Allu Aravind Praises About Allu Arjun Wife Sneha Reddy at Writer Padma Bhushan Success Event - Sakshi
Sakshi News home page

Allu Aravind : అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డిపై అల్లు అరవింద్‌ ప్రశంసలు

Published Sun, Feb 5 2023 11:27 AM | Last Updated on Sun, Feb 5 2023 1:14 PM

Allu Aravind Praises Allu Arjun Wife Sneha Reddy At An Event - Sakshi

ప్రతి ఆడపిల్ల తన కుటుంబంతో కలిసి రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా చూడాలని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. సుహాస్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇటీవలె విడుదలై థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుంది.  తాజాగా రైటర్‌ ప్మభూషణ్‌ సక్సెస్‌ మీట్‌ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

''ప్రతి ఆడపిల్లలు పెరెంట్స్‌ని తీసుకొని ఈ సినిమాకు వెళ్లాలి. ఎందుకంటే సాధారణంగా ఆడపిల్లలనగానే చక్కగా చదువుకోవాలి. పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి.వాళ్లని పెంచి పెద్ద చేయాలనే ఉంటుంది. కానీ వాళ్లకంటూ కొన్ని అభిప్రాయాలు, ఇష్టాలు ఉంటాయని తల్లిదండ్రులు గుర్తించరు. అందుకే ఆ సినిమా వాళ్లందరికి చూపించాలి. ఇక నేను పర్సనల్‌గా ఆడపిల్లలు ఇంట్లోనే కూర్చోవాలి అనే సిద్ధాంతాలను ఇష్టపడను. వాళ్ల కాళ్లమీద వాళ్ల నిలబడాలనుకుంటాను.

ఈ సినిమా చూశాక ఇంటికి వెళ్లి మా భార్యను అడిగాను. నువ్వు ఏం అవ్వాలనుకున్నావ్‌ అని. ఇక మా కోడలు స్నేహా రెడ్డి(అల్లు అర్జున్‌ భార్య)కి నిజానికి పని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ధనవంతుల ఇంట్లో పుట్టి పెద్ద స్టార్‌ హీరోను పెళ్లి చేసుకుంది. కానీ ఇప్పటికీ తన పని తాను చేసుకుంటుంది'' అంటూ కోడలిపై ప్రశంసలు కురిపించారు. కాగా స్నేహారెడ్డి ప్రస్తుతం ఓ ఆన్‌లైన్‌ ఫోటో స్టూడియోకు సీఈవోగా వ్యవహరిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement