‘దేవర’ రొమాంటిక్ మోడ్ ఇంకా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దేవరగా ఎన్టీఆర్ కనిపిస్తారు. ఇటీవల జాన్వీ, ఎన్టీఆర్ పాల్గొనగా ఈ సినిమాకు చెందిన ఓ పాటను థాయ్‌లాండ్‌లో చిత్రీకరించారు మేకర్స్. తాజాగా ఎన్టీఆర్, జాన్వీ కాంబినేషన్‌లో మరో రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరించడానికి యూనిట్ ప్లాన్ చేసిందని సమాచారం.
ఇందుకోసం హైదరాబాద్ శివార్లలో ఓ స్పెషల్ సెట్‌ను రెడీ చేస్తున్నారని, వచ్చే వారం ఈ సెట్‌లో ఈ పాట చిత్రీకరణ జరుగుతుందని టాక్. ఇప్పటికే యాక్షన్ పార్ట్, టాకీ ఎక్కువ శాతం పూర్తి కావడంతో కొరటాల శివ పాటల చిత్రీకరణపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.
సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్, ప్రకాశ్‌రాజ్, షైన్ టామ్ చాకో, నరైన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. కల్యాణ్‌రామ్ సమర్పణలో కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ‘దేవర’ రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగాన్ని సెప్టెంబరు 27న విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment