
తెలుగులో టాప్ యాంకర్ ఎవరంటే సుమ అని టక్కున చెప్తాం.. తమిళంలో అలాంటి పేరే సంపాదించుకుంది అంజనా రంగన్.

టీవీ షోలు, రియాలిటీ షోలు, సినిమా ఈవెంట్స్‌తో అనునిత్యం బిజీగానే ఉంటుంది. ఈ తమిళ యాంకర్ ఇటీవల దేవర సినిమా చెన్నై ప్రెస్‌మీట్‌కు హోస్టింగ్ చేసింది.

హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను చూడగానే ఆమె సంతోషంతో ఉబ్బితబ్బిబైపోయింది. తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

ఇండస్ట్రీలోకి వచ్చి 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఒక అద్భుతమైన ఈవెంట్‌తో 17వ సంవత్సరంలోకి అడుగుపెట్టాను.

ఎంతో మంచి మనిషి అయిన జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ప్రెస్ ఈవెంట్‌కు హోస్టింగ్ చేశాను.

ఇన్నాళ్లుగా ఆయన్ని స్క్రీన్‌పై చూసి ఇష్టపడ్డాను. నేరుగా ఎప్పుడు చూస్తానా? అనుకున్నాను.

అలాంటిది ఆ దేవుడు నాకెంతో ప్రత్యేకమైన రోజున ఇలా స్పెషల్ గిఫ్ట్ ఇస్తాడనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది అని ఎక్స్ (ట్విటర్)లో రాసుకొచ్చింది.
























