cameras
-
బీజేపీపై నిఘాకు కెమెరాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి ఈ నెల 5న జరిగే ఎన్నికల సమయంలో బీజేపీ అక్రమాలకు పాల్పడితే రికార్డు చేసేందుకు వీలుగా స్పై, బాడీ కెమెరాలను మురికివాడల్లోని ప్రజలకు అందజేసినట్లు ఆప్ చీఫ్ కేజ్రీవాల్ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో ఆప్ చారిత్రక విజయం సాధించబోతోందన్నారు. బీజేపీ ఘోర పరాజయం తప్పదన్నారు. ఇది తెలిసే ఆ పార్టీ అనుచిత చర్యలకు దిగుతోందని విమర్శించారు. బీజేపీ గూండాల అక్రమాలను రికార్డు చేసేందుకు మురికివాడల్లోని ప్రజలకు నిఘా కెమెరాలను అందించినట్లు చెప్పారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిని పోలీసులకు పట్టించేందుకు వీలుగా సమాచారం అందిన 15 నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకునేలా క్విక్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. స్లమ్ ఏరియాల్లోని ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోకుండా చేసే ఉద్దేశంతో వారి వేలికి నల్ల సిరా పూసి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని తెలిపారు. బీజేపీ వాళ్ల నుంచి డబ్బులైతే తీసుకోండి, కానీ, వేలికి సిరా పూయనివ్వకండని ఓటర్లను కేజ్రీవాల్ కోరారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారా... ఏఐ కెమెరా పట్టేస్తుంది!
మద్యం సేవించి వాహనం నడుపుతున్నారా? ‘రోడ్డు మీద పోలీసుల్లేరు కదా, మనం సేఫ్’అనుకోవడానికి ఇకపై వీల్లేదు. ఎందుకంటే తాగి, లేదా డ్రగ్స్ తీసుకుని వాహనం నడిపే వారిని కదలికలను బట్టి పసిగట్టే కృత్రిమ మేధతో కూడిన కెమెరా వచ్చేసింది. ఇకపై పోలీసులు ప్రతి వాహనాన్నీ ఆపి డ్రైవర్‌ను చెక్ చేయాల్సిన పని లేదు. ఈ ఏకై కెమెరాలు డ్రైవర్ స్థితి ఏమిటన్నది గుర్తించి పోలీసులకు సమాచారమిస్తాయి. వాళ్లు వెంటనే వాహనాన్ని ఆపి డ్రైవర్‌ను చెక్ చేస్తారు. తాగి నడిపేవారిని పట్టుకోవడానికి ఏఐ సాయంతో తయారు చేసిన ప్రపంచంలోనే తొలి కెమెరా ఇది. అత్యాధునిక హెడ్సప్ పరికరంతో తయారు చేసిన ఈ కెమెరాలను బ్రిటన్ పోలీసులు ప్రయోగాత్మకంగా వాడి చూస్తున్నారు. ఈ కెమెరాలు డ్రైవర్లకు కనిపించవు. వీటిని అక్యూసెన్సస్ అనే సంస్థ తయారు చేసింది. వాహనాలు నడుపుతూ మొబైల్ ఫోన్లు వాడే, సీటు బెల్టు పెట్టుకోని డ్రైవర్లను పట్టుకోవడానికి గతంలో పోలీసులు ఈ సంస్థ కెమెరాల ను వాడారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదానికి ఆస్కారం ఆరు రెట్లు ఎక్కువ. అలాంటివారిని ముందే గుర్తించగలిగితే అనేక ప్రాణాలు కాపాడొచ్చనేది అక్యూసెన్సస్ మోటో. కానీ పోలీసులు అంతటా కాపలా కాయలేరు. ‘‘కనుక ఇలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం తప్పనిసరి. ప్రమాదాలను తగ్గించడానికి చేపడుతున్న చర్యల్లో ఇదో భాగం’’అంటున్నారు బ్రిటన్ పోలీసులు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కూ.. చుక్.. చెక్..
భద్రత విషయంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రైళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిఘా కెమెరాలను ఏర్పాటు చేయనుంది. పట్టాలపై ప్రమాదకరమైన వస్తువులను దూరం నుంచే గుర్తించి లోకో పైలెట్లను అప్రమత్తం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రైళ్లు పట్టాలు తప్పడాన్ని నివారించడంతోపాటు ఉగ్రవాద, అసాంఘిక శక్తుల కుట్రలను తిప్పికొట్టే లక్ష్యంతో రైల్వేశాఖ వీటిని ఏర్పాటుచేయనుంది. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో సీసీటీవీ కెమెరాల నిఘా కొనసాగుతుండగా.. నడుస్తున్న రైళ్లను మాత్రం ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) పరిజ్ఞానం ద్వారా పర్యవేక్షిస్తున్నారు.కానీ, నడిచే రైళ్లు ప్రమాదాలకు గురికాకుండా ముందుగానే అప్రమత్తంచేసే వ్యవస్థ ఇప్పటివరకు అందుబాటులో లేదు. –సాక్షి, అమరావతిదూరం నుంచే గుర్తించి అప్రమత్తం..ఇక ఏఐ పరిజ్ఞానంతో పనిచేసే ఈ ‘టూ ఫ్రంటల్ హై రిజల్యూషన్ కెమెరాలు’ రైలు పట్టాలపై అనుమానాస్పద వస్తువులను చాలాదూరం నుంచే గుర్తించి లోకో పైలెట్‌ను అప్రమత్తం చేస్తాయి.వస్తువు ఫొటో తీసి వెంటనే ప్రాసెస్ చేసి అది ఎలాంటిదో సమాచారం ఇస్తాయి. అంటే.. అది ప్రమాదకరమైన వస్తువా.. అసహజమైన వస్తువా..కదులుతున్న వస్తువా.. మనుషులా.. జంతువులా అనేది కూడా గుర్తిస్తాయి.లోకో పైలెట్లు వెంటనే అప్రమత్తమై అత్యవసర బ్రేక్ వేసి ఆ వస్తువుకు కనీసం కి.మీ. ముందుగానే రైలును నిలిపివేస్తారు.గుర్తించిన అభ్యంతరకర వస్తువుల పైకి లేజర్ కిరణాలను ప్రసరింపజేసి ఆ వస్తువు ఎంత దూరంలో ఉందో లోకో పైలెట్ గుర్తించే పరిజ్ఞానాన్ని కూడా అందుబాటులోకి తేనున్నారు.అత్యవసర బ్రేక్‌ను సీసీటీవీ కెమెరాలతో అనుసంధానించి అసాధారణ పరిస్థితుల్లో లోకో పైలట్‌తో నిమిత్తం లేకుండానేరైలు ఆటోమేటిగ్గా ఆగిపోయేట్లుగా చేసే పరిజ్ఞానంపై కూడా రైల్వేశాఖ పరిశోధనలు నిర్వహిస్తోంది.మూడేళ్లలో 97 ప్రమాదాలు..ఇటీవలి కాలంలో దేశంలో రైళ్లు పట్టాలు తప్పి ప్రమాదాలకు గురవుతున్న దుర్ఘటనలు గణనీయంగా పెరిగాయి. 2021 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ ప్రమాదాలు 97 సంభవించాయి. కొన్నిచోట్ల విద్రోహశక్తులు రైలుపట్టాలపై ప్రమాదకరమైన వస్తువులను ఉంచి కుట్రలు పన్నిన ఉదంతాలూ ఉన్నాయి. దీంతో రైలు పట్టాలపై ఈ తరహా వస్తువులను ముందుగానే గుర్తించి ప్రమాదాలు నివారించేందుకు రైళ్లలో ఏఐ కెమెరాలను ఏర్పాటుచేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది.రూ.15 వేల కోట్లతో 75,000ఏఐ కెమెరాలు..ఈ నేపథ్యంలో.. రూ.15 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో 75 వేల ఏఐ కెమెరాలను ఏర్పాటుచేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. 40 వేల బోగీలు, 14 వేల లోకోమోటివ్‌లు (ఇంజిన్లు), 6 వేల ఈఎంయూలలో ఈ కెమెరాలను ఏర్పాటుచేస్తారు. ప్రతి బోగీకి ఆరు కెమెరాలు, ప్రతి లోకోమోటివ్‌కు నాలుగు కెమెరాలను అమరుస్తారు. అక్టోబరు నుంచి ఏడాదిలోగా దశలవారీగా అన్ని రైళ్లలో ఏఐ కెమెరాల ఏర్పాటు పూర్తిచేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం పలు కంపెనీలకు టెండర్లు అప్పగిస్తోంది. -
రైళ్లలో ఇక ‘ఏఐ’ కన్ను
ప్రయాగ్‌రాజ్: దేశంలో రైలు ప్రమాదాలను నివారించేందుకు రైల్వే బోర్డు ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అన్ని రైలు ఇంజిన్లలో, రైళ్లలోని ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీతో పనిచేసే సీసీటీవీ కెమెరాలను అమర్చనున్నారు. ఈ విషయాన్ని రైల్వే బోర్డు ఛైర్పర్సన్, సీఈవో జయవర్మ సిన్హా మంగళవారం(ఆగస్టు20) వెల్లడించారు.రైలు ప్రమాదానికి కారణమయ్యే పరిస్థితులను గుర్తించడంలో ఈ కెమెరాలు ఉపయోగపడతాయని ఆమె తెలిపారు. కుంభమేళాకు రైల్వేశాఖ సన్నద్ధతపై పలు రైల్వే డివిజన్ల జనరల్ మేనేజర్లతో ఆమె సమీక్షించారు. కుంభమేళా సమయంలో సంఘ విద్రోహశక్తులు ట్రాక్‌లను ధ్వంసం చేయకుండా చూసేందుకు భద్రతా ఏజెన్సీలు ట్రాక్‌లను నిరంతరం పర్యవేక్షిస్తాయని తెలిపారు. -
ఏఐ.. పార్కింగ్ ఎక్కడోయ్
షాపింగ్ కోసం కోఠి వెళ్లారు. అదసలే బిజీ ఏరియా.. ఫుల్ ట్రాఫిక్.. కారు పార్క్ చేయడానికి స్థలం లేదు. దగ్గరలో ఎక్కడ పార్కింగ్ ఉందో తెలియదు. రోడ్డు పక్కనే పార్క్ చేస్తే.. ట్రాఫిక్‌కు అంతరాయం. పోలీసుల కంట్లో పడితే ఫైన్ కట్టక తప్పదు. అదే ఓ యాప్ ఉండి, దగ్గరలో పార్కింగ్ ఎక్కడుందో తెలిస్తే..? అదీ పార్కింగ్ స్లాట్ బుక్ చేసుకుని, నేరుగా వెళ్లి పార్క్ చేసేసుకోగలిగితే..? ఈ తిప్పలన్నీ తప్పుతాయి కదా.బిజీ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాల ఏర్పాటుతోపాటు ఇలాంటి వెసులుబాట్లు తెస్తే.. వాహనదారులకు ప్రయోజనం కలుగుతుంది. ట్రాఫిక్ చిక్కులకు చెక్ పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ తరహా ఏర్పాట్లపై ‘ఈజీపార్క్ ఏఐ’ అనే సంస్థ ఇటీవల ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుకు ప్రజెంటేషన్ కూడా ఇచి్చంది. ఐటీ, కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో పార్కింగ్ సమస్యను పరిష్కరించవచ్చని ప్రతిపాదన చేసింది.సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ నగరం ఇప్పటికే వాహనాలతో కిక్కిరిసిపోయింది. ఏటా పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. అవన్నీ రోడ్లపై తిరగడం సంగతి పక్కనపెడితే.. ఎక్కడో ఓ చోట పార్క్ చేయక తప్పదు. షాపింగ్ కోసం వెళ్లినా, ఏదైనా పని మీద వెళ్లినా.. పార్కింగ్ కోసం తిప్పలే. కార్లే కాదు బైకులు పెట్టడానికీ ఎక్కడా స్థలం లేని దుస్థితి. దీనితో షాపుల ముందు, రోడ్ల పక్కన, గల్లీల్లో వాహనాలను పార్క్ చేస్తున్నారు. దీనితో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు, ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం సమస్యగా మారుతోంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో ఈ ఇబ్బంది మరింత ఎక్కువగా ఉంటోంది. పర్యాటక ప్రదేశాలు, ఆలయాలు, సాయంత్రాలు ఆహ్లాదంగా గడపడానికి వెళ్లే చోట్ల పార్కింగ్ పెద్ద ప్రహసనంగా మారింది.ఎలా పనిచేస్తుంది..కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) సాయంతో పార్కింగ్ సమస్యను పరిష్కరించే విధానాన్ని ఈజీపార్క్ ఏఐ సంస్థ రూపొందించింది. ఆ వివరాల మేరకు.. పార్కింగ్ స్థలం నిర్వహించే వారికి ఒక డాష్ బోర్డు ఏర్పాటు చేస్తారు. వాహనాలు ఎన్ని వస్తున్నాయి? ఆక్యుపెన్సీ ఎంత ఉంది? ఎంతసేపు వాహనాలు పార్క్ చేస్తారన్న డేటాను దాని ద్వారా అందిస్తుంది. అలా అన్ని పార్కింగ్ స్థలాల వివరాలను ఒకచోట క్రోడీకరిస్తుంది.ఈ వివరాలను ఓ యాప్ సాయంతో వాహనదారులకు అందుబాటులో ఉంచుతుంది. ఈ యాప్ ద్వారా ఎక్కడెక్కడ పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉన్నాయనేది తెలుస్తుంది. ముందుగానే పార్కింగ్ స్లాట్లను బుక్ చేసుకుని, నేరుగా వెళ్లి పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఫీజును కూడా ఆన్లైన్ ద్వారానే చెల్లించేయొచ్చు. ఒకవేళ ఆ ప్రాంతానికి వెళ్లకపోతే.. స్లాట్‌ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. పార్కింగ్ ప్రదేశాల్లో ఇంటర్నెట్ ఆధారిత కెమెరాలతో నిఘా ఉంటుంది. వాహనానికి సంబంధించిన అలర్ట్స్ వస్తాయి. దొంగతనం, మరేదైనా జరిగితే వెంటనే అప్రమత్తం చేసే ఏర్పాట్లు ఉంటాయి. వాహనాలు వెళ్లిపోయి పార్కింగ్ స్లాట్లు ఖాళీ అయితే.. వెంటనే యాప్‌లో అప్డేట్ అయి ఖాళీగా చూపిస్తుంది. కావాల్సిన వారు బుక్ చేసుకోవచ్చు. పార్కింగ్ స్థలం వద్ద వాహనాలు బయటికి వెళ్లడం, లోపలికి రావడం ప్రత్యేక పరికరాలతో నమోదవుతూ ఉంటుంది. ఆటోమేటిగ్గా వాటి నంబర్లను గుర్తించి అప్డేట్ చేసే వ్యవస్థ ఉంటుంది.మల్టీలెవల్ పార్కింగ్తో.. అలాగే హైదరాబాద్‌లో భూముల విలువలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికితోడు ప్రధాన ప్రాంతాల్లో స్థలాలకు కొరత ఉండటంతో.. మలీ్టలెవల్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలా ఏర్పాటు చేసినా.. అవి ఎక్కడున్నాయో అందరికీ తెలిసే అవకాశం తక్కువ. తెలిసినా పార్కింగ్ ఖాళీగా ఉందో లేదో తెలియదు. అక్కడిదాకా వెళ్లి ఖాళీ లేకుంటే.. మళ్లీ మరోచోటికి వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే పార్కింగ్ ఖాళీగా ఉందో, లేదో తెలిసి.. ముందే స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో ‘ఈజీపార్క్ ఏఐ’ అనే సంస్థ ముందుకొచి్చంది. ఇటీవల దీనిపై రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది.భవనాల్లో పార్కింగ్ సరిగా లేక.. హైదరాబాద్‌లో 80 లక్షలకుపైగా వాహనాలు ఉన్నాయి. కార్లు, టూ వీలర్లతోపాటు విద్యాసంస్థల వాహనాలు, ఆటోలు వంటివీ భారీగా ఉన్నాయి. ఇందులో కార్లు, టూవీలర్ల పార్కింగ్ కోసం ఇబ్బంది వస్తోంది. ట్రాఫిక్‌లో ఎలాగోలా గమ్యస్థానానికి చేరుకున్న వాహనదారులకు పార్కింగ్ విషయంలో తిప్పలు తప్పట్లేదు. పార్కింగ్‌కు అనుగుణంగా భవన నిర్మాణాలు చేపట్టకపోవడం ఈ సమస్యకు ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు.పార్కింగ్ సమస్యపై జనం ఏమంటున్నారు?సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో పార్కింగ్ సమస్యను పరిష్కరించడంపై ఫోకస్ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ఓ సమీక్ష సందర్భంగా ప్రకటించారు. ‘ఈజీపార్క్ఏఐ’ సంస్థ ప్రజెంటేషన్ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పార్కింగ్ సమస్య పరిష్కారానికి ఐటీని వినియోగించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఐటీ, కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించి వాహనాల పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఐటీ శాఖ ఇంజనీర్లను ఆదేశించారు కూడా. ఎక్కడికెళ్లినా పార్కింగ్‌కు ఇబ్బందే.. హైదరాబాద్‌లో, ముఖ్యంగా బిజీ ఏరియాల్లో పార్కింగ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటోంది. చాలాసేపు వెతికితే కానీ బండి పెట్టుకోవడానికి ప్లేస్ కనబడటం లేదు. చాలా షాపింగ్ కాంప్లెక్స్‌లలో పార్కింగ్ ఉండట్లేదు. అంతా రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు. అది ట్రాఫిక్‌కు ఇబ్బందిగా మారుతోంది. – నరేశ్‌గౌడ్ లోడి, అంబర్పేటప్రభుత్వం చొరవ తీసుకోవాలి హైదరాబాద్‌లో పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. పార్కింగ్ విషయంలో ప్రభుత్వం సరైన పాలసీ రూపొందించాలి. షాపింగ్ కాంప్లెక్స్‌లు, దుకాణాలకు, వాహనదారులకు అవగాహన కలి్పంచాలి. అప్పుడే నగరవాసులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. – కల్యాణ్, దిల్సుఖ్నగర్ -
బాల ఫోటో గ్రాఫర్లకోసం అదిరిపోయే కెమెరా..ఫీచర్లు ఏంటంటే ?
-
సిటీపై కమాండ్.. నేరగాళ్లపై కంట్రోల్!
హైదరాబాద్: ఉల్లంఘనుల్లో క్రమశిక్షణ పెంచడం...స్వైర‘విహారం’ చేసే నేరగాళ్లకు చెక్ చెప్పడం...వాహనచోదకులు గమ్యం చేరుకునే సమయాన్ని గణనీయంగా తగ్గించడం... విపత్కర పరిస్థితుల్లో సత్వర స్పందన... ఈ లక్ష్యాలతో ఏర్పాటైన అత్యాధునిక వ్యవస్థే ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం (ఐటీఎంఎస్). బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ లో ఇదీ ఓ అంతర్భాగమే. రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ సోమవారం ఆవిష్కరించిన ‘2306 సేఫ్ సిటీ ప్రాజెక్టు సీసీ కెమెరాలు’ ఈ కోణా ల్లో కీలకపాత్ర పోషించనున్నాయి. వీటిలో కొన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తాయి. ‘ప్లేటు’ మారితే పట్టేస్తుంది... నేరగాళ్లు, ఉల్లంఘనులు పోలీసుల్ని తప్పించుకోవడానికి అనేక ఎత్తులు వేస్తుంటారు. ఇందులో భాగంగా ఇతర వాహనాల నెంబర్లకు తమ వాహనాల నెంబర్ ప్లేట్లపై వేసుకుని సంచరిస్తుంటారు. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రీడింగ్ సిస్టం (ఏఎన్పీఆర్) సాఫ్ట్వేర్ ఈ తరహా కేటుగాళ్లకు చెక్ చెబుతుంది. ఈ వ్యవస్థ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ) ద్వారా ఆర్టీఏ సర్వర్‌తో అనుసంధానించి ఉంటుంది. నగర వ్యాప్తంగా ఉండే కెమెరాల ద్వారా ఒకే నెంబర్‌తో రెండు వాహనాలు, కార్ల నెంబర్లతో ద్విచక్ర వాహనాలు, వేరే నెంబర్లతో తిరిగే ఆటోలను తక్షణం గుర్తిస్తుంది. ఆ విషయాన్ని ఆ వాహనం ప్రయాణించే ముందు జంక్షన్లలో ఉన్న క్షేత్రస్థాయి పోలీసులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తుంది. వాహన ‘మార్గాలను’ చెప్పేస్తుంది... నగర వ్యాప్తంగా సంచరించే వాహనాల ట్రాకింగ్ విధానం సైతం ఐటీఎంఎస్ ద్వారా అందుబాటులోకి రానుంది. 250 జంక్షన్లలో ఉండే సీసీ కెమెరాలు ఆయా ప్రాంతాల్లో సంచరించే ప్రతి వాహనాన్నీ నెంబర్‌తో సహా చిత్రీకరించి సర్వర్‌లో నిక్షిప్తం చేస్తాయి. ఏదైనా నేరానికి పాల్పడిన వాహనమో, అనుమానిత వాహనమో ఏ ప్రాంతం నుంచి ఏ సమయంలో ఎక్కడికి ప్రయాణించిందో క్షణాల్లో తెలుసుకునే అవకాశం ఈ సాఫ్ట్వేర్ ద్వారా కలుగుతుంది. సీసీసీలోని సిబ్బంది తేదీ, వాహనం నెంబర్‌ను ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే చాలు.. ఆయా రోజుల్లో సదరు వాహనం ఎక్కడ నుంచి నగరంలోకి ప్రవేశించింది? ఏ సమయంలో ఎక్కడ ఉంది? ఏఏ మార్గాల్లో ప్రయాణించింది? ఎక్కడెక్కడ ఆగింది? తదితర అంశాలను తెలియజేస్తుంది. కిడ్నాప్, స్నాచింగ్ వంటి నేరాలు జరిగినప్పుడు ఈ వ్యవస్థ అందించే ఆధారాలు కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించనున్నాయి. జంక్షన్ల వారీగా వాహన కౌంటింగ్... ప్రతి చౌరస్తా నుంచి నిమిషనిమిషానికీ ముందుకు సాగే వాహనాలను లెక్కించే ప్రక్రియ సైతం ఐటీఎంఎస్లోని సాఫ్ట్‌వేర్స్‌లో ఉన్నాయి. ఓ నిమిషం కాలంలో సదరు జంక్షన్‌ను ఎన్ని వాహనాలను దాటాయి? వాటిలో ద్విచక్ర, త్రిచక్ర, తేలికపాటి వాహనాలతో పాటు భారీ వాహనాలు, బస్సులు ఎన్ని? అనే అంశాన్ని ప్రత్యేక పరికరాల ద్వారా సాఫ్ట్వేర్ లెక్కిస్తుంది. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీసీసీలో ఉండే సిబ్బందికి తెలియజేస్తుంది. ఫలితంగా ఆయా సమయాల్లో ఏఏ రూట్లు బిజీగా ఉన్నాయో తెలుసుకునే సిబ్బంది ఆ విషయాన్ని జంక్షన్లలో ఉండే ప్రత్యే క బోర్డుల ద్వారా వాహనచోదకులకు అందిస్తారు. వీఎంఎస్లతో నిరంతరం సందేశాలు... ఐటీఎంఎస్ ద్వారా ప్రతి జంక్షన్‌లోనూ ఏర్పాటయ్యే వీఎంఎస్‌లు(వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డులు) ట్రాఫిక్ స్థితిగతులపై నిరంతర సందేశాలు ఇవ్వనున్నారు. ఓ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనచోదకుడికి ముందు రానున్న చౌరస్తా, రహదారిలో ట్రాఫిక్ స్థితిగతుల్ని ఎప్పికప్పుడు వీఎంఎస్‌ల్లో ప్రదర్శితమవుతాయి. ఉల్లంఘనులకు ‘ఈ’ చెక్... జంక్షన్లలో ఉన్న ఫ్రీ–లెఫ్ట్‌ను ఉల్లంఘిస్తూ ఆయా చోట్ల వాహనాలు ఆపినా... వన్‌వే నిబంధనను ఉల్లంఘించినా, వాహనాలు రాంగ్ రూట్లలో దూసుకువస్తున్నా... ప్రస్తుతం ఆయా చోట్ల ఉండే క్షేత్రస్థాయి పోలీసులే చర్యలు తీసుకోవాలి. ఐటీఎంఎస్ వ్యవస్థలో అన్ని జంక్షన్లతో పాటు రాంగ్‌రూట్, వన్‌వే ఉల్లంఘన అవకాశం ఉన్న ప్రాంతాల్లోనూ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. సర్వర్‌తో అనుసంధానించి ఉండే ఈ కెమెరాలు వాటంతట అవే ఆయా ఉల్లంఘనుల వాహనాలను ఫొటో తీస్తారు. సర్వర్ ఆధారంగా ఈ–చలాన్ సైతం ఆటోమేటిక్‌గా సంబంధింత వాహనచోదకుడి చిరునామాకు చేరిపోతుంది. దీంతో పాటు నో–పార్కింగ్, కమ్యూనిటీ పార్కింగ్, పెయిడ్ పార్కింగ్ ప్రాంతాలనూ జీయో ట్యాకింగ్, ఫెన్సింగ్ ద్వారా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. ఐసీసీసీ ఆధీనంలో ఏ కెమెరాలు ఎన్నంటే..? ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాక్స్, పీటీజెడ్, ఏఎన్పీఆర్ కెమెరాలు 10 వేలు నగర వ్యాప్తంగా వివిధ కీలక ప్రాంతాల్లోనివి 126 మూడు కమిషనరేట్లలోని 2828 జంక్షన్లలోనివి బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసి 38 ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాలు నేను సైతం, కమ్యూనిటీ ప్రాజెక్టుల కింద ఏర్పాటైన 4,99,869 (అవసరమైనప్పుడు యాక్సస్ చేయవచ్చు) జీపీఎస్ పరిజ్ఞానం ఉన్న గస్తీ వాహనాలకు ఏర్పాటు చేసినవి 1322 ట్రాఫిక్ నిర్వహణతో పాటు నేరగాళ్లకూ చెక్ దేశంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ వ్యవస్థగా రికార్డు -
ఆదిత్య సెల్ఫీ..!
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సూర్యుడి దిశగా దూసుకుపోతున్న ఆదిత్య–ఎల్1 కెమెరా పని మొదలుపెట్టింది. తన సెల్ఫీతోపాటు భూమి, చంద్రుడిని కూడా క్లిక్ మనిపించింది. ఈ మేరకు ఆదిత్య–ఎల్1 నుంచి అందుకున్న ఫొటోలను బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం గురువారం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో విడుదల చేసింది. ఆదిత్య–ఎల్1లో అమర్చిన కెమెరా ఈనెల 4న తీసిన సెల్ఫీలో వీఈఎల్సీ (విజిబుల్ ఎమిషన్ లైన్), ఎస్‌యూఐటీ(సోలార్ అ్రల్టావయొలెట్) పరికరాలు కనిపిస్తున్నాయి. అదే కెమెరా భూమి, చంద్రుడి ఫొటోలను కూడా తీసింది. ఆదిత్య–ఎల్1లో అమర్చిన ఏడు వేర్వేరు పేలోడ్లలో వీఈఎల్సీ, ఎస్యూఐటీలు కూడా ఉన్నాయి. ఆదిత్య–ఎల్1 భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజియన్ పాయింట్1(ఎల్1)లోని తన నిర్దేశిత కక్ష్యలోకి చేరుకున్నాక సూర్యుడి చుట్టు పరిభ్రమిస్తూ వీఈఎల్సీ పేలోడ్ ద్వారా రోజుకు 1,440 ఫొటోలను తీసి భూనియంత్రిత కేంద్రాలకు విశ్లేషణ నిమిత్తం పంపించనుంది. -
సీసీటీవీ కెమెరాలతో మెరుగైన భద్రత
సాక్షి, అమరావతి : నేరాల నియంత్రణ, మెరుగైన భద్రతకు సీసీటీవీ కెమెరాలు అత్యావశ్యకమని దేశంలోని పట్టణ ప్రాంత ప్రజలు గాఢంగా విశ్వసిస్తున్నారు. అందుకే దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల ప్రజలు తమ నివాస ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు మొగ్గుచూపుతున్నారు. కాలనీలు, అపార్ట్మెంట్లు, ఇతర నివాస ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవడం ఐదేళ్లుగా భారీగా పెరుగుతోందని ఫోర్బ్స్ సంస్థ ‘పోలీసింగ్ ఇన్ ఇండియా–2023’ నివేదిక వెల్లడించింది. ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం విస్తతితో భద్రత, వ్యక్తిగత ప్రైవసీ అనే రెండింటిలో ఎటువైపు మొగ్గుచూపాలి అనే అంశంపై ఐదేళ్ల క్రితం వరకు దేశ ప్రజల్లో ఓ సందిగ్థత ఉండేదని ఆ నివేదిక పేర్కొంది. కాలనీలు, నివాస ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడం తమ వ్యక్తిగత గోప్యతకు భంగకరమని భావించేవారు. బహిరంగ ప్రదేశాల్లో పోలీసు, మున్సిపల్ శాఖలు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నారు. కాబట్టి తమ నివాస ప్రాంతాల్లో ఇవి వద్దనే భావన ఉండేది. కానీ, నగర, పట్టణ ప్రాంత ప్రజల్లో ఆలోచనా దృక్పథం ఐదేళ్లలో మారిందని ఆ నివేదిక వెల్లడించింది. ప్రజలు తమ నివాసాలకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసుకుంటున్నారని తెలిపింది. నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ.. దేశంలో నగరాలు, ప్రధాన పట్టణ ప్రాంతాల్లో 51 శాతం మంది ప్రజలు తమ నివాస ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసుకున్నారు. నగరాల్లో 61 శాతం, ప్రధాన పట్టణాల్లో 46 శాతం ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి. నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని కాలనీల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో కర్ణాటక మొదటిస్థానంలో ఉండగా రెండు, మూడు స్థానాల్లో హరియాణా, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. కర్ణాటకలో 68శాతం, హరియాణాలో 67శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 33శాతం ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేసుకున్నారు. ప్రభుత్వం అత్యధికంగా ఈ కెమెరాలు ఏర్పాటుచేసిన వాటిలో ఢిల్లీ మొదటిస్థానంలో ఉంది. ఇక్కడ 54 శాతం ప్రాంతాల్లో ప్రభుత్వమే వీటిని ఏర్పాటుచేసింది. అలాగే, అత్యధిక ఆదాయ వర్గాల ప్రాంతాల్లో 73 శాతం, ఎగువ మధ్యతరగతి వర్గాల ప్రాంతాల్లో 63 శాతం, మధ్య తరగతి వర్గాలుండే చోట 45 శాతం, అంతకంటే తక్కువ ఆదాయ వర్గాల ప్రాంతాల్లో 28శాతం వరకు ఈ కెమెరాలు ఉన్నాయి. సీసీటీవీ కెమెరాలతో ‘ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ (ఎఫ్‌ఆర్‌టీ) పోలీసులకు అందుబాటులోకి వస్తోంది. దాంతో నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు మరింత సమర్థంగా నిర్వర్తించేందుకు ఆ శాఖకు ఇది ఉపయోగపడుతోంది. ఈ కెమెరాలు లేని ప్రాంతాల్లో కంటే ఉన్న ప్రాంతాల్లో నేరాలు 30 శాతం తగ్గినట్లు.. కేసుల ఛేదన 28 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. -
ఇక కెమెరాలు, ప్రింటర్లు.. మరిన్ని కీలక ఎలక్ట్రానిక్ పరికరాలపై ఆంక్షలు!
పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల దిగుమతులకు లైసెన్స్ తప్పనిసరి చేసిన భారత ప్రభుత్వం ఇప్పుడు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా అలాంటి ఆంక్షలు విధించే ఆలోచనలో ఉంది. ఈ ఉత్పత్తులలో కెమెరాలు, ప్రింటర్లు, హార్డ్ డిస్క్‌లు, టెలిఫోనిక్, టెలిగ్రాఫిక్ పరికరాల భాగాలు ఉండవచ్చని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఆ నివేదిక ప్రకారం, స్థానిక మార్కెట్లో ఈ ఉత్పత్తులకు అత్యధిక డిమాండ్ ఉండటంతో విదేశాల నుంచి పెద్డఎత్తున దిగుమతులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఉత్పత్తి అవకాశాలను ప్రోత్సహించాలంటే ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని దీనిపై అవగాహన ఉన్న వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వస్తువుల దిగుమతులు 2023 ఆర్థిక సంవత్సరంలో 10.08 బిలియన్ డాలర్లను అధిగమించాయి. ఇతర వస్తువులపైనా సమీక్ష! పైన పేర్కొన్న ఉత్పత్తులతో పాటు, అధిక దిగుమతి అవుతున్న ఇతర వస్తువులను ప్రభుత్వం సమీక్షిస్తున్నట్లు సమాచారం. వీటిలో యూరియా, యాంటీబయాటిక్స్, టర్బో-జెట్లు, లిథియం-అయాన్ అక్యుమ్యులేటర్లు, శుద్ధి చేసిన రాగి, యంత్రాలు, యాంత్రిక ఉపకరణాలు, సోలార్, ఫొటోవోల్టాయిక్ సెల్స్, అల్యూమినియం స్క్రాప్, పొద్దుతిరుగుడు విత్తన నూనె, జీడిపప్పు ఉన్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో, భారత్ మొత్తం సరుకుల దిగుమతులు 16.5 శాతం పెరిగి 714 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ దిగుమతులు పెరగడం వల్ల దేశం కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 2 శాతానికి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 1.2 శాతంగా ఉండేది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అగ్రిమెంట్-1 (ITA-1) పరిధిలోకి వచ్చే 250 ఉత్పత్తుల దిగుమతులపై ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఐటీఏ-1 జాబితాలో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, కంప్యూటర్లు, టెలికాం పరికరాలు, సెమీకండక్టర్లు, సెమీకండక్టర్ తయారీ, యాంప్లిఫైయర్లు, టెస్టింగ్ పరికరాలు, సాఫ్ట్వేర్, సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్లు సహా అనేక రకాల హై-టెక్నాలజీ వస్తువులు ఉన్నాయి. -
టోల్‌ప్లాజా, ఫాస్టాగ్ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు!
టోల్ ప్లాజాల వద్ద పొడవైన క్యూలను నివారించేందుకు కేంద్రం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) తరహాలో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ (ఫాస్టాగ్)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సాంప్రదాయ టోల్ వసూళ్ల విషయంలో కేంద్రం మార్పులు చేయాలని భావిస్తోంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలపై నంబర్ ప్లేట్లను గుర్తించేలా కెమెరా ఎయిడెడ్ టోల్ కలెక్షన్ సిస్టమ సాంకేతికతను ఉపయోగించనుంది. ఇందుకోసం ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ (ఏఎన్పీఆర్) కెమెరాలను అమర్చనుంది. నిరీక్షణ తప్పనుంది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ (ఎంఓఆర్టీహెచ్) శాఖ టోల్ ప్లాజాల వద్ద చెల్లింపుల కోసం వాహనాలు నిరీక్షించే సమయాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ఈ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. మరి ఫాస్టాగ్ ప్రస్తుతం, దేశం అంతటా దాదాపు 97 శాతం టోల్ వసూలు ఫాస్టాగ్ ద్వారా జరుగుతున్నాయి. అయినప్పటికీ టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉందని, వాహనాల రాకపోకలు నిలిచిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంఓఆర్టీహెచ్ తెలిపింది. ఈ ఏఎన్పీఆర్ కెమెరాలను సెటప్ చేయడం వల్ల టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించవచ్చు’ అని సూచించింది. ఏఎన్పీఆర్ ఎలా పనిచేస్తుంది? కేంద్ర హైవే రవాణా శాఖ వివరాల ప్రకారం..దేశంలో జాతీయ ప్రధాన రహదారుల్లో ఉన్న టోల్ గెట్లను తొలగించి...వాటి స్థానంలో లేటెస్ట్ టెక్నాలజీ ఏఎన్పీఆర్ కెమెరాల్ని ఇన్ స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఈ సాంకేతికత వాహనం నంబర్ ప్లేట్ మీద నెంబర్‌ను చదివి, సదరు వాహన యజమాని లింక్ ఫోన్ నెంబర్‌కు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుంచి టోల్‌కు చెల్లించాల్సిన అమౌంట్‌ను డిడక్ట్ చేస్తుంది. వాహనాల నంబర్ ప్లేట్ల ఫోటోను క్యాప్చర్ చేయడానికి సిస్టమ్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏఎన్పీఆర్ కెమెరాలతో సన్నద్ధం చేస్తుంది. ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు కెమెరా వాహనదారుడి బ్యాంక్ ఖాతా నుండి టోల్ మొత్తాన్ని వసూలు చేసేలా సిస్టమ్‌కు సిగ్నల్ ఇస్తుంది. ఏఎన్పీఆర్ సమర్థవంతంగా పనిచేస్తుందా? ఏఎన్‌పీఆర్‌తో టోల్ గేట్ల వద్ద రద్దీని తగ్గిస్తామని కేంద్రం చెబుతున్నప్పటికీ..దీనిపై అనేక సందేహాలు వ్యక్త మవుతున్నాయి. ఈ పద్దతిలో 2019 తర్వాత కేటాయించిన నెంబర్ ప్లేట్లను మాత్రమే గుర్తించే అవకాశం ఉంది. ఎందుకంటే, భారత ప్రభుత్వం 2019లో ప్రయాణీకుల వాహనాలకు ఓఈఎం (Original Manufacturer Number ) నెంబర్‌ను అమలు చేసింది. కెమెరాలు ఈ కంపెనీ అమర్చిన నంబర్ ప్లేట్లను మాత్రమే చదవగలవు. దీంతో పాటు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ (ఏఎన్పీఆర్ ) కెమెరాలు నంబర్ ప్లేట్ తొమ్మిది అంకెల రిజిస్ట్రేషన్ నంబర్‌ను మించి ఉన్నప్పుడు చదవడం సవాలుగా మారనుంది. దేశంలో చాలా మంది వాహన యజమానులు నంబర్ ప్లేట్‌పై పేర్లు రాస్తుంటారు. దీని వల్ల సదరు నెంబర్ ప్లేట్లను గుర్తించడం కష్టం నెంబరు ప్లేట్లు మురికిగా ఉంటే వాటిని గుర్తించలేం. అలాంటి వాహనాలకు టోల్ వసూలు చేయడం చాలా కష్టం. అలాగే, ఏఎన్పీఆర్ కింద టోల్ చెల్లించకుండా టోల్ ప్లాజాలను దాటేందుకు ప్రయత్నించే వాహన యజమానులకు జరిమానా విధించే నిబంధన లేదు. -
నీటి అడుగున అద్భుతాల్ని క్లిక్ మనిపించే డ్రోన్ కెమెరా
నీటి అడుగున ఉండే వింతలను కళ్లారా చూడాలని, వాటి ఫొటోలు తీసుకోవాలని చాలామందికి కోరికగా ఉన్నా, నేరుగా నీటిలోకి దూకడానికి తటపటాయిస్తారు. సరదాగా స్విమ్మింగ్ పూల్లోనో, చిన్నపాటి చెరువులోనో ఈతలు కొట్టేవాళ్లు కూడా సముద్రంలోకి దిగాలంటే వెనుకంజ వేస్తారు. మరి నీటి అడుగున ఉన్న వింత విడ్డూరాలను ఫొటోలు తీసుకోవడమెలా? ఇదిగో, ఈ ఫొటోలో కనిపిస్తున్న బుల్లి డ్రోన్ ఉంటే భేషుగ్గా నీటి అడుగున ఉండే వింత విడ్డూరాల ఫొటోలు సులభంగా తీసుకోవచ్చు. గ్రీస్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ‘బెంటిక్స్’ ఈ మినియేచర్ అండర్‌వాటర్ డ్రోన్‌ను రూపొందించింది. ఇది లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఒకసారి చార్జ్ చేస్తే, నీటి అడుగున గంటన్నరసేపు నిక్షేపంగా చక్కర్లు కొడుతూ ఫొటోలు, వీడియోలు తీసి దీనికి అనుసంధానమైన యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు పంపగలదు. దీనిని రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రించవచ్చు. దీని పొడవు 11.8 అంగుళాలు, వెడల్పు 9.8 అంగుళాలు, ఎత్తు 5.9 అంగుళాలు. బరువు ఐదు కిలోలు మాత్రమే! దీనిని ఎక్కడికైనా తేలికగా తీసుకుపోవచ్చు. ‘బెంటిక్స్’ ప్రస్తుతం దీనిని నమూనాగా రూపొందించింది. ఆసక్తిగల సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తే, మార్కెట్లోకి తీసుకొచ్చేలా దీని ఉత్పాదన భారీ స్థాయిలో ప్రారంభిస్తామని ‘బెంటిక్స్’ ప్రతినిధులు చెబుతున్నారు. -
ట్రిపుల్ ఏఐ రియర్కెమెరాతో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్, అదీ బడ్జెట్ ధరలో
సాక్షి,ముంబై: భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. 50మెగాపిక్సెల్ AI ట్రిపుల్ కెమెరా, 6X జూమ్ పెరిస్కోప్-స్టైల్‌తో లావా బ్లేజ్ ప్రొ అనే కొత్త బడ్జెట్ ఫోన్‌ను మంగళవారం విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన లావా బ్లేజ్‌కు ఈ స్మార్ట్‌ఫోన్ సక్సెసర్. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, బాటమ్-ఫైరింగ్ స్పీకర్, ప్రీమియం ఫ్రోస్టెడ్ గ్లాస్ డిజైన్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్, టైప్‌సీ చార్జర్లాంటి ఇతర ఫీచర్లను ఇందులో అందించడం విశేషం. లావా బ్లేజ్ ప్రొ స్పెసిఫికేషన్స్ 6.5అంగుళాల HD డిస్ప్లే ఆండ్రాయిడ్ 12, MediaTek G37 ఆక్టా-కోర్ ప్రాసెసర్ 4జీబీర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 8మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో 5000mAh బ్యాటరీ కెపాసిటీ ధర, లభ్యత లావా బ్లేజ్ ప్రో రూ. 10,499లుగా కంపెనీ ధర నిర్ణయించింది. గ్లాస్ గ్రీన్, గ్లాస్ ఆరెంజ్, గ్లాస్ బ్లూ , గ్లాస్ గోల్డ్ అనే నాలుగు విభిన్న రంగుల్లో ఈ ఫోన్ లభ్యం. ఫ్లిప్‌కార్ట్, లావా ఇ-స్టోర్ దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. -
షావోమి 200 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్ త్వరలోనే
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమి త్వరలోనే 200 ఎంపీ కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, 200MP సెన్సార్, స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్సెట్, 120Hz డిస్ప్లే , 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫోన్ అందుబాటులో రానుంది. ఇప్పటికే మోటరోలా తన తదుపరి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను 200 ఎంపీ కెమెరాతో లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. అలాగే శాంసంగ్ కూడా 50 మెగాపిక్సెల్ ISOCELL జీఎన్ఎస్ సెన్సార్, 200-మెగాపిక్సెల్ సెన్సార్‌తో స్మార్ట్ఫోన్లను తీసుకొస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇపుడు ఈ రేసులో షావోమి కూడా చేరింది. కాగా ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో విక్రేతలు దేశంలో 38 మిలియన్ స్మార్ట్ఫోన్లను రవాణా చేయడంతో 2022 క్యూ1లో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సంవత్సరానికి కేవలం 2 శాతం మాత్రమే పెరిగింది. ఈ సమయంలో 8 మిలియన్ యూనిట్లన విక్రయాలతో షావోమి ఇండియాలో టాప్ బ్రాండ్‌గా నిలిచింది. శాంసంగ్ 6.9 మిలియన్ యూనిట్లను షిప్పింగ్ చేసింది. -
క్లిక్ 'మని' సంపాదిస్తున్నారు!
ఫొటోలు దిగడమే కాదు.. ఫొటోలు తీయడాన్ని కూడా యువత ట్రెండ్‌గా మార్చేస్తోంది. ఖాళీ దొరికినప్పుడల్లా ఖరీదైన కెమెరాలను భుజాన వేసుకుని బైక్‌లపై ఫొటోషూట్‌కు పరుగెడుతోంది. తమలోని అభిరుచులను ఎప్పటికప్పుడు కొత్తగా ప్రదర్శిస్తూ ఔరా అనిపిస్తోంది. ఒకవైపు చదువుకుంటూనే..మరోవైపు కెమెరాలు క్లిక్‌మనిపిస్తూ అనుభూతితో పాటు ఆదాయాన్ని కూడా ఆర్జిస్తోంది. సాక్షి, అమరావతి: ఇటీవల కాలంలో యువత ఫొటోగ్రఫీపై మక్కువ పెంచుకోవడంతో పాటు సొంత కెమెరా కొనుక్కోవడం కోసం విలాసాలకు దూరంగా ఉంటోంది. ఖరీదైన సెల్ఫోన్లు, బైక్‌ల వాడకాన్ని తగ్గించుకుని ఆ డబ్బుతో మంచి కెమెరాను కొనుగోలు చేసి తనలోని ప్రతిభ అందులో బంధిస్తోంది. ఇంటర్ మొదలు ఇంజనీరింగ్ వరకు చాలా మంది విద్యార్థులు ఫొటోగ్రఫీని హాబీగా మార్చుకుంటున్నారు. వాయిదా పద్ధతుల్లో రూ.40 వేల నుంచి రూ.లక్షకు పైగా వెచ్చించి కెమెరాలు కొనుగోలు చేస్తున్నారు. సాయంత్ర సమయాలు, వారాంతాల్లో స్నేహితులకు ఫొటో షూట్లు చేస్తూ పాకెట్‌మనీని సంపాదించుకుంటున్నారు. ఒక్కో కాపీకి రూ.60 నుంచి రూ.150 వరకు వసూలు చేస్తున్నారు. సరాసరి నెలకు రూ.6,000 నుంచి రూ.10,000 వరకు ఆర్జిస్తున్నారు. కొందరైతే చదువును కొనసాగిస్తూనే ఫొటోగ్రఫీపై పూర్తిగా ఆధారపడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇంటి వద్దనే ఎడిటింగ్ వర్క్ చేస్తూ నెలకు రూ.15,000 నుంచి రూ.25,000 వరకు సంపాదిస్తున్నారు. డబ్బు సంపాదన లక్ష్యం కాకుండా కూడా ఫ్రీలాన్సర్లుగా నేచర్, వైల్డ్ ఫొటోగ్రఫీని ఆస్వాదిస్తూ..స్నేహితులు, కళాశాలల్లో కార్యక్రమాలకు ఫొటోలు తీస్తున్న యువత కూడా ఉంది. సోషల్ మీడియా మేనియా.. యువత రోడ్లు, పార్కులు, పర్యాటక ప్రాంతాలు, జలాశయాలు, పురాతన కట్టడాలు, హిల్ స్టేషన్లలో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా దిగిన ఫొటోలను వెంటనే ఫేస్బుక్, వాట్సాప్ స్టేటస్, డీపీ ఇలా నచ్చిన సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ మురిసిపోతున్నారు. ఇందుకోసమే విద్యార్థులు కళాశాలల్లో జట్టుగా ఏర్పడి ప్రతి వారాంతంలో ఫొటో షూట్లకు వెళ్లడం అలవాటుగా మార్చుకున్నారు. ఈ క్రమంలో అందరూ కలిసి కెమెరాను కొనుగోలు చేయడమో..అద్దెకు తీసుకోవడమో చేస్తున్నారు. ప్రతిభకు మెరుగులు ఇలా.. తొలుత తోటి విద్యార్థులు, తెలిసిన వాళ్లకు ఫొటోలు తీస్తూ తమలోని ప్రతిభకు పదును పెడుతున్నారు. పనితనం నచ్చిన వాళ్లు ఈవెంట్, ఔట్ డోర్ ఫొటోషూట్లకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా పట్టణాల్లోని ప్రముఖ స్టూడియోలు, ఫొటోగ్రాఫర్లు సదరు యువతను స్టిల్ ఫొటోగ్రఫీకి పార్ట్‌టైమర్లుగా నియమించుకుంటున్నారు. అద్దెకు కెమెరాలు సొంత కెమెరాలు లేని వారు అద్దె ప్రాతిపదికన కెమెరాలను తీసుకువచ్చి ఫొటోషూట్లు చేస్తున్నారు. 8 గంటలు, 12 గంటల వ్యవధిలో సెమీ ప్రొఫెషనల్ కెమెరాలకు రూ.600 నుంచి రూ.1,000, డీఎస్ఎల్ఆర్ ప్రొఫెషనల్ కెమెరాలకు రూ.1,000 నుంచి రూ.2,000, మిర్రర్ లెస్ హైలీ ఫ్రొఫెషనల్ కెమెరాలకు రూ.2,500 నుంచి రూ.5,000 వరకు అద్దె చెల్లిస్తున్నారు. ఈవెంట్‌ను బట్టి కెమెరాలను తీసుకుంటూ తమ ప్యాకేజీలను ఫిక్స్ చేస్తున్నారు. సరదాగా నేర్చుకున్నా.. కుటుంబాన్ని పోషిస్తోంది! నేను సరదాగా ఫొటోగ్రఫీ నేర్చుకున్నాను. ఇప్పుడది నా కుటుంబాన్ని పోషించే మార్గాన్ని చూపించింది. ఆరేళ్ల కిందట మా నాన్న మాకు దూరమయ్యారు. అప్పుడు నేను ఇంటర్లో ఉన్నాను. అప్పటి నుంచి మా అమ్మ, తమ్ముడి బాధ్యత నేనే చూసుకుంటున్నాను. ఇప్పుడు నేను బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాను. వారాంతాల్లో కాలేజీ స్టూడెంట్స్‌కు ఫొటో షూట్లు చేస్తూనే..బయట నుంచి వచ్చిన వీడియో ఎడిటింగ్ వర్క్స్ చేస్తూ నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు సంపాదిస్తున్నాను. నాకు సొంతంగా రెండు ఫొటో, ఒక వీడియో కెమెరాలు ఉన్నాయి. – బి.నవీన్, సామర్లకోట, తూర్పుగోదావరి జిల్లా -
డీఎస్ఎల్ఆర్ కెమెరా కాస్ట్ ఎంతైనా..ఫోన్లోని ఈ ఫీచర్ ముందు దిగదుడుపే!
దూరంలో ఉన్న ఆబ్జెక్ట్లను ఫోన్లో బంధించడం అంటే మీకిష్టమా? జూమ్ చేస్తే ఫోటోల క్లారిటీ మిస్సవుతుందా? ప్రొఫెషనల్‌గా ఫోటోలు తీసేందుకు డీఎస్ఎల్ఆర్ కెమెరాను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. కెమెరాతో పని లేకుండా చేతిలో ఉండే ఫోన్లతో దూరంలో ఉన్న వ్యక్తుల్ని, వస్తువుల్ని హై క్వాలిటీతో ఫోటోలు తీయొచ్చు. ఎలా అంటారా?! ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.ఈ ఏడాదిలో టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ ఐఫోన్ 14 సిరీస్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఫోన్ విడుదల తరువాత ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లలో భారీ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2023లో యాపిల్ సంస్థ ఐఫోన్ 15 సిరీస్‌లోని ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో మోడళ్లను యూజర్లకు పరిచయం చేయనుంది. అయితే ఈ ఫోన్ రేర్ కెమెరా సిస్టమ్‌లో పెరిస్కోప్ లెన్స్ ఉండనున్నాయి. ఈ ఫీచర్ సాయంతో ఇప్పుడున్న ఐఫోన్13, ఐఫోన్14 సిరీస్ ఫోన్ల కంటే ఐఫోన్15 ఫోన్ కెమెరాతో మన కంటికి కనిపించే రేణువుల్ని సైతం హైక్వాలిటీలో జూమ్ చేసి మరి వీక్షించవచ్చు. అనలిస్ట్ జెఫ్ పీయూ ప్రకారం.. ఐఫోన్ 15 ప్రోలో ఉన్న ఓ మూడు కెమెరాలలోని ఓ కెమెరాను పెరిస్కోప్ లెన్స్‌ను యాపిల్ అమర్చనున్నట్లు తెలిపారు. దీంతో ప్రస్తుతం ఐఫోన్ 13 ప్రో 3 ఎక్స్ ఆప్టికల్ జూమ్ కంటే మెరుగ్గా..ఐఫోన్ 15 ప్రో కెమెరాను 10ఎక్స్ వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చని అన్నారు. కొత్తేం కాదు ఐఫోన్ 15ప్రోలో అందుబాటులోకి తెచ్చే ఈ పెరిస్కోప్ లెన్స్ కొత్త ఫీచర్లేం కాదు. ఇప్పటికే పలు ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ ఫోన్లైన శాంసంగ్ గెలాక్సీ ఎస్21 అల్ట్రా, హువావే పీ40 ప్రో ప్లస్ ఫోన్లలో రేర్ కెమెరాలో ఈ పెరిస్కోప్ కెమెరాలు ఉన్నాయి. ఈ కెమరాల సాయంతో జర్నీలో లేదంటే, వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు ఈ పెరిస్కోప్ లెన్స్‌లోని ఫోక్స్(వెలుతురు) యాంగిల్ మిర్రర్ మీదిగా ప్రతిభింభించి మనం చూడాలనుకున్న టార్గెట్ మీద పడుతుంది. దీంతో చికటి కాస్తా వెలుతురు వెదజల్లుతుంది. అంతేకాదు జూమ్ చేసేందుకు, ఏదైనా ఫోటో బ్లెర్గా ఉన్న మనకు స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. రెండేళ్ల నుంచి ప్రచారం.. యాపిల్ ఐఫోన్లలో పెరిస్కోప్ ఫీచర్‌ను అదిగో అప్పుడు తెస్తుందని, ఇదిగో ఇప్పుడే తెస్తుందంటూ టెక్ మార్కెట్లో గత రెండేళ్ల నుంచి ప్రచారం కొనసాగుతుంది. కానీ ఇప్పటి వరకు అలాంటి ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొని రాలేదు. ఇదే అంశంపై ప్రఖ్యాత విశ్లేషకుడు మింగ్-చి కువో మాట్లాడుతూ..పెరిస్కోప్ కెమెరా ఐఫోన్ 14 ప్రోలో ఉంటుందని, కానీ తాజాగా చిప్‌తో పాటు ఇతర కారణాల వల్ల ఐఫోన్ 15ప్రో ఈ పెరిస్కోప్ కెమెరాతో మార్కెట్లో విడుదలవుతుందని అన్నారు. ఐఫోన్ 13 ప్రో మోడల్‌లలో సాధారణ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ సర్వ సాధారణం. అయితే అనేక ఆండ్రాయిడ్ ఫోన్లు ఇప్పటికే 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ కెమెరాలను మార్కెట్లోకి విడదల చేస్తున్నాయి. అంతేకాదు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఫోటోలు, వీడియోలు తీసేందుకు డీఎస్ఎల్ఆర్ కెమెరాల అవసరం ఉండదని, ఫోన్‌తోనే దూరంగా ఉన్నా సరే ఫోటోల్ని అందంగా తీయొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: ఊసరవెల్లిలా రంగులు మార్చే ఫోన్ చూశారా..? -
సంచలన ఆవిష్కరణ.. ఇక స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా బంప్స్ కనపడవు!
ప్రస్తుత స్మార్ట్ టెక్నాలజీ యుగంలో స్మార్ట్‌ఫోన్ ఇల్లు లేదు అని చెప్పుకోవడంలో పెద్ద అతిశయోక్తి లేదు. అంతలా విస్తరించింది, ఈ స్మార్ట్‌ఫోన్ ప్రపంచం. అయితే, ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్ కొనే ముందు తప్పక చూసే ఫీచర్స్‌లలో కెమెరా అనేది చాలా ముఖ్యమైనది. ఈ మధ్య కొన్ని కంపెనీలు యూజర్లను ఆకట్టుకోవడం కోసం పెద్ద, పెద్ద కెమెరాల గల స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ఇవీ, పనితీరు పరంగా చూస్తే బాగానే ఉన్న, చూడాటానికి అంత బాగుండటం లేదు. దీనికి, ముఖ్య కారణం మన స్మార్ట్‌ఫోన్ కెమెరాల వెనుక ఉండే పెద్ద, పెద్ద కెమెరా బంప్స్. ఇలా కెమెరా బంప్స్ పెద్దగా ఉండటం వల్ల కొన్నిసార్లు స్మార్ట్‌ఫోన్ లుక్ కూడా దెబ్బతింటుంది. అయితే, ఈ సమస్యకు చెక్ పెడుతూ.. ప్రిన్స్టన్, వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు సరికొత్త ఆవిష్కరణతో ముందుకు వచ్చారు. మన స్మార్ట్ఫోన్లు నానో కెమెరాలతో త్వరలో రానున్నాయి. మీరు నానో కెమెరా సైజ్ గురుంచి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇది చూడాటానికి చిన్నగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రోబోటిక్స్ టెక్నాలజీ సహాయంతో నానో కెమెరాలను తయారు చేయవచ్చు అని పరిశోధకులు అన్నారు. ఈ అత్యంత చిన్న కెమెరాలో 1.6 మిలియన్ స్థూపాకార పోస్ట్‌లు ఉన్నాయి. ఇవి కాంతిని ప్రాసెస్ చేయడానికి సహాయపడతాయి. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే?, ఈ నానో కెమెరా చిప్‌ను సంప్రదాయ కంప్యూటర్ చిప్స్ లాగా ఉత్పత్తి చేయవచ్చు. ఇవి అల్గోరిథంలపై ఆధారపడి పనిచేస్తాయి. నేచర్ కమ్యూనికేషన్స్‌లో వచ్చిన కథనం ప్రకారం.. నానో కెమెరాల కొత్త జెన్ ఔషధం, రోబోటిక్స్ లో ఉపయోగించే ప్రస్తుత నానో కెమెరా టెక్నాలజీతో సహాయంతో పనిచేస్తాయి. కొత్త నానో కెమెరాలతో చిత్రాలను సంప్రదాయ కెమెరాలతో సమానంగా పరిశోధకులు తీయగలిగారు. ఈ నానో కెమెరాలలో ఉపయోగించే కొత్త టెక్నాలజీని "మెటాసర్ఫేస్" అని పిలుస్తారు. దీనిలో సంప్రదాయ కెమెరా లోపల వక్రమైన కటకాలను నానో క్యామ్ ల ద్వారా ఉంచుతారు. ఇవీ, కేవలం అర మిల్లీమీటర్ వెడల్పుతో ఉంటాయి. పనితీరు పరంగా చూసిన ఇప్పుడు ఉన్న కెమెరాలతో సరిసమానంగా పనిచేస్తాయి అని వారు తెలిపారు. (చదవండి: ఆండ్రాయిడ్ 13 ఫీచర్లు లీక్, వారెవ్వా.. అదరగొట్టేస్తున్నాయ్!) -
అమ్మ బాబోయ్.. ఇవేం కెమెరాలు
సరదాగా కారులో పోయేప్పుడు.. ఉల్లాసం కోసం ఫుల్ సౌండ్‌లో రేడియో వింటాం. సరదాగా బయటకు తొంగి చూస్తుంటాం. ఒక్కోసారి హడావిడిలో సిగ్నల్ జంప్ కొట్టి పోతాం. దారినపోయే వెహికిల్స్‌కు కట్టింగ్లు కొడతాం. ఓ.. ఇంకా చాలా పనులు చేస్తాం. ఇదంతా వ్యక్తిగతంగా ఫీలవుతుంటారు చాలామంది. అయితే ఆ వ్యక్తిగతంపై నిఘా నీడలు అలుముకుంటే?.. యస్.. అలాంటి పవర్ఫుల్ కెమెరాలు సమీప భవిష్యత్తులో మనదగ్గరికీ రాబోతున్నాయి. తన డెలివరీ వ్యవస్థను పటిష్టపర్చుకునేందుకు కొత్త తరహా కెమెరా నిఘా వ్యవస్థను తీసుకొచ్చింది అమెజాన్. ఆన్లైన్ సేల్స్, గూడ్స్ డెలివరీ సర్వీసుల్లో భాగంగా డెలివరీ వెహికిల్స్‌లో ‘నెట్రాడైన్ కెమెరాల’ను ఉపయోగిస్తోంది అమెజాన్. డెలివరీ బాయ్స్ మీద నిఘా, భద్రత దృష్ట్యా త్వరలో వీటిని భారత్‌లో ప్రవేశపెట్టాలని అమెజాన్ భావిస్తోంది. పూర్తి అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీతో పని చేసే ఈ కెమెరాలు.. ప్రతీది నిశితంగా పరిశీలిస్తాయి. నాలుగు లెన్స్‌ల ఈ కెమెరాలు ముందుగా డెలివరీ డ్రైవర్ ముఖాన్ని, బాడీని స్కాన్ చేసుకుని ఆ బయోమెట్రిక్ డేటా ద్వారా షిఫ్ట్‌లో ఉన్నంతసేపు పర్యవేక్షిస్తుంటుంది. డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకున్నారా? రోడ్లపై సరిగా వెళ్తున్నారా? సమయానికి డెలివరీలు అందిస్తున్నారా? ఇలా.. ప్రతీది చూస్తుంటాయి. పైగా ఈ కెమెరాల ద్వారానే డ్రైవర్ల పనితీరుపై ఓ అంచనాకి రావడం, బోనస్‌లు, ఇతరత్రా నజరాల్ని ప్రకటిస్తున్నారు. అయితే.. డ్రైవర్ల ఆవేదన ఈ హైస్టాండర్డ్ కెమెరాల వల్ల తాము శిక్షకు గురికావాల్సి వస్తోందని కొందరు డెలివరీ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిరంతర పర్యవేక్షణ వల్ల సమయానికి డెలివరీలు చేయలేకపోతున్నామని, తద్వారా జీతంలో కోతలు.. పనితీరు సరిగా లేదనే నోటీసులు అందుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. చివరికి డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ‘ఆవులించినా సరే’.. సదరు ఉద్యోగికి నెగెటివ్ పాయింట్స్ పడుతున్నాయట. అయితే అమెజాన్ మాత్రం ‘ఏఐ కెమెరా’ చర్యలను సమర్థించుకుంటోంది. 48 శాతం యాక్సిడెంట్లు తగ్గాయని, ట్రాఫిక్ ఉల్లంఘనలు 77 శాతం తగ్గాయని చెబుతోంది. సీట్ బెల్ట్ ఛలానాలు, నిర్లక్క్ష్యపు డ్రైవింగ్ ఉదంతాలు సైతం తగ్గినట్లు చెబుతోంది. చదవండి: ఇదేం అమ్మాయి.. ఈ భూమ్మీద ఎక్కడా చూసి ఉండరు!! -
Samsung Vs One Plus: కెమెరాల పని అయ్యింది ఇక డిస్ప్లేల వంతు!
సాక్షి, వెబ్‌డెస్క్ : ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా ఉన్న ఇండియాలో కొత్త యుద్దానికి తెర లేచింది. ఇంత కాలం చిప్సెట్స్, కెమెరాల విషయంలో పోటాపోటీగా మోడళ్లు విడుదల చేసిన ఫోన్ తయారీ కంపెనీలు ఇప్పుడు డిస్ప్లే కేంద్రంగా వార్ రెడీ అయ్యాయి. బ్రాండ్ వార్ స్మార్ట్‌ఫోన ఇండస్ట్రీలో గడిచిన ఐదేళ్లలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. శామ్సంగ్, యాపిల్ వంటి బడా కంపెనీలను వెనక్కి నెట్టి మరీ చైనాకు చెందిన వన్‌ప్లస్, షావోమీ, రియల్మీ, ఒప్పో, వివోలు మార్కెట్‌పై పట్టు సాధించాయి. మైక్రోమ్యాక్స్, సెల్కాన్ వంటి దేశీ కంపెనీలను చైనా మొబైల్ బ్రాండ్స్ వెనక్కి నెట్టాయి. నోకియా ఇంకా ఫీచర్ ఫోన్లను దాటి ముందుకు రాలేకపోయింది. హ్యువావే, ఎల్జీ, సోనిలు పత్తా లేకుండా పోయాయి. ప్రస్తుతం శామ్సంగ్, చైనా కంపెనీల మధ్యనే ప్రైస్‌వార్, ఫీచర్ వార్ జరుగుతోంది. ఎన్ని కెమెరాలు, పిక్సెల్ ఎంత స్మార్ట్ఫోన్లకు సంబంధించి గడిచిన నాలుగేళ్లుగా వెనుక వైపు ఎన్ని కెమెరాలు ఉన్నాయి. వాటి మెగాపిక్సెల్ ఎంత అనే అంశం చుట్టూనే ఇటు శామ్సంగ్, అటు షావోమీ వంటి చైనా కంపెనీలు పోటీ పడ్డాయి. ఈ పోటీ పెరిగి వెనుక వైపు నాలుగు, ముందు వైపు రెండు కెమెరాలు అందించే స్థాయికి చేరుకున్నాయి. ఇక కెమెరా సామర్థ్యానికి సంబంధించి 16 మెగా పిక్సెల్స్ దగ్గర మొదలైన పోటీ 48 మెగా పిక్సెల్స్ మీదుగా 108 మెగా పిక్సెల్స్ వరకు చేరుకుందీ. ఇదే సమయంలో ర్యామ్ కెపాసిటీ విషయంలోనూ పోటీ నెలకొని ఉండేది. ఇక్కడ కూడా ఇరు వర్గాలు సమస్థాయికి చేరుకున్న బ్యాటరీ సామర్థ్యం మీద ఫోకస్ చేశాయి. టాప్ నాచ్, డ్రాప్ నాచ్ అంటూ మోడళ్లు విడుదల చేసినా అవి లాంగ్‌రన్‌లో ప్రభావం చూపలేదు. కెమెరా, ర్యామ్, ప్రాసెసర్లే ప్రధానంగా పోటీ నెలకొంది. డిస్ప్లే క్వాలిటీ విషయంలో పోటీ ఉన్నా హెచ్డీ, ఫుల్హెచ్డీ దగ్గరే చైనా కంపెనీలు ఆగిపోగా శామ్సంగ్ అమోల్డ్ డిస్ప్లే తో అదరగొట్టింది. శామ్సంగ్ నోట్, ఎస్ సిరీస్‌లో 4కే డిస్ప్లేలు ఇచ్చి టాప్‌గా నిలవగా వన్‌ప్లస్ సైతం బరిలోకి దిగింది. వీడియో కంటెంట్‌కి గిరాకీ జియో రాకతో ఒక్కసారిగా ఇండియాలో నెట్ కంటెంట్ వాడకం పెరిగింది. దీనికి తోడు లాక్డౌన్ కారణంగా వీడియో కంటెంట్‌కి డిమాండ్ పెరిగింది. రోజుకో వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ అందుబాటులోకి వస్తోంది. దీంతో డిస్ప్లే క్వాలిటీతో పాటు సైజుకి కూడా ప్రాధాన్యత పెరిగింది. గతేడాదే శామ్సంగ్ జెడ్ సిరీస్‌లో ఫ్లిప్ అంటూ డబుల్ డిస్ప్లే ఫోన్లను అందుబాటులోకి తెచ్చినా పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో జెడ్ సిరీస్‌కే మరిన్ని హంగులు జోడించి ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. జెడ్ సిరీస్‌లో రెండు తెరలు కలిపితే స్క్రీన్ సైజు 7.30 ఇంచులుగా ఉంది. దాదాపు ట్యాబ్ స్థాయిలో ఈ స్ర్రీన్ ఉండనుంది. శామ్సంగ్ వర్సెస్ వన్ ప్లస్ నాణత్య పాటిస్తూ తక్కువ బడ్జెట్లో హై ఎండ్ ఫీచర్లు అందిస్తూ వన్ ప్లస్ బ్రాండ్ మార్కెట్లో తనదైన ముద్ర వేసుకుంది. హై ఎండ్ సెగ్మెంట్లో యాపిల్, శామ్‌సంగ్‌కి ధీటుగా ఎదిగింది. బడ్జెట్‌కి ప్రాముఖ్యత ఇచ్చే ఇండియన్ మార్కెట్లో స్థిరమైన స్థానం సాధించింది. అన్నింటా శామ్సంగ్, యాపిల్‌కు పోటీ ఇచ్చే వన్‌ప్లస్ ఇప్పుడు బిగ్ స్క్రీన్ విషయంలోనూ వెనక్కి తగ్గేది లేదంటోంది. ఆగస్టులో బిగ్ స్క్రీన్ ఫోన్ రిలీజ్ చేస్తామంటూ శామ్సంగ్ దాదాపు రెండు నెలల ముందు నుంచే లీకులు ఇస్తూ వచ్చింది. చివరకు ఆగస్టు 11న డేట్ ఫిక్స్ చేసింది. సరిగ్గా శామ్సంగ్ ఈవెంట్‌కి ఒక్క రోజు ముందే వన్‌ప్లస్ సప్రైజింగ్ న్యూస్ చెప్పింది. తమ బ్రాండ్ నుంచి కూడా బిగ్ స్క్రీన్ ఫోన్ వస్తోందంటూ వన్‌ప్లస్ యూఎస్ఏ ట్విట్టర్ పేజీలో టీజర్ రిలీజ్ అయ్యింది. దీంతో రెండు కంపెనీల మధ్య ఆసక్తికర పోరుకి తెరలేచింది. 8.11 10am EThttps://t.co/mmPi4jlrhx pic.twitter.com/U6lPdrFnjf — OnePlus➕ (@OnePlus_USA) August 10, 2021 ప్రభావం చూపుతుందా ? మొబైల్ బ్రాండ్ల మధ్య ధర, కెమెరా, ర్యామ్, చిప్సెట్, బ్యాటరీ బ్యాకప్ విషయంలోనే గట్టి పోటీ నెలకొంది. వీటి ఆధారంగానే అమ్మకాలు సాగాయి. మధ్యలో ఫింగర్ ప్రింట్ స్కానర్, నాచ్, డిస్ ప్లే రి ఫ్రెష్ రేటు విషయంలో కంపెనీలు ప్రయోగాలు చేసినా అవేమీ అమ్మకాలపై గణనీయమైన ప్రభావం చూపలేదు. ఇప్పుడు బిగ్ స్క్రీన్ వార్ నిజంగానే ప్రభావం చూపుతుందా లేక కొద్ది కాలం హడావుడి తర్వాత సద్దుమణుగుతుందా అనేది తేలాల్సి ఉంది. -
ఫీచర్స్ లీకయ్యాయి, ఆపిల్ తరహాలో
టెక్ యుగంలో గాడ్జెట్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. దైనందిన జీవితంలో భాగమైన గాడ్జెట్స్‌ను విడుదల చేసేందుకు ఆయా స్మార్ట్ దిగ్గజ సంస్థలు పోటీ పడుతున్నాయి. తాజాగా చైనా సంస్థ రియల్ మీ టాబ్లెట్, రియల్ మీ ప్యాడ్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ ఏడాదిలోపే విడుదల కానున్న ఈ గాడ్జెట్స్ ధర ఎంతో కన్ఫామ్ కాకపోయినప్పటికి వాటి ఫీచర్స్ లీకయ్యాయి. ఫీచర్స్ ఇలా ఉన్నాయి టిప్‌స్టెర్ కథన ప్రకారం రియల్మీ ప్యాడ్ 7000ఎంఏహెచ్ బ్యాటరీ, 65 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ప్రస్తుతం 65 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే 45000ఏంఎంహెచ్ బ్యాటరీ తప్పనిసరిగా ఉండాలి.లుక్ వైజ్‌గా చూసుకుంటే రియల్మీ ప్యాడ్.. ఆపిల్ ఐప్యాడ్‌ను పోలి ఉంటుందని తేలింది. ఎందుకంటే అన్నీ వైపులా మెటాలిక్ ఫినిషింగ్ కలిగి ఉంది. ప్యాడ్ వెనుక భాగంలో కేవలం ఒక కెమెరాను కలిగి ఉండడం మరో విశేషం. రెండర్లు బెజెల్స్ సన్నగా ఉండి బటన్ డిజైన్ తక్కువగా ఉంది. యూరోపియన్ మార్కెట్ కోసం తహతహలాడుతున్న రియల్ మీ ఈ ఏడాది జిటి 5జి లాంచ్ ఈవెంట్లో రియల్మీ ప్యాడ్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. టాబ్లెట్ మాత్రమే కాదు రియల్మీ బుక్ అని పిలిచే ల్యాప్ ట్యాప్‌ను కూడా విడుదల చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతానికి ఫీచర్స్ ఇలా ఉన్నా త్వరలో దాని ధరెంతో తెలిసే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
నవ్వితేనే ఆఫీసుల్లోకి ఎంట్రీ.. ఇదేం విడ్డూరం!
ఆఫీస్ పరిధిల్లో సీసీ కెమెరాలు, ఐరిష్ మెషిన్లు ఉద్యోగుల కదలికలను, హాజరును పరిశీలించేందుకు ఏర్పాటు చేస్తుంటాయి కంపెనీలు. అయితే చైనాలోని కొన్ని ఆఫీసుల్లో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. ఉద్యోగులు ఆఫీస్‌లోకి అడుగుపెట్టాలంటే కచ్చితంగా నవ్వాల్సిందే. ఈ మేరకు స్మైల్ రికగ్నిషన్ కెమెరా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఆఫీసుల్లోకి ప్రవేశించడం మాత్రమే కాదు.. పర్సనల్ పీసీలు ఆన్ చేయాలన్నా, లంచ్ యాక్సెస్, మీటింగ్‌లకు అటెండ్ కావాలన్నా ఎంప్లాయి నవ్వాల్సిందే. ఇందుకు సంబంధించి కెనన్ కంపెనీ, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సాయంతో స్మైల్ రికగ్నిషన్ టెక్నాలజీ డెవలప్ చేసింది. పని చేసే టైంలో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారా? లేదా? అనేది ఈ టెక్నాలజీ మానిటరింగ్ చేస్తుందని కెనన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెలిపింది. ప్రయోగాత్మకం మరో 30 దేశాల్లో(భారత్‌తో సహా) ఈ టెక్నాలజీకి ట్రయల్ రన్ నిర్వహించాలని భావిస్తున్నట్లు కెనన్ ఒక స్టేట్మెంట్లో పేర్కొంది. నిజానికి స్మైల్ రికగ్నిషన్ కెమెరాలను కిందటి ఏడాదే డెవలప్ చేసినప్పటికీ.. అది అంతగా గుర్తింపు దక్కించుకోలేదు. అయితే ఈ ఏడాది బీజింగ్‌లో కొన్ని టాప్ కంపెనీలు ఈ టెక్నాలజీని అనుమతించడంతో ప్రముఖంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ టెక్నాలజీపై విమర్శలు ఉన్నప్పటికీ.. ఇది ఉద్యోగుల మానస్థితిని అదుపు చేస్తుందని, వాళ్లను వందకి వంద శాతం సంతోషంగా ఉంచుతాయని కంపెనీలు వివరణలు ఇచ్చుకుంటున్నాయి. ఇదిలా ఉంటే మాస్కులు పెట్టుకున్న ఉద్యోగుల సంగతేంటని కొందరు సెటైర్లు వేస్తుండడం కొసమెరుపు. చదవండి: ఆర్టిఫిషీయల్ మూడో కన్ను! -
సెక్యూరిటీ కెమెరాల్లో పదిలంగా తండ్రి ప్రేమ
కూతురికి తండ్రంటేనే ఎక్కువ ఇష్టం. వాళ్లకు కూడా అంతే.. కొడుకు కన్నా కూతుర్లంటేనే అమితమైన ప్రేమ. వారికోసం ఆకాశంలోని చందమామను కూడా తెచ్చిచ్చేందుకు సై అంటారు.కూతురి ముఖం గుర్తొస్తే చాలు కొండనైనా అవలీలగా ఎత్తి అవతల పడేస్తామంటారు. చివరికి బంగారు తల్లి ముఖం చూడగానే అప్పటివరకు పడ్డ శ్రమంతా పటాపంచలైపోతుంది. అంతటి గొప్ప బంధం తండ్రీకూతుళ్లది. ఈ బంధానికి సాక్ష్యంగా నిలిచిందీ ఘటన. అమెరికాలోని లూయిస్విల్లేలో హన్నా కుటుంబం నివసిస్తోంది. హన్నా తండ్రికి కూతురంటే పంచ ప్రాణాలు. అందుకే రోజూ ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు సెక్యూరిటీ కెమెరాల దగ్గర కొన్ని సెకన్లు ఆగి హన్నాకు గుడ్‌మార్నింగ్ చెప్తాడు. (చదవండి: నాన్న చంపాలని చూస్తున్నారు : నటి వైరల్ వీడియో) 'ఈ రోజంతా నీకు మంచే జరగాలని కోరుకుంటున్నా, ఈ రోజు నీకు గొప్పగా ఉండబోతుంది..' అంటూ రకరకాల విషెస్ చెప్పేవాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకవేళ హన్నా ఇంటి నుంచి వెళ్లిపోయినా ఆమెకు తండ్రి ప్రేమ మాత్రం ప్రతిరోజూ దొరుకుతుంది అని క్యాప్షన్ జత చేశారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు.. హన్నా ఎవరో తెలీకపోయినా ఆమె పొందుతున్న ప్రేమను చూసి ఎమోషనల్ అవుతున్నారు. హన్నా, ఆమె కుటుంబం ఎప్పటికీ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. (చదవండి: వైరల్: యువతి తలను కోసుకుని తినొచ్చు!!) Hannah may have moved away from home, but that didn’t stop her dad from showing his love everyday. pic.twitter.com/BjCJPHdEuc— Ring (@ring) November 26, 2020 -
ఐఫోన్ 12- 12 మినీ.. ఏది బెటర్?
ముంబై, సాక్షి: యాపిల్ తయారీ ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ దేశీయంగా రూ. 10,000 ధరల తేడాతో లభిస్తున్నాయి. ఐఫోన్ 12 రూ. 79,900 నుంచి ప్రారంభంకాగా.. 12 మినీ రూ. 69,900 ప్రారంభ ధరలో లభిస్తోంది. ఈ రెండు ఫోన్లను పరిశీలిస్తే ప్రధానంగా డిస్ప్లే పరిమాణం, బ్యాటరీ సామర్థ్యం ప్రస్తావించవచ్చని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. స్మార్ట్‌ఫోన్ నిపుణుల అభిప్రాయాల ప్రకారం ఇతర అంశాలు చూద్దాం.. 5.4 అంగుళాలు ఐఫోన్ 12.. డిస్ప్లే 6.1 అంగుళాలుకాగా.. 12 మినీ 5.4 అంగుళాల తెరను కలిగి ఉంది. పూర్తి హెచ్డీ, సూపర్ రెటీనా XDR డిస్ప్లేతో లభిస్తోంది. ఫ్రంట్ కెమెరా నాచ్, ఫేస్ ఐడీ సెన్సార్లను సైతం కలిగి ఉంది. 12 మినీ పరిమాణం తక్కువకావడంతో ఒంటి చేత్తో ఆపరేట్ చేయడం సులభంగా ఉంటుంది. అయితే ఐఫోన్ 5 Sతో పోలిస్తే పరిమాణంలో పెద్దదనే చెప్పాలి. కేవలం 135 గ్రాముల బరువుతో సౌకర్యంగా కూడా ఉంటుంది. 7.4 ఎంఎం మందాన్ని మాత్రమే కలిగి ఉండటంతో సులభంగా వినియోగించవచ్చు. గ్లాసీ బ్యాక్ కావడంతో చేతివేళ్ల మార్క్‌లకు ఆస్కారం తక్కువే. అయితే ఐఫోన్ 12తో పోలిస్తే పెద్ద స్క్రీన్‌పై టైపింగ్‌కు అలవాటుపడిన వారికి కొంతమేర అసౌకర్యంగా అనిపించవచ్చు. చదవండి: (ప్లూటన్‌తో విండోస్ పీసీ హ్యాకర్లకు చెక్) 12తో పోలిస్తే 12 మినీ చిన్న స్క్రిన్‌ను కలిగి ఉన్నప్పటికీ ఐఫోన్ 12 స్థాయిలో బ్రైట్నెస్ను కలిగి ఉంటుంది. హెచ్డీఆర్ కంటెంట్ విషయంలో 625 నుంచి 1200 నిట్స్వరకూ బ్రైట్నెస్ను ప్రతిబింబిస్తుంటుంది. వీడియో కంటెంట్ చూస్తున్నప్పుడు స్టీరియో స్పీకర్ కారణంగా ఆడియో సైతం స్పష్టంగా బిగ్గరగా వస్తుంది. 12 మినీలోనూ 5 ఎన్ఎం ఆధారిత A14 బయోనిక్ చిప్‌నే వినియోగించారు. 4 జీబీ ర్యామ్, ఐవోఎస్ 14 ద్వారా అత్యుత్తమ యూజర్ ఎక్స్పీరియన్స్ పొందే వీలుంది. 64 GB అంతర్గత మెమొరీతో రూపొందింది. ఇక గేములు ఆడేటప్పుడు ఐఫోన్ 12తో పోలిస్తే 12 మినీ స్వల్పంగా వేడెక్కుతోంది. పరిమాణంరీత్యా ఇది ప్రస్తావించదగ్గ అంశంకాదు. ఇదేవిధంగా 12 మినీ 15 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను సపోర్ట్ చేస్తుందని యాపిల్ చెబుతోంది. అయితే ఐఫోన్ 12తో పోలిస్తే గేములు, వీడియో స్ట్రీమింగ్ విషయంలో బ్యాటరీ చార్జింగ్ తొందరగా కోల్పోయే అవకాశముంది. సగటు వినియోగదారునికి ఇది సమస్యకాకపోవచ్చు. ఫాస్ట్ చార్జర్ ఐఫోన్ 12 మినీ 18W చార్జర్‌తో గంటలోనే చార్జింగ్ పూర్తవుతుంది. కొత్త మాగ్‌సేఫ్ చార్జర్ సపోర్ట్ చేసినప్పటికీ 12W చార్జింగ్ సామర్థ్యానికే పరిమితం. ఐఫోన్ 12లో అయితే 15W చార్జింగ్కు వీలుంది. అంతేకాకుండా మాగ్‌సేఫ్ చార్జింగ్ వల్ల 12 మినీ కొంతమేర వేడెక్కుతోంది. ఈ చార్జర్‌ను రెండో ఆప్షన్‌గానే పరిగణించాలి. 12 మినీ బ్యాటరీ సామర్థ్యం 2227 ఎంఏహెచ్కాగా.. 2815 ఎంఏహెచ్ను ఐఫోన్ 12 కలిగి ఉంటుంది. ఇక వెనుకవైపు రెండు కెమెరాలు 12 ఎంపీ, వైడ్, అల్ట్రావైడ్ లెన్స్‌తో రూపొందాయి. ఫ్రంట్ కెమెరా సైతం 12 ఎంపీని కలిగి ఉంటుంది. వెరసి చాలా వరకూ రెండు ఫోన్లూ ఒకే తరహా ఫీచర్లను కలిగి ఉన్నాయి. స్క్రీన్ పరిమాణం, బ్యాటరీ విషయంలో మాత్రమే ఐఫోన్ 12 మినీ విభిన్నతను కలిగి ఉన్నట్లు స్మార్ట్‌ఫోన్ నిపుణులు పేర్కొంటున్నారు. -
మరో సంచలనం దిశగా షావోమి
సాక్షి,న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ విభాగంలో రికార్డు అమ్మకాలతో దూసుకుపోతున్న చైనా మొబైల్ తయారీ దారు షావోమి మరోమెట్టు పైకి ఎదగాలని భావిస్తోంది. స్మార్ట్‌ఫోన్ రంగంలో తదుపరి సెగ్మెంట్ ఫోల్డింగ్ ఫోన్ల తయారీలో దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రూపకల్పనకు సంబంధించి డిజైన్ పేటెంట్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ ఫోన్లో రొటేటింగ్ క్వాడ్-కెమెరా ప్రధాన ఫీచర్‌గా వుండటం ఆసక్తికరంగా మారింది. (రెడ్మి ఎక్స్ సిరీస్ స్మార్ట్‌టీవీలు త్వరలో) గిజ్మో చైనా నివేదిక ప్రకారం షావోమి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కెమెరా సెల్ఫీల కోసం ముందుకి, సాధారణ ఫోటోల కోసం వెనక్కి రొటేట్ అవుతుందట. దీనికి సంబంధించిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు 48 చిత్రాలను కూడా రీలీజ్చేసినట్టు తెలిపింది. అయితే సాధారణ స్మార్ట్ఫోన్లలో రొటేటింగ్ కెమెరా ఇప్పటికే ఉన్నప్పటికీ మడతఫోన్లలో ఇదే మొదటిది. ఇప్పటికే మోటరోలా రాజర్ మడతపోన్తో పాటు, శాంసగ్ గెలాక్సీ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లలో గెలాక్సీ జెడ్ ఫ్లిప్ విజయవంతమైన నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించేందుకు తరువాతి సెగ్మెంట్లోకి షావోమి జంప్ చేయనుంది. అయితే ఈ అంచనాలపై షావోమి అధికారికంగా స్పందించాల్సి వుంది. -
అద్భుత కెమెరాలతో ఎల్జీ వెల్వెట్ స్మార్ట్ఫోన్లు
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంటున్న ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ సరికొత్త డిజైన్ , అద్బుతమైన కెమెరాలతో కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనుంది. రెయిన్ డ్రాప్ కెమెరా డిజైన్ తో ఎల్జీ వెల్వెట్ అని పేరుతో వీటిని లాంచ్ చేయనుంది. ఫోన్ డిజైన్ కి సంబంధించిన కొన్ని లీక్ ఫొటోలు కూడా ఇప్పటికే బయటకు వచ్చాయి. అయితే ఎల్జీ వెల్వెట్‌ను మే 7 న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ వీడియో టీజర్ ద్వారా ప్రకటించింది. తమ తాజా స్మార్ట్‌ఫోన్ డిజైన్ ప్రత్యర్థి స్మార్ట్ఫోన్లకు భిన్నంగా ఉంటుందని ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఎల్జీ పేర్కొంది. ఈ ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 765 జి ప్రాసెసర్, 5జీ సపోర్ట్, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్,ఎల్ఈడీ ఫ్లాష్ వెనుకవైపుమూడు కెమెరాలను అమర్చినట్టు తెలుస్తోంది. లాక్డౌన్ కొనసాగుతున్నందున ఇది ముగిసిన తరువాత ఎల్జి వెల్వెట్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో లభ్యం కానుందని భావిస్తున్నారు. -
అమెజాన్ సేల్ : వాటిపై అదిరిపోయే ఆఫర్లు
సాక్షి,ముంబై: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో మరోసారి తగ్గింపుధరలు, ఆఫర్ల పండుగ మొదలైంది. గణతంత్ర దినోత్సవం (రిప్లబిక్ డే) అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్-2020 పేరుతో స్పెషల్ విక్రయాలను చేపట్టింది. జనవరి 22 వరకు కొనసాగే సేల్ ఈ రోజు (శనివారం) అర్థరాత్రి నుంచే ప్రైమ్ మెంబర్లకు అందుబాటులోకి తేనుంది. ప్రధానంగా వివిధ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లతోపాటు, పలురకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై తగ్గింపు ధరలను ప్రకటించింది. స్మార్ట్ఫోన్లపై 40శాతం దాకా, ల్యాప్‌ట్యాప్‌లు, కెమెరాలపై 60 శాతం తగ్గింపు లభించనుంది. దీంతో ల్యాప్‌టాప్‌లపై రూ.35వేల దాకా, కెమెరాలపై రూ. 10,000 వరకూ ప్రత్యేక తగ్గింపు లభించనుంది. దీంతోపాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ కూడా అదనం. వన్‌ప్లస్ 7టీ, వన్‌ఫ్లస్ 7టీ ప్రొ, రెడ్మినోట్ 8 ప్రొ, ఒప్పో ఎఫ్ 11 వివో యూ 20లపై ఈ తగ్గింపు ధరల్లో అందుబాటులో ఉంటాయి. ప్రధానంగా ఒప్పో ఎఫ్ 11 భారీగా పదివేల దాకా డిస్కౌంట్ ధరలో లభించనుంది. ప్రస్తుత సేల్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ. 13,990 కే కొనుగోలు చేయవచ్చు. -
కొత్తగా.. పక్కాగా..
ఈ–చలాన్, డ్రంక్ అండ్ డ్రైవ్ అమలులో సమస్యలు, అక్రమాలకు చెక్ పెట్టాలని పోలీస్ బాస్ భాస్కర్ భూషణ్ నిర్ణయించారు. కాంటాక్ట్ లెస్ ఈ–చలాన్ అమలు చేయాలని, బాడీవార్న్ కెమెరాలు ధరించి డ్రంక్ అండ్ డ్రైవ్ (డీడీ) పక్కాగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో పోలీసు అధికారులు, సిబ్బంది అమలుకు చర్యలు ప్రారంభించారు. నెల్లూరు(క్రైమ్): మోటార్‌వాహన చట్టాల అమలుకు పోలీసులు ఒకప్పుడు ప్రత్యక్షంగా జరిమానాలు విధించేవారు. వాహనాలు నడిపేవారికి డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు లేకపోయినా అప్పుడుకప్పుడే జరిమానా విధించి నగదు వసూలు చేసేవారు. దీంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని ప్రాంతాల్లో పోలీసులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు ఈ–చలాన్లు అమల్లోకి తీసుకువచ్చారు. జిల్లాలో 2017 నుంచి ఈ విధానం అమల్లో ఉంది. వాహనం రాంగ్ పార్కింగ్ చేసినా, సెల్‌ఫోన్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, పత్రాల్లేని వారికి ఈ చలాన్ విధిస్తున్నారు. వివరాలు వాహన యజమానికి ఎస్ఎంఎస్ రూపంలో పంపుతున్నారు. దీంతో వాహనదారులు ఏపీ ఆన్లైన్, మీ–సేవ తదితరాల్లో జరిమానా చెల్లిస్తున్నారు. ఇబ్బందుల కారణంగా.. ఈ–చలాన్ అమలు సందర్భంలో పోలీసు అధికారులు కొందరు వాహనదారుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకు ఎందుకు ఫైన్ విధించారంటూ వాగ్వాదానికి దిగుతున్నారు. పోలీస్ సిబ్బంది వారికి చెప్పే ప్రయత్నం చేసినా వినడంలేదు. మరికొందరు తమకున్న పలుకుబడిని ఉపయోగించి వాహనాలు విడిచిపెట్టాలని, ఈ–చలాన్‌ను తీసివేయాలని ఒత్తిడి తెస్తున్నారు. కొందరు పోలీసులు అవినీతికి పాల్పడుతూ అందినకాడికి జేబులు నింపుకొంటున్నారు. వాహనదారులను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నారు. చలాన్ల పేరిట గంటల తరబడి నిలిపివేస్తున్నారు. వీటన్నింటిని పరిశీలించిన ఎస్పీ భాస్కర్ భూషణ్ ఈ–చలాన్ పే రిట వాహనాలను నిలుపరాదని, కాంటాక్ట్ లెస్ ఈ–చలాన్ సిస్టంను అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. వాహనదారుడు నిబంధనలు ఉల్లంఘించిన వైనాన్ని ఫొటో తీసి ఈ–చలాన్ పంపాలని సూచించారు. దీంతో పోలీస్ అధికారులు, సిబ్బంది ఆ దిశగా చర్యలు చేపట్టారు. బాడీవార్న్ కెమెరాలు ధరించి.. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ కొందరు ప్రమాదాల బారిన పడుతున్నారని, ప్రాణాలు కోల్పోతున్నారని భావించి వాటిని కట్టడి చేసేందుకు పోలీస్ శాఖ డ్రంక్ అండ్ డ్రైవ్‌ను విస్తృతంగా నిర్వహిస్తోంది. జిల్లాలో ప్రతిరోజూ డీడీ నిర్వహిస్తూ మద్యం మత్తులో వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. పరీక్షల్లో అధికశాతం మద్యం సేవించినట్లుగా నిర్ధారణ అయితే కోర్టు వారికి జరిమానాతోపాటు జైలు శిక్ష విధిస్తోంది. నామమాత్రంగా ఆల్కాహాల్ శాతం ఉంటే జరిమానా వేస్తున్నారు. ఈ ప్రక్రియ కొందరు ఖాకీలకు కల్పతరువుగా మారింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన మందుబాబులను బెదిరించి అందినకాడికి దోచుకుంటున్నారు. రూ.వేలల్లో నగదు తీసుకుని కేసుల్లేకుండా పంపివేస్తున్నారు. కొందరు సిబ్బంది చేతివాటంపై ఎస్పీకి ఫిర్యాదులు అందడంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మార్పులు తీసుకువస్తున్నారు. ఇకపై పరీక్షల్లో పాల్గొనే సిబ్బంది విధిగా బాడీవార్న్ కెమెరాలు ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షల ప్రారంభం నుంచి ముగిసే వరకు కెమెరా ధరించడం ద్వారా ప్రతి విషయం రికార్డవుతుంది. కమాండ్ కంట్రోల్ నుంచి లైవ్ చూడవచ్చు. దీని ద్వారా అవినీతిని నియంత్రిచవచ్చని, మద్యం సేవించి పరీక్షల్లో పట్టుబడిన వారు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశం లేకుండా పోతుందని పోలీస్ బాస్ భావిస్తున్నారు. త్వరలో దీనిని అమల్లోకి తీసుకురానున్నారు. -
అద్దెకు తీసుకుని అమ్మేస్తారు..
చిక్కడపల్లి: షార్ట్ ఫిలింలు తీస్తున్నామని పరిచయం చేసుకుని ఓఎల్ఎక్స్లో కెమెరాలు అద్దెకు తీసుకొని వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు వ్యక్తులను బుధవారం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5.45లక్షల విలువైన 10 కెమెరాల స్వాధీనం చేసుకున్నారు. చిక్కడపల్లి ఏసీపీ కార్యాలయంలో సీఐ శివశంకర్‌రావు, డీఐ ప్రభాకర్‌తో కలిసి ఏసీపీ చల్లా శ్రీధర్ వివరాలు వెల్లడించారు. గోల్కొండ ప్రాంతానికి చెందిన సైమన్ అనే వ్యక్తి తన కెమెరాలను అద్దెకు ఇస్తానని ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇచ్చాడు. దీనిని చూసిన గచ్చిబౌలి రాజీవ్‌నగర్‌కు చెందిన టాక్సీ డ్రైవర్ సారిన్ హర్షవర్ధన్, బాలానగర్‌కు చెందిన ఆనంద్‌కుమార్ అనే వ్యక్తులు గత సెప్టెంబర్ 15న సైమన్ను సంప్రదించారు. రూ.700 చొప్పున కిరాయి మాట్లాడుకుని 10 కెమెరాలను తీసుకున్నారు. గుర్తింపుగా ఆధార్ కార్డు స్కాన్ చేసి ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అక్టోబర్ 9 వరకు గడువు పొడిగిస్తున్నట్లు సైమన్‌కు మేసేజ్ చేశారు. అనంతరం కెమెరాలను ఇతరులకు విక్రయించారు. అయితే గడువు ముగిసినా కెమెరాలు తిరిగి ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన సైమన్ వారికి ఫోన్ చేయగా స్విచ్ఛాప్ చేసినట్లు వచ్చింది. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్, కమిషనర్లరెట్ల పరిధిలోని చిక్కడపల్లి, బహుదూర్‌పూర, బోయినపల్లి, చాంద్రాయణగుట్ట, వనస్థలిపురం, అల్వాల్, సనత్‌నగర్, గోల్కొండ, ఎస్సార్‌నగర్ పీఎస్‌ల పరిధిలో కేసులు ఉన్నట్లు తెలిపారు. వారి నుంచి కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
షావోమి సంచలనం : కొత్త శకం
చైనా మొబైల్ దిగ్గజం షావోమి సరికొత్త రికార్డు నమోదు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా , దేశంలో నెంబర్ 1 బ్రాండ్‌గా కొనసాగుతున్న షావోమి మరో సంచలనానికి నాంది పలకనుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా భారీ కెమెరాతో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది.. ఈ మేరకు ట్విటర్లో ఫోటోను షేర్ చేసింది. ఎంఐ నోట్ 10, ఎంఐ నోట్ 10 ప్రొ (ఎంఐ సీసీ9 ప్రొ) పేరుతో స్మార్ట్ఫోన్లను తీసుకు రానుందని తెలుస్తోంది. విభిన్న ప్రాసెసర్లతో, అద్భుతమైన ఫీచర్లతో ఇవి ఆకట్టుకోనున్నాయని టిప్‌స్టర్ ముకుల్ శర్మ కూడా ట్వీట్ చేయడం విశేషం. స్మార్ట్ఫోన్ల కెమెరాల యుగంలో ఒక కొత్త శకం ప్రారభం కానుందని ట్వీట్ చేసింది. చైనాలో ఎంఐ సీసీ9 ను నవంబరు 5న లాంచ్ చేయనున్నామంటూ టీజర్‌ను వదిలింది. కాగా ఇప్పటికే ఆన్లైన్లొ లీకైన వివరాల ప్రకారం ఎంఐ సీసీ 9 ప్రొ స్నాప్‌డ్రాగన్ 730 జి ప్రాసెసర్‌ను కలిగి ఉండగా, ఎంఐ నోట్ 10 ఫ్లాగ్షిప్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 సాక్ ప్రాససర్‌ను అమర్చినట్టుతెలుస్తోంది. Introducing the world's FIRST 108MP Penta Camera. A new era of smartphone cameras begins now! #MiNote10 #DareToDiscover pic.twitter.com/XTWHK0BeVL — Xiaomi #First108MPPentaCam (@Xiaomi) October 28, 2019 -
సినిమా షూటింగ్ అంటూ మోసం!
సాక్షి, బంజారాహిల్స్: సినిమా షూటింగ్ కోసమని కెమెరాలు అద్దెకు తీసుకోవడం... వాటిని తిరిగి ఇవ్వకుండా విక్రయించడం... వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడం... ఇలా మోసాలకు పాల్పడుతూ తప్పించుకొని తిరుగుతున్న ఓ కేటుగాడిని పోలీసులు వలపన్ని పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ ఎస్ఐ ఎ.రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం... బెల్లంపల్లికి చెందిన విజ్ఞాన్ దాసరి(27) మణికొండలో నివాసం ఉంటూ తాను ఈవెంట్ ఆర్గనైజర్‌నని ప్రచారం చేసుకుంటాడు. గత నెల 19న శ్రీకృష్ణానగర్‌లో సినిమా షూటింగ్‌లకు కెమెరాలను అద్దెకిచ్చే మహేష్‌ను కలిసి తాను సినిమా తీస్తున్నానని, రెండు రోజుల పాటు కెమెరా అద్దెకు కావాలని చెప్పి రూ.6 లక్షల విలువ చేసే కెమెరా తీసుకెళ్లాడు. ఎంతకు తిరిగి రాకపోగా ఫోన్ చేస్తే స్పందించలేదు. దీంతో బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పక్కా నిఘా వేసిన పోలీసులు నిందితుడిని రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకొని విచారించారు. అద్దెకు తీసుకున్న కెమెరాను రూ.90 వేలకు విక్రయించి ఆ డబ్బుతో గోవాకు వెళ్లి జల్సాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. కెమెరాను రికవరీ చేసిన పోలీసులు లోతుగా విచారించగా గతంలో కూడా మియాపూర్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కెమెరాలు అద్దెకు తీసుకొని అమ్ముకొని జల్సాలు చేసినట్లు తేలింది. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 406, 420 కింద కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. -
అద్దెకు తీసుకుని అమ్మేస్తాడు
రసూల్‌పురా: హెచ్డీ కెమెరాలను అద్దెకు తీసుకుని వాటిని విక్రయించి మోసాలకు పాల్పడుతున్న యువకుడిని బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేసి అతడి నుంచి రూ. 5లక్షల విలువైన 9 కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ రాజేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి భాగ్ అంబర్ పేట, రామిరెడ్డినగర్‌కు చెందిన రంజిత్‌కుమార్‌రెడ్డి బీటెక్ చదువుతూ మధ్యలోనే మానేశాడు. ఉద్యోగం నిమిత్తం అమెరికాలో ఉంటున్న సోదరుడి వద్దకు వెళ్లిన అతడికి అక్కడ ఉద్యోగం లభించకపోవడంతో 2017 నవంబర్‌లో నగరానికి తిరిగి వచ్చాడు. క్రికెట్ బెట్టింగ్‌కు అలవాడి పడిన రిజింత్ ‘బెట్ 365’ యాప్ ద్వారా బెట్టింగ్‌కు పాల్పడి ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో స్నేహితుల నుంచి కెమెరాలు, అమెరికా నుంచి సోదరుడు పంపిన ఐఫోన్లు, ల్యాప్ టాప్‌లను విక్రయించి జల్సాలు చేసేవాడు. దుబాయ్‌లో ఉంటున్న అతడి తండ్రి సాంబశివారెడ్డికి ఈ విషయం తెలియడంతో నగరానికి వచ్చిన అతను కెమెరాలు ఇచ్చిన స్నేహితులకు డబ్బులు చెల్లించి గత ఏడాది రంజిత్‌ను దుబాయ్ తీసుకెళ్లి ఐఈఎల్ టీఎస్‌లో కోచింగ్ ఇప్పించాడు. గత ఏప్రిల్‌లో నగరానికి వచ్చిన రంజిత్ పరీక్షలకు హాజరయ్యాడు. అనంతరం మరోసారి క్రికెట్‌బెట్టింగ్‌లకు పాల్పడి ఆర్థికంగా నష్టపోయాడు. ఓఎల్ఎక్స్లో ప్రకటనలు చూసి... ఓఎల్ఎక్స్లో హెచ్డీ కెమెరాలను అద్దెకు ఇస్తున్న ప్రకటనలు చూసిన అతను సులువుగా డబ్బులు సంపా.దించేందుకు పథకం పన్నాడు. అడ్వాన్స్‌లు చెల్లించి పలువురి వద్ద కెమెరాలను అద్దెకు తీసుకున్నాడు. ఇదే క్రమంలో పాతబోయిన్‌పల్లి మల్లిఖార్డున్‌నగర్‌కు చెందిన మణికంఠ వద్ద హెచ్డి కెమెరా అద్దెకు ఇస్తున్నట్లు ప్రకటన ఇవ్వడంతో రంజిత్ తన ఆధార్‌కార్డు డిపాజిట్ చేసి రోజుకు రూ. వెయ్యి చొప్పున చెల్లించేలా గత డిసెంబర్ 20న రెండు రోజుల అద్దెకు కెమెరా తీసుకెళ్లాడు. కెమెరా తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేస్తుండడంతో మణికంఠ ఈనెల 23న బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు రంజిత్ కోఠిలోని హిరాదాస్ మార్కెట్లో కెమెరాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో అతడిని అరెస్టు చేశారు. రూ. 5లక్షల విలువైన 9 హెచ్డీ కెమెరాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. -
న్యూ ఐఫోన్ ఫీచర్లు హల్చల్
మొబైల్ దిగ్గజం యాపిల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన ప్రత్యేకతను చాటుకునేందుకు కొత్త ఎత్తుగడలతో వస్తోంది. భవిష్యత్ ఐపోన్లను ట్రిపుల్ రియర్ కెమెరాలతో తీసుకురానుందని తాజా సమాచారం. హువావే తరహాలో తన నూతన ఐఫోన్లలో ట్రిపుల్ బ్యాక్ కెమెరాలను జోడించి కస్టమర్లను ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. దీనికి సంబంధించిన కొత్త ఐఫోన్ 11 ఇమేజ్‌లు ప్రస్తుతం నెట్లో లీకయ్యాయి. హువావే మేట్ 20 ప్రొ బాటలో యాపిల్ తరువాతి తరం ఐఫోన్లలో ట్రిపుల్ బ్యాక్ కెమెరాలను అందివ్వనున్నట్లు సమాచారం. ఐఫోన్ ఎక్స్‌ఎస్‌లో డ్యుయల్ కెమెరాలను జోడించిన సంస్థ ఇపుడిక ట్రిపుల్ కెమెరాలతో ఫ్లాగ్షిప్ ఫోన్లను తీసుకురానుంది. అలాగే మూడో కెమెరా 3డీ ఇమేజ్‌లకు సపోర్ట్‌ను ఇవ్వనుందట. ప్రస్తుతం పలు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు 3డీ ఆప్షన్‌ను కెమెరాలకు ఇస్తున్నాయి. అదే కోవలో యాపిల్ చేరనుంది. అలాగే కొత్త ఐఫోన్లను 2019, సెప్టెంబరు నాటికి అందివ్వనున్నట్లు సమాచారం. కాగా తాజా లీకులపై యాపిల్ అధికారికంగా స్పందించాల్సి వుంది. Back from September 2019, I bring you the very 1st and very early glimpse at which I guess #Apple will unveil as #iPhoneXI!!! Yes, time has already come to meet the new #iPhone through gorgeous 5K renders made on behalf of new coming Partner @digitindia -> https://t.co/b6SxFUS2tx pic.twitter.com/97jrlTHQ5G — Steve H.McFly (@OnLeaks) January 6, 2019 -
అద్భుత ఫీచర్లతో హువావే స్మార్ట్ఫోన్లు
చైనా మొబైల్స్ తయారీ సంస్థ హువావే రెండు ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను లండన్‌లో లాంచ్ చేసింది. మొబైల్ టెక్నాలజీ మరో మెట్టు పైకి తీసుకెళుతూ హువావే మేట్ 20', 'హువావే మేట్ 20 ప్రొ’ పేరిట నూతన స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చింది. హైసిలికాన్ కిరిన్ 980 లాంటి అధునాతన ప్రాసెసర్ తోపాటు, ప్రపంపంచలోనే తొలిసారిగా లైకా ట్రిపుల్ కెమెరాలని ఈ ఫోన్లనో ఏర్పాటు చేసింది. హువావే మేట్ 20 ధర సుమారు రూ. 67,910 హువావే మేట్ 20 ప్రొ ధర: సుమారు రూ.89,155 హువావే మేట్ 20 ప్రొ ఫీచర్లు 6.39 ఇంచెస్ ఫుల్ వ్యూ డిస్ప్లే(19.5:9) 3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ హైసిలికాన్ కిరిన్ 980 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9పై 6జీబీర్యామ్,128జీబీ స్టోరేజ్ 40+20+8 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 24ఎంపీ సెల్ఫీ కెమెరా 4200 ఎంఏహెచ్ బ్యాటరీ హువావే మేట్ 20 ఫీచర్లు 6.53 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే(18:7:9) 2244 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ హైసిలికాన్ కిరిన్ 980 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9పై 4/6జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 256 జీబీ వరకు పెంచుకునే సామర్ధ్యం) 16+2+8 20ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 24+2 ఎంపీ డ్యుయల్ ఫ్రంట్ కెమెరాలు 4000ఎంఏహెచ్ బ్యాటరీ -
5 కెమెరాల ఎల్జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది
ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఎల్జీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. వి సిరీస్‌లో తరువాతి తరం ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఎల్జీ వీ40 థిన్‌క్యూ పేరుతోవిడుదల చేసింది. వెనుక వైపు మూడు, ముందు వైపు రెండు మొత్తం ఐదు కెమెరా లెన్సస్తో లాంచ్ చేసింది. నాలుగు రంగుల ఆప్షన్స్‌లో ఇది అందుబాటులోకి వచ్చింది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 9, ఐ ఫోన్ ఎక్స్‌ఎస్‌మాక్స్‌కి గట్టిపోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాల అంచనా. 12 ఎంపీ స్టాండర్డ్ కెమెరా, 16 ఎంపీ సూపర్‌వైడ్ యాంగిల్ కెమెరా, 12ఎంపీ పోర్ట్రయిట్ కెమెరాను రియర్ సైడ్ అమర్చింది. అమెరికాలో అక్టోబర్ 19నుంచి విక్రయానికి లభ్యం. భారతదేశం లో విడుదల తేదీ ఇంకా బహిర్గతం కాలేదు. ఎల్జీ వీ40 థిన్‌క్యూ ఫీచర్లు 6.4 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే ఆండ్రాయిడ్ ఓరియో 8.1 3120 x 1440 రిజల్యూషన్ స్నాప్ డ్రాగన్ 845ప్రాసెసర్ 6జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ ఎస్డీ కార్డ్ద్వారా2టీబీదాకా విస్తరించుకునే అవకాశం 12+16+12 ఎంపీ రియర్‌కెమెరా 5+8 ఎంపీ సెల్పీ కెమెరా 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ ధర: సుమారు 67,980 రూపాయలు -
శాంసంగ్ ఫోన్ : భారీ స్క్రీన్, ట్రిపుల్ రియర్ కెమెరా
సాక్షి, న్యూఢిల్లీ: సౌత్ కొరియన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ7 2018 ను విడుదల చేసింది. శాంసంగ్ ఏ సిరీస్‌లో ఆకట్టుకునే ఫీచర్లతో ముఖ్యంగా భారీ డిస్ప్లే, మూడు రియర్‌కెమెరాలతో లేటెస్ట్ వెర్షన్‌గా దీన్ని అందుబాటులోకి తెచ్చింది. బ్లూ, బ్లాక్, గోల్డ్ , పింక్ కలర్స్‌లో లభించనున్న ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 29,385గా ఉంది. అక్టోబర్ ఆరంభంనుంచి యూరోపియన్, ఇతర ఆసియన్ మార్కెట్లలో లభ్యం కానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎ7 2018 ఫీచర్లు 6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే 1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 24+8+5 ఎంపీ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు 24 ఎంపీ సెల్ఫీ కెమెరా 3300 ఎంఏహెచ్ బ్యాటరీ -
ట్రాఫిక్ ఉల్లంఘనులూ జర జాగ్రత్త..!
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనులు ఇక మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే...ఇప్పటికే ట్రాఫిక్ జంక్షన్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు,కానిస్టేబుళ్ల చేతుల్లో ఉన్న కెమెరాల చేతికి చిక్కుతున్న వీరు... పోలీసు సిబ్బంది లేరు కదా అని ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్ పోలీసుకమిషనరేట్లలో ఉత్సవాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో వినియోగించే వెహికల్ మౌంటెడ్ కెమెరాలను ఇప్పుడూ ట్రాఫిక్ ఉల్లంఘనుల భరతం పట్టేం దుకు వాడాలని యోచిస్తున్నారు. సీసీ టీవీ కెమెరాలు లేని గల్లీల్లో వీటిని వినియోగించాలని భావిస్తున్నారు. ప్ర యోగాత్మకంగా ఐటీ కారిడార్‌లో ఈ వాహనాలను వినియోగించి ఫలితాలను పరి శీలించిన అనంతరం తదుపరి చర్యలకు ఉపక్రమించనున్నారు. 360 డిగ్రీల్లో..... ‘ఈ వాహనాల్లో ఉన్న 20 కెమెరాలు ఎప్పటికప్పుడూ ఆయా ప్రాంతాల్లో జరిగే దృశ్యాలను బంధిస్తుంటాయి. పాన్, పింట్, జూమ్...అటూ ఇటూ చూడటం...360 డిగ్రీల కోణంలో తిరిగి అన్ని దృశ్యాలను రికార్డు చేస్తాయి. వాహనానికి పక్కన, వెనుక కూడా ఒక్కో కెమెరా ఉంటాయి. వాహనం ఉన్న ప్రాంతం నుంచి చుట్టు పక్కల 500 మీటర్ల మేర ఫొటోలను క్లిక్ మనిపిస్తుంది. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారి వాహనాల ఫొటోల ఆధారంగా వాహనదారుడి ఇంటికి ఈ–చలాన్ పంపించనున్నారు. ఇప్పటికే వెహికల్ మౌంటెడ్ కెమెరాలను గణేశ్ ఉత్సవాల బందోబస్తు సమయంలో ఉపయోగిస్తున్న వాహనాలను ట్రాఫిక్ ఉల్లంఘనలకు వినియోగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. -
ఢిల్లీలో భారీ వర్షం : తడిచిపోయిన మీడియా కెమెరాలు
సాక్షి, న్యూఢిల్లీ : శుక్రవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వాడివేడిగా సభ జరగాల్సిన సమయంలో భారీ వర్షం ఢిల్లీని ముంచెత్తింది. భారీ వర్షం దెబ్బకు ఢిల్లీలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇక వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోదీ ప్రభుత్వంపై తొలిసారి అవిశ్వాసం జరగనుండటంతో దేశం మొత్తం ఇప్పుడు ఢిల్లీ వైపు చూస్తోంది. అవిశ్వాస తీర్మానంతో వాడి వేడిగా జరగనున్న వర్షాకాల సమావేశాలను కవర్ చేయడానికి దేశ వ్యాప్తంగా మీడియా సంస్థలు ఢిల్లీలో పాగావేశాయి. అయితే శుక్రవారం కురిసిన భారీ వర్షానికి వార్తా సంస్థల ఎలక్ట్రానిక్ పరికరాలు తడిచిపోయాయి. కెమెరాలు, ఇతర కవరేజి వస్తువులు తడిసిముద్దయ్యాయి. -
స్పీడ్ గన్స్, కెమెరాలు
సాక్షి, సిద్దిపేట : రాజీవ్ జాతీయ రహదారి.. ఇటీవల తరచూ ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.. ఆ రహదారిపై ప్రయాణించాలంటేనే జనం జంకుతు న్నారు.. అయితే ఇకపై ఆ పరిస్థితి మారనుంది. రాజీవ్ రహదారిపై రక్షణ చర్యలు చేపట్టేందుకు సిద్దిపేట జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటివరకు జరిగిన ప్రమాదాలు, వాటికి గల కారణాలు తెలుసుకుని, అవి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం, మానకొండూరులో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలతో అధికారులు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. ఈ మేరకు సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామి రెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌తోపాటు బీవోటీ డీజీఎం విజయభాస్కర్‌రెడ్డి సమావేశమయ్యారు. ప్రమాదాలపై అధ్యయనం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట నుంచి సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల మీదుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ప్రాంతం వరకు 207 కిలోమీటర్ల మేర రాజీవ్ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించారు. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో గల పలు జాతీయ రహదారులను ఈ దారి కలుపుతుంది. సిద్దిపేట జిల్లాలో ఈ రహదారి ములుగు మండలం వంటిమామిడి నుంచి బెజ్జంకి వరకు సుమారు 125 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ రహదారి పనులపై అప్పట్లోనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎక్కడా పార్కింగ్ లేదు! రాజీవ్ రహదారిపై ఎక్కడిపడితే అక్కడ ఉన్న మూల మలుపులు, తొమ్మిది అంగుళాల ఎత్తు మాత్రమే ఉన్న డివైడర్ వల్ల ప్రమాదాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి. ఇసుక వాహనాలు, ఎక్స్‌ప్రెస్‌లు మితిమీరిన వేగమే ప్రమాదాలకు కారణం అని అధికారులు ఓ అంచనాకు వచ్చారు. వీటిని నిరోధించేందుకు ఓఆర్ఆర్ మాదిరిగా స్పీడ్ కంట్రోలింగ్ సిస్టమ్ (స్పీడ్ గన్స్) ఏర్పాటు చేయనున్నారు. 207 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారిపై ఎక్కడా పార్కింగ్ సౌకర్యం లేదు. కొన్ని సందర్భాల్లో ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. దీన్ని నివారించేందుకు సిద్దిపేట జిల్లాలోని 95 కిలోమీటర్ల పొడవున 7 పార్కింగ్ సదుపాయం కల్పించేందుకు స్థల సేకరణ చేస్తున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు.. గుర్తుతెలియని వాహనాలను గుర్తించడంతో పాటు రహదారిపై జరిగే ఇతర నేరాలను అరికట్టేందుకు సిద్దిపేట జిల్లా పరిధిలో రాజీవ్ రహదారిపై 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా రహదారి వెంట ఉన్న గ్రామాల్లో రోడ్డు దాటే సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటి నివారణకు ప్రతి గ్రామంలో లైటింగ్, ఇతర రక్షణ చర్యలు చేపట్టనున్నారు. జీబ్రా క్రాసింగ్ పెయింటింగ్, ప్రమాద సూచికలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. డివైడర్ల ఎత్తు పెంపు విషయంపై బీవోటీ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. అలాగే సిద్దిపేట సరిహద్దులోని పొన్నాల వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి మంజూరు ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలిసింది. రహదారికి ఇరువైపులా పార్కింగ్ ‘ప్రమాదాలకు ప్రధాన కారణం డ్రైవర్లకు విశ్రాంతి లేకపోవడం. దీన్ని నివారించేందుకు సిద్దిపేట జిల్లా పరిధిలోని 75 కిలోమీటర్లలో అవసరమైన చోట పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు ప్రభుత్వ భూమి గుర్తించాలని ఆర్డీవోలు, తహశీల్దారర్లకు ఆదేశాలు జారీ చేశాం. మితిమీరిన వేగాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టే విషయంపై పోలీస్ కమిషనర్‌తో చర్చించాం.’ – వెంకట్రామిరెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళిక ‘రాజీవ్ రహదారిపై రోజూ ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. దీన్ని నివారించేందుకు జిల్లా కలెక్టర్ చొరవతో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. పార్కింగ్, స్పీడ్ కంట్రోల్, సీసీ కెమెరాల ఏర్పాటు మొదలైన చర్యలు తీసుకుంటున్నాం. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడతాం. – జోయల్ డేవిస్, సిద్దిపేట పోలీస్ కమిషనర్ రక్షణ చర్యలు చేపడుతున్నాం. రహదారిపై ప్రమాదాలు నివారించేందుకు రక్షణ చర్యలు చేపడుతున్నాం. రామునిపట్ల, లింగారెడ్డిపల్లి గ్రామాల వద్ద లైటింగ్ ఏర్పాటు, మార్కింగ్‌లు, ఇతర గుర్తులను తెలిపేలా ఎప్పటికప్పుడు పెయింటింగ్ చేస్తున్నాం. – విజయ భాస్కర్‌రెడ్డి, బీవోటీ, డీజీఎం -
'ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే ఆఫర్స్' : 80 శాతం డిస్కౌంట్స్
దేశీయ అతిపెద్ద ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే ఆఫర్ల వెల్లువ ప్రారంభించబోతుంది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా 'ది ఫ్లిప్‌హార్ట్ డే' సేల్ నిర్వహించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. సర్ప్రైజ్లతో రోజంతా అలరించనున్నట్టు పేర్కొంది. ఈ సేల్‌లో భాగంగా హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై 14 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్‌ను అందించనుంది. యూజర్లు ఎవరైతే 'ది ఫ్లిప్‌హార్ట్ డే' ఆఫర్లో సైన్-అప్ అవుతారో వారికి వస్త్రాలు, బ్యూటీ, యాక్ససరీస్, హోమ్ డెకర్లపై 14 శాతం అదనపు డిస్కౌంట్‌ను అందించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఒకవేళ ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, పవర్ బ్యాంకులు, టాబ్లెట్లు, ఇతర యాక్ససరీస్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి, 80 శాతం డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. అయితే డిస్కౌంట్లు ఆఫర్ చేసే ఉత్పత్తుల పేర్లను మాత్రం కంపెనీ రివీల్ చేయలేదు. మొబైల్ ఫోన్లపై కూడా 'గ్రేట్ డీల్స్' ఉంటాయని పేర్కొంది. ఈ కేటగిరీ ఉత్పత్తుల పేర్లను కూడా వెల్లడించలేదు. బ్యూటీ, టాయ్స్, స్పోర్ట్స్, బుక్స్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్లనుపొందవచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. టీవీ, హోమ్ అప్లియెన్స్‌పై 70 శాతం వరకు, ఫర్నీచర్, డెకర్, ఫర్నీషింగ్ వాటిపై 40 శాతం నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది. కనీసం 40 శాతం, 50 శాతం, 60 శాతం డిస్కౌంట్లతో 'ఫెంటాస్టిక్ డీల్స్' ను అందుబాటులో ఉంచుతామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. -
ఆదర్శలో నిఘా
బజార్హత్నూర్ : ఓ వైపు విద్యాలయాలు గ్రామాలకు దూరంగా ఉండడంతో రాత్రింబవళ్ళు భయంగా ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. బాలికలకు భద్రత కరువై తల్లితండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వం కొత్తగా రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యాలయంలో నిరంతరం నిఘా ఉంచేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వీటితో తరగతి గది, పాఠశాల ఆవరణలో నిఘా పెరగడంతో అనుక్షణం అప్రమత్తత కనిపిస్తోంది. బజార్హత్నూర్ ఆదర్శ పాఠశాలలో 16 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థినిల చదువుకు భరోసా ఏర్పడింది. బాలికల వసతి గృహాలకు భద్రత మండల కేంద్రంలో 2013లో ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేశారు. మొదట ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. 2014లో ఆదర్శ పాఠశాల నూతన భవనంలో తరగతులు ప్రారంభించారు. ప్రస్తుతం పాఠశాలలో మండలంలోని 13 గ్రామపంచాయతీల పరిధిలోని 45 గ్రామాలకు చెందిన 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు 485 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2015లో ఆదర్శ పాఠశాల ఆవరణలో బాలికల వసతి గృహం ఏర్పాటు చేశారు. 100 మంది బాలికలకు వసతి ఏర్పాటు చేశారు. బజార్హత్నూర్కు 3కిలో మీటర్ల దూరంలో పాఠశాల ఉండడంతో రాత్రి సమయంలో పోకిరిల బెడద ఉండేది. ప్రస్తుతం సీసీ కెమెరాలు ఏర్పాటుతో భద్రంగా చదువుకొంటున్నారు. చేకురనున్న ప్రయోజనాలు సీసీ కెమెరాలతో తరగతి గదుల్లో విద్యార్థుల క్రమశిక్షణ, ఉపాధ్యాయుల బోధన తీరుతెన్నులను పరిశీలిస్తున్నారు. ఏ తరగతి గదిలోనైనా విద్యార్థులు అల్లరి చేస్తున్నారంటే వెంటనే అక్కడికి ఉపాధ్యాయులను పంపించే అవకాశం ఉంటుంది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు భోధన చేస్తున్నారా, పిల్లలతో ముచ్చటిస్తున్నారా అనే విషయం తెలిస్తుంది. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారా అనే విసయాన్ని పై అధికారులు తెలుసుకోవడానికి వీలుపడుతుంది. వంట గదుల్లో ఆహార పదార్థాల్లో నాణ్యత పెరిగే అవకాశం ఉంటుంది. పాఠశాల ప్రాంగణంలో అపరిచితులు వచ్చిన వెంటనే స్పందించడంతో పాటు వారి కదిలికలను గుర్తించి పోలీస్‌లకు సమాచారం అందించవచ్చు. సీసీ కెమెరాలతో సత్ఫలితాలు ఆదర్శ పాఠశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో విద్యార్థులపై నిఘా ఉంచడం సులభమైంది. సీసీ కెమెరాలతో అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాం. విద్యాబోధన, మధ్యాహ్న భోజనం, భద్రతతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. సీసీ కెమెరాల ఏర్పాటు సత్పాలితాలనిస్తుంది. – రాజశేఖర్, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్, బజార్హత్నూర్ -
గోడ వెనుక ఏముంది?
లండన్: కేవలం మీ ఫోన్‌కున్న కెమెరాతో ఓ గోడకు ఇవతలి వైపు ఉండి అవతల ఎవరున్నారో తెలుసుకోగలిగితే? మీ శరీరాన్ని, మెదడును కేవలం ఓ కెమెరాతో స్కాన్ చేయగలిగితే? పొగమంచులోనూ రోడ్లను స్పష్టంగా చూడగలిగితే? వాటి ఫొటోలు కూడా స్పష్టంగా తీయగలిగితే? ప్రస్తుతానికి ఇవన్నీ అసాధ్యంగానే అనిపిస్తున్నప్పటికీ భవిష్యత్‌లో అందుబాటులోకి రానున్న అత్యాధునిక కెమెరాలతో సాధ్యమేనని పరిశోధకులు చెబుతున్నారు. వీటి సాయంతో సరికొత్త నిఘా ఫోన్ల శకం మొదలవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోకు చెందిన ప్రొ.డానియేల్ ఫాసియో, హెరియట్–వాట్ వర్సిటీకి చెందిన ప్రొ.స్టీఫెన్ మెక్లాగ్లీన్ ఓ వ్యాసం రాశారు. భవిష్యత్ కెమెరాల్లో షార్ట్ లేజర్ కిరణాలను ఓ గదిలో ప్రయోగించినప్పుడు గోళాకృతిలో అన్ని కోణాల్లోనూ విస్తరిస్తాయని తెలిపారు. గోడల్ని దాటివెళ్లి వస్తువుల్ని తాకే ఈ కిరణాలు వెనక్కి తిరిగివస్తాయని వెల్లడించారు. ప్రత్యేకంగా రూపొందించిన అత్యంత సున్నితమైన కెమెరాలు వెనక్కు వచ్చే లేజర్ కిరణాలను గుర్తిస్తాయన్నారు. ఈ కెమెరాలు ఓ సెకనులో 20 బిలియన్ ఫ్రేముల్ని రికార్డు చేయగలవన్నారు. తాము ల్యాబ్ లో చేసిన పరీక్షలో ఓ గోడ అవతలి వైపున ఉండే వస్తువుల్ని ఈ కెమెరాల ద్వారా గుర్తించడం సాధ్యమేనని తేలిందన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఘటనాస్థలికి చేరుకోకుండానే లేదా అక్కడికి వెళ్లలేని పరిస్థితుల్లో బాధితుల్ని రక్షించడానికి ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. -
నాలుగు కెమెరాల హానర్ 9 లైట్..
సాక్షి, న్యూఢిల్లీ: హానర్ కొత్త మొబైల్‌ను లాంచ చేసింది. ఆర్టీఫిషీయల్ ఇంటిలిజెన్స్ వ్యూస్ 10 స్మార్ట్‌ఫోన్‌ను అందించిన వెంటనే కంపెనీ మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. మిడ్ సెగ్మెంట్లో హానర్ 9 లైట్ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రెండు వేరియంట్లలో లాంచ్ చేసిన వాటి ధరలు ఇలా ఉన్నాయి. 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999గా, 64జీబీ వేరియంట్ రూ.14,999 గా నిర్ణయించింది. జనవరి 21 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రత్యేకంగా ఇది విక్రయానికి లభిస్తుంది. గ్రే, బ్లూ, బ్లాక్ రంగుల్లో ఇది లభ్యం. కాంపాక్ట్ బాడీ, డ్యుయల్ కెమెరా 0.25 సెకన్లలో అన్‌లాక్ అయ్యే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఏఐ ఆధారిత రియల్-టైమ్ సెన్స్ఆబ్జెక్ట్ రికగ్నిషన్ తమ కొత్త స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలని కంపెనీ ప్రకటించింది. హానర్ 9 లైట్ ఫీచర్లు 5.65 అంగుళాల ఫుల్ హెచ్డీ బెజెల్ లెస్ డిస్ ప్లే ఆండ్రాయిడ్ ఓరియో 8.0 కిరిన్ 695 ఆక్టా కోర్ ప్రాసెసర్ 3 జీబీ/4జీబీ ర్యామ్ 32/64జీబీ స్టోరేజ్ 13+2 ఎంపీ రియర్ కెమెరా 13+2 ఎంపీ సెల్ఫీ కెమెరా 256 జీబీ దాకా విస్తరించుకునే సౌలభ్యం 3000 ఎంఏహెచ్ బ్యాటరీ 9 Lite With Launched in India -
పవర్‌పుల్ స్మార్ట్‌ఫోన్ పవర్3: ఫీచర్స్ అదుర్స్
ఇటీవల మార్కెట్లో విడుదలైన పవర్‌పుల్ స్మార్ట్‌ఫోన్ పవర్ 3 ఇపుడు ప్రీ ఆర్డర్స్‌కు అందుబాటులో ఉంది. తన పవర్ సిరీస్‌లో భాగంగా యూలే ఫోన్ లాంచ్ చేసిన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ 'పవర్ 3' సుమారు రూ.19,210 (220 డాలర్లు) ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యమవుతున్నది. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ వేరియంట్లో జనవరి 8 వరకు ఈ ప్రీ ఆర్డర్ కు లభ్యం. దీంతో పాటు ఒక గిఫ్ట్ బ్యాగ్ (సుమారు రూ.3వేలు) కూడా అందిస్తోంది. వన్ ప్లస్ 5 టీ తరహాలో ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్‌ను జోడించింది. 6జీబీ, భారీ బ్యాటరీ, మొత్తం నాలుగు కెమెరాలు ఈ డివైస్‌లో ప్రత్యేకఆకర్షణగా నిలువస్తున్నాయి. 6జీబీ, భారీ బ్యాటరీ, మొత్తం నాలుగు కెమెరాలు ఈ డివైస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. యూలే ఫోన్ పవర్ 3 ఫీచర్లు... 6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2.5డి కర్వ్డ్ గ్లాస్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.1 ఓరియో) 6 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 16+5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 13+5 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు 6080 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ -
సచివాలయమా..బిగ్‌బాస్‌షోనా
-
బాత్రూమ్లలో తప్ప అన్ని చోట్లా కెమెరాలు
సాక్షి, అమరావతి: సచివాలయ అధికారులు, ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం నిఘా పెంచింది. బాత్రూమ్లు మినహా కారిడార్లు, ఉద్యోగులు పనిచేసే క్యాబిన్లు, క్యాంటీన్లు.. చివరకు కంప్యూటర్లలో సైతం కెమెరాలు అమర్చారు. ఎటు కదిలినా కెమెరాలు వెంటాడుతుండటంతో సచివాలయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో తప్పులేదు గానీ.. తమను అవమానించేలా ఎక్కడపడితే అక్కడ కెమెరాలు పెట్టడమేమిటని మండిపడుతున్నారు. కంప్యూటర్లలో సైతం మైక్రో కెమెరాలు ఏర్పాటు చేశారని.. దీంతో పక్కనున్న సహ ఉద్యోగులతో మాట్లాడటం కూడా ఇబ్బందికరంగా మారిందని వాపోయారు. ప్రభుత్వం ఇంత అనుమానంతో వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఓ సీనియర్ ఉద్యోగి వ్యాఖ్యానించారు. తమ ప్రతి కదలికపైనా నిఘా పెట్టడం దారుణమన్నారు. సచివాలయమా.. బిగ్‌బాస్’ షోనా! ఇది సచివాలయమా ‘బిగ్‌బాస్’షోనా అని పలువురు అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ 60 కెమెరాలైతే ఇక్కడ ఏకంగా 240 కెమెరాలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కంప్యూటర్లలో కూడా కెమెరాలు ఏర్పాటు చేస్తే.. ప్రశాంతంగా ఎలా పనిచేయగలమని ప్రశ్నించారు. ఏ అధికారి వద్దకు.. ఎవరు వచ్చి వెళ్తున్నారనే వివరాలను తెలుసుకునే రీతిలో కెమెరాల ఏర్పాటు చేశారని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికలకు ముందు మారిన మనిషినని చంద్రబాబు పదేపదే చెప్తే సంతోషించామని, కానీ ఆయనలో ఎలాంటి మార్పు రాలేదనే విషయం మరోసారి స్పష్టమైందన్నారు. ఇప్పటికే బయోమెట్రిక్ హాజరు పేరుతో ఉద్యోగుల పనితీరు పట్టించుకోకుండా.. హాజరు మాత్రమే చూస్తున్నారని మండిపడ్డారు. తాము సమయంతో సంబంధం లేకుండా పనిచేస్తామని, ఇప్పుడు ఈ–ఆఫీస్ వల్ల సెలవు రోజుల్లో కూడా విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. అలాంటి తమ పట్ల ఈ విధంగా వ్యవహరించడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబుకు మొదట్నుంచీ ఉద్యోగులంటే ద్వేష భావం ఉందని.. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఉద్యోగులను వేధించడం అలవాటుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకు ముందు డీఏ ఇవ్వకుండా ఏడిపించేవారని, ఇప్పుడు డీఏలు ప్రకటించి.. ఆ తర్వాత పెండింగ్‌లో పెట్టి తమతో ఆడుకుంటున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇదంతా చాలదన్నట్టు 50 ఏళ్లకే బలవంతంగా పదవీ విరమణ చేయించి ఇంటికి పంపించే చర్యలు కూడా చేపట్టారని వాపోయారు. -
కెమేరాలు, యాక్సెస్ కార్డులు అమల్లోకి తెండి
సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశం సాక్షి, అమరావతి: ఉద్యోగులు మినహా ఇతరులెవరూ ప్రభుత్వ కార్యాలయాల లోపలకి ప్రవేశించకుండా నిఘా కెమేరాలు, యాక్సెస్ కార్డుల వినియోగాన్ని తక్షణం అమల్లోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యమంత్రి గురువారం వెలగపూడి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. గత ఆర్థిక సంవత్సరం జనవరితో పోల్చి చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి వరకు అదనంగా రూ.3,895.52 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆయనీ సందర్భంగా తెలిపారు. 14న మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. -
యువతిపై గ్యాంగ్ షాకింగ్ అటాక్..!
