Indian market
-
మారుతీ సుజుకీ నుంచి చిన్న ఈవీ!
న్యూఢిల్లీ: పరిమాణం, మార్కెట్ వాటాలో భారత్‌లో అతిపెద్ద కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) విభాగంపై దృష్టి సారిస్తోంది. దేశీయ ఈవీ మార్కెట్లో కంపెనీ ఎంట్రీ కాస్త ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. ‘ఈవీ మార్కెట్‌ను అధ్యయనం చేస్తున్నాం. మా పోటీదారుల ఉత్పత్తులు ఎలా పనిచేశాయో చూశాం. భారతీయ మార్కెట్‌కు ఏమి అవసరమో మాకు తెలుసు. అంతర్జాతీయంగా సుజుకీ కార్పొరేషన్‌కు ఎలక్ట్రిక్ వెహికిల్స్‌తోపాటు ఇతర అన్ని మోడళ్లకు ఉత్పత్తి కేంద్రంగా భారత్ ఉంటుంది. ఉత్పత్తిలో దాదాపు 50 శాతం జపాన్, యూరప్‌కు ఎగుమతి చేస్తాం’ అని సుజుకీ మోటార్ కార్పొరేషన్ ప్రెసిడెంట్, రిప్రజెంటేటివ్ డైరెక్టర్ తొషిహిరో సుజుకీ గురువారం వెల్లడించారు. భారత్ మొబిలిటీ ఎక్స్పో నేటి (జనవరి 17) నుంచి ప్రారంభం అవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చిన్న ఎలక్ట్రిక్ కార్లు.. ఎస్‌యూవీలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లో 50 శాతం మార్కెట్ వాటాను.. అలాగే ఈవీ విపణిలో అగ్రశ్రేణి వాటాను పొందాలని చూస్తున్నట్లు తొషిహిరో సుజుకీ వెల్లడించారు. ఎస్‌యూవీలను కస్టమర్లు డిమాండ్ చేస్తున్నందున భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈ–విటారాతో ఈవీ ప్రయాణం ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు. వినియోగానికి కాంపాక్ట్ ఈవీలు ఉత్తమంగా సరిపోతాయని సుజుకీ అన్నారు. ఈవీ విభాగంలో కంపెనీ నుంచి తదుపరి మోడల్ చిన్న కారు వచ్చే అవకాశం ఉందని ఆయన మాటలనుబట్టి సుస్పష్టం అవుతోంది. కస్టమర్ అవసరాలను అధ్యయనం చేస్తున్నామని, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ కార్లు ట్యాంక్ ఇంధనంతో దాదాపు 500 కిలోమీటర్ల పరిధిని ఇస్తాయని సుజుకీ తెలిపారు. ఈ దూరాన్ని ఆచరణ సాధ్యం చేయడానికి ఈ–విటారాను సన్నద్ధం చేస్తున్నట్టు చెప్పారు. భారత్ మండపం వేదికగా ఈ–విటారాను కంపెనీ శుక్రవారం (నేడు) ఆవిష్కరిస్తోంది. టాటా నెక్సాన్ ఈవీతో పాటు హ్యుండై క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ జడ్ఎస్ ఈవీలకు ఈ–విటారా పోటీ ఇవ్వనుంది. ఇంకా డిమాండ్ ఉంది.. అమ్మకాలు క్షీణిస్తున్నప్పటికీ భారత్‌లో చిన్న కార్లు నిలిచిపోవని సుజుకీ అన్నారు. ‘సుజుకీ కార్పొరేషన్ అనుబంధ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా భారత్‌లో మార్కెట్ లీడర్‌గా ఉంది. ద్విచక్ర వాహనాల నుండి నాలుగు చక్రాల వాహనాలకు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉన్న 100 కోట్ల మంది ప్రజలకు భవిష్యత్తులో ఇంకా సరసమైన చిన్న కార్లు అవసరం అని విశ్వసిస్తున్నాం. ఈ–విటారా పట్ల కస్టమర్ల నుండి అభిప్రాయాన్ని, ప్రతిస్పందనను అర్థం చేసుకుంటాం. ఆ తర్వాతే చిన్న ఎలక్ట్రిక్ కార్ల ప్రణాళికలతో ముందుకు సాగుతాం’ అని వివరించారు. కాగా, మారుతీ సుజుకీ ఇండియా 2024లో 3.24 లక్షల యూనిట్లను ఎగుమతి చేసింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఎలక్ట్రిక్ యాక్సెస్ సైతం.. సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ–యాక్సెస్‌ను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో సందర్భంగా ఆవిష్కరిస్తోంది. సుజుకీ ఇప్పటికే భారత్‌లో పెట్రోల్ వర్షన్ యాక్సెస్–125 విక్రయిస్తోంది. భారతీయుడు కూడా సుజుకీ మోటార్ ప్రెసిడెంట్ కావచ్చు..మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో ఎవరైనా కావొచ్చని, ఇక్కడ జాతీయత ఒక అంశం కాదని తొషిహిరో సుజుకీ అన్నారు. భారతీయుడు కూడా సుజుకీ మోటార్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ పదవి చేపట్టవచ్చని స్పష్టం చేశారు. తన తండ్రి దివంగత ఒసాము సుజుకీ 40 సంవత్సరాల క్రితం భారత్ వచ్చారని, ఈ మార్కెట్ యొక్క అసలైన సామర్థ్యాన్ని ఎవరూ ఊహించలేదని వివరించారు. అయినప్పటికీ భారతదేశం మరియు ఇక్కడి ప్రజలపై ఆయనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. నేడు భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ ప్రపంచంలో మూడవ అతిపెద్ద మార్కెట్‌గా అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. 2003లో లిస్టింగ్ అయినప్పటి నుండి మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ అలాగే ఎండీ, సీఈవో పదవులను భారతీయ, జపాన్ ఎగ్జిక్యూటివ్‌లు అలంకరిస్తున్నారు. -
ఈ టూవీలర్స్ అమ్మకాలు.. వీటిదే ఆధిపత్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో డిసెంబర్ నెలలో 'బజాజ్ చేతక్' (Bajaj Chetak) తొలి స్థానంలోకి దూసుకొచ్చింది. గత నెలలో 18,276 యూనిట్లతో బజాజ్ ఆటో 25 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. 2020 జనవరిలో ఎలక్ట్రిక్ చేతక్ ద్వారా స్కూటర్స్ రంగంలోకి బజాజ్ రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. ఈ-టూ వీలర్స్ విభాగంలో దేశంలో ఒక నెల అమ్మకాల్లో తొలి స్థానాన్ని కైవసం చేసుకోవడం సంస్థకు ఇదే తొలిసారి. డిసెంబర్ నెలలో 17,212 యూనిట్లతో టీవీఎస్ మోటార్ కంపెనీ రెండవ స్థానంలో నిలిచింది.నవంబర్ వరకు తొలి స్థానంలో కొనసాగిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) గత నెలలో అతి తక్కువగా 13,769 యూనిట్లతో 19 శాతం వాటాతో మూడవ స్థానానికి పరిమితమైంది. 2024లో కంపెనీకి అతి తక్కువ విక్రయాలు నమోదైంది డిసెంబర్ నెలలోనే కావడం గమనార్హం. అక్టోబర్‌లో 41,817 యూనిట్ల అమ్మకాలు సాధించిన ఓలా ఎలక్ట్రిక్ నవంబర్‌లో 29,252 యూనిట్లను నమోదు చేసింది.హోండా ఎలక్ట్రిక్ (Honda Electric) టూ వీలర్లు రోడ్డెక్కితే ఈ ఏడాది మార్కెట్ మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనపడుతోంది. సంప్రదాయ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) ఆధారత టూవీలర్ రంగాన్ని ఏలుతున్న దిగ్గజాలే ఎలక్ట్రిక్ విభాగాన్ని శాసిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి నెల నమోదవుతున్న అమ్మకాలే ఇందుకు నిదర్శనం.రెండింటిలో ఒకటి ఈవీ..భారత త్రిచక్ర వాహన రంగంలో ఎలక్ట్రిక్ త్రీవీలర్లు దూకుడుమీదున్నాయి. భారత ఈవీ రంగంలో టూవీలర్ల తర్వాత త్రీవీలర్లు రెండవ స్థానంలో నిలిచాయి. 2024లో దేశవ్యాప్తంగా మొత్తం 6,91,011 యూనిట్ల ఈ-త్రీవీలర్స్ రోడ్డెక్కాయి. భారత్‌లో గతేడాది ఎలక్ట్రిక్, ఐసీఈ, సీఎన్జీ, ఎల్పీజీ విభాగాల్లో కలిపి మొత్తం 12,20,925 యూనిట్ల త్రిచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో ఎలక్ట్రిక్ వాటా ఏకంగా 56 శాతం ఉంది. అంటే అమ్ముడవుతున్న ప్రతి రెండింటిలో ఒకటి ఎలక్ట్రిక్ కావడం విశేషం.ఎలక్ట్రిక్ త్రీవీలర్స్‌లో నాయకత్వ స్థానాన్ని కొనసాగిస్తున్న మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ 10 శాతం వాటా సాధించింది. వేగంగా దూసుకొచ్చిన బజాజ్ ఆటో 6 శాతం వాటాతో మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2023లో అమ్ముడైన 5,83,697 యూనిట్ల ఎలక్ట్రిక్ త్రీవీలర్లతో పోలిస్తే 2024 విక్రయాల్లో 18 శాతం వృద్ధి నమోదైంది.2023లో సగటున ఒక నెలలో 48,633 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళితే గతేడాది ఈ సంఖ్య నెలకు 57,584 యూనిట్లకు ఎగసింది. ఐసీఈ, సీఎన్జీ, ఎల్పీజీ ఆప్షన్స్‌తో పోలిస్తే నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండడం వల్లే ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకు డిమాండ్ పెరుగుతోంది. మెరుగైన రుణ లభ్యత, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అందుబాటులోకి విభిన్న మోడళ్లు, సరుకు రవాణాకై లాజిస్టిక్స్ కంపెనీల నుంచి డిమాండ్ ఇందుకు మరింత ఆజ్యం పోస్తోంది. త్రీవీలర్స్‌లో సీఎన్జీ విభాగానికి 28 శాతం వాటా కాగా, డీజిల్‌కు 11, ఎల్పీజీ 3, పెట్రోల్‌కు ఒక శాతం వాటా ఉంది.పోటీలో నువ్వా నేనా..రెండవ స్థానంలో ఉన్న టీవీఎస్ మోటార్ కంపెనీతో నువ్వా నేనా అన్నట్టు పోటీపడుతూ.. 2024 సెప్టెంబర్‌లో 19,213 యూనిట్లతో తొలిసారిగా బజాజ్ ఆటో రెండవ స్థానాన్ని పొంది టీవీఎస్‌ను మూడవ స్థానానిని నెట్టింది. అక్టోబర్, నవంబర్‌లో టీవీఎస్‌కు గట్టి పోటీ ఇచ్చిన బజాజ్ ఆటో మూడవ స్థానానికి పరిమితమైంది.ఇక 2020 జనవరి నుంచి 2023 నవంబర్ వరకు బజాజ్ ఆటో మొత్తం 1,04,200 యూనిట్ల అమ్మకాలను సాధించింది. తొలి లక్ష యూనిట్లకు కంపెనీకి 47 నెలల సమయం పట్టింది. 2024లో ఏకంగా 2 లక్షల యూనిట్ల విక్రయాలకు చేరువైంది. గతేడాది సంస్థ మొత్తం 1,93,439 యూనిట్ల అమ్మకాలతో భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో మూడవ స్థానంలో ఉంది. ఓలా ఎలక్ట్రిక్ 4,07,547 యూనిట్లతో మొదటి, టీవీఎస్ మోటార్ కో 2,20,472 యూనిట్లతో రెండవ స్థానంలో నిలిచాయి. -
రూ.20 లక్షల కోట్లకు ఈవీ మార్కెట్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) మార్కెట్ విలువ భారత్‌లో 2030 నాటికి రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం తెలిపారు. ఆ సమయానికి మొత్తం ఈవీ పర్యావరణ వ్యవస్థలో దాదాపు 5 కోట్ల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ సుస్థిరతపై 8వ సదస్సు ఈవీఎక్స్‌పో 2024 సందర్భంగా ఆయన మాట్లాడారు. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల ఫైనాన్స్ మార్కెట్ పరిమాణం దేశంలో దాదాపు రూ.4 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనాగా వెల్లడించారు. భారత్‌లో 40 శాతం వాయు కాలుష్యం రవాణా రంగం వల్లే అని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. సౌర విద్యుత్ 44 శాతం.. భారత్ రూ. 22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటోందని, ఇది పెద్ద ఆర్థిక సవాలుగా మారిందని గడ్కరీ అన్నారు. ఈ శిలాజ ఇంధనాల దిగుమతి మన దేశంలో చాలా సమస్యలను సృష్టిస్తోందని తెలిపారు. భారత్‌లో ఉత్పత్తి అవుతున్న మొత్తం విద్యుత్‌లో 44 శాతం సౌరవిద్యుత్ కైవసం చేసుకున్నందున ప్రభుత్వం పర్యావరణ అనుకూల శక్తి వనరులపై దృష్టి పెడుతోందని వివరించారు.లక్ష ఈ–బస్‌లు అవసరం.. ఎలక్ట్రిక్ బస్‌ల కొరతను భారత్ ఎదుర్కొంటోందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ‘మన దేశానికి లక్ష ఎలక్ట్రిక్ బస్‌లు అవసరం. అయితే ప్రస్తుతం మన సామర్థ్యం 50,000 ఈ–బస్‌లు. మీరు మీ ఫ్యాక్టరీని విస్తరించుకోవడానికి ఇదే సరైన సమయం. ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు నాణ్యత విషయంలో రాజీ పడొద్దు’ అని తయారీ కంపెనీలను ఉద్దేశించి అన్నారు. -
రూ.2 లక్షల కంటే తక్కువ ధర.. ఇవిగో బెస్ట్ బైకులు!
మంచి స్టైల్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కోరుకునేవారు.. కొంత ఎక్కువ డబ్బు వెచ్చించి బైక్ కొనాలని చూస్తారు. అలాంటి వారి కోసం ఈ కథనంలో రూ.2 లక్షల కంటే తక్కువ ధరలో లభించే బైకుల గురించి తెలుసుకుందాం.హీరో కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ప్రముఖ బైక్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్లో 'కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్' విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బైక్ ధర రూ. 1.79 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులోని 210 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 9250 rpm వద్ద 25.1 Bhp పవర్, 7250 rpm వద్ద 20.4 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.హీరో కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ బైక్.. స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, గ్యాస్-ఛార్జ్డ్ మోనోషాక్ వంటి వాటితో పాటు టర్న్-బై-టర్న్ న్యావిగేషన్, ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ పోర్ట్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇవన్నీ రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.యమహా ఆర్15 వీ4రూ.1.82 లక్షల నుంచి రూ.1.87 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ధర వద్ద లభించే 'యమహా ఆర్15 వీ4' మన జాబితాలో చెప్పుకోడదగ్గ బైక్. ఈ బైకులోని 155 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 10,000 rpm వద్ద 18.1 Bhp పవర్, 7500 rpm వద్ద 14.2 Nm టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.యమహా ఆర్15 వీ4 బైక్ 282 మిమీ ఫ్రంట్ డిస్క్, 220 మిమీ రియర్ డిస్క్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఇది మంచి రైడింగ్ అనుభూతిని అందించడానికి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు రైడింగ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటివి కూడా కలిగి ఉంది.బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200బజాజ్ అంటే అందరికీ గుర్తొచ్చేది పల్సర్. ఈ బైక్ మార్కెట్లో అధిక అమ్మకాలను పొందుతోంది. బజాజ్ ఆర్ఎస్ 200 ధర రూ. 1.74 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 200 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 24.1 Bhp పవర్, 18.7 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎల్ఈడీ లైటింగ్ వంటివి పొందుతుంది.కేటీఎమ్ ఆర్సీ 125రూ.2 లక్షల కంటే తక్కువ ధర వద్ద కేటీఎమ్ బైక్ కావాలనుకునేవారికి.. ఆర్సీ 125 బెస్ట్ ఆప్షన్. ఈ బైకులోని 124.7 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ద్వారా 9250 rpm వద్ద 14.34 Bhp పవర్, 8000 rpm వద్ద 12 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్, అడ్జస్టబుల్ హ్యాండిల్‌బార్, ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్స్ కలిగిన ఈ బైక్ ఎక్కువమందికి ఇష్టమైన మోడల్. -
ఏఐ రేసును గెలిచే మార్గం
భారతదేశం కృత్రిమ మేధా శక్తి కేంద్రంగా అవతరించాలంటే మౌలిక సదుపాయాలు ఒక్కటే చాలవు, పరిశోధనా ప్రతిభ కూడా అవసరం. ఇటీవల ఇండియాలో పర్యటించిన మెటా చీఫ్ ఏఐ సైంటిస్ట్ యాన్ లెకూన్ దీన్నే నొక్కిచెప్పారు. అమెరికా సిలికాన్ వ్యాలీలోని అత్యుత్తమ ప్రతిభావంతుల్లో ఎక్కువ మంది భారత సంతతికి చెందిన వారే. కనీసం వారిలో కొందరినైనా వెనక్కు తేవాలి. వారు ఇక్కడ అభివృద్ధి చెందడానికి అవసరమైన వ్యవస్థను కల్పించాలి. ఇప్పుడు ఏఐలో ఫ్రాన్స్ కీలకంగా మారిందంటే దానికి కారణం, ఎక్కడెక్కడో పని చేస్తున్న ఫ్రెంచ్ ప్రతిభావంతులను తిరిగి ఫ్రాన్స్ వైపు ఆకర్షించేలా చేసిన వారి ఏఐ వ్యూహం. ఇది మనకు ప్రేరణ కావాలి.ఎన్విడియా సంస్థకు చెందిన జెన్సన్ హువాంగ్, మెటా సంస్థకు చెందిన యాన్ లెకూన్ ఇటీవలి భారత్ సందర్శనలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు భారతీయ మార్కెట్ ప్రాముఖ్యాన్ని గురించి మాత్రమే నొక్కి చెప్పడంలేదు; భారతదేశం కృత్రిమ మేధా శక్తి కేంద్రంగా అవతరించాలన్నా, జాతీయ ఏఐ మిషన్ విజయవంతం కావాలన్నా ఏఐ మౌలిక సదుపాయాలు మాత్రమే సరిపోవు; అగ్రశ్రేణి కృత్రిమ మేధ పరిశోధనా ప్రతిభ అవసరం. మెటా సంస్థకు చెందిన చీఫ్ ఏఐ సైంటిస్ట్ యాన్ లెకూన్ తన పర్యటనలో భాగంగా ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ చెన్నై సహా పలు విద్యాసంస్థలలో ప్రసంగించారు. 2018లో ట్యూరింగ్ ప్రైజ్ విజేత అయిన లెకూన్, కృత్రిమ మేధ ఉత్పత్తి అభివృద్ధిపై మాత్రమే భారత్ దృష్టి పెట్టకుండా, ప్రపంచ కృత్రిమ మేధా పరిశోధనలో తన భాగస్వా మ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఏఐలో అత్యాధునిక పరిశోధన అవకాశాల కొరత, ‘బ్రెయిన్ డ్రెయిన్’ (పరిశోధకులు వేరే దేశాలకు వెళ్లిపోవడం) భారత్ తన సొంత ఏఐ నైపుణ్యాన్ని పెంపొందించు కోవడానికి ఉన్న ప్రాథమిక సవాళ్లని ఆయన ఎత్తి చూపారు.ప్రతిభ అవసరం!దీనికి విరుద్ధంగా, గత నెలలో జరిగిన ఎన్విడియా ఏఐ సదస్సులో రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీతో వేదికను పంచు కున్న జెన్సన్ హువాంగ్ భారత్ సరసమైన కృత్రిమ మేధ మౌలిక సదుపాయాలను నిర్మించాలని నొక్కి చెప్పారు. అయితే, ఇండియా లోని అత్యున్నత స్థాయి పరిశోధనా ప్రతిభ గురించి ఆయన దాదాపుగా ప్రస్తావించలేదు. ఏఐ మౌలిక సదుపాయాలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యత, భారత్ తన ‘నేషనల్ ఏఐ మిషన్’ (ఎన్ఏఐఎమ్)లో కంప్యూటర్ మౌలిక సదుపాయాలకు ఇచ్చిన ప్రాధాన్యతకు అనుగుణంగానే ఉంది. మిషన్ నిధులలో సగం వరకు దీనికే కేటాయించారు.అర్థవంతమైన ఏఐ పరిశోధనకు కంప్యూటర్ కనీస అవసరం అని అంగీకరించాలి. జాతీయ ఏఐ మిషన్ లో భాగంగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయంపై దృష్టి సారించిన మూడు ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఈఓ)ను ఏర్పాటు చేస్తున్నట్లు ఇండియా ఇటీవల ప్రకటించింది. అలాగే ‘ఏఐ ఫర్ ఆల్’(అందరికీ కృత్రిమ మేధ) భావనపై దృష్టిని కేంద్రీకరించింది. అయితే, 10,000 జీపీయూ కంప్యూటర్ మౌలిక సదుపాయాలు, 3 సెక్టోరల్ సీఓఈలు మాత్రమే దేశంలో అత్యాధునిక ఏఐ పరిశోధనను సొంతంగా ప్రారంభించలేవు. రాబోయే నెలల్లో భారత్ జీపీయూలను పొందడంపై దృష్టి పెట్టినప్పటికీ, ఏఐలో పోటీ తత్వాన్ని పెంచే కీలకమైన అంశం నిర్లక్ష్యానికి గురవుతోంది.జాతీయ ఏఐ మిషన్ తన మూలస్తంభాలుగా ప్రతిభ, నైపుణ్యా లను కలిగివుందనడంలో సందేహం లేదు. కానీ అగ్రశ్రేణి పరిశోధనా ప్రతిభను ఆకర్షించడం, ఉన్నదాన్ని నిలుపుకోవడం, శిక్షణ ఇవ్వడంపై భారతదేశ అవసరాన్ని ఇది నొక్కి చెప్పడం లేదు. బదులుగా, ఇది గ్రాడ్యుయేట్, పోస్ట్–గ్రాడ్యుయేట్ స్థాయిలలో కృత్రిమ మేధ పాఠ్యాంశాల సంఖ్యను, ప్రాప్యతను పెంచడంపై దృష్టి పెట్టే ఏఐ ఫ్యూచర్ స్కిల్స్ ప్రోగ్రామ్‌ను ఊహిస్తోంది.ఫ్యూచర్‌స్కిల్స్ ప్రోగ్రామ్ ఏఐ పట్ల అవగాహనను, విద్యను పెంపొందించడంలో సహాయపడుతుంది. కానీ రాబోయే రెండు మూడేళ్లలో భారత్‌లో అత్యాధునిక ప్రతిభావంతుల సమూహాన్ని నిర్మించడంలో ఇది తోడ్పడదు. లెకూన్ ఎత్తి చూపినట్లుగా, ప్రస్తుతం ఏఐలో అత్యాధునిక ప్రతిభ లేకపోతే ఈ ఆటలో భారత్ విజయం సాధించలేదు.ఫ్రాన్స్ విజయగాథఉదాహరణకు లెకూన్ స్వదేశమైన ఫ్రాన్స్‌ను చూడండి. అమెరికా, చైనాలకు పోటీగా ఉన్న తమదైన ఏఐ శక్తిని ఫ్రాన్స్ కోల్పోతున్నట్లు అక్కడి నాయకులు గ్రహించారు. అందుకే తాజా ఏఐ టెక్ వేవ్ కార్య క్రమాన్ని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. ఫ్రెంచ్ ఏఐ వ్యూహం, ఎక్కడెక్కడో పని చేస్తున్న ఫ్రెంచ్ ప్రతిభా వంతులను తిరిగి ఫ్రాన్స్ వైపు ఆకర్షించడం చుట్టూ తిరుగుతుంది. గూగుల్ డీప్‌మైండ్, మెటాలో ఫండమెంటల్ ఏఐ రీసెర్చ్ (ఫెయిర్) బృందంతో కలిసి పనిచేసిన ఫ్రెంచ్ వ్యవస్థాపకులు కేవలం ఏడాది క్రితమే ఫ్రెంచ్ స్టార్టప్ అయిన మిస్ట్రాల్‌ను ప్రారంభించారు. ఇది ఓపెన్ఏఐకి చెందిన చాట్‌జీపీటీ వేదికకు అగ్ర పోటీదారులలో ఒకటిగా నిలవడమే కాక, ఏఐ ప్రపంచంలో ఫ్రాన్స్ స్థానాన్ని ప్రధాన స్థాయికి తీసుకొచ్చింది.ప్రపంచ వేదికపై ఫ్రాన్స్ ఈ విజయం వెనుక ఉన్న మరొక కారణాన్ని కూడా లెకూన్ ఎత్తి చూపారు. పదేళ్ల క్రితం ఫ్రాన్స్‌లో మెటా సంస్థకు చెందిన ఫెయిర్ జట్టును ఏర్పాటు చేశారు. ఇది చాలా మంది ఫ్రెంచ్ పరిశోధకులకు ఏఐ పరిశోధనను వృత్తిగా మలుచుకునేలా ప్రేరేపించింది. ఇదే మిస్ట్రాల్ వంటి ఫ్రెంచ్ ఏఐ స్టార్టప్‌ల విజయానికి దోహదపడిందని చెప్పారు.నిలుపుకోవాల్సిన ప్రతిభ భారత్ కూడా ఇలాగే చేయాలి. సిలికాన్ వ్యాలీలోని అగ్రశ్రేణి ఏఐ పరిశోధనా ప్రతిభలో ఎక్కువ మంది భారతీయ మూలాలకు చెంది నవారే అన్నది సత్యం. ఒకట్రెండు ఉదాహరణలను చూద్దాం. చాట్‌జీపీటీకి చెందిన ప్రధాన భాగమైన ట్రాన్స్ఫార్మర్లు వాస్తవానికి ‘అటెన్షన్ ఈజ్ ఆల్ యు నీడ్’ అనే గూగుల్ రీసెర్చ్ పేపర్లో భాగం. ఆ పేపర్ సహ రచయితలలో ఆశిష్ వాశ్వానీ, నికీ పర్మార్ ఇద్దరూ భారతీయ సంతతికి చెందినవారు. బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నా లజీలో వాశ్వానీ బీటెక్ చేయగా, పుణె ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీలో పర్మార్ చదివారు. మద్రాస్ ఐఐటీ పూర్వ విద్యార్థి అరవింద్ శ్రీనివాస్ గతంలో ఓపెన్ఏఐలో పరిశోధకుడు. పెర్ప్లెక్సిటీ. ఏఐని ప్రారంభించారు. ఇది ప్రస్తుతం సిలివాన్ వ్యాలీలోని హాటెస్ట్ ఏఐ స్టార్టప్‌లలో ఒకటిగా పరిగణించబడుతోంది.ఇలాంటి ప్రతిభను తిరిగి భారత్‌కు తేవాలి, లేదా ప్రతిభావంతులను నిలుపుకోవాలి. బెంగళూరు, గురుగ్రామ్, హైదరాబాద్, చెన్నై, ముంబై లేదా భారతదేశంలో ఎక్కడైనా అభివృద్ధి చెందడానికి అవస రమైన పరిశోధనా వ్యవస్థను కల్పించాలి. ఐఐటీ మద్రాస్ రీసెర్చ్ పార్క్‌లో చేసినట్లుగా, చిన్న ప్రదేశాల్లో కూడా అభివృద్ధి చెందడానికి వీలు కల్పించే వ్యవస్థ ఈ రంగంలో అద్భుతమైన పురోగతికి, అనేక విజయ గాథలకు దారి తీస్తుంది. ఏఐకి కూడా అదే వ్యూహాన్ని వర్తింప జేస్తే అది ఇండియాను ప్రధాన ఏఐ కేంద్రంగా మలచగలదు.అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కు ఏఐ ఒక మూలస్తంభంగా ఉండాలి. ప్రధాన భారతీయ కార్పొరేట్లతో పాటు, ప్రాథమిక పరిశోధన చేయడానికి, ఈ ప్రతిభను ఆహ్వానించగల కనీసం మూడు, నాలుగు ఏఐ ల్యాబ్‌లకు నిధులు సమకూర్చాలి. ఈ ల్యాబ్‌లకు జాతీయ ఏఐ మిషన్ కింద కొనుగోలు చేయడానికి ప్రతిపాదించిన కంప్యూట్–ఇన్ ఫ్రాస్ట్రక్చర్, అధునాతన ఏఐ చిప్‌లతో సహా క్లిష్టమైన ఏఐ మౌలిక సదుపాయాలను అందించవచ్చు.అయితే, ఏఐలో పరిశోధనా ప్రతిభ ఇప్పటికే భారతదేశంలో లేదని చెప్పడం లేదు. మన విశ్వవిద్యాలయాలు ఏఐ, సంబంధిత రంగాలలో గొప్ప పరిశోధకులను ఉత్పత్తి చేస్తూనే ఉన్నాయి. ఎన్వీడి యాతో సహా అనేక ప్రపంచ కంపెనీలు ఇక్కడున్న తమ ఏఐ ల్యాబ్ లలో వేలాది మంది భారతీయులను కలిగి ఉన్నాయి. ఈ పునాది, అత్యుత్తమ అగ్రశ్రేణి ఏఐ ప్రతిభను ఆకర్షించడం, దాన్ని నిలుపుకోవ డంతో సహా జాతీయ ఏఐ మిషన్ విజయంలో సహాయపడుతుంది. చాలా మంది అంచనాల ప్రకారం, కృత్రిమ మేధలో విజయ ఫలాలు చాలా మధురంగా ఉండగలవు.అనిరుధ్ సూరి వ్యాసకర్త ‘ద గ్రేట్ టెక్ గేమ్’ రచయిత; ‘కార్నెగీ ఇండియా’ నాన్ రెసిడెంట్ స్కాలర్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
రూ.6000 వద్ద లభించే బెస్ట్ స్మార్ట్ఫోన్లు: ఇక్కడ చూడండి
ప్రస్తుతం మార్కెట్లో లక్ష రూపాయల కంటే ఎక్కువ ఖరీదైన స్మార్ట్ఫోన్ల దగ్గర నుంచి రూ. 6వేలు ధర వద్ద లభించే ఫోన్ల వరకు ఉన్నాయి. ఈ కథనంలో ఆరువేల రూపాయల ధర వద్ద లభించే స్మార్ట్ఫోన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 (Infinix Smart 8)మార్కెట్లో అందుబాటులో ఉన్న 'ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8' ధర కేవలం రూ.6,699 మాత్రమే. బ్యాంక్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే. ఇది రూ. 6వేలకు లభిస్తుంది. ఇందులో 3 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.6 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, రెండు కెమెరాలు మొదలైనవి ఉంటాయి. ఇది ఆక్టా కోర్ యూనిసోక్ T606 ప్రాసెసర్ పొందుతుంది.ఐటెల్ ఆరా 05ఐ (Itel Aura 05i)రూ.6000 కంటే తక్కువ ధర వద్ద లభించే స్మార్ట్ఫోన్ల జాబితాలో ఐటెల్ ఆరా 05ఐ ఒకటి. ఇది 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ పొందుతుంది. యూనిసోక్ SC9863A1 ప్రాసెసర్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుతుంది. దీని ధర రూ. 5749 మాత్రమే. మల్టిపుల్ కెమెరా ఆప్షన్స్ ఇందులో చూడవచ్చు.రెడ్మీ ఏ2 (Redmi A2)రూ.5669 వద్ద లభించే రెడ్మీ ఏ2 కూడా ఆరు వేల రూపాయల కంటే తక్కువ ధర వద్ద లభిస్తున్న స్మార్ట్ఫోన్లలో ఒకటి. ఆక్టా కోర్ ప్రాసెసర్ కలిగిన ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుతుంది. ఇది 2 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ పొందుతుంది. 8 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్ ఈ స్మార్ట్‌ఫోన్‌లో లభిస్తుంది. -
ట్రంప్ ఎన్నికతో భారత్‌వైపు చూపు
అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ సీఎల్ఎస్ఏ భారత్‌లో పెట్టుబడులు పెంచేందుకు ఆసక్తి చూపుతోంది. అక్టోబర్‌లో చైనా మార్కెట్లో దాదాపు ఐదు శాతం ఇన్వెస్ట్మెంట్ పెంచినట్లు కంపెనీ తెలిపింది. అదే సమయంలో భారత్‌లో 20 శాతంగా ఉన్న పెట్టుబడులను 10 శాతానికి తగ్గించింది. కానీ రానున్న రోజుల్లో భారత్‌లో తిరిగి పెట్టుబడులను పెంచబోతున్నట్లు సీఎల్ఎస్ఏ పేర్కొంది.అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలు పరిమితంగానే ఉంటాయని సీఎస్ఎల్ఏ అంచనా వేస్తుంది. దాంతో చైనాకు ఇబ్బందులు తప్పవనే వాదనలున్నాయి. కాబట్టి చైనాలో పెట్టుబడులు పెట్టడానికి అంతగా ఆసక్తి చూపించడంలేదు. చైనా ఆర్థిక వృద్ధిలో ఎగుమతులే ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాంటిది ట్రంప్ రాకతో వీటిపై తీవ్ర ప్రభావం పడుతుందని సీఎల్ఎస్ఏ విశ్లేషిస్తుంది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరం కావొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దాంతో అక్కడి కంటే మెరుగైన ఆర్థిక వాతావరణ పరిస్థితులున్న భారత్‌వైపు సీఎల్ఎస్ఏ మొగ్గు చూపుతుంది.ఇదీ చదవండి: వ్యాక్సిన్ వ్యతిరేకితో భారత్‌కు నష్టం?ఇటీవలి కాలంలో విదేశీ మదుపర్లు భారత స్టాక్ మార్కెట్ల నుంచి రోజు సరాసరి రూ.3000 కోట్లు ఉపసంహరించుకుంటున్నారు. గత నెల నుంచి దాదాపు రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత మార్కెట్లు కొంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇది సీఎల్ఎస్ఏ వంటి పెట్టుబడిదారులు భారత మార్కెట్‌పై ఆసక్తి చూపేందుకు అవకాశం కల్పిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఏఐపై ఎరిక్సన్ ఫోకస్
న్యూఢిల్లీ: స్వీడన్‌కి చెందిన టెలికం పరికరాల తయారీ దిగ్గజం ఎరిక్సన్ భారత్‌లో తమ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. కృత్రిమ మేథ (ఏఐ), జనరేటివ్ ఏఐ, నెట్వర్క్ ఏపీఐలు, 6జీ టెక్నాలజీ అభివృద్ధి మొదలైన వాటిపై దృష్టి పెట్టనుంది. ఇందుకోసం గణనీయంగా ఇన్వెస్ట్ చేయనుంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2024లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ భారత విభాగం హెడ్ ఆండ్రెస్ విసెంటి ఈ విషయాలు తెలిపారు. 1994లో నుంచి భారత్‌లో తాము ఉత్పత్తి చేస్తున్నామని, అంతర్జాతీయంగా తమకు కీలక మార్కెట్లలో ఇది కూడా ఒకటని వివరించారు. 5జీ సాంకేతికతను వినియోగంలోకి తేవడంలో భారత్ వేగంగా పనిచేసిందని ఆండ్రెస్ తెలిపారు. కేవలం 22 నెలల్లోనే అయిదు లక్షల పైగా బేస్ స్టేషన్లు ఏర్పాటు చేసి, దేశవ్యాప్తంగా 90 శాతం మేర కవరేజీ సాధించిందని చెప్పారు. దీంతో నెట్వర్క్ పనితీరుకు సంబంధించి భారత్ 86వ స్థానం నుంచి 16వ స్థానానికి చేరిందని పేర్కొన్నారు. టెలికం దిగ్గజాలు భారతి ఎయిర్టెల్, జియోతో ఎరిక్సన్కి గతంలో ఒప్పందాలు ఉన్నాయి. ఇటీవలే 4జీ, 5జీ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్‌నకు సంబంధించి వొడాఫోన్ ఐడియాతో కాంట్రాక్టు కుదుర్చుకుంది. ప్రస్తుతం దేశీయంగా ఎరిక్సన్కి చెన్నై, బెంగళూరు, గురుగ్రామ్‌లో ఆర్అండ్డీ కేంద్రాలు ఉన్నాయి. టెలికం రంగంలో రవాణా, క్లౌడ్ తదితర విభాగాలకు సంబంధించిన సాంకేతికతలపై ఇవి పని చేస్తున్నాయి. -
ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ @ 4 కోట్లు
న్యూఢిల్లీ: సూపర్ లగ్జరీ కార్ల తయారీలో ఉన్న బ్రిటిష్ కంపెనీ ఆస్టన్ మార్టిన్ భారత్‌లో కొత్త వాంటేజ్‌ను విడుదల చేసింది. ఎక్స్‌షోరూం ధర రూ.3.99 కోట్లు. 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజన్, 8 స్పీడ్ జడ్ఎఫ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఎల్రక్టానిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్, బావర్స్ అండ్ విలి్కన్స్ 15 స్పీకర్స్ సౌండ్ సిస్టమ్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ పొందుపరిచారు. ఈ 2 డోర్ల కూపే 665 పీఎస్ పవర్, 800 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. గరిష్ట వేగం గంటకు 325 కి.మీ. 3.5 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కీలకమైన, ఆశాజనక మార్కె ట్ కాబట్టే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అన్ని మోడళ్లను భారత్‌లోనూ విడుదల చేస్తున్నట్లు ఆస్టన్ మార్టిన్ న్యూఢిల్లీ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ తెలిపా రు. సెప్టెంబర్ 2న అంతర్జాతీయంగా వీ12 మోడల్‌ను కంపెనీ విడుదల చేస్తోంద న్నారు. ఈ మోడల్ భారత్‌లో తొలిసారిగా వెంటనే అందుబాటులోకి వస్తోందన్నారు.ఉత్తరాది కంటే వేగంగా దక్షిణాది.. సూపర్ లగ్జరీ కార్ల మార్కెట్ దేశంలో రెండేళ్లుగా ఏటా 35–40% వృద్ధి చెందుతోందని ఆనంద్ చెప్పారు. గతేడాదితో పోలిస్తే కంపెనీ అమ్మకాల్లో 90% వృద్ధి నమోదైందని వివరించారు. ఆస్టన్ మార్టిన్ కార్ల అధికారిక దిగుమతిదారుగా ఆస్టన్ మార్టిన్ న్యూఢిల్లీ వ్యవహరిస్తోంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుండి పెరుగుతున్న డిమాండ్‌ను అధిగమించడానికి కంపెనీ నెట్‌వర్క్‌ను విస్తరించనుంది. ప్రస్తుతం కంపెనీకి న్యూఢిల్లీలో షోరూం ఉంది. ఏడాది చివరికల్లా బెంగళూరులో ఔట్లెట్ రానుంది. సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ కార్స్ మార్కెట్ ఉత్తరాది కంటే దక్షిణాది వేగంగా వృద్ధి చెందుతోందని ఆనంద్ తెలిపారు. -
అగ్రరాజ్యంలో తగ్గినా.. భారత్‌లో తగ్గని ఈవీ సేల్స్
ఎలక్ట్రిక్ వాహనాల (EV) విక్రయాల వృద్ధి రేటు ప్రపంచవ్యాప్తంగా మందగిస్తోందని.. ఇటీవలి గోల్డ్‌మన్ సాక్స్ పేర్కొంది. ఇంతకీ ఈవీల వృద్ధి ఎందుకు తగ్గుతోంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధి రేటు తగ్గడానికి ప్రధాన కారణం.. నిర్వహణ సంస్థల అధిక మూలధన వ్యయాలు, ఎన్నికల అనిశ్చితులు మాత్రమే కాకుండా ఛార్జింగ్ స్టేషన్ల కొరత అని తెలుస్తోంది.వెహికల్ వాల్యుయేషన్ అండ్ ఆటోమోటివ్ రీసెర్చ్ కంపెనీ ప్రకారం.. అమెరికన్లు 2024 మొదటి త్రైమాసికంలో 2,00,000 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసారు. ఈవీల అమ్మకాలు 2023 కంటే 2024లో 7.3 శాతం వృద్ధి చెందినట్లు తెలుస్తోంది. విక్రయాలు కొంత పెరిగినప్పటికీ.. వృద్ధి రేటు మాత్రం గణనీయంగా తగ్గింది.యూరోపియన్ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(ACEA ) నివేదిక ప్రకారం.. EV రిజిస్ట్రేషన్లు తగ్గడం, ఈస్టర్ సెలవుల సమయం కారణంగా ఈ సంవత్సరం మార్చిలో మొదటిసారిగా యూరప్‌లో కొత్త కార్ల అమ్మకాలు క్షీణించాయని తెలిసింది. యూరోపియన్ యూనియన్ (EU)లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు మార్చిలో 11.3 శాతం తగ్గి 134,397 యూనిట్లకు చేరుకున్నాయి. ఐరోపాలో అతిపెద్ద మార్కెట్ అయిన జర్మనీలో కూడా EV అమ్మకాల్లో 29 శాతం తగ్గుదలను నమోదు చేసింది.ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ తగ్గడంతో.. మిడ్, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు.. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. గత కొన్ని నెలలోగా అమెరికాలో వీటి వృద్ధి ఎలక్ట్రిక్ వాహనాల కంటే గణనీయంగా పెరిగింది.భారతదేశంలో ఏం జరుగుతోంది?జీఎంకే రీసెర్చ్ & అనలిటిక్స్ నివేదిక ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 1.7 మిలియన్ యూనిట్లను అధిగమించినట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ గణనీయమైన పెరుగుదలను నమోదు చేసినట్లు స్పష్టమవుతోంది. మన దేశమ్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 2023 కంటే 10 శాతం వృద్ధిని నమోదు చేసాయి. ఇందులో ఎక్కువ భాగం ప్యాసింజర్ వెహికల్స్ ఉన్నాయి. -
భారత్‌లో మోటరోలా ఎడ్జ్ 50 ప్రో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మోటరోలా భారత్‌లో ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ప్రపంచంలో తొలి ట్రూ కలర్ కెమెరా, 3డీ కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. 6.7 అంగుళాల 1.5కే సూపర్ హెచ్డీ పీఓఎల్ఈడీ డిస్ప్లే, ఆన్‌డ్రాయిడ్ 14 ఓఎస్, 30 ఎక్స్ హైబ్రిడ్ జూమ్, 3 ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50 ఎంపీ ప్రైమరీ ఏఐ కెమెరా, టర్బోపవర్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్, 125 వాట్ టర్బోపవర్ వైర్డ్ చార్జింగ్ వంటి హంగులు ఉన్నాయి. ధర రూ.27,999 నుంచి ప్రారంభం. -
ష్నైడర్ ఎలక్ట్రిక్ భారీ పెట్టుబడులు
బెంగళూరు: ఎనర్జీ మేనేజ్మెంట్, ఆటోమేషన్ దిగ్గజం ష్నైడర్ ఎలక్ట్రిక్ దేశీయంగా తయారీపై భారీ పెట్టుబడులకు సిద్ధపడుతోంది. 2026కల్లా తయారీ ప్లాంట్లపై రూ. 3,200 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. తద్వారా దేశ, విదేశాలలో అమ్మకాలకు భారత్‌ను తయారీ కేంద్రంగా వినియోగించుకోనున్నట్లు పేర్కొంది. ఈ బాటలో స్థానికంగా డేటా సెంటర్లకు అవసరమయ్యే కూలింగ్ సొల్యూషన్స్‌ను ఉత్పత్తి చేసేందుకు రూ. 100 కోట్లతో ఏర్పాటు చేసిన ప్లాంటును తాజాగా ప్రారంభించింది. ప్రణాళికల్లో భాగంగా గ్రూప్ తయారీ కేంద్రంగా భారత్‌లో పెట్టుబడులు చేపట్టనున్నట్లు ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ప్రెసిడెంట్, గ్రేటర్ ఇండియా జోన్ ఎండీ, సీఈవో దీపక్ శర్మ వెల్లడించారు. వివిధ ప్రొడక్టులు, సొల్యూషన్ల తయారీకి దేశవ్యాప్తంగా తయారీ ప్లాంట్లను నెలకొల్పనున్నట్లు కూలింగ్ సొల్యూషన్స్ యూనిట్ ప్రారంభం సందర్భంగా తెలియజేశారు. వెరసి మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, పశి్చమ బెంగాల్, ఉత్తరాఖండ్, ఒడిషాలలో యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. తాజా యూనిట్‌తో కలిపి ప్రస్తుతం కంపెనీ దేశవ్యాప్తంగా 30 ఫ్యాక్టరీలను నిర్వహిస్తోంది. -
మిడిల్ క్లాస్ డ్రీమ్ వెహికల్: ఐకానిక్ లూనా సరికొత్తగా! రిపబ్లిక్ డే ఆఫర్
దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పుంజుకుంటోంది. ఈ ట్రెండ్‌కు అనుగుణంగా దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీలన్నీ తమ మోడళ్లలో ఈవీ వెర్షన్స్ లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒకప్పటి మధ్యతరగతి కలల టూవీలర్ లూనా సరికొత్త అవతారంలో ఈవీగా భారతీయ వినియోగదారులను ఆకట్టుకొనేందుకు భారత్‌లో లాంచ్ కానుంది. ఈవీలకు పెరిగిన డిమాండ్ నేపథ్యంలో కెనటిక్ కంపెనీకి చెందిన పాపులర్ లూనా స్కూటర్‌ను తాజాగా ఈవీ వెర్షన్లో రిలీజ్ చేస్తోంది. అంతేకాదు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. మోస్ట్ ఎవైటెడ్ మల్టీ యుటిలిటీ e2W, కైనెటిక్ గ్రీన్ E-Lunaను వచ్చే నెల (ఫిబ్రవరి 2024) ఆరంభంలో రిలీజ్ చేయనుంది. బుకింగ్‌లు జనవరి 26న షురూ అవుతాయని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. Kinetic Green వెబ్సైట్లో కేవలం రూ. 500తో ప్రీ-బుక్ చేసుకోవచ్చు. కైనెటిక్ ఇ-లూనా పూర్తిగా మేడ్-ఇన్-ఇండియాగా వస్తోంది. మెట్రో ,టైర్ 1, టైర్-2, టైర్-3 నగరాలు , అలాగే గ్రామీణ యూజర్లును కూడా దృష్టిపెట్టుకుని అత్యాధునిక ఫీచర్లతో లూనా ఈవీ నితయారు చేసినట్టు కైనెటిక్ గ్రీన్ ఫౌండర్, సీఈవో సులజ్జ ఫిరోడియా మోత్వాని తెలిపారు. అంతేకాదు 'చల్ మేరీ లూనా' అంటూ యాడ్ ప్రపంచంలో సంచలనం రేపిన పియూష్ పాండే తిరిగి ఈ బ్రాండ్ కోసం పని చేయనున్నారట. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ లూనాకోసం సంతోషంగా ఉందని ప్రకటించారు పియూష్. నేటి యువతరాన్ని దృష్టిలో పెట్టుకుని మయూర్ అండ్ టీం దీనికోసం పనిచేస్తోందన్నారు.పీయూష్ పాండే ప్రస్తుతం ఒగిల్వీ ఇండియా గ్లోబల్ క్రియేటివ్ ఛైర్మన్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్నారు కాగా కైనెటిక్ 2000 ప్రారంభంలో దాని ఉత్పత్తిని నిలిపివేసింది Unleash the beats, charge up the streets, and ride the rhythm of the future on the Zulu! .#kineticgreen #kineticgreenev #kineticgreen2w #kineticgreenvehicles #kyaboltizulu #kineticgreenjourney #hiphop pic.twitter.com/h3rw3YzSRT — Kinetic Green (@KineticgreenEV) January 17, 2024 కైనటిక్ లూనాఫీచర్లు, అంచనాలు కైనెటిక్ ఇ లూనాకు సంబంధించిన ఫీచర్లను కంపెనీ అధికారికంగా ప్రకటించనప్పటికీ, అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. 16-అంగుళాల వైర్ స్పోక్ వీల్స్, మోపెడ్ ఆపడానికి రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. ఈ లూనా టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్బర్లతో వస్తుంది. ఈ లూనా ఒక ‘హై-స్పీడ్’ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా కూడా ఉంటుందని అంచనా. బ్యాటరీ 5 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. గంటకు గరిష్టంగా 60 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. పవర్‌ట్రెయిన్ డిజైన్ ఛార్జ్ టర్న్అరౌండ్ టైమ్‌లను తగ్గించడానికి మార్చుకునే లేదా రిమూవముల్ బ్యాటరీ ప్యా క్తో డిజైన్ చేసింది. -
టీవీ నుంచి వీడియోల వైపు.. !
న్యూఢిల్లీ: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అన్ని రంగాల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొబైల్ ప్రతిఒక్కరి జీవితంలో భాగమైంది. ఏదైనా కొత్త సినిమా, వెబ్‌సిరీస్ చూడాలన్నా ఇప్పుడు టీవీలకు బదులుగా మొబైల్, ల్యాప్టాప్లనే వాడుతున్నారు. అందరి ఇళ్లల్లో టీవీలు ఉన్నా క్రమంగా వాటి వాడకం తగ్గుతోంది. ఓటీటీలకు ప్రాధాన్యం పెరుగుతోంది. అందుకు సంబంధించి మీడియా పార్ట్నర్స్ ఏషియా ఆసక్తికర నివేదిక విడుదల చేసింది. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో (ఏపీఏసీ) 2028 నాటికి అత్యధికంగా ఆదాయం నమోదయ్యే టాప్ 6 వీడియో మార్కెట్లలో భారత్ కూడా ఒకటిగా ఎదగనుంది. ఈ జాబితాలో చైనా, జపాన్, కొరియా, ఆస్ట్రేలియా, ఇండొనేషియాలు కూడా ఉన్నాయి. ఆసియా–పసిఫిక్ ప్రాంత వీడియో పరిశ్రమలో ఈ ఆరు దేశాల వాటా ఏకంగా 90 శాతంగా ఉండనుంది. మీడియా పార్ట్నర్స్ ఏషియా (ఎంపీఏ) విడుదల చేసిన ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇక 2023–28 మధ్య కాలంలో అత్యంత వేగంగా ఎదిగే వీడియో మార్కెట్లలో ఒకటిగా భారత్ ఉంటుందని నివేదిక పేర్కొంది. వార్షిక ప్రాతిపదికన 5.6 శాతం మేర వృద్ధి చెందవచ్చని అంచనా వేసింది. 14 మార్కెట్లలో ఉచిత టీవీ చానళ్లు, పే–టీవీలు, వివిధ రకాల వీవోడీలు (వీడియో–ఆన్–డిమాండ్) .. వాటి వినియోగదారులు, ప్రకటనలు మొదలైన అంశాలను అధ్యయనం చేసిన మీదట ఎంపీఏ ఈ నివేదికను రూపొందించింది. దీని ప్రకారం 2023–28 మధ్య కాలంలో ఏపీఏసీ వీడియో పరిశ్రమ మొత్తం ఆదాయం 2.6 శాతం వార్షిక వృద్ధితో 165 బిలియన్ డాలర్లకు చేరనుంది. చైనా మార్కెట్ 1.7 శాతం వృద్ధితో 2028 నాటికి 70 బిలియన్ డాలర్లకు చేరుకోగలదు. ఆ తర్వాత స్థానాల్లో జపాన్ (35 బిలియన్ డాలర్లు), భారత్ (17 బిలియన్ డాలర్లు), కొరియా (14 బిలియన్ డాలర్లు), ఆస్ట్రేలియా (11 బిలియన్ డాలర్లు) ఉంటాయి. కనెక్టివిటీ దన్ను.. మెరుగైన ఇంటర్నెట్, కనెక్టెడ్ టీవీల వినియోగం పెరగడం, ప్రీమియం లోకల్ కంటెంట్‌పై ఇన్వెస్ట్ చేస్తుండటం, ప్రీమియం స్పోర్ట్స్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉండటం మొదలైన అంశాల వల్ల ఆసియా–పసిఫిక్ వీడియో పరిశ్రమ క్రమంగా టీవీ నుంచి ఆన్లైన్ వైపు వెడుతోందని నివేదిక తెలిపింది. రాబోయే రోజుల్లో ఆదాయాలు, వీక్షకుల సంఖ్య పెరగడానికి కూడా ఇదే కారణం కాగలదని పేర్కొంది. 2023లో 5.5 శాతం వృద్ధి .. ఏపీఏసీ వీడియో పరిశ్రమ ఆదాయం 2023లో 5.5 శాతం వృద్ధి చెందింది. 145 బిలియన్ డాలర్లకు చేరింది. ఆన్లైన్ వీడియో విభాగం ఇందుకు దోహదపడింది. ఏపీఏసీలో గతేడాది చైనా అగ్రస్థానంలోనే కొనసాగింది. 64 బిలియన్ డాలర్ల మార్కెట్‌గా నిల్చింది. చైనాను పక్కన పెడితే గతేడాది అతి పెద్ద మార్కెట్లలో జపాన్ (32 బిలియన్ డాలర్లు), భారత్ (13 బిలియన్ డాలర్లు), కొరియా (12 బిలియన్ డాలర్లు), ఆస్ట్రేలియా (9.5 బిలియన్ డాలర్లు), తైవాన్, ఇండొనేషియా ఉన్నాయి. వినియోగదారులు ఆన్లైన్ వైపు మళ్లుతుండటం, కనెక్టెడ్ టీవీలు పెరుగుతుండటంతో టీవీ మాధ్యమంపై ఒత్తిడి పెరుగుతోందని నివేదిక పేర్కొంది. -
కోకా కోలా నుంచి మద్యం.. రేటెంతో తెలుసా?
కూల్ డ్రింక్ అనగానే ఎక్కువ మందికి గుర్తొచ్చే బ్రాండ్ 'కోకా కోలా' (Coca Cola). ఈ కంపెనీ ఇప్పుడు మన దేశంలో తొలిసారిగా మద్యం విభాగంలోకి అడుగు పెట్టింది. కోకా కోలా మద్యం పేరు ఏమిటి? దాని ధరలు ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. థమ్స్ అప్, మ్కా, ఫాంటా, స్ర్పైట్, మాజా, కోకా కోలా జీరో షుగర్, డైట్ కోక్, ష్వెప్స్, ఛార్జ్డ్, కిన్లే, మినిట్ మెయిడ్, స్మార్ట్ వాటర్, రిమ్ జిమ్, హానెస్ట్ టీ, కోస్టా కాఫీ, జార్జియా వంటి వాటితో దూసుకెళ్తున్న కోకా కోలా తాజాగా 'లెమన్ డౌ' (Lemon-Dou) అనే పేరుతో మద్యం తయారు చేయడం మొదలు పెట్టింది. కోకా కోలా 'లెమన్ డౌ' ఇప్పుడు కేవలం గోవా, మహారాష్ట్రలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గోవాలో దీని ధర రూ. 150 కాగా.. మహారాష్ట్రలో రూ. 230 కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ మద్యం భారతీయులను ఆకర్షిస్తుందా? లేదా? అనే టెస్టింగ్ దశలోనే ఉంది. ఆ తరువాత ఇందులో ఏమైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తిస్తే.. కంపెనీ దానికి తగిన విధంగా మద్యం తయారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఈ ఏడాది ఎక్కువ గూగుల్ సెర్చ్ చేసిన విషయాలు ఇవే.. 2018లో కోకా కోలా కంపెనీ 'లెమన్ డౌ'ను జపాన్ దేశంలో పరిచయం చేసింది. ఇది చైనా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఇది భారతదేశానికి వచ్చింది. దేశీయ మార్కెట్లో ఈ మద్యం సక్సెస్ అవుతుందా.. లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది. -
మూడు నెలల కనిష్ఠానికి చేరనున్న సీపీఐ ద్రవ్యోల్బణం!
భారత గణాంకాల మంత్రిత్వ శాఖ సెప్టెంబర్‌కు సంబంధించిన వినియోగదారుల ధరల సూచీ డేటాను, ఆగస్టులోని పారిశ్రామిక ఉత్పత్తి డేటాను అక్టోబరు 12న విడుదల చేయనుంది. అందుకు నిపుణులు కారణాలను విశ్లేసిస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో మూడు నెలల కనిష్ఠానికి పడిపోయే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ద్రవ్యోల్బణం ఆగస్టులో 6.83 శాతంగా ఉంది. కానీ సెప్టెంబరు నెలకు అది 5.4 శాతానికి తగ్గుతుందని అంచనా. పారిశ్రామికోత్పత్తి సూచీ జులైలో 5.7తో పోలిస్తే ఆగస్టులో 9.1కు పెరిగినట్లు తెలుస్తుంది. అయితే ఇది గడిచిన 14 నెలల్లో అత్యధికం. సెప్టెంబర్‌లో టమాటా ధరలు సాధారణ స్థితికి రావడంతో నెలవారీగా ఖర్చుల శాతం తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు. దాంతో పాటు ఇండియన్ మార్కెట్లు జీవితకాలపు గరిష్ఠాల్లో ట్రేడయ్యాయి. అయితే అదే సమయంలో ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌లో ఉల్లి ధరలు 12 శాతం పెరిగాయి. తృణధాన్యాలు, పప్పుల ధరలు పెరిగాయి. సెప్టెంబరులో అంతర్జాతీయ చమురు ధరలు దాదాపు 8.8శాతం పెరిగినప్పటికీ చమురు మార్కెటింగ్ కంపెనీలు మాత్రం ధరలపై ఎలాంటి ప్రభావం చూపకపోవడం కొంత ఊరట కలిగించినట్లు కొన్ని వర్గాలు తెలిపాయి. అన్ని కారణాల వల్ల ద్రవ్యోల్బణం దాదాపు ఒకటిన్నర శాతం తగ్గుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. -
200 కి.మీ రేంజ్లో కొత్త ఈ-స్కూటర్ : బుకింగ్స్ షురూ! ధర మాత్రం!
Pure EV ePluto 7G Max electric scooter: ప్యూర్ ఈవీ భారతదేశంలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. 201 కిమీ పరిధితో ePluto 7G మాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. దేశంలో 200 కిమీ కంటే ఎక్కువ పరిధిని అందిస్తున్న 2-వీలర్ EVలలో ePluto 7G మాక్స్ ఒకటిగా నిలిచింది. ఈ వింటేజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్‌లు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. ePluto 7G MAX ఫీచర్లు : AIS-156 సర్టిఫికేట్, స్మార్ట్ BMS , బ్లూటూత్ కనెక్టివిటీతో 3.5 KWH బ్యాటరీని అమర్చింది. స్కూటర్ హిల్ స్టార్ట్ అసిస్ట్, డౌన్‌హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెన్, రివర్స్ మోడ్ ,స్మార్ట్ AI వంటి ఫీచర్లతో వస్తుంది. ఇవి బ్యాటరీ ఆరోగ్యాన్ని కాపాడతాయని కంపెనీ పేర్కొంది. దీని ధర రూ. 1,14,999 (ఎక్స్-షోరూమ్). రాష్ట్ర స్థాయి సబ్సిడీలు , RTO రుసుములను బట్టి ఆన్-రోడ్ ధర మారుతుంది. వచ్చే పండుగ సీజన్ నుండి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఈ స్కూటర్ మ్యాట్ బ్లాక్, రెడ్, గ్రే , వైట్ నాలుగు రంగులలో లభించనుంది. (ODI WC 2023 Revenue Prediction: ఆదాయంపై బీవోబీ సంచలన అంచనాలు) అత్యధికంగా అమ్ముడవుతున్న 7G మోడల్ అప్‌గ్రేడ్ వెర్షన్ రోజుకు 100 కి.మీ డ్రైవ్ చేసే వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్యూర్ EV సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోహిత్ వదేరా తెలిసారు. మరోవైపు కంపెనీ దాదాపు అన్ని ప్రముఖ నగరాలు, పట్టణాలలో తన డీలర్ నెట్‌వర్క్‌ను దూకుడుగా విస్తరిస్తోంది, FY24 చివరి నాటికి 300 కంటే ఎక్కువ టచ్పాయింట్లను లక్ష్యంగా చేసుకుంది. -
పండగ సీజన్: అందుబాటులో ధరలో సీఎన్జీ కార్లు
పండుగ సీజన్ దగ్గర పడుతోంది. అందుబాటులో ధరలో సీఎన్జీకారు కోసం చూస్తున్నారా? అయితే ప్రస్తుతం భారతదేశంలో అత్యంత సరసమైన, పర్యావరణహిత CNG-ఆధారిత కార్లను ఒకసారి పరిశీలిద్దాం Maruti Alto & Alto K10 S-CNG దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి చెందిన కార్లలో సిఎన్జి కార్ సెగ్మెంట్ల ఆల్టో సిరీస్, ఆల్టో ఆల్టో కె10 లాంటి ప్రధానంగా ఉన్నాయి. ఆల్టో 796cc ఇంజన్ 40 bhp, 60 గరిష్టటార్క్ను అందిస్తుంది. వీటి ధరలు ఆల్టో ధర రూ. 5.13 లక్షలు. ఆల్టో కె10 1.0-లీటర్ ఇంజన్ (56 బిహెచ్పి & 82 ఎన్ఎమ్) కలిగి ఉంది. ఈ మోడల్ రెండూ సమర్థవంతమైన పనితీరును అందిస్తాయి. లు ప్రశంసనీయమైన ఇంధన సామర్థ్యంతో సిటీ డ్రైవింగ్‌కు అనువైనవి. ఆల్టో K10 ధర రూ. 5.96 లక్షలు Maruti S-Presso S-CNG మారుతి ఎస్ ప్రెస్సో 1.0-లీటర్ ఇంజన్. 56 bhp. 82 Nm అందిస్తుంది. ధర: రూ. 5.91-6.11 లక్షలు Maruti Wagon R S-CNG, వ్యాగన్ ఆర్ చక్కటి ఇంటీరియర్ స్పేస్‌తో ముచ్చటైన కారు ఇది. రోజువారీ ప్రయాణానికి ఆకర్షణీయమైన ఎంపిక. 1.0-లీటర్ ఇంజన్ (56 bhp & 82 Nm) సామర్థ్యంతో వస్తుంది. ధర: రూ. 6.44-6.89 లక్షలు Tata Tiago iCNG టాటా టియాగో టాటా టియాగో iCNG చక్కటి బూట్ స్పేస్‌తో అందుబాటులోఉన్న CNG హ్యాచ్‌బ్యాక్ ఇది. 1.2-లీటర్ CNG ఇంజన్ (72 bhp & 95 Nm) , స్పెషల్ ట్విన్ CNG సిలిండర్ సిస్టమ్‌తో ఉన్నదీనిధర: రూ. 6.54-8.20 లక్షలు. Maruti Celerio S-CNG: మారుతి సెలేరియో 1.0-లీటర్ CNG ఇంజిన్‌తో బడ్జెట్‌ధరలో అందుబాటులో ఉన్న కారిది. ధర: రూ. 6.73 లక్షలు టాటా పంచ్ Tata Punch iCNG ఈ కాంపాక్ట్ SUV 1.2-లీటర్ ఇంజన్ 72 bhp మరియు 95 Nm ను అందిస్తుంది. ధర: రూ. 7.09 నుంచి 9.67 లక్షలు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్జీ Hyundai Grand i10 Nios CNG : 1.2-లీటర్ ఇంజన్ 68 బిహెచ్పి, 95 ఎన్ఎంను అందిస్తుంది. ధర: రూ. 7.58-8.13 లక్షలు -
లగ్జరీ బీఎండబ్ల్యూ ఈవీ: గంటల్లోనే హాట్ సేల్, ధర ఎంతంటే?
జర్మనీ లగ్జరీ కార్ మేకర్ బీఎండబ్ల్యూ ఇండియా కొత్తరు కారును లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. BMW iX1 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఇండియాలో ఆవిష్కరించింది. ఫుల్లీ ఎలక్ట్రిక్ BMW iX1 బుకింగ్‌లు ప్రత్యేకంగా ఆన్లైన్లో తీసుకొచ్చింది. బుకింగ్స్ అలా మొదలు పెట్టిందో లేదో విపరీతమైన డిమాండ్‌ను నమోదు చేసింది. ఈ హాల్ సేల్‌లో ఇప్పటికే 2023కి సంబంధించిన మొత్తం యూనిట్లు అందుకుంది. రూ. 66.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)ధరతో తీసుకొచ్చిన ఈ ఎస్యూవీ డెలివరీలో అక్టోబర్‌లో ప్రారంభం. లాంచింగ్ రోజే iX1 SUVకి ‘అసాధారణ స్పందన రావడం థ్రిల్లింగ్‌గా ఉందంటూ BMW ప్రెసిడెంట్ విక్రమ్ పవా సంతోషం ప్రకటించారు. తమకు ఇండియాలో iX1కి గొప్ప అరంగేట్రం అని పేర్కొన్నారు. కానీ ఎన్ని యూనిట్లు సేల్ అయిందీ కచ్చితమైన వివరాలు అందించలేదు. డిజైన్ పరంగా, iX1 ఒక విభిన్నమైన 'I' ఎలక్ట్రిక్ గుర్తింపు,అడాప్టివ్ LED హెడ్లైట్లు LED హెడ్‌ల్యాంప్‌లు రన్నింగ్ బోర్డ్‌లతో పాటు ముందు మరియు వెనుక బంపర్‌లో బ్లూ యాక్సెంట్లతో దాదాపు చతురస్రాకారంలో గ్రిల్‌ను అమర్చింది. iX1 66.4kWh బ్యాటరీ ప్యాక్, 80 kms/hr గరిష్ట వేగంతో 5.6సెకన్లలో 100 కి.మీటర్ల వరకు తక్షణ వేగవంతం అందుకుంటుంది. ఇది 313 హెచ్‌పి పవర్‌ను గరిష్టంగా 494 ఎన్ఎమ్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 29 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. దాదాపు 6.3 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. ఆల్ఫ్‌లైన్ వైట్, స్పేస్ సిల్వర్, బ్లాక్ సఫైర్ , స్టార్మ్ బే అనే నాలుగు రంగుల్లో లభ్యం. 10.7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది. ఇది బ్లూ రింగ్ ఫినిషర్ లోగోతో ఎమ్ స్పోర్ట్ లెదర్ స్టీరింగ్ వీల్, 12 స్పీకర్లతో హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, మసాజ్ ఫంక్షన్లతో కూడిన యాక్టివ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైట్‌ని కలిగి ఉంది. అలాగే డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్ టెయిల్‌గేట్ మరియు స్టోరేజీతో కూడిన ఫ్లోటింగ్ ఆర్మ్‌రెస్ట్ ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. -
విడుదలకు సిద్దమవుతున్న ఎలక్ట్రిక్ కార్లు - వివరాలు
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ రోజురోజుకి పెరుగుతున్న వేళ ఇప్పటికే విడుదలైన వాహనాలను కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో టాటా పంచ్ ఈవీ, హ్యుందాయ్ ఎక్స్టర్ ఈవీ, మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఈవీ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 1. టాటా పంచ్ ఈవీ: ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో అత్యధిక భద్రత కలిగిన వాహనాల జాబితాలో ఒకటిగా ఉన్న టాటా పంచ్ త్వరలో ఎలక్ట్రిక్ రూపంలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అనేక సార్లు టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ కారు ఈ ఏడాది చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో విడుదలకానున్నట్లు సమాచారం. దేశీయ విఫణిలో ఎంతోమంది వాహన ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో పంచ్ ఈవీ కూడా ఒకటి. ఇది రెండు బ్యాటరీ ఫ్యాక్ ఆప్షన్‌తో లభించనుంది. అవి 19.2 కిలోవాట్ (65 Bhp / 110 Nm) & 24 కిలోవాట్ (74 Bhp / 114 Nm) బ్యాటరీ ప్యాక్. ఈ ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది. 2. హ్యుందాయ్ ఎక్స్టర్ ఈవీ: ఈ ఏడాది మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త హ్యుందాయ్ ఎక్స్టర్ కూడా ఎలక్ట్రిక్ వెర్షన్ రూపంలో విడుదలకానుంది. టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారు 2024 చివరి నాటికి మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. బ్యాటరీ ఇందులో 25 కిలోవాట్ నుంచి 30 కిలోవాట్ మధ్యలో ఉండవచ్చని అంచనా. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: టెక్సాస్ సరిహద్దులో మస్క్ - వీడియో వైరల్ 3. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఈవీ: మారుతి సుజుకి ఫ్రాంక్స్ త్వరలో ఎలక్ట్రిక్ కారుగా విడుదలకానుంది. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో కంపెనీ 2030 నాటికి 6 వాహనాలను విడుదల చేయడానికి కంపెనీ సన్నద్ధమవుతోంది. ఇందులో ఒకటి ఫ్రాంక్స్ ఈవీ. ఈ వెర్సన్ గురించి కంపెనీ అధికారిక వివరాలు వెల్లడించనప్పటికీ.. ఇది ఒక సింగిల్ ఛార్జ్‌తో 400 నుంచి 450 కిమీ రేంజ్ అందించవచ్చని తెలుస్తోంది. Note: ఈ కథనంలో ఉపయోగించిన ఫోటోలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అధికారిక చిత్రాలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
Today Gold and Silver: బంగారం నేలచూపులు, షాకిస్తున్న వెండి
Today Gold and Silver Prices: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరింత దిగివచ్చాయి. గత కొన్ని సెషన్లుగా నేలచూపులు చూస్తున్న పసిడి ధర శుక్రవారం దేశవ్యాప్తంగా సుమారు 300 రూపాయలు క్షీణించింది. మూడు రోజుల్లో దాదాపు వెయ్యిరూపాయలు దిగి వచ్చింది. సెప్టెంబరు 26న రూ. 54,750గా ఉన్న 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర శుక్రవారం నాటికి రూ. 54 వేల స్థాయిని కోల్పోయి 53,650 స్థాయికి దిగి వచ్చింది. మూడు సెషన్లలో 1100 దిగివచ్చింది.హైదరాబాద్ మార్కెట్లో 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 250 రూపాయలు క్షీణించి రూ. 53,650గా ఉంటే…24 క్యారెట్ల బంగారం ధర రూ.270 తగ్గి రూ. 58,530గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అయితే వెండి మాత్రం వెయ్యి రూపాయలు పుంజుకుంది. దీంతో కిలో వెండి ధర ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ. 77500 ఉండగా, ఢిల్లీలో రూ.74,700 పలుకుతోంది. (బ్యాంకు లాకర్లో రూ.18 లక్షలు చెదల పాలు: లాకర్ కొత్త నిబంధనలు తెలుసా?)కాగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్న సంగతి తెలిసిందే. అలాగే దేశీయంగా కూడా పెళ్లిళ్ల సీజన్లో పుంజుకున్నప్పటికీ, గత కొన్ని వారాలుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు పాజటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. -
యాప్ట్రానిక్స్ స్టోర్స్‌లో ఐఫోన్లపై బంపర్ ఆఫర్లు
Offers on iPhone 15 series యాపిల్ ఉత్పత్తుల విక్రయ సంస్థ యాప్ట్రానిక్స్ తాజాగా ఐఫోన్ 15 స్మార్ట్ఫోన్లు, వాచ్‌లను దేశవ్యాప్తంగా 56 స్టోర్స్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. గుంటూరు, సిద్ధిపేట, విజయనగరం, భీమవరం తదితర నగరాల్లోని స్టోర్స్ కూడా వీటిలో ఉన్నాయి. గుంటూరు, సిద్ధిపేట స్టోర్స్‌లో ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఐఫోన్ 14 లేదా ఐఫోన్ 13లను కొనుగోలు చేసేవారు రూ. 11,000 విలువ చేసే యాక్సెసరీలు ఉచితంగా పొందవచ్చని పేర్కొంది. ప్రత్యామ్నాయంగా రూ. 2,500 ఫ్లాట్ డిస్కౌంటును ఎంచుకోవచ్చని తెలిపింది. అదనంగా యాపిల్కేర్ప్లస్, ప్రొటెక్ట్ప్లస్పై రూ. 2,000 మినహాయింపును, ఫోన్‌ను ఎక్సే్చంజ్ చేస్తే రూ. 6,000 వరకు బోనస్ వంటివి పొందవచ్చు. మొత్తం మీద గుంటూరు, సిద్ధిపేట కస్టమర్లు 31 శాతం వరకు ఆదా చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. -
ఫెస్టివ్ సీజన్: బంగారం, వెండి ధరలు, ఎన్నాళ్లీ ఒత్తిడి!
Gold and silver prices today : దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో శనివారం 10గ్రాముల పసిడి (22 క్యారెట్లు) ధర రూ. 100 పెరిగి రూ. 54,950కి చేరింది. అలాగే 10 గ్రాముల (24 క్యారెట్లు) బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 59,950 వద్ద ఉంది. అ టు వెండి ధరలు కూడా పుంజుకున్నాయి. దేశంలో కిలో వెండి ధర 300 రూపాయి ఎగిసి రూ. 75,800కి చేరింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 79,300గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో 60వేల మార్క్‌ను దాటేసిన 10 గ్రాముల గోల్డ్ ధరలో గత కొన్ని రోజులుగా పసిడి ధరల్లో తీవ్ర ఒత్తిడి కొనసాగుతోంది. దీంతో రానున్న ఫెస్టివ్ సీజన్ , దీపావళి పెళ్లిళ్ల ముహూర్తాల నేపథ్యంలో బంగారం కొనాలో, వెయిట్ చేయాలో తెలియని అనిశ్చితి వినియోగదారుల్లో నెలకొంది. ఫెడ్ వడ్డీరేట్లు ప్రస్తుతం యథాతథంగా ఉంచినప్పటికీ ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో మరోసారి వడ్డీ వడ్డన ఉంటుందనే అంచనాల మధ్య పసిడి ధరలపై ఒత్తిడి కొనసాగుతోందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు , జాతీయ అంతర్జాతీయ పరిణామాలు, ఆర్థిక పరిస్థితులు, ఫెడ్ వడ్డీరేటు, రూపాయి, డాలరు కదలికలపై భారతీయ మార్కెట్లో పసిడి ధరలు ఆధారపడి ఉంటాయి. అలాగే ప్రపంచ బంగారం డిమాండ్, వివిధ దేశాలలో కరెన్సీ విలువలు, ప్రస్తుత వడ్డీ రేట్లు , బంగారు వాణిజ్యానికి సంబంధించిన ప్రభుత్వ నిబంధనలు వంటి అంశాలు కూడా దోహదం చేస్తాయి. -
ఫెడ్ ఎఫెక్ట్: స్టాక్ మర్కెట్ పతనం, దిగివచ్చిన పసిడి
Today Gold and Silver Prices: బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని సెషన్లుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర గురువారం కాస్త నెమ్మదించింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రా. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 150 తగ్గి రూ. 55,050గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10గ్రా. బంగారం ధర 180 రూపాయలు ఎ గిసి 60,050 వద్ద ఉంది. మరోవైపు కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ.78 వేలు పలుకుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. (డేటా భద్రత నిబంధనలు: తేడా వస్తే రూ. 250 కోట్ల వరకు జరిమానా) ముఖ్యంగా ఫెడ్ వడ్డీరేట్లు యధాతథంగాఉంచడంతో డాలర్ బలంపుంజుకుంది. డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి స్వల్పంగా నష్టపోతోంది. ఇక స్టాక్‌మార్కెట్ల విషయానికి వస్తే గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ ఏకంగా 500పాయింట్లకుపైగా కుప్పకూలగా, 147 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 19800 స్థాయిని కూడా కోల్పోయి మరింత బలహీన సంకేతాలందించాయి. అటు ఆయిల్ రేట్లు భగ్గుమన్నాయి. -
పండగ వేళ పసిడి పరుగు, వెండి ఎంత తగ్గిందంటే!
Today Gold and Silver Prices: దేశంలో బంగారం , వెండి ధరలు పైపైకే చూస్తున్నాయి. గతరెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర సోమవారం మరింత ఎగిసింది. అటు వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని సెషన్లుగా పరుగాపక పయనిస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ పెరుగుతున్న చమురు, డాలరు బలం బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) (సెప్టెంబర్ 18, సోమవారం నా డు )లో బంగారం, వెండి ధరలు రెండూ పెరిగాయి.అక్టోబర్ 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్ MCXలో రూ. 105 పెరిగి 10 గ్రాములకు రూ.59,098గా ఉంది. అదేవిధంగా, డిసెంబర్ 5, 2023న మెచ్యూర్ అయ్యే వెండి ఫ్యూచర్స్ కూడా రూ. 307 లేదా 0.43 శాతం పెరిగి MCXలో కిలోకు రూ. 72,461 వద్ద ట్రేడవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల పసిడి ధర 140 రూపాయిలు పెరిగి, 10గ్రాములకు 55,050 గా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 150 రూపాయలు పుంజుకుని 60.050పలుకుతోంది. అటు వెండి కిలో స్వల్పంగా 200 రూపాయిలు తగ్గి కిలో వెండి 74,500గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అటు వరస లాభాలకుచెక్ చెప్పిన దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం నష్టాల్లోకి జారుకున్నాయి.మరోవైపు పెరుగుతున్న చమురు ధరల కారణంగా భారత కరెన్సీ రూపాయి డాలరు మారకంలో 83.22 వద్ద రికార్డు కనిష్ట స్థాయికి చేరుకుంది.