బెంగళూరుకు చెందిన ఈవీ మేకర్ సింపుల్ ఎనర్జీ మార్కెట్లో ఉన్న పోటీని ఎదుర్కోవడానికి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక భవిష్యత్ ఉత్పత్తి శ్రేణిలో భాగంగా ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ తయారు చేయాలని భావిస్తున్నట్లు సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, సీఈఓ సుహాస్ రాజ్ కుమార్ తెలిపారు. తన స్వల్పకాలిక ప్రణాళికల్లో భాగంగా ఈ స్టార్టప్ ఈ సంవత్సరం చివరి నాటికి ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను త్వరగా మార్కెట్లోకి తీసుకొని రావడానికి వేగంగా ప్రణాళికలు చేస్తుంది అని అన్నారు.(చదవండి: కొత్త కారు కొనేవారికి మారుతి సుజుకి షాక్!)
దీనితో పాటు వచ్చే ఏడాది నాటికి ఒక ఈ-బైక్ తో పాటు రాబోయే ఒకటిన్నర సంవత్సరంలో కొత్త పవర్ ట్రైన్ తీసుకొనిరావలని యోచిస్తున్నట్లు అతను చెప్పాడు. "మేము బహుముఖ ఉత్పత్తి దిశగా వెళ్లాలని చూస్తున్నాము, మేము స్పష్టంగా నాలుగు చక్రాల వాహనాన్ని మా భవిష్యత్తు ప్రణాళికగా చూస్తున్నాము. మాకు ఒక విజన్ ఉంది. అందుకే ఆర్ & డీ(పరిశోధన & అభివృద్ధి) బృందాన్ని పెంచుతున్నాము" అని రాజ్ కుమార్ పీటీఐతో చెప్పారు. ఒక కంపెనీగా బహుళ ఉత్పత్తులతో రావాలని మేము చూస్తున్నాము అని నొక్కి చెప్పారు. రాబోయే మూడేళ్లలో మరో రెండు ఉత్పత్తులతో కంపెనీ వస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే, లాస్ట్ మైలు డెలివరీ, లాజిస్టిక్స్ పై ఎక్కువ దృష్టి సారించాము అని అన్నారు. ఈ సంవత్సరం చివరినాటికి ఫస్ట్ స్కూటర్ విడుదల చేస్తాము. ప్రస్తుతం ఇది టెస్టింగ్, హోమోలాజియేషన్ దశలో ఉంది అని అన్నారు.
ఈ సంస్థ హోసూర్(తమిళనాడు) వద్ద ఒక మిలియన్ సామర్థ్యంతో ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తోంది. "మేము తగినంత సామర్ధ్యం గల ఫ్యాక్టరీ కలిగి ఉన్నాము, తద్వారా డిమాండ్ పెరిగితే ఆ డిమాండ్ కి సరిపోతుంది. ఒక మిలియన్ సామర్థ్యాన్ని చేరుకోవడానికి కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది అని అనుకుంటున్నాము. కానీ, మార్కెట్ ఎలా స్పందిస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. మాకు మాత్రం ఫోర్ వీలర్ విషయంలో కచ్చితమైన ప్రణాళికలు ఉన్నాయి" అని ఆయన అన్నారు. దీర్ఘ కాలిక ప్రణాళిక ప్రకారం వచ్చే 18 నెలల్లో దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 1000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నది. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం వచ్చే 3-7 నెలల్లో 300 పై చిలుకు చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. దేశీయ మార్కెట్‌తోపాటు విదేశాలకూ వాహనాలను ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు ఉన్నాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment