Vidadala Rajini
-
రైతుల భుజం తట్టి భరోసా ఇచ్చాము: Vidadala Rajini
-
ఏపీలో 104, 108 సేవలు అటకెక్కాయి: విడదల రజిని
-
Vidadala Rajini: కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా..?
-
అధికారం శాశ్వతం కాదు.. గుర్తుంచుకోండి.. కూటమి ప్రభుత్వానికి విడుదల రజిని హెచ్చరిక
సాక్షి,పల్నాడు జిల్లా : అధికారం శాశ్వతం కాదు. గుర్తుంచుకోండి అని మాజీ మంత్రి విడుదల రజిని కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. పల్నాడు జిల్లా నరసరావు పేట జైల్లో ఉన్న వైఎస్సార్ సీపీ నేత సింగారెడ్డి కోటిరెడ్డిని పరామర్శించారు. అనంతరం విడదల రజిని మీడియాతో మాట్లాడారు.‘వైఎస్సార్సీపీ నేత సింగారెడ్డి కోటిరెడ్డి సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తే ఆయనపై అక్రమ కేసులు పెట్టారు. నరసరావుపేట జైలుకు పంపారు. కోటిరెడ్డికి 75 ఏళ్లు. సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్తే ఆ అధికారులను కోటిరెడ్డి కొట్టినట్టు, కులం పేరుతో దూషించినట్లు అక్రమ కేసులు బనాయించారు.ఒక రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తే కోటిరెడ్డిపై కేసులు పెట్టారు. ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. అది ఖచ్చితంగా రాజకీయ నాయకులు, పోలీసులు గుర్తు పెట్టుకోవాలి. వైఎస్సార్సీపీ నేతలు ఓ పథకం ప్రకారం జైలుకు పంపుతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడున్నాయి. రోజూ రాష్ట్రంలో ఎక్కడో చోట మహిళలపై దాడులు జరుగుతున్నాయి. మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ఆనవాళ్లు దొరకడం లేదు. పోలీసులు మహిళలపై జరుగుతున్న దాడులపై దృష్టి పెట్టకుండా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై దృష్టి పెట్టారు’ అని విడదల రజిని మండిపడ్డారు. -
మీరు ఎంత భయపెట్టాలని చూస్తే.. మేము అంత ధైర్యంగా ముందుకు వస్తాం
-
పులివెందుల అంటే ఎందుకంత కక్ష...
-
ఆంధ్రప్రదేశ్ లో 108, 104 సేవలు అటకెక్కాయి: Vidadala Rajini
-
Vidadala Rajini: కూటమి ప్రభుత్వం మాత్రం ఆరోగ్య శ్రీని పట్టించుకోవడం లేదు
-
‘పులివెందుల మెడికల్ కాలేజీపైనే ఎందుకీ కక్ష?’
గుంటూరు, సాక్షి: ప్రైవేటీకరణ అనేది కూటమి సర్కార్ ఫిలాసఫీ అని, అందుకే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఏపీ మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మంగళవారం గుంటూరు ఆమె మీడియాతో మాట్లాడారు.ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గొప్ప ఆలోచన. గ్రామాల్లోకి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను పంపి పేదలకు వైద్యం అందించాం. మా హయాంలో ఎలాంటి సౌకర్యాలు అందించామో ప్రజలకు తెలుసు. ఏపీని మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ పని చేశారు. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద జల్లాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.కూటమి ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను నిర్వీర్యం చేస్తోంది. ఆరోగ్యశ్రీని ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా అనారోగ్యశ్రీగా మార్చేశారు. ప్రజలకు అసౌకర్యాలు కలగకూడదని 104, 108 సర్వీసులు తీసుకొచ్చాం. ఆ సేవలను కూడా అటకెక్కించారు. ఏపీకి 17 మెడికల్‌కాలేజీలు తీసుకొచ్చాం. మెడికల్ కాలేజీల కోసం రూ.8,500 కోట్లు ఖర్చు చేశాం. మిగిలిన మెడికల్ కాలేజీలను పూర్తి చేయలేక మాపై బురద జల్లాలని చూస్తున్నారు. కాలేజీలకు పర్మిషన్ రాలేదని సంబంధిత మంత్రి మాట్లాడుతున్నారు. ఆయన తెలిసి మాట్లాడుతున్నారో.. తెలీక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. మొత్తం 17 కాలేజీల్లో పులివెందుల కాలేజీ కూడా ఉంది. కానీ, ఆ ఒక్క కాలేజీ మీద అంత కక్ష ఎందుకు?. పులివెందుల కాలేజీకి మెడికల్ సీట్లు వద్దని లేఖ రాయడం దేనికి?. అని నిలదీశారామె...పులివెందుల మెడికల్ కాలేజ్‌కు హాస్టల్స్ లేవని ఇప్పుడున్న మంత్రి చెప్తున్నారు. కానీ, ప్రభుత్వం దృష్టి పెట్టి ఉంటే ఈపాటికి పనులన్నీ పూర్తి అయ్యేవి. (ఈ ఏడాది జనవరి లో హాస్టల్ నిర్మాణానికి సంబంధించిన ఫోటోలను మీడియా ముందు రజిని ప్రదర్శించారు)కూటమి ప్రభుత్వం ఒక పథకం ప్రకారం సోషల్ మీడియా పై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోంది. కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని విడదల రజిని అన్నారు. -
