lava
-
అక్టోబర్ 9 నుంచి లావా అగ్ని-3 విక్రయాలు
న్యూఢిల్లీ: మొబైల్‌ఫోన్స్ తయారీలో ఉన్న దేశీయ కంపెనీ లావా అక్టోబర్ 9 నుంచి అగ్ని-3 స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించనుంది. అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ మోడల్ లభించనుంది. ప్రారంభ ధర రూ.19,999.లావా అగ్ని-3 బార్ ఫోన్లో రేర్ డిస్ప్లేతో వస్తున్న ఏకైక మోడల్ ఇదేనని కంపెనీ తెలిపింది. 1.74 అంగుళాల సెకండరీ అమోలెడ్ డిస్ప్లే పొందుపరిచారు. ఆన్‌డ్రాయిడ్ 14 ఓఎస్, 6.78 అగుళాల 1.5కె కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 2.5 గిగాహెట్జ్ ప్రాసెసర్, సోనీ 50 ఎంపీ ఓఐఎస్ కెమెరా, 8 ఎంపీ టెలిఫోటో, 8 ఎంపీ అ్రల్టావైడ్ కెమెరా, సామ్సంగ్ 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ వ్యూ వీడియో మోడ్, డాల్బీ అట్మోస్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్‌తో రూపుదిద్దుకుంది.లావా అగ్ని-3 స్మార్ట్‌ఫోన్ 66 వాట్స్ సూపర్ ఫాస్ట్ చార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 జీబీ ర్యామ్, 8 జీబీ వరకు వర్చువల్ ర్యామ్, 128/256 జీబీ ఇంటర్నల్ మెమరీ వంటి హంగులు ఉన్నాయి. అగ్ని–3 రాకతో రూ.20–25 వేల ధరల శ్రేణిలో ఆన్లైన్ విభాగంలో 2025–26 నాటికి 10 శాతం మార్కెట్ వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు లావా ఇంటర్నేషనల్ ఈడీ సునీల్ రైనా తెలిపారు. -
రూ.14 వేలకే కర్వ్డ్ డిస్ప్లే ఫోన్
దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా బ్లేజ్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. కంపెనీ కొత్త బ్లేజ్-ఎక్స్ (Blaze X) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది.ఈ స్మార్ట్‌ఫోన్ స్టార్‌లైట్ పర్పుల్, టైటానియం గ్రే అనే రెండు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. కొత్త బ్లేజ్-ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను లావా ఈ-స్టోర్, అమెజాన్ ఇండియా స్టోర్‌లో జూలై 20 నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ చవకైన సరికొత్త స్మార్ట్‌ఫోన్ రూ. 13,999 ప్రారంభ ధరకు (బ్యాంకు ఆఫర్లతో సహా) లభిస్తుంది.స్పెసిఫికేషన్లుపంచ్-హోల్ డిజైన్‌తో 6.67-అంగుళాల 120 హెర్ట్జ్ డిస్ప్లే64MP+2MP రియర్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరాMediaTek డైమెన్సిటీ 6300 ప్రాసెసర్33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ -
ఐస్‌ల్యాండ్‌లో మరోసారి బద్దలైన అగ్ని పర్వతం.. (ఫొటోలు)
-
Volcano: ఐస్లాండ్లో బద్దలైన మరో అగ్నిపర్వతం
రెగ్జావిక్: ఐస్లాండ్లో మరోసారి భారీ అగ్నిపర్వతం బద్దలైంది. ఇక్కడ అగ్నిపర్వతం బద్దలవడం మూడు నెలల్లో ఇది నాలుగోసారి. అగ్నిపర్వతం నుంచి కాంతివంతమైన కాషాయ రంగులో ఉన్న లావా, పెద్ద ఎత్తున పొగలు గాల్లోకి ఎగసిపడ్డాయని వాతావరణకేంద్రం తెలిపింది. కరిగిపోయిన రాతితో పాటు లావా పర్వతానికి ఇరువైపులా విరజిమ్మాయి. రాజధాని రెగ్జావిక్ ప్రాంతంలో ఉన్న ఈ అగ్నిపర్వతం బద్దలవబోతోందని అధికారులు కొన్నిరోజుల ముందే హెచ్చరించారు. స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. రెగ్జావిక్‌లో పోలీసులు అత్యవసరస్థితి ప్రకటించారు. ఐస్లాండ్లో 30 దాకా యాక్టివ్ అగ్నిపర్వతాలున్నాయి. దీంతో ఇక్కడికి అగ్నిపర్వాతాలను చూసేందుకు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఇదీ చదవండి.. హౌతీల డ్రోన్‌ను పేల్చేసిన అమెరికా -
Iceland volcano: భూగర్భంలో భుగభుగలు
అనగనగా ఒక చిన్న పల్లెపట్టు. అంతా సజావుగా సాగిపోతున్న వేళ. ఉన్నట్టుండి ఎటు చూస్తే అటు భూమిపై పగుళ్లు. చూస్తుండగానే అందులోంచి ఫౌంటేన్‌లా విరజిమ్ముతూ లావా ప్రవాహాలు. బిక్కచచి్చపోయి కకావికలమవుతున్న జనం. ఏదో హాలీవుడ్ సినిమాలా ఉంది కదూ! ఐస్లాండ్లో పశ్చిమ రెగ్జానెస్ ద్వీపకల్పంలోని గ్రెంతావిక్ అనే బుల్లి బెస్త గ్రామం, దాని పరిసర ప్రాంతాలు ఇప్పుడు అచ్చం అలాంటి భయానక పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి. అక్కడ భూగర్భంలో 800 ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న అపారమైన లావా రాశి కొన్నాళ్లుగా ఒళ్లు విరుచుకుంటోంది. భారీ ప్రవాహంగా మారి భయపెడుతోంది...! ఐస్లాండ్ అగ్నిపర్వతాలకు పెట్టింది పేరు. అక్కడి రెగ్జానెస్ ద్వీపకల్పమైతే అందమైన అగ్నిపర్వతాలకు నిలయం. పెద్ద టూరిస్టు స్పాట్ కూడా. గత 800 ఏళ్లలో ఈ ప్రాంతంలో ఒక్క అగ్నిపర్వతం కూడా బద్దలవలేదు. అలాంటిది గతేడాది నుంచి ఇక్కడ పరిస్థితులు మారుతున్నాయి. కొద్ది రోజులుగా భయానక స్థాయికి చేరాయి. ముఖ్యంగా గ్రెంతావిక్, పరిసర ప్రాంతాల్లో గత నెల రోజుల్లోపే ఏకంగా మూడుసార్లు అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. లావా ప్రవాహాలు ఉవ్వెత్తున ఎగజిమ్మి భయభ్రాంతులను చేశాయి. దాంతో ఆ ప్రాంతాలవారిని ఖాళీ చేయించాల్సి వచి్చంది. ఇదంతా టీజర్ మాత్రమేనని అసలు ముప్పు ముందుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. గ్రెంతావిక్ కింద భూగర్భంలో మాగ్మా (శిలాద్రవం) పూర్తిగా కరిగి అపార లావా ప్రవహంగా మారిందని తేల్చారు! దాని పరిమాణం రికార్డు స్థాయిలో ఏకంగా 65 లక్షల క్యూబిక్ మీటర్లని లెక్కగట్టారు! అంతేకాదు, ఈ లావా భూగర్భంలో ఏకంగా సెకనుకు 7,400 క్యుబిక్ మీటర్ల వేగంతో ప్రవహిస్తోందట. ఇది డాన్యుబ్ వంటి భారీ నదుల ప్రవాహ వేగం కంటే కూడా చాలా ఎక్కువ. 2021–23 మధ్య ఇక్కడ భూగర్భంలో నమోదైన లావా ప్రవాహ రేటు కంటే ఇది 100 రెట్లు ఎక్కువని అధ్యయన సారథి యూనివర్సిటీ ఆఫ్ ఐస్లాండ్లోని నోర్డిక్ వోల్కెనోలాజికల్ సెంటర్‌కు చెందిన ప్రొఫెసర్ ఫ్రెస్టెనిన్ సిగ్మండ్సన్ లెక్కగట్టారు. ఈ లావా ప్రవాహం ఉజ్జాయింపుగా 15 కిలోమీటర్ల పొడవు, నాలుగు కిలోమీటర్ల ఎత్తు, కేవలం కొన్ని మీటర్ల వెడల్పున్నట్టు తేల్చారు. ఈ గణాంకాలు, హెచ్చరికలతో కూడిన అధ్యయనం జర్నల్‌సైన్స్‌లో గురువారం ప్రచురితమైంది. అందుకు కేవలం కొన్ని గంటల ముందే ఆ ప్రాంతమంతటా అగ్నిపర్వతం బద్దలవడంతో పాటు భూగర్భం నుంచి కూడా లావా ఎగజిమ్మిన ఉదంతాలు నమోదయ్యాయి! ఇలా జరగడం గత రెండు నెలల్లో మూడోసారి. గతేడాది డిసెంబర్ 18 నుంచి ఈ ప్రాంతాల్లో మూడు రోజుల పాటు లావా ఎగజిమ్మింది. మళ్లీ ఈ ఏడాది జనవరి 14న కూడా రెండుసార్లు లావా పెల్లుబికింది. దాంతో ప్రభుత్వం హుటాహుటిన రంగంలోకి దిగింది. ఈ ద్వీపకల్పమంతటా ఎమర్జెన్సీ ప్రకటించింది. భవిష్యత్తుపై ఆందోళన తాజా పరిస్థితుల నేపథ్యంలో రెగ్జానెస్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కొద్ది రోజులుగా గ్రెంతావిక్తో పాటు ఇక్కడి పలు ఆవాస ప్రాంతాల్లో భూగర్భంపై ఒత్తిడి తీవ్రతరమవుతున్న సూచనలు ప్రస్ఫుటమవుతున్నాయి. భూమిలోంచి లావా ప్రవాహాలు ఎగజిమ్ముతుండటమే గాక ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద పగుళ్లు కనిపిస్తున్నాయి. భారీ సంఖ్యలో భూ ప్రకంపనలూ నమోదవుతున్నాయి. ఒక పెద్ద క్రీడా మైదానంలో సగానికి పైగా భారీ పగులు ఏర్పడటం వణికిస్తోంది. ప్రస్తుతానికైతే మొత్తం ద్వీపకల్పం భవిష్యత్తుపైనే నీలినీడలు కమ్ముకున్నాయని ప్రొఫెసర్ సిగ్మండ్సన్ ఆవేదనగా చెబుతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ లావా ప్రవాహం మరింతగా పెరిగేలా ఉందని కూడా ఆయన హెచ్చరించారు. అగ్నిపర్వతాల పుట్టిల్లు ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో చురుకైన అగ్నిపర్వతాలు ఉన్న దేశంగా ఐస్లాండ్కు పేరుంది. అందుకే దాన్ని లాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ అని చమత్కరిస్తుంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30కి పైగా అగ్నిపర్వతాలు చురుగ్గా ఉన్నాయి. ఇవి భారీ పర్యాటక ఆకర్షణలు కూడా. వీటిని చూసేందుకు ఏటా విదేశీయులు వస్తుంటారు. ఐస్లాండ్ మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ ప్రాంతంలో ఉండటమే అక్కడ ఇన్ని అగ్నిపర్వాతల పుట్టుకకు ప్రధాన కారణమన్నది సైంటిస్టుల అభిప్రాయం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బద్దలైన అగ్నిపర్వతం.. ఇళ్లపైకి లావా ప్రవాహం
ఐస్‌ల్యాండ్: ఐస్‌ల్యాండ్‌లోని రెక్జానెస్ ద్వీపకల్పంలో భారీ అగ్ని పర్వతం బద్దలైంది. దీని నుంచి వెలువడిన అగ్ని పర్వతం జనావాసాలపైకి ప్రవహిస్తోంది. దీంతో సమీపంలోని పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. లావా ముప్పులో ఆ ప్రాంతం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నారు. అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావా ఆ ప్రాంతంపైకి ప్రవహించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అడ్డుగా పెద్ద బండరాళ్లను పెట్టారు. కానీ ప్రయోజనం లేకపోయింది. లావా ప్రవహించడంతో స్థానికులు ఇళ్లను ఖాలీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వారితోపాటు పెంపుడు జంతువులు, పశువులను కూడా తీసుకెళుతున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఐస్‌ల్యాండ్‌లో నెలరోజుల వ్యవధిలో అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో పర్యాటక ప్రాంతమైన బ్లూలాగూన్‌ను జనవరి 16 వరకు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం లావా ఈ ప్రదేశానికి దూరంగా ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ఎర్రసముద్రంలో యుద్ధమేఘాలు.. హౌతీ క్షిపణిని కూల్చివేసిన అమెరికా -
మనీలాండరింగ్ కేసులో లావా ఎండీ అరెస్టు
మనీ లాండరింగ్ కార్యకలాపాలపై కొనసాగుతున్న విచారణలో భాగంగా లావా ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు హరి ఓం రాయ్‌తో పాటు వివో మొబైల్స్ ఇండియాకు చెందిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం అరెస్టు చేసింది. అయితే హరి ఓం రాయ్ ప్రమేయంపై నిర్దిష్ట వివరాలు ఇంకా వెల్లడించలేదు. వివో మొబైల్స్ ఇండియా, గ్రాండ్ ప్రాస్పెక్ట్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్ (జీపీఐసీపీఎల్)తో సహా 23 అనుబంధ కంపెనీలకు చెందిన 48 స్థానాల్లో ఈడీ దాడుల నిర్వహించింది. దిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్కు అనుగుణంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఫిబ్రవరి 3, 2022న ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అయిలే జీపీఐసీపీఎల్ నేరపూరిత చర్యలకు పాల్పడిందని ఆరోపిస్తూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. అక్రమంగా చైనాకు నిధులు తరలించడమే లక్ష్యంగా భారత్‌లో బోగస్ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. భారత్‌లో పన్నులు ఎగవేస్తూ వివో మొబైల్స్ ఇండియా విక్రయాల ద్వారా వచ్చిన మొత్తంలో దాదాపు సగం డబ్బును చైనాకు తరలించిందనే ఆరోపణలు వచ్చాయి. -
మరో చవక మొబైల్.. అతితక్కువ ధరకే సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల
Lava launches Yuva 2 smartphone: స్వదేశీ బ్రాండ్ లావా చాలా తక్కువ ధరలో సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. ఎంట్రీ లెవల్ యువ 2 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటరోలా (Motorola Moto G14), షావోమీ (Xiaomi Redmi 12) కంపెనీలు చవక ఫోన్లను విడుదల చేసిన మరుసటి రోజే లావా కూడా తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ మూడు ఫోన్లూ రూ. 10,000 కంటే తక్కువ ధరల విభాగంలో ఒకదానితో ఒకటి పోటీపడతాయి. గ్లాస్ బ్యాక్ ఫినిషింగ్, క్లీన్ అండ్ బ్లోట్‌వేర్ ఫ్రీ ఆండ్రాయిడ్ అనుభవాన్ని అందించే లావా యువ 2 స్మార్ట్‌ఫోన్ 3జీబీ/64జీబీ వేరియంట్ ధర రూ.6,999. గ్లాస్ బ్లూ, గ్లాస్ లావెండర్, గ్లాస్ గ్రీన్ రంగుల్లో లభ్యమవుతుంది. ఆగస్టు 2 నుంచి తమ రిటైల్ నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. మరో విశేషం ఏంటంటే ఈ ఫోన్‌కు వారంటీ వ్యవధిలోపు ఏవైనా సమస్యలు వస్తే ఇంటి వద్దే సర్వీస్ అందిస్తారు. ఇదీ చదవండి ➤ Expensive TV: వామ్మో రూ. 1.15 కోట్లు.. మార్కెట్లోకి అత్యంత ఖరీదైన టీవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు 90Hz 6.5 అంగులాల హెచ్డీ ప్లస్ సింక్ డిస్ప్లే 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 3జీబీ వరకు వర్చువల్ మెమొరీ 8-కోర్ Unisoc T606 చిప్సెట్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ 13ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా 10W USB టైప్-C ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ -
కరిగి, విరిగిన ‘బేబీ’ అగ్ని పర్వతం
అదో కొత్త అగ్ని పర్వతం.. రెండు వారాల కిందే పుట్టింది.. ఇంతలోనే అంతెత్తున పెరిగింది.. లోపలి నుంచి ఉబికివచ్చిన లావా వేడికి అంచులు కరిగి, విరిగి పడింది. లావాను బాంబుల్లా ఎగజల్లింది. ఐస్‌ల్యాండ్‌లోని రేక్జానెస్ ద్వీపకల్పం ప్రాంతంలోని ‘బేబీ’ అగ్నిపర్వతం విశేషమిది. అగ్నిపర్వతాలకు నిలయమైన రేక్జానెస్ ప్రాంతంలో గత నెల రోజుల్లో ఏకంగా ఏడు వేల భూప్రకంపనలు వచ్చాయి. రెండు వారాల కింద ఓ చోట అకస్మాత్తుగా సుమారు రెండున్నర కిలోమీటర్ల పొడవున భూమిలో పగుళ్లు వచ్చాయి. అందులో ఓ చోట లావా వెలువడటం మొదలై, మెల్లగా అగ్ని పర్వతంలా ఏర్పడింది. ప్రస్తుతం ‘బేబీ వల్కనో’గా పిలుస్తున్న ఈ అగ్నిపర్వతం.. రెండు రోజుల కింద తీవ్రస్థాయిలో లావా వెలువరించడం మొదలుపెట్టింది. అది తీవ్ర స్థాయికి చేరి ఓ పక్క విరిగి.. లావా నదిలా ప్రవహిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఐస్‌ల్యాండ్ యూనివర్సిటీ వల్కనాలజీ అండ్ నేచురల్ హజార్డ్స్ పరిశోధకుల బృందం విడుదల చేసింది. -
మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కావాలా? తగ్గింపు ధరలో ఇదిగో బెస్ట్ ఆప్షన్!
సాక్షి, ముంబై: లావా అగ్ని-2 5జీ స్మార్ట్‌ఫోన్‌పై తగ్గింపుతో అందుబాటులో ఉంది. రూ. 2000 తగ్గింపుతో బుధవారం నుంచి దేశీయ మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి లావా అగ్ని 2 5జీ బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ రోజు (మే 24) నుండి ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. (నైజిరియన్ చెఫ్ రికార్డ్: ఏకంగా 100 గంటలు వంట, ఎందుకో తెలుసా?) లావా అగ్ని 2 5జీ ఫీచర్లు 6.78-అంగుళాల FHD+ స్క్రీన్, మీడియా టెక్ సరికొత్త డైమెన్సిటీ 7050 ప్రాసెసర్, 16 ఎంపీ సెల్పీ కెమెరా 1.0-మైక్రాన్ (1 um) పిక్సెల్ సెన్సార్‌తో 50ఎంపీ క్వాడ్ కెమెరా 8 జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ 6W ఛార్జర్‌తో 4700mAh బ్యాటరీ ఫోన్ ధర రూ. 21,999 వద్దర ఆన్లైన్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అయితే ప్రధాన క్రెడిట్ , డెబిట్ కార్డ్‌లపై రూ. 2,000 ఫ్లాట్ తగ్గింపుతో రూ. 19,999 లభించనుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. (‘నేనే కింగ్’: మాంగో అయినా లగ్జరీ వాచ్ అయినా...!) ఇదీ చదవండి: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ‘గార్బేజ్ క్వీన్స్’ : వైరల్ ఫోటోలు -
తక్కువ ధరలో లభించే 5జి స్మార్ట్‌ఫోన్స్ - ఇవి చాలా బెస్ట్..!
భారతదేశం అభివృద్ధి మార్గంలో పరుగులు పెడుతున్న వేళ స్మార్ట్‌ఫోన్ వినియోగం సర్వ సాధారణంగా మారింది. అయితే స్మార్ట్‌ఫోన్ ధరలు ఇతర మొబైల్స్ కంటే కూడా ఎక్కువగా ఉండటం వల్ల కొంత మంది కొనుగోలు చేయడానికి కొంత వెనుకడుగు వేస్తున్నాయి. కానీ తక్కువ ధరలో కావాలనుకునే వారికోసం మార్కెట్లో లభించే స్మార్ట్‌ఫోన్స్ వివరాలు ఇక్కడ చూసేద్దాం.. లావా బ్లేజ్ 5జి: లావా కంపెనీకి చెందిన బ్లేజ్ 5జి మొబైల్ ధర మార్కెట్లో రూ. 10,999. ఇది 4 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ & 6 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ రెండు మొబైల్ ఆధునిక డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 500 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి 50 మెగా పిక్సెల్ కెమెరా సెటప్ పొందుతుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ ఆధునిక కాలంలో ఉపయోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. వివో టి2ఎక్స్ 5జి: 5జి మొబైల్స్ లో అత్యంత ప్రజాదరణ పొందిన వివో టి2ఎక్స్ 5జి ఒకటి. దీని ధర రూ. 12,999. ఇవి మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి 4 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ & 8 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్. ఈ స్మార్ట్‌ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 6.58 ఇంచెస్ HD+ LCD స్క్రీన్, 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్స్ మైక్రో సెన్సార్, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమరా వంటివి పొందుతుంది. (ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా గురించి ఆసక్తికర విషయాలు - డోంట్ మిస్!) శాంసంగ్ గెలాక్సీ ఎమ్14 5జి: ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇండియన్ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతున్న బ్రాండ్స్ లో ఒకటి శాంసంగ్. శాంసంగ్ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా విడుదలైన గెలాక్సీ ఎమ్14 5జి తక్కువ ధరలో లభించే ఉత్తమమైన మోడల్. దీని ధర రూ. 14,900. ఈ 5జి మొబైల్ 6.6 ఇంచెస్ HD డిస్ప్లే పొందుతుంది. అంతే కాకూండా ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. డిజైన్, ఫీచర్స్ మరింత ఆధునికంగా ఉంటాయి. (ఇదీ చదవండి: ఒక్కసారిగా రూ. 171 తగ్గిన గ్యాస్ ధరలు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?) పోకో ఎక్స్5 5జి: పోకో కంపెనీకి చెందిన ఎక్స్5 5జి మొబైల్ మార్కెట్లో లభించే ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్. దీని ధర రూ. 18,999. ఇది 8 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ & 8 జీబీ ర్యామ్ / 256 జీబీ స్టోరేజ్ అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. 6.67 ఇంచెస్ డిస్ప్లే కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుతుంది. ఫీచర్స్ మాత్రమే కాకుండా కెమెరా ఆప్షన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. -
లావా బ్లేజ్ 1ఎక్స్ 5జీ చూశారా? బడ్జెట్ ధరలో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్
సాక్షి,ముంబై: స్వదేశీ మొబైల్ తయారీ సంస్థ లావా మొబైల్స్ సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోలాంచ్ చేసింది. Lava Blaze 1X 5G పేరుతో బడ్జెట్ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. గత ఏడాది తీసుకొచ్చి బ్లేజ్ 5జీ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా దీన్ని అందుబాటులోకి తెచ్చింది. లావా బ్లేజ్ 1 ఎక్స్ 5జీ స్పెసిఫికేషన్లు 6.5 అంగుళాల IPS LCD డిస్ప్లే 1600 × 720 పిక్సెల్స్ HD+ రిజల్యూషన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC చిప్సెట్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ f/1.8 ఎపర్చర్ 50+2+వీజీఏ రియర్ ట్రిపుల్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ, 12W ఛార్జర్, ధర: రూ.11,999. ఇది గ్లాస్ గ్రీన్ , గ్లాస్ బ్లూ రంగులలో ప్రత్యేకంగా ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుంది. -
అదిరిపోయే ఫీచర్లతో లావా బ్లేజ్: పరిచయ ఆఫర్ చూస్తే ఫిదా!
సాక్షి, ముంబై: దేశీయ మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ లావా మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ లావా బ్లేజ్-2ను విడుదల చేసింది. ప్రీమియం గ్లాస్ ఫినిషింగ్ , పంచ్-హోల్ డిస్ప్లే,డ్యూయల్ కెమెరా , 5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో బ్లేజ్ 2 స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,999 వద్ద లాంచ్ చేసింది. అయితే పరిచయ ఆఫర్‌గా కేవలం రూ.8,999కే అందించనుంది. లావా బ్లేజ్-2 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఈ నెల 18 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. (Billionaire Barber Story: ఒకపుడు తినడానికి లేదు..ఇపుడు 600 లగ్జరీ కార్లు..‘బిలియనీర్ బాబు’ స్టోరీ చూస్తే..!) టైప్ C ఛార్జింగ్ పోర్ట్‌తో పాటు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13కి అప్‌గ్రేడ్ చేయబడుతుందని , రెండు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లను అందిస్తామని కంపెనీ వెల్లడించింది. (మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ దెబ్బ! మస్క్‌కు భారీ ఝలక్!) లావా బ్లేజ్-2 స్పెసిఫికేషన్స్ 6.5-అంగుళాల హెచ్డీ + డిస్ప్లే విత్ పంచ్ హోల్ డిజైన్ యూనిసోన్ టీ616 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12 6జీబీ రామ్,128 జీబీ స్టోరేజీ 13 మెగా పిక్సెల్స్ డ్యుయల్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీకెమెరా 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ భారత్‌లో లావా బ్లేజ్-2 ధర రూ.8,999. గ్లాస్ బ్లూ, గ్లాస్ బ్లాక్, గ్లాస్ ఆరెంజ్ రంగుల్లో లభిస్తుంది. ఈ నెల 18 మధ్యాహ్నం నుంచి సేల్స్ ప్రారంభం. -
ప్రకృతి చెక్కిన రాళ్లు..లావా చెక్కిన శిలలు!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం.. దట్టమైన అడవుల్లో.. గుట్టల దిగువన పొడవాటి శిలలు.. ఏదో పని కోసం మనుషులు చెక్కి అలా వదిలేసినట్టు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.. కానీ అవి ప్రకృతి చెక్కిన రాళ్లు.. అందులోనూ మామూలు రాళ్లు కాదు.. భూమి అడుగునుంచి పొంగుకొచ్చిన లావా గట్టిపడి నిలువునా పోతపోసి నట్టు ఏర్పడిన బసాల్ట్ శిలలు అవి. ఎంతో చరిత్ర దాగి ఉన్న ఆ నిలువు రాళ్లను ఔత్సాహిక యువత గుర్తించినా.. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ఇప్పటివరకు నమోదు చేయలేదు. పరిరక్షణకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీనితో ఆ అరుదైన బసాల్ట్ శిలలు ధ్వంసమైపోయే అవకాశం ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఏమిటీ శిలలు.. ►ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని బజార్ హత్నూర్, బోరెల్గూడ, ఆసిఫాబాద్ సమీపంలోని వర్తమనూర్తోపాటు పలుచోట్ల అరుదైన బసాల్ట్ శిలలు ఉన్నాయి. వీటిని కాలమ్నార్ బసాల్ట్ (లావా శిలలు)గా పిలుస్తారు. సుమారు ఆరు కోట్ల ఏళ్ల కింద ఇవి ఏర్పడినట్టు అంచనా. సాధారణంగా భూగర్భం నుంచి ఉబికి వచ్చిన లావా ప్రవహిస్తూ నీటి ప్రవాహాల వద్ద వేగంగా ఘనీభవించినపుడు.. నీళ్లు ఇంకినప్పుడు నేల నెర్రలువాసినట్టుగా లావాలో అష్టభుజి, షట్భుజి, చతురస్రం.. ఇలా రకరకాల ఆకృతుల్లో లోతుగా పగుళ్లు ఏర్పడతాయి. కొన్నేళ్ల పరిణామక్రమంలో అవి విడివడి స్తంభాలుగా రూపొందుతాయి. చాలా ప్రాంతాల్లో లావా ప్రవహించినా ఈ కాలమ్నార్ బసాల్ట్‌లు మాత్రం కొన్ని చోట్లనే ఏర్పడడం విశేషం. ఇలాంటివి చాలా అరుదు కూడా. 5 లక్షల కిలోమీటర్ల పరిధిలో.. ►భూగర్భం నుంచి ఉబికి వచ్చిన లావా ప్రవహించిన ప్రాంతం మన దేశంలో ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. దీన్ని డెక్కన్ వల్కానిక్ ప్రావిన్స్ (డీవీపీ)గా పేర్కొంటారు. ఇందులో మహారాష్ట్ర పూర్తి ప్రాంతం ఉండగా తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, గుజరాత్‌లలో కొంత భాగం ఉంది. డీవీపీ తూర్పు చివరిభాగం తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్‌లలో విస్తరించి ఉంది. ఈ డీవీపీలోనే పలు ప్రాంతాల్లో కాలమ్నార్ బసాల్ట్ శిలలు ఏర్పడ్డాయి. ఇతర రాష్ట్రాల్లో రక్షిస్తున్నా.. మహారాష్ట్ర, కర్ణాటకలలో ఇలాంటి లావా శిలలున్న ప్రాంతాలను జీఎస్ఐ అధికారికంగా గుర్తించింది. ఇప్పుడు అవి రక్షిత ప్రాంతాలుగా ఉన్నాయి. కర్ణాటకలోని ఉడిపి జిల్లా పరిధిలోకి వచ్చే సెయింట్ మేరీస్ దీవిలో పొడవాటి లావా శిలలతో ఏర్పడిన గుట్ట ఉంది. ఆ శిలలను జీఎస్ఐ గుర్తించి ప్రాచుర్యంలోకి తేవటంతో అది పర్యాటక ప్రాంతంగా మారింది. విదేశాల్లోనూ ఇలాంటి శిలలున్న ప్రాంతాలను జియో పార్కులుగా అభివృద్ధి చేస్తున్నారు. అయితే మన రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐదారు ప్రాంతాల్లో ఈ లావా శిల లను గుర్తించినా పట్టించుకునేవారే లేకుండా పోయారు. వ్యవసా యం, ఆవాసాల విస్తరణ, రోడ్ల నిర్మాణంతో అవి చెదిరిపోయే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంగారకుడిపైనా కాలమ్నార్ శిలలు ► కొన్నేళ్ల కింద నాసా ఉపగ్రహాలతో అంగారకుడిని చిత్రించినప్పుడు కనిపించిన దృశ్యాలు శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరి చాయి. అంగారక గ్రహం మీద గుట్ట ల్లాగా ఉన్న ప్రాంతాల్లో నిలువు చారలను విశ్లేషించగా.. కాలమ్నార్ బసాల్ట్ (లావా శిలలు)గా తేల్చారు. అంగారక గ్రహం మీద అగ్నిపర్వతాలు ఉండేవన్న దానికి ఇవి ఆధారంగా నిలిచాయి. భవిష్యత్తులో మానవులు అంగారకుడిపైకి వెళ్లేందుకు ఎంత అనువుగా ఉంటుందన్న దిశలో సాగుతున్న పరిశోధనల్లో ఇదీ ఓ కీలక అంశంగా మారింది. బొమ్మలు గీసినట్టే ఇది ఆసిఫాబాద్ ప్రాంతంలోని వర్తమనూర్ వద్ద అడవిలో కనిపించిన అందమైన రాతి అమరిక. ఎవరో చెక్కినట్టుగా, రాళ్లపై ఆదిమానవులు రూపొందించిన పెట్రోగ్లివ్స్ను తలపిస్తున్న ఈ అమరిక లావా ప్రభావంతో ఏర్పడినదే. ప్రపంచవ్యాప్తంగా కొన్నిచోట్ల మాత్రమే ఇలాంటి శిలలు ఉన్నాయి. అలాంటి వాటిని పట్టించుకునే వారే లేరన్న విమర్శలున్నాయి. రక్షిత ప్రాంతాలుగా గుర్తించాలి.. ప్రపంచంలో అరుదుగానే ఈ కాలమ్నార్ బసాల్ట్ శిలలు ఉన్నాయి. పలు దేశాల్లో వీటిపై అధ్యయనాలు జరుగుతున్నాయి కూడా. తెలంగాణలో ఈ శిలలు కనిపించిన ప్రాంతాలను రక్షిత ప్రాంతాలుగా గుర్తించి భవిష్యత్తు ప్రయోగాలకు రక్షించుకోవాలి. – చకిలం వేణుగోపాల్, జీఎస్ఐ విశ్రాంత అధికారి ఔత్సాహికులే గుర్తించారు.. ఆదిలాబాద్ ప్రాంతంలో ఇప్పటివరకు వెలుగు చూసిన లావా శిలలను మన్నె ఆలియా, కటకం మురళి, వేణుగోపాల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితర ఔత్సాహికులు గుర్తించారు. కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యు ల వల్లనే ఆ శిలలు బయటి ప్రపంచానికి తెలిసి వాటిపై స్థానికంగా కొంత అవగాహనకు వీలు కలిగింది. వాటి పుట్టుపూర్వోత్తరాలపై అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది. – శ్రీరామోజు హరగోపాల్, చరిత్ర పరిశోధకులు రాజమండ్రి సమీపంలో ఓ చిన్న భాగం.. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లోని డీవీపీతో లింకు లేకుండా.. రాజమండ్రి సమీపంలో 25 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో లావా ఘనీభవించిన ప్రాంతముంది. కోస్తా ప్రాంతంలో ఈ చిన్న ముక్క తప్ప మరెక్కడా ఇలాంటిది లేదని నిపుణులు చెప్తున్నారు -
బద్ధలైన అగ్నిపర్వతం.. భగభగమండే లావా ఎగిసిపడుతున్న దృశ్యాలు వైరల్
అగ్నిపర్వతం నుంచి నిప్పులుగక్కుతూ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న లావా దృశ్యాలను ఓ ప్రకృతి ప్రేమికుడు కెమెరాలో బంధించాడు. ఎంతో మనోహరంగా కన్పిస్తున్న ఈ వీడియోనూ 'హౌ థింగ్స్ వర్క్' అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేయగా అది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చిన్న ప్రపంచంలోని ఈ వీడియో ఎంత అద్భుతంగా ఉందో చూడండి అని హౌ థింగ్స్ వర్క్ రాసుకొచ్చింది. Amazing footage. Our little world is fascinating 🌋 pic.twitter.com/vnYQf8kH9Y — H0W_THlNGS_W0RK (@HowThingsWork_) March 3, 2023 అగ్నిపర్వతంలో ఘన రూపంలో లావా.. ఉష్ణోగ్రత 700 నుంచి 1200 డిగ్రీల సెల్సియస్‌కు చేరినప్పుడు ద్రవీభవించి నిప్పులుగక్కుకుంటూ బయటకు వస్తుంది. ఫ్లూయిడ్లా మారి ఉవ్వెత్తున ఎగిసిపడి ప్రవహిస్తుంది. ఇలాంటి దృశ్యాలు అత్యంత అరుదుగా కెమెరా కంటికి చిక్కుతాయి. లావా ఉష్ణోగ్రత 700 నుంచి 1200 డిగ్రీల సెల్సియస్ కాగా.. సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత 5,600 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. అంటే లావా వేడి సూర్యుడి ఉపరితలంతో పోల్చితే ఐదింట ఒక వంతు కంటే ఎక్కువగానే ఉంటుందన్నమాట. వాతావరణ మార్పుల కారణంగా భూతాపం విపరీతంగా పెరిగింది.. అగ్నిపర్వతాలు బద్దలు అవుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. 2021లో స్పెయిన్‌లో, 2022లో మెక్సికోలో ప్రాచీన అగ్నిపర్వతాలు బద్దలై పలువురు చనిపోయారు. చదవండి: ఏడాదిలోగా రష్యా ఖజానా ఖాళీ.. పుతిన్‌కు షాకిచ్చిన వ్యాపారవేత్త! -
Lava Blaze 5G: రూ.11 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ మాత్రం అదుర్స్!
భారతీయ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా కొత్త 5జీ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. లావా బ్లేజ్ 5జీ (Lava Blaze 5G) సిరీస్‌లో నూతన వేరియంట్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. 6జీబీ ర్యామ్, 128బీజీ స్టేరేజ్ కెపాసిటీతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ విశేషంగా ఆకట్టుకుంటోంది. చవకైన రేంజ్లో లభించే ఈ 5జీ ఫోన్ గురించి లావా కంపెనీ గత ఏడాదిలోనే తెలియజేసింది. లావా బ్లేజ్ 5జీ ఫోన్ ధరను రూ.11,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే ప్రారంభ ఆఫర్ కింద రూ.11,499కే ఈ ఫోన్‌ను అందిస్తోంది. గ్లాస్ బ్లాక్, గ్లాస్ బ్ల్యూ, గ్లాస్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ అలాగే అమెజాన్ ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు. (ఇదీ చదవండి: టెక్ ప్రపంచంలోనే తొలి ఫోన్,10 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్.. ధర ఎంతంటే!) లావా బ్లేజ్ 5జీ స్పెసిఫికేషన్స్ 90హెడ్జ్ రిఫ్రెష్ రేటుతో 6.5 అంగులాల హెచ్డీ ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఎస్ఓసీ 2.2 గిగాహెడ్జ్ క్లాక్‌స్పీడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఎల్పీడీడీఆర్4ఎక్స్ మెమొరీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ 1 టీబీ వరకు పెంచుకునే ఎక్స్టర్నల్ మెమొరీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ అనానమస్ కాల్ రికార్డింగ్ ఫీచర్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ -
రష్యాలో ఒళ్లు విరుచుకున్న అగ్నిపర్వతాలు
మాస్కో: రష్యాలో రాజధాని మాస్కోకు 6,600 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో కంచట్కా ద్వీపకల్పంలో రెండు అగ్నిపర్వతాలు నిద్రాణ స్థితి నుంచి మేల్కొని ఒళ్లు విరుచుకున్నాయి. భారీ పరిమాణంలో లావాను వెదజల్లుతున్నాయి. వాటినుంచి వెలువడుతున్న లావా, ధూళి మేఘాలు సుదూరాల దాకా కన్పిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. అతి త్వరలో పూర్తిస్థాయిలో బద్దలయ్యే ప్రమాదముందన్నారు. శనివారం సంభవించిన గట్టి భూకంపమే ఇందుకు కారణమట. వీటిలో క్లుచెవ్స్కయా స్పోకా అగ్నిపర్వతం నుంచి గంటకు ఏకంగా పదిసార్లు భారీ పేలుళ్లు వెలువడుతున్నాయట! 4,754 మీటర్ల ఎత్తులో ఉన్న ఇది యురేషియాలోకెల్లా అత్యంత ఎత్తైన అగ్నిపర్వతం. కంచట్కా ద్వీపకల్ప ప్రాంతం ఏకంగా 30కి పైగా చురుకైన అగ్నిపర్వతాలకు నిలయం! -
చవకైన 5జీ స్మార్ట్ఫోన్లు, వరుసలో మరిన్ని బ్రాండ్లు!
చవక ఫోన్లతో దేశీ బ్రాండ్లు గతంలో భారత 3జీ, 4జీ మార్కెట్లో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 5జీ విభాగంలోనూ అదే ట్రెండ్‌కు లావా మొబైల్స్ తెరలేపింది. రూ.10,000లోపు ధరలో మోడల్‌ను ప్రవేశపెట్టి భారత్‌లో చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్ ట్యాగ్‌ను సొంతం చేసుకుంది. మరిన్ని భారతీయ బ్రాండ్లు ఈ విభాగంలో రంగ ప్రవేశం చేయనున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 5జీ హ్యాండ్సెట్లు రూ.13 వేల నుంచి లభిస్తున్నాయి. రానున్న రోజుల్లో రూ.10 వేల లోపు ధరలో మోడళ్లు వెల్లువెత్తనున్నాయి. దేశీయ కంపెనీల రాకతో చవక ధరల విభాగం జోరు కొనసాగనుంది. 5జీ నెట్వర్క్ విస్తరణ, కస్టమర్ల ఆదరణనుబట్టి ఈ విభాగంలో భారతీయ బ్రాండ్ల రాక ఆధారపడుతుందని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ తెలిపారు. గతంలో మాదిరిగా ఇబ్బడి ముబ్బడిగా బ్రాండ్స్ ఉండకపోవచ్చని అన్నారు. ఒకదాని వెంట ఒకటి.. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో జూలై–సెప్టెంబర్‌లో 4.5 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ రంగంలో 15లోపు బ్రాండ్లదే హవా. షావొమీ తొలి స్థానంలో నిలవగా శామ్సంగ్ రెండవ స్థానంలో ఉంది. వివో, రియల్మీ, ఒప్పో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. యాపిల్, వన్‌ప్లస్, మోటో, మోటరోలా, నోకియా, ఐక్యూ, పోకో వంటివి పోటీపడుతున్నాయి. ఇక 5జీ విభాగంలో 20 శాతం వాటాతో శామ్సంగ్ అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. దేశీ బ్రాండ్స్ అయిన మైక్రోమ్యాక్స్, కార్బన్‌తోపాటు టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో సైతం 5జీ స్మార్ట్‌ఫోన్స్ రంగంలో ఎంట్రీకి సమాయత్తం అవుతున్నాయి. ప్రస్తుతం అమ్ముడవుతున్న స్మార్ట్ఫోన్లలో మూడింట ఒక వంతు 5జీ మోడల్స్ ఉంటున్నాయి. అన్ని బ్రాండ్స్ కలిపి 300 దాకా 5జీ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. చవక మోడళ్లు మార్కెట్‌ను ముంచెత్తితే 5జీ విభాగం అంచనాలను మించి విక్రయాలను నమోదు చేయడం ఖాయంగా కనపడుతోంది. బ్లేజ్ 5జీ ఫీచర్స్ ఇవే.. లావా మొబైల్స్ బ్లేజ్ 5జీ పేరుతో స్పెషల్ లాంచ్ ఆఫర్లో రూ.9,999 ధరలో ఫోన్‌ను ఆవిష్కరించింది. 6.51 అంగుళాల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే, ఆన్‌డ్రాయిడ్ 12 ఓఎస్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఆక్టాకోర్ 2.2 గిగాహట్జ్ ప్రాసెసర్, 50 ఎంపీ ఏఐ ట్రిపుల్ కెమెరా, 128 జీబీ స్టోరేజ్‌తో తయారైన ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుపరిచింది. 4 జీబీ ర్యామ్, 3 జీబీ వర్చువల్ ర్యామ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్, వాటర్ డ్రాప్ డిస్ప్లే, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా వంటి హంగులు ఉన్నాయి. గ్లాస్ బ్లాక్ డిజైన్‌లో రెండు రంగుల్లో లభిస్తుంది. చదవండి: Disney Layoffs: ఐటీలో మొదలై అక్కడి వరకు.. ఉద్యోగులపై వేటుకు రెడీగా ఉన్న ప్రముఖ ఓటీటీ సంస్థ! -
అత్యంత చవకైన లావా బ్లేజ్ 5జీ సేల్: కమింగ్ సూన్!
సాక్షి,ముంబై: ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ లావా అత్యంత చౌక ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్లో అందుబాటులోకి తేనుంది. లావా బ్లేజ్ 5జీ పేరుతో గత నెల ఇండియా మొబైల్ కాంగ్రెస్ -2022లో ఆవిష్కరించిన సంస్థ ఇక యూజర్లకు త్వరలోనే అందించనుంది. దేశంలోనే అత్యంత చౌక 5జీ స్మార్ట్‌ఫోన్ ఇదని కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారీ డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా లాంటి ఫీచర్లున్న ఈ ఫోన్ ధర రూ. 10999గా ఉంటుందని అంచనా. గ్రీన్ , బ్లూ రంగుల్లో అమెజాన్ ద్వారా విక్రయానికి అందుబాటులోకి రానుంది. లావా 5జీ బ్లేజ్ స్పెసిఫికేషన్స్ 6.5-అంగుళాల హెచ్డీ + ఎల్సీడీ డిస్ప్లే డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ,ఆండ్రాయిడ్ 12 ఓఎస్ 1600×720 పిక్సెల్ రిజల్యూషన్ 50+2+2 టట్రిపుల్ ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ For those who live in the fast lane. Blaze 5G. Only on Amazon.#ComingSoon #Blaze5G #IndiaJeele5G #LavaMobiles #ProudlyIndian pic.twitter.com/MH2OZm0a1t — Lava Mobiles (@LavaMobile) November 3, 2022 -
ట్రిపుల్ ఏఐ రియర్కెమెరాతో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్, అదీ బడ్జెట్ ధరలో
సాక్షి,ముంబై: భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. 50మెగాపిక్సెల్ AI ట్రిపుల్ కెమెరా, 6X జూమ్ పెరిస్కోప్-స్టైల్‌తో లావా బ్లేజ్ ప్రొ అనే కొత్త బడ్జెట్ ఫోన్‌ను మంగళవారం విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన లావా బ్లేజ్‌కు ఈ స్మార్ట్‌ఫోన్ సక్సెసర్. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, బాటమ్-ఫైరింగ్ స్పీకర్, ప్రీమియం ఫ్రోస్టెడ్ గ్లాస్ డిజైన్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్, టైప్‌సీ చార్జర్లాంటి ఇతర ఫీచర్లను ఇందులో అందించడం విశేషం. లావా బ్లేజ్ ప్రొ స్పెసిఫికేషన్స్ 6.5అంగుళాల HD డిస్ప్లే ఆండ్రాయిడ్ 12, MediaTek G37 ఆక్టా-కోర్ ప్రాసెసర్ 4జీబీర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 8మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో 5000mAh బ్యాటరీ కెపాసిటీ ధర, లభ్యత లావా బ్లేజ్ ప్రో రూ. 10,499లుగా కంపెనీ ధర నిర్ణయించింది. గ్లాస్ గ్రీన్, గ్లాస్ ఆరెంజ్, గ్లాస్ బ్లూ , గ్లాస్ గోల్డ్ అనే నాలుగు విభిన్న రంగుల్లో ఈ ఫోన్ లభ్యం. ఫ్లిప్‌కార్ట్, లావా ఇ-స్టోర్ దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. -
అవి శివుడి గుడి స్తంభాలు.. ఇది హిడింబి ఇసుర్రాయి!
సాక్షి, హైదరాబాద్: మీటర్లకొద్దీ పొడవున్న నిలువు రాళ్లు.. ఏదో పనికోసం యంత్రంతో కోసినట్టుగా చక్కటి ఆకృతులు.. ఒకదాని తర్వాత ఒకటి పడుకోబెట్టినట్టుగా ఉన్న రాతి శిలలు.. అవి శివుడి గుడి స్తంభాలు అంటూ స్థానికంగా ఓ ప్రచారం.. ►దారిపక్కన టన్నుల బరువున్న విశాలమైన రెండు రాళ్లు.. వృత్తాకారంలో ఒకదానిపై మరొకటి పేర్చినట్టు ఆకృతి.. అది ఒకనాటి ఇసుర్రాయి అని, భారతంలో ప్రస్తావించే హిడింబి దాన్ని వాడేదని ఓ గాధ.. ►చిత్రమైన ఆకృతుల్లో, మనం నిత్యం వాడే పరికరాల ఆకారాల్లో ఉండే రాళ్లు జన బాహుళ్యంలో వింత ప్రచారానికి కారణమవుతాయి. అలాంటివే ఈ రాళ్లు. ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడి మనను ఆకట్టుకుంటున్నాయి. వీటి వెనుక ఎలాంటి చారిత్రక, పౌరాణిక గాథ లేదని తేల్చిన నిపుణులు దీనిపై స్థానికులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. రాతి స్తంభాల ఆకృతిలో.. ఆసిఫాబాద్ జిల్లా బోర్‌లాల్‌గూడ అడవిలో ప్రకృతి చెక్కిన రాతి స్తంభాలు ఉన్నాయి. దాదాపు ఆరున్నర కోట్ల ఏళ్ల కింద లావా ఉబికివచ్చి కడ్డీల ఆకృతుల్లో ఘనీభవించిన రాతి శిలలు అవి. కాలమ్నార్ బసాల్ట్స్‌గా పేర్కొనే ఈ శిలలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు తిరుపతి మిత్రబృందం గుర్తించింది. తెలంగాణలో తొలిసారిగా ఏడేళ్ల కింద ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ శాంతిపూర్ రిజర్వ్ ఫారెస్టులో కూడా ఇలాంటి రాళ్లను గుర్తించారు. తాజాగా రెండో చోట అవి బయటపడినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. ఈ ప్రాంతాన్ని భూభౌతిక స్మారక ప్రాంతంగా గుర్తించాలని కోరారు. కర్ణాటకలోని ఉడిపి సమీపంలో సెయింట్ మేరీ ద్వీపాల్లో ఇలాంటి రాతి స్తంభాలను గుర్తించిన జీఎస్ఐ.. దేశంలో గుర్తింపు పొందిన 34 జాతీయ భూభౌతిక స్మారక ప్రాంతాల్లో ఒకటిగా చేర్చిందని తెలిపారు. బోర్‌లాల్‌గూడలో ఈ లావా శిలలున్న ప్రాంతంలో పురాతన శివలింగం వెలుగుచూడటంతో.. శివుడి గుడి కోసం రూపొందించిన స్తంభాలుగా వీటి గురించిన గాథ ప్రచారంలో ఉందని వెల్లడించారు. ఇసుర్రాయి రూపంలో.. హైదరాబాద్ శివార్లలో ఇబ్రహీంపట్నానికి 2 కిలోమీటర్ల దూరంలో దండుమైలారం వెళ్లేదారిలో రోడ్డు పక్కన భారీ వృత్తాకార రాళ్లు ఒకదానిపై ఒకటి పేర్చినట్టు ఉన్నాయి. ఇది మహాభారతంలో హిడింబి అనే రాక్షస స్త్రీ వాడిన ఇసుర్రాయిగా ఓ గాథ స్థానికంగా ప్రచారంలో ఉంది. బుద్ధవనం ప్రాజెక్టు డిజైన్ ఇన్చార్జి శ్యాంసుందర్, శిల్పి హర్షవర్ధన్‌తో కలిసి చరిత్ర పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి వీటిని పరిశీలించి.. అవి సహజసిద్ధంగా ఏర్పడ్డవేనని గుర్తించారు. కోట్ల ఏళ్ల పరిణామ క్రమంలో రాళ్లు ఇలా ఒకదానిపై మరొకటి ఏర్పడటం సహజమని.. వీటిని బ్యాలెన్సింగ్ స్టోన్స్‌గా పిలుస్తారని తెలిపారు. వీటిని కాపాడుకుంటే ఆ ప్రాంతానికి ఓ ప్రత్యేకతగా ఉంటుందని స్థానికులకు సూచించారు. -
తెలంగాణ ఒకనాటి ‘పండోరా’.. చిన్నపాటి సముద్రాలు.. లావా ప్రవాహాలు
సాక్షి, హైదరాబాద్: చుట్టూ చిన్నపాటి సముద్రాలు.. లావా ప్రవాహాలు.. వాటితో ఏర్పడిన కొండలు, గుట్టలు.. భారీ వృక్షాలు.. జీవరాశులు.. వీటన్నింటి మధ్య ఉప్పొంగి ప్రవహించే పెద్ద నది.. ఇవన్నీ ఏదో హాలీవుడ్ సినిమాలో సీన్లు కాదు. అచ్చంగా ఒకప్పుడు తెలంగాణ భూభాగంలో నెలకొన్న పరిస్థితులు. ఊహించుకోవడానికే ఆశ్చర్యంగా ఉన్నా ఇవన్నీ వాస్తవాలే. ఇప్పుడున్న ఖండాలు, భూభాగాలు అప్పట్లో కలిసి ఉండేవి. కోట్ల ఏళ్ల పరిణామక్రమంలో కొన్ని విడిపడి, కొంత కలిసిపోయి ఇప్పుడున్న రూపానికి వచ్చాయి. ఆ మార్పులను చూడటానికి మన జీవితకాలం సరిపోదు. కానీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో అలనాటి పరిస్థితులను గుర్తించారు. ఈ క్రమంలో జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చకిలం వేణుగోపాలరావును ‘సాక్షి’పలకరించగా.. ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. చకిలం వేణుగోపాలరావు సున్నపురాతి గనులు వాటి చలవే.. తెలంగాణ ప్రాంతంలో ఇటు ఉమ్మడి నల్గొండ, అటు తాండూరు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో సున్నపురాతి నిల్వలకు కారణం నాటి సముద్ర భాగాలే. అప్పట్లో సముద్ర తీరం నుంచి తక్కువ లోతుండే భాగం వరకు భారీగా సున్నపురాతి నిల్వలు ఏర్పడ్డాయి. ఆ సముద్రాలు అంతం కాగా.. సున్నపురాయి నిల్వలు ఇప్పుడు మనకు పనికొస్తున్నాయి. ఈ బొగ్గు నిల్వలు 30 కోట్ల ఏళ్లవి.. తెలంగాణ భూభాగం, దీని పరిసరాల్లోని బొగ్గు పొరలు దాదాపు 30 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడ్డాయి. ఈ ప్రాంతాన్ని జియోలజిస్టులు గోండ్వానా బేసిన్గా పేర్కొంటారు. అప్పట్లో ఈ ప్రాంతాల మీదుగా అమెజాన్ కంటే భారీ మంచినీటి నది ప్రవహించేది. ఆ నది ప్రస్తుతం ఆస్ట్రేలియా ఖండం (అప్పట్లో ఈ భూభాగాలన్నీ కలిసి ఉండేవి) వరకు విస్తరించి ఉండేది. నది పరీవాహకంలో ఏకంగా ఆరేడు మీటర్ల చుట్టుకొలతతో కాండం ఉండే భారీ వృక్షాలు పెద్ద సంఖ్యలో ఉండేవి. అప్పట్లో ఏర్పడిన ప్రకృతి విపత్తులతో ఆ వృక్షాలన్నీ కూలిపడి.. పైన మట్టిపొరలు పేరుకుపోయాయి. లక్షల ఏళ్లు ఒత్తిడికి, ఉష్ణోగ్రతలకు గురై బొగ్గుగా మారాయి. ఇప్పుడా బొగ్గు నిల్వలనే మనం తవ్వి వినియోగించుకుంటున్నాం. అలనాటి భారీ నదితో సంబంధం లేకున్నా.. ఇప్పుడా పరిధిలోనే గోదావరి నది ప్రవహిస్తుండటం విశేషం. అవన్నీ లావా గుట్టలే.. ఒకప్పుడు తెలంగాణ భూభాగంలోని కొంత ప్రాం తంలో అగ్నిపర్వతాల లావా ప్రవహించింది. దాదాపు 15 లక్షల చదరపు కిలోమీటర్ల మేర ఘనీభవించి పీఠభూమి ఏర్పడింది. ఈ పరిధిని డెక్కన్ వల్కానిక్ ప్రావిన్స్ (డీవీపీ)గా పేర్కొంటారు. శంకర్పల్లి, చేవెళ్ల, వికారాబాద్, జహీరాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో మహారాష్ట్రవైపున్న కొన్ని ప్రాంతాలు దాని పరిధిలో ఉంటాయి. ఈ ప్రాంతంలోని గుట్టలన్నీ సుమారు ఆరున్నర కోట్ల ఏళ్ల కింద ఉబికివచ్చిన లావాతో ఏర్పడినవే. మిగతా తెలంగాణలో గ్రానైట్, డోలరైట్ రాళ్ల గుట్టలు ఏర్పడ్డాయి. హైదరాబాద్‌కు కొంత దూరం చేవెళ్ల సమీపంలోని ముడిమ్యాల గ్రామం వద్ద ఆ లావా అవశేషాలను జియోలజిస్టులు గుర్తించారు. ఆ లావా ప్రవాహాల సమయంలోనే ఇక్కడి డైనోసార్లు అంతరించాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మహారాష్ట్ర సరిహద్దు గోదావరి తీర ప్రాంతాల్లో ఆ డైనోసార్ల శిలాజాలు లభిస్తున్నాయి. సముద్రాల మధ్య.. ఒకప్పుడు ప్రస్తుతమున్న తెలంగాణ పీఠభూమి ప్రాంతానికి పక్కన రెండు సముద్రాలు ఉండేవి. దిగువన ఉన్నదానికి కడప బేసిన్ అని, ఎగువన ఉన్నదానికి పాకాల బేసిన్ అని జియోలజిస్టులు పేరుపెట్టారు. శేషాచలం కొండలు, నగరి జగ్గయ్యపేట మొదలు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్, మహబూబ్‌నగర్–ఖమ్మం జిల్లాల్లోని కొంత ప్రాంతంలో కడప బేసిన్ విస్తరించి ఉండేది. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పరిధి అంతా పాకాల బేసిన్ పరిధిలో ఉండేది. ఈ రెండు సముద్ర బేసిన్లు కూడా.. ఖమ్మం జిల్లా చిరునోముల గ్రామం వద్ద 10–12 మీటర్ల పాయతో అనుసంధానమై ఉండేవని గుర్తించారు. పాకాల బేసిన్లో సులువాయి, పెన్‌గంగ అన్న రెండు సబ్బేసిన్లను.. కడప బేసిన్లో కర్నూల్, పల్నాడు అనే రెండు సబ్ బేసిన్లను గుర్తించారు. ఇవన్నీ 160 కోట్ల ఏళ్ల నుంచి 55 కోట్ల ఏళ్ల కిందటి వరకు ఉండేవని అంచనా. ఇండోనేషియాలో అగ్నిపర్వతం పేలుడు.. తెలంగాణలో బూడిద సుమారు 75 వేల ఏళ్ల కింద ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో ఉన్న టోబా అనే అగ్నిపర్వతం భారీ స్థాయిలో బద్దలైంది. దాని నుంచి వెలువడిన బూడిద వేల కిలోమీటర్ల దూరం విస్తరించింది. అలా పడిన బూడిద నీటి ప్రవాహాలతో కొట్టుకుపోయి కొన్నిచోట్ల కుప్పగా చేరింది. అదే తరహాలో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఆ అగ్నిపర్వతం బూడిద కుప్పలు మేటవేసి ఉన్నాయి. కొత్తగూడెం సమీపంలోని ముర్రేరు వద్ద, మంజీరా లోయలోని కొన్ని ప్రాంతాల్లో సదరు బూడిద కుప్పలను జియోలజిస్టులు ఇప్పటికే గుర్తించారు. ఏపీలోని బనగానపల్లి సమీపంలో జ్వాలాపురం గ్రామంలో మెరుగుసుద్దగా పిలుచుకునే బూడిద కుప్పలు వీటిలో భాగమే. ఆ బూడిదనే కొన్ని కంపెనీలు గిన్నెలు తోమేందుకు వినియోగించే పౌడర్‌గా తయారు చేసి అమ్ముతున్నాయి. -
మూడు అంతస్తుల ఎత్తు లావా బ్లాకులు
లాపాల్మా: స్పానిష్ ద్వీపంలో లాపాల్మాలోని కుంబ్రే వైజా అగ్ని పర్వతం విస్పోటనం జరిగిన మూడు వారాల తర్వాత మూడూ అంతస్తుల భవనం అంత ఎత్తు వరకు లావా బ్లాక్‌లు ఏర్పడ్డాయని స్పానిష్ నేషనల్ జియోలాజికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎన్జీ) తెలిపింది. పైగా ఈ అగ్నిపర్వతం గుండా ఇప్పటికీ ఎర్రటి లావా నదిలా ప్రవహిస్తోందని వెల్లడించింది. సెప్టెంబర్ 19న లాపాల్మాలో అగ్నిపర్వతం విస్పోటనంతో దాదాపు వెయ్యి భవనాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: "సైక్లోథాన్‌తో మానసిక ఆరోగ్యం పై అవగహన కార్యక్రమాలు") ఈ మేరకు రిక్టారు స్కేలు పై 3.8 తీవ్రతతో మాజో, ఫ్యూన్కాలియంట్, ఎల్పాసో వంటి గ్రామాల్లో భూమి కంపించిందని పేర్కొంది. అంతేకాదు అగ్నిపర్వత ఉద్గార బిలం పై కప్పు కూలిపోయి ఎర్రటి లావా ఖాళీ చేయించిన లామా క్యామినో డి లా గటా ఇండస్ట్రియల్ ఎస్టేట్ భవనాల వరకు చేరుకుందని ఐఎన్జీ అధికారులు తెలిపారు. ఈక్రమంలో లాపాల్మాలో దాదాపు 83 వేల మంది ఉన్న ఆ ప్రాంతంలో సుమారు ఆరు వేల మంది నివాసితులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు వెల్లడించారు. విస్పోటన సమీపంలో మెరుపులు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. (చదవండి: దాదాపు నెలరోజలు సముద్రంలోనే!) -
స్పెయిన్‌లో అగ్నిపర్వతం విస్పోటనం
స్పెయిన్‌లోని అట్లాంటిక్ మహాసముద్ర ద్వీపంలోని లాప్లామాలో అగ్నిపర్వతం పేలి లావా పైకి ఉప్పొంగుతోంది. లావా ధారలుగా ప్రవహిస్తూ ఎరుపు రంగు అగ్నికీలల్ని వందల మీటర్ల దూరం వరకు వెదజిమ్మింది. దీంతో ఆకాశమంతా ఎరుపురంగులోకి మారింది. అగ్నిపర్వత శిఖరం నుండి ఎర్రటి లావా ఆకాశంలోకి ఫౌంటెయిన్‌లా ఎగసిపడటంతో ప్రజలు వణికిపోయారు. (చదవండి: ప్రపంచంలోనే ఖరీదైన పెంపుడు జంతువులు ఇవే) సెగలు, పొగలు గక్కుతూ లావా వరదై పారింది. ఈ క్రమంలో స్పెయిన్ అధికారులు తక్షణమే అప్రమత్తమై సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను ట్విటర్లో వాతావరణ శాఖ షేర్ చేసింది. అలాగే దృశ్యాల్ని చూసిన చాలామంది తమ అనుభవాలను పంచుకుంటూ వీడియోలను పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. (చదవండి: చైనాలో పడవ బోల్తా.. 10 మంది మృతి) BREAKING: Volcanic eruption on Canary Island of La Palma in Spain. pic.twitter.com/XghhbjqBPO — Insider Paper (@TheInsiderPaper) September 19, 2021 -
లావా చెక్కిన ‘స్తంభాలు’
ఈ చిత్రంలో కనిపిస్తున్నవి గండరాతి శిలలు.. కానీ సాధారణ రాయితో ఏర్పడ్డవి కాదు. భూపొరల నుంచి ఉప్పొంగిన లావా ఘనీభవించి ఇలా రాతిగా మారాయి. లావాతో ఏర్పడ్డ రాతి పొరలు సహజంగానే కనిపిస్తుంటాయి. కానీ ఉలితో శిల్పి చెక్కినట్టుగా ఇలా ఒకేరకం కడ్డీలుగా ఏర్పడటం మాత్రం కొంత అరుదే. వాటిని కాలమ్నార్ బసాల్ట్‌గా పిలుస్తారు. ఇలాంటి అరుదైన లావా రాతిస్తంభాలు ఆసిఫాబాద్ అడవుల్లో వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల్లో గతంలో విస్తారంగా కనిపించిన ఈ లావా స్తంభాలు తెలంగాణ లో తొలిసారి కనిపించడం విశేషం. ఇలాం టి రాతిస్తంభాలు కొన్ని ప్రాంతాల్లో చాలా పొడవుగా ఉంటాయి. అలాంటి స్తంభాలతో ఏర్పడ్డ గుట్టలు కూడా ఉన్నాయి. ఆసిఫాబాద్ అభయారణ్యంలో వెలుగుచూసిన లా వా ‘రాతికడ్డీలు’ భూ ఉపరితలంలో చిన్న విగానే కనిపిస్తున్నా భూగర్భంలో మరింత పొడవుగా ఉండి ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ ప్రాంతంలో జీఎస్ఐ విభాగం పరిశోధన జరిపితే మరిన్ని కొత్త విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది. 6.5 కోట్ల సంవత్సరాల క్రితం.. దక్కన్ పీఠభూమి చాలా వరకు లావా ప్రవహించిన ప్రాంతమే. దాదాపు 6.5 కోట్ల సంవత్సరాల క్రితం భూగర్భంలోని పొరల్లో చోటుచేసుకున్న చర్య ఫలితంగా లోపలి నుంచి లావా ఉప్పొంగి మహారాష్ట్ర పూర్తి భాగం, రాజస్తాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో కొంతభాగం చొప్పున ఆవరించిందని, వికారాబాద్ సమీపంలోని అనంతగిరి గుట్టలు అలా ఉప్పొంగిన లావా ఘనీభవించి ఏర్పడ్డవేనని ఔత్సాహిక పరిశోధకులు చెబుతున్నారు. చేవెళ్ల మీదుగా వికారాబాద్, ఇటు కర్ణాటక, అటు మహారాష్ట్ర వైపు ఇలా లావాతో రాతి పొరలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. దాదాపు 5 లక్షల చదరపు కి.మీ. మేర ఇవి ఏర్పడటం గమనార్హం. ఈ సాధారణ రాతి పొరలే కాకుండా కొన్ని ప్రత్యేక ఒత్తిళ్ల వల్ల అవి నిర్దిష్ట ఆకృతిలో స్తంభాలుగా ఏర్పడ్డాయి. వాటినే కాలమ్నార్ బసాల్ట్‌గా పేర్కొంటారు. – సాక్షి, హైదరాబాద్ జీఎస్ఐ పరిశోధన చేపట్టాలి... కొందరు ఔత్సాహికులు కొంతకాలం క్రితం ఆసిఫాబాద్ అభయారణ్యంలో పరిశోధించి ఈ రాళ్లను గుర్తించారు. ఆ చిత్రాలను నేను జీఎస్ఐ విశ్రాంత డిప్యూటీ డైరక్టర్ చకిలం వేణుగోపాల్‌కు పంపగా అవి కాలమ్నార్ బసాల్ట్‌గా ఆయన నిర్ధారించారు. ఈ అరుదైన రాళ్లకు సంబంధించి ఆ ప్రాంతంలో జీఎస్ఐ వెంటనే పరిశోధన చేపట్టాలి. – శ్రీరామోజు హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ తెలంగాణలో తొలిసారే... మహారాష్ట్రలోని యావత్మాల్లో ఇటీవల రోడ్డు నిర్మాణం కోసం జరిపిన తవ్వకాల్లో భారీ కాలమ్నార్ బసాల్డ్ పొర వెలుగుచూసింది. ఆసిఫాబాద్ అడవిలో కనిపించిన శిలాస్తంభాల చిత్రాలు చూస్తే అవి కాలమ్నార్ బసాల్ట్గానే అనిపిస్తోంది. జీఎస్ఐ పరిశోధించి వాటిని అధికారికంగా తేలిస్తే తెలంగాణలో మొదటిసారి అలాంటి శిలారూపాలు రికార్డయినట్టవుతుంది. – చకిలం వేణుగోపాల్,జీఎస్ఐ విశ్రాంత డిప్యూటీ డైరక్టర్ -
బంపర్ ఆఫర్.. రూ.1 కే టీడబ్ల్యుఎస్ ఇయర్‌బడ్స్
ఈ రోజుల్లో మనకు రూ.1కే ఏమి వస్తుంది. మహా అయితే ఒక చాక్లెట్ మాత్రమే వస్తుంది. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా కేవలం రూ.1కే టీడబ్ల్యుఎస్ ఇయర్ బడ్స్ ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఎక్కువగా హెడ్ ఫోన్ జాక్ తీసుకొని రాకపోవడంతో టీడబ్ల్యుఎస్ ఇయర్ బడ్స్ కు చాలా డిమాండ్ పెరిగింది. అందుకే అనేక పరిశోదనల అనంతరం ప్రోబడ్స్ను రూపొందించినట్లు లావా పేర్కొంది. కస్టమర్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా, అనేక ట్రయల్స్ చేసిన తర్వాత ఈ డిజైన్ చేసినట్లు సంస్థ తెలిపింది. నిజంగానే కేవలం రూపాయికే ఇయర్‌బడ్స్‌ను లావా సంస్థ ‘ఆఫర్’ చేస్తోంది. రూపాయికే సొంతం చేసుకోవాలంటే రేపు(జూన్ 24వ తేదీ) మధ్యాహ్నం వరకు ఆగాల్సిందే. లావా ఈ-స్టోర్ కానీ, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లోగానీ గురువారం 12 గంటల నుంచి ఈ స్పెషల్ ఆఫర్ ప్రారంభవుతుంది. అయితే, ఇక్కడొక షరతు ఉంది. స్టాక్ అందుబాటులో ఉన్న వరకే రూపాయికి ఆఫర్ వర్తిస్తుందని లావా కంపెనీ పేర్కొంది. తర్వాత కొనుగోలు చేసే వారు రూ.2,199 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 11.6 mm అడ్వాన్స్డ్ డ్రైవర్స్, మీడియా టెక్ ఏయిరో చిప్సెట్ ఉన్నాయి. ప్రతి బడ్ లో 55 ఎమ్ఎహెచ్ బ్యాటరీ, అలాగే కేసులో 500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ప్రోబడ్స్ లేటెస్ట్ బ్లూటూత్ v5.0 టెక్నాలజీ సపోర్ట్ చేయడంతో పాటు 77 గ్రాముల బరువు ఉన్నాయి. చదవండి: చైనాకు భారీ షాక్ ఇచ్చిన శామ్సంగ్ -
వందల ఏళ్ల తర్వాత విస్ఫోటనం.. ఆమ్లెట్ వేసిన సైంటిస్టులు
రేక్జావిక్: ఐస్‌ల్యాండ్ రాజధాని రేక్జావిక్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఫగ్రడాల్స్‌ఫాల్ పర్వతం సమీపంలో ఉన్న అగ్ని పర్వతం వారం రోజుల క్రితం విస్ఫోటనం చెందిన సంగతి తెలిసిందే. 900 వందల సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఈ ఏడాది బద్దలవ్వడంతో ఆ చుట్టు పక్కల ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ ప్రాంతంలో విస్ఫోటనం గురించి అధ్యయనం చేయడానికి ఐస్‌ల్యాండ్ చేరుకున్న శాస్త్రవేత్తలు పర్వత ప్రాంతంపై నుంచి లావా ప్రవహించే అరుదైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే వారు అక్కడ వంట కూడా చేశారు. మీరు చదివింది కరెక్టే.. శాస్త్రవేత్తలు అక్కడ వంట చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరలవుతున్నాయి. న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ఇందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేసింది. వందల ఏళ్ల తర్వాత ఈ అగ్ని పర్వతం విస్పోటనం చెందడంతో కొందరు శాస్త్రవేత్తలు దీని గురించి అధ్యయనం చేయడానికి ఐస్‌ల్యాండ్ చేరుకున్నారు. అగ్నిపర్వతం వద్దకు చేరుకున్న శాస్త్రవేత్తల బృందం ఈ విస్ఫోటనం గురించి అధ్యయనం చేయడమేకాక.. ఈ ఘటనలో వెలువడిన లావాను ఉపయోగించి ఏకంగా వంట చేశారు. 'ఐస్లాండ్ అగ్నిపర్వతం విస్పోటనం చెందడం వల్ల వెలువడిన లావా హాట్ డాగ్స్‌ను ఆస్వాదించడానికి అవకాశం కల్పిస్తుంది' అనే క్యాప్షన్‌తో యూట్యూబ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇది ఇప్పటికే 58కే వ్యూస్ పొందింది. విస్పోటనం వల్ల వెలువడిన వేడి వేడి లావాపై హాట్ డాగ్స్ వండటం, రేకు కాగితంపై శాండ్విచ్లను గ్రిల్ చేయడంతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. మరొక బృందం ఈ లావా మీద పాన్ పెట్టి గుడ్లు పగలగొట్టి ఆమ్లెట్ వేయడమేకాక బేకన్ వండుతున్న మరొక వీడియోను యూరుకుర్ హిల్మార్సొన్మ్ యూట్యూబ్‌లో షేర్ చేశారు. ఫగ్రడాల్స్ఫాల్లో విస్ఫోటనం ప్రారంభమైన తరువాత గత శుక్రవారం రాత్రి ఎర్రటి మేఘం ఆకాశాన్ని కమ్మెసిందా అన్నట్లు అక్కడి పరిసరాలు మారిపోయాయి. ఇక విస్ఫోటనానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విస్ఫోటనంతో అగ్ని పర్వతం నుంచి బయటకు చిమ్ముతున్న ఎర్రని లావా ప్రవహాన్ని చూపించే ఒక డ్రోన్ ఫుటేజ్ ఇప్పటికే మిలియన్ల వ్యూస్ సంపాదించింది. విస్ఫోటనం జరగడానికి ముందు నాలుగు వారాల్లో ఈ ద్వీపకల్పంలో 40,000కు పైగా భూకంపాలు సంభవించాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో నో-ఫ్లై జోన్ ఆంక్షలు విధించారు. విస్ఫోటనం ప్రజలకు తక్షణ ప్రమాదం కలిగించలేదని అధికారులు వెల్లడించారు. చదవండి: వాల్కనో బీభత్సం : ఎగిసిపడిన లావా సమ్మర్ లేని సంవత్సరం గురించి మీకు తెలుసా? -
900 ఏళ్లకు నిద్రలేచి.. వణికించి.. భయపెట్టి
వరుసగా భూకంపాలు.. రాత్రిలేదు, పగలు లేదు.. ప్రతి నిమిషం వణుకే.. ప్రతి క్షణం భయం భయమే. ఒకటీ రెండూ కాదు.. కేవలం మూడు వారాల్లో ఏకంగా 50 వేల ప్రకంపనలు. ఓ రోజు ఉన్నట్టుండి ఆగిపోయాయ్. హమ్మయ్య అనుకోవడానికి లేదు. భూకంపాలు ఆగిపోగానే.. అగ్ని పర్వతం పేలడం మొదలైంది. కుతకుతా ఉడుకుతున్న ఎర్రని లావా పెల్లుబుకుతూ ప్రవహిస్తోంది. అటు యూరప్.. ఇటు అమెరికా ఖండాల మధ్య అట్లాంటిక్ మహా సముద్రంలో ఉన్న ఐస్‌ల్యాండ్‌లో కొద్దిరోజులుగా పరిస్థితి ఇది. ఇక్కడ 900 ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న ఫగ్రడాల్స్జల్ అగి్నపర్వతం తాజాగా బద్దలైంది. సుమారు కిలోమీటరు వెడల్పుతో లావా ఓ నదిలా ప్రవహిస్తోంది. కొందరు ఫొటోగ్రాఫర్లు ఓ డ్రోన్ సాయంతో అగ్ని పర్వతం పేలుడును చిత్రీకరించారు. ఓ వైపు మంచు గ్లేసియర్లు, వేడి నీటి ఊటలు, మరోవైపు ఎటు చూసినా పచ్చదనంతో ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన ఐస్‌ల్యాండ్‌లో.. ఏకంగా 32 అగి్నపర్వతాలు ఉండటం గమనార్హం. -
వాల్కనో బీభత్సం : ఎగిసిపడిన లావా
-
వాల్కనో బీభత్సం : ఎగిసిపడిన లావా
సాక్షి,న్యూఢిల్లీ: ఐస్లాండ్ రాజధాని రీజావిక్లో బద్దలైన అగ్నిపర్వతం బీభత్సం రేపేలా అగ్నికీలల్ని వెదజిమ్మింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులయ్యారు. ఎర్రటి లావా ఆకాశంలోకి ఫౌంటెయిన్‌లా ఎగసిపడింది. దీంతో భయంతో జనం బిక్కుబిక్కుమన్నారు. సెగలు, పొగలు గక్కుతూ లావా వరదై పారింది. రాజధానికి 30 కిలో మీటర్ల దూరంలోని ఫాగ్రాదల్సజాల్లో శుక్రవారం ఈ ఉదంతంచోటు చేసుకుంది. అయితే దీని వల్ల ప్రస్తుతానికి ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని ఐస్లాండ్ వాతావరణ శాఖ (ఐఎంవో) పేర్కొంది. కేవలం ఒక నెలలో 40 వేల భూకంపాలు సంభవించిన అనంతరం వాల్కనో బద్దలైనట్టు తెలిపింది. అలాగే దాదాపు 800 సంవత్సరాలలో ఈ ప్రాంతంలో ఇది తొలి అగ్నిపర్వత విస్ఫోటనమని అధికారులు పేర్కొన్నారు. చదరపు కిలోమీటర్ మేర లావా వ్యాపించి, 100 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు. అలాగే ఎగిసిన పొగ వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడే ముప్పు ఉందని,అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను ట్విటర్లో వాతావరణ శాఖ షేర్ చేసింది. అలాగే దృశ్యాల్ని చూసిన చాలామంది తమ అనుభవాలను పంచుకుంటూ వీడియోలను పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
మార్కెట్లోకి మేడ్ ఇన్ ఇండియా లావా మొబైల్స్
న్యూఢిల్లీ: మళ్లీ మొబైల్ మార్కెట్ లో మేడ్ ఇన్ ఇండియా కంపెనీల జోరు కొనసాగుతుంది. ప్రస్తుతం మొబైల్ మార్కెట్ లో విదేశీ కంపెనీలదే పై చేయి. ప్రధానంగా చెప్పాలంటే చైనా మొబైల్ కంపెనీలు ఈ మార్కెట్ లో దూసుకెళ్తున్నాయి. అయితే వీటిని తట్టుకొని నిలబడటానికి గతంలో మైక్రో మాక్స్ కొన్ని మొబైల్స్ విడుదల చేయగా.. తాజాగా లావా కంపెనీ తన కొత్త నాలుగు మొబైల్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. లావా జెడ్1, లావా జెడ్2, లావా జెడ్4, లావా జెడ్6 పేరుతో స్మార్ట్ఫోన్లను పరిచయం చేసింది. కొత్త ఫోన్లు దేశంలోనే స్థానికంగా బ్యాటరీలు, ఛార్జర్లతో సహా 60 శాతం భాగాలు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని సంస్థ పేర్కొంది. లావా జెడ్2, లావా జెడ్4, లావా జెడ్6 మొబైల్స్ జనవరి 11 నుంచి, లావా జెడ్ 1 జనవరి 26 నుంచి అమెజాన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో లభిస్తాయి.(చదవండి: శామ్సంగ్ నుంచి సరికొత్త బడ్జెట్ మొబైల్) లావా జెడ్1 ఫీచర్స్: డిస్ప్లే: కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో 5-అంగుళాల డిస్ప్లే ర్యామ్: 2జీబీ ఇంటర్నల్ స్టోరేజ్: 16జీబీ ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో ఏ20 రియర్ కెమెరా: 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్ బ్యాటరీ: 3,100ఎంఏహెచ్ ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ ధర: రూ.5,499 లావా జెడ్2 ఫీచర్స్: డిస్ప్లే: 6.5-అంగుళాల హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే ర్యామ్: 2జీబీ ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ35 రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్ బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ + 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ ధర: రూ.6,999 లావా జెడ్4 ఫీచర్స్: డిస్ప్లే: 6.5-అంగుళాల హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే ర్యామ్: 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ35 రియర్ కెమెరా: 13 ఎంపీ + 5 ఎంపీ + 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్ బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ + 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ ధర: రూ.8,999 లావా జెడ్6 ఫీచర్స్: డిస్ప్లే: 6.5-అంగుళాల హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే ర్యామ్: 6జీబీ ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ35 రియర్ కెమెరా: 13 ఎంపీ + 5 ఎంపీ + 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్ బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ + 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ ధర: రూ.9,999 -
2 వేల ఏళ్ల నాటి శవాలు: లావాలో..
పాంపే : దాదాపు రెండు వేల ఏళ్ల క్రితం అగ్ని పర్వతపు లావాలో చిక్కుపోయి శిలలా మారిన ఇద్దరు వ్యక్తుల శవాలు తాజాగా బయటపడ్డాయి. ఇటలీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు వీటిని వెలికి తీశారు. శనివారం వీటికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. క్రీస్తుపూర్తం 79లో పాంపేలోని ప్రాచీన రోమన్ సిటీకి దగ్గరలోని మౌంట్ వెసువిస్ అగ్ని పర్వతం బద్దలైంది. దీంతో లావా ఉప్పొంగి అక్కడికి దగ్గరలోని ఊర్లను కప్పేసింది. లావా నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించినప్పటికి ప్రజల వల్ల కాలేదు. లావాలో చిక్కుకుని ప్రాణాలు వదిలారు. అయితే లావాతో కప్పబడి పోయిన శవాలు మాత్రం చెక్కు చెదరకుండా మిగిలిపోయాయి. ( వైరల్: చిరుత ఇంతలా భయపడ్డం చూసుండరు ) భూగర్భ ప్రాంతంలో శవ శిలలు 2017లో ఈ ప్రాంతంలో పురావస్తు శాఖ తవ్వకాలు జరపగా.. మూడు గుర్రాల శిలలు బయటపడ్డాయి. తాజాగా నవంబర్ నెలలో ఇద్దరు వ్యక్తులకు చెందిన శవ శిలలను కనుగొన్నారు. లావానుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించిన ధనికుడు అతడి సేవకుడికి చెందిన శవాలుగా గుర్తించారు. ఓ వ్యక్తికి 18-25 సంవత్సరాల వయస్సు.. మరో వ్యక్తికి 30-40 ఏళ్ల వయసు మధ్య ఉంటుందని తెలిపారు. లావానుంచి తప్పించుకోవటానికి సురక్షితమైన ప్రదేశం కోసం అన్వేషిస్తూ భూగర్భ ప్రాంతంలోకి వచ్చి ఉంటారని, అక్కడే లావాకు బలయ్యారని తెలిపారు. నవంబర్ 18వ తేదీన తీసిన ఫొటోలను విడుదల చేశారు. -
లావా మేడిన్ ఇండియా స్మార్ట్‌ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ : చైనా వస్తువులు, దిగుమతులపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ స్మార్ట్‌ఫోన్ సంస్థ లావా వేగం పెంచింది. ఎంట్రీ లెవల్ విభాగంలో ఒక స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ‘లావా జెడ్61 ప్రో’ పేరుతో చాలా అందుబాటు ధరలో ఆవిష్కరించింది. లావా జెడ్61 ప్రో మేడిన్ స్మార్ట్ ఫోన్ అని లావా ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ హెడ్ తేజిందర్ సింగ్ వెల్లడించారు. ఫేస్ అన్‌లాక్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 0.6 సెకన్లలో అన్‌లాక్ అవుతుందన్నారు. తక్కువ ధరలో చాలా ఆకర్షణీయంగా, బడ్జెట్ ధరలను కోరుకునే వినియోగదారులకు లేదా ఫీచర్ ఫోన్ నుండి స్మార్ట్‌ఫోన్‌కు మారేవారికి సరిపోతుందనీ, భారతీయులుగా గర్వపడతారని వ్యాఖ్యానించారు. ధర, లభ్యత లావా జెడ్61 ప్రో ధర 5,774 రూపాయలు. రెడ్, బ్లూ, రెండు రంగుల్లో ఇది లభించనుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తోపాటు ఆఫ్‌లైన్ మార్కెట్లో కూడా అందుబాటులో ఉంటుంది. లావా జెడ్ 61 ప్రో ఫీచర్లు 5.45 అంగుళాల హెచ్డి + డిస్ప్లే 1.6 గిగాహెడ్జ్ ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ 128 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం 8 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీకెమెరా 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ -
రూ.3899 కే స్మార్ట్‌ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ : లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌నుతీసుకొచ్చింది. ‘లావా జెడ్ 41’ పేరుతో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం లాంచ్ చేసింది. దీని ధర రూ. 3,899. మిడ్నైట్ బ్లూ, యాంబర్ రెడ్ రంగుల్లో ఇది లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్ యూట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్‌లాంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలతో వినియోగదారుల అన్ని సోషల్ మీడియా అవసరాలను తీర్చగలదు. యూట్యూబ్ గో వంటి డేటా యాప్ప్ సర్ఫింగ్‌కు కూడా ఈ స్మార్ట్‌ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 5 అంగుళాల డిస్ప్లే ఆండ్రాయిడ్ 9 పై (గో ఎడిషన్) 5 ఎంపీ రియర్ కెమెరా 1 జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ 2500 ఎంఏహెచ్ బ్యాటరీ స్పెసిఫికేషన్ల పరంగా, 9 లెవల్ ఫిల్టర్లు, నైట్ షాట్, స్మార్ట్ స్లీప్, బర్స్ట్ మోడ్ ఎఫెక్ట్‌తో పాటు రియల్ టైమ్ బోకె ఫీచర్లతో రూ. 4వేల విభాగంలో ఉన్న ఏకైక స్మార్ట్‌ఫోన్ ఇదేనని లావా ఇంటర్నేషనల్ హెడ్ (ప్రొడక్ట్) తేజిందర్ సింగ్ వెల్లడించారు. -
లావా నుంచి ‘జడ్93’ స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: మొబైల్స్ తయారీ కంపెనీ లావా తాజాగా తన ‘జడ్93’ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అధిక గ్రాఫిక్స్ కలిగిన ఆటలను ఆడేందుకు వీలుగా ‘స్మార్ట్ ఏఐ గేమింగ్ మోడ్’ను ఈ ఫోన్ కలిగి ఉందని కంపెనీ ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్ ధర రూ.7,999 వద్ద నిర్ణయించింది. వెనుకవైపు 13మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2ఎంపీ సెకండరీ సెన్సార్ కమెరా.. 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.22 అంగుళాల డిస్ప్లే ఇందులో స్పెసిఫికేషన్లుగా కంపెనీ ప్రకటించింది. -
ఈ ఫోన్ ఉంటే టీవీ అవసరం లేదు
న్యూఢిల్లీ: నేటి యువత అభిరుచులకు అనుగుణంగా 6 అంగుళాల స్క్రీన్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్ ‘లావా జెడ్ 62’ను లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ విడుదల చేసింది. అరు అంగుళాల ఫుల్ వ్యూ (నాచ్ తక్కువగా ఉండే) ఐపీఎస్ డిస్ప్లేతో కూడిన ఈ ఫోన్ ఉంటే టీవీ అవసరం లేదని, వీడియో వీక్షణ అనుభవం గొప్పగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ‘త్రో యువర్ టీవీ’ పేరుతో ఓ ఆఫర్‌ను కూడా కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద తమ పాత టీవీని ఇచ్చి జెడ్62 స్మార్ట్‌ఫోన్‌ను గెలుచుకోవచ్చని తెలిపింది. స్టాక్ ఉన్నంత వరకు ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ఇది అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ఆఫర్ కోసం కంపెనీ వెబ్సైట్లో ఈ నెల 18 నుంచి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని సూచించింది. జెడ్62 ఫోన్లో ప్రత్యేకంగా గూగుల్ అసిస్టెంట్ కీని కంపెనీ ఏర్పాటు చేసింది. దీని సాయంతో కోరుకున్న యాప్‌ను వాయిస్ కమాండ్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. 3,380 ఎంఏహెచ్ ఆర్టిఫీషియల్ ఇన్టెలిజెన్స్ బ్యాటరీ ఇందులో ఉంది. ఫేస్ అన్‌లాక్, 8మెగాపిక్సల్, 5 మెగాపిక్సల్ ఏఐ స్టూడియోమోడ్ కెమెరా తదితర ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.6,060. -
లావా కొత్త స్మార్ట్‌ఫోన్, అతి తక్కువ ధరలో
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ స్మార్ట్‌ఫోన్ మేకర్ లావా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. లావా జెడ్ 60కి సక్సెసర్‌గా లావా జెడ్60ఎస్ పేరుతో4జీ వోల్ట్ డివైస్‌ను లావా ఇంటర్నేషనల్ విడుదల చేసింది. దీని ధరను రూ.4949 గా నిర్ణయించింది. నవంబరు 15, 2018లోపు కొనుగోలు చేసిన వారికి వన్ టైం స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్ చేస్తోంది. అలాగే జియో (పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్) కస్టమర్లకు రూ.2200 తక్షణ క్యాష్‌బ్యాక్‌ఆఫర్ కూడా ఉంది. 50 రూపాయల విలువైన 44 రీచార్జ్ కూపన్లను జియో వినియోగదారులకు అందిస్తుంది. లావా జెడ్60ఎస్ 5 అంగుళాల డిస్ప్లే 1.5గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1 జీబీ, 16జీబీ స్టోరేజ్ ఆండ్రాయిడ్8.1 ఓరియో(గో) 5ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 2500 ఎమ్ఏహ్చ్బ్యాటరీ -
వందేళ్లలో ఇదే భారీ విస్పోటనం
పహోవా, హవాయి : ఈ నెల మూడున హవాయి ద్వీపంలోని కిలౌయిలో అగ్ని పర్వతం బద్దలయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నేటి వరకూ అంటే దాదాపు నాలుగు వారాలుగా లావా వెలువడుతూనే ఉన్నది. కిలౌయి అగ్ని పర్వతం నుంచి బయటకు వస్తున్న లావాతో హవాయి వీధులన్నీ పూర్తిగా కప్పబడ్డాయి. చాలా నివాస గృహాలు నాశనం అయ్యాయి. స్థానికులు ఆ ప్రదేశాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు చేరాలని అధికారులు కోరుతున్నారు. బిగ్ ఐలాండ్‌లో ఉన్న లీలాని ఎస్టేట్స్ హౌసింగ్ డెవలప్మెంట్కు సమీపాన ఉన్న ఈ కిలౌయి అగ్నిపర్వతం విస్పోటనం చెందడంతో విధ్వంసకర రీతిలో లావా వెలువడుతుండటంతో ఈ ప్రాంతంలోని ఇళ్లు పూర్తిగా నాశనమయ్యాయి. ఈ నెల 3న విస్పోటమయిన ఈ అగ్నిపర్వతం వల్ల నాశనమయిన ఇళ్ల సంఖ్య తొలుత 50 కాగా ప్రమాద తీవ్రత పెరగడం వల్ల ఇది 80కు చేరుకుందని ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ తెలిపింది. అంతేకాక దాదాపు 890 హెక్టార్ల(2,200) విస్తీర్ణం మేర లావా వ్యాపించిందని తెలిపింది. గత వంద సంవత్సరాలలో ఇదే అతి పెద్ద భారీ విస్పోటనమని, నష్టం కూడా పెద్ద మొత్తంలో వాటిల్లిందని ప్రకటించింది. దాదాపు 37 ఇళ్ల చుట్టూ లావా పేరుకుపోయింది. ఆ ఇళ్లలో ఇంకా ఎవరైనా ఉంటే వారు బయటకు రావడానికి వీలులేకుండా దాదాపు 30 మీటర్ల ఎత్తు వరకు లావా వ్యాపించిందని తెలిపింది. మొత్తం అగ్ని పర్వతంలో ఉన్న లావాలో, ప్రస్తుతం బయటకు వస్తున్నది చాలా కొద్దిశాతమేనని, ఈ కొద్ది మొత్తానికే పరిస్థితి ఇలా ఉంటే, ఇక మొత్తం లావా బయటకు ప్రవహిస్తే పరిస్థితిని ఊహించలేమని అమెరికా జియలాజికల్ డిపార్టుమెంటు ఆందోళన వ్యక్తం చేసింది. ఇకైక అనే వ్యక్తి ఈ అగ్ని పర్వత విస్పోటనాన్ని వీడియో తీసి ఫేస్బుక్లో పోస్టు చేశాడు. దానిలో అతను ‘అగ్నిపర్వతం నుంచి వెలువడిని లావా ఈ దారిలో ఉన్న 8 ఇళ్లను కేవలం 12 గంటల్లో నామరూపాలు లేకుండా చేసింది . ఇక్కడే మా సోదరుని ఇళ్లు కూడా ఉంది. కానీ ఇప్పుడు దాన్ని కనీసం గుర్తుపట్టడానికి కూడా వీలు లేనంతగా మారిపోయింద’న్నాడు. -
ఆండ్రాయిడ్ ఓరియోలో లావా కొత్త స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: మొబైళ్లు తయారు చేసే లావా కంపెనీ ఆండ్రాయిడ్ ఓరియో(గో ఎడిషన్)లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. జడ్50 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ భాగస్వామ్యంతో తక్కువ ధరకే అందిస్తున్నామని లావా తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.4,000 అని భారతీ ఎయిర్టెల్ మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్(నా తొలి స్మార్ట్‌ఫోన్) కార్యక్రమంలో భాగంగా ఆ కంపెనీ రూ.2,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ని ఇస్తోందని, దీంతో ఈ ఫోన్ రూ.2,400కే లభిస్తుందని వివరించింది. ఈ జడ్50 స్మార్ట్‌ఫోన్‌లో 4.5 అంగుళాల డిస్ప్లే, 1.1 గిగాహెట్జ్ క్వాడ్–కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్పేస్, 5 మెగా పిక్సెల్ రియర్, ఫ్రంట్ కెమెరా విత్ ఫ్లాష్ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ లక్షకు పైగా రిటైల్ స్టోర్స్‌లతో పాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ వంటి ఈ కామర్స్ వెబ్‌సైట్‌ల్లో కూడా లభిస్తుందని పేర్కొంది. గూగుల్ సంస్థ గత ఏడాది డిసెంబర్లో ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్‌లో ఒక స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఓఎస్‌పై పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌లు తక్కువ డేటాను వినియోగించుకుంటూనే వేగంగా పనిచేస్తాయి. -
రూ.2400కే లావా స్మార్ట్‌ఫోన్
ఎన్నో అంచనాల అనంతరం లావా కంపెనీ దేశీయ తొలి ఆండ్రాయిడ్ ఓరియో(గో ఎడిషన్) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎయిర్టెల్ ఆఫర్ చేస్తున్న ‘మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్’ ప్రొగ్రామ్‌లో భాగంగా జడ్50 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.2400కే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను 10వేలకు పైగా రిటైల్ స్టోర్లలో, అదేవిధంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి ఆన్లైన్ ఛానళ్లలో అందుబాటులో ఉంచినట్టు లావా పేర్కొంది. బ్లాక్, గోల్డ్ రంగుల ఆప్షన్లలో ఇది లభ్యమవుతోంది. ఈ లావా జడ్50 అసలు మార్కెట్ ఆపరేటింగ్ ధర 4,400 రూపాయలు. ఎయిర్టెల్ ఈ ఫోన్‌పై రూ.2000 క్యాష్‌బ్యాక్ ప్రకటించడంతో, దీని ధర 2,400 రూపాయలకు దిగొచ్చింది. అయితే కస్టమర్లు రూ.2000 క్యాష్‌బ్యాక్ పొందాలంటే, తొలి 18 నెలలు రూ.3500తో, 19 నుంచి 36 నెలల మరో రూ.3500తో తమ ఎయిర్టెల్ అకౌంట్లలో రీఛార్జ్ చేసుకోవాలి. ఈ ఫోన్‌ను రెండేళ్ల వారెంటీతో మార్కెట్లోకి వచ్చింది. లావా అదనంగా వన్‌టైమ్ స్క్రీన్ రిప్లేస్మెంట్ను కూడా ఆఫర్ చేస్తోంది. అయితే ఇది ఫోన్ కొనుగోలు చేసిన ఏడాది వరకే వాలిడ్‌లో ఉంటుంది. లావా జడ్50 స్పెషిఫికేషన్లు.. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో(గో ఎడిషన్) 4.5 అంగుళాల డిస్ప్లే 2.5డీ కర్వ్డ్ గొర్రిల్లా గ్లాస్ క్వాడ్-కోర్ 1.1గిగాహెడ్జ్ మీడియాటెక్ ఎంటీ6737ఎం ఎస్ఓసీ 1జీబీ ర్యామ్, 8జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ 5 మెగాపిక్సెల్ రియర్, ఫ్రంట్ కెమెరా సెన్సార్స్ 2000 ఎంఏహెచ్ బ్యాటరీ -
తొలి ఆండ్రాయిడ్ గో స్మార్ట్‌ఫోన్..
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ హ్యాండ్సెట్ తయారీదారు లావా తొలి ఆండ్రాయిడ్ ఓరియో గో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం విడుదల చేసింది. లావా జెడ్ 50 పేరుతో దీన్ని లాంచ్ చేసింది. బడ్జెట్ ధరలో ఎంట్రీ లెవల్లో 1జీబీ ర్యామ్ డివైస్లకుద్దేశించిన కొత్త ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం (గో ఎడిషన్) మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ధరను 5వేల రూపాయలుగా నిర్ణయించింది. లావా జెడ్ 50 ఫీచర్లు 4.5 అంగుళాల డిస్ప్లే, 2.5డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆండ్రాయిడ్ ఓరియో గో 1.1 గిగాహెట్జ్ క్వాడ్ కోర్ 1 జీబీ ర్యామ్ 8 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ 5ఎంపీ రియర్ కెమెరా 5ఎంపీ సెల్ఫీ కెమెరా విత్ ఫ్లాష్ -
ముంచుకొస్తున్న ప్రళయాగ్ని!
పది కిలోమీటర్ల వెడల్పు.. అర కిలోమీటర్‌కుపైగా ఎత్తున్న సొరంగం.. టిక్..టిక్..టిక్మంటూ కాలం గడుస్తోంది.. ఉన్నట్టుండి అకస్మాత్తుగా.. కళ్లుమూసి తెరిచేలోగా... సొరంగంలోని లావా కాస్తా ఒక్కపెట్టున పైకి ఎగజిమ్మింది... ఏమిటిది? ఇదేదో సస్పెన్స్ సినిమా కథ అనుకునేరు! అక్షరాలా వాస్తవం. సముద్రపు అడుగున వేల ఏళ్లపాటు నిద్రాణంగా ఉన్న ఓ అగ్నిపర్వతం క్రియాశీలకమైందని.. ముందస్తు హెచ్చరికల్లేకుండా ఎప్పుడైనా పేలిపోవచ్చునని చెబుతున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. ఈ విపత్తుతో కనీసం 10 కోట్ల మంది ప్రాణాలకు ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. ఎక్కడిది? జపాన్ దక్షిణ ప్రాంతంలో కికాయి కాల్డెరా అనే పేరుతో ఓ అగ్నిపర్వతముంది. భూమ్మీద కనిపించేది కొంచెమే అయినా అడుగున భారీ సైజులో ఉంటుంది. 7,300 ఏళ్ల కింద బద్దలై లావా ఎగజిమ్మిందని.. ఫలితంగా అక్కడి జొమోన్ నాగరికత పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందని చరిత్రకారుల అంచనా. ఎలా తెలిసింది..? జపాన్‌లోని కోబె విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇటీవల ఈ అగ్నిపర్వత ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించారు. ఫుకేమరూ అనే పరిశోధక నౌకతో అగ్నిపర్వత ప్రాంతానికి వెళ్లిన శాస్త్రవేత్తలు సముద్రపు అడుగుభాగంలో ఓ భారీ లావా గోపురాన్ని గుర్తించారు. ఈ గోపురం వేల ఏళ్లుగా పేరుకుపోయిన లావా పరిమాణం కొంచెం అటూ ఇటుగా 32 ఘనపు కిలోమీటర్లు! అంటే 32 పక్కన 12 సున్నాలు పెడితే వచ్చే సంఖ్యలో ఉన్నన్ని లీటర్ల లావా అన్నమాట! ఏం జరుగుతుంది..? ఇది ఆషామాషీ సైజున్న అగ్నిపర్వతం కాదు. పైగా వేల ఏళ్లుగా నిద్రాణంగా ఉన్నది. గతంలో ఎగసిన లావా కాస్తా అగ్నిపర్వతంపై పేరుకుపోవడంతో లోపల లావా తీవ్రమైన ఒత్తిడితో పేరుకుపోతూ వస్తోంది. జపాన్ శాస్త్రవేత్తలు సేకరించిన నమూనాల్లో రయోలైట్స్ అనే ప్రత్యేకమైన రాళ్లు ఉన్నాయి. ఈ రాళ్లు అందులో లావా ఇంకా ఉందనేందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. లావా ఎగజిమ్మితే సల్ఫర్ డయాక్సైడ్తో కూడిన బూడిద కొన్ని కిలోమీటర్ల ఎత్తుకు చేరుతుంది. ఫలితంగా ధూళి మేఘాలు ఏర్పడి కొంతకాలం సూర్యుడి వెలుగు భూమిని చేరకుండా పోతుంది. దీంతో కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోతాయి. సముద్రపు అడుగున జరిగే ప్రక్రియ కాబట్టి సునామీ వచ్చి అమెరికా తీరాన్ని తాకుతుందని అంచనా. కికాయి అగ్నిపర్వతాన్ని మరింత అధ్యయనం చేయడం ద్వారా విస్ఫోటనం జరిగే సమయాన్ని అంచనా వేసేందుకు జపాన్ శాస్త్రవేత్తలు యత్నిస్తున్నారు. నిదర్శనాలేంటి? కికాయి అగ్నిపర్వతంలోని లావా మళ్లీ క్రియాశీలమైందని శాస్త్రవేత్తలు వేసిన అంచనాలు నిజమే అనేందుకు ఇప్పటికే కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి. రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో చిన్న చిన్న అగ్నిపర్వతాలు పేలిపోతుండటమే కాకుండా.. ఊహించని రీతిలో వరుస భూకంపాలు వస్తున్నాయి. ఇండోనేసియా నుంచి మొదలుకుని ఫిలిప్పీన్స్, జపాన్, ఉత్తర, దక్షిణ అమెరికా పశ్చిమ తీరప్రాంతం మొత్తాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. ప్రపంచంలోనే అత్యధిక అగ్నిపర్వతాలు ఉన్న ప్రాంతం ఇదే. టెక్టానిక్ ప్లేట్ల క్రియాశీలత కారణంగా ఇక్కడ భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి. అమెరికా తీరంలోని సెయింట్ ఆండ్రియాస్ ఫాల్ట్ వద్ద కూడా ఓ భారీ భూకంపం ఎప్పుడైనా రావచ్చని అంచనాలు చాలాకాలంగా ఉన్నాయి. -
ఎయిర్టెల్ నుంచి మరో 4జీ స్మార్ట్‌ఫోన్
జియోకు కౌంటర్‌గా కార్బన్ భాగస్వామ్యంలో ఏ40 4జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసిన టెలికాం దిగ్గజం ఎయిర్టెల్, మరో స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌కు సిద్ధమైంది. లావాతో చేతులు కలిపి మరో 4జీ వాయిస్ఓవర్ ఎల్టీఈ డివైజ్‌ను తీసుకొస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ డివైజ్‌కు ఏం పేరు పెడుతున్నారో ఇంకా తెలియరాలేదు. కానీ త్వరలోనే ఈ రెండింటి భాగస్వామ్యంలో మాత్రం ఓ 4జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతున్నట్టు వెల్లడైంది. కార్బన్ ఏ40 ఇండియన్‌తో పోలిస్తే కొన్ని స్పెషిఫికేషన్లు, ధరలో మాత్రమే తేడా ఉండనుందట. కార్బన్ ఏ40 ఇండియన్ మాదిరిగా భారీ మొత్తంలో డేటా, వాయిస్ ప్రయోజనాలతోనే ఈ ఎయిర్టెల్-లావా ఫోన్ వస్తుందని తెలుస్తోంది. దీని ధర రూ.1,699గా ఉండబోతుందని వెల్లడవుతోంది. జియోకు పోటీగా ఎయిర్టెల్ తీసుకొచ్చిన తొలి స్మార్ట్‌ఫోన్ ఖరీదు 1,399 రూపాయలు. లావా ఫోన్ వ్యూహం కూడా కార్బన్ ఏ40 ఇండియన్ మాదిరిదేనట. ఈ ఫోన్‌ను కొనుగోలు చేయడానికి తొలుత వినియోగదారులు రూ.3,500 చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం కంపెనీ రూ.1,801ను క్యాష్‌బ్యాక్‌గా అందిస్తుంది. అంటే ఎయిర్టెల్-లావా ఫోన్ అందుబాటులోకి వచ్చేది 1,699 రూపాయలకే. అయితే రూ.1,801ను కంపెనీ ఎలా రీఫండ్ చేస్తుందో ఇంకా స్పష్టత లేదు. 4.5 అంగుళాల లేదా 5 అంగుళాల డిస్ప్లేను ఈ ఫోన్ కలిగి ఉండబోతుందని మాత్రమే తెలిసింది. అయితే ఇటు ఎయిర్టెల్ కానీ, అటు లావా కానీ ఈ డివైజ్‌పై ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. -
లావా జెడ్ సిరీస్‌లో నాలుగు కొత్త ఫోన్లు
న్యూఢిల్లీ: లావా ఇంటర్నేషనల్ తాజాగా తమ జెడ్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్స్ శ్రేణిని ఆవిష్కరించింది. జెడ్60, జెడ్70, జెడ్80, జెడ్90 వంటి నాలుగు ఫోన్లు దీన్లో ఉన్నాయి. వీటి ధర రూ. 5,500 నుంచి రూ. 10,750 దాకా ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్స్తో పాటు కంపెనీ మనీ బ్యాక్ చాలెంజ్‌ను కూడా ప్రకటించింది. ఈ ఆఫర్ కింద ఫోన్ కొనుక్కున్న కస్టమర్లు.. ఏ కారణం చేతనైనా అది నచ్చకపోయిన పక్షంలో 30 రోజు ల్లోగా వాపసు చేసి, తాము చెల్లించిన సొమ్మును వెనక్కి పొందవచ్చు. అక్టోబర్ 1 నుంచి డిసెంబ ర్ 31 దాకా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుం దని లావా ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ విభాగ వైస్ ప్రెసిడెంట్ దీపక్ మహాజన్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సునీల్ రైనా తెలియజేశారు. -
బీఎస్ఎన్ఎల్ ఫీచర్ ఫోన్.. ధరెంత?
సాక్షి, న్యూఢిల్లీ : రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ ప్రకటనాంతరం టెలికాం దిగ్గజాలు ఒక్కోటి ఫోన్ల మార్కెట్‌పై దృష్టిసారిస్తున్నాయి. ఇటీవలే జియోఫోన్‌కు పోటీగా ఎయిర్టెల్ రూ.2500కు స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టనున్నట్టు తెలుపగా... తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ కూడా ఫీచర్ ఫోన్లను లాంచ్ చేయబోతుందట. దీనికోసం దేశీయ మొబైల్ డివైజ్ తయారీదారులు లావా, మైక్రోమ్యాక్స్‌లతో కూడా బీఎస్ఎన్ఎల్ ఒప్పందం కుదుర్చుకుందని తెలిసింది. 2000 రూపాయల ధరలో, అన్ని ఉచిత ఆఫర్లతో అక్టోబర్‌లో కో-బ్రాండెడ్ ఫీచర్ ఫోన్లను బీఎస్ఎన్ఎల్ ఆవిష్కరించబోతుందని వెల్లడైంది. లావా, మైక్రోమ్యాక్స్ వంటి డివైజ్ తయారీదారులతో కలిసి సొంత మోడల్లో కో-బ్రాండెడ్ ఫీచర్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురాబోతున్నామని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ అనుపమ శ్రీవాస్తవ చెప్పారు. ఈ ఫోన్లు మార్కెట్లో ఉన్న ప్రస్తుత వాయిస్ ప్యాకేజీల కంటే ఎక్కువ మొత్తంలో అందిస్తాయన్నారు. ఉచిత వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని కూడా అందించబోతున్నట్టు తెలిపారు. ఈ డివైజ్ ధర కూడా 2000 రూపాయలు.. బీఎస్ఎన్ఎల్ 10.5 కోట్ల సబ్స్క్రైబర్లకు ఎక్స్‌క్లూజివ్‌గా ఈ రెండు కంపెనీలు కో-బ్రాండెడ్ డివైజ్‌లను రూపొందిస్తున్నాయి. దీంతో దీపావళి పండుగ కంటే ముందస్తుగానే ఫీచర్ ఫోన్ మార్కెట్ పూర్తిగా కుదుపులకు లోనుకానున్నట్టు తెలుస్తోంది. ఓ వైపు జియో ఫోన్, మరోవైపు బీఎస్ఎన్ఎల్ కో-బ్రాండెడ్ ఫీచర్ ఫోన్లు.. వీటితో తీవ్ర పోటీ నెలకొనబోతుంది. ఫీచర్‌ఫోన్ల ద్వారా వస్తున్న రెవెన్యూలు 15 శాతం ఉండగా.. ఈ డివైజ్‌లు మార్కెట్లో 50 శాతం స్థానాన్ని ఆక్రమించుకుని ఉన్నాయి. ఇటీవల వెల్లడైన రిపోర్టుల ప్రకారం 85 శాతం ఫీచర్ ఫోన్ వినియోగదారులు స్మార్ట్ఫోన్లలోకి మారడానికి సిద్ధంగా లేనట్టు తెలిసింది. బీఎస్ఎన్ఎల్ ఫీచర్ ఫోన్ లాంచింగ్‌పై లావా కానీ, మైక్రోమ్యాక్స్ కానీ స్పందించలేదు. -
స్మార్ట్‌ఫోన్, ఫీచర్ ఫోన్లపై లావా బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ కంపెనీ లావా, తన అన్ని మేజర్ మోడల్స్‌పై రెండేళ్ల వారెంటీని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న తన పోర్ట్‌ఫోలియోలోని స్మార్ట్ఫోన్లు, ఫీచర్ ఫోన్లపై ఈ వారెంటీ అందిస్తానని లావా పేర్కొంది. భవిష్యత్తులో లాంచ్ చేయబోయే అన్ని మోడల్స్‌కు ఈ రెండేళ్ల వారెంటీ ఉంటుందని తెలిపింది. భారత మొబైల్ హ్యాండ్సెట్ ఇండస్ట్రీలో ఈ విధంగా వారెంటీ ఆఫర్‌ను ప్రకటించడం ఇదే మొదటిసారి. ఆగస్టు 26 తర్వాత కొనుగోలు చేసిన హ్యాండ్సెట్లకు రెండేళ్ల వారెంటీ యాక్టివేట్ అవుతుంది. యాక్ససరీస్‌పై కూడా ఆరు నెలల ప్రామాణికమైన వారెంటీ క్లాష్ ఉంటుంది. టచ్ ప్యానల్ లేదా ఎల్సీడీ డిస్ప్లేకు ఏడాది పాటు ఈ వారెంటీ కొనసాగుతుంది. ఈ సమయం తమకు ఎంతో అద్భుతమైన క్షణాలని, దేశీయ మొబైల్ హ్యాండ్సెట్ ఇండస్ట్రిలో తమ బలాన్ని మరింత పెంచుకుంటున్నామని రెండేళ్ల వారెంటీ స్కీమ్ లాంచ్ సందర్భంగా లావా ఇంటర్నేషనల్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ గౌరవ్ నిగమ్ చెప్పారు. తన పోర్ట్‌ఫోలియో డివైజ్‌లకు రెండేళ్ల వారెంటీని ప్రకటిస్తున్నామని, దేశీయ మొబైల్ ఫోన్ బ్రాండులో ఇలా ఆఫర్ చేయడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. తమ ఉత్పత్తిని అభివృద్ధి చేసే ప్రతి స్టేజీలో క్వాలిటీ కంట్రోల్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తామని నిగమ్ తెలిపారు. -
లావా తొలి ల్యాప్‌ట్యాప్..ధరెంతో తెలుసా?
మొబైల్, టాబ్లెట్ల తయారీలో దేశీయంగా ఎంతో పేరు సంపాదించుకున్న లావా తన మొట్టమొదటి ల్యాప్‌ట్యాప్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మైక్రోసాఫ్ట్, ఇంటెల్ భాగస్వామ్యంతో తన తొలి ల్యాప్‌ట్యాప్ హీలియం 14ను రూపొందించింది. ఎంతో తేలికైనదిగా రూపొందించిన ఈ ల్యాప్‌ట్యాప్ ధర రూ.14,999గా కంపెనీ పేర్కొంది. హీలియం 14 ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంపికచేసిన రిటైల్ స్టోర్లు, ఢిల్లీ ఎన్సీఆర్, కోయంబత్తూరు, హైదరాబాద్, బెంగళూరుల మల్టి-బ్రాండు అవుట్ లెట్లలో జూలై తొలివారం నుంచి విక్రయానికి తీసుకురానున్నట్టు కంపెనీ పేర్కొంది. లావా హీలియం 14 పేరు ప్రకారమే 14.1 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లేను కలిగి ఉంది. విండోస్ 10 హోమ్ ఎడిషన్ దీనిలో ప్రీలోడెడ్‌గా వస్తోంది. ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్‌ను ఇది అందిస్తోంది. 2జీబీ ర్యామ్, 32జీబీ బిల్ట్-ఇన్ స్టోరేజ్‌తో వచ్చిన ఈ ల్యాపీలో ఎస్డీ కార్డు ద్వారా 128జీబీ వరకు విస్తరణ మెమరీకి అవకాశముంది. రోజంతా వాడుకోవడానికి వీలుగా 10,000ఎంఏహెచ్ బ్యాటరీని ఇది అందిస్తోంది. ఈ ల్యాపీ 1.4కేజీల బరువు కలిగిఉంది. సిల్వర్, పర్పుల్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది. డిజిటల్ ఇండియాలో భాగస్వాములుగా చేయడానికి సరసమైన ధరలో పర్సనల్ కంప్యూటింగ్ డివైజ్‌లను తమ పార్టనర్స్‌తో కలిసి అభివృద్ధి చేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ ఇండియా కన్జ్యూమర్ అండ్ డివైజెస్ సేల్స్ దేశీయ జనరల్ మేనేజర్ ప్రియదర్శి మోహపాత్ర చెప్పారు. లావాతో కలిసి వీటిని రూపొందించడం చాలా ఆనందంగా ఉందన్నారు. -
లావా కొత్త ప్రీమియం స్మార్ట్ ఫోన్లు లాంచ్
ప్రముఖ దేశీయ మొబైల్‌మేకర్ లావా రెండు కొత్త ప్రీమియం స్మార్ట్ ఫోన్లను లంచ్ చేసింది. జెడ్ సీరిస్‌లో జెడ్ 25, జెడ్10 పేరుతో రెండు మొబైల్స్‌ను బుధవారం విడుదల చేసింది. తద్వారా మిడ్ సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్ కేటగిరీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఢిల్లీలోని ఎంపిక చేసిన షాపుల్లో మార్చి 23ని విక్రయానికి పెడుతున్నట్టు కంపెనీ తెలిపింది. వీటి ధరలను వరుసగా రూ .18,000, రూ 11,500గా కంపెనీ నిర్ణయించింది. అలాగే ఒక సంవత్సరం తయారీదారు వారంటీతోపాటు 6నెలల ఇన్ బాక్స్ యాక్ససరీస్ వారంటీ ఇస్తోంది.అలాగే 30రోజుల్లో రీప్లేస్మెంట్ చేసుకునే సదుపాయం కూడా కల్పించింది. గత ఏడు సంవత్సరాలుగా తమ నూతన ఆవిష్కరణకు పరిశోధకనకు, జెడ్ సిరీస్ స్మార్ట్ ఫోన్లు నిదర్శమని లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రొడక్షన్ హెడ్ గౌరవ నిగమ్ తెలిపారు లావా జెడ్ 25 ఫీచర్స్ 5.5-అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 6.0 మార్షమల్లౌ 4జీబీర్యామ్ 16జీబీ స్టోరేజ్ 13ఎంపీవెనుక కెమెరా 8ఎంపీ ఫ్రంట్ కెమెరా 3020 ఎంఏహెచ్ బ్యాటరీ గ్రే అండ్ గోల్డ్ కలర్స్‌లో లభ్యం. లావా జెడ్ 10 ఫీచర్స్ 5 అంగుళాల స్క్రీన్ ఆండ్రాయిడ్ 6.0 మార్షమల్లౌ 8ఎంపీవెనుక కెమెరా విత స్పాట్లైట్ ఫ్లాష్ 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 2జీబీర్యామ్ 16జీబీ స్టోరేజ్ 2620ఎంఏహెచ్ బ్యాటరీ గోల్డ్ కలర్ లో అందుబాటులో ఉంది. -
150 ఏళ్లకు ఎగసిన లావా
పణజీ: దాదాపు 150 సంవత్సరాలుగా నిద్రాణ స్థితిలో ఉన్న ‘బ్యారెన్ ఐలాండ్’అగ్నిపర్వతం తాజాగా తిరిగి లావాను వెదజల్లుతోందని పరిశోధకులు శుక్రవారం చెప్పారు. మన దేశంలో ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న అగ్ని పర్వతం ఇదొక్కటే. అండమాన్ నికోబార్ దీవుల్లో, రాజధాని పోర్ట్ బ్లెయిర్‌కు 140 కి.మీ దూరంలో ఉంటుంది. 1991 నుంచే అప్పుడప్పుడు ఈ అగ్నిపర్వతం నుంచి లావా, బూడిద వచ్చేవి. గోవాలోని జాతీయ సముద్ర విజ్ఞాన సంస్థ (ఎన్ ఐఓ)లో పనిచేసే పరిశోధకుల బృందం ఈ ఏడాది జనవరి 23న అండమాన్ తీరంలోని సముద్ర మట్టిని సేకరించేందుకు అగ్ని పర్వతం వద్దకు వెళ్లింది. ఆ సమయంలో బూడిద వెలువడుతుండటం చూసి పరిశోధకులు పర్వతానికి దూరంగా వచ్చి గమనించారు. అగ్నిపర్వతం విడతల వారీగా లావాను వెదజల్లుతోందనీ, ప్రతిసారీ 5 నుంచి 10 నిమిషాల పాటు లావాను బయటకు చిమ్ముతోందని పరిశోధకులు గుర్తించారు. జనవరి 26న ఇదే సంస్థకు చెందిన మరో బృందం అక్కడకు వెళ్లినప్పుడు కూడా బూడిద వెలువడింది. పగటి సమయంలో కేవలం బూడిద మాత్రమే కనపడగా, చీకటి పడ్డాక చూస్తే ఎర్రటి లావా కూడా వస్తున్నట్లు స్పష్టమైంది. అగ్ని పర్వత బిలం వద్ద పొగ మేఘాలు కమ్ముకున్నాయి. -
భారత్‌లో నిప్పులు కురిపిస్తున్న వాల్కెనో
పనాజీ: భారత్‌లో ఉన్న ఏకైక వాల్కెనో 150 ఏళ్ల తర్వాత మేల్కొంది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న బారెన్ ఐలాండ్ వాల్కెనో విస్ఫోటనం చెందినట్లు గోవాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ(ఎన్ఐఓ) శుక్రవారం పేర్కొంది. చివరగా 1991లో లావాను బయటకు చిమ్మినట్లు తెలిపింది. ప్రస్తుతం వాల్కెనో నుంచి పెద్ద ఎత్తున పొగలు, లావా బయటకు వస్తున్నట్లు చెప్పింది. గత నెల 23వ తేదీన బారెన్ అగ్నిపర్వతాన్ని పరిశీలించడానికి శాస్త్రవేత్తలు వెళ్లగా.. ఒక్కసారిగా పొగలు బయటకు చిమ్మడం ప్రారంభమైనట్లు తెలిపింది. పగటి సమయంలో కేవలం పొగ మబ్బులను గమనించిన శాస్త్రవేత్తల బృందానికి రాత్రి సమయంలో పెద్ద సైజులో ఎర్రటి లావా ముద్దలు వెలువడుతున్నట్లు గుర్తించారు. -
లావా కొత్త ఫోన్ @రూ.4,599
న్యూఢిల్లీ: దేశీ మొబైల్ తయారీ కంపెనీ ‘లావా’ తాజాగా ‘ఏ68’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.4,599. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 3జీ, 4.5 అంగుళాల స్క్రీన్, 1.2 గిగాహెర్జ్ట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ, 5 ఎంపీ రియర్ కెమెరా, 1,750 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ వివరించింది. ఆసస్ నుంచి ‘జెన్‌ఫోన్ సెల్ఫీ’ కొత్త వెర్షన్ -
తిరుపతిలో లావా మొబైల్ ప్లాంట్
చెన్నై: మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ ‘లావా’.. తమ ప్లాంట్‌ను తిరుపతిలో ఏర్పాటు చేయనున్నది. ఏపీలోని తిరుపతిలో 20 ఎకరాల్లో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ల్యూక్ ప్రకాశ్ వెల్లడించారు. ఈ ప్లాంట్ ఏర్పాటైతే దక్షిణాదిన ఇదే తమకు తొలి ప్లాంట్ అవుతుందని వివరించారు. తిరుపతితో పాటు యమున ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో కూడా మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ ప్లాంట్ల ఏర్పాటు కోసం రూ.2,615 కోట్ల పెట్టుడులు కేటాయించామని పేర్కొన్నారు. -
హైదరాబాద్ లో లావా మొబైల్స్ పరిశోధన కేంద్రం..
♦ తిరుపతి ప్లాంటు 2018కల్లా రెడీ ♦ లావా వైస్ ప్రెసిడెంట్ సందీప్ డోంగ్రె హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల విక్రయంలో ఉన్న లావా ఇంటర్నేషనల్ సంస్థ హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని(ఆర్అండ్డీ) ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. చర్చలు పురోగతిలో ఉన్నాయని, ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని లావా వైస్ ప్రెసిడెంట్ సందీప్ డోంగ్రె గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ప్రతిపాదిత కేంద్రంలో 200 మందిని నియమిస్తామని చెప్పారు. ఇప్పటికే కంపెనీకి బెంగళూరులో 400 మందితో కూడిన ఆర్అండ్డీ సెంటర్ ఉంది. వచ్చే మూడేళ్లలో పరిశోధన, అభివృద్ధిపై రూ.200 కోట్లు ఖర్చు చేస్తామని ఆయన చెప్పారు. ఇక 4జీ విషయానికి వస్తే ప్రస్తుతం నాలుగు మోడళ్లు ప్రవేశపెట్టామన్నారు. వచ్చే త్రైమాసికంలో మరో మూడు మోడళ్లు రానున్నాయని వివరించారు. విక్రయాల పరంగా 70 శాతం వాటా ఫీచర్ ఫోన్లదేనని ఆయన చెప్పారు. నెలకు 50 లక్షల యూనిట్లు.. లావా ఇంటర్నేషనల్‌కు నోయిడాలో మొబైల్స్ తయారీ ప్లాంటు ఉంది. దీని సామర్థ్యం నెలకు 25 లక్షల యూనిట్లు. నోయిడాలో మరో ప్లాంటును కంపెనీ నెలకొల్పుతోంది. అలాగే తిరుపతి వద్ద 20 ఎకరాల్లో రూ.500 కోట్లతో ప్లాంటు రాబోతోంది. ఈ రెండు ప్లాంట్లలో 2018లో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని సందీప్ తెలిపారు. మూడేళ్లలో కంపెనీ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం నెలకు 50 లక్షల యూనిట్లకు చేరుతుందని చెప్పారు. దేశీయంగా లావా నెలకు 20 లక్షల మొబైల్ ఫోన్లను విక్రయిస్తోంది. 10.5 శాతం మార్కెట్ వాటాతో భారత్‌లో నాల్గవ స్థానంలో ఉంది. ఇండియన్ బ్రాండ్స్‌లో రెండో స్థానంలో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. -
లావా కొత్త 4జీ స్మార్ట్ ఫోన్ ‘వి5’
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘లావా’ తాజాగా ‘వి5’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.11,499. ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4జీ, 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 5.5 అంగుళాల తెర, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 3 జీబీ ర్యామ్, 13 రియర్ ఎంపీ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. కంపెనీ ప్రస్తుత త్రైమాసికంలో 7-8 కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్స్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. -
తిరుపతి ప్లాంటుకు రూ.500 కోట్లు: లావా
నెలకు 50 లక్షల ఫోన్ల ఉత్పత్తి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హ్యాండ్సెట్ల తయారీ రంగంలో ఉన్న లావా మొబైల్స్ తిరుపతి మొబైల్స్ హబ్‌లో ఏర్పాటు చేస్తున్న ప్లాంటుకు రూ.500 కోట్లు పెట్టుబడి చేయనుంది. 2017 నాటికి ప్లాం టులో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. 20 ఎకరాల్లో రానున్న ఈ ప్లాంటు పూర్తిగా సిద్ధమైతే నెలకు 50 లక్షల ఫోన్లను ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యమని లావా ఇంటర్నేషనల్ చీఫ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫీసర్ సంజీవ్ అగర్వాల్ వెల్లడించారు. తమ ప్లాంటు ద్వారా 12,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. రానున్న రోజుల్లో భారత్‌లో పూర్తి తయారీ వ్యవస్థను అభివృద్ధి చేస్తామని, స్థానికంగా విడిభాగాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తామన్నారు. తిరుపతి సమీపంలో రేణిగుంట విమానాశ్రయం వద్ద ఏర్పాటవుతున్న శ్రీవెంకటేశ్వర మొబైల్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ దసరా రోజున శంకుస్థాపన చేశారు. 2022కి రూ.2,615 కోట్లు.. ఆరు నెలల క్రితం కార్యకలాపాలు ప్రారంభమైన లావాకు చెందిన నోయిడా ప్లాంటు సామర్థ్యం నెలకు 10 లక్షల యూనిట్లు ఉంది. ఈ ప్లాంటులో తయారీ వ్యయం చైనా స్థాయిలోనే ఉందని సంజీవ్ వెల్లడించారు. భారత్‌లో రెండు తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు 2022 నాటికి రూ.2,615 కోట్లు ఖర్చు చేస్తామని జూలైలో లావా సీఎండీ హరి ఓం రాయ్ ప్రకటించారు. కొంత మొత్తం ఆర్‌అండ్‌డీకి వెచ్చిస్తామన్నారు. ఈ ప్లాంట్లు పూర్తి అయితే సంస్థ తయారీ సామర్థ్యం మొత్తం నెలకు 1.8 కోట్ల యూనిట్లకు చేరుతుంది. -
ఏపీలో లావా మొబైల్ అసెంబ్లింగ్ యూనిట్?
న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ లావా రూ.250 కోట్ల పెట్టుబడి అంచనాతో దేశంలో ఒక మొబైల్ అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీని కోసం ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నామని లావా ఇంటర్నేషనల్ డెరైక్టర్ విశాల్ సెహగల్ తెలిపారు. లావాకు ప్రస్తుతం నోయిడాలో ఒక అసెంబ్లింగ్ యూనిట్ ఉంది. జోలో ‘బ్లాక్’ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణ: లావా కంపెనీ తన జోలో సిరీస్‌లోనే ‘బ్లాక్’ అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.12,999. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.5 అంగుళాల తెర, 13 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 4జీ, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 3,200 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్మార్ట్ఫోన్లు కేవలం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని విశాల్ సెహగల్ చెప్పారు. -
1,650 డిగ్రీలంటే మాడిపోవడమే...
ఇదేదో సినిమాల్లోని గ్రాఫిక్ సీన్ కాదు... అచ్చంగా నిజమైనదే.. 1,650 డిగ్రీల ఉష్ణోగ్రతతో సూరీడులా భగభఘ మండుతున్న లావాకు ఇంత దగ్గరగా వెళ్లడమంటే మాటలు కాదు మరీ. అయితే...అమెరికాలోని జార్జియాకు చెందిన ఫిల్మ్ మేకర్, సాహసికుడు శామ్ క్రాస్‌మన్ బృందం ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో సూక్ష్మ జీవులు ఎలా మనుగడ సాగిస్తాయనే అంశంపై పరిశోధనలో భాగంగా మారూమ్ అగ్నిపర్వత జలంలో ఉన్న లావా సరస్సుకు సమీపంలోకి వెళ్లాలని ఈ బృందం నిర్ణయించింది. ప్రపంచంలో లావా సరస్సులు ఏడే ఉన్నాయి. అందులో వాన్వాట్ దేశంలో ఉన్న ఈ లావా సరస్సు కూడా ఒకటి. అయితే..సరస్సు వద్దకు వెళ్లడమంటే ప్రాణాలకు తెగించడమే. 45 డిగ్రీలంటేనే మనం అల్లాడుతాం. అలాంటిది 1,650 డిగ్రీలంటే మాడిపోవడమే. ఆమ్ల వర్షాలతో పాటు, విష వాయువులు వెలువడటం ఇక్కడ మామూలే. దీనికితోడు తమ ప్రాజెక్టు కోసం ఫోటోలు తీయడమంటే అసాధ్యమే. అయితే..ఫోటోలు, వీడియో చిత్రీకరణ కోసం వారు డ్రోన్లను వాడారు. అత్యంత వేడిని తట్టుకునేలా రూపొందించిన ప్రత్యేక సూట్లను ధరించారు. -
లావా మేక్ ఇన్ ఇండియా ఫోన్..
‘సాక్షి’ ఇంటర్వ్యూ : లావా సీఎండీ హరి ఓమ్ రాయ్ మార్చికల్లా తొలి ఉత్పాదన ⇒ నోయిడా యూనిట్లో అసెంబ్లింగ్ ⇒ {పోత్సహిస్తే తెలుగు రాష్ట్రంలో ప్లాంట్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ ‘మేక్ ఇన్ ఇండియా’ బాట పట్టింది. 2015 మార్చికల్లా లావా మేక్ ఇన్ ఇండియా తొలి ఉత్పాదన మార్కెట్లోకి రానుంది. నోయిడాలోని రిపేరింగ్ కేంద్రంలో తొలుత మొబైల్ ఫోన్లను అసెంబ్లింగ్ చేస్తారు. ప్రస్తుతం చైనాలోని షెన్జెన్లో ఉన్న సొంత ప్లాంటు నుంచి భారత్‌కు లావా, జోలో బ్రాండ్లలో వివిధ మోడళ్లను దిగుమతి చేస్తోంది. 100 శాతం భారత్‌లో తయారైన మొబైల్ రావడానికి నాలుగేళ్లు పడుతుందని లావా ఇంటర్నేషనల్ సీఎండీ హరి ఓమ్ రాయ్ తెలిపారు. ఐరిస్ ఫ్యూయెల్ 60 మోడల్ ఆవిష్కరణ కార్యక్రమానికి మంగళవారం ఢిల్లీ వెళ్లిన సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. విశేషాలు ఆయన మాటల్లోనే.. తయారీ కేంద్రంగా భారత్.. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ పరిమాణం 1.8 ట్రిలియన్ డాలర్లు. ఇందులో చైనాలో తయారవుతున్న ఎలక్ట్రానిక్స్ విలువ 1 ట్రిలియన్ డాలర్లు. ఇప్పుడు ైచె నీయులు కార్మికులుగా పనిచేసేందుకు ఇష్టపడడం లేదు. ఇదే మనకు కలసి వచ్చే అంశం. భారత్‌లోని యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తే చాలు. తయారీ రంగంలో ఆస్తులుగా రూపొందుతారు. 10-15 ఏళ్లలో ప్రపంచ ఎలక్ట్రానిక్స్ అవసరాల్లో 40 శాతం మేర ఉత్పత్తి చేయగలిగేంతగా భారత్‌లో అవకాశాలున్నాయి. ఇక్కడ దృష్టి సారించేందుకు కంపెనీలకు సరైన సమయమిది. ఈ విషయంలో భారతీయ కంపెనీగా మేం ముందడుగు వేస్తున్నాం. ఎక్కువ ప్రోత్సాహకాలిస్తే.. ప్రత్యేక మోడల్ మేక్ ఇన్ ఇండియా ట్యాగ్‌తో మార్చిలో వస్తోంది. ఈ మోడల్‌కు కావాల్సిన కొన్ని విడిభాగాలను దేశంలో తయారు చేస్తాం. ఇక ప్లాంటు విషయానికి వస్తే ఉత్తరాదితోపాటు దక్షిణాది రాష్ట్రాలనూ పరిశీలిస్తున్నాం. ఎక్కువ ప్రోత్సాహకాలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక రాష్ట్రంలో ప్లాంటు పెట్టేందుకు మేం సిద్ధం. ప్రతిపాదిత ప్లాంటుకై మూడేళ్లలో రూ.500 కోట్లు వెచ్చిస్తాం. నెలకు 50 లక్షల మొబైల్ ఫోన్ల తయారీ సామర్థ్యంతో ఈ ప్లాంట్ రానుంది. 2018 నాటికి మొబైల్స్‌ను పూర్తిగా భారత్‌లో తయారు చేస్తాం. ఫిబ్రవరిలో ఆన్‌డ్రాయిడ్ వన్.. ఆన్‌డ్రాయిడ్ వన్ ఫోన్ తయారీలోకి లావా కూడా వస్తోంది. మార్కెట్లో ఉన్న వన్ ఫోన్లతో పోలిస్తే మరిన్ని ఫీచర్లతో ఇది రానుంది. లావా ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు పెద్ద ఎత్తున ఫ్రాంచైజీ విధానంలో ఏర్పాటు చేస్తున్నాం. భారత్‌తోపాటు నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, రష్యా, థాయ్‌లాండ్ తదితర దేశాల్లో నెలకు 30 లక్షల ఫోన్లను విక్రయిస్తున్నాం. థాయ్‌లాండ్‌లో నెలకు సుమారు 4 లక్షల మొబైల్ పీసులు విక్రయిస్తూ రెండో స్థానంలో ఉన్నాం. 2013-14లో లావా ఇంటర్నేషనల్ రూ.2,909 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6,000 కోట్ల మార్కును దాటుతాం. భారత స్మార్ట్ఫోన్ల మార్కెట్లో లావాకు 8 శాతం వాటా ఉంది. -
లావా ప్రవాహంతో ఇల్లు బుగ్గి...
అమెరికాలోని హావాయి దీవిలో జూన్ 26న బద్దలైన కెలియా అగ్నిపర్వతం నుంచి నెమ్మదిగా దిగువకు ప్రవహిస్తున్న లావా సోమవారం మధ్యాహ్నం ఓ ఇంటిని ఇలా దహించివేసింది. పహోవా గ్రామంలోని ఈ ఇల్లు నిమిషాల వ్యవధిలోనే బూడిదైపోయింది. అగ్నిపర్వతం నుంచి నెమ్మదిగా ప్రవహిస్తున్న లావా అక్టోబర్ 26న ఓ రోడ్డును దాటుకుని ఈ గ్రామ సమీపంలోకి చేరి సోమవారం ఇలా తొలి ఇంటిని బూడిద చేసింది. స్థానికులను సురక్షిత ప్రాంతానికి తరలించడంతో పాటు ఇతర ఇళ్లకు లావా చేరకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. -
కొత్త సరకు
లావా మాగ్నమ్ ఫ్యాబ్లెట్... దేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కిట్‌క్యాట్‌తో పనిచేసే సరికొత్త ఫ్యాబ్లెట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆరు అంగుళాల స్క్రీన్ సైజుగల ఈ ఎక్స్604 1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌పై నడుస్తుంది. కిట్‌క్యాట్ అతితక్కువ మెమరీని ఉపయోగించుకుంటుంది కాబట్టి ప్రాసెసర్ వేగం మరింత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒక గిగబైట్ ర్యామ్, 8 జీబీల మెమరీ ఉన్న ఈ ఫ్లాబ్లెట్లో బీఎస్ఐ సెన్సర్‌తో కూడిన 8 ఎంపీ ప్రధాన కెమెరా ఉంది. వీడియో కాలింగ్ కోసం రెండు ఎంపీల కెమెరాను వాడారు. కేవలం 8.9 మిల్లీమీటర్ల మందం, 210 గ్రాముల బరువు ఎక్స్604 ప్రత్యేకతలు. 2800 ఎంఏహెచ్ బ్యాటరీతో ఎనిమిది గంటల టాక్‌టైమ్, 200 గంటల స్టాండ్‌బై టైమ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. తెలుపు, నలుపు రంగుల్లో లభించే ఈ ఫ్యాబ్లెట్ ఖరీదు రూ.11,999. 36.3 ఎంపీ రెజల్యూషన్‌తో నికాన్ డీ810 స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత కెమెరాలతో పనిలేకుండా పోయింది. కానీ చిత్రాల్లో స్పష్టత, రకరకాల పరిస్థితుల్లో ఫొటోలు తీసుకోవాలంటే మాత్రం పూర్తిస్థాయి కెమెరాలను వాడాల్సిందే. ఈ నేపథ్యంలో అటు ఫొటోగ్రఫీ వృత్తిలో ఉన్నవారికి, ఇటు ఔత్సాహికులకూ ఉపయోగపడేలా నికాన్ కంపెనీ సరికొత్త డీఎస్ఎల్ఆర్ కెమెరా ఒకదాన్ని విడుదల చేసింది. డీ810 అని పిలుస్తున్న ఈ కొత్త కెమెరా రెజల్యూషన్ 36.3 ఎంపీ కావడం విశేషం. ఫుల్ హెచ్డీ క్వాలిటీతో వీడియోలు తీసుకోగలగడం మరో ప్రత్యేకత. ఈ వీడియో కెమెరా ఏకంగా సెకనుకు 60 ఫ్రేమ్‌లు రికార్డు చేయగలదు. డీ810 ఎఫ్ఎక్స్ అంటే ఫుల్ ఫ్రేమ్ ఫార్మాట్లో పనిచేస్తుంది కాబట్టి ఫొటోలను ఎంతగా ఎన్లార్జ్ చేసినప్పటికీ చిత్ర నాణ్యత తగ్గదు. హెచ్డీఎంఐ ఔట్పుట్ ద్వారా వీడియోలు, ఫొటోలను కెమెరాలో కాకుండా ఇతర మాధ్యమాల్లో నేరుగా స్టోర్ చేసుకోవచ్చు. అత్యాధునిక నికార్ లెన్సులు, ఎక్స్స్పీడ్ 4 ఇమేజ్ ప్రాసెసింగ్ ఇంజిన్ల ద్వారా చిత్ర నాణ్యతను పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కంపెనీ చెబుతోంది. -
కొత్త సరుకు
ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్‌తో ఎల్జీ ఎల్80 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తాజా వెర్షన్ కిట్‌క్యాట్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌ను ఎల్జీ కంపెనీ ఎల్80 పేరుతో ఇటీవల మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మధ్యమశ్రేణి ఫీచర్లతో కూడిన ఈ ఫోన్ ధర రూ.13,100 వరకూ ఉండవచ్చునని అంచనా. ఎల్జీ ఇండొనేషియా ఫేస్బుక్, ట్విట్టర్ల ద్వారా ఎల్80 రాకను తెలియజేయగా దీంట్లో సింగిల్ సిమ్, డబుల్ సిమ్ వేరియంట్లు రెండూ ఉంటాయని తెలిపింది. ఎల్80లో 1.2 గిగాహెర్ట్జ్ డ్యుయెల్‌కోర్ క్వాల్కామ్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. స్క్రీన్‌సైజు దాదాపు 5 అంగుళాలు. ఇక మెమరీ విషయానికొస్తే దీంట్లో ఒక గిగాబైట్ ర్యామ్, 4 గిగాబైట్ల ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. మైక్రోఎస్డీ కార్డు ఉపయోగించే వీలుంది కాబట్టి మెమరీని మరింత పెంచుకోవచ్చు. అయిదు మెగాపిక్సెళ్ల ప్రధాన కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, వీజీఏ ఫ్రంట్ కెమెరా దీంట్లో ఏర్పాటు చేశారు. త్రీజీ, బ్లూటూత్ 4.0, ఎఫ్ఎం రేడియో, జీపీఎస్, వైఫై వంటి అదనపు హంగులున్న ఎల్జీ ఎల్80లో 2540 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 2 కలర్స్... దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ రంగు రంగుల కవర్షెల్స్తో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. తన కాన్వాస్ శ్రేణిలో భాగంగా ‘కాన్వాస్ 2 కలర్స్’ పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.పది వేల వరకూ ఉండవచ్చు. డార్క్ గ్రే, వైట్ రంగుల్లో లభించే కాన్వాస్ కలర్స్ కవర్షెల్స్ మాత్రం భిన్న రంగుల్లో లభిస్తాయి. డార్క్ గ్రే కలర్ స్మార్ట్‌ఫోన్‌ను ఖరీదు చేస్తే దాంతోపాటు రేడియెంట్ రెడ్, మిస్టిక్ బ్లూ కవర్లు లభిస్తాయి. తెల్లరంగు ఫోన్‌తోపాటు వైబ్రంట్ ఎల్లో, స్ప్లెండిడ్ గ్రీన్ కవర్లు ఉంటాయన్నమాట. రెండు జీఎస్ఎం సిమ్‌కార్డులను సపోర్ట్ చేయగల కలర్స్‌లో అయిదు అంగుళాల స్క్రీన్ ఉంటుంది. మీడియాటెక్ 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ర్యామ్ ఒక గిగాబైట్ కాగా, ఇంటర్నల్ మెమరీ 4 గిగాబైట్లు. పిక్సెల్ రెజల్యూషన్ 720 బై 1280 ఉండటం విశేషం. అలాగే ప్రధాన కెమెరా 8 మెగాపిక్సెళ్ల రెజల్యూషన్‌తో ఫొటోలు తీయగలుగుతుంది. వీడియో కాలింగ్‌కు ఉద్దేశించిన ఫ్రంట్ కెమెరా రెజల్యూషన్ 2 మెగాపిక్సెల్స్. బర్న్ ద రోప్, ఫుక్రే, ఫ్రాగ్ బరస్ట్ వంటి గేమ్స్, కింగ్‌సాఫ్ట్, గెటిట్, ఒపేరా మినీ, ఎంలైవ్, ఎంఐ గేమ్స్, రివరీ ఫోన్‌బుక్, స్మార్ట్‌ప్యాడ్ వంటి అప్లికేషన్లతో కలిపి లభిస్తోంది ఈ స్మార్ట్‌ఫోన్. ఐవరీ ఎస్ టాబ్లెట్ దేశీయ టెక్నాలజీ కంపెనీ లావా త్రీజీ ఆధారిత టాబ్లెట్ ఐవరీఎస్ను అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్ స్టోర్ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉన్న ఈ టాబ్లెట్ ఏడు అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.2.2 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మీడియాటెక్ 1.3 గిగాహెర్ట్జ్ డ్యుయెల్‌కోర్ ప్రాసెసర్‌తో పనిచేసే ఐవరీ ఎస్‌లో గ్రాఫిక్స్ కోసం మాలీ 400 జీపీయూ కూడా ఏర్పాటు చేశారు. రెండు సిమ్‌కార్డులను సపోర్ట్ చేయగలదీ టాబ్లెట్. త్రీజీ, 2జీ బ్లూటూత్, వైఫై వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక గిగాబైట్ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ (ఎస్డీకార్డుతో 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు) ఉన్న ఐవరీ ఎస్ 2800 ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 3.2 మెగాపిక్సెల్స్. వాట్స్అప్, హంగామా, పేటీఎం, ఈఏ గేమ్స్, వంటివి ప్రీలోడెడ్‌గా లభిస్తాయి. ధర రూ.8499. నికాన్ కూల్‌పిక్స్ శ్రేణి కెమెరాలు.. సుప్రసిద్ధ కెమెరా తయారీ కంపెనీ నికాన్ తాజాగా తన కూల్‌పిక్స్ శ్రేణిలో భాగంగా 16 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది. ఫొటోగ్రఫీ నిపుణులతోపాటు సామాన్యులు సైతం సులువుగా ఉపయోగించేందుకు వీలుగా వేర్వేరు స్పెసిఫికేషన్స్, ఫీచర్లతో ఉన్నాయి ఈ కెమెరాలు. కూల్‌పిక్స్ పీ సిరీస్‌లో భాగంగా విడుదలైన పీ600, పీ530, పీ340ల్లో సూపర్ లాంగ్ జూమ్ లెన్సులు, ఫుడ్ హెచ్డీ వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కూల్‌పిక్స్ పీ600లో అప్టికల్ జూమ్ 60 ఎక్స్ వరకూ ఉండగా, డైనమిక్ జూమ్1 120 ఎక్స్ వరకూ ఉండటం వల్ల సుదూర చిత్రాలను కూడా స్పష్టంగా తీసే అవకాశముంది. వైడ్ యాంగిల్ 24 మిమీల నుంచి 1440 మిమీ వరకూ ఉండటం విశేషం. వైఫై, జీపీఎస్ టెక్నాలజీలనూ దీంట్లో పొందుపరిచారు. ఇక ఎస్ శ్రేణి కెమెరాల్లో మొత్తం ఎనిమిది కెమెరాలను విడుదల చేసింది. ఎస్9700లో 30 ఎక్స్ ఆప్టికల్, డైనమిక్ జూమ్1లు ఉన్నాయి. ట్రావెల్లాగ్స్ ఫీచర్ ద్వారా మీరు ప్రయాణించే మార్గాన్ని, ఫొటో తీసిన ప్రాంతాన్ని జీపీఎస్ ద్వారా లొకేషన్ రికార్డు చేయవచ్చు. ఎస్9600లో 22 ఎక్స్ ఆప్టికల్ జూమ్, 16 ఎంపీ రెజల్యూషన్ ఉన్నాయి. ఎల్శ్రేణిలో మొత్తం 4 మోడళ్లను ప్రవేశపెట్టారు. వీటిల్లోని ఎల్830లో అల్ట్రా హై పవర్ జూమ్ బ్రిడ్జ్ కెమెరా టెక్నాలజీని ఉపయోగించారు. ఇక ఎల్330 26ఎక్స్ ఆప్టికల్ జూమ్ సౌకర్యం కలిగి ఉంది. ఈజీ ఆటోమోడ్, స్మార్ట్ పోర్టెయిట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి ఈ ఎల్ శ్రేణి కెమెరాల్లో. చివరగా కూల్‌పిక్స్ ఏడబ్యూ120 గురించి. రఫ్ అండ్ టఫ్ వాడకానికి ఉద్దేశించిన ఈ కెమెరా వాటర్ ప్రూఫ్ కూడా. రెండు మీటర్ల ఎత్తు నుంచి కిందపడ్డా తట్టుకునే విధంగా తయారు చేశారు. పీ శ్రేణి కెమెరా ధర రూ.19 నుంచి రూ.24 వేల మధ్యలో ఉంటే.. ఎస్ శ్రేణి ధర రూ.6450 నుంచి రూ.17950 వరకూ ఉంటాయి. ఎల్శ్రేణి కెమెరాల ధర రూ.5వేల నుంచి రూ.16 వేల వరకూ ఉంది. ఏడబ్ల్యూ 120 ధర రూ.17950. -
లావా 3జీ కాలింగ్ ట్యాబ్లెట్ @ రూ.8,499
న్యూఢిల్లీ: దేశీ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ లావా... 3జీ కాలింగ్ ట్యాబ్లెట్ ‘ఐవరీ ఎస్’ను విడుదల చేసింది. దీని ధర రూ.8.499. 7 అంగుళాల స్క్రీన్ సైజు, డ్యూయల్ సిమ్ కలిగిఉన్న ఈ ట్యాబె ్లట్ బరువు 300 గ్రాములుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. మీడియాటెక్ 1.3 గిగాహెర్ట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 4 జీబీ అంతర్గత మెమరీ(32 జీబీ ఎక్స్‌పాండబుల్) వంటి కీలక సాంకేతికాంశాలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ట్యాబ్లెట్‌కు వెనుకవైపున 3.2 మెగాపిక్సెల్స్ కెమెరా, ముందువైపున వీజీఏ కెమేరా(3జీ వీడియో కాలింగ్), 2,800 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం తదితర ఫీచర్లు ఉన్నట్లు లావా ఇంటర్నేషనల్ సహవ్యవస్థాపకుడు, డెరైక్టర్ ఎస్ఎన్ రాయ్ వివరించారు. యువత, యువ ప్రొఫెషనల్స్‌ను ఆకట్టుకునే లక్ష్యంగా ఒపేరా, హంగామా మ్యూజిక్, వాట్స్‌యాప్, పేటీఎం, ఈఏ గేమ్స్ తదితర ప్రీలోడెడ్ యాప్స్, గేమ్స్‌ను ఇందులో పొందుపరిచినట్లు ఆయన పేర్కొన్నారు. -
లావాతో కరెంటు!
లండన్: భూగర్భంలో కుతకుతలాడుతూ ఉండే శిలాద్రవం (మాగ్మా) సాయంతో విద్యుత్‌ను ఉత్పత్తి చే సే కొత్త ఐడియాను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, రివర్సైడ్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఐస్‌ల్యాండ్‌లో 2009లో ఐస్‌ల్యాండిక్ డీప్ డ్రిల్లింగ్ ప్రాజెక్టు చేపట్టిన శాస్త్రవేత్తలు అనుకోకుండానే ఈ కొత్త పద్ధతిని గుర్తించారు. ప్రాజెక్టు కోసం ఓ చోట 2,100 మీటర్ల లోతుకు తవ్వగానే భూమి పై పొరలోకి చొచ్చుకువచ్చిన ఓ మాగ్మా ప్రదేశం తగిలింది. సుమారు 900 నుంచి 1000 డిగ్రీ సెల్షియస్ల ఉష్ణోగత్రతో ఉన్న లావా రెండేళ్ల పాటు నిరంతరమూ ఆవిరిని ఎగజిమ్మింది. మామూలుగా అయితే మాగ్మా ఇంకా చాలా లోతులో ఉంటుందని, ఇలా చాలా తక్కువ లోతులోనే ఇలాంటి ప్రాంతం ఉన్నట్లు వెల్లడి కావడం ఇది రెండోసారి మాత్రమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ లావా వల్ల వెలువడే నీటిఆవిరి ద్వారా విద్యుత్‌ను భారీగా తయారు చేయవచ్చని, దీనివల్ల ఒక్కచోట మాగ్మా ఆవిరితోనే సుమారు 36 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని అంటున్నారు. -
లావా ‘ఐరిస్ ప్రో 30’ మొబైల్@ రూ.15,999
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ కంపెనీ లావా కొత్త స్మార్ట్‌ఫోన్, ఐరిస్ ప్రో 30ను శుక్రవారం మార్కెట్లోకి తెచ్చింది. 4.7 అంగుళాల ఐపీఎస్ ఓజీఎస్ స్క్రీన్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.15,999 అని లావా ఇంటర్నేషనల్ సీఎండీ హరి ఓమ్ రాయ్ చెప్పారు. ఆండ్రాయిడ్ 4.2.2 ఓఎస్‌పై పనిచేసే ఈ డ్యుయల్ సిమ్ ఫోన్లో 1.2 గిగాహెర్ట్స్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 4 జీబీ మెమెరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 8 మెగా పిక్సెల్ రియర్ , 3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఫేస్ డిటెక్షన్ తదితర ఫీచర్లున్నాయని పేర్కొన్నారు. బ్యాటరీ లైఫ్‌ను 30% పెంచే కంటెంట్ ఎడాప్టివ్ బ్యాక్లిట్ కంట్రోల్(సీఏబీసీ) ఈ ఫోన్ ప్రత్యేకతని రాయ్ వివరించారు. వచ్చే ఏడాది మార్చి కల్లా వంద కోట్ల డాలర్ల టర్నోవర్ సాధించడం లక్ష్యమని రాయ్ వివరించారు.