
సాక్షి, గుంటూరు జిల్లా: టీడీపీ దుర్మార్గపు రాజకీయాలకు అంతులేకుండా పోతోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి నీచ రాజకీయం వెలుగులోకి వచ్చింది. గుంటూరు వెస్ట్ వైఎస్సార్‌సీపీ నుంచి మంత్రి విడదల రజిని పోటీ చేస్తుండగా, విడదల రజిని అనే పేరుగల మరొక మహిళ చేత నామినేషన్ వేయించడానికి గల్లా మాధవి ప్రయత్నించింది.
మూడు రోజుల నుంచి గల్లా మాధవి ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో విడదల రజిని అనే మహిళను నిర్బంధించారు. తన కుమార్తె విడుదల రజినిని కిడ్నాప్ చేసి నిర్బంధించారంటూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మహిళను అపార్ట్‌మెంట్ నుంచి నగరంపాలెం పోలీసులు అదుపులోకి తీసుకుని.. తండ్రికి అప్పగించారు.
కాగా, గల్లా మాధవిపై ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ప్రచారం నిర్వహించినందుకు రెండు పోలీసు కేసులు నమోదయ్యాయి. టీడీపీ అభ్యర్థిగా శనివారం నామినేషన్ వేసిన గళ్లా మాధవి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పోలీసు కేసుల వివరాలతోపాటు పెద్ద ఎత్తున స్థిర, చరాస్తులకు సంబంధించిన వివరాలు చూపారు.
Comments
Please login to add a commentAdd a comment