
సాక్షి, అమరావతి: వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మకమైన మార్పులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో వైద్య కళాశాలలో ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు పెద్దమొత్తంలో వైద్య ఆరోగ్య శాఖలో అదనంగా కొత్తపోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్‌లో 560 గ్రేడ్-2 ఫార్మసిస్ట్‌లతో పాటు వైద్యకళాశాలలో 1952 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖలో 1285 ఉద్యోగాల అదనంగా మంజూరు చేసింది.
(చదవండి: ఏపీలో షిప్ రిపేరింగ్ యూనిట్! )
2190 కొత్త పోస్టులు
35 మెడికల్ కళాశాలలు, అనుబంధ ఆసుపత్రులలో 2190 కొత్త పోస్టులు సృష్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతోపాటు కొత్తగా సృష్టించిన పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీచేశారు. కొత్తగా మంజూరైన పోస్టుల వివరాలు చూస్తే.. ప్రొఫెసర్లు- 51, అసోసియేట్ ప్రొఫెసర్లు-187, అసిస్టెంట్ ప్రొఫెసర్లు- 130, నర్సింగ్ -1040, పారామెడికల్ -782 ఉన్నాయి.
దేశంలోనే అత్యధిక పోస్టులు ఒకేసారి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కొత్తగా మంజూరైన పోస్టుల కారణంగా రాష్ట్రంలో ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు పెరగనున్నాయి. ప్రజలకు వైద్యసేవలు మరింత చేరువ కానున్నన్నాయి.
చదవండి: మరోసారి మెరిసిన ఏపీ పోలీస్
Comments
Please login to add a commentAdd a comment