Railways
-
హైరిస్క్ జోన్లో వందేభారత్!
కుదుపులు లేని వేగవంతమైన ప్రయాణం, ఆధునిక కప్లింగ్ సిస్టం వల్ల కోచ్‌ల మధ్య సమన్వయం, ‘కవచ్’(Kavach)ఏర్పాటుతో ప్రమాదాలకు అతి తక్కువ ఆస్కారం.. వందేభారత్ రైళ్ల(Vande Bharat) గురించి రైల్వే శాఖ చెప్పే విశేషాలివి. నిజానికి ఈ రైళ్లు హై రిస్క్ జోన్లో పరుగు పెడుతున్నాయి. ఒక్క ప్రాంతంలో తప్ప మరెక్కడా రైలు ప్రమాదాలు నివారించే కవచ్ వ్యవస్థ ఈ రైళ్లలో లేదు. ఢిల్లీ–ఆగ్రా, మధుర–పల్వాల్ సెక్షన్ల మధ్య 86 కి.మీ. నిడివిలో మాత్రమే వందేభారత్ రైళ్లు సురక్షితంగా ప్రయాణిస్తాయి.మిగతా ప్రాంతాల్లో సాధారణ రైళ్లకు ఉన్న ప్రమాద భయం వీటినీ వెంటాడుతోంది. గంటకు 50 – 70 కి.మీ. సగటు వేగంతో ప్రయాణించే సాధారణ రైళ్లు నిరంతరం ‘రిస్క్’లో ఉంటే.. 100 కి.మీ. సగటు వేగం (గరిష్టం 130 కి.మీ.)తో దూసుకెళ్లే వందేభారత్ రైళ్లు హై రిస్కులో ఉన్నాయని స్పష్టమవుతోంది. తెలంగాణ మీదుగా నడుస్తున్న ఐదు వందేభారత్ రైళ్లు ప్రమాదకరంగానే పరుగు పెడుతున్నాయి. పట్టాలపై రైళ్ల అధిక సాంద్రత, సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరించకపోవటం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ఆ పరికరం నిరుపయోగమే.. ప్రస్తుతం వందేభారత్ రైళ్లలో కవచ్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. లోకో పైలట్ నిర్లక్ష్యంగా ఉన్నా, తప్పుడు సిగ్నల్‌తో వేరే రైళ్లకు చేరువగా దూసుకెళ్లినా రైలు తనంతట తానుగా బ్రేక్ వేసుకుంటుందనే భావన చాలా మందిలో ఉంది. కానీ, రైళ్ల లోకోమోటివ్‌లలో మాత్రమే కవచ్ యంత్రం ఉంటే నిరుపయోగమే. కవచ్ వ్యవస్థ పనిచేయాలంటే, రైలు ఇంజిన్లలో కవచ్ పరికరం ఉండటంతో పాటు, ప్రతి స్టేషన్లో కవచ్ వ్యవస్థ ఉండాలి.అక్కడి ట్రాక్ వెంట ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్స్ ఏర్పాటు చేయాలి. ట్రాక్ వెంట ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఉండాలి. వీటిని అనుసంధానిస్తూ ఆ మార్గంలో నిర్ధారిత నిడివిలో టెలికం టవర్లు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ అనుసంధానమై పనిచేసినప్పుడే రైళ్లు వాటంతట అవి ప్రమాదాన్ని నివారించుకోగలవు. లోకో పైలట్లను కవచ్ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది. మిగతావి ఏవీ లేకుండా కేవలం ఇంజిన్లలో కవచ్ పరికరంతో పరుగుపెట్టే వందేభారత్‌లు ప్రమాదాన్ని నివారించుకోలేవని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఒకే మార్గంలో.. ఢిల్లీ–ఆగ్రా మధ్య దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలు గతిమాన్ ఎక్స్‌ప్రెస్ పరుగు పెడుతోంది. దీని వేగం గంటకు 160 కి.మీ.. ఈ వేగాన్ని సాధారణ ట్రాక్ తట్టుకోలేదన్న ఉద్దేశంతో ఆ మార్గంలో 125 కి.మీ. ప్రత్యేక ట్రాక్ నిర్మించారు. అదే మార్గంలోని మధుర–పల్వాల్ సెక్షన్ల మధ్య 86 కి.మీ. మేర పూర్తిస్థాయి కవచ్ వ్యవస్థ ఏర్పాటైంది. ఆ మార్గంలో మాత్రమే రైళ్లు కవచ్ రక్షణతో ఉన్నట్టు. ఆ మార్గంలో ఒకే ఒక వందేభారత్ రైలు నడుస్తోంది.దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని లింగంపల్లి–వికారాబాద్–వాడీ సెక్షన్ల మధ్య 245 కి.మీ. మేర కవచ్ ఏర్పాటైంది. కానీ ఆ మార్గంలో వందేభారత్ రైలు తిరగటం లేదు. మన్మాడ్–ముధ్ఖేడ్–డోన్ మధ్య 959 కి.మీ... బీదర్–పర్బణి మధ్య 241 కి.మీ. మేర కవచ్ వ్యవస్థ ఏర్పాటైంది. నార్తర్న్ రైల్వే పరిధిలో కూడా కొంతమేర ఉంది. మొత్తంగా 1,548 రూట్ కి.మీ. మేర మాత్రమే ఇది ఏర్పడింది. మరో 3 వేల కి.మీ.లో పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం వందేభారత్ రైళ్లను పెంచటంపై ప్రదర్శిస్తున్న వేగం.. కవచ్ వ్యవస్థ ఏర్పాటులో చూపటం లేదు. -
విద్యుత్ రైలుకి వందనం
కూ.. ఛుక్.. ఛుక్.. ఛుక్.. ఇది రైలు శబ్ద విన్యాసం..!గుప్పు.. గుప్పు.. వెలువడే పొగ బండి.. రైలును ఉద్దేశించి అనాదిగా చెప్పే మాట. ఇప్పుడా శబ్దం మారింది, ఆ పొగ మాయమైంది. అది విద్యుదీకరణ విప్లవం ఫలితం.. మనదేశ పట్టాల మీద ఆ విప్లవానికి బీజం పడి ఫిబ్రవరి 3వ తేదీకి సరిగ్గా వందేళ్లు కావస్తోంది.1925 ఫిబ్రవరి 3వ తేదీ.. బొంబాయి (ప్రస్తుత ముంబై) నగరంలోని విక్టోరియా టెర్మినస్ (ప్రస్తుత ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్) రైల్వేస్టేషన్ కిక్కిరిసి ఉంది. బ్రిటిష్ అధికారులు, పోలీసుల హడావుడి మధ్య నగర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో చుక్ చుక్మనే శబ్దం, గుప్పుమనే పొగ లేకుండానే మూడు కోచ్‌లతో కూడిన రైలు కామ్‌గా వచ్చి ఆగింది. అంతే చప్పట్లతో ఆ ప్రాంతం మారుమోగింది. గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే హార్బర్ బ్రాంచి ఆ తొలి సబర్బన్ ఎలక్ట్రిక్ రైలును నడిపింది. – సాక్షి, హైదరాబాద్ముంబై–కుర్లా మార్గంలో..అప్పటికే పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలక్ట్రిక్ రైళ్లు పరుగుతీస్తున్నాయి. మన దేశంలో పెద్ద నగరమైన ముంబైలోనూ వాటిని ప్రవేశ పెట్టాలని నాటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ముంబై–కుర్లా మార్గాన్ని పూర్తి చేసింది. మన దేశంలో ప్రవేశపెట్టిన ఈ తొలి విద్యుత్ లోకోమోటివ్ను స్విస్ లోకోమోటివ్ అండ్ మెషీన్‌వర్క్స్ సంస్థ తయారు చేసింది. ఇంగ్లండ్‌లో ఉపయోగించిన న్యూపోర్ట్–షిల్డన్ విద్యుదీకరణ తరహా విధానాన్ని ఇక్కడ అనుసరించారు. దానికోసం 1,500 వోల్ట్స్ డీసీ విద్యుత్‌ను ఉప యోగించారు. ఈ రైలుకు మూడు కోచ్‌లను అనుసంధానం చేశారు. వాటిని ఇంగ్లండ్‌కు చెందిన కామెల్–లెయిర్డ్, జర్మనీకి చెందిన ఉర్డింగెన్ వ్యాగన్ ఫాబ్రిక్ సంస్థలు తయారు చేశాయి.వరుసగా విద్యుత్ రైళ్లను ప్రారంభిస్తూ..గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వేకు పోటీగా 1929లో బాంబే బరోడా– సెంట్రల్ ఇండియా రైల్వే బాంబే చర్చ్‌గేట్ నుండి బోరివలి వరకు 1500 వోల్ట్స్ డీసీ కరెంటును ఉపయోగించి ఈఎంయూ రైళ్లను నడపడం ప్రారంభించింది. గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే 1928లో కొన్ని బ్యాటరీ– ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్లను దిగుమతి చేసుకుంది. ముంబై వీటీ నుంచి పుణె, ఇగత్పురి వరకు మార్గాన్ని 1929–30 నాటికి విద్యుదీకరించి కరెంటు రైళ్లను ప్రారంభించింది. ఆగస్ట్ 1927 నాటికి 41 స్విస్ క్రోకోడిల్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లు ముంబైకి చేరుకున్నాయి. తర్వాతి తరం ఇంజన్లను ఇంగ్లండ్‌లో వల్కన్ ఫౌండ్రీ , మెట్రోపాలిటన్ వికర్స్ సంస్థల నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ రెండో తరం ఇంజన్ల గరిష్ట వేగం అప్పట్లోనే గంటకు 136 కిలోమీటర్లు కావటం విశేషం. వాటిని 112 కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు అనుమతించారు. కానీ మన దేశంలోని ట్రాక్ సామర్థ్యం దృష్ట్యా అవి 55 కిలోమీటర్ల వేగానికే పరిమితం అయ్యాయి.1930 తర్వాత బ్రేక్ పడి..దేశంలో వరుసగా విద్యుత్ రైళ్లను ప్రవేÔè పెడుతూ వచ్చిన బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం.. 1930 తర్వాత వేగం తగ్గించుకుంది. స్వాతంత్య్రోద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటమే దానికి కారణం. 1930 నుంచి 1947 మధ్య 388 కిలోమీటర్ల మార్గాన్ని మాత్రమే విద్యుదీకరించారు. ఇక స్వాతంత్య్రం తర్వాత తొలి ఐదేళ్లు రైల్వే మార్గాల విద్యుదీకరణ పూర్తిగా నిలిచిపోయింది. 1951–56 మధ్య 141 కి.మీ. 1956–61 మధ్య 246 కి.మీ. మేర విద్యుదీకరించారు. 1961 తర్వాత వేగం పుంజుకుంది. కొత్త మార్గాలన్నీ ఎలక్ట్రిక్ విధానంలో చేపడుతూ వచ్చినా అది పరిమితంగానే ఉండిపోయింది. దీంతో 90శాతం ప్రాంతాల్లో డీజి ల్ రైళ్లే నడుస్తూ వచ్చాయి. దక్షిణ భారత్‌కు సంబంధించి 1931లోనే మద్రాస్ బీచ్ స్టేషన్–తాంబారం స్టేషన్ మధ్య కరెంటు రైళ్లను నడిపారు. కానీ తర్వాత పురోగతి లేకుండా పోయింది. తిరిగి 1980 దశకంలో కదలిక వచ్చింది. ఆ సమయంలోనే ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో లైన్ల విద్యుదీకరణ మొదలైంది.విజయవాడ – గూడూరు మధ్య తొలిసారిగా..విజయవాడ–గూడూరు–చెన్నై సెక్షన్ విద్యుదీకరణ పనులతో తెలుగు నేలపై కరెంటు రైళ్ల వినియోగానికి బీజం పడింది. 1976లో ప్రారంభమైన పనులు 1980 నాటికి పూర్తయ్యాయి. తర్వాత వరుసగా విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి. స్థానిక పరిస్థితులు, వాతావరణ కారణాలు, సాంకేతిక సమస్యలు.. వెరసి ఒక మార్గంలో కొంతదూరం విద్యుదీకరణ పనులు పూర్తయితే.. మిగతా మార్గంలో జరిగేవి కావు. దీనితో దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లకు విద్యుదీకరణ ఉన్నంత వరకు కరెంటు ఇంజిన్లు వాడి, తర్వాత డీజిల్ ఇంజిన్ జత చేసి ముందుకు పంపేవారు. ఇటీవలి వరకు ఇది కొనసాగడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో తెలంగాణ, ఏపీ సహా 20 రాష్ట్రాల్లో మొత్తం లైన్లను విద్యుదీకరించారు. ప్రస్తుతం కొత్తగా చేపట్టే రైల్వే లైన్లతో సమాంతరంగా విద్యుదీకరణ పనులు కూడా జరుపుతారు.మొట్టమొదటి ఎలక్ట్రిక్ రైలును ధ్వంసం చేసిన కార్మికులు..ప్రపంచంలో తొలి ఎలక్ట్రిక్ రైలు స్కాట్లాండ్లో రూపొందింది. అక్కడి అబెర్డీన్ నగరానికి చెందిన రసాయన శాస్త్రవేత్త రాబర్ట్ డేవిడ్సన్ 1837లో గాల్వానిక్ సెల్స్ (బ్యాటరీలు)తో నడిచే ఎలక్ట్రిక్ లోకోమోటివ్ను రూపొందించారు. అది ఫలితం ఇవ్వకపోవడంతో మార్పు లు చేసి మరో ఏడు టన్నుల బరువును లాగ గలిగిన లోకోమోటివ్ను అభివృద్ధి చేశారు. దాని వేగం గంటకు 6 కిలోమీటర్లు. ప్రయోగ పరీక్షలో ఆరు టన్నుల బరువును రెండున్నర కిలోమీటర్ల దూరం లాగింది. గ్లాస్గో రైల్వేలో దీనిని నడ పాలని నిర్ణయించారు. ఈలోపే తమ ఉద్యోగ భద్రతకు ముప్పు వస్తుందని ఆందోళన చెందిన రైల్వే కార్మికులు ఆ లోకోమోటివ్ను ధ్వంసం చేశారు.» మొదటి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ రైలును 1879లో బెర్లిన్‌లో వెర్నర్ వాన్ సిమెన్స్ ఆధ్వర్యంలో సిద్ధమైంది. 2.2 కిలోవాట్స్ శక్తి గల మోటారుతో నడిపారు. మూడు కోచ్‌లతో కూడిన ఆ రైలు గంటకు 13 కిలోమీటర్ల వేగంతో నడిచింది.» సొరంగ మార్గాలు, కిక్కిరిసిన పట్టణ ప్రాంతాల్లో డీజిల్, బొగ్గు రైలు పొగతో జనం విసిగిపోయి ఎలక్ట్రిక్ రైళ్ల వైపు మొగ్గుచూపటం ప్రారంభించారు. కొన్ని పట్టణాలు అప్పట్లోనే పొగ రైళ్లను నిషేధించాయి.» అమెరికాలో తొలి ఎలక్ట్రిక్ రైలు 1895లో మొదలైంది. బాల్టిమోర్ ఒహియోను న్యూ యార్క్ మధ్య దాన్ని ప్రారంభించారు.మన దేశంలో కరెంటు రైలు విశేషాలెన్నో..» మన దేశంలో ప్రస్తుతం వినియోగిస్తున్న విద్యుత్ లోకోమోటివ్‌లు 10,230, డీజిల్ ఇంజన్లు 4,560..» చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్‌లో 1961లో మన దేశం సొంతంగా ఎలక్ట్రిక్ లోకోమోటివ్ను రూపొందించింది. డబ్ల్యూసీఎం–5 లోకమాన్య అని దానికి పేరు పెట్టారు. అయితే ఇప్పటికీ శక్తివంతమైన లోకోమోటివ్ల తయారీ కోసం మన దేశం విదేశీ కంపెనీలపై ఆధారపడుతోంది.» 2015లో స్విస్ కంపెనీ ఆల్‌స్టామ్‌తో కేంద్రం ఒప్పందం చేసుకుని, బిహార్‌లోని మాధేపురాలో ఎలక్ట్రిక్ లోకోమోటివ్ల తయారీ యూనిట్ ప్రారంభించింది. ఇక్కడ 12,000 హార్స్పవర్ సామర్థ్యమున్న లోకోమోటివ్‌లు తయారు చేస్తున్నారు. 250 కంటే అధికంగా వ్యాగన్లు ఉండే సరుకు రవాణా రైళ్లకు ఈ లోకోమోటివ్లను వాడుతున్నారు.» ప్రపంచంలో తొలిసారిగా పాత డీజిల్ రైలు ఇంజన్‌ను ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌గా మార్చిన ఘనత మన రైల్వేదే. ఇప్పటికే ప్రయోగాత్మంగా మూడు ఇంజన్లను మార్చి వినియోగి స్తున్నారు. పాత డీజిల్ ఇంజన్లన్నీ ఎలక్ట్రిక్‌గా మార్చే ప్రతిపాదన ఉంది. అయితే ఏదైనా సమస్య ఏర్పడి ఎలక్ట్రిక్ రైళ్ల వినియోగంలో ఇబ్బందులు తలెత్తితే.. అత్యవసరంగా వినియోగించేందుకు వీలుగా 3 వేల డీజిల్ ఇంజన్లను సిద్ధంగా ఉంచాలని రైల్వేశాఖ నిర్ణయించింది. -
రైల్వేలకు పాత పద్దే!
న్యూఢిల్లీ: కొత్త బడ్జెట్లో రైల్వేశాఖ పద్దుల్లో పెద్దగా మార్పులేమీ రాలేదు. 2025–26 బడ్జెట్లో ఈ శాఖకు మొత్తం రూ.2.52 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వేలు మొత్తం రూ.3,02,100 కోట్ల ఆదాయం ఆర్జిస్తాయని అంచనా వేశారు. మరో 200 వందేభారత్ రైళ్లు, 100 అమృత్ భారత్ రైళ్లు, 50 నమోభారత్ రైళ్లు ప్రవేశపె ట్టేందుకు అనుమతి ఇచ్చారు. వచ్చే నాలుగేళ్ల లో మొత్తం రైల్వే మౌలిక వసతుల కల్పన కోసం రూ.4.5 లక్షల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు బడ్జెట్ ప్రకటన అనంతరం శనివారం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆదాయ అంచనా రూ.3 లక్షల కోట్లు2025–26 ఆర్థిక సంవత్సరంలో రైల్వే శాఖ అన్ని మార్గాల ద్వారా రూ.3,02,100 కోట్ల ఆదాయం ఆర్జిస్తుందని అంచనా వేశారు. 2024–25 బడ్జెట్లో సవరించిన అంచనా ప్రకారం ఇది రూ.2,79,000 కోట్లుగా ఉంది. గత బడ్జెట్లో ప్రయాణికుల చార్జీల ఆదాయం 2024–25లో రూ.80,000 కోట్లు ఉండగా, 2023–24లో రూ.70,693 కోట్లు వచ్చింది. 2024–25 బడ్జెట్లో సరుకు రవాణా ద్వారా రూ.1,80,000 కోట్ల ఆదాయం వస్తుందని సవరించిన అంచనాల్లో పేర్కొన్నారు. 2023–24లో ఇది 1,68,199 కోట్లుగా ఉంది. రైల్వేల్లో భద్రతాపరమైన చర్యల కోసం 2024–25 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం రూ.1,14,062 కోట్లు ఉండగా, 2025–26 బడ్జెట్లో దీనిని రూ.1,16,514 కోట్లుగా అంచనా వేశారు. అయితే, ఇంతగా నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ రైల్వేలకు వస్తున్న ఆదాయంలో మాత్రం పెద్దగా పెరుగుదల ఉండటం లేదని ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్, టెలి కమ్యూనికేషన్స్ మాజీ డీజీ శైలేంద్రకుమార్ గోయెల్ చెప్పారు. మరో 200 వందేభారత్ రైళ్లు: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దేశవ్యాప్తంగా మరో 200 వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తక్కువ దూరంగల పట్టణాల మధ్య ప్రయాణించే అమృత్ భారత్ రైళ్లను మరో 100 ప్రారంభిస్తామని చెప్పారు. 17,500 కొత్త కోచ్‌ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు వివరించారు. -
సూపర్‌స్టార్ విఫలమైనా..
రంజీ ట్రోఫీ పునరాగమనంలో విరాట్ కోహ్లి(Virat Kohli) విఫలమైనా.. అతడి జట్టు ఢిల్లీ మాత్రం ఘన విజయం సాధించింది. రైల్వేస్(Railways Team)ను ఏకంగా ఇన్నింగ్స్ పందొమ్మిది పరుగుల తేడాతో ఓడించింది. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో వైఫల్యం తర్వాత టీమిండియా స్టార్ క్రికెటర్ కోహ్లి ఎట్టకేలకు దేశవాళీ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రైల్వేస్ జట్టుతో గురువారం మొదలైన మ్యాచ్ సందర్భంగా కోహ్లి ఢిల్లీ తరఫున సొంతమైదానంలో అడుగుపెట్టాడు. దీంతో కోహ్లి ఆటను చూసేందుకు తొలిరోజే వేలాది మంది అరుణ్ జైట్లీ స్టేడియానికి పోటెత్తారు. అయితే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకోవడంతో తొలిరోజు.. కోహ్లికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక శుక్రవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా బ్యాట్‌తో అతడు మైదానంలో అడుగుపెట్టాడు. కరతాళ ధ్వనులు, ఆర్సీబీ... ఆర్సీబీ... కోహ్లి... కోహ్లి... అనే అభిమానుల నినాదాల మధ్య ఉదయమే అతడు క్రీజులోకి వచ్చాడు.15 బంతుల్లోనే ముగిసిన ముచ్చటఅప్పటికే ఐదు వేల పైచిలుకు ప్రేక్షకులు మైదానంలోకి వచ్చేశారు. అయితే కోహ్లిని 6 పరుగుల వద్దే హిమాన్షు క్లీన్‌బౌల్డ్ చేయడంతో మరింత మంది అభిమానులు స్టేడియం లోపలికి వచ్చేందుకు ఆసక్తి కనబరచలేదు. కనీసం అతడిబ్యాట్ నుంచి ఫిఫ్టీ వచ్చినా వేలసంఖ్యతో తొలిరోజులాగే అరుణ్ జైట్లీ స్టేడియం నిండిపోయేది.కానీ.. పుష్కర కాలం తర్వాత రంజీ బరిలోకి దిగిన ఈ దిగ్గజ ఆటగాడి బ్యాటింగ్ ముచ్చట 15 బంతుల్లోనే ముగిసింది.ఇక మ్యాచ్ విషయానికొస్తే సూపర్‌స్టార్ కోహ్లి విఫలమైనప్పటికీ ఎలైట్ గ్రూప్ ‘డి’లో రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో రైల్వేస్‌ను 241 పరుగులకు ఆలౌట్ చేసిన బదోని సేన.. తమ మొదటి ఇన్నింగ్స్‌లో 374 రన్స్ స్కోరు చేసింది.బదోని కెప్టెన్ ఇన్నింగ్స్టాపార్డర్లో ఓపెనర్లు అర్పిత్ రాణా(10), సనత్ సంగ్వాన్(30).. వన్‌డౌన్ బ్యాటర్ యశ్ ధుల్(32) ఎక్కువ సేపు నిలవలేకపోయారు. మరోవైపు.. కోహ్లి ఆరు పరుగులకే అవుట్ కాగా.. ఆయుశ్ బదోని కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 77 బంతుల్లోనే 12 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి.. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అవుటయ్యాడు.మూడో రోజే ముగిసిన కథఇక బదోనికి తోడుగా సుమిత్ మాథుర్ 86 పరుగులతో రాణించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ప్రణవ్ రాజువన్షీ 39 రన్స్‌తో ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో 374 పరుగుల మేర మెరుగైన స్కోరు సాధించిన ఢిల్లీ.. శనివారం నాటి మూడో రోజు ఆటలో రైల్వేస్ కథను ముగించింది.సూరజ్ అహుజా బృందాన్ని కేవలం 114 పరుగులకే ఆలౌట్ చేసి.. ఘన విజయం సాధించింది. ఢిల్లీ బౌలర్లలో స్పిన్నర్ శివం శర్మ ఐదు వికెట్లతో చెలరేగగా.. నవదీప్ సైనీ, సిద్ధాంత్ శర్మ, మోనీ గరేవాల్, ఆయుశ్ బదోని ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక ఢిల్లీ ఇన్నింగ్స్‌లో మెరుగైన స్కోరు చేయడంతో పాటు.. ఓవరాల్‌గా మూడు వికెట్లు పడగొట్టిన స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సుమిత్ మాథుర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. రోహిత్‌కు మాత్రం పరాభవంఏదేమైనా రంజీ రీఎంట్రీలో విరాట్ కోహ్లి బ్యాట్ ఝులిపించలేకపోయినప్పటికీ.. విజయంతో తిరిగి వెళ్లడం విశేషం. మరోవైపు.. రంజీ పునరాగమనం(జనవరి 23)లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం ఘోర పరాభవం ఎదురైంది. బ్యాటర్(3, 28)గా అతడి వైఫల్యం ముంబై జట్టుపై ప్రభావం చూపింది. జమ్ము కశ్మీర్ చేతిలో ముంబై ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.విరాట్ కోహ్లికి సన్మానంఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) తమ స్టార్ క్రికెటర్ కోహ్లిని సత్కరించింది. అంతర్జాతీయ కెరీర్లో భారత్ తరఫున వంద టెస్టులు పూర్తి చేసుకున్న తమ ఆటగాడిని డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ శాలువకప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మెమెంటోను బహూకరించారు. మూడేళ్ల క్రితమే 2022లోనే కింగ్ కోహ్లి వంద టెస్టుల మార్క్ దాటాడు. కానీ రంజీల బరిలోకి దిగకపోవడంతో ఆత్మీయ సత్కారం కోసం డీడీసీఏ ఇన్నేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది.చదవండి: అతడిని ఆడించడం అన్యాయం.. మాకు ఒక మాట కూడా చెప్పలేదు: బట్లర్ -
నిధులకు నిరీక్ష.. కూటమికి పరీక్ష
కేంద్రం రేపు పార్లమెంట్లో ప్రవేశ పెట్టనున్న 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ‘ఉపాధి’, వ్యవసాయం, రైల్వేకు కేటాయింపులపై జనం గంపెడాశలు పెట్టుకున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏటా గరిష్టంగా 150 పని దినాలు కల్పిస్తూ కేంద్రం బడ్జెట్లో ప్రకటన చేయాలని, పథకం అమలుకు సరిపడినన్ని నిధులను ముందుగానే కేటాయించాలని కోరుతున్నారు. ఏటా కేటాయింపులు తక్కువగా ఉండటంతో సరైన సమయానికి నిధులు విడుదల కాక రాష్ట్రాల్లో పేదలకు పనుల కల్పన తగ్గిపోతోందని చెబుతున్నారు. మన రాష్ట్రంలో గత ఏడాది సగటున ఒక్కో కుటుంబానికి 55 రోజుల చొప్పున పనులు కల్పించగా, ఈ ఏడాది ఆ సంఖ్య 47కు తగ్గిపోయిందని గుర్తు చేస్తున్నారు. మరోవైపు వ్యవసాయ రంగానికి ఈ దఫా కేటాయింపులు భారీగా పెంచాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో 68 శాతం జనాభా ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్న తరుణంలో గతేడాది బడ్జెట్లో కేవలం రూ.1.52 లక్షల కోట్లు మాత్రమే కేటాయించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం బడ్జెట్లో ఇది 3.1 శాతం మాత్రమేనని చెబుతున్నారు. ఇతర రంగాలకు జరిపే కేటాయింపులతో పోల్చి చూస్తే వ్యవసాయ అనుబంధ రంగాలకు జరిపే కేటాయింపులు కూడా చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు. ఇక రాష్ట్రంలో రైల్వే గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంతమంచిదని ఆ రంగ ఉద్యోగులే వాపోతున్నారు. కొత్త రైల్వే లైన్లు, ఆధునికీకరణపై ఈసారైనా దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. – సాక్షి, అమరావతికనీసం 150 పని దినాలు కల్పించాలిఉపాధి హామీ పథకం అమలుకు ఆర్థిక ఏడాది చివరిలో నిధుల కొరత తలెత్తకుండా కేంద్రం ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్(Budget)లోనైనా నిధులు కేటాయించాలని దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఉపాధి హామీ పథకం(Employment Guarantee Scheme) జాబ్‌కార్డుదారులు కోరుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఈ పథకం కింద మొత్తం ఖర్చులో 90 శాతం కేంద్రమే భరించాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో పథకం అమలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగుతుంది. చట్టం నిబంధన ప్రకారం పని అడిగిన ప్రతి కూలీ కుటుంబానికి ప్రభుత్వం ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. అయితే, కొన్నేళ్లుగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం అమలులో డిమాండ్‌కు తగ్గట్టుగా కేంద్రం వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదు. దీంతో ప్రతి ఏటా ఆర్థిక ఏడాది చివరిలో జనవరి–మార్చి నెలల మధ్య పని చేసిన కూలీలకు వేతనాల చెల్లింపులు నెలల తరబడి ఆలస్యమవుతున్నాయి. దీనికి తోడు మ్యాచింగ్‌గా మెటీరియల్ కేటగిరిలో రాష్ట్రాలకు విడుదల చేయాల్సిన నిధులను ఆలస్యంగా విడుదల చేస్తున్న కారణంగా అభివృద్ధి పనుల నిర్వహణపై ప్రభావం పడుతోంది. ప్రస్తుత 2024–25 వార్షిక బడ్జెట్లో దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం అమలుకు కేంద్రం రూ.86 వేల కోట్లు కేటాయించింది. అయితే, జనవరి 26వ తేదీ (సోమవారం) నాటికే అన్ని రాష్ట్రాల్లో జరిగిన పనులకు రూ.87,865 కోట్లు ఖర్చయింది. ఈ లెక్కన ఈ ఆర్థిక ఏడాదిలో ఇంకా మిగిలి ఉన్న ఫిబ్రవరి, మార్చి నెలల్లో పని చేసే కూలీలకు వేతనాలు చెల్లించడానికి అదనపు నిధులు కేటాయించాల్సి ఉంటుంది. మరోవైపు కూలీల వేతనం ఏటా పెరుగుతున్నా, ఆ మేరకు బడ్జెట్ కేటాయింపులు పెంచడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా పని దినాల సంఖ్య 100 నుంచి 150కి పెంచాలని పేదలు, వివిధ ఎన్జీవో సంఘాలు, రాజకీయ వర్గాల నుంచి బలంగా డిమాండ్ వినిపిస్తోంది. పెద్దపీటతోనే ‘సాగు’ క్షేమంవ్యవసాయ రంగానికి ఈ దఫా కేటాయింపులు భారీగా పెంచాలన్న డిమాండ్ రైతుల నుంచి వ్యక్తమవుతోంది. దేశ జీడీపీలో 15 శాతానికి పైగా ఈ రంగం నుంచే వస్తోంది. ఏటా ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలపై రైతు సంఘాలు పెదవి విరుస్తున్నాయి. ఫసల్ బీమా యోజన, పీఎం కిసాన్ వంటి పథకాలకు 2023–24తో పోలిస్తే 2024–25లో భారీగా కోత విధించారు. ఈసారి మొత్తం బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు కనీసం 5–10 శాతానికి తక్కువ కాకుండా కేటాయింపులు జరపాలనే డిమాండ్ విన్పిస్తోంది. పీఎం కిసాన్ ద్వారా ఇచ్చే సాయం రెట్టింపు చేయాలని రైతులు కోరుతున్నారు. ఫసల్ బీమా యోజనకు కేటాయింపులు పెంచడమే కాదు.. ప్రీమియం చెల్లింపు భారం రైతులపై మోపకుండా పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించేలా మార్పులు తీసుకు రావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్గానిక్ ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను, జాతీయ స్థాయిలో సర్టిఫికేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్‌గా వీటిని ప్రోత్సహించేందుకు ఎఫ్‌పీవోలు, ఎస్హెచ్సీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఏపీలో ఆయిల్ పామ్ మరింతగా విస్తరణ, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా కూరగాయల ఉత్పత్తి, సరఫరా చైన్‌ను ఏర్పాటు చేయడం, వీటి నిల్వ కోసం గ్రామ స్థాయిలో స్టోరేజ్, మార్కెటింగ్ సౌకర్యాల కల్పనకు చేయూతనివ్వాలి. బడ్జెట్లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. యంత్ర పరికరాలతో పాటు డ్రోన్స్ వినియోగాన్ని ప్రోత్సహించాలి. సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించేలా జాతీయస్థాయిలో వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఉద్యాన, మత్స్య, పాడి రంగాల్లో కూడా ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రోత్సహించేలా రాయితీలు ప్రకటించాలి. అపరాలు, నూనె గింజల సాగును ప్రోత్సహించాలి. పరిశోధన కేంద్రాలకు నిధులు పెంచాలి.పట్టాలెక్కని రైల్వే ప్రాజెక్టులురాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాటలు కోటలు దాటినా నిధుల కేటాయింపు మాత్రం కేంద్ర ప్రభుత్వ ఖజానా దాటడం లేదు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో 2025–26 వార్షిక బడ్జెట్లో అయినా రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు తగినన్ని నిధులు రాబట్టడంలో సఫలమవుతారా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గుంటూరు జిల్లా నంబూరు నుంచి అమరావతి మీదుగా ఎర్రుపాలెం వరకు రైల్వేలైన్ నిర్మాణం కోసం 2014లోనే రైల్వేశాఖ ఆమోదించినట్లు ప్రకటించింది. ఆ ఐదేళ్లలో కనీసం సర్వే కూడా పూర్తిచేయలేదు. ఇప్పుడు మరోసారి అమరావతి రైల్వే లైన్‌పై మాటల గారడి చేస్తున్నాయి. రైల్వేకు సంబంధించి ప్రధాన డిమాండ్లు ఇలా ఉన్నాయి. » కాకినాడ–పిఠాపురం (21.51 కి.మీ.), మాచర్ల–నల్గొండ (92 కి.మీ.), కంభం–ప్రొద్దుటూరు (142కి.మీ.), గూడూ రు–దుగ్గరా జుపట్నం (41.55 కి.మీ.) రైల్వేలైన్ల నిర్మాణాన్ని పట్టాలెక్కించాలి. కొండపల్లి– కొత్తగూడెం (125 కి.మీ.), భద్రాచలం–కొవ్వూరు (151 కి.మీ.) లైన్ల నిర్మాణం సంగతి తేల్చాలి.» కడప–బెంగళూరు (255 కి.మీ), కోటిపల్లి–నర్సాపురం రైల్వే లైన్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. » నడికుడి–శ్రీకాళహస్తి, డోన్–అంకోలా, విజయవాడ–ఖరగ్‌పూర్, విజయవాడ–నాగ్‌పూర్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు వెంటనే పూర్తి చేసేలా నిధులు మంజూరు చేయాలి.» కర్నూలు జిల్లాలో రూ.440 కోట్లతో నిర్మిస్తున్న కోచ్ ఫ్యాక్టరీ పనులు సకాలంలో పూర్తి చేయాలి.» తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్‌ను ఏర్పాటుచేయాలి. జయవాడ–గూడూరు మధ్య నాలుగో లైన్ నిర్మించాలి. కడప–బెంగళూరు రైల్వేలైన్ అలైన్మెంట్ మార్చాలి. ఇప్పటికే ఆమోదించిన మచిలీపట్నం–రేపల్లె రైల్వేలైన్‌ను బాపట్ల వరకు పొడిగించాలి.» ఓబులవారిపల్లి–కృష్ణపట్నం రైలు మార్గంలో పాసింజర్ రైలును నడపాలి. నందలూరు రన్నింగ్ స్టాఫ్ సెంటర్‌ను మరింత అభివృద్ధి చేయాలి. అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఒంటిమిట్టలో హాల్టింగ్ కల్పించాలి. -
కోహ్లి తెచ్చిన కిక్...
సాధారణంగా రంజీ మ్యాచ్ జరుగుతోందంటే.. వంద మంది ప్రేక్షకులు ఆట చూసేందుకు రావడం కూడా కష్టమైన ఈ రోజుల్లో... గురువారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం (గతంలో ఫిరోజ్ షా కోట్లా మైదానం) కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా జనమే... ఇసుక వేస్తే రాలనంత మంది అభిమానులు రంజీ మ్యాచ్ చూసేందుకు పోటెత్తారు. సుదీర్ఘ కాలంగా దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి 2012 తర్వాత తొలిసారి ఢిల్లీ జట్టు తరఫున రంజీ మ్యాచ్ ఆడుతుండటంతో అభిమానులు బ్రహ్మరథం పట్టారు. మ్యాచ్ ప్రారంభానికి మూడు గంటల ముందు నుంచే క్యూ లైన్లు నిండిపోగా... ఢిల్లీ, డిస్ట్రిక్ట్స్ క్రికెట్ సంఘం (డీడీసీఏ) చేసిన ఏర్పాట్లకు మించి ప్రేక్షకులు మైదానానికి తరలివచ్చారు. అభిమానులు భారీగా వస్తారని ముందే అంచనా వేసిన డీడీసీఏ... స్టేడియంలోని 6 వేల సామర్థ్యం గల ‘గౌతమ్ గంభీర్ స్టాండ్’ను తెరవగా... కాసేపట్లోనే అది నిండిపోయి స్వల్ప తొక్కిసలాట జరిగింది. అదే సమయంలో మైదానం వెలుపల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమం జరుగుతుండటంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది... 11 వేల సామర్థ్యం గల ‘బిషన్ సింగ్ బేడీ స్టాండ్’లోకి అభిమానులను అనుమతించారు. తొలి రోజు ఏకంగా 27 వేల మంది కంటే ఎక్కువ మంది ప్రేక్షకులు హాజరైనట్లు సమాచారం. న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్లు బరిలోకి దిగితే... దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లు కూడా కళకళలాడు తాయని నిజమైంది. రంజీ ట్రోఫీ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో భాగంగా గురువారం అరుణ్ జైట్లీ స్టేడియంలో రైల్వేస్, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్‌కు ప్రేక్షకుల నుంచి అసాధారణ స్పందన లభించింది. 2012 తర్వాత భారత దిగ్గజం విరాట్ కోహ్లి రంజీ మ్యాచ్‌లో ఆడేందుకు సిద్ధం కావడమే దీనికి కారణం. కోహ్లి ఆటతీరును ప్రత్యక్షంగా చూసేందుకు ప్రేక్షకులు ఉదయం నుంచే ఎగబడ్డారు. ఫలితంగా మైదానం అభిమానులతో నిండిపోయింది. ‘రంజీ ట్రోఫీలో ఇలాంటి సందడి గతంలో ఎప్పుడూ చూడలేదు. దేశవాళీ మ్యాచ్‌లు చూసేందుకు అభిమానులు ఈ స్థాయిలో వస్తారని ఎప్పుడూ ఊహించలేదు. ఇదంతా కేవలం ఒక్క వ్యక్తి కోసమే. వచ్చిన వాళ్లంతా కోహ్లి నామస్మరణ చేస్తున్నారు’ అని మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన ఓ భారత మాజీ క్రికెటర్ అన్నాడు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) కార్యదర్శి అశోక్ శర్మ మాట్లాడుతూ... ‘30 ఏళ్లుగా ఢిల్లీ క్రికెట్‌ను గమనిస్తున్నా. రంజీ ట్రోఫీలో ఇలాంటి దృశ్యాలు చూడలేదు. కోహ్లి ఆదరణకు ఇది నిదర్శనం. మొదట ఒక గేట్ ద్వారానే అభిమానులను అనుమతించాం. తర్వాత పరిస్థితిని బట్టి మైదానంలోని అన్ని గేట్లు తెరిచాం’ అని అన్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కెరీర్లో చివరగా ఆడిన రంజీ మ్యాచ్‌కు ఇప్పటి వరకు అత్యధికంగా 8 వేల పైచిలుకు మంది అభిమానులు హాజరు కాగా... గురువారం రైల్వేస్–ఢిల్లీ మ్యాచ్ చూసేందుకు 27 వేల మందికి పైగా ప్రేక్షకులు పోటెత్తారు. ఈరోజు క్రీజులోకి రానున్న కోహ్లి ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఢిల్లీ కెపె్టన్ ఆయుశ్ బదోనీ ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నా... అభి మానుల ఉత్సాహం మాత్రం తగ్గలేదు. ‘గంటలకొద్దీ నిలబడి మైదానంలోకి వచ్చింది... కోహ్లిని చూసేందుకే. అతడు ఫీల్డింగ్ చేసినా మాకు ఆనందమే’ అని ప్రేక్షకుల్లోని ఒక గృహిణి పేర్కొనగా... కోహ్లి ఆట చూసేందుకే పాఠశాల నుంచి వచ్చామని పలువురు విద్యార్థులు చెప్పారు. రెండో స్లిప్‌లో ఫీల్డింగ్ చేసిన కోహ్లి... అభిమానులకు చేతులు ఊపుతూ అభివాదం చేయగా... ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఓ అభిమాని మైదానంలోకి వచ్చి కోహ్లి కాళ్లకు నమస్కరించాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన రైల్వేస్ తొలి ఇన్నింగ్స్‌లో 67.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. ఉపేంద్ర యాదవ్ (95; 10 ఫోర్లు, 1 సిక్స్), కరణ్ శర్మ ( 50; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో నవ్‌దీప్, సుమిత్ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం ఢిల్లీ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 41 పరుగులు చేసింది. శుక్రవారం కోహ్లి బ్యాటింగ్‌కు రానున్న నేపథ్యంలో... మరింత మంది అభిమానులు మైదానానికి పోటెత్తడం ఖాయమే!చదవండి : 2 పరుగులే 6 వికెట్లు.. 152 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే -
పైన ప్రయాణికులు.. కింద సరుకు
సాక్షి, అమరావతి: కొత్త తరహా డబుల్ డెక్కర్ రైళ్లు త్వరలో పట్టాలు ఎక్కనున్నాయి. ప్రయాణికులు, సరుకు రవాణా ఒకేసారి గమ్యం చేరేలా సరికొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు సరికొత్త రైలు డిజైన్‌ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మోడల్ రైళ్ల డిజైన్‌ను గత ఏడాది చివర్లో రైల్వే శాఖ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించగా, ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. సరికొత్త డబుల్ డెక్కర్ రైలు డిజైన్‌ను రైల్వే రీసెర్చ్–డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ రూపొందించింది. పై అంతస్తును ప్రయాణికులకు, కింద అంతస్తును సరుకు రవాణాకు ఉపయోగిస్తారు. తద్వారా ఒకేసారి ప్రయాణికులు, సరుకు త్వరితగతిన నిర్దేశిత గమ్యస్థానాలను చేరేలా ఈ డబుల్ డెక్కర్ రైళ్లు ఉపకరించడంతో నిర్వహణ వ్యయం తగ్గుతుంది. ప్రస్తుతం రైలు ప్రయాణికుల కోసం సాధారణ రైళ్లు, సరుకు రవాణా కోసం గూడ్స్ రైళ్లను ఉపయోగిస్తున్నారు.ఒక్కో కోచ్‌కు రూ.4 కోట్లు డబుల్ డెక్కర్ రైళ్లలో 18 నుంచి 22 కోచ్‌ల చొప్పున నిర్మించాలని నిర్ణయించారు. ఒక్కో కోచ్‌ను రూ.4 కోట్లతో నిర్మించనున్నారు. ఇప్పటికే కపుర్తలా కోచ్ ఫ్యాక్టరీలో 10 కోచ్‌లను తయారు చేశారు. ఈ ఏడాది చివరి నాటికి డబుల్ డెక్కర్ రైళ్లను పట్టాలు ఎక్కించాలని రైల్వే శాఖ భావిస్తోంది. అందుకోసం కోచ్‌ల తయారీ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. మరోవైపు కార్గో రవాణా ద్వారా మరింత రాబడి సాధించేందుకు ఈ సరికొత్త డబుల్ డెక్కర్ రైళ్లు దోహదపడతాయని రైల్వే శాఖ ఆశిస్తోంది. 2023–24లో రైల్వే 1,591 మిలియన్ టన్నుల కార్గో రవాణా చేసింది. 2030 నాటికి 3 వేల మిలియన్ టన్నుల కార్గో రవాణా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ఏటా 10 శాతం చొప్పున కార్గో రవాణా పెరగాల్సి ఉంది. ఆ లక్ష్య సాధనకు ఈ రైళ్లు దోహదపడతాయని రైల్వే శాఖ భావిస్తోంది. -
2030 నాటికి రైల్వేకు ‘కవచ్’ రక్షణ
సాక్షి, అమరావతి: దేశంలో రైలు ప్రమాదాల నివారణకు ఉద్దేశించిన ‘కవచ్’ వ్యవస్థ ఏర్పాటుకు రైల్వే శాఖ కార్యాచరణ వేగవంతం చేసింది. ఒకే ట్రాక్‌పై పొరపాటున రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొనకుండా అడ్డుకునేందుకు ‘రీసెర్చ్ డిజైన్స్– స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్వో) 2022లో రూపొందించిన ఈ కవచ్ వ్యవస్థను 2030 నాటికి దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తేవాలని ప్రణాళిక సిద్ధం చేసింది. గత ఐదేళ్లలో సగటున ఏడాదికి 43 రైలు ప్రమాదాల్లో 56 మంది చొప్పున దుర్మరణం చెందారు. దాంతో రైలు ప్రమాదాల నివారణకు కవచ్ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రయోగాత్మకంగా మొదటి దశను విజయవంతంగా పూర్తి చేసిన రైల్వే శాఖ, రెండో దశ కింద దేశంలో 10 వేల రైళ్లలో 9 వేల కిలోమీటర్ల మేర ఈ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. అందుకోసం సర్వే పూర్తి చేసి, టెండర్ల ప్రక్రియ చేపట్టింది. ఏపీలో ఇప్పటికే 120 కి.మీ.మేర కవచ్ రక్షణ అందుబాటులో ఉండగా, వచ్చే ఏడాది మరో 550 కి.మీ.మేర ఏర్పాటు చేయనున్నారు. అనంతరం ఇంకో 600 కి.మీ.మేర అందుబాటులోకి తేనుంది. మొత్తం ఏడు రకాల రైలు ప్రమాదాల నివారణకు ఉద్దేశించిన కవచ్ ప్రాజెక్ట్ రైల్వే భద్రతలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనుంది.రెండో దశలో 10 వేల రైళ్లు.. 9 వేల కి.మీ..కవచ్ రెండో దశ ప్రాజెక్ట్ కోసం దశల వారీగా టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మొత్తం 10 వేల రైళ్లలో 9వేల కి.మీ.మేర కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోసహా 12 రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్ట్ కోసం 18 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచింది. కిలోమీటరుకు రూ.50 లక్షల చొప్పున, ఒక్కో లోకో(రైలు)కు రూ.70 లక్షల చొప్పున వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. 2025 ఏప్రిల్‌లో ప్రారంభించి నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి 10 వేల రైళ్లు, 9 వేల కి.మీ.లలో కవచ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి. అనంతరం మూడో దశ కింద మరో 10 వేల రైళ్లలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. దాంతో దేశ వ్యాప్తంగా రైల్వే వ్యవస్థకు 100 శాతం కవచ్ రక్షణ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది.కర్నూలు– గుంతకల్లు మధ్య కవచ్ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 122 కిలోమీటర్ల మేర కవచ్ రక్షణ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కవచ్ ఏర్పాటులో భాగంగానే కర్నూలు– గుంతకల్లు మధ్య కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. కాగా తూర్పు కోస్తా రైల్వే ఒడిశాలోని భద్రక్ నుంచి విశాఖపట్నం శివారులోని దువ్వాడ వరకు 550 కి.మీ. మేర రూ.280 కోట్లతో ఈ వ్యవస్థ ఏర్పాటు కోసం ఇప్పటికే టెండర్లు ఖరారు చేసింది. 2025 చివరి నాటికి ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. చెన్నై –కోల్‌కతా కారిడార్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 600 కి.మీ.మేర ఈ వ్యవస్థను 2030 నాటికి అందుబాటులోకి తేనుంది. అందుకోసం టెండర్ల ప్రక్రియను ఈ జనవరిలో పూర్తి చేయనుంది.‘కవచ్’తో ఏడు రకాల ప్రమాదాల నివారణ» రెడ్ సిగ్నల్ పడితే రైలు డ్రైవర్‌తో నిమిత్తం లేకుండానే కనీసం 50 మీటర్ల ముందు రైలు ఆటోమేటిగ్గా నిలిచిపోతుంది. హఠాత్తుగా ఏదైనా తీవ్ర అనారోగ్యంగానీ ఇతరత్రా కారణాలతో బ్రేక్ వేయలేని స్థితిలో డ్రైవర్ ఉన్నా సరే రైలు ప్రమాదం సంభవించకుండా అడ్డుకుంటుంది.» 130 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్న రైలును కాషన్ జోన్లు (వేగం తగ్గించాల్సిన ప్రదేశాలు) రాగానే కనీసం 10 కి.మీ. వేగం ఆటోమేటిగ్గా తగ్గిపోతుంది. కాషన్ జోన్ దాటిన తర్వాత మళ్లీ వేగం పుంజుకుంటుంది.» లూప్‌లైన్లలో రైలు వేగం ఆటోమేటిగ్గా గంటకు 30 కి.మీ. వేగానికి తగ్గిపోతుంది.» స్టేషన్ మాస్టర్ ఎర్ర జెండా ఊపగానే రైలు ఆటోమేటిగ్గా వేగం తగ్గి నిలిచిపోతుంది.» లెవల్ క్రాసింగ్ సమీపించగానే ఆటోమేటిగ్గా రైలు హార్న్ గట్టిగా మోగుతుంది. దాంతో లెవల్ క్రాసింగ్ వద్ద ఉన్న వారు అప్రమత్తమవుతారు.» రైలు ప్రయాణంలో ఉన్నంత సేపు ఆ పరిధిలోని క్యాబ్ సిగ్నల్ పని చేస్తూనే ఉంటుంది. ఆ తర్వాత వచ్చే సిగ్నల్ ఎప్పుడన్నది లోకో (రైలు ఇంజిన్)లో డిస్ ప్లే అవుతూనే ఉంటుంది.» రెడ్ హోమ్ సిగ్నల్ కనిపించగానే (అంటే రైలు అత్యవసరంగా నిలపాలనే సిగ్నల్) రైలు ఆటోమేటిక్గానిలిచిపోతుంది. అదే ట్రాక్‌పై ఎదురుగా 15 కి.మీ. దూరంలో మరో రైలు ఉందని తెలిసినా, ట్రాక్‌పై అవాంఛనీయ వస్తువులు లేదా ఇతరత్రా ఏమైనా ఉన్నట్టు గుర్తించినా వెంటనే రెడ్హోమ్ సిగ్నల్ పడుతుంది. దాంతో రైలు ఆటోమేటిగ్గా నిలిచిపోతుంది. -
ఈ యాప్‌లలో ట్రైన్ టికెట్ బుక్ చేస్తే.. కన్ఫర్మ్ అవ్వాల్సిందే!
మన దేశంలో ఎక్కడికైనా ప్రయాణించాలంటే.. భారతీయ రైల్వే అత్యంత చౌకైన.. ఉత్తమ మార్గం. రోజూ లక్షలమంది రైలు ద్వారానే ప్రయాణిస్తున్నారు. అయితే మనం కొన్ని సార్లు సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నప్పుడు.. ముందుగానే బుక్ చేసుకుంటే ప్రయాణం సులభంగా ఉంటుంది. గతంలో ట్రైన్ రిజర్వేషన్ చేసుకోవాలంటే.. తప్పకుండా రైల్వే స్టేషన్ వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వల్ల ఇంట్లో కూర్చునే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. ఈ కథనంలో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడానికి ఉత్తమైన యాప్స్ గురించి తెలుసుకుందాం.ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ (IRCTC Rail Connect)ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్.. అనేది ఇండియన్ రైల్వే అధికారిక యాప్. దీని ద్వారా టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్ వంటివి చేసుకోవచ్చు, పీఎన్ఆర్ స్టేటస్ తెలుసుకోవచ్చు. కోచ్ వివరాలు, బెర్త్ నెంబర్ వంటి వాటిని ఎంచుకోవడం ద్వారా ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు.ఐఆర్సీటీసీ యూటీఎస్ (IRCTC UTS)ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వే.. యూటీఎస్ (అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్) యాప్ తీసుకువచ్చింది. దీని ద్వారా ప్లాట్‌ఫామ్ టికెట్స్ బుక్ చేసుకోవడం మాత్రమే కాకుండా.. జనరల్ టికెట్స్, మంత్లీ సీజనల్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. లోకల్ ట్రైన్లలో ప్రయాణించేవారికి ఈ యాప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.కన్ఫర్మ్ టికెట్ (Confirmtkt)ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలనుకునే వారికి ఈ 'కన్ఫర్మ్ టికెట్' యాప్ ఓ మంచి ఎంపిక. ఈ యాప్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవడం మాత్రమే కాదు, చెల్లింపులు కూడా చాలా సులభంగా ఉంటాయి. ఇందులో తత్కాల్ టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు.ఇక్సిగో (Ixigo)ఈ యాప్ ద్వారా ట్రైన్ టికెట్స్ మాత్రమే కాకుండా.. విమానాలు, హోటళ్లను కూడా బుక్ చేసుకోవచ్చు. దీని ద్వారా ట్రైన్ ట్రాకింగ్, లైవ్ అప్డేట్స్ వంటివి కూడా తెలుసుకోవచ్చు. పీఎన్ఆర్ స్టేటస్ తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్ లేనప్పుడు కూడా ట్రైన్ రియల్ స్టేటస్ తీసుకోవడానికి ఈ యాప్ సహకరిస్తుంది.ఇదీ చదవండి: రోజుకు రూ.50 పెట్టుబడి: ఆదాయం రూ.కోటిమేక్మైట్రిప్ (Makemytrip)ప్రస్తుతం మేక్మైట్రిప్ అనేది చాలా పాపులర్ యాప్. ఇందులో ట్రిప్ గ్యారెంటీ అనే ఫీచర్ ఉండటం వల్ల.. కన్ఫర్మ్గా టికెట్ బుక్ అవుతుంది. టికెట్ క్యాన్సిల్ అయితే మీ డబ్బుతో పాటు.. ఇతర ఉపయోగకరం కూపన్లు వంటివి కూడా లభిస్తాయి. ఎక్కువమంది ఉపయోగిస్తున్న యాప్‌లలో ఇది ప్రధానంగా చెప్పుకోదగ్గ యాప్ అనే చెప్పాలి. -
రైల్వే కొత్త యాప్.. ఎవరి కోసమంటే..?
ఇండియన్ రైల్వే ఫ్రంట్‌లైన్ భద్రతా సిబ్బంది కోసం భద్రతా శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించే మొబైల్ అప్లికేషన్ 'సంరక్ష'ను ప్రారంభించింది. లక్షలాది మంది రైల్వే ఫ్రంట్‌లైన్ సిబ్బందికి క్లిష్టమైన కార్యాచరణ శిక్షణను అందించడమే లక్ష్యంగా ఈ యాప్‌ను రూపొందించినట్లు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే తెలిపింది.ఈ 'సంరక్ష' యాప్‌ను సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నాగపూర్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రూపొందించారు. రైల్వే ఉద్యోగుల శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించే సమర్థవంతమైన వ్యవస్థను అందించడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, ఏఐ భవిష్యత్తులో సాధ్యాలతో, రైల్వే డొమైన్ పరిజ్ఞానంతో ఈ యాప్ అనుసంధానమై ఉంటుందని డీఆర్ఎం నమితా త్రిపాఠి పేర్కొన్నారు.రైల్వే రూపొందించిన ఈ యాప్ స్మార్ట్ లెర్నింగ్, ఫీడ్‌బ్యాక్ మెకానిజమ్‌లను కలిగి ఉంటుంది. ఇది మల్టీ లెవల్, రియల్ టైమ్ ఫీడ్‌బ్యాక్, పర్యవేక్షణను సాధ్యం చేస్తుంది. -
సామాన్యులకూ ఒక సీటు
సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య పెంచాలని నిర్ణయించిన రైల్వే శాఖ.. ఆ మేరకు ఏర్పాట్లు ప్రారంభించింది. అల్పాదాయ వర్గాల ప్రయాణికుల కోసం ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అదనంగా రెండు జనరల్ క్లాస్ కోచ్‌లను జత చేస్తున్నారు. దీంతో ఇక నుంచి ప్రతి ఎక్స్‌ప్రెస్ రైల్‌కు నాలుగు జనరల్ క్లాస్ కోచ్‌లు ఉండనున్నాయి. నవంబర్ నెల చివరి నాటికి దేశవ్యాప్తంగా వేయి జనరల్ కోచ్‌లు అందుబాటులోకి రానుండగా.. దక్షిణ మధ్య రైల్వేకు 165 కేటాయించారు. దేశవ్యాప్తంగా అన్ రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణికులు కిక్కిరిసిపోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న అంశంపై సాక్షి మీడియా పలు కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే.అన్నీ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లే..ప్రస్తుతం దేశంలో సంప్రదాయ ఐసీఎఫ్ కోచ్‌ల తయారీని రైల్వే శాఖ నిలిపేసింది. వాటి స్థానంలో తక్కువ బరువుండే, ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రాణనష్టం తగ్గించే రీతిలో ఉండే ఎల్‌హెచ్‌బీ కోచ్‌లనే తయారు చేస్తోంది. ఈ కోచ్‌ల తయారీ పెరుగుతున్నకొద్దీ సంప్రదాయ కోచ్‌లను తొలగిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైళ్లకు మొత్తం 5,748 కోచ్‌లున్నాయి. వీటిల్లో ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల సంఖ్య 2,181. మొత్తం జోన్ పరిధిలో 272 రైళ్లు ఉంటే, ఎల్‌హెచ్‌బీ కోచ్‌లున్న రైళ్ల సంఖ్య 88. మరో ఏడు జతల రైళ్లకు ఈ ఏడాది ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా జనరల్ కోచ్‌లను ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా.. అన్నీ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లనే సరఫరా చేస్తున్నారు. అవసరమైతే రిజర్వ్డ్ కోచ్‌లు తగ్గించి.. దేశవ్యాప్తంగా ఏసీ కోచ్‌ల సంఖ్య పెంచుతూ సాధారణ ప్రజలు వినియోగించే జనరల్ కోచ్‌ల సంఖ్య తగ్గిస్తున్నారంటూ కొంతకాలంగా రైల్వేశాఖపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇది వాస్తవం కాదు అని ఎప్పటికప్పుడు ఖండిస్తున్న రైల్వేశాఖ.. ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా అన్ రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణికుల అవస్థలను పరిశీలించేందుకు సర్వే చేసింది. అన్ రిజర్వ్డ్ కోచ్‌లలో నిలబడేందుకు కూడా స్థలం లేక ప్రయాణికులు టాయిలెట్ల వద్ద కూర్చుని ప్రయాణిస్తున్న వాస్తవాలను గుర్తించింది. రిజర్వేషన్ చార్జీలను భరించే స్తోమత లేక అలాగే ఇబ్బందులతో ప్రజలు ప్రయాణిస్తున్నారు.దీంతో వెంటనే జనరల్ కోచ్‌ల సంఖ్య పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లకే ఈ నిర్ణయం వర్తించనుంది. క్రమంగా ఐసీఎఫ్ కోచ్‌ల స్థానంలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడిచే రైళ్లకు జనరల్ కోచ్‌ల సంఖ్య పెంచుతారు. సాధారణంగా ఒక ఎక్స్‌ప్రెస్ రైలులో 24 కోచ్‌లుంటాయి. వాటిల్లో రెండు జనరల్ కోచ్‌లుంటాయి. ఇప్పుడు అదనంగా రెండు జనరల్ క్లాస్ కోచ్‌లను అనుసంధానించటం కుదరదు. చేరిస్తే అప్పుడు ఆ రైలు కోచ్‌ల సంఖ్య 26కు పెరుగుతుంది. అన్ని రూట్లు అంత పొడవైన రైలు నడిచేందుకు అనువుగా ఉండవు. దీంతో రెండు రిజర్వ్డ్ కోచ్‌లను తగ్గించి వాటి స్థానంలో రెండు జనరల్ కోచ్‌లను చేర్చాలని నిర్ణయించారు. ఫలితంగా ఎక్కువ మంది అన్ రిజర్వ్డ్ ప్రయాణికులకు ప్రయాణ వెసులుబాటు కలగటమే కాకుండా, టాయిలెట్ల వద్ద కూర్చుని ప్రయాణించే సమస్య కొంతమేర తగ్గుతుంది. నవంబర్‌లో వేయి కోచ్లునవంబర్ మాసం చివరి నాటికి దేశవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనంగా వేయి జనరల్ కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా ఇలా పదివేల కోచ్‌లు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. వీటిలో 6 వేలు అన్రిజర్వ్డ్ కోచ్‌లు కాగా.. మిగతా 4 వేలు నాన్ ఏసీ స్లీపర్ కోచ్‌లు ఉండనున్నాయి. రెండేళ్లలో అందుబాటులోకి వచ్చే పదివేల జనరల్ కోచ్‌లలో అదనంగా రోజుకు మరో 8 లక్షల మంది రైళ్లలో ప్రయాణించగలరని అంచనా వేశారు. అంకెల్లో భారతరైల్వే⇒ 4 ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో భారత్ స్థానం⇒ 2023 నాటికి మొత్తం రైల్వే ట్రాక్ 1,32,310 కి.మీ రైల్వేలో మొత్తం ఉద్యోగులు 12 లక్షల మందికి పైగా⇒ ఇండియన్ రైల్వేలో మొత్తం జోన్లు 17 దేశంలో మొత్తం రైల్వే స్టేషన్లు 7,325⇒ దేశంలో రోజూ నడుస్తున్న ప్యాసింజర్ రైళ్లు 13,000⇒ దేశంలో రైళ్లలో రోజూ ప్రయాణిస్తున్న ప్రయాణికులు 2.40 కోట్ల మంది రోజూ దేశంలో నడుస్తున్న రైళ్లలో ప్యాసింజర్ కోచ్‌ల సంఖ్య 84,863⇒ 2024 మార్చి నాటికి (2023ృ24) ఇండియన్ రైల్వే ఆదాయం రూ.2.40 లక్షల కోట్లు రోజువారీ రైల్వే ఆదాయం రూ.600 కోట్లు⇒ రైలు ప్రమాదాలను నివారించడానికి ఇప్పటిదాకా కవచ్‌ను ఏర్పాటు చేసిన రైల్వే ట్రాక్ 37 వేల కి.మీ⇒ దేశంలో రోజూ నడుస్తున్న సరుకు రవాణా రైళ్లు 8,000⇒ 2024 అక్టోబర్ నాటికి దేశంలో నడుస్తున్న వందే భారత్ రైళ్లు 66 వచ్చే మూడేళ్లలో ప్రవేశపెట్టనున్న వందే భారత్ రైళ్ల సంఖ్య 400⇒ 2024, మార్చి నాటికి దేశంలో విద్యుత్ రైల్వే మార్గాలు 62,119 కి.మీ⇒ 202-24 లెక్కల ప్రకారం సగటున ఆన్లైన్లో రోజుకు బుక్ అవుతున్న రైల్ టికెట్లు 12.38 లక్షలు⇒ ఆన్లైన్లో నిమిషానికి బుక్ అవుతున్న రైల్ టికెట్లు 28,000⇒ రోజుకు రైళ్లలో అందిస్తున్న భోజనాలు 16 లక్షలు⇒ కేటరింగ్ ద్వారా ఆదాయం రూ.1,947.19 కోట్లు⇒ ఐఆర్సీటీసీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నవారు 12.21 కోట్లు -
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో సూపర్ యాప్
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికుల ఇబ్బందులను దూరం చేసేందుకు భారతీయ రైల్వే త్వరలో ఒక సూపర్ యాప్‌ను విడుదల చేయనుంది. ఈ సూపర్ యాప్ డిసెంబర్ 2024 చివరి నాటికి అందుబాటులోకి రానుంది. ఈ యాప్ సాయంతో ప్రయాణికులు టికెట్ బుకింగ్, రైలు రాకపోకల సమాచారం, ఆహారం, రైలు రన్నింగ్ స్థితి తదితర వివరాలను అత్యంత సులభంగా తెలుసుకోవచ్చు.త్వరలో అందుబాటులోకి రానున్న భారతీయ రైల్వేల సూపర్ యాప్ ఇప్పటికే ఉన్న ఐఆర్సీటీసీ యాప్‌కు భిన్నంగా ఉంటుంది. ఈ సూపర్ యాప్ ద్వారా ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. టిక్కెట్, పాస్‌లను కొనుగోలు చేయవచ్చు. రైల్వే టైమ్‌టేబుల్‌ను కూడా చూడవచ్చు. ఈ యాప్‌ను రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెంటర్ అభివృద్ధి చేస్తోంది.ప్రస్తుతం ప్రయాణికులు ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ఐఆర్సీటీసీ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ యాప్ ద్వారా విమాన టిక్కెట్లను కూడా కొనుగోలు చేయవచ్చు. రైలులో ఆహారాన్ని కూడా ఆర్డర్ చేయవచ్చు. అయితే భారతీయ రైల్వే మరో కొత్త యాప్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రయాణికులకు మరింత చేరువకానుంది.ఇది కూడా చదవండి: సగం సీట్లు ‘ఇతరులకే’..! -
రైల్వే స్టేషన్లలో దీపావళి రద్దీ.. ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు
న్యూఢిల్లీ: దీపావళి పండుగకు ఊళ్లకు వెళ్లేవారితో రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. దీపావళితో పాటు ఛత్ పూజలకు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తమ ఊళ్లకు తరలివెళుతున్నారు. దీనిని గమనించిన రైల్వేశాఖ ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.ఉత్తర రైల్వే పండుగలకు ప్రత్యేక రైళ్లను నడపడమే కాకుండా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వెలుపల ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ప్రయాణికులకు భోజన సౌకర్యాన్ని అందుబాటులో ఉంచింది. అలాగే ఫ్యాన్లను ఏర్పాటు చేయడంతో పాటు రైళ్ల గురించిన సమాచారాన్ని అందించేందుకు హెల్ప్ డెస్క్‌ను, అదనపు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేసింది.ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పెద్ద సంఖ్యలో ఆర్సీఎఫ్, సివిల్ డిఫెన్స్ సిబ్బందిని రైల్వే శాఖ మోహరించింది. స్టేషన్లో మరిన్ని సౌకర్యాలు కల్పించడంపై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైల్వేశాఖ ప్రతి సంవత్సరం పండుగలకు ప్రత్యేక రైళ్లను నడుపుతుంటుంది. అయితే ఈసారి పండుగను రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.ఇది కూడా చదవండి: మహారాష్ట్ర ఎన్నికలు: కాంగ్రెస్ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల -
రైలు ప్రమాదానికి కారణమేంటీ? దక్షిణ రైల్వే జీఎం స్పందన
తమిళనాడులో శుక్రవారం రాత్రి మైసూర్-దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ఏకంగా 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. తిరువళ్లూరు జిల్లాలోని కవరైపెట్లై రైల్వే ష్టేషన్ వద్ద రాత్రి 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై తాజాగా దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్ఎన్ సింగ్ స్పందించారు. మైసూర్-దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి సిగ్నల్, రూట్ మధ్య అసమతుల్యతే కారణమని తెలిపారు. ‘‘మైసూరు-దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్ మెయిన్ లైన్‌కు మారాలి, కానీ ఏదో తప్పు జరిగింది. గూడ్స్ రైలు నిలిచిన ట్రాక్‌లోని ఎక్స్‌ప్రెస్ రైలు రూట్ మార్చబడింది. సరిగ్గా ఏమి జరిగిందో ఇప్పడే ఏం చెప్పలేం. ఎక్స్‌ప్రెస్ రైలు గూడూరుకు (ఆంధ్రప్రదేశ్‌లోని) వెళుతోంది. ఇది తిరువళ్లూరులోని కవరైప్పెట్టై రైల్వే స్టేషన్లో ఆగింది. అక్కడ గూడూరుకు వెళ్లే గూడ్స్ రైలు కూడా లూప్ లైన్లో ఉంది. అయితే మెయిన్ లైన్‌కు సిగ్నల్ క్లియరెన్స్ ఉన్నప్పటికీ.. ఎక్స్‌ప్రెస్ రైలు లూప్ లైన్లోకి ప్రవేశించి వెనుక నుంచి గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో రైలు పట్టాలు తప్పడానికి దారి తీస్తుంది.ఇక.. ఈ ప్రమాదంలో 12 కోచ్‌లు పట్టాలు తప్పగా.. 19 మంది గాయపడ్డారు. ఎక్స్‌ప్రెస్ రైలులో 1,300 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎక్స్‌ప్రెస్ రైలులోని ఓ పవర్ కారు కూడా మంటల్లో చిక్కుకుంది. గాయపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో రైలు పట్టాలు తప్పడంతో మరమ్మతుల కారణంగా శనివారం షెడ్యూల్ చేసిన 18 రైళ్లు రద్దు చేయబడ్డాయి. కొన్ని రైళ్లను దారి మళ్లించారు.చదవండి: తమిళనాడు రైలు ప్రమాదం.. కేంద్రంపై రాహుల్ మండిపాటు -
స్పీడ్ విజన్ కెమెరాలతో రైలు ప్రమాద కుట్రలకు చెక్
న్యూఢిల్లీ: రైల్వే ట్రాక్‌లపై బరువైన వస్తువులు, సిలిండర్లు పెట్టి, రైళ్లను పట్టాలు తప్పించే కుట్రలకు రైల్వేశాఖ చెక్ పెట్టనుంది. ఇటువంటి దుశ్చర్యలను విఫలం చేసేందుకు రైల్వేశాఖ హైటెక్నాలజీ సాయంతో రైళ్లకు రక్షణ కల్పించనుంది.రైలు ప్రమాద కుట్రలను పసిగట్టేందుకు ఇకపై రైళ్ల లోకోమోటివ్ (ఇంజిన్) ముందు, గార్డు క్యాబిన్ వెనుక స్పీడ్ విజన్ కెమెరాలు అమర్చనున్నారు. దీంతో లోకోమోటివ్ పైలట్లు ట్రాక్‌పై అడ్డుగావున్న వస్తువును దూరం నుండే చూడగలుగుతారు. ఈ స్పీడ్ విజన్ కెమెరాలు రికార్డు కూడా చేస్తాయి. ఫలితంగా ఇటువంటి చర్యలకు పాల్పడే నిందితులను పట్టుకునేందుకు ఈ సాంకేతికత ఎంతగానో ఉపకరిస్తుంది.ఇటీవలి కాలంలో యూపీలోని కాన్పూర్ డివిజన్‌తో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపై భారీ వస్తువులను ఉంచి రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరిగాయి. వీటిని దృష్టిలో ఉంచుకున్న రైల్వే అధికారులు స్పీడ్ విజన్ కెమెరాలను రైళ్లకు అమర్చాలని నిర్ణయించారు. ఈశాన్య రైల్వే అధికారులు దీనికి సంబంధించిన ప్రతిపాదనను సిద్ధం చేసి, రైల్వే బోర్డుకు పంపారు. బోర్డు ఈ ముసాయిదాను రైల్వే మంత్రిత్వ శాఖకు పంపింది. మంత్రివర్గం నుంచి ఆమోదం పొందగానే, రైళ్లకు స్పీడ్ విజన్ కెమెరాలను అమర్చనున్నారు. ఈ హైటెక్ సెక్యూరిటీ సిస్టమ్ కోసం రైల్వేశాఖ ప్రత్యేక భద్రతా ఏజెన్సీ సహాయాన్ని తీసుకోనుంది. ఇది కూడా చదవండి: ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా ఆండ్రో, ఎక్కడుందో తెలుసా? -
కూ.. చుక్.. చెక్..
భద్రత విషయంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రైళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిఘా కెమెరాలను ఏర్పాటు చేయనుంది. పట్టాలపై ప్రమాదకరమైన వస్తువులను దూరం నుంచే గుర్తించి లోకో పైలెట్లను అప్రమత్తం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రైళ్లు పట్టాలు తప్పడాన్ని నివారించడంతోపాటు ఉగ్రవాద, అసాంఘిక శక్తుల కుట్రలను తిప్పికొట్టే లక్ష్యంతో రైల్వేశాఖ వీటిని ఏర్పాటుచేయనుంది. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో సీసీటీవీ కెమెరాల నిఘా కొనసాగుతుండగా.. నడుస్తున్న రైళ్లను మాత్రం ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) పరిజ్ఞానం ద్వారా పర్యవేక్షిస్తున్నారు.కానీ, నడిచే రైళ్లు ప్రమాదాలకు గురికాకుండా ముందుగానే అప్రమత్తంచేసే వ్యవస్థ ఇప్పటివరకు అందుబాటులో లేదు. –సాక్షి, అమరావతిదూరం నుంచే గుర్తించి అప్రమత్తం..ఇక ఏఐ పరిజ్ఞానంతో పనిచేసే ఈ ‘టూ ఫ్రంటల్ హై రిజల్యూషన్ కెమెరాలు’ రైలు పట్టాలపై అనుమానాస్పద వస్తువులను చాలాదూరం నుంచే గుర్తించి లోకో పైలెట్‌ను అప్రమత్తం చేస్తాయి.వస్తువు ఫొటో తీసి వెంటనే ప్రాసెస్ చేసి అది ఎలాంటిదో సమాచారం ఇస్తాయి. అంటే.. అది ప్రమాదకరమైన వస్తువా.. అసహజమైన వస్తువా..కదులుతున్న వస్తువా.. మనుషులా.. జంతువులా అనేది కూడా గుర్తిస్తాయి.లోకో పైలెట్లు వెంటనే అప్రమత్తమై అత్యవసర బ్రేక్ వేసి ఆ వస్తువుకు కనీసం కి.మీ. ముందుగానే రైలును నిలిపివేస్తారు.గుర్తించిన అభ్యంతరకర వస్తువుల పైకి లేజర్ కిరణాలను ప్రసరింపజేసి ఆ వస్తువు ఎంత దూరంలో ఉందో లోకో పైలెట్ గుర్తించే పరిజ్ఞానాన్ని కూడా అందుబాటులోకి తేనున్నారు.అత్యవసర బ్రేక్‌ను సీసీటీవీ కెమెరాలతో అనుసంధానించి అసాధారణ పరిస్థితుల్లో లోకో పైలట్‌తో నిమిత్తం లేకుండానేరైలు ఆటోమేటిగ్గా ఆగిపోయేట్లుగా చేసే పరిజ్ఞానంపై కూడా రైల్వేశాఖ పరిశోధనలు నిర్వహిస్తోంది.మూడేళ్లలో 97 ప్రమాదాలు..ఇటీవలి కాలంలో దేశంలో రైళ్లు పట్టాలు తప్పి ప్రమాదాలకు గురవుతున్న దుర్ఘటనలు గణనీయంగా పెరిగాయి. 2021 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ ప్రమాదాలు 97 సంభవించాయి. కొన్నిచోట్ల విద్రోహశక్తులు రైలుపట్టాలపై ప్రమాదకరమైన వస్తువులను ఉంచి కుట్రలు పన్నిన ఉదంతాలూ ఉన్నాయి. దీంతో రైలు పట్టాలపై ఈ తరహా వస్తువులను ముందుగానే గుర్తించి ప్రమాదాలు నివారించేందుకు రైళ్లలో ఏఐ కెమెరాలను ఏర్పాటుచేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది.రూ.15 వేల కోట్లతో 75,000ఏఐ కెమెరాలు..ఈ నేపథ్యంలో.. రూ.15 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో 75 వేల ఏఐ కెమెరాలను ఏర్పాటుచేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. 40 వేల బోగీలు, 14 వేల లోకోమోటివ్‌లు (ఇంజిన్లు), 6 వేల ఈఎంయూలలో ఈ కెమెరాలను ఏర్పాటుచేస్తారు. ప్రతి బోగీకి ఆరు కెమెరాలు, ప్రతి లోకోమోటివ్‌కు నాలుగు కెమెరాలను అమరుస్తారు. అక్టోబరు నుంచి ఏడాదిలోగా దశలవారీగా అన్ని రైళ్లలో ఏఐ కెమెరాల ఏర్పాటు పూర్తిచేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం పలు కంపెనీలకు టెండర్లు అప్పగిస్తోంది. -
రూ.6,456 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: రూ.6,456 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టబోయే మూడు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థికవ్యవహారాల కేబినెట్ కమిటీ పలు ప్రాజెక్టులకు ఓకే చెప్పింది. ఒడిశా, జార్ఖండ్, పశి్చమబెంగాల్, ఛత్తీస్‌గఢ్‌లోని మరో 300 కి.మీ.ల రైలుమార్గం నిర్మిస్తూ ఆ మార్గంలో కొత్తగా 14 రైల్వేస్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ‘ఈ మార్గాల్లో రాకపోకలు పెరగడం వల్ల ఈ 4 రాష్ట్రాల ప్రజలకు మేలు జరగనుంది. ప్రజారవాణాతోపాటు ఇక్కడి ఎరువులు, బొగ్గు, ఇనుము, ఉక్కు, సిమెంట్, సున్నపురాయి తరలింపు సులభం కానుంది. దీంతో 10 కోట్ల లీటర్ల చమురు దిగుమతి భారం, 240 కోట్ల కేజీల కర్భన ఉద్గారాల విడుదల తగ్గడంతోపాటు 9.7 కోట్ల చెట్లునాటినంత ప్రయోజనం దక్కనుంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాలకు రూ.4,136 కోట్ల సాయం పలు హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టుల ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చే ఎనిమిదేళ్లలో 15వేల మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి సామర్థ్యం సాధించేందుకు ఆ రాష్ట్రాలకు రూ.4,136 కోట్ల ఈక్విటీ సాయం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గరిష్టంగా ఒక్కో ప్రాజెక్టుకు రూ.750 కోట్ల మేర రుణసాయం అందించనున్నారు. మరోవైపు వ్యవసాయ మౌలికవసతుల నిధి పథకం(ఏఐఎఫ్)లో స్వల్ప మా ర్పులు చేస్తూ రైతు ఉత్పత్తిదారుల సంఘం(ఎఫ్‌పీఓ)లకూ వర్తింపజేయాలన్న నిర్ణయానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. దీంతో పాల ఉత్పత్తిదారులు, మత్స్యకారులు, నేతపనివాళ్లు, గ్రామీణ కళాకారులు, హస్తకళాకారులు వంటి వారికీ ఈ పథకం ద్వారా రుణసదుపాయం కలి్పంచేందుకు అవకాశం లభిస్తుంది. రూ. 1 లక్ష కోట్ల మూల నిధితో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించడం తెల్సిందే. ఐదు గంటల సుదీర్ఘ సమీక్ష మహిళలు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు, సామాజిక రంగంలో విధానాల రూపకల్పనకు విస్తృత సంప్రదింపులు జరపాల్సిందిగా ప్రధాని మోదీ మంత్రులను, అధికారులను కోరారు. బుధవారం మొత్తం మంత్రిమండలిలో మోదీ ఐదు గంటల సుదీర్ఘ సమీక్ష జరిపారు. ప్రభుత్వ నిర్ణయాలను వేగంగా, సమర్థమంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. గత పదేళ్లలో ప్రజలకు ఎంతో మేలు చేశామని, అదే వేగంతో వచ్చే ఐదేళ్లు కూడా పనిచేద్దామని మోదీ సూచించారు. -
రైళ్లలో ఇక ‘ఏఐ’ కన్ను
ప్రయాగ్‌రాజ్: దేశంలో రైలు ప్రమాదాలను నివారించేందుకు రైల్వే బోర్డు ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అన్ని రైలు ఇంజిన్లలో, రైళ్లలోని ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీతో పనిచేసే సీసీటీవీ కెమెరాలను అమర్చనున్నారు. ఈ విషయాన్ని రైల్వే బోర్డు ఛైర్పర్సన్, సీఈవో జయవర్మ సిన్హా మంగళవారం(ఆగస్టు20) వెల్లడించారు.రైలు ప్రమాదానికి కారణమయ్యే పరిస్థితులను గుర్తించడంలో ఈ కెమెరాలు ఉపయోగపడతాయని ఆమె తెలిపారు. కుంభమేళాకు రైల్వేశాఖ సన్నద్ధతపై పలు రైల్వే డివిజన్ల జనరల్ మేనేజర్లతో ఆమె సమీక్షించారు. కుంభమేళా సమయంలో సంఘ విద్రోహశక్తులు ట్రాక్‌లను ధ్వంసం చేయకుండా చూసేందుకు భద్రతా ఏజెన్సీలు ట్రాక్‌లను నిరంతరం పర్యవేక్షిస్తాయని తెలిపారు. -
chhattisgarh: 72 రైళ్లు రద్దు.. రూ. 29 కోట్లు నష్టం
జార్ఖండ్‌లో ఇటీవల చోటుచేసుకున్న రైలు ప్రమాదం తర్వాత ఈ మార్గంలోని అరడజనుకు పైగా రైళ్లు రద్దు కావడంతో ఒకవైపు ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు రైల్వేశాఖ ఆదాయానికి గండిపడింది.తాజాగా రాజ్‌నంద్‌గావ్-కల్మనా రైల్వే సెక్షన్ మధ్య మూడవ రైల్వే లైన్‌ను కలమన రైల్వే స్టేషన్‌కు అనుసంధానించేందుకు రైల్వేశాఖ ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్, ప్రీ నాన్-ఇంటర్‌లాకింగ్ పనులను చేపట్టింది. దీంతో ఎక్స్‌ప్రెస్, మెమూ రైళ్లు ఆగస్టు 4 నుండి 20 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. దీంతో రక్షాబంధన్ సందర్భంగా ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి.బిలాస్పూర్- నాగ్‌పూర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రద్దు ప్రభావం అటు ప్రయాణికులపైన, ఇటు రైల్వే ఆదాయంపైన పడనుంది.అలాగే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మౌలిక సదుపాయాల కల్పన పేరుతో గత మూడు నెలలుగా రాయ్‌పూర్ మీదుగా వెళ్లే రైళ్లను తరచూ రద్దు చేస్తున్నారు. ఈసారి ఏకంగా 72 రైళ్లను (416 ట్రిప్పులు) రద్దు చేయడంతో ఐదు లక్షల మందికి పైగా ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ నేపధ్యంలో కన్ఫర్మ్ చేసిన 4 లక్షల 32 వేల టిక్కెట్లను రద్దు చేయడంతో, రైల్వేశాఖ ప్రయాణికులకు రూ.28 కోట్ల 86 లక్షలు వాపసు చేయాల్సి ఉంటుంది. -
ట్రైన్లో బెర్త్ కూలి.. ప్యాసింజర్ మృతి
తిరువనంతపురం: ట్రైన్ అప్పర్ బెర్త్ ఒక్కసారిగా కూలిపోవటంలో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. కేరళకు చెందిన ప్యాసింజర్ అలిఖాన్ సీకే తన స్నేహితులతో ఆగ్రాకు.. ఎర్నాకులం-హజ్రత్ నిజాముద్దీన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జూన్ 16న జరిగిన ఈ ప్రమాద ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ట్రైన్ తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ప్రయాణిస్తున్న సమయలో ఒక్కసారిగా అలిఖాన్ సీకేపై అప్పర్ బెర్త్కూలిపోయింది.దీంతో ఆయన మెడకు తీవ్రంగా గాయాలు అయ్యాయి.దీంతో ఆయన్ను రామగుండంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తలించారు. ఇక్కడ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్రైన్లో జరిగిన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తటంలో రైల్వే మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ‘ఎక్స్’లో స్పందించారు. అప్పర్ బెర్త్ కూలిపోయిందని తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. ‘‘ రైల్వే అధికారుల ట్రైన్‌లోని బెర్త్‌ను పరిశీలించారు.ప్రయాణీకుడు అలిఖాన్ సీకే సీటు నెం. S/6 కోచ్‌లో 57 (లోయర్ బెర్త్). అయితే ఆయనపై ఉన్న పైబెర్త్కు చైన్ సరిగ్గా అమర్చకపోవడం వల్లనే కిందకు పడిపోయింది. కానీ, పైబెర్త్ డ్యామెజీ కారణంగా కిందపడలేదు’’ అని వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై రామగుండం రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి గాయాలైన ప్రయాణికుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారని తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై కేరళ కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ప్రధాని మోదీ ప్రభుత్వంలో రైల్వేలో జరుగుతున్న ప్రమాదాలపై విమర్శలు చేసింది. ఈ ప్రమాదాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. -
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
సెమీ-హై స్పీడ్ వందే భారత్ రైళ్ల భారీ విజయం తర్వాత ఇండియన్ రైల్వే దేశంలోని మొదటి వందే మెట్రోను ప్రారంభించాలని యోచిస్తోందని, ఇంట్రా-సిటీ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్‌ను మార్చేందుకు ప్రణాళికలు వేస్తోందని ప్రాజెక్ట్‌తో సంబంధం ఉన్న ఒక సీనియర్ అధికారి తెలిపారు."2024 జూలై నుండి వందే మెట్రో ట్రయల్ రన్ ప్రారంభించడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. తద్వారా దీని సేవలను వీలైనంత త్వరగా ప్రజలకు అందించవచ్చు" అని ఆ అధికారి చెప్పినట్లుగా ఎన్డీటీవీ పేర్కొంది. క్షణాల్లో వేగాన్ని అందుకునేలా, తక్కువ సమయంలో ఎక్కువ స్టాప్‌లను కవర్ చేసేలా ఆధునిక టెక్నాలజీతో పాటు మరిన్ని ఫీచర్లు ఈ ట్రైన్లో ఉండనున్నట్లు తెలుస్తోంది.రైల్వే వర్గాల ప్రకారం, ఇది ఒక ప్రత్యేకమైన కోచ్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది. దీనిలో నాలుగు కోచ్‌లు ఒక యూనిట్‌గా ఉంటాయి. ప్రాథమికంగా కనీసం 12 కోచ్‌లు ఒక వందే మెట్రోలో ఉంటాయి. తర్వాత డిమాండ్‌కు అనుగుణంగా కోచ్‌లను 16 వరకు పెంచుతారు. -
ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టిన ఆంధ్ర బ్యాటర్..
కడప స్పోర్ట్స్: కల్నర్ సీకే నాయుడు ట్రోఫీ జాతీయ అండర్–23 క్రికెట్ టోర్నీలో భాగంగా రైల్వేస్ జట్టుతో ఆదివారం మొదలైన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఓపెనర్ మామిడి వంశీకృష్ణ (64 బంతుల్లో 110; 9 ఫోర్లు, 10 సిక్స్‌లు) అద్భుతం చేశాడు. గుంటూరు జిల్లాకు చెందిన 22 ఏళ్ల వంశీకృష్ణ ఒకే ఓవర్లోని వరుస 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టి సంచలనం సృష్టించాడు. వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలో జరుగుతున్న ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 372 పరుగులు చేసింది. రైల్వేస్ లెగ్ స్పిన్నర్ దమన్‌దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో వంశీకృష్ణ 6 బంతుల్లో 6 సిక్స్‌లు సంధించాడు. అనంతరం ఈ జోరు కొనసాగిస్తూ వంశీకృష్ణ 48 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సీకే నాయుడు ట్రోఫీ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆంధ్ర బ్యాటర్‌గా వంశీకృష్ణ రికార్డు నెలకొల్పాడు. మామిడి వంశీకృష్ణతోపాటు వన్‌డౌన్ బ్యాటర్, కెపె్టన్ వంశీకృష్ణ (55; 6 ఫోర్లు, 1 సిక్స్), ధరణి కుమార్ (81; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), వెంకట్ రాహుల్ (61 బ్యాటింగ్; 6 ఫోర్లు) కూడా రాణించారు. ఇంతకుముందు అంతర్జాతీయ వన్డేల్లో హెర్షల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా), జస్కరణ్ మల్హోత్రా (అమెరికా)... అంతర్జాతీయ టి20ల్లో యువరాజ్ సింగ్ (భారత్), కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్)... ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో (మూడు/నాలుగు రోజులపాటు జరిగే మ్యాచ్‌లు) గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్), రవిశాస్త్రి (భారత్), లీ జెర్మన్ (న్యూజిలాండ్)... దేశవాళీ వన్డేల్లో తిసారా పెరీరా (శ్రీలంక), రుతురాజ్ గైక్వాడ్ (భారత్)... దేశవాళీ టి20ల్లో రోజ్ వైట్లీ (ఇంగ్లండ్), లియో కార్టర్ (న్యూజిలాండ్), హజ్రతుల్లా జజాయ్ (అఫ్గానిస్తాన్) ఒకే ఓవర్లో వరుస 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టారు. -
రైల్వే కిచెన్‌లో ఎలుకల సంచారం.. అధికారుల స్పందన ఇది..!
ముంబయి: రైల్వేలలో ఆహారం నాణ్యతపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఆహారంలో అపరిశుభ్రమైన వస్తువులు రావడం తరచూ చూస్తుంటాం. కానీ తాజాగా రైల్వే కిచెన్(ప్యాంట్రీ)లో ఏకంగా ఎలుకలు విచ్చలవిడిగా సంచరిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన మడగావ్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. రైల్వే కిచెన్‌లో ఎలుకలు సంచరిస్తున్న వీడియోను ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తాను మడగావ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా ఈ దృశ్యాలను చూశానని ఆ ఘటనపై ఇలా పేర్కొన్నాడు. '11099 నెంబర్‌గల మడ్గావ్ ఎక్స్‌ప్రెస్‌లో అక్టోబర్ 15న ప్రయాణిస్తున్నాను. అప్పటికే మధ్యాహ్నం 1:45 గంటలకు బయలుదేరాల్సిన రైలు.. మధ్యాహ్నం 3:30 గంటలకు ఆలస్యమైంది. రైలు వెనుకభాగంలోకి వెళ్లి చూస్తే ప్యాంట్రీలో ఎలుకలు దర్శనమిచ్చాయి. ఆహార పదార్థాలను ఎలుకలు తింటూ కనిపించాయి.' అని ఆ యూజర్ తెలిపాడు. View this post on Instagram A post shared by RF Drx. Mangirish Tendulkar (@mangirish_tendulkar) ఈ ఘటనపై ఆర్పీఎఫ్ పోలీసుకు తెలిపినా ప్రయోజనం లేకపోయిందని ఆ ప్రయాణికుడు తెలిపాడు. రైల్వే ట్రాక్‌పై ఉండే ఎలుకలు లోపలికి దూరి ఉండవచ్చని సాధారణంగా మాట్లాడి నిరుత్సాహపరిచాడు. ఆ తర్వాత అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ మీనాకు ఫిర్యాదు చేస్తే ప్యాంట్రీ మేనేజర్‌తో మాట్లాడామని వెల్లడించారు. అయితే.. రైలు కోచ్‌లలో లోపాల కారణంగానే ఎలుకలు లోపలికి ప్రవేశిస్తున్నాయని ఆయన ఆరోపించారు. చివరికి రైల్వే పెద్దలు ఈ ఘటనపై స్పందించి.. తగు నివారణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్యాంట్రీలో శుభ్రతపై తగు జాగ్రత్తలు తీసుకుంటామని సోషల్ మీడియాలో రిప్లై ఇచ్చారు. The matter is viewed seriously and suitable action has been taken.Pantry Car Staff have been sensitised to ensure hygiene and cleanliness in the pantry car. The concerned have been suitably advised to ensure effective pest and rodent control measures which is being ensured. — IRCTC (@IRCTCofficial) October 18, 2023 ఇదీ చదవండి: కశ్మీరీ వలస కుటుంబాలకు ఇకపై నెలకు రూ.27 వేలు -
T20 Cricket: విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 11 బంతుల్లోనే.. తొలి భారత బ్యాటర్‌గా!
SMAT 2023- Ashutosh Sharma breaks Yuvraj Singh's record: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)-2023 సందర్భంగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అరుదైన రికార్డు బద్దలైంది. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన ఓవరాల్ భారత బ్యాటర్ల జాబితాలో యువీని వెనక్కి నెట్టి అశుతోశ్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అశుతోష్ సంచలన ఇన్నింగ్స్ దేశవాళీ టీ20 టోర్నీ SMAT సోమవారం(అక్టోబరు 16) ఆరంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో రోజు షెడ్యూల్లో భాగంగా రాంచి వేదికగా అరుణాచల్ ప్రదేశ్- రైల్వేస్ జట్లు మంగళవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రైల్వేస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ ఉపేంద్ర యాదవ్(103) అజేయ సెంచరీతో మెరవగా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అశుతోష్ శర్మ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 11 బంతుల్లోనే కేవలం 11 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా మధ్యప్రదేశ్ ఆటగాడు అశుతోష్ యువీ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో మొత్తంగా 12 బంతులు ఎదుర్కొన్న ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. 53 రన్స్ చేశాడు. ఇందులో ఒక ఫోర్, 8 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసిన రైల్వేస్.. అరుణాచల్ ప్రదేశ్‌ను 119 పరుగులకే ఆలౌట్ చేసింది. తద్వారా 127 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. యువీ నాటి టీ20 వరల్డ్‌కప్‌లో టీ20 వరల్డ్‌కప్-2007లో ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా యువరాజ్ సింగ్ సిక్సర్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. స్టువర్ట్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. యువీ రికార్డు బ్రేక్ చేసిన నేపాల్ బ్యాటర్ అయితే, ఇటీవలే యువీ పేరిట ఉన్న ఈ రికార్డు బద్దలైన విషయం తెలిసిందే. చైనాలో ఆసియా క్రీడలు-2023 సందర్భంగా నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఐరీ మంగోలియాపై 9 బంతుల్లోనే 50 పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో యువీ పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేసి తన పేరు చరిత్ర పుటల్లో లిఖించుకున్నాడు. చదవండి: మెకానికల్ ఇంజనీర్! పాక్‌ను ఒంటిచేత్తో ఓడించి.. టీమిండియా పరువు కాపాడి! ఒకే ఒక్కసారి కెప్టెన్‌గా.. -
పట్టాలెక్కిన యశ్వంతపూర్ వందేభారత్
సాక్షి, హైదరాబాద్/కాచిగూడ: తెలంగాణకు మూడో వందేభారత్ రైలుగా కేటాయించిన కాచిగూడ–యశ్వంతపూర్ వందేభారత్ రైలు పట్టాలెక్కింది. ఆదివారం దేశవ్యాప్తంగా ఒకేసారి 9 వందేభారత్ రైళ్లను ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియోకాన్ఫరెన్సు ద్వారా జెండా ఊపి దాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కాచిగూడ స్టేషన్ నుంచి బెంగళూరులోని యశ్వంతపూర్ స్టేషన్‌కు బయలుదేరింది. కాచిగూడ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్, హైదరాబాద్ డీఆర్ఎం లోకేష్ విష్ణోయ్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్రం రూ.9 లక్షల కోట్లు ఇచ్చింది.. ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకున్నాక తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రూ.9 లక్షల కోట్లు ఖర్చుచేసిందని కిషన్‌రెడ్డి అన్నారు. వందేభారత్ రైలు ప్రారంబోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతూ వచ్చిందని, మోదీ దీన్ని గుర్తించి తెలంగాణకు న్యాయం చేస్తున్నారన్నారు. సంవత్సరానికి 55 కి.మీ. చొప్పున కొత్త లైన్లు ఏర్పాటు చేస్తుండగా, ప్రస్తుతం రూ.31,221 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు రాష్ట్రంలో జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని రైల్వే స్టేషన్లను రూ.2,300 కోట్ల వ్యయంతో ఆధునీకరిస్తున్నామని, త్వరలో మరిన్ని ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. కాజిపేటలో వ్యాగన్ తయారీ కర్మాగారం అందుబాటులోకి వస్తోందని, అక్కడ భవిష్యత్తులో రైల్వేకు అవసరమైన ఇతర పరికరాలు కూడా తయారవుతాయని వివరించారు. మంగళవారం ఉదయం నుంచి.. సాధారణ ప్రయాణికులు లేకుండా తొలిరోజు బెంగుళూరు వెళ్లిన రైలు, సోమవారం మధ్యాహ్నం 2.45 గంటలకు అక్కడి నుంచి ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయల్దేరనుంది. మంగళవారం ఉదయం 5.30 గంటలకు కాచిగూడ నుంచి ప్రయాణికులతో బెంగళూరు బయల్దేరనుంది. -
ఇక వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లు.. ఒక్కో రైలుకు రూ.120 కోట్ల ఖర్చు
సాక్షి, అమరావతి: వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రత్యామ్నాయంగా రైల్వేశాఖ వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లను ప్రవేశపెడుతోంది. మొదటిదశలో 200 రైళ్ల తయారీకి కాంట్రాక్టును ఖరారు చేసింది. రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లలో ప్రస్తుతం చెయిర్‌కార్ కోచ్‌లే అందుబాటులో ఉన్నాయి. దేశంలో రెండో అతివేగంగా ప్రయాణించే వందేభారత్ రైళ్లలో ప్రస్తుతం ఏసీ చెయిర్‌కార్ కోచ్‌లే ఉన్నాయి. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తోంది. కానీ స్లీపర్ కోచ్‌లు లేకపోవడంపై ప్రతికూల స్పందన కూడా వ్యక్తమవుతోంది. స్లీపర్ కోచ్‌లు లేకపోవడంతో దూరప్రాంత ప్రయాణాలకు ప్రయాణికులు విముఖత చూపుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగానే రైల్వేశాఖ వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లు ప్రవేశపెడుతోంది. స్లీపర్ కోచ్‌లతో కూడిన వందేభారత్ రైళ్ల తయారీకి టెండర్ల ప్రక్రియను పూర్తిచేసింది. మొత్తం 400 రైళ్లు ప్రవేశపెట్టాలన్నది రైల్వేశాఖ ఉద్దేశం. మొదటిదశలో ప్రవేశపెట్టే 200 రైళ్ల కోసం టెండర్లను ఇటీవల ఖరారు చేసింది. ఏడుసంస్థలు బిడ్లు దాఖలు చేయగా.. రైల్‌వికాస్ నిగమ్ లిమిటెడ్, రష్యాకు చెందిన టీఎంహెచ్ గ్రూప్‌తో కూడిన కన్సార్షియం 120 రైళ్ల తయారీ కాంట్రాక్టును దక్కించుకుంది. ఒక్కో రైలును రూ.120 కోట్లతో తయారు చేసేందుకు ఈ కన్సార్షియం ముందుకొచ్చింది. టిట్లాఘర్ వేగన్, బీహెచ్ఈఎల్తోకూడిన కన్సార్షియం మరో 80 రైళ్లను తయారు చేయనుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగం.. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లలో మొత్తం 16 బోగీలుంటాయి. థర్డ్ ఏసీ కోచ్‌లు 11, సెకండ్ ఏసీ కోచ్‌లు 4, ఫస్ట్ ఏసీ ఒక కోచ్ ఉండేలా డిజైన్ చేశారు. ప్రయాణికుల స్పందనను బట్టి.. తరువాత దశల్లో కోచ్‌ల సంఖ్యను 20 లేదా 24కు కూడా పెంచాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఈ రైలు బయలుదేరిన నిమిషం వ్యవధిలోనే గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు ‘ఫ్రంట్ డ్రివెన్’ విధానంలో ప్రయాణిస్తున్నాయి. వందేభారత్ స్లీపర్ కోచ్‌లు ‘డిస్ట్రిబ్యూటెడ్’ విధానంలో ప్రయాణిస్తాయి. దీంతో రైలు ప్రయాణంలో కుదుపులు, శబ్దం కనిష్టస్థాయిలోనే ఉంటాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ల కంటే వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లు పట్టాలపై తక్కువ ఒత్తిడి కలిగిస్తూ అధికవేగంతో ప్రయాణిస్తాయి. దీనివల్ల పట్టాల నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుందని రైల్వే ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది చివరినాటికి తొలి వందేభారత్ స్లీపర్ కోచ్‌ల రైలును పట్టాలెక్కించాలని రైల్వేశాఖ భావిస్తోంది. నేటినుంచి సామర్లకోటలో వందేభారత్‌కు హాల్ట్ సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లా సామర్లకోటలో గురువారం నుంచి వందేభారత్ రైలు ఆగనుంది. ఈ రైలు సామర్లకోట జంక్షన్లో ఒక్క నిమిషం ఆగేందుకు రైల్వేశాఖ అనుమతి ఇచ్చింది. ఈ రైలు హాల్ట్‌కు అనుమతి ఇవ్వాలన్న ప్రజల విజ్ఞప్తుల్ని కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విన్‌వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో 48 గంటల వ్యవధిలోనే వందేభారత్ రైలు హాల్ట్‌కు ఆమోదం లభించింది. దీంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
రైలు టిక్కెట్ బుకింగ్ సర్వీసులో సాంకేతిక లోపం
-
యాదాద్రికి ఎంఎంటీఎస్
సాక్షి, హైదరాబాద్, యాదాద్రి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఎంఎంటీఎస్ అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ మొదలైంది. ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు ఉన్న 33 కిలోమీటర్ల మార్గంలో ఇప్పుడున్న రెండు లైన్లతో పాటు ఎంఎంటీఎస్ కోసం మరోలైన్ అదనంగా నిర్మించనున్నారు. వాస్తవానికి ఎంఎంటీఎస్ రెండోదశ కింద 2016లోనే ఈ ప్రాజెక్టు చేపట్టారు. కానీ రాష్ట్రప్రభుత్వం తన వాటాగా నిధులు కేటాయించకపోవడంతో తీవ్ర జాప్యం నెలకొంది. రూ.330 కోట్లతో అప్పట్లో అంచనాలు రూపొందించారు. పెరిగిన ధరల దృష్ట్యా ప్రాజెక్టు వ్యయం ఇప్పుడు రూ.430 కోట్లకు చేరింది. రైల్వేశాఖ వందశాతం నిధులతో ఈ ప్రాజెక్టు నిర్మించనుంది. రైల్ వికాస్‌నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) ఆధ్వర్యంలో త్వరలో పనులు ప్రారంభమవుతాయి. జీఎం సమీక్ష దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్, ఆర్వీఎన్ఎల్ చీఫ్‌ప్రాజెక్ట్ మేనేజర్ మున్నాకుమార్, సికింద్రాబాద్ డీఆర్ఎం ఏకే గుప్తాలతో కూడిన ఉన్నతాధికారుల బృందం గురువారం యాదాద్రి రైల్వేస్టేషన్‌ను సందర్శించింది. రైల్వేస్టేషన్లో ప్రయాణికుల సదుపాయాలు, స్టేషన్ అభివృద్ధి ప్రణాళికలు, కొత్తగా నిర్మించాల్సిన ఎంఎంటీఎస్–2 లైన్, తదితర పనులపైన జీఎం సమీక్షించారు. ప్రాజెక్ట్‌లో భాగంగా ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరి, యాదాద్రి స్టేషన్లు, యార్డులలో అదనపు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతమున్న రైల్వేస్టేషన్లో నూతనంగా నిర్మించిన ప్లాట్‌ఫాం, స్టేషన్ ఇతర వసతుల కోసం స్థలాన్ని జీఎం పరిశీలించారు. ప్రస్తుతం గుట్టవైపు ఉన్న స్టేషన్‌కు ఎదురుగా నూతన రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టడానికి అనువుగా ఉన్నట్టు గుర్తించారు. యాదాద్రి క్షేత్ర ఆలయ నమూనాతో రైల్వేస్టేషన్ ముఖ ద్వారం నిర్మించనున్నారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపేందుకు చర్యలు తీసుకోవాలని, రైల్వేస్టేషన్‌ను ఆధునీకరించాలని, రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి రాసిన వినతిపత్రాన్ని జీఎంకు భువనగిరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ అందజేశారు. జీఎం ముందుగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నారు. యాదాద్రి పునరాభివృద్ధి అమృత్‌భారత్ స్టేషన్ పథకం కింద యాదాద్రి రైల్వేస్టేషన్‌ను పునరాభివృద్ధి చేయనున్నట్టు జీఎం అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. ఎంఎంటీఎస్ –2 లైన్ కోసం స్టేషన్ తూర్పు వైపున విస్తరించాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఈ స్టేషన్ అభివృద్ధికి రైల్వేశాఖ నిధులు కేటాయించిన దృష్ట్యా అమృత్‌భారత్ పథకం కింద పడమర వైపున కూడా స్టేషన్ అభివృద్ధి చేస్తామని, టెండర్లు కూడా పిలుస్తామని చెప్పారు. ప్లాట్ ఫామ్‌ల పైకప్పు నిర్మాణం, ప్రధాన ముఖద్వార అభివృద్ధితో పాటు స్టేషన్ భవనాన్ని మెరుగుపరచనున్నట్టు తెలిపారు. ఎంఎంటీఎస్‌తోపాటు, స్టేషన్ అభివృద్ధి వల్ల యాదాద్రికి భక్తులు అతి తక్కువ చార్జీల్లోనే వెళ్లవచ్చన్నారు. -
రజితను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈమె వలలో పడ్డారంటే..
ఆదిలాబాద్‌టౌన్: కొలువుల ఆశ చూపి నిరుద్యోగులను బరిడీ కొట్టించింది ఈ మాయలేడి. నిరుద్యోగులనే కాదు.. ఏకంగా టీచర్లు.. లెక్చరర్లు సైతం ఈమె వలలో పడ్డారంటే ఎంత కి‘లేడి’నో ఇట్టే అర్థమైపోతుంది. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఘరానా మోసానికి పాల్పడింది. ఫేక్ ఐడెంటిటీ కార్డులు, అపాయింట్మెంట్ లెటర్లు సృష్టించి ఉద్యోగం వచ్చిందంటూ నమ్మబలికింది. కాజిపేటలో 15రోజుల పాటు డ్యూటీలు సైతం చేయించింది. మరికొందరు నుంచి డబ్బులు వసూలు చేసి రెండేళ్లుగా ఈ తతంగానికి పాల్పడుతోంది. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఆమె బాగోతం బయటపడింది. ఈ మేరకు డీఎస్పీ ఉమేందర్ శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.ఆదిలాబాద్ పట్టణానికి చెందిన తోట రజిత రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని జిల్లాకు చెందిన పది మందిని మోసం చేసింది. ఇందులో జిల్లా కేంద్రానికి చెందిన నలుగురు, బోథ్‌లో ఇద్దరు, బజార్హత్నూర్లో ఒకరు, ఇచ్చోడలో ఒకరు, బేలలో ఒకరు, ఉట్నూర్‌లో ఒకరు ఉన్నారు. రెండేళ్లుగా ఇలా మోసాలకు పాల్పడుతుంది. కాజీపేటలో ఓ ప్రైవేట్ రూం తీసుకొని వీరికి డ్యూటీలు కేటాయించినట్లు నమ్మబలికింది. గూడ్స్ రైళ్లు లెక్కించడం.. తదితర పనులు అప్పగించింది. ఐడీ కార్డులు, అపాయింట్మెంట్ లెటర్లు సైతం సృష్టించింది. ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పది మంది నుంచి రూ.49.40 లక్షలు తీసుకుంది. హైదరాబాద్‌కు చెందిన నలుగురు వ్యక్తులను విచారిస్తే మిగతా విషయాలు బయటకు వస్తాయి. ప్రస్తుతం కేసు నమోదు చేశాం. కోర్టులో ప్రవేశపెడతాం. నిరుద్యోగులు ఇలాంటి మోసగాళ్లను నమ్మకూడదు. అప్రమత్తంగా ఉండాలి. సమావేశంలో సీఐ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన తోట రజిత ఓపెన్ డిగ్రీ చదివింది. కొంత కాలం ప్రైవేట్ జాబ్ చేసింది. జల్సాల కోసం డబ్బు సంపాదించాలనే ఆశతో హైదరాబాద్‌లో తన బంధువు శేషగిరిరావుతో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయక నిరుద్యోగులకు వల విసిరింది. ఒక్కొక్కరి నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేసింది. హైదరాబాద్‌కు చెందిన మరో ముగ్గురు వ్యక్తులు మందీప్‌సింగ్, సందీప్‌సింగ్, కబీర్‌సింగ్ ఈమెకు తోడయ్యారు. ఎలాంటి పరీక్షలు, ఇంటర్వ్యూలు లేకుండా విద్యార్హతలు లేకున్నా సరే రైల్వేశాఖలో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మబలికింది. ఈమె మోసాన్ని గ్రహించక పది మంది రూ.49.40 లక్షలు అప్పగించారు. -
ప్యాసింజర్ రైళ్లకు మంగళం
స్వాతంత్రోద్యమ కాలం నుంచి రైళ్లు ప్రజల జీవితాలతో ముడిపడి ఉండేవి. రోడ్డు మార్గాలు, రవాణా సాధనాలు అంతంతమాత్రంగా ఉన్న రోజుల్లో పేద, మధ్య, ఎగువ తరగతి ప్రజలకు ప్రయాణ సాధనం రైలు మాత్రమే. దీంతో రైల్వే శాఖ నిరంతరం ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో పనిచేసేది. కాలక్రమేణా ఆధునికత సంతరించుకున్న రైల్వే శాఖ సేవామార్గాన్ని విస్మరించి లాభార్జనే పరమావధిగా పనిచేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి, వాటిని ఎక్స్‌ప్రెస్‌లుగా మర్పు చేయడంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రయాణం భారంగా మారింది. ఏలూరు (టూటౌన్): ఒక నాడు అధికంగా కనిపించే ప్యాసింజర్ రైళ్లు క్రమేణా కనుమరుగయ్యాయనే చెప్పవచ్చు. ఎక్కడో కొన్ని మార్గాల్లో మినహా ప్యాసింజర్ రైళ్లు అనేవి కనిపించని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా విజయవాడ డివిజన్ పరిధిలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా రాజమండ్రి–విజయవాడ ప్యాసింజర్ రైలు ప్రతి రోజు అప్ అండ్ డౌన్‌గా తిరిగేది. ఇది పేద ప్రజలకు, నిత్యం ప్రయాణించే చిరు వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకు అక్కరకు వచ్చేది. ఉదాహరణకు ఏలూరు నుంచి కేవలం రూ.15 చార్జీతో విజయవాడ ప్రయాణం చేసి మళ్లీ సాయంత్రం తిరిగి వచ్చే వెసులుబాటు ఉండేది. అంటే ఒక ప్రయాణికుడు కేవలం రూ.30 ఖర్చుతో ఏలూరు నుంచి విజయవాడ వెళ్లి వచ్చే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఈ రైలు ఎక్స్‌ప్రెస్‌గా మార్చి వేశారు. అలాగే చార్జీలు పెద్ద ఎత్తున పెంచి వేశారు. దీంతో గతంలో కిక్కిరిసి ఉండే ప్రయాణికులు ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ రైలుగా మార్చిన తరువాత నామమాత్రంగానే కనిపిస్తున్నారు. కాకినాడ పోర్టు నుంచి విజయవాడ వచ్చే ఫాస్ట్ ప్యాసింజర్ రైలు సైతం నేడు ఎక్స్‌ప్రెస్ రైలుగా రూపాంతరం చెందింది. సుదూర ప్రాంతం నుంచి వచ్చే రాయగడ–గుంటూరు ప్యాసింజర్ సైతం ఎక్స్‌ప్రెస్‌గా మార్చి వేశారు. దీంతో ఈ ప్రాంతం నుంచి విశాఖపట్టణం, శ్రీకాకుళం, రాయగడ ప్రాంతాలకు వెళ్లే వలస కూలీలు, సాధారణ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పాత సీసాలో కొత్త సారా నింపినట్లు గతంలో నడిచే ప్యాసింజర్ రైళ్లనే ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చి వేసి పెద్ద ఎత్తున చార్జీలు వసూలు చేస్తున్నారే తప్ప ఆ రైళ్లల్లో అదనంగా ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదంటూ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. స్లీపర్ బోగీలు కుదింపు.. ఏసీ బోగీలు పెంపు రైళ్లలో ప్రయాణించే జనరల్, స్లీపర్ క్లాస్ బోగీల విషయంలో రైల్వే శాఖ పట్టించుకోవడం లేదనేది ప్రయాణికుల వాదనగా ఉంది. రద్దీ ఉండే అనేక రైళ్లలో ఏసీ బోగీల సంఖ్యను ఇబ్బడిముబ్బడిగా పెంచుతున్నారు. ఇదే సమయంలో జనరల్, స్లీపర్ బోగీల సంఖ్యను కుదిస్తున్నారు. భువనేశ్వర్ నుంచి బెంగుళూరు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో గతంలో స్లీపర్ బోగీలు 10, ఏసీ బోగీలు 3 ఉండేవి. తాజాగా స్లీపర్ బోగీలను ఆరుకు తగ్గించి, ఏసీ బోగీలను ఆరుకు పెంచారు. అలాగే విశాఖపట్టణం–హైదరాబాద్ మధ్య నడిచే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో గతంలో స్లీపర్ బోగీలు 12 ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య ఏడుకు తగ్గించి, ఏసీ బోగీలను మూడు నుంచి ఏడుకు పెంచారు. ఇలా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్ బోగీలను తగ్గించి, ఏసీ బోగీలను పెంచడం వల్ల సాధారణ ప్రజలకు రైలు ప్రయాణం అందని ద్రాక్షలా చేస్తున్నారనేది ప్రయాణికుల వాదనగా ఉంది. రైళ్ల రద్దుతోనూ తప్పని అవస్థలు ఇటీవల ఒడిశాలో జరిగిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంతో పాటు ట్రాక్‌ల మెయింట్‌నెన్స్ పేరుతో విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. నిత్యం ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండే విజయవాడ–విశాఖపట్టణం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, గుంటూరు–విశాఖపట్టణం మధ్య నడిచే సింహాద్రి ఎక్స్‌ప్రెస్, కాకినాడ పోర్టు–విజయవాడ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలును పలు పర్యాయాలు రద్దు చేస్తుండటంతో వాటిలో ప్రయాణించేందుకు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఇవన్నీ రెగ్యులర్ ప్రయాణికులు, విద్యార్థులు, వ్యాపారులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు నిత్యం ప్రయాణించే రైళ్లే. వీటిని పలు కారణాలతో ఎక్కువ సార్లు రద్దు చేస్తుండటంతో నిత్యం ప్రయాణించే వారి బాధలు వర్ణనాతీతంగా చెప్పుకోవచ్చు. ఆదాయం బాగుంటేనే గ్రీన్‌సిగ్నల్ పలు కారణాలతో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్న రైల్వే శాఖ అంతరాష్ట్ర సర్విసులను, రైల్వేకు అధిక ఆదాయం తెచ్చే వందేభారత్ వంటి రైళ్ళను మాత్రం యధావిధిగా నడపడంపై సాధారణ ప్రయాణికులు విమర్శలు చేస్తున్నారు. భిన్నమతాలు, భాషలు, ప్రాంతాలను కలిపే రైళ్లు నేడు లాభాలు తెచ్చే మార్గాల వైపే దృష్టి సారించడం శోచనీయమంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్లీపర్ బెర్త్ దొరకడమే కష్టమే స్లీపర్ క్లాస్ బోగీల సంఖ్యల తగ్గించి వేస్తుండటంతో రిజర్వేషన్ దొరకడమే కష్టంగా మారింది. నెల ముందు రిజర్వేషన్ కోసం ప్రయత్నించినా వెయిటింగ్ లిస్ట్ వస్తోంది. గతంలో నాలుగు రోజుల ముందు ప్రయత్నిస్తే స్లీపర్ క్లాస్‌లో రిజర్వేషన్ దొరికేది. సామాన్య, మధ్యతరగతి ప్రయాణికుల పట్ల రైల్వే శాఖ శ్రద్ద చూపాల్సిన అవసరం ఉంది. – కొరబండి బాబూరావు, సామాజిక కార్యకర్త, ఏలూరు -
రైల్వేతో కలిసి పనిచేస్తారా? రూ.80 వేల వరకూ సంపాదించుకోవచ్చు!
రైల్వేలో ఉద్యోగం చేయాలని చాలా మంది కలలు కంటారు. అయితే తక్కువ సంఖ్యలో పోస్టులు, తీవ్రమైన పోటీ కారణంగా ఉద్యోగం సాధించడం కష్టంగా మారింది. అయినా పర్వాలేదు.. రైల్వేతో కలిసి పనిచేస్తూ డబ్బు సంపాదించుకునే అవకాశం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కల్పిస్తోంది. ఇదీ చదవండి: ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసా? ఐఆర్సీటీసీ ఏజెంట్‌గా చేరితే మంచి మొత్తంలో సంపాదించుకోవచ్చు. ఇందులో చేరేవారిని రైల్ ట్రావెల్ సర్వీస్ ఏజెంట్‌గా వ్యవహరిస్తారు. దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. కార్యాలయం అవసరం లేదు. ఇంట్లో నుంచే కంప్యూటర్లో ఈ పని చేసుకోవచ్చు. రైల్వేలో టికెట్ క్లెర్క్‌లు చేసే పనినే ఈ ఏజెంట్లు ఇంటి వద్ద నుంచి చేయాలి. మీరు బుక్ చేసిన టికెట్లకు ఐఆర్సీటీసీ కమీషన్ ఇస్తుంది. ఇదీ చదవండి: గ్యాస్ వినియోగదారులకు ఊరట.. ధరల పరిమితిపై కేంద్రం పరిశీలన! సంపాదన ఇలా.. నాన్ ఏసీ కోచ్ టిక్కెట్‌ను బుక్ చేస్తే ఒక్కో టికెట్‌కు రూ.20, ఏసీ క్లాస్ టికెట్‌ను బుక్ చేస్తే రూ.40 చొప్పున ఏజెంట్‌కు కమీషన్ వస్తుంది. అలాగే టికెట్ ధరలో ఒక శాతం డబ్బును కూడా ఏజెంట్‌కు ఇస్తారు. ఐఆర్సీటీసీ ఏజెంట్లు పరిమితి లేకుండా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అలాగే 15 నిమిషాల్లో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసే అవకాశం కూడా ఉంది. మీరు బుక్ చేసిన టిక్కెట్ల ఆధారంగా మీ సంపాదన ఉంటుంది. ఇదీ చదవండి: Get 1 Electric Scooter: రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్! మంచి బుకింగ్ లభిస్తే నెలకు రూ.80 వేల వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఏజెంట్‌గా చేరాలనుకునేవారు ఐఆర్సీటీసీ రుసుము కింద సంవత్సరానికి రూ.3,999 చెల్లించాల్సి ఉంటుంది. అదే రెండు సంవత్సరాలకు అయితే రూ. 6,999 చెల్లించాలి. నెలలో 100 టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ఒక్కో టికెట్‌కు రూ.10 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: Physics Wallah Viral Video: బోరుమన్న ఫిజిక్స్ వాలా మాజీ టీచర్లు! నాటకం బాగుందన్న నెటిజన్లు! -
యూనియన్‌బడ్జెట్23: రైల్వేలకు భారీ కేటాయింపులు
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023-24లో రైల్వేలకు భారీ కేటాయింపులను చేస్తున్నట్టు ప్రకటించారు. రైల్వేల కోసం రూ. 2.4 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఇది దాదాపు పదేళ్లలో అత్యధికం, గత సంవత్సరం బడ్జెట్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ అని ఆమె ఈ సందర్భంగా చెప్పనారు. అంతేకాదు నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి రావడానికి ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ దేశాన్ని పరిపాలించిన సంవత్సరంతో పోల్చుతే ఇది 2013-14లో చేసిన వ్యయం కంటే దాదాపు తొమ్మిది రెట్లు ఎక్కువ అంటూ ఆర్థికమంత్రి నొక్కిచెప్పారు. క్రిటికల్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌ల కోసం ఆమె రూ. 75,000 కోట్లను కూడా ప్రకటించింది, ఇది రైల్వేలకు కూడా ప్రత్యేకంగా దాని సరుకు రవాణా వ్యాపారంలో సహాయపడే అవకాశం ఉందన్నారు. -
ఆధునిక రైల్వేకు రూపకల్పన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గత ఎనిమిదేళ్లలో రైల్వేల పురోగతి అద్భుతంగా సాగిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 2014 కు ముందు తెలంగాణకు రైల్వే బడ్జెట్లో రూ. 250 కోట్ల లోపే కేటాయింపు ఉండేదని, ఇప్పుడు అది రూ. 3వేల కోట్లకు పెరిగిందన్నారు. రైలును చూడని మెదక్ లాంటి ప్రాంతాలకు ఇప్పుడు రైల్వే కనెక్టివిటీ ఏర్పడిందని, ఇది తెలంగాణలో రైల్వేపరంగా పురో గతికి గుర్తని ఆయన వ్యాఖ్యానించారు. సంక్రాంతి నాడు ఆదివారం ఉదయం సికింద్రాబాద్– విశాఖప ట్నం మధ్య నడిచే దేశంలో ఎనిమిదో వందేభారత్ రైలును ఆయన లాంఛనంగా ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఢిల్లీ నుంచి ఆయన జెండా ఊపగా, సికింద్రాబాద్ స్టేషన్లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యక్షంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ తెలంగాణలో రైల్వేలో పురోగతిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. త్వరలోనే తెలంగాణలోని అన్ని బ్రాడ్ గేజ్ మార్గాల విద్యుదీకరణ 2014కు ముందు ఎనిమిదేళ్ళ కాలంలో తెలంగాణ ప్రాంతంలో కొత్తగా వేసిన రైలు మార్గం 125 కిలో మీటర్ల లోపే ఉండగా, గడిచిన ఎనిమిదేళ్లలో 325 కిలోమీటర్ల మేర కొత్తగా నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఎనిమిదేళ్లలో ట్రాక్ విస్తరణ పను లు 250 కిలోమీటర్లకు పైగా జరిగాయని, విద్యుదీ కరణ పనులు మూడు రెట్లు పెరిగాయని వెల్లడించా రు. త్వరలోనే అన్ని బ్రాడ్ గేజ్ మార్గాల విద్యు దీకరణ పూర్తి చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ఏపీలో కూడా బలోపేతానికి చర్యలు ఆంధ్రప్రదేశ్‌లో కూడా రైలు నెట్ వర్క్‌ను బలోపేతం చేయటానికి కేంద్రం చర్యలు చేపట్టిందన్నారు. కొద్ది కాలంలోనే 350 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాన్ని, 800 కిలోమీటర్ల మేర ట్రాక్ గేజ్ మార్పిడి పనులను పూర్తి చేయటాన్ని ప్రస్తావించారు. 2014 కు ముందు కాలంతో పోల్చుకుంటే ఆంధ్ర ప్రదేశ్‌లో ఏటా 60 కిలోమీటర్ల మేర మాత్రమే విద్యుదీకరణ జరగగా ఇప్పుడు ఆ వేగం ఏడాదికి 220 కిలోమీటర్లకు పెరిగిందన్నారు. దేశీయంగా సొంత పరిజ్ఞానంతో అద్భుతంగా రూపొందిన ఈ రైలు నవ భారత సామర్థ్యానికి, దీక్షకు ఒక చిహ్నం అని ప్రధాని అభివర్ణించారు. సైనిక దినోత్సవం సందర్భంగా భారత సైనికులకు కూడా ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు. పక్షం రోజుల్లో రెండోది... : ఈ ఏడాది కేవలం 15 రోజుల్లోనే రెండో వందే భారత్ రైలు పట్టాలెక్కిందని పేర్కొంటూ, వందే భారత్ రైళ్ళ తయారీలో వేగానికి ఇది నిదర్శనమన్నారు. సికింద్రాబాద్ వందే భారత్‌కు పూర్వం పట్టాలెక్కిన 7 వందే భారత్ రైళ్ళు 23 లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణించాయని, ఇది భూమి చుట్టూ 58 ప్రదక్షిణలతో సమానమని పేర్కొన్నారు. ఇక రోజువారీగా వందేభారత్..: ఈ రైలు సికింద్రాబాద్‌లో బయలుదేరి వరంగల్, ఖమ్మం మీదు గా ఏపీలోని విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో ఆగుతూ విశాఖపట్నం చేరుకుంటుందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వందేభారత్ రైలు సంక్రాంతి కానుకగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. త్వరలో రూ.700 కోట్ల వ్యయంతో ప్రధాని ఆధ్వ ర్యంలో సికింద్రాబాద్ స్టేషన్ అద్భుతంగా పునర్ని ర్మాణం జరగనుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలి పారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు మహమూ ద్ అలీ, శ్రీనివాస యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ నేతలు లక్ష్మణ్, విజయశాంతి పాల్గొన్నారు. -
‘పసిడి’కి పంచ్ దూరంలో...
జాతీయ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ (50 కేజీలు) పసిడి పతకానికి విజయం దూరంలో నిలిచింది. భోపాల్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో నిఖత్ 5–0తో శివిందర్ కౌర్ (ఆలిండియా పోలీస్)పై ఘనవిజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో అనామిక (రైల్వేస్)తో నిఖత్ తలపడుతుంది. 75 కేజీల విభాగంలో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ (అస్సాం) కూడా ఫైనల్ చేరింది. -
ఇంటి నుంచి పారిపోయి వెళ్లి పెళ్లి చేసుకొని.. రైలుపట్టాలపై..
సాక్షి, యశవంతపుర: బెంగళూరు చిక్కబాణవార సమీపంలోని హుస్కూరు గ్రామం వద్ద ప్రేమ జంట రైలు కింద పడి అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. మృతుడు నాగేంద్ర (21) కాగా, యువతి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల ఇద్దరూ ఇళ్లు వదిలి వెళ్లి పెళ్లి చేసుకొన్నారు. చిక్కబాణవార–గొల్లహళ్లి రైల్వేస్టేషన్ల మధ్య హుస్కూరు రైల్వేస్టేషన్ వద్ద పట్టాలపై ఇద్దరి శవాలను రైల్వే పోలీసులు కనుగొన్నారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యశవంతపుర పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చదవండి: (భర్త వివాహేతర సంబంధం.. భార్యకు తెలిసి..) -
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై ఆ టెన్షన్ లేదు, కొత్త సర్వీస్ వచ్చేసింది!
ఇండియన్ రైల్వేస్.. ప్రతి రోజు లక్షల మంది ప్యాసింజర్లను వారి గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు కోట్ల రూపాయలు సరకులను రావాణా చేస్తూ ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తోంది. ప్రయాణికుల సేవలు అందించడంలో ఏ మాత్రం రాజీ పడకుండా ముందుకు దూసుకెళ్తోంది. తాజాగా మరో సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది భారతీయ రైల్వే. రాత్రి పూట ప్రయాణించే ప్యాసింజర్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సరికొత్త సేవ ఇకపై రాత్రి పూట ప్రయాణించే ప్యాసింజర్లు రైలులో నిద్రిపోయినా ఎలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే రైల్వే శాఖ సరికొత్త సేవని ప్రవేశపెట్టింది. ‘డెస్టినేషన్ అలర్ట్ వేక్ అప్ అలారం’ పేరుతో కొత్త సర్వీసును ప్రారంభించింది భారతీయ రైల్వే . ఇదివరకే రాత్రి వేళ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు నుంచి ఈ అంశంపై పలుమార్లు రైల్వే బోర్డుకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ సమస్య నుంచి బయటపడేందుకు రైల్వేశాఖ ఈ సౌకర్యాన్ని తీసుకువచ్చింది. ఎంక్వైరీ సర్వీస్ నంబర్ 139లో రైల్వే ఈ కొత్త సేవను ప్రారంభించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు రైల్వే ప్రయాణికులకు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ సర్వీసు ద్వారా ప్యాసింజర్లు వారి స్టేషన్‌కు చేరుకునే వరకు ఆందోళన లేకుండా నిద్రపోవచ్చు. ఇది ఎలా పని చేస్తుందంటే.. ప్యాసింజర్ వారి గమ్య స్థానానికి చేరుకునే 20 నిమిషాల ముందు రైల్వే శాఖ నుంచి మీకు అలర్ట్ వస్తుంది. దీని ద్వారా మీరు నిద్రలేచి మీ గమ్య స్థానానికి చేరుకుంటారు. ఇలా ఉపయోగించుకోండి డెస్టినేషన్ అలర్ట్ వేకప్ అలారం సేవను ప్యాసింజర్లు ఉపయోగించుకోవాలంటే.. ఐఆర్సీటీసీ( IRCTC) హెల్ప్‌లైన్ 139కి కాల్ చేయాలి. మీరు గమ్యస్థాన అలర్ట్ కోసం ముందుగా 7 నంబర్లను, ఆపై 2 నంబర్లను నొక్కాలి. తర్వాత మీ 10 అంకెల పీఎన్ఆర్(PNR) నెంబర్‌ను నమోదు చేయాలి. దీన్ని నిర్ధారించడానికి 1 డయల్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు స్టేషన్ చేరుకోవడానికి 20 నిమిషాల ముందు వేకప్ అలర్ట్ వస్తుంది. -
సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్?
న్యూఢిల్లీ: కోవిడ్-19 సంకక్షోభ సమయంలో రద్దు చేసిన సీనియర్ సిటిజన్ల రైల్వే రాయితీ పొందే తరుణం రానుంది. ఈ మేరకు వారికి రాయితీ ఛార్జీలను పునరుద్ధరించాలని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. రైల్వేలు సాధారణ స్థితికి చేరుకుంటున్నందున, వివిధవర్గాలకు చెందిన ప్రయాణికులకు గతంలో అందించిన రాయితీలను తిరిగి అందించేలా చర్యలు చేపట్టాలని కమిటీ కోరింది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు రైల్వే రాయితీ ఛార్జీల రాయితీ పునరుద్ధరణపై ఆలోచించాలని రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖను కోరింది. వారికి స్లీపర్ క్లాస్, ఏసీ-3 కేటగిరీల్లో మొత్తం ఛార్జీలో 40 శాతం నుండి 50 శాతం వరకు రాయితీని అందించాలని సిఫార్సు చేసింది. గతవారం ఆగస్టు 4న పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కమిటీ ఈ మేరకు పేర్కొంది. అయితే రాయితీ పునరుద్ధరణపై రైల్వే శాఖ అధికారిక స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సీనియర్ సిటిజన్లు,జర్నలిస్టులకు అందించే రైల్వే ఛార్జీల రాయితీలు 2020 మార్చి 20నుంచి రద్దైన సంగతి తెలిసిందే. బీజేపీ లోక్‌సభ ఎంపీ రాధామోహన్ సింగ్ రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. -
లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2004–09లో రైల్వే శాఖలో గ్రూప్–డి ఉద్యోగాలు ఇప్పించినందుకు ప్రతిఫలంగా అభ్యర్థుల నుంచి బిహార్ రాజధాని పాట్నాలో లక్షకుపైగా చదరపు అడుగుల భూమిని లాలూ, కుటుంబ సభ్యులు తక్కువ ధరకే సొంతం చేసుకున్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది. లాలూ 2004–09లో యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 18న సీబీఐ ఆర్థిక నేరాల విభాగం ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. తాజా కేసు నేపథ్యంలో సీబీఐ అధికారులు ఢిల్లీ, పాట్నా, గోపాల్‌గంజ్‌లో లాలూ, కుటుంబ సభ్యులకు సంబంధించిన 16 చోట్ల సోదాలు ప్రారంభించారు. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, కుమార్తెలు మీసా భారతి, హేమా యాదవ్‌తోపాటు అక్రమంగా ఉద్యోగాలు దక్కించుకున్న మరో 12 మందిని నిందితులుగా చేర్చారు. భూమికి బదులు రైల్వే ఉద్యోగాల కుంభకోణంపై సీబీఐ 2021 సెప్టెంబర్ 23న దర్యాప్తు ప్రారంభించింది. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు మూడు సేల్ డీడ్ల ద్వారా భూమిని రబ్రీదేవికి, ఒక సేల్ డీడ్ ద్వారా మీసా భారతికి, రెండు గిఫ్ట్ డీడీల ద్వారా హేమా యాదవ్‌కు బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూములను సొంతం చేసుకోవడానికి లాలూ కుటుంబం సదరు అభ్యర్థులకు కేవలం రూ.3.75 లక్షల నుంచి రూ.13 లక్షల దాకా చెల్లించినట్లు సీబీఐ చెబుతోంది. నిజానికి ఆ భూముల విలువ రూ.కోట్లల్లో పలుకుతోంది. సంచలనం సృష్టించిన దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్‌కు న్యాయస్థానం ఇటీవలే బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే. భూమికి బదులు రైల్వే ఉద్యోగాల వ్యవహారంలో సీబీఐ కేసు నమోదు చేయడంపై రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) స్పందించింది. కేంద్రంలోని అధికార బీజేపీ సీబీఐని అడ్డం పెట్టుకొని బెదిరింపులకు దిగుతోందని, తాము భయపడే ప్రసక్తే లేదని ఆర్జేడీ అధికార ప్రతినిధి మనోజ్ కుమార్ ఝా తేల్చిచెప్పారు. రబ్రీదేవి పట్ల అధికారుల అనుచిత ప్రవర్తన బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి పట్ల సీబీఐ అధికారులు అనుచితంగా ప్రవర్తించారని, అసభ్యకర పదజాలంతో దూషించారని ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) ఆరోపించింది. భూమికి బదులు రైల్వే ఉద్యోగాల కేసులో సీబీఐ అధికారులు శుక్రవారం పాట్నాలో రబ్రీ దేవి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆమెను 12 గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు. -
సీనియర్ సిటిజన్ల ముక్కుపిండి రూ.1500 కోట్లు వసూలు
కరోనా సంక్షోభం మొదలు రైల్వేశాఖ బాదుడు మొదలైంది. సాధారణ రైళ్లకే ప్రత్యేకం పేరు పెట్టి అదనపు ఛార్జీలు వసూలు చేసింది. తక్కువ ధరకు సామాన్యులకు అందుబాటులో ఉండే ప్యాసింజర్ రైళ్లను ఎడాపెడా రద్దు చేసి పారేసింది. ఆఖరికి సామాజిక బాధ్యతగా వివిధ వర్గాలకు అందిస్తున్న రాయితీలను ఏకపక్షంగా ఎత్తేసింది. ఆఖరికి సీనియర్ సిటిజన్లపై కూడా కనికరం చూపలేదు. మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ఆసక్తికర విషయాలను వెలుగులోకి తెచ్చారు. గడిచిన రెండేళ్లుగా సీనియర్ సిటిజన్లకు రైల్వే ప్రయాణాల్లో రాయితీలు ఎత్తి వేయడం ద్వారా రైల్వేశాఖ వృద్ధ ప్రయాణికుల నుంచి అదనంగా రూ. 1500 కోట్లను తన ఖాతాలో జమ చేసుకుంది. రాయితీలు బంద్ కరోనా కారణంగా 2020 మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. దీంతో జనజీవనం ఎక్కడికక్కడే నిలిచిపోయింది. రైలు సర్వీసులు నిలిచిపోయాయి. ఆ తర్వాత క్రమంగా రైళ్లను పట్టాలెక్కించింది, అయితే అవన్ని ప్రత్యేక రైళ్లుగా పేర్కొంటూ.. అప్పటి వరకు అందిస్తూ వచ్చిన అన్ని రకాల రాయితీలను రైల్వేశాఖ ఎత్తేసింది. ఇందులో సీనియర్ సిటిజన్లు ఇచ్చే ప్రయాణ రాయితీ కూడా ఉంది. సీనియర్ సిటిజన్స్ రైల్వేలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక రాయితీలు ఉన్నాయి. 58 ఏళ్లు పైబడిన స్త్రీలకు టిక్కెట్టు ధరలో 50 శాతం, 60 ఏళ్లు పైబడిన పురుషులు, థర్డ్ జెండర్ వాళ్లకు టిక్కెట్టు ధరలో 40 శాతం రాయితీ ఉంది. అయితే తొలి విడత లాక్డౌన్ నుంచి ఈ రాయితీలు ఏవీ అమలు కావడం లేదు. దీనికి సంబంధించిన సమాచారం ఆర్టీఐ ద్వారా సేకరించారు. 7.31 కోట్ల మంది ప్రయాణం 2020 మార్చి 20 నుంచి 2022 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా వివిధ రైళ్లలో 7.31 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ప్రయాణం చేశారు. ఇందులో 4.46 కోట్ల మంది పురుషులు, 2.84 కోట్ల మంది స్త్రీలు, 8,310 మంది థర్డ్ జెండర్ వాళ్లు ఉన్నారు. వీళ్లకు ఈ రెండేళ్ల కాలంలో ఎటువంటి రాయితీ కల్పించలేదు. దీంతో వీళ్ల ప్రయాణాల ద్వారా రైల్వేకు రూ.3464 కోట్ల ఆదాయం సమకూరింది. రూ. 1500 కోట్లు గడిచిన రెండేళ్లలో సీనియర్ సిటిజన్లకు కనుక రాయితీని అమలు చేసి ఉంటే రైల్వేశాఖ ఖజానాలో చేరిన రూ.3464 కోట్ల రూపాయల్లో కనీసం రూ. 1500 కోట్ల రాయితీగా వృద్ధులకు అక్కరకు వచ్చేది. ఈ డబ్బు వారి కనీస అవసరాలు, మందులు మాకులకు పనికి వచ్చేవి. కానీ కరోనా కష్ట సమయంలోనూ వృద్ధులపై దయ చూపేందుకు రైల్వేశాఖ ససేమిరా అంది. ప్రతీ ప్రయాణంలోనూ వారి వద్ద నుంచి ఫుల్ ఛార్జీ వసూలు చేస్తూ తన బొక్కసం నింపుకుంది. బాధ్యత మరిచిన రైల్వే రైల్వేశాఖలో వృద్ధులు, సైనికులు, రోగులు, మాజీ ప్రజాప్రతినిధులు, దివ్యాంగులు ఇలా మొత్తం 53 రకాల రాయితీలను అందిస్తోంది, వీటి వల్ల రైల్వే ఆదాయానికి ఏటా సగటున రూ.2000 కోట్లు తూటు పడుతోంది. అయితే ఆ మేరకు సామాజిక భద్రత లభిస్తోంది. అయితే లాభాలే ముఖ్యం సామాజిక భద్రత మా బాధ్యత కాదన్నట్టుగా ఇటీవల రైల్వే వ్యవహరిస్తుండటంతో గత రెండేళ్లుగా ఈ రాయితీలేవీ అమలు కావడం లేదు. చదవండి: తల్లిబిడ్డల కోసం రైల్వేశాఖ వినూత్న నిర్ణయం! -
ఉత్తర భారత యాత్రకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, అమరావతి/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ఉత్తర భారతదేశ యాత్రకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు విజయవాడ ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ టి.మురళీకృష్ణ తెలిపారు. శుక్రవారం రైల్వే స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ స్వదేశ్ దర్శన్‌లో భాగంగా ఆగ్రా, మధుర, వైష్ణోదేవి దర్శనం, అమృత్సర్ యాత్రకు ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ నెల 27న రేణిగుంట–తిరుపతి నుంచి బయల్దేరే రైలు విజయవాడ, సికింద్రాబాద్‌లో ప్రయాణికులను ఎక్కించుకుని ఏడు రాత్రులు, 8 పగళ్లు ప్రయాణించి వచ్చే నెల 3న గమ్యస్థానానికి చేరుకుంటుందన్నారు. భోజన వసతితో పాటు స్లీపర్ క్లాస్ ప్రయాణ ధర రూ.18,120, థర్డ్ ఏసీ టికెట్ ధర రూ.22,165గా ఉంటుందన్నారు. వారణాసి, ప్రయాగ సంగమ్, గయ యాత్రకు సెప్టెంబర్ 15న సికింద్రాబాద్ నుంచి మహాలయ పిండ్‌దాన్ ఎక్స్‌ప్రెస్ రైలును ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 5 రాత్రులు, 6 పగళ్లు స్లీపర్ క్లాస్ ప్రయాణ ధర రూ.14,485, థర్డ్ ఏసీ రూ.18,785గా నిర్ణయించినట్టు తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్‌లో ప్రయాణికులు రైలు ఎక్కే సౌకర్యం ఉంటుందన్నారు. మరోవైపు విజయ గోవిందం ఎక్స్‌ప్రెస్ పేరుతో తిరుమల, తిరుచానూరుకు ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నామన్నారు. 2 రాత్రులు, 3 పగళ్లు ప్రయాణ టికెట్ ధర విజయవాడ నుంచి రూ.3,410, రాజమండ్రి–సామర్లకోట నుంచి రూ.3,690 ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎల్టీసీ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. ఆసక్తి గలవారు ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా 8287932312, 9701360675 ఫోన్ నంబర్లు లేదా విజయవాడ రైల్వే స్టేషన్‌లోని కార్యాలయంలో సంప్రదించాల్సిందిగా కోరారు. పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రత్యేక రైళ్లు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించే నాన్–టెక్నికల్ కేటగిరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రాంతీయ విమాన ప్యాకేజీలు ఐఆర్సీటీసీ హైదరాబాద్ నుంచి ప్రాంతీయ విమాన టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చినట్టు తెలి పారు. ఈ నెల 27న అల్టిమేట్ ఉత్తరాఖండ్ పేరుతో డెహ్రాడూన్, హరిద్వార్, ముస్సోరి, రుషికేష్ చుట్టివ చ్చేలా రూ.23,635తో ప్రత్యేక ప్యాకేజీ రూపొందించామన్నారు. 29న రాయల్ నేపాల్‌యాత్రలో భాగం గా ఖాట్మండు, పోఖరా ప్రయాణానికి రూ.40 వేల నుంచి టికెట్ ధర ప్రారంభమవుతుందన్నారు. ఈ నెల 12, 14, 19, 21, 26, 28 తేదీల్లో తిరుపతి, కాణిపాకం, శ్రీనివాసమంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూరు, తిరుమలతో కలిపి రూ.12,260తో విమాన ప్యాకేజీని నిర్వహిస్తున్నట్టు వివరించారు. చదవండి: మళ్లీ పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర.. నెల గ్యాప్ తర్వాత రూ.50 పెంపు -
రైల్వే–ఆర్టీసీ కలసి సరుకు రవాణా!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ–రైల్వేలు కలసి సరుకు రవాణా దిశగా అడుగులు వేస్తున్నాయి. టీఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్ విభాగం ఏర్పడ్డా, ఇంతకాలం పెద్దగా ఆదాయాన్ని సాధించలేకపోయింది. ఇప్పుడు దాన్ని పూర్తిస్థాయిలో మార్చి ఆదాయాన్ని పెంచేలా ఎండీ సజ్జనార్ చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవలే కార్గో విభాగానికి జీవన్‌ప్రసాద్ అధికారిని బిజెనెస్ హెడ్‌గా నియమించారు. ఇటీవలే కర్ణాటకలో, అక్కడి ఆర్టీసీ కార్గో విభాగం పని తీరును పరిశీలించి వచ్చిన ఆయన, తాజాగా రైల్వేతో అనుసంధానంపై కసరత్తు ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ విద్యాధర్‌రావుతో బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, కార్గో బిజినెస్ హెడ్ జీవన్‌ప్రసాద్‌లు భేటీ అయ్యారు. ఈ మేరకు రైల్వే–ఆర్టీసీ సరుకు రవాణా అనుసంధానం సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఏంటీ ఆలోచన...: కొంతకాలంగా సరుకు రవాణాను మరింత పటిష్టం చేసే దిశలో దక్షిణ మధ్య రైల్వే పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఈమేరకు వివిధ సం స్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీతో కూడా ఒప్పందంపై యోచిస్తోంది. ప్రస్తుతం నిర్ధారిత స్టేషన్ల నుంచి సరుకు రవాణా అవుతోంది. ఆయా స్టేషన్ల వరకు సరుకును బుక్ చేసినవారే తెచ్చి రైల్వేకు అప్పగించాల్సి ఉంది. ఇది పెద్ద లోటుగా ఉంది. దీనిని ఆర్టీసీ భర్తీ చేసేందుకు ముందుకొచ్చింది. పార్శిల్స్ బుక్ చేసుకున్న వారి ఇళ్లు, వ్యాపారకేంద్రాల వద్దకు ఆర్టీసీ కార్గో సిబ్బంది వెళ్లి సరుకును సేకరిస్తారు. అందుకయ్యే ఖర్చును వసూలు చేస్తారు. సరుకును నిర్ధారిత రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి రైల్వే సిబ్బందికి అప్పగిస్తారు. దీనివల్ల సరుకు బుక్ చేసుకున్న వారికి దాన్ని స్టేషన్ వరకు తరలించే భారం తప్పుతుంది. ఆ బాధ్యతను తీసుకున్నందుకు ఆర్టీసీ తన వంతు చార్జీలు తీసుకుంటుంది. దీనివల్ల రైల్వేకు సరుకు రవాణా పార్శిళ్ల సంఖ్య పెరిగి వ్యాపారం వృద్ధి చెందుతుందని, ఆర్టీసీకి కూడా భారీ డిమాండ్ వస్తుందని అభిప్రాయపడ్డారు. -
రైల్వేలను ప్రైవేటీకరించే ఆలోచన లేదు
చెన్నై: జాతీయ రవాణా సాధనమైన రైల్వేలను ప్రైవేటీకరించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పునరుద్ఘాటించారు. భద్రత, సౌకర్యం విషయంలో ప్రయాణికుల ఆకాంక్షలను నెరవేర్చడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైల్వే రంగంలో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సాంకేతికత దేశీయంగా అభివృద్ధి చేసినదే కావాలన్నారు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్), వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రాజెక్టులను అశ్వినీ వైష్ణవ్ ప్రస్తావించారు. తమిళనాడులోని పెరంబుదూర్‌లో శనివారం నిర్వహించిన భారతీయ రైల్వే మజ్దూర్ సంఘ్(బీఆర్‌ఎంఎస్) 20వ అఖిలభారత సదస్సులో ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. రైల్వేలను ప్రైవేటీకరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు పదేపదే ఆరోపిస్తున్నాయని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చిచెప్పారు. అతిపెద్ద సంస్థ అయిన రైల్వేలను ప్రైవేట్‌కు అప్పగించే ఆలోచన, ప్రణాళిక ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిపై ఇప్పటికే స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు. రైల్వేల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రూపకల్పనలో ఐసీఎఫ్ కృషిని మంత్రి ప్రశంసించారు. రైల్వేశాఖలో నియామకాల్లో గత యూపీఏ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వం రైల్వే శాఖలో 3.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. మరో 1.40 లక్షల ఉద్యోగాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. -
ప్రైవేటు రైళ్లా ? మాకొద్దు బాబోయ్ !
న్యూఢిల్లీ: రైల్వే విభాగంలో ప్రైవేట్ సంస్థలను అనుమతించడం తదితర చర్యలతో రైల్వే అసెట్స్‌ను మానిటైజ్ చేయాలన్న ప్రతిపాదనకు ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా స్పందన రాలేదని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. మానిటైజేషన్ ప్రక్రియను సరిగ్గా రూపొందించకపోవడం ఇందుకు కారణం కావచ్చని .. ఈ నేపథ్యంలో సదరు ప్రణాళికలను రైల్వే శాఖ పునఃసమీక్షిస్తోందని ఆయన తెలిపారు. కచ్చితంగా రాబడులు వస్తాయంటేనే పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ ముందుకు వస్తుందని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అసెట్ మానిటైజేషన్ ప్రణాళికలో పేర్కొన్న రూ. 6 లక్షల కోట్ల అసెట్స్ నుంచి కచ్చితంగా ఆదాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కాంత్ వివరించారు. చదవండి: ఎల్ఐసీ ఐపీవో వాయిదా! -
విశాఖ–సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్ల కొనసాగింపు
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): గుంటూరు డివిజన్ మీదుగా విశాఖపట్నం–సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య నడిచే వారాంతపు ప్రత్యేక రైళ్లు మార్చి నెలలోనూ కొనసాగనున్నట్లు సీనియర్ డీసీఎం నరేంద్ర వర్మ తెలిపారు. ► విశాఖపట్నం–సికింద్రాబాద్ (08579) ప్రత్యేక రైలు మార్చి 2 నుంచి 30వ తేదీ వరకు ప్రతి బుధవారం రాత్రి 7.00 గంటలకు విశాఖపట్నం స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ► సికింద్రాబాద్–విశాఖపట్నం (08580) ప్రత్యేక రైలు మార్చి 3 నుంచి 31వ తేదీ వరకు ప్రతి గురువారం రాత్రి 7.40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. ► విశాఖపట్నం–సికింద్రాబాద్ (08585) ప్రత్యేక రైలు మార్చి 1 నుంచి 29వ తేదీ వరకు ప్రతి మంగళవారం రాత్రి 7.00 గంటలకు విశాఖ నుంచి బయలుదేరుతుంది. ► సికింద్రాబాద్–విశాఖపట్నం (08586) ప్రత్యేక రైలు మార్చి 2 నుంచి 30వ తేదీ వరకు ప్రతి బుధవారం రాత్రి 9.05 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. -
కేంద్ర ప్రభుత్వంపై బీజేపీ నేత అసంతృప్తి
ఢిల్లీ: బీజేపీ నేత వరుణ్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను తీవ్రంగా తప్పుబట్టారు. పలు సంస్థలను ప్రైవేటీకరణ చేస్తే.. వాటిల్లో ఉద్యోగం చేసేవారు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘బ్యాంకింగ్ రంగం, రైల్వేలను ప్రైవేటీకరణ చేస్తే.. సుమారు ఐదు లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఒక వ్యక్తి తన ఉపాధి కోల్పోయడంటే.. అతని కుటుంబంలోని మిగతా సభ్యులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది. వారి భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని పెంపొందిస్తాయి కానీ, ప్రజల్లో ఆర్థిక అసమానతలను పెంచవు. పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహించవు’ అని వరుణ్ గాంధీ ట్వీటర్లో పేర్కొన్నారు. గతంలో వరుణ్ గాంధీ వ్యవసాయ చట్టాలు, లఖిమ్‌పూర్ ఖేరీ ఘటనలపై కేంద్రాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. केवल बैंक और रेलवे का निजीकरण ही 5 लाख कर्मचारियों को ‘जबरन सेवानिवृत्त’ यानि बेरोजगार कर देगा। समाप्त होती हर नौकरी के साथ ही समाप्त हो जाती है लाखों परिवारों की उम्मीदें। सामाजिक स्तर पर आर्थिक असमानता पैदा कर एक ‘लोक कल्याणकारी सरकार’ पूंजीवाद को बढ़ावा कभी नहीं दे सकती। — Varun Gandhi (@varungandhi80) February 22, 2022 -
మనీశ్ పాండే విధ్వంసం.. బౌండరీలు, సిక్సర్లతో వీరవిహారం
Manish Pandey: రంజీ ట్రోఫీ 2022లో భాగంగా ఇవాళ రైల్వేస్‌తో మొదలైన మ్యాచ్‌లో కర్ణాటక కెప్టెన్ మనీశ్ పాండే విశ్వరూపం చూపించాడు. సుదీర్ఘ ఫార్మాట్లోనూ టీ20 తరహాలో విధ్వంసం సృష్టించాడు. బౌండరీలు, సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 121 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్లతో 156 పరుగులు సాధించాడు. మరో ఎండ్‌లో క్రిష్ణమూర్తి సిద్ధార్థ్ సైతం అజేయమైన శతకం (221 బంతుల్లో 121 బ్యాటింగ్; 17 ఫోర్లు, 2 సిక్సర్లు)తో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక జట్టు 5 వికెట్ల నష్టానికి 392 పరుగుల భారీ స్కోర్ చేసింది. కాగా, మనీశ్ పాండే ధనాధన్ ఇన్నింగ్స్ కర్ణాటక రంజీ జట్టు కంటే అతన్ని ఇటీవలే కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ జట్టుకే అధిక ఆనందాన్ని కలిగించింది. కేఎల్ రాహుల్ సారధ్యంలోని లక్నో జట్టు మెగా వేలంలో మనీష్ పాండేను 4.6 కోట్లకు కొనుగోలు చేసింది. మనీశ్‌పై ఎల్ఎస్జే భారీ అంచనాలు పెట్టుకుంది. ఇదిలా ఉంటే, మనీశ్ పాండే ప్రాతినిధ్యం వహిస్తున్న కర్ణాటక జట్టుకే ఆడుతున్న పంజాబ్ కింగ్స్ ఆటగాడు మయాంక్ అగర్వాల్ (16), రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్ (21) దారుణంగా నిరాశపరిచారు. వీరిద్దరు కర్ణాటక తరఫున ఓపెనర్లుగా బరిలోకి దిగి తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. పడిక్కల్‌కు ఆర్ఆర్ జట్టు 7.75 కోట్లకు వేలంలో కొనుగోలు చేయగా, మయాంక్‌ను పంజాబ్ జట్టు 12 కోట్లకు డ్రాఫ్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: సూపర్ సెంచరీతో ఫాంలోకి వచ్చిన రహానే -
వచ్చే మూడేళ్లలో పట్టాలెక్కనున్న 400 వందే భారత్ రైళ్లు
ఎన్డీఏ సర్కారు ఈ సారి కొత్త రైళ్లు ప్రవేశపెట్టడంపై దృష్టి సారించింది. మోదీ సర్కార్ కొలువుదీరిన తర్వాత కొత్త రైళ్లు స్టార్ చేయడం కంటే నూతన రైల్వేలైన్ల నిర్మాణం, డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులపై ఎక్కువగా ఫోకస్ చేశారు. గతానికి భిన్నంగా వందే భారత్ పేరుతో భారీగా రైళ్లు ప్రవేశపెట్టబోతున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇప్పటికే వరుసగా 75 వారాల పాటు 75 వందే భారత్ రైళ్లను నడిపిస్తామని పీఎం మోదీ ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా ఆర్థిక మంత్రి ప్రకటన వచ్చింది. కొత్తగా వచ్చే వందే భారత్ రైళ్లను పూర్తిగా లింకే హఫ్ మన్ బుష్ (ఎల్ఎఫ్బీ) కోచ్‌లతో రూపొందించబోతున్నారు. ప్రస్తుతం రాయ్‌బరేలీ, కపుర్తాల, చెన్నైలలో ఉన్న కోచ్ ఫ్యాక్టరీలలో ఎల్ఎఫ్బీ కోచ్‌లను తయారు చేస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ బోగీలకు సంబంధించిన టెస్ట్ జరుగనుందని మంత్రి అశ్వీనీ వైౌష్ణవ్ తెలిపారు. ఆగష్టు, సెప్టెంబరులో ఈ రైళ్లు పట్టాలెక్కే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే ఈ రైళ్లు ప్రీమియం కేటగిరిలో సేవలు అందించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని పలు నగరాల నంచి దేశరాజధానికి వందే భారత్ రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా వచ్చే రైళ్లలో తెలంగాణ, ఏపీకి వాటా దక్కనుంది. ఇక వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు రైల్వే నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తామని మంత్రి ప్రకటించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి ఇప్పటి వరకు ఎరువుల సరఫరాకే రైల్వే నెట్వర్క్ ఉపయోగపడుతోంది. కరోనా సంక్షోభం వచ్చాక రైళ్ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల రవాణా పెద్ద ఎత్తున చేపట్టారు. వీటి ఫలితాలు బాగుండటంతో ఈసారి చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే కార్గో సేవలు ప్రారంభిస్తామన్నారు. ఈ మేరకు పీఎం గతి శక్తి ద్వారా దేశవ్యాప్తంగా వంద కార్గో టెర్మినల్స్ నిర్మించబోతున్నారు. ఇతర కీలక అంశాలు - రైల్వే, పోస్టల్ శాఖల సమన్వయంతో పార్సిస్ సర్వీసుల బలోపేతం - ఆధునిక టెక్నాలజీ సీల్ 4 సాయంతో రైలు ప్రమాదాలు నివారించేందుకు ‘కవచ్’ కార్యక్రమం. 2022-23 చివరి నాటికి కవచ్ పరిధిలో 2,000 కి.మీ ట్రాక్. - రైల్వేలతో మాస్ అర్బన్ ట్రాన్సపోర్టేషన్ అనుసంధానం - లోకల్ బిజినెస్‌ని ప్రోత్సహించేందుకు సప్లై చెయిన్ బలోపేతానికి వన్ స్టేషన్ - వన్ ప్రొడక్ట్ పథకం - ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 1.37 లక్షల కోట్లు కేటాయింపు - రైల్వే స్టేషన్ల డెవలప్మెంట్ కోసం రూ. 12,000 కోట్ల కేటాయింపు -
పండగవేళ ప్రయాణికులకు షాక్! ఈ స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ ఛార్జీల పెంపు
సంక్రాంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. దీంతో భారీ ఎత్తున ప్రజలు ప్రయాణాలకు సిద్ధమయ్యారు. పండగ వేళ రద్దీ నియంత్రణ పేరుతో ప్రజల నెత్తిన పిడుగు వేసింది రైల్వేశాఖ. స్టేషన్లలోకి ప్రయాణికులతోపాటు వచ్చే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల రాకను నియంత్రించేందుకు ప్లాట్‌ఫారమ్ ధరలను భారీగా పెంచింది. నగర పరిధిలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 15 రైల్వే స్టేషన్లలో ఫ్లాట్‌ఫారమ్ టిక్కెట్టు ధరలను పెంచుతున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. నిత్యం లక్ష మందికి పైగా రాకపోకలు సాగించే సికింద్రాబాద్ స్టేషన్లో ప్రస్తుతం రూ.10 ఉన్న ఫ్లాట్‌ఫారమ్ టిక్కెట్టు ధరను రూ. 50 పెంచుతున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్, లింగంపల్లి, బేగంపేట స్టేషన్లలో ప్రస్తుతం రూ.10 ఉన్న టిక్కెట్టు ధరను రూ. 20 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ల పెంపు నుంచి నగర పరిధిలో కాచిగూడ స్టేషన్‌కు మినహాయింపు ఇచ్చారు. తెలంగాణలో ఇక తెలంగాణ వ్యాప్తంగా వరంగల్, కాజీపేట, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాచలంరోడ్డు, మంచిర్యాల, రామగుండం, పర్లీ వైద్యనాథ్, తాండూరు, వికారాబాద్‌లతో పాటు కర్నాటకలోని బీదర్ రైల్వే స్టేషన్లలో కూడా రూ.10గా ఉన్న ఫ్లాట్‌ఫారమ్ టిక్కెట్టు ధర రూ.20కి పెరిగింది. పెరిగిన ఫ్లాట్‌ఫారమ్ టిక్కెట్టు ధరలు 2022 జనవరి 10 నుంచి 20 వరకు అమల్లో ఉంటాయి. ఏపీపై స్పష్టత లేదు దక్షిణ మధ్యరైల్వే పరిధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడులో విస్తరించి ఉండగా ఇందులో తెలుగు రాష్ట్రాలే కీలకం. అయితే ఫ్లాట్‌ఫారమ్ టిక్కెట్ ధరల పెంపుకు సంబంధించి ఏపీ, మహరాష్ట్ర పరిధిలోకి వచ్చే ప్రధాన రైల్వే స్టేషన్ల వివరాలను రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించలేదు. తెలంగాణతో పాటు కర్నాటకలోని బీదర్‌కి సంబంధించిన వివరాలే వెల్లడించింది. చదవండి: రైల్వే ప్రయాణికులకు షాక్.. భారీగా బాదుడు! -
RED RAIL: టిక్కెట్ల బుకింగ్ ఇప్పుడు ఇంకా ఈజీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్లో బస్ టికెట్లను విక్రయిస్తున్న రెడ్‌బస్ తాజాగా రెడ్రైల్పేరుతో రైల్వే టికెట్ల బుకింగ్ విభాగంలోకి ప్రవేశించింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) భాగస్వామ్యంతో ఈ సేవల్లోకి అడుగుపెట్టింది. ప్రతిరోజూ 90 లక్షల పైచిలుకు రైల్వే సీట్లు రెడ్‌బస్ యాప్‌లోనూ బుకింగ్‌కు అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. -
4 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు భారంగా రైల్వేశాఖ నిర్ణయం!
అవసాన దశలో ఇతరులపై ఆధారపడి జీవించే వారికి శాపంగా మారింది రైల్వేశాఖ నిర్ణయం. అరకొర ఆదాయంతోనే పొదుపు చేసుకున్న సొమ్ముతోనో ప్రయాణం చేసే సీనియర్ సిటిజన్స్‌కి రైల్వేశాఖ నిర్లక్ష్య వైఖరి భారంగా మారింది. కరోనా సంక్షోభం సమయంలో ఎత్తి వేసిన రాయితీలు నేటికి పునరుద్ధరించకపోవడంతో తమకు ఇబ్బందిగా మారిందంటున్నారు సీనియర్ సిటిజన్లు. రాయితీలకు కోత సామాజిక బాధ్యతగా రైల్వేశాఖ సమాజంలోని సీనియర్ సిటిజన్లు, ఉద్యోగార్థులు, రోగులు, జర్నలిస్టులు, ఆర్మీ తదితర వర్గాలకు రైలు ప్రయాణం సందర్భంగా రాయితీలు కల్పిస్తోంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు సంబంధించి 58 ఏళ్లు దాటిన స్త్రీలకు 50 శాతం 60 ఏళ్లు దాటిన పురుషులకు 40 శాతం రాయితీ ఉంది. అయితే కరోనా కారణంగా దేశవ్యాప్తంగా రైళ్ల సర్వీసులను 2020 మార్చి 24 నుంచి రద్దు చేశారు. ఆ తర్వాత మూడు నెలల తర్వాత రైళ్లు క్రమంగా ప్రారంభం అయ్యాయి. అయితే రాయితీ మాత్రం పునరుద్ధరించలేదు. అధిక ఛార్జీలు రైలు సర్వీసులు ప్రారంభమైనా రాయితీల విషయంలో రైల్వేశాఖ మౌనముద్ర వహించింది. దీంతో గత ఏడాది కాలంగా అన్ని రైళ్లలో ప్రయాణిస్తున్న సీనియర్ సిటిజన్లు టిక్కెట్టు ఛార్జీలు పూర్తిగా చెల్లించాల్సి వస్తోంది. పైగా ప్రస్తుతం నడుస్తున్నవి ప్రత్యేక రైళ్లు కావడంతో అన్నింటా అధికంగానే సొమ్ములు చెల్లించాల్సి వస్తోంది. ఆదాయం తగ్గిపోయి, అనారోగ్యాలకు చేరువైన సీనియర్ సిటిజన్లకు రైలు ప్రయాణాలు భారంగా మారాయి. ముఖ్యంగా హెల్త్ చెకప్‌ల కోసం క్రమం తప్పకుండా ప్రయాణాలు చేసే వారు మరీ ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు కోట్ల మంది లాక్డౌన్ తర్వాత స్పెషల్ ట్యాగ్‌తో రైల్వే సర్వీసులు ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు ఎంత మంది సీనియర్ సిటిజన్లు రైళ్లలో ప్రయాణించారనే వివరాలు కావాలంటూ మధ్యప్రదేశ్‌కి చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే ఆర్టీఐ కార్యకర్త దరఖాస్తు సమర్పించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. 2021 సెప్టెంబరు 31 నాటికే దేశవ్యాప్తంగా రిజర్వ్డ్ రైళ్లలోనే 3,78,50,668 మంది ప్రయాణం చేసినట్టు రైల్వే రికార్డులు వెల్లడించాయి. ఈ రోజు వరకయితే ఈ సంఖ్య నాలుగు కోట్లకు తక్కువగా ఉండదు. మంత్రి కేటీఆర్ ట్వీట్ ఆర్టీఐ ద్వారా సమాచారం వెల్లడి కావడంతో ఒక్కసారిగా రైల్వేశాఖపై విమర్శలు పెరిగాయి. కరోనా వంటి సంక్షోభం సమయంలో ఓ వైపు ఆదాయం తగ్గిపోయి అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే రాయితీలకు కోత పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ సమాజానికి సర్వం ధారపోసిన వృద్ధుల పట్ల నిర్థయగా వ్యవహరించడం సరికాదంటూ సుతిమొత్తగా హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సైతం రైల్వేశాఖ తీరును తప్పు పట్టారు. రాయితీలు పునరుద్ధరించాలంటూ రైల్వేమంత్రికి విజ్ఞప్తి చేశారు. VerY unfortunate situation Railway Minister @AshwiniVaishnaw Ji Please review the decision in the interest of crores of senior citizens who deserve our assistance and respect https://t.co/cNvbyHx0oH — KTR (@KTRTRS) November 23, 2021 చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. -
ఐఆర్సీటీసీ ఫీజులో వాటాలపై వెనక్కి తగ్గిన రైల్వేస్..
ఐఆర్సీటీసీ వెబ్సైట్లో బుకింగ్స్ ద్వారా వసూలయ్యే కన్వీనియెన్స్ ఫీజు ఆదాయంలో వాటాలు తీసుకునే విషయంలో రైల్వేస్ బోర్డ్ వెనక్కి తగ్గింది. ఐఆర్సీటీసీ ప్రయోజనాలు, మార్కెట్ సెంటిమెంట్‌ను గౌరవిస్తూ ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నవంబర్ 1 నుంచి కన్వీనియెన్స్ ఫీజులో 50 శాతం వాటాను రైల్వే బోర్డుతో పంచుకోనున్నట్లు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) గురువారం స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిస్పందనగా శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో ఐఆర్సీటీసీ షేరు ధర 25 శాతం పతనమై రూ. 685 స్థాయికి క్షీణించింది. అయితే, రైల్వే బోర్డు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిసిన తర్వాత మళ్లీ కొంత కోలుకుంది. చివరికి బీఎస్ఈలో సుమారు 7 శాతం క్షీణతతో రూ. 846 వద్ద క్లోజయ్యింది. అయితే, షేర్ల విభజన అమల్లోకి వచ్చిన వెంటనే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేసింది. కనిష్ట స్థాయిల్లో విక్రయించుకున్న వారు నష్టాలు మూటగట్టుకోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. రైలు టికెట్ చార్జీలో కన్వీనియెన్స్ ఫీజు భాగంగా ఉండదు. వెబ్ ద్వారా టికెట్ బుకింగ్ సర్వీసును అందించినందుకు ఐఆర్సీటీసీ ఈ ఫీజును వసూలు చేస్తుంది. సాధారణంగా ప్రయాణికుల నుంచి వసూలు చేసే కన్వీనియెన్స్ ఫీజు ద్వారా ఐఆర్సీటీసీ, రైల్వేస్‌కు గణనీయంగా ఆదాయం లభిస్తుంది. 2014–15లో రెండు సంస్థల మధ్య 20–80 శాతం నిష్పత్తిలో వాటాలు ఉండేవి. అప్పట్లో ఐఆర్సీటీసీకి రూ. 253 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత సంవత్సరంలో 50–50 నిష్పత్తికి సవరించినప్పుడు రూ. 552 కోట్లు వచ్చింది. కానీ 2016–17 తర్వాత కన్వీనియెన్స్ ఫీజును తొలగించారు. అయితే, 2019–20లో తిరిగి విధించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కరోనా వైరస్ పరిణామాల కారణంగా ఐఆర్సీటీసీ ఆదాయాలు మెరుగుపర్చేందుకు రైల్వేస్ తన వాటాను వదులుకుంది. దీంతో 2020–21లో ఐఆర్సీటీసీకి రూ. 299 కోట్లు, ఈ ఏడాది ఇప్పటిదాకా రూ. 224 కోట్లు కన్వీనియెన్స్ ఫీజు ఆదాయం వచ్చింది. -
ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ షాక్
-
సరుకు రవాణా మరింత పెరగాలి
సాక్షి, హైదరాబాద్: రైల్వేలో టికెట్‌యేతర ఆదాయాన్ని భారీగా పెంచుకునేందుకు ప్రత్యేక చొరవ చూపాలని రైల్వే సహాయమంత్రి రావు సాహెబ్ పాటిల్ దాన్వే ఆదేశించారు. సరుకు రవాణాను మరింత పెంచేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం ఆయన రైల్‌నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరుకు రవాణా చేసే సంస్థలతో లాజిస్టిక్స్ కంపెనీలతో మెరుగైన అనుసంధానం ఉండేలా అధికారులు చొరవ చూపాలన్నారు. సరుకు రవాణా విషయంలో దక్షిణ మధ్య రైల్వే ముందు వరుసలో ఉండాల్సి ఉందని, ఇందుకు సరుకు రవాణా మరింత పటిష్టం కావాల్సిన అవసరముందని చెప్పారు. అలాగే ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించే విషయంలో లక్ష్యాలను సకాలంలో సాధించాలన్నారు. సీసీటీవీ నెట్వర్క్, భద్రత, కిసాన్ రైళ్లు, దూద్ దురంతో అంశాలను కూలంకషంగా చర్చించారు. కరోనా సమయంలో రైల్వే ఆస్పత్రి అందించిన సేవలను పాటిల్ ప్రశంసించారు. -
‘వ్యాగన్’కు మ్యుటేషన్ బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఇప్పటివరకు భూమి అందలేదు. రైల్వే పేరిట భూమిని మ్యుటేషన్ చేసి ఇస్తేనే మేం పని ప్రారంభింస్తాం. అప్పటివరకు మాకు భూమి అందనట్టే లెక్క’–దక్షిణ మధ్య రైల్వే ‘కోర్టు పరిధిలో ఉన్న కేసు కొలిక్కి రావటంతో జనవరిలోనే రైల్వేకు భూమిని అప్పగించాం. దాన్ని రైల్వే పేరిట మ్యుటేషన్ కోసం తహసీల్దారుకు ఇచ్చిన లేఖను రైల్వేకు అప్పగించాం. కానీ, రైల్వే యంత్రాంగమే పని ప్రారంభించటం లేదు’ –తెలంగాణ రెవెన్యూ యంత్రాంగం ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు 13 ఏళ్లుగా ఓ రైల్వే ప్రాజెక్టు కోసం తెలంగాణ ఎదురుచూస్తోంది. అయితే ఆ ప్రాజెక్టుకు కేటాయించిన భూమి విషయమై వేసిన కేసు కోర్టులో నలిగి ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఆ తర్వాత భూమి మ్యుటేషన్ అంశం అడ్డంకిగా మారింది. ఇదీ సంగతి... మమతాబెనర్జీ రైల్వేశాఖ మంత్రిగా ఉన్న సమయంలో కాజీపేటకు వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీ మంజూరైంది. కాజీపేటకు సమీపంలోని మడికొండ సీతారామస్వామి దేవాలయానికి చెందిన 150 ఎకరాల భూమిని దీనికి కేటాయించారు. తర్వాత ఈ భూమి కేటాయింపుపై కోర్టులో కేసు నమోదైంది. ఇంతలో ఆ ప్రాజెక్టు రద్దవడంతో దానిస్థానంలో వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్‌షాపును 2016లో రైల్వే శాఖ మంజూరు చేసింది. రూ.383.05 కోట్ల అంచనాతో మంజూరైన ఈ ప్రాజెక్టుకు తొలుత రైల్వే బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించినా, భూవివాదం కారణంగా ఆ నిధులు విడుదల కాలేదు. ఎట్టకేలకు కోర్టు కేసు కొలిక్కి రావటంతో గత జనవరిలో 150 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు రైల్వేకు అప్పగించారు. అయితే, ఆ భూమిని రైల్వే పిరియాడికల్ వ్యాగన్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపు పేరుతో మ్యుటేషన్ చేయాలని, అలా భూమి తమ పేరుతో మారితేనే పనులు చేపట్టేందుకు తమ విధానాలు అంగీకరిస్తాయని రైల్వే అధికారులు తేల్చి చెప్పారు. దీంతోపాటు మరో 11 ఎకరాల భూమి కూడా కావాలని కోరగా, రెవెన్యూ అధికారులు పదెకరాలను కేటాయించారు. అయితే, మొత్తం భూమికి సంబంధించిన కాగితాలు ఇవ్వటంతోనే అప్పగింత ప్రక్రియ పూర్తయినట్టు రెవెన్యూ అధికారులు చెబుతుండగా, మ్యుటేషన్ జరగకపోవటం, ధరణి పోర్టల్ రైల్వే పేరు నమోదు కాకపోవటంతో పనులు ప్రారంభించలేమని రైల్వే అధికారులు మిన్నకుండిపోయారు. 1,500 కుటుంబాలకు ఉపాధి 1980లలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కృషితో కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరైంది. సరిగ్గా పనులు మొదలుపెట్టే తరుణంలో ఇందిరాగాంధీ హత్య, సిక్కుల ఊచకోత వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో పెరిగిన ఆగ్రహాన్ని చల్లార్చడానికిగాను ఆ రాష్ట్రంలోని కపుర్తలాకు ఈ కోచ్‌ఫ్యాక్టరీని బదలాయించారు. తర్వాత రాష్ట్రవిభజన సమయంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఏర్పడ్డ కమిటీ అది సాధ్యం కాదని తేల్చింది. ఈ క్రమంలో వర్క్‌షాపు మంజూరైంది. నెలకు వంద గూడ్సు వ్యాగన్లను ఓవర్‌హాలింగ్ చేయటం దీని పని. ఇందులో ప్రత్యక్షంగా 500 మంది, పరోక్షంగా మరో వేయి మందికి ఉపాధి దక్కుతుందని అంచనా ఉంది. -
National Open Athletics: పారుల్ డబుల్ ధమాకా
సాక్షి, వరంగల్ స్పోర్ట్స్: రైల్వేస్ అథ్లెట్ పారుల్ చౌదరి(Parul Chaudhary) డబుల్ ధమాకా సాధించింది. జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆమె రెండో స్వర్ణం సాధించింది. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో ఆమె తాజాగా మహిళల 3000 మీ. స్టీపుల్‌చేజ్‌లోనూ విజేతగా నిలిచింది. పోటీల ప్రారంభ రోజే పారుల్ 5000 మీటర్ల పరుగులో కూడా బంగారు పతకం సాధించింది. శుక్రవారం జరిగిన మూడు వేల మీటర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్లో పారుల్ చౌదరికి మహారాష్ట్ర అథ్లెట్ కోమల్ చంద్రకాంత్ జగ్దలే గట్టిపోటీ ఇచి్చంది. చివరకు 0.02 సెకన్ల అతి స్వల్ప తేడాతో పారుల్ (9ని.51.01 సె) పసిడి పతకం పట్టేసింది. కోమల్ 9 ని.51.03సెకన్ల టైమింగ్‌తో రజతంతో సరిపెట్టుకొంది. ఈ ఈవెంట్లో ప్రీతి (రైల్వేస్; 10 ని.22.45 సె.) కాంస్యం గెలిచింది. పోటీల మూడో రోజు కూడా రైల్వేస్ అథ్లెట్ల హవానే కొనసాగింది. ఐదు ఈవెంట్లలో రైల్వేస్ అథ్లెట్లు బంగారు పతకాలు సాధించారు. పురుషుల హైజంప్‌లో సందేశ్, షాట్‌పుట్‌లో కరణ్వీర్ సింగ్, మహిళల లాంగ్‌జంప్‌లో ఐశ్వర్య, హర్డిల్స్‌లో కనిమొని బంగారు పతకాలు సాధించారు. నిరాశ పరిచిన నందిని... తెలంగాణ అమ్మాయి అగసర నందిని 100 మీటర్ల హర్డిల్స్‌లో నిరాశపరిచింది. ఇటీవల నైరోబి (కెన్యా)లో జరిగిన ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో సెమీస్ చేరిన నందిని... ఆశ్చర్యకరంగా జాతీయ ఓపెన్ పోటీల్లో విఫలమైంది. శుక్రవారం జరిగిన మహిళల వంద మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో ఆమె 14.30 సెకన్ల టైమింగ్‌తో ఆరో స్థానంలో నిలిచింది. ఇందులో కనిమొని (రైల్వేస్; 13.54 సె.) విజేతగా నిలువగా, అపర్ణ రాయ్ (కేరళ; 13.58 సె.), కె.నందిని (తమిళనాడు; 13.90 సె) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు. మిక్స్డ్ 4్ఠ400 మీ.రిలేలో తెలంగాణ బృందం అసలు పరుగునే పూర్తి చేయలేకపోయింది. -
మహారాష్ట్రకు ‘కోచ్’.. తెలంగాణకు తూచ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కొత్త రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కేటాయింపు అంశాన్ని పరిశీలిస్తామంటూనే రిక్తహస్తం చూపిన రైల్వేశాఖ, అదే సమయంలో మహారాష్ట్రకు దానిని కేటాయించి వేగంగా పూర్తిచేస్తోంది. తెలంగాణ ఎదురుచూస్తున్న కోచ్ ఫ్యాక్టరీపై ఆశలను ఆవిరి చేస్తూ, మహారాష్ట్రలోని లాతూరుకు దానిని కేటాయించి దాదాపు పూర్తి చేసింది. ఈ ఏడాది డిసెంబర్లో ఉత్పత్తి ప్రారంభించే దశకు చేర్చేపనిలో నిమగ్నమైంది. తాజాగా సమాచార హక్కు చట్టం కింద సామాజిక కార్యకర్త రవికుమార్ వివరాలు అడుగగా రైల్వే శాఖ పలు విషయాలు వెల్లడించింది. ఇదీ సంగతి.. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తానని కేంద్రం ఇదివరకు పేర్కొంది. ఈ మేరకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. విభజన చట్టంలో దీన్ని పొందుపరచటంతో కోచ్ ఫ్యాక్టరీ వస్తుందేమోనని యావత్తు రాష్ట్రం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూసింది. కానీ, దేశవ్యాప్తంగా ప్రస్తుత రైల్వే అవసరాలను ఇప్పటికే ఉన్న కోచ్ ఫ్యాక్టరీలే తీరుస్తున్నాయని, భవిష్యత్తు అవసరాలకు కూడా అవి సరిపోతాయని ఏడాదిన్నర క్రితం రైల్వే శాఖ తేల్చి చెప్పింది. అప్పట్లోనే సమాచార హక్కు చట్టం రూపంలో రైల్వే శాఖ ఆలోచన లిఖితపూర్వకంగా స్పష్టమైంది. కానీ, కొత్త రైల్వే కోచ్ ఫ్యాక్టరీల అవసరమే లేదన్న రైల్వే శాఖ, 2018 ఏప్రిల్‌లో మహారాష్ట్రలోని లాతూరులో దాని ఏర్పాటు అంశాన్ని ప్రతిపాదించింది. కేవలం ఐదు నెలల్లోనే రూ.625 కోట్లతో మంజూరు చేసింది. ఆ వెంటనే పనులు ప్రారంభించి, ఇప్పటికే రూ.587 కోట్లు ఖర్చు చేసింది. ఈఏడాది చివరి నాటికి దానిని పూర్తి చేయనున్నట్టు తాజాగా స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుల మంజూరు, తిరస్కరణలన్నీ రాజకీయ కారణాల ఆధారంగానే జరుగుతున్నాయని రవికుమార్ ఆరోపించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టును కూడా తెలంగాణ నేతలు సాధించలేకపోయారని ఆయన విచారం వ్యక్తం చేశారు. -
కరోనా: ప్రయాణికులు లేకపోవడంతో 10 రైళ్లు రద్దు
