Guntur West
-
టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి డర్టీ పాలిటిక్స్.. మహిళను నిర్బంధించి..
సాక్షి, గుంటూరు జిల్లా: టీడీపీ దుర్మార్గపు రాజకీయాలకు అంతులేకుండా పోతోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి నీచ రాజకీయం వెలుగులోకి వచ్చింది. గుంటూరు వెస్ట్ వైఎస్సార్సీపీ నుంచి మంత్రి విడదల రజిని పోటీ చేస్తుండగా, విడదల రజిని అనే పేరుగల మరొక మహిళ చేత నామినేషన్ వేయించడానికి గల్లా మాధవి ప్రయత్నించింది.మూడు రోజుల నుంచి గల్లా మాధవి ఉంటున్న అపార్ట్మెంట్లో విడదల రజిని అనే మహిళను నిర్బంధించారు. తన కుమార్తె విడుదల రజినిని కిడ్నాప్ చేసి నిర్బంధించారంటూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మహిళను అపార్ట్మెంట్ నుంచి నగరంపాలెం పోలీసులు అదుపులోకి తీసుకుని.. తండ్రికి అప్పగించారు.కాగా, గల్లా మాధవిపై ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ప్రచారం నిర్వహించినందుకు రెండు పోలీసు కేసులు నమోదయ్యాయి. టీడీపీ అభ్యర్థిగా శనివారం నామినేషన్ వేసిన గళ్లా మాధవి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో పోలీసు కేసుల వివరాలతోపాటు పెద్ద ఎత్తున స్థిర, చరాస్తులకు సంబంధించిన వివరాలు చూపారు. -
గుంటూరు వెస్ట్: ఇరుకునపడ్డ టీడీపీ.. అదే మైనస్‌గా మారిందా?
ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అయితే సీఎం జగన్మోహన్రెడ్డి వ్యూహాత్మక ఎత్తుగడలకు చంద్రబాబు నాయుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా గుంటూరు పశ్చిమ అభ్యర్థి ఎంపికలో తెలుగుదేశానికి కొత్త చిక్కులు ఎదురయ్యాయి. బీసీలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ సీటుకు విపరీతమైన పోటీ ఎదురైంది. మరోవైపు అధికార వైసీపీ అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన మంత్రి విడదల రజనీ బరిలోకి దిగడంతో టీడీపీ ఇరుకున పడింది. ఈ నేపథ్యంలో ఇంతవరకు తెలుగుదేశం పార్టీని భుజాన మోసిన అందరినీ పక్కకి తోసేసి.. కొత్త అభ్యర్థిగా గల్లా మాధవిని తీసుకురావడంపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వీటన్నింటికి తోడు గల్లా మాధవి ఒంటెత్తు పోకడలు పార్టీకి చేటు తీసుకొస్తున్నాయి. అంతేకాదు సీనియర్లు కూడా దూరమైపోతున్నారు. వారితో పాటు క్యాడర్ కూడా వెళ్లిపోతోంది. గల్లా మాధవి ఉన్నట్టుండి సడన్‌గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేసరికి, ఆమెకు ఎవరేమిటో తెలీడం లేదు. హాయిగా ఏసీలో కూర్చుని పనిచేసే ఆమె మండుటెండలోకి వచ్చి, చుట్టూ గుమిగూడే జనం మధ్యలో ఇమడలేక పోతున్నారు. వీటన్నిటికి మించి విడదల రజనీ దూకుడు ముందు ఆమె పోటీ పడలేకపోతున్నారనే టాక్ అయితే జనంలోకి వెళ్లిపోయింది. అది ఆమెకు మైనస్‌గా మారింది. అంతేకాదు రాజకీయాల్లో రజనీ సీనియర్ అయ్యారు. మంత్రి అయ్యారు. రాజకీయాల్లో రెండు ఫేజ్లను చూశారు. వీటన్నిటి పరంగా గల్లా మాధవి సరైన అభ్యర్థి కాదనే అంటున్నారు. కోవెలమూడి రవీంద్ర.. ప్రస్తుతం గుంటూరు వెస్ట్ ఇంచార్జిగా ఉన్నారు. ఆయన 2014, 2019లో కూడా టికెట్ ఆశించారు. చంద్రబాబు అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడూ ఇవ్వలేదు. దీంతో ఆయన రగలిపోతున్నారు. దాదాపు క్యాడర్ అంతా ఆయనవైపే ఉంది. వారి దగ్గర మీకు నచ్చినట్టు చేసుకోండి అని అంటున్నారని తెలిసింది. హీరో బాలక్రష్ణ వీరాభిమాని మన్నవ మోహనకృష్ణ కూడా గుంటూరు వెస్ట్ సీటు ఆశించారు. రాకపోవడంతో బహిరంగంగానే అసంత్రప్తి వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు పిలిచి మాట్లాడారు. కానీ పని కాలేదని అంటున్నారు. తాడిశెట్టి ఫ్యామిలీకి గుంటూరులో మంచి పట్టుంది. తాడిశెట్టి వెంకట్రావు, తాడిశెట్టి మురళీ మొన్నటి వరకు వైసీపీలో ఉన్నారు, సీటు రాదని గ్రహించి, చంద్రబాబు దగ్గర హామీ తీసుకుని తెలుగుదేశంలోకి వచ్చారు. తీరా వచ్చాక బాబు కూడా హ్యాండ్ ఇచ్చేసరికి రివర్స్ అయ్యారని అంటున్నారు. బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ జనసేన నేతగా ఉన్నారు. పొత్తులో భాగంగా గుంటూరు వెస్ట్ ఆశించారు. రాకపోవడంతో ఆయన సైడ్ అయిపోయారు. ప్రస్తుతం యాక్టివ్ గా లేరు. ఉమ్మడి పొత్తులో భాగంగా బీజేపీ నుంచి ఆ పార్టీ నేత వల్లూరు జయప్రకాశ్ నారాయణ ఆశించారు. హడావుడిగా కార్యాలయం ఓపెన్ చేశారు. 18 రోజులు పాదయాత్ర చేశారు. ధూంధామ్ చేశారు. చివరికి సీటు టీడీపీకి వెళ్లిపోయింది. దీంతో ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసుకెళ్లి ధర్నాలు చేసినా ఫలితం రాలేదు. అప్పటి నుంచి బుద్ధిగా ఇంటిపట్టునే ఉంటున్నారు. ఇలా ఇంతమంది తెలుగుదేశం నాయకులు వ్యతిరేకమైపోవడంతో గల్లామాధవి గెలవడం కష్టమేనని అంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైనది విడదల రజనీ చరిష్మా ముందు ఈమె నిలవలేకపోతున్నారని అంటున్నారు. రాజకీయాల్లో తన మార్కు చూపించుకున్న విడదల రజనీని గెలవడం ఈ పరిస్థితుల్లో అంత ఈజీకాదని అంటున్నారు. తనకే విజయావకాశాలు ఉన్నాయని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇదీ చదవండి: జగన్ ముందుకు.. అధఃపాతాళానికి చంద్రబాబు -
టీడీపీ నేతలు ఫోన్ చేశారు.. సాక్ష్యమిదే: మద్దాలి గిరిధర్
సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పచ్చ పార్టీ నేతలు తనను సంప్రదించారని తెలిపారు. చివరి రోజు వరకు టీడీపీ నేతలు ఓటు కోసం తనతో సంప్రదింపులు జరిపారని పేర్కొన్నారు. తన కాల్ డేటాను చూస్తే ఏ నాయకుడు ఫోన్ చేశారో తెలుస్తుందన్నారు. 'కుట్రలు, వెన్నుపోటు రాజకీయాలకు పేటెంట్ చంద్రబాబు. గౌరవం ఇవ్వకపోవడంతోనే పార్టీని వీడాం. గతంలో చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. సీఎం జగన్‌పై ఉన్న అభిమానంతోనే వైఎస్సార్సీపీలో చేరాం. టీడీపీ పతనం కావడానికి లోకేషే కారణం. నేను నా వాళ్లు మాత్రమే అనే నైజం చంద్రబాబుది. అమరావతి ఉద్యమం కోసం శ్రీదేవి పోరాడతాననడం హాస్యాస్పదం. పూటకొక మాట మారిస్తే ప్రజల విశ్వాసం కోల్పోతారు.' అని గిరిధర్ ఫైర్ అయ్యారు. చదవండి: కొనటం, అమ్మడమే చంద్రబాబు విజయ రహస్యం: పేర్ని నాని -
ఎమ్మెల్యే మద్దాల గిరి కుమారుని వివాహానికి హాజరైన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి కుమారుని వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. మంగళగిరిలోని సీకే ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను సీఎం జగన్ ఆశీర్వదించారు. -
సీఎం జగన్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే
-
అందుకే సీఎం జగన్‌ను కలిశా: టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి, అమరావతి: తన నియోజకవర్గ సమస్యల పరిష్కారానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసినట్టు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌రావు తెలిపారు. గుంటూరు పట్టణంలో వివిధ అభివృద్ధి పనుల గురించి అడగ్గా సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. తన నియోజకవర్గ పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించగా, రూ. 25 కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని ఆదేశించినట్టు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అమలుపై చంద్రబాబు నాయుడు ద్వంద్వ వైఖరితో ఉన్నారని అన్నారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలు మార్చేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ కార్యదీక్షత, పట్టుదల చూసి చాలా సంతోషం వేసిందన్నారు. ఉగాది నాటికి పేదలు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. భారత దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్ సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నారని ప్రశంసించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి హయాంలో రాష్ట్రం ఇండస్ట్రియల్ హబ్ అయిందని, వైఎస్ జగన్ ప్రభుత్వంలో మళ్లీ అదే విప్లవం రాబోతోందన్నారు. బొల్లాపల్లి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. రైతులు ఆందోళన పడాల్సిన పనిలేదు రాజధాని గురించి మాట్లాడే పెద్దవాడిని కాదని, రాజధానిపై సీఎంకి స్పష్టత ఉందన్నారు. గత ఐదేళ్లలో అమరావతిలో అభివృద్ధి జరగలేదని, రాజధాని రైతుల ఆందోళనకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. అమరావతి లెజిస్లేటివ్ రాజధానిగా ఉంటుందని సీఎం జగన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత స్పష్టత వస్తుందని, అప్పటివరకు వేచిచూడాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఐదేళ్లలో రైతుల్ని ఇబ్బంది పెట్టింది ఎవరో అందరికి తెలుసునని అన్నారు. పార్టీ మారడం గురించి ఎటువంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. తాను చంద్రబాబును విమర్శించడం లేదని ఆత్మపరిశీలన చేసుకోవాలని మాత్రమే చెబుతున్నానని ఎమ్మెల్యే గిరిధర్ అన్నారు. -
సీఎం జగన్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి, అమరావతి: గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటు ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలుసుకున్నారు. భేటీ వివరాలు వెల్లడి కాలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను టీడీపీ ఎమ్మెల్యే గిరిధర్ రావు కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి దూరంగా ఉంటున్నారు. శాసనసభలో తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించి, సీటు కేటాయించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఇటీవల విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే సీఎం జగన్‌ను కలవడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. (ప్రత్యేక సభ్యుడిగా గుర్తించండి: వల్లభనేని వంశీ) -
గెలిచినా.. ఓడినా..పోటీ ఒక్కసారే!
సాక్షి, అమరావతి : గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. 1994 నుంచి ఇక్కడ ప్రధాన పార్టీల తరఫున ఒక సారి పోటీ చేసిన అభ్యర్థులు ఆ తరువాత అక్కడి నుంచి ఎన్నికల బరిలో నిలవడంలేదు. ఓడిన అభ్యర్థులే కాదు.. గెలిచిన అభ్యర్థులదీ అదే పరిస్థితి. 1994 సంవత్సరంలో చల్లా వెంకటకృష్ణారెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సిహెచ్.జయరాంబాబుపై గెలిచారు. 1999 ఎన్నికల్లో వారిద్దరూ పోటీకి దూరమయ్యారు. ఆ సంవత్సరం టీడీపీ అభ్యర్థి శనక్కాయల అరుణ, కాంగ్రెస్ అభ్యర్థి కె.ఈశ్వరవెంకటభారతిపై గెలిచారు. అప్పటి ప్రభుత్వంలో శనక్కాయల అరుణ మంత్రిగా పనిచేశారు. మరుసటి ఎన్నికకు ఈ ఇద్దరూ దూరమయ్యారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన తాడిశెట్టి వెంకట్రావు టీడీపీ అభ్యర్థి టి.వెంకటేశ్వరరావుపై గెలిచారు. 2009లో వారిద్దరూ పోటీకి దూరమయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చుక్కపల్లి రమేష్‌పై గెలిచారు. ఆ తరువాత 2014లో కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేసినా మూడవ స్థానానికి పరిమితం అయ్యారు. 2014లో మోదుగుల వేణుగోపాలరెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లేళ్ల అప్పిరెడ్డిపై గెలిచారు. ప్రస్తుతం మోదుగుల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. గుంటూరు పశ్చిమం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా చంద్రగిరి ఏసురత్నం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మద్దాళి గిరి పోటీచేస్తున్నారు. -
పూనమ్ 136 నాటౌట్
సాక్షి, గుంటూరు వెస్ట్: బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే లీగ్‌లో పూనమ్ రౌత్ (160 బంతుల్లో 136 నాటౌట్; 15 ఫోర్లు) అజేయ శతకంతో మెరిసింది. ఫలితంగా రైల్వేస్ వరుసగా ఆరో విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం సౌరాష్ట్రతో మ్యాచ్‌లో రైల్వేస్ 163 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత రైల్వేస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 251 పరుగులు చేసింది. ఓపెనర్‌గా బరిలో దిగిన పూనమ్ తొలి వికెట్‌కు శ్వేత (45; 8 ఫోర్లు)తో కలిసి 93 పరుగులు జోడించింది. అనంతరం రైల్వేస్ బౌలర్లు స్నేహ రాణా (5/10), రాజేశ్వరి (3/12), పూనమ్ యాదవ్ (2/19) ధాటికి సౌరాష్ట్ర 39.1 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. -
గుంటూరా?..
గుంటూరు పేరుకే రాజధాని నగరం.. రోడ్లు చూస్తే పల్లెటూరికన్నా అధ్వానం. ప్రధాన రహదారులైనా.. అంతర్గత రోడ్లయినా అడుగడుగునా గుంతల మయం. చినుకుపడిందా రోడ్లన్నీ బురదమయం.. నగరం నడిబొడ్డున ఉన్న మెడికల్ కాలేజీ రోడ్డయినా.. శివారులోని సుద్దపల్లి డొంక అయినా ఒకటే తీరు.. దమ్ముంటే అడుగు పెట్టు.. కింద పడకుంటే ఒట్టు అంటూ వాహనచోదకులకు సవాల్ విసురుతున్నాయి. శివారులోని రోడ్లన్నీ జర్రుజర్రున జారుతూ పాదచారులతో పరాచికాలు ఆడుతున్నాయి. ఓ ప్రణాళికంటూ లేకుండా అధికారులు చేపట్టిన భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ (యూజీడీ) నిర్మాణ పనులు రోడ్లను ధ్వంసం చేసి నగర ప్రజలకు నెలల తరబడి నరకం చూపుతున్నాయి. నగరంపాలెం(గుంటూరు): నగరంలో రహదారులు నరకానికి ఆనవాళ్లుగా మారాయి. ప్రధాన రహదారులతోపాటు, కాలనీ మెయిన్, అంతర్గత రోడ్డు అధ్వానమయ్యాయి. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనుల కోసం ప్రణాళిక లేకుండా రహదారులను పగలగొట్టారు. నగరంలోని కేవీపీ కాలనీ, ఏటీ అగ్రహారం, ఎన్జీవో కాలనీ, శ్యామలనగర్, నాయీబ్రాహ్మణ కాలనీ, ఎస్వీఎన్ కాలనీ, స్వర్ణభారతినగర్, నగరాలు, శారదాకాలనీ, ఆదిత్యనగర్, రాజీవ్‌గాంధీనగర్, నెహ్రూనగర్, మంగళదాస్‌నగర్, పాత గుంటూరు, సుద్దపల్లి డొంకలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పైపు లైన్ల కోసం తీసిన గుంతల్లో మట్టి సక్రమంగా తరలించకపోవడంతో అవి సిమెంట్ రోడ్లపై పడి రూపురేఖలు కోల్పాయాయి. వర్షాలకు సిమెంటు రోడ్లు కాస్తా బురద రోడ్లను తలపిస్తున్నాయి. కలెక్టరేట్ రోడ్డు, అమరావతి రోడ్డు, పొన్నూరు రోడ్డు, జీటీ రోడ్డు, ఏటుకూరు రోడ్డులలో యూజీడీ పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో వాహనాలు వెళ్లడం కష్టతరమైంది. వానకు బురద, ఎండకు దుమ్ముతో ప్రయాణికులు అల్లాడిపోతున్నారు. పునరుద్ధరణ లేదు యూజీడీ పనుల కోసం గతేడాది ఫిబ్రవరిలో తవ్విన రోడ్లనూ పునరుద్ధరించలేదు. వీటిపై సీఎం కంప్లైంట్ సెల్‌కు భారీగా ఫిర్యాదులు వెళుతున్నాయి. యూజీడీ పనుల నిమిత్తం పగలగొట్టిన 500 కిలోమీటర్ల మేర రహదారులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని, అప్పటి వరకు వేరే రోడ్ల జోలికి వెళ్లొద్దని జూన్ చివరి వారంలో కలెక్టర్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. వీటిలో 200 కిలోమీటర్లు ఉన్న సీసీ రోడ్లను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలనీ, నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగం అధికారులను, రవాణా శాఖ నుంచి యంత్ర సామగ్రిని, కార్మిక శాఖ నుంచి కార్మికులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. పునరుద్ధరణ చేయాల్సిన ప్రాంతాలను 15 జోన్లగా విభజించి ప్రతి రోజూ పది కిలోమీటర్ల మేర పునరుద్ధరించాలని ఆదేశించారు. కానీ రోజుకు మూడు కిలో మీటర్లు కూడా పునరుద్ధరణ పనులు సాగడం లేదు. మరమ్మతులు చేపట్టండి మా ప్రాంతంలో యూజీడీ పనులు ప్రారంభించినప్పటి నుంచి రోడ్లన్ని ఆధ్వానంగా తయారయ్యాయి. వర్షాలు కురిసినప్పుడు ఈ రోడ్ల మీద నడవాలంటే నరకంగా మారింది. ఉదయం పిల్లల్ని స్కూల్‌కి తీసుకెళ్లేందుకు సర్కస్ ఫీట్లు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వెంటనే రోడ్లు మరమ్మతులు చేయాలి. – గఫూర్, తారకరామనగర్ -
గిరిజన సంక్షేమ శాఖలో 'కోల్డ్'వార్!
గుంటూరు వెస్ట్ : జిల్లా గిరిజన సంక్షేమశాఖాధికారి(డీటీడబ్ల్యుఓ) పోస్టు కోసం ఇద్దరు అధికారుల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఆ పోస్టులో ఉన్న అధికారి అక్కడే కొనసాగేందుకు, మరో అధికారి ఏవిధంగానైనా పోస్టును దక్కించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆ శాఖలో తీవ్రచర్చకు దారితీశాయి. ఆ ఇద్దరు అధికారుల తీరుతో విస్తుబోతున్న కిందిస్థాయి సిబ్బంది ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందోనని ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రస్తుత డీటీడబ్ల్యుఓ వీ.నారాయణుడును చిత్తూరు జిల్లా డీటీడబ్ల్యుఓగా నియమిస్తూ ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు జారీఅయినట్టు సమాచారం. గత ఏడాది ఆగస్టు 22న నారాయణుడు ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. ఏడాది కూడా పూర్తికాకుండానే ఆయనను చిత్తూరు జిల్లాకు బదిలీ చేయడం వెనుక చాలాతతంగం నడిచినట్టు ఉద్యోగవర్గాల్లో చర్చనడుస్తోంది. అలాగే ఏటీడబ్ల్యుఓ ఎం.ఈశ్వరరావుకు ఇన్చార్జి డీటీడబ్ల్యుఓగా బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈశ్వరరావును చిత్తూరు జిల్లా ఇన్చార్జి డీటీడబ్ల్యుఓగా నియమిస్తూ ఉన్నతాధికారులు గతనెలలో ఉత్తర్వులు జారీచేశారు. ఆయన జూన్ 30 తేదీనే ఇక్కడి నుంచి రిలీవ్ కావాల్సి ఉంది. కానీ రిలీవ్‌కాలేదు. ఈశ్వరరావుది ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమాను మండలం. చిత్తూరు జిల్లాకు బదిలీపై వెళ్లడం ఇష్టంలేని ఆయన ఈ జిల్లాలోనే పోస్టింగ్ కేటాయించాలని ప్రత్తిపాడు నియోజకవర్గంలో కీలకపాత్ర పోషిస్తున్న అధికార పార్టీ నేత ద్వారా ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్టు తెలిసింది. తనకు బదులుగా నారాయణుడును చిత్తూరు జిల్లాకు పంపించాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో అధిక మొత్తంలో నగదు చేతులు మారినట్టు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఈక్రమంలోనే ఈశ్వరరావు ఈనెల 11వ తేదీ నుంచి 15 రోజులపాటు సెలవుపై వెళ్లిపోయారు. సీటు కాపాడుకునేందుకు నారాయణుడు విశ్వప్రయత్నాలు తాను బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పాలనకు సంబంధించిన వ్యవహారాలు, ఇతరత్రా సమస్యలు తలెత్తిన సమయంలో నారాయణుడు జిల్లాలో సీనియర్ ఏటీడబ్ల్యుఓ అయిన ఈశ్వరరావు ద్వారా వాటిని పరిష్కరించే వారని తెలిసింది. ఇప్పుడు తనసీటుకే ఎసరువస్తుండడం ఆయనకు మింగుడుపడడం లేదు. ఉన్నతాధికారులతో ఈవిషయమై పలుమార్లు చర్చించినట్లు తెలిసింది. నిబంధనలు ప్రకారం తన బదిలీ జరగదని, అదేవిధంగా జిల్లాకు చెందిన ఏటీడబ్ల్యుఓకు ఇన్చార్జి డీటీడబ్ల్యుఓగా ఇవ్వడం కుదరదని ఆయన చెబుతున్నారు. ఏమైనా ఇక్కడే కొనసాగేవిధంగా ఆయన తన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.