Medical and Health Department
-
జీబీ సిండ్రోమ్ భయపెడుతోంది
సాక్షి, అమరావతి/గుంటూరు మెడికల్/సాక్షి ఫ్యామిలీ హెల్త్ డెస్క్ : లక్ష మందిలో ఒకరికో, ఇద్దరికో అరుదుగా వచ్చే గులియన్ బ్యారి సిండ్రోమ్ (జీబీఎస్) కేసుల నమోదు రాష్ట్రంలో ఒక్కసారిగా పెరుగుతుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల ఈ వ్యాధి కారణంగా శ్రీకాకుళం జిల్లాలో యువంత్ (10) అనే బాలుడు మృతి చెందాడు. గుంటూరు జీజీహెచ్‌లో ఏడుగురు బాధితులు ఈ సమస్యతో చేరగా, ఇద్దరు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన ఐదుగురిలో గుంటూరు జిల్లా అలసనపల్లికి చెందిన బి.కమలమ్మ ఐసీయూలో, నరసరావుపేటకు చెందిన ఎస్.కె.రవీుజాన్ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. వీరిద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మిగతా ముగ్గురు.. గుంటూరు ఐపీడీకాలనీలోని వి.ఆశీర్వాదం, నెహ్రూనగర్‌కు చెందిన షేక్ గౌహర్జాన్, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లికి చెందిన వి.నాగవేణి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరులో 5, విశాఖలో 6, కాకినాడలో 4, విజయనగరం, విజయవాడ, అనంతపురంలో ఒక్కో కేసు చొప్పున మొత్తంగా 18 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కర్నూలు, గుంటూరు, కాకినాడ, విశాఖ జీజీహెచ్‌లలో నెలకు 10–15 చొప్పున కొత్త కేసులు నమోదు అవుతున్నాయని వైద్య శాఖ వెల్లడించింది. నెల్లూరులో ఇటీవల లోకల్ టీవీ రిపోర్టర్ ఒకరు ఈ వ్యాధి బారినపడి కోలుకున్నారు. గుంటూరులో ఏకంగా ఏడుగురు ఈ వ్యాధి బారిన పడటంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు శుక్రవారం స్వయంగా జీజీహెచ్‌కు వచ్చి పరిస్థితిపై ఆరా తీశారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి గురించి న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎన్.వి.సుందరాచారితో మాట్లాడారు.మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీబీ సిండ్రోమ్ కేసుల గురించి ప్రజలు భయాందోళన చెందాల్సిన పనిలేదన్నారు. సాధారణంగా వచ్చే వైరసేనని, గతంలో కూడా చాలా మంది చికిత్స పొంది రికవరీ అయ్యారని చెప్పారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలన్నారు. ఇవీ లక్షణాలు» మెదడు నుంచి కాళ్ల వరకు పొడవుగా ఉండే కాలి నరాలు ప్రభావితమై కాళ్లు చచ్చుబడిపోతాయి. క్రమంగా వీపు భాగం, చేతులు, మెడ కండరాలు ఇలా దేహమంతా పూర్తిగా అచేతనమవుతుంది. గొంతు కండరాలు అచేతనమైతే రోగి మాట్లాడలేడు. మింగడమూ కష్టమవుతుంది. ముఖంలోని కండరాలు అచేతనమైతే కళ్లు కూడా మూయలేడు.» ఈ ప్రక్రియ ఛాతీ కండరాలు, ఊపిరితిత్తులను పని చేయించే డయాఫ్రమ్ కండరాల వరకు వెళ్లినప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఆ స్థితికి వచ్చిన బాధితులు మృతి చెందే అవకాశం ఉంది. ఈ వ్యాధి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. తీవ్రత స్వల్పంగా ఉంటే నడక కష్టమవుతుంది. ఎక్కువగా ఉంటే బాధితులు పూర్తిగా మంచానికే పరిమితమవుతారు. » జీవక్రియలు ప్రభావిమతమైనప్పుడు గుండె స్పందనలు వేగంగా లేదా మెల్లగా మారడం, బీపీ హెచ్చు తగ్గులకు గురికావడం, ముఖం నుంచి వేడి ఆవిర్లు వస్తున్నట్లు అనిపించడం, బాగా చెమటలు పట్టడం జరగవచ్చు. వ్యాధి మొదలయ్యాక క్రమంగా 7 నుంచి 14 రోజులపాటు తీవ్రం కావచ్చు. మైలీన్ పొర మళ్లీ యథాస్థితికి వస్తే బాధితుడు క్రమంగా కోలుకోవడం మొదలవుతుంది. ఇలా కోలుకోవడమన్నది రోజుల వ్యవధి నుంచి ఆరు నెలలలోగా జరగవచ్చు. » శరీరంలో పొటాషియం లేదా క్యాల్షియం పాళ్లు తగ్గితే జీబీఎస్‌లో కనిపించే లక్షణాలే కనిపిస్తాయి. అయితే అవి భర్తీ కాగానే అచేతనత్వం తగ్గిపోతుంది. ఇక శరీరంలో అకస్మాత్తుగా క్రియాటినిన్ పాళ్లు పెరిగిపోవడం, డిఫ్తీరియా, హెచ్ఐవీ, లింఫోమా వంటి జబ్బుల్లోనూ జీబీ సిండ్రోమ్‌లోని లక్షణాలే కనిపిస్తాయి. కాబట్టి జీబీ సిండ్రోమ్ నిర్ధారణ చాలా స్పష్టంగా జరగాలి.ఎందుకిలా? ఎవరికి వస్తుంది?ఏదైనా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకాక పోస్ట్ వైరల్ లేదా పోస్ట్ బ్యాక్టీరియల్ వ్యాధిగా కనిపించే గులియన్ బ్యారీ సిండ్రోమ్ (జీబీఎస్) కాళ్లు చచ్చుబడిపోవడంతో ప్రారంభమవుతుంది. చిత్రంగా బాధితుల వైటల్స్... అంటే నాడి, రక్తపోటు వంటివన్నీ సాధారణంగానే ఉంటాయి. కానీ కాళ్ల దగ్గర్నుంచి క్రమంగా పై వైపునకు శరీరం అచేతనమవుతూ వస్తుంది. గతంలో ఇది చాలా అరుదుగా కనిపించేది. ప్రతి లక్ష మందిలో కేవలం ఒకరిద్దరికే వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు వందలాది మందిని ప్రభావితం చేస్తోంది. ఇటీవల దీని విస్తృతి పెరిగింది. ఇది ఏ వయసువారిలోనైనా రావచ్చు. పుణేలో అనేక మంది కలుషితమైన నీటిని వాడటంతో ఈ వ్యాధి ప్రబలినట్లు తేలింది. అక్కడి నీళ్లలో నోరో వైరస్, క్యాంపైలో బ్యాక్టీరియా ఉందని.. వాటి ప్రభావంతో వ్యాధి నిరోధక శక్తి బాధితుల నరాలపై ఉన్న మైలీన్ పొరను దెబ్బతీయడంతో ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధి వచ్చినట్లు ప్రాథమిక నివేదికల్లో తేలింది. బాధితులు అచేతనం కావడం ఎందుకంటే.. మనిషి ప్రతి అవయవాన్నీ మెదడు నియంత్రిస్తుంటుంది. మెదడు నుంచి దేహంలోని ప్రతి భాగానికీ ఆదేశాలందించడానికి నరాలపై మైలీన్ అనే పొర ఉంటుంది. వ్యాధి నిరోధక వ్యవస్థలోని యాంటీబాడీస్ తమ సొంత మైలీన్ పొరను దెబ్బతీసినప్పుడు మెదడు నుంచి వచ్చే సిగ్నల్స్ అందక అవయవాలు చచ్చుబడి అచేతనమవుతాయి.వందలో 95 మందికి ప్రాణాపాయం ఉండదుజీబీఎస్ వ్యాధి చాలా ఏళ్లుగా ఉంటోంది. దీని అసలు పేరు ల్యాండ్రీ గులియన్ బ్యారీ సిండ్రోమ్. ప్రపంచ వ్యాప్తంగా లక్ష జనాభాలో ఒకరిద్దరు వ్యాధి బారిన పడుతుంటారు. గుంటూరు జీజీహెచ్‌లో నెలకు 10–15 కొత్త కేసులు మేం చూస్తుంటాం. సాధారణంగా వ్యాధి బారిన పడిన వందలో 75 మందికి ఆస్పత్రుల్లో చికిత్స కూడా అవసరం ఉండదు. 95 శాతం మంది రికవరీ అవుతారు. 5 శాతం మందికి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతాయి.బాధితులకు రూ.5 లక్షల ఖరీదైన ఇమ్యూనో గ్లోబ్యులిన్ ఇంజక్షన్లు ఇవ్వడంతో పాటు, ఆరోగ్య పరిస్థితిని బట్టి ఐసీయూ, వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తుంటాం. ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అంటు వ్యాధి కాదు. ఈ నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదు. కాళ్లు, చేతులు చచ్చుబడటం, కండరాల బలహీన పడటం, స్వతహాగా నిలబడటానికి, నడవడానికి ఇబ్బంది వంటి లక్షణాలున్న వారు వెంటనే వైద్యులను సంప్రదిస్తే సరిపోతుంది. – డాక్టర్ ఎన్.వి. సుందరాచారి, సీనియర్ న్యూరాలజిస్ట్, ప్రిన్సిపల్, గుంటూరు వైద్య కళాశాలతక్కువ ఖర్చుతో ప్లాస్మా ఎక్స్ఛేంజ్ చికిత్సఈ జబ్బులో రోగి తన రోజువారీ పనులను సొంతంగా చేసుకోలేని పరిస్థితికి చేరుకుంటే రోగి శరీర బరువు ఆధారంగా వారికి తగిన మోతాదులో ఐదు రోజులపాటు ఇమ్యూనో గ్లోబ్యులిన్ ఇంజెక్షన్లు ఇస్తారు. ఇవి దేహంలో మైలీన్ షీత్‌ను ధ్వంసం చేసే యాంటీబాడీస్‌ను బ్లాక్ చేయడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుతాయి. మరో పద్దతిలో రోగి బరువునుబట్టి ప్రతి కిలోగ్రాముకూ 250 ఎంఎల్ ప్లాస్మాను రక్తం నుంచి తొలగిస్తారు. అందులో ఐదు విడతలుగా రోజు విడిచి రోజు రక్తంలోని ప్లాస్మాను తీసేయడం ద్వారా ప్లాస్మాలోని యాంటీబాడీస్‌ను తొలగించడం జరుగుతుంది. ఇందులో ఇమ్యూనో గ్లోబ్యులిన్ చికిత్స ఖరీదైనది. దానితో పోలిస్తే ప్లాస్మా ఎక్స్ఛేంజ్ చికిత్స దాదాపు సగం ఖర్చులోనే అవుతుంది. యువత, టీనేజీ పిల్లలు వేగంగా కోలుకుంటారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కలుషితమైన నీరు, ఆహారం వాడకపోవడం అన్ని విధాలా మేలు.– డాక్టర్ బి. చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్ న్యూరో ఫిజీషియన్ -
‘భవ్యం'గా టెండరు!
సాక్షి, అమరావతి : వడ్డించేవాడు మనోడైతే బంతి చివర్లో కూర్చున్నా అన్నీ సమకూరుతాయన్నది సామెత. ప్రభుత్వంలోనూ ఇలాంటి కీలక వ్యక్తులను ప్రసన్నం చేసుకుంటే ఇంక తిరుగే ఉండదు.. అనుకున్న పనులు అనుకున్నట్లు చకచకా జరిగిపోతాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో ఇప్పుడు అచ్చం ఇదే జరుగుతోంది. 108, 104 వాహనాలు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ నిర్వహణ టెండర్లలో ఓ అస్మదీయ సంస్థకు భారీగా లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ ముఖ్యనేతల డైరెక్షన్లో ‘భవ్య’మైన స్కెచ్ వేశారు. ఆ ప్రణాళిక కథాకమామిషు ఇదిగో ఇదే.. ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే లక్ష్యంపేద, బడుగు బలహీన వర్గాలకు మేలు చేసేలా గత ప్రభుత్వంలో అమలైన డైరెక్ట్ బెన్ఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) స్కీంలను టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే అటకెక్కించింది. కూటమి పార్టీ నేతల జేబులు నింపే దోచుకో పంచుకో తినుకో (డీపీటీ) కార్యక్రమాలనే పక్కాగా అమలుచేస్తోంది. అస్మదీయ సంస్థలకు పనులను కట్టబెట్టడం ద్వారా రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే లక్ష్యంగా అడుగు లు వేస్తోంది. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖలోని 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ (ఎంఎంయూ), 108 అంబులెన్స్‌లు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ఈఆర్సీ) నిర్వహణ కాంట్రాక్టును తమ అస్మదీయ సంస్థకు కట్టబెట్టడానికి ఓ ‘భవ్య’మైన ప్రణాళిక రచించినట్లు విశ్వసనీయ సమాచారం. పై మూడింటికీ కలిపి ఏపీఎంఎస్ఐడీసీ ఒకే టెండరును పిలిచింది. ఈ టెండరు నిబంధనలను చూసి ‘నిబంధనలన్నీ ప్రభుత్వ పెద్దలు నిశ్చయించుకున్న సంస్థకే కాంట్రాక్టు కట్టబెట్టేలా ఉన్నాయి. ఆ సంస్థ పేరొక్కటే టెండరు డాక్యుమెంట్లో పొందుపరచలేదు’.. అని వైద్యశాఖలో ఇప్పుడీ అంశాన్ని విస్తృతంగా చర్చించుకుంటున్నారు. నిజానికి.. రోడ్డు ప్రమాదాలు, ఇతర ఘటనల్లో బాధితులకు సత్వర వైద్యసాయం అందజేత, ప్రివెంటివ్ కేర్‌లో 108, 104 సేవలు కీలకపాత్ర పోషిస్తుంటాయి. ఇంత పెద్ద వ్యవస్థ నిర్వహణ కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ పూర్వ అనుభవం, సామర్థ్యం ఎంతో కీలకం. వీలైనన్ని ఎక్కువ సంస్థలు ఈ టెండరులో పాల్గొనే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలి. కానీ, పెద్దఎత్తున అంబులెన్స్‌లు, ఎంఎంయూలు నిర్వహించిన, అనుభవం, సామర్థ్యంలేని సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టడం కోసం ఇష్టమొచ్చినట్లు నిబంధనలు రూపొందించినట్లు స్పష్టమవుతోంది. ఒకే తరహా సేవలకు వేర్వేరు నిబంధనలు.. రాష్ట్రవ్యాప్తంగా 1,700 అంబులెన్స్‌లు, ఎంఎంయూలు ఐదేళ్లపాటు నిర్వహణ, ఇతర అవసరాలకు రూ.రెండు వేల కోట్ల అంచనాతో టెండరు రూపొందించారు. ఇంత విలువైన కాంట్రాక్టులను ఓ చిన్న సంస్థకు కట్టబెట్టడం కోసం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) మార్గదర్శకాలకు తూట్లు పొడిచారు. సీవీసీ మార్గదర్శకాల ప్రకారం.. ప్రాజెక్టు అంచనా వ్యయంలో మూడు ఆర్థిక సంవత్సరాల సగటు వార్షిక టర్నోవర్ కనీసం 30 శాతం ఉండాలి. అయితే, ప్రస్తుత టెండరులో వార్షిక టర్నోవర్ రూ.100 కోట్ల వరకూ ఉండాలని పేర్కొన్నారు. అలాగే, గిరిజన ప్రాంతాల్లో 122 ఫీడర్ అంబులెన్స్ నిర్వహణ కోసం ఏపీఎంఎస్ఐడీసీ టెండర్లు పిలిచింది. ఇందులో సర్వీస్ ప్రొవైడర్‌కు కనీసం రెండేళ్ల అనుభవంతో పాటు, కనీసం 33 శాతం (40) ఫీడర్ అంబులెన్సులను గిరిజన, మారుమూల ప్రాంతాల్లో నిర్వహించి ఉండాలని నిబంధన విధించారు. కానీ, 108, 104 టెండరులో మాత్రం బిడ్ దాఖలుచేసే నాటికి 100 వరకూ అంబులెన్స్‌లు/ఎంఎయూ/వెటర్నరీ యూనిట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో నిర్వహించి ఉంటే చాలన్నారు. ఈ నేపథ్యంలో.. ఒకే తరహా సేవలకు సంబంధించిన టెండర్లలో వేర్వేరు నిబంధనలు విధించడం ఇక్కడ గమనార్హం. ఫీడర్ అంబులెన్స్‌ల తరహాలో 33 శాతం నిబంధన పెడితే అస్మదీయ సంస్థ బిడ్ పరిశీలన దశలోనే తిరస్కరణకు గురవుతుందని 104, 108 టెండరులో మెలికపెట్టినట్లు తెలిసింది. సదరు సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో వెటర్నరీ అంబులెన్స్‌లు నిర్వహిస్తుండడంతో ప్రస్తుత టెండర్లలో వెటర్నరీ అంశాన్ని చేర్చినట్లు సమాచారం. మరోవైపు.. ఎల్రక్టానిక్ హెల్త్ రికార్డుల (ఈహెచ్‌ఆర్) సృష్టిలో అనుభవం ఆధారంగా ఐదు మార్కులు కేటాయిస్తామని టెండరులో పేర్కొన్నారు. ఇక సదరు అస్మదీయ సంస్థ పలు రాష్ట్రాల్లో ఈహెచ్‌ఆర్ ప్రాజెక్టులు చేసిన క్రమంలో దాని ఆధారంగా మార్కులిచ్చి మేలు చేయడానికే ఈ నిబంధన కూడా చేర్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు హెల్త్‌కేర్ ప్రాజెక్టుల్లో ఈ సంస్థ ఉన్న నేపథ్యంలో ప్రతి ప్రాజెక్టుకు 1.5 చొప్పున 15 మార్కుల వరకూ బోనస్ ఇచ్చేలా నిబంధన పెట్టారు.ఒకే బిడ్ వచ్చినా ఆమోదించేలా.. ఇక సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా పనులకు టెండర్లు పిలిచినప్పుడు ఒకే సంస్థ బిడ్ వేస్తే ఆ టెండర్‌ను రద్దుచేసి, మరోసారి పిలవడం ఆనవాయితీ. కానీ, ఓ సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టడం కోసం పూర్వ అనుభవం, సామర్థ్యం కలిగిన సంస్థలు పోటీలో ఉండకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ ‘భవ్య’మైన ప్రణాళికను రచించింది.ఒక్క బిడ్ దాఖలైనా ఆమోదించేలా షరతు విధించింది. దీంతో.. ఒకే సంస్థ పోటీలో ఉండేలా నిబంధనలు పొందుపరిచి, ఆ మేరకు బిడ్ ఆమోదించే వెసులుబాటు కల్పించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. గతంలో టెండర్లు పిలిచినప్పుడు ఇలాంటి నిబంధనలు ఉండేవి కావని, ఇప్పుడే చేర్చారని ఏపీఎంఎస్ఐడీసీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్మెంట్ నిబంధనల సడలింపు
సాక్షి, అమరావతి: తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన ఆస్పత్రులన్నింటిలో ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను అనుమతించాలని ఆరోగ్యశ్రీ సీఈవో, డీఎంఈని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు మెడికల్ రీయింబర్స్మెంట్ నిబంధనలను సడలిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆరోగ్యశ్రీకి మంగళం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేద ప్రజలకు ఉచిత వైద్యం ఇక ఎండమావిలా మారనుంది. కోటిన్నర కుటుంబాలకు ఆపద్భాంధవి అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని బీమా పద్ధతిలో అమలు చేయాలని కూటమి సర్కారు నిర్ణయించింది. ఆరోగ్యశ్రీ పథకానికి వెచ్చిస్తున్న మొత్తంలో భారీగా కోత కోయాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ మేరకు అడుగులు ముందుకు వేసింది. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య సేవలను ట్రస్ట్ పద్ధతిలో కాకుండా ఇన్సూరెన్స్ విధానంలో అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో భాగంగా ఎన్టీఆర్ వైద్య సేవ(ఆరోగ్యశ్రీ)ను బీమా విధానంలో తీసుకొచ్చే అంశంపై అధికారులకు మార్గ నిర్దేశం చేశారు. ఆరోగ్య బీమా విధానం వల్ల నాణ్యమైన సేవలు అందించే అవకాశం ఉంటుందని సమర్థించుకున్నారు. మొత్తంగా రాష్ట్రాన్ని రెండు యూనిట్లుగా విభజించి బీమా విధానాన్ని అమలు చేయాలని.. పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్‌లోని బీమా కంపెనీల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో బీమా కంపెనీల లాభాపేక్ష ముందు పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందడం ప్రశ్నార్థకంగా మారబోతోంది. పేదలెవరూ వైద్యం కోసం ఇబ్బందులు పడకుండా, అప్పుల పాలు కాకుండా మహోన్నత సంకల్పంతో 2007లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్ర విభజన అనంతరం 2014–19 మధ్య నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీకి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఊపిరిలూదింది. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్సార్, వైఎస్ జగన్ గుర్తుకొచ్చేలా గత ఐదేళ్లుగా అమలైంది. అయితే వారి ముద్రను చెరిపివేసే చర్యల్లో భాగంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా కనుమరుగు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ క్రమంలో ఇప్పటికే నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా భారీగా బకాయి పెట్టారు. దీంతో ఆరోగ్యశ్రీ కార్డుతో ఆసుపత్రులకు వెళితే నిర్మొహమాటంగా యాజమాన్యాలు వెనక్కు పంపుతున్న దుస్థితి నెలకొంది. మరోవైపు చికిత్సల అనంతరం విశ్రాంతి సమయానికి అందించే ఆరోగ్య ఆసరా చెల్లింపులు సైతం నిలిచి పోయాయి.ఈ నేపథ్యంలో శనివారం బీమా పేరిట ఆరోగ్యశ్రీ ట్రస్ట్ స్థానంలో ప్రైవేట్ కంపెనీని జొప్పించే ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపారు. దీంతో కొత్త ఏడాదిలో టెండర్లు పిలిచి, బీమా కంపెనీల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఇప్పటికే వైద్య శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బీమా కంపెనీలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించడం గమనార్హం. తొలి నుంచీ బాబుకు ప్రైవేట్ అంటే ప్రేమ » విద్య, వైద్య రంగాలను ప్రైవేట్ పరం చేయటమే లక్ష్యంగా గతంలోనూ చంద్రబాబు పరిపాలన కొనసాగించారు. ప్రస్తుతం కూడా అదే తరహాలో పాలన సాగిస్తున్నారు. ఏకంగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రతిష్టాత్మకమైన ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. ‘ఆరోగ్యశ్రీలో వ్యాధులన్నింటినీ చేర్చడంతోపాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత పరీక్షలు, చికిత్స, ఆపరేషన్ సౌకర్యం కల్పిస్తాం’ అని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి అనంతరం మాట తప్పడం తెలిసిందే. » 2007లో వైఎస్సార్ హయాంలో 942 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి ప్రారంభిస్తే, ఆ తర్వాత చంద్రబాబు సర్కారు ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చింది. తాజాగా బీమా రూపంలో పథకాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతోంది. గత ప్రభుత్వంలో పథకం పరిధిలోకి తెచి్చన 3257 ప్రొసీజర్లకు కోతలు విధించడానికి వైద్య శాఖ కసరత్తు చేస్తోంది. » ప్రస్తుతం హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తుండగా కొత్త విధానంలో కుటుంబాలు/లబి్ధదారుల వారీగా ప్రభుత్వం ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా వైద్య సేవల కల్పన చేపడుతారు. ఇప్పటి వరకూ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వమే నేరుగా పథకాన్ని అమలు చేయడంతో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి. ఇన్సూరెన్స్ ఏజెన్సీల చేతుల్లోకి వెళితే లాభాపేక్షతో ప్రజలకు వైద్య సేవలు ప్రశ్నార్థకంగా మారతాయనడంలో సందేహం లేదు. తాజా ప్రతిపాదనలకు ఆమోదం ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్ విధానంలో అమలు చేయడంలో భాగంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధానాలను కూడా పరిశీలించి అధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. జనఔషధి మందుల షాపులను ప్రతి మండలంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 104 సర్వీసుల ద్వారా రక్త పరీక్షలు చేసే విధానాన్ని పైలెట్‌గా ప్రారంభించాలని సీఎం చెప్పారు. కొత్తగా 108 అంబులెన్స్‌లను కొనుగోలు చేయాలన్నారు. కాగా, 108 సర్వీసులో సిబ్బంది, డ్రైవర్లకు ఇస్తున్న జీతానికి అదనంగా రూ.4 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. కొత్తగా 58 మహాప్రస్థానం వాహనాలను సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా అందుబాటులోకి తేనున్నారు. గత ప్రభుత్వంలో విప్లవాత్మక సంస్కరణలు» వైఎస్సార్సీపీ హయాంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి విప్లవాత్మక సంస్కరణలతో వైఎస్ జగన్ ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించారు. 2019 ఎన్నికల హామీ మేరకు రూ.5 లక్షల్లోపు వార్షికాదాయ కుటుంబాలను పథకం పరిధిలోకి తెచ్చారు. చికిత్స వ్యయం పరిమితిని రూ.5 లక్షలు నుంచి దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.25 లక్షలకు పెంచారు. » అంతకుముందు టీడీపీ హయాంలో కేవలం 1,059 ప్రొసీజర్లతో అస్తవ్యస్థంగా ఉన్న ఆరోగ్యశ్రీకి ప్రాణం పోసి ప్రొసీజర్లను ఏకంగా 3,257కి పెంచారు. ఐదేళ్లలో 45.10 లక్షల మందికి ఉచిత చికిత్స కోసం రూ.13 వేల కోట్లకు పైగా వెచి్చంచారు. శస్త్ర చికిత్సలు జరిగిన 24.59 లక్షల మందికి కోలుకునే సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ.1,465 కోట్ల మేర సాయం అందించారు. » ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను తేవాలన్న సంకల్పంతో రూ.8,500 కోట్లతో 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మారుమూల పల్లెకు, గిరిజన ప్రాంతాల్లోనూ పేదవాడి ఇంటి ముంగిటకే మెరుగైన వైద్యం అందించాలన్న సదుద్దేశంతో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రవేశపెట్టారు. వీటికి తోడు ప్రభుత్వ ఆస్పత్రులను మరింత మెరుగ్గా అభివృద్ధి చేయడంతో పాటు కొత్త ఆస్పత్రులు ఏర్పాటు చేసే కార్యక్రమంలో రూ.17 వేల కోట్లతో నాడు–నేడు కార్యక్రమం చేపట్టారు. » కోవిడ్ సమయంలో ప్రజలకు దేశంలో ఎక్కడా లేని విధంగా సేవలు అందించారు. వైద్య ఆరోగ్య శాఖ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో ఏకంగా 54 వేల వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాలు చేపట్టారు. -
చిన్నారిని చిదిమేసిన సర్కారు నిర్లక్ష్యం
కొత్తపల్లి: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖపై టీడీపీ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీవ్ర నిర్లక్ష్యానికి ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారి బలైంది. 108 అంబులెన్సుల నిర్వహణలో ప్రభుత్వం చేస్తున్న అనవసర రాజకీయాలు ఈ దారుణానికి పరోక్ష కారణం. అందుబాటులో 108 అంబులెన్స్ లేకపోవడంతో జరిగిన జాప్యంవల్ల సకాలంలో సరైన చికిత్స అందక తమ కుమార్తె మరణించిందని చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాకినాడ జిల్లాలో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన వివరాలు ఏమిటంటే.. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో ప్రముఖ ప్రార్థనాలయానికి చెందిన పాస్టర్ కుమార్తె రత్నప్రకాశకు పిఠాపురం మండలం చిత్రాడకు చెందిన జోగి షారోన్కుమార్తో వివాహమైంది. వీరు ప్రస్తుతం కృష్టా జిల్లా పామర్రు నియోజకవర్గం వీరంకిలాకు గ్రామంలో ఉంటున్నారు. వీరి కుమార్తె బెట్సీ జయకీర్తన (3) కొద్దిరోజులుగా ఉప్పాడలోని తన అమ్మమ్మ ఇంటి వద్ద తల్లితో కలిసి ఉంటోంది. క్రిస్మస్ వేడుకలు సమీపించడంతో శనివారం ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మేడపై ఉన్న పాత చెక్క బీరువాను కిందకు దింపి, పైన గదులు శుభ్రపరుస్తున్నారు. కింద ఆడుకుంటున్న జయకీర్తన చెక్క బీరువా గెడను పట్టుకుని వేలాడింది. అంతే.. ఒక్కసారిగా బీరువా ఆమె మీద పడింది. చిన్నారి ఏడుపు విని పరుగున వెళ్లిన కుటుంబ సభ్యులు ఆమెను బయటకుతీసి కొత్తపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించడంతో 108 అంబులెన్సుకు ఫోన్‌చేశారు. అయితే, అది అందుబాటులో లేకపోవడంతో కొత్తపల్లి ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఆ చిన్నారిని బతికించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ 108 రాకపోవడంతో చావుబతుకుల్లో ఉన్న చిన్నారిని కుటుంబ సభ్యులు ప్రైవేటు అంబులెన్సులో కాకినాడకు తరలించారు. మార్గంమధ్యలోనే జయకీర్తన ప్రాణాలు విడిచింది. అప్పటివరకూ ఆడుకుంటూ కేరింతలు కొట్టిన ఆ చిన్నారి అంతలోనే మరణించడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆనందంగా పండగ జరుపుకోవాల్సిన సమయంలో పండంటి బిడ్డను పోగొట్టుకున్నామంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్నారి మృతదేహాన్ని వీరంకిలాకులకు తరలించారు. సకాలంలో 108 అంబులెన్సు వచ్చి ఉంటే తమ పాప బతికేదని తల్లి రత్నప్రకాశ విలపించింది. -
బాలుడికి జికా వైరస్‌పై ‘నారాయణ’ నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి : దేశంలో అరుదుగా నమోదవుతున్న జికా వైరస్ లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్య, ఆరోగ్య శాఖకు కనీస సమాచారం ఇవ్వకుండా మంత్రి నారాయణకు చెందిన నెల్లూరులోని నారాయణ ఆస్పత్రి తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆరేళ్ల బాలుడిలో లక్షణాలు గుర్తించినప్పటికీ ముంబైలోని ప్రైవేట్ ల్యాబ్‌కు నమూనాలు పంపింది. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో జికా వైరస్ అని తేలింది. వాస్తవానికి.. గతనెల 30న జ్వరంతో బాధపడుతున్న బాలుడికి నారా యణ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈనెల 7న జ్వరంలో ఫిట్స్ రావడంతో తిరిగి మరో మారు తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. చికిత్స అందిస్తున్నా ఆరోగ్య సమస్యలు తగ్గకపోవడం, డెంగీ, మలేరియా పరీక్షలు కూడా నెగిటివ్ రావడంతో జికా ఏమోనని వైద్యులు అనుమానించి ఈనెల 13న నేరుగా ముంబైకు నమూనాలు పంపారు. 16న వెలువడిన ఫలితాల్లో జికా వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్లు తేలింది. ఇలా అరుదైన వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే వైద్యశాఖలోని ఎపిడమాలజీ విభాగానికి సమాచారం ఇస్తే ప్రత్యేక బృందాలు బాలుడి నమూనాలను నేరుగా పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ వైరాలజీ (ఎన్ఐవీ) ల్యాబ్‌కు పంపేవారు. దీంతోపాటు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వ్యాధి వ్యాప్తి నియంత్రణకు వేగంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ, నారాయణ ఆస్పత్రి బాధ్యతారాహిత్యం కారణంగా ఇప్పుడు ఈ వ్యవహారంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు.. ప్రైవేట్ ల్యాబ్ ఫలితాల ఆధారంగా జికా వైరస్ అని నిర్ధారణకు రాలేని వైద్యశాఖ.. బాలుడితో పాటు, తల్లిదండ్రులు, గ్రామంలోని మరికొందరి నమూనాలను పూణేలోని ఎన్ఐవీ ల్యాబ్‌కు గురువారం పంపింది. గర్భస్థ శిశువులపై తీవ్ర ప్రభావం..డెంగీ, చికున్‌గున్యా మాదిరిగానే జికా వైరస్ పగటిపూట కుట్టే ఎడిస్ జాతి దోమ కాటు ద్వా రా వ్యాపిస్తుంది. ఇది సోకిన గర్భిణుల ద్వారా పుట్టే శిశువుల్లో మైక్రోసెఫలీ సమస్య ఎదురవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు స్ప ష్టం చేశాయి. దీంతో.. శిశువు మెదడుపై ప్రభా వం పడి నరాలు, కండరాల సమస్యలు, పక్షవాతం, బలహీనత లక్షణాలు ఎదురవుతాయి. సాధారణ వ్యక్తుల్లో సైతం కండరాలు బిగుసుకుపోవడం, దృశ్య లోపాలు, పక్షవాతం సంభవించే అవకాశం ఉంటుంది. రక్తం, వీర్యం, జననాంగ స్రవాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాధి సోకుతుంది. ఈ ఏడాది జూలైలో దేశంలో జికా వైరస్ కేసులు వెలుగు చూశాయి. దీంతో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక మార్గదర్శకాలను ఇచ్చింది. జికా వైరస్ సోకిన ప్రాంతాల్లోని గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలని ఆదేశించింది. -
ఆరోగ్య శాఖకు అవినీతి జబ్బు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖకు అవినీతి రోగం పట్టుకుంది. లంచాలు మరిగిన కొందరు అధికారులు సొంత శాఖ ఉద్యోగులనే డబ్బు కోసం వేధింపులకు గురిచేస్తున్న వ్యవహారం ఆ శాఖలో పెద్ద దుమారాన్ని రేపుతోంది. ముఖ్యంగా కొన్ని డీఎంహెచ్‌వో కార్యాలయాల్లో ఇంక్రిమెంట్లు, సెలవులు, ఎస్ఆర్ ప్రారంభానికి.. ఇలా ప్రతి పనికీ రేటు కట్టి మరీ తమ రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారని వైద్యులు, నర్సులు, ఇతర ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంచం ఇవ్వకుంటే నెలల తరబడి ఫైళ్లను తొక్కిపెడుతున్నారని వాపోతున్నారు. లంచాల వ్యవహారంపై విసిగిపోయిన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కొందరు వైద్యులు ఏకంగా మెడికల్ ఆఫీసర్ల వాట్సప్ గ్రూప్‌లోనే అవినీతి తంతును బహిర్గతం చేసినట్టు తెలిసింది. ప్రసూతి సెలవుల ఆమోదానికి రూ. 3 వేలు, మాజీ ఉద్యోగుల ఇంక్రిమెంట్లకు రూ. 4 వేలు, ఎస్ఆర్ ప్రారంభించడానికి రూ. 5 వేలు ఇలా ప్రతి పనికీ డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఓ రేటు ఖరారు చేశారని ఆరోపించారు. ఇక ప్రొబేషన్ డిక్లరేషన్‌కు రూ. 15 వేలు, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులకు రూ. 2 వేల నుంచి రూ.15 వేలు ఇస్తే కానీ ఫైళ్లు ముందుకు కదలడంలేదని, ఈ అవినీతి దందాకు అడ్డుకట్ట పడాలన్న మెసేజ్‌లు జిల్లా వైద్య శాఖలో కలకలంరేపాయి. దీంతో ఉలిక్కిపడ్డ జిల్లా స్థాయి అధికారి మెసేజ్‌లు పెట్టిన మెడికల్ ఆఫీసర్లకు ఫోన్ చేసి తన కార్యాలయానికి వస్తే మాట్లాడుకుందామని బ్రతిమాలుకున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వసూళ్లకు పాల్పడుతున్న కొందరు డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్‌లకు కార్యాలయాల్లో పనిచేస్తున్న ఏవో, క్లర్కులు, కాంట్రాక్టు ఉద్యోగులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వైద్య శాఖ ఉద్యోగి ఒకరు మెడికల్‌గా అన్‌ఫిట్ అవడంతో నిబంధనల ప్రకారం కుమారుడికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వడానికి ఫైల్‌ను కలెక్టర్‌కు పంపడానికి చిత్తూరు డీఎంహెచ్‌వో కార్యాలయంలో రూ.లక్షలు వసూలు చేశారు. ప్రైవేటుఆస్పత్రుల్లో బెడ్ల సామర్థ్యం ఆధారంగా రిజి్రస్టేషన్, రెన్యువల్‌కు బెడ్‌కు రూ. వెయ్యి చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నారు. అనధికారికంగా డిప్యుటేషన్లు ఉన్నతాధికారుల అనుమతుల్లేకుండా జిల్లాల్లో అనధికార డిప్యుటేషన్ల్లోనూ డీఎంహెచ్‌వోలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనంతపురం జిల్లాలో 20 మందికిపైగా ఉద్యోగులు డీఎంహెచ్‌వో కార్యాలయంలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులందాయి. పనిచేయాల్సిన చోట కాకుండా జిల్లా కేంద్రంలో కొనసాగడానికి వీరు పెద్ద ఎత్తున ఓ ఉన్నతాధికారికి లంచాలు ముట్టజెప్పినట్టు విమర్శలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. గుంటూరు డీఎంహెచ్‌వో ఆఫీస్‌లోనూ అధికారుల అనుమతుల్లేకుండానే కొందరు శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులు డిప్యుటేషన్‌పై కొనసాగుతున్నారు. అర్బన్ పీహెచ్‌సీల్లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లు,చిరుద్యోగులను క్లర్కులుగా కొనసాగిస్తూ వారి ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు. -
అత్యవసర సేవకుల సమ్మెబాట
సాక్షి నెట్వర్క్: తమ సమస్యల పరిష్కారం కోసం 108 ఉద్యోగులు పోరుబాట పట్టాలని నిర్ణయించుకున్నారు. బాబు ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు అయినా 108 ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. పైగా కాంట్రాక్టు సంస్థను మార్చి మరింత గందరగోళానికి గురిచేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తమ సమస్యల పరిష్కారం కోసం 108 ఉద్యోగులు ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఏపీ 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఇటీవల డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ అదనపు సీఈవోకు సమ్మె నోటీసు ఇచ్చారు. మొత్తం 3,600 మంది ఉద్యోగులు (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు, పైలెట్లు) సమ్మెలో పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 768 అంబులెన్స్‌లు నిలిచిపోనున్నాయి. ఆపదలో ప్రాణాలు కాపాడే అపర సంజీవనిగా పేరొందిన 108 అంబులెన్స్ ఉద్యోగుల సమ్మె వల్ల ప్రజలకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉంది. 108 సర్వీస్‌లను ప్రభుత్వమే నిర్వహించాలి.. ఉద్యోగులకు 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి.. వైద్య, ఆరోగ్య శాఖలో భర్తీ చేసే ఉద్యోగాల్లో 108లో పని చేస్తున్నవారికి వెయిటేజీ ఇవ్వాలి.. మరణించిన 108 ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియా రూ.25 లక్షలు ఇవ్వాలి.. తదితర డిమాండ్లతో సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ మేరకు విజయనగరం, అనకాపల్లి, విశాఖ, ఎన్టీఆర్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల డీఎంహెచ్వోలు, డీఆర్వో, మండల స్థాయి అధికారులకు సమ్మె నోటిస్లు ఇచ్చారు. -
మళ్లీ ‘డెంగీ’ పంజా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ, చికున్‌గున్యా, మలేరియా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల తగ్గినట్లే తగ్గి విష జ్వరాలు తిరిగి విజృంభిస్తున్నాయి. మరోవైపు దగ్గు, జలుబు బాధితుల సంఖ్య కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇటీవలి వానలతో నీళ్లు నిలవడం, ఉష్ణోగ్రతలు పెరగడంతో దోమలు స్వైర విహారం చేయడం, వాతావరణంలో మార్పులు వంటివి దీనికి కారణమవుతున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వం, ప్రజలు తగిన జాగ్రత్తలు చేపట్టాలని సూచిస్తున్నారు. హైదరాబాద్‌లో డెంగీ ప్రతాపం ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల ఆరో తేదీ వరకు రాష్ట్రంలో 9,254 డెంగీ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో హైదరాబాద్‌లో అత్యధికంగా 2,731 డెంగీ కేసులు, తర్వాత మేడ్చల్ జిల్లాలో 700 కేసులు నమోదైనట్టు తెలిపింది. మెదక్ జిల్లాలో అత్యంత తక్కువగా 24 డెంగీ కేసులు నమోదైనట్టు పేర్కొంది. అయితే అధికారికంగా నమోదు కాని డెంగీ కేసులు ఇంకా పెద్ద సంఖ్యలో ఉంటాయని అంచనా. మరోవైపు ఇదేకాలంలో తెలంగాణవ్యాప్తంగా 397 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. అందులో ఒక్క హైదరాబాద్‌లో ఏకంగా 204 కేసులు రికార్డయ్యాయి. ఇక 229 మలేరియా కేసులు నమోదవగా.. అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 67 కేసులు ఉన్నాయి. డెంగీ, చికున్‌గున్యా తదితర విష జ్వరాల కేసులు చాలా వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే నమోదవుతున్నాయి. మొత్తం డెంగీ కేసుల్లో 8,409 కేసులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదవగా.. ప్రైవేట్‌లో 845 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అనేక ప్రైవేట్ ఆస్పత్రులు డెంగీ, చికున్‌గున్యా కేసుల వివరాలను సరిగా అందజేయకపోవడమే దీనికి కారణమనే విమర్శలు ఉన్నాయి. తమ వద్దకు వస్తున్న ప్రతీ 10 జ్వరం కేసుల్లో ఇద్దరు, ముగ్గురికి చికున్‌గున్యా లక్షణాలు ఉంటున్నట్టు వైద్యులు చెప్తుండటం గమనార్హం. రాష్ట్రంలో 2,071 డెంగీ హైరిస్క్ ప్రాంతాలు రాష్ట్రంలో డెంగీ ముప్పున్న 2,071 డెంగీ హైరిస్క్ ప్రాంతాలను వైద్యారోగ్యశాఖ ఇప్పటికే గుర్తించింది. గతంలో నమోదైన డెంగీ కేసుల ఆధారంగా ఈ ప్రాంతాలను నిర్ధారించింది. ప్రస్తుతం డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 33 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. అలాగే 42 డెంగీ పరీక్షా కేంద్రాలు, ఆస్పత్రులు, తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లను గుర్తించి వాటిల్లో సౌకర్యాలు కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 53 బ్లడ్ బ్యాంకులను గుర్తించగా.. అందులో 26 బ్లడ్ బ్యాంకుల్లో ప్లేట్లెట్ యూనిట్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. అన్ని జిల్లాల్లోనూ శానిటైజేషన్, నీటి నిల్వ ప్రాంతాల్లో దోమలు రాకుండా చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లాలని.. దోమల ఉత్పత్తిని నివారించే చర్యలు, అవగాహన చేపట్టాలని సూచించారు. మరోవైపు వైద్యారోగ్యశాఖలోని వివిధ విభాగాధిపతులంతా ఆస్పత్రులను పరిశీలించి, నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఒకేసారి రకరకాల జ్వరాలు ఈ ఏడాది రకరకాల వైరల్ జ్వరాలు కలిపి ఒకే సమయంలో దాడి చేస్తున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. కొందరిలో డెంగీ, చికున్‌గున్యా రెండూ కూడా ఉంటున్నాయని అంటున్నారు. ఇక నడివయసువారు, వృద్ధుల్లో చికున్‌గున్యా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వివరిస్తున్నారు. ఏదైనా సరైన పరీక్షలు చేయించుకుని.. వ్యాధిని స్పష్టంగా నిర్ధారించుకుని, చికిత్స పొందాలని స్పష్టం చేస్తున్నారు. డెంగీకి కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటివి సరిపోవని.. ఐజీఎం పరీక్ష చేయించాలని సూచిస్తున్నారు. -
కొత్తగా 400 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది అదనంగా 400 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం మంగళవారం 4 కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ యాదాద్రి భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్ కాలేజీలకు అనుమతి ఇస్తూ ప్రిన్సిపాళ్లకు లేఖ రాసింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం 8 కొత్త కాలేజీల కోసం దరఖాస్తు చేసింది. వాటిలో నాలుగింటికి గత నెలలో అనుమతులు రాగా, తాజాగా మిగిలిన నాలుగింటి అనుమతులపై స్పష్టత ఇచ్చింది. గత నెలలో ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేట కాలేజీలకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వడం పట్ల మంత్రి దామోదర రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది వీటిల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయని తెలిపారు. మొత్తం 8 కాలేజీల్లో కలిపి 400 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ కాలేజీల్లోని మొత్తం సీట్ల సంఖ్య 4090కి పెరిగినట్టు మంత్రి వెల్లడించారు. ముమ్మర ప్రయత్నాలు... ఈ ఏడాది మొత్తం 8 కాలేజీలకు ప్రభుత్వం దరఖాస్తు చేసింది. జూన్‌లో ఈ కాలేజీల పరిశీలనకు వచ్చిన ఎన్ఎంసీ అధికారులు, ఇక్కడ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. టీచింగ్ స్టాఫ్, సౌకర్యాలు లేకుండా అనుమతులు ఇవ్వలేమన్నారు. అధికారులు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకురావడంతో అవసరమైన నిధులను కొత్త సర్కార్ కేటాయించింది. ఎన్ఎంసీ లేవనెత్తిన లోపాలను సవరించి ఫస్ట్ అప్పీల్‌కు వెళ్లింది. ఈ అప్పీల్ తర్వాత ములుగు, నర్సంపేట, గద్వాల నారాయణపేట కాలేజీలకు పర్మిషన్ ఇచ్చిన ఎన్ఎంసీ, మిగిలిన 4 కాలేజీలకు అనుమతి ఇవ్వలేదు. ఈ కాలేజీల అనుమతులపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రెగ్యులర్‌గా పర్యవేక్షించారు. యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ కాలేజీలకు సిబ్బందిని నియమించారు. ఇటీవల జరిగిన జనరల్ ట్రాన్స్ఫర్లలో తొలుత ఆ 4 కాలేజీల్లోని ఖాళీలను నింపిన తర్వాతే, మిగిలిన కాలేజీల్లోకి స్టాఫ్‌ను బదిలీ చేశారు. ప్రొఫెసర్ల కొరతను అధిగమించేందుకు ఎలిజిబిలిటీ ఉన్న వారికి ప్రమోషన్లు ఇప్పించారు. కాలేజీ, హాస్పిటల్లో ఉండాల్సిన లేబొరేటరీ, డయాగ్నస్టిక్స్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేసేందుకు నిధులు కేటాయించారు. ఇలా ఎన్ఎంసీ లేవనెత్తిన అన్ని లోపాలను సవరించి కేంద్ర ఆరోగ్యశాఖకు సెకండ్ అప్పీల్ చేశారు. మంత్రి దామోదర రాజ నర్సింహ ఆదేశాలతో వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ, డీఎంఈ డాక్టర్ వాణి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆరోగ్యశాఖ, ఎన్ఎంసీ అధికారులను కలిశారు. కాలేజీల ఏర్పాటుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని, ఇంకేమైనా అవసరం ఉంటే అవి కూడా సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అన్ని కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. లెటర్ ఆఫ్ పర్మిషన్ జారీ చేయాలని ఎన్ఎంసీని ఆదేశించింది. మంత్రి దామోదర రాజనర్సింహ ప్రయత్నాలు సఫలం అయ్యాయి. ఆయన కృషి ఫలితంగా కొత్తగా మెడికల్ కాలేజీలకు అనుమతులు వచ్చాయి. కాలేజీలకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, సకాలంలో అవసరమైన నిధులు కేటాయించిన సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి దామోదర రాజనర్సింహ కృతజ్ఞతలు తెలిపారు. -
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం
సాక్షి, అమరావతి: ‘అధికారంలోకి వస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తాం. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం’ అంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన టీడీపీ కూటమి.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కుతోంది. కొత్త ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేయకపోగా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన నియామకాల ప్రక్రియలను సైతం నిలిపివేసే దిశగా అడుగులు వేస్తూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. వైద్య, ఆరోగ్య శాఖలో 2 వేలకు పైగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను రద్దు చేయాలని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో ఆ శాఖ ఉన్నతాధికారులు పలుమార్లు సమావేశం నిర్వహించి.. నోటిఫికేషన్లు రద్దు చేస్తే తలెత్తే న్యాయపరమైన ఇబ్బందులపై చర్చించినట్లు సమాచారం. జీరో వేకెన్సీకి తిలోదకాలు.. ప్రభుత్వాస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్లు, డాక్టర్లు, నర్సుల, ఇతర వైద్య సిబ్బంది కొరత లేకుండా జీరో వేకెన్సీ(ఎప్పటికప్పుడే ఖాళీలు భర్తీ) పాలసీని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీ పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూనే.. రోగుల అవసరాలకు అనుగుణంగా కొత్త పోస్టులు మంజూరు చేస్తూ వచ్చింది. ఎన్నికలకు ముందు కూడా పారామెడికల్‌తో పాటు ఇతర సహాయక సిబ్బంది పోస్టుల భర్తీ కోసం డిస్టిక్ సెలక్షన్ కమిటీ(డీఎస్సీ)లు 2 వేలకు పైగా పోస్టుల భర్తీకి 18 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అయితే ఈ నియామక ప్రక్రియ కొనసాగుతుండగా ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే జీరో వేకెన్సీ పాలసీకి తూట్లు పొడిచింది. అలాగే వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసిన ఈ 18 నోటిఫికేషన్లనూ రద్దు చేసేందుకు చర్యలు చేపట్టింది. తుది దశలో ఉన్నా.. రద్దుకే మొగ్గు! వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసిన 18 నోటిఫికేషన్లకు సంబంధించి.. మూడింటిలో ఇప్పటికే తుది మెరిట్ జాబితాలు విడుదలయ్యాయి. మరో 8 నోటిఫికేషన్లలో ప్రాథమిక మెరిట్ జాబితాలు జారీ చేయగా.. ఏడింటిలో ప్రాథమిక మెరిట్ జాబితాలు విడుదల చేయాల్సి ఉంది. ఇలా దాదాపు ముగింపు దశలో ఉన్న నోటిఫికేషన్లను రెండు నెలలకు పైగా పెండింగ్‌లో ఉంచిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు రద్దు చేసే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. అలాగే విజయనగరం వైద్య కళాశాలలో 60 పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను కూటమి ప్రభుత్వం రద్దు చేసి.. గత నెలలో రెండో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత రెండో నోటిఫికేషన్‌ను కూడా నిలిపివేసింది. ఇక మచిలీపట్నం వైద్య కళాశాలలో 96 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా.. ఒక విడత ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. రెండో విడత ఎంపిక జాబితా మాత్రం ఇంకా ప్రాసెస్‌లోనే ఉండిపోయింది. దీనిపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంపై ఉన్న కోపంతో.. తమ జీవితాలతో ఆడుకోవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వైద్య సేవలపై ప్రభావం.. కూటమి ప్రభుత్వ నిర్ణయాల వల్ల వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. రాష్ట్రంలో విష జ్వరాలు విలయతాండవం చేస్తున్న తరుణంలో.. బోధనాస్పత్రుల్లో పారామెడికల్, ఇతర సహాయక సిబ్బంది కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మార్కాపురం బోధనాస్పత్రిలో రోజుకు 500 నుంచి 600 మేర ఓపీలు నమోదవుతున్నాయి. ఈ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీíÙయన్లు 25 మంది అవసరమవ్వగా.. ప్రస్తుతం ఐదుగురే ఉన్నారు. రోజుకు 300 వరకు ల్యాబ్ పరీక్షలు చేయాల్సిన చోట.. ఐదుగురే ఉండటంతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఆలస్యమవుతున్నాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయితే గానీ ఈ సమస్య పరిష్కారమవ్వదని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. -
మన డాక్టరమ్మకు భద్రత కావాలి
సాక్షి, అమరావతి: వైద్య విద్యార్థినిపై కోల్‌కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది భద్రతలో లొసుగులను తేటతెల్లం చేసింది. ప్రస్తుతమున్న చట్టాలు వైద్యులు, వైద్య సిబ్బందికి భద్రతా వాతావరణాన్ని కల్పించడం లేదని ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మన డాక్టరమ్మల భద్రత ఏ విధంగా ఉంది? సురక్షిత వాతావరణంలో మహిళా వైద్యులు, సిబ్బంది సేవలు అందించాలంటే ఏ చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై ‘సాక్షి’ పలువురు వైద్య నిపుణులతో చర్చించింది. వైద్య శాఖలో 30 ఏళ్లకుపైగా సేవలు అందించిన సీనియర్ వైద్యులు, మాజీ ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లను కలిసి వారి అభిప్రాయాలను సేకరించింది.గళం విప్పే వ్యవస్థ రావాలిఅన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, కళాశాలల్లో ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలపై ఫిర్యాదులు చేయడానికి, పరిష్కరించడానికి అంతర్గత కమిటీలు ఉంటాయి. అయితే వీటిల్లో ఆయా కళాశాల, ఆస్పత్రిలో పని చేసే ఫ్యాకల్టీ, వైద్యులు, ఇతర అధికారులే సభ్యులుగా ఉంటారు. దీంతో ఏదైనా సమస్య తలెత్తితే విద్యార్థినులు ఫిర్యాదు చేయడానికి సంకోచించే పరిస్థితులు న్నాయి. తమ వివరాలు బహిర్గతమై కొత్త చిక్కులు తలెత్తుతాయని ఆందోళన చెందుతున్నారు. కమిటీల్లో పోలీస్, న్యాయ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులకు స్థానం కల్పిస్తే నిష్పాక్షిక విచారణకు వీలుంటుంది. బాధితులు నిర్భయంగా గళం విప్పడానికి ఆస్కారం లభిస్తుంది. ముఖ్యంగా లైంగిక వేధింపులు, ర్యాగింగ్ ఘటనల్లో బాధితులు వెనుకడుగు వేయడానికి ప్రధాన కారణం ఆయా కమిటీల్లో సభ్యులంతా అక్కడి వారు కావడమేనని పేర్కొంటున్నారు. హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు 36 గంటలు, రెండు, మూడు రోజులు నిరంతరాయంగా విధులు నిర్వహిస్తున్న దుస్థితి నెలకొంది. గతంతో పోలిస్తే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ సీట్లు పెరిగాయి. అందువల్ల విద్యార్థుల పని వేళలపై వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాలి. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం 24 గంటల పాటు విధులు నిర్వహించిన విద్యార్థికి డే ఆఫ్ తప్పకుండా ఇవ్వాలి.సహాయకుల రాకపోకలపై షరతులుప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగికి సహాయకుడిగా ఒకరినే అనుమతిస్తారు. కొన్ని సందర్భాల్లో అసలు సహాయకుడినే అనుమతించరు. పరామర్శలకు వచ్చే వారిని పరిమిత వేళల్లోనే అనుమతిస్తారు. ప్రతి వ్యక్తిని స్క్రీనింగ్ చేస్తారు. మద్యం, ఇతర మత్తు పదార్థాలు సేవించిన వ్యక్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. ఇలాంటి నిబంధనలే ప్రభుత్వాస్పత్రుల్లోనూ విధించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల సహాయకులు, బంధువులు, స్నేహితుల రాకపోకలపై నియంత్రణ లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. చికిత్స అందించడంలో ప్రొటోకాల్ కారణంగా ఆలస్యం / దురదృష్టవశాత్తూ రోగి మృతి చెందిన సందర్భాల్లో వైద్య సిబ్బందిపై ఒక్కోసారి దాడులు జరుగుతున్నాయి. గత రెండు నెలల్లో కర్నూలు, విజయవాడ జీజీహెచ్‌లలో ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. ఇలాంటివి పునరావృతం కాకుండా సహాయకులను నియంత్రించాలి. ఎమర్జెన్సీ, ఇతర వార్డుల్లోకి ప్రవేశించేప్పుడే సహాయకులను స్క్రీనింగ్ చేయాలి. ఎమర్జెన్సీ వార్డుల్లో అదనపు భద్రత సిబ్బందిని నియమించాలి.భద్రతపై వైద్య వర్గాల ప్రధాన డిమాండ్లు⇒ రక్షణ చర్యలపై కనీస అవగాహన లేని వారు, వయసు మళ్లిన వారు ఆస్పత్రులు, కళాశాలల వద్ద సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వహిస్తున్నారు. సుశిక్షితులైన భద్రతా సిబ్బందిని నియమించాలి. ⇒ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరగాలి. ఆస్పత్రులు, కళాశాలల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణను బలోపేతం చేయాలి. హై రిజల్యూషన్ కెమెరాలను అమర్చి 24/7 పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఉండాలి. ఏ చిన్న అవాంఛనీయ ఘటన చోటు చేసుకున్నా వెంటనే అప్రమత్తం కావాలి.⇒ విధుల్లో ఉండే వైద్య సిబ్బందికి సరిపడా వాష్, రెస్ట్, డ్యూటీ రూమ్స్ ఉండాలి. మహిళా వైద్యులు, విద్యార్థినుల కోసం కేటాయించిన గదుల వద్ద పటిష్ట భద్రత కల్పించాలి. ⇒ ప్రస్తుతం రాష్ట్రంలోని బోధనాస్పత్రులు చాలా వరకూ కొన్ని దశాబ్ధాల క్రితం నిర్వహించినవే. గత ప్రభుత్వంలో నాడు–నేడు కింద పీహెచ్‌సీలు, సెకండరీ కేర్ పరిధిలో చాలా వరకూ కొత్తగా ఆస్పత్రుల్లో వైద్యుల అవసరాలకు అనుగుణంగా వసతులు కల్పించారు. కొత్తగా నిర్మించే వైద్య కళాశాలల్లో అదే తరహాలో వసతులు ఉంటున్నాయి. ఇక పాత బోధనాస్పత్రులతో పాటు, మరికొన్ని పాత ఆస్పత్రుల్లో పెరిగిన వైద్యులు, విద్యార్థుల సంఖ్యకు వసతులు లేవు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం వసతులు కల్పించాలి. ⇒ సాధారణంగా ఊరికి దూరంగా ఉండే ప్రభుత్వ ఆస్పత్రులు, కళాశాలల వద్ద పోలీసు నిఘా నిరంతరం ఉండాలి. పరిసరాల్లో ముళ్లు, చెట్ల పొదలు స్థానిక సంస్థలు చర్యలు చేపట్టాలి.⇒ వైద్య సిబ్బంది సంచరించే ప్రాంతాల్లో రాత్రి వేళ లైట్లు ఉండాలి. సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు దీన్ని పర్యవేక్షించాలి. వైద్య సిబ్బందితో నిర్వహించే సమావేశాల్లో రోగులకు సేవల కల్పనతోపాటు భద్రతాపరమైన అంశాలపైనా చర్చించాలి. ఇబ్బందులను తెలుసుకుని పరిష్కరించాలి.కమిటీల్లో పోలీసులు, లాయర్లు ఉండాలివైద్య విద్యార్థుల్లో 70 శాతం వరకు యువతులే ఉన్నందున వారి భద్రత పట్ల ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అన్ని కళాశాలల్లో సమస్యలను నివేదించేందుకు కమిటీలున్నా చురుగ్గా పనిచేసేలా చూడాలి. కేవలం టీచింగ్ ఫ్యాకల్టీ మాత్రమే కాకుండా పోలీస్ శాఖ నుంచి సీఐ స్థాయి అధికారి, న్యాయ శాఖ నుంచి ఒకరితోపాటు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి కమిటీలో సభ్యులుగా ఉండాలి. సభ్యుల పేర్లు, ఫోన్ నెంబర్లను కళాశాలలో ప్రదర్శించాలి. – డాక్టర్ విఠల్‌రావు, సిద్ధార్థ వైద్య కళాశాల పూర్వ ప్రిన్సిపల్ సీసీ కెమెరాలు పెంచాలివిశాలమైన ప్రభుత్వ ఆసుపత్రులు, కళాశాలల ప్రాంగణాల్లో భద్రత కల్పించడం సవాళ్లతో కూడుకున్నదే. తరగతి గదులు, ల్యాబ్‌లు, కారిడార్లు, విద్యార్థులు, వైద్యులు సంచరించే అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల సర్వే లెన్స్ ఉండేలా చూడాలి. వీటి పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ రూమ్‌లో 24/7 సిబ్బంది ఉండాలి. ఆస్పత్రులు, కళాశాలల పరిసర ప్రాంతాల్లో పోలీసు నిఘా ఏర్పాటు చేయాలి. దీనివల్ల భద్రతతోపాటు ఆస్పత్రుల్లో శిశువుల అపహరణలు అరికట్టవచ్చు. మహిళా వైద్య సిబ్బంది శారీరక, మానసిక దృఢత్వంపై దృష్టి సారించాలి. – డాక్టర్ వెంగమ్మ, రిటైర్డ్ డైరెక్టర్, వీసీ, స్విమ్స్ యూనివర్సిటీ, తిరుపతివసతులు మెరుగుపడాలిఆస్పత్రులు, కళాశాలల్లో వసతులను అభివృద్ధి చేయాలి. కోల్‌కతాలో హత్యాచారానికి గురైన విద్యార్థిని 36 గంటలు విధులు నిర్వర్తించింది. మన దగ్గర కూడా ఈ పరిస్థితులు న్నాయి. వైద్య విద్యార్థుల పని వేళల మీద దృష్టి పెట్టాలి. తగినన్ని వాష్ రూమ్స్, రెస్ట్ రూమ్స్, డ్యూటీ రూమ్స్ ఏర్పాటు చేసి పరిశుభ్రంగా నిర్వహించాలి. ముఖ్యంగా మహిళా వైద్య సిబ్బందికి ఆస్పత్రుల్లో సురక్షిత వాతావరణం కల్పించాలి. ఫ్యాకల్టీ సైతం విద్యార్థులను తమ పిల్లల్లాగా భావించాలి. – డాక్టర్ శశిప్రభ, మాజీ డీఎంఈ, ఉమ్మడి ఏపీ వ్యవస్థ మారాలి..దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి వద్ద జూనియర్ వైద్యులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తెల్లటి వస్త్రంపై ఎర్రటి సిరాతో చేతి ముద్రలు వేస్తూ.. మహిళలపై దాడులను అరికట్టాలంటూ నినదించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి రాత్రి భద్రత పెంచాలిబోధనాస్పత్రుల్లో టీబీ, ఇన్ఫెక్షన్ వైద్య సేవలు, బ్లడ్ బ్యాంక్‌లు, ల్యాబ్‌లు, కొన్ని రకాల విభాగాలు ఐపీ, ఓపీ భవనాలకు దూరంగా ఉన్నందున జన సంచారం తక్కువగా ఉంటుంది. అలాంటి విభాగాల్లోనూ మహిళా వైద్యులు, సిబ్బంది నైట్ డ్యూటీలు చేస్తుంటారు. అక్కడ సెక్యూరిటీ పెంచాలి. అనుమా నాస్పద వ్యక్తులు చొరబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బులు కట్టి చికిత్స పొందే ప్రైవేట్ ఆస్పత్రుల్లో సైతం క్షుణ్నంగా పరిశీలించాకే పరిమిత వేళల్లో రోగుల సహాయకులను అనుమతిస్తారు. ప్రభుత్వాస్పత్రుల్లోనూ అలాగే వ్యవహ రించాలి. సహాయకులను గుంపులుగా అనుమతించకూడదు. – డాక్టర్ చాగంటి పద్మావతి, పూర్వ ప్రిన్సిపల్, గుంటూరు వైద్య కళాశాల -
బ్రెయిన్ ఈటింగ్ అమీబా జాగ్రత్త సుమా!
హెల్త్‌డెస్‌్క : కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కారణంగా ఇటీవల ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన దేశవాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఈ తరహా అమీబా అనవాళ్లు లేకపోయినా వైద్య ఆరోగ్య శాఖలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కలుషితమైన చెరువులు, నీటివనరులతో పాటు సరైన నిర్వహణ లేని స్విమ్మింగ్ పూల్లలో చిన్నారులు ఈదడం వల్ల ఈ తరహా అమీబా వ్యాపించే అవకాశం ఉంది. చిన్నారుల్లో రోగ నిరోధకత తక్కువ కాబట్టి వారిపై ఇది ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ముక్కు రంధ్రాల్లోంచి మెదడుకు.. నెగ్లేరియా ఫౌలేరీ అని పిలిచే ఈ అమీబా ప్రపంచవ్యాప్తంగా లోతుతక్కువ ఉండే చెరువులు, సరస్సులు, కాల్వలతో పాటు పంటపొలాలు, నేలల్లోనూ నివసిస్తుంది. బాగా వేడిగా ఉండే నీటి బుగ్గల్లో (హాట్ స్ప్రింగ్స్) కూడా ఇది మనుగడ సాగించగలుగుతుంది. ఇది మెదడులో ‘ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్కెఫలైటిస్ – (పామ్)’ అనే తీవ్రమైన ఇన్ఫెక్షన్ను కలుగజేస్తుంది. (ఈ కారణంగానే దీనిని బ్రెయిన్ ఈటింగ్ అమీబాగా పేర్కొంటున్నారు) నాడీ వ్యవస్థను దెబ్బతీయడం వల్ల మరణించే అవకాశమూ ఉంది. చిన్నారులు చెరువులు, ఈత కొలనుల్లాంటి వాటిల్లో ఈదుతున్నప్పుడు ఈ అమీబా వాళ్ల ముక్కు రంధ్రాల్లోంచి మెదడుకు చేరి ‘పామ్’ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. లక్షణాలు» తీవ్రమైన జ్వరం » తీవ్రమైన తలనొప్పి » వికారం, వాంతులు » వణుకు ళీ అయోమయం చివరగా కోమాలోకి వెళ్లే ప్రమాదం » మెదడువాపులో కనిపించే అన్నిలక్షణాలతో పాటు మెడకదలించలేకపోవడం (స్టిఫ్ నెక్), వెలుతురు చూడలేకపోవడం. నిర్ధారణ» లంబార్ పంక్చర్ ప్రక్రియ ద్వారా వెన్నుపాము చివరి భాగం నుంచి నీరు (సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్) తీసి పరీక్షించాల్సి ఉంటుంది. » కొన్నిసార్లు మెదడు బయాప్సీ నిర్వహించి అక్కడ అమీబా ఉనికిని గుర్తించాల్సి ఉంటుంది. నివారణ» కలుíÙత నీటితో కూడిన చెరువులు, కాల్వలు,సరస్సుల వంటి వాటిల్లోకి పిల్లలు వెళ్లకుండా చూసుకోవాలి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగాఉండే పిల్లల విషయంలో ఇది మరీ ప్రమాదం. » నగరాల్లోని స్విమ్మింగ్ పూల్స్‌లో వాటి నిర్వహణ సరిగా (క్లోరినేషన్ చేయడం, పరిశుభ్రమైన నీటినే వాడటం) ఉందా లేదా? అనే విషయాలను పరిశీలించాకే పిల్లలను పంపాలి. » కొందరు యోగా నిపుణులు ఓ కొమ్ము చెంబు నుంచి నేరుగా ముక్కు రంధ్రం ద్వారా నీటిని బయటకు స్రవించేలా చేసే ‘నేతి’ప్రక్రియ చేయిస్తుంటారు. అయితే మామూలు నల్లా / కొళాయి నీళ్లతో చేసేవారు బాగా మరగబెట్టి చల్లార్చిన నీటితోనే దీన్ని చేయాలి. కలుషితమైన నీళ్లతో చేస్తే పెద్దవారిలోనూ బ్రెయిన్ఈటింగ్ అమీబా తాలూకు ‘పామ్’ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. ఎంత వేగంగా చికిత్స చేస్తే అంత మేలు దీనికి నిర్దిష్ట చికిత్స అంటూ ఏదీ లేదు. కరోనా కేసుల్లో మెదడుకు బ్లాక్ ఫంగస్ వచ్చినప్పుడు ఉపయోగించిన యాంఫోటెరిసిన్–బి వంటి మందులతో పాటు రిఫాపిన్, ఫ్లుకోనాజోల్, మిల్టెఫొసైన్ వంటి మందులను ఉపయోగిస్తారు. (మిల్టెఫొసైన్ను.. శాండ్‌ఫ్లై అనే కీటకాల్లో ఉంటూ లీష్మానియాసిస్ అనే వ్యాధిని కలిగించే పరాన్నజీవి సంబంధిత ఇన్ఫెక్షన్కు ఉపయోగించడానికి ‘ఎఫ్‌డీఏ’అనుమతించింది). త్వరగా వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తే అంత మేలు. చిన్నారులకు చల్లటి నీళ్లతో (మరీ చల్లటివి కాదు) స్పాంజింగ్ చేస్తూ జ్వరం తగ్గేలా చేయడం వల్ల వేగంగా కోలుకుంటారు. డా. విజయ్, న్యూరాలజిస్ట్,కిమ్స్ ఐకాన్, వైజాగ్ -
ప్రజారోగ్య సంచాలకుల విభాగం రద్దు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అత్యంత కీలకమైన ప్రజారోగ్య సంచాలకుల (డీపీహెచ్) విభాగాన్ని రద్దు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఆ విభాగాన్ని వైద్య విధాన పరిషత్‌లో కలిపి కొత్తగా డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కేర్ సర్వీసెస్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. డీపీహెచ్ రద్దయితే డైరెక్టర్ పోస్టు కూడా రద్దవుతుంది. కొత్తగా ఏర్పాటు చేసే డైరెక్టరేట్‌కు ఒక కమిషనర్‌ను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ప్రస్తుతం డీహెచ్గా ఉన్న డాక్టర్ రవీందర్‌నాయక్ పోస్టు పోతుందని అంటున్నారు. పీహెచ్‌సీలు మొదలు జిల్లా ఆసుపత్రుల దాకా ఒకే విభాగం పర్యవేక్షణలోకి... ప్రస్తుతం వైద్య, ఆరోగ్యశాఖలో ప్రజారోగ్య సంచాలకుల విభాగం, వైద్య విధాన పరిషత్, వైద్యవిద్య సంచాలకుల (డీఎంఈ) విభాగం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం ఉన్నాయి. డీపీహెచ్ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్సీ)లు ఉన్నాయి. అంటే ప్రాథమిక ఆరోగ్య వైద్య సేవలన్నీ ఆ విభాగం పరిధిలోనే జరుగుతాయి. అలాగే వైద్యవిధాన పరిషత్ పరిధిలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు ఉండగా మెడికల్ కాలేజీలు డీఎంఈ పరిధిలో ఉన్నాయి. ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో సబ్ సెంటర్లు, కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్హెచ్ఎం కింద చేపట్టే ప్రత్యేక కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఇప్పుడు డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కేర్ సర్వీసెస్‌ను ఏర్పాటు చేస్తే పీహెచ్సీ నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు దాని పరిధిలోకి వస్తాయి. ఇలా అవన్నీ ఒకే గొడుగు కిందకు వస్తాయి. మిగిలిన విభాగాలు యథావిధిగా కార్యకలాపాలు సాగిస్తాయని వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇక వైద్య విధాన పరిషత్‌లోని ఉద్యోగులందరికీ ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వడం ద్వారా వారికి అన్ని వసతులను ప్రభుత్వం కల్పించనుంది. వైద్య వ్యవస్థలకు జిల్లా బాస్ ఎవరు? ఈ నాలుగు విభాగాలకు కలిపి జిల్లా స్థాయిలో ఒక బాస్ లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఉదాహరణకు మెడికల్ కాలేజీల్లో ఏదైనా సమస్య తలెత్తితే ప్రిన్సిపాల్ చూస్తారు. మరి అన్ని మెడికల్ కాలేజీల్లో సమస్య తలెత్తితే జిల్లా స్థాయిలో దాన్ని పరిష్కరించే నాథుడే లేడు. రాష్ట్ర స్థాయిలో ఉండే డీఎంఈనే సమస్యను పరిష్కరించాల్సి వస్తోంది. ఇదే పరిస్థితి మిగిలిన విభాగాల్లోనూ నెలకొంది. పేరుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారే (డీఎంహెచ్‌వో) అయినా కేవలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకే పరిమితమయ్యారు. ఇతర విభాగాల ఉద్యోగుల సమస్యలు వినే పరిస్థితి లేదు. ఇలా జిల్లాస్థాయి వైద్య విభాగాలను పర్యవేక్షించే వ్యవస్థ లేదు. అన్ని వైద్య విభాగాలకు కలిపి ఒక అధిపతి లేరు. ఈ పరిస్థితిని కూడా మార్చాలని వైద్య, ఆరోగ్యశాఖ భావిస్తోంది. రాష్ట్రస్థాయిలో ఆ శాఖ కార్యదర్శి బాస్‌గా ఉన్నా కింది స్థాయిలో మాత్రం ప్రత్యేక వ్యవస్థ లేదన్న చర్చ జరుగుతోంది. -
Fact Check: బాబు హయాంలో తుస్...జగన్ పాలనలో భేష్!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రామోజీ పైత్యం పరాకాష్టకు చేరుతోంది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గంటూ ఈనాడులో ‘పచ్చ’ రోతలు పెచ్చుమీరుతున్నాయి. బాబు హయాంలో వ్యవస్థ మొత్తం భ్రష్టుపట్టినా వేలెత్తి చూపేందుకు మనసురాని పచ్చ పత్రికలకు జగన్ హయాంలో జరిగే మంచి కూడా పాపంలా కనిపిస్తోంది. ఏపీలో వైద్యరంగాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న ఆయన సంస్కరణలు వారికి ఘోరంలా గోచరిస్తున్నాయి. కొత్తగా 17 వైద్య కళాశాలలు రాష్ట్రంలో ఏర్పాటు చేసి అందులో ఐదింటిని ప్రారంభించినా ప్రశంసించలేక... పగబడుతున్నాయి. ఐదేళ్లలో వైద్య రంగం స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తే... అది తమ వారు చేయలేకపోయారన్న దుగ్ధతో క్షుద్ర రాతలకు తెగబడుతున్నాయి. ‘తెలంగాణ లో భేష్.. ఏపీలో తుస్’ అంటూ ఇక్కడి బోధన ఆస్పత్రులపై నికృష్ట కథనాన్ని అచ్చేశాయి. సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. వీలైనంత పెద్ద సంఖ్యలో అబద్ధాలను అచ్చేయాలి. ఎలాగైనా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచాలి. తద్వారా తమకు అనుకూలురైన పచ్చనేతలకు పట్టంగట్టాలి. ఇదే లక్ష్యంతో ఎలాంటి దారుణానికైనా వెనుకాడకూడదని రామోజీ సారధ్యంలో నడుస్తున్న ఈనాడు నిర్ణయించుకున్నట్టుంది. ఇందుకోసం రోజురోజుకూ అత్యధిక సంఖ్యలో తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయి. 2014–19 మధ్య రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగం పడకేసిన సందర్భంలోనూ సీఎంగా తన మనిషి ఉండటంతో ఆహా ఓహో ఏపీ వైద్య రంగం అంటూ రామోజీరావు బాకాలు ఊదారు. గడచిన ఐదేళ్లలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వైద్య, ఆరోగ్యశాఖలో 53 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయడంతో పాటు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించారు. 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు చర్యలు చేపట్టి ఐదు కళాశాలలను ఇప్పటికే ప్రారంభించడంతో పాటు, మరో ఐదు త్వరలో ప్రారంభించనున్నారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ విధానం, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి ప్రజల గుమ్మం వద్దకే వైద్య సేవలను చేరువ చేశారు. కేవలం ఐదేళ్లలో వైద్య రంగం ఇంతగా పురోగమిస్తే బాబుకు రాజకీయ భవిష్యత్ ఉండదనే ఉద్దేశంతో నిస్సిగ్గుగా ఈనాడులో దిగజారుడు రాతలు రాస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ కంటే మనమే మెరుగు ప్రజలకు వైద్యపరంగా అండగా నిలవడంలో పక్కనున్న తెలంగాణాతో పాటు, దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ ఉంటోంది. మధ్యతరగతి వర్గాలకు సైతం ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందిస్తున్న రాష్ట్రంగా ఏపీని నీతి ఆయోగ్ సైతం కీర్తించింది. రూ.5 లక్షలలోపు వార్షికాదాయం గల కుటుంబాలన్నీ నేడు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయి. రూ.25 లక్షల వరకూ వైద్య సేవలను ఉచితంగా పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రం కన్నా మిన్నగా ఆరోగ్యశ్రీ పథకాన్ని సీఎం జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది. రక్తహీనత నివారణ, డిజిటల్ వైద్య సేవల కల్పన, జాతీయ ప్రమాణాలు కలిగిన ఆస్పత్రుల సంఖ్య పరంగా, ఇలా వివిధ అంశాల్లో తెలంగాణా ఏపీ కంటే వెనుకే ఉంది. వైద్య విద్యకు పట్టం అధికారంలోకి వచ్చాక ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మేరకు 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా ప్రణాళికబద్ధంగా అడుగులు వేశారు. తొలుత ఐదు జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేయడం ద్వారా రాజమహేంద్రవరం, ఏలూరు, విజయనగరం, నంద్యాల, మచిలీపట్నం వైద్య కళాశాలలకు అనుమతులను రాబట్టారు. తద్వారా ఈ ఏడాది 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారు. మిగిలిన 7 వైద్య కళాశాలలను అందుబాటులోకి తెచ్చేలా సన్నద్ధమయ్యారు. మూడేళ్లలో 17 కొత్త మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలోనూ ఏర్పాటు కానున్నాయి. కరోనా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూనే వైద్య రంగంలో సంస్కరణలన్నింటినీ ప్రస్తుత ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలో చిన్న పిల్లలకు మెరుగైన వైద్య సదుపాయాల అవసరాలను గుర్తించి టీటీడీ ఆధ్వర్యంలో శ్రీపద్మావతి చిన్న పిల్లల హృదయాలన్ని ప్రారంభించారు. చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తెస్తూ రూ. 450 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దాని నిర్మాణం దాదాపు పూర్తయింది. కానీ చిన్న పిల్లల ఆస్పత్రులకు ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపలేదని ఈనాడు తప్పుడు రాతలతో జనాన్ని నమ్మించేందుకు యత్నిస్తోంది. బాబు పాలనలోనే నీరుగార్చారు గత తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో వైద్యరంగం పూర్తిగా కుదేలైంది. ఆరోగ్యశ్రీ మూలకు చేరింది. వైద్యకళాశాలల ఊసే లేదు. అదే సమయంలో పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం నాలుగు కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడంతోపాటు, భవిష్యత్తులో మరిన్ని కళాశాలల ఏర్పాటుకు వీలుగా 25 సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులను జిల్లా ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్ చేస్తూ పడకల సంఖ్యను పెంచింది. 2018లోగా ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసింది. అప్పట్లో తీసుకున్న చర్యలు 17 కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు వచ్చేందుకు దోహదపడ్డాయి. పక్క రాష్ట్రంలో కళాశాలల ఏర్పాటుకు ముందు చూపుతో అడుగులు వేస్తున్నా.. బాబు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగి కూడా రాష్ట్ర ప్రయోజనాలను నీరుగార్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ వైద్య రంగాన్ని పట్టించుకోకుండా ప్రైవేట్ వైద్య కళాశాలలను ప్రోత్సహిస్తూ వైద్య విద్యను వ్యాపారంగా మార్చేశారు. అయినా అవేవీ ఈనాడుకు... దానిని నడిపిస్తున్న రామోజీరావుకు ‘కమ్మ’గానే కనిపించాయి. వైఎస్సార్సీపీ హయాంలో పురోగతి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర వైద్య శాఖ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఏకంగా 53 వేలకుపైగా పోస్టులను ఐదేళ్లలో భర్తీ చేశారు. అంతేకాకుండా వైద్య శాఖలో నియామకాల కోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుతో పాటు, ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేపట్టేలా అత్యవసర ఉత్తర్వులు ఇచ్చారు. స్పెషలిస్ట్ వైద్యులు 4500 మేర, మెడికల్ ఆఫీసర్లు 2500కు పైగా, 6700కు పైగా నర్సుల పోస్టులను భర్తీ చేశారు. ఇంతలా చర్యలు తీసుకుంటే బోధనాస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత ఉంటోందని రామోజీరావు రోత రాతలు రాసుకొచ్చారు. -
5,348 పోస్టుల భర్తీకి అనుమతి
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలో 5,348 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతించింది. ఈ మేరకు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్, నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నా, ఎన్నికల తర్వాతే నోటిఫికేషన్ ఉండొచ్చని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయాలంటే ఈసీ అనుమతి తప్పనిసరి కావడంతో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) విభాగం పరిధిలో 3,235 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 1,255, ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 575, డ్రగ్ కంట్రోల్ అడ్మిని్రస్టేషన్ పరిధిలో 11, ఆయుష్ విభాగంలో 26, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో 34, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి పరిధిలో 212 పోస్టులు భర్తీ చేస్తారు. వివిధ విభాగాల్లో భర్తీ చేసే పోస్టుల వివరాలు ► ప్రజారోగ్య సంచాలకుల విభాగంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్– 351, ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్–2)– 193, స్టాఫ్‌నర్స్– 31 ► డ్రగ్ కంట్రోల్ అడ్మిని్రస్టేషన్ పరిధిలోజూనియర్ ఎనలిస్ట్ – 11 ► ఆయుష్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ (ఆయుర్వేద)– 6, టెక్నికల్ అసిస్టెంట్ (యునాని) – 8, లెక్చరర్ (ఆయుర్వేద) –1, లెక్చరర్ (హోమియో) –10, మెడికల్ ఆఫీసర్ (యు) లీవ్ రిజర్వుడు–1 ► ఐపీఎంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్– 4, లేబరేటరీ టెక్నీషియన్ గ్రేడ్–2 లోకల్ క్యాడర్ –6, లేబరేటరీ టెక్నీషియన్ గ్రేడ్–2 స్టేట్ క్యాడర్ –1, లేబరేటరీ అటెండెంట్ స్టేట్ క్యాడర్– 7, వ్యాక్సినేటర్ –1, స్టాఫ్‌నర్స్–1, ఫార్మసిస్ట్ (గ్రేడ్–2) –1, జూనియర్ అనెలిస్ట్ (లోకల్ క్యాడర్)–2, జూనియర్ అనెలిస్ట్ (స్టేట్ క్యాడర్) – 11 ► డీఎంఈ పరిధిలో సీటీ స్కాన్ టెక్నీషియన్–6, డెంటల్ హైజినిస్ట్– 3, ఈసీజీ టెక్నీషియన్ – 4, ఈఈజీ టెక్నీషియన్ – 5, అనెస్థిషియా టెక్నీషియన్ – 93, ఆడియో విజువల్ టెక్నీషియన్ – 32, ఆడియో మెట్రీ టెక్నీషియన్– 18, బయో మెడికల్ ఇంజనీర్–14, బయో మెడికల్ టెక్నీషియన్– 11, డెంటల్ టెక్నీషియన్– 53, రేడియోగ్రఫీ టెక్నీషియన్– 19, ఆప్తోమెట్రిస్ట్– 20, స్టెరిలైజేషన్ టెక్నీషియన్–15, ఫిజియోథెరపిస్ట్–33, అసిస్టెంట్ ప్రొఫెసర్లు– 555, నాన్ మెడికల్ అసిస్టెంట్లు (జి)–17, రేడియోలాజికల్ ఫిజిక్స్ అండ్ రేడియోలాజికల్ ఫిజిసిస్ట్ లెక్చరర్– 5, పర్ఫ్యూజనిస్ట్–3, లైబ్రేరియన్–14, ఫిజికల్ డైరెక్టర్ – 5, క్లినికల్ సైకాలజిస్ట్ – 2, స్పీచ్ పాథాలజిస్ట్– 1, చైల్డ్ సైకాలజిస్ట్– 21, ఇమ్యునోలజిస్ట్–1, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు–80, మెడికో సోషల్ వర్కర్ (గ్రేడ్–2)– 95, స్టాఫ్‌నర్సులు–1,545, స్టాటిస్టిషియన్–20, ఫార్మసిస్ట్ (గ్రేడ్–2) – 125, ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్–2)– 420 ► తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఫిజియోథెరపిస్ట్– 13, ఏఎన్ఎంలు– 85, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు– 617, స్టాఫ్‌నర్సులు– 332, డెంటల్ అసిస్టెంట్ సర్జన్లు – 6, ల్యాబ్ టెక్నీషియన్లు– 136, ఫార్మసిస్ట్ (గ్రేడ్–2)– 66 ► ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. అనెస్థీషియా– 4, బయో కెమిస్ట్రీ –1, డెంటల్ సర్జరీ –1, ఈఎన్టీ– 1, గైనిక్ అంకాలజీ– 2, మెడికల్ ఆంకాలజీ (పీడియాట్రిక్ మెడికల్ ఆంకాలజీతో కలిపి)– 4, మైక్రోబయోలజీ – 1, మాలిక్యులర్ అంకాలజీ –1, న్యూక్లియర్ మెడిసిన్– 2, ఆప్తమాలజీ – 1, పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్– 2, పాథాలజీ– 2, ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ – 2, రేడియోలాజికల్ ఫిజిక్స్ – 4, రేడియాలజీ – 2, రేడియో థెరపీ – 4, సర్జికల్ అంకాలజీ – 6, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్–1. సివిల్ అసిస్టెంట్ సర్జన్ (హాస్పిటల్ అడ్మిని్రస్టేషన్) – 2, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (అనెస్థీషియా)– 2, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సైటో పాథాలజీ)– 2, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (పాథాలజీ) –2, లెక్చరర్ (న్యూక్లియర్ అంకాలజీ) – 1, లెక్చరర్ (న్యూక్లియర్ మెడిసిన్/న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్)– 3, బయోమెడికల్ ఇంజనీర్ – 2, స్టాఫ్‌నర్స్–80, ల్యాబ్ టెక్నీషియన్లు (గ్రేడ్–2 – 8, మౌల్డ్ టెక్నీషియన్ – 1, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్ – 2, రేడియోథెరపీ టెక్నీషియన్ – 10, టెక్నీషియన్లు–5, టెక్నీషియన్లు (మెడికల్ ఇమేజింగ్)– 5, థియేటర్ అటెండెంట్లు–5, డెంటల్ టెక్నీషియన్ –1, ఈసీజీ టెక్నీషియన్– 2, ల్యాబ్ టెక్నీషియన్– 8, మెడికల్ ఫిజిసిస్ట్– 5, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్– 3, రేడియోగ్రాఫర్ సీటీ టెక్నీషియన్– 2, రేడియోగ్రాఫర్ మమోగ్రఫీ టెక్నీషియన్–1, రేడియోగ్రాఫర్ ఎంఆర్ఐ టెక్నీషియన్– 2, రేడియోగ్రాఫర్ ఆర్టీ టెక్నీషియన్– 5, రేడియోగ్రాఫర్–6, సోషల్ వర్కర్–6. -
వైద్య కాలేజీల్లో 4,356 అధ్యాపక పోస్టుల భర్తీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 4,356 అధ్యాపక పోస్టులను కాంట్రాక్టు, గౌరవ వేతనం పద్ధతిలో భర్తీ చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. 3,155 పోస్టులను కాంట్రాక్టు, 1,201 పోస్టులను గౌరవ వేతనం పద్ధతిలో భర్తీ చేయనుంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్ పోస్టులు 498, అసోసియేట్ ప్రొఫెసర్ 786, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1,459, ట్యూటర్ 412, సీనియర్ రెసిడెంట్స్ పోస్టులు 1,201 భర్తీ చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు అంటే ఏడాది కాలానికి వీరిని నియమిస్తారు. మెడికల్ కాలేజీల్లో జాతీ య మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తనిఖీలు చేయనున్నందున పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని నిర్ణయించారు. అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రో బయా లజీ, ఫోరెన్సిక్ మెడిసిన్,కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, సైకియాట్రీ, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, ఆప్తమాలజీ, ఆర్ధోపెడిక్స్, గైనకాలజీ, రేడియాలజీ, అనెస్థీషియా, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. స్థానికులకు ప్రాధాన్యత ఈ నెల 16వ తేదీన ఆయా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయి. ప్రొఫెసర్ పోస్టుకు 8 ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు ఐదేళ్ల అనుభవం ఉండాలి. ప్రొఫెసర్‌కు నెల వేతనం రూ.1.90 లక్షలు కాగా, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.లక్షన్నర, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1.25 లక్షలు, సీనియర్ రెసిడెంట్‌కు రూ.92,575, ట్యూటర్కు రూ.55 వేలు ఇవ్వనున్నారు. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఇంటర్వ్యూలకు హాజరుకావొచ్చు. అయితే స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. స్థానికులు లేనప్పుడు ఇతర రాష్ట్రాల వారికి అవకాశం కల్పిస్తారు. అభ్యర్థుల గరిష్ట వయస్సు ఈ నెల 31వ తేదీ నాటికి 69 ఏళ్లకు మించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాహసోపేత నిర్ణయం: మంత్రి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకులు, సిబ్బంది కొరతను తీర్చడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో ఏటా రూ.634 కోట్ల అదనపు భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు. -
వైద్య ఆరోగ్య శాఖలో మరిన్ని ఉద్యోగాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో జీరో వేకెన్సీ (ఒక్క పోస్టు ఖాళీగా ఉండకూడదు) విధానాన్ని తీసుకువచ్చి పెద్ద ఎత్తున పోస్టుల భర్తీ చేపడుతోంది. వైద్య విద్యా కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగులకు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. దీనిలో భాగంగా సెకండరీ హెల్త్ డైరెక్టరేట్(ఏపీవీవీపీ) పరిధిలో 185 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (సీఏఎస్ఎస్) పోస్టుల భర్తీకి బుధ, శుక్రవారాల్లో ఏపీ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వాకిన్ రిక్రూట్మెంట్ నిర్వహించనుంది. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ.. ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాల్లో పోస్టులను బుధవారం భర్తీ చేయనున్నారు. గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్తీషియా, ఈఎన్టీ, ఆప్తమాలజీ, పాథాలజీ విభాగాల్లో పోస్టుల భర్తీకి శుక్రవారం వాకిన్ రిక్రూట్మెంట్ నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు షెడ్యూల్ ప్రకారం తాడేపల్లిలోని సెకండరీ హెల్త్ డైరెక్టర్ కార్యాలయంలో నిర్వహించే వాకిన్ రిక్రూట్మెంట్కు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య హాజరవ్వాల్సి ఉంటుంది. శాశ్వత, కాంట్రాక్ట్, కొటేషన్ విధానాల్లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో పనిచేయడానికి స్పెషలిస్ట్ వైద్యులు ముందుకు రాకపోతుండటంతో కొటేషన్ విధానాన్ని సీఎం జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో మారుమూల ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో పనిచేయడానికి ఎంత వేతనం కావాలో వైద్యులు కొట్ చేయవచ్చు. ఆ కొటేషన్లను పరిశీలించి వైద్యులు కోరినంత వేతనాలను ఇచ్చి మరీ ప్రభుత్వం వైద్యులను నియమిస్తోంది. పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం http://apmsrb.ap.gov.in/msrb/, https://hmfw.ap.gov.in వెబ్సైట్లను అభ్యర్థులు పరిశీలించాల్సి ఉంటుంది. మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీ.. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలోని అర్బన్ హెల్త్, వెల్నెస్ సెంటర్లలో 189 పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మంగళవారం నోటిఫికేసన్ జారీ చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్టు బోర్డ్ మెంబర్ సెక్రటరీ శ్రీనివాసరావు తెలిపారు. భర్తీ చేసే పోస్టుల్లో 102 మెడికల్ ఆఫీసర్లు, 87 స్టాఫ్ నర్సు పోస్టులు ఉన్నాయన్నారు. బుధవారం నుంచి మార్చి 10వ తేదీ వరకూ అర్హులైన అభ్యర్థులు https://apmsrb.ap.gov.in/msrb వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇక సమగ్ర నోటిఫికేషన్‌ను https://apmsrb.ap.gov.in/msrb, https://dme.ap.nic.in వెబ్సైట్లను అభ్యర్థులు సంప్రదించాల్సి ఉంటుంది. -
ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డు నిబంధన సడలింపు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం వర్తించాలంటే తెల్లరేషన్ కార్డు తప్పనిసరన్న నిబంధనను సడలించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నిబంధన కారణంగా తెల్లరేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొనే వారి సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన వైద్య, ఆరోగ్య శాఖపై మంత్రి దామోదర రాజనర్సింహతో కలసి సమీక్షించారు. ప్రధానంగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు తీరు, నిధుల విడుదలపై సీఎం అధికారులతో చర్చించారు. ప్రతి నెలా ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు విధిగా విడుదల చేయాలన్నారు. అలాగే ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులను ప్రతి 3 నెలలకోసారి విడుదల చేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుసంధానంగా ఉన్న బోధన ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులకు రూ. 270 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పారు. సత్వరమే ‘టిమ్స్’పూర్తి చేయాలి... వరంగల్, ఎల్బీ నగర్, సనత్‌నగర్, అల్వాల్‌లలో చేపడుతున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతి చోటా నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం కామన్ పాలసీని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కొడంగల్‌లో వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయడాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్.. డిజిటల్ కార్డులు.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యునీక్ నంబర్‌తో అనుసంధానించాలని.. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందిండానికి వీలవుతుందన్నారు. హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలని చెప్పారు. బీబీనగర్ ఎయిమ్స్... బీబీనగర్ ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం రేవంత్ చెప్పారు. ఎయిమ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని... తద్వారా ఉస్మానియా, నిమ్స్, గాంధీ ఆసుపత్రులపై భారం తగ్గుతుందన్నారు. ఈ మేరకు ఎయిమ్స్‌ను సందర్శించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవల కోసం అవసరమైతే తానే స్వయంగా కేంద్ర మంత్రిని కలిసి వివరిస్తానని సీఎం పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రి విస్తరణలో నెలకొన్న సమస్యలను అధికారులు సీఎంకు వివరించగా ఉస్మానియా హెరిటేజ్ భవనానికి సంబంధించిన వ్యవహారం కోర్టులో ఉన్నందున కోర్టు సూచనల ప్రకారం ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకుందామని సీఎం అన్నారు. ఫార్మా కంపెనీల సీఎస్ఆర్... మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో హౌస్ కీపింగ్ మెయింటెనెన్స్ బాధ్యతను పెద్ద ఫార్మా కంపెనీలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులను ఉపయోగించి హౌస్ కీపింగ్ సేవలను మెరుగుపరచాలని సీఎం కోరారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో ఏదో ఒక ఆసుపత్రిని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. జూనియర్ డాక్టర్లు, ఆశ వర్కర్లు, స్టాఫ్ నర్సులకు ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతాలు అందించేలా చూడాలన్నారు. 108, 102 సేవల పనితీరుపై వాకబు చేసిన సీఎం.. అవి మరింత మెరుగైన సేవలు అందించేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, కమిషనర్ కర్ణన్, డ్రగ్ కంట్రోల్ డీజీ కమలహాసన్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓ విశాలాచ్చి తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యశ్రీపై సందేహాలు ఉండకూడదు: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: వైద్య ఆరోగ్య శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి, మంత్రి విడదల రజని, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్-2పై చర్చించారు. ఆరోగ్యశ్రీని ఎలా వినియోగించుకోవాలనేదానిపై ముమ్మరంగా ప్రచారం చేయాలని, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి సకాలంలో మందులు పంపిణీ చేయాలని, ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి అవసరమైన వారికి క్యాంప్‌ల ద్వారా వైద్యసేవలు అందించాలని సీఎం సూచించారు. ముందు జాగ్రత్త అనేది చాలా ముఖ్యమని, గ్రామంలో ప్రతి ఇల్లూ మ్యాపింగ్ జరగాలి.. ప్రతి ఆరు నెలలకోసారి డేటా అప్డేట్ చేయాలన్న సీఎం.. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీపై అధికారులను ఆరా తీశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా రూ. 25 లక్షల వరకూ వైద్యసేవలు, ఈ సేవలు ఎలా పొందాలన్న విషయంలో ఎవ్వరికీ సందేహాలు ఉండకూడదని.. వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షలో మరోసారి సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ♦ఆరోగ్యశ్రీ వినియోగంపై ముమ్మరంగా ప్రచారం చేయాలి, ఆరోగ్యశ్రీ సేవలను ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి ♦ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం. ♦మెగా ఆరోగ్యశ్రీ అవేర్నెస్ క్యాంపెయిన్ స్టేటస్ వివరించిన అధికారులు ♦నిర్ణీత టార్గెట్‌లోగా ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ పూర్తి చేయాలి ♦ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ స్టేటస్ వివరించిన అధికారులు ♦ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా రూ. 25 లక్షల వరకూ వైద్యసేవలు ♦ఈ సేవలు ఎలా పొందాలన్న విషయంలో ఎవ్వరికీ సందేహాలు ఉండకూడదు ♦ఈ సమాచారం తెలియని వారు ఉండకూడదు ♦నెట్ వర్క్ ఆస్పత్రులకు ఎలా వెళ్లాలన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలియాలి ♦అవేర్నెస్ అనేది పెంచాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి అనేది బాగా అవేర్నెస్ పెరగాలి ♦జగనన్న ఆరోగ్య సురక్ష అమలు, పురోగతిని సీఎంకు వివరించిన అధికారులు ♦జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు చేయూతనిచ్చే కార్యక్రమం ఎలా జరుగుతుందన్న దానిపై నిరంతరం సమీక్ష చేయాలన్న సీఎం ♦ప్రివెంటివ్ కేర్ అనేది ముఖ్యం, ప్రతి ఇంటిని జల్లెడ పట్టి క్యాంపుల ద్వారా అవసరమైన వారికి వైద్యసేవలు అందాలి ♦గ్రామాన్ని జల్లెడ పట్టాలి, ప్రతి ఆరునెలలకోసారి ఇది జరగాలి ♦విలేజ్ శాచురేషన్ మోడ్ లో జరగాలి ప్రతి ఇల్లు కవర్ అవ్వాలి ఇదే మన ప్రధాన ధ్యేయంగా ఉండాలి ♦ఏ గ్రామంలో ఎంతమందికి బీపీ, షుగర్ ఉన్నాయి, ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, వారికి అందే వైద్యసేవలు తదితర డేటా మ్యాపింగ్ అనేది జరగాలి ♦బీపీ, షుగర్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించి ప్రివెంటివ్ కేర్ లో భాగంగా చికిత్సలు అందించడం, మందులు ఇవ్వడం, మంచానికి పరిమితమైన వారికి కావాల్సిన మందులు ఇవన్నీ కూడా మ్యాప్ చేయాలి, ♦ప్రతి 6 నెలలకోసారి మీ రికార్డులు అప్డేట్ చేయాలి ♦శాచురేషన్ కాన్సెప్ట్ ఉండాలి, గ్రామంలో 100 శాతం జరగాలి, ఎక్కడైనా ఆరోగ్యశ్రీ కార్డు మిస్ అయినా వారికి కూడా వైద్యం అందాలి ♦ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఐడెంటిఫై చేసిన వారికి రీకన్ఫర్మేషన్ టెస్ట్‌లు చేయండి ♦సెకండ్ క్యాంప్ తర్వాత ప్రతి కేసుకు సంబంధించి టెస్ట్‌లు పూర్తి కావాలి, టెస్ట్‌లు అవసరముంటే మళ్ళీ తప్పకుండా చేయాలి ♦క్యాంప్‌లపై సీరియస్ గా దృష్టిపెట్టాలి ♦ప్రతి సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని డ్రైవ్ చేయాలి ♦స్టెమీ కార్యక్రమం విలేజ్ క్లీనిక్ దగ్గర నుంచి మొదలవ్వాలి, అవసరమైన ఓరియెంటేషన్ ఇవ్వాలి, పబ్లిక్ అవేర్నెస్పై మరింత ఫోకస్ పెట్టాలి, ♦నూతన మెడికల్ కాలేజీలకు సంబంధించిన స్టేటస్ వివరించిన అధికారులు ♦వాటికి అవసరమైన ఎక్విప్‌మెంట్‌పై దృష్టి పెట్టాలన్న సీఎం ♦జిల్లాల వారీగా జగనన్న ఆరోగ్య సురక్ష 2 స్టేటస్ వివరించిన అధికారులు, మొత్తం 1338 క్యాంప్‌లు నిర్వహించగా, క్యాంప్‌లలో స్పాట్ టెస్టింగ్ 98,210 మందికి నిర్వహించినట్లు, 4,27,910 మంది ఓపీ ద్వారా వైద్యసేవలు పొందారన్న అధికారులు ♦జేఏఎస్ 1 కంటివెలుగు కళ్ళద్దాల పంపిణీ స్టేటస్ రిపోర్ట్ వివరించిన అధికారులు♦మొత్తం 5,76,493 మందికి కళ్ళద్దాలు అవసరం కాగా, 67 శాతం పంపిణీ జరిగిందని, మిగిలిన కళ్ళద్దాల పంపిణీ కూడా త్వరితగతిన పూర్తిచేయనున్నామన్న అధికారులు ♦వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 12 ఎస్ఎన్సీయూలు, 5 ఎన్ఐసీయూలు ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయని అధికారుల వెల్లడి, అతి త్వరలో ప్రారంభించనున్న సీఎం ♦విశాఖలో మెంటల్ కేర్ ఆసుపత్రి, విజయవాడ, తిరుపతిలో సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్స్, రీజనల్ డ్రగ్ స్టోర్స్, తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్‌లో పీజీ మెన్స్ హాస్టల్, అనంతపురం జీజీహెచ్‌లో బర్న్స్ వార్డ్, కర్నూలులో స్టేట్ క్యాన్సర్ ఇన్సి›్టట్యూట్, జీఎంసీ కర్నూలులో ఎగ్జామినేషన్ హాల్ ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయన్న అధికారులు ఇదీ చదవండి: చంద్రబాబుకు షాక్ మీద షాకులు -
AP: ‘పెద్ద’ భరోసా..!
