Sneha Reddy
-
అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత తొలి పోస్ట్ చేసిన స్నేహ రెడ్డి!
అల్లు అర్జున్ పుష్ప-2 రిలీజై ఇప్పటికే నెల రోజులు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.1831 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద ఇంకా దూసుకెళ్తోంది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టింది. బాలీవుడ్‌లోనూ తిరుగులేని చరిత్ర సృష్టించింది. ఇప్పటికే రూ.806 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ సాధించిన నాన్ హిందీ సినిమాగా నిలిచింది.సంధ్య థియేటర్ విషాదం..అయితే పుష్ప-2 విడుదలకు ముందు రోజే తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృత్యువాత పడింది. ఈ ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. అయితే ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.అల్లు అర్జున్ అరెస్ట్..ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. అయితే ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయం చంచల్ గూడ నుంచి విడుదలయ్యారు. ఇటీవల బన్నీకి నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసింది.అరెస్ట్ తర్వాత బన్నీ భార్య ఎమోషనల్..హీరో అల్లు అర్జున్ భార్య స్నేహ తీవ్ర భావోద్వేగానికి గురైంది. బన్నీ అరెస్ట్ సమయంలో ఆయనను హత్తుకుంది. ధైర్యంగా ఉండమని భార్యకు అల్లు అర్జున్ భరోసా ఇచ్చి పోలీసుల వెంట వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. ఈ వివాదం తర్వాత ఆమె తొలిసారి చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది.(ఇది చదవండి: సంధ్య థియేటర్ ఘటన: శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్)అరెస్ట్ తర్వాత తొలి పోస్ట్..బన్నీ అరెస్ట్ తర్వాత స్నేహారెడ్డి తొలిసారిగా పోస్ట్ చేసింది. డిసెంబర్లో జరిగిన జ్ఞాపకాలను ఓసారి గుర్తు చేసుకుంది. ఆల్ డిసెంబర్ మూమెంట్స్ ఇన్ వన్ ప్లేస్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇందులో తన పిల్లలు అయాన్, అర్హతో బన్నీ ఆడుకుంటున్న ఫోటోలు కూడా ఉన్నాయి. అరెస్ట్ తర్వాత ఆమె చేసిన తొలి పోస్ట్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. పుష్ప సినిమాకు స్వీక్వెల్‌గా ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించారు. వీరిద్దరి కాంబోలో 2021లో వచ్చిన పుష్ప ది రైజ్ బాక్సాఫీస్‌ను షేర్ చేసింది. అదే ఉత్సాహంతో పుష్ప-2 ది రూల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీ విడుదలైన నెల రోజుల్లోనే ఇండియన్ సినీ చరిత్రలో ఎప్పుడు రికార్డులు సృష్టించింది.(ఇది చదవండి: తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్.. బాహుబలి -2 రికార్డ్ బ్రేక్)బాహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ రికార్డులు బ్రేక్..టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన బాహుబలి, బాహుబలి-2, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ చిత్రాల ఆల్ టైమ్ వసూళ్లను ఇప్పటికే అధిగమించింది. కేవలం పుష్ప-2 కంటే ముందు అమిర్ ఖాన్ నటించిన దంగల్ మాత్రమే ఉంది. దంగల్ మూవీ రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో తొలిస్థానంలో నిలిచింది. అయితే దంగల్ రికార్డ్‌ను పుష్పరాజ్ బ్రేక్ చేస్తాడా? లేదా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
అల్లు అర్హ బర్త్ డే.. ముద్దుల కూతురికి ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్!
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహరెడ్డి గారాలపట్టి అల్లు అర్హ ఇటీవల రియాలిటీ షోలో కనిపించింది. తండ్రితో కలిసి పాల్గొన్న అర్హ అచ్చ తెలుగులో పద్యం చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇవాళ బన్నీ ముద్దుల కూతురు అర్హ తన ఎనిమిదో పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా టాలీవుడ్ ఫ్యాన్స్ అభిమాన హీరో కూతురికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.అయితే అల్లు అర్జున్ తన కూతురి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. 8 సంవత్సరాల స్వచ్ఛమైన ఆనందం.. నా లిటిల్ అర్హ నా జీవితాన్ని మధురంగా మార్చింది.. నీపై అనంతమైన ప్రేమతో మీ నాన్న అంటూ బన్నీ పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అల్లు స్నేహరెడ్డి తన గారాలపట్టికి బర్త్ డే విషెస్ తెలిపింది. అర్హకు సంబంధించిన అరుదైన ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. హ్యాపీ బర్త్ డే మై క్యూటెస్ట్, స్వీటెస్ట్ బేబీ..మేము నిన్ను చాలా ప్రేమిస్తున్నాం అర్హ' అంటూ పోస్ట్ చేసింది. మా జీవితంలో ఇది చాలా ప్రత్యేకమైన రోజు అంటూ తమ ముద్దుల కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
గోవాలో ఫ్యామిలీతో అల్లు స్నేహ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
అల్లు స్నేహ బర్త్‌డే స్పెషల్: ఐకాన్ స్టార్.. స్టైలిష్ వైఫ్ (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బన్నీ భార్య.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరో, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన పిల్లలు అయాన్, అర్హలతో కలిసి తిరుమల స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి స్వామివారి దర్శన అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందిన్కాగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2: ది రూల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పుష్పకు సీక్వెల్‌గా సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడినా మూవీ డిసెంబర్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే పుష్ప-2 షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు మేకర్స్. రిలీజ్ తేదీలోనూ ఎలాంటి మార్పులేదని మరోసారి ప్రకటించారు.#TFNReels: #AlluSnehaReddy along with her kids visited Tirumala to seek the divine blessings of Lord Venkateshwara!! 🙏✨#AlluArjun #AlluAyaan #AlluArha #TeluguFilmNagar pic.twitter.com/fNGQNbFb1A— Telugu FilmNagar (@telugufilmnagar) August 6, 2024 -
జిమ్‌లో అల్లు స్నేహారెడ్డి.. వర్కవుట్స్ చూశారా!
టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్యగా స్నేహా రెడ్డి అందరికీ పరిచయమే. సినిమాలకు సంబంధం లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా ఫ్యామిలీతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో నెటిజన్లను ఆకట్టుకుంటారు. ఈ క్రమంలో ఆమెకు నెట్టింట ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు సుమారు 10 మిలియన్ల వరకు ఫాలోవర్స్ ఉన్నారుతాజాగా స్నేహారెడ్డి జిమ్‌లో వర్కవుట్ చేస్తోన్న సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వేరే లెవెల్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 మూవీతో బిజీగా ఉన్నారు. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రాన్ని పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలోనూ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన పుష్ప-2 ఊహించని విధంగా డిసెంబర్‌కు వాయిదా పడింది.Giving us major fitness goals, #AlluSnehaReddy seen streching & flexing to the core at the gym! 📸💪#AlluArjun #TFNReels #TeluguFilmNagar pic.twitter.com/QHMYWqNuNA— Telugu FilmNagar (@telugufilmnagar) June 28, 2024 -
Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
హీరో అల్లు అర్జున్ ఈ మధ్య లేనిపోని వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనడంతో బన్నీని ఉద్దేశిస్తూ నాగబాబు రెచ్చగొట్టే ట్వీట్ చేయడం.. ఇలా అనుకోని విధంగా వార్తల్లో నిలిచాడు. అయితే అదంతా సైలెంట్ అయిపోయింది. ఇక తాజాగా బన్నీ నుంచి ఊహించని ఫొటో ఒకటి బయటకొచ్చింది. ఇందులో భార్యతో కలిసి ఓ డాబాలో భోజనం చేస్తున్నాడు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. పేరేంటో తెలుసా?)'పుష్ప' మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన అల్లు అర్జున్.. బయట ఎక్కడ కనిపించినా సరే జనాలు బాగానే వస్తారు. అలాంటిది సింపుల్‌గా ఓ దాబాలో భోజనం చేస్తూ కనిపించడం ఆసక్తికరంగా అనిపించింది. ఎన్నికల్లో నిలబడ్డ ఫ్రెండ్‌కి సపోర్ట్ చేసేందుకు నంద్యాల వెళ్లిన బన్నీ.. తిరిగొచ్చే క్రమంలోనే దాబాలో లంచ్ చేసినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం అల్లు అర్జున్.. 'పుష్ప 2' షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఆగస్టు 15న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల ముందు తొలి లిరికల్ సాంగ్ రిలీజ్ కాగా, బన్నీ స్టైల్-స్టెప్పులతో ఆకట్టుకుంటోంది. (ఇదీ చదవండి: నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!) -
Allu Arjun HD Images: ప్రతి పాత్రా ప్రత్యేకం.. వెండితెర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ప్రత్యేకం (ఫొటోలు)
-
ఇద్దరు అర్జున్‌లను హ్యాండిల్ చేయగలవా..భార్యపై బన్నీ కామెంట్లు
-
అల్లు అర్జున్ పెళ్లి రోజు.. భార్యతో ఈ క్యూట్ ఫొటోలు చూశారా?
-
తిరుమల శ్రీవారి సేవలో స్నేహా రెడ్డి.. సోషల్ మీడియాలో వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. తన పిల్లలు అయాన్, అర్హలతో ఉన్న ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె ఒక్కరే తిరుమలకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. కాగా.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ కనిపించనుంది. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తిరుమలలో ప్రగతి, నందిని రెడ్డి స్నేహారెడ్డితో పాటు తిరుమలలో డైరెక్టర్ నందిని, నటి ప్రగతి కూడా కనిపించారు. వీరికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Allu Arjun Wife Sneha Reddy: శ్రీవారిని దర్శించుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి!https://t.co/jc53pf3pku#AlluArjun #allusnehareddy #SnehaReddy #tirumala #TTD #MovieNews #LatestNews #TeluguNews #SakshiNews #TrendingNews #LatestNewsToday #Trending — Sakshi (@sakshinews) January 29, 2024 -
సంక్రాంతి వేకేషన్లో ఐకాన్ స్టార్.. వీడియో వైరల్!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల ప్రజలు భోగి సంబురాలతో ఈ ఏడాది వేడుకలను ఘనంగా ప్రారంభించారు. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఫెస్టివల్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. అగ్ర సినీ తారలంతా తమకు ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లిపోయి పొంగల్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఫెస్టివల్ వెకేషన్‌కు వెళ్లిపోయారు. రామ్ చరణ్-ఉపాసన, వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వెళ్తూ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-స్నేహారెడ్డి సైతం బెంగళూరుకు వెళ్లిపోయారు. కుటుంబంతో కలిసి సంక్రాంతి వేడుకల కోసమే బయలుదేరారు. ఎయిర్‌పోర్ట్‌లో బన్నీ దంపతులు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్ట్-1 సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న పుష్ప-2లో నటిస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్లో రూపొందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. వీరిద్దరి కాంబోలో పుష్ప బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో నటనకు అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ కూడా అందుకున్నారు. కాగా.. పుష్ప-2 చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. #TFNExclusive: Icon stAAr @alluarjun along with his wife #AlluSnehaReddy were seen 📸 at HYD airport in stylish & chic looks as they're off to Bangalore for Sankranthi celebrations with family! 😍🔥#AlluArjun #Pushpa2TheRule #TeluguFilmNagar pic.twitter.com/zbj3NHc55j — Telugu FilmNagar (@telugufilmnagar) January 14, 2024 -
వరుణ్- లావణ్య పెళ్లిలో బన్నీ కూతురు సందడి..!
మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో మెగా, అల్లు కుటుంబాలు హాజరవుతున్నారు. ఇటలీలోని టుస్కానీలో గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే కాక్టెయిల్ పార్టీ, హల్దీ వేడుకలు ముగిశాయి. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. (ఇది చదవండి: ఈ ముహూర్తంలోనే వరుణ్- లావణ్యల పెళ్లి.. ఎందుకంటే?) సోమవారం రాత్రి జరిగిన కాక్ టెయిల్ పార్టీలో కుటుంబ సభ్యులంతా సందడి చేశారు. ఈ పార్టీలో రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహాలు కూడా కలర్ఫుల్గా కనిపించారు. టాలీవుడ్ హీరో నితిన్, ఆయన భార్య షాలిని కూడా స్టైలిష్‌గా కనిపించారు. అయితే ఈ వేడుకల్లో బన్నీ కూతురు అల్లు అర్హ మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించింది. తాజాగా అల్లు అర్హ ఫోటోలను స్నేహా రెడ్డి తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ఆ ఫోటోల్లో అర్హ బ్రేక్ ఫాస్ట్ చేస్తూ కనిపించింది. బన్నీ సైతం తన కుమారుడు అయాన్‌తో ఉన్న పిక్‌ను షేర్ చేశారు. అంతే కాకుండా ఈ వేడుకల్లో చిరంజీవి కుమార్తె శ్రీజ కొణిదెల కూడా పాల్గొన్నారు. కాగా.. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి నవంబర్ 1న మధ్యాహ్నం 2.48 నిమిషాలకు వివాహాబంధంలోకి అడుగు పెట్టనున్నారు. ప్రస్తుతం వీరికి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (ఇది చదవండి: నెలలోపే ఓటీటీకి వచ్చేస్తోన్న స్టార్ హీరో సినిమా!) View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
Pre-Wedding Party: వరుణ్-లావణ్య ప్రీ వెడ్డింగ్ పార్టీలో అల్లు అర్జున్ (ఫొటోలు)
-
అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి బర్త్ డే స్పెషల్ ఫొటోలు
-
'హ్యాపీ బర్త్ డే క్యూటీ'.. బన్నీ ఎమోషనల్ పోస్ట్!
టాలీవుడ్లో మోస్ట్ బ్యూటీఫుల్ జంటల్లో అల్లు అర్జున్- స్నేహారెడ్డి ఒకరు. సినిమాలతో బిజీగా ఉన్నా ఎప్పుడు ఫ్యామిలీకి సమయం కేటాయిస్తూ ఉంటారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే సెప్టెంబర్ 29న తన భార్య స్నేహారెడ్డి బర్త్ డే సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ వీడియో షేర్ చేశారు. 'హ్యాపీ బర్త్ డే క్యూటీ.. సన్‌సైన్ ఆఫ్ మై లైఫ్' అంటూ భార్యపై బన్నీ ప్రేమను చాటుకున్నారు. కాగా.. అల్లు అర్జున్, స్నేహా రెడ్డి 2011లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమంత నటించిన శాకుంతలం చిత్రంలో కీలక పాత్రతో నటించిన అర్హ తొలిసారిగా స్క్రీన్‌పై నటిస్తోంది. కాగా.. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. వీరి కాంబో వచ్చిన పుష్ప పార్ట్-1 ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
భార్య బిజినెస్‌ను ప్రమోట్ చేస్తున్న అల్లు అర్జున్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బన్నీకి ఎంత క్రేజ్ ఉందో స్నేహారెడ్డికి కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కూతురు, కొడుకుతో కలిసి బన్నీ చేసే అల్లరి ఫోటోల, వీడియోలను తరచూ తన ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటుంది స్నేహారెడ్డి. ఇక బన్నీ భార్యగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆమె సొంతంగా PICABOO పేరుతో ఓ ఆన్లైన్ ఫోటో స్టూడియోను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2016లో ప్రారంభించిన ఈ కంపెనీ ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ప్రస్తుతం PICABOOPOPUP పేరుతో ఫస్ట్ ఎడిషన్ కోసం స్నేహారెడ్డి ఓ గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇందులో దేశ వ్యాప్తంగా వివిధ డిజైనర్ బ్రాండ్స్ సందడి చేశాయి. ముఖ్యంగా మామ్ అండ్ కిడ్స్ కోసం ప్రత్యేకంగా ఈ ఎగ్జిబిషన్లో స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కోసం స్నేహారెడ్డి కూతురు అర్హతో కలిసి హాజరయ్యింది. ఈ సందర్భంగా స్టాల్స్ యజమానులతో సరదాగా ముచ్చటించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ కొడుకు అయాన్‌తో కలిసి ఈవెంట్లో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్‌గా మారాయి. భార్య ఈవెంట్‌ను సపోర్ట్ చేయడానికి బన్నీ రావడం ముచ్చటేస్తుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. -
వేకేషన్ నుంచి తిరిగొచ్చిన ఐకాన్ స్టార్.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ అల్లు అర్జున్ - స్నేహారెడ్డి జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంట ఎక్కడికెళ్లినా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో టచ్‌లో ఉంటారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాస్త విరామం దొరికితే చాలు విదేశాల్లో వాలిపోతుంటారు. ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్ వెళ్లిన బన్నీ తాజాగా ఇండియాకు తిరిగొచ్చారు. తన భార్య స్నేహా రెడ్డితో కలిసి ముంబయి విమానాశ్రయంలో కనిపించారు. (ఇది చదవండి: నాలుగున్నరేళ్లుగా నటుడితో సహజీవనం.. మీరిక పెళ్లి చేసుకోరా?) టాలీవుడ్ జంట ఎయిర్‌పోర్ట్‌లో స్పెషల్ లుక్‌లో కనిపించారు. వీరిద్దరిని చూసిన నెటిజన్స్ స్టైలిష్ కపుల్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న పుష్ప- 2: ది రూల్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తోంది. పుష్ప పార్ట్ 1 సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రంలో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే పుష్ప-2 షూటింగ్లో బన్నీ జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: ఎన్టీఆర్ కోసం ఎవరూ ఊహించని హీరోయిన్!) ICON star @alluarjun and #AlluSnehaReddy at Mumbai airport Bunny boy looks 😎😍#Pushpa2TheRule pic.twitter.com/YoPTySfKyx — Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) June 7, 2023 #TFNExclusive: AA slays in Black🖤 Icon Star @alluarjun along with his wife #AlluSnehaReddy get papped at Mumbai airport!!😎#AlluArjun #Pushpa2TheRule #TeluguFilmNagar pic.twitter.com/rkVKbbpj4A — Telugu FilmNagar (@telugufilmnagar) June 7, 2023 -
స్నేహా కాదు.. ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ పేరు రివీల్ చేసిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న ఆయన ప్రస్తుతం పుష్ప పార్ట్-2లో నటిస్తున్నాడు. శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే బన్నీ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. పొలిటికల్ లీడర్ కూతురు స్నేహరెడ్డిని అల్లు అర్జున్ ప్రేమించి పెళ్లాడాడు. వీరికి అయాన్, అర్హ ఇద్దరు పిల్లలు. అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి కూడా సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. ముఖ్యంగా పిల్లలతో బన్నీ సరదా మూమెంట్స్, వెకేషన్ ఇలా తనకి సంబంధించిన విషయాలను ఇన్‌స్టాలో పంచుకుంటుంది. ఈ క్రమంలో స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌కు స్నేహా కంటే ముందు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో తన ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ పేరును బన్నీ రివీల్ చేసేశాడు. ఆహాలో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2 ఫైనల్స్‌కు అల్లు అర్జున్ గెస్టుగా విచ్చేశాడు. కంటెస్టెంట్లలో శ్రుతి అనే సింగర్ పాట పాడిన అనంతరం బన్నీ మాట్లాడుతూ.. 'నీ పేరు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ పేరు కూడా శ్రుతినే' అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఈ వీడియో చూసి స్నేహా ఎలా రియాక్ట్ అవుతుందో..! -
చిరు కూతుళ్లు శ్రీజ, సుష్మితలతో అల్లు అర్జున్ వెకేషన్.. ఇది సరిపోదా?
అల్లు-మెగా ఫ్యామిలీ మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఇప్పటికే చిరంజీవి, అల్లు అరవింద్ స్పందించినా రూమర్స్ మాత్రం ఆగడం లేదు. రీసెంట్గా రామ్‌చరణ్ బర్త్‌డే పార్టీలో కూడా అల్లు అర్జున్ కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. 38వ వసంతంలోకి అడుగుపెట్టిన రామ్‌చరణ్ చిరంజీవి నివాసంలో గ్రాండ్ పార్టీ ఇచ్చారు. టాలీవుడ్ ప్రముఖులంతా పార్టీలో సందడి చేసినా అల్లు అర్జున్ మాత్రం రాకపోడంతో నిజంగానే వీరిద్దరి మధ్య స్టార్ వార్ నడుస్తోందంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ రూమర్స్‌కి అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి చెక్ పెట్టింది. అల్లుఅర్జున్, శ్రీజ, సుష్మితలతో పాటు మరికొంత మంది కజిన్స్‌తో వెకేషన్‌కు వెళ్లిన వీడియోను స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీనికి లవ్ ఫ్యామిలీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఒకవేళ నిజంగానే బన్నీ-చరణ్‌లకు మధ్య విబేధాలు ఉంటే శ్రీజ, సుష్మితలు బన్నీతో కలిసి వెకేషన్‌కు వెళ్లరు కదా, అయినా సోషల్ మీడియాలో విష్ చేయనంత మాత్రానా కథలు అల్లడమేనా? అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
అల్లు అర్జున్ కూతురిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సమంత
సమంత నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఈ సినిమా కోసం సమంత ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అంతే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు కారణం బన్నీ కూతురు అర్హ ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇవ్వడమే. శాకుంతల-దుష్యంత మహారాజు కొడుకు భరతుడి పాత్రలో అర్హ కనిపించనుంది. ఇక ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేసిన సమంత వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీబిజీగా గడిపేస్తుంది. తాజాగా యాంకర్ సుమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత అల్లు అర్హ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. 'అల్లు అర్హ చాలా క్యూట్ గా ఉంటుంది. తనకి అసలు ఇంగ్లీష్ రాదు. హాయ్ కూడా నార్మల్‌గానే చెప్తుంది. ఈ జనరేషన్ పిల్లలకి అంత బాగా తెలుగు నేర్పించినందుకు వాళ్లు పేరెంట్స్‌కి హ్యాట్సాఫ్ చెప్పాలి. సెట్లో కూడా ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా భయపడకుండా బాగా చెప్పింది. అల్లు అర్జున్ ఇప్పుడు స్టార్ అయితే, అర్హ పుట్టకతోనే స్టార్' అంటూ పొగడ్తల వర్షం కురిపించింది. -
అర్హ స్టంట్‌కి షాక్ అయిన అల్లు అర్జున్.. ఫోటో వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ అంటే టాలీవుడ్లో తెలియని వారుండరు. సోషల్ మీడియాలోనూ అర్హకు బోలెడంత ఫాలోయింగ్ ఉంది. తన ముద్దు ముద్దు మాటలు, చేష్టలతో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకునే అర్హ తాజాగా తన టాలెంట్‌తో మరోసారి సర్ప్రైజ్ చేసింది. అతి చిన్న వయసులోనే క్లిష్టమైన యోగాసనాలు వేసి తండ్రి అల్లు అర్జున్‌కే ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి సంబంధించిన ఓ క్యూట్ ఫోటోను స్నేహారెడ్డి తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసుకోవడంతో ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. అయాన్, అర్హ చేసే అల్లరి ఫోటోలు, వీడియోలను స్నేహారెడ్డి తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటదన్న విషయం తెలిసిందే. తాజాగా తమ గార్డెన్లో అర్హ యోగాసనం వేస్తుంటే అది చూసి బన్నీ షాక్ అవుతున్నట్లు ఒక ఫోటోను స్నేహా అభిమానులతో పంచుకుంది. ఇక అర్హ ఇప్పటికే శాకుంతలం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. -
పెళ్లి రోజు: అల్లు అర్జున్-స్నేహ క్యూట్ పిక్స్ వైరల్
-
అంతకన్నా ఆనందం ఏముంటుంది? అదే నాకిష్టమైన ప్లేస్ : స్నేహారెడ్డి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బన్నీకి ఎంత క్రేజ్ ఉందో స్నేహారెడ్డికి కూడా సోషల్ మీడియాలో వీపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కూతురు, కొడుకుతో కలిసి బన్ని చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను తