CM Jagan Review Meeting With Medical And Health Department: Updates - Sakshi
Sakshi News home page

ఫ్యామిలీ డాక్టర్‌తో కోటి మందికిపైగా సేవలు

Published Tue, Jun 13 2023 2:24 PM | Last Updated on Tue, Jun 13 2023 5:06 PM

CM Jagan Review Meet Medical Health Department June 2023 Updates - Sakshi

సాక్షి, గుంటూరు:  వైద్య, ఆరోగ్యశాఖలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి విడదల రజిని, ఉన్నతాధికారులు, పలువురు ఆయా విభాగాల అధికారులు హాజరయ్యారు.

సమీక్ష సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతికి చోటు ఉండకూడదు. ఫిర్యాదు చేయడానికి టెలిఫోన్‌ నంబర్‌ ప్రతిచోటా ఉంచాలి. అలాగే సమర్థవంతమైన ఎస్‌ఓపీలను పెట్టాలి. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలి. పీహెచ్‌సీలు, విలేజ్‌ క్లినిక్‌ల పనితీరు ఇందులో కీలకం. ప్రివెంటివ్‌ కేర్‌లో మనం ఆశించిన లక్ష్యాలను అప్పుడే సాధించగలం. 

► వైద్య ఆరోగ్యశాఖలో రిక్రూట్‌మెంట్‌ వ్యవస్ధ సమర్థవంతంగా పనిచేయాలి. ఒక ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీచేయాలి. ఎక్కడా కూడా సిబ్బంది కొరత అన్నది ఉండకూడదు. నాలుగు వారాలకు మించి.. ఎక్కడా ఏ ఖాళీ కూడా ఉండకూడదు. 

అధికారుల వివరణ

► కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చాం. ఫస్ట్‌ఎయిడ్, స్నేక్‌ బైట్, ఐవీ ఇన్‌ఫ్యూజన్, ఇంజక్షన్, వూండ్‌ కేర్, డ్రస్సింగ్, బేసిక్‌ కార్డియాక్‌ లైఫ్‌ సపోర్ట్‌ లాంటి అంశాల్లో వారికి శిక్షణ పూర్తయ్యింది.

► అక్టోబరు22న ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకూ 1,39,97,189 మందికి సేవలు అందించాం. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ద్వారా సేవలందుకున్నవారిలో 35,79,569 మంది హైపర్‌ టెన్షన్‌తో, 24,31,934 డయాబెటిస్‌తో బాధపడతున్నట్టు గుర్తింపు.

► వాళ్లందరికి మంచి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ సూచించారు. పేషెంట్‌కు చికిత్స అందించడంతోపాటు.. వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేయాలన్నారు. విలేజ్‌ క్లినిక్‌ స్ధాయిలో కంటి పరీక్షలు క్రమం తప్పకుండా కూడా చేయాలన్నారు. 

సికిల్‌ సెల్‌ ఎనీమియాను నివారించే కార్యక్రమంపై సీఎం జగన్‌ సమీక్ష
సికిల్‌ సెల్‌ ఎనీమియా నివారణ కార్యక్రమంలో భాగంగా.. ఈ ఏడాది  6.68 లక్షలమందికి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు సీఎం జగన్‌ వద్ద ప్రస్తావించారు. ఈ నెలలోనే అల్లూరిసీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పరీక్షలు ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. ఓరల్‌ హెల్త్‌లో భాగంగా ప్రతినెలా కూడా దంత వైద్యులు పీహెచ్‌సీలను సందర్శించేలా చర్యలు తీసుకున్నామన్నారు అధికారులు.

► టీబీ నివారణపైనా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు వెల్లడించిన అధికారులు. ప్రస్తుతం లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయిస్తున్నామని వెల్లడి. 

అందరికీ పరీక్షలు చేయడంద్వారా బాధితుల్ని గుర్తించి.. వారికి మంచి చికిత్స అందించే చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేయాలని సీఎం జగన్‌ అధికారులతో చెప్పారు. 

► ప్రతి కుటుంబంలో పుట్టే బిడ్డ దగ్గరనుంచి ప్రతి ఒక్కరికీ కూడా ఆరోగ్యశ్రీకార్డు ఇవ్వాలని సీఎం జగన్‌ అధికారుల్ని ఆదేశించారు. క్యూ ఆర్‌ కోడ్‌ ఉన్న ఈ కార్డు ద్వారా వారి ఆరోగ్యవివరాలను నమోదు చేయాలన్నారు.


 
మెడికల్‌ కాలేజీలపైనా సీఎం సమీక్ష. 
ఈ విద్యాసంవత్సంలోనే ప్రారంభం కానున్న కొత్త మెడికల్‌ కాలేజీల్లో మౌలికసదుపాయాలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. మెడికల్‌ కాలేజీలు చరిత్రలో నిలిచిపోయే నిర్మాణాలని, ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కొత్త మెడికల్‌ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. అలాగే.. పాడేరు, పులివెందుల, ఆదోని కొత్త మెడికల్‌ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు మొదలవుతాయి. మిగిలిన కాలేజీల్లో కూడా పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించిన అధికారులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement