Writer Padma Bhushan Movie
-
ఈ వారం థియేటర్/ ఓటీటీలో అలరించే చిత్రాలివే
టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న చిత్రాల హవా కొనసాగుతుంది. గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్ బరిలో పెద్ద చిత్రాలేవి లేకపోవడంతో.. వరుసగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ వారం కూడా అటు ఓటీటీలో ఇటు థియేటర్స్‌లో చిన్న చిత్రాలే రిలీజ్ కాబోతున్నాయి. మార్చి మూడో వారంలో రిలీజ్ కాబోతున్న సినిమాలపై ఓ లుక్కేయండి. కబ్జ కన్నడ స్టార్స్ ఉపేంద్ర, సుదీప్, శివరాజ్ కుమార్ హీరోలుగా నటంచిన మల్టీస్టారర్ ‘కబ్జ’. ఆర్. చంద్రు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రముఖ హీరో పునీత్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 17న తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత నటుడు నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 'కళ్యాణ వైభోగమే' చిత్రంలో నాగశౌర్యకు జోడిగా నటించి వెండితెరపై మ్యాజిక్ చేసిన మాళవిక నాయర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 17న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ‘సార్’ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తొలిసారిగా తెలుగులో కథానాయకుడిగా నటించిన చిత్రం సార్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 17న విడుదలై సూపర్ హిట్ కొట్టింది. సంయుక్తా మీనన్ హీరోయిన్. సముద్రఖని, హైపర్ ఆది, తనికెళ్ళ భరణి, అక్కినేని సుమంత్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించారు. ఇక థియేటర్ ఆడియన్స్‌ను అలరించిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్దమైంది. ఈ నెల 17 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. సత్తిగాని రెండెకరాలు ‘పుష్ప’ స్నేహితుడిగా నటనకు గానూ మంచి మార్కులు కొట్టేసిన జగదీశ్ ప్రతాప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సత్తిగాని రెండెకరాలు’. దీనికి అభినవ్ రెడ్డి దర్శకుడు. వెన్నెల కిశోర్ .. మోహనశ్రీ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్న ఈ మూవీ మార్చి 17వ తేదీ నుంచి ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. రైటర్ పద్మభూషన్ కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషన్’. ఫిబ్రవరి 3న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని మంచి విజయం సాధించింది. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్దమైంది. మార్చి 17నుంచి ప్రముఖ ఓటీటీ జీ5లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు.. మనీషాట్- మార్చి 15 కుత్తే (హిందీ చిత్రం)- మార్చి 16 షాడో అండ్ బోన్(వెబ్ సిరీస్-సీజన్ 2)- మార్చి 16 మేస్ట్రో(వెబ్ సిరీస్)- మార్చి 17 ఇన్ హిజ్ షాడో మార్చి(సినిమా)- మార్చి 17 ది మెజిషియన్ ఎలిఫెంట్(సినిమా)- మార్చి 17 అమెజాన్ ప్రైమ్ వీడియో బ్లాక్ ఆడమ్(ఇంగ్లీష్)- మార్చి 15 డోమ్ (వెబ్ సిరీస్-సీజన్ 2)- మార్చి 17 ఆహా.. సత్తిగాని రెండెకరాలు(తెలుగు)- మార్చి 17 లాక్డ్ (వెబ్ సిరీస్ సీజన్ 2)- మార్చి 17 జీ5 లాక్(తమిళం)- మార్చి 17 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.. పాప్ కౌన్(హిందీ సిరీస్)- మార్చి 17 సోనీ లివ్.. రాకెట్ బాయ్స్(హిందీ సిరీస్ 2)- మార్చి 16 -
ఓటీటీకి 'రైటర్ పద్మభూషణ్'.. రిలీజ్ డేట్ ఫిక్స్
కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. ఫిబ్రవరి 3న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. టీనా శిల్పరాజ్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటించింది. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఓటీటీ రైట్స్‌ను జీ5 దక్కించుకుంది. ఈనెల 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. అసలు కథేంటంటే.. పద్మ భూషణ్ అలియాస్ రైటర్ పద్మభూషణ్(సుహాస్) విజయవాడలో లైబ్రేరియన్‌గా పని చేస్తుంటాడు. ఎప్పటికైనా గొప్ప రైటర్ కావాలని కలలు కంటాడు. అతని ఇష్టాన్ని ప్రోత్సహిస్తుంటారు తండ్రి మధుసూధన్‌రావు(అశిష్ విద్యార్థి), తల్లి సరస్వతి(రోహిణి). పద్మభూషన్ కష్టపడి ‘తొలి అడుగు’ అనే ఒక పుస్తకాన్ని రాస్తాడు. పేరెంట్స్‌కి తెలియకుండా అప్పుచేసి మరీ ఆ పుస్తకాన్ని పబ్లీష్ చేయిస్తాడు. కానీ ఆ పుస్తకాన్ని ఎవరూ కొనుగోలు చేయరు. ఉచితంగా ఇచ్చినా చదవరు. దీంతో తీవ్ర నిరాశకు గురవుతాడు. కట్ చేస్తే.. పద్మ భూషన్ పేరుతో మార్కెట్లోకి ఓ పుస్తకం వస్తుంది. అది బాగా సేల్ అవుతుంది. అంతేకాదు అతని పేరు మీద బ్లాగ్ కూడా రన్ అవుతుంది. దీంతో పద్మభూషన్ సెలెబ్రెటీ అవుతాడు. మేనల్లుడు గొప్ప రైటర్ అని కూతురు సారిక(టీనా శిల్పరాజ్)ని ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్దమవుతాడు పద్మభూషన్ మామ లోకేంద్ర కుమార్(గోపరాజు రమణ). ఇష్టపడిన మరదలితో పెళ్లి అవుతుందన్న సమయంలో షాకింగ్ ట్విస్ట్ ఎదురవుతుంది. అదేంటి? రైటర్ పద్మభూషణ్ పేరుతో పుస్తకాలు రాసేది ఎవరు? ఎందుకు రాస్తున్నారు? మరదలు సారికాతో పద్మభూషణ్ పెళ్లి జరిగిందా లేదా? గొప్ప రైటర్ కావాలన్న పద్మ భూషణ్ కల నెరవేరిందా? లేదా? అనేదే మిగతా కథ. థియేటర్లలో మిస్సయినావారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. -
రైటర్ పద్మభూషణ్ మూవీ.. హీరోయిన్ గురించి ఈ విషయాలు తెలుసా?
తెలుగు చిత్రపరిశ్రమలో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ’ అన్న మాటను తప్పని రుజువు చేస్తున్నారు ఎంతోమంది తెలుగు అమ్మాయిలు తమ ప్రతిభతో..! తాజాగా ఆ జాబితాలోకి చేరిన నటే టీనా శిల్పరాజ్. ఇటీవల రైటర్ పద్మభూషణ్ సినిమాలో టాలీవుడ్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. యాక్టర్‌గా మనల్ని మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మన బలాలు, బలహీనతలు ఏంటీ? ఎక్కడ మనం బాగా చేయగలుగుతున్నాం. ఇంకా ఎక్కడ మెరుగుపరచుకోవాలి? ఇలా చాలా విషయాలను నేర్చుకున్నాను ఈ ప్రయాణంలో – టీనా శిల్పరాజ్ టీనా శిల్పరాజ్.. పక్కా హైదరాబాదీ. పుట్టింది, పెరిగింది, చదివింది అంతా హైదరాబాద్‌లోనే. చదువు పూర్తయిన వెంటనే నటనపై ఉన్న ఆసక్తితో మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆమె అందానికి అభినయం కూడా తోడవటంతో అవకాశాలు ఆమె ఇంటి తలుపు తట్టాయి. ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’ వెబ్ సిరీస్‌తో వీక్షకులకు పరిచయం అయింది. అయితే ఆమె చేసింది ఒక్క సిరీసే అయినా.. అందులో ఆమె నటనను మెచ్చి సినిమా ఛాన్స్ కూడా వచ్చి చేరింది ఆమె కాల్షీట్స్ డైరీలో. ఆడిషన్‌కు వెళ్లటం, సెలెక్ట్ అయ్యి సినిమాలో నటించడం, ఇప్పుడు ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండటం అన్నీ చకచకా జరిగిపోయాయి. అదే ఆమె నటించిన ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా. చిన్న సినిమా అయినా థియేటర్లలో సందడి చేసింది. -
చాలా అందమైన సినిమా: రష్మిక ప్రశంసల వర్షం
విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాన్. యూట్యూబ్ యాక్టర్‌గా కెరీర్‌ని ఆరంభించి.. కలర్ ఫోటోతో హీరో అయ్యాడు. ఈ తర్వాత ఫ్యామిలీ డ్రామా, హిట్ 2 చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ లో మెప్పించాడు. ఇక ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చిన సుహాస్ మూవీని పలువురు సినీతారలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా చేరిపోయింది. ఈ సందర్భంగా చిత్రబృందాన్ని ట్వీట్ చేసింది పుష్ప భామ. రష్మిక తన ట్విటర్లో రాస్తూ.. ' మీరు చాలా అందమైన సినిమా తీశారు. మీ చిత్రబృందాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న మీకు ప్రత్యేక అభినందనలు. ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలిసి వెళ్లి ఈ చిత్రాన్ని చూస్తారని ఆశిస్తున్నా' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. మహిళల కోసం ప్రత్యేకంగా ఈనెల 8న ఉచిత షోలు ఏర్పాటు చేసినట్లు రైటర్ పద్మభూషణ్ చిత్రబృందం ప్రకటించింది. మాస్ మహారాజా రవితేజ సైతం రైటర్ పద్మభూషణ్ చిత్రాన్ని కొనియాడారు. సుహాస్ నటన అద్భుతంగా ఉందని.. ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేశానని తెలిపారు. క్లైమాక్స్ హృదయానికి హత్తుకునేలా ఉందని ప్రశంసించారు రవితేజ. ఈ సందర్భంగా చిత్రబృందానికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మరో హీరో నవీన్ పోలిశెట్టి సైతం రైటర్ పద్మభూషణ్ చిత్రబృందాన్ని అభిందిస్తూ ట్వీట్ చేశారు. You guys have made such a beautiful film..@SharathWhat @anuragmayreddy and @ActorSuhas Dear comrade to now- so so proud! ❤️Congratulations on this huge success you guys🤗🤗❤️ I hope all of you go give it a watch.. highly recommended for u my beautiful ladies❤️ and guess what.👇🏻 pic.twitter.com/t7NtOdO7ls — Rashmika Mandanna (@iamRashmika) February 7, 2023 What a performance by @ActorSuhas.Thoroughly enjoyed watching #WriterPadmabhushan. The climax is heart of the film❤️ Absolutely loved it. A must watch for all. Kudos to @anuragmayreddy @SharathWhat, director @prasanthshanmuk & young team for pulling off such a refreshing film — Ravi Teja (@RaviTeja_offl) February 7, 2023 So happy to see the response to #WriterPadmabhushan . The team deserves all the love. Go watch the film with your families if you haven’t yet. Congrats Agent Bobby @ActorSuhas . And super happy for my brothers @SharathWhat @anuragmayreddy ❤️ — Naveen Polishetty (@NaveenPolishety) February 7, 2023 -
మహిళల కోసం ‘రైటర్ పద్మభూషణ్’ టీం కీలక నిర్ణయం
కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషన్’. ఫిబ్రవరి 3న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని విజయవంతంగా కొనసాగుతుంది. సూపర్ స్టార్ మహేశ్‌బాబు, నేషనల్ క్రష్ రష్మిక సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఫ్యామిలీ ఆడియన్స్ తప్పక చూడాల్సిన చిత్రమని కామెంట్ చేశారు. తాజాగా మహిళల కోసం రైటర్ పద్మభూషణ్ చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు(ఫిబ్రవరి 8) తెలుగు రాష్ట్రాలలోని మహిళలకు ఈ చిత్రాన్ని ఉచితంగా చూపిస్తామని ప్రకటించింది. 38 థియేటర్లలో రైటర్ పద్మభూషణ్ చిత్రం నాలుగు షోలు ఉచితంగా ప్రదర్శిస్తామని వెల్లడించింది. 60 నుంచి 70 వేల మంది మహిళలకు ఫ్రీగా చిత్రాన్ని చూపించబోతున్నామని నిర్మాత శరత్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో పాసులు ఇస్తామని చెప్పారు. We humbly, respectfully and with all our heart invite the women across the telugu states to watch our film #WriterPadmabhushan tomorrow, without needing to buy a ticket. Theatres list also attached where this initiative is applicable. Details in next tweet: pic.twitter.com/SjhQ2sv3N3 — Sharath Chandra (@SharathWhat) February 7, 2023 -
రైటర్ పద్మభూషణ్‌పై మహేశ్‌బాబు ప్రశంసలు.. ఏడ్చేసిన సుహాస్
సుహాస్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. చిన్న సినిమా అయినా మంచి కంటెంట్‌తో పాటు చక్కని సందేశం ఉండడంతో ఈ సినిమాకు స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్రంపై సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేశానని.. సుహాస్ నటన అద్భుతంగా ఉందని కొనియాడారు. అలాగే దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్, నిర్మాతలు శరత్చంద్ర, అనురాగ్‌రెడ్డిని కృషిని ప్రశంసించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. మహేష్ బాబు ట్వీట్లో రాస్తూ.. ’రైటర్ పద్మభూషణ్ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశా. హార్ట్ టచింగ్‌గా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయింది. కుటుంబంతో కలిసి తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమాలో సుహాస్ నటన అద్భుతంగా ఉంది. ఈ సినిమాతో విజయాన్ని అందుకున్న శరత్, అనురాగ్ రెడ్డి, షణ్ముఖ ప్రశాంత్ అండ్ టీమ్ అందరికీ అభినందనలు.' అంటూ పోస్ట్ చేశారు ప్రిన్స్. అలాగే హీరో సుహాస్, దర్శకుడు, నిర్మాతలతో కలిసి ఉన్న ఫోటోని మహేశ్ బాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. Enjoyed watching #WriterPadmabhushan! A heartwarming film, especially the climax! ❤️ A must-watch for families! Loved @ActorSuhas' performance in the film! Congratulations @SharathWhat, @anuragmayreddy, @prasanthshanmuk & the entire team on its huge success 👍👍👍 pic.twitter.com/yCg2MEKpiY — Mahesh Babu (@urstrulyMahesh) February 6, 2023 ఏడ్చేసిన సుహాస్ రైటర్ పద్మభూషణ్‌పై మహేశ్ బాబు ప్రశంసలు కురిపించడంతో హీరో సుహాన్ భావోద్వేగాలను ఆపుకోలేక పోయాడు. ఈ ఆనందకర క్షణాలను తట్టుకోలేక ఏడ్చేశాడు. ఈ సందర్భంగా మహేశ్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు సుహాస్. Team : Endhuku Edusthunav? Me : Emo Vacchesthundhi 🥹 Super Size Thank you Sir🙏. Happy tears ❤️ https://t.co/DUHyhZqyjN — Suhas 📸 (@ActorSuhas) February 6, 2023 -
బన్నీ భార్యకు ఆ అవసరం లేదు.. అయినా పనిచేస్తుంది : అల్లు అరవింద్
ప్రతి ఆడపిల్ల తన కుటుంబంతో కలిసి రైటర్ పద్మభూషణ్ సినిమా చూడాలని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇటీవలె విడుదలై థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుంది. తాజాగా రైటర్ ప్మభూషణ్ సక్సెస్ మీట్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అరవింద్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ''ప్రతి ఆడపిల్లలు పెరెంట్స్‌ని తీసుకొని ఈ సినిమాకు వెళ్లాలి. ఎందుకంటే సాధారణంగా ఆడపిల్లలనగానే చక్కగా చదువుకోవాలి. పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి.వాళ్లని పెంచి పెద్ద చేయాలనే ఉంటుంది. కానీ వాళ్లకంటూ కొన్ని అభిప్రాయాలు, ఇష్టాలు ఉంటాయని తల్లిదండ్రులు గుర్తించరు. అందుకే ఆ సినిమా వాళ్లందరికి చూపించాలి. ఇక నేను పర్సనల్‌గా ఆడపిల్లలు ఇంట్లోనే కూర్చోవాలి అనే సిద్ధాంతాలను ఇష్టపడను. వాళ్ల కాళ్లమీద వాళ్ల నిలబడాలనుకుంటాను. ఈ సినిమా చూశాక ఇంటికి వెళ్లి మా భార్యను అడిగాను. నువ్వు ఏం అవ్వాలనుకున్నావ్ అని. ఇక మా కోడలు స్నేహా రెడ్డి(అల్లు అర్జున్ భార్య)కి నిజానికి పని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ధనవంతుల ఇంట్లో పుట్టి పెద్ద స్టార్ హీరోను పెళ్లి చేసుకుంది. కానీ ఇప్పటికీ తన పని తాను చేసుకుంటుంది'' అంటూ కోడలిపై ప్రశంసలు కురిపించారు. కాగా స్నేహారెడ్డి ప్రస్తుతం ఓ ఆన్లైన్ ఫోటో స్టూడియోకు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. -
ఓ రచయిత ప్రయాణం
‘‘రైటర్ పద్మభూషణ్’ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. విజయవాడలోని ఓ మధ్య తరగతి యువకుడి కథ ఇది’’ అని దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ అన్నారు. సుహాస్, టీనా శిల్పరాజ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. జి. మనోహర్ సమర్పణలో అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా షణ్ముఖ ప్రశాంత్ మాట్లాడుతూ– ‘‘నా దృష్టిలో కథని అమ్మలానే చూస్తాను. ఎంత బడ్జెట్ పెట్టినా మొదట కంటెంట్ రాయాల్సింది రచయితనే. అలాంటి ఒక రచయిత ప్రయాణం ఈ చిత్రంలో ఉంటుంది. ఇందులో హీరో ΄ాత్ర పేరు పద్మభూషణ్. తను రైటర్ కావాలనుకుంటాడు. మరి అయ్యాడా? లేదా అనేదే కథ. దర్శకులు జంధ్యాల, ఈవీవీ, శ్రీను వైట్లగార్ల సినిమాలంటే ఇష్టం. నా బలం కూడా కామెడీనే. మా సినిమాలో మంచి వినోదం ఉంటుంది’’ అన్నారు. -
Ashish Vidyarthi: ఆ బాధ్యత మాదే
‘‘తోటి నటీనటులతో పాటు యాక్ట్ చేస్తూ, నా పాత్రకు ఎంతవరకు న్యాయం చేస్తున్నాననే విషయంపై మాత్రమే నేను దృష్టి పెడతాను. అంతేకానీ ఇది చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలు చూడను’’ అన్నారు నటుడు ఆశిష్ విద్యార్థి. సుహాస్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో జి. మనోహర్ సమర్పణలో అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీ రోల్ చేసిన నటుడు ఆశిష్ విద్యార్థి మాట్లాడుతూ– ‘‘మంచి హ్యూమర్, ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది. ఈ చిత్రంలో కొడుకు ఏదో సాధిస్తాడని ఆశపడే ఓ మధ్యతరగతి తండ్రి పాత్రలో నటించాను. కానీ ఈ తండ్రి జీవితంలో ఓ ట్విస్ట్ ఉంటుంది. ఈ సినిమాలో నాకు, రోహిణీగారికి మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘చేసే ప్రతి పాత్రను నేను డ్రీమ్ రోల్‌గానే భావిస్తాను. మొదట్లో విలన్ రోల్స్ చేశాను. అయితే నాకు కామెడీ అంటే ఇష్టం. కానీ నాకు అన్ని రకాల పాత్రలూ చేయాలని ఉంది. అయితే మనకు ఎటువంటి పాత్రలు ఇవ్వాలనేది దర్శక–రచయితలపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రకు మేం న్యాయం చేస్తామనే నమ్మకాన్ని వారిలో కలిగించే బాధ్యత మా ఆర్టిస్టులదే’’ అని అన్నారు. -
‘రైటర్ పద్మభూషణ్’ కుటుంబాన్ని పరిచయం చేసిన సుహాస్
`కలర్‌ఫోటో` చిత్రంతో హీరోగా తొలి సక్సెస్ అందుకున్న సుహాస్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా మారిపోయారు. ఈ చిత్రాల్లో `రైటర్ పద్మభూషణ్` ఒకటి. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ఓ సాంగ్ మినహా ఎంటైర్ షూటింగ్ పూర్తయ్యింది. కొత్త ఏడాది సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్ ఇప్పుడు సుహాస్ పుట్టినరోజు సంరద్భంగా `రైటర్ పద్మభూషణ్` ఫ్యామిలీ పోస్టర్‌ను విడుదల చేశారు. సుహాస్ తండ్రి పాత్రలో ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి, తల్లి పాత్రలో ప్రముఖ నటి రోహిణి నటిస్తున్నారు. ఈ బర్త్ డే స్పెషల్ పోస్టర్‌ను గమనిస్తే ఇందులో అందరూ సెలబ్రేషన్స్ మూడ్‌లో కనిపిస్తున్నారు. ష్మణుఖ ప్రశాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సుహాస్ అనేక ఇబ్బందులు పడే రైటర్ పాత్రలో కనిపించబోతున్నారు. మనోహర్ గోవింద స్వామి సమర్పణలో చాయ్ బిస్కట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ పతాకాలపై అనురాగ్, శరత్, చంద్రు మనోహర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.