సాక్షి, విజయవాడ: ప్రయాణికుల సంఖ్య తగినంతగా లేకపోవడంతో 10 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ నెల 28 నుంచి మే 31 వరకు ఐదు రైళ్లను రద్దు చేసింది. నర్సాపూర్–నిడదవోలు(07241), నిడదవోలు–నర్సాపుర్ (07242), సికింద్రాబాద్–బీదర్(07010), బీదర్–హైదరాబాద్ (07009), సికింద్రాబాద్–కర్నూలు సిటీ (07027)లు రద్దయ్యాయి. కర్నూలు సిటీ–సికింద్రాబాద్(07028)ఈ నెల 29 నుంచి జూన్ 1 వరకు రద్దు చేశారు. మైసూర్–రేణిగుంట(01065)రైలును ఈ నెల 30 నుంచి వచ్చే నెల 28వరకు రద్దు చేశారు. రేణిగుంట–మైసూర్(01066) రైలును మే 1 నుంచి 29 వరకు రద్దు చేయగా, సికింద్రాబాద్–ముంబాయి ఎల్టీటీ(02235) రైలును ఈ నెల 30 నుంచి వచ్చే నెల 28 వరకు, ముంబాయి ఎల్టీటీ–సికింద్రాబాద్(02236) రైలును మే 1 నుంచి మే 29 వరకు రద్దు చేశారు. చదవండి: ఏపీ: వాహన విక్రయాల్లో జోష్ విదేశీ ఎగుమతుల్లో ఏపీ రికార్డు -
సీఎంలతో సమావేశం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా బాధితులకు అవసరమైన ప్రాణవాయువు (ఆక్సిజన్) రవాణాలో వేగం పెంచామని, ఇందులో భాగంగా వైమానిక దళం, రైల్వే శాఖ సేవలను ఉపయోగించుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు ఉన్న 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆక్సిజన్ కొరతపై ముఖ్యమంత్రుల విజ్ఞప్తులను మోదీ ఆలకించారు. మనమంతా ఒక్కతాటిపైకి వచ్చి కలిసి పని చేస్తే వనరుల కొరత అనే మాటే ఉండదని తేల్చిచెప్పారు. పారిశ్రామిక ఆక్సిజన్‌ను కూడా తక్షణ అవసరాలకు అనుగుణంగా మెడికల్ ఆక్సిజన్‌గా మార్చి, ఆసుపత్రులకు పంపిస్తున్నట్లు గుర్తుచేశారు. అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్ అవసరాలను తీర్చడానికి రాష్ట్రాలు కలిసి పనిచేయాలని, సమన్వయం చేసుకోవాలని ప్రధాని కోరారు. ఆక్సిజన్, అత్యవసర ఔషధాల అక్రమ నిల్వ, బ్లాక్ మార్కెటింగ్‌పై నిఘా పెట్టాలని రాష్ట్రాలకు సూచించారు. ఆక్సిజన్ ట్యాంకర్లు ఎక్కడా ఆగిపోకుండా పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్రాల్లో ఆక్సిజన్ సరఫరా తీరును పరిశీలించేందుకు ఉన్నత స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఆక్సిజన్ ట్యాంకర్ల ప్రయాణ సమయాన్ని, ఖాళీ ట్యాంకర్లు వెనక్కి వచ్చే సమయాన్ని తగ్గించడానికి అన్ని అవకాశాలను పరిశీలించి, అమలు చేస్తున్నామన్నారు. ఏమీ చేయలేకపోతున్నా: కేజ్రీవాల్ ఢిల్లీలో కొనసాగుతున్న కరోనా కల్లోలాన్ని సీఎం కేజ్రీవాల్ ప్రధానికి నివేదించారు. ‘‘పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రజలను వారి చావుకు వారిని వదిలేయలేం. ఢిల్లీ ప్రజల తరపున చేతులు జోడించి ప్రార్థిస్తున్నా. వెంటనే తగిన చర్యలు తీసుకోని పక్షంలో పరిస్థితి మరింత విషమిస్తుంది. కొన్ని రాష్ట్రాల నుంచి ఢిల్లీకి ఆక్సిజన్ రావాల్సి ఉండగా.. ఆ ట్యాంకర్లను ఇతర రాష్ట్రాల్లో ఆపేస్తున్నారు. ఆయా రాష్ట్రాల సీఎంలకు ఒక్క ఫోన్ చేయండి.ఆ వాహనాలను ఆపొద్దని చెప్పండి. ముఖ్యమంత్రి అయి ఉండీ ఏం చేయలేకపోతున్నా. కరోనా నుంచి దేశాన్ని కాపాడేందుకు ఒక జాతీయ ప్రణాళిక ఉండాలి. ఈ ప్రణాళికలో అన్ని ఆక్సిజన్ ప్లాంట్లను ఆర్మీ రక్షణలో ఉంచాలి’’ అని కోరారు. అయితే, ఈ సమావేశానికి సంబంధించి కేజ్రీవాల్ ప్రసంగాన్ని ఢిల్లీ ప్రభుత్వం మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తప్పుపట్టాయి. గతంలో కూడా సమావేశాలు ప్రసారమయ్యాయని ఢిల్లీ ప్రభుత్వం గుర్తుచేసింది. ఒకవేళ ఇబ్బంది కలిగించి ఉంటే అందుకు విచారం వ్యక్తంచేస్తున్నామని పేర్కొంది. పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆక్సిజన్ అవసరం చాలా ఉందని ప్రధాని మోదీ చెప్పారు. డిమాండ్‌ను తీర్చడానికి పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేయాలని ఆక్సిజన్ ఉత్పత్తిదారులకు విజ్ఞప్తి చేశారు. ఆయన శుక్రవారం దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆక్సిజన్ ఉత్పత్తిదారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. సవాళ్లతో కూడిన ఈ సమయంలో తగిన పరిష్కార మార్గాలను సూచించాలని కోరారు. ప్రభుత్వం, ఆక్సిజన్ ఉత్పత్తిదారుల మధ్య సమన్వయాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో వైద్య అవసరాలను తీర్చడానికి పారిశ్రామిక ఆక్సిజన్‌ను మళ్లించడం గొప్ప పని అని కొనియాడారు. ఆక్సిజన్ సరఫరా కోసం ఇతర వాయువులను రవాణా చేయడానికి ఉద్దేశించిన ట్యాంకర్లను ఉపయోగించుకోవాలన్నారు. ఆక్సిజన్ చేరవేతకు రైల్వేలు, వైమానిక దళం సేవలను ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని గుర్తుచేశారు. ప్రభుత్వం, రాష్ట్రాలు, పరిశ్రమలు, రవాణాదారులు, అన్ని ఆస్పత్రులు ఏకతాటి పైకి వచ్చి కలిసి పని చేయాలన్నారు. -
రైల్వే సదుపాయాలను ప్రైవేటీకరించేది లేదు
న్యూఢిల్లీ: రైల్వే మౌలిక సదుపాయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వృద్ధి కోసం ఆస్తుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించి నిధులు రాబట్టుకునే (మానిటైజేషన్) ప్రణాళికలతో ఉన్నట్టు రైల్వే మంత్రీ పీయూష్ గోయల్ రాజ్యసభకు శుక్రవారం తెలియజేశారు. ప్రయాణికుల రైళ్ల కార్యకలాపాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిన చేపట్టనున్నామని.. తద్వారా రూ.30,000 కోట్ల ప్రైవేటు పెట్టుబడులను తీసుకురానున్నట్టు తెలిపారు. ఈస్టర్న్, వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లను ప్రారంభించిన తర్వాత మానిటైజేషన్ ప్రణాళికతో రైల్వే శాఖ ఉన్నట్టు చెప్పారు. అలాగే, పీపీపీ నమూనాలో స్టేషన్ల అభివృద్ధి, ప్రయాణికుల రైళ్లు, రైల్వే భూములు, బహుళ వినియోగ భవనాలు, రైల్వే కాలనీలు, రైల్వే స్టేడియమ్‌ల రూపంలో నిధులు రాబట్టుకోనున్నట్టు వివరించారు. ఆస్తుల నగదీకరణ వల్ల రైల్వేల అభివృద్ధికి కావాల్సిన నిధు లు సమకూరతాయన్నారు. సభ్యుల నుంచి వచ్చిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రైవేటీకరణ/మానిటైజేషన్ వేర్వేరు కాంగ్రెస్ సభ్యుడు జైరామ్‌రమేశ్ వేసిన ప్రశ్నకు స్పందిస్తూ.. ప్రైవేటీకరణ, ఆస్తుల నగదీకరణ మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ‘‘ప్రైవేటీకరణ చేయడం అంటే ఆస్తులను శాశ్వతంగా ప్రైవేటు సంస్థలకు అప్పగించేయడం. అందులో ఇక ఏ మాత్రం ప్రభుత్వ యాజమాన్యం ఉండదు. కానీ, రైల్వే అమలు చేయనున్న ప్రణాళిక ఏమిటంటే.. ఆస్తులను ఉపయోగించి నిధులను సమకూర్చుకోవడం (మానిటైజేషన్) ఎలాగన్నదే. ఇలా సమకూర్చుకునే నిధులు తిరిగి పెట్టుబడులు పెట్టి, వృద్ధి చెందేందుకే. రైల్వే మౌలిక ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేవేటీకరించము’’ అని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్లు (డీఎఫ్సీ) ప్రత్యేక కార్పొరేట్ విభాగాలని.. రైల్వే మద్దతు వాటికి ఉంటుందన్నారు. డీఎఫ్సీ వేసే ట్రాక్‌లకు రైల్వే యజమానిగా లేదన్నారు. పెట్టుబడి ఆధారిత వృద్ధికి రైల్వే కీలకమైనదిగా మంత్రి పేర్కొన్నారు. ‘‘ఒక్క రోడ్డును నిర్మిస్తే ప్రతీ ఒక్కరూ దానిని వినియోగించుకుంటారు. అలాగే, ఒక నూతన రైల్వే ట్రాక్‌ను నిర్మించి వాటి నిర్వహణకు ప్రైవేటు సంస్థలను ఆహ్వానించి ప్రోత్సహిస్తే.. అది కొత్త ఉపాధి అవకాశాలను తీసుకొస్తుందే కానీ, ఉన్న ఉద్యోగాలకు నష్టం చేయదు’’ అని మంత్రి చెప్పారు. -
పట్టాలెక్కనున్న మరిన్ని స్పెషల్ రైళ్లు
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరిన్ని స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె.త్రిపాఠీ ఒక ప్రకటనలో తెలిపారు. ►డిబ్రూఘడ్–కన్యాకుమారి(05906) వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 27 నుంచి ప్రారంభమై ప్రతి శనివారం రాత్రి 7.25 గంటలకు డిబ్రూఘడ్లో బయలుదేరి మూడో రోజు ►(సోమవారం) మధ్యాహ్నం 3.35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక్కడ నుంచి 3.55 గంటలకు బయలుదేరి మంగళవారం రాత్రి 10 గంటలకు కన్యాకుమారి చేరుకుంటుంది. ►ఈ స్పెషల్ ఎక్స్‌ప్రెస్(05905) తిరుగు ప్రయాణంలో కన్యాకుమారిలో మార్చి 4 నుంచి ప్రారంభమై ప్రతి గురువారం సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి, మరసటి రోజు రాత్రి 11.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక్కడ నుంచి అర్ధరాత్రి 12.10 గంటలకు బయలుదేరి ప్రతి ఆదివారం రాత్రి 8.50 గంటలకు డిబ్రూఘడ్ చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైల్ 1–సెకండ్ ఏసీ, 4–థర్డ్ ఏసీ, 11–స్లీపర్ క్లాస్, 3–సెకండ్ క్లాస్, 1 పాంట్రీకార్, 2–జనరేటర్ మోటార్ కార్స్ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడుస్తుంది. చదవండి: కుమార్తెను ప్రభుత్వ బడిలో చేర్పించిన తహసీల్దార్ పనులన్నీ మానేసి.. గ్రామస్తులంతా కదిలొచ్చి -
ఏపీలో ‘స్మార్ట్’గా రైల్వే సేవలు
సాక్షి, అమరావతి: రైలు టెర్మినళ్ల వద్ద వ్యాపారాన్ని ప్రారంభించేందుకు రైల్వే శాఖ కొత్త పథకాన్ని తీసుకురానుంది. ఇందుకు గూడ్స్ షెడ్లను ఎంచుకుని అక్కడే వ్యాపారం ఆరంభించేందుకు ‘సర్వీస్ మార్కెట్ ఎట్ రైల్ టెర్మినల్స్’ (స్మార్ట్) అనే పథకం ప్రారంభించనుంది. రైలు టెర్మినళ్ల వద్ద సర్వీస్ మార్కెట్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులను ఆహ్వానించనుంది. అంటే గూడ్స్ షెడ్ల వద్ద సరుకును నేరుగా వినియోగదారులకు అందించేందుకు సర్వీస్ ప్రొవైడర్లకు అవకాశం కల్పిస్తోంది. ఏపీలో ఈస్ట్‌కోస్ట్ రైల్వే పరిధిలోని వాల్తేరు డివిజన్ ఐదు చోట్ల గూడ్స్ షెడ్ల నిర్మాణం చేపట్టనుంది. ఉత్తరాంధ్రలోని కంటకపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, బొబ్బిలి, విశాఖపట్నంలలో గూడ్స్ షెడ్ల నిర్మాణాలు జరగనున్నాయి. సర్వీస్ ప్రొవైడర్లకు, వినియోగదారులకు మేలు స్మార్ట్ పథకం ద్వారా సర్వీస్ మార్కెట్ చేయాలనుకునే సర్వీస్ ప్రొవైడర్లు తమ సరుకు రైల్ ట్రాన్స్‌పోర్టు ద్వారా గూడ్స్ షెడ్లకు చేరుస్తారు. అక్కడి నుంచి నేరుగా వినియోగదారులకు మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రోడ్డు రవాణా కంటే రైల్ ట్రాన్స్‌పోర్టు ధరలు చౌకగా మారాయి. చౌకగా వినియోగదారులకు సరుకును అందించే అవకాశం ఉంటుంది. సర్వీస్ ప్రొవైడర్లు గూడ్స్ షెడ్ల ద్వారా మార్కెట్ చేయాలనుకుంటే తమ సంస్థ పేరును కానీ, వ్యక్తిగతంగా వివరాల్ని ఫ్రైట్ ఆపరేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఎఫ్‌వోఐఎస్) ద్వారా నమోదు చేసుకోవాలి. వినియోగదారుడు ఎవరైనా నేరుగా సర్వీస్ ప్రొవైడర్‌ను స్మార్ట్ పథకం ద్వారా సంప్రదించవచ్చు. ట్రక్కులు, లాజిస్టిక్స్ వ్యాపారులు, రైలు రవాణాను ఉపయోగించే వినియోగదారులకు ప్రయోజకనకరంగా ఉంటుంది. ఇప్పటికే బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్లు దక్షిణ మధ్య రైల్వే గతేడాది అన్ని డివిజన్ల పరిధిలో బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్లు ఏర్పాటు చేసింది. సరుకు రవాణాలో కీలకంగా ఈ బీడీయూలను భాగస్వామ్యం చేసి ఆదాయం ఆర్జిస్తోంది. రైతులు, చిరువ్యాపారులు సైతం ఇతర రాష్ట్రాలకు రైల్వే వ్యాగన్ల ద్వారా సరుకు రవాణా చేస్తూ తమ ఉత్పత్తులకు మంచి ధరను పొందుతున్నారు. గతేడాది సరుకు రవాణా ద్వారా ఏపీ నుంచి రైల్వే శాఖ రూ.2,600 కోట్ల ఆదాయం పొందింది. అధికశాతం కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల నుంచి సరుకు రవాణాలో భాగస్వామ్యం ఉంది. -
కాంట్రాక్టుల కోసం రూ.కోటి లంచం
న్యూఢిల్లీ: కాంట్రాక్టులు కట్టబెట్టే విషయంలో ప్రైవేట్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించి, కోటి రూపాయలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వేస్‌కు చెందిన చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(కన్స్ట్రక్షన్) మహేందర్ సింగ్ చౌహాన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అరెస్టు చేసింది. ఇండియన్ రైల్వేస్ సర్వీస్ ఆఫ్ ఇంజనీర్(ఐఆర్ఎస్ఈ) 1985 బ్యాచ్‌కు చెందిన చౌహాన్‌ను అస్సాం రాజధాని గువాహటిలో అదుపులోకి తీసుకున్నారు. అలాగే లంచం చేరవేసిన ఏబీసీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగి భూపేంద్ర రావత్, మరో వ్యక్తి ఇంద్రాసింగ్ను అరెస్టు చేశారు. దీంతో సంబంధం ఉన్న రైల్వే అధికారులు హేమ్‌చంద్ బోరా, లక్ష్మీకాంత్ వర్మ, ఏబీసీఐ సంస్థ డైరెక్టర్ పవన్ బైద్పై కేసు నమోదు చేశారు. ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వేస్ పరిధిలో పలు ప్రాజెక్టులు కట్టబెట్టేందుకు చౌహాన్ ఏబీసీఐ సంస్థకు అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. ఆయన ఆ సంస్థ నుంచి లంచం కింద రూ. కోటి వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో 60 లక్షలను సీబీఐ రికవరీ చేసినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ, ఉత్తరాఖండ్, త్రిపుర, పశ్చిమబెంగాల్, అస్సాంలో పలుచోట్ల దాడులు చేసి, రూ.54 లక్షలు స్వాధీనం చేసుకుంది. -
రైల్వే ఆధునీకరణలో నిర్లక్ష్యం
లక్నో: సరుకు రవాణా కోసం ప్రత్యేక కారిడార్‌ను ఏర్పాటు చేసే విషయంలో, రైల్వేలను ఆధునీకరించే విషయంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. మౌలిక వసతుల కల్పనలో రాజకీయాలు వద్దని సూచించారు. ఈస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్(ఈడీఎఫ్‌సీ)లో భాగంగా ‘న్యూ భావ్‌పూర్ – న్యూ ఖుర్జా’ మార్గాన్ని మంగళవారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ మార్గంలో తొలి రవాణా రైలు ప్రారంభమైన సందర్భంగా ‘స్వావలంబ భారత్’ గర్జన స్పష్టంగా వినిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ తాజా సదుపాయంతో రైతులు సరైన సమయంలో తమ ఉత్పత్తులను మార్కెట్‌కు చేర్చగలరన్నారు. ఈ ఫ్రీట్ కారిడార్‌కు 2006లోనే అనుమతి లభించిందని, అయితే, అప్పటి ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిరాసక్తత కారణంగా అది పేపర్లపైననే మిగిలిపోయిందని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాతనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిందని, ఇది తమ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. ‘2014 వరకు ఒక్క కి.మీ. కూడా ట్రాక్ వేయలేదు. నిధులను వినియోగించలేదు. 2014లో మేం ప్రారంభించేనాటికి ప్రాజెక్టు ఖర్చు 11 రెట్లు పెరిగింది. మేం అధికారంలోకి వచ్చిన తరువాత 1,100 కి.మీ.ల పనులు పూర్తయ్యాయి’ అన్నారు. ఈడీఎఫ్‌సీ ప్రాజెక్టులో మొత్తం 1,840 కి.మీ. మేర ప్రత్యేక ఫ్రీట్ కారిడార్‌ను నిర్మిస్తారు. ఇది పంజాబ్‌లోని లూథియానా నుంచి కోల్‌కతా వరకు ఉంటుంది. -
లోకల్ రైళ్లల్లో పిల్లలకు నిషేధం
సాక్షి, ముంబై: లోకల్ రైళ్లల్లో చిన్న పిల్లలతో కలసి ప్రయాణం చేయడంపై రైల్వే నిషేధం విధించింది. అత్యవసర విధులు నిర్వహించే వారి కోసం ప్రారంభించిన లోకల్ రైళ్లలో, ప్రస్తుతం పలు విభాగాలకు చెందిన ప్రయాణికులందరినీ ప్రయాణం చేసేందుకు అనుమతించారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతించింది. ఈ క్రమంలో చాలా మంది మహిళలు తమ పిల్లలతో కలసి లోకల్ రైళ్లలో ప్రయాణిస్తుండటం కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో చిన్న పిల్లలతో లోకల్ ప్రయాణం ప్రమాదకరమని, పిల్లలతో కలసి లోకల్ రైళ్లలో ప్రయాణించే మహిళలను రైళ్లల్లో అనుమతించబోమని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో మహిళలు మాత్రమే లోకల్ రైళ్లల్లో ప్రయాణించేలా చర్యలు తీసుకోనుంది. దీనికోసం ఇకపై ముంబైలోని రైల్వే స్టేషన్లో గేట్ల వద్ద ఆర్పీఎఫ్ జవాన్లను మోహరించనుంది. -
అదనంగా మరో 900 ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: దసరా సందర్భంగా అదనంగా మరో 900 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ తెలిపారు. మహమ్మారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో సాధారణ ప్రయాణికులకు స్టేషన్లలోకి అనుమతించడం లేదని, రిజర్వేషన్లు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేశారు. పండుగ సమీపిస్తున్న తరుణంలో సోమవారం ‘సాక్షి’తో మాట్లాడిన సీపీఆర్వో రాకేష్ పలు విషయాలు వెల్లడించారు. స్టేషన్లో ప్రతి ప్రయాణికుడికి థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా, రైల్వే స్టేషన్లో బుకింగ్ సదుపాయం ఉందని, ఆన్లైన్ ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఏసీ బోగీల్లో ప్రయాణికులకు దుప్పట్లు ఇవ్వడం లేదన్న ఆయన, భోజనం కూడా ఇంటి నుంచే తెచ్చుకుంటే మంచిదని సూచించారు. అయితే క్యాటరింగ్ ఫుడ్ కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రయాణీకులంతా తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, స్టేషన్లో నిరంతరం సీసీటీవీ పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. -
రైలు ప్రయాణం: అదనంగా మరో రూ. 35!
న్యూఢిల్లీ: ప్రయాణీకులపై భారం పెంచాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఒక్కో టికెట్‌పై యూజర్ ఫీ రూపంలో రూ. 10 నుంచి రూ. 35 వరకు అదనంగా వసూలు చేయాలన్న ప్రతిపాదన ఉందని సంబంధిత వర్గాలు సోమవారం వెల్లడించాయి. స్టేషన్లను ఆధునీకరించి, ప్రయాణీకులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ఈ నిధులను వినియోగించాలని భావిస్తున్నట్లు తెలిపాయి. త్వరలో ఈ ప్రతిపాదన కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళ్లనుందని పేర్కొన్నాయి. కాగా నవీకరిస్తున్న, రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో రైల్ టికెట్ ధరతో కలిపి యూజర్ చార్జీలు వసూలు చేస్తామని భారతీయ రైల్వే ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. (చదవండి: సివిల్స్ పరీక్షకు ప్రత్యేక రైళ్లు..) ఇందులో భాగంగా దేశంలోని 7 వేల రైల్వే స్టేషన్లలో 10–15 శాతం స్టేషన్లలో వీటిని అమలు చేస్తామని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతేగాక ఒకసారి స్టేషన్ ఆధునీకరణ పూర్తయ్యాక యూజర్ చార్జీ సొమ్మును రాయితీలకు మళ్లిస్తామని, అప్పటివరకు ఈ సొమ్మును స్టేషన్ అభివృద్దికి వినియోగిస్తామని వివరించారు. ఇక ప్రస్తుతం దాదాపు 50 స్టేషన్లను ఆధునీకరించాలని రైల్వే భావిస్తోంది. ఆయా స్టేషన్ల కింద ఉన్న భూములను 60 ఏళ్లపాటు వాణిజ్య అవసరాలకు లీజుకు ఇవ్వాలనే యోచనలో ఉంది. ఈ విధంగా అభివృద్ధి చేసిన స్టేషన్ హబ్స్‌ను రైలోపోలిస్‌గా పిలుస్తారు. (రైల్వే ఛార్జీల పెంపు ప్రైవేట్ సంస్థలకే..!) -
12 నుంచి పట్టాలెక్కనున్న ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): ప్రయాణికుల సౌకర్యార్థం మరికొన్ని స్పెషల్ రైళ్లు ఈ నెల 12వ తేదీ నుంచి దేశ్యవ్యాప్తంగా నడుపనున్నారు. వీటిలో ఈస్ట్‌కోస్ట్‌రైల్వే, వాల్తేర్ డివిజన్ పరిధి విశాఖ నుంచి, విశాఖ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రైల్వే బోర్డు ఇటీవల ప్రకటించింది. ఈ స్పెషల్ రైళ్లకు రిజర్వేషన్ ఈ నెల 10వ తేదీనుంచి ప్రారంభమవుతుందని వాల్తేర్ డివిజనల్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కే.త్రిపాఠి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. (చదవండి: నన్ను కాపాడి నువ్వెళ్లిపోయావా..) ప్రత్యేక రైళ్ల వివరాలు... ►విశాఖపట్నం–కోర్బా–విశాఖపట్నం (08518/8517) డైలీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ 12వ తేదీ నుంచి విశాఖలో ప్రారంభమై ప్రతిరోజు రాత్రి 8.05 గంటలకు బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో 13వ తేదీ నుంచి కోర్బాలో ప్రారంభమై ప్రతిరోజు సాయంత్రం 4.10గంటలకు బయల్దేరుతుంది. ఈ స్పెషల్ రైలు రానుపోను విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ, కేసింగ, టిట్లాఘడ్, కంటాబంజి, ఖరియార్ రోడ్, మహాసముంద్, రాయ్‌పూర్, టిల్డా నియోరా, భతపరా, బిలాస్పూర్, అకల్తరా, జంజ్‌గిరినైలా, చంపా స్టేషన్లలో ఆగుతుంది. (చదవండి: గాజువాక సీఐకి నూతన్ నాయుడు ఫోన్..) విశాఖ మీదుగా నడిచే రైళ్లు ►తిరుచ్చిరాపల్లి–హౌరా–తిరుచ్చిరాపల్లి( 02664 / 02663) వీక్లీ స్పెషల్ రైలు ఈ నెల 15 నుంచి ప్రారంభమై ప్రతి మంగళ, శుక్రవారాలలో సాయంత్రం 4.20గంటలకు తిరుచ్చిరాపల్లిలో బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో హౌరాలో 17 నుంచి ప్రారంభమై ప్రతి గురు, ఆది వారాలలో సాయంత్రం 4.10గంటలకు బయల్దేరుతుంది. ఈ స్పెషల్ రైలు రానుపోను విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఖుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్ స్టేషన్లలో ఆగుతుంది. ►గౌహతి–బెంగళూరు కంటోన్మెంట్–గౌహతి(02509 / 02510) ట్రై వీక్లి స్పెషల్ రైలు గౌహతిలో 13 నుంచి ప్రారంభమై ప్రతి ఆది, సోమ, మంగళవారాలలో ఉదయం 6.20గంటలకు బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో బెంగళూరు కంటోన్మెంట్లో 16 నుంచి ప్రారంభమై ప్రతి బుధ, గురు, శుక్రవారాలలో రాత్రి 11.40గంటలకు బయల్దేరుతుంది. ఈ స్పెషల్ రైలు రానుపోను రన్‌గియా, న్యూ జల్పయ్గురి, మాల్డా టౌన్, హౌరా, బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్ కియోంఝర్ రోడ్, కటక్, భువనేశ్వర్, ఖుర్దారోడ్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, ఇతర ముఖ్య స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. ఈ స్పెషల్ రైళ్లకు టికెట్స్ రిజర్వేషన్ కౌంటర్స్ వద్ద, ఐఆర్సీటీసీ వెబ్సైట్లో లభ్యమవుతాయని, కేవలం కన్ఫర్మ్ టికెట్స్ ఉన్న ప్రయాణికులను మాత్రమే రైళ్లలోకి అనుమతిస్తారని సీనియర్ డీసీఎం త్రిపాఠి తెలిపారు. -
కూలీలు, చిరువ్యాపారుల నగరబాట
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ల నుంచి అన్‌లాక్ దశ ముమ్మరం కావడంతో స్వస్ధలాలకు తరలిన కార్మికులు, చిరువ్యాపారులు, ట్రేడర్లు తిరిగి నగరాల బాటపడుతున్నారు. రైల్వే ట్రాఫిక్ పెరిగిన తీరు ఈ వివరాలు వెల్లడిస్తోందని రైల్వే సహాయ మంత్రి సురేష్ అంగది పేర్కొన్నారు. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ సమయంలో గ్రామాల బాటపట్టిన కూలీలు, చిరువ్యాపారులు మహా నగరాలకు తిరిగివస్తున్నారని చెప్పారు. ప్రధాన నగరాల్లో సాధారణ పరిస్థితి నెలకొనగానే వారి కుటుంబ సభ్యులు కూడా తిరిగి నగరాలకు చేరకుంటారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతో రైల్వేలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్రాలు కోరితే మరిన్ని రైళ్లను నడుపుతామని, అయితే పలు రాష్ట్రాలు ఇంకా కోవిడ్-19తో పోరాడుతున్నాయని అన్నారు కాగా రైల్వేలు 31 ప్రత్యేక రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లను, 254 స్పెషల్ మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతున్నాయని మంత్రి తెలిపారు. మే 12 నుంచి జులై 17 వరకూ ప్రత్యేక రాజధాని రైళ్లు దాదాపు 12 లక్షల మంది ప్రయాణీకులను గమ్యస్ధానాలకు చేర్చాయని, జూన్ 1 నుంచి జులై 17 మధ్య ఎక్స్‌ప్రెస్ రైళ్లు 1.6 కోట్ల మంది ప్రయాణీకులను గమ్యస్ధానాలకు చేర్చాయని అధికారులు తెలిపారు. ప్రధాన నగరాల నుంచి బయలుదేరే రైళ్లు 80 శాతం ఆక్యుపెన్సీతో వెళ్లగా, తిరుగుప్రయాణంలో 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్నట్టు రైల్వేలు గుర్తించాయని మంత్రి తెలిపారు. దీనిప్రకారం కార్మికులు, చిరువ్యాపారులు కుటుంబ సభ్యులతో కలిసి స్వస్ధలాలకు వెళ్లి తిరిగి ఒంటరిగా నగరాలకు చేరుకుంటున్నట్టు వెల్లడైందన్నారు. చదవండి: నా భర్త వంట చేస్తాడు... తప్పేంటి? అన్‌లాక్ 2.0తో ఢిల్లీలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోగా, వైరస్ తాకిడి తీవ్రంగా ఉన్న ముంబై.. బెంగళూర్‌లో ఆర్థిక కార్యకలాపాలు ముమ్మరం కావాల్సిఉందని చెప్పారు. యూపీ, బిహార్, అసోం, రాజస్ధాన్‌ల నుంచి కార్మికులు నగరాలకు చేరుకుంటున్నారని తెలిపారు. బెంగళూర్‌లో బుధవారం లాక్డౌన్ ముగియనుండటంతో అక్కడ ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. రాష్ట్రాల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌తో పాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం రైల్వేలు తమ సర్వీసులను పునరుద్ధరిస్తాయని మంత్రి సురేష్ అంగడి తెలిపారు. -
ప్యాసింజర్ రైల్లో ప్రైవేటు కూత
న్యూఢిల్లీ: ప్యాసింజర్ రైళ్ల నిర్వహణలో ప్రైవేటు రంగానికి ఆహ్వానం పలికే కార్యక్రమానికి బుధవారం రైల్వే శాఖ లాంఛనంగా శ్రీకారం చుట్టింది. 109 మార్గాల్లో 151 ఆధునిక రైళ్లను నడిపేందుకు ప్రైవేటు సంస్థల నుంచి ‘రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్’లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సుమారు రూ. 30 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులు సమకూరుతాయని ఆశిస్తున్నారు. ప్యాసింజర్ రైళ్ల నిర్వహణలో ప్రైవేటు పెట్టుబడులను ఆమోదించడం ఇదే ప్రథమం. అయితే, ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిర్వహణలో ‘ఇండియన్ రైల్వే అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ)’ భాగస్వామ్యం గత సంవత్సరమే ప్రారంభమైంది. లక్నో – ఢిల్లీ మార్గంలో తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపేందుకు ఐఆర్సీటీసీకి గత సంవత్సరం అనుమతి లభించింది. దీంతోపాటు ప్రస్తుతం ఐఆర్సీటీసీ వారణాసి– ఇండోర్ మార్గంలో కాశి మహాకాళ్ ఎక్స్‌ప్రెస్‌ను, అహ్మదాబాద్– ముంబై మార్గంలో తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతోంది. ప్రైవేటు పెట్టుబడులతో ఆధునిక సాధన సంపత్తి, ప్రయాణీకులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు సమకూరుతాయని రైల్వే శాఖ భావిస్తోంది. ప్యాసింజర్ రైళ్ల నిర్వహణకు అనుమతించనున్న 109 మార్గాలను 12 క్లస్టర్లుగా విభజించారు. ఈ 151 ఆధునిక రైళ్లలో అత్యధికం భారత్‌లోనే రూపొందుతాయి. వీటిలో 16 కోచ్‌లు ఉంటాయి. గంటకు 160 కిమీల గరిష్ట వేగంతో వెళ్లేలా ఈ రైళ్లను డిజైన్ చేస్తున్నారు. -
ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు!
