రూ.3899 కే స్మార్ట్‌ఫోన్‌ | Lava launches Z41 entry level smartphone at Rs 3899  | Sakshi
Sakshi News home page

రూ.3899 కే స్మార్ట్‌ఫోన్‌

Published Tue, Oct 22 2019 4:05 PM | Last Updated on Tue, Oct 22 2019 4:07 PM

Lava launches Z41 entry level smartphone at Rs 3899  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్  ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌నుతీసుకొచ్చింది. ‘లావా జెడ్ 41’  పేరుతో  ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం  లాంచ్‌ చేసింది. దీని ధర రూ. 3,899.  మిడ్‌నైట్‌ బ్లూ, యాంబర్‌ రెడ్‌  రంగుల్లో ఇది లభిస్తుంది.  స్మార్ట్‌ఫోన్ యూట్యూబ్, వాట్సాప్,  ఫేస్‌బుక్‌లాంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలతో  వినియోగదారుల  అన్ని సోషల్ మీడియా అవసరాలను తీర్చగలదు. యూట్యూబ్ గో వంటి డేటా  యాప్ప్‌ సర్ఫింగ్‌కు కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ సపోర్ట్‌ చేస్తుంది.  

5 అంగుళాల డిస్‌ప్లే 
ఆండ్రాయిడ్ 9 పై (గో ఎడిషన్)
5 ఎంపీ రియర్‌ కెమెరా
1 జీబీ ర్యామ్‌, 16జీబీ  స్టోరేజ్‌
2500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

స్పెసిఫికేషన్ల పరంగా,  9 లెవల్ ఫిల్టర్లు, నైట్ షాట్, స్మార్ట్ స్లీప్, బర్స్ట్ మోడ్ ఎఫెక్ట్‌తో పాటు రియల్ టైమ్ బోకె ఫీచర్లతో రూ. 4వేల విభాగంలో ఉన్న ఏకైక స్మార్ట్‌ఫోన్ ఇదేనని లావా ఇంటర్నేషనల్ హెడ్ (ప్రొడక్ట్) తేజిందర్ సింగ్  వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement