చెన్నై: ఎలక్ట్రిక్ టూ వీలర్ల తయారీలో ఉన్న బెంగళూరు కంపెనీ సింపుల్ ఎనర్జీ తాజాగా సింపుల్ వన్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ధర బెంగళూరు ఎక్స్‌షోరూంలో రూ.1.45 లక్షలు. ఒకసారి చార్జింగ్‌తో 212 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. కస్టమర్‌లు రూ. 13,000 అదనంగా చెల్లించి 750-వాట్ల పోర్టబుల్ ఛార్జర్‌ని తీసుకోవచ్చు. (వార్నీ.. రేఖలా మారిపోయిన అమితాబ్, అందంగా సల్మాన్ ఖాన్)
2021 ఆగస్ట్ 15న రూ.1.10 లక్షల ధరతో ఈ మోడల్‌ను కంపెనీ ఆవిష్కరించింది. కాగా, జూన్ 6 నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయని సింపుల్ ఎనర్జీ తెలిపింది. దేశవ్యాప్తంగా విస్తరణ, సామర్థ్యం పెంపునకు వచ్చే 12-18 నెలల్లో సుమారు రూ.820 కోట్లు వెచ్చించనున్నట్టు సంస్థ ఫౌండర్ సుహాస్ రాజ్‌కుమార్ తెలిపారు. ఏడాదిలో 40-50 నగరాల్లో 180 వరకు ఔట్‌లెట్లను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.
సింపుల్ వన్ కోసం ఇప్పటికే ఒక లక్ష యూనిట్లకు బుకింగ్స్ ఉన్నాయని వెల్లడించారు. ధర రూ.35 వేలు పెరిగినప్పటికీ బుకింగ్స్ రద్దు కాకపోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడులోని శూలగిరి వద్ద ప్లాంటుకు ఇప్పటికే కంపెనీ రూ.110 కోట్లు ఖర్చు చేసింది. వార్షిక తయారీ సామర్థ్యం 5 లక్షల యూనిట్లు. (కొత్త వ్యాపారంలోకి నయన్, అంత సాహసం ఎందుకు చేస్తోంది? క్లారిటీ)
Comments
Please login to add a commentAdd a comment