సాక్షి,ముంబై: ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ లావా అత్యంత చౌక ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్‌లో అందుబాటులోకి తేనుంది. లావా బ్లేజ్ 5జీ పేరుతో గత నెల ఇండియా మొబైల్ కాంగ్రెస్ -2022లో ఆవిష్కరించిన సంస్థ ఇక యూజర్లకు త్వరలోనే అందించనుంది. దేశంలోనే అత్యంత చౌక 5జీ స్మార్ట్‌ఫోన్ ఇదని కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారీ డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా లాంటి ఫీచర్లున్న ఈ ఫోన్ ధర రూ. 10999గా ఉంటుందని అంచనా. గ్రీన్ , బ్లూ రంగుల్లో అమెజాన్ ద్వారా విక్రయానికి అందుబాటులోకి రానుంది.
లావా 5జీ బ్లేజ్ స్పెసిఫికేషన్స్
6.5-అంగుళాల హెచ్డీ + ఎల్‌సీడీ డిస్‌ప్లే
డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ,ఆండ్రాయిడ్ 12 ఓఎస్
1600×720 పిక్సెల్ రిజల్యూషన్
50+2+2 టట్రిపుల్ ఎంపీ రియర్ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
For those who live in the fast lane.
— Lava Mobiles (@LavaMobile) November 3, 2022
Blaze 5G. Only on Amazon.#ComingSoon #Blaze5G #IndiaJeele5G #LavaMobiles #ProudlyIndian pic.twitter.com/MH2OZm0a1t
Comments
Please login to add a commentAdd a comment