పాట్నా: ముజఫర్ నగర్ రైల్వే స్టేషన్లో జరిగిన హృదయ విదారక ఘటనకు సంబంధించి బీహార్ ప్రభుత్వం, రైల్వేపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. ముజఫర్ నగర్ రైల్వే స్టేషన్లో ఒక మహిళ చనిపోగా, ఆమె కొడుకు శవం దగ్గర ఏడుస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆ మహిళ రైల్వే స్టేషన్లో సరైన ఆహారం, వసతి లేకే చనిపోయిందని లాయర్ మహమ్మూద్ ఎన్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. (‘కోహ్లి.. అనుష్కకు విడాకులు ఇచ్చేయ్’) మే 25న రైల్వే స్టేషన్లో దీనికి సంబంధించి రికార్డు అయిన సీసీ ఫుటేజీని సీజ్ చేయాలని కోరారు. బీహార్ ప్రభుత్వం, రైల్వే శాఖలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతే కాకుండా సదరు మహిళ కుటుంబానికి తగిన నష్టపరిహారం చెల్లించాలని కూడా ఆదేశించాలని ఎన్హెచ్ఆర్సీని కోరారు. బీహార్ రైల్వే కనీస వసతులు కూడా రైళ్లో కల్పించలేదని, శిశు, మహిళ సంరక్షణ విషయంలో విఫలమైందని ఎన్హెచ్ఆర్సీకి తెలిపారు. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి జీవించే హక్కును రాజ్యాంగం కల్పించిందని ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సదురు మహిళ మే 24న శ్రామిక్‌రైల్లో గుజరాత్ నుంచి బయలుదేరి మే 25 కు గుజరాత్‌కు చేరుకుంది. అయితే ఆమెకు సరైన ఆహారం, వసతి లభించక మరణించింది. (వైరస్ భయం: ఫ్లైట్‌లో ‘ఆ నలుగురు’) -
గమ్యస్థానాలకు 75లక్షల మంది కార్మికులు: కేంద్రం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో 4 కోట్ల మంది వలస కార్మికులు నివసిస్తున్నట్లు కేంద్ర హౌంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పునియా సాలిలా శ్రీవాస్తవ తెలిపారు. శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడుతూ.. లాక్డౌన్ అమలు నాటి నుంచి ఇప్పటి వరకు 75 లక్షల మంది వలస కార్మికులు బస్సులు, రైళ్లలో తమ గమ్యస్థానాలకు చేరుకున్నారని పేర్కొన్నారు. వలస కార్మికులు మే 1నుంచి ఇప్పటి వరకు 2,600 శ్రామిక రైళ్లో తమ నివాసాలకు చేరుకున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. 35 లక్షల మంది కార్మికలు ప్రత్యేక శ్రామిక్ రైళ్లలో ప్రయాణించగా, మిగతా 40 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించారని చెప్పారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలు కార్మికులకు మెరుగైన ఆహార, నివాస సదుపాయాలు కల్పించాయన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి అన్ని రాష్ట్రాలు వేగవంతమైన చర్యలు చేపట్టాయని తెలిపారు. వలస కార్మికల కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు శ్రీవస్తవ తెలిపారు. చదవండి: వలస కార్మికులకు అండగా హైకోర్టులు -
లక్ష దాటిన వలస ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: వలస కార్మికుల ప్రయాణం కొనసాగుతోంది. దక్షిణమధ్య రైల్వే నడుపుతున్న ప్రత్యేక శ్రామిక్ రైళ్ల ద్వారా బుధవారం సాయంత్రానికి తెలంగాణ నుంచి 74 రైళ్ల ద్వారా 1,00,324 మంది స్వస్థలాలకు వెళ్లారు. ఇందులో ఎక్కువ మంది ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల వారున్నారు. ఇక్కడికి దాదాపు 2,600 కి.మీ. దూరంలో ఉన్న మణిపూర్‌కు కూడా 3 రైళ్ల ద్వారా 4,800 మంది తరలివెళ్లారు. ఈనెల ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి లిం గంపల్లి నుంచి 27, చెర్లపల్లి నుంచి 4, ఘట్కేసర్ నుంచి 17, బీబీనగర్ నుంచి 8, నాగులపల్లి నుంచి 9, బొల్లారం నుంచి 8, మేడ్చల్ నుంచి ఒకటి నడిచాయి. ఎండలు తీవ్రంగా ఉం డటంతో నడుస్తూ, సైకిళ్ల ద్వారా వెళ్లటం ప్రమాదమని భా వించి క్రమంగా శ్రామిక్ రైళ్ల కోసం పేర్లు నమోదు చేసుకుం టున్న కార్మికుల సంఖ్య పెరుగుతోంది. (నేటి నుంచి ప్రగతి రథం పరుగులు) ఇక దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి పది స్టేషన్ల ద్వారా 44 రైళ్లలో 50,227 మంది, మహారాష్ట్ర నుంచి 12 రైళ్ల ద్వారా 15,915 మంది తరలారు. వెరసి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పటి వరకు 1,66,466 మంది వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు తరలివెళ్లారు. ఎన్ని రైళ్లయినా నడిపేందుకు సిద్ధం: దక్షిణ మధ్య రైల్వే ఇప్పటివరకు బిహార్‌కు 40, జార్ఖండ్‌కు 13, రాజస్తాన్‌కు 9, ఉత్తరప్రదేశ్‌కు 30, మణిపూర్‌కు 3, ఛత్తీస్‌గఢ్‌కు 4, మధ్యప్రదేశ్‌కు 12, ఒడిశాకు 9, మహారాష్ట్రకు 3, పశ్చిమబెంగాల్‌కు 1, ఉత్తరాఖండ్‌కు 1 చొప్పున రైళ్లు నడిపింది. దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా మాట్లాడుతూ ఇంకా ఎన్ని శ్రామిక్ రైళ్లు నడిపేందుకైనా సిద్ధమని చెప్పారు. (ఔటర్‌పై ఇక రైట్..రైట్..) రూ.8.5 కోట్లు చెల్లించాం: సీఎస్ సోమేశ్‌కుమార్ రాష్ట్రం నుండి లక్ష మంది వలస కార్మికులను 74 ప్రత్యేక రైళ్లలో వివిధ రాష్టాలకు పంపించినందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను అభినందించారు. బుధవారం బీఆర్కేఆర్ భవన్లో నిర్వహించిన సమీక్షా స మావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఆదేశాల తో నోడల్ బృందం, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు, హై దరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, రై ల్వే తదితర శాఖలు కృషి చేశాయన్నారు. వలస కార్మికుల తరలింపుకు రాష్ట్ర ప్రభుత్వం రైల్వేకు 8.5 కోట్లు చెల్లించిందన్నారు. సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి తొలి రైలు.. ప్రయాణికుల తరలింపునకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు మొట్టమొదటిసారి సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరింది. సికింద్రాబాద్–న్యూఢిల్లీ (02437) స్పెషల్ ట్రైన్ బుధవారం మధ్యాహ్నం 1.15కి సికింద్రాబాద్ స్టేషన్ 10వ ప్లాట్‌ఫామ్ నుంచి బయలుదేరింది. గురువారం ఉదయం 10.40కి ఇది న్యూఢిల్లీకి చేరుకోనుంది. ఈ ట్రైన్లో మొత్తం 1,003 మంది ప్రయాణికులు బయలుదేరారు.దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా పర్యవేక్షణలో అధికారులు కరోనా నిబంధనల మేరకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు, శానిటైజేషన్ తరువాత రైల్లోకి అనుమతించారు. ప్రయాణికుల మధ్య భౌతిక దూరం పాటించేలా ఆర్పీఎఫ్తో పాటు అన్ని విభాగాలు జాగ్రత్తలు తీసుకున్నాయి. -
రైళ్లు వస్తున్నాయ్..!
సాక్షి, హైదరాబాద్: సుమారు 52 రోజుల విరామం తర్వాత సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రైళ్ల రాకపోకలకు సన్నద్ధమైంది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. న్యూఢిల్లీ నుంచి బెంగళూర్, బెంగళూర్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే రెండు ప్రత్యేక సూపర్ ఫాస్ట్ రైళ్లలో బుధవారం ఉదయం ఒకటి, సాయంత్రం మరొకటి సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకోనున్నాయి. ఈ రైళ్లలో దాదాపు 300 మంది నగరానికి చేరుకోనున్నారు. లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారి కోసం రైల్వేశాఖ ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. బుధవారం నగరానికి చేరుకోనున్న వారితో పాటు ఇక్కడి నుంచి బయలుదేరనున్న ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఇక నుంచి సాధారణ రాకపోకలకు భిన్నమైన సరికొత్త నిబంధనల మధ్య ప్రయాణికుల రాకపోకలు సాగనున్నాయి. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో రైల్వేస్టేషన్‌ను ఇప్పటికే పూర్తిగా శానిటైజ్ చేశారు. అన్ని ప్లాట్‌ఫామ్‌లు, విశ్రాంతి గదులు, ట్రాక్‌లను శుద్ధి చేశారు. ప్రయాణికులు పాటించాల్సిన నిబంధనలపైన ప్రత్యేక సూచికలు, బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించేందుకు ప్లాట్‌ఫామ్‌లపైన ప్రతి ఆరు అడుగులకు మార్కింగ్ చేశారు. ట్రైన్ ఎక్కేసమయంలో ఈ భౌతిక దూరం తప్పనిసరి. అలాగే రైలు బయలుదేరే సమయానికి 90 నిమిషాలు ముందు మాత్రమే లోనికి అనుమతించనున్నారు. థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే ట్రైన్ ఎక్కేందుకు అనుమతిస్తారు. ట్రైన్ దిగిన వారికి కూడా ఈ స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. ట్రైన్ ఎక్కేవారికి, దిగేవారికి చేతులు శుభ్రంచేసుకొనేందుకు శానిటైజర్లు ఇస్తారు. ప్రయాణికులు ఇంటి నుంచే భోజనం, వాటర్ బాటిల్ తెచ్చుకోవడం మంచిదని అధికారులు సూచించారు. అందుబాటులో వైద్యులు.. ప్రయాణికులకు జరిపే థర్మల్ స్క్రీనింగ్‌లో ఎలాంటి అనుమానాలు కనిపించినా, కరోనా లక్షణాలున్నా వెంటనే 104కు ఫోన్ చేసి పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం పదో నంబర్ ప్లాట్‌ఫామ్‌పైన నిపుణులైన డాక్టర్లు విధులు నిర్వహిస్తారు. అనుమానాలున్న ప్రయాణికులను ప్రత్యేక గదుల్లో ఉంచుతారు. అలాంటి వారు ట్రైన్ దిగిన తర్వాత, లేదా ఎక్కేందుకు వచ్చిన వారైనా సరే లక్షణాలను పరిగణనలోకి తీసుకొని 104కు సమాచారం అందజేస్తారు. పదో నంబర్ ప్లాట్‌ఫామ్ నుంచే.. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రత్యేక రైళ్ల రాకపోకలను పదో నంబర్ ప్లాట్‌ఫామ్‌కే పరిమితం చేశారు. దీంతో ఒకటో నంబర్ నుంచి 9వ నంబర్ ప్లాట్‌ఫామ్ వరకు ఎలాంటి కార్యకలాపాలుండవు. లిఫ్టులు, ఎస్కలేటర్లను కూడా వినియోగించుకొనేందుకు అవకాశం ఉండదు. ప్రయాణికులు నేరుగా బోయిన్పల్లి వైపున్న పదో నంబర్ ప్లాట్‌ఫామ్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. బుధవారం నగరానికి చేరుకోనున్న బెంగళూర్–న్యూఢిల్లీ, న్యూఢిల్లీ–బెంగళూర్ ప్రత్యేక రైళ్లు కూడా ఈ ప్లాట్‌ఫామ్ నుంచే బయలుదేరనున్నాయి. ప్రయాణికులు కూర్చునేందుకు సీట్ల మధ్య భౌతిక దూరం పాటించే విధంగా ప్లాట్‌ఫామ్‌పైన ప్రత్యేక మార్కింగ్ చేసినట్లు ఇండియన్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధి శ్రీనివాస్ తెలిపారు.మరోవైపు ఇటు ప్రయాణికులు మినహా స్టేషన్లోకి ఇతరులు రాకుండా ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. -
శ్రామిక్ రైళ్లలో స్వస్థలాలకు వలస కూలీలు
సాక్షి, ముంబై/సాక్షి, విజయవాడ/కొలిమిగుండ్ల: ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి మంగళవారం వలస కూలీల రైళ్లు మొదలయ్యాయి. లాక్డౌన్ కారణంగా ముంబైలోచిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులను తీసుకుని కళ్యాణ్ జంక్షన్ నుంచి మంగళవారం రాత్రి శ్రామిక్ ప్రత్యేక రైలు గుంతకల్‌కు బయల్దేరింది. ఈ రైల్లో అనంతపురం, కర్నూలు జిల్లాలతో పాటు సమీప ప్రాంతాలకు చెందిన సుమారు 1200 మంది తమ స్వస్థలాలకు బయల్దేరారు. బుధవారం రాత్రికి వీరు గుంతకల్ చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు చెందిన మత్స్యకారులు ముంబైలో పనిచేస్తుంటారు. ముంబైలోని బందర్, దానా బందర్ తదితర ప్రాంతాల్లోని మురికి వాడల్లో వీరు నివసిస్తుంటారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వీరికి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి లభించడంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. తమ ఇబ్బందులు వెలుగులోకి తీసుకువచ్చిన సాక్షికి మత్స్యకారులు ధన్యవాదాలు తెలిపారు. ముంబై సమీపంలోని కళ్యాణ్ జంక్షన్ నుంచి మత్స్యకారులతో బయల్దేరిన రైలు స్వస్థలాలకు మహారాష్ట్ర వలస కూలీలు జీవనోపాధి కోసం కృష్ణా జిల్లాకు వచ్చిన మహారాష్ట్రలోని చంద్రాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 1,212 మంది వలస కూలీలను రాష్ట్ర ప్రభుత్వం వారి స్వస్థలాలకు పంపించింది. కలెక్టర్ ఎ.ఎండీ ఇంతియాజ్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ మాధవీలత పర్యవేక్షణలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రత్యేక రైల్లో కూలీలు వారి ప్రాంతానికి తరలివెళ్లారు. జిల్లాలోని గంపలగూడెం పరిసర ప్రాంతాలకు ఏటా మార్చి నెలలో మిర్చి కోతల కోసం మహారాష ్టనుంచి కూలీలు వస్తారు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా వీరంతా ఇక్కడే ఇరుక్కుపోయారు. కూలీలను 48 బస్సుల్లో గంపలగూడెం నుంచి విజయవాడ తరలించిన అధికారులు భోజనాల అనంతరం రాయనపాడు రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఒక్కో బోగీలో 50 మంది చొప్పున 24 బోగీల్లోకి కూలీలను ఎక్కించారు. కాగా కర్నూలు జిల్లా కల్వటాల–కొలిమిగుండ్ల మధ్య నిర్మిస్తున్న రామ్‌కో సిమెంట్ కంపెనీ పనులు చేసేందుకు వచ్చిన పలు రాష్ట్రాల వలస కూలీలను స్వస్థలాలకు పంపిస్తున్నారు. బిహార్‌కు చెందిన 480 మందిని మంగళవారం బస్సుల్లో కర్నూలు రైల్వే స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక రైల్లో బిహార్‌కు పంపిస్తున్నారు. -
రెండు పీపీఈ నమూనాలకు ఆమోదం
న్యూఢిల్లీ: ఉత్తర రైల్వే వర్క్‌షాపులో రూపొందించిన రెండు వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ) నమూనాలకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) తాజాగా ఆమోదం తెలిపింది. దీంతో రైల్వే యూనిట్లలో వీటి ఉత్పత్తికి మార్గం సుగమమైంది. శరీర భాగాల్లో రక్తం, ఇతర స్రావాల ప్రసరణ కోసం ఈ పరికరాలను ఉపయోగిస్తారు. ప్రస్తుతం రోజుకు 20 వరకు ఈ పరికరాలను తయారు చేస్తున్నామని, ఇకపై రోజుకు 100కు పైగా రూపొందిస్తామని రైల్వే వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందిస్తున్న రైల్వే ఆసుపత్రుల్లో వీటిని ఉపయోగిస్తామని పేర్కొన్నాయి. దేశంలో పీపీఈ కొరత ఎక్కువగా ఉంది. దీంతో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది భయం భయంగా పనిచేయాల్సి వస్తోంది. సరిపడగా పీపీఈ అందుబాటులోకి వస్తే కరోనా మహమ్మారిని మరింత సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో డీఆర్డీవో పాటు పలు సంస్థలు వ్యక్తిగత రక్షణ పరికరాలను తయారు చేసేందుకు ముందుకు వచ్చాయి. (చైనా ఎన్ని మాస్క్‌లు అమ్మిందంటే..?) -
రైల్వే రిజర్వేషన్ టికెట్ల సొమ్ము వాపసు
సాక్షి, అమరావతి: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో వాల్తేరు డివిజన్లో ప్రయాణికులకు టికెట్ రిజర్వేషన్ కింద రూ.7.50 కోట్ల సొమ్మును రైల్వేశాఖ వాపసు ఇచ్చింది. కరోనా జాతీయ విపత్తు నేపథ్యంలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 14 వరకు ఆన్లైన్, కౌంటర్ల ద్వారా రిజర్వేషన్ టికెట్లు పొందిన ప్రయాణికులకు రైల్వేశాఖ డబ్బు వాపసు చేసింది. -
నిత్యావసరాల రవాణాలో రైల్వేదే అగ్రస్థానం
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు నిత్యావసరాల ఇబ్బందులు తలెత్తకుండా రైల్వేశాఖ తగిన చర్యలు తీసుకుంటోంది. ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసినప్పటి నుంచి నిత్యావసర సరుకుల రవాణా కోసం ప్రత్యేకంగా గూడ్స్ రైళ్లను తిప్పుతోంది. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ నిత్యావసరాల కొరత రాకుండా చూస్తోంది. గత ఐదు రోజుల్లో దేశ వ్యాప్తంగా లక్షన్నర వ్యాగన్ల నిత్యావసరాలు రవాణా చేసినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ఇందులో బియ్యం, గోధుమలు వంటి ఆహార ధాన్యాలు, ఉల్లి, పండ్లు, కూరగాయలు, పాలు, వంట నూనె తదితర నిత్యావసరాలున్నాయి. వీటితో పాటు థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గు, వ్యవసాయ రంగానికి ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులు మొదలైనవి రవాణా చేస్తోంది. కరోనాను జాతీయ విపత్తుగా భావించి సరుకు రవాణాలో డెమరేజ్, వార్ఫేజ్ ఛార్జీలను ఎత్తేసింది. అవసరాన్ని బట్టి మరిన్ని రాయితీలు కల్పిస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు. - ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినప్పటినుంచి దక్షిణ మధ్య రైల్వే అదనంగా 270 గూడ్స్ రైళ్లను నడిపి రికార్డు సాధించింది. - ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య పట్టణాల్లో ఉన్న ఎఫ్‌సీఐ గోడౌన్లకు రోజుకు సగటున 1.80 మిలియన్ టన్నుల చొప్పున నిత్యావసర సరుకులు సరఫరా చేస్తోంది. - ఒక్కో వ్యాగన్‌కు 60 టన్నుల వరకు సరుకును చేరవేసే సామర్థ్యం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. - రేణిగుంట నుంచి వ్యాగన్ ద్వారా ఢిల్లీకి పాలు సరఫరా చేసి అక్కడి ప్రజల అవసరాలు తీర్చింది. - రైల్వే ఉద్యోగులకు రొటేషన్ పద్ధతిలో ఎమర్జెన్సీ డ్యూటీల కింద సరుకు రవాణా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. - లాక్ డౌన్ ఎత్తేసేవరకు గూడ్స్ రవాణాలో అదనపు ఛార్జీలు (డెమరేజ్, వార్ఫేజ్ ) విధించకూడదని రైల్వేశాఖ నిర్ణయించింది. - కంటైనర్ టారిఫ్‌లో కూడా స్టేకింగ్, డిటెన్షన్ వంటి ఛార్జీలు విధించడం లేదు. -
అప్పుడు ధోని.. ఇప్పుడు మరో టికెట్ కలెక్టర్!
ముంబై: ఎంఎస్ ధోని.. అంతర్జాతీయ క్రికెట్లో ఎలా అడుగుపెట్టాడో అందరికీ తెలిసిన విషయమే. స్పోర్ట్స్ కోటాలో టికెట్ కలెక్టర్‌గా ఉద్యోగం సంపాదించి తర్వాత దేశవాళీ మ్యాచ్‌ల్లో సత్తాచాటుకుని భారత జట్టులోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ధోని తన అంతర్జాతీయ కెరీర్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు మరో టికెట్ కలెక్టర్ కూడా టీమిండియా మేనేజ్మెంట్ తలుపులు తట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతనే ఢిల్లీకి చెందిన హిమాన్షు సంగ్వాన్ రంజీల్లో రైల్వేస్ తరఫున ఆడుతున్న ఈ ఫాస్ట్ బౌలర్ తన బౌలింగ్‌తో అద్భుతాలు చేస్తున్నాడు. ఇటీవల ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మొత్తంగా ఆరు వికెట్లు సాధించి సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ మాత్రమే తీసిన సంగ్వాన్.. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. తన బౌలింగ్‌తో పటిష్టమైన ముంబైను బెంబేలెత్తించిన సంగ్వాన్.. పృథ్వీషా, అజింక్యా రహానే వంటి స్టార్ ఆటగాళ్ల వికెట్లను కూడా ఖాతాలో వేసుకుని ఇది తన పేస్ అంటూ టీమిండియా సెలక్టర్లకు సవాల్ విసురుతున్నాడు. అయితే తన బౌలింగ్‌లో పదునుకు ఆసీస్ దిగ్గజం మెక్‌గ్రాత్ కారణం అంటున్నాడు సంగ్వాన్. మెక్‌గ్రాత్ పర్యవేక్షణలో నేను శిక్షణ పొందా. అతని పర్యవేక్షణలోనే ఎన్నో బంతుల్ని వేశా. ఆ క్రమంలోనే నా బౌలింగ్‌లో తప్పిదాలను సరిచేసుకున్నా. ప్రత్యేకంగా నోట్స్ రాసుకుంటూ బౌలింగ్‌ను మెరుగుపరుచుకున్నా. ప్రతీ సెషన్లోనూ నాకు మెక్‌గ్రాత్ అండగా నిలిచాడు. చాలా టెక్నికల్ విషయాలు మెక్‌గ్రాత్ నుంచే నేర్చుకున్నా. బేసిక్స్‌తో పాటు ఓపికగా ఎలా బౌలింగ్ చేయాలి అనేది మెక్‌గ్రాత్ సార్ చెప్పారు. ఈ రెండు విషయాల్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలనేది నాకు మెక్‌గ్రాత్ సార్ చెప్పిన సూత్రం. అతని మార్గదర్శకత్వమే నన్ను రాటు దేలేలా చేసింది. నా బౌలింగ్ క్రెడిట్ అంతా మెక్‌గ్రాత్ సార్కే చెందుతుంది’ అని సాంగ్వాన్ చెప్పుకొచ్చాడు. ఇక పృథ్వీషా, రహానేలను ఎలా కట్టడి చేశాననే దానిపై కూడా సాంగ్వాన్ స్పష్టం చేశాడు. ‘ పృథ్వీ షా ఒక ఎటాకింగ్ ప్లేయర్. ఎప్పుడూ దూకుడుగా ఆడటంపైనే షా దృష్టి పెడతాడు. ప్రత్యేకంగా పృథ్వీ షా కొన్ని ఏరియాల్లో బంతుల్లు సంధించా. నా పేస్‌ను చేంజ్ చేస్తూ అతని బౌలింగ్ చేశా. అది ఫలించింది. రహానే విషయంలో కూడా ఒక ప్రణాళికతోనే బరిలోకి దిగా. వరల్డ్‌లో అత్యుత్తమ టెస్టు బ్యాట్స్మన్లలో రహానే ఒకడు. భారత టెస్టు క్రికెట్ జట్టు రహానే వైస్ కెప్టెన్ కూడా. కచ్చితమైన ఏరియాల్లో బంతులు వేయడమే కాకుండా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్‌పై ఆడేలా బంతులు వేశా. దాంతో రహానే వికెట్ కూడా దక్కింది. ఇద్దరికీ ప్రణాళికలు సిద్ధం చేసుకునే పోరుకు సిద్ధమయ్యా’ అని 24 ఏళ్ల సాంగ్వాన్ అన్నాడు. -
‘150 రైళ్లు..50 స్టేషన్లు ప్రైవేటుపరం’
సాక్షి, న్యూఢిల్లీ : భారత రైల్వేల ప్రైవేటీకరణ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. తేజాస్ రైలును ప్రవేశపెట్టిన అనంతరం తాజాగా మరో 150 రైళ్లు, 50 రైల్వే స్టేషన్లను దశలవారీగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని కేంద్రం గురువారం నిర్ణయించింది. కేంద్ర నిర్ణయం గురించి నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను ముందకు తీసుకువెళ్లేందుకు సాధికార కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుందని లేఖలో కాంత్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆరు విమానాశ్రయాల ప్రైవేటకీరణ అనుభవాన్ని ప్రస్తావిస్తూ రైల్వేల్లోనూ ఇదే తరహాలో ప్రైవేటీకరణ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు కార్యదర్శులతో కూడిన సాధికార కమిటీ ఏర్పాటవుతుందని రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్‌కు రాసిన లేఖలో అమితాబ్ కాంత్ తెలిపారు. ప్రయాణీకుల రైళ్ల నిర్వహణను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించే ప్రక్రియతో ఈ రైళ్ల నిర్వహణలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయని పేర్కొన్నారు. -
రైల్లో మంత్రి బ్యాగు చోరీ.. మోదీనే కారణం!
రాయ్‌పూర్: ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి ఛత్తీస్‌గఢ్ విద్యాశాఖ మంత్రి ప్రేమసాయి సింగ్ టేకమ్ విచిత్రమైన ఆరోపణలు చేశారు. రైల్వేలో దొంగతనాల వెనుక ప్రధాని మోదీ ఉన్నారని ఆరోపించారు. రెండోరోజుల కిందట అమర్కంటక్ ఎక్స్‌ప్రెస్ రైల్లో జరిగిన చోరీ ఘటనలో మంత్రి టేకమ్ బ్యాగు పోయింది. దీంతో ఆయన ఏకంగా మోదీని చోరీలు చేయిస్తున్నారంటూ విడ్డూరమైన ఆరోపణలు చేశారు. ‘మోదీజీ రైళ్లలో చోరీలు చేయిస్తున్నారు. మంత్రుల బ్యాగులను కొట్టేస్తున్నారు. ఆయన ప్రభుత్వం సాధించిన ఘనత ఇది’ అని టేకమ్ చెప్పుకొచ్చారు. మోదీ సర్కారు వందరోజుల పాలనను, రైళ్లలో దొంగతనాలతో ముడిపెట్టి ఆయన వ్యాఖ్యలు చేశారు. అమర్కంటక్ ఎక్స్‌ప్రెస్‌లో ఫస్ట్‌క్లాస్ కోచ్‌లో ప్రయాణిస్తున్న టేకమ్ బ్యాగును దొంగలు కొట్టేసినట్టు కథనాలు వచ్చాయి. ఆయన బ్యాగులో నగదుతోపాటు విలువైన పత్రాలు ఉన్నట్టు సమాచారం.