పూనమ్‌ 136 నాటౌట్‌  | The Railways are the sixth consecutive succession | Sakshi
Sakshi News home page

పూనమ్‌ 136 నాటౌట్‌ 

Published Sat, Dec 15 2018 1:29 AM | Last Updated on Sat, Dec 15 2018 1:29 AM

The Railways are the sixth consecutive succession - Sakshi

సాక్షి, గుంటూరు వెస్ట్‌: బీసీసీఐ సీనియర్‌ మహిళల వన్డే లీగ్‌లో పూనమ్‌ రౌత్‌ (160 బంతుల్లో 136 నాటౌట్‌; 15 ఫోర్లు) అజేయ శతకంతో మెరిసింది. ఫలితంగా రైల్వేస్‌ వరుసగా ఆరో విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం సౌరాష్ట్రతో మ్యాచ్‌లో రైల్వేస్‌ 163 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత రైల్వేస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 251 పరుగులు చేసింది. ఓపెనర్‌గా బరిలో దిగిన పూనమ్‌ తొలి వికెట్‌కు శ్వేత (45; 8 ఫోర్లు)తో కలిసి 93 పరుగులు జోడించింది. అనంతరం రైల్వేస్‌ బౌలర్లు స్నేహ రాణా (5/10), రాజేశ్వరి (3/12), పూనమ్‌ యాదవ్‌ (2/19) ధాటికి సౌరాష్ట్ర 39.1 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement