Simple One Electric Scooter
-
తక్కువ ధరలో విడుదలకానున్న సింపుల్ ఎనర్జీ స్కూటర్లు - వివరాలు
Simple Energy Electric Scooters: సుదీర్ఘ విరామం తరువాత 'సింపుల్ ఎనర్జీ' (Simple Energy) కంపెనీ దేశీయ మార్కెట్లో 'సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్' లాంచ్ చేసింది. కాగా సంస్థ ఇప్పుడు వచ్చే త్రైమాసికంలో మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, రాబోయే రోజుల్లో సింపుల్ ఎనర్జీ విడుదల చేయనున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పటికే అందుబాటులో ఉన్న సింపుల్ వన్ స్కూటర్ ధర కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో విడుదలైన సింపుల్ వన్ స్కూటర్ ధర రూ. 1.45 లక్షల నుంచి రూ. 1.5 లక్షల మధ్య ఉంది. ఇప్పటికే ఈ స్కూటర్ డెలివరీలు కూడా మొదలయ్యాయి. (ఇదీ చదవండి: కన్నీళ్లు తెప్పిస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్ కష్టాలు.. కస్టమర్ సాయంతో జాబ్ కొట్టాడిలా..!) కంపెనీ విడుదలచేయనున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు బహుశా రూ. 1 లక్ష నుంచి రూ. 1.2 లక్షల మధ్య ఉండొచ్చని సమాచారం. ధర తక్కువగా ఉంటుంది కావున బ్యాటరీ చిన్నగా ఉంటుంది, తద్వారా రేంజ్ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదలైన తరువాత టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ 450 ఎక్స్, ఓలా ఎస్1 ఎయిర్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉంటుంది. (ఇదీ చదవండి: చిన్నప్పుడు స్కూల్లో నన్ను ఇలా ఎగతాళి చేసేవారు - అనంత్ అంబానీ!) సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.8 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ, 8.5 కిలోవాట్ మోటార్ ఉంటుంది. కావున ఇది 72 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 236 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ కలిగి బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. -
సింపుల్ వన్ డెలివరీలు మొదలయ్యాయ్ - అక్కడ మాత్రమే
Simple One Electric Scooter: గత కొన్ని నెలల నిరీక్షణ తరువాత 'సింపుల్ ఎనర్జీ' దేశీయ మార్కెట్లో ఇటీవల 'సింపుల్ వన్' ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు కంపెనీ డెలివరీలను కూడా ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, సింపుల్ ఎనర్జీ సుమారు ఒక లక్ష కంటే ఎక్కువ బుకింగ్స్ స్వీకరించింది. అయితే ఇప్పుడు కేవలం 15 యూనిట్లను మాత్రమే డెలివరీ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం డెలివరీలు కేవలం బెంగళూరులో మాత్రమే ప్రారంభమయ్యాయి. త్వరలోనే దేశంలోని మరిన్ని ప్రధాన నగరాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. (ఇదీ చదవండి: రెపో రేటుపై ఆర్బీఐ ప్రకటన.. కీలక వడ్డీ రేట్లు యధాతథం) సింపుల్ ఎనర్జీ కంపెనీ దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 40 నుంచి 50 నగరాల్లో 160 నుంచి 180 రిటైల్ స్టోర్లను ప్రారంభించింది. వీటి ద్వారానే కంపెనీ దేశంలో తన ఉనికిని విస్తరాయించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.45 లక్షలు. ఇది ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 212 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇక డిజైన్, ఫీచర్స్ పరంగా దాని ప్రత్యర్థులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. -
సింపుల్ వన్: లాంగెస్ట్ రేంజ్ స్కూటర్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా?
చెన్నై: ఎలక్ట్రిక్ టూ వీలర్ల తయారీలో ఉన్న బెంగళూరు కంపెనీ సింపుల్ ఎనర్జీ తాజాగా సింపుల్ వన్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ధర బెంగళూరు ఎక్స్‌షోరూంలో రూ.1.45 లక్షలు. ఒకసారి చార్జింగ్‌తో 212 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. కస్టమర్లు రూ. 13,000 అదనంగా చెల్లించి 750-వాట్ల పోర్టబుల్ ఛార్జర్‌ని తీసుకోవచ్చు. (వార్నీ.. రేఖలా మారిపోయిన అమితాబ్, అందంగా సల్మాన్ ఖాన్) 2021 ఆగస్ట్ 15న రూ.1.10 లక్షల ధరతో ఈ మోడల్‌ను కంపెనీ ఆవిష్కరించింది. కాగా, జూన్ 6 నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయని సింపుల్ ఎనర్జీ తెలిపింది. దేశవ్యాప్తంగా విస్తరణ, సామర్థ్యం పెంపునకు వచ్చే 12-18 నెలల్లో సుమారు రూ.820 కోట్లు వెచ్చించనున్నట్టు సంస్థ ఫౌండర్ సుహాస్ రాజ్‌కుమార్ తెలిపారు. ఏడాదిలో 40-50 నగరాల్లో 180 వరకు ఔట్లెట్లను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. సింపుల్ వన్ కోసం ఇప్పటికే ఒక లక్ష యూనిట్లకు బుకింగ్స్ ఉన్నాయని వెల్లడించారు. ధర రూ.35 వేలు పెరిగినప్పటికీ బుకింగ్స్ రద్దు కాకపోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడులోని శూలగిరి వద్ద ప్లాంటుకు ఇప్పటికే కంపెనీ రూ.110 కోట్లు ఖర్చు చేసింది. వార్షిక తయారీ సామర్థ్యం 5 లక్షల యూనిట్లు. (కొత్త వ్యాపారంలోకి నయన్, అంత సాహసం ఎందుకు చేస్తోంది? క్లారిటీ) -
ఇక సుదీర్ఘ నిరీక్షణకు తెర.. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ రేపే!