నాలుగు రోజులుగా సుధారాణికి చిలకలూరిపేట సిఐ చిత్రహింసలు..
-
విడదల రజినిని అంత మాట అన్నప్పుడు.. పవన్ కి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
-
కార్యకర్తలపై కేసులు.. విడదల రజిని ఫైర్
-
కేసులు పెట్టిన అధికారులపై కచ్చితంగా చర్యలుంటాయి: విడదల రజిని
సాక్షి, గుంటూరు: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు మాజీ మంత్రి విడదల రజిని. ఈ రాష్ట్రంలో చట్టం న్యాయం కొంతమంది కోసమే పని చేస్తుందా? అని ప్రశ్నించారు. అలాగే, సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.మాజీ మంత్రి విడదల రజిని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో పోలీసు బాసు.. పొలిటికల్ బాసుల కోసం పనిచేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం సోషల్ మీడియా ప్రతినిధులపై కుట్రతో జైలుకు పంపుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే సోషల్ మీడియాపై కేసులు పెడతారా?. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది.మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా పోస్టులు పెడితే పోలీసులు ఏం చేస్తున్నారు?. 20 రోజుల క్రితం నాపై పెట్టిన పోస్టులకు సంబంధించి ఆధారాలతో సహా డీజీపీ, ఎస్పీకి ఫిర్యాదు చేస్తే ఇంతవరకు చర్యలు లేవు. నా క్యారెక్టర్ దెబ్బ తినే విధంగా వ్యక్తిత్వ హననానికి గురి చేస్తూ టీడీపీ స్పాన్సర్ మీడియా పోస్టులు పెట్టింది. ఈ రాష్ట్రంలో చట్టం, న్యాయం కొంతమంది కోసమే పని చేస్తుందా?. అక్రమంగా, అన్యాయంగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టిన అధికారులపై కచ్చితంగా చర్యలు ఉంటాయి.మా నాయకుడు చెప్పాడంటే చేస్తాడు అంతే.. అది అందరికీ తెలుసు. మా నియోజకవర్గానికి చెందిన సుధారాణిని ఐదు రోజులు పాటు అక్రమంగా, అన్యాయంగా స్టేషన్లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. మాటలతో చెప్పలేని విధంగా చిలకలూరిపేట సీఐ రమేష్ బూతులు మాట్లాడారు. సుధారాణి చెప్పిన విషయాలకు సాక్ష్యాత్తూ న్యాయమూర్తి చలించిపోయారంటే.. పోలీసులు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అనే అర్థం అవుతుంది. సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
వైఎస్సార్సీపీలో పలు నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్తగా విడదల రజనిని, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా బాలవజ్రబాబు (డైమండ్ బాబు) నియమితులయ్యారు.ఇదీ చదవండి: YSRCP సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ నిర్బంధం.. ఏపీ హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ -
జగనన్నను చరిత్ర ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది
-
యూట్యూబ్ ఛానళ్లపై విడదల రజిని కంప్లైంట్
-
వ్యక్తిత్వ హననం చేస్తారా?.. యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులపై విడదల రజిని పోలీసులకు ఫిర్యాదు
సాక్షి,గుంటూరు : వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోస్టింగ్స్ పెడుతున్న వారిపై మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్ అనే యాంకర్‌తో పాటు, మరో రెండు యూట్యూబ్ ఛానెల్ నిర్వహకులు తన గురించి అసభ్యకర పోస్టింగ్స్, వీడియోలు పెడుతున్నారని పోలీసుల ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా పోలీసులతో పాటు జాతీయ మహిళా కమీషన్, ఏపీ మహిళా కమీషన్, డీజీపీలకు విడదల రజిని ఫిర్యాదు చేశారు. -
సహానా మృతిపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రులు
-
గుంటూరు సహాన ఘటనపై విడదల రజిని ఎమోషనల్..
-
దళిత యువతి సహానాది ప్రభుత్వ హత్యే
గుంటూరు మెడికల్ : కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడి దాడిలో మరణించిన దళిత యువతి మధిర సహానాది ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్సీపీ నేతలు, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, విడదల రజిని స్పష్టం చేశారు. వారు మంగళవారం రాత్రి గుంటూరు జీజీహెచ్‌లో సహానా మృతదేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పిఠాపురం, హిందూపురం, బద్వేలు, తెనాలిలో మహిళలపై జరిగినవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనన్నారు. ఇటీవలి హత్యలు, దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మహిళలపై అఘాయిత్యాలు, దాడులు, లైంగిక దాడులు, హత్యలు జరుగుతున్నాయని అన్నారు.రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని, చట్టాలను ప్రభుత్వ పెద్దలు చుట్టాలుగా మార్చుకున్నారని ఆరోపించారు. దళిత యువతి సహానాపై దాడి జరిగి మూడు రోజులు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నా ప్రభుత్వం నుంచి స్పందనే లేదని చెప్పారు. ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయని, బయటకు చెప్పుకోలేని అభద్రతా భావంలో సహానా తల్లిదండ్రులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ దాడిపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, నిందితుడికి కఠిన శిక్షపడేలా చూడాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగితే తక్షణమే స్పందించేవారని చెప్పారు. సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత చేతగాని తనం వల్లే దాడులు, హత్యలు జరుగుతున్నాయని, పోలీసులు కళ్లున్న కబోదుల్లా ఉన్నారని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. దాడులు, హత్యలపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదులు చేసినా, తిరిగి తమ పార్టీ నేతలపైనే కేసులు పెడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా దిశ యాప్ ప్రవేశపెట్టారని, దాని ద్వారా మహిళలకు భరోసా లభించి, ధైర్యంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత దిశ యాప్ పనిచేయడంలేదని, అందువల్లే ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయని అన్నారు. -
మధిర సహాన మృతిపై వైఎస్సార్సీపీ నేతల తీవ్ర విచారం
సాక్షి,గుంటూరు: టీడీపీ రౌడీషీటర్ నవీన్ దాడిలో గాయపడి మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన మధిర సహాన చివరకు ఓడిపోయింది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సహాన మరణంపై సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీకి మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ మనోహర్ నాయుడు, నూరి ఫాతిమా, డైమండ్ బాబు యువతి కుటుంబాన్ని పరామర్శించారు.అనంతరం మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. ‘ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. సహన విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నారో అందరూ చూస్తున్నారు. అక్కడి మంత్రి ఏమైపోయారు. ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. దిశ యాప్ లేకపోవటం వల్లే రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. సహాన మరణ వార్తపై వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. రేపు (బుధవారం)సహన కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నారు’ అని అన్నారు. సహానా మరణంపై మాజీ మంత్రి విడదల రజిని విచారం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇందుకు సహానలాంటి ఘటనలే నిదర్శనం. సహాన శరీరంపై గాయాలున్నాయి. బయటకు చెప్పుకోలేని అభద్రతాభావంలో సహన తల్లిదండ్రులు ఉన్నారు. మహిళలకు రక్షణ లేదన్న భావన వ్యక్తం అవుతోంది. దిశ లాంటి చట్టాలను వైఎస్ జగన్ హయాంలో తీసుకొచ్చారు. దిశ లాంటి చట్టాల అవసరం ఉంది. మహిళల రక్షణ పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
శ్రీవారి లడ్డూ పవిత్రతను దెబ్బతీసేలా బాబు దుష్ప్రచారం
-
మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం వెనుక పెద్ద స్కామ్: రజనీ
-
మాకు మెడికల్ కాలేజీలు వద్దు అని కేంద్రానికి లెటర్ రాసిన చెత్త ప్రభుత్వం ఇది
-
మెడికల్ కాలేజీల పరిస్థితేంటి?: విడదల రజిని
సాక్షి,గుంటూరు: వైఎస్జగన్ తన హయంలో ప్రజారోగ్యంపై ఎక్కువ దృష్టిపెట్టారని మాజీ మంత్రి విడదల రజిని చెప్పారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన 17 మెడికల్ కాలేజీల ఏర్పాటు బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనన్నారు.ఈ విషయమై రజిని బుధవారం (సెప్టెంబర్18) మీడియాతో మాట్లాడారు. ‘మెడికల్ కాలేజీల బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వానికి క్లారిటీ లేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులన్నీ హైదరాబాద్‌లోనే ఉండిపోయాయి. దీంతో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు ఏపీలోనూ ఉండాలనే ఆలోచనలతో వైఎస్జగన్ మెడికల్ 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రెండో దశలో ప్రారంభించాల్సిన అయిదు మెడికల్ కాలేజీల పరిస్థితేంటి’అని విడదల రజని ప్రశ్నించారు.విడదల రజిని ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు..కొత్త మెడికల్ కాలేజీలపై కూటమి ప్రభుత్వం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందిఏపిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందాలన్న ఉద్దేశంతోనే వైఎస్ జగన్ ప్రభుత్వం మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కాలేజీ ఆస్పత్రులతో పేదలకు మెరుగైన, ఉచిత వైద్యసేవలు అందించవచ్చని వైఎస్జగన్ భావించారుమెడికల్ కాలేజ్ ఒక్క రాత్రిలో నిర్మాణం కాదువందేళ్ళలో కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయికేవలం ఐదేళ్ళలో వైఎస్జగన్ ఐదు మెడికల్ కాలేజ్ ప్రారంభించి మరో ఐదు కాలేజీల నిర్మాణం ప్రారంభించారుఈ ఏడాది ఐదు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావాల్సి ఉంది.కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేయని దుస్సాహాసం కూటమి ప్రభుత్వం చేసిందిపులివెందుల కాలేజీకి సీట్ల కేటాయింపు వద్దని ప్రభుత్వం లేఖ రాసిందిపులివెందుల మీద ద్వేషం, రాజకీయ కక్షతోనే ప్రభుత్వం లేఖ రాసింది.వైఎస్జగన్ మీద కక్షతోనే విద్యార్థుల జీవితాలను బలి చేస్తున్నారుమూడో ఫేజ్‌లో రావాల్సిన ఏడు మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదుప్రయివేట్--పబ్లిక్ పార్టనర్ షిప్ లో నిర్వహించేందుకు సిద్దమయ్యారు.ప్రయివేటు వ్యక్తులకు బదలాయిస్తూ స్కామ్‌కు తెర తీస్తున్నారు.ఫీజుల జీవోలను రద్దు చేస్తామని ఎన్నికల ముందు చెప్పి ఈ రోజు అదే జీవో పేరుతో ఫీజులు కొనసాగిస్తున్నారు]ఇదీ చదవండి.. బాబూ అమరావతి మాత్రమే సెంటిమెంటా..?