కడుపు కింద భాగంలో జిస్ట్ అనే కణితి సమస్యతో బాధపడుతున్న విజయవాడకు చెందిన సునీల్‌కు గత మార్చిలో గుంటూరు జీజీహెచ్‌లో క్లిష్టమైన సర్జరీ విజయవంతంగా పూర్తైంది. బాధితుడికి చిన్న పేగు డ్యూడెనమ్, జెజునమ్ జంక్షన్ దగ్గర కణితి ఉన్నట్లు జనరల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ కిరణ్ కుమార్ గుర్తించారు. మెడికల్ జర్నల్స్ ప్రకారం ప్రపంచంలో ఇటువంటి కేసులు రెండు మాత్రమే నమోదయ్యాయి. అరుదైన ఈ సమస్యకు ఎలా ఆపరేషన్ చేయాలో నిర్దిష్ట విధానాలు లేకున్నా జనరల్ సర్జరీ విభాగం వైద్యులంతా చర్చించుకుని సాహసోపేతంగా నిర్వహించారు. సాక్షి, అమరావతి: ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు పెద్దాస్పత్రి అంటే విజయవాడ జీజీహెచ్! 2019కి ముందు వరకూ ఇక్కడ న్యూరో విభాగంలో వైద్యులు అరకొరగా ఉండటంతో సేవలపై తీవ్ర ప్రభావం పడేది. రోజంతా కలిపినా కేవలం వంద లోపే ఓపీలు నమోదు అయ్యేవి. ఐపీలు అంతంత మాత్రంగానే ఉండేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యూరో విభాగంలో మంజూరైన పోస్టులన్నింటిలో వైద్యులను అందుబాటులోకి తెచ్చింది. ఖరీదైన చికిత్సలను సైతం ఉచితంగా అందించేలా మందులు, సదుపాయాలను సమకూర్చింది. ప్రస్తుతం ఇక్కడ రోజుకు 250 వరకూ ఓపీలు నమోదు అవుతున్నాయి. పడకలన్నీ ఫుల్‌గా ఉంటున్నాయి. ఒక్క న్యూరో మాత్రమే కాకుండా అన్ని విభాగాల్లో వైద్యులు, సిబ్బంది కొరతకు తావులేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌ను అందుబాటులోకి తేవడంతో పాటు అధునాతన వైద్య పరికరాలను సమకూర్చింది. సేవలు కూడా గణనీయంగా పెరిగాయి. దీంతో ప్రజల్లో పెద్దాస్పత్రిపై విశ్వాసం పెరిగింది. 2018–19లో 9,202 మేజర్ సర్జరీలు నిర్వహించగా 2022–23లో ఏకంగా 51 శాతం అదనంగా అంటే 13,095 సర్జరీలు జరగడం గమనార్హం. 2018–19లో 3.85 లక్షల ల్యాబ్ టెస్ట్‌లు చేయగా 2022–23లో 5.83 లక్షల టెస్ట్‌లు చేశారు. వైద్య రంగంలో సంస్కరణలు.. సీఎం జగన్ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణల ఫలితంగా ప్రభుత్వాస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగింది. రోగుల తాకిడికి సరిపడా వైద్యులు, సిబ్బంది, అధునాతన వైద్య పరికరాలను సమకూర్చారు. విజయవాడ జీజీహెచ్‌లోనే కాకుండా అన్ని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో గతంతో పోలిస్తే రోగుల సేవల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. సర్జరీల్లో పెరుగుదల ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా గత నాలుగేళ్లలో 53 వేలకు పైగా పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. దీంతో బోధనాస్పత్రుల్లోని స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో వైద్యులు, సిబ్బంది కొరతకు తావులేకుండా పోయింది. ఆపరేషన్ థియేటర్లలో అధునాతన వైద్య పరికరాలు సమకూరడంతో సర్జరీలు పెరిగాయి. 2022–23లో ఏకంగా 3,45,482 మైనర్, 1,50,592 మేజర్ సర్జరీలను నిర్వహించారు. 2023–24లో జూలై నెలాఖరు నాటికి 2.04 లక్షల మేజర్ సర్జరీలు జరిగాయి. టీడీపీ హయాంలో 2018–19లో ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో 1.99 లక్షల మైనర్, 98 వేల మేజర్ సర్జరీలు మాత్రమే జరిగాయి. గతంతో పోలిస్తే 73.05 శాతం మైనర్, 52.56 శాతం మేజర్ సర్టరీలు పెరిగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ల్యాబ్‌లను బలోపేతం చేయడంతో ఏటా కోటికిపైనే ల్యాబ్ టెస్ట్‌లు జీజీహెచ్‌లలో చేపడుతున్నారు. 2021–22లో 1.06 కోట్లు, 2022–23లో 1.32 కోట్ల మేర ల్యాబ్ టెస్ట్‌లు ఉచితంగా నిర్వహించారు. ఈ ఏడాది ఇప్పటికే 70 లక్షల టెస్ట్‌లు పూర్తి అయ్యాయి. ► 2021–22లో బోధనాస్పత్రుల్లో 49.32 లక్షల ఓపీ సేవలు నమోదు కాగా గతేడాది 83.16 లక్షలకు పెరిగాయి. ఐపీ సేవల్లో 33.63 శాతం పెరుగుదల నమోదైంది. ► డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలతో కూడిన 608 రకాల మందులను ప్రభుత్వం బోధనాస్పత్రుల్లో అందుబాటులోకి తెచ్చింది. 530కిపైగా రకాల మందులను సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ రూపంలో సరఫరా చేస్తుండగా మిగిలినవి స్థానిక ఫార్మా కంపెనీల ద్వారా అందిస్తున్నారు. ల్యాబ్ టెస్ట్‌ల నిర్వహణకు అవసరమయ్యే రీ ఏజెంట్స్ (రసాయనాలను) సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానంలో సరఫరా ప్రారంభించింది. ► నాడు–నేడు కింద రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ సీఎం జగన్ చర్యలు తీసుకున్నారు. బోధనాస్పత్రుల్లో అదనపు వార్డులు, సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌ల నిర్మాణం చేపట్టారు. గతంలో రూ.40 మాత్రమే ఉన్న డైట్ చార్జీలను రూ.80కు పెంచడం ద్వారా రోగులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. చక్కగా ఆపరేషన్ చేశారు 20 ఏళ్ల క్రితం గుండె కవాటం చెడిపోయింది. నా కుమార్తె సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నా మందులతోనే కాలం గడిపా. రానురాను సమస్య పెరగడంతో గత ఆగస్టులో కర్నూలు జీజీహెచ్‌లో అడ్మిట్ అయ్యా. సీటీ సర్జన్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆపరేషన్ చేశారు. మైట్రల్ వాల్వ్ రీ ప్లేస్మెంట్, కార్డల్ ప్రిజర్వేషన్ శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆపరేషన్ చక్కగా చేశారు. నర్సింగ్ సేవలు చాలా బాగున్నాయి. వారి చొరవతో చకచకా కోలుకోగలిగా. సాధారణంగా ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అంటే అందరూ తెలియని భయానికి లోనవుతుంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. వసతులు బాగున్నాయి. అనుభవజ్ఞలైన వైద్యులు, సిబ్బంది మంచి వైద్యం అందిస్తున్నారు. – వెంకట రెడ్డి, ప్రజా పరిరక్షణ ఐక్యవేదిక అనంతపురం జిల్లా అధ్యక్షుడు ప్రైవేట్‌కు మించి సేవలు.. నాన్న అనారోగ్యం బారిన పడటంతో విజయవాడ జీజీహెచ్‌కు తీసుకొచ్చాం. వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి అడ్మిట్ చేసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించారు. నర్సులు, వైద్య సిబ్బంది రోగులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో సైతం ఈ తరహాలో సేవలుండవు. – జి. రవి, ఎండపల్లి, ఏలూరు జిల్లా సేవలు వినియోగించుకోవాలి బోధనాస్పత్రుల్లో ఎంతో అనుభవజ్ఞలైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. అరుదైన జబ్బులకు ఇక్కడ చికిత్సలు అందుతున్నాయి. ప్రభుత్వం సౌకర్యాలను మెరుగుపరిచింది. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలి. ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి అనవసర వ్యయ ప్రయాసలకు గురి కావద్దు. ప్రభుత్వాస్పత్రుల్లో సేవలను సద్వినియోగం చేసుకోవాలి. అరుదైన సర్జరీలు అలవోకగా చేసేందుకు వసతులున్నాయి. కోత, కుట్లు లేకుండా చిన్న గాటుతో సర్జరీలు చేస్తున్నారు. – డాక్టర్ నరసింహం, డీఎంఈ -
వైద్యారోగ్యశాఖపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖ పై సమీక్ష నిర్వహించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ శనివారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పనిచేయని పీఎస్ఏ ప్లాంట్ల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా మందులను సాంకేతికపరమైన యంత్రాలను రెడీ చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రభుత్వ ల్యాబ్‌లలో 16,500 శాంపిల్స్ టెస్ట్ చేసే సామర్థ్యం ఉందని మంత్రికి ఉన్నతాధికారులు తెలియజేశారు. ప్రభుత్వంతోపాటు 84 ప్రైవేట్ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. గత రెండు వారాల నుంచి 6 వేలకు పైగా నమూనాలను సేకరించామని చెప్పారు. కోవిడ్ టెస్టుల సామర్థ్యం పెంచాలని కనీసం రోజుకు 4000 టెస్టులు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. కోవిడ్ 19 రోజువారీ నివేదికను ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలలోపు పత్రికా ప్రకటన కోసం సమర్పించాలని పేర్కొన్నారు. గత 4 సంవత్సరాల సీఎస్ఆర్ విరాళాల జాబితాను సిద్ధం చేసి నివేదిక ఇవ్వాలని తెలిపారు. చదవండి: కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం.. 78 మంది సస్పెండ్ -
ఏపీ వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలను విస్తృతం చేయాలి: సీఎస్
-
ఆరోగ్య సురక్ష విస్తరణ
సాక్షి, అమరావతి: అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్న ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. గ్రామాల్లోనే ప్రజలందరూ ఉచితంగా స్పెషలిస్ట్ వైద్యసేవలు, మందులు పొందడం.. అలాగే, పట్టణ, నగర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న శిబిరాలకూ ప్రజలు పోటెత్తుతుండడంతో వీటిని ప్రతి వార్డుకూ విస్తరించాలని వైద్యశాఖ సంకల్పించింది. ఇప్పటివరకు 8,985 శిబిరాల నిర్వహణ.. గత నెల 30 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 పనిదినాల్లో 8,985 క్యాంపులు నిర్వహించారు. వీటిల్లో 35,11,552 మంది ఉచిత స్పెషలిస్ట్ వైద్యసేవలు పొందారు. వీరిలో 61,971 మందిని మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్ చేశారు. అలాగే, గ్రామాల్లోని 10,032 విలేజ్ క్లినిక్‌ల పరిధిలో చేయాలన్నది లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 6,500కు పైగా క్యాంపులు పూర్తయ్యాయి. ఇప్పుడు వీటికి అదనంగా పట్టణాల్లో వార్డుల వారీగా విస్తరించారు. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ, నగరాల్లో 542 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 1,626 శిబిరాలు నిర్వహించాలన్నది ప్రణాళిక. దీంతో ఒక్కో కేంద్రం పరిధిలో ప్రస్తుతం మూడుచొప్పున ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఒక్కో శిబిరం వద్దకు వెయ్యి మందికి పైగా జనాభా హాజరవుతున్నారు. ఇలా ప్రజల తాకిడి ఎక్కువగా ఉండడంతో వైద్యం పొందడంలో ఆలస్యం, ఇబ్బందులకు ఆస్కారం లేకుండా ఉండేందుకు వీలుగా వార్డు సచివాలయాల వారీగా సోమవారం నుంచి శిబిరాలను నిర్వహిస్తున్నారు. తాజా నిర్ణయంతో ఇప్పుడు ఈ క్యాంపులు మరింతగా పెరగనున్నాయి. 3,842 వార్డు సచివాలయాల పరిధిలో.. పట్టణ ప్రాంతాల్లో రాష్ట్రవ్యాప్తంగా 3,842 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే శిబిరాలు పూర్తయినవి మినహాయించి మిగిలిన ప్రతి సచివాలయం పరిధిలో శిబిరాలు నిర్వహించేలా ప్రణాళిక రచించారు. ► సచివాలయం పరిధిలో శిబిరం నిర్వహించడానికి ముందే ప్రతి ఇంటిని వలంటీర్లు, గృహ సారథులు సందర్శిస్తున్నారు. ► ఆ తర్వాత.. వలంటీర్లు, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు ప్రతి ఇంటిని సందర్శించి ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ► బీపీ, సుగర్ పరీక్షలతో పాటు, అవసరం మేరకు డెంగీ, మలేరియా, వంటి ఇతర ఏడు పరీక్షలు చేపడుతున్నారు. ► ఈ స్క్రీనింగ్‌లో గుర్తించిన వివిధ సమస్యల ఆధారంగా బాధితులు శిబిరాలకు హాజరవ్వడానికి టోకెన్లు ఇస్తున్నారు. ► టోకెన్లతో సంబంధం లేకుండా ప్రజలు నేరుగా శిబిరాలకు హాజరయ్యే వెసులుబాటు కూడా అధికారులు కల్పించారు. ► ఇక ప్రతి క్యాంపులో ఇద్దరు ఎంబీబీఎస్, ఇద్దరు స్పెషలిస్ట్ వైద్యులు, సరిపడా మందులను సమకూరుస్తున్నారు. ఇబ్బందులకు తావు లేకుండా.. పట్టణాల్లోని ప్రతి వార్డు సచివాలయంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శిబిరాల నిర్వహణ ప్రారంభించాం. రాష్ట్రవ్యాప్తంగా వైద్య శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్ చేసిన వారికి ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం. స్థానిక మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలకు ఆ బాధత్యలు అప్పగించాం. - ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, సీఈఓ, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ -
ప్రజల సంతృప్తే ప్రామాణికంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలు చేయాలన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిడి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఆరోగ్య సురక్ష మీద ప్రతి వారం సమీక్షలు చేయాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో జగనన్న ఆరోగ్య సురక్ష సహా పలు అంశాలపై సంబంధిత అధికారులతో వైఎస్ జగన్ చర్చించారు ఈ సందర్భంగా జగనన్న ఆరోగ్య సురక్షపై వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటి వరకూ 1,22,69,512 కుటుంబాలపై సర్వే చేసినట్టు అధికారులు తెలిపారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో రోగులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందాలని తెలిపారు. పేషెంట్లకు అందుతున్న సదుపాయాలు మెరుగ్గా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హెల్త్ క్యాంపులను నిర్వహించడమే కాదు, వారి ఆరోగ్యం బాగు అయ్యేంతవరకూ చేయిపట్టుకుని నడిపించాలని సీఎం జగన్ పేర్కొన్నారు. చికిత్స అనంతరం వాడాల్సిన మందుల విషయంలో అవి ఖరీదైనా సరే వారికి అందించాలన్నారు. ప్రతీ నెలకు మండలంలో నాలుగు సచివాలయాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. రోగుల సంతృప్తి, క్యాంపుల్లో సదుపాయాలు, రోగులకు చేయూత నందించడం, ఆరోగ్య సురక్ష కార్యక్రమంమీద అవగాహన ఈ 4 అంశాలమీద తప్పనిసరిగా సమీక్ష చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. చదవండి: చంద్రబాబు ఇంటి భోజనంపై అనుమానాలు?: మంత్రి అమర్నాథ్ సీఎం జగన్ ఇంకేం మాట్లాడారో ఆయన మాటాల్లోనే.. ► ఆరోగ్య సురక్ష మీద ప్రతి వారం క్రమం తప్పకుండా నా దగ్గర సమీక్షలు చేయాలి. ప్రతి ఒక్కరి ఫోన్లో కూడా ఆరోగ్య శ్రీ యాప్‌ని డౌన్లోడ్ చేయాలి. దీని వల్ల పర్యవేక్షణ మరింత సులభతరం అవుతుంది. ►అలాగే దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలోనూ మార్పులు రావాలి. ►నిపుణులైన వైద్యులు ఆరోగ్య సురక్షా శిబిరాలకు వస్తున్నప్పుడు అక్కడే వీరికి సర్టిఫికెట్లు జారీచేయాలి. ►తిరుపతి తరహాలోనే చిన్నపిల్లలకోసం అత్యాధునిక ఆస్పత్రిని విజయవాడ–గుంటూరు, విశాఖపట్నంలలో ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలి. ►ప్రకాశం జిల్లాలో కూడా కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. -
‘క్యాన్సర్ మానిటరింగ్’లో 353 పోస్టుల సృష్టి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వ రంగంలోనే మెరుగైన, నాణ్యమైన క్యాన్సర్ వైద్య సేవల కల్పనకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఈ క్రమంలో విశాఖలో కేజీహెచ్, గుంటూరు జీజీహెచ్, కడప జీజీహెచ్‌లలో క్యాన్సర్ సెంటర్లతో పాటు, డీఎంఈ కార్యాలయంలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ కోసం ప్రభుత్వం 353 పోస్టులను కొత్తగా సృష్టించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ మంజుల డి.హోస్మని ఉత్తర్వులిచ్చారు. 6 ప్రొఫెసర్, 5 అసోసియేట్, 14 అసిస్టెంట్ ప్రొఫెసర్, 90 స్టాఫ్ నర్స్, 90 జనరల్ డ్యూటీ అటెండెంట్ చొప్పున, మిగిలిన వాటిలో ఇతర పోస్టులను కేటాయించారు. 50 కి.మీ దూరంలో క్యాన్సర్ వైద్యసేవలనుఅందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. లెవల్–1 క్యాన్సర్ సెంటర్‌గా గుంటూరును, లెవల్–2 సెంటర్లుగా కర్నూలు, విశాఖ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నారు. -
ఒక్కో పోస్టుకు 15 మంది పోటీ
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్(సీఏఎస్) పోస్టులకు డిమాండ్ నెలకొంది. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 250 సీఏఎస్ వైద్య పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో 3,906 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 15 మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వచ్చిన దరఖాస్తుల పరిశీలన అనంతరం ప్రాథమిక మెరిట్ జాబితాను ఇప్పటికే రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటించింది. బుధవారంతో ప్రాథమిక మెరిట్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ గడువు ముగియనుంది. అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను ప్రకటించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇన్–సర్వీస్ కోటాలో 2023–24 విద్యా సంవత్సరానికి పీజీ చదివేందుకు వెళ్లే వైద్యుల స్థానాలను భర్తీ చేయడం కోసం ప్రభుత్వం పోస్టుల భర్తీ చేపడుతోంది. ఖాళీ అయ్యే పోస్టులను అంచనా వేసి వైద్యులు రిలీవ్ అయి వెళ్లే సమయానికి కొత్తవారిని అందుబాటులోకి తెచ్చి ఫ్యామిలీ డాక్టర్, ఇతర పీహెచ్సీ సేవలకు అంతరాయం కలగకుండా ముందు చూపుతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కాగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2019 నుంచి ఇప్పటి వరకూ ఏకంగా 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టింది. -
పథకాల అమలులో ఏపీ ప్రామాణికం
సాక్షి, బెంగళూరు: సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశానికే గొప్ప ప్రామాణికంగా నిలుస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సమానత్వాన్ని సాధించొచ్చనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారని వెల్లడించారు. ప్రముఖ మీడియా గ్రూప్.. సౌత్ ఫస్ట్ ఆధ్వర్యంలో బెంగళూరులో శనివారం దక్షిణ్ డైలాగ్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. దక్షిణ భారత రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై మదింపు జరిగింది. దీనికి ఆయా రాష్ట్రాల ఐటీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాలకు ఒక అభివృద్ధి నమూనా ఉందా? ఒకవేళ ఉంటే అది సరైన దారిలోనే ఉందా? అనే అంశాలపై చర్చ నిర్వహించారు. అనేక సంస్కరణలకు శ్రీకారం.. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. మన దేశంలోనే గొప్ప రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో ముందుకు దూసుకెళుతోందని తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో సీఎం జగన్ అనేక విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని వెల్లడించారు. ప్రతి పథకం ఆయన ఆలోచన నుంచి వచ్చేందేనన్నారు. అమ్మఒడి ద్వారా ఏటా 44.50 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారని చెప్పారు. దీనివల్ల విద్యార్థుల డ్రాపవుట్లు నివారించి అక్షరాస్యత శాతాన్ని పెంచగలిగామన్నారు. నాలుగేళ్లలో ఈ పథకానికి తమ ప్రభుత్వం ఏకంగా 26,067.28 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. అలాగే రాష్ట్రంలోని 46 వేల పాఠశాలలను నాడు–నేడు కింద రూ.17,805 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన కార్యక్రమాల ద్వారా 1 నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్నామని తెలిపారు. నిజమైన మహిళా సాధికారత దిశగా ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తోందన్నారు. వైఎస్సార్ ఆసరా ద్వారా ఇప్పటివరకు 7.98 లక్షల మహిళా గ్రూపులకు రూ.19,178.17 కోట్ల రుణాలను తమ ప్రభుత్వం మాఫీ చేసిందని తెలిపారు. అలాగే వైఎస్సార్ చేయూత కింద 45 నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఒక్కొక్కరికి ఏటా రూ.18,750 చొప్పున అందించిందన్నారు. 30 లక్షల మందికిపైగా మహిళలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు ఇళ్లు కూడా కట్టి ఇస్తోందని చెప్పారు. ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ రైతు భరోసా, వాహన మిత్ర , నేతన్న నేస్తం.. ఇలా ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏపీ ఏపీలో వైద్య ఆరోగ్య రంగంలో తమ ప్రభుత్వం కనీవినీ ఎరుగని సంస్కరణలు ప్రవేశపెట్టిందని రజిని తెలిపారు. రాష్ట్రంలోని అందరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేశామని చెప్పారు. దేశంలో ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏపీయేనని వెల్లడించారు. రూ.16 వేల కోట్లతో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేశామన్నారు. జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా వైద్య పరీక్షలు చేయడంతోపాటు ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా ముందుకు వెళితే మంచి ఫలితాలు సాధించొచ్చని అభిప్రాయపడ్డారు. -
ఒకే రోజు 9 కొత్త మెడికల్ కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ నెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ఒకేసారి వీటిని ప్రారంభించనున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. కాలేజీల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వీటిలో చేరే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులను వెంటనే సమకూర్చాలని సూచించారు. గురువారం ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ కార్యాలయంలో వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. జిల్లాకో కాలేజీ ఏర్పాటులో భాగంగా.. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడంతోపాటు వైద్య విద్యను చేరువ చేసేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని హరీశ్‌రావు గుర్తు చేశారు. గతేడాది ఒకే వేదిక నుంచి ఎనిమిది మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ కొత్త మెడికల్ కళాశాలల ప్రిన్సిపాల్స్ అందుబాటులో ఉండి, అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఈ అంశంపై శుక్రవారం మరోసారి సమావేశమై ఏర్పాట్లను పర్యవేక్షించాలని కాళోజీ వర్సిటీ వీసీ, వైద్య విద్య సంచాలకులను మంత్రి ఆదేశించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు తెలంగాణలో కేవలం ఐదే మెడికల్ కాలేజీలు ఉండేవని, అందులోనూ మూడు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందే ఉన్నాయని హరీశ్ చెప్పారు. అదే ఇప్పుడు కొత్తవి కలిపి మొత్తం 26 కాలేజీకు చేరాయన్నారు. 2014లో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కలిపి 850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటే.. ఇప్పుడు ఏకంగా 3,915 సీట్లకు పెరిగాయని వివరించారు. మహిళల ఆరోగ్యం కోసం.. రాష్ట్రంలో మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం కొత్తగా మరో వంద ఆరోగ్య మహిళ కేంద్రాలను ఈ నెల 12వ తేదీన ప్రారంభిస్తున్నట్టు మంత్రి హరీశ్ తెలిపారు. వీటితో కలిపి రాష్ట్రంలో ఆరోగ్య మహిళా కేంద్రాల సంఖ్య 372కు చేరుతోందన్నారు. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 2,78,317 మందికి స్క్రీనింగ్ నిర్వహించి, వివిధ సమస్యలున్న 13,673 మంది మహిళలను ఆస్పత్రులకు రిఫర్ చేశామని చెప్పారు. 5,204 స్టాఫ్ నర్స్ రిక్రూట్ మెంట్ ఫలితాలను త్వరగా విడుదల చేయాలని.. ఏఎన్ఎంల పీఆర్సీ, ఎరియర్స్ వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
Fact Check: వైద్యానికి శాశ్వత బలం
సాక్షి, అమరావతి: నాలుగేళ్లలో 53 వేలకు పైగా వైద్య పోస్టులను భర్తీ చేసిన చరిత్ర మన రాష్ట్రంలో గతంలో ఎప్పుడైనా ఉందా? మన కళ్లెదుటే స్పెషలిస్టు డాక్టర్లు, కొత్త మెడికల్ కాలేజీలు కనిపిస్తున్నాయి. ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ అవుతున్నాయి. అసలు ఖాళీల భర్తీకే ప్రత్యేకంగా మెడికల్ సర్వీసెస్ బోర్డు ఏర్పాటైందంటే వైద్య ఆరోగ్య రంగంపై ప్రభుత్వం ఎంత శ్రద్ధ వహిస్తోందో వేరే చెప్పాలా? అయినా సరే చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని కాకమ్మ కధలు అల్లే రామోజీని ఏమనుకోవాలి? ‘కాంట్రాక్ట్’ క్రమబద్ధీకరణ.. ఏపీ వీవీపీ విలీనం టీడీపీ అధికారంలో ఉండగా ఐదేళ్లలో చంద్రబాబు అతి కష్టమ్మీద వైద్య, ఆరోగ్య శాఖలో భర్తీ చేసింది కేవలం 1,693 పోస్టులు. ప్రభుత్వాస్పత్రుల వైపు చూడాలంటేనే జనం జంకే పరిస్థితి కల్పించారు. మానవ వనరుల కొరత తీవ్రంగా వేధిస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పేదలకు ప్రైవేట్ వైద్యాన్నే దిక్కుగా మార్చేశారు. ఇలాంటి దుస్థితిలో ఉన్న వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ సీఎం జగన్ ఏకంగా 53,126 పోస్టులను భర్తీ చేసి జవసత్వాలు చేకూర్చారు. వైద్య రంగంలో మన రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా మార్చారు. వైద్య శాఖలో ఏ ఒక్క పోస్టు ఖాళీ ఏర్పడినా ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే వెంటనే భర్తీ చేసేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అత్యవసర ఉత్తర్వులు ఇచ్చింది. వైద్య శాఖ నియామకాల కోసమే ప్రత్యేకంగా ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్‌ను ఏర్పాటు చేసింది. ఇది గొప్ప ప్రగతిశీల చర్యగా కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసించింది. పీహెచ్‌సీల్లో వైద్యులు ఎవరైనా దీర్ఘకాలిక సెలవుపై వెళితే సేవలకు అంతరాయం కలగకుండా జిల్లాకు నలుగురు చొప్పున 114 మంది డాక్టర్లను సిద్ధంగా ఉంచగా తాత్కాలిక సెలవుపై వెళ్లిన చోట విధులు నిర్వర్తించేందుకు 175 మంది చొప్పున పూల్ అప్ వైద్యులను అందుబాటులో ఉంచారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరత 61 శాతం కాగా మన రాష్ట్రంలో కేవలం 5 శాతానికే పరి మితమైంది. వైద్య శాఖలో 2014కు ముందు ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు వీలుగా ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. ఏపీ వైద్య విధాన పరిషత్‌ను ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా వేల మంది ఉద్యోగులకు భద్రత కల్పించింది. మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లకు (ఎంఎల్‌హెచ్‌పీ) దేశంలో ఎక్కడా లేనివిధంగా పారి తోషికం చెల్లిస్తోంది. పనితీరును అంచనా వేసి అదనంగా రూ.15 వేల వరకూ ప్రోత్సాహకం అందిస్తోంది. ప్రోత్సాహకంతో కలిపి గరిష్టంగా రూ.40 వేల వరకూ వేతనా లను చెల్లిస్తోంది. మరి ఇలాంటి చర్యలు చంద్రబాబు ప్రభుత్వంలో రామోజీ ఎప్పుడైనా చూశారా? కనీసం ఇప్పుడైనా తెలుసుకుంటున్నారా? -
ఇంటికే ‘ఆరోగ్యం’!
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ వెళ్లి ఆరోగ్యశ్రీ సేవలను ఎలా పొందాలనే అంశంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి ఆరోగ్యశ్రీ సమాచారాన్ని ప్రజలకు అందించాలని సూచించారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి రూ.5 లక్షలు లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు పథకాన్ని వర్తింపజేస్తున్నామని, తద్వారా రాష్ట్రంలో 95 శాతం జనాభాను పథకం పరిధిలోకి తెచ్చామని తెలిపారు. ఈ క్రమంలో పథకం కింద రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ఉచితంగా వైద్య సేవలను పొందటంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇందుకోసం వచ్చే నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని దిశా నిర్దేశం చేశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఆరోగ్యశ్రీ పథకం, నాడు–నేడు, వైద్య శాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల పురోగతిని అధికారులు వివరించారు. 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ప్రగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. వైద్య కళాశాలల నిర్మాణం వేగంగా ముందుకు సాగుతోందని అధికారులు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభమైన నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం కొత్త కళాశాలల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లకు మంచి స్పందన వచ్చిందన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లలో ప్రవేశాలు పొందడానికి ప్రైవేట్ కంటే ప్రభుత్వ కళాశాలల వైపే విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. వచ్చే ఏడాది పులివెందుల, పాడేరు, ఆదోని మార్కాపురం, మదనపల్లె మెడికల్ కళాశాలలను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ కళాశాలలు, బోధనాస్పత్రుల కోసం ఇప్పటికే పోస్టులను కొత్తగా సృష్టించిన నేపథ్యంలో భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 2025–26లో మిగిలిన ఏడు మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నామన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. సమగ్ర వివరాలతో బుక్లెట్ గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీలో కేవలం 1,059 ప్రొసీజర్ మాత్రమే ఉండేవి. మన ప్రభుత్వం వచ్చాక వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటే ప్రతి ప్రొసీజర్స్‌ను పథకంలోకి తెచ్చి ప్రొసీజర్లను ఏకంగా 3,257కు పెంచాం. నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్యను గణనీయంగా పెంచి హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా మనవారికి ఉచిత వైద్యం అందిస్తున్నాం. ఈ క్రమంలో వచ్చే నెల 15 నుంచి ప్రారంభించే ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమంలో ప్రతి కుటుంబానికి పథకం గురించి సమగ్ర వివరాలతో బుక్లెట్ అందజేయాలి. ఆ బుక్‌లెట్‌ను చూస్తే పథకం సేవలను ఎలా పొందాలి? ఏ సేవలు ఉంటాయి? లాంటి అంశాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన రావాలి. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో), ఏఎన్ఎం, ఆశావర్కర్, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి ఆరోగ్యశ్రీ గురించి సవివరంగా తెలియజేయాలి. అనారోగ్యం బారినపడినా, దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగినా ఆరోగ్యశ్రీ కింద ఎలా చికిత్స పొందాలన్న దానిపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. ప్రజలు ఉంటున్న ప్రాంతానికి అత్యంత సమీపంలోని నెట్వర్క్ ఆస్పత్రిలో ఎలా చికిత్స పొందాలో వివరించాలి. ఆరోగ్యశ్రీ సేవలపై సంపూర్ణ సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడమే కాకుండా సమర్థంగా సేవలు అందుకునేలా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే పథకం సేవలపై యాప్ తీసుకొచ్చాం. ఒక్క యాప్ ద్వారానే కాకుండా కాల్ సెంటర్ల ద్వారా కూడా సేవలు పొందడంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలి. ► సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, కార్యదర్శి డా.మంజుల, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ మురళీధర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సాంబశివారెడ్డి, సీఈవో హరేందిరప్రసాద్, సలహాదారు గోవిందహరి, ప్రత్యేకాధికారి అశోక్‌బాబు, సెకండరీ హెల్త్ డైరెక్టర్ వెంకటేశ్వర్, ఫైనాన్స్ సెక్రటరీ గుల్జార్, డీఎంఈ డాక్టర్ నరసింహం, నాడు–నేడు డైరెక్టర్ మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమర్థంగా నిర్వహణ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్మాణం, పరికరాలు సమకూర్చడం ఎంత ముఖ్యమో వాటిని ఉత్తమంగా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. అలా చేయకపోతే పరిస్థితులు మళ్లీ మొదటికే వస్తాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్వహణ అత్యంత సమర్థంగా ఉండాలి. నిర్వహణకు నిధుల సమస్య రాకుండా చూసుకోవాలి. ఇందుకోసం ఒక విధానం తీసుకురావాలి. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద అందించే సేవలకుగాను ప్రభుత్వం నుంచి వెళ్లే నిధులు ఆయా ఆస్పత్రుల నిర్వహణకు వినియోగించేలా ఒక పద్ధతి తీసుకురావాలి. ఇలా చేయకపోతే ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్వహణ నాణ్యతతో చేయడం కష్టం. అలాగే ప్రభుత్వ విద్యా సంస్థలకు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బుల్లో కూడా కొంత ఆయా సంస్థల నిర్వహణకు వినియోగించేలా ఒక విధానం తేవాలి. అన్ని ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువచేయడానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నాం. నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు ఏర్పాట్ల పనులు పూర్తి కావాలి. పాలకొల్లు, పార్వతీపురం కళాశాలల పనులను మరింత వేగవంతం చేయాలి. ఫిర్యాదులు చేయడంపై అవగాహన ఉండాలి ఆరోగ్యశ్రీ సేవలను పొందడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా, లంచాల ప్రస్తావన వచ్చినా వెంటనే ఫిర్యాదు చేసేలా కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి. ఫిర్యాదులకు సంబంధించిన నెంబర్లను కూడా ప్రజలకు తెలియచెప్పాలి. నెట్వర్క్ ఆస్పత్రులు ఆయా ప్రాంతాల్లో తప్పనిసరిగా హెల్త్ క్యాంపులు నిర్వహించాలి. ఈ విధానం కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. విలేజ్ క్లినిక్స్, సచివాలయ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఈ శిబిరాలు అమలు జరిగేలా చూడాలి. డిశ్చార్జ్ అయిన రోజే ‘ఆసరా’ ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్స చేసిన రోగులకు వైద్యులు సూచించిన విశ్రాంత సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం కింద నెలకు రూ.5 వేల వరకూ జీవన భృతి ఇస్తున్నాం. రోగికి అందించే ఈ సాయాన్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోజే ఇవ్వాలి. దీనికి కావాల్సిన ఎస్ఓపీని రూపొందించండి. -
సెప్టెంబర్ 15 నుంచి ఆరోగ్యశ్రీ సేవలపై అవగాహన
సాక్షి, గుంటూరు: ఏపీలో వైద్య, ఆరోగ్య శాఖ పని తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎంటి. కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ సేవలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. దీనికోసం ముమ్మరంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. సెప్టెంబరు 15 నుంచి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసుకోవాలన్న సీఎం.. నూతన మెడికల్ కాలేజీలు, నిర్వహణపైనా సమీక్షించారు. ప్రభుత్వ రంగంలోని మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల నిర్వహణ అత్యంత సమర్థవంతంగా ఉండాలన్న సీఎం.. నిర్వహణకు నిధులు సమస్య రాకుండా చూసుకునేందుకు ఒక విధానం తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాలలోని ఐదు మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలు జరగనున్నాయని, వచ్చే ఏడాది మరో ఐదు మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు సిద్ధం అవుతున్నామని అధికారులు వివరించారు. పులివెందుల, పాడేరు, ఆదోని, మార్కాపూర్, మదనపల్లెల్లో వచ్చే ఏడాది నుంచి ప్రవేశాలకు సిద్ధమవుతున్నాయని అధికారులు తెలిపారు. చదవండి: 'చంద్రా’లు దిద్దిన కాపురం.. స్కెచ్ మాములుగా లేదు! -
ఆస్పత్రులకు ఇస్తున్న బడ్జెట్ ఎంత?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులకు ఎంత బడ్జెట్ ఇస్తున్నారు..? గ్రామీణ, తాలూకా, జిల్లాస్థాయి ఆస్పత్రుల్లో వసతులు ఎలా ఉన్నాయి..? ఎంతమంది వైద్యులు అవసరం.. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు..? ఇతర సిబ్బంది పరిస్థితి ఏంటి..? తదితర అంశాలపై పూర్తినివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, ప్రజారోగ్య, కుటుంబసంక్షేమ డైరెక్టర్‌తో పాటు పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన స్వర్ణకు గత డిసెంబర్ 26వ తేదీ రాత్రి 8:30 గంటల సమయంలో పురిటినొప్పులు వచ్చాయి. ప్రైవేటు వాహనంలో ఆమెను పదర పీహెచ్‌సీకి, అక్కడి నుంచి అమ్రాబాద్ పీహెచ్‌సీకి.. అక్కడి నుంచి అచ్చంపేట ఆస్పత్రికి.. ఆ తర్వాత మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడకు చేరుకునే సరికి రాత్రి 2:30 గంటలైంది. వైద్యులు సాధారణ ప్రసవం చేశారు. కాసేపటికే ఊపిరి తీసుకోలేక శిశువు, అరగంట తర్వాత ఆ బాలింత మరణించా రు. ఈ ఘటన వివరాలు పత్రికల్లో చూసిన హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై ప్రధానన్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి మహిళను తీసుకొచ్చిన సమయంలో వెంటిలేటర్ అవసరమైందని, అక్కడ ఆ సౌకర్యం లేకపోవడంతో మరో చోటకు తరలించాల్సి వచ్చిందని మెడికల్ సూపరింటెండెంట్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. వాదనల అనంతరం కోర్టు నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేసింది. -
క్యాన్సర్ గ్రిడ్‌తో ‘ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల’ అనుసంధానం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న అన్ని క్యాన్సర్ ఆస్పత్రుల్లో పాలియేటివ్ కేర్ కోసం 5% పడకలను కచ్చితంగా కేటాయించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. బుధవారం వైద్య ఆరోగ్య శాఖ విభాగాధిపతులతో ఆమె మంగళగిరిలో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ..ఆరోగ్యశ్రీ క్యాన్సర్ ఆస్పత్రులను హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నడుస్తున్న క్యాన్సర్ గ్రిడ్‌కు అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల ఏ ప్రాంతంలో ఎలాంటి, ఎక్కువ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయో ప్రభుత్వానికి తెలుస్తుందన్నారు. ఐబ్రిస్ట్ స్క్రీనింగ్‌ను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని చెప్పారు. రూ.10వేల ఆసరా పింఛన్లు పొందుతున్న వారికి ఉచిత బస్‌పాస్‌లు అందజేయాలని సీఎం ఆదేశించారని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్దానం తాగునీటి ప్రాజెక్టుతో పాటు, పలాసలో కిడ్నీ కేర్ సెంటర్‌ను త్వరలో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. పిడుగురాళ్ల, పులివెందులలో ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించనున్న నేపథ్యంలో, ఆయా చోట్ల టీచింగ్ ఆస్పత్రుల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలన్నారు. నేడు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మంత్రి రజిని పోస్టర్‌ను ఆవిష్కరించారు. గురువారం గుంటూరులో నులిపురుగుల నివారణ మందులు పంపిణీ చేస్తామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీందిరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్ల భర్తీకి ఓకే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ (బీ కేటగిరీ 35 శాతం), ఎన్ఆర్ఐ (సీ కేటగిరీ 15%) కోటా సీట్లను భర్తీ చేయకుండా ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సీట్ల భర్తీ ప్రక్రియను యథాతథంగా కొనసాగించుకోవచ్చని తెలిపింది. అయితే సీట్ల భర్తీ తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కార్యదర్శి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య విద్య కమిషనర్ తదితరులను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 22కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని సదుపాయాలతో ధీటుగా నిర్వహించేలా విజయనగరం, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, నంద్యాల జిల్లాల్లో నెలకొల్పిన ప్రభుత్వ నూతన వైద్య కళాశాలల్లో సీట్లను జనరల్, సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్ఆర్ఐ కోటాగా విభజిస్తూ ప్రభుత్వం గత నెలలో జీవోలు 107, 108 జారీ చేసింది. వీటిని సవాలు చేస్తూ గుంటూరుకు చెందిన కోయ శిరీష, ఏలూరుకు చెందిన జతిన్ రాయ్, ఆత్మకూరుకు చెందిన వీణా జ్యోతిక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రైవేట్‌కు ధీటుగా అభివృద్ధి చేసేందుకే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ధీటుగా నూతన వైద్య కళాశాలలను నిలబెట్టాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంస్థల నుంచి రూ.వేల కోట్లను సమీకరించి మరీ నూతన వైద్య కళాశాలలను నిర్మించిందన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్ఆర్ఐ కోటాల కింద అందిన ఫీజులను ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్లో జమ చేసి ఆ మొత్తాలతో ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను అత్యుత్తమంగా నిర్వహిస్తామన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోటా సీట్లను తీసుకురావడం ఇదే తొలిసారి కాదని, 2017 నుంచి ఇది అమలవుతోందన్నారు. ఇప్పటికే రాజస్థాన్, హరియాణ, గుజరాత్లో విజయవంతంగా అమలు చేస్తున్నారని శ్రీరామ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఐదు వైద్య కళాశాలల్లో 750 సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇందులో 15 శాతం సీట్లు ఆల్ ఇండియా కోటా కింద కేంద్రానికి వెళతాయన్నారు. మిగిలిన 85 శాతం సీట్లలో 50 శాతం సీట్లను జనరల్ కేటగిరీలో ప్రతిభ ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పాటిస్తూ భర్తీ చేస్తామని వివరించారు. ఇవి పోగా మిగిలిన 50 శాతం సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేస్తామన్నారు. వీటికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించదన్నారు. నిర్ణయించిన ఫీజుల కన్నా ఎక్కువ మొత్తాలు వసూలు చేస్తే అది క్యాపిటేషన్ ఫీజుల కిందకు వస్తుందన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేస్తామని, ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని అభ్యర్ధించారు. ఎన్ఎంసీ అనుమతి లేకుండానే వర్గీకరించారు.. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఠాకూర్ యాదవ్ వాదనలు వినిపిస్తూ సీట్లను మూడు కేటగిరీలుగా విభజించడం అంటే బహిరంగంగా వేలం వేయడమేనన్నారు. ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం జనరల్, సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్ఆర్ఐ కోటాలు తీసుకొచ్చిందన్నారు. దీని వల్ల రిజర్వేషన్ వర్గాలకు అన్యాయం జరుగుతుందన్నారు. జాతీయ వైద్య కమిషన్ అనుమతి లేకుండా ప్రభుత్వం 3 కేటగిరీలను తీసుకొచ్చిందన్నారు. జనరల్ విభాగంలో ఏడాదికి రూ.15 వేలు, సెల్ఫ్ ఫైనాన్స్‌లో రూ.12 లక్షలు, ఎన్ఆర్ఐ విభాగంలో రూ.20 లక్షలను ఫీజుగా నిర్ణయించారన్నారు. కొత్త విధానంలో సీట్లను భర్తీ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు ధర్మాసనం నిరాకరిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 22కి వాయిదా వేసింది. -
‘మెడికల్’ రికార్డు..!
వడ్డే బాలశేఖర్–మచిలీపట్నం నుంచి సాక్షి ప్రతినిధి: వందల ఏళ్ల క్రితమే సముద్రయానం ద్వారా వర్తక వాణిజ్యంతో అలరారిన మచిలీపట్నం నగరం క్రీ.శ. మూడో శతాబ్ధం నాటిదని చరిత్ర చెబుతోంది. ఆధునిక కాలంలో బ్రిటీష్ పాలకులు బందరు తీరం నుంచి వాణిజ్య కార్యకలా పాలు నిర్వహించారు. ఇంత ప్రాముఖ్యత కలిగిన చారిత్రక నగరంలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో తీర ప్రాంత ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యం అవసరమైతే 70 కి.మీ ప్రయాణించి విజయవాడ వెళ్లాల్సిందే. ఈ అవస్థలను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బందరు మెడికల్ కాలేజీని మంజూరు చేసి శాశ్వత పరిష్కారం చూపారు. 64.3 ఎకరాల్లో రూ.550 కోట్లతో మచిలీపట్నం వైద్య కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణానికి 2021 జూలై 7 సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే ఉన్న జిల్లా ఆస్పత్రిని బోధనాస్పత్రిగా అభివృద్ధి చేశారు. 150 ఎంబీబీఎస్ సీట్లతో నూతన వైద్య కళాశాల తరగతులు ప్రారంభించేలా సదుపాయాలను సమకూర్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచి మచిలీపట్నం వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను ‘సాక్షి’ ప్రతినిధి పరిశీలించారు. బందరు తీర ప్రాంత ప్రజలకు ఆరోగ్య భద్రత తొలి ఏడాది ఎంబీబీఎస్‌లో చేరే విద్యార్థులకు అకడమిక్ కార్యకలాపాల కోసం అడ్మినిస్ట్రేషన్, ల్యాబొరేటరీ, లెక్చర్ గ్యాలరీ, ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్, హాస్టళ్లతో కలిపి 7 బ్లాక్‌లను నిర్మించారు. లెక్చర్ గ్యాలరీ బ్లాక్‌లో 184 మంది కూర్చునే సామర్థ్యంతో ఎల్ఈడీ స్క్రీన్స్, ప్రొజెక్టర్స్, సెంట్రల్ ఏసీ లాంటి అత్యాధునిక వసతులతో రెండు లెక్చర్ హాల్స్, ఇన్సైడ్, అవుట్‌సైడ్ రీడింగ్ రూమ్స్, జర్నల్, స్టాఫ్ రీడింగ్, లైబ్రరీ రూమ్‌లు ఏర్పాటు చేశారు. అమ్మాయిలు, అబ్బాయిల కోసం విడివిడిగా రెండు హాస్టల్ బ్లాక్‌లు సిద్ధం చేశారు. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా హ్యూమన్ అనాటమీ, క్లినికల్ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ/హెమటాలజీ, సెంట్రల్ ల్యాబొరేటరీ, స్కిల్ డెవలప్మెంట్, రీసెర్చ్ ల్యాబ్‌ల ఏర్పాటుకు అనుగుణంగా అన్ని వనరులు సమకూర్చారు. ఆయా బ్లాక్‌లలో ఫర్నిచర్ సమకూర్చే సమకూర్పు పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెలాఖరు లోపు భవనాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా.. మచిలీపట్నం తరహాలోనే నంద్యాల, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం వైద్య కళాశాలలు కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభానికి సిద్ధమయ్యాయి. అన్ని చోట్ల నేడో రేపో కళాశాలల ప్రిన్సిపాళ్లు, బోధన సిబ్బంది కొత్తగా నిర్మించిన తమ చాంబర్లలో కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాష్ట్రానికి సమకూరనున్నాయి. ఆంధ్రా మెడికల్ కాలేజీ 1923లో ఏర్పాటు కాగా వందేళ్ల తరువాత ప్రభుత్వ రంగంలో ఒకే ఏడాది ఐదు కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. విద్య, వైద్యం.. రెండు రకాల లాభాలు కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెరగడంతో పాటు ఆయా ప్రాంతాల్లోని పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు మరింత చేరువ కానున్నాయి. ఐదు చోట్ల సేవలు అందించిన జిల్లా ఆస్పత్రుల స్థానంలో బోధనాస్పత్రులు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా నిపుణులైన వైద్యులు అందుబాటులోకి వస్తారు. సేవలు రెట్టింపవుతాయి. అధునాతన వైద్య పరికరాలు, ల్యాబ్‌లు సమకూరడంతో వైద్య సేవలు, రోగ నిర్ధారణ సేవల్లో నాణ్యత పెరుగుతుంది. రేడియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ విభాగాల వల్ల వివిధ రకాల వ్యాధులు, జబ్బులపై రీసెర్చ్ జరుగుతుంది. ప్రస్తుతం ఎంబీబీఎస్‌లో చేరనున్న విద్యార్థులు నాలుగేళ్ల అనంతరం హౌస్ సర్జన్లుగా సేవలు అందిస్తారు. 24/7 ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండటంతో సేవలు మరింత మెరుగవుతాయి. మరోవైపు ఎన్ఎంసీ ప్రవేశపెట్టిన ఫ్యామిలీ అడాప్షన్ విధానం ద్వారా ప్రతి విద్యార్థి ఐదు కుటుంబాలకు సంబంధించిన ఆరోగ్య బాధ్యతలను పర్యవేక్షిస్తారు. నాలుగైదేళ్ల తర్వాత పీజీ సీట్లు కూడా సమకూరడంతో స్పెషలిస్ట్ వైద్యుల సంఖ్య పెరుగుతుంది. వైద్యుల నిష్పత్తి పెరుగుతుంది కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతో మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు విస్త్రృతంగా పెరుగుతాయి. డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక వైద్యుడు ఉండాలి. మన దేశంలో వెయ్యి మందికి ఒకరి కంటే తక్కువ వైద్యులున్నారు. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతో ఎక్కువ మంది వైద్యులు అందుబాటులోకి వస్తారు. తద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ కర్నూలు జీజీహెచ్ శరవేగంగా పెండింగ్ పనులు ఈ ఏడాది ఐదు కొత్త వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభించడానికి వీలుగా పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఈ నెల 31 నుంచి ఆల్ ఇండియా కోటా సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్ట్ చేస్తారు. పెండింగ్ పనులన్నీ శరవేగంగా నెలాఖరులోగా పూర్తి చేసేలా పర్యవేక్షిస్తున్నాం. వచ్చే ఏడాది మరో ఐదు కళాశాలలను ప్రారంభించేలా కసరత్తు చేపట్టాం. – ఎం.టి.కృష్ణబాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నాలుగేళ్లలో వైద్యరంగం బలోపేతం ఇలా.. ► రూ.16 వేల కోట్లతో నాడు–నేడు ద్వారా ప్రభుత్వ వైద్య రంగం బలోపేతం. ► నాలుగేళ్లలో ఏకంగా దాదాపు 51 వేల వైద్య పోస్టుల భర్తీ. ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేసేలా సీఎం జగన్ ఆదేశాలు. వైద్య శాఖలో పోస్టుల భర్తీ కోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాటు. ► గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ద్వారా 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు. ► దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. నెలకు రెండు సార్లు గ్రామాలకు పీహెచ్సీ వైద్యులు. ఇప్పటివరకూ 1.70 కోట్ల మందికి సొంత ఊళ్లలోనే వైద్యం. ► వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,059 నుంచి 3,257కి పెంపు. 40 లక్షల మందికి ఉచిత వైద్యం కోసం రూ.8 వేల కోట్ల వ్యయం. వైఎస్సార్ ఆరోగ్య ఆసరాతో విశ్రాంతి సమయంలో జీవన భృతి చెల్లింపు. ఇప్పటివరకూ 17.25 లక్షల మందికి రూ.1,074.69 కోట్లు అందించిన ప్రభుత్వం. ► 108, 104 అంబులెన్స్‌ల సేవలు బలోపేతం. కొత్తగా 768 అంబులెన్స్‌ల సేవలు అందుబాటులోకి. 2020 జూలై నుంచి 33.35 లక్షలకు పైగా అత్యవసర కేసుల్లో సేవలందించిన అంబులెన్స్‌లు. ► ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులు. స్థానికులకు ఎంతో మేలు ఇప్పటిదాకా బందరు ప్రాంతంలో మెరిట్ విద్యార్థులు వైద్య విద్య చదవాలంటే కాకినాడ, విజయవాడ, వైజాగ్ వెళ్లాల్సి వచ్చేది. ఇక్కడే వైద్య కళాశాల ఏర్పాటుతో స్థానికులకు ఎంతో మేలు జరగనుంది. పూర్తి స్థాయిలో బోదనాస్పత్రి సిద్ధం అయింది. భవిష్యత్తులో పీజీ విద్యార్థులు కూడా వస్తారు. బందరు చుట్టు పక్కల ప్రాంత ప్రజలకు ఆరోగ్య భద్రత చేకూరుతోంది. – డాక్టర్ బి.శ్రీనివాసాచార్య, ఐఎంఏ రాష్ట్ర వైస్ ప్రెసిడెంగ్, మచిలీపట్నం మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసి ప్రతి చోటా వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఆమేరకు నంద్యాలలో కొత్త వైద్య కళాశాలను నెలకొల్పారు. త్వరలోనే తరగతులు ప్రారంభం కానున్నాయి. వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో వైద్య కళాశాలల ఏర్పాటుతో ప్రజలకు మేలు జరుగుతోంది. విద్యార్థుల వైద్య విద్య కల కూడా నెరవేరుతుంది. సూపర్ స్పెషాలిటీ వైద్యం మరింత చేరువ అవుతుంది. – చెన్నకేశవ, నంద్యాల 17 కొత్త కాలేజీలు రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం ద్వారా స్పెషలిస్ట్ వైద్య సేవలను చేరువ చేసేలా సీఎం జగన్ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా 2,550 ఎంబీబీఎస్ సీట్లను అదనంగా సమకూరుస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం 5 కాలేజీలు ప్రారంభం అవుతుండగా వచ్చే విద్యా సంవత్సరం మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని కాలేజీలను ప్రారంభిస్తారు. మిగిలిన వాటిని 2025–26లో ప్రారంభించేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రులను 330 పడకల జిల్లా ఆస్పత్రులుగా నోటిఫై చేసింది. -
ప్రమాదంలోకి ప్రజారోగ్యం! సర్కార్ వారి హద్దులను చెరిపేస్తే ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సర్కారుకు, డాక్టర్లకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆర్ఎంపీలు, పీఎంపీలకు శిక్షణ ఇవ్వాలన్న రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయంపై వైద్యులు మండిపడుతున్నారు. వారికి శిక్షణ ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య సేవలకు వాడుకోవాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలను తప్పుబడుతున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బీఎన్ రావు, తెలంగాణ జూనియర్ డాక్టర్ల (జూడా) సంఘం అధ్యక్షుడు డాక్టర్ కౌశిక్ కుమార్ పింజరాల, హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) అధ్యక్షుడు డాక్టర్ కె.మహేష్‌కుమార్‌లు వైద్యారోగ్య శాఖ నిర్ణయంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ‘తెలంగాణలో ప్రభుత్వం పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి డాక్టర్లను తయారు చేస్తున్న తరుణంలో ఆర్ఎంపీ (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్), పీఎంపీ (ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్)లకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? తెలంగాణ వైద్యరంగంలో దయనీయ పరిస్థితికి ఇది ఉదాహరణ. ఇప్పటికే ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న ఆశ, ఏఎన్ఎం సహా ఇతర ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలను ఉపయోగించుకునే దిశగా ఎందుకు ఆలోచించడంలేదు? ఆర్ఎంపీలు, పీఎంపీలకు శిక్షణ ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? ఓటు బ్యాంకు రాజకీయాల కోసమేనా? ఆధునిక వైద్యంపై అవగాహన లేని వారికి శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతించడం.. ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేయడమే. ఏళ్ల తరబడి ఆధునిక వైద్యం నేర్చుకున్న డాక్టర్లకు సర్కారు నిర్ణయం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇది అనైతిక నిర్ణయం. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సిబ్బంది కొరతను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది. దీనికి బదులు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులను నియమించాలి..’ అని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఆర్ఎంపీ, పీఎంపీలు నిర్వహిస్తున్న క్లినిక్‌లన్నింటినీ మూసివేయాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. శస్త్రచికిత్సలు చేయడంపై అభ్యంతరం... రాష్ట్రంలో వేలాది మంది ఆర్ఎంపీ, పీఎంపీలు ఉన్నారు. అత్యధిక శాతం గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం అందిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నా గ్రామీణ స్థాయి వరకు అవి అందుబాటులో లేవు. పైగా చాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు డాక్టర్లు నిత్యం రావడంలేదన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రామీణులకు ఆర్ఎంపీలు, పీఎంపీల వైద్య సేవలే దిక్కవుతున్నాయి. అయితే చాలామంది ఆర్ఎంపీలు, పీఎంపీలు ప్రాథమిక చికిత్సకే పరిమితం కాకుండా, చిన్నపాటి శస్త్రచికిత్సలు, ప్రసవాలు కూడా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అంతేగాక ప్రైవేట్ ఆసుపత్రులకు రోగులను తీసుకెళ్తూ కమీషన్లు పొందుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. మరోవైపు అనేకచోట్ల ఆర్ఎంపీలు, పీఎంపీల వైద్యం వికటించిన ఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వారికి శిక్షణ ఇచ్చి, సర్టిఫికెట్లు ఇచ్చి, కొన్ని పరిమితులతో ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించేలా చూడాలన్నది తమ ఉద్దేశమని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వ నిర్ణయం.. ప్రజారోగ్యాన్ని అనర్హులైన వారి చేతిలో ఉంచడమే అవుతుందని డాక్టర్లు మండిపడుతున్నారు. ‘ఇది అమలైతే రోగులు ఎక్కువ సంఖ్యలో ఆర్ఎంపీలు, పీఎంపీల వద్దకు వెళతారు. వారు తెలిసీ తెలియని వైద్యం చేసి వికటించినప్పుడు, వారు ఆ కేసులను డాక్టర్ల వద్దకు పంపిస్తారు. కానీ అప్పటికే రోగి పరిస్థితి విషమిస్తుంది. ఆ తర్వాత ఏదైనా జరిగితే డాక్టర్లపైకే నెట్టేస్తారు..’ అని అంటున్నారు. ప్రాథమిక చికిత్సకు మాత్రమే పరిమితమం కావాల్సిన వారు తమ హద్దులను దాటుతున్నారని, మందులు రాయడం వంటివి కూడా చేస్తున్నారని వివరిస్తున్నారు. ఇలాంటి వారికి శిక్షణ ఇవ్వాలనే నిర్ణయం ద్వారా ప్రభుత్వం గ్రామీణ ఆరోగ్యాన్ని పణంగా పెడుతోందని అంటున్నారు. వారికి శిక్షణ ఇవ్వాలనుకుంటే ఇక ఇన్ని మెడికల్ కాలేజీల అవసరం ఏముందంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
మరో 8 కొత్త మెడికల్ కాలేజీలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2024–25 వైద్య విద్యా సంవత్సరంలో జోగుళాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్అర్బన్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో ఈ కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఒక్కో కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. అంటే కొత్తగా 800 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను ఇప్పటికే 25 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఈ ఎనిమిది కూడా అందుబాటులోకి వస్తే.. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకున్నట్టు అవుతుంది. వీటితో కలిపి రాష్ట్రంలోని మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 34కు చేరుతుంది. అంతేకాదు.. దేశంలో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రికార్డు నెలకొల్పనుంది. భారీగా పెరిగిన వైద్య సీట్లు తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వైద్య కళాశాలలతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు గణనీయంగా పెరిగాయి. 2014లో ప్రభుత్వ కాలేజీల్లో 850 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా.. ఈ ఏడాది నాటికి 3,790కి పెరిగాయి. కొత్తగా రానున్న 8 మెడికల్ కాలేజీల్లో మరో 800 మెడికల్ సీట్లు ఉంటాయి. దీంతో మొత్తంగా రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 4,590 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు కలిపి చూస్తే.. 2014కు ముందు రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు ఉంటే.. ఈ ఏడాది ఆ సంఖ్య 56కు చేరుకుంది. ఇదే సమయంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,850 నుంచి 8,340కు చేరింది. కొత్త మెడికల్ కాలేజీల సీట్లనూ కలిపితే 9,140 సీట్లకు చేరుతుంది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న ప్రైవేటు మెడికల్ కాలేజీల ద్వారా మరికొన్ని సీట్లు రానున్నాయి. అంటే తెలంగాణలో మొత్తంగా 10 వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉండగా.. సగటున 7.5 పీజీ సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. 2023–24లో దేశవ్యాప్తంగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన 2,118 మెడికల్ సీట్లలో ఒక్క తెలంగాణలోనివే 900 (43 శాతం) కావడం గమనార్హం. ‘జిల్లాకో మెడికల్ కాలేజీ’ ఇలా.. ► 2014కు ముందు రాష్ట్రంలో గాంధీ (1954), ఉస్మానియా (1946), కాకతీయ (1959), రిమ్స్ ఆదిలాబాద్, నిజామాబాద్ మెడికల్ కాలేజీ ఉన్నాయి. ► 2016–17లో మహబూబ్‌నగర్, సిద్దిపేట జిల్లాల్లో, 2018–19లో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కాలేజీలు ఏర్పాటయ్యాయి. ► గత ఏడాది (2022–23)లో మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేశారు. ► ఈ ఏడాది (2023–24) కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్నాయి. ► వచ్చే ఏడాది (2024–25)లో జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో వైద్య విద్య విప్లవం జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని ప్రకటించి, అనతి కాలంలోనే మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. మెడికల్ కాలేజీల ఏర్పాటు ద్వారా రాష్ట్ర విద్యార్థులకు వైద్య విద్యను, పేద ప్రజలకు స్పెషాలిటీ వైద్యసేవలను చేరువ చేశారు. కొత్త మెడికల్ కాలేజీలు, లోకల్ రిజర్వేషన్ వల్ల డాక్టర్ కావాలనుకునే తెలంగాణ విద్యార్థులకు అపార అవకాశాలు అందుతున్నాయి. విద్యార్థులు వీటిని సది్వనియోగం చేసుకోవాలని కోరుతున్నాను. తెలంగాణ ఆచరిస్తే, దేశం అనుసరిస్తుందనే నినాదానికి ఇదో నిదర్శనం. – హరీశ్‌రావు, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి -
నిమ్స్‌లో రోబోటిక్ సర్జరీలు
లక్డీకాపూల్ (హైదరాబాద్): నిమ్స్ ఆస్పత్రిలో సోమవారం నుంచి రోబోటిక్ సర్జరీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రూ.31.50 కోట్లతో నిమ్స్ కొనుగోలు చేసిన డావెన్నీ ఎక్స్ఐ రోబో యంత్రాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. రోబోటిక్ సర్జరీల నిర్వహణకు నిమ్స్ యాజమాన్యం ఇప్పటికే సీనియర్ ప్రొఫెసర్లకు శిక్షణ ఇచ్చింది. ఇందులో వివిధ విభాగాలకు చెందిన 15 మంది వైద్యులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రోబోటిక్ సర్జరీ సిస్టంతో పాటుగా స్పెషా లిటీ బ్లాక్‌లోని ఆపరేషన్ థియేటర్లలో యూరాలజీ, న్యూరో సర్జరీ విభాగాలకు సంబంధించిన ఆధునిక వైద్య పరికరాలనూ మంత్రి ప్రారంభించనున్నారు. ఇవీ ప్రయోజనాలు.. కార్పొరేట్ ఆస్పత్రులలో సుమారు రూ.1.75 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్న ఈ రోబోటిక్ సర్జరీలను నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేయనున్నారు. రోబోటిక్ శస్త్రచికిత్స వల్ల రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆపరేషన్ సక్సెస్ రేట్ కూడా నూటికి నూరు శాతం ఉంటుంది. క్లిష్టమైన మూత్రాశయం, పెద్దపేగు, చిన్న పేగు, క్లోమం, కాలేయం, గర్భసంచి, అన్నవాహిక.. తదితర సర్జరీలను రోబో విధానంలో మరింత మెరుగ్గా నిర్వహించవచ్చు. అతి సూక్ష్మమైన కేన్సర్ కణతులను సైతం తొలగించడానికి వీలుంటుంది. ముఖ్యంగా సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, యూరాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, గైనకాజీ విభాగాల్లో మరింత మెరుగైన శస్త్ర చికిత్సలు చేయడానికి వీలుంటుంది. వైద్య సేవల్లో దేశానికే రోల్‌మోడల్ : నిమ్స్ డైరెక్టర్ బీరప్ప వైద్య సేవల్లో నిమ్స్ ఆస్పత్రి దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప అన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చయ్యే శస్త్రచికిత్సలను నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగానే చేస్తున్నామన్నారు. ఎంత పెద్ద ఆపరేషన్ చేయించుకున్నా రోగి మూడో రోజునే ఇంటికి వెళ్లే విధంగా దోహదపడే రోబోటిక్ సిస్టంను సమకూర్చుకున్నామన్నారు. స్పెషాలిటీ బ్లాక్‌లోని ఆపరేషన్ థియేటర్లలో ఏర్పాటు చేసిన ఈ రోబోటిక్ సర్జరీ సిస్టంను ప్రస్తుతానికి సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, యూరాలజీ విభాగాలలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు డాక్టర్ బీరప్ప తెలిపారు. -
రాష్ట్రంపై డెంగీ పంజా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై డెంగీ పంజా విసురుతోందని.. ఈ ఏడాది ఇప్పటివరకు 583 డెంగీ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ పేర్కొంది. అందులోని ఇటీవలి మే, జూన్ నెలల్లోనే అధికంగా కేసులు నమోదయ్యాయని నివేదికలో వెల్లడించింది. సాధారణంగా వానాకాలం సీజన్ మొదలయ్యాక డెంగీ, ఇతర విష జ్వరాలు వ్యాపిస్తుంటాయి. కానీ ఈసారి వానాకాలం సీజన్ ప్రారంభం కాకముందే మే నెలలోనే డెంగీ కేసులు నమోదవడం ఆందోళనకరంగా మారింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 218 డెంగీ కేసులురాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 44, మేడ్చల్ మల్కాజిగిరి, వరంగల్ జిల్లాల్లో 38 చొప్పున కేసులు నమోదయ్యాయి. వానలు మొదలైన నేపథ్యంలో డెంగీ కేసులు పెరిగే అవకాశం ఉంటుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఆ పది జిల్లాల్లో రిస్క్ రాష్ట్రంలో డెంగీ హైరిస్క్ జిల్లాలను ప్రజారోగ్య కార్యాలయం గుర్తించింది. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మేడ్చల్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, పెద్దపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో డెంగీ కేసులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో గతేడాది నమోదైన డెంగీ కేసుల్లో ఈ జిల్లాల్లోనే 80 శాతం వరకు నమోదైనట్టు పేర్కొంది. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు 121 మలేరియా కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, కొమురంభీం ఆసిఫాబాద్, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలను హైరిస్క్ జిల్లాలుగా వైద్యారోగ్యశాఖ గుర్తించింది. గతేడాది రాష్ట్రంలో నమోదైన మలేరియా కేసుల్లో ఈ ఏడు జిల్లాల్లోనే 91.5 శాతం కేసులు వచ్చాయని పేర్కొంది. అధికారులతో మంత్రి సమీక్ష వానాకాలం మొదలైన నేపథ్యంలో డెంగీ, మలేరియా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. వర్షాకాలం నేపథ్యంలో వ్యాధుల నియంత్రణపై ప్రత్యేకంగా అన్ని జిల్లాల డీఎంహెచ్వోలతో మంత్రి హరీశ్‌రావు తాజాగా సమీక్ష నిర్వహించారు. కలుషిత నీటి ద్వారా వచ్చే వ్యాధులు మిషన్ భగీరథతో తగ్గిపోయాయని.. కానీ కీటకాలతో వ్యాపించే వ్యాధుల నియంత్రణపై ప్రధానంగా దృష్టి పెట్టాలని అన్ని జిల్లాల వైద్యాధికారులను ఆదేశించారు. మలేరియాను గుర్తించే 8 లక్షల ర్యాపిడ్ కిట్లను, డెంగీని గుర్తించే 1.23 లక్షల ఎలిజా కిట్లను ఇప్పటికే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపామని తెలిపారు. -
ఏ వైరస్ వచ్చినా ఎదుర్కొనేలా..
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో కరోనాను మించిన వైరస్లు రావొచ్చని ఇద్దరు ఎంటమాలజిస్టులు తనతో చెప్పారని.. వైద్యారోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉంటే అలాంటి వాటిని ధైర్యంగా ఎదుర్కోవచ్చని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేలా వైద్యారోగ్య శాఖను తీర్చిదిద్దాలని నిర్ణయించామని చెప్పారు. బడ్జెట్లో వైద్యారోగ్య రంగానికి కేటాయింపులు భారీగా పెంచామని.. 2014లో రూ.2,100 కోట్లు కేటాయించగా, 2023–24 నాటికి ఏకంగా రూ.12,365 కోట్లకు పెరిగాయని వివరించారు. ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను 17 వేల నుంచి 50 వేలకు పెంచామని, అలాగే 50 వేల ఆక్సిజన్ బెడ్లు కూడా సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిమ్స్ ఆస్పత్రిలో కొత్తగా 2 వేల పడకలతో మరో బ్లాక్ నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడారు. సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. అది వైద్యారోగ్య శాఖ ప్రాధాన్యత! ‘‘మన రాష్ట్రంలో మిడతల బెడద లేదు. కానీ మిడతల దండు హరియాణాలోకి వచ్చి అక్కడి నుంచి మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోకి ప్రవేశించి ఆదిలాబాద్ సరిహద్దు దాకా వచ్చాయి. ఆ సమయంలో కేంద్రం ఇద్దరు ఎంటామాలజిస్టులను పంపింది. అయితే మహారాష్ట్రలోనే మిడతలను మట్టుపెట్టడంతో మన వరకు రాలేదు. తర్వాత ఆ ఇద్దరు ఎంటమాలజిస్టులు నన్ను కలిశారు. సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన ఈ కాలంలోనూ మిడతల సమస్యకు పరిష్కారం కనుక్కోలేరా? అని నేను ప్రశ్నించాను. మనిషి 4 లక్షల ఏళ్ల క్రితం పుడితే.. మిడతలు, బ్యాక్టీరియాలు అంతకన్నా ముందు 8 లక్షల ఏళ్ల క్రితమే పుట్టాయి. వాటికి వ్యతిరేకంగా మనిషి చర్యలు చేపడితే ప్రకోపం చెంది ఇబ్బందులు కలిగిస్తాయి. అందుకే మిడతలను చంపలేమని, పూర్తిగా నిర్మూలించలేమని ఎంటమాలజిస్టులు వివరించారు. కరోనా కూడా అలాంటిదేనని, భవిష్యత్తులో దానిని మించిన వైరస్లు రావొచ్చని నాతో అన్నారు. వైద్యారోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉంటే.. నష్టం తక్కువగా ఉంటుందని, లేకుంటే నష్టాలు భారీగా ఉంటాయని హెచ్చరించారు. వైద్యారోగ్య శాఖ ప్రాధాన్యతను దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. మానవ జీవనం ఉన్నంత కాలం వైద్యం కూడా కొనసాగుతూనే ఉంటుంది. భారీగా ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు నిమ్స్ ఆస్పత్రి భారీ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడం దేశ వైద్యారోగ్య రంగంలోనే చారిత్రక సందర్భం. కేంద్రాన్ని ప్రాధేయపడకుండా సొంతంగా 550 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగల ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నాం. గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందించాం. పుట్టే బిడ్డలు ఒడ్డూ పొడుగు బాగుండాలంటే వాళ్లు గర్భంలో ఎదిగే కాలంలో ఎలాంటి ఆటంకం ఉండకూడదు. ఒకసారి స్టంటింగ్ సమస్య ఏర్పడితే.. మళ్లీ ఎదుగుదల చూడాలంటే వంద సంవత్సరాల కాలం పడుతుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఈ సమస్యను అధిగమించేందుకు ఇస్తున్నవే న్యూట్రిషన్ కిట్లు. గాంధీ ఆస్పత్రి సేవలు అమోఘం కరోనా కాలంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ గొప్పగా పనిచేసింది. ఆ సమయంలో రోగులకు ధైర్యంగా సేవలు అందించిన గాంధీ ఆస్పత్రి వైద్యులను అభినందిస్తున్నా. అయితే ఎంత చేసినా వైద్యశాఖకు పలు దిక్కుల నుంచి విమర్శలు వస్తుంటాయి. నిరుపేదలు వైద్యం కోసం వస్తే.. బెడ్లు అందుబాటులో లేనప్పుడు వైద్యులు ఉదార హృదయంతో ఒక అరగంట ఎక్కువ పనిచేసైనా, కింద బెడ్డు వేసి అయినా వైద్యం అందిస్తారు. కానీ ఆస్పత్రిలో బెడ్లు లేవని, పేషెంట్లను కింద పడుకోబెడుతున్నారని ప్రచారం జరుగుతుంది. అందువల్ల ప్రజా సంబంధాల వ్యవస్థను మరింతగా మెరుగుపరుకోవాలి. సేవలు మరింత పెరగాలి వైద్యారోగ్య రంగంలో చాలా మార్పులు రావాలి. ఆస్పత్రుల నిర్మాణాలే కాదు.. ఆస్పత్రుల్లో సేవలు కూడా పెరగాలి. ఈ రోజు మనం ఏ స్టేజ్‌లో ఉన్నాం, ఇంకా ఎంత ముందుకు పోవాల్సి ఉంది? జరగాల్సిన కొత్త ఆవిష్కరణలు ఏంటి? చేపట్టాల్సిన చర్యలేమిటన్న ప్రణాళికల కోసం సమయం కేటాయించాలి. ప్రజల బాగు కోసం ఇంకా ఏం చేయాలనే తపన వైద్యాధికారులకు ఉండాలి. అపవాదులను తొలగించుకొని రాష్ట్రంలో వైద్యశాఖనే నంబర్ వన్ అని పేరొచ్చేలా కృషి చేయాలి. భారీగా ఆస్పత్రుల నిర్మాణం రాష్ట్రంలో గొప్పగా ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. వరంగల్‌లో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి రానుంది. ఒకప్పుడు నిమ్స్‌లో 900 పడకలుంటే.. తెలంగాణ వచ్చాక 1,500 పడకలకు పెంచాం. మరో 2 వేల పడకల సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం. హైదరాబాద్‌లో టిమ్స్ కింద నాలుగువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు కడుతున్నాం. విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అద్భుతమైన వైద్య సేవలు, టెలీ మెడిసిన్ సేవలు అందుతాయి..’’ అని కేసీఆర్ చెప్పారు. న్యూట్రిషన్ కిట్ల పంపిణీ ప్రారంభం నిమ్స్ కార్యక్రమం సందర్భంగా.. హైదరాబాద్‌లో గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీని కూడా సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. తన చేతుల మీదుగా ఆరుగురికి న్యూట్రిషన్ కిట్లను అందచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని, ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తాతా మధు, మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నేడు నాగ్‌పూర్‌కు కేసీఆర్ – బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గురువారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వెళ్తున్నారు. ఆయన హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటల సమయంలో నాగ్‌పూర్‌కు చేరుకుంటారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మహారాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొని తిరుగు ప్రయాణమవుతారు. సాయంత్రం 4 గంటల సమయంలో హైదరాబాద్‌కు చేరుకుంటారు. హైదరాబాద్ బయట మూడో కార్యాలయం.. నాగ్‌పూర్ కార్యాలయం బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ వెలుపల మూడో కార్యాలయం కానుంది. ఇప్పటికే ఢిల్లీలోని వసంత్ విహార్‌లో పార్టీ కేంద్ర శాశ్వత కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఏపీలోనూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఓ అద్దె భవనంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. తాజాగా నాగ్‌పూర్‌లో ఏర్పాటు చేశారు. త్వరలో ఔరంగాబాద్, పుణేలోనూ బీఆర్ఎస్ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. -
ఖాళీలు కనపడొద్దు
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది పోస్టులు ఒక్కటి కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అందుకు తగ్గట్టు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభంకానున్న ఐదు కొత్త వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాలపై సీఎం జగన్ సమీక్షించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలలు చరిత్రలో నిలిచిపోయే నిర్మాణాలని సీఎం పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, వైద్య శాఖలో పోస్టుల భర్తీ, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఇతర కార్యక్రమాల అమలు పురోగతిపై సమీక్షించిన సీఎం జగన్ పలు సూచనలు చేశారు. ఐఏఎస్ నేతృత్వంలో ఎప్పటికప్పుడు భర్తీ.. ప్రభుత్వాస్పత్రులను వేధించే ప్రధాన సమస్య మానవ వనరుల కొరత. దీనికి చెక్ పెట్టేలా ఇప్పటికే 48 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టాం. ఈ నియామకాల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుండాలి. ఎప్పటికప్పుడు ఖాళీ అయిన పోస్టులను గుర్తించి భర్తీ చేయాలి. వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్మెంట్ వ్యవస్థ సమర్థంగా పనిచేయాలి. ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి. ఏదైనా పోస్టు ఖాళీ అయితే నాలుగు వారాల్లో భర్తీ చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. ఆరోగ్య పరిస్థితులపై ట్రాకింగ్ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలి. అప్పుడే ప్రివెంటివ్ కేర్‌లో ఆశించిన లక్ష్యాలను సాధించగలం. కార్యక్రమం అమలులో పీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్‌ల పాత్ర ఎంతో కీలకం. మధుమేహం, రక్తపోటు, ఇతర నాన్ కమ్యూనికబుల్, కమ్యూనికబుల్ జబ్బుల బాధితులకు మంచి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి. ఫ్యామిలీ డాక్టర్ వద్ద వీరికి చికిత్స అందించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలి. విలేజ్ క్లినిక్‌ల స్థాయిలో కంటి పరీక్షలు చేపట్టాలి. క్రమం తప్పకుండా ఈ ప్రక్రియ కొనసాగాలి. టీబీ నిర్ధారణ పరీక్షలు అందరికీ చేయడం ద్వారా బాధితులను గుర్తించాలి. వారికి మంచి చికిత్స అందించే దిశగా అడుగులు వేయాలి. క్యూ ఆర్ కోడ్‌తో స్మార్ట్ కార్డులు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి అర్హత పొందిన కుటుంబాల్లో పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికీ క్యూ ఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ కార్డులు అందజేయాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా అవినీతికి తావు లేకుండా చర్యలు చేపట్టాలి. సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ప్రతి చోటా ఫోన్ నంబర్లు ప్రదర్శించాలి. వాటిని సకాలంలో పరిష్కరించాలి. 1.39 కోట్ల మందికి ఫ్యామిలీ డాక్టర్ సేవలు గతేడాది అక్టోబర్ 22 నుంచి ఇప్పటివరకు ఫ్యామిలీ డాక్టర్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా 1,39,97,189 మందికి సేవలందించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 35,79,569 మంది రక్తపోటు, 24,31,934 మంది మధుమేహం బాధితులని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు (సీహెచ్‌వో) శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ఫస్ట్ ఎయిడ్, పాముకాటు, ఐవీ ఇన్ఫ్యూజన్, ఇంజక్షన్, డ్రస్సింగ్, బేసిక్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ లాంటి అంశాల్లో శిక్షణ ఇచ్చామన్నారు. సికిల్‌సెల్ అనీమియా నివారణలో భాగంగా ఈ ఏడాది 6.68 లక్షల మందికి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఈ నెలలోనే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పరీక్షలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దంత వైద్యులు ప్రతినెలా పీహెచ్‌సీలను సందర్శించేలా చర్యలు తీసుకున్నామన్నారు. టీబీ నివారణపైనా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతున్నామన్నారు. లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది మరో 3 మెడికల్ కాలేజీలు.. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నందా్యలలో ఏర్పాటవుతున్న మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. మరో 3 కొత్త వైద్య కళాశాలలు పాడేరు, పులివెందుల, ఆదోనిలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మిగిలిన కళాశాలల్లో పనులు వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు. సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ జవహర్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్, ఏపీవీవీపీ కమిషనర్ వెంకటేశ్వర్, రవాణాశాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, ఔషధ నియంత్రణ విభాగం డీజీ రఘురామరెడ్డి, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ రామిరెడ్డి, డీఎంఈ నరసింహం పాల్గొన్నారు. -
ఫ్యామిలీ డాక్టర్‌తో కోటి మందికిపైగా సేవలు
సాక్షి, గుంటూరు: వైద్య, ఆరోగ్యశాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి విడదల రజిని, ఉన్నతాధికారులు, పలువురు ఆయా విభాగాల అధికారులు హాజరయ్యారు. సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ► ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతికి చోటు ఉండకూడదు. ఫిర్యాదు చేయడానికి టెలిఫోన్ నంబర్ ప్రతిచోటా ఉంచాలి. అలాగే సమర్థవంతమైన ఎస్ఓపీలను పెట్టాలి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలి. పీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్‌ల పనితీరు ఇందులో కీలకం. ప్రివెంటివ్ కేర్‌లో మనం ఆశించిన లక్ష్యాలను అప్పుడే సాధించగలం. ► వైద్య ఆరోగ్యశాఖలో రిక్రూట్మెంట్ వ్యవస్ధ సమర్థవంతంగా పనిచేయాలి. ఒక ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీచేయాలి. ఎక్కడా కూడా సిబ్బంది కొరత అన్నది ఉండకూడదు. నాలుగు వారాలకు మించి.. ఎక్కడా ఏ ఖాళీ కూడా ఉండకూడదు. అధికారుల వివరణ ► కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చాం. ఫస్ట్‌ఎయిడ్, స్నేక్ బైట్, ఐవీ ఇన్ఫ్యూజన్, ఇంజక్షన్, వూండ్ కేర్, డ్రస్సింగ్, బేసిక్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ లాంటి అంశాల్లో వారికి శిక్షణ పూర్తయ్యింది. ► అక్టోబరు22న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకూ 1,39,97,189 మందికి సేవలు అందించాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా సేవలందుకున్నవారిలో 35,79,569 మంది హైపర్ టెన్షన్‌తో, 24,31,934 డయాబెటిస్తో బాధపడతున్నట్టు గుర్తింపు. ► వాళ్లందరికి మంచి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. పేషెంట్‌కు చికిత్స అందించడంతోపాటు.. వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలన్నారు. విలేజ్ క్లినిక్ స్ధాయిలో కంటి పరీక్షలు క్రమం తప్పకుండా కూడా చేయాలన్నారు. సికిల్ సెల్ ఎనీమియాను నివారించే కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష సికిల్ సెల్ ఎనీమియా నివారణ కార్యక్రమంలో భాగంగా.. ఈ ఏడాది 6.68 లక్షలమందికి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు సీఎం జగన్ వద్ద ప్రస్తావించారు. ఈ నెలలోనే అల్లూరిసీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పరీక్షలు ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. ఓరల్ హెల్త్‌లో భాగంగా ప్రతినెలా కూడా దంత వైద్యులు పీహెచ్‌సీలను సందర్శించేలా చర్యలు తీసుకున్నామన్నారు అధికారులు. ► టీబీ నివారణపైనా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు వెల్లడించిన అధికారులు. ప్రస్తుతం లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయిస్తున్నామని వెల్లడి. అందరికీ పరీక్షలు చేయడంద్వారా బాధితుల్ని గుర్తించి.. వారికి మంచి చికిత్స అందించే చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేయాలని సీఎం జగన్ అధికారులతో చెప్పారు. ► ప్రతి కుటుంబంలో పుట్టే బిడ్డ దగ్గరనుంచి ప్రతి ఒక్కరికీ కూడా ఆరోగ్యశ్రీకార్డు ఇవ్వాలని సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించారు. క్యూ ఆర్ కోడ్ ఉన్న ఈ కార్డు ద్వారా వారి ఆరోగ్యవివరాలను నమోదు చేయాలన్నారు. మెడికల్ కాలేజీలపైనా సీఎం సమీక్ష. ఈ విద్యాసంవత్సంలోనే ప్రారంభం కానున్న కొత్త మెడికల్ కాలేజీల్లో మౌలికసదుపాయాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మెడికల్ కాలేజీలు చరిత్రలో నిలిచిపోయే నిర్మాణాలని, ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కొత్త మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. అలాగే.. పాడేరు, పులివెందుల, ఆదోని కొత్త మెడికల్ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు మొదలవుతాయి. మిగిలిన కాలేజీల్లో కూడా పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించిన అధికారులు. -
యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు
సాక్షి, అమరావతి /విశాఖపట్నం/కొరాపుట్ / సాక్షి నెట్వర్క్: ఒడిశా రాష్ట్రంలో సంభవించిన ఘోర రైలు ప్రమాద ఘటనలో సహాయక చర్యల్లో ఏపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పాలుపంచుకుంటోంది. సీఎం జగన్ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఒడిశా సరిహద్దుల్లో ఉండే మన రాష్ట్రంలోని ఆస్పత్రులను అప్రమత్తం చేశారు. 108 అంబులెన్స్‌లు 20, ఇతర అంబులెన్స్‌లు 25, మహాప్రస్థానం వాహనాలు 15 కలిపి 60 వాహనాలు ఘటన స్థలానికి తరలించారు. పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించారు. రైలులో ప్రయాణించిన మన రాష్ట్ర ప్రయాణికుల వివరాల ఆధారంగా కో ఆర్డినేట్ చేసుకుని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని జిల్లాల డీఎంహెచ్ఒలను ఆదేశించారు. అవసరమైతే హెలికాఫ్టర్ సేవలు: మంత్రి అమర్నాథ్ రైలు ప్రమాద బాధితులకు అత్యవసర సాయం అవసరమైతే హెలికాఫ్టర్ సేవలు వినియెగించుకోవాలని సీఎం ఆదేశించారని ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కలిసి శనివారం ఆయన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎవరైనా రైలులో ప్రయాణించి, ఫోన్‌కి స్పందించకపోతే వారిని గుర్తించేందుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఖరగ్‌పూర్ నుంచి చాలా మంది తెలుగు వారు ఇదే రైలులో ప్రయాణించినట్లు తెలిసిందన్నారు. ఒక క్షతగాత్రుడి అభ్యర్థన మేరకు విశాఖలోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రికి తరలించామన్నారు. కటక్ రైల్వేస్టేషన్లో ప్రత్యేక అధికారుల బృందం, ప్రభావిత ప్రాంతంలోని ప్రతి ఆస్పత్రిలో ఆంధ్రా అధికారులు సేవల్లో ఉంటారని తెలియజేశారు. సహాయక చర్యలు ముమ్మరం: మంత్రి రజిని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో రైలు ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ముమ్మరం చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రం నుంచి 20 అడ్వాన్స్డ్ లైఫ్ సేవింగ్ అంబులెన్సులు, 21 మహాప్రస్థానం వాహనాలను పంపామన్నారు. ఈ వాహనాలను సమన్వయం చేసుకునేందుకు వైద్యం, రవాణా, పోలీసుశాఖల నుంచి ముగ్గురు అధికారులను నియమించామని చెప్పారు. శ్రీకాకుళం రిమ్స్, విశాఖపట్నం కేజీహెచ్, విజయనగరం జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్లను అప్రమత్తం చేశామన్నారు. అవసరమైతే ఒడిశాలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి కూడా వైద్య సేవలు అందించాలని చెప్పామని తెలిపారు. కాగా, రైలు ప్రమాదంపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు తానేటి వనిత, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆదిమూలపు సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నంబర్లు 0891–2590100, 0891 2590102, 9154405292 (వాట్సాప్ నంబర్) తాడేపల్లిలోని రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ సెంటర్లో కంట్రోల్ రూమ్ నంబర్లు 1070, 112, 18004250101, 8333905022 (వాట్సప్) -
కాసులకు కక్కుర్తిపడి కడుపులోనే కరిగిస్తున్నారు!
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాసులకు కక్కుర్తిపడుతున్న కొందరు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు, వైద్య సిబ్బంది లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ కడుపులోని బిడ్డను కరిగించేస్తున్నారు. ఆడపిల్లలు వద్దనుకునే వారి బలహీనతను ఆసరాగా చేసుకొని లింగనిర్ధారణ పరీక్షల పేరుతో విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు. రెండేళ్ల కిందట హైదరాబాద్‌కు చెందిన వైద్యాధికారులు బృందాలుగా ఏర్పడి ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఆస్పత్రులు, సెంటర్లపై పోలీసులతో కలిసి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. దీంతో కొంతకాలం దందాకు అడ్డుకట్టపడింది. అనంతరం మళ్లీ ఈ దందా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో సాగుతోంది. దీనిని అరికట్టకపోతే 2031 జనాభా లెక్కల నాటికి అడపిల్లల సంఖ్య గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు గర్భస్థ లింగ నిర్ధారణ నేరం అని అన్ని స్కానింగ్ కేంద్రాల్లో, ఆస్పత్రుల్లో బోర్డు కనిపిస్తుంది. కానీ ఆయా కేంద్రాల నిర్వాహకులు, వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పవిత్రమైన వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు. వైద్యారోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణలోపంతో ఆడశిశువులు భ్రూణహత్యకు గురవుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3,50,03,674. 2011లో దేశంలోని మొత్తం జనాభాలో 2.89 శాతం. జాతీయ జనాభా కమిషన్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ గణాంకాల ప్రకారం 2021లో తెలంగాణ జనాభా 3,77,25,000 కాగా, 2031 నాటికి 3,92,07,000కు చేరుకోగలదని అంచనా. ఇవి 2021, 2031 సంవత్సరాల్లో వరుసగా దేశ జనాభాలో 2.77 శాతం, 2.66 శాతం. 2011 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో లింగ నిష్పత్తి (ప్రతి వెయ్యిమంది పురుషులకు మహిళల సంఖ్య) 988 కాగా, వివిధ జిల్లాల్లో ఇది 950 నుంచి 1046 వరకు నమోదైంది. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవు పోలీసు శాఖ సహకారంతో స్కానింగ్ సెంటర్లపై డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాం. సంబంధిత చట్టంపై ఆరోగ్య సిబ్బంది ద్వారా గర్భిణులకు అవగాహన కల్పిస్తాం. మొదట ఆడ సంతానం కలిగి ఉండి తిరిగి గర్భం దాల్చిన వారిపై ప్రత్యేక దృష్టి పెడతాం. స్వచ్ఛంద సంస్థలు ఐసీడీఎస్, మెప్మాతో కలిసి స్కానింగ్ కేంద్రాలపై నిఘా పెంచుతాం. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే 104 లేదా 1098 లేదా డయల్ 100కు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం. –డాక్టర్ సాంబశివరావు,డీఎంహెచ్ఓ, హనుమకొండ బేటీ బచావో బేటీ పఢావోతో అవగాహన బాలురకు దీటుగా బాలికల సంఖ్యను పెంచేందుకు బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. అవకతవకలకు పాల్పడే స్కానింగ్ సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటున్నాం. –సంతోష్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి -
Andhra Pradesh: ఇదిగో మార్పు..
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో తొలిసారిగా విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టపీట వేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు అవసరమైన కనీస సామాజిక మౌలిక వసతులను ప్రభుత్వ రంగంలో కల్పిస్తోంది. ఇందుకు ఏకంగా రూ.55,597 కోట్లు వ్యయం చేస్తోంది. తద్వారా గ్రామీణ ముఖ చిత్రంలో సమూల మార్పులు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఒక పక్క దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని గత చంద్రబాబు సర్కారు విద్య, వైద్య, వ్యవసాయ రంగాలను నిర్లక్ష్యం చేయడమే కాకుండా, ఆ రంగాల్లో ప్రైవేట్‌ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం కనీస సామాజిక బాధ్యతగా ఆయా రంగాల్లో ప్రజలకు, రైతులకు అవసరమైన సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఒక పక్క సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ప్రజలకు అవసరమైన విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున వ్యయం చేస్తోంది. ప్రతి గ్రామంలోనూ ఇప్పుడు సచివాలయం కనిపిస్తోంది. అక్కడి నుంచి నాలుగు అడుగులు వేస్తే వైఎస్సార్ హెల్త్ క్లినిక్.. ఇంకో నాలుగు అడుగులు వేస్తే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రం కనిపిస్తోంది. మరో నాలుగు అడుగులు వేస్తే డిజిటల్ లైబ్రరీ.. ఇంకో నాలుగు అడుగులు వేస్తే సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దిన ఇంగ్లిష్ మీడియం స్కూల్ సాక్షాత్కారిస్తోంది. ఇప్పుడు ఏ గ్రామం వెళ్లినా ఈ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. విద్యా రంగంలో రూ.16,450.59 కోట్ల వ్యయం మన బడి నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా 61,661 స్కూళ్ల రూపు రేఖలు మార్చేందుకు ఏకంగా రూ.16,450.69 కోట్లు వ్యయం చేసేందుకు ప్రణాళికను రూపొందించి అమలు చేస్తోంది. ఇప్పటికే తొలి దశలో 15,713 స్కూళ్లలో రూ.3,697.86 కోట్లతో పనులు పూర్తి చేశారు. ఈ స్కూళ్లన్నీ 10 రకాల వసతులతో కార్పొరేట్ స్కూళ్లను మించి సర్వాంగ సుందరంగా దర్శనమిస్తున్నాయి. నాడు–నేడు రెండో దశలో 22,344 స్కూళ్లలో రూ.8,000 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. విద్యార్థులకు అవసరమైన అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నారు. తొలి దశలో ఆయా గ్రామాల్లో రూపు రేఖలు మారిన స్కూళ్లను చూస్తే.. గతానికి, ఇప్పటికి మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. సకల మౌలిక వసతులు సమకూర్చిన స్కూళ్లలో ఈ విద్యా సంవత్సరం నుంచి డిజిటల్ తరగతులు ప్రారంభిస్తున్నారు. దశల వారీగా గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీల నిర్మాణం చేపడుతున్నారు. తొలి దశలో రూ.575 కోట్ల వ్యయంతో 3,589 డిజిల్ లైబ్రరీల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. పట్టణాల నుంచి సొంతూరు వెళ్లినా, అక్కడి నుంచే పనిచేసేలా డిజిటల్ లైబ్రరీలను చేపడుతున్నారు. చూడ ముచ్చటగా స్కూళ్లు చంద్రబాబు హయాంలో ప్రభుత్వ స్కూళ్లలో మరుగుదొడ్లు లేక ఆడ పిల్లలు అనేక అవస్థలు పడ్డారు. రేకులు, దుప్పట్లు అడ్డుపెట్టుకునే పరిస్థితులుండేవి. శిథిలమైన బడులు ఆ బడులను కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా దీర్చిదిద్దుతున్నారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు, సురక్షిత మంచినీటి వసతి, విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, లైట్లు, గ్రీన్ చాక్ బోర్డులు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు వేర్వేరుగా ఫర్నీచర్‌తో పాటు ప్రహరీ.. తదితర మౌలిక సదుపాయాలతో ప్రభుత్వ బడులు చూడముచ్చటగా కనిపిస్తున్నాయి. తొలి దశ స్కూళ్లలో వచ్చే జూన్‌లో స్కూళ్లు తెరిచే నాటికి స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్‌తో పూర్తిగా డిజిటల్ క్లాసు రూములుగా దర్శనమివ్వనున్నాయి. నాడు–నేడు పేరుతో విద్యా సంస్థల్లో చేపట్టిన పనుల వ్యయం సామాజిక పెట్టుబడిగా.. ప్రజల ఆస్తులుగా పరిగణించాలని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ రంగంలో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల చేరికలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ చర్యలు ఫలితాలు ఇస్తున్నాయనడానికి పెరిగిన చేరికలే నిదర్శనం. ప్రభుత్వ స్కూళ్లను సీబీఎస్ఈ ఇంగ్లిష్ మీడియంతో తీర్చిదిద్దుతున్నారు. ఇవి వచ్చే తరం పిల్లల భవిష్యత్ కోసం మన ప్రభుత్వం తీసుకువస్తున్న గొప్ప మార్పుగా విద్యా వేత్తలు అభివర్ణిస్తున్నారు. ప్రజారోగ్యంలో భారీ మౌలిక సౌకర్యాలు ► నాడు–నేడు పేరుతో వైద్య రంగంలోనూ కొత్తగా ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీల ఆధునికీకరణ, విలేజ్, వార్డు క్లినిక్స్ నిర్మాణం, స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాల కోసం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.16,822 కోట్లు వ్యయం చేస్తోంది. ► దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టింది. ఇందులో ఐదు కాలేజీల నిర్మాణం 90 శాతం పైగా పూర్తయింది. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు చేపట్టనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,185 ఎంబీబీఎస్ సీట్లు (ప్రభుత్వ కళాశాలల్లో) ఉంటే కొత్తగా నిర్మిస్తున్న 17 మెడికల్ కాలేజీల ద్వారా అదనంగా 2,100 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ► ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీల ఆధునికీకరణతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో గతంలో ఏ సర్కారు కూడా ఇన్ని మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవు. 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్స్ ► గ్రామ, వార్డు స్థాయిలో క్లినిక్స్ ఏర్పాటు చేసి ప్రజల ముగింటకే ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తున్నారు. 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్స్, 528 వార్డు హెల్త్ క్లినిక్స్ నిర్మాణం ముమ్మరంగా కొనసాగుతోంది. కొత్తగా 150 పీహెచ్‌సీలతో పాటు 992 పీహెచ్‌సీలు ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి. ► గత చంద్రబాబు సర్కారు వైద్య విద్యా రంగాలల్లో ప్రైవేట్‌ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటే ఇప్పుడు జగన్ సర్కారు ప్రభుత్వ రంగంలోనే విద్య, వైద్య సదుపాయాలను కల్పిస్తూ సామాజిక బాధ్యను నెరవేరుస్తోంది. రూ.17 వేల కోట్లతో వ్యవ‘సాయం’ ► దేశంలో, రాష్ట్రంలో అత్యధిక శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గ్రామాల్లోని అత్యధిక ప్రజానీకానికి ఉపాధి కల్పిస్తున్నది ఈ రంగమే. అలాంటి రైతులకు గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా వ్యయం చేస్తోంది. విత్తనం నుంచి పంట ఉత్పత్తుల విక్రయం వరకు రైతులకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి జగన్ 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► రూ.2269.30 కోట్లతో రైతు భరోసా కేంద్రాలకు శాశ్వత భవన నిర్మాణాలు చేపట్టారు. ఇందులో ఇప్పటికే 4095 పూర్తయ్యాయి. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి అన్ని మౌలిక వసతుల కల్పనకు ఏకంగా రూ.17 వేల కోట్ల వ్యయంతో ప్రాజెక్టులను చేపడుతున్నారు. మొత్తం 30 రకాల పనులు చేపడుతున్నారు. ► సుమారు 4,200 ప్రాంతాల్లో గోదాములు, కోల్డ్ రూమ్‌లు, డ్రైయింగ్ ఫ్లాట్‌ఫాంల నిర్మాణం చేపడుతున్నారు. డ్రై స్టోరేజీ– డ్రైయింగ్ ఫ్లాట్ ఫామ్స్, గోడౌన్లు, హార్టికల్చర్‌లో మౌలిక సదుపాయాలు, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, అసేయింగ్ ఎక్విప్మెంట్, ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, ఈ– మార్కెటింగ్, మెగా కస్టం హైరింగ్ హబ్స్, ఆర్బీకేల స్థాయిలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు, వరి పండిస్తున్న జిల్లాల్లో కంబైన్డ్ హార్వెస్టర్లు, ఏంఎసీలు–బీఎంసీలు, ఆక్వా ఇన్ఫ్రా, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లు, ఫుడ్ ప్రాససింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ► పాడి రైతుల కోసం ఇప్పటికే తొలి దశలో రూ.399.01 కోట్లతో 2,535 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల నిర్మాణాన్ని చేపట్టారు. అమూల్‌తో ఒప్పందం ద్వారా పాడి రైతులు పోసే పాల ధరను ఎప్పటికప్పుడు పెంచుతున్నారు. తద్వారా ప్రైవేట్ డెయిరీలు కూడా పెంచాల్సిన పరిస్ధితిని తీసుకువచ్చారు. వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున మౌలిక వసతులకు ఇంత వ్యయం చేయడం దేశ చరిత్రలోనే తొలిసారి. సచివాలయాలు సామాజిక ఆస్తి ► గ్రామాల్లోని ప్రజలకు ప్రభుత్వ సేవలన్నీ ఒకే చోట అందించేందుకు రూ.4,750 కోట్ల వ్యయంతో 10,893 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో ఇప్పటికే 5,926 భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇవన్నీ కూడా ఆయా గ్రామాల ప్రజల సామాజిక ఆస్తిగా నిలిచిపోనున్నాయి. ► రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటయ్యాయి. ఆయా గ్రామాల్లోని 1.34 లక్షల మంది యువతీ యువకులు శాశ్వత ఉద్యోగులుగా కనిపిస్తున్నారు. ప్రతి సచివాలయంలోనూ గ్రామ స్థాయిలోనే దాదాపు 600 పౌర సేవలు ఎటువంటి లంచాలు, వివక్షకు తావులేకుండా అందుతున్నాయి. అభివృద్ధి వ్యయం రయ్.. రయ్.. రాష్ట్రంలో అభివృద్ధి వ్యయం గత మూడేళ్లుగా ఏటేటా పెరుగుతోంది. ఇదే సమయంలో అభివృద్ధియేతర వ్యయం ఏటేటా తగ్గుతోంది. సామాజిక, కమ్యూనిటీ సేవలు, ఆర్థిక సేవల వ్యయం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతోంది. సామాజిక, ఆర్థిక అభివృద్ధికి నేరుగా సంబంధించిన కార్యకలాపాలపై చేసే వ్యయమే అభివృద్ధి వ్యయం. ఉదాహరణకు వ్యవసాయం, ఆరోగ్యం, విద్యపై చేసే ఖర్చు అభివృద్ధి వ్యయమే. రాష్ట్రంలో మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి సామాజిక రంగ వ్యయం పెరుగుతోంది. సామాజిక సేవలు, గ్రామీణాభివృద్ధి, ఆహార నిల్వల గిడ్డంగులు సామాజిక రంగ సేవల కిందకు వస్తాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో వైద్యం, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం, నీటి సరఫరా, పారిశుధ్య రంగాల వ్యయం పెరుగుతోంది. – 2020–21 ఆర్థిక ఏడాది నుంచి 2022–23 ఆర్థిక ఏడాది వరకు ఆర్థిక సూచికలపై ఆర్బీఐ అధ్యయన నివేదిక -
వైద్యం.. కొత్త ముఖచిత్రం... నాలుగేళ్లలో విప్లవాత్మక సంస్కరణలు
మన బంధువులు, మిత్రులు, తెలిసిన వారెవరైనా మనకు తారసపడినప్పుడో లేక ఫోన్ చేసినప్పుడో వినిపించే తొలి పదం ‘బాగున్నారా..’ అని. ఆ తర్వాతే మిగతా విషయాలు. అంటే ఆరోగ్యంగా ఉండాలన్నదే అందరి ఆకాంక్ష. అప్పుడే అన్ని పనులను సవ్యంగా చేసుకోగలమని.. దేన్నయినా సాధించుకోగలమనే నమ్మకం ఉంటుంది. దైనందిన జీవితంలో ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకెన్నడూ లేని విధంగా, దేశంలోనే అన్ని రాష్ట్రాలకంటే గొప్పగా వైద్య, ఆరోగ్య రంగంపై శ్రద్ధ చూపుతోంది. అవసరమైన మేరకు వైద్యులు, సిబ్బంది, కొత్త వైద్య.. నర్సింగ్ కళాశాలల ఏర్పాటు, నాడు–నేడు కింద మౌలిక వసతుల కల్పన, కార్పొరేట్‌కు దీటుగా సౌకర్యాలు కల్పిస్తోంది. మన ఇంట్లో వారికే బాగోలేకపోతే ఎలాంటి వైద్యం కోరుకుంటామో అచ్చంగా అలాంటి వైద్యాన్నే ప్రజల ముంగిటకు తీసుకొచ్చింది. ఇతర రాష్ట్రాలన్నీ శభాష్.. అనేలా విప్లవాత్మక సంస్కరణలతో ఈ రంగం ముఖ చిత్రాన్నే మార్చివేసింది. అనంతపురం జిల్లా మండల కేంద్రమైన కంబదూరుకు చెందిన నాగమణెమ్మ ఎనిమిదేళ్ల క్రితం నరాల బలహీనత వ్యాధికి గురై మంచానికే పరిమితమైంది. భర్త గంగన్న, కొడుకు, కూతురు ఆమె బాగోగులు చూస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో భాగంగా ప్రస్తుతం నాగమణెమ్మ ఇంటి వద్దకు నెలలో రెండు సార్లు పీహెచ్సీ వైద్యుడు వస్తున్నాడు. ఆమెకు బీపీ చూసి, ఆరోగ్యంపై వాకబు చేస్తున్నాడు. ఒకప్పుడు ఆసుపత్రికి పోవాలంటే ఆటో బాడుగకు తీసుకుని, ఇంట్లో వాళ్లు కష్టపడి తీసుకెళ్లేవాళ్లు. ప్రస్తుతం కుటుంబ సభ్యులకు వ్యయ ప్రయాసలు తగ్గాయి. గతంలో వీలును బట్టి ఏదో ఒక ఆస్పత్రికి తీసుకెళ్లేవాళ్లు. ఒక్కోసారి ఒక్కో వైద్యుడి వద్దకు వెళ్లడంతో ఆమె ఆరోగ్య చరిత్రపై వారికి అవగాహన లేక మందులు, వైద్యం విషయంలో కొంత గందరగోళం ఉండేది. ఇప్పుడు ఒకే వైద్యుడు క్రమం తప్పకుండా నాగమణెమ్మకు వైద్యం అందిస్తుండటంతో ఆ ఇబ్బందులేవీ లేవు. ప్రస్తుతం ఇలా ఊరూరా వైద్య సేవలందించేలా ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కల్పించడానికి దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం వైఎస్ జగన్ ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. సాక్షి, అమరావతి : ప్రస్తుతం చిన్న చిన్న జబ్బులకు పీహెచ్సీ, సీహెచ్‌సీ, పెద్దాస్పత్రులు, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా.. గ్రామాల్లోనే వైద్య సేవలు అందుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఇద్దరు వైద్యులు రోజు మార్చి రోజు తమకు కేటాయించిన విలేజ్ క్లినిక్స్‌కు 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)తో పాటు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపీ సేవలు చూశాక, మధ్యాహ్నం నుంచి మంచానికి పరిమితం అయిన వృద్ధులు, వికలాంగులు, ఆరోగ్యశ్రీ రోగుల గృహాలను సందర్శించి వారికి ఇంటి వద్దే వైద్యం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి చిన్నారులు, విద్యార్థుల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. ఈ విధానంలో రాష్ట్రంలోని 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను నెలలో రెండు సార్లు పీహెచ్సీ వైద్యులు సందర్శిస్తున్నారు. ప్రతి విలేజ్ క్లినిక్‌లో 105 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయి. టెలిమెడిసన్ కన్సల్టేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటోంది. ఏ రోగికైనా మెరుగైన వైద్యం అవసరం అని భావిస్తే.. ఇక్కడి నుంచే పెద్దాస్పత్రులకు రెఫర్ చేస్తారు. ఆ రోగిని దగ్గరలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రికి తరలించడం, అక్కడ అతనికి వైద్యం అందేలా చూడటం వంటి కార్యకలాపాలను సీహెచ్‌వో, ఏఎన్ఎం చూస్తారు. వీరు విలేజ్ ఆరోగ్య మిత్రగా వ్యవహరిస్తారు. 1.17 కోట్ల వైద్య సేవలు ఫ్యామిలీ డాక్టర్ విధానం ట్రయల్ రన్‌ను గత ఏడాదిలో ప్రారంభించి.. ఈ ఏడాది ఏప్రిల్ ఆరో తేదీన పూర్తి స్థాయిలో అమలులోకి తెచ్చారు. 10,032 విలేజ్ క్లినిక్‌లను వైద్యులు 1.14 లక్షల సార్లు సందర్శించారు. ఈ క్రమంలో 1,17,08,895 వైద్య సేవలు అందించారు. నాడు–నేడుతో మహర్దశ ఇది 2019కు ముందు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు పీహెచ్సీ. నెర్రెలు చీలిన ప్రహరీ.. పిచ్చి మొక్కలు, గడ్డితో కూడిన ఆవరణ.. అపరిశుభ్ర వాతావరణం, కుర్చీలు, తాగునీరు, మరుగుదొడ్లు లేని దుస్థితి. ఇక్కడికి రావాలంటేనే రోగులు వణికిపోయేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ఆస్పత్రిలో నాడు–నేడు కింద పనులు చేపట్టింది. కుర్చీలు, ఓపీ గదులు, 10 పడకలతో ఇన్ పేషెంట్ వార్డు, కాన్పుల గది ఇలా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. చూపించుకోవడానికి జనం క్యూ కడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2,500 మంది జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేసి, వాటికి శాశ్వత భవనాలు సమకూర్చే దిశగా అడుగులు వేశారు. 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటికే సొంత భవనాలు ఉన్న వాటికి మరమ్మతులు చేయడంతో పాటు, పాత భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మిస్తుండగా 882 చోట్ల పనులు పూర్తయి అధునాతనంగా ఆస్పత్రులు తయారయ్యాయి. 121 సీహెచ్‌సీలు, 42 ఏరియా ఆస్పత్రులు, రెండు ఎంసీహెచ్ ఆస్పత్రులను అభివృద్ధి చేశారు. రూ.50 కోట్లతో ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం రీసెర్చ్ సెంటర్ నిర్మాణం పూర్తయింది. ఇక్కడ వైద్యులు, సిబ్బందిని నియమించారు. ప్రభుత్వ కృషి ఫలితంగా 443 ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్(ఎన్‌క్వాష్) గుర్తింపుతో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. గుజరాత్, కేరళ, హరియాణా, తెలంగాణలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నాణ్యమైన ప్రసూతి సేవలకు గాను ఇచ్చే ‘లక్ష్య’ గుర్తింపులో దేశంలోనే రెండో స్థానంలో ఏపీ ఉంది. వైద్య విద్యలో నవశకం రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి ఐదు కళాశాలల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు చేపట్టాలని లక్ష్యం నిర్దేశించుకోగా, ఇప్పటికే నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం కళాశాలలకు అనుమతులు వచ్చాయి. రాజమండ్రి వైద్య కళాశాలకు త్వరలో అనుమతి రానుంది. ఫలితంగా ఒక్కో చోట 150 సీట్లు చొప్పున 750 సీట్లు పెరగనున్నాయి. 2024–25లో పులివెందుల, పాడేరు, ఆదోని కళాశాలలు.. ఆ తర్వాతి ఏడాది మిగిలిన తొమ్మిది కళాశాలలను ప్రారంభించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. మరోవైపు ఇప్పటికే ఉన్న కళాశాలలు, ఆస్పత్రులను రూ.3,820 కోట్లతో బలోపేతం చేస్తోంది. వీటన్నింటి ఫలితంగా 627 పీజీ సీట్లు పెరిగాయి. తద్వారా భవిష్యత్‌లో స్పెషలిస్ట్ వైద్యుల కొరతకు తావుండదు. ప్రజలకు ఆరోగ్యశ్రీ రక్ష సీఎం జగన్.. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేశారు. రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ పథకం పరిధిలోకి తేవడం ద్వారా 1.4 కోట్లకు పైగా కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తోంది. 2014–19 మధ్య ఆరోగ్యశ్రీ పథకంలో కేవలం 1059 ప్రొసీజర్స్ మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య ఏకంగా 3,255కు పెంచారు. పేద, మధ్యతరగతి ప్రజలు శస్త్ర చికిత్సల అనంతరం విశ్రాంత సమయంలో ఇబ్బందులు లేకుండా ఆరోగ్య ఆసరా పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. దీని కింద 1519 రకాల ప్రొసీజర్లలో చికిత్స అనంతరం వైద్యుడు సూచించిన విశ్రాంతి సమయానికి రోజు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.ఐదు వేల వరకు ప్రభుత్వం సాయం అందిస్తోంది. గత నాలుగేళ్లలో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పథకాల కోసం ప్రభుత్వం రూ.8,302.47 కోట్లు ఖర్చు చేసింది. ఆరోగ్యశ్రీ ద్వారా 36,19,741 మంది, ఆసరా ద్వారా 16,20,584 మంది లబ్ధి పొందారు. ఇంకా ఎన్నెన్నో సేవలు ► 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ), 108 అంబులెన్స్ సేవలను ప్రభుత్వం బలోపేతం చేసింది. ప్రతి మండలానికి ఒక్కొక్కటి చొప్పున 104, 108 వాహనాలను సమకూర్చారు. 768 అంబులెన్స్‌లతో 2020లో సేవలను విస్తరించారు. తాజాగా మరో 146 అంబులెన్స్‌లను కొనుగోలు చేస్తున్నారు. రోజుకు సగటున 3300 మంది అంబులెన్స్ సేవలను ప్రస్తుతం వినియోగించుకుంటున్నారు. 104 ఎంఎంయూలను ప్రారంభంలో మండలానికి ఒకటి చొప్పున 676 వాహనాలను సమకూర్చింది. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ప్రతి సచివాలయాన్ని రెండు సార్లు నెలలో 104 ఎంఎంయూలు సందర్శించేలా మరో 256 వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ► గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 500 కొత్త వాహనాలతో ‘డాక్టర్ వైఎస్సార్ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవలను విస్తరించారు. రోజుకు సగటున 631 మంది బాలింతలను క్షేమంగా ఇళ్లకు చేరుస్తున్నారు. ► డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులను ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతున్నారు. ఇలా విలేజ్ క్లినిక్స్‌లో 105, పీహెచ్‌సీల్లో 172, సీహెచ్‌సీ ఏరియా ఆస్పత్రుల్లో 330 రకాల మందులను సమకూరుస్తున్నారు. బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులను సరఫరా చేస్తున్నారు. మరోవైపు రోగులకు పెట్టే ఆహారం విషయంలోను నాణ్యత ఉండేలా చర్యలు తీసుకున్నారు. ► వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు, ఆరోగ్య కార్యక్రమాల అమలులో ఏపీ దేశంలోనే అగ్రగామిగా ఉంది. నీతి ఆయోగ్ వంటి సంస్థలు ప్రశంసించాయి. దేశంలో మధ్య తరగతి వర్గాలకు ఆరోగ్యబీమా కల్పిస్తున్న రాష్ట్రం ఏపీ అని ‘హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ఇండియాస్ మిస్సింగ్ మిడిల్ క్లాస్’ పేరుతో రూపొందించిన నివేదికలో నీతి ఆయోగ్ తెలిపింది. ► క్షయ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్న టాప్–3 రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ► దేశంలో వంద శాతం పీహెచ్‌సీలను 24/7 నడుపుతున్న రాష్ట్రం ఏపీ అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పలు నివేదికల్లో స్పష్టం చేసింది. ► హెపటైటిస్ నియంత్రణలో ఏపీ చర్యలు భేష్‌గా ఉంటున్నాయని కేంద్ర వైద్య శాఖ ప్రశంసిచింది. హైరిస్క్ వర్గాలకు ముందస్తుగా టీకా పంపిణీ చేపడుతున్న రాష్ట్రంగా కూడా రికార్డు సాధించింది. కొరతకు తావు లేకుండా.. రాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా 2019 నుంచి ఇప్పటికి ఏకంగా 48,639 పోస్టులు భర్తీ చేశారు. ఇక్కడితో ఆగకుండా ఖాళీ అయ్యే పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేసుకునేలా ప్రభుత్వం అత్యవసర అనుమతులు ఇచ్చింది. దేశంలో స్పెషాలిటీ వైద్యులు కొరత ప్రభుత్వ ఆస్పత్రుల్లో 61 శాతం మేర ఉండగా, ఏపీలో కేవలం 5 శాతం మేర ఉంటోంది. గైనకాలజిస్టుల సంఖ్య జాతీయ స్థాయిలో కొరత 50 శాతం ఉంటే, ఏపీలో 1.4 శాతం మాత్రమే ఉంది. స్టాప్నర్స్ల కొరత 27 శాతం ఉంటే.. రాష్ట్రంలో కొరతకే ఆస్కారం లేదు. ఫలితంగా డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలకు మించి వైద్యులు, సిబ్బంది ఉన్నారు. కాగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 4,469 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. సగటున రోజుకు 1,360 సర్జరీలు బోధనాస్పత్రుల్లో 2018–19లో సగటున రోజుకు 817 మైనర్, మేజర్ ఆపరేషన్లు నిర్వహించే వారు. 2022–23లో రోజుకు 1360 ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. అప్పట్లో రోజుకు 19 వేల చొప్పున ఓపీలు, 1900 మేర ఐపీలు ఉండగా, గత ఏడాది 22 వేలకు పైగా ఓపీల చొప్పున 83.16 లక్షలు, ఐపీలు రోజుకు 2,253 చొప్పున 8.22 లక్షలు నమోదు అయ్యాయి. నాటికి, నేటికి ఎంత తేడా! కర్నూలు జీజీహెచ్‌లోని కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగంలో 2019కి ముందు ఒక డాక్టర్, ఆరుగురు నర్సులు, ముగ్గురు టెక్నికల్ సిబ్బంది మాత్రమే ఉండేవారు. ఉన్న ఒక్క వైద్యుడు సెలవు పెడితే అంతే సంగతులు. సీటీ సర్జన్ ఆపరేషన్ చేసే సమయంలో గుండె నుంచి రక్త ప్రసరణ నిలిపివేసి, మెషిన్ ద్వారా ఇతర శరీర భాగాలకు రక్తం సహా ఆక్సిజన్‌ను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ కీలకమైన మిషన్‌ను పర్ఫ్యూజనిస్ట్లు ఆపరేట్ చేస్తుంటారు. ఇంతటి కీలకమైన పోస్టు అప్పట్లో ఖాళీగా ఉండేది. దీంతో హైదరాబాద్ నుంచి కేసుల ప్రాతిపదికన పర్ఫ్యూజనిస్ట్ను పిలిపించుకుని సర్జరీలు చేసేవారు. అత్యవసర సమయాల్లో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లిపోయేవారు. దీంతో 2017–18లో ఈ విభాగంలో 120 సర్జరీలు మాత్రమే చేశారు. ఓపీలు నెలకు 80లోపే చూసేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ విభాగంలో అదనంగా ముగ్గురు వైద్యులు, నలుగురు నర్సులు, ముగ్గురు టెక్నీషియన్లు రావడంతో పాటు పర్ఫ్యూజనిస్ట్ పోస్టు భర్తీ అయింది. దీంతో 2022–23లో ఏకంగా 1600 ఓపీలు నమోదు అయ్యాయి. మేజర్, మైనర్ కలిపి 566 సర్జరీలు చేశారు. మొత్తంగా 1500 పడకలున్న ఈ ఆస్పత్రిలో 2018–19లో 9.46 లక్షల ఓపీలు, 80 వేల ఐపీ, 29 వేల మైనర్, మేజర్ సర్జరీలు నమోదయ్యాయి. 2022–23లో 12 లక్షల మేర ఓపీ, లక్షకుపైగా ఐపీ సేవలు అందించడంతో పాటు, 41 వేల సర్జరీలు నిర్వహించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పెద్దాస్పత్రుల్లో పరిస్థితి మెరుగైంది. అనుబంధం ఏర్పడుతుంది గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సంరక్షణ చర్యలపై సరైన అవగాహన లేదు. ఈ క్రమంలో ఎంబీబీఎస్ వైద్యుడే నేరుగా గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకం అవ్వడం మంచి పరిణామం. గర్భిణి, బాలింత.. బీపీ, మధుమేహం వ్యాధిగ్రస్తులను రెండు, మూడు సార్లు చూస్తే వైద్యుడు వారిని పేరు పెట్టి పిలిచే పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో ఆ వైద్యుడికి ప్రజలకు మధ్య అనుబంధం ఏర్పడుతుంది. ఇది రోగికి మానసికంగా బలాన్ని ఇస్తుంది. ఈ మానసిక బలం రోగి త్వరగా కోలుకోవడానికి ఎంతో ఉపయోగకరం. – డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూల్ జీజీహెచ్ ప్రజారోగ్య రక్షణలో మంచి ఫలితాలు బీపీని నియంత్రణలో ఉంచుకోకపోవడంతో ప్రస్తుతం 20 శాతం పెరాలసిస్ కేసులు వస్తున్నాయి. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు అనేక రకాల జబ్బుల బారిన పడుతున్నారు. మన దగ్గర 60 శాతం గ్రామీణ జనాభా ఉంది. గ్రామాల్లో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెరుగుతున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యల కోసం 10–20 కి.మీ ప్రయాణించి చూపించుకోవడం వారికి అయ్యే పని కాదు. ఈ నేపథ్యంలో వైద్యుడే ఆయా గ్రామాలకు వెళ్లడం ప్రజారోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. భవిష్యత్‌లో గుండెపోటు, కిడ్నీ, మెదడు జబ్బుల బారినపడే వారి సంఖ్య క్రమంగా తగ్గుతుంది. – డాక్టర్ బాబ్జీ, వైస్ చాన్స్‌లర్, వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం -
‘ప్రతీ రోగి చిరునవ్వుతో ఇంటికెళ్లాలి.. ఆస్పత్రుల్లో మార్పు తేవాలి’
సాక్షి, అమరావతి: వైద్య ఆరోగ్య రంగం పరంగా రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధులకనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు, సౌకర్యాలు మెరుగు పడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశిస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల తీరులో గణనీయమైన మార్పులొచ్చాయనే విషయాన్ని నిరూపించేలా ఉండాలని మంత్రి వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం మంత్రి మంగళగిరి ఎపిఐఐసి టవర్స్ లోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రిలోకి అడుగుపెట్టగానే రోగికి తాను పొందబోయే సౌకర్యాల గురించిన నాలుగైదు ప్రాధాన్యాంశాల పోస్టర్లను ప్రతి ఆస్పత్రిలో ప్రదర్శించేలా చూడాలని మంత్రి సూచించారు. ఇంతకుముందెన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య ఆరోగ్య రంగానికి ఇస్తున్న ప్రాధాన్యం, కేటాయిస్తున్న నిధులు, సిబ్బంది నియామకం...వంటి వాటి విషయంలో ఒక చరిత్ర సృష్టించారని..ఇది అందరూ గుర్తెరిగేలా ఈ పోస్టర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని మంత్రి రజిని తెలిపారు. రోగి చిరునవ్వుతో ఇంటికి వెళ్లాలి రోగి ఆస్పత్రికి వచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్లేవరకూ పూర్తి ఆరోగ్యంతో, సంతోషంతో, తాను మంచి సేవలు పొందానన్న సంతృప్తితో వెళ్లేలా చూడాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖపై ఉందని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం విషయంలో చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరముందని మంత్రి రజిని ఆదేశించారు. పారిశుద్ధ్యం, పరిపాలన, ఆస్పత్రుల నిర్వహణ, రోగులకు బలవర్థకమైన ఆహారం పంపిణీ ...ఇవన్నీ సరిగా అమలవుతున్నదీ, లేనిదీ అధికారులు తరచూ చూడాలని మంత్రి ఆదేశించారు. తనిఖీల సంఖ్య పెంచాలని, తనిఖీల సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏ మాత్రం అక్రమాలు, అవకతవకలు జరిగినట్లు పసిగట్టినా సంబంధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి ఆస్పత్రిలో మాతాశిశు సంరక్షణ వార్డుల వద్ద బాలింతలకు ప్రత్యేకించే విధంగా పింక్ కలర్ కర్టెన్లు ఏర్పాటు చేసి, పాలిచ్చే తల్లులకు తగినంత మరుగు ఉండేలా చూడాలని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం పెద్ద మొత్తం కూడా వెచ్చించాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు. విశాఖ కేజీహెచ్ ఈ నాలుగేళ్లలో ఎంతో అద్భుతంగా మారిందని, ఇలాంటి సౌకర్యాలు ఇప్పటికే అక్కడ ఏర్పడ్డాయని మంత్రి ఈ సందర్భంగా ఉదహరించారు. ముఖ్యంగా మహిళా వార్డుల వద్ద క్లోజ్డ్ డస్ట్బిన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. తనిఖీలతో ఆస్పత్రుల పనితీరు మారాలి ఆస్పత్రుల పనితీరుపై కేటాయించే మార్కుల విషయంలో పారదర్శకత ఉండాలని , పనితీరు అన్నివిధాలా బాగున్నప్పుడే మార్కులు ఇవ్వాలని మంత్రి రజిని అధికారులకు సూచించారు. తరచూ తనిఖీల ద్వారా ఆస్పత్రుల పనితీరును మెరుగుపరచాలని మంత్రి ఆదేశించారు. ఇన్సినిరేటర్స్ ఏర్పాటుకు ఆదేశాలు ప్రభుత్వ నిధులతో పాటు అవసరమైతే దాతల నుంచి సహకారాన్ని తీసుకుని, 16 టీచింగ్ ఆస్పత్రుల వద్ద ఇన్సినిరేటర్స్ ఏర్పాటు చేసి, వ్యర్థాల ప్రక్షాళన చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆస్పతుల్లో సిబ్బంది నుంచి ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ తీసుకోవాలని, తదనుగుణంగా జీతానికి దీన్ని లింక్ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. డైట్‌ను తనిఖీ చేయాలి రోగులకు బలవర్ధక ఆహారాన్ని అందించాలన్న లక్ష్యంతో గతంలో రూ.40గా ఉన్న డైట్ ఛార్జీలు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రూ.80కు పెంచిన నేపథ్యంలో మెనూ చార్టులో నిర్దేశించిన మేరకు మూడుపూటలా నాణ్యమైన ఆహారం ఇస్తున్నదీ, లేనిదీ తనిఖీ చేయాలని మంత్రి ఆదేశించారు. గిరిజన ప్రాంతాలకు మహాప్రస్థానం వాహనాలను పెంచాలి మహాప్రస్థానం వాహనాల గురించి మంత్రి రజిని మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి సరిహద్దులు కలిగిన విశాఖపట్నం, విజయన గరాల ఆస్పత్రులకు మహాప్రస్థానం వాహనాలను పెంచాలని, ఈ ప్రాంతాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి రజిని ఆదేశించారు. అలాగే పెద్ద జిల్లా అయిన గుంటూరు, యాత్రికులు ఎక్కువగా సందర్శించే తిరుపతిలలో కూడా మహాప్రస్థానం వాహనాల సంఖ్య పెంచాల్సిన అవసరముందని మంత్రి సూచించారు. సిటి, ఎమ్మారై సేవలపై అధ్యయనం రాష్ట్ర వ్యాప్తంగా సీటీ, ఎమ్మారై యంత్రాలు ఎలా పనిచేస్తున్నాయో పరిశీలించాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో వైద్య విద్యా శాఖ డైరెక్టర్ డాక్టర్ నరసింహం, డిప్యూటీ డైరెక్టర్ కర్రి అప్పారావు తదితర అధికారులు పాల్గొన్నారు. -
‘Andhra Pradesh: ఉన్నత’ వైద్యం
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ కనీవినీ ఎరుగని రీతిలో 48 వేలకుపైగా వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయడంతోపాటు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో గ్రామాల్లోనే వైద్య సేవలందిస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మానవ వనరుల కొరత అనే ప్రశ్నే ఉత్పన్నం కాకుండా ఎప్పటికప్పుడు వివరాలను సేకరించడంపై దృష్టి సారించింది. ప్రభుత్వాస్పత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరతకు తావులేకుండా ఒక్కో ఆస్పత్రిని యూనిట్‌గా తీసుకుని క్రమం తప్పకుండా ఆడిట్ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గ్రామాల్లోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్ నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని స్థాయిల్లో మానవ వనరులపై ఆడిట్ చేపట్టాలని స్పష్టం చేశారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాల పురోగతి, కరోనా తాజా పరిస్థితులను పరిశీలించి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. వైద్య, ఆరోగ్య శాఖపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సిబ్బందిపై ప్రతి సమీక్షలోనూ వివరాలివ్వాలి.. ప్రభుత్వాస్పత్రులను నాడు – నేడు ద్వారా తీర్చిదిద్దడం ద్వారా ప్రజల్లో భరోసా ఏర్పడింది. రోగుల తాకిడికి సరిపడా నియామకాలను చేపడితే సగం సమస్యలకు తెర పడుతుంది. మానవ వనరులపై ఆడిట్ నిర్వహించిన అనంతరం గుర్తించిన ఖాళీలను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వెంటనే భర్తీ చేయాలి. అవసరం మేరకు డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. దీంతోపాటు మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తూ ఎప్పటికప్పుడు మందులు సరిపడా స్టాక్ ఉండేలా చర్యలు చేపట్టాలి. సిబ్బంది ఎంతమంది ఉన్నారు? ఎన్ని ఖాళీలు ఉన్నాయి? అనే అంశాలపై ప్రతి సమీక్షలోనూ నాకు వివరాలు అందచేయాలి. పకడ్బందీగా ‘ఫ్యామిలీ డాక్టర్’ సేవలు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ (ఎఫ్పీసీ) అత్యంత పకడ్బందీగా అమలు కావాలి. నిర్దేశించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) మేరకు వైద్యులు గ్రామానికి వెళ్లి సేవలు అందించాలి. జీవనశైలి జబ్బుల బాధితులను గుర్తించి వారి ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఫ్యామిలీ డాక్టర్ ఫలానా గ్రామానికి ఫలానా రోజు వస్తారనే వివరాలను ముందుగానే వెల్లడించాలి. ఆయా తేదీల్లో గ్రామానికి డాక్టర్ వస్తున్నట్లు ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రజలందరికీ తెలియచేయాలి. దీనివల్ల డాక్టర్ వద్దకు వచ్చి వైద్య సేవలు పొందగలుగుతారు. ఎఫ్పీసీని మెరుగ్గా ముందుకు తీసుకెళ్లేలా జిల్లాల్లో సమర్థులైన అధికారుల సేవలను వినియోగించుకోవాలి. రక్తహీనత నివారణ.. నేత్ర పరీక్షలు గర్భిణులు, చిన్నారులకు మంచి పౌష్టికాహారం అందించడం ద్వారా రక్తహీనత సమస్యను ఎదుర్కోవాలి. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ ద్వారా ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలి. రక్త హీనతతో బాధపడే గర్భిణులను గుర్తించి తప్పనిసరిగా పౌష్టికాహారం అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. విలేజ్ క్లినిక్స్ స్థాయిలోనే క్రమం తప్పకుండా కంటి పరీక్షలు కూడా నిర్వహించాలి. ఈమేరకు కంటి డాక్టర్లకు షెడ్యూల్ రూపొందించి నెల, రెండు నెలలకు ఒకసారి నేత్ర పరీక్షలు చేయాలి. దృష్టి సంబంధిత సమస్యలున్న వారికి కంటి అద్దాలు ఇవ్వాలి. ఎమర్జెన్సీ సీపీఆర్‌పై శిక్షణ విలేజ్ క్లినిక్‌లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను (సీహెచ్‌వో) విధి నిర్వహణలో సుశిక్షితులుగా తయారు చేయాలి. ఇందుకోసం ప్రత్యేక కరిక్యులమ్‌ను సిద్ధం చేయాలి. సీహెచ్‌వోలకు సరఫరా చేసే వైద్య పరికరాల వినియోగంపై బోధనాసుపత్రుల్లో శిక్షణ ఇవ్వాలి. వాటిని సక్రమంగా వినియోగిస్తున్నారో లేదో సమీక్షించాలి. దంత సంరక్షణ, ఈఎన్టీ, వృద్ధాప్య సమస్యలతోపాటు సీపీఆర్ లాంటి అత్యవసర పరిస్థితుల్లో ఎలా వైద్య సేవలు అందించాలో శిక్షణ ఇప్పించాలి. వీటితోపాటు గ్రామాల్లో పాము కాట్లకు సంబంధించి వెంటనే చికిత్స అందించేలా శిక్షణ ఉండాలి. 5 కొత్త మెడికల్ కాలేజీలు ఈ ఏడాదే రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుపై సీఎం జగన్ తాజాగా సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,185 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో ఏకంగా మరో 2,100 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నట్లు అధికారులు వివరించారు. 2023–24 విద్యాసంవత్సరంలో విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలోని కొత్త మెడికల్ కళాశాలల్లో తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. తద్వారా 750 సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. 2024–25లో మరో 350 మెడికల్ సీట్లు అదనంగా రాబట్టేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. 2025–26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, బాపట్ల, మదనపల్లె, పెనుకొండ, పాలకొల్లు, మార్కాపురం, నర్సీపట్నం, అమలాపురం, పార్వతీపురంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల్లో తరగతులు మొదలయ్యేలా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. తద్వారా మరో 1,000 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. 23 రోజుల్లో 20.25 లక్షల మందికి వైద్య సేవలు ఏప్రిల్ 6వతేదీన ఫ్యామిలీ డాక్టర్ విధానం పూర్తి స్థాయిలో ప్రారంభం కాగా గత నెల 28 నాటికి గ్రామాల్లో 20,25,903 మందికి వైద్య సేవలు అందించినట్లు అధికారులు తెలిపారు. రక్తపోటుతో 4.86 లక్షల మంది, మధుమేహంతో 2.70 లక్షల మంది బాధ పడుతుండగా 4.43 లక్షల మంది ఈ రెండు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించి ఫ్యామిలీ డాక్టర్ ద్వారా వైద్యం, మందులు అందజేస్తున్నామన్నారు. నోటి క్యాన్సర్ బాధితులు 4,649 మంది, ఛాతీ క్యాన్సర్ బాధితులు 1,761 మంది, గర్భాశయ క్యాన్సర్ బాధితులు 7,042 మంది గ్రామాల్లోనే వైద్య సేవలు పొందినట్లు వెల్లడించారు. పూర్తిగా అదుపులో కోవిడ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పూర్తిగా అదుపులో ఉందని, గత వారం రోజుల్లో నమోదైన పాజిటివ్ కేసులను బట్టి దేశంలో 23వ స్థానంలో ఉందని అధికారులు తెలిపారు. 24 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా ఫీవర్ సర్వేను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ప్రతి విలేజ్ క్లినిక్‌లో 20 ర్యాపిడ్ టెస్ట్ కిట్లను అందుబాటులో ఉంచామన్నారు. 14 ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు పని చేస్తున్నాయన్నారు. విదేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్‌పోర్టుల్లో టెస్టులు చేస్తున్నామని, మందులు, మాస్క్‌లు, పీపీఈ కిట్లు, ఆక్సిజన్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని వెల్లడించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ నివాస్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో హరేందిర ప్రసాద్, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ మురళీధర్‌రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర్, డీఎంఈ డాక్టర్ నరసింహం, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ రామిరెడ్డి, నాడు–నేడు టెక్నికల్ డైరెక్టర్ మనోహరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
సాక్షి, తాడేపల్లి : వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న రిక్రూట్మెంట్ బోర్డు వెంటనే వాటికి సంబంధించిన ఖాళీలను భర్తీచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా కూడా సిబ్బంది లేరనే మాట రాకూడదని తెలిపారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. క్రమం తప్పకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆడిట్ చేయాలని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, మందులు కూడా సరిపడా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల దాదాపుగా సమస్యలు సమసిపోతాయని తెలిపారు. ప్రతి సమీక్షా సమావేశంలో కూడా సిబ్బంది ఎంతమంది ఉన్నారు? ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న దానిపై వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ తాజా పరిస్థితులపై సీఎంకు వివరాలను అందించిన అధికారులు. ►రాష్ట్రంలో కోవిడ్ పూర్తిగా అదుపులో ఉందన్న అధికారులు. ►గత వారంరోజుల్లో దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఏపీ 23 స్థానంలో ఉందన్న అధికారులు. ►ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య కేవలం 24 మంది మాత్రమేనని తెలిపిన అధికారులు. ►వీరంతా కోలుకుంటున్నారని వెల్లడి. ►సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే నిర్వహించామని, చాలా స్వల్ప సంఖ్యలో లక్షణాలు ఉన్నవారిని గుర్తించామన్న అధికారులు. ►లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నామని వెల్లడి. ►ప్రతి వైయస్సార్ క్లినిక్‌లో కూడా 20 ర్యాపిడ్ టెస్ట్ కిట్లను ఉంచామన్న అధికారులు. ►14 ఆర్టీపీసీఆర్ ల్యాబులు పనిచేస్తున్నాయని వెల్లడి. ►ఎయిర్‌పోర్టులలో విదేశాల నుంచి వచ్చేవారికి టెస్టులు చేస్తున్నామని తెలిపిన అధికారులు. ►ఆక్సిజన్ యూనిట్లు, పైపులైన్లు, మాస్క్‌లు, మందులు, పీపీఈ కిట్లు ఇవన్నీ కూడా సరిపడా ఉన్నాయని వెల్లడి. ►ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా అమలు చేయాలి: సీఎం. ►ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఏప్రిల్ 6 నుంచి 28 వరకూ 20,25,903 మందికి సేవలు. ►10,032 గ్రామాల్లో వైద్య సేవలు అందించిన ఫ్యామిలీ డాక్టర్. ►ఫ్యామిలీ డాక్టర్ వచ్చేముందు ఎప్పుడు వస్తున్నారన్న దానిపై ముందుగానే తేదీలు ఇవ్వాలి. ►ఆ తేదీలను ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంల ద్వారా గ్రామాల్లో ప్రజలకు తెలిపేలా చేయాలి. ►దీనివల్ల వారు ఫ్యామిలీ డాక్టర్ వద్దకు వచ్చి వైద్యం పొందుతారు. ►అలాగే క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయాలి. ►ఎవరికి సమస్య ఉన్నా వారికి వెంటనే పరీక్షలు చేయించాలి. ►అవసరమైన వారికి కంటి అద్దాలు ఇవ్వాలి. ►సీహెచ్సీలలో వారికిచ్చిన వైద్య పరికరాలను వినియోగిస్తున్నారా ? లేదా ? అన్నది సమీక్ష చేయాలి. ►అందుబాటులోని బోధనాసుపత్రుల్లో వారికి శిక్షణ ఇప్పించాలి. కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్సీలలో నాడు – నేడు పనులపై సీఎం సమీక్ష. ►కొత్త మెడికల్ కాలేజీల కారణంగా 2100 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయన్న అధికారులు. ►రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 2185 మెడికల్ సీట్లకు ఇవి అదనం అని తెలిపిన అధికారులు. ►ఈ విద్యాసంవత్సంలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీల్లో తరగతులు ప్రారంభిస్తున్నామన్న అధికారులు. ►తద్వారా 750 సీట్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపిన అధికారులు. ►2024 –25 విద్యా సంవత్సరంలో మరో 350 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయన్న అధికారులు. -
కిడ్నీ రాకెట్‌పై సర్కారు సీరియస్
మహారాణిపేట/సింహాచలం: విశాఖపట్నంలో కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికారులు ఈ ఉదంతంపై విచారణ వేగవంతం చేశారు. దీనిపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతోపాటు పోలీసులు కూడా సమగ్ర దర్యాప్తు చేపట్టారు. పెందుర్తిలో కిడ్నీ మార్పిడి చేసిన తిరుమల ఆస్పత్రిపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, జీవన్‌దాన్ అధికారులు, పోలీసులు దాడులు నిర్వహించారు. డబ్బు ఆశ చూపించి గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన మధురవాడ వాంబే కాలనీకి చెందిన జి.వినయ్‌కుమార్‌కు పెందుర్తి తిరుమల ఆస్పత్రిలో కిడ్నీ తీసుకున్న విషయం తెలిసిందే. ఒప్పందం ప్రకారం రూ.8.50 లక్షలు ఇవ్వకుండా కేవలం రూ.2.50 లక్షలు ఇవ్వడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రికే అనుమతి లేదు కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆదేశాల మేరకు పెందుర్తిలో కిడ్నీ మార్పిడి చేసిన తిరుమల ఆస్పత్రిపై డీఎంహెచ్‌వో పి.జగదీశ్వరరావు, జీవన్‌దాన్ కో–ఆర్డినేటర్ రాంబాబు, ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఆస్పత్రి అనుమతులు, ఇటీవల జరిగిన సర్జరీలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో ఆర్థో ఓపీలు, సర్జరీలు చేస్తున్న విషయాన్ని గుర్తించారు. ఇందులో రెండు ఆపరేషన్ థియేటర్లు కూడా ఉండటాన్ని గమనించారు. ఐదేళ్లుగా పెందుర్తిలో తిరుమల ఆస్పత్రి కార్యకలాపాలు సాగిస్తోంది. దీనికి ఎటువంటి అనుమతి లేదని అధికారుల విచారణలో నిర్ధారణ అయింది. కనీసం తాత్కాలిక ఆనుమతి కూడా లేదన్న విషయం తెలుసుకుని అధికారులు కంగుతిన్నారు. అనుమతులు లేని ఆస్పత్రిలో నిబంధనలకు విరుద్ధంగా, నేరపూరితంగా సర్జరీలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఆ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ వైద్యుడు మాత్రమే ఉండగా.. కిడ్నీ మారి్పడి ఎలా చేశారు, ఎవరు చేశారన్న విషయంపైనా ఆరా తీశారు. తమ ఆస్పత్రిలో ఎముకలకు సంబంధించిన వైద్యమే తప్ప ఎలాంటి కిడ్నీ మారి్పడి ఆపరేషన్లు జరగలేదని ఆస్పత్రి ఎండీ పరమేశ్వరరావు అధికారులకు చెప్పారు. ఆస్పత్రి సీజ్ : వైద్య సేవలు, సౌకర్యాలపై అధికారులు కలెక్టర్ మల్లికార్జునకు ప్రాథమిక నివేదికను అందజేయగా.. ఆస్పత్రిని సీజ్ చేయాలని ఆదేశించారు. దీంతో డీఎంహెచ్‌వో జగదీశ్వరరావు, పెందుర్తి తహసీల్దార్ సమక్షంలో ఆస్పత్రిని సీజ్ చేశారు. మోసం, మానవ అవయవాల మారి్పడి చట్టం 1995, ఐపీసీ 18, 19తో పాటు 420 ఆర్/డబ్ల్యూ 120(బీ) కింద కేసు నమోదు చేశారు. -
కరోనాపై అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి: సీఎం జగన్
తాడేపల్లి: వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈరోజు(సోమవారం) విద్యాశాఖపై సమీక్ష అనంతరం వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం జగన్ ప్రధానంగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి విడదల రజిని, సీఎస్ జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశంలో సీఎం జగన్ ఏమన్నారంటే.. కరోనా వ్యాపిస్తుందన్న సూచనలు నేపధ్యంలో అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశం గ్రామ స్ధాయిలోనే పరీక్షలు నిర్వహించి, అక్కడే మందులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతున్నవారికి కోవిడ్ సోకితే వారిని వెంటనే హాస్పిటల్‌కి తరలించేలా చర్యలుండాలన్న సీఎం కోవిడ్ తాజా పరిస్థితి, నివారణకు తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించిన అధికారులు పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని తెలిపిన అధికారులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అధికారులు విలేజ్ క్లినిక్స్ స్ధాయిలోనే ర్యాపిడ్ టెస్టులు చేసే వ్యవస్థ ఉందని, అక్కడ ఏమైనా తేలితే వెంటనే ఆర్టీపీసీఆర్కు పంపించే ఏర్పాటు చేశామన్న అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే చేయించామని కేవలం 25 మంది మాత్రమే కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరారని వెల్లడించిన అధికారులు ఆక్సిజన్ లైన్లు, పీఎస్ఏ ప్లాంట్లు, ఆక్సిజన్ సిలెండర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు వీటన్నింటినీ కూడా చెక్ చేసి సిద్ధంచేసుకుంటున్నామన్న అధికారులు అంతర్జాతీయ విమాన ప్రయాణికులనుంచి ర్యాపిడ్ శాంపిల్స్ తీసుకునేందుకు విమానాశ్రయాల్లో అన్నిరకాలుగా సిద్ధంచేశామన్న అధికారులు ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... ముందు జాగ్రత చర్యల్లో భాగంగా అన్నిరకాలుగా సిద్ధం కావాలన్న సీఎం. ఎప్పటికప్పుడు పరిస్థితిని చూసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. ఫ్యామిలీ డాక్టర్, విలేజీ క్లినిక్స్ వ్యవస్ధ కోవిడ్ విస్తృతిని అడ్డుకోవడానికి, మంచి వైద్యం అందించేలా చేయడానికి ఉపయోగపడుతుందన్న సీఎం గ్రామాల్లో సర్వే చేసి, లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి, వారికి వెంటనే మందులు ఇచ్చేలా చూడాలన్న సీఎం ప్రతి విలేజ్ క్లినిక్‌కూ టెస్టింగ్ కిట్స్, మందులు పంపించాలని సీఎం ఆదేశం ప్రస్తుతం ఉన్న వేరియంట్‌కు తగినట్టుగా మందులు తెప్పించుకోవాలన్న సీఎం ల్యాబులను అన్నింటినీ కూడా పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసుకోవాలన్న సీఎం జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణ పనులపైనా సీఎం జగన్ సమీక్ష మొదటి ప్రాధాన్యతలో నిర్దేశించుకున్న విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల్లో షెడ్యూలు ప్రకారం పనులు జరుగుతున్నాయని వెల్లడించిన అధికారులు. మిగిలిన కాలేజీల్లో కూడా పనులను ముందుకు తీసుకెళ్తున్నామన్న అధికారులు. పూర్తయ్యే దశలో పలాస కిడ్నీ స్పెషాల్టీ హాస్పిటల్, కర్నూలులో కేన్సర్ ఇనిస్టిట్యూట్, వైయస్సార్ కడపలో జీజీహెచ్ సూపర్ స్పెషాలిటీ, కేన్సర్ విభాగంతో సహా మూడు బ్లాకులు. కొన్నిరోజుల్లో ఇవి పూర్తిగా సిద్ధమవుతాయని తెలిపిన అధికారులు. -
రెండు ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: కామారెడ్డి, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వానికి తెలియజేసింది. మరో 7 వైద్య కళాశాలల అనుమతుల ప్రక్రియ వివిధ స్థాయిల్లో ఉంది. 2023–24 వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి ఆ రెండు కళాశాలల్లో 200 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి వచ్చినట్లయింది. మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, బోధన అధ్యాపకులను పూర్తిస్థాయిలో నియమించుకోవాలని నేషనల్ మెడికల్ కమిషన్ కోరింది. తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినట్లు ఎక్కడైనా రుజువైతే అనుమతి రద్దవుతుందని హెచ్చరించింది. కాగా ఆయా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు, వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేయడం తప్పనిసరి చేయాలని స్పష్టం చేసింది. కోర్సులు, అందుబాటులో ఉన్న అధ్యాపకులు, వారి 5 ఏళ్ల అనుభవం, విద్యార్థులు చేరిన అనుబంధ విశ్వవిద్యాలయం మొత్తం సమాచారాన్ని ప్రదర్శించడం తప్పనిసరి చేయాలని పేర్కొంది. ప్రతి స్పెషాలిటీలో అందుతున్న వైద్యసేవలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, పరికరాలను కూడా ప్రదర్శించాలని సూచించింది. రెండు వైద్య కళాశాలలకు అనుమతి రావడంపై వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. -
AP: ‘డాక్టర్’ గారు వచ్చేశారు!
సాక్షి, అమరావతి: ప్రజలు, ప్రభుత్వ వైద్యుల మధ్య అనుబంధాన్ని బలపరచడం ద్వారా మెరుగైన వైద్య సంరక్షణపై సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రామీణ ప్రజలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతిష్టాత్మక ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. గత ఏడాది అక్టోబర్ 21 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలైన ట్రయల్ రన్ విజయవంతం కావడంతో పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఫ్యామిలీ డాక్టర్ విధానం పూర్తి స్థాయిలో అమలు కార్యక్రమం గురువారం ప్రారంభం కానుంది. ఏమిటీ విధానం? ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్న కుటుంబాలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా తమ కుటుంబ వైద్యుడిని సంప్రదిస్తున్నారు. వారి ఆరోగ్యం పట్ల సంబంధిత వైద్యుడు నిరంతరం ఫాలోఅప్‌లో ఉంటారు. ఆయా కుటుంబాల్లోని వ్యక్తుల ఆరోగ్యంపై డాక్టర్‌కు సమగ్ర అవగాహన ఉంటుంది. ఒక అనుబంధం ఏర్పడి ఆ కుటుంబానికి మెరుగైన వైద్య సంరక్షణ అందుతుంది. ఇదే తరహాలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ ఉచితంగా అందించాలన్నది ఫ్యామిలీ డాక్టర్ విధానం లక్ష్యం. ఇలా నిర్వహిస్తున్నారు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది కలిపి 14 మంది ఉండేలా చర్యలు తీసుకుంది. పీహెచ్‌సీలోని ఇద్దరు వైద్యులకు ఆ పరిధిలోని గ్రామ సచివాలయాలను కేటాయించారు. వైద్యులు వాటిని నెలలో రెండు సార్లు సందర్శించాల్సి ఉంటుంది. 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)తో పాటు గ్రామానికి వెళ్లి రోజంతా అక్కడే గడిపి ప్రజలకు వైద్య సేవలు అందిస్తారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ 104 ఎంఎంయూ వద్ద ఓపీ సేవలు అందిస్తారు. మంచానికి పరిమితమైన వృద్ధులు, దివ్యాంగులు, ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన రోగుల గృహాలను మధ్యాహ్నం నుంచి సందర్శించి ఇంటి వద్దే సేవలు అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చిన్నారులు, విద్యార్థుల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. 14 రకాల పరీక్షలు.. 105 రకాల మందులు గ్రామీణ స్థాయిలో వైద్య వసతులను బలోపేతం చేస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతి 2,500 మంది జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో), ఏఎన్ఎం, నలుగురు నుంచి ఆరుగురు ఆశా వర్కర్లు వీటిల్లో ఉంటారు. ప్రతి క్లినిక్‌లో 105 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయి. టెలిమెడిసన్ కన్సల్టేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలులో విలేజ్ క్లినిక్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గ్రామాలకు వెళ్లిన వైద్యులు వీటిలో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఎవరైనా రోగికైనా మెరుగైన వైద్యం అవసరం అని భావిస్తే ఫ్యామిలీ డాక్టర్ అక్కడి నుంచే పెద్దాస్ప్రత్రులకు రిఫర్ చేస్తారు. రోగిని దగ్గరలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రికి తరలించడం, వైద్యం అందేలా చూడటం లాంటి కార్యకలాపాలను సీహెచ్‌వో, ఏఎన్ఎం పర్యవేక్షిస్తారు. వీరు విలేజ్ ఆరోగ్యమిత్రగా వ్యవహరిస్తారు. కొత్తగా 260 ఎంఎంయూ వాహనాలు పీహెచ్సీ వైద్యులు తమకు కేటాయించిన గ్రామాలకు షెడ్యూల్ ప్రకారం 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)లో వెళతారు. రాష్ట్ర ప్రభుత్వం 2020లో మండలానికి ఒక 104 ఎంఎంయూను సమకూర్చి సేవలను బలోపేతం చేసింది. అయితే ప్రతి గ్రామాన్ని నెలలో రెండు సార్లు సందర్శించాల్సి ఉన్నందున ఇప్పటికే ఉన్న 676 ఎంఎంయూ వాహనాలకు అదనంగా కొత్తగా 260 వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. నాలుగేళ్లలో 48,639 వైద్య పోస్టుల భర్తీ ఫ్యామిలీ డాక్టర్ విధానం సమర్థంగా అమలయ్యేందుకు ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులతోపాటు మండలానికి రెండు పీహెచ్‌సీలు లేదా ఒక పీహెచ్సీ, సీహెచ్‌సీ ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న 1,142 పీహెచ్‌సీలకు అదనంగా 151 పీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైనా వైద్యుడు సెలవుపై వెళితే ఫ్యామిలీ డాక్టర్ సేవలకు అంతరాయం కలగకుండా అదనపు డాక్టర్లను అందుబాటులో ఉంచారు. ఏడు పీహెచ్‌సీలకు ఒకరు, జిల్లాకు నలుగురు చొప్పున 285 మంది అదనపు వైద్యులను సమకూర్చారు. ఇలా ఫ్యామిలీ డాక్టర్ పథకం కోసం కొత్తగా వైద్య పోస్టులు సృష్టించడంతోపాటు అప్పటికే ఉన్న ఖాళీలను భర్తీ చేసి మొత్తంగా 2,875 మంది డాక్టర్లను అందుబాటులో ఉంచారు. వైద్య శాఖలో ఒక్క పోస్టు కూడా ఖాళీగా మిగలకుండా గత నాలుగేళ్లలో 48,639 మంది వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. వైద్యులకు ఫోన్లు వైద్యులు గ్రామాలను సందర్శించని రోజుల్లో ప్రజలకు ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురైతే ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా పీహెచ్సీ వైద్యుడికి మొబైల్ ఫోన్‌ను సమకూర్చింది. రాష్ట్రవ్యాప్తంగా 1,142 పీహెచ్‌సీల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు సుమారు రూ.3 కోట్లతో ఫోన్లను అందజేశారు. వైద్యుడు మారినా ఫోన్ నంబర్ మారకుండా శాశ్వత నంబర్ కేటాయించారు. గ్రామాల్లోనే 14 రకాల వైద్య పరీక్షలు – గర్భ నిర్ధారణకు యూరిన్ టెస్ట్ – హిమోగ్లోబిన్ టెస్ట్ – ర్యాండమ్ గ్లూకోజ్ టెస్ట్ (షుగర్) – మలేరియా టెస్ట్ – హెచ్ఐవీ నిర్ధారణ – డెంగ్యూ టెస్ట్ – మల్టీపారా యూరిన్ స్ట్రిప్స్ (డిప్ స్టిక్) – అయోడిన్ టెస్ట్ – వాటర్ టెస్టింగ్ – హెపటైటిస్ బి నిర్ధారణ – ఫైలేరియాసిస్ టెస్ట్ – సిఫిలిస్ ర్యాపిడ్ టెస్ట్ – విజువల్ ఇన్స్పెక్షన్ – స్పుటమ్ (ఏఎఫ్‌బీ) ట్రయల్ రన్లో 69 లక్షల మందికి వైద్య సేవలు – ఓపీ సేవలు– 25,80,599 – యాంటెనేటల్(గర్భిణులకు వైద్య సేవలు)– 4,03,500 – పోస్ట్‌నేటల్(బాలింతలకు వైద్య సేవలు)– 2,20,835 – మధుమేహం బాధితులు– 15,79,962 – రక్తపోటు బాధితులు– 20,98,028 – క్యాన్సర్ రోగులు– 33,635 నిరంతర సంరక్షణతో మంచి ఫలితాలు బీపీ నియంత్రణలో లేకపోవడంతో 20 శాతం పెరాలసిస్ కేసులు నమోదవుతున్నాయి. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేయడంతో పలు రకాల జబ్బుల బారినపడుతున్నారు. గ్రామాల్లో జీవన శైలి జబ్బులు పెరుగుతున్నాయి. మారుమూల గ్రామాల్లో నివసించే బీపీ, మధుమేహం, ఇతర సమస్యల బాధితులు తరచూ 5 నుంచి 10 కి.మీ ప్రయాణించి ఆస్పత్రులకు వెళ్లి వైద్యులను కలసి మందులు తీసుకోవడం ఇబ్బందికరం. వైద్యుడే గ్రామాలకు వెళ్లి వారి ఆరోగ్యం పట్ల నిరంతరం వాకబు చేయడం ప్రజారోగ్యంపై మంచి ప్రభావం చూపుతుంది. గుండెపోటు, కిడ్నీ, మెదడు జబ్బుల బారినపడే వారి సంఖ్య క్రమంగా తగ్గుతుంది. – డాక్టర్ బాబ్జీ, సీనియర్ వైద్యుడు, వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ అనుబంధంతో మానసిక బలం ఎంబీబీఎస్ వైద్యుడే నేరుగా గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకం కావడం మంచి పరిణామం. గర్భిణులు, బాలింతలు, బీపీ, మధుమేహం బాధితులను తరచూ పరామర్శించడం ద్వారా వైద్యులు వారిని గుర్తు పట్టి పేరుతో పలకరిస్తారు. తద్వారా వైద్యుడు, ప్రజలకు మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది. అది రోగికి మానసికంగా ఎంతో బలాన్ని ఇస్తుంది. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూలు జీజీహెచ్ ప్రజారోగ్య ముఖచిత్రాన్ని మార్చిన సీఎం జగన్ దేశ వైద్య రంగ చరిత్రలోనే ఫ్యామిలీ డాక్టర్ విధానం ఒక విప్లవాత్మక నిర్ణయం. ఇది ప్రజారోగ్య వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చేసింది. వైద్యుల కోసం ఆస్పత్రులకు వెళ్లి పడిగాపులు కాసే పరిస్థితులు తొలగిపోయి డాక్టర్లే గ్రామాల బాట పట్టడం సాధారణ విషయం కాదు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణపై సీఎం జగన్ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. ఒక్క ఫ్యామిలీ డాక్టర్ విధానమే కాకుండా వైద్య ఆరోగ్య రంగంపై రూ.16 వేల కోట్లకుపైగా వెచ్చిస్తూ నాడు – నేడుతో ఆస్పత్రుల ఆధునికీకరణ, 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణాన్ని చేపట్టారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేయడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి భరోసానిచ్చారు. ఆరోగ్య రంగంలో ఏపీ ఈ రోజు దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. – విడదల రజిని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ‘ఫ్యామిలీ డాక్టర్’ సేవలు – జనరల్ ఔట్ పేషెంట్ సేవలు – బీపీ, షుగర్, ఊబకాయం లాంటి జీవనశైలి జబ్బుల కేసుల ఫాలోఅప్ – గర్భిణులకు యాంటినేటల్ చెకప్స్, బాలింతలకు పోస్ట్‌నేటల్ చెకప్స్, ప్రసవానంతర సమస్యల ముందస్తు గుర్తింపు.చిన్నపిల్లలో పుట్టుకతో వచ్చిన లోపాల గుర్తింపు. – రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు, చిన్న పిల్లలకు వైద్య సేవలు – ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్స జరిగిన రోగులు, క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక జబ్బులతో మంచానికే పరిమితమైన వారికి, వృద్ధులకు ఇంటి వద్దే వైద్యం. – పాలియేటివ్ కేర్.. తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ నిర్ధారణ -
కోవిడ్ మళ్లీ కోరలు చాస్తోంది! రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా చోట్ల వైరల్ ఫీవర్లు, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇదే సమయంలో కోవిడ్–19 పరీక్షల్లో పాజిటివిటీ రేటు సైతం వేగంగా పెరుగుతున్నట్లు గుర్తించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, రాష్ట్రాలకు జాగ్రత్త చర్యలను సూచిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇన్‌ఫ్లూయెంజా లైక్ ఇల్నెస్ (ఐఎల్ఐ), సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ (ఎస్ఏఆర్ఐ) సమస్యలపై ఇదివరకే రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేయగా.. ప్రస్తుతం కోవిడ్–19 కేసుల దృష్ట్యా జాగ్రత్త చర్యలను పాటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వివిధ అంశాలపై తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ భల్ దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. అలసత్వం వద్దు.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కోవిడ్–19 కేసుల నమోదు వేగంగా పెరుగుతోంది. కేరళలో 26.4 శాతం, మహారాష్ట్రలో 21.7 శాతం, గుజరాత్లో 13.9 శాతం, కర్ణాటకలో 8.6 శాతం, తమిళనాడులో 6.3 శాతం కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఏమాత్రం అలస్వతంగా ఉండవద్దని కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ దిశగా టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్లను వేగవంతం చేయాలని స్పష్టం చేసింది. పరీక్షలను పెద్ద ఎత్తున పెంచుతూ కోవిడ్–19 జాగ్రత్తలను పాటించేలా చేయాలని, కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. కేసుల సంఖ్య పెరిగి ప్రమాదానికి దారితీయకుండా ముందస్తు జాగ్రత్తలు అవసరమని కేంద్రం వివరించింది. ఇదే సమయంలో అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్, ఇన్ఫ్లుయాంజా కేసులపైనా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది. దేశంలో ఈ తరహా కేసులు జనవరి నుంచి మార్చి చివరి వరకు, ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు కనిపిస్తాయని, ఈ నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం గుర్తు చేసింది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. కోవిడ్–19ను అరికట్టేందుకు ప్రజలు అన్ని రకాల జాగ్రత్త చర్యలు పాటించేలా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశించింది. ► వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, క్రమం తప్పకుండా చేతులు శుభ్రపర్చుకోవాలని, శానిటైజర్ వినియోగించాలని సూచించింది. ► దీర్ఘకాలిక వ్యాధులున్న వారు వీలైనంత తక్కువగా బయటకు వెళ్లాలని స్పష్టం చేసింది. ► వైద్యులు, పారామెడిక్స్, ఇతర ఆరోగ్య సంరక్షణ సిబ్బంది మాస్క్‌లు ధరించాలని స్పష్టం చేసింది. ► రద్దీగా ఉండే ప్రాంతాల్లో, క్లోజ్డ్ సెట్టింగులున్న చోటఉండాల్సిన వారు తప్పకుండా మాస్క్‌లు ధరించాలి ► తుమ్మేటప్పుడు, దగ్గుతున్నప్పుడు ముక్కు, నోరు కప్పుకోవడానికి రుమాలు అందుబాటులో ఉంచుకోవాలి ► బయటకు వెళ్లిన ప్రతి ఒక్కరు తరచుగా చేతులు శుభ్రపర్చుకోవాలి ► బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధించాలి ► కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలను వీలైనంత ఎక్కువ సంఖ్యలో చేయాలి. లక్షణాలను గుర్తిస్తే వెంటనే ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి ఆస్పత్రుల్లో ఏర్పాట్లు.. ఎలాంటి పరిస్థితులు వచ్చినా తట్టుకునే విధంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఆస్పత్రుల్లో మందులను అందుబాటులో ఉంచాలని, వైద్య పరికరాల పనితీరును సరిచూసుకోవాలని తెలిపింది. అలాగే ఆక్సిజన్ వసతులను పునఃసమీక్షించుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు అన్ని రకాల ఆస్పత్రులను సన్నద్ధం చేయాలని ఆదేశించింది. ఐసీయూ పడకలు, ఆక్సిజన్ పడకల తీరును నిరంతరం పరిశీలించాలని, ఆస్పత్రుల వారీగా సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఈనెల 27న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
హెచ్3ఎన్2పై వైద్య శాఖ అప్రమత్తం.. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హెచ్3ఎన్2 ప్రభావం లేనప్పటికీ ముందస్తు నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో జ్వరం, దగ్గు, జలుబు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారిని గుర్తించి వారికి వైద్య సహాయం అందించడానికి సోమవారం నుంచి ఫీవర్ సర్వేను చేపట్టనుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖాధికారుల (డీఎంహెచ్‌వో)కు ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజలను స్క్రీనింగ్ చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశించింది. శీతాకాలం ముగిసి వేసవి ప్రారంభమవుతున్న క్రమంలో వాతావరణ మార్పులతో దగ్గు, జలుబు, వైరల్ జ్వరాలు దేశవ్యాప్తంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. ఇన్‌ఫ్లూయెంజా ఎ ఉపరకం హెచ్3ఎన్2 అనే వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతోందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఇప్పటికే వెల్లడించింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సైతం రాష్ట్రాలకు ఇప్పటికే పలు మార్గదర్శకాలు జారీ చేసింది. సీజన్ మారడం వల్లే.. హెచ్3ఎన్2 ఫ్లూ అనుమానిత లక్షణాలున్న వారికి పరీక్షలు చేయడం కోసం టెస్టింగ్ కిట్లను వైద్య ఆరోగ్య శాఖ కొనుగోలు చేస్తోంది. రెండు రోజుల్లో అన్ని బోధనాస్పత్రులకు వీటిని పంపనుంది. ప్రస్తుతం తిరుపతి స్విమ్స్‌లోని వీఆర్డీఎల్ ల్యాబ్‌లో హెచ్3ఎన్2 నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇక్కడ జనవరిలో 12, ఫిబ్రవరిలో తొమ్మిది పాజిటివ్ కేసులను నిర్ధారించారు. అయితే ఆందోళన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ఏటా సీజన్ మారుతున్న సమయంలో కేసులు కొంత పెరుగుతాయని అంటున్నారు. ప్రస్తుతం వేసవి సీజన్ మొదలవుతుండటంతో అవే పరిస్థితులు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఆస్పత్రులకు వస్తున్న బాధితులకు చాలా అరుదుగా మాత్రమే అడ్మిషన్ అవసరమవుతోందని చెబుతున్నారు. సాధారణంగా ఆస్పత్రులకు వచ్చే ఓపీల్లో 5 నుంచి 6 శాతం వరకు జ్వరం, దగ్గు, జలుబు వంటి కేసులే ఉంటాయని గుర్తు చేస్తున్నారు. వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలు.. ► క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోవాలి. ► ఫ్లూ లక్షణాలున్నవారు మాస్క్ ధరించాలి. ► వీలైనంత ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ► షేక్‌హ్యాండ్, ఆలింగనాలు మానుకోవాలి. ► బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మకూడదు. కంగారు పడవద్దు.. వాతావరణం మారుతున్నప్పుడు సాధారణంగా జలుబు, దగ్గు, జ్వరం వంటివి వస్తాయి. వీటికే ప్రజలు కంగారు పడిపోవద్దు. ఈ లక్షణాలు ఉన్నవారు సమీపంలోని ఆశా వర్కర్, ఏఎన్ఎంలను సంప్రదించవచ్చు. వారు మందులు ఇవ్వడంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెబుతారు. హెచ్3ఎన్2 ప్రభావం రాష్ట్రంలో లేదు. అయినప్పటికీ ముందు జాగ్రత్తల్లో భాగంగా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ రామిరెడ్డి, డైరెక్టర్, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు జాగ్రత్త.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిపై వైరస్లు, బ్యాక్టీరియాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులు, షుగర్, హెచ్ఐవీ బాధితులు మాస్క్ ధరించాలి. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే పారాసెటమాల్, బ్రూఫెన్ మాత్రలు, గొంతు ఉపశమనానికి విక్స్ బిళ్లలు వేసుకోవాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. ఒసెల్టామివిర్ 75 ఎంజీ మాత్ర రోజుకు రెండుసార్లు వేసుకోవాలి. – డాక్టర్ ఎస్.రఘు,సూపరింటెండెంట్, ఛాతీ, సాంక్రమిక వ్యాధుల ఆస్పత్రి, గుంటూరు -
Andhra Pradesh: ఆందోళన వద్దు.. ఇక మీ ఇంటికే డాక్టర్ వస్తాడు..!
సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగంలో మరో కీలక ఘట్టానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ఈ నెల 15వ తేదీ తరువాత పూర్తి స్థాయిలో అమలులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ అమలు, వైద్య ఆరోగ్య శాఖలో నాడు – నేడు సహా వివిధ కార్యక్రమాల పురోగతిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలతో మేలు చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతి కుటుంబం ఆరోగ్యం పట్ల కూడా అంతే శ్రద్ధ తీసుకుంటూ ఫ్యామిలీ డాక్టర్ విధానానికి రూపకల్పన చేసింది. గతేడాది అక్టోబర్ 21 నుంచి ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ 45,90,086 మందికి వైద్య సేవలు అందించినట్లు సమీక్షలో అధికారులు తెలిపారు. రిఫరల్ సేవలను భాగం చేయండి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ రిఫరల్ సేవలను ఫ్యామిలీ డాక్టర్ విధుల్లో భాగంగా చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఆరోగ్యశ్రీ సేవల్లో ఎలాంటి ఇబ్బంది, సమస్యలు ఎదురైనా ఫిర్యాదు చేసేందుకు వీలుగా కార్డులపై నెంబర్ ఉంచాలని సూచించారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నప్పటికీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో వైద్యం అందించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని కార్డులపై ముద్రించాలన్నారు. రక్తహీనత బాధితుల వివరాలను వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్‌కు అనుసంధానించి పౌష్టికాహారం అందించాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా పౌష్టికాహారం అందిస్తున్నారా? లేదా? అన్నది పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. పీహెచ్‌సీల్లో పూర్తి స్థాయిలో వైద్యుల నియామకం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలులోకి తెచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) పూర్తి స్థాయిలో వైద్యుల నియామకాలను భర్తీ చేసినట్లు అధికారులు తెలిపారు. దీర్ఘకాలిక సెలవుల సమయంలో సేవలకు అంతరాయం కలగకుండా వైద్యుల అదనపు నియామకాలు చేపట్టామని వివరించారు. ప్రతి జిల్లాకు నలుగురు అదనపు వైద్యులను సిద్ధంగా ఉంచామన్నారు. ఇక డాక్టర్ల స్వల్పకాలిక సెలవుల సందర్భాల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడకుండా ప్రతి 6–7 పీహెచ్‌సీలకు ఒక వైద్యుడిని అదనంగా నియమించామన్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 175 మందిని రిజర్వ్‌లో ఉంచినట్లు వెల్లడించారు. మరిన్ని ఔషధాలు.. టెస్టింగ్ కిట్లు.. రిజర్వు వాహనాలు రాష్ట్రంలో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లకుగానూ ప్రతి చోటా ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో), ముగ్గురు నుంచి నలుగురు ఆశా కార్యకర్తలు ఉంటారని అధికారులు చెప్పారు. విలేజ్ క్లినిక్స్, 104 మొబైల్ మెడికల్ యూనిట్ల (ఎంఎంయూ)లో మందుల సంఖ్యను 67 నుంచి 105కి పెంచామన్నారు. విలేజ్ క్లినిక్స్‌లో 14 రకాల వైద్య పరీక్షల కిట్లను అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలకు అందించే వైద్య సేవలను రియల్ టైమ్‌లో నమోదు చేసేందుకు టూల్స్ సిద్ధం చేశామన్నారు. 104 ఎంఎంయూలు ప్రస్తుతం 676 ఉండగా కొత్తగా 234 వాహనాలతో కలిపి మొత్తం 910 ఎంఎంయూలతో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలవుతుందని వివరించారు. ప్రతి జిల్లాకు బ్యాక్ అప్ కింద మరో 104 ఎంఎంయూ వాహనాన్ని రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు తెలిపారు. ఉదయం 9 నుంచి 4 గంటల వరకు.. ఫ్యామిలీ డాక్టర్ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రామంలోనే ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తారని అధికారులు తెలిపారు. జనరల్ ఓపీ, జీవన శైలి జబ్బులు, గర్భవతుల ఆరోగ్య సంరక్షణ, అంగన్వాడీ, పాఠశాలల సందర్శన, పిల్లల ఆరోగ్యంపై పరిశీలన, రక్తహీనత నివారణ తదితర అంశాలపై వైద్యులు దృష్టి పెడతారని చెప్పారు. మంచానికే పరిమితమైన రోగులకు ఇంటి వద్దే వైద్య సేవలు అందించడంతో పాటు పంచాయతీ కార్యదర్శితో కలిసి గ్రామంలో పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ లాంటి విధులన్నింటినీ ఫ్యామిలీ డాక్టర్ నిర్వహిస్తారన్నారు. రక్తపోటు, మధుమేహం లాంటి జీవనశైలి జబ్బుల బాధితుల డేటా వివరాలు ఫ్యామిలీ డాక్టర్‌కు అందుబాటులో ఉంటాయన్నారు. వీరికి ఫాలో అప్ వైద్య సేవలను అందించడం కోసం ఈ డేటాను వినియోగిస్తామన్నారు. 108 అంబులెన్స్‌ల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కండిషన్లో లేని వాహనాలను తొలగించి కొత్తవాటిని ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా కొత్తగా 108 అంబులెన్స్ వాహనాలు 146 కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న వైద్య కళాశాలల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కళాశాలల్లో 2023–24 విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు వివరించారు. విజయనగరం వైద్య కళాశాలకు ఇప్పటికే ఎన్ఎంసీ అనుమతులు లభించాయని చెప్పారు. ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో 35.42 లక్షల మందికి వైఎస్సార్ కంటి వెలుగు సచివాలయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం మూడో విడతలో భాగంగా 60 ఏళ్లు పైబడిన 24,65,300 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కంటి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మిగిలిపోయిన మరో 35,42,151 మందికి కంటి పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని తాజా సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా సమగ్ర కంటి చికిత్స అందించే సంకల్పంతో కంటి వెలుగు కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2019 అక్టోబరు 10న సీఎం జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఆరంభమైంది. తొలి రెండు దశల్లో 60,393 పాఠశాలల్లో 66,17,613 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. వీరిలో 1,58,227 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలు అందజేయడంతో పాటు 310 మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. మూడో దశలో 60 ఏళ్లు పైబడిన వారికి కంటి పరీక్షల నిర్వహణ, చికిత్స ప్రారంభించారు. 24,65,300 మందికి ఇప్పటికే వైద్య పరీక్షలు చేసి 8 లక్షల మందికిపైగా వృద్ధులకు కళ్లద్దాలు అందించారు. మరో 4,70,034 మందికి కంటి శుక్లాల శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ క్రమంలో మూడో విడతలో మిగిలిపోయిన 35.42 లక్షల మందికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద కంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. 26 జిల్లాల్లో 376 బృందాలతో స్క్రీనింగ్ కార్యక్రమాన్ని చేపడతారు. వచ్చే ఆగస్టులోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఉచితంగా అత్యాధునిక వైద్యం.. వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా గ్లూకోమా, డయాబెటిక్ రెటీనోపతితో పాటు ఇతర కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి అత్యాధునిక కంటి వైద్యాన్ని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేసేందుకు, సిబ్బందికి శిక్షణ కోసం ఎల్.వి ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌ను భాగస్వామిగా చేసుకున్నారు. సీఎం సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు, ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్, ప్రత్యేకాధికారి డాక్టర్ అశోక్, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ మురళీధర్‌రెడ్డి, డ్రగ్స్ డైరెక్టర్ జనరల్ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
‘వైఎస్సార్ కంటి వెలుగు ఫేజ్-3’ ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. మార్చి 15న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను సీఎం ప్రారంభించనున్నారు. ఈ మేరకు సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. కాగా, క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఫేజ్ ౩లో మిగిలిన వారికి ‘వైఎస్సార్ కంటి వెలుగు’ను సీఎం ప్రారంభించారు. 35,41,151మంది అవ్వాతాతలకు పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 376 టీమ్స్ ఏర్పాటు చేశారు. సమీక్షా సమావేశంలో సీఎం జగన్ ఏమన్నారంటే? ►మార్చి 15 నుంచి ఫ్యామిలీడాక్టర్ కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో అమలు ►అదే రోజు ఒక విలేజ్‌క్లినిక్ వద్ద ప్రారంభించేందుకు అధికారుల ఏర్పాట్లు ►ఫ్యామిలీ డాక్టర్ పైలట్ ప్రాజెక్టులో ఇప్పటివరకూ 45,90,086 మందికి ఆరోగ్య సేవలు ►ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు ఫ్యామిలీ డాక్టర్‌కాన్సెప్ట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి సర్వం సిద్ధంగా ఉందని తెలిపిన అధికారులు ►1,149 పీహెచ్‌సీల్లో పూర్తిస్థాయిలో వైద్యుల నియమాకాలను పూర్తిచేశామన్న అధికారులు ►దీర్ఘకాలిక సెలవుల సమయంలో సేవలకు అంతరాయం లేకుండా ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలమేరకు సీహెచ్‌సీల్లో ఉన్న వైద్యులను ఇక్కడ వినియోగించుకుంటామని, ►దీని కోసం అదనపు నియామకాలకు కూడా చేశామని తెలిపిన అధికారులు. ►ప్రతి జిల్లాకు నలుగురు అదనపు వైద్యులను దీనికోసం నియమించుకున్నామని తెలిపిన అధికారులు. ►ఇతర స్వల్పకాలిక సమయాల్లో కూడా వైద్యసేవలకు అంతరాయం లేకుండా ప్రతి 6–7 పీహెచ్‌సీలకూ ఒక డాక్టర్‌ను అదనంగా నియమించుకున్నామని, ఇలా రాష్ట్రవ్యాప్తంగా 175 మందిని రిజర్వ్‌లో పెట్టుకున్నామని తెలిపిన అధికారులు. ►10,032 విలేజ్‌హెల్త్ క్లినిక్స్‌లో ప్రతి క్లినిక్‌కూ ఒక ఏఎన్ఎం చొప్పున ఉంటారు. వీరితో పాటు ఒక సీహెచ్ఓ, 3-4 మంది ఆశా కార్యకర్తలు ఉంటారు. ►విలేజ్‌హెల్త్‌క్లినిక్స్, అలాగే 104లలో ఉంచే మందుల సంఖ్యను కూడా పెంచామని తెలిపిన అధికారులు. ►సీఎం ఆదేశాల మేరకు అవసరమైన అన్నిరకాలు మందులు ఉండాలన్న లక్ష్యంతో ఇదివరకు ఇస్తున్న 67 రకాల మందులను 105కు పెంచామని తెలిపిన అధికారులు ►అలాగే 14 రకాల డయాగ్నోస్టిక్ కిట్లను కూడా విలేజ్‌క్లినిక్స్‌కు అందుబాటులో పెట్టామని తెలిపిన అధికారులు. ►మందులకు, డయాగ్నోస్టిక్.. తదితర వాటి సరఫరాకు అంతరాయం లేకుండా వాటిని స్టాకులో కూడా ఉంచుతున్నామని తెలిపిన అధికారులు. ►రోగులకు అదించే సేవలను రియల్‌టైంలో నమోదు చేయడానికి టూల్స్‌ను ఏర్పాటు చేశామన్న అధికారులు ►పీహెచ్‌సీలను, 104 అంబులెన్స్‌లను అనుసంధానం చేస్తూ మ్యాపింగ్‌కూడా పూర్తిచేశామన్న అధికారులు ►ఇప్పటికే 676 వాహనాలు (104) సేవలు అందిస్తుండగా, కొత్తగా వచ్చే 234 వాటితో కలిపి ఫ్యామిలీ డాక్టర్‌కాన్సెప్ట్ అమలుకోసం 910 వాహనాలు (104)లను వినియోగించనున్నట్టు తెలిపిన అధికారులు. ►అలాగే ప్రతిజిల్లాకు బ్యాక్అప్ కింద మరో 104 వాహనాన్నికూడా రిజర్వ్‌లో ఉంచుతున్నామని తెలిపిన అధికారులు ►ఉదయం 9 గంటలనుంచి 4 గంటలవరకూ విలేజ్‌క్లినిక్‌లో అందుబాటులో ఫ్యామిలీ డాక్టర్ ►జనరల్‌ఓపీ, నాన్‌కమ్యూనికబుల్ డిసీజ్ మేనేజ్మెంట్, గర్భవతుల ఆరోగ్య రక్షణ, అంగన్వాడీల సందర్శన, అందులో పిల్లల ఆరోగ్యంపై పరిశీలన, స్కూళ్ల సందర్శన, అందులోని పిల్లల ఆరోగ్యంపై పరిశీలన, రక్తహీనత నివారణపై దృష్టి, మంచానికే పరిమితమైన పేషెంట్ల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి, వారి ఇళ్లకే వెళ్లి సేవలు అందించడం, పంచాయతీ కార్యదర్శితో కలిసి.. గ్రామంలో పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ.. ఈ విధులన్నింటినీ కూడా ఫ్యామిలీ డాక్టర్ నిర్వర్తిస్తారు ►డిస్ట్రిక్‌హబ్స్‌లో ఉండే స్పెషలిస్టు డాక్టర్ల ద్వారా టెలిమెడిసన్ పద్ధతుల్లోకూడా వీరికి సేవలందించేలా చూస్తారు ►హైపర్‌టెన్షన్, డయాబెటీస్‌లాంటి నాన్‌కమ్యూనికబుల్‌డిసీజ్‌లతో బాధపడుతున్న వారి డేటా కూడా ఫ్యామిలీ డాక్టర్‌కు అందుబాటులో ఉంటుంది ►ఫాలోఅప్ ట్రీట్మెంట్కోసం ఈ డేటాను వినియోగిస్తారు ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే...: ►ఆరోగ్య శ్రీ రిఫరల్, సేవలు కూడా ఫ్యామిలీ డాక్టర్ విధుల్లో భాగం కావాలన్న సీఎం ►ఆరోగ్య శ్రీ సేవలపై ఎలాంటి ఫిర్యాదులున్నా చేయడానికి ఆరోగ్య శ్రీ కార్డులపై ఫిర్యాదు నంబర్ ఉంచాలన్న సీఎం ►ఎవరైనా లంచాలు అడిగినా ఈ నంబర్‌కు చేయాలంటూ కార్డుపై ముద్రించాలన్న సీఎం ►ఎనీమియా కేసులను సంపూర్ణ పోషణ ప్లస్‌తో అనుసంధానం చేయాలన్న సీఎం ►పోషణ ప్లస్‌ద్వారా వారికి పౌష్టికాహారం అందించేలా చూడ్డం, అది అందుతుందా? లేదా? అన్న పర్యవేక్షణ కూడా చేయాలన్న సీఎం ►మూడో విడతలో మిగిలిన వారికి వైఎస్ఆర్ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం ►క్షేత్రస్థాయిలో పరీక్షలకోసం కార్యాచరణ సిద్ధం ►సచివాలయాల వారీగా మ్యాపింగ్ ► అలాగే దంతపరీక్షలు నిర్వహించడంపైనా దృష్టిపెట్టాలన్న సీఎం ►దీని కోసం కార్యాచరణ సిద్ధంచేయాలన్న సీఎం. ►వైఎస్ఆర్ కంటి వెలుగుపై సీఎంకు వివరాలందించిన అధికారులు ►రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా సమగ్రమైన కంటి చికిత్సను ఉచితంగా అందించే కార్యక్రమంలో భాగంగా 2019 అక్టోబరు 10న వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్. ►80 శాతానికి పైగా కేసుల్లో అంధత్వ సమస్యలను చికిత్స ద్వారా నివారించడంతో పాటు నయం చేయడం సాధ్యం ►ఈ నేపధ్యంలో డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ద్వారా అంధత్వ సమస్యలను నివారించడమే ప్రభుత్వ లక్ష్యం ►ఈ కార్యక్రమంలో భాగంగా అత్యాధునిక కంటి చికిత్సలను నిర్ధేశించుకున్న లక్ష్యం మేరకు దశల వారీగా ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం. ►ఇందులో భాగంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, సచివాలయాలు, పాఠశాలల్లో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు కంటి శస్త్ర చికిత్సలను ►ప్రభుత్వ మరియు గుర్తింపు పొందిన కంటి ఆసుపత్రుల్లో ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం ►అవసరమైన మేరకు ఉచితంగా కళ్లద్దాలు, మందులు కూడా అందించిన ప్రభుత్వం ►గ్లూకోమా, డయాబెటిక్ రెటీనోపతితో పాటు ఇతర కంటి సమస్యలతో బాధపడుతున్నవారికి అత్యాధునిక కంటి వైద్యాన్ని ఉచితంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందిస్తున్న ప్రభుత్వం. ►ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కంటి వైద్య నిపుణులు, ఇతర సిబ్బందికి అవసరమైన శిక్షణ కోసం ఎల్ వి ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌ను భాగస్వామిగా చేసుకున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కంటి వెలుగు ద్వారా... ►డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ఫేజ్ –1, ఫేజ్ –2 ద్వారా ఇప్పటికే 60,393 పాఠశాలల్లో 66,17,613 మంది విద్యార్ధులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహణ ►వీరిలో 1,58,227 మంది విద్యార్ధులకు కళ్లద్దాలు అందజేయడంతో పాటు 310 మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించామన్న అధికారులు ►ఫేజ్ –3లో భాగంగా అవ్వాతాతలకు కంటి వెలుగు కార్యక్రమాన్ని 60 సంవత్సరాలు దాటిన 24,65,300 మందికి ఇప్పటికే స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి ►వీరిలో సుమారు 8 లక్షల మందికి పైగా కళ్లద్దాలు అందించారు. మరో 4,70,034 మందికి కంటి శుక్లం శస్త్రచికిత్సలు నిర్వహించామని తెలిపిన అధికారులు. ►ఈ నేపధ్యంలో మూడో విడతలో మిగిలిన వారికి వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ►గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ఈ కంటి స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 60 యేళ్లు పైబడిన మరో 35,42,151 మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తారు. దీనికోసం 26 జిల్లాల్లో మైక్రో యాక్షన్ ప్లాన్లు తయారు చేసి... 376 బృందాలతో స్క్రీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ►ఈ ఏడాది ఆగష్టులోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడుపైనా సీఎం సమీక్ష ►రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న మెడికల్‌కాలేజీల్లో పనులు కొనసాగుతున్నాయని తెలిపిన అధికారులు. ►విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీల్లో 2023–24 విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నామని తెలిపిన అధికారులు. ►విజయనగరం మెడికల్ కాలేజీకి ఇప్పటికే అనుమతులు ఇచ్చారని, మిగతా కాలేజీలకూ అనుమతులు రానున్నాయని తెలిపిన అధికారులు ►సీఎం ఆదేశాల మేరకు 108 పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని తెలిపిన అధికారులు ►క్రమం తప్పకుండా రివ్యూ చేసి, కండిషన్లో లేనివాటిని తీసివేస్తున్నామని తెలిపిన అధికారులు ►ఇలా తీసివేసిన వాటి స్థానంలో కొత్తవాటిని పెడుతున్నామని తెలిపిన అధికారులు ►కొత్తగా 146 వాహనాలను (108) కొనుగోలు చేస్తున్నామన్న అధికారులు ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె నివాస్, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్ హరీందిర ప్రసాద్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్ రెడ్డి, డ్రగ్స్ డైరెక్టర్ జనరల్ రవిశంకర్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
‘యాంటిబయోటిక్స్’కు బ్రేకులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యాంటిబయోటిక్ మందుల అతి వినియోగాన్ని నియంత్రించడంపై వైద్య శాఖ దృష్టి సారించింది. నిబంధనలకు విరుద్ధంగా మందుల దుకాణాల్లో ఈ మందుల విక్రయానికి కళ్లెం వేయాలని నిర్ణయించింది. యాంటీబయోటిక్స్ అతి వినియోగం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తోంది. దగ్గు, జలుబు, జ్వరం.. ఇలా ఏ చిన్న సమస్య వచ్చినా యాంటీబయోటిక్స్ వాడుతున్నారు. వైద్యులు ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందుల దుకాణాలకు వెళ్లి సమస్య చెప్పగానే ఈ మందులు ఇచ్చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి అనంతరం వీటి వినియోగం మరింత పెరిగింది. అధికశాతం మందుల దుకాణాల్లో వీటి విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఈ తరహాలో వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల షాపుల్లో జరిగే యాంటిబయోటిక్స్ విక్రయాలపై ఔషధ నియంత్రణ విభాగం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇప్పటికే హెచ్చరికలు జారీ డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం 1945లోని షెడ్యూల్ హెచ్, హెచ్ 1లో ఉండే మందులను దుకాణాల్లో వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు. వీటిలో యాంటిబయోటిక్స్ కూడా ఉంటాయి. అందువల్ల షెడ్యూల్ హెచ్, హెచ్ 1 మందుల విక్రయాల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే ఔషధ నియంత్రణ విభాగం అధికారులు మందుల దుకాణాల యజమానులు, అసోసియేషన్ ప్రతినిధులకు హెచ్చరికలు జారీ చేశారు. వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులను విక్రయిస్తూ తనిఖీల్లో పట్టుబడినా, ఆధారాలతో ఫిర్యాదులు వచ్చినా నెల రోజుల పాటు లైసెన్స్‌ను సస్పెండ్ చేయడంతో పాటు, శాశ్వతంగా అనుమతులు రద్దు కూడా చేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి షెడ్యూల్ హెచ్, హెచ్1 మందుల విక్రయాలపై నిఘా ఉంచుతున్నారు. రాష్ట్రంలో 42వేల హోల్‌సేల్, రిటైల్ మందుల దుకాణాలు ఉన్నాయి. మందులపై ఉన్న బ్యాచ్ నంబర్ల ఆధారంగా హోల్‌సేలర్ నుంచి ఏ మందులు ఏ రిటైల్ దుకాణానికి వెళ్లాయి, అక్కడ వాటి విక్రయాలు, రికార్డులు ఇతర అంశాలపై ఆరా తీస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు మందుల దుకాణాల్లో ఫార్మాసిస్ట్‌ల అందుబాటు, వైద్యుల ప్రిస్క్రిప్షన్ మేరకు హెచ్, హెచ్1 మందుల విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించాం. విచ్చలవిడిగా యాంటిబయోటిక్స్ విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ మందుల వినియోగంపై ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. వైద్యుడి సూచన లేకుండా మందుల దుకాణాల్లో యాంటిబయోటిక్ ఇస్తే ప్రశ్నించాలి. – ఎస్. రవిశంకర్ నారాయణ్, డీజీ ఔషధ నియంత్రణ విభాగం -
ఆకస్మిక గుండెపోటు సంఘటనలు: తెలంగాణలో సీపీఆర్‌పై శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఆకస్మిక గుండెపోటు సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో బాధితుల ప్రాణాలు కాపాడటంపై వైద్య ఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది. అన్ని జిల్లాల్లో నూ కార్డియో–పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్), ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ (ఏఈడీ)లపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం ప్రతీ జిల్లాకు 4 నుంచి ఏడుగురు మాస్టర్ ట్రైనర్లను పంపించనుంది. ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, మున్సిపల్ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, కమ్యూనిటీ వలంటీర్లు, షాపింగ్ మాల్స్ ఉద్యోగులు, పెద్ద కాంప్లెక్స్‌ల్లో ఉండేవారికి సీపీఆర్, ఏఈడీలపై శిక్షణ ఇస్తారు. 108 సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు అందరికీ సీపీఆర్‌లో శిక్షణ ఇస్తామని వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇప్పటికే 160 మంది మాస్టర్ ట్రైనర్లు హైదరా బాద్‌లో సీపీఆర్‌లో శిక్షణ పొందారు. ప్రతి మాస్టర్ ట్రైనర్ వారానికి 300 మందికి శిక్షణ ఇస్తారు. మనిషిని పోలిన బొమ్మలపై శిక్షణ ఇస్తారు. శిక్షణ కా ర్యాచరణ ప్రణాళికను వైద్య ఆరోగ్యశాఖ సిద్ధం చేసింది.ౖ కలెక్టరేట్లలోనూ శిక్షణనిస్తారు. ఎవరైనా ఆకస్మిక గుండెపోటుకు గురైనప్పుడు సమీపంలో ఉన్న వారు వెంటనే సీపీఆర్ చేస్తే గుండె తిరిగి కొట్టుకునేందుకు, తద్వారా ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఉంటుంది. -
గుండెపోటు బాధితులకు గోల్డెన్ చికిత్స
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గుండెపోటు బాధితులకు గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించడం కోసం ఉద్దేశించిన ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (స్టెమీ) కార్యక్రమం అమలులోకి తీసుకుని రావడంలో భాగంగా స్టెమీ ఇ డియా సంస్థతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఒప్పందం చేసుకుంది. టెలీ మెడిసిన్ తరహాలో హబ్ అండ్ స్పోక్ విధానంలో ఈ కార్యక్రమాన్ని అమలుచేయనున్నారు. ఈ క్రమంలో హబ్, స్పోక్‌లోని వైద్యులు, సిబ్బందికి స్టెమీ ప్రొటోకాల్స్‌పై స్టెమీ ఇండియా శిక్షణ ఇవ్వనుంది. స్టెమీ అంటే సాధారణ భాషలో గుండె రక్తనాళం 100 శాతం పూడుకుపోవడంతో వచ్చే గుండెపోటు అని అర్థం. ఇలాంటి సందర్భాల్లో రెండు, మూడు గంటల్లో లక్షణాలను గుర్తించి, ఆ పూడికను కరిగించే చికిత్స (థ్రాంబోలైసిస్ ఇంజక్షన్)ను ఇవ్వగలిగితే ప్రాణాలను కాపాడొచ్చు. క్యాథ్‌ల్యాబ్ ఉన్న ఆస్పత్రులు హబ్‌లుగా అభివృద్ధి స్టెమీ కార్యక్రమం కోసం క్యాథ్‌ల్యాబ్ ఉన్న ప్రభుత్వ బోధనాస్పత్రులను హబ్‌లుగా అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు బోధనాస్పత్రుల్లో క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం ఉంది. మిగిలిన ఆస్పత్రుల్లో క్యాథ్‌ల్యాబ్ సౌకర్యాన్ని ప్రభుత్వం సమకూర్చడానికి చర్యలు చేపట్టింది. ఈలోగా క్యాథ్‌ల్యాబ్ రహిత బోధనాస్పత్రులున్న చోట ఆ సౌకర్యం ఉన్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లోని ప్రైవేట్ ఆస్పత్రుల సేవలు వినియోగించుకోనున్నారు. జిల్లా ఆస్పత్రులు, 53 ఏరియా ఆస్పత్రులు స్పోక్‌లుగా వ్యవహరిస్తాయి. ఈ క్రమంలో హబ్‌కు రెండు గంటల ప్రయాణ దూరంలో ఉన్న జిల్లా, ఏరియా ఆస్పత్రులను అనుసంధానిస్తారు. ఈ ఆస్పత్రులకు ఛాతీనొప్పి, ఇతర గుండెపోటు లక్షణాలతో వచ్చిన వ్యక్తులకు వెంటనే టెలీ ఈసీజీ తీస్తారు. ఆ ఫలితం హబ్‌లో ఉన్న కార్డియాలజిస్ట్‌కు వెళ్తుంది. ఫలితాన్ని పరిశీలించి, గుండె రక్తనాళం ఎంత శాతం పూడుకుపోయింది? వెంటనే థ్రాంబోలైసిస్ అవసరమా? లేదా? అనేది కార్డియాలజిస్ట్ నిర్ధారిస్తారు. అనంతరం స్పోక్ కేంద్ర వైద్యుడిని అప్రమత్తం చేస్తారు. అవసరం మేరకు ‘థ్రాంబోలైసిస్’ ఇంజక్షన్ ఇస్తారు. దీంతో రోగి ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడతాడు. అనంతరం చికిత్స కోసం హబ్‌కు/సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు తరలిస్తారు. త్వరలో వైద్యులు, సిబ్బందికి శిక్షణ స్టెమీ ఇండియాతో ఒప్పందం చేసుకున్నాం. త్వరలో వైద్యులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు మొదలవుతాయి. హబ్‌లో ఉండే కార్డియాలజిస్ట్, సిబ్బంది, స్పోక్‌లోని జనరల్ ఫిజీషియన్ ఇతర సిబ్బంది విధులు, కర్తవ్యాలు, స్టెమీ ప్రొటోకాల్స్‌పై శిక్షణ ఉంటుంది. అదే విధంగా స్పోక్స్‌కు స్టెమీ కిట్ల పంపిణీ చేపడతాం. వీలైనంత త్వరగా స్టెమీ కార్యక్రమం ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. – డాక్టర్ వినోద్‌కుమార్, డీఎంఈ, కమిషనర్ ఏపీవీవీపీ -
మెడికల్ కాలేజీల్లో కౌన్సెలింగ్ కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: కాకతీయ మెడికల్ కాలేజీ ఎండీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం... నిజామాబాద్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థి ఆత్మహత్య.. ఖమ్మం జిల్లాకు చెందిన మెడికల్ విద్యార్థి విజయవాడలో ఆత్మహత్య ఘటనలు ఈ ఐదారు రోజుల్లో యావత్ సమాజాన్ని కుదిపేశాయి. మెడికల్ కాలేజీల్లో అసలేం జరుగుతోందని ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ కూడా దీన్ని తీవ్రంగా పరిగణించింది. వేధింపులు, పరీక్షల ఒత్తిడి, ఇతరత్రా కారణాలతో వైద్య విద్యార్థుల ఆత్మహత్యలు, యత్నాలకు పాల్పడుతున్నారని గుర్తించారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో తక్షణమే కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది. మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడే విద్యార్థులకు కౌన్సెలింగ్ చేయాలని నిర్ణయించింది. విద్యార్థుల నుంచి ఏమైనా ఫిర్యాదులు వస్తే తక్షణమే వాటిని పరిష్కరించాలని స్పష్టం చేసింది. ఫిర్యాదులను తమకు పంపించాలని, అందుకు తీసుకున్న చర్యలేంటో తెలియజేయాలని పేర్కొంది. ఇంటర్న్‌షిప్ విద్యార్థులకు, పీజీ మెడికల్ విద్యార్థులతో ఎన్ని గంటలు పనిచేయిస్తున్నారు? అదనపు గంటలు పనిచేయిస్తున్నారా? వీక్లీ ఆఫ్‌లు ఇస్తున్నారా? వంటి అంశాలపై సమగ్ర సమాచారం పంపాలని ఆదేశించింది. చాలా మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లోనూ పీజీ మెడికల్ విద్యార్థులపై సీనియర్ డాక్టర్లు పనిభారం వేస్తూ వేధిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు సీనియర్ డాక్టర్లు పీజీలతో పనిచేయించుకుంటూ తమ సొంత ప్రైవేట్ ప్రాక్టీస్‌పై దృష్టి పెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటువంటి వారి వివరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 24 గంటల హెల్ప్‌లైన్.. అన్ని వైద్య కళాశాలల్లో తప్పనిసరిగా 24 గంటల హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని, డీన్ లేదా ప్రిన్సిపాల్ అధ్యక్షతన ఒక అంతర్గత ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని, కాలేజీల్లో ఆత్మహత్యల నివారణ కోసం సైకియాట్రీ సీనియర్ ప్రొఫెసర్‌ను సభ్యుడిగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆపదలో ఉన్నవారు లేదా ఆత్మహత్య చేసుకొనే ధోరణి ఉన్నవారు సొసైటీ ఫర్ మెంటల్ హెల్త్ – 011–4076 9002 నంబర్‌కు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు ఫోన్ చేయవచ్చని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) సూచించింది. గత ఐదేళ్లలో ఆత్మహత్యలకు పాల్పడిన వైద్య విద్యార్థుల వివరాలను, మధ్యలోనే చదువు మానేసిన విద్యార్థుల వివరాలను పంపించాలని ఎన్ఎంసీ కోరింది. ప్రతి మెడికల్ కాలేజీలోనూ విద్యార్థులకు యోగా, ధ్యానం తప్పనిసరి చేయాలని సూచించింది. ఆత్మహత్యల ధోరణిపై ఆందోళన వ్యక్తం చేసిన ఎన్ఎంసీ.. ఇలాంటి ఘటనలకు ర్యాగింగ్‌తో సంబంధం లేనప్పటికీ చాలా సందర్భాల్లో ర్యాగింగ్ వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయని భావిస్తోంది. వాటిపై సమీక్షించాల్సిన అవసరముందంటున్నారు. ‘ప్రతి ఒక్కరి జీవితం విలువైనది. విద్యార్థులు సురక్షితంగా చదువుకొనేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తాం. అందుకోసం ఎన్ఎంసీ సరైన నిర్ణయాలు తీసుకుంటుంది. విద్యార్థుల్లో ఒత్తిడి, వేధింపులతో ఆత్మహత్యల వంటి ఘటనలను నిరోధించడానికి కౌన్సెలింగ్, ఇతర సహాయక వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయాలి’అని ఎన్ఎంసీ కోరింది. ఆ ప్రకారం రాష్ట్రంలో చర్యలు చేపడుతున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. -
మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా విలేజ్ క్లినిక్స్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ ద్వారా గ్రామీణులకు మెరుగైన సేవలు అందించడమే వైద్య, ఆరోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా విలేజ్ క్లినిక్‌లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల (సీహెచ్‌వోల) పనితీరును ప్రతినెలా సమీక్షించనున్నారు. ఇందుకు అనుగుణంగా సూచీలను ఖరారు చేశారు. ఆయా సూచీల్లో సీహెచ్‌వోలు కనబరిచిన ప్రతిభ ఆధారంగా పనితీరును అంచనా వేస్తారు. గ్రామాల్లోనే ప్రజలకు వైద్య సేవలందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 10,032 విలేజ్ క్లినిక్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిలో బీఎస్సీ నర్సింగ్ చేసిన వారిని సీహెచ్‌వోలుగా నియమించింది. 14 అంశాల ఆధారంగా.. సీహెచ్‌వోలు ప్రజలకు అందించే సేవలతోపాటు వారి పనితీరును అంచనా వేయడానికి 14 అంశాలను ఖరారు చేశారు. ఈ అంశాల్లో నెల రోజుల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా పనితీరు అంచనా వేస్తారు. సాధారణంగా సీహెచ్‌వోలకు వైద్య శాఖ నెలకు రూ.15 వేల వరకూ పనితీరు ఆధారంగా ప్రోత్సాహకం అందిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రోత్సాహకం అందించడానికి పనితీరు అంచనాలను ప్రామాణికంగా తీసుకుంటారు. విలేజ్ క్లినిక్ పరిధిలోని ప్రజలకు ఓపీ, టెలీ మెడిసిన్ సేవల కల్పన, హైరిస్క్ గర్భిణుల గుర్తింపు, వీరికి కౌన్సెలింగ్ చేయడం, ఆర్సీహెచ్ పోర్టల్‌లో చిన్నారుల రిజిస్ట్రేషన్, ఏడాదిలోపు పిల్లలకు ఫుల్ ఇమ్యూనైజేషన్, ఎన్సీడీ సర్వే పురోగతి వంటి 14 అంశాల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా పనితీరు అంచనా ఉంటుంది. 12 రకాల వైద్య సేవలు విలేజ్ క్లినిక్‌ల ద్వారా ప్రజలకు 12 రకాల వైద్య, 14 రకాల పరీక్షల సేవలు అందిస్తోంది. 67 రకాల మందులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. టెలీ మెడిసిన్ ద్వారా పీహెచ్సీ వైద్యుడితోపాటు హబ్‌లోని జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిషన్ వంటి స్పెషలిస్ట్ వైద్యుల కన్సల్టేషన్ సేవలు ప్రజలకు అందుతున్నాయి. మరోవైపు ఫ్యామిలీ డాక్టర్ విధానంలో భాగంగా పీహెచ్సీ వైద్యులు నెలలో రెండుసార్లు విలేజ్ క్లినిక్‌లను సందర్శిస్తున్నారు. -
విజయనగరం వైద్య కళాశాలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైద్య విద్యలో సువర్ణాధ్యాయం లిఖించేలా కీలక ముందడుగు పడింది. విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 150 ఎంబీబీఎస్ సీట్లకు అడ్మిషన్లు నిర్వహించేలా నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్ఎంసీ నుంచి వైద్య శాఖకు మంగళవారం ఉత్తర్వులు అందాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏకంగా 17 వైద్య కళాశాలలను సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలల్లో అకడమిక్ కార్యకలాపాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఐదుచోట్ల జిల్లా ఆస్పత్రులను యుద్ధప్రాతిపదికన బోధనాస్పత్రులుగా తీర్చిదిద్దడంతోపాటు ఒక్కోచోట 150 ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిషన్లకు అనుమతులు కోరుతూ ఎన్‌ఎంసీకీ గత ఏడాది దరఖాస్తు చేసింది. దీంతో ఈ నెల మొదటి వారంలో 5చోట్ల ఎన్ఎంసీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. అనంతరం విజయనగరం వైద్య కళాశాలలో అడ్మిషన్లకు ఆమోదం లభించింది. మిగిలిన నాలుగు కళాశాలలకు ఆమోదం లభించాల్సి ఉంది. వీటికి కూడా ఆమోదం లభిస్తే వచ్చే విద్యా సంవత్సరంలో ఏకంగా 750 ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్రానికి అదనంగా సమకూరుతాయి. తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్రంలో చివరిసారిగా 2014లో నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చింది. ఈ కళాశాల ఏర్పాటుకు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడే అడుగులు పడ్డాయి. అనంతరం టీడీపీ హయాంలో ఒక్కటి కూడా ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కాలేదు. అంతకుముందు చంద్రబాబు సీఎంగా ఉన్న రోజుల్లోనూ ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఏర్పాటుకు కృషి చేసిన దాఖలాలు లేవు. టీడీపీ ప్రభుత్వం ప్రైవేట్ వైద్య కళాశాలల ఏర్పాటుకు కొమ్ముకాసింది. సీఎం వైఎస్ జగన్ కృషితో తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాల ఏర్పాటైంది. వైద్య రంగంలో మరో మైలురాయి విజయనగరం వైద్య కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ఇచ్చేందుకు ఎన్ఎంసీ ఆమోదం ఇవ్వడం శుభపరిణామం. దీంతో రాష్ట్ర వైద్య రంగంలో మరో మైలురాయి వచ్చి చేరింది. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటును సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో తొలుత విజయనగరం కళాశాలకు ఎన్ఎంసీ అనుమతులు లభించాయి. విజయనగరం వైద్య కళాశాలతో ఉత్తరాంధ్ర ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సంరక్షణ సమకూరుతుంది. మరో 4 కళాశాలలకు కూడా అనుమతులు లభిస్తాయని దృఢ నిశ్చయంతో ఉన్నాం. 2019లో రాష్ట్రంలో మొత్తం 911 పీజీ సీట్లు ఉండేవి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవతో ఆ సీట్లను 1,249 కు పెంచుకోగలిగాం. మరో 637 సీట్ల పెంపుదల కోసం చేస్తున్న కృషిలో భాగంగా ఇప్పటివరకు 90 సీట్లను అదనంగా సాధించగలిగాం. – విడదల రజని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి -
శారీరక శ్రమతోనే ఎన్సీడీ సమస్యలకు చెక్
సాక్షి, అమరావతి: బీపీ, షుగర్, ఇతర నాన్‌కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) నుంచి బయటపడడానికి నడక, వ్యాయామం వంటి శారీరకశ్రమే శరణ్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చెప్పారు. ఆయన సోమవారం మంగళగిరిలోని తన కార్యాలయం నుంచి రాష్ట్రంలోని ప్రైవేట్, ఎయిడెడ్, సాంకేతిక విద్యాసంస్థల యజమానులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీడీ సమస్యల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సీఎం జగన్ ఆదేశించినట్టు చెప్పారు. ఇందులో భాగంగా అవగాహన కార్యక్రమాలను డ్రైవ్‌లా చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీనికి ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. రోజూ ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు నడక, వ్యాయామాలు చేసుకోవడానికి వీలుగా స్థలాలు, క్రీడామైదానాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. దీనిపై విద్యాసంస్థల యాజమాన్యాలు రెండు, మూడురోజుల్లో తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలపాలని కోరారు. రాష్ట్రంలో 1990లో 30 శాతం ఉన్న ఎన్సీడీ ప్రభావం ప్రస్తుతం 63 శాతానికి పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో 68 శాతం మరణాలకు ఎన్సీడీ సమస్యలే ప్రధాన కారణమన్నారు. ఈ క్రమంలో ఎన్సీడీ సమస్యల కట్టడిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. 30 ఏళ్లు పైబడిన వారికి వైద్యశాఖ స్క్రీనింగ్ చేసి ఆరోగ్య సమస్యలు గుర్తిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి ఐదుగురిలో ఒకరు బీపీ/షుగర్‌తో ఉన్నట్టు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు, కమిషనర్ సురేష్‌బాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, ఉన్నత విద్యామండలి చైర్మన్ డాక్టర్ హేమచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
కడుపు కోత తగ్గించేలా!
రాష్ట్రలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కువగా సిజేరియన్ ప్రసవాలే చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనిని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేస్తున్న సిజేరియన్ల నియంత్రణకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం వైద్య శాఖ ప్రత్యేక ప్రణాళిక రచించింది. సాక్షి, అమరావతి: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాల ప్రకారం మొత్తం ప్రసవాల్లో సిజేరియన్లు 10 నుంచి 15 శాతంలోపే ఉండాలి. కానీ.. మన రాష్ట్రంలో ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన మొత్తం ప్రసవాల్లో 2021–22లో 43.82 శాతం, 2022–2023 (ఏప్రిల్ నుంచి డిసెంబర్)లో 47.39 శాతంగా నమోదైంది. హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఐఎస్) సమాచారం ప్రకారం.. 2021–22 సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగిన మొత్తం ప్రసవాల్లో 50.81 శాతం సిజేరియన్లుగా నమోదయ్యాయి. 2022–23లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ పరిశీలిస్తే 55.83 శాతానికి పెరిగింది. ప్రభుత్వాస్పత్రుల్లో సిజేరియన్ ప్రసవాల నియంత్రణకు వైద్య శాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్ల నియంత్రణ చర్యల్లో భాగంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా 26 జిల్లాల్లో ప్రసూతి సేవలందిస్తున్న నెట్వర్క్ ఆస్పత్రుల్లో నిర్వహించిన సిజేరియన్ ప్రసవాలపై ఆడిట్ నిర్వహించింది. 74 ఆస్పత్రుల్లో 91నుంచి 100 శాతం సిజేరియన్లే 2022–23 సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య రాష్ట్రంలో ప్రసూతి సేవలు అందిస్తున్న 198 ఆస్పత్రుల్లో సిజేరియన్ ప్రసవాలపై వైద్య శాఖ అధ్యయనం నిర్వహించింది. వీటిలో ఏకంగా 74 ఆస్పత్రుల్లో 91నుంచి 100 శాతం సిజేరియన్లే చేసినట్టు తేలింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 14, పల్నాడులో 9, అనకాపల్లిలో 7, గుంటూరులో 8 ఆస్పత్రులు ఈ జాబితాలో ఉన్నాయి. 45 ఆస్పత్రుల్లో 81నుంచి 90 శాతం, 38 ఆస్పత్రుల్లో 71నుంచి 80%, 41 ఆస్పత్రుల్లో 70 శాతానికిపైగా సిజేరియన్లు చేసినట్టు అధికారులు గుర్తించారు. జిల్లాల వారీగా అత్యధికంగా సిజేరియన్లు నిర్వహించిన ఆస్పత్రులను పరిశీలిస్తే.. శ్రీసత్యసాయి జిల్లాలోని ఓ ఆస్పత్రిలో 714 ప్రసవాలకు గాను.. 712 సిజేరియన్లు చేశారు. కర్నూలు జిల్లాలోని మరో ఆస్పత్రిలో 322 కాన్పులకు గాను 321, అన్నమయ్య జిల్లాలో 290 ప్రసవాలకు గాను 290 సిజేరియన్లు చేశారు. కుటుంబ సభ్యుల నుంచీ ఒత్తిడి! సిజేరియన్ చేయాలని గర్భిణుల కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉండటం వల్లే ఇలా చేయాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. తొలి కాన్పు సిజేరియన్ అయితే.. రెండో కాన్పు కూడా అలా చేయక తప్పడం లేదంటున్నారు. ఇందులో కొంత నిజం ఉన్నప్పటికీ వైద్యులు అందుకు అంగీకరించకూడదని.. సంబంధిత కేసుల్లో ఆయా కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొన్ని ఆస్పత్రులైతే సిజేరియన్లు చేయడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. కారణాలివీ.. ► సాధారణ ప్రసవంతో పోలిస్తే సిజేరియన్‌కు ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం చెల్లిస్తున్న ఫీజు ఎక్కువగా ఉండటం. సాధారణ ప్రసవం చేయాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో గర్భిణి, కడుపులోని బిడ్డ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తూ ఉండాలి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిపుణులైన నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండరు. దీంతో అన్ని గంటలపాటు ప్రైవేట్ వైద్యులు ఓపికతో ఎదురుచూసే పరిస్థితులు లేకపోవడం. ► చిన్నపాటి నర్సింగ్ హోమ్‌లు, ఆస్పత్రులకు ప్రత్యేకంగా 24/7 ఆనస్తీషియా వైద్యుడు అందుబాటులో లేకపోవడం. ► యువ వైద్యుల్లో సాధారణ ప్రసవాలు నిర్వహించడానికి తగినంత అనుభవం, ఆత్మవిశ్వాసం లేకపోవడం. ► సాధారణ ప్రసవానికి సిద్ధపడేలా సిజేరియన్ ప్రసవంతో సంభవించే సమస్యలపై గర్భిణి, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయకపోవడం. -
5,204 స్టాఫ్ నర్స్ పోస్టులు.. 40 వేల దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: స్టాఫ్‌నర్స్ పోస్టులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. వైద్య, ఆరోగ్య శాఖ నెలన్నర క్రితం 5,204 స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. వాటిని తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే గడువు బుధవారమే ముగియగా, తాజాగా దానిని 21వ తేదీ వరకు పొడిగించారు. ఇప్పటివరకు ఏకంగా 40 వేల దరఖాస్తులు రాగా, గడువు పొడిగింపుతో మరో 15 వేల మంది దరఖాస్తు చేసే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. వెయిటేజీకి సంబంధించి అనుభవ ధ్రువీకరణ పత్రాలు పొందడంలో ఆలస్యం, ఇతరత్రా కారణాలతో అనేకమంది దరఖాస్తు చేసుకోలేకపోవడంతో గడువు పొడిగించారు. ఒక్కో ఉద్యోగానికి 10 నుంచి 11 మంది పోటీ పడే అవకాశముందని అంచనా. ఈ పోస్టులకు పేస్కేల్ రూ.36,750–1,06,990 మధ్య ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిశాక రాత పరీక్ష వివరాలను మెడికల్ బోర్డు ప్రకటించనుంది. ఏదైనా ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో రాత పరీక్ష నిర్వహించే అవకాశముంది. పరీక్షకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు మెడికల్ బోర్డు తెలిపింది. అధికారుల అలసత్వం రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరో గ్య కేంద్రాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నవారు అనుభవ ధ్రువీకరణ పత్రా లు పొందాలని బోర్డు సూచించింది. రాత పరీక్షలో మార్కులకు గరిష్టంగా 80 పాయింట్లు ఉంటాయి. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గరిష్టంగా 20 పాయింట్ల వరకు అదనంగా ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించిన వారికి 6 నెలలకు 2.5, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. అయితే అనేకమంది అభ్యర్థులకు సంబంధిత ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు అనుభవ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో చుక్కలు చూపిస్తున్నారు. నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ల జారీలో కూడా అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీని కోసం ఎమ్మార్వో ఆఫీసుల్లోని కొందరు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.5 వేల వరకు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సంబంధిత అధికారులు దీనిపై దృష్టిపెట్టి ధ్రువీకరణ పత్రాలు సులువుగా జారీచేసేలా ఆదేశాలు జారీచేయాలని నర్సింగ్ సంఘాల నాయకులు కోరుతున్నారు. -
డాక్టర్లు, సిబ్బంది ఖాతాలకే ప్రోత్సాహకాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవల్లో నాణ్యతను మరింతగా పెంపొందించడంపై వైద్య, ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ఆరోగ్యశ్రీ ప్రోత్సాహకాల (ఇన్సెంటివ్) సొమ్మును నేరుగా వైద్యులు, వైద్య సిబ్బంది బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. ఆస్పత్రుల్లో మానవ వనరుల కొరతకు తావులేకుండా పోస్టుల భర్తీ, మౌలిక వసతుల కల్పన, అన్ని ప్రభుత్వాస్పత్రులను నెట్వర్క్ ఆస్పత్రులుగా నోటిఫై చేయడం వంటి ప్రభుత్వ చర్యలతో ఆరోగ్యశ్రీ సేవలు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రభుత్వాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు భారీగా పెరిగాయి. మొత్తం క్లెయిమ్‌లలో 30 శాతం ప్రభుత్వాస్పత్రుల నుంచి ఉంటున్నాయి. వీటిని ఇంకా పెంచడం ద్వారా ప్రభుత్వాస్పత్రులకు ఎక్కువ నిధులు రాబట్టి, ఆస్పత్రులను అభివృద్ధి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగానే ప్రోత్సాహకాల జమలోనూ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ కింద ఒక ఆపరేషన్ చేస్తే.. దానికి వచ్చే క్లెయిమ్ మొత్తంలో 25 శాతం ప్రోత్సాహకం కింద హెల్త్ కేర్ స్టాఫ్‌కు వస్తుంది. ఈ మొత్తాన్ని నిబంధనలకు అనుగుణంగా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి కేటాయిస్తారు. ఇప్పటివరకూ ఈ సొమ్మును ఆస్పత్రుల సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ఉండే ఖాతాల్లో జమ చేస్తున్నారు. అనంతరం వాటిని వైద్యులు, సిబ్బందికి పంపిణీ చేస్తున్నారు. ఈ విధానంలో కాలయాపన జరుగుతోంది. దీంతో నేరుగా, వైత్యులు, సిబ్బంది ఖాతాల్లోనే ఈ సొమ్ము జమ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఏపీవీవీపీ, డీఎంఈ ఆస్పత్రుల్లోని వైద్యులు, ఇతర సిబ్బంది బ్యాంక్ ఖాతాల వివరాలను ఆన్లైన్లో రిజిస్టర్ చేసే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నెల నుంచి డీఎంఈలో ప్రారంభం ఆరోగ్యశ్రీ ప్రోత్సాహకాలు నేరుగా సిబ్బంది ఖాతాల్లో జమ చేసే విధానాన్ని ఈ నెల నుంచి డీఎంఈ ఆస్పత్రుల్లో ప్రారంభిస్తున్నాం. అనంతరం ఏపీవీవీపీ ఆస్పత్రులకూ విస్తరిస్తాం. జనవరి వరకు పాత విధానంలో చెల్లింపులు ఉంటాయి. ఏ నెలకు ఆ నెల ప్రోత్సాహకాలు నేరుగా వ్యక్తిగత ఖాతాల్లో ట్రస్టు నుంచి జమ అవుతాయి. ఈ విధానంతో వైద్యులు, సిబ్బందిలో నూతనోత్తేజం వస్తుందని భావిస్తున్నాం. తద్వారా ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు మరింత పెరుగుతాయని భావిస్తున్నాం. – డాక్టర్ వినోద్‌కుమార్, డీఎంఈ -
సచివాలయాల ద్వారా 3.64 కోట్ల సేవలు
యడ్లపాడు: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా తమ ప్రభుత్వం ఇప్పటివరకు ప్రజలకు 3.64 కోట్ల సేవలను అందించిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ఇది మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడులో ఉపాధిహామీ పథకం కింద రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని మంగళవారం మంత్రి ప్రారంభించారు. ప్రతి రెండువేల జనాభాకు ఒక సచివాలయం చొప్పున ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా 15,004 సచివాలయాలను నిర్మించారని, ఇది దేశ చరిత్రలోనే మహాయజ్ఞమని పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం 1.34 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిందని చెప్పారు. వీరిలో 85 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారే ఉండటం గమనించాల్సిన విషయమన్నారు. ప్రతి సచివాలయం ద్వారా 540 రకాల ప్రభుత్వ సేవలను అందిస్తున్నామన్నారు. 50 కుటుంబాలకు ఒక వలంటీర్ వంతున లక్షలమందిని నియమించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. ఒక్క వంకాయలపాడు సచివాలయం పరిధిలోనే నాలుగువేలకుపైగా ప్రభుత్వ సేవల్ని ప్రజలకు అందించినట్లు చెప్పారు. టీడీపీ హయాంలో అంతా దుర్మార్గమేనని చెప్పారు. అప్పట్లో జన్మభూమి కమిటీలకు నచ్చిన, వారి పార్టీకి చెందిన, లంచం ఇచ్చిన వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అందేవన్నారు. -
ఆరోగ్యానికి వై‘ఎస్సార్’.. ప్రైవేటుకు దీటుగా వైద్యం
కాకినాడ సిటీ: చిన్న జబ్బు చేసి, ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే రోజుకు కనీసం రూ.500 నుంచి రూ.1,000 ఖర్చు చేయాల్సిందే. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వారికి తరచూ రక్త పరీక్ష, మందుల ఖర్చు సరేసరి. ఇటువంటి పరిస్థితుల్లో జబ్బు చేసిందంటే పేదవారు ఆర్థికంగా ఇబ్బందులు పడక తప్పేది కాదు. ఈ దుస్థితి నుంచి వారిని బయట పడేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్యరంగంపై ఫోకస్ పెట్టారు. పక్కా భవనాలు, నిపుణులైన వైద్యులు, వైద్య సిబ్బంది, అన్ని సౌకర్యాలతో వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు (యూహెచ్‌సీ) ఏర్పాటు చేశారు. ఇవి పేదల ఆరోగ్యానికి ఎంతో భరోసా ఇస్తున్నాయి. కాకినాడ, పెద్దాపురం, తుని, సామర్లకోట, పిఠాపురం వంటి పట్టణాల్లో శివారు ప్రాంతాల నుంచి సైతం 10 నిమిషాల్లో కాలినడకన చేరుకునేలా యూహెచ్‌సీలు ఏర్పాటు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్సీ) ఉండగా, వీటితో పాటు జిల్లాలో కొత్తగా 23 వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో యూహెచ్‌సీకి రూ.80 లక్షల చొప్పున వెచ్చించారు. ప్రభుత్వ సాయం మరువలేం పిల్లలు, వృద్ధులకు చిన్నపాటి జబ్బు చేస్తే.. ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్తే పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చయ్యేవి. చాలా దూరం కావడంతో ప్రభుత్వాసుపత్రికి వెళ్లడానికి ఎంతో సమయం పట్టేది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేసి సత్వరమే ఉచిత వైద్యం అందిస్తోంది. ప్రభుత్వ సాయాన్ని పేద ప్రజలు ఎప్పటికీ మరువలేరు. – డి.జితేంద్రసింగ్, స్వర్ణాంధ్ర కాలనీ, కాకినాడ అన్ని రకాల చికిత్సలూ అందిస్తున్నాం వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లో పేదలకు అన్ని రకాల వైద్య చికిత్సలూ అందిస్తున్నాం. ముఖ్యంగా ల్యాబ్ ద్వారా రక్త పరీక్షలు నిర్వహించి, దీర్ఘకాలిక రోగులకు ఎప్పటికప్పుడు ఉచితంగా మందులు అందజేస్తున్నాం. కొంత ఇబ్బందికరంగా ఉన్న రోగులను పర్యవేక్షణలో ఉంచుకుని, వైద్యం అందించేందుకు 10 పడకలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పడిప్పుడే వీటికి అవసరమైన పరికరాలు వస్తున్నాయి. రోగులకు అవసరమైన స్థాయిలో సిబ్బంది ఉండటంతో సత్వరం వైద్య సేవలందిస్తున్నాం. వారంలో ఒక రోజు ఇద్దరు, ముగ్గురు స్పెషలైజేషన్ చేసిన వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. – డాక్టర్ వి.మహేష్, పర్లోవపేట, వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్, కాకినాడ ఇవీ సౌకర్యాలు ► ఒక్కో అర్బన్ హెల్త్ సెంటర్‌ను 10 గదులతో నిర్మించారు. ► ప్రతి భవనంలో 10 పడకలు, ఓపీ–1, ఓపీ–2, లేబర్ రూము, మైనర్ ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, యోగా గది, ఫార్మా గది, మినీ వార్డులు ఉన్నాయి. ► ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఒక వైద్యాధికారి వైద్య సేవలు అందిస్తారు. వీరితో పాటు ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, అటెండర్ అందుబాటులో ఉంటారు. ► ప్రతి సోమవారం ఒక స్పెషలైజేషన్ వైద్యుడి సేవలు అందిస్తున్నారు. ► బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక రోగులు ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరగనవసరం లేకుండా అర్బన్ హెల్త్ సెంటర్లోనే రక్త పరీక్షలు చేస్తారు. ► అనంతరం వైద్యులు ఆ రిపోర్టులు చెక్ చేసి, ఉచితంగా మందులు అందజేస్తారు. ► ల్యాబ్‌లో అన్ని రకాల వైద్య పరీక్షలూ ఉచితంగా చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ► ఎవరికైన రోగ తీవ్రత ఎక్కువగా ఉంటే ఈ–సంజీవని యాప్ ఆయా స్పెషలైజ్డ్ డాక్టర్ల సలహా తీసుకుని, చికిత్స చేసి, మందులు అందజేస్తారు. శివారు ప్రాంతాలకు ఎంతో మేలు డాక్టర్ వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు పట్టణాల్లోని శివారు ప్రాంత ప్రజలకు వరంలా ఉన్నాయి. కాకినాడ నగరంలోని దుమ్ములపేట, పర్లోవపేట, సంజయ్‌నగర్, సాంబమూర్తినగర్, రేచర్లపేట కొత్త కాకినాడ, జగన్నాథపురం, నరసింహా రోడ్డు, పప్పుల మిల్లు, పద్మనాభ నగర్, ఏటిమొగ, ముత్తానగర్, మహాలక్ష్మి నగర్, రణదీప్ నగర్, నాయకర్ నగర్, జె.రామారావుపేట, ఏసువారి వీధి, చినమార్కెట్ తదితర శివారు ప్రాంతాలకు అర్బన్ హెల్త్ సెంటర్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ శివారు కాలనీల్లోని ప్రజలు గతంలో ఏదైనా చిన్నపాటి జబ్బు చేస్తే ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి(జీజీహెచ్)కి వెళ్లడానికి చాలా వ్యయప్రయాసలు పడేవారు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లతో చేరువలోనే సత్వర వైద్య సేవలు అందుతున్నాయని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
శరవేగంగా.. పారదర్శకంగా
సాక్షి, అమరావతి: అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే ఒక్క మెతుకు చాలు! ఉద్యోగాల భర్తీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిబద్ధత గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకేసారి లక్షల ఉద్యోగాల భర్తీతోనే రుజువైంది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఒకేదఫాలో 1.35 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను సక్రమంగా భర్తీ చేసి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఉద్యోగాల భర్తీ ఎంత ప్రధానమో పారదర్శకంగా చేపట్టి అర్హులకు న్యాయం చేయడం అంతకంటే ముఖ్యమన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విధానాలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తూ వైద్య ఆరోగ్య శాఖలో 48 వేలకుపైగా ఉద్యోగాలను శరవేగంగా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. తాజాగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలను రెండు వారాల్లోనే వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంటేనే అక్రమాలు, అవకతవకలు, నిబంధనల ఉల్లంఘన అని పలు సందర్భాల్లో రుజువు కాగా కోర్టు కేసులు, ఏళ్ల తరబడి సుదీర్ఘ భర్తీ ప్రక్రియతో నిరుద్యోగుల్లో నైరాశ్యం ఆవహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అందుకు భిన్నంగా సక్రమం.. సత్వరం.. పూర్తి పారదర్శక విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తోంది. రెండు వారాల్లోనే ప్రిలిమినరీ ఫలితాలు పోలీసు ఉద్యోగార్థుల కలలను నిజం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టింది. ఏటా కనీసం 6 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఈ ఏడాది 6,100 కానిస్టేబుల్, 411 ఎస్సై పోస్టులతో మొత్తం 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీని రాష్ట్ర పోలీసు నియామక మండలి చేపట్టింది. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి జనవరి 22న ప్రిలిమినరీ పరీక్షను 997 కేంద్రాల్లో నిర్వహించింది. 6,100 పోస్టులకు 5.03 లక్షల మంది దరఖాస్తు చేయగా ప్రిలిమినరీకి 4,59,182 మంది హాజరయ్యారు. అంత భారీగా అభ్యర్థులు ఉన్నప్పటికీ రాత పరీక్ష ఫలితాలను కేవలం రెండు వారాల్లోనే ప్రకటించడం విశేషం. ప్రాథమిక ‘కీ’ కూడా ప్రకటించి అభ్యంతరాలను తెలిపేందుకు అవకాశం కల్పించారు. వాటిని పరీశీలించి మూడు ప్రశ్నలకు సమాధానాలను సరి చేసి తుది ‘కీ’ విడుదల చేశారు. ప్రిలిమినరీ పరీక్షలో 95,208 మంది అర్హత సాధించారు. మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించేందుకు కటాఫ్ మార్కును కూడా పోలీసు నియామక మండలి హేతుబద్ధంగా నిర్ణయించింది. మొత్తం 200 మార్కుల పరీక్షలో జనరల్ అభ్యర్థులకు 40 శాతం అంటే 80 మార్కులను కటాఫ్‌గా ఖరారు చేసింది. బీసీ అభ్యర్థులకు 35 శాతం అంటే 70 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికుల కేటగిరీ అభ్యర్థులకు 30 శాతం అంటే 60 మార్కులు కటాఫ్‌గా నిర్ణయించారు. ఇక అభ్యర్థుల్లో ఎలాంటి అపోహలు తలెత్తకుండా ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ షీట్లను కూడా అందుబాటులోకి తేవడం గమనార్హం. అభ్యర్థులు తమ ఓఎంఆర్ షీట్లను డౌన్లోడ్ చేసుకుని ‘కీ’తో సరిచూసుకునేందుకు మూడు రోజులపాటు అవకాశం కల్పించారు. పోలీస్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఇంత పారదర్శకంగా, నిర్ణీత షెడ్యూల్ ప్రకారం సకాలంలో నిర్వహిస్తుండటం పట్ల అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మెయిన్ పరీక్షకు, అనంతరం దేహదారుఢ్య పరీక్షలకు ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నామని చెబుతున్నారు. 411 ఎస్సై పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షను ఫిబ్రవరి 19న నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖలో 48 వేల పోస్టుల భర్తీ సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యమిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీని నిరంతర ప్రక్రియగా ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఈ మూడున్నరేళ్లలో వైద్య శాఖలోని వివిధ విభాగాల్లో ఇప్పటివరకు ఏకంగా 48 వేల ఉద్యోగాలను భర్తీ చేశారు. పత్రికల్లో నోటిఫికేషన్ జారీ చేసి షెడ్యూల్లో పేర్కొన్న ప్రకారం పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తున్నారు. ఏ ఒక్క పోస్టు భర్తీపైనా ఎలాంటి ఆరోపణలుగానీ ఫిర్యాదులుగానీ రాకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. నాడు అంతా అక్రమాలు.. కోర్టు కేసులే టీడీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంటేనే పెద్ద ప్రహసనం. రాత పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారో... ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారో అంతుబట్టక అభ్యర్థులు అల్లాడేవారు. నిబంధనలు, అర్హతలు, రిజర్వేషన్ల అమలుకు రోస్టర్ పాయింట్ల ఖరారు... ఇలా అన్ని స్థాయిల్లోనూ అక్రమాలే చోటు చేసుకోవడంతో అభ్యర్థులు తరచూ న్యాయ పోరాటాలకు దిగాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. రాత పరీక్ష ‘కీ’పై అభ్యంతరాలను కనీసం పట్టించుకునేవారే కాదు. ఓఎంఆర్ షీట్లను పరిశీలించేందుకు సులభంగా అనుమతించేవారు కూడా కాదు. రాత పరీక్ష నిర్వహణ, ఫలితాలపై అభ్యర్థుల సందేహాలకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానమే ఉండేది కాదు. అందుకు భిన్నంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో ఉద్యోగాలను భర్తీ చేస్తుండటం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విధానానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్దిష్ట ప్రక్రియను సృష్టించిందని నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి1.35 లక్షల సచివాలయాల పోస్టుల భర్తీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధి, పారదర్శకతకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిదర్శనం. పరిపాలనను ప్రజల ముంగిటకు తీసుకొస్తూ ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏకంగా 1.35 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేయడం ద్వారా యువత పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన నిబద్ధతను చాటుకున్నారు. అదీ అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే భర్తీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకేసారి ఇంత భారీస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం దేశంలోనే తొలిసారి కావడం విశేషం. 1.35 లక్షల ఉద్యోగాలకు ఏకంగా 21 లక్షల మంది దరఖాస్తు చేయగా 2019 సెప్టెంబరు 1–9త తేదీల మధ్య నిర్వహించిన ఎంపిక పరీక్షకు 19.5 లక్షల మంది హాజరయ్యారు. అయినప్పటికీ పరీక్ష ఫలితాలను 11 రోజుల్లోనే వెల్లడించి ఆపై రెండు వారాల్లోనే ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేరేలా చర్యలు తీసుకున్నారు. రెండేళ్ల ప్రొబేషన్ పూర్తి అయిన తరువాత నిబంధనల మేరకు ఉద్యోగాలను క్రమబద్ధీకరించారు. అంత భారీగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఎక్కడా ఎలాంటి అక్రమాలు, అవకతవకలు లేకుండా నిర్వహించడం సర్వత్రా ప్రశంసలు అందుకుంది. త్వరలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న మరో 14 వేల పోస్టులను కూడా అదే రీతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. -
5 కొత్త మెడికల్ కాలేజీల్లో వచ్చే ఏడాది అడ్మిషన్లు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైద్య విద్యకు మహర్దశ పట్టనుంది. వరుసగా మూడేళ్లలో 750, 750, 1,050 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. వైద్య విద్యా రంగంలో విద్యార్థులకు విస్తృత అవకాశాలు కలగనున్నాయి. ఎన్నికల హామీలను నెరవేరుస్తూ ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం రూ.8,480 కోట్లు వ్యయం చేస్తోంది. 2023–24 విద్యా సంవత్సరంలో ఐదు కొత్త వైద్య కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. 2024–25లో మరో ఐదు కళాశాలల్లో అకడమిక్ కార్యకలాపాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యుద్ధ ప్రాతిపదికన.. రానున్న విద్యా సంవత్సరం నుంచి నంద్యాల, మచిలీపట్నం, విజయనగరం, ఏలూరు, రాజమండ్రిల్లో కొత్త వైద్య కళాశాలల అకడమిక్ కార్యకలాపాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యుద్ధప్రాతిపదికన ఆయా ప్రాంతాల్లోని జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా తీర్చిదిద్దుతున్నారు. మచిలీపట్నం మినహా మిగిలిన నాలుగు చోట్ల ప్రీ–ఇంజనీర్డ్ బిల్డింగ్ (పీఈబీ) నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. వీటిల్లో అకడమిక్ కార్యకలాపాలు ప్రారంభించడం ద్వారా వచ్చే ఏడాది రాష్ట్రంలో 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరనున్నాయి. అదనపు భవనాలు, పడకలు 2024–25లో అకడమిక్ కార్యకలాపాలు మొదలయ్యే వాటిల్లో పాడేరు, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని మెడికల్ కాలేజీలున్నాయి. పాడేరులో ఇప్పటికే 150 పడకల ప్రభుత్వాస్పత్రి ఉండగా మిగిలిన నాలుగు చోట్ల వంద పడకల సామర్థ్యం కలిగిన ప్రభుత్వాస్పత్రులున్నాయి. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం కొత్త వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలంటే 330 పడకల సామర్థ్యం కలిగిన బోధనాస్పత్రి అందుబాటులో ఉండాలి. ఈ క్రమంలో ఆయా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా తీర్చిదిద్ది అదనపు భవనాల నిర్మాణం, పడకల పెంపు చేపట్టనున్నారు. మిగిలిన ఏడు వైద్య కళాశాలలు 2025–26లో అకడమిక్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేయనున్నారు. చేరువలో స్పెషాలిటీ వైద్యం కొత్త వైద్య కళాశాలల్లో అకడమిక్ కార్యకలాపాలపై లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేశాం. వచ్చే విద్యా సంవత్సరంలో 5 వైద్య కళాశాలల్లో అకడమిక్ కార్యకలాపాలు మొదలవుతాయి. అనంతరం మరో ఐదు కళాశాలల్లో ప్రారంభించేలా కృషి చేస్తున్నాం. పెద్ద ఎత్తున వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా పేద విద్యార్థులకు వైద్య విద్యతోపాటు ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత చేరువ చేయడం సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. – ఎం.టి.కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి -
ఫ్యామిలీ డాక్టర్‌తో మెరుగైన ఆరోగ్య సంరక్షణ
సాక్షి, అమరావతి: ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించాలన్న సీఎం వైఎస్ జగన్ ఆలోచనల నుంచి ఈ కార్యక్రమం పుట్టిందని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తన కార్యాలయంలో ఆమె గురువారం ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మంత్రి మాట్లాడుతూ మార్చి నెలలో పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అధికారికంగా ప్రారంభించాలని సీఎం జగన్ నిర్దేశించారని చెప్పారు. ఇందుకు అనుగుణంగా పూర్తిస్థాయిలో అమలుకు అన్ని వనరులను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. క్లినిక్‌లలో సిబ్బంది పోస్టులు ఎక్కడైనా ఖాళీగా ఉంటే వెంటనే భర్తీ చేయాలని చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా గిరిజన ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవ్వాలని ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. సికిల్ సెల్‌తో బాధపడే వారిని గుర్తించి.. వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేయాలన్నారు. ఐదు కొత్త మెడికల్ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్ పాల్గొన్నారు. -
రోగులను నిర్లక్ష్యం చేస్తే డిస్మిస్.. మంత్రి హరీశ్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రోగులపట్ల వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే డిస్మిస్ చేయడానికి కూడా వెనుకాడబోమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతల మృతి ఘటనను తీవ్రంగా పరిగణించామని.. అటువంటి ఘటనలు పునరావృతమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో ఉన్నతాధికారులతో కలసి ఆయన వైద్య, ఆరోగ్యశాఖ వార్షిక నివేదిక–2022ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఒకట్రెండు ఘటనలు మినహా గతేడాది వైద్య, ఆరోగ్యశాఖ పనితీరు దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ‘హెల్త్ ఫర్ ఎవ్రీ ఏజ్.. హెల్త్ ఎట్ ఎవ్రీ స్టేజ్.. టువార్డ్స్ ఆరోగ్య తెలంగాణ’ అనే నినాదాన్ని తాము ఎంచుకున్నామని వివరించారు. అన్ని వయసుల వారికీ వైద్యం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో వైద్య, ఆరోగ్యశాఖకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 11,440 కోట్ల బడ్జెట్ కేటాయించిందని... ఈ కేటాయింపులతో తలసరి హెల్త్ బడ్జెట్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచామన్నారు. నీతి ఆయోగ్ ర్యాంకుల్లో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. ప్రధాని మోదీ పేర్కొనే డబుల్ ఇంజన్ సర్కారున్న ఉత్తరప్రదేశ్ ఈ ర్యాంకుల్లో చివరి స్థానంలో నిలిచిందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. అలాగే వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ కాంగ్రెస్ పార్టీ చార్జిïÙట్ విడుదల చేయడాన్ని ఆయన హాస్యాస్పదంగా అభివరి్ణంచారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు చార్జిషీట్ పేరుతో హడావిడి చేశారని మండిపడ్డారు. వైద్య రంగంపై నీతి ఆయోగ్ విడుదల చేసిన సూచీలో కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాలైన రాజస్తాన్ 16వ స్థానంలో, ఛత్తీస్‌గఢ్ 10వ స్థానంలో, హిమాచల్‌ప్రదేశ్ 7వ స్థానంలో నిలిచాయనే విషయాన్ని ఆ పార్టీ నేతలు మరిచిపోయినట్లున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 50 శాతం గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారని... దీనివల్ల అక్కడక్కడా వారు అనారోగ్యం బారినపడుతున్నారని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. రాష్ట్రానికి ఎన్నో అవార్డులు... దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో అమలు చేస్తున్న మిడ్ వైఫరీ వ్యవస్థకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నుంచి టాప్ పర్ఫార్మింగ్ స్టేట్ అవార్డు లభించిందని.. యునిసెఫ్ కూడా ఈ సేవలను ప్రశింసించిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. హైరిస్క్ గర్భిణులను గుర్తించి సంరక్షించడంలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని ఆయన వివరించారు. అలాగే తెలంగాణ డయాగ్నోస్టిక్ హైదరాబాద్ సెంట్రల్ హబ్‌కు ఎన్ఏబీఎల్ గుర్తింపు లభించిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 31 లక్షల మందికి టెలి కన్సల్టెన్సీ ద్వారా వైద్య సేవలు అందించినందుకు కేంద్రం రాష్ట్రానికి అవార్డు ఇచ్చిందని హరీశ్‌రావు చెప్పారు. పీహెచ్సీ, జిల్లా ఆసుపత్రి, యూపీహెచ్‌సీలకు నేషనల్ క్వాలిటీ ఆష్యురెన్స్ ప్రోగ్రాం కింద రాష్ట్రానికి మూడు కేంద్ర అవార్డులు లభించాయన్నారు. టీబీ నియంత్రణలో ప్రతిభ కనబర్చిన నిజామాబాద్, భద్రాచలం, ఖమ్మం జిల్లాలకు వరల్డ్ టీబీ డే సందర్భంగా కేంద్రం అవార్డులు ప్రకటించిందని గుర్తుచేశారు. గతేడాది 2.59 లక్షల మందికి ఆరోగ్యశ్రీ సేవలు.. ఈ ఏడాది మరిన్ని పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకున్నామని మంత్రి హరీశ్‌రావు వివరించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నామన్నారు. ఈఎన్టీ, సరోజినీదేవి ఆసుపత్రులను మరింత పట్టిష్టం చేస్తామని, ఆహార కల్తీ నియంత్రణపై మరింతగా దృష్టి పెడతామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద గతేడాది 2.59 లక్షల మంది రోగులు లబ్ధి పొందారని, ఉద్యోగులు, జర్నలిస్టుల పథకంలో 43,702 మంది లబ్ధి పొందారని మంత్రి వివరించారు. గతంలో పరిమితి రూ. 2 లక్షలు ఉంటే దాన్ని రూ. 5 లక్షలకు పెంచామన్నారు. అలాగే అవయవ మారి్పడి వంటి శస్త్రచికిత్సల కోసం రూ. 10 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీలో కవరేజీ కలి్పస్తున్నామన్నారు. -
ప్రభుత్వ ఆసుపత్రుల్లో 4.83 కోట్ల ఓపీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ల (ఓపీ) సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెరగడంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు బదులు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారని వైద్య, ఆరోగ్యశాఖ వార్షిక నివేదిక–2022 తెలిపింది. 2021లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ 4.23 కోట్లుగా నమోదవగా 2022లో అది 4.83 కోట్లకు పెరిగిందని వెల్లడించింది. అలాగే 2021లో ఇన్–పేషెంట్ (ఐపీ) సేవలు 14.16 లక్షలుగా ఉండగా 2022లో అవి 16.97 లక్షలకు పెరిగాయని పేర్కొంది. 2021లో 2.57 లక్షలు జరగ్గా 2022 నాటికి సర్జరీల సంఖ్య 3.04 లక్షలకు పెరిగిందని తెలిపింది. నివేదికలోని ముఖ్యాంశాలు... ►2022లో ఒకేసారి 8 వైద్య కాలేజీల ప్రారంభం. ఈ ఏడాది మరో 9 కాలేజీలు ప్రారంభించే పనులు. గతేడాది అదనంగా 200 పీజీ సీట్లు. ►ఎంబీబీఎస్ సీట్లలో లక్ష జనాభాకు 19 సీట్లతో దేశంలో మొదటి స్థానం... లక్ష జనాభాకు ఏడు పీజీ మెడికల్ సీట్లతో దేశంలో రెండో స్థానం. ►మాతృత్వ మరణాల రేటు 56 నుంచి 43కు (జాతీయ సగటు 97) తగ్గుదల. ►శిశుమరణాల రేటు జాతీయ స్థాయిలో 28 ఉండగా రాష్ట్రంలో 21. ►సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 8,200 పడకలు అందుబాటులోకి తెచ్చేలా పనులు ప్రారంభం. ►గతేడాది 515 డయాలసిస్ పరికరాలతో 61 కొత్త డయాలసిస్ కేంద్రాలు మంజూరు. గతేడాది 50 లక్షలు దాటిన డయాలసిస్ సెషన్స్ సంఖ్య. ►కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ మొదటి దశలో భాగంగా 9 జిల్లాల్లో పంపిణీ ప్రారంభం. ►కంటివెలుగు రెండో దశ ప్రారంభం. ►ప్రభుత్వ ఆసుపత్రుల్లో 33 శాతంగా ఉన్న ప్రసవాల రేటు ఇప్పుడు 61 శాతానికి పెరుగుదల. ►గతేడాది జరిగిన 5.40 లక్షల ప్రసవాల్లో 61 శాతం అంటే 3.27 లక్షల ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిర్వహణ. ►ఇన్ఫెక్షన్ల నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు. ►రోగాలను ముందే గుర్తించి చికిత్స అందించేందుకు వీలుగా రాష్ట్రంలో ఎన్సీడీ స్క్రీనింగ్ కార్యక్రమానికి శ్రీకారం. గతేడాది చివరి నాటికి 1.48 కోట్ల మందికి స్క్రీనింగ్ నిర్వహణ. బీపీ, షుగర్ రోగులకు కిట్లు అందజేత. ►కరోనా బూస్టర్ డోసు పంపిణీ 47 శాతం (జాతీయ సగటు 23 శాతం) పూర్తి. ►ఇప్పటివరకు 11 వేల కొత్త పడకలు అందుబాటులోకి వచ్చాయి. 27,500 పడకలకు ఆక్సిజన్ సరఫరాకు ఏర్పాటు. ►డైట్ చార్జీలు రూ. 40 నుంచి రూ. 80కి పెంపు. ►రోగి సహాయకుల కోసం 18 పెద్దాసుపత్రుల్లో రూ. 5కే భోజన పథకం ప్రారంభం. -
ప్రజారోగ్యం బలోపేతం.. మూడు కీలక కార్యక్రమాల అమలుకు సన్నద్ధం
సచివాలయ సిబ్బంది తరహాలోనే ప్రతి గ్రామంలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ సిబ్బంది అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ప్రతి కుటుంబాన్ని కలుసుకుని విలేజ్ క్లినిక్స్ సేవలను వివరించాలి. విలేజ్ క్లినిక్స్ ఆవశ్యకత, సిబ్బంది అందుబాటులో ఉంటున్న తీరు, సేవలపై ప్రతి కుటుంబానికీ అవగాహన కలగాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు ప్రధాన కార్యక్రమాలకు మార్చి నెలలో శ్రీకారం చుట్టనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు.. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వాస్పత్రుల సందర్శన.. జగనన్న గోరుముద్ద ద్వారా పిల్లలకు వారంలో మూడు రోజులు రాగి మాల్ట్ పంపిణీ.. ఇలా ఈ మూడు కార్యక్రమాలను మార్చి నెలలో ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ప్రతి వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ను నెలలో రెండు సార్లు వైద్యులు సందర్శిస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. 4 వేలు పైబడి జనాభా ఉన్న క్లినిక్‌లను నెలలో మూడు సార్లు సందర్శించేలా చర్యలు చేపట్టామన్నారు. విలేజ్ క్లినిక్స్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌లో (ఎస్ఓపీ) పారిశుద్ధ్యం, పరిశుభ్రత, తాగునీరు, కాలుష్యం అంశాలను చేర్చామన్నారు. క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తించి బాధితులకు వైద్యం అందించడంలో భాగంగా స్క్రీనింగ్, చికిత్సలపై సిబ్బందికి అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. సమీక్ష సందర్భంగా సీఎం జగన్ పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు మార్చి 1 నుంచి ఆస్పత్రులను సందర్శించడం ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకుని ఇంకా ఏమైనా లోపాలు, సమస్యలుంటే పరిష్కరించేలా చర్యలు చేపట్టవచ్చు. ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్‌వో/జీఎంపీ ఆధీకýృత మందులు, సర్జికల్స్ మాత్రమే ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలిచ్చాం. దీన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఎక్కడా మందులకు కొరత ఉందన్న మాటే వినిపించకూడదు. ప్రజారోగ్య వ్యవస్థలో మన రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలి. ఫ్యామిలీ డాక్టర్ విధానం ట్రయల్ రన్ ఇప్పటికే కొనసాగుతోంది. ఇందులో గుర్తించిన సమస్యలు, లోపాలను సరిదిద్దుకుని మార్చి 1వతేదీ తరువాత పూర్తి స్థాయిలో కార్యక్రమాన్ని అమలు చేసేలా సన్నద్ధం కావాలి. సచివాలయాల స్థాయిలోనే రక్తహీనత గుర్తింపు గ్రామ సచివాలయాల స్థాయిలోనే రక్తహీనత బాధితులను గుర్తించి ఆరోగ్య సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి. రక్తహీనత నివారణకు వైద్యం, పౌష్టికాహారపరంగా అన్ని చర్యలు చేపట్టాలి. ఈ విషయంలో వైద్య ఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మధ్య పూర్తి సమన్వయం ఉండాలి. డేటా అనుసంధానాన్ని సమర్థంగా చేపట్టాలి. పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు పరస్పరం అనుసంధానమై తల్లులు, పిల్లల్లో రక్తహీనత లాంటి సమస్యలను పూర్తిగా నివారించాలి. కౌమార బాలికలు, గర్భిణుల్లో రక్తహీనత నివారణకు బీ–12 సబ్ లింగ్యువల్ టాబ్లెట్లను పంపిణీ చేయాలన్న నిపుణుల సూచనల మేరకు చర్యలు తీసుకోవాలి. పాఠ్య ప్రణాళికలో ఆరోగ్య అంశాలు పరిసరాల పరిశుభ్రత, సమతుల ఆహారం, వ్యాయామం ఇతర ఆరోగ్య అంశాలను పాఠ్య ప్రణాళికలో చేర్చాలి. పారిశుద్ధ్యం, పరిశుభ్రత, కాలుష్యం తదితరాలకు సంబంధించి విలేజ్ క్లినిక్స్ సిబ్బంది సమస్యలను నివేదించగానే వెంటనే చర్యలు చేపట్టే విధంగా వ్యవస్థలను సిద్ధం చేయాలి. మండల స్థాయి అధికారులు, జేసీ, జిల్లా కలెక్టర్ వీటిపై పర్యవేక్షణ చేయాలి. 108, 104 వాహనాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. రోజూ దీనిపై సమీక్షించాలి. జిల్లాల్లో కలెక్టర్లు కూడా పర్యవేక్షించాలి. ఎన్సీడీ బాధితులపై ప్రత్యేక శ్రద్ధ గుండె జబ్బులు, క్యాన్సర్, బీపీ, మధుమేహం లాంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్(ఎన్సీడీ) నియంత్రణ, నివారణ, చికిత్సలపై దృష్టి సారించాలి. బాధితుల ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ వహించాలి. క్రమం తప్పకుండా మందులు తీసుకుంటున్నారో లేదో ఆరా తీయాలి. అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ద్వారా బాధితులను కలిసి ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించాలి. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన పేషెంట్లు డిశ్చార్జి అనంతరం ఇంటికి చేరుకున్నాక ఏఎన్ఎంలు వారిని పరామర్శించి ఆస్పత్రి సేవలపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. ఆ నివేదిక ఆధారంగా ఆస్పత్రులకు బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. ఉద్దానం కిడ్నీ జబ్బులకు శాశ్వత పరిష్కారాలు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ప్రాంతాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాం. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ జబ్బుల నివారణలో భాగంగా తాగునీటి కోసమే దాదాపు రూ.700 కోట్లు ఖర్చు పెడుతున్నాం. పాలకొండ ప్రాంతంలో తాగునీటికి సుమారుగా రూ.265 కోట్లు వ్యయం చేస్తున్నాం. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఆస్పత్రిని నిర్మిస్తున్నాం. తాగునీటి పథకం, ఆస్పత్రి ఈ రెండూ మార్చి కల్లా పూర్తవుతాయని అధికారులు నాకు సమాచారం ఇచ్చారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల సమస్యకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారాలు చూపుతోంది. పలాసలో నిర్మిస్తున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలి. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి సమస్య నివారణ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు. బోధనాస్పత్రుల్లో క్యాన్సర్‌కు అధునాతన చికిత్స ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో క్యాన్సర్‌కు అధునాతన చికిత్స, మౌలిక సదుపాయాలను కల్పించాలి. ప్రస్తుతమున్న, కొత్తగా నిర్మిస్తున్న బోధనాస్పత్రుల్లో ఈ ప³రికరాలు, చికిత్సలు ఉండాలి. గుండె జబ్బుల చికిత్స కేంద్రాలుండాలి. అన్ని చోట్ల క్యాథ్ ల్యాబ్స్ పెట్టాలి. నిర్మాణం పూర్తవుతున్న కొద్దీ కొత్త బోధనాస్పత్రుల్లో ఇవి ఏర్పాటు కావాలి. అన్ని టీచింగ్ ఆస్పత్రుల్లో క్యాన్సర్, కార్డియాక్ సదుపాయాలు ఉండాలి. ఈ సౌకర్యాలను మెరుగు పరచుకోవడం ద్వారా క్యాన్సర్, గుండె స్పెషాలిటీల్లో మరిన్ని పీజీ సీట్లు సాధించేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా రాష్ట్రంలోనే సరిపడా వైద్య నిపుణులు తయారవుతారు. దంత సంరక్షణపై చిన్నారులు, పాఠశాల విద్యార్థుల్లో అవగాహన కల్పించాలి. స్క్రీనింగ్ నిర్వహించి చికిత్స అందించడంపై ఆలోచన చేయాలి. రోగులకు మరింత నాణ్యతతో, మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ యాప్ ప్రారంభించేందుకు సన్నద్ధం కావాలి. జాతీయ స్థాయిలో వైద్య శాఖకు అవార్డులు జాతీయ స్థాయిలో కాగిత రహిత వైద్య సేవల్లో రాష్ట్ర వైద్య శాఖ ఐదు అవార్డులు సాధించినట్లు వైద్య, ఆర్యోగ్యశాఖ మంత్రి విడదల రజని, అధికారులు తెలియచేయగా సీఎం జగన్ వారిని అభినందించారు. రాష్ట్రీయ కిషోర స్వాస్త్యా కార్యక్రమం (ఆర్కేఎస్కే)–స్కూల్, వెల్నెస్ కార్యక్రమం అమలులో జాతీయ స్థాయిలో ఇటీవల వైద్య శాఖకు లభించిన రెండు అవార్డులను సీఎం పరిశీలించారు. సమీక్షలో సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్ నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ మురళీధర్‌రెడ్డి, డీఎంఈ, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వినోద్ కుమార్, ఔషధ నియంత్రణ డీజీ రవిశంకర్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ సాంబశివారెడ్డి పాల్గొన్నారు. -
ఏపీ వైద్య శాఖ కృషి.. హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: హైరిస్క్ ప్రెగ్నెన్సీ అనేది మాతృ మరణాలకు ప్రధాన కారణం. రక్తహీనత, చిన్న వయసులో గర్భం దాల్చడం, 2 లేక 3 అబార్షన్ల అనంతరం గర్భం దాల్చడం, ఎక్కువ కాన్పులు, అధిక బీపీ, గుండె, కిడ్నీ జబ్బులు, ఇతర సమస్యలతో గర్భం దాల్చిన మహిళలను హైరిస్క్‌గా పరిగణిస్తారు. వీరికి ప్రసవం సమయంలో ఇతర ఆరోగ్య పరమైన ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఈ క్రమంలో ప్రసవానికి ముందే వీరిని పెద్దాస్పత్రులకు తరలించడం ద్వారా ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండేందుకు వైద్య శాఖ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని హైరిస్క్ గర్భిణిలను డెలివరీ డేట్‌కు సుమారు వారం రోజుల ముందే సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా, బోధనాస్పత్రులకు తరలించే కార్యక్రమాన్ని గత నెలలో ప్రారంభించారు. ఇందుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది. గత నెల 15వ తేదీ నుంచి ఇప్పటి వరకు 5,398 మందిని తరలించగా.. 4,678 మంది సురక్షితంగా ప్రసవించారు. వీరిలో 332 మంది సీహెచ్‌సీల్లో, 447 మంది ఏరియా, 535 మంది జిల్లా ఆస్పత్రుల్లో, 916 మంది బోధనాస్పత్రుల్లో, 147 మంది ఎంసీహెచ్ సెంటర్లలో, మిగిలిన వారు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ప్రసవం నిర్వహించారు. పక్కా ప్రణాళికతో తరలింపు ప్రసవానికి సిద్ధంగా ఉన్న హైరిస్క్ గర్భిణుల వివరాలను ఏఎన్ఎం యాప్ ద్వారా ఏఎన్ఎంలకు పంపుతున్నారు. ఈ క్రమంలో వారు స్థానిక పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్‌తో కలిసి తమ పరిధిలోని హైరిస్క్ గర్భిణులను ఏ ఆస్పత్రికి తరలించాలనే దానిపై ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఆ మేరకు ప్రసవానికి ముందే గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తారు. ఈ ప్రక్రియపై రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన మెటర్నల్ మానిటరింగ్ సెల్ నుంచి పర్యవేక్షణ ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే నెల 21వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 8,384 మంది హైరిస్క్ గర్భిణులు ప్రసవానికి సిద్ధంగా ఉన్నారు. వీరి వివరాలను ఇప్పటికే ఏఎన్ఎం యాప్‌లో పొందుపరిచారు. తద్వారా వీరిలో ఇప్పటికే 592 మంది గర్భిణులను పెద్దాస్పత్రులకు తరలించారు. మరో 7,792 మందిని ఆస్పత్రులకు తరలించాల్సి ఉంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఏటా 8 లక్షల మందికిపైగా గర్భిణులు ఆర్సీహెచ్ పోర్టల్‌లో రిజిస్టర్ అవుతుంటారు. వీరిలో 10 శాతం మంది హైరిస్క్‌లో ఉంటున్నారు. ఈ లెక్కన నెలకు 5 వేల వరకు హైరిస్క్ గర్భిణుల ప్రసవాలు జరుగుతుంటాయి. -
రాష్ట్ర వైద్య శాఖకు ఐదు జాతీయ స్థాయి అవార్డులు
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో రాష్ట్ర వైద్య శాఖకు ఐదు అవార్డులు లభించాయి. రాష్ట్ర ప్రజలకు పేపర్ రహిత వైద్య సేవలు వేగంగా చేరువ చేస్తూ, ఉత్తమ పని తీరు కనబరుస్తున్నందుకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మూడు విభాగాల్లో ఈ అవార్డులను ప్రకటించింది. పేపర్ రహిత వైద్య సేవల్లో భాగంగా ప్రతి వ్యక్తికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్లు సృష్టిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 5.4 కోట్ల మందికి హెల్త్ ఐడీలను ఇచ్చారు. ఇందులో 3.79 కోట్ల మంది హెల్త్ ఐడీలకు వారి ఆరోగ్య రికార్డులను అనుసంధానించారు. ఇలా డిజిటల్ హెల్త్ ఐడీలకు ఆరోగ్య రికార్డులను అనుసంధానించిన రాష్ట్రాల విభాగంలో ఏపీ ప్రథమ స్థానం పొందింది. జిల్లాల విభాగంలో దేశంలోనే తొలి మూడు అవార్డులూ వరుసగా ఏలూరు, విశాఖపట్నం, పల్నాడు జిల్లాలకొచ్చాయి. ఇంటిగ్రేటెడ్ విధానంలో హెల్త్ ఐడీలకు ఆరోగ్య రికార్డులు అనుసంధానించిన విభాగంలోనూ రాష్ట్రానికి మొదటి స్థానం లభించింది. గతేడాది అక్టోబర్ 20 నుంచి డిసెంబర్ 10 మధ్య కనబరిచిన ఉత్తమ ప్రతిభకు ఈ అవార్డులిచ్చారు. అంతకు ముందు రెండు నెలల్లో పనితీరుకు ప్రకటించిన అవార్డుల్లోనూ ఏపీకి జాతీయ స్థాయిలో ఆరు లభించాయి. ఈ లెక్కన నాలుగు నెలల్లో రాష్ట్ర వైద్య శాఖకు జాతీయ స్థాయిలో 11 అవార్డులు వచ్చాయి. ప్రజల ప్రాథమిక ఆరోగ్య వివరాలు నిక్షిప్తం వైఎస్ జగన్ సీఎం అయిన నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. పేపర్ రహిత వైద్య సేవల్లోనూ వేగంగా చర్యలు చేపడుతోంది. 2021 అక్టోబర్‌లో రాష్ట్ర వైద్య శాఖ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్–కమ్యూనికబుల్ డిసీజెస్(ఎన్సీడీ–సీడీ) 2.0ను ప్రారంభించింది. ఏఎన్ఎం, ఆశ వర్కర్లు ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలకు డిజిటల్ హెల్త్ ఐడీలను సృష్టించడంతో పాటు, స్క్రీనింగ్ నిర్వహించి ప్రాథమిక ఆరోగ్య వివరాలను హెల్త్ ఐడీల్లో నిక్షిప్తం చేశారు. ఇలా ఇప్పటివరకు 5.4 కోట్ల మందికి హెల్త్ ఐడీలను సృష్టించారు. మరోవైపు 14,505 ప్రభుత్వాస్పత్రులు, 21,200 మంది వైద్యులు, ఇతర సిబ్బందిని ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌లో రిజిస్టర్ చేశారు. ఇది సంఖ్యాపరంగా, జనాభా శాతం పరంగా కూడా దేశంలోనే అత్యధికం. ► పేపర్ రహిత వైద్య సేవల్లో ఉత్తమ పనితీరుకు కేంద్ర పురస్కారాలు ► హెల్త్ ఐడీలకు ఆరోగ్య రికార్డుల అనుసంధానంలో రాష్ట్రానికి ప్రథమ స్థానం ► జిల్లాల విభాగంలోనూ తొలి మూడూ మన రాష్ట్రానికే ► ఏలూరు, విశాఖ, పల్నాడు జిల్లాలకు అవార్డులు ► ఇంటిగ్రేటెడ్ విధానంలోనూ రాష్ట్రానిదే అగ్రస్థానం -
Andhra Pradesh: చేరువలో చికిత్స
అందిస్తున్న వైద్య సేవలు ఇలా.. ►ప్రతి వార్డుకు 2–3 కి.మీ దూరంలోపు లేదా 15 నిమిషాల నడక దూరంలో క్లినిక్ ఉంటుంది. ►గతంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఒక్క నర్సు మాత్రమే అందుబాటులో ఉండేవారు. ప్రస్తుతం ఒక మెడికల్ ఆఫీసర్, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఇతర సిబ్బందిని అందుబాటులోకి తెచ్చారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 3,920 మంది ఉద్యోగులను ప్రభుత్వం అర్బన్ హెల్త్ సెంటర్లకు మంజూరు చేసింది. నియామకాలు దాదాపు పూర్తయ్యాయి. ►గతంలో ఓపీ సేవలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం పది పడకలతో ఇన్‌పేషెంట్ విభాగం కూడా అందుబాటులోకి వచ్చింది. ►గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శాఖ అమలు చేసే ఆరోగ్య కార్యక్రమాలన్నీ అర్బన్ హెల్త్ క్లినిక్‌లతో పట్టణ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ►పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణులకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రతి ఆరు ఆరోగ్య కేంద్రాలను ఒక క్లస్టర్‌గా చేసి, అక్కడ ఈ సేవలు అందించేందుకు ఇప్పటికే వైద్య శాఖ అల్ట్రాసౌండ్ మిషన్లను కొనుగోలు చేసింది. సాక్షి, అమరావతి: గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో జనాభా 9 లక్షలు. టీడీపీ హయాంలో ఇక్కడ 13 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రమే ఉండేవి. అంటే సుమారు 70 వేల మందికి ఒకటన్న మాట. వీటిలోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండేది. దగ్గు, జలుబు, జ్వరం వంటి చిన్న సమస్యలకు కూడా జీజీహెచ్కువెళ్లాల్సి వచ్చేది. ఇక్కడ రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ప్రజలు ప్రైవేట్ క్లినిక్‌లను ఆశ్రయించేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. నగరంలో ఉన్న 13 ఆరోగ్య కేంద్రాలకు అదనంగా మరో 17 కలిపి మొత్తంగా 30 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. దీంతో ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు మరింత చేరువయ్యాయి. అదే విధంగా విశాఖలో గతంలో 24 ఆరోగ్య కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం 63 ఉన్నాయి. విజయవాడలో గతంలో 29 ఉండగా, ప్రస్తుతం 41 అందుబాటులోకి వచ్చాయి. గుంటూరు, విశాఖ, విజయవాడ నగరాల తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాలిటీల్లోని ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలను సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేరువ చేసింది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు సైతం పట్టణ ప్రజలు జీజీహెచ్, జిల్లా, ఏరియా ఆస్పత్రులు, ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా చేసింది. ఇందుకోసం నగర, పట్టణ ప్రాంతాల్లో కొత్తగా మరిన్ని డాక్టర్ వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను వైద్య శాఖ నెలకొల్పింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 73 మున్సిపాలిటీల్లో కేవలం 259 అర్బన్ ప్రిలిమినరీ హెల్త్ సెంటర్లు మాత్రమే ఉండేవి. ఈ నేపథ్యంలో.. పట్టణాల్లో మధ్యతరగతి, పేద ప్రజలు సర్కార్ వైద్యం కోసం పడుతున్న అగచాట్లను సీఎం వైఎస్ జగన్ సర్కార్ గుర్తించింది. వీటిని అధిగమించి వారికి వైద్యం మరింత చేరువ చేయాలని నిర్ణయించింది. 25 వేల మంది జనాభాకు ఒకటి చొప్పున అర్బన్ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేయడంలో భాగంగా గత టీడీపీ హయాంలో ఉన్న 259కి అదనంగా మరో 301 కేంద్రాలను కలిపి, మొత్తంగా 560 క్లినిక్‌ల ఏర్పాటుకు సంకల్పించింది. ప్రస్తుతం 542 చోట్ల వైద్య సేవలు అందుతున్నాయి. టెలీ మెడిసిన్‌తో అత్యాధునిక వైద్యం 542 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో రోజుకు సగటున 18,970 మంది వైద్య సేవలు పొందుతున్నారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 43,10,363 మంది వైద్య సేవలు పొందారు. క్లినిక్‌లలో టెలీమెడిసిన్ సౌకర్యాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దీంతో జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిషన్ వంటి స్పెషలిస్ట్ వైద్యుల కన్సల్టేషన్ సైతం ప్రజలకు ఇక్కడే లభిస్తోంది. ఇలా 7.86 లక్షల మంది టెలీ మెడిసిన్ సేవలు పొందారు. 216 రకాల మందులు, 60 రకాల వైద్య పరీక్షలు ఇక్కడ అందుబాటులో ఉంటున్నాయి. వైద్య పరీక్షల కోసం సెమీ ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ అనలైజర్, 3–పార్ట్ హెమటాలజీ అనలైజర్ సహా పలు పరికరాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గత 9 నెలల్లో 7.51 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులను నేరుగా రోగుల వాట్సాప్కే పంపుతున్నారు. ఈహెచ్‌ఆర్ (ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్) విధానంలో రోగులకు అందించిన వైద్య సేవల వివరాలను వారి డిజిటల్ హెల్త్ ఖాతాల్లోకి అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 15.09 లక్షల మంది హెల్త్ రికార్డులను వారి డిజిటల్ హెల్త్ ఖాతాలకు అనుసంధానించారు. సొంత భవనాల నిర్మాణం క్లినిక్‌ల కోసం సొంత భవనాలు సమకూర్చడంపైనా నాడు–నేడు కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో ఇప్పటికే ఉన్న 184 సొంత భవనాలకు మరమ్మతులు చేపట్టింది. మిగిలిన వాటి కోసం కొత్త భవనాల నిర్మాణం చేపడుతోంది. కొత్త భవనం నిర్మాణానికి రూ.80 లక్షలు, మరమ్మతులకు రూ.10 లక్షల చొప్పున వెచ్చిస్తున్నారు. ఇలా రూ.374.61 కోట్లతో సొంత భవనాలను సమకూరుస్తున్నారు. నిర్మాణం పూర్తయిన 116 కొత్త భవనాలను ప్రారంభించి, వాటిల్లో సేవలు మొదలుపెట్టారు. ప్రజలు ఇబ్బంది పడకూడదనేదే లక్ష్యం ప్రాథమిక వైద్యం కోసం పట్టణ ప్రజలు ఇబ్బంది పడకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలను వారికి చేరువ చేస్తున్నాం. జాతీయ ప్రమాణాలతో వనరులు సమకూరుస్తున్నాం. నగర, పట్టణ ప్రజలు క్లినిక్‌లలో వైద్య సేవలు వినియోగించుకోవాలి. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ త్వరలో ‘అల్ట్రా సౌండ్’ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా 90 కేంద్రాలకు స్కానింగ్ పరికరాలు సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అల్ట్రాసౌండ్ స్కాన్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు వైద్య శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో 542 ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న క్రమంలో చిన్న మున్సిపాలిటీల్లో కనీసం ఒకటి, పెద్ద మున్సిపాలిటీల్లో, మున్సిపల్ కార్పొరేషన్లలో ఆరు ఆరోగ్య కేంద్రాలకు ఒకటి చొప్పున 90 అ్రల్టాసౌండ్ స్కానింగ్ పరికరాలను ప్రభుత్వం సరఫరా చేసింది. ఒక్కో పరికరం రూ.2.45 లక్షల చొప్పున 90 పరికరాలను రూ.2,20,50,000తో కొనుగోలు చేసింది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ సేవలు అందించేందుకు వీలుగా ఆయా ఆస్పత్రులు, డయగ్నోసిస్ సెంటర్లను ప్రీ–కాన్సెప్షన్, ప్రీ–నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (పీసీపీఎన్డీటీ) చట్టం కింద రిజి్రస్టేషన్ చేయాల్సిందిగా డీఎంహెచ్ఓలందరికీ వైద్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇది పూర్తవ్వగానే సేవలు ప్రారంభిస్తామని పట్టణ ఆరోగ్య కేంద్రాల ప్రత్యేక అధికారి విజయలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు. ఈ సేవలు అందుబాటులోకి రావడం ద్వారా నగరాలు, పట్టణాల్లోని గర్భిణులకు కడుపులో ఉమ్మ నీరు స్థాయి, పుట్టబోయే బిడ్డకు వెన్నెముక, గుండె, ఇతర సమస్యలేమైనా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. వీటితో పాటు సాధారణ ప్రజలకు అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా కడుపునొప్పి, గాల్‌బ్లాడర్, కిడ్నీలో రాళ్లు, కిడ్నీవాపు, అపెండిక్స్, ఇతర సమస్యలను నిర్ధారించవచ్చు. కాగా, విశాఖపట్నంలో 11, విజయవాడలో 8, గుంటూరులో 4, మిగతా నగరాలు, పట్టణాల్లో 3, 2, 1 చొప్పున ఈ పరికరాలను ఏర్పాటు చేశారు.