తెలుగు చిత్రపరిశ్రమలో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ’ అన్న మాటను తప్పని రుజువు చేస్తున్నారు ఎంతోమంది తెలుగు అమ్మాయిలు తమ ప్రతిభతో..! తాజాగా
ఆ జాబితాలోకి చేరిన నటే టీనా శిల్పరాజ్. ఇటీవల రైటర్ పద్మభూషణ్ సినిమాలో టాలీవుడ్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది.
యాక్టర్‌గా మనల్ని మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మన బలాలు, బలహీనతలు ఏంటీ? ఎక్కడ మనం బాగా చేయగలుగుతున్నాం. ఇంకా ఎక్కడ మెరుగుపరచుకోవాలి? ఇలా చాలా విషయాలను నేర్చుకున్నాను ఈ ప్రయాణంలో – టీనా శిల్పరాజ్
టీనా శిల్పరాజ్.. పక్కా హైదరాబాదీ. పుట్టింది, పెరిగింది, చదివింది అంతా హైదరాబాద్‌లోనే. చదువు పూర్తయిన వెంటనే నటనపై ఉన్న ఆసక్తితో మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆమె అందానికి అభినయం కూడా తోడవటంతో అవకాశాలు ఆమె ఇంటి తలుపు తట్టాయి. ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’ వెబ్ సిరీస్‌తో వీక్షకులకు పరిచయం అయింది.
అయితే ఆమె చేసింది ఒక్క సిరీసే అయినా.. అందులో ఆమె నటనను మెచ్చి సినిమా ఛాన్స్ కూడా వచ్చి చేరింది ఆమె కాల్షీట్స్ డైరీలో. ఆడిషన్‌కు వెళ్లటం, సెలెక్ట్ అయ్యి సినిమాలో నటించడం, ఇప్పుడు ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండటం అన్నీ చకచకా జరిగిపోయాయి. అదే ఆమె నటించిన ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా. చిన్న సినిమా అయినా థియేటర్లలో సందడి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment