suhas
-
మరో ఓటీటీలోకి వచ్చేసిన 'గొర్రె పురాణం'
టాలీవుడ్ అప్‌కమింగ్ హీరోల్లో సుహాస్ ఒకడు. కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టాడు కానీ 'కలర్ ఫోటో' మూవీ హిట్ అయ్యేసరికి దశ తిరిగింది. ప్రస్తుతం ఏడాదికి రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరిస్తున్నాడు. ఇతడు నటించిన రెండు సినిమాలు ఇప్పుడు ఓటీటీల్లోకి వచ్చేశాయి.(ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ)సుహాస్ 'జనక అయితే గనక' సినిమా ఆహా ఓటీటీలోకి వచ్చింది. పిల్లలు వద్దనుకునే ఓ మధ్య తరగతి యువకుడు.. తన భార్య నెల తప్పిందనే కారణంతో కండోమ్ కంపెనీపై కేసు పెడతాడు. బోల్డ్ కాన్సెప్ట్ అయినప్పటికీ ఎక్కడా గీత దాటలేదు.మరోవైపు సెప్టెంబరులో సుహాస్ 'గొర్రె పురాణం' చిత్రం థియేటర్లలో రిలీజైంది. అక్టోబర్ 10న ఆహా ఓటీటీలో వచ్చింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో కూడా వచ్చేసింది. ఎలాంటి హడావుడి లేకుండా తీసుకొచ్చేశారు. ఓ గొర్రె వల్ల రెండు వర్గాలు ఎలా కొట్టుకున్నాయి? అనే కాన్సెప్ట్‌తో తీశారు. ఇంట్రెస్ట్ ఉంటే లుక్కేసేయండి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన దేవర, వేట్టయన్, జనక అయితే గనక.. ఏది ఎందులో?) -
అమెరికా ఎన్నికలు.. సుహాస్ సుబ్రమణ్యం సరికొత్త రికార్డు
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల ఫలితాల్లో భారతీయ అమెరికన్లు సత్తా చాటుతున్నారు. భారత సంతతికి చెందిన సుహాస్ సుబ్రమణ్యం ప్రతినిధుల సభకు గెలుపొందారు. వర్జీనియా 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన డెమోక్రటిక్ పార్టీ తరఫున గెలుపొందారు. వర్టీజినియా నుంచి ప్రతినిధుల సభకు గెలిచిన తొలి ఇండియన్ అమెరికన్‌గా సుహాస్ సుబ్రమణ్యం సరికొత్త రికార్డు సృష్టించారు.గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో సాంకేతిక విధాన సలహాదారుగా సుబ్రహ్మణ్యం పనిచేశారు. 2020లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ ఎన్నికల్లో వర్జీనియా సెనేట్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వర్జీనియా నుంచే గెలుపొంది ప్రతినిధుల సభకు వెళుతున్నారు. ఇదీ చదవండి: ఇల్లినోయిస్ నుంచి రాజాకృష్ణమూర్తి గెలుపు -
ఓటీటీలోకి క్రేజీ సినిమా.. కండోమ్ కంపెనీపై కేసు పెడితే?
మరో తెలుగు సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. మిడిల్ క్లాస్ కథల్లో ఎక్కువగా కనిపించిన సుహాస్ లేటెస్ట్ మూవీ 'జనక అయితే గనక'. దసరాకి థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ఓటీటీ ప్రకటన వచ్చేసింది. ఇంతకీ ఎప్పుడు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే?సుహాస్ 'జనక అయితే గనక' సినిమా కాన్సెప్ట్ బాగుంది. కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. కానీ థియేటర్లలో సరిగా ఆడలేదు. మూవీ సాగదీసినట్లు అనిపించిందనే టాక్ రావడంతో తేడా కొట్టేసింది. థియేటర్లలో సరిగా ఆడలేదు కానీ ఇప్పుడు ఆహా ఓటీటీలోకి వచ్చేస్తుంది. నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: నా ఉద్దేశం అదికాదు.. 'బిగ్‌బాస్ 8' వివాదంపై మెహబూబ్ వీడియో)'జనక అయితే గనక' విషయానికొస్తే.. తండ్రి అయితే ఖర్చులు పెరుగుతాయనే భయపడే ఓ కుర్రాడు, భార్య నెల తప్పిందని చెప్పడంతో షాకవుతాడు. తాను కండోమ్ ఉపయోగించినప్పటికీ తండ్రి కావడం ఇతడిని ఆలోచనలో పడేస్తుంది. దీంతో సదరు కండోమ్ కంపెనీపై కేసు పెడతాడు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.చెప్పుకోవడానికి కాస్త వల్గర్ అనిపిస్తుంది కానీ ఏ మాత్రం గీత దాటకుండా సున్నితమైన హాస్యంతో సినిమా తీశారు. కాసేపు అలా సరదాగా నవ్వుకునే సినిమా చూద్దానుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?) -
‘జనక అయితే గనక’మూవీ రివ్యూ
టైటిల్: జనక అయితే గనకనటీనటులు: సుహాస్, సంగీర్తన, రాజేంద్రప్రసాద్, గోపరాజు రమణ, వెన్నెక కిశోర్, మురళీ శర్మ తదితరులునిర్మాణ సంస్థ: దిల్ రాజు ప్రొడక్షన్స్నిర్మాతలు : హర్షిత్ రెడ్డి, హన్షిత్ రెడ్డిదర్శకత్వం: సందీప్‌రెడ్డి బండ్లసంగీతం: విజయ్ బుల్గానిక్సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్విడుదల తేది: అక్టోబర్ 12, 2024ఈ మధ్యే ‘గొర్రె పురాణం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుహాస్.. ఇప్పుడు ‘జనక అయితే గనక’ అనే సినిమాతో మరోసారి థియేటర్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం రేపు(అక్టోబర్ 12) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్ ప్రివ్యూ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? సుహాస్ ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ప్రసాద్ (సుహాస్) కి పిల్లలు కనడం అస్సలు ఇష్టం లేదు. ఈ రోజుల్లో పిల్లలను పోషించాలంటే లక్షల్లో డబ్బులు అవసరమని, అంత డబ్బు తన వద్ద లేదని పిల్లలే వద్దనుకుంటాడు. భార్య(సంగీత విపిన్) కూడా అతని మనసును అర్థం చేసుకుంటుంది. కుటుంబ నియంత్ర కోసం కండోమ్ వాడుతారు. అయినప్పటికీ ప్రసాద్ భార్య గర్భం దాల్చుతుంది. దీంతో కండోమ్ సరిగ్గా పని చేయలేదని వినియోగదారుల కోర్టును ఆశ్రయిస్తాడు ప్రసాద్. తాను వాడిన కండోమ్ సరిగా పనిచేయలేకపోవడంతో తన భార్య గర్భం దాల్చిందని, నష్టపరిహారంగా రూపాయలు కోటి ఇవ్వాలని ఆ కంపెనీపై కేసు వేస్తాడు. ఈ కేసు ప్రసాద్ జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? అసలు ప్రసాద్ భార్య గర్భం ఎలా దాల్చింది? చివరకు ఈ కేసులో ప్రసాద్ గెలిచాడా లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..మానవ జీవితంలో వస్తు వినియోగం తప్పని సరి. ఏదైనా ఒక వస్తువు కొని ఆ వస్తువు నకిలీ లేదా నాసిరకం అయితే అమ్మిన వ్యాపారిపై లేదా ఉత్పత్తిదారులపై కేసు వేయొచ్చనే విషయం చాలా మందికి తెలియదు. వినియోగదారుల చట్టం పై జనాలకు అవగాహన లేదు. ఈ పాయింట్ తో తెరకెక్కిన చిత్రమే జనగా అయితే గనక. ప్రస్తుతం సమాజం ఫేస్ చేస్తున్న ఓ సీరియస్ ఇష్యూ ని కామెడీ వేలో చూపిస్తూ చివరకు ఓ మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. దర్శకుడు రాసుకున్న కథ బాగుంది. కండోమ్ మీద కేసు పెట్టడమనే పాయింట్ ఆసక్తికరంగా ఉంది. కానీ అంతే ఆసక్తికరంగా కథనాన్ని నడిపించలేకపోయాడు.వినోదాత్మకంగా చూపించాలనే ఉద్దేశంతో చాలా చోట్ల లాజిక్ లెస్ సన్నివేశాలను జోడించాడు. ముఖ్యంగా కీలకమైన కోర్టు సన్నివేశాలు చాలా సిల్లీగా అనిపిస్తాయి . వెన్నెల కిషోర్ చేసే కామెడీ కూడా రొటీన్ గానే అనిపిస్తుంది. కోర్టు డ్రామా మొదలవగానే సినిమా క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు.ఇంటర్వెల్ ముందు వరకు అసలు కథను ప్రారంభించకుండా కథనాన్ని నడిపించాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కష్టాలను చూపించేందుకు ప్రసాద్ పాత్ర చుట్టు అల్లిన సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేవు. ఈ రోజుల్లో పిల్లలను కనాలంటే ఎంత ఖర్చు అవుతుందో ప్రాక్టికల్‌గా చూపించే సీన్ నవ్వులు పూయించడంతో పాటు ఆలోచింపచేస్తుంది. ఫస్టాఫ్‌లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కష్టాలను చూపించి, సెకండ్ హాఫ్ లో వారి ఎమోషన్స్ తో కొందరు చేస్తున్న మోసపూరిత వ్యాపారాల చూపించారు. వైద్యం పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులు చేస్తున్న దందా, నాణ్యమైన విద్య పేరుతో ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న మోసాన్ని వినోదాత్మకంగా చూపించారు. అయితే ముందుగా చెప్పినట్లుగా కోర్డు డ్రామాలో బలం లేదు. కొన్ని చోట్ల ప్రసాద్ పాత్ర చేసే ఆర్గ్యుమెంట్స్‌కి అర్థం ఉండదు. ఇక చివర్లో వచ్చే చిన్న ట్విస్ట్ అయితే అదిరిపోతుంది.ఎవరెలా చేశారంటే..సుహాస్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలోనైనా జీవించేస్తాడు . మిడిల్ క్లాస్ యువకుడు ప్రకాష్ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. కోటి సీన్లలో అతను చెప్పే డైలాగులు ఆలోచింపజేస్తాయి. హీరోయిన్ పాత్రనిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. సినిమా కథంతా చుట్టే తిరుగుతుంది. లాయర్ కిషోర్ గా వెన్నెల కిషోర్ తనదైన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశాడు. జడ్జి ధర్మారావుగా రాజేంద్రప్రసాద్ కొన్నిచోట్ల నవ్విస్తాడు. లాయర్ గా మురళి శర్మ, హీరో తండ్రిగా గోపరాజు, బామ్మ పాత్రను పోషించిన నటితోపాటు మిగిలిన వారంతా తమ పాత్రల పరిధి మీద చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పరవాలేదు. సంగీతం బావుంది. పాటలు కథలో భాగంగానే వస్తాయి. అయితే ఒక పాట మినహా మిగిలినవేవి గుర్తుండవు. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
సరికొత్త కాన్సెప్ట్‌తో జనక అయితే గనక.. ఆసక్తిగా ట్రైలర్
టాలీవుడ్ హీరో సుహాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాదిలో మరో మూవీతో అలరించేందుకు వస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో సినీ ప్రియులను ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్నాడు. తాజాగా సుహాస్ నటించిన చిత్రం జనక అయితే గనక. ఈ సినిమాను సందీప్ రెడ్డి బండ్ల డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సంకీర్తన హీరోయిన్గా నటించగా.. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ విజయదశమి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం పిల్లలు పుడితే లైఫ్‌లో ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందో అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారుపిల్లలంటే భయపడే ఓ వ్యక్తి జీవితంగా ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా గురించి దిల్ రాజు మాట్లాడారు. సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉందని ఆయన తెలిపారు. ఈనెల 12న జనక అయితే గనక థియేటర్లలో అలరించనుంది. -
రిలీజైన మూడు వారాల్లోనే ఓటీటీలో 'గొర్రె పురాణం'
సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గొర్రె పురాణం’. బాబీ దర్శకత్వంలో ప్రవీణ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 20న విడుదల అయింది. అయితే, విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. టాలీవుడ్లో విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పించే నటుడిగా సుహాస్‌కు గుర్తింపు ఉంది. ఈ క్రమంలో ఆయన నటించిన కొత్త సినిమా 'గొర్రె పురాణం' సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ వచ్చినప్పటికీ అనుకున్నంతగా కలెక్షన్లు సాధించలేదు.'గొర్రె పురాణం' చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ఆహా అధికారికంగా సోషల్‌మీడియా ద్వారా వెళ్లడించింది. అక్టోబర్ 10 నుంచి తమ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని ఆహా ఒక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. టాలీవుడ్లో వరుస సినిమాలతో సుహాస్ బిజీగా ఉన్నారు. సుహాస్ కొత్త సినిమా 'జనక అయితే గనక' దసర సందర్భంగా అక్టోబర్ 12న థియేటర్లో విడుదల కానుంది.కథేంటంటే..టైటిల్ తగ్గట్టే ఈ సినిమా కథంతా ఓ గొర్రె చుట్టూ తిరుగుతుంది. రఫిక్ అనే ఓ ముస్లీం వ్యక్తి బక్రీద్ పండగ కోసం ఓ గొర్రెను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తాడు. పండగ రోజు దాన్ని బలి ఇచ్చేందుకు ప్రయత్నించగా తప్పించుకొని పారిపోతుంది. రఫిక్ గ్యాంగ్ దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. పరుగెత్తి హిందువుల టెంపుల్‌లోకి వెళ్తుంది. ఆ పోచమ్మ తల్లే ఈ గొర్రెను మన దగ్గరకు పంపించింది అని చెప్పి.. నరహింహా(రఘు కారుమంచి) దాన్ని ఆ టెంపుల్లోనే బలి ఇవ్వాలని చెబుతాడు. చివరకు ఈ గొర్రె మాదంటే.. మాది అంటూ రెండు మతాల ప్రజలు గొడవకు దిగుతారు.ఆ వీడియో కాస్త వైరల్ అయి..రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అవుతుంది. పోలీసులు ఆ గొర్రెను అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తారు. కోర్టు జడ్జి(పొసాని కృష్ణ మురళి) ఎలాంటి తీర్పు ఇచ్చాడు. ఒక గొర్రె రెండు మతాల మధ్య ఎలాంటి చిచ్చు పెట్టింది? ఈ గొర్రె న్యూస్ ఇంత వైరల్ కావాడానికి గల కారణం ఏంటి? దీని వెనుక దాగి ఉన్న రాజకీయ కుట్ర ఏంటి? జైలు ఖైది రవి(సుహాస్)కి ఈ గొర్రె కథకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు రవి జైలుపాలు ఎలా అయ్యాడు? అతనికి జరిగిన అన్యాయం ఏంటి? గొర్రె అతనికి ఎలాంటి సహాయం చేసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
హీరో సుహాస్ 'జనక అయితే గనక' మూవీ ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
ఓటీటీలోకి రానున్న 'గొర్రె పురాణం'.. అధికారిక ప్రకటన
సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గొర్రె పురాణం’. బాబీ దర్శకత్వంలో ప్రవీణ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 20న విడుదల అయింది. అయితే, ఇప్పుడు ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. టాలీవుడ్లో విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పించే నటుడిగా సుహాస్‌కు గుర్తింపు ఉంది. ఈ క్రమంలో ఆయన నటించిన కొత్త సినిమా 'గొర్రె పురాణం' సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ వచ్చినప్పటికీ అనుకున్నంతగా కలెక్షన్లు సాధించలేదు.'గొర్రె పురాణం' సినిమాలో ఒక జంతువునే ప్రధాన పాత్రధారిగా పెట్టుకుని అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు దర్శకులు. తాను భిన్నమైన కథలను ఎంచుకుంటానని మరోసారి సుహాస్ ఈ చిత్రంతో నిరూపించాడు. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ఆహా అధికారికంగా ప్రకటించింది. అయితే, ఎప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొస్తారనేది మాత్రం వెళ్లడించలేదు. అక్టోబర్ 6న ఓటీటీలోకి రావచ్చని టాక్ నడుస్తోంది. లేదంటే, అక్టోబర్ 11న తప్పకుండా ఓటీటీలో రిలీజ్ అవుతుందని సమాచారం.కథేంటంటే..టైటిల్ తగ్గట్టే ఈ సినిమా కథంతా ఓ గొర్రె చుట్టూ తిరుగుతుంది. రఫిక్ అనే ఓ ముస్లీం వ్యక్తి బక్రీద్ పండగ కోసం ఓ గొర్రెను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తాడు. పండగ రోజు దాన్ని బలి ఇచ్చేందుకు ప్రయత్నించగా తప్పించుకొని పారిపోతుంది. రఫిక్ గ్యాంగ్ దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. పరుగెత్తి హిందువుల టెంపుల్‌లోకి వెళ్తుంది. ఆ పోచమ్మ తల్లే ఈ గొర్రెను మన దగ్గరకు పంపించింది అని చెప్పి.. నరహింహా(రఘు కారుమంచి) దాన్ని ఆ టెంపుల్లోనే బలి ఇవ్వాలని చెబుతాడు. చివరకు ఈ గొర్రె మాదంటే.. మాది అంటూ రెండు మతాల ప్రజలు గొడవకు దిగుతారు.ఆ వీడియో కాస్త వైరల్ అయి..రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అవుతుంది. పోలీసులు ఆ గొర్రెను అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తారు. కోర్టు జడ్జి(పొసాని కృష్ణ మురళి) ఎలాంటి తీర్పు ఇచ్చాడు. ఒక గొర్రె రెండు మతాల మధ్య ఎలాంటి చిచ్చు పెట్టింది? ఈ గొర్రె న్యూస్ ఇంత వైరల్ కావాడానికి గల కారణం ఏంటి? దీని వెనుక దాగి ఉన్న రాజకీయ కుట్ర ఏంటి? జైలు ఖైది రవి(సుహాస్)కి ఈ గొర్రె కథకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు రవి జైలుపాలు ఎలా అయ్యాడు? అతనికి జరిగిన అన్యాయం ఏంటి? గొర్రె అతనికి ఎలాంటి సహాయం చేసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
గొర్రెతో సినిమా.. మంచి ప్రయత్నమే!
సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గొర్రె పురాణం’. వాస్తవానికి ఇందులో హీరో గొర్రె అనే చెప్పాలి. సినిమా మొత్తంలో సుహాస్ ఓ 20 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. మిగతా భాగం అంతా గొర్రె చుట్టే తిరుగుతుంది. ఈ కథ బాగున్నప్పటికీ హీరో సుహాస్ ప్రమోషన్స్‌కి రాకపోవడం.. పబ్లిసిటీ అంతగా లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. కానీ దర్శకుడు బాబీ మాత్రం ఓ బోల్డ్ అటెంప్ట్ చేశాడు. (చదవండి: గొర్రె పురాణం మూవీ రివ్యూ)గొర్రెతో సినిమా చేయడం అంత చిన్న విషయం కాదు, గొర్రెను ఒక పాత్రగా తెరపై చూపించడం అంటే ఎంత కష్టపడాలో అది మేకర్స్ కు మాత్రమే తెలుసు. అలాంటిది ఎక్కడా వీఎఫ్ఎక్స్ వాడకుండా నిజమైన గొర్రెతో సినిమా తీసిన దర్శకుడి ప్రతిభ మెచ్చుకోదగినది, ఈ విషయంలో దర్శకుడు బాబీ విజయం సాధించాడు అని చెప్పాలి. అందుకే బాబీకి మంచి ప్రశంసలు అందుతున్నాయి.సినిమాను చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. ఈ బడ్జెట్లో ఇంత మంచి సెటైరికల్ సినిమా తీయడంలో డైరెక్టర్ బాబి సక్సెస్ అయ్యాడు. అయితే సినిమాలో మంచి కంటెంట్ ఉంది కానీ, ల్యాగ్ ఎక్కువైందనే విమర్శలు మాత్రం వస్తున్నాయి. -
Gorre Puranam Review: ‘గొర్రె పురాణం’ మూవీ రివ్యూ
టైటిల్: గొర్రె పురాణంనటీనటులు: సుహాస్, పోసాని కృష్ణ మురళి, రఘు తదితరులునిర్మాత: ప్రవీణ్ రెడ్డిదర్శకత్వం: బాబీసంగీతం: పవన్ సీహెచ్సినిమాటోగ్రఫీ: సురేశ్ సారంగంవిడుదల తేది: సెప్టెంబర్ 21, 2024యంగ్ హీరో సుహాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న వదనం లాంటి సినిమాలన్నీ మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు అదే జోష్‌లో ‘గొర్రెపురాణం’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..టైటిల్ తగ్గట్టే ఈ సినిమా కథంతా ఓ గొర్రె చుట్టూ తిరుగుతుంది. రఫిక్ అనే ఓ ముస్లీం వ్యక్తి బక్రీద్ పండగ కోసం ఓ గొర్రెను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తాడు. పండగ రోజు దాన్ని బలి ఇచ్చేందుకు ప్రయత్నించగా తప్పించుకొని పారిపోతుంది. రఫిక్ గ్యాంగ్ దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. పరుగెత్తి హిందువుల టెంపుల్‌లోకి వెళ్తుంది. ఆ పోచమ్మ తల్లే ఈ గొర్రెను మన దగ్గరకు పంపించింది అని చెప్పి.. నరహింహా(రఘు కారుమంచి) దాన్ని ఆ టెంపుల్లోనే బలి ఇవ్వాలని చెబుతాడు. చివరకు ఈ గొర్రె మాదంటే.. మాది అంటూ రెండు మతాల ప్రజలు గొడవకు దిగుతారు. ఆ వీడియో కాస్త వైరల్ అయి..రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అవుతుంది. పోలీసులు ఆ గొర్రెను అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తారు. కోర్టు జడ్జి(పొసాని కృష్ణ మురళి) ఎలాంటి తీర్పు ఇచ్చాడు. ఒక గొర్రె రెండు మతాల మధ్య ఎలాంటి చిచ్చు పెట్టింది? ఈ గొర్రె న్యూస్ ఇంత వైరల్ కావాడానికి గల కారణం ఏంటి? దీని వెనుక దాగి ఉన్న రాజకీయ కుట్ర ఏంటి? జైలు ఖైది రవి(సుహాస్)కి ఈ గొర్రె కథకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు రవి జైలుపాలు ఎలా అయ్యాడు? అతనికి జరిగిన అన్యాయం ఏంటి? గొర్రె అతనికి ఎలాంటి సహాయం చేసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఒక జంతువునే ప్రధాన పాత్రధారిగా పెట్టుకొని హాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. ఇక తెలుగులో అయితే రాజమౌళి చిన్న ఈగతో సినిమా తీసి హిట్ కొట్టాడు. ఈ సినిమాలో కూడా ఒక జంతువునే హీరో. కథంతా గొర్రె చుట్టే నడిపిస్తూ... ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న చాలా అంశాలను ప్రస్తావించారు. కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ప్రజలను ఎలా తప్పుదారి పట్టిస్తారు? తమపై వచ్చే వ్యతిరేకతను తగ్గించుకోవడానికి మీడియాను ఎలా వాడుకుంటారు? అనేది సెటైరికల్‌గా తెరపై చూపించారు. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగుంది. అయితే దాన్ని తెరపై చూపించే విషయంలో కాస్త తడబడ్డాడు. స్క్రీన్‌ప్లేని బలంగా రాసుకోలేకపోయాడు. బహుశా బడ్జెట్ ప్రాబ్లమ్ కావొచ్చ కొన్ని ముఖ్యమైన సీన్లను కూడా సాదా సీదాగా తీసేశారు. ఓ మర్డర్ సీన్‌తో కథను ప్రారంభించి మొదట్లోనే ప్రేక్షకుడికి ఆసక్తి కలిగించాడు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్‌తో గొర్రె ఎంట్రీ ఆకట్టుకుంటుంది. అది రెండు మతాల మధ్య చిచ్చు పెట్టినప్పటి నుంచి కథపై ఆసక్తి కలుగుతుంది. గొర్రె చుట్టూ సాగే సరదా సన్నివేశాలతో బోర్ కొట్టకుండా ఫస్టాఫ్ సాగుతుంది. ఒక్క సీన్ మీనహా ఇంటర్వెల్ వరకు సుహాస్ తెరపై కనిపించదు. ఇక ద్వితియార్థంలో ఎక్కువ భాగం జైలు, కోర్టు సీన్లతోనే సాగుతుంది. రవి ప్లాష్ బ్యాక్ స్టోరీ భావోద్వేగానికి గురి చేస్తుంది. గొర్రెను జైలు నుంచి తప్పించేందుకు హీరో చేసే ప్రయత్నాలు సిల్లీగా అనిపిస్తాయి. కోర్టు సీన్లో సుహాస్ చెప్పే డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. లాజిక్స్ వెతక్కుకుండా చూస్తే..‘గొర్రె పురాణం’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో హీరో గొర్రె అనే చెప్పాలి. ఒక గొర్రెకు తరుణ్ భాస్కర్, మరొక గొర్రెకు గెటప్ శ్రీను వాయిస్ ఓవర్ ఇచ్చారు. రెండు గొర్రెల మధ్య వచ్చే సీన్లకు వీరిద్దరు ఇచ్చే వాయిస్ ఓవర్ నవ్వులు పూయిస్తాయి. ఇక ఈ చిత్రంలోసుహాస్ది కీలక పాత్ర. నిడివి తక్కువే అయినా ఎప్పటి మాదిరిగానే తన పాత్రలో లీనమై నటించాడు సుహాస్. ఖైదీ రవి పాత్రకు న్యాయం చేశాడు. ఎమోషనల్ సీన్లలో చక్కగా నటించాడు. ఇక హిందూ వాదిగా రఘు, జడ్జీగా పొసాని తమదైన కామెడీ పంచులతో నవ్వించే ప్రయత్నం చేశారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. పవన్ సీహెచ్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథలో భాగంగా వస్తాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెర ఇంకాస్త పని చెప్పాల్సింది. నిడివి తక్కువ ఉన్నప్పటికీ కొన్ని చోట్ల సాగదీతగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. -
గొర్రె మీద కేసా?
సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గొర్రె పురాణం’. బాబీ దర్శకత్వంలో ప్రవీణ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.‘గొర్రె మీద కేసా? ఎవడా కేసుపెట్టిన గొర్రె? మనం బతకడం కోసం వాటిని చంపేయొచ్చు... మనది ఆకలి... మరి అవి బతకడం కోసం మనల్ని చంపేస్తే అది ఆత్మరక్షణే కదా సార్...’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. -
ఆసక్తికరంగా సుహాస్ ‘గొర్రె పురాణం’ ట్రైలర్
టాలీవుడ్లో విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న నటుడిగా సుహాస్‌కు గుర్తింపు ఉంది . ఈ క్రమంలో ఆయన నటించిన కొత్త సినిమా 'గొర్రె పురాణం' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. తాజాగా చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇటీవలే అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్, శ్రీరంగనీతులు, ప్రసన్నవదనం వంటి సినిమాలతో ప్రేక్షకులకు సుహాస్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు 'గొర్రె పురాణం' చిత్రంతో సెప్టెంబర్ 20న థియేటర్లోకి రానున్నారు. ఒక గ్రామంలో రెండు మతాల మధ్య ఒక గొర్రె ఎలా చిచ్చు పెట్టిందో ట్రైలర్‌తో హింట్ ఇచ్చారు. కోర్టు, కేసులు, గొడవలు ఇలా అన్నీ ఒక గొర్రె చుట్టూ సాగే ఎమోషనల్ డ్రామాగా సినిమా తెరకెక్కించారు. -
స్వర్ణం గెలవలేకపోయా: ఐఏఎస్ అధికారి సుహాస్ యతిరాజ్
వరుసగా రెండు పారాలింపిక్స్‌లో రజత పతకాలు సాధించిన భారత పారా షట్లర్ సుహాస్ యతిరాజ్... విశ్వక్రీడల్లో స్వర్ణం గెలవలేకపోవడం నిరాశగా ఉందని అన్నారు. పారిస్ పారాలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్4 ఫైనల్లో పరాజయం పాలై రజతం దక్కించుకున్న 41 ఏళ్ల ఐఏఎస్ అధికారి సుహాస్ యతిరాజ్... మూడేళ్ల క్రితం టోక్యోలోనూ రెండో స్థానంలోనే నిలిచారు.‘పసిడి పతకం సాధించాలని ఎంతో శ్రమించా. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌తో విశ్వ క్రీడలకు రావడంతో అంచనాల భారం కూడా పెరిగింది. రజతం దక్కడం కూడా ఆనందంగానే ఉన్నా... ఏదో వెలితి అనిపిస్తోంది. బంగారు పతకం చేజారిందనే బాధ ఒకవైపు... పారాలింపిక్స్ వంటి అత్యుత్తమ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ పతకం నెగ్గాననే భావన మరో వైపు ఉంది. గత కొంతకాలంగా దేశంలో క్రీడా సంస్కృతి పెరిగింది. గతంలో క్రికెట్‌కే ఎక్కువ క్రేజ్ ఉండేది. ఇప్పుడు అన్ని క్రీడలకు ఆదరణ దక్కుతోంది. పారా అథ్లెట్లకు కూడా మంచి తోడ్పాటు లభిస్తోంది. రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో మనవాళ్లు మరిన్ని పతకాలు సాధించగలరు’ అని సుహాస్ అన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాకు చెందిన సుహాస్ 2007 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం సుహాస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో ప్రాంతీయ రక్షక్ దళ్, యూత్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సెక్రటరీ డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. -
వర్షాల ఎఫెక్ట్.. వాయిదా పడిన సుహాస్ సినిమా
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఆగకుండా వర్షం పడుతూనే ఉంది. అవసరముంటే తప్పితే జనాలు పెద్దగా బయటకు రావట్లేదు. ఈ వర్షం వల్ల గతవారం థియేటర్లలో రిలీజైన 'సరిపోదా శనివారం' సినిమాకు పెద్ద దెబ్బ పడింది. బాగుందనే టాక్ వచ్చినప్పటికీ వర్షం వల్ల కలెక్షన్స్ పడిపోయాయి. 5 రోజుల్లో రూ.65 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది.(ఇదీ చదవండి: ప్రభాస్ భారీ విరాళం.. మీరు విన్నది నిజం కాదు!)ఇలా వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాలతో పాటు తెలుగు స్టార్ హీరోలు చాలామంది లక్షల రూపాయల్ని విరాళంగా ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే సుహాస్ హీరోగా దిల్ రాజు నిర్మాణ సంస్థ తీసిన 'జనక అయితే గనక' సినిమాని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.లెక్క ప్రకారం సెప్టెంబరు 7న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాలి. ముందు రోజు ప్రీమియర్లు కూడా ప్లాన్ చేశారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ఇంతలోనే మరోసారి తెలుగు రాష్ట్రాలకు వర్షం పోటెత్తనుందనే హెచ్చరిక వచ్చింది. 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడబోతున్నాయని అంటున్నారు. దీనిబట్టి చూస్తే వాయిదా వేసి మంచి పనే చేశారనిపిస్తోంది.(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్!) -
దిల్ రాజు వాట్సాప్ చాట్ బయటపెట్టిన సుహాస్!
చిన్న సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం చాలా కష్టం. ఎంత ప్రచారం చేసినా..కొన్ని చిన్న చిత్రాలు రిలీజ్ అయిన విషయం కూడా ప్రేక్షకులకు తెలియదు. అందుకే మేకర్స్ డిఫరెంట్ వేలో ప్రచారం చేయడం ప్రారంభించారు. ప్రాంక్ వీడియోలు చేస్తూ..కాంట్రవర్సీ క్రియేట్ చేసి సినిమా పేరును ప్రేక్షకులను చేరవయ్యేలా చేస్తున్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్స్ కూడా డిఫరెంట్‌గానే ప్లాన్ చేస్తున్నారు. తాజాగా హీరో సుహాస్ తన కొత్త సినిమా ప్రచారం కోసం ఏకంగా దిల్ రాజు వాట్సాప్ చాట్నే బయటపెట్టాడు.ప్రీమియర్ షో ఫిక్స్!సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. దిల్ రాజు ప్రోడక్షన్స్ బ్యానర్‌పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మించారు. సందీర్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. రిలీజ్‌కి ఒక రోజు ముందు అంటే.. సెప్టెంబర్ 6న ప్రీమియర్ షో వేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ..నిర్మాత దిల్ రాజుతో చేసిన వాట్సాప్ చాట్‌ని హీరో సుహాస్ బయటపెట్టాడు.వాట్సాప్ చాట్‌లో ఏముందంటే..సుహాస్: సర్ మనం ప్రీమియర్ షో వేస్తే బాగుంటుంది. ఈ మధ్య ప్రీమియర్స్ వేసిన సినిమాలన్నీ బాగా వర్కౌట్ అవుతున్నాయి.దిల్ రాజు: చూడాలి సుహాస్. ఇప్పటికిప్పుడు అంటే ప్లాన్ చేయాలి. చెక్ చేసి చెబుతా.సుహాస్: ఈ నెల 6న సాయంత్రం ఏఎంబీ, నెక్సెస్ ఇలా అన్ని ఓపెన్ చేద్దాం సర్.దిల్ రాజు: కొంచెం టైమ్ ఇవ్వు సుహాస్.. చెప్తా.సుహాస్: వాయిస్ రికార్డుదిల్ రాజు: 6న కన్ఫామ్ సుహాస్. ప్రీమియర్స్ వేసేద్దాంసుహాస్: క్లాప్ కొడుతున్న ఎమోజీThat's how @ThisIsDSP Garu helped us 🤗❤️#JanakaAitheGanaka premieres on September 6th 🤗#JAGOnSeptember7th pic.twitter.com/i1Kog2gh2y— Suhas 📸 (@ActorSuhas) September 3, 2024 -
‘జనక అయితే గనక’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
మా లైన్ దాటలేదు: ‘దిల్’ రాజు
‘‘దిల్’ రాజు ప్రోడక్షన్ అంటే కుటుంబంతో కలిసి చూసే సినిమా ఉంటుంది. అయితే ‘జనక అయితే గనక’ కాస్త భిన్నంగా ఉంటుంది. కానీ మా బేనర్ లైన్ దాటకుండా తీశాం’’ అన్నారు ‘దిల్’ రాజు. సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. దిల్ రాజు ప్రోడక్షన్స్ బ్యానర్‌పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మించారు. సందీర్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది.ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘చేస్తున్న ప్రతి సినిమాకీ ఒక్కో మెట్టు ఎక్కుతున్న సుహాస్ కొత్త కథలు ఎంచుకుంటున్నాడు. సుహాస్ అంటే మినిమమ్ గ్యారెంటీ అని యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు కూడా అంటున్నారు. ఇక చిన్న సినిమాలకు ప్రీమియర్లు కలిసి వస్తున్నాయి. మేం సెప్టెంబర్ 6న ప్రీమియర్లు వేస్తున్నాం.ఈ సినిమా చూశాక వినోదంతో పాటు మంచి సందేశం ఇచ్చారనే ఫీల్‌తో థియేటర్ నుంచి బయటకు వస్తారు’’ అని అన్నారు. ‘‘ప్రశాంత్ నీల్‌కి ఈ కథ తెలుసు... చాలా బాగుందన్నారు’’ అని సందీప్ రెడ్డి చెప్పారు. ‘‘ఈ సినిమాని ఓవర్సీస్లో డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నానని ‘దిల్’ రాజుగారితో చెబితే ఓకే అన్నారు’’ అని సుహాస్ తెలిపారు. ఎడిటర్ కోదాటి, సంగీతదర్శకుడు విజయ్ బుల్గానిన్ పాల్గొన్నారు. -
‘పసిడి’ వేటలో భారత షట్లర్లు
పారిస్: పారాలింపిక్స్‌లో ఆదివారం భారత షట్లర్లు మెరిపించారు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్–4 కేటగిరీలో సుహాస్ యతిరాజ్... ఎస్ఎల్–3 కేటగిరీలో నితేశ్ కుమార్ ఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం రజత పతకాలను ఖరారు చేసుకున్నారు. 2007 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన సుహాస్ గత టోక్యో పారాలింపిక్స్‌లోనూ ఫైనల్‌కు చేరి రజత పతకం దక్కించుకున్నాడు. ఈసారి సెమీఫైనల్లో సుహాస్ 21–17, 21–12తో భారత్‌కే చెందిన సుకాంత్ కదమ్‌ను ఓడించాడు. మరో విభాగం సెమీఫైనల్లో నితేశ్ 21–16, 21–12తో దైసుకె ఫుజిహారా (జపాన్)పై గెలిచి తొలిసారి పారాలింపిక్స్ ఫైనల్లోకి ప్రవేశించాడు. నేడు జరిగే ఫైనల్స్‌లో టోక్యో పారాలింపిక్స్ చాంపియన్ లుకాస్ మజుర్ (ఫ్రాన్స్)తో సుహాస్; డేనియల్ బెథెలి (బ్రిటన్)తో నితేశ్ తలపడతారు. మహిళల సింగిల్స్ ఎస్యు5 కేటగిరీలో ఇద్దరు భారత క్రీడాకారిణులు తులసిమతి మురుగేశన్, మనీషా రామదాస్ సెమీఫైనల్లో పోటీపడనున్నారు. ఇద్దరిలో ఒకరు ఫైనల్‌కు చేరుకోనుండటంతో ఈ విభాగంలోనూ భారత్‌కు కనీసం రజతం లభించనుంది. ఈరోజు జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో ఫ్రెడీ సెతియావాన్ (ఇండోనేసియా)తో సుకాంత్ తలపడతాడు. ప్రీతికి రెండో పతకం మహిళల అథ్లెటిక్స్ టి35 200 మీటర్ల విభాగంలో భారత అథ్లెట్ ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని సాధించింది. ప్రీతి 200 మీటర్ల దూరాన్ని 30.01 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. టి35 100 మీటర్ల విభాగంలోనూ ప్రీతికి కాంస్య పతకం లభించిన సంగతి తెలిసిందే. రాకేశ్‌కు దక్కని కాంస్యం పురుషుల ఆర్చరీ కాంపౌండ్ ఓపెన్ విభాగంలో భారత ప్లేయర్ రాకేశ్ కుమార్ కాంస్య పతక మ్యాచ్‌లో ఓడిపోయాడు. హి జిహావో (చైనా)తో జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో రాకేశ్ 146–147 స్కోరుతో పరాజయం పాలయ్యాడు. రవికి ఐదో స్థానం పురుషుల షాట్‌పుట్ ఎఫ్40 కేటగిరీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు రవి రొంగలి ఐదో స్థానంలో నిలిచాడు. ఇనుప గుండును రవి 10.63 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది ఆసియా పారా గేమ్స్‌లో రజతం గెలిచిన రవి ఈసారి తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినా ఫలితం లేకపోయింది. మిగెల్ మోంటెరో (పోర్చుగల్; 11.21 మీటర్లు) స్వర్ణం సాధించాడు. మరోవైపు మహిళల 1500 మీటర్ల టి11 విభాగం తొలి రౌండ్లో భారత అథ్లెట్ రక్షిత రాజు 5 నిమిషాల 29.92 సెకన్లలో గమ్యానికి చేరి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది. షూటర్ల గురి కుదరలేదు భారత షూటర్లకు ఆదివారం అచి్చరాలేదు. ఆదివారం లక్ష్యంపై గురి పెట్టిన ఏ షూటర్ కూడా పోడియంపై నిలువలేకపోయాడు. మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ (ఎస్‌హెచ్1) ఈవెంట్లో అవని లేఖరా 11వ స్థానంలో నిలువగా, సిద్ధార్థ బాబు 28వ స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. ఇదే విభాగం వ్యక్తిగత ఈవెంట్లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన అవని గురి ‘మిక్స్డ్’లో మాత్రం కుదర్లేదు. ఆమె 632.8 స్కోరు చేయగా, సిద్ధార్థ 628.3 స్కోరు చేశాడు. ఈ ఈవెంట్ల్లో టాప్–8 స్థానాల్లో నిలిచిన వారే ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ (ఎస్‌హెచ్2) ఈవెంట్లోనూ శ్రీహర్ష రామకృష్ణకు క్వాలిఫయింగ్‌లోనే చుక్కెదురైంది. అతను 630.2 స్కోరుతో 26వ స్థానంలో నిలిచాడు. రోయింగ్‌లో నిరాశ భారత రోయింగ్ జోడీ కొంగనపల్లి నారాయణ–అనితకు పారాలింపిక్స్‌లో నిరాశ ఎదురైంది. ఆసియా పారా క్రీడల్లో రజత పతకం నెగ్గుకొచి్చన ఈ జంట పారిస్ నుంచి రిక్తహస్తాలతో రానుంది. ఆదివారం జరిగిన పీఆర్3 మిక్స్డ్ డబుల్ స్కల్స్ రోయింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నారాయణ–అనిత జోడీ ఓవరాల్‌గా ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశపరిచింది. 7 నుంచి 12వ స్థానాల కోసం నిర్వహించిన వర్గీకరణ పోటీల్లో భారత ద్వయానికి 8వ స్థానం దక్కింది. ఈ జంట పోటీని 8 నిమిషాల 16.96 సెకన్లలో పూర్తి చేసింది. ఆర్మీ సిపాయి అయిన కొంగనపల్లి నారాయణ 2015లో జమ్మూ కశీ్మర్లోని సరిహద్దు విధుల్లో ఉండగా ల్యాండ్‌మైన్ పేలి ఎడమ కాలిని మోకాలు నుంచి పాదం వరకు పూర్తిగా కోల్పోయాడు. అనిత రోడ్డు ప్రమాదంలో కాలును కోల్పోయింది. -
'జనక అయితే గనక'.. ట్రైలర్ వచ్చేసింది!
డిఫరెంట్ స్టోరీస్‌తో అభిమానులను అలరిస్తోన్న నటుడు సుహాస్. తాజాగా మరో ఆసక్తికర టైటిల్‌తో ఫ్యాన్స్‌ను అలరించేందుకు వచ్చేస్తున్నాడు. సుహాస్, సంగీర్తన జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'జనక అయితే గనక'. ఈ సినిమాకు సందీప్‌రెడ్డి బండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే మధ్య తరగతి వ్యక్తి జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. భార్య, భర్త, పిల్లలు అనే ఆసక్తికర కథాంశంతో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. టైటిల్ చూస్తేనే ఆడియన్స్‌లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 7న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. -
కీర్తీ సురేష్ సినిమా.. డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదల
హీరోయిన్ కీర్తీ సురేశ్ మెయిన్ లీడ్ రోల్లో నటిస్తున్న కొత్త సినిమా ‘ఉప్పు కప్పురంబు’ డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సుహాస్ మరో లీడ్ రోల్లో కనిపిస్తారు. ఐవీ శశి దర్శకత్వంలో తెరకెక్కుత్ను ఈ చిత్రాన్ని రాధికా లావు నిర్మించారు. వసంత్ మురళీ కృష్ణ మరింగంటి కథ అందిస్తున్నారు.ఓ గ్రామంలోని స్మశానం విస్తరణ నేపథ్యంలో ‘ఉప్పు కప్పురంబు’ సినిమా కథనం ఉంటుందనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. కాగా ఈ సినిమాలో కీర్తీ సురేశ్, సుహాస్ జంటగా నటిస్తారా? లేదా? అనే విషయంపై స్పష్టత రావాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి ఉండాల్సిందే. అయితే, ఉప్పు కప్పురంబు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది. అమెజాన్ ప్రైమ్ కోసమే ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా విడుదల కానుంది. త్వరలోనే మరిన్ని విషయాలు ఉప్పు కప్పురంబు మేకర్స్ వెల్లడించనున్నారు. కీర్తీ సురేశ్ నటించిన రఘుతాత సినిమా ఆగష్టు 15న విడుదల కానుంది. మరోవైపు బేబీ జాన్ సినిమాతో ఆమె బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుంది. -
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘శ్రీరంగనీతులు’
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాన్ నటించిన తాజా చిత్రం ‘శ్రీరంగనీతులు’. ప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 11న థియేటర్స్‌లో విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది.ఈ సినిమాలో సుహాస్ తో పాటు కేరాఫ్ కంచరపాలెం తో ఆకట్టుకున్న కార్తీక్‌రత్నం, బేబీ తో యూత్ లో ఫాలోయింగ్ తెచ్చుకున్న విరాజ్ అశ్విన్, రుహానిశర్మ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నలుగురి పెర్ఫార్మెన్స్ శ్రీరంగనీతులు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఇటీవల ఈ చిత్రాన్ని ఓటీటీ రిలీజ్ చేయగా..అక్కడ కూడా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. అమెజాన్ ప్రెమ్‌లో టాప్ ట్రెండింగ్ చిత్రంగా కొనసాగుతుంది. థియేటర్స్‌కి మించిన స్పందన ఓటీటీల్లో రావడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది.‘శ్రీరంగనీతులు’ స్టోరీ ఇదేఈ సినిమా కథంతా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. బస్తీకి చెందిన శివ(సుహాస్) టీవీ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. అతనికి ఫ్లెక్సీల పిచ్చి. బతుకమ్మ సందర్భంగా ఆ ఏరియాలోని గ్రౌండ్లో ఎమ్మెల్యేతో కలిసి దిగిన ఫోటోతో ఫ్లెక్సీ కట్టిస్తాడు. అయితే దాన్ని రాత్రికి రాత్రే ఎవరో మాయం చేస్తారు. మరో ప్లెక్సీ కట్టించడానికి డబ్బులు ఉండవు. ఎలాగైన పండక్కి గ్రౌండ్లో తన ప్లెక్సీ ఉండాలనుకుంటాడు. దాని కోసం శివ ఏం చేశాడు? చివరకు ఏం జరిగింది?మరోవైపు వరుణ్(విరాజ్ అశ్విన్), ఐశ్వర్య(రుహానీ శర్మ) ప్రేమించుకుంటారు. తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి భయపడుతుంది ఐశ్వర్య. పెళ్లి చేసుకుందామని వరుణ్ పదే పదే అడగడంతో ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు రెడీ అవుతుంది. ఇంతలోపు ఆమె తండ్రి ఓ పెళ్లి సంబంధం తీసుకొస్తాడు. వారికి అమ్మాయి నచ్చడంతో త్వరలోనే పెళ్లి చేయాలనుకుంటారు. ప్రేమ విషయాన్ని చెప్పలేక, పెద్దలు చూసిన సంబంధం చేసుకోలేక సతమతమవుతారు. దీంతో పాటు ఐశ్వర్యకు మరో సమస్య వస్తుంది. ఆది ఏంటి? చివరకు వరుణ్, విరాజ్‌లు పెళ్లి చేసుకున్నారా లేదా?ఇంకోవైపు ఉన్నత చదువులు చదివిన కార్తిక్(కార్తీక్ రత్నం) డ్రగ్స్‌కి అలవాటు పడి జులాయిగా తిరుగుతుంటాడు. ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతున్నాడని తెలిసి అతన్ని పట్టుకోవడం కోసం పోలీసులు తీరుగుతుంటారు. కొడుకును పోలీసులకు చిక్కకుండా కాపాడుకునే క్రమంలో తండ్రి(దేవీ ప్రసాద్) చిక్కుల్లో పడతారు. చివరకు తండ్రిని కూడా పోలీసులు పట్టుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? కార్తిక్ డ్రగ్స్‌కు ఎందుకు బానిసయ్యాడు? చివరకు ఈ ముగ్గురి జీవితాల్లో వచ్చిన మార్పు ఏంటి? అనేదే మిగతా కథ. -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మరో తెలుగు సినిమా చెప్పపెట్టకుండా ఓటీటీలోకి వచ్చేసింది. లెక్క ప్రకారం యూట్యూబ్‌లో దీన్ని నేరుగా రిలీజ్ చేస్తారనే న్యూస్ వచ్చింది. ఈ క్రమంలోనే దీనికి ఒకరోజు ముందు ఇప్పుడు సైలెంట్‌గా ఈ మూవీని ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది చూద్దాం.కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టినప్పటికీ 'కలర్ ఫోటో'తో హిట్ కొట్టిన సుహాస్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం టాలీవుడ్లో ప్రామిసింగ్ మూవీస్ చేస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు', 'ప్రసన్న వదనం' లాంటి మూవీస్‌తో ఆకట్టుకున్నాడు. ఇతడు కీలక పాత్రలో నటించిన మూవీనే 'శ్రీరంగనీతులు'. ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్)సుహాస్, విరాజ్ అశ్విన్, రుహానీ శర్మ కీలక పాత్రలు పోషించిన 'శ్రీరంగనీతులు'.. బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. జనాల్ని ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే మే 30న దీన్ని యూట్యూబ్‌లో ఉచితంగా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇంతలోనే ఆహా ఓటీటీ ఈ మూవీని స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చేసింది.'శ్రీరంగనీతులు' కథ విషయానికొస్తే.. బస్తీ కుర్రాడు శ్యాంసంగ్ శివ (సుహాస్)ది ఫ్లెక్సీల పిచ్చి. లోకల్ రాజకీయ నాయకుడితో ఫొటో దిగి ఫ్లెక్సీ వేయిస్తాడు. కానీ అది మాయమవుతుంది. మరోవైపు జీవితంలో ఫెయిలయ్యానని కార్తీక్ (కార్తిక్ రత్నం) మద్యానికి బానిస అయిపోతాడు. ఇంకోవైపు ఐశ్వర్య (రుహానీ శర్మ), వరుణ్ (విరాజ్ అశ్విన్) ప్రేమికులు. కానీ తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పే ధైర్యముండదు. మరి ఈ నలుగురి జీవితాల్లో ఏం జరిగింది? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆరేళ్ల తర్వాత తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)🔥 Drama, love, and suspense 🔥 "Sriranga Neethulu" takes you on a journey of unexpected twists and emotional highs. Watch now #SrirangaNeethulu only on aha▶️https://t.co/4BJf8LDbAm pic.twitter.com/DcMAoezh3Q— ahavideoin (@ahavideoIN) May 29, 2024 -
ఓటీటీలోకి సుహాస్ లేటెస్ట్ హిట్ మూవీ.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్
మరో క్రేజీ సినిమా ఓటీటీ రిలీజ్‌కి రెడీ అయిపోయింది. సుహాస్ హీరోగా నటించిన ఆ సినిమా పేరే 'ప్రనస్న వదనం'. విడుదలకు ముందే అంచనాలు ఏర్పరుచుకున్న ఈ చిత్రం.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత బాగుందనే టాక్ సొంతం చేసుకుంది. కాకపోతే కాన్సెప్ట్ కాస్త కొత్తగా ఉండటంతో జనాలకు అనుకున్న స్థాయిలో రీచ్ కాలేకపోయింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో అలరించేందుకు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.తెలుగులో ఈ మధ్య కాలంలో సుహాస్ పేరు బాగా వినిపిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీతో హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో.. రీసెంట్గా 'ప్రసన్న వదనం'తో వచ్చాడు. మే 3న థియేటర్లలోకి వచ్చింది. హీరోకి ఫేస్ బ్లైండ్నెస్ అనే కథ ఆసక్తికరంగా అనిపించింది. సినిమా కూడా బాగానే ఉందని చూసినవాళ్లు అభిప్రాయపడ్డారు. ఇప్పుడీ మూవీ మూడు వారాల్లోనే అంటే మే 24 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: భూ వివాదంలో ట్విస్ట్.. క్లారిటీ ఇచ్చిన జూ.ఎన్టీఆర్ టీమ్)'ప్రసన్నవదనం' కథేంటి?సూర్య (సుహాస్) ఓ రేడియో జాకీ. ఓ యాక్సిడెంట్ కారణంగా ప్రొసోపగ్నోషియా అనే పరిస్థితి వస్తుంది. ఇది ఓ లోపం. అదేంటంటే ఇతడికి మొహాలు గుర్తుండవు, కనిపించవు. అన్నీ గుర్తుంటాయి ముఖాలు తప్ప. దీన్ని ఫేస్ బ్లైండ్నెస్ అంటారు. ఈ సమస్యతో ఉన్నోడు కాస్త ఓ హత్యలో సాక్షి అవుతాడు. అసలా మర్డర్ చేసిందెవరు? లోపమున్న హీరో నిందుతుల్ని ఎలా పోలీసులకు పట్టిస్తాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు థియేటర్లలో చూడాలంటే కాస్త కష్టం కానీ ఓటీటీలో మాత్రం క్రేజీగా ఆడేస్తాయి. ప్రస్తుతం అటు థియేటర్, ఇటు ఓటీటీలో పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. వచ్చే వారం ఓటీటీలోకి వచ్చేస్తుంది కాబట్టి 'ప్రసన్నవదనం'.. డిజిటల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఛాన్సులు గట్టిగా ఉంటాయనమాట.(ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. స్పాట్లో చనిపోయిన స్టార్ హీరో బంధువులు)Without a Face, But Not Without Courage..💪A Hero's Journey Beyond Sight!🎭A gripping thriller-drama #PrasannaVadanamOnAha Premieres May 24th!(24 hours early access for aha gold subscribers)@ahavideoIN @ActorSuhas @payal_radhu @RashiReal_ @ManikantaJS @ReddyPrasadLTC… pic.twitter.com/NG4CmDnW94— ahavideoin (@ahavideoIN) May 17, 2024 -
సుహాస్ ప్రసన్న వదనం.. మరో హిట్ పడినట్టేనా?
టైటిల్: ప్రసన్న వదనంనటీనటులు: సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్, నందు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులుడైరెక్టర్: అర్జున్ వైకేనిర్మాతలు: మణికంఠ జేఎస్, ప్రసాద్‌రెడ్డి టీఆర్‌సంగీతం: విజయ్ బుల్గానిన్సినిమాటోగ్రఫీ: ఎస్.చంద్రశేఖరన్‌ఎడిటింగ్: కార్తిక్ శ్రీనివాస్విడుదల తేదీ: 03-05-2024టాలీవుడ్లో యంగ్ హీరో సుహాస్ ప్రత్యేక శైలితో దూసుకెళ్తున్నారు. ఫ్యామిలీ డ్రామా, కలర్ ఫోటో, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. తాజాగా మరోసారి ప్రసన్న వదనం అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. సుకుమార్ వద్ద పని చేసిన అర్జున్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఫేస్ అండ్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్ ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి సరికొత్త కాన్సెప్ట్ వర్కవుట్ అయ్యిందా? కొత్త దర్శకుడితో సుహాస్ ఖాతాలో మరో హిట్ పడిందా? చూసేద్దాం పదండి. అసలు కథేంటంటే...ఓ ప్రమాదంలో తల్లితండ్రులను కోల్పోతాడు సూర్య(సుహాస్). అసలే కష్టాల్లో ఉన్న అతనికి మరో వింత డిజార్డర్ కూడా వస్తుంది. తలకి బలంగా గాయం కావడంతో ఫేస్ బ్లైండ్నెస్ డిజార్డర్ వస్తుంది. అంటే అతను ఎవరినీ గుర్తించలేడు. ఓ ఎఫ్ఎం స్టేషన్లో ఆర్జేగా పని చేస్తున్న సూర్య ఓ అర్ధరాత్రి దారుణమైన ఘటనను ప్రత్యక్షంగా చూస్తాడు. అమృత(సాయి శ్వేత)అనే అమ్మాయిని ఎవరో లారీ కింద తోసేస్తారు. అయితే ఈ ఘటనని ప్రత్యక్షంగా చూసిన సూర్య.. తనకి ఫేస్ బ్లైండ్నెస్ ఉండటం వల్ల ఆ వ్యక్తి ఎవరనేది గుర్తుపట్టలేడు. మరుసటి రోజే అది యాక్సిడెంట్ అని వార్తల్లో వస్తుంది. ఇది చూసిన సూర్య బాధితురాలికి న్యాయం చేయాలని భావించి పోలీసులకు ఫోన్ చేసి అసలు సంగతి చెబుతాడు. ఈ కేసుని ఏసీపీ వైదేహి(రాశి సింగ్) ఎస్ఐ( నితిన్ ప్రసన్న) చాలా సీరియస్‌గా తీసుకుంటారు. అసలు పోలీసులు నిందితున్ని పట్టుకున్నారా? దర్యాప్తులో ఎలాంటి నిజాలు రాబట్టారు? ఫేస్ బ్లైండ్‌నెస్‌తో సూర్య ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు ? అసలు అమృతని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది ? అనేది తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే.ఎలా సాగిందంటే.. ఇలాంటి ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్‌తో తెలుగులో ఇప్పటివరకూ సినిమాలు రాలేదు. సరికొత్త పాయింట్‌ను తీసుకున్న డైరెక్టర్ అర్జున్ ఆ పాయింట్‌ను అంతే కొత్తగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు. అందులో సక్సెస్ అయ్యారు కూడా. సూర్య తల్లితండ్రులు ప్రమాదంలో చనిపోవడం.. సూర్యకి ఫేస్ బ్లైండ్ నెస్ రావడం.. ఆ తర్వాత అతను పడే ఇబ్బందులు, అధ్య(పాయల్ రాధకృష్ణ) రూపంలో ఓ క్యూట్ లవ్ స్టొరీతో కథను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లాడు. కథలోకి క్రైమ్ ఎలిమెంట్ వచ్చిన తరవాత వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ మాత్రం నిజంగానే బ్లైండ్నెస్ వచ్చేలా చేస్తుంది. అంటే అంతలా సస్పెన్ష్ ఉంటుందన్నమాట.సెకండాఫ్‌కు వచ్చేసరికి కథను మరింత గ్రిప్పింగ్‌గా నడిపించారు డైరెక్టర్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఆ ట్విస్ట్‌ను ఎవరూ ఊహించలేరు. కథను అంత పకడ్బందీగా రాసుకున్నాడు దర్శకుడు. క్లైమాక్స్ ఈ సినిమాకి మరో హైలెట్‌గా నిలిచింది. అప్పటివరకూ కాస్తా స్లో నేరేషన్ అనిపించినప్పటికీ ఈ కథకు ఇచ్చిన ముగింపు మాత్రం అదిరిపోయింది.ఎవరెలా చేశారంటే...సూర్య పాత్రలో సుహాస్ సహజంగా ఒదిగిపోయాడు .తనదైన నటనలో ఎమోషనల్ సీన్స్‌లో అదరగొట్టేశాడు. యాక్షన్ సీక్వెన్స్‌లోనూ సూపర్బ్ అనిపించాడు. పాయల్ తన అందంతో పాత్రలో ఒదిగిపోయింది. రాశి సింగ్, నితిన్ తమ పాత్రల పరిధి మేర నటించారు. హర్ష, సత్య కామెడీతో అదరగొట్టేశారు. ఓవరాల్‌గా నందుతో పాటు మిగిలిన నటీనటులు తమపాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే.. విజయ్ బుల్గానిన్ నేపధ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ ఫరవాలేదు. కార్తిక్ శ్రీనివాస్ ఎడిటింగ్‌లో తన కత్తెరకు కాస్తా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. ఓవరాల్‌గా తొలి సినిమాతోనే దర్శకుడు అర్జున్ తన మార్క్ చూపించారు. -
ఆనందంతో డైరెక్టర్ని హత్తుకున్నాను: సుహాస్
‘‘ప్రసన్న వదనం’ మూవీ ఫేస్ బ్లైండ్నెస్ (ముఖాలను గుర్తు పట్టడంలో ఇబ్బంది) కాన్సెప్ట్‌తో రూపొందింది. డైరెక్టర్ అర్జున్‌గారు సినిమా తీసిన విధానం, స్క్రీన్ ప్లే అదిరిపోయాయి. ఈ సినిమా తొలి కాపీ చూశాక భావోద్వేగం, ఆనందంతో డైరెక్టర్ని హత్తుకున్నాను. ఇంత అద్భుతంగా వచ్చిన మా చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని సుహాస్ అన్నారు. అర్జున్ వైకే దర్శకత్వంలో సుహాస్ హీరోగా, పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రసన్న వదనం’. జేఎస్ మణికంఠ, టీఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా సుహాస్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో రేడియో జాకీ పాత్ర చేశాను. అతను తనకున్న ఫేస్ బ్లైండ్నెస్ కారణంగా ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నాడు? దాన్ని ఎలా పరిష్కరించుకున్నాడు అనేది ఈ చిత్రకథ. ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. అవి చేయడం కాస్త సవాల్‌గా అనిపించింది. ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని నిర్మించారు నిర్మాతలు. ప్రస్తుతానికి నా చేతిలో ఎనిమిది సినిమాలున్నాయి’’ అన్నారు.