Simple One Electric Scooter: బెంగళూరుకు చెందిన ప్రముఖ స్టార్టప్ కంపెనీ 'సింపుల్ ఎనర్జీ' (Simple Energy) దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్న 'సింపుల్ వన్' (Simple One) ఎలక్ట్రిక్ స్కూటర్ని రేపు అధికారికంగా విడుదల చేయడానికి సన్నద్ధమైంది. సుదీర్ఘ విరామం తరువాత విడుదలకానున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎంతో అతృతతో ఎదురు చూస్తున్నారు. డెలివరీలు కూడా బహుశా రేపు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పాటు పరిచయమైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దాదాపు రెండు సంవత్సరాల తరువాత మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఎటువంటి ఇబ్బందులు కస్టమర్లు ఎదుర్కోకూడదని చాలా రోజులుగా టెస్ట్ చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ మొత్తం చరమ దశకు చేరింది. కావున విడుదలకు సన్నద్ధమైపోయింది. రేంజ్ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.8kWh లిథియం-అయాన్ బ్యాటరీ, 8.5 కిలోవాట్ మోటార్ ఉంటుంది. కావున ఇది 72 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 236 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ గతంలోనే ధ్రువీకరించింది. కావున మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఇది గట్టి పోటీ ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ కలిగి బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఈ స్కూటర్ ఎకో, రైడ్, డాష్, సోనిక్ అనే నాలుగు రైడింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక మోనోషాక్, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు లభిస్తాయి. (ఇదీ చదవండి: భారత్‌లో విడుదలైన ఆల్ట్రోజ్ సిఎన్జి.. ధర తక్కువ & ఎక్కువ ఫీచర్స్!) ధర & ప్రత్యర్థులు ఇప్పటికే మంచి బుకింగ్స్ పొందిన ఈ స్కూటర్ రానున్న రోజుల్లో మరిన్ని గొప్ప బుకింగ్స్ పొందుతుందని ఆశిస్తున్నాము. కంపెనీ ఈ స్కూటర్ ధరను రూ. 1.09 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) గతంలోనే ప్రకటించింది. ఇది మార్కెట్లో ఓలా ఎస్1, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ 450 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ డేట్ ఫిక్స్ - నిరీక్షణకు తెర పడ్డట్టే..
ఓలా ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లో మొదటిసారి తన ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలచేసినప్పుడు బెంగళూరుకు చెందిన ప్రముఖ స్టార్టప్ కంపెనీ సింపుల్ ఎనర్జీ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ పరిచయం చేసింది. అయితే ఇప్పటివరకు అనేక విధాలుగా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ని టెస్ట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు ఈ స్కూటర్ మే 23 న అధికారికంగా మార్కెట్లో విడుదలకానున్నట్లు సమాచారం. సింపుల్ ఎనర్జీ 2023 మే 23న తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గతంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీలో ఏర్పడిన లోపల వల్ల కొన్ని కంప్లైంట్స్ వెలుగులోకి వచ్చాయి. ఆ సమయంలో కంపెనీ సింపుల్ వన్ స్కూటర్‌ను మరింత నిశితంగా పరిశీలిస్తూ విడుదల చేయడంలో కొంత ఆలస్యం చేసింది. ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ (AIS) సవరణ 3 ప్రవేశపెట్టిన తరువాత మెరుగైన బ్యాటరీ భద్రతలను కలిగి ఉన్న స్కూటర్లలో సింపుల్ వన్ ప్రధానంగా చెప్పుకోదగ్గదిగా మారింది. కావున ఈ స్కూటర్ మార్కెట్లో అమ్మకానికి రానున్న అత్యంత సురక్షితమైన ఎలక్ట్రిక్ స్కూటర్ కానుంది. (ఇదీ చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన కార్లు వీరి దగ్గరే ఉన్నాయి - ధరలు తెలిస్తే దిమ్మతిరిగాల్సిందే!) కొత్త సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 4.8kWh లిథియం-అయాన్ బ్యాటరీ, 8.5 కోలోవాట్ మోటార్ ఉంటుంది. కావున 72 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 236 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ గతంలోనే ధ్రువీకరించింది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే మంచి సంఖ్యలో బుకింగ్స్ కూడా పొందింది, కాగా త్వరలో లాంచ్ అవుతుంది. డెలివరీలు కూడా వేగంగానే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేశాలను మాతో పంచుకోండి. -
ఓలా స్కూటర్లో వచ్చిన మంటలపై సింపుల్ వన్ సీఈఓ ఆసక్తికర ట్వీట్..!
పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు కాలుష్యాన్ని తగ్గిస్తుందంటూ చెబుతూ వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయా? అంటే అవును అనే విధంగా వరుస సంఘటనలు దేశంలో చోటు చేసుకుంటున్నాయి. వేసవి కాలం మొదలైందో లేదో ఒకే రోజు తమిళనాడు, మహారాష్ట్రలలో రెండు చోట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. పూణే నగరంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్ 1 ప్రో బైకు అగ్నికి ఆహుతయ్యింది. రోడ్డు పక్కన ఓ షాపు ముందు నిలిపి ఉంచిన స్కూటరు నుంచి ఉన్నట్టుండి పొగలు రావడం మొదలైంది. క్షణాల్లోనే దట్టమైన పొగలు కాస్తా మంటలుగా మారింది. నిమిషాల వ్యవధిలోనే ఓలా స్కూటర్ అగ్ని కీలల్లో చిక్కుకుని కాలి మసయ్యింది. అక్కడే ఉన్న స్థానికులు ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. దేశ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉన్న ఓలా స్కూటర్ మంటల్లో చిక్కుకుని తగలబడి పోవడం సంచలనంగా మారింది. ఈ స్కూటరులో అమర్చిన లిథియం ఐయాన్ బ్యాటరీలో ఎక్సోథెర్మిక్ రియాక్షన్ కారణంగానే మంటలు వ్యాపించి ఉంటాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపించాలని.. స్కూటరు డిజైనులో లోపాలు ఉంటే వెంటనే సరి చేయాలని ఓలా స్కూటర్ యూజర్లు డిమాండ్ చేస్తున్నారు. As summer arrives, it’s a real test for survival of #EV in India. #EVonFire #BatteryMalfunction pic.twitter.com/Xxv9qS4KSu — Saharsh Damani, MBA, CFA, MS (Finance) (@saharshd) March 26, 2022 అయితే, ఈ సంఘటనపై ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ వాహన తయారీ సంస్థ సింపుల్ వన్ సీఈఓ పరోక్షంగా స్పందించారు. ఈ సంఘటన గురించి ప్రస్తావించకుండా.. వారు తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి తీసుకుంటున్న భద్రతపై సింపుల్ వన్ సీఈఓ సుహాస్ రాజ్ కుమార్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏముంది అంటే?.. #SimpleONE ప్రారంభ రోజుల నుంచి థర్మల్ పనితీరుపై మా ప్రధాన దృష్టి ఉంది. అపూర్వమైన పనితీరును పనితీరు పొందడానికి, థర్మల్ సమస్యలు నివారించడానికి, తీవ్రమైన పరిస్థితులలో కూడా ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచడానికి మేము మా స్వంత థర్మల్ మేనేజ్మెంట్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాము. మాకు మీ #SafetyFirst" అని ట్వీట్ చేస్తూ మరోక ట్వీట్‌ను రీ-ట్వీట్ చేశారు. Thermal performance was one of our prime areas of focus ever since the early days of #SimpleONE To achieve unprecedented performance, we developed our own thermal management system to avoid thermal runways, keeping the temperatures in check even in extreme conditions #SafetyFirst https://t.co/Ea90duQk3L — Suhas Rajkumar (@suhasrajkumar) March 27, 2022 (చదవండి: రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్...తల్లిదండ్రులకు షాకింగ్ న్యూస్..!) -
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి అదిరిపోయే శుభవార్త.. సింగిల్ ఛార్జ్ @ 300కిమీ!
మీరు కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు అదిరిపోయే శుభవార్త. బెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ అధిక రేంజ్ సామర్ధ్యం గల ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే, గత ఏడాది ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ 236 కిలోమీటర్లు దూసుకెళ్లనున్నట్లు పేర్కొంది. కానీ, ఇప్పుడు అదనంగా మరో బ్యాటరితో ఆ స్కూటర్‌ను అప్డేట్ చేసి తీసుకొస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ రేంజ్ 300కిమీ పైగా ఉంటుందని సంస్థ తెలిపింది. నిజానికి చెప్పాలంటే, రేంజ్ విషయంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారుతో పోటీ పడుతుంది. అయితే, రెగ్యులర్ వేరియంట్ ధర రూ.1.10 లక్షలుగా ఉంటే అప్ డేట్ చేసిన సింపుల్ వన్ ధర రూ.1.45 లక్షలుగా ఉంది. గతంలో లాంచ్ చేసిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.2 కిడబ్ల్యుహెచ్ ఫిక్సిడ్ బ్యాటరీ ప్యాక్, 1.6 కెడబ్ల్యుహెచ్ రిమూవబుల్ బ్యాటరితో వస్తుంది. ఈ వాహనాన్ని ఛార్జ్ ఛార్జ్ చేస్తే 236 కిలోమీటర్ల దూసుకెళ్తుంది అని కంపెనీ తెలిపింది. Today, we're announcing a new configuration for #SimpleOne customers that want even more range on their scooter — taking it all the way up to a whopping 300+ km⚡ This optional battery pack upgrade is priced at ₹1,49,999 (excl. state subsidies) Oh, and it also fits in the boot😌 pic.twitter.com/WSYSzHmTlH — Simple Energy (@SimpleEnergyEV) March 1, 2022 కొత్తగా తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లో 3.2 కిడబ్ల్యుహెచ్ ఫిక్సిడ్ బ్యాటరీ ప్యాక్, రెండు 1.6 కెడబ్ల్యుహెచ్ రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒకసారి ఛార్జ్ చేస్తే 300+ కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది. కంపెనీ ఇటీవల తన ఎలక్ట్రిక్ స్కూటర్ మోటార్'ను కూడా అప్ డేట్ చేసినట్లు తెలిపింది. ఎలక్ట్రిక్ స్కూటర్ అప్ గ్రేడ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ 6.8 kWh బ్యాటరీతో వస్తుందని సింపుల్ ఎనర్జీ ప్రకటించింది. ఇది 8.5 కిలోవాట్ల పవర్(11.3 హెచ్ పి), 72 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ డెలివరీలు జూన్ నుంచి ప్రారంభంకానున్నాయి. (చదవండి: March 1: నేటి నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే!) -
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ తేదీలను ప్రకటించిన సింపుల్ ఎనర్జీ..!
ఎలక్ట్రిక్ వాహన ప్రియలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎట్టకేలకు మార్కెట్లోకి వచ్చేందుకు సిద్దం అయ్యింది. బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వేహికల్ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ ఈ ఏడాది(2022) జూన్ నుంచి తన ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్ డెలివరీలను ప్రారంభించనున్నట్లు బుధవారం(జనవరి 12) ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గత ఏడాది భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన ఈ స్కూటర్ ఇప్పటివరకు 30,000కు పైగా ప్రీ బుకింగ్స్ అందుకుంది. తమిళనాడులోని హోసూరులో ఉన్న తయారీ కేంద్రంలో వీటిని ఉత్పత్తి చేయనున్నారు. రూ.2500 కోట్లు పెట్టుబడి ఈ తయారీ కేంద్రం వార్షిక సామర్థ్యం 1 మిలియన్ యూనిట్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం స్కూటర్ల తయారీకి ఈ ఫ్యాక్టరీ సిద్ధంగా ఉంది. సింపుల్ ఎనర్జీ తమిళనాడులోని ధర్మపురిలో రెండవ తయారీ కర్మాగారాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇది 600 ఎకరాల భూమిలో విస్తరించి ఉంది. ఇది ఏడాదికి 12.5 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ కేంద్రం ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల ఉత్పత్తి కేంద్రంగా నిలవనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ గిగా ఫ్యాక్టరీలో మొదటి దశ ఉత్పత్తి వచ్చే ఏడాది చివరి నాటికి జరుగుతుందని ఆ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. మొత్తంగా సింపుల్ వన్ రూ.2500 కోట్లు పెట్టుబడికి రెడీ అయ్యింది. 236 కిలోమీటర్ల రేంజ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 6 కిలోల బరువున్న 4.8 కిలోవాట్స్ గల పోర్టబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీని డిటాచబుల్, పోర్టబుల్ స్వభావం వల్ల ఇంటి వద్ద ఈ-స్కూటర్ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. దీని సింపుల్ లూప్ ఛార్జర్ సహాయంతో 60 సెకన్ల వ్యవధిలో 2.5 కిలోమీటర్ల రేంజ్ వరకు వాహనాన్ని ఛార్జ్ చేయవచ్చు. ఈ-స్కూటర్‌ను సింగిల్ ఛార్జ్ చేస్తే ఎకో మోడ్‌లో 203 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చు. ఇండియన్ డ్రైవ్ సైకిల్(ఐడీసీ) పరిస్థితుల్లో 236 కిలోమీటర్ల రేంజ్ అందించినట్లు కంపెనీ పేర్కొంది. దీని గరిష్ట వేగం గంటకు 105 కిలోమీటర్లు. ఇది 3.6 సెకన్లలో 0 నుంచి 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే, 2.95 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో స్ప్రింట్ చేయగలదు. స్కూటర్ కు 4.5 కెడబ్ల్యు పవర్ అవుట్ పుట్, 72 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. (చదవండి: ఆ రెండు దేశాల్లో ఫేస్‌బుక్‌కు గట్టి దెబ్బ!) -
2021లో భారత్‌లో విడుదలైన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..!
గత ఏడాది వచ్చిన కరోనా మహమ్మారి తర్వాత 2021లో శర వేగంగా పుంజుకున్న రంగాలలో ఎలక్ట్రిక్ వాహన రంగం చాలా ముఖ్యమైనది. ఈ ఏడాదిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు రాకెట్ కంటే వేగంగా దూసుకుకెళ్లాయి. వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం పోట పోటీగా అన్నీ ఈవీ కంపెనీలు అదిరిపోయే ఫీచర్స్‌తో తమ వాహనలను మార్కెట్లోకి దించాయి. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. 2021లో ద్విచక్ర వాహన విభాగంలో విడుదలైన టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ల గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ వాహన ప్రియులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న లాంచ్ అయ్యింది. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఎస్1, ఎస్1 ప్రో అనే రెండు వేరియంట్లలో ఈ స్కూటర్ లాంచ్ చేసింది. బేస్ మోడల్ ఎస్1 ధర ₹85,099(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)కు, ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 ప్రోను ₹1,10,149(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ధరకు లాంచ్ చేసింది. ఎస్1 స్కూటర్ 2.98 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 121 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఇక ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 ప్రో 3.97 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 181 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఈ రెండు మోడల్స్ కూడా ఓలా యాజమాన్య బ్యాటరీ మేనేజ్ మెంట్ సిస్టమ్ (బిఎమ్ఎస్)తో వస్తాయి. (చదవండి: ఇయర్ ఎండ్ సేల్: పలు కార్ల కొనుగోలుపై రూ. లక్ష వరకు తగ్గింపు..!) సింపుల్ వన్ ఓలా ఎలక్ట్రిక్ లాంఛ్ చేసిన తర్వాత బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వేహికల్(ఈవీ) స్టార్టప్ సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్ స్కూటర్ లాంఛ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పోర్టబుల్ 4.8 కిలోవాట్ బ్యాటరీ చేత పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో గల లిథియం-అయాన్ బ్యాటరీని ఇంటి వద్ద ఛార్జ్ చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఒకసారి ఛార్జ్ చేస్తే ఎకో మోడ్‌లో 203 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఈ స్కూటర్ ధర రూ.1.10 లక్షలుగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 3.6 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఇది హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, కావున దీని గరిష్ట వేగం గంటకు 100 కిమీ వరకు ఉంటుంది. ఈవీ సోల్ ఈవీ ఇండియా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ సోల్'ను రూ.1.39 లక్షల(ఎక్స్ షోరూమ్) ధరకు లాంఛ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యూరోపియన్ టెక్నాలజీ ప్రమాణాల ఆధారంగా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఐఓటీ ఎనేబుల్డ్, యాంటీ థెఫ్ట్ లాక్ సిస్టమ్, జీపీఎస్ నావిగేషన్, యుఎస్బి పోర్ట్, సెంట్రల్ బ్రేకింగ్ సిస్టమ్ జియో ట్యాగింగ్, కీలెస్ ఫీచర్, రివర్స్ మోడ్, జియో ఫెన్సింగ్ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లనున్నట్లు కంపెనీ తెలిపింది. బౌన్స్ ఇన్ఫినిటీ బెంగళూరుకు చెందిన మొబిలిటీ సంస్థ బౌన్స్ భారత మార్కెట్లలోకి సరికొత్త ‘బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1’ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఈ స్కూటర్ లాంచ్‌తో ఎలక్ట్రిక్ వాహనాల్లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్ఠింది. బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 స్కూటర్‌ను 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్'తో వచ్చిన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ బౌన్స్. బ్యాటరీ, ఛార్జర్‌తో కూడిన బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 ధర రూ.68,999 (ఢిల్లీ ఎక్స్-షోరూమ్), కాగా బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్‌లో స్కూటర్‌ను తీసుకుంటే ఈ స్కూటర్ ధర రూ. 45,099 (ఢిల్లీ ఎక్స్-షోరూమ్) ధరగా ఉంది. బ్యాటరీ లేకుండా సరసమైన ధరకు బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 స్కూటర్‌ను కొనుగోలుదారులు పొందవచ్చు. ఇది గరిష్టంగా గంటకు 65 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 85 కిమీ మేర ప్రయాణిస్తోందని కంపెనీ వెల్లడించింది. బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ 0 నుంచి 40 కెఎమ్‌పీహెచ్ వేగాన్ని 8 సెకన్లలో అందుకోగలదు. కొమాకి టిఎన్95 ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన కంపెనీ కొమాకి ఈ ఏడాది ప్రారంభంలో మూడు ఎలక్ట్రిక్ స్కూటర్ల(టిఎన్95, ఎస్ఈ, ఎమ్5)ను లాంచ్ చేసింది. టిఎన్95 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.₹98,000, ఎస్ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.96,000గా ఉంది. ఇక ఎమ్5 మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ.99,000 ధరకు లాంచ్ చేసింది. టిఎన్95 ఎలక్ట్రిక్ స్కూటర్ డిటాచబుల్ లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ -స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే100 నుండి 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇది ఫుల్ కలర్ డిజిటల్ డిస్ప్లే, పార్క్, రివర్స్ అసిస్ట్, ఆన్-బోర్డు క్రూయిజ్ కంట్రోల్, సెల్ఫ్-డయాగ్నసిస్ స్విచ్, రీజనరేటివ్ బ్రేకింగ్ వంటి ఫీచర్లతో అందుబాటులో ఉంటుంది. (చదవండి: 2021 రౌండప్: అస్తమించిన టెక్ మేధావులు వీళ్లే..) -
ప్రపంచంలో అతి పెద్ద స్కూటర్ ప్లాంట్.. ఇండియాలో నిర్మాణం.. ఎక్కడంటే
World Largest Scooter Factory In Tamilnadu: ప్రపంచంలోనే అతి పెద్ద స్కూటర్ ప్లాంట్ ఇండియాలో నిర్మాణం జరుపుకోబోతుంది. ఈ మేరకు స్కూటర్ తయారీ కంపెనీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ ఫ్యాక్టరీలో స్కూటర్ల తయారీ ప్రారంభం కానుంది. ఓలా రాకతో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఒక్కసారిగా ఊపు వచ్చింది. మరోవైపు పెరుగుతున్న పెట్రోలు ధరలు సైతం ఈవీ స్కూటర్ల వైపు ప్రజలు మళ్లేలా చేశాయి. ఈ తరుణంలో ప్రపంచంలోనే సింగిల్ ఛార్జ్ తో అత్యధిక దూరం ప్రయాణించే స్కూటర్‌గా సింపుల్ వన్ మార్కెట్లోకి ఎంటరయ్యింది. ఈ కంపెనీ చెబుతున్న వివరాల ప్రకారం స్టాండర్డ్ కండీషన్స్‌లో సింపుల్ వన్ 236 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. అద్భుతమైన ఫీచర్లు ఉండటానికి తోడో ఈవీ స్కూటర్బూమ్ని అందిపుచ్చుకోవాలని సింపుల్ వన్ నిర్ణయించుకుంది. అందులో భాగంగా భారీ ఎత్తున స్కూటర్ల తయారీకి రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఓలా సంస్థ తమిళనాడులో కృష్ణగిరి జిల్లాలో 500 ఎకరాల్లో ఓలా స్కూటర్ గిగా ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. సింపుల్ వన్ అంతకంటే పెద్దగా ఏకంగా 600 ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయించింది. గిగా ఫ్యాక్టరీ నిర్మాణం కోసం సింపుల్ వన్ సంస్థ సైతం తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. మొత్తం రెండు దశల్లో ఆరు వందల ఎకరాల్లో గిగా ఫ్యాక్టరీ నిర్మించనుంది. ఇప్పటికే సింపుల్ వన్‌కి హోసూరు జిల్లాలో ఏడాదికి పది లక్షల స్కూటర్లను తయారు చేసే సామర్థ్యంలో ఒక ఫ్యాక్టరీ ఉంది. దీనికి అదనంగా మరో ఫ్యాక్టరీని తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో నిర్మించనుంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీకి సంబంధించిన గిగా ఫ్యాక్టరీ మొదటి దశ ఉత్పత్తి వచ్చే ఏడాది చివరి నాటికి జరుగుతుందని ఆ కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. కాగా రెండో దశ 2023 చివరి నాటికి అందుబాటులోకి రానుంది. మొత్తంగా సింపుల్ వన్ రూ. 2500 కోట్లు పెట్టుబడికి రెడీ అయ్యింది. ఈ ఫ్యాక్టరీ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 12 వేల మందికి ఉపాధి లభించనుంది. -
ఓలా, టెస్లాకు పోటీగా సింపుల్ ఎనర్జీ సంచలన నిర్ణయం
బెంగళూరుకు చెందిన ఈవీ మేకర్ సింపుల్ ఎనర్జీ మార్కెట్లో ఉన్న పోటీని ఎదుర్కోవడానికి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక భవిష్యత్ ఉత్పత్తి శ్రేణిలో భాగంగా ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ తయారు చేయాలని భావిస్తున్నట్లు సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, సీఈఓ సుహాస్ రాజ్ కుమార్ తెలిపారు. తన స్వల్పకాలిక ప్రణాళికల్లో భాగంగా ఈ స్టార్టప్ ఈ సంవత్సరం చివరి నాటికి ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను త్వరగా మార్కెట్లోకి తీసుకొని రావడానికి వేగంగా ప్రణాళికలు చేస్తుంది అని అన్నారు.(చదవండి: కొత్త కారు కొనేవారికి మారుతి సుజుకి షాక్!) దీనితో పాటు వచ్చే ఏడాది నాటికి ఒక ఈ-బైక్ తో పాటు రాబోయే ఒకటిన్నర సంవత్సరంలో కొత్త పవర్ ట్రైన్ తీసుకొనిరావలని యోచిస్తున్నట్లు అతను చెప్పాడు. "మేము బహుముఖ ఉత్పత్తి దిశగా వెళ్లాలని చూస్తున్నాము, మేము స్పష్టంగా నాలుగు చక్రాల వాహనాన్ని మా భవిష్యత్తు ప్రణాళికగా చూస్తున్నాము. మాకు ఒక విజన్ ఉంది. అందుకే ఆర్ & డీ(పరిశోధన & అభివృద్ధి) బృందాన్ని పెంచుతున్నాము" అని రాజ్ కుమార్ పీటీఐతో చెప్పారు. ఒక కంపెనీగా బహుళ ఉత్పత్తులతో రావాలని మేము చూస్తున్నాము అని నొక్కి చెప్పారు. రాబోయే మూడేళ్లలో మరో రెండు ఉత్పత్తులతో కంపెనీ వస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే, లాస్ట్ మైలు డెలివరీ, లాజిస్టిక్స్ పై ఎక్కువ దృష్టి సారించాము అని అన్నారు. ఈ సంవత్సరం చివరినాటికి ఫస్ట్ స్కూటర్ విడుదల చేస్తాము. ప్రస్తుతం ఇది టెస్టింగ్, హోమోలాజియేషన్ దశలో ఉంది అని అన్నారు. ఈ సంస్థ హోసూర్(తమిళనాడు) వద్ద ఒక మిలియన్ సామర్థ్యంతో ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తోంది. "మేము తగినంత సామర్ధ్యం గల ఫ్యాక్టరీ కలిగి ఉన్నాము, తద్వారా డిమాండ్ పెరిగితే ఆ డిమాండ్ కి సరిపోతుంది. ఒక మిలియన్ సామర్థ్యాన్ని చేరుకోవడానికి కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది అని అనుకుంటున్నాము. కానీ, మార్కెట్ ఎలా స్పందిస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. మాకు మాత్రం ఫోర్ వీలర్ విషయంలో కచ్చితమైన ప్రణాళికలు ఉన్నాయి" అని ఆయన అన్నారు. దీర్ఘ కాలిక ప్రణాళిక ప్రకారం వచ్చే 18 నెలల్లో దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 1000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నది. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం వచ్చే 3-7 నెలల్లో 300 పై చిలుకు చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. దేశీయ మార్కెట్‌తోపాటు విదేశాలకూ వాహనాలను ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు ఉన్నాయని తెలిపింది. -
దూసుకెళ్తున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్
ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ఓలా ఎలక్ట్రిక్, సింపుల్ ఎనర్జీ అనే రెండు కొత్త దేశీయ కంపెనీలు తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ స్కూటర్లు వస్తూ వస్తూనే ఒక సంచలనాన్ని క్రియేట్ చేశాయి. అప్పటికే వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఉన్న మార్కును ఇవి తుడిపేసి కొత్త మార్కును క్రియేట్ చేశాయి. ఓలా ఎలక్ట్రిక్ ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేసిన 24 గంటలలోపే లక్ష మందికి వాటిని బుక్ చేసుకున్నారు. దీంతో ఓలా కంపెనీ ప్రపంచ రికార్డు సాధించింది. తాజాగా ఓలా కంపెనీ ధీటుగా అంతే స్థాయిలో బుకింగ్స్ వచ్చినట్టు బెంగళూరు స్టార్టప్ కంపెనీ సింపుల్ ఎనర్జీ ప్రకటించింది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 30,000కు పైగా ప్రీ బుకింగ్స్ వచ్చినట్లు బెంగళూరుకు చెందిన ఈవీ తయారీసంస్థ సింపుల్ ఎనర్జీ ప్రకటించింది. ఎటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీ లేకుండా మార్కెట్లోకి వచ్చినప్పటికీ ఈ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కు అద్భుతమైన స్పందన లభించింది. కస్టమర్లు స్కూటర్ బుక్ చేయడం కోసం ప్రయత్నిస్తుంటే సాంకేతిక సమస్యలు వచ్చినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఒకేసారి ఎక్కువ మంది ప్రీ ఆర్డర్ల కోసం ప్రయత్నించడంతో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు, ఆ తర్వాత ఆ సమస్యను పరిష్కరించినట్లు కంపెనీ పేర్కొంది. సింపుల్ ఎనర్జీ ఇప్పుడు సాధ్యమైనంత త్వరగా స్కూటర్లను డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఇప్పుడు ఈ రెండు ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి.(చదవండి: Afghanistan: ‘సిగ్గుందా? శవాలపై వ్యాపారమా?’) -
మార్కెట్లో ఉన్న అత్యుత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
ప్రస్తుతం పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. లీటరు పెట్రోలు ధర సెంచరీ దాటిన సంగతి తెలిసిందే. బండి బయటకు తీయాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో పెట్రోలు బండ్లకు ప్రత్యామ్నాయంగా ఈవీ స్కూటర్లపై ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పటికే మార్కెట్లో లభ్యం అవుతున్నప్పటికీ, మరికొన్ని ఈ సంవత్సరం చివరినాటికి కస్టమర్ల చేతికి అందనున్నాయి. దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి ఇటీవల కొత్తగా కొన్ని స్కూటర్లు వచ్చాయి. ఈ స్కూటర్లు వస్తూ వస్తూనే ఒక ట్రెండ్ క్రియేట్ చేశాయని చెప్పుకోవాలి. ఓలా ఎలక్ట్రిక్, సింపుల్ ఎనర్జీ, ఏథర్ ఎనర్జీ, బజాజ్, టీవీఎస్ వంటి కంపెనీలు దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో పోటీ పడుతున్నాయి. అయితే, ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది అత్యుత్తమం అనేది ప్రజలు తెలుసుకోలేక పోతున్నారు. మేము ప్రస్తుతం ఉన్న వాటిలో కొన్ని మంచి ఎలక్ట్రిక్ స్కూటర్లను మీకు తెలియజేస్తున్నాము.(చదవండి: ఎంజీ ఎస్టర్ ఎస్యూవీ.... కీ ఫీచర్లు ఇవే!) ఓలా ఎస్1, ఎస్1 ప్రో ఓలా ఎలక్ట్రిక్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1ను ఆగస్టు 15న రూ.99,999(ఎక్స్ షోరూమ్) ధరతో లాంచ్ చేసింది. ఓలా ఎలక్ట్రిక్ ఎస్1, ఎస్1 ప్రో అనే పేరుతో రెండు స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.99,999, ఎస్1 ప్రో స్కూటర్ ధర రూ.1,29,999గా ఉంది. ఓలా ఎస్1 సెప్టెంబర్ 8 నుంచి కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. అక్టోబర్ నుంచి 1,000 నగరాలు, పట్టణాల్లో డెలివరీల సేవలను ప్రారంభిస్తుంది. సెప్టెంబర్ 8 వరకు కంపెనీ బుకింగ్స్ కోసం రూ.499 చెల్లించాల్సి ఉంటుంది. ఓలా ఎస్1 ప్రో ఐడీసీ మోడ్ లో 181 కి.మీ దూరం వెళ్లనున్నట్లు పేర్కొంది. గంటకు 115 కిలోమీటర్ల గరిష్ట వేగం, హైపర్ ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో 40 నిమిషాల కంటే తక్కువ సమయంలో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. ఈ స్కూటర్ తో వచ్చే పోర్టబుల్ ఛార్జర్ ద్వారా చార్జ్ చేయడానికి సుమారు 6 గం. సమయం పడుతుంది. ఇందులో రివర్స్ మోడ్, హిల్ హోల్డ్ ఫంక్షన్, డ్రైవింగ్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి. 0-40 కిలోమీటర్లు వేగాన్ని 3 సెకండ్లలో అందుకుటుంది. ఇది కీలెస్ లాక్, అన్ లాక్ సిస్టమ్, యాంటీ థెఫ్ట్ అలర్ట్ సిస్టమ్, జియో ఫెన్సింగ్ వంటి భద్రతా ఫీచర్లతో వస్తుంది. ఈ స్కూటర్లో 3.97 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 రంగుల్లో లభిస్తుంది. ఓలా తమిళనాడులో 500 ఎకరాల్లో తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. సింపుల్ వన్ సింప్లీ ఎనర్జీ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్ ను ఆగస్టు 15 నాడు లాంఛ్ చేసింది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు ప్రీ ఆర్డర్ల కోసం అందుబాటులో ఉంది. మీరు సింపుల్ వన్ బుక్ చేసుకోవాలంటే రూ.1,947 చెల్లించాల్సి ఉంటుంది. సింపుల్ వన్ ను రూ.1,09,999 (ఎక్స్ షోరూమ్ ధర)కు లాంఛ్ చేశారు. సింపుల్ వన్ బ్రెంజ్ బ్లాక్, అజ్యూరే బ్లూ, గ్రేస్ వైట్, నమ్మ రెడ్ రంగులలో లభిస్తుంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను చార్జ్ చేస్తే ఐడీసీ మోడ్ లో 236 కిలోమీటర్ల దూరం వెళ్లనున్నట్లు పేర్కొంది. అలాగే ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 105 కిలోమీటర్లు. దీనిలో 4.8కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ(కంబైన్డ్ ఫిక్సిడ్, పోర్టబుల్), 7 కెడబ్ల్యు మోటార్ ఉన్నాయి. దీనిలో టైర్ ప్రజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది. అథర్ 450ఎక్స్ అథర్ 450ఎక్స్ టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు. 3.3 సెకన్లలో 0-40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. అథర్ 450ఎక్స్ ఐడీసీ మోడ్ లో 116 కి.మీ దూరం వెళ్లనున్నట్లు పేర్కొంది. బ్యాటరీ వాటర్ రెసిస్టెంట్ ఐపీ 67 రేటెడ్ ప్రజర్ డై కాస్ట్ అల్యూమినియం బ్యాటరీ ప్యాక్, ఫ్రంట్ అండ్ రియర్ కోసం రెండు డిస్క్ బ్రేకులు, 22ఎల్ స్టోరేజీ, 7 అంగుళాల ఎల్ సిడి డిస్ ప్లేతో ఈ స్కూటర్ వస్తుంది. అథర్ 450ఎక్స్ ధర రూ.1,44,500. ఈ స్కూటర్లో 2.61 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ఉంటుంది. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ ఈ ఏడాది జూన్ లో టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ అర్బన్ స్కూటర్ ను రూ.115,218 ధరకు విడుదల చేసింది. టీవీఎస్ ఐక్యూబ్ లో 2.25 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ, 4.4 కిలోవాట్లు కలిగిన ఎలక్ట్రిక్ మోటార్ కలిగి ఉంది. దీని టాప్ స్పీడ్ గంటకు 78 కి.మీ. దీని ఫుల్ ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ ఫ్రంట్ టెలిస్కోపిక్, రియర్ హైడ్రాలిక్ ట్విన్ ట్యూబ్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ తో వస్తుంది. 118 కిలోల బరువున్న ఈ స్కూటర్ 140 ఎన్ఎమ్ టార్క్ ఉతపతి చేస్తుంది. బజాజ్ చేతక్ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.8 కిలోవాట్ మోటార్ చేత పనిచేస్తుంది. దీనిలో 3కేడబ్ల్యుఐపీ 67 లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ స్కూటర్ గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇందులో స్పోర్ట్ మోడ్, ఎకో మోడ్ అనే రెండు మోడ్స్ ఉన్నాయి. 5 ఆంపియర్ పవర్ సాకెట్ ద్వారా స్కూటర్ ని ఇంటి వద్ద ఛార్జ్ చేయవచ్చు. ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, బ్లూటూత్ బేస్డ్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, ఇల్యూమినేటెడ్ స్విచ్ గేర్, స్మార్ట్ ఫోన్ యాప్ ఫీచర్స్ ఉన్నాయి. బజాజ్ చేతక్ ఈ-స్కూటర్ అర్బన్, ప్రీమియం అనే రెండు వేరియెంట్లలో లభిస్తుంది. అర్బన్ ధర ₹1.42 లక్షలు కాగా, ప్రీమియం రిటైల్స్ ₹1.44 లక్షలు(ఎక్స్ షోరూమ్, పూణే). -
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ VS సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్
75వ స్వాతంత్ర్య దినోత్సవం సంధర్భంగా ఓలా ఎలక్ట్రిక్, సింపుల్ ఎనర్జీ తమ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల ఫీచర్స్ చూడాటానికి చాలా దగ్గరగా ఉన్నాయి. ఏదేమైనా, ఓలా ఎలక్ట్రిక్, సింపుల్ ఎనర్జీ రెండు ఈవీ ప్రపంచంలో ఒకదానితో మరొకటి పోటీపడనున్నాయి. ఓలా ఈ-స్కూటర్ ను కేవలం రూ.499కు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. సింపుల్ వన్ స్కూటర్ ను కూడా రూ.1947 చెల్లించి ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే భారత దేశంలోని 1,000కు పైగా నగరాల నుంచి బుకింగ్‌ల రూపంలో అపారమైన స్పందనను పొందింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో 18 నిమిషాల పాటు చార్జ్ చేస్తే 75 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు అని ఓలా వెల్లడించింది. ఇక సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ లూప్ ఛార్జర్ సహాయంతో 1 నిమిషం చార్జ్ చేస్తే 2.5 కిలోమీటర్ల రేంజ్ వరకు వెళ్లనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ రెండు స్కూటర్ల మిగతా ఫీచర్స్ గురుంచి ఈ క్రింద తెలుసుకోండి. Simple One Ola S1 Pro Top Speed 105 Kmph 115 Kmph Range 236 KM 181 KM Acceleration(0 - 40 KM) 2.95 Secs 3 Secs Torque 72 Nm 58 Nm Battery Capacity 4.8 KWh 3.97 KWh Boot Space 30L 36L Price ₹1.10 lakhs ₹1.30 lakhs ఈ రెండు స్కూటర్లు కూడా వాటికి అవే స్వంత ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నాయి. ఇప్పటి వరకు, మనకు తెలిసిన వివరాలతో విజేతను ఎంచుకోవడం కష్టం కాబట్టి పూర్తి స్థాయిలో రోడ్ల మీదకు వచ్చాక ఏది ఉత్తమం అనేది తెలుస్తుంది. అయితే, రెండు ఈ-స్కూటర్లు బజాజ్ చేతక్, ఏథర్ 450X, TVS iQube వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లతో మార్కెట్లో పోటీ పడనున్నాయి. -
ఓలా ఈవీని మించిపోయిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వేహికల్ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ దేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ను ₹1.10 లక్షల(ఎక్స్ షోరూమ్, మైనస్ సబ్సిడీలు) ధర వద్ద లాంఛ్ చేసింది. కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ను ₹1,947 రీఫండ్ చేయగల ప్రీ బుకింగ్ ధరకు బుకింగ్ చేసుకోవచ్చు. ప్రీ బుకింగ్ ₹1,947 ధరను భారతదేశనికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరానికి గుర్తుగా పెట్టారు. తమిళనాడులోని హోసూర్ లోని ప్లాంట్ లో ఈవీ మేకర్ తన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల(Simple One Electric Scooter)ను తయారు చేస్తుంది. మొదటి దశలో ఏడాదికి ఒక మిలియన్ వాహనాల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం కలిగి ఉన్నట్లు కంపెనీ తెలిపింది. 4.8 కిలోవాట్స్ బ్యాటరీ కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, గోవా, ఉత్తరప్రదేశ్ సహా తొలి దశలో దేశవ్యాప్తంగా మొత్తం 13 రాష్ట్రాల్లో ఈ-స్కూటర్ అందుబాటులోకి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఆరు కిలోల బరువున్న 4.8 కిలోవాట్స్ గల పోర్టబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీని డిటాచబుల్, పోర్టబుల్ స్వభావం వల్ల ఇంటి వద్ద ఈ-స్కూటర్ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. దీని సింపుల్ లూప్ ఛార్జర్ తో 60 సెకన్ల వ్యవధిలో 2.5 కిలోమీటర్ల రేంజ్ వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఛార్జ్ చేయవచ్చు. 236 కిలోమీటర్ల రేంజ్ ఈవీ కంపెనీ రాబోయే మూడు నుంచి ఏడు నెలల్లో దేశవ్యాప్తంగా 300కి పైగా పబ్లిక్ ఫాస్ట్ ఛార్జర్లను కూడా ఇన్ స్టాల్ చేస్తుంది. ఈ-స్కూటర్ ను సింగిల్ ఛార్జ్ చేస్తే ఎకో మోడ్ లో 203 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చు. ఇండియన్ డ్రైవ్ సైకిల్(ఐడీసీ) పరిస్థితుల్లో 236 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 105 కిలోమీటర్లు. ఇది 3.6 సెకన్లలో 0 నుంచి 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే, 2.95 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో స్ప్రింట్ చేయగలదు. స్కూటర్ కు 4.5 కెడబ్ల్యు పవర్ అవుట్ పుట్, 72 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో వస్తుంది. ఇది 30 లీటర్లబూట్ సామర్థ్యం, 12 అంగుళాల వీల్స్, 7 అంగుళాల కస్టమైజబుల్ డిజిటల్ డ్యాష్ బోర్డ్, ఆన్ బోర్డ్ నావిగేషన్, జియో ఫెన్సింగ్, ఎస్ఓఎస్ సందేశం, డాక్యుమెంట్ స్టోరేజీ, టైర్ ప్రజర్ మానిటరింగ్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. సింపుల్ వన్ ఈ-స్కూటర్ రెడ్, వైట్, బ్లాక్, బ్లూ వంటి నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. సింపుల్ వన్ ఈ-స్కూటర్ ఏథర్, హీరో ఎలక్ట్రిక్, ఓలా ఎలక్ట్రిక్ వంటి స్కూటర్లతో పోటీ పడనుంది. -
ఓలాకి పోటీగా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్
బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ సింపుల్ ఎనర్జీ తన మొదటి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఆగస్టు 15న తీసుకొస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కంపెనీ వెబ్ సైట్లో ఆగస్టు 15 నుంచి సాయంత్రం 5 గంటల నుంచి ₹1,947 ధరకు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. "సింపుల్ వన్ ద్వారా ఎలక్ట్రిక్ వేహికల్ ఇండస్ట్రీలో బెంచ్ మార్క్ సృష్టించాలని మేం ఆశిస్తున్నాం. ఆగస్టు 15 మాకు చారిత్రాత్మక రోజు" అని కంపెనీ వ్యవస్థాపకుడు & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుహాస్ రాజ్ కుమార్ తెలిపారు.సింపుల్ వన్ లాంఛ్ తర్వాత తన ప్రత్యర్థులైన ఓలా స్కూటర్, అథర్ 450ఎక్స్ తో తలపడనుంది. సింగిల్ చార్జ్ చేస్తే 240 కి.మీ మైలేజ్ సింపుల్ వన్, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు రెండు ఆగస్టు 15న లాంఛ్ కానున్నాయి. అథర్ 450 ఎక్స్ ఇప్పటికే ₹99,000 ధరకు లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 6 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువు గల 4.8 కిలోవాట్ అవర్(కెడబ్ల్యుహెచ్) లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేయనున్నట్లు పేర్కొంది. ఈ స్కూటర్ బ్యాటరీ 70 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ కానున్నట్లు కంపెనీ తేలుపుతుంది. దీనిని ఒకసారి చార్జ్ చేస్తే 'ఎకో మోడ్'లో 240 కిలోమీటర్ల వరకు వెళ్లనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇది గంటకు 100 కిలోమీటర్ల అత్యదిక వేగంతో వెళ్తుంది. 3.6 సెకన్లలో 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్ల విషయానికి వస్తే టచ్ స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆన్ బోర్డ్ నావిగేషన్ సపోర్ట్ ఉన్నాయి. సింపుల్ వన్ ధర ₹1,00,000 నుంచి ₹1,20,000 వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. సింపుల్ వన్ మొదటి దశలో 13 రాష్ట్రాల్లో ప్రారంభించనున్నారు. అలాగే, ఆగస్టు 150న రానున్న ఓలా స్కూటర్ ధర కూడా ₹1,20,000 ఉండే అవకాశం ఉంది.