Lava Blaze Pro Launched with 50MP Triple Camera Price and Features - Sakshi
Sakshi News home page

Lava Blaze Pro: ట్రిపుల్‌ ఏఐ రియర్‌కెమెరాతో అదిరిపోయే ఫోన్‌, అదీ బడ్జెట్‌ ధరలో

Published Tue, Sep 20 2022 4:09 PM | Last Updated on Tue, Sep 20 2022 5:22 PM

Lava Blaze Pro launched with 50MP triple camera price and features - Sakshi

సాక్షి,ముంబై: భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.  50మెగాపిక్సెల్ AI ట్రిపుల్ కెమెరా, 6X జూమ్ పెరిస్కోప్-స్టైల్‌తో లావా బ్లేజ్‌ ప్రొ అనే కొత్త బడ్జెట్ ఫోన్‌ను మంగళవారం విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన లావా బ్లేజ్‌కు ఈ స్మార్ట్‌ఫోన్ సక్సెసర్. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, బాటమ్-ఫైరింగ్ స్పీకర్, ప్రీమియం ఫ్రోస్టెడ్ గ్లాస్ డిజైన్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్, టైప్‌సీ చార్జర్‌లాంటి ఇతర ఫీచర్లను ఇందులో అందించడం విశేషం.

లావా బ్లేజ్‌ ప్రొ స్పెసిఫికేషన్స్
6.5అంగుళాల HD డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 12,  MediaTek G37 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌
4జీబీర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌
8మెగాపిక్సెల్  సెల్ఫీ  కెమెరాతో
5000mAh  బ్యాటరీ కెపాసిటీ

ధర, లభ్యత
లావా బ్లేజ్ ప్రో రూ. 10,499లుగా కంపెనీ ధర నిర్ణయించింది. గ్లాస్ గ్రీన్, గ్లాస్ ఆరెంజ్, గ్లాస్ బ్లూ ,  గ్లాస్ గోల్డ్  అనే  నాలుగు విభిన్న రంగుల్లో ఈ ఫోన్‌ లభ్యం. ఫ్లిప్‌కార్ట్, లావా ఇ-స్టోర్ దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement