ప్రయాగ్‌రాజ్: దేశంలో రైలు ప్రమాదాలను నివారించేందుకు రైల్వే బోర్డు ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అన్ని రైలు ఇంజిన్‌లలో, రైళ్లలోని ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీతో పనిచేసే సీసీటీవీ కెమెరాలను అమర్చనున్నారు. ఈ విషయాన్ని రైల్వే బోర్డు ఛైర్‌పర్సన్, సీఈవో జయవర్మ సిన్హా మంగళవారం(ఆగస్టు20) వెల్లడించారు.
రైలు ప్రమాదానికి కారణమయ్యే పరిస్థితులను గుర్తించడంలో ఈ కెమెరాలు ఉపయోగపడతాయని ఆమె తెలిపారు. కుంభమేళాకు రైల్వేశాఖ సన్నద్ధతపై పలు రైల్వే డివిజన్ల జనరల్ మేనేజర్లతో ఆమె సమీక్షించారు. కుంభమేళా సమయంలో సంఘ విద్రోహశక్తులు ట్రాక్‌లను ధ్వంసం చేయకుండా చూసేందుకు భద్రతా ఏజెన్సీలు ట్రాక్‌లను నిరంతరం పర్యవేక్షిస్తాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment