post
-
టాలీవుడ్ హీరోయిన్స్ సంక్రాంతి స్పెషల్ విషెస్ (ఫోటోలు)
-
నా భర్త వల్లే ఇది సాధ్యమైంది.. ఈ ఫొటో ఆయన కోసమే! (ఫోటోలు)
-
అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత తొలి పోస్ట్ చేసిన స్నేహ రెడ్డి!
అల్లు అర్జున్ పుష్ప-2 రిలీజై ఇప్పటికే నెల రోజులు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.1831 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద ఇంకా దూసుకెళ్తోంది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టింది. బాలీవుడ్‌లోనూ తిరుగులేని చరిత్ర సృష్టించింది. ఇప్పటికే రూ.806 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ సాధించిన నాన్ హిందీ సినిమాగా నిలిచింది.సంధ్య థియేటర్ విషాదం..అయితే పుష్ప-2 విడుదలకు ముందు రోజే తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృత్యువాత పడింది. ఈ ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. అయితే ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.అల్లు అర్జున్ అరెస్ట్..ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. అయితే ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయం చంచల్ గూడ నుంచి విడుదలయ్యారు. ఇటీవల బన్నీకి నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసింది.అరెస్ట్ తర్వాత బన్నీ భార్య ఎమోషనల్..హీరో అల్లు అర్జున్ భార్య స్నేహ తీవ్ర భావోద్వేగానికి గురైంది. బన్నీ అరెస్ట్ సమయంలో ఆయనను హత్తుకుంది. ధైర్యంగా ఉండమని భార్యకు అల్లు అర్జున్ భరోసా ఇచ్చి పోలీసుల వెంట వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. ఈ వివాదం తర్వాత ఆమె తొలిసారి చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది.(ఇది చదవండి: సంధ్య థియేటర్ ఘటన: శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్)అరెస్ట్ తర్వాత తొలి పోస్ట్..బన్నీ అరెస్ట్ తర్వాత స్నేహారెడ్డి తొలిసారిగా పోస్ట్ చేసింది. డిసెంబర్లో జరిగిన జ్ఞాపకాలను ఓసారి గుర్తు చేసుకుంది. ఆల్ డిసెంబర్ మూమెంట్స్ ఇన్ వన్ ప్లేస్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇందులో తన పిల్లలు అయాన్, అర్హతో బన్నీ ఆడుకుంటున్న ఫోటోలు కూడా ఉన్నాయి. అరెస్ట్ తర్వాత ఆమె చేసిన తొలి పోస్ట్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. పుష్ప సినిమాకు స్వీక్వెల్‌గా ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించారు. వీరిద్దరి కాంబోలో 2021లో వచ్చిన పుష్ప ది రైజ్ బాక్సాఫీస్‌ను షేర్ చేసింది. అదే ఉత్సాహంతో పుష్ప-2 ది రూల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీ విడుదలైన నెల రోజుల్లోనే ఇండియన్ సినీ చరిత్రలో ఎప్పుడు రికార్డులు సృష్టించింది.(ఇది చదవండి: తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్.. బాహుబలి -2 రికార్డ్ బ్రేక్)బాహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ రికార్డులు బ్రేక్..టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన బాహుబలి, బాహుబలి-2, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ చిత్రాల ఆల్ టైమ్ వసూళ్లను ఇప్పటికే అధిగమించింది. కేవలం పుష్ప-2 కంటే ముందు అమిర్ ఖాన్ నటించిన దంగల్ మాత్రమే ఉంది. దంగల్ మూవీ రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో తొలిస్థానంలో నిలిచింది. అయితే దంగల్ రికార్డ్‌ను పుష్పరాజ్ బ్రేక్ చేస్తాడా? లేదా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
Anupama Parameswaran: 2025లో అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ పోస్ట్ ఇదే! (ఫోటోలు)
-
Sai Pallavi: నాకంటే ఎక్కువే ప్రేమిస్తున్నాడు.. ఎమోషనలైన హీరోయిన్ (ఫోటోలు)
-
బంగ్లాదేశ్ సోషల్‌మీడియా పోస్టుపై భారత్ ఆగ్రహం
న్యూఢిల్లీ:ఇటీవల భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు చాలా వరకు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ సన్నిహితుడు మహఫుజ్ ఆలం సోషల్ మీడియా వేదికగా ఇటీవల భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.‘బంగ్లాదేశ్ ప్రభుత్వం వద్ద మేం ఈ విషయాన్ని లేవనెత్తాం. ఆలం పోస్టును తర్వాత తొలగించారు. బహిరంగ వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. బంగ్లా ప్రజలు, తాత్కాలిక ప్రభుత్వంతో సంబంధాలను పెంపొందించుకునేందుకు భారత్ ఆసక్తితో ఉన్నప్పటికీ ఇలాంటి చర్యలు నిరాశ కలిగిస్తున్నాయి’ అని భారత విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. భారత్‌లోని కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలంటూ ఆలం కొన్ని రోజుల క్రితం ఫేస్బుక్లో పోస్టు పెట్టి కొన్ని రోజుల తర్వాత తొలగించాడు.బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు..2200 కేసులు కాగా, బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్కడ హిందువులపై దాడులకు సంబంధించి ఏకంగా 2200 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. షేక్‌హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత హిందువులపై దాడులు పెరిగిన విషయం తెలిసిందే. -
జీవితంలో కొత్త అధ్యాయం షురూ అంటున్న పుష్ప 2 కొరియోగ్రాఫర్ (ఫోటోలు)
-
మేజిస్ట్రేట్ చాలా యాంత్రికంగా వ్యవహరించారు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 111 కింద పోలీసులు పెడుతున్న కేసుల్లో నిందితులకు మేజిస్ట్రేట్ కోర్టులు యాంత్రికంగా రిమాండ్ విధిస్తుండటాన్ని హైకోర్టు ఆక్షేపించింది. దర్యాప్తు అధికారి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో నిందితుడు బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద నేరం చేశారనేందుకు ఎలాంటి ఆధారాలను చూపకపోయినా మేజిస్ట్రేట్ మాత్రం ఆ సెక్షన్ కింద నేరం చేశారనేందుకు ఆధారాలున్నాయని రిమాండ్ ఉత్తర్వుల్లో పేర్కొనడాన్ని న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం తెలిపింది. మేజిస్ట్రేట్ మెదడు ఉపయోగించకుండా, లోపభూయిష్టంగా ఉత్తర్వులిస్తున్నారని తేల్చి చెప్పింది. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి తన కుమారుడు వెంకటరమణారెడ్డికి వినుకొండ కోర్టు విధించిన రిమాండ్‌ను రద్దు చేసి అతన్ని విడుదల చేసేలా ఆదేశాలివ్వాలంటూ పప్పుల చెలమారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం ఇటీవల విచారణ జరిపి, తీర్పు రిజర్వ్ చేసింది. ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో మేజిస్ట్రేట్ కోర్టు తీరును తప్పుపట్టింది. ఓ వ్యక్తిపై సెక్షన్ 111 కింద కేసు పెట్టాలంటే, అతనిపై గత పదేళ్లలో ఒకటికంటే ఎక్కువ చార్జిషీట్లు దాఖలై, వాటిలో ఒకదానినైనా కోర్టు విచారణకు స్వీకరించి ఉండాలని ధర్మాసనం తెలిపింది. ప్రస్తుత కేసులో నిందితుడిపై గత పదేళ్లలో కేసులు నమోదయినట్లు గానీ, చార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకున్నట్లు గానీ దర్యాప్తు అధికారి రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించలేదంది. అలాగే బీఎన్ఎస్ సెక్షన్ 47 కింద దర్యాప్తు అధికారి నిందితునికి ఇచి్చన నోటీసులో అరెస్ట్‌కు కారణాలను పేర్కొన్నట్లు మేజిస్ట్రేట్ తన ఉత్తర్వుల్లో తెలిపారని, వాస్తవానికి అరెస్ట్‌కు కారణాలను దర్యాప్తు అధికారి పేర్కొనలేదని తెలిపింది. అయినప్పటికీ దర్యాప్తు అధికారి సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌పై మేజిస్ట్రేట్ సంతృప్తి వ్యక్తం చేశారంది. మేజిస్ట్రేట్ యాంత్రికంగా వ్యవహరించడమే కాక, కనీసం నోటీసులో పేర్కొన్న అరెస్ట్‌కు కారణాలను నిందితునికి రాతపూర్వకంగా ఇచ్చారా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించలేదని ఆక్షేపించింది. మేజిస్ట్రేట్ రిమాండ్ ఉత్తర్వుల్లో ఈ రెండు లోపాల కారణంగా ఈ హెబియస్ కార్పస్ పిటిషన్‌కు విచారణార్హత ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే దర్యాప్తు అధికారి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో మాత్రం నిందితుని అరెస్ట్‌కు నిర్దిష్ట కారణాలు స్పష్టంగా పేర్కొన్నారని తెలిపింది. అందువల్ల ప్రస్తుత కేసులో నిందితుని అరెస్ట్‌ను అక్రమంగా ప్రకటించలేమంది. అందువల్ల అరెస్ట్‌ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు తెలిపింది. పిటిషనర్ లేదా నిందితుడు వారికి చట్ట ప్రకారం ఉన్న ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవాలని తెలిపింది. -
సమంత సంచలన పోస్ట్.. టార్గెట్ అతనేనా..?
-
‘వారంలో ఏడు రోజులు ఫ్రీగా పని చేస్తాను’
యూకేలో ఉండడానికి ఉచితంగా పని చేయాడానికైనా సిద్ధంగా ఉన్నట్లు ఓ భారతీయ విద్యార్థిని తెలిపింది. గ్రాడ్యుయేషన్ చేసేందుకు యూకే వెళ్లిన ఆమె అక్కడే ఉండేందుకు ఉచితంగా పని చేస్తానని లింక్డ్ఇన్ పోస్ట్‌లో తెలియజేశారు. 2022లో గ్రాడ్యుయేషన్ పూర్తయినప్పటి నుంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లు శ్వేత చెప్పారు. తాను రోజు 12 గంటలపాటు వారంలో ఏడు రోజులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈపోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.‘నా పేరు శ్వేత. నేను గ్రాడ్యుయేషన్ చేసేందుకు యూకే వచ్చాను. నా గ్రాడ్యుయేట్ వీసా మూడు నెలల్లో ముగియనుంది. నేను యూకేలో వీసా అందించే కంపెనీల్లో ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. 2022లో నా గ్రాడ్యుయేషన్ పూర్తయినప్పటి నుంచి 300 కంటే ఎక్కువగానే ఉద్యోగాలకు దరఖాస్తు చేశాను. యూనివర్శిటీ ఆఫ్ లీసెస్టర్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్సీ పట్టా పొందాను. వీసా స్పాన్సర్డ్ డిజైన్ ఇంజినీర్ ఉద్యోగాల కోసం చూస్తున్నాను. మీరు యూకేలో కంపెనీ నిర్వహిస్తూ డిజైన్ ఇంజినీర్ల కోసం వెతుకుతున్నట్లయితే నన్ను వెంటనే ఉద్యోగంలోకి తీసుకోండి. వారంలో ఏడు రోజులపాటు రోజువారీ 12 గంటలు పని చేస్తాను. ఒక నెలపాటు నాకు ఎలాంటి జీతం అవసరం లేదు. నా పనితీరు గమనించండి. నచ్చితే కొనసాగించండి. లేదంటే ఎలాంటి వివరణ ఇవ్వకుండా వెంటనే ఉద్యోగం నుంచి తొలగించండి. ఈ పోస్ట్‌ను అంతర్జాతీయ విద్యార్థులు చదువుతుంటే దీన్ని రీపోస్ట్ చేయండి’ అని తెలుపుతూ దానికి సంబంధించిన ఇమేజ్ను కూడా శ్వేత షేర్ చేశారు.ఇదీ చదవండి: ‘నవంబర్ 8న సెలవులో ఉంటాను.. బై’!మిమ్మల్ని మీరు నమ్మండిఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘మీరు వెళ్లిన దేశంలో ఉండటానికి ఉచితంగా పని చేయడం లేదా అన్నేసి గంటలు పనిచేయడం అసంబద్ధం. మీకు ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను’ అంటూ ఒకరు కామెంట్ చేశారు. ‘యూకేలో ఉండడం కోసం ఇలా చేయనవసరం లేదు. మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు తెలివైనవారు. ప్రపంచంలో ఎక్కడైనా గుర్తింపు పొందుతారు’ అని మరొకరు రిప్లై ఇచ్చారు. -
మాటలు రావట్లేదు.. ఆయన మృతిపై 'దేవర' నటి ఎమోషనల్ (ఫొటోలు)
-
World Post Day 2024: ప్రపంచ కమ్యూనికేషన్ విప్లవంలో..
ఒకటిన్నర శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా పోస్టల్ వ్యవస్థ మనుగడ సాగిస్తోంది. ప్రజల దైనందిన జీవితంలో పోస్టల్ రంగానికున్న పాత్ర, ప్రపంచ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో పోస్టల్ వ్యవస్థ సహకారంపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 9న ప్రపంచ తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటారు.1874లో స్విట్జర్లాండ్‌లో ప్రారంభమైన యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (యూపీయూ) వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ పోస్టల్ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ప్రపంచ కమ్యూనికేషన్ విప్లవంలో యూపీయూ కీలక పాత్ర పోషించింది. ప్రపంచ తపాలా దినోత్సవం 1969లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పోస్టల్ సేవల ప్రాముఖ్యతను తెలియజెప్పేందుకు అక్టోబర్ 9న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి.యూపీయూ స్థాపించి ఈ సంవత్సరానికి 150 ఏళ్లు పూర్తవుతుంది. ప్రపంచ తపాలా దినోత్సవం ప్రారంభమైనది మొదలు కమ్యూనికేషన్లు, వాణిజ్యం, అభివృద్ధిలో పోస్టల్ సేవల ప్రాముఖ్యత మరింతగా పెరిగింది. ప్రస్తుతం ఈ-కామర్స్, లాజిస్టిక్స్, ఆర్థిక సేవల విషయంలో పోస్టల్ వ్యవస్థ ప్రముఖమైనదిగా మారింది.ప్రపంచంలోనే అతిపెద్ద తపాలా వ్యవస్థగా భారతదేశం గుర్తింపు పొందింది. 1774లో వారెన్ హేస్టింగ్స్ కలకత్తాలో జనరల్ పోస్టాఫీసును ప్రారంభించారు. 1837లో కలకత్తా, మద్రాస్, బాంబేలలో తపాలా సేవలను ఆలిండియా సర్వీసుల్లో చేర్చారు. 1852లో మనదేశంలో తొలిసారిగా సింథ్డాక్ అనే తపాలా బిళ్లను విడుదలచేశారు. పూర్తి కథనం: స్మార్ట్‌గా పోస్టల్ సేవలు -
Disha Patani: నా జీవితంలో ఆనందాన్ని నింపావ్.. కల్కి హీరోయిన్ ఎమోషనల్ (ఫోటోలు)
-
16 ఏళ్లయింది.. ఎన్టీఆర్ కోసం తెగ ఆరాటపడ్డ యాంకర్.. ఇన్నాళ్లకు! (ఫొటోలు)
-
ఇంద్రా నూయి స్థానంలో ఎవరు?
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త మహిళా ఇండిపెండెంట్ డైరెక్టర్ కోసం ఎదురుచూస్తోంది. 2018 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్న పెప్సికో హెడ్ ఇంద్రా నూయి పదవీ కాలం గత నెలాఖరుతో ముగియగా... ఆమె స్థానంలో అంతర్జాతీయ స్థాయిలో ఆటతో పాటు వ్యాపార రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మహిళను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.ఐసీసీ చైర్మన్‌గా కొనసాగుతున్న గ్రేగ్ బార్క్లే కూడా త్వరలోనే పదవీ విరమణ చెందనున్న విషయం తెలిసిందే. ‘క్రికెట్లో సమానత్వం, వైవిధ్యాన్ని సమ్మిళితం చేయగల ఆసక్తి ఉన్న వారిని డైరెక్టర్‌గా ఎంపిక చేయనున్నాం. కొత్తగా ఎంపికైన మహిళా డైరెక్టర్‌కు చైర్మన్ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునే అధికారం ఉంటుంది.ఆటకు మరింత ప్రోత్సాహం అందిచగల వారి కోసం చూస్తున్నాం’ అని ఐసీసీ తెలిపింది. ఐసీసీ తొలి మహిళా స్వతంత్ర డైరెక్టర్‌గా ఎన్నికైన ఇంద్రా నూయి... ఆరేళ్ల పాటు సమర్థవంతంగా విధులను నిర్వర్తించారు. -
Deepthi Sunaina: కన్నీళ్లు పెట్టుకున్న బిగ్‌బాస్ బ్యూటీ.. అయినా.. (ఫోటోలు)
-
నా ఉద్దేశంలో ఆ పండుగ అర్థం.. సుధామూర్తి పోస్ట్ వైరల్
రాజ్యసభ ఎంపీ సుధా మూర్తి రక్షా బంధన్ సందర్భంగా ఒక సందేశాన్ని పంచుకున్నారు. పండుగ వెనుక ఉన్న కథను షేర్ చేసుకున్నారు. ఇది సోషల్ మీడియాలో చర్చకు తెరతీసింది. అంతకు మించే రాఖీ పండుగకు సంబంధించిన కథలు ఉన్నాయంటూ పోస్టలు పెట్టారు. ఇంతకీ ఆమె షేర్ చేసుకున్న కథ ఏంటంటే.. రక్షా బంధన్ తనకు ఒక ముఖ్యమైన పండుగా అని చెప్పారు. ఇది ఒక సోదరికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎల్లప్పుడూ నాకు సహాయం చేయాలని సూచించే రక్షయే ఈ చిన్న దారం అని అన్నారు. అందుకు సంబంధించిన గాథను కూడా చెప్పుకొచ్చారు. "మేవార్ రాజ్యపు కర్ణావతి తన రాజ్యం శత్రు రాజుల దాడికి గురై సంకట స్థితిలో ఉన్నప్పుడూ పొరుగున ఉన్న మొఘల్ చక్రవర్తి హుమాయున్‌కు ఒక చిన్న దారం పంపింది. ఇది తాను ఆపదలో ఉన్నాను, దయచేసి నన్ను మీ సోదరిగా పరిగణించి రక్షించండి అని ఆ దారం రూపంలో హుమాయున్ రాజుకి సందేశం పంపింది. అయితే హుమాయున్ ఆ దారం అర్థం ఏంటో అస్సలు తెలియదు. తన మంత్రుల ద్వారా అసలు విషయం తెలుసుకుని రక్షించేందుకు ఢిల్లీ పయనమయ్యాడు. అయితే సమయానికి హుమాయున్ చేరుకోలేకపోవడంతో కర్ణావతి మరణించింది." అని సుదామూర్తి పోస్ట్‌లో రాసుకొచ్చారు. అయితే వినయోగదారులు ఈ వ్యాఖ్యలతో విభేధించడమే గాక మహాభారత కాలంలోనే రక్షాబంధన్ గురించి ఉందంటూ నాటి ఘటనలను వివరించారు. శిశుపాలుడిని చంపడానికి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తుండగా శ్రీకృష్ణుడి వేలుకి గాయమవ్వడం జరుగుతుంది.వెంటనే ద్రౌపది చీర కొంగు చింపి కట్టిందని, అందుకు ప్రత్యుపకారంగా కౌరవులు నిండు సభలో అవమానిస్తున్నప్పుడూ ద్రౌపదికి చీరలు ఇచ్చి కాపాడాడని అన్నారు. అలాగే బలిచక్రవర్తి పాతాళ రాజ్యాన్ని రక్షిస్తుండేవాడు. అతడు తన భక్తితో విష్ణువుని ప్రసన్నం చేసుకుని ఆయన్నే రాజ్యనికి కాపలాగా ఉంచాడు. అయితే లక్ష్మీదేవి ఈ విషయం తెలుసుకుని ఈ శ్రావణ పూర్ణిమ రోజున రాఖీ కట్టి తన భర్తను దక్కించుకుందని పురాణ వచనం అంటూ సుధామూర్తి పోస్ట్‌కి కౌంటర్ ఇస్తూ పోస్టులు పెట్టారు. కాగా, చిన్నప్పుడు తాను తెలుసుకున్న రాఖీ పండగ కథలను తెలియజేయాలనుకోవడమే తన ఉద్దేశమని సుధామూర్తి వివరణ ఇచ్చారు. (చదవండి: 'అమ్మ అపరాధం'ని అధిగమించి గొప్ప పారిశ్రామిక వేత్తగా..!) -
సామ్ జ్ఞాపకాల్లో చైతూ.. ఆ ఒక్క ఫొటో డిలీట్ చేయలేదుగా! (ఫొటోలు)
-
తులం బంగారం రూ. 113 మాత్రమే *
మనదేశంలో పెళ్లిళ్లు, వేడుకలు, అక్షయతృతీయ, వరలక్ష్మీ వ్రతం లాంటి సందర్భాల్లో బంగారం కొనుగోలుకు అధిక డిమాండ్ ఉంటుంది. గతంతో పోలిస్తే బంగారం ధర భారీగా పెరిగినప్పటికీ, చాలామంది దానిని కొనుగోలు చేసేందుకు ఏమాత్రం వెనుకాడరు. అయితే ఒకప్పుడు 11.66(తులం) గ్రాముల బంగారం ధర కేవలం రూ.113 అని తెలిస్తే ఎవరికైనా ఆ కాలానికి తిరిగి వెళ్లాలనిపిస్తుంది. అయితే బంగారం ధర చాలా తక్కువగా ఉన్న కాలంలో ప్రజల ఆదాయం కూడా చాలా పరిమితంగానే ఉండేది. బంగారం కొనుగోలుకు సంబంధించిన పాత రసీదు ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ రసీదులో 11.66 గ్రాముల బంగారం ధర రూ.113 అని ఉంది. ఈ బిల్లు 1959 నాటిది.ప్రస్తుతం తులం బంగారం ధర రూ.70 నుంచి 75 వేలుగా ఉందని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పాత బిల్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. దీనిని చూసిన యూజర్స్ తెగ ఆశ్చర్యపోతున్నారు. ‘జిందగీ గుల్జార్ హై’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ బిల్లు ఫొటోను షేర్ చేశారు. ఈ పోస్ట్‌ను ఇప్పటివరకు 69 వేల మందికి పైగా లైక్ చేశారు. అలాగే పలువురు తమ కామెంట్లు పెడుతున్నారు. ఒక యూజర్ ‘సమయం వేగంగా కదులుతోంది’అని రాయగా, మరొక యూజర్ ‘నాటి ఆదాయాల ప్రకారం చూస్తే బంగారం ఎంతో ఖరీదైనది’ అని రాశారు. ఇంకో యూజర్ ‘అప్పట్లో చాలామంది జీతం నెలకు 40 రూపాయలు’ అని రాశారు. -
‘నువ్వెక్కడున్నా నా మనసంతా నీ చుట్టే’.. హార్దిక్ పాండ్యా భావోద్వేగం! (ఫొటోలు)
-
అనంత్- రాధిక వెడ్డింగ్: అందానికే అర్థంలా సానియా మీర్జా (ఫొటోలు)
-
‘ఆనాటి సిగ్గరే..నేటి లెజెండ్!’ బుమ్రాపై పొరుగింటి ఆంటీ భావోద్వేగ పోస్ట్ వైరల్
ఉత్కంఠభరితంగా బార్బడోస్‌లో జరిగిన మ్యాచ్‌లో టీ-20 ప్రపంచ కప్‌ను టీమిండియా దక్కించుకుంది. దీంతో టీమిండియా ఆటగాళ్లపై అభినందనలు వెల్లువెత్తాయి. ప్రధానంగా సూర్యకుమార్‌యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ హీరోలుగా నిలిచారు. అయితే జస్ప్రీత్ బుమ్రా తల్లి సన్నిహితురాలు, పొలిటికల్ జర్నలిస్టు చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఒకటి వైరల్‌గా మారింది.ప్రపంచ కప్ ఫైనల్లో జస్ప్రీత్ బుమ్రా తన అద్భుతమైన ప్రదర్శనకు స్టార్ క్రికెటర్‌పై నా హీరో అంటూ తన ప్రేమను అభిమానాన్ని చాటుకున్నారు బుమ్రా తల్లి దల్జీత్కి బెస్ట్ ఫ్రెండ్ దీపాల్ త్రివేది. ‘‘ నాకున్న క్రికెట్ పరిజ్ఞానం శూన్యం.. విరాట్ కోహ్లీ అనుహ్క భర్తగా తెలుసు. అతని డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించినప్పుడు నాకు నచ్చుతుంది. ఒకప్పుడు సిగ్గరి.. ఇప్పుడు లెజెండ్' అంటూ బుమ్రాపై సుదీర్ఘ భావోద్వేగ పోస్ట్ పెట్టారు దీపాల్ త్రివేది. ఇందులో బుమ్రాతో తనకున్న అనుబంధాన్ని, అతడి పడ్డ కష్టాలను వివరంగా రాసుకొచ్చారు. అంతేకాదు బుమ్రా పుట్టినపుడు తొలుత చేతుల్లోకి తీసుకున్నఅదృష్టవంతురాల్ని తానే అంటూ సంతోషాన్ని ప్రకటించారు. అప్పుడే పుట్టిన బిడ్డను తాకడం అదే మొదటిసారి. అప్పటికే కుమార్తె ఉన్నప్పటికీ అది పెద్దగా గుర్తులేదు. బిడ్డ సన్నగా, బలహీనంగా ఉన్నాడు .. ఆ క్షణాలు ఇప్పటికీ గుర్తు అన్నారామె.My cricket knowledge is Zero. I know Virat Kohli as Anushka's husband. He is so pleasant and I like when he tries to dance. But this (long) post is about my hero. One day in December 1993, when my salary was less than Rs 800 a month, my best friend and next door neighbour… pic.twitter.com/uvWQmmAwwN— Deepal.Trivedi #Vo! (@DeepalTrevedie) June 30, 2024అలాగే చిన్నప్పటినుంచీ బుమ్రా పట్టుదల, సంకల్పం గురించి వివరించారు. నిజంగా మా స్టోరీ బాలీవుడ్ సినిమా కంటే తక్కువేమీకాదు. బుమ్రా తండ్రి జస్బీర్ సింగ్ మరణించిన తరువాత తల్లి రోజుకు కనీసం 16-18 గంటలు పనిచేస్తూ చాలా కష్టపడేది. పొరుగువారిగా, కష్టాలు, నష్టాలు అన్నీ పంచుకున్నాం. ఒక చిన్న ప్లాస్టిక్బాల్తో బుమ్రా ఎపుడూ క్రికెట్ ఆడుతూ ఉండేవాడనీ, తనకు మాత్రం దల్జీత్ ఇల్లు స్వర్గధామం లాంటిదని తెలిపారు. ఒకసారి తన ఇంక్రిమెంట్ డబ్బులతో బుమ్రాకు విండ్చీటర్ (జాకెట్) కొనిచ్చిన ఏకైక బహుమతిని కూడా దీపాల్ గుర్తు చేసుకున్నారు. జస్ప్రీత్ బుమ్రాకు గర్వమనేదే లేదు. వినయం ఏమాత్రం తగ్గలేదు. అతడ్ని చూసి ప్రతీ భారతీయుడు గర్వపడాలి. అతని నుండి నేర్చుకోవాలంటూ బుమ్రాపై ప్రశంసలు కురిపించారు. -
కొడుకు గౌతమ్ తొలి స్టేజీ ఫెర్ఫార్మెన్స్.. మహేశ్ బాబు భార్య ఎమోషనల్ (ఫొటోలు)
-
‘అందుకనేగా అర్ధాంగి అంటారు’.. రాచకొండ పోలీసుల పోస్ట్ వైరల్
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. బ్యాంక్ సిబ్బంది, ప్రభుత్వ అధికారుల పేరుతో ఫోన్లు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఓటీపీ అడిగి బ్యాంక్‌లోని డబ్బులను దోచేస్తున్నారు. అయితే ఇలాంటి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వుండాలని ఎప్పటికప్పుడు పోలీసులు ప్రజలకు హెచ్చరిస్తూనే ఉన్నారు.ఈ మోసాల గురించి మరింత వివరంగా చెప్పేందుకు రాచకొండ పోలీసులు ఓ వినూత్న ప్రయత్నం చేశారు. ఇందుకు కాస్త హాస్యాన్ని జోడించారు. ఓ ఫన్నీ కపుల్ జోక్‌తో ప్రజలను హెచ్చరించారు. ఓ అర్థాంగి అమాయకత్వం సైబర్ కేటుగాళ్ల నుండి ఎలా కాపాడిందో తెలియజేస్తూ సాగిన చిన్న ఫన్నీ స్టోరీని రాచకొండ పోలీస్ కమీషనరేట్ అధికారిక ఎక్స్ మాధ్యమంలో పోస్ట్ చేశారు. చివరగా.. బ్యాంకు అకౌంట్ వివరాలు, ఓటీపీలు, ఏటీఎం లేదా క్రెడిట్ కార్డు వివరాలను ఎవరితో పంచుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు చెప్పారు. రాచకొండ పోలీసుల రావుగారి 'అర్థాంగి' స్టోరీ కింద చదవండి: -
ఎంతో కష్టపడ్డాం.. మంత్రి పదవి ఇవ్వండి
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవులపై ఉత్కంఠ నెలకొంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడంతో రాష్ట్ర మంత్రివర్గంపై ఇంకా పూర్తిస్థాయి కసరత్తు జరపలేదని చెబుతున్నారు. మంత్రులుగా ఎవరిని తీసుకోవాలనే దానిపై ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చినా ఇంకా కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అయితే, మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న చాలామంది తమకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా కష్టపడ్డామని, ఎంతో చేశామని తమకు అవకాశం ఇవ్వాల్సిందేనని పలు జిల్లాలకు చెందిన సీనియర్లు ఆయన్ను కోరుతున్నారు. నేరుగా ఆయన్ను కలిసి తమకు అవకాశం కల్పించాలని కోరడంతోపాటు వివిధ మార్గాల ద్వారా ఆయనపై ఒత్తిడి పెంచుతున్నారు. లోకేశ్ చుట్టూ చక్కర్లు..చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు లోకేశ్ పార్టీలో కీలకంగా ఉండడంతో అనేకమంది ముందు ఆయన్ను కలుస్తున్నారు. ఎన్నికలకు ముందు లోకేశ్ పలువురికి మంత్రి పదవులు ఇస్తానని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పుడు వారంతా తమకిచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నారు. నిత్యం ఆయన్ను కలుస్తూ తమ గురించి ఆలోచించాలని విన్నవించుకుంటున్నారు. అయితే, ఫలితాల తర్వాత ఇప్పటివరకు ఎవరికీ చంద్రబాబు ఆయన తనయుడు లోకేశ్ మంత్రి పదవి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. జనసేన, బీజేపీకి మంత్రి పదవులు ఇవ్వాల్సి వుండడం, టీడీపీలోనే ఆశావహులు ఎక్కువగా ఉండడంతో ఎవరికీ ఏ విషయం చెప్పకుండా ఇంకా ఏమీ ఆలోచించలేదని సర్దిచెబుతున్నారు. తమ సంగతి చూడాలంటున్న సీనియర్లు..ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై దృష్టిపెడతారని చెబుతున్నారు. భవిష్యత్తులో తాము పోటీచేసే అవకాశం ఉండకపోవచ్చని, ఈసారి ఎలాగైనా మంత్రిగా అవకాశం ఇవ్వాలని పలువురు సీనియర్లు ఆయన్ను కోరుతున్నారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వంటి నేతలు ఈ కోవలో ఉన్నారు. సామాజికవర్గ నేపథ్యంలో తమకు అవకాశం ఇవ్వాలని బొండా ఉమామహేశ్వరరావు వంటి నేతలు గట్టిగా అడుగుతున్నట్లు సమాచారం. క్లిష్ట సమయంలో పార్టీ కోసం పనిచేసిన తమకు ఎలాగైనా మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర, నిమ్మల రామానాయుడు వంటి నేతలు ఒత్తిడి తెస్తున్నారు.లోకేశ్‌పై ఆశలు పెట్టుకున్న జూనియర్లు..మరోవైపు.. లోకేశ్ అండతో పార్టీలో ఎదిగిన నేతలు, ఆయన ద్వారా సీటు దక్కించుకుని గెలిచిన జూనియర్లు తమకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని అడుగుతుండడం చర్చనీయాంశమైంది. పెదకూరపాడు నుంచి గెలిచిన భాష్యం ప్రవీణ్ వంటి నేతల ఇలాంటి వారిలో ఉన్నారు. అయితే, అందరికీ మంత్రి పదవులు ఇవ్వలేమని చూస్తామని మాత్రమే లోకేశ్ చెబుతున్నట్లు తెలిసింది. సీనియర్ నాయకులకు సైతం ఇప్పటివరకు మంత్రి పదవుల హామీ లభించలేదు. సాధారణంగా అయితే చంద్రబాబు ఈపాటికి మంత్రి పదవుల కోసం అభిప్రాయ సేకరణ, సామాజిక సమీకరణలు, సీనియారిటీ వంటి అంశాల ప్రాతిపదికగా కసరత్తు చేయాల్సి వుంది. కానీ, ఇప్పుడు అదేమీ లేకపోవడంతో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయో, ఆయన మనసులో ఏముందోనని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సీనియర్లు తమకు అవకాశం వస్తుందా? లేదా? అని చంద్రబాబుకి సన్నిహితంగా ఉండే వారి నుంచి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, మంత్రివర్గం, కీలక పదవుల గురించి ఎలాంటి విషయాలు బయటకు చెప్పకపోవడంతో పార్టీ నేతలు ఉత్కంఠకు లోనవుతున్నారు.