-
నిఘా నేత్రం
జేఎన్టీయూకేలో సీసీ కెమెరాల పటిష్ట నిర్వహణ ∙ బయోమెట్రిక్ ఏర్పాటుకు కసరత్తులు విద్యాలయాల్లో ర్యాగింగ్ వికృత క్రీడకు చరమగీతం పాడేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే అన్ని యూనివర్సిటీలు, కళాశాలల్లో సీసీ కెమెరాలను, బయోమెట్రిక్‌ను పటిష్టంగా అమలు చేయాలంటూ ఏపీ ఉన్నత విద్యామండలి జీఓ జారీ చేసింది. బాలాజీచెరువు (కాకినాడ) : ర్యాగింగ్ భూతాన్ని విద్యాలయాలనుంచి తరిమికొట్టే సత్సంకల్పంతో ఏపీ ఉన్నత విద్యామండలి జారీ చేసిన ఆదేశాల మేరకు గతేడాది జేఎన్టీయూ కాకినాడలో వర్సిటీ ఆవరణ, వివిధ విభాగాలు, వసతి గృహాల్లో అక్కడక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటిని మరింత విస్తృతం చేసి విద్యార్థుల కదలికలపై నిఘా మరింత పెడుతున్నారు. విద్యార్థులకు ఎలక్ట్రానిక్ ఐడెంటీటీ కార్డులను మంజూరు చేయాలంటూ ఉన్నత విద్యామండలి వర్సిటీలకు మార్గదర్శకాలను జారీ చేసింది. గతంలో కళాశాలలో చదువు పూర్తయిన విద్యార్థులు ఏళ్ల తరబడి కళాశాలలో తిష్టవేసేవారు. ర్యాగింగ్‌కు కొందరు పాల్పడేవారు. ఇప్పుడు చేపట్టిన చర్యలతో అలాంటివారి ఆటలు సాగవు. ర్యాగింగ్‌కు ఎవరైనా పాల్పడితే సర్వర్ రి మోట్ సిస్టంలో విద్యార్థి ఆధారాలతో సహా పట్టుబడతాడు. అప్పుడు ర్యాగింగ్ కేసుల నమోదు, రౌడీషీట్ వంటి కేసులు సైతం ప్రత్యేక పరిస్థితుల్లో నమోదవుతాయి. అలా జరిగితే ఆ విద్యార్థి భవిష్యత్‌కు తీవ్ర విఘాతం కలుగుతుంది. అందుకే విద్యార్థులు వాటికి దూరంగా ఉంటారు. వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి ప్రస్తుతం వర్సిటీలో 1,500 మందికి పైగా విద్యార్థులు బీటెక్, ఎంటెక్ చదువుతున్నారు. వసతి గృహాల్లోనే ర్యాగింగ్‌కు అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాటిపైనే ప్రత్యేక దృష్టి సాధించారు. సీనియర్లను జూనియర్లు సార్, మేడమ్ అంటూ సంబోధించడం, సీనియర్లకు ప్లేటులో అన్నం పెట్టించుకుని జూనియర్లు అందించడం, అనధికారికంగా హాస్టల్లో బస చేయడం వంటివి ఎన్నో ఏళ్లుగా సాగుతున్నాయి. అటువంటి పరిస్థితి నుంచి విముక్తి కలిగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వసతి గృహం, ఇతర విభాగాల్లో బయోమెట్రిక్ ఏర్పాటు చేసేందుకు కావాల్సిన పరికరాలు త్వరలో రానున్నాయి. అప్పుడు విద్యార్థుల హాజరు కఠినతరం చేయడం, విద్యార్థులు తరగతి, వసతి గృహంలో ఉన్న సమయం, బయటకు వెళ్లే సమయం నమోదవుతుంది. దాంతో దురాగతాలకు చెక్ పడుతుంది. రాత్రివేళలో ప్రత్యేక నిఘా రాత్రులు సైతం వర్సిటీలో నిఘా పెట్టాం. రాత్రి 9 గంటల తరువాత నిఘా బృందాలు వర్సిటీలో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటులో మిగిలిన వర్సిటీలతో పోలిస్తే ముందున్నాం. ఇప్పటికే వర్సిటీలోకి ప్రధానరహదారిన వచ్చే వాహనాల నెంబర్లను సెక్యూరిటీ సిబ్బంది నమోదు చేస్తున్నారు. అక్కడ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. – వెల్లంకి సాంబశివకుమార్, వైస్ చాన్సలర్, జేఎన్టీయూకే -
మహిళలు సీక్రెట్ కెమెరాలతో జాగ్రత్త !
-
పొన్కల్‌లో నిజామాబాద్ జిల్లావాసి ఆత్మహత్య
జన్నారం : టైగర్‌జోన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కెమెరాలు అమర్చి, పరిశీలించే ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన జన్నారం మండలంలోని పొన్కల్‌లో చోటుచేసుకుంది. ఏఎస్సై మజార్ కథనం ప్రకారం... నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలం కిసాన్‌పేట్ గ్రామానికి చెందిన ప్రశాంత్(23) హైదరబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నాడు. ఇటీవల కవ్వాల్ టైగర్‌జోన్ పరిధిలో జంతుగణనలో భాగంగా కెమరాలు అమర్చి, వివరాలు సేకరించే విషయమై శిక్షణ పొందుతున్నాడు. ఇందులో భాగంగా జన్నారం మండలం పొన్కల్ గ్రామంలో అద్దె గదిలో ఉంటున్నాడు. ఆదివారం రాత్రి తన గదిలో ఇనుపరాడ్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లావారాక 8 గంటలైన తలుపు తెరవ కపోవడంతో అనుమానంతో యజమాని కిటికీలోంచి చూశాడు. లోపలి గదిలో అతడు ఉరేసుకుని విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతుడి కుటుంబీకులకు సమాచారం ఇవ్వగా వారొచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రశాంత్‌ను ఎవరో చంపి ఉంటారని వారు ఆరోపించారు. అరుుతే గది లోపలి వైపు గడియ పెట్టి ఉండడంతో ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ మోహన్ పరిశీలించారు. మృతుడి తండ్రి స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై మజార్ తెలిపారు. ఆత్మహత్య కారణాలు తెలియరాలేదు. -
ఇది నేరస్తుల నెట్వర్క్!
ఢిల్లీలో ‘సీసీటీవీ’ వ్యవస్థ ♦ పోలీసుల రాకను పసిగట్టేందుకు కెమెరాలు న్యూఢిల్లీ: శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు సీసీటీవీలను ఏర్పాటు చేసి నిరంతరం సమీక్షిస్తుంటే.. అదే సాంకేతికతను ఉపయోగించుకుని యథేచ్చగా అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఢిల్లీ గ్యాంబ్లర్లు. తమ డెన్ చుట్టుపక్కల పోలీసుల సంచారాన్ని పసిగట్టి జాగ్రత్తపడుతూ.. విచ్చలవిడిగా అక్రమ వ్యాపారం చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. దేశ రాజధానిలోని వసంత్ గావ్‌లో అక్రమ మద్యం, మత్తుపదార్థాలు అమ్ముతున్నారంటూ.. ఢిల్లీ పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. పోలీసులు ఆ ప్రాంతంలో రైడ్ చేయగా అక్రమ కార్యక్రమాలకు సంబంధించిన ఆనవాళ్లేమీ దొరకలేదు. మరో ప్రాంతం నుంచి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దీనిపై ఉన్నతాధికారులు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఈ బృందం పకడ్బందీగా వ్యవహరించి నాలుగైదు గ్యాంగులను పట్టుకున్నాక ఈ నేరస్తుల ‘సీసీటీవీ నెట్వర్క్’ వెలుగులోకి వచ్చింది. అక్రమ కార్యక్రమాలకు పాల్పడేవారు తమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఎలాంటి అనుమానం రాకుండా సీసీటీవీలను ఏర్పాటుచేసుకున్నారు. దీన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు ఓ వ్యవస్థను పెట్టుకున్నారు. తమ ప్రాంతంలో పోలీసులు, బీట్ కానిస్టేబుళ్ల సంచారంపై అనుమానం వస్తే వెంటనే అప్రమత్తమవుతున్నారు. దీంతో పోలీసులు పక్కా సమాచారంతో వెళ్లినా వీరిని పట్టుకోలేక పోయారు. -
కెమెరాల్లో పట్టేస్తాం.. ఈ చలాన్ పంపిస్తాం
► ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే వాహన చోదకులపై ప్రత్యేక దృష్టి ► డీజీపీ జే వీ రాముడు వెల్లడి ► ఈ-ఆఫీస్ అప్లికేషన్, ఈ-చలానా, ఎఫ్ఎం రేడియో సేవలు ప్రారంభం ఏలూరు అర్బన్ : జిల్లాలో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని.. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే వారిని గుర్తించి చర్యలు చేపడతామని రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు చెప్పారు. శుక్రవారం ఏలూరు వచ్చిన ఆయన ఈ-ఆఫీస్ అప్లికేషన్, ఈ-చలానా, ఎఫ్ఎం రేడియో సేవలను ఆరోగ్య భద్రత పథకంలో తల్లిదండ్రులనూ చేర్చండి డీజీపీకి పోలీసు అధికారుల సంఘం వినతి ఏలూరు అర్బన్ : పోలీసు ఉద్యోగులకు అమలు చేస్తున్న ఆరోగ్య భద్రత పథకంలో వారి తల్లిదండ్రులనూ చేర్చాలని జిల్లా పోలీసు అధికారుల సంఘం డీజీపీ జేవీ రాముడుకు విజ్ఞప్తి చేసింది. శుక్రవారం నగరానికి విచ్చేసిన డీజీపీని సంఘ అధ్యక్షుడు కె.నాగరాజు, కార్యదర్శి కె.రజనీకుమార్, నాయకులు కె.వెంకటరావు, జి.దివాకర్, ఏకే సత్యనారాయణ తదితరులు కలసి ఈ మేరకు వినతిపత్రం అందించారు. ఆర్థో, డెంటల్, జనరల్ వైద్య సేవలకు గాను జిల్లాలో మరో మూడు ఆసుపత్రులను నెట్వర్క్ జాబితాలో చేర్చాలని వినతి పత్రంలో కోరారు. చనిపోయిన పోలీసు ఉద్యోగుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.లక్ష సాయం అందించేందుకు ప్రతినెలా పోలీసు ఉద్యోగుల జీతాల నుంచి రూ.50 మినహాయించి డిసీజ్డ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్‌కు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జమ చేసేలా అనుమతి ఇవ్వాలని కోరారు. సంఘ కార్యాలయానికి సొంత భవనం నిర్మించే అవకాశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ప్రారంభించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిని సీసీ కె మెరాల ద్వారా గుర్తించి, మల్టీపర్పస్ పోలీస్ డివైస్ (ఎంపీడీ) సాయంతో జరిమానాలకు సంబంధించి ఈ చలానాలు జారీ చేస్తామని చెప్పారు. జిల్లాలో పెరుగుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలను నియంత్రించే క్రమంలో ఈ చలానా విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ కోసం తొలిసారిగా ఎఫ్ఎం రేడియో 88.7 ప్రారంభి స్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఎఫ్ఎం రేడియో సేవలు ఏలూరు నగర వాసులకు మాత్రమే అందుబాటులో ఉంటాయని, త్వరలో జిల్లా అంతటా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ప్రజలకు మెరుగైన, సత్వర సేవలు అందించే లక్ష్యంతో ఈ-ఆఫీస్ సేవలు ప్రారంభిస్తున్నామన్నారు. దేశంలోని తొలిసారిగా పశ్చిమగోదావరి జిల్లాలో దీనిని అమల్లోకి తెచ్చామన్నారు.కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లలో ఈ-ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అందించిందని తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంతోపాటు అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ‘కృపామణి’ నిందితుల్ని వదలం వ్యభిచార ఊబిలోకి దించే ప్రయత్నాలను భరించలేక తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య, చిత్తూరు నగర మేయర్ దంపతుల హత్య కేసులకు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నలపై డీజీపీ స్పందించారు. ఈ కేసులను అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పా రు. అంతకుముందు ఏలూరులో నిర్మించిన పోలీసు జిమ్, సురేష్ బహుగుణ స్కూల్లో నూతనంగా నిర్మించిన భవనాలను డీజీపీ ప్రారంభించారు. అనంతరం పోలీసు పరేడ్ గ్రౌండ్స్ సమీపంలో నిర్మించిన అమర పోలీసు వీరుల స్థూపాన్ని సందర్శించారు. ఆయన వెంట కోస్తా జిల్లాల ఐజీ కుమార్ విశ్వజిత్, ఏలూరు రేంజి డీఐజీ పి.హరికుమార్, జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్, అడిషనల్ ఎస్పీ ఎన్.చంద్రశేఖర్, ఏలూరు డీఎస్పీ కేజీవీ సరిత ఉన్నారు. పోలీస్ అధికారులతో సమీక్ష డీజీపీ రాముడు ఏలూరు రేంజి పోలీసు ఉన్నతాధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. కృపామణి ఆత్మహత్య, దేవరపల్లిలో కన్న కుమారుణ్ణి తండ్రి హత్య చేసిన ఘటన తదితర కేసులకు సంబంధించిన వివరాలు, ఆ కేసుల్లో పురోగతిపై ఆరా తీశారు. జిల్లా సరిహద్దులో మావోయిస్టుల సంచారం తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారని సమాచారం. -
ఆలయ భద్రత ‘గోవిందా’
- సెల్ఫోన్లు, కెమెరాలతో ఆలయంలోకి అనుమతి - తూతూమంత్రంగా సిబ్బంది తనిఖీలు - నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టీటీడీ యంత్రాంగం చంద్రగిరి : ఏడు లోకాలను రక్షించే ఏడుకొండల వాడికి రక్షణ కరువైంది. శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఘన చరిత్ర ఉంది. అటువంటి ఆలయానికి భద్రత విషయంలో టీటీడీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నారాయణవనంలో శ్రీవారు పద్మావతి దేవిని వివాహం చేసుకుంటారు. అనంతరం దేవేరులు తిరుమలకు పయనమౌతారు. అయితే తొం డవాడ స్వర్ణముఖినది ఒడ్డున వెలసిన శ్రీఅగస్త్య మహాముని వివాహానంతరం దేవేరులు తిరుమలకు వెళ్లడం మంచిదికాదని వివరిస్తారు. దానికి అణుగుణంగా శ్రీనివాసుడు అమ్మవారితో కలసి ఆరు నెలల కాలం పాటు శ్రీనివాస మంగాపురంలో నివ శించాడని అందుకే ఆ గ్రామం శ్రీనివాస మం గాపురంగా నిలిచిందని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా భక్తులు తిరుమలలో నిర్వహించలేనటువంటి సేవలను మంగాపురాలయంలో నిర్వహించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తిరుమలకు కాలినడకన చేరుకోవడానికి శ్రీవారి మొట్టుదారి దగ్గరవడంతో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. తిరుమల శ్రీవారి ఆలయం తర్వాత అంతటి ప్రాముఖ్యత గల దేవాలయం శ్రీనివాస మంగాపురం. ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న ఆలయంపై టీటీడీ అధికారులు శీత కన్ను వేశారు. శ్రీనివాస మంగాపురంలోని స్వామివారిని దర్శిం చుకోవడానికి వస్తున్న భక్తులకు కనీస అవసరాలను తీర్చడంలో టీటీడీ పూర్తి గా వైఫల్యం చెందిదని స్థానికులు ఆరోపిస్తున్నారు. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు రోజుకు వేల సంఖ్యలో వస్తుంటారు. ఆలయ పరిసరాలలో ఎక్కడాకాని లగేజి కౌంటర్ లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. దీంతో చేసేదేమిలేక భక్తులు తమ లగేజీతోపాటే ఆలయంలోకి ప్రవేశిస్తున్నారు. ఆలయంలోకి సెల్ఫోన్లు, కెమెరాలు నిషేధమని అధికారులకు తెలిసినా కూడా చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నా రు. సిబ్బంది సైతం భక్తులకు సూచనలు ఇస్తున్నారే తప్ప వారిని తనిఖీ చేసిన దాఖలు లేవు. దీంతో భక్తులు ఆలయంలోకి సెల్ఫోన్లు, వీడి యో కెమెరాలతో ప్రవేశిస్తున్నారు. భక్తులు అలయంలో ఫొటోలు, వీడియోలను చిత్రీకరిస్తుండటంతో తోటి భక్తులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకనైనా అధికారులు మేల్కొని తిరుమల తరహాలో ఆలయ సమీపం లో సెల్ ఫోన్, లగేజి కౌంటర్ల ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. -
బ్యాంకుల్లో భద్రత పెంచండి
- బీహారీ ముఠాలు తిరుగుతున్నాయి - ఏటీఎంల్లో సెక్యూరిటీ, బ్యాంకుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి - వ్యవసాయ రుణాల మంజూరులో దళారుల ప్రమేయం వద్దు - పార్వతీపురం ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పార్వతీపురం: బ్యాంకుల్లో భద్రతను మరింత పెంచాలని పార్వతీపురం ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పట్టణంలోని బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్వతీపురంలో బయట ప్రాంతాలకు చెందిన దొంగల ముఠాలు తిరుగుతున్నాయని, ఇటీవల బిహారీ ముఠాను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. బ్యాంకుల్లో సీసీ కెమెరాలతో పాటు ఏటీఎంలలో సెక్యూరిటీ గార్డులను నియమించాలని సూ చించారు. అలాగే నగదు విత్‌డ్రాల వద్ద నిఘాను పటిష్టం చేయాలన్నారు. దీంతోపాటు ముఖ్యంగా అమాయకులైన రైతులను మోసగించి... కొంతమంది దళారులు వ్యవసాయ రుణాలకు వస్తారని, వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. రుణాల విషయంలో దాదాపు దళారులను దూరంగా ఉంచాలన్నారు. రావివలస పీఏసీఎస్ రుణాల వ్యవహారాన్ని అందరూ గమనించాలన్నారు. అలాగే బ్యాంకుల్లో ఇంటిదొంగలపై జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు సొమ్ము స్వాహా చేసిన సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా లాంటి సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. దీనిలో భాగం గా బ్యాంకర్ల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. కార్యక్రమంలో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వి.చంద్రశేఖర్, ఎస్సై బి.సురేంద్రనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
హైవేపై సీసీ కెమెరాలతో నిఘా
వాహన వేగాన్ని నియంత్రించే స్పీడ్‌బ్రేకర్లు, స్టాపర్లు సాలూరు: గతంలో ఎన్నడూ లేనివిధంగా నేరాలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా చేయడంతోపాటు, ఒకవేళ సంభవిస్తే బాధ్యులను త్వరితగతిన గుర్తించేలా చేసేందుకు వీలుగా పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవలే సీఐగా బాధ్యతలు స్వీకరించిన జి.రామకృష్ణ ఈదిశగా ఆలోచన చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే పలు చర్యలు కార్యరూపం దాల్చగా ఇంకొన్ని ఆలోచనలు ఆచరణలోకి రావాల్సి ఉంది. దీంతో పోలీసుల చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జాతీయ రహదారిపై సీసీ కెమెరాలు 26వ నంబరు జాతీయ రహదారిపై స్థానిక తహశీల్దార్ కార్యాలయ జంక్షన్లో మూడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాలను గుర్తించడంతో రోడ్డు ప్రమాదాలు, అక్రమరవాణా చేసే వాహనాలను సునాయాసంగా గుర్తించే అవకాశం కలుగుతుందని సీఐ రామకృష్ణ భావిస్తున్నారు. అంతేకాకుండా పట్టణంలో రహదారులు ఇరుగ్గా ఉండడంతో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా పోలీసుల పనితీరుపై కూడా తమ శాఖ నిఘా పెట్టేందుకు దోహదపడుతుందంటున్నారు. వేగ నియంత్రణకు వాహన వేగాన్ని నియంత్రించేందుకు, తద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు వీలుగా జాతీయ రహదారిపై పలుచోట్ల స్పీడ్ బ్రేకర్లు, స్టాపర్లను ఏర్పాటు చేశారు. గాంధీనగర్‌వద్ద వన్ వే ట్రాఫిక్ మార్గంపై స్పీడ్ బ్రేకర్లను నిర్మించారు. అలాగే కాస్త ముందుగా జాతీయ రహదారిపైన, ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోను స్టాపర్లను ఏర్పాటు చేశారు. దీనివల్ల సత్ఫలితం వస్తుందని భావిస్తున్నారు. త్వరలో జీపీఎస్ ఫోన్లు అలాగే నోపార్కింగ్ బోర్డులు కూడా ఏర్పాటు చేయనుండడంతో పాటు రాత్రివేళ విధులు నిర్వర్తించే పోలీసులకు, ట్రాఫిక్ నియంత్రణకు వెళ్లే వారిపై ఒక కన్నేసేలా చేసేందుకు ఉపకరించే జీపీఎస్ ఫోన్లను వినియోగంలోకి తేనున్నారు. దీనివల్ల ఏసమయంలో ఎక్కడ ఉన్నారో ఇట్టే తెలుసుకోవడం సాధ్యమంటున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నేరాలు, ప్రమాదాల అదుపునకు, చోటివ్వకుండా చర్యలు తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
కెమెరాలు పరిష్కారమా?
రోగుల బంధువుల నుంచి తమకు రక్షణ కావాలని, ఆస్ప త్రులలో సీసీ కెమెరాలను పెట్టాలని ఇటీవలి కాలంలో డాక్టర్లు మొత్తుకుంటున్నారు. సాధారణంగా ప్రైవేట్ వ్యక్తులు తమ షాపుల్లో వీటిని వాడుతున్నారు. కానీ ఆ పేరుతో మనం సీసీ కెమెరాల నిర్బంధంలో ఉన్నామనే విషయం చాలామందికి తెలీదు. జనం రహస్యాలు, దాపరికాలు లేకుండా ఉన్నది ఉన్న ట్లు మాట్లాడుకుంటారు. కానీ ఆస్పత్రుల యాజమాన్యాలు, కొందరు డాక్టర్లు మాత్రం ఈ మాటలను తమకు ఆసరాగా చేసుకుంటున్నారు. రోగి కుటుంబం వారి ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై వారు దృష్టి పెడుతున్నారు. అందరు డాక్టర్లు కాకపోయినా ఎక్కువ మంది డాక్టర్లు మాత్రం రోగి దగ్గర ఎలా డబ్బులు లాగాలి అనే సీసీ కెమెరాలను వాడుతున్నారు. అసలే ప్రాణం బాగులేని సమయంలో హాస్పిటల్‌కు వెళతారు. అప్పు డు రోగి కుటుంబ సభ్యులు, బంధువులు మానసికాందోళనతో ఉంటారు. దాన్ని ఆసరాగా చేసుకొని డబ్బులు వసూలు చేసు కుంటున్నారు. సామాన్య ప్రజలకు జరుగుతున్న ఈ అన్యా యాన్ని అరికట్టాలి. వైద్యసేవలో ఉండవలసిన నైతిక ధర్మాన్ని అందరూ పాటించేలా చూడాలి. తలారి సుధాకర్ కోహెడ, కరీంనగర్ జిల్లా -
జస్ట్ రొమాన్స్..!
చూస్తుంటే ‘బిగ్‌బాస్’ రియాల్టీ షోలో రొమాన్స్ కామన్ ఫ్యాక్టర్ అయిపోయినట్టుంది. భిన్న ధుృవాలు ఆకర్షించుకుంటాయన్న సూత్రంలా... హౌస్‌లో ఉన్న ఆడ- మగ ఒకరికొకరు ఠక్కున కనెక్ట్ అయిపోతున్నారు. చుట్టూ కెమెరాలు రెప్పలార్పకుండా ఉన్నా... వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకుంటున్నట్టు లేదు. ప్రస్తుత సీజన్లో హౌస్‌లో ఉన్న గౌతమ్, దియాంద్రల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుటవుతున్నట్టుంది... సాన్నిహిత్యం రోజురోజుకూ పెరిగిపోతుందట. వారి ప్రేమ కామన్ హాల్... బెడ్రూమ్లు దాటి బాత్రూమ్ల వరకు పాకిందన్నది గుసగుస. వీరే కాదు... ఇలా బిగ్‌బాస్ షోతో చాలామందే ఒంటరిగా వచ్చి జంటలుగా తేలుతున్నారు. -
పిల్లలు తీసిన పెద్ద ఫొటోలు!
-
చిల్డ్రన్స్ క్లిక్ అవుట్
ప్రోత్సహించే వారుంటే అడుగున దాక్కున్న ప్రతిభ కూడా అంబరాన్ని తాకుతుంది. అద్భుతాలను ఆవిష్కరించి అదరహో అనిపిస్తుంది. చదువే లోకంగా బతికే ఆ చిన్నారులకు కాసింత ఆటవిడుపు దొరికితే చాలు. వారి మస్తిష్కాల్లో అందరి మన్ననలు అందుకునే ఆలోచనలు అంకురిస్తాయి. చిన్నారుల్లో దాగి ఉన్న మరో కోణాన్ని వెలికితీసే ప్రయత్నం సాక్షి సిటీప్లస్ చేసింది. బాలల దినోత్సవం సందర్భంగా గడుగ్గాయిల చేతులకు కెమెరాలు అందించింది. వన్ డే ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లుగా స్వేచ్ఛనిచ్చింది. సాక్షి సపోర్ట్‌ను అందిపుచ్చుకున్న నవ్య గ్రామర్ స్కూల్, అంబర్‌పేటకు చెందిన 12 మంది విద్యార్థులు వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లుగా మారిపోయారు. నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో కలియ తిరిగారు. రాజసం ఉట్టిపడే వన్యప్రాణుల హావభావాలు లెన్స్‌తో చూసి మురిసిపోయారు. అంతే ఠీవీ ఉట్టిపడేలా వాటిని క్లిక్ మనిపించారు. వీరిలో ఒక్కొక్కరిదీ ఒక్కో కోణం.. ఒక్కో ఫొటో ఒక్కో జీవ వైవిధ్యం. పుస్తకాలతో కుస్తీ పట్టడంలోనే కాదు.. కెమెరాలు క్లిక్మనిపించడంలోనూ తామేం తక్కువేం కాదని నిరూపించారు. ఈ చిన్నారులు క్లిక్ మనిపించిన చిత్రాల్లో.. ‘బెస్ట్ సిక్స్’ ఇక్కడ ప్రచురిస్తున్నాం. పిల్లలతో ఇలా వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ తీయించడం చాలా మంచి ఆలోచన. భవిష్యత్తులో కూడా ‘సాక్షి సిటీప్లస్’ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడితే బాగుంటుంది. చిన్నారులకు వన్యప్రాణులు తదితర అంశాలపై అవగాహన పెరుగుతుంది. - జి.భాస్కర్‌రెడ్డి, నవ్య గ్రామర్ హైస్కూల్ ప్రిన్సిపాల్ -
కెమెరాల ముందు కొట్టుకున్న లేడి కానిస్టేబుల్స్
-
స్మార్ట్ ఫోన్లలో కెమెరాదే పైచేయి!
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా సెల్ ఫోన్ల వాడకం జనాభాతో సమానంగా పరుగులు తీస్తుంటే.. ఇందులో స్మార్ట్ ఫోన్ల సందడి అంతా ఇంతా కాదు. రోజుకో కొత్త మొబైల్. గంటకో టెక్నాలజీ. ఇలా పరుగులు తీస్తూనే ఉంది ఫోన్ ప్రపంచం. అయితే యువత స్మార్ట్ ఫోన్ల వాడకంలో ఎన్నో రకాలైన ఫీచర్లను కల్గి ఉన్నా.. అందులోని కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారట. ఈ విషయాన్ని తాజాగా ఓ సర్వే స్పష్టం చేసింది. ఇందుకు 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉన్న 1,019 యువతను ఎంచుకున్నారు. వీరిలో 90 శాతం మంది మాత్రం తాము ఫోటోలు తీయడానికి స్మార్ట్ ఫోన్ కెమెరానే ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోని వారంలోని అధికమొత్తంలో తాము తీసిన ఫోటోలను స్నేహితులతో షేర్ చేసుకుంటామన్నారు. అయితే తాము పంపే వాటిలో సెల్ఫీ ఫోటోలే కాకుండా.. ఇంట్లోని వస్తువులను కూడా ఫోటోల రూపంలో పంపుతామని వారు స్పష్టం చేస్తున్నారు. కాగా, 78 శాతం మంది మాత్రం రోజులో కనీసం రెండ గంటలపాటు ఫోన్లలో గడుపుతామని తెలిపారు. -
నగ్న దృశ్యం
-
బిగ్‌బజార్‌లో భారీ చోరీ
సుల్తాన్‌బజార్: ఒకప్పుడు ఉపాధినిచ్చి..ఆదుకున్న సంస్థకే కన్నం వేశారా ప్రబుద్ధులు. రూ.50 లక్షలకు పైగా విలువైన లాప్‌ట్యాప్‌లు, స్మార్ట్ఫోన్లు, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు దోచుకున్నారు. ఈ సంఘటన శనివారం నగరంలో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కాచిగూడ క్రాస్ రోడ్‌లోని బిగ్‌బజార్‌ను శుక్రవారం రాత్రి ఎప్పటిలాగానే పని వేళలు ముగిసిన తరువాత మూసేశారు. శనివారం తెల్లవారు జామున 3 గంటలకు సెక్యూరిటీ చెక్ నిర్వహించారు. డిస్ప్లేలో కొన్ని ల్యాప్‌ట్యాప్‌లు, సెల్ఫోన్లు కనిపించ కపోవడంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ముగ్గురు వ్యక్తులు ఎలక్ట్రానిక్ వస్తువులు దొంగిలిస్తున్నట్లు అందులో గుర్తించారు. వెంటనే విషయాన్ని బిగ్‌బజార్ ఉన్నతాధికారులకు సెక్యూరిటీ సిబ్బంది సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి, సుల్తాన్‌బజార్ పోలీసులను ఆశ్రయించారు. ఏసీపీ రవికుమార్, డీఐ కిషోర్ లు సంఘటన స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి, వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. సిబ్బందిని విచారించారు. బిగ్‌బజార్ మేనేజర్ ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ప్రణాళిక ప్రకారమే... గతంలో బిగ్‌బజార్ లో పనిచేసి, మానివేసిన ముగ్గురు సెక్యూరిటీ గార్డులుపక్కా ప్రణాళికతో చోరీ చేశారని సీసీ కెమెరా ఫుటేజ్‌ల ద్వారా తెలుస్తోంది. అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌లకు చెందిన పప్పుదాస్, కమల్‌దాస్, రజినిపెగ్‌లు బిగ్‌బజార్‌లో 3వ ప్లోర్లోని ఫైర్‌ఎగ్జిట్ ద్వారం నుంచి 2వ అంతస్తులోని ఎలాక్ట్రానిక్ విభాగంలోకి ప్రవేశించి అక్కడున్న ఖరీదైన ల్యాప్‌ట్యాప్‌లు, స్మార్ట్ ఫోన్లు, కెమెరాలను, తర్వాత పక్కనే ఉన్న స్టోర్‌రూమ్, స్టాఫ్‌రూమ్‌ల తాళాలను పగులగొట్టి లోనికి వెళ్లి రెండు బీరువాల తాళాలను పగులగొట్టి అందులో ఉన్న ఖరీదైన సెల్ఫోన్లను ఎత్తుకెళ్లారు. మొత్తం పరికరాల విలువ రూ.50లక్షలకు పైనేనని సిబ్బంది చెబుతున్నారు. సీసీ కెమెరాల వైర్లు కత్తిరించి: ముగ్గురు వ్యక్తులు లోనికి వస్తూనే కొన్ని సీసీ కెమెరాల వైర్లను కత్తిరించారు. ఓ కెమెరా వైర్లు కత్తిరించకపోవడంతో చోరీ దృశ్యాలు చిక్కాయి. అర్ధరాత్రి 12 గంటల 52 నిమిషాల నుంచి ఒంటిగంటన్నర వరకు చోరీ చేశారు. నిందితులు 4 సూట్‌కేసులు, 6 బ్యాగులను తీసుకువచ్చి వాటిలో చోరీ చేసిన వస్తువులు తీసుకుని దర్జాగా ఆటోలో వెళ్లిపోయారు. చివరకు రాత్రి డ్యూటీలో ఉన్న ఓ సెక్యూరిటీ గార్డ్ వద్ద నిందితుడు కూల్‌డ్రింక్ తాగి మరీ వెళ్లడం గమనార్హం. కీలకం కానున్న ఫోన్‌కాల్: చోరీ చేస్తున్న సమయంలో ముగ్గురిలో ఒకడు సరిగ్గా 1.05 గంటలకు ఎవరికో ఫోన్ చేశాడు. ఈ దృశ్యాలను సీసీ కెమెరాలో చూసిన పోలీసులు ఫోన్ కాల్‌పై దృష్టి పెట్టారు. బిగ్‌బజార్ నుంచిఆ సమయంలో వారు ఎక్కడికి ఫోన్ చేశారు? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితుల బయోడేటా ఆధారంగా వారి ఫొటోలను సేకరించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నగరంలోనే నిందితులు? నిందితులు పప్పుదాస్, కమల్‌దాస్, రజినిపెగ్ల పట్టుకునేందుకు 3 బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. నిందితులు అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌లకు చెందిన వారు. అసోం వె ళ్లేందుకు సోమవారం ఉదయం రైలుఉంది. మరే ఇతర మార్గాల ద్వారా నిందితులు వెళ్లినా పోలీసులకు దొరికిపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీన్నిబట్టి నిందితులు న గరం, శివారు ప్రాంతాలలో ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను పట్టుకుంటాం: కాచిగూడ క్రాస్‌రోడ్స్‌లోని బిగ్‌బజార్‌లో గుర్తు తెలియని వ్యక్తులు 35 సెల్ఫోన్లు, 15 ల్యాప్‌ట్యాప్‌లు. 7 కెమెరాలు చోరీ చేశారని ఏసీపీ రవికుమార్ విలేకరులకు తెలిపారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. 3 బృందాలతో గాలింపు చర్యలు మొదలుపెట్టామని ఆయన తెలిపారు. తన పర్యవేక్షణలో సుల్తాన్‌బజార్ డీఐ కిషోర్‌కుమార్ దర్యాప్తు చేస్తున్నార ని చెప్పారు. -
లెన్స్ అండ్ సురభి
వారిది సాటిలేని నటనా చతురత.. వీరిది వైవిధ్యమైన కళా దృశ్యాలను ఒడిసిపట్టాలనే తపన.. వెరసి నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని సురభి ఆడిటోరియంలో ప్రద ర్శితమయ్యే నాటకాలపై ఆధునికులు మనసు పారేసుకుంటున్నారు. ఫొటోగ్రఫీ క్రేజ్ పుణ్యమో.. వైవిధ్యమైన దృశ్యాలకు అందమైన రూపం ఇవ్వాలనే ఆత్రమో గాని సురభి ఆడిటోరియంలో సిటీజనుల కెమెరాలు క్లిక్‌మంటున్నాయి. అపురూపమైన కళాభినివేశాలను తమలో ఇముడ్చుకుంటున్నాయి. జీవన దిలా సాగిపోయే ఆ అభినయ ఝరిని.. మరింత ఉన్నతంగా, వైవిధ్యంగా చూపించాలని పరితపిస్తున్నాయి. వీకెండ్స్‌లో సురభి కళా నిలయం వైపు అడుగులేస్తున్న ఫొటోగ్రాఫర్లలో కొందరు అంతర్జాతీయ పురస్కారాలు అందుకోవడం మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఏదేమైనా నగరంలో ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటున్న ఈ ట్రెండ్ పుణ్యాన ఈ అజరామర కళారూపం మరింతగా నగరవాసులకు చేరువవుతుందని కళాభిమానులు ఆశిస్తున్నారు. తొలిసారి 2010లో సురభి ప్రదర్శనకు వెళ్లాను. నిజంగా అద్భుతం. అక్కడ ఏ ఫొటోగ్రాఫర్కైనా కావాల్సినంత ముడిసరుకుంది. అన్నింటికన్నా ఆ కళాకారుల్లో కనపడే స్వచ్ఛతకు హ్యాట్సాఫ్ చెప్పాలి. అంత గొప్ప సురభి గురించి ప్రపంచానికి చాటి చెప్పాలంటే, ఆ కళావైభవానికి మరింత ప్రాచుర్యం కల్పించాలంటే అందుకు ఫొటోగ్రఫీ ఒక చక్కని మార్గం. అక్కడ నేను తీసిన ఒక ఫొటోకు నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ మూమెంట్ అవార్డ్ లభించింది. - చంద్రశేఖర్ సింగ్ నూటపాతికేళ్ల సురభి నాటక కళామండలిని పరిశీలించడమే ఓ అద్భుతం. అపూర్వ ధారణ శక్తితో సందర్భోచితంగా సాగిపోయే వారి అభినయం మహాద్భుతం. ఈ కాలంలోనూ భారతీయ నాటకం బతికుందంటే.. కళామూర్తుల తృష్ణ ఎంత గొప్పదో తెలుస్తుంది. ఎల్లలు లేని వారి కళాభినివేశాన్ని నిశ్శబ్దంగా నా కెమెరాలో బంధించాను. భగవంతుడే తన కళ్లను అరువిచ్చి నా కెమెరాతో ఆ అపురూప దృశ్యాలను నిక్షిప్తం చేసే భాగ్యం కల్పించాడన్పిస్తోంది. - మామిడి చైతన్యకుమార్ తరచూ సురభిని సందర్శించి మరిన్ని ఫొటోలు తీయాలనుకుంటున్నాను. ఆ లైట్స్, యాక్షన్, సాంకేతిక విలువలు.. ఎంత గొప్పగా ఉన్నాయో.. ఇది సింగిల్‌షాట్‌లో తీసిన ఒక లో-బడ్జెట్ హాలీవుడ్ మూవీకి సరిసాటి. నమ్ముకున్న కళను బతికించుకోవడానికి వీరు చేస్తున్న కృషికి జోహార్లు. మల్టీప్లెక్స్‌లు వదిలిపెట్టి ఈ లైవ్మూవీని చూడండి. నాటకం మీ మనసు దోచుకుంటుందని నేను హామీ ఇస్తున్నాను. -యర్రమిల్లి అభిలాష్ ఆర్టిస్టులు మేకప్ చేసుకుంటున్న ప్రాంతంలో అకస్మాత్తుగా ఆ తరం రంగస్థల నటి పద్మజా వర్మ కనపడింది. మేకప్ చేసుకుంటున్న ఆమె ఎక్స్ప్రెషన్ చూసి అసంకల్పితంగానే నా కెమెరా స్పందించింది. నాటకం నానాటికీ ప్రాభవం కోల్పోతున్నా.. సడలని అంకితభావానికి ప్రతిబింబంలా కనిపించిన ఆ దృశ్యాన్ని బంధించాను. దీనికి అలయెన్జ్ ఫ్రాంచైజ్ వరల్డ్ ఫొటో కాంపిటీషన్లో రన్నరప్ ప్రైజ్ లభించింది. ఈ గుర్తింపు అపూర్వ కళకు ఫొటోగ్రఫీ కళ కట్టిన పట్టంగా భావిస్తున్నా. -స్వారత్ -
అడవిలో దొంగలు పడ్డారు!
ఆత్మకూరు రూరల్: పెద్దపులుల అభయారణ్యంగా పేరుగాంచిన నల్లమలలో రక్షణ కరువైంది. విస్తారమైన వృక్షసంపద నిలయమైన కొండలను సంరక్షించడంలో అటవీ అధికారులు విఫలమవుతున్నారు. అక్రమార్కులు యథేచ్ఛగా ఫారెస్టులో సంచరిస్తున్న వారిని పట్టుకునే నాథుడు లేడు. వన్యప్రాణులను లెక్కించేందుకు, స్మగ్లర్లు, వేటగాళ్లను పసిగట్టేందుకు అడవిలో కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని బైర్లూటీ రేంజ్లో ఇటీవల రెండు కెమెరాలు మాయం కావడంతో నల్లమలలో ఏ పాటి నిఘా ఉందో ఇట్టే అర్థమవుతోంది. సిబ్బంది నిర్లక్ష్యమే కారణం.. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో నల్లమల 15 వేల హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇందులో పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, దుప్పి, తదితర జాతులకు చెందిన జంతువులు ఉన్నాయి. వీటి సంరక్షణకోసం అటవీశాఖ దాదాపు 200 మందికి పైగా సిబ్బందిని నియమించింది. 12 బేస్ క్యాంపులను ఏర్పాటు చేసింది. ప్రతి ఏడాది రెండు, మూడు సార్లు ఈ ప్రాంతంలో ఉండే పెద్దపులులు, చిరుతలు, ఆయా జాతులకు చెందిన వన్య ప్రాణులను లెక్కిస్తుంటారు. వీటి లెక్కింపుతో పాటు పొలపర్లను, అటవీ స్మగ్లర్లను గుర్తించేందుకు వీలుగా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని బైర్లూటీ, నాగలూటి, ఆత్మకూరు, వెలుగోడు రేంజ్‌లలో 130 కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా నాగలూటి పెచ్చెర్వు, పంగిడి, పావురాలగుట్ట, దామర్లకుంట, సుద్దకుంట, జీబీఎం ప్రాంతాల్లో కెమెరాలను అమర్చారు. ఈ ఏడాది జనవరి, మే నెల 9 నుంచి 14 వరకు పెద్దపులుల గణాంకాల సేకరణ చేపట్టారు. కెమెరా ట్రాప్‌లలో ఎన్ని వన్యప్రాణులు నిక్షిప్తమయ్యాయో తెలుసుకుని పూర్తి వివరాలు వెల్లడించే క్రమంలో అటవీ సిబ్బంది నిమగ్నమయ్యారు. అన్ని ప్రాంతాల్లో అమర్చిన కెమెరాలను సేకరించారు. అయితే బైర్లూటీ రేంజ్ పరిధిలోని పావురాలగుట్ట పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రెండు కెమెరాలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లినట్లు అటవీ సిబ్బంది గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ.40 వేలు ఉంటుంది. విషయం బయటకు పొక్కకుండా ఉండేలా కెమెరాల కోసం అడవిలో సిబ్బంది అన్వేషణ చేపట్టారు. అయినా ఫలితం దక్కకపోవడంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అటవీ సమీప గ్రామాలకు చెందిన పొలపర్లపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దట్టమైన అటవీప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌లపైనే దృష్టి సారించకుంటే ఇక అటవీ, వన్యప్రాణులను ఎలా సంరక్షిస్తారంటూ పలువురు వన్యప్రాణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై బైర్లూటీ రేంజ్ ఆఫీసర్ అశోక్‌కుమార్‌యాదవ్‌ను సాక్షి వివరణ కోరగా అలాంటిదేమి లేదంటూ చెప్పడం గమనార్హం. -
కెమెరాలకు స్మార్ట్ ఫోన్ల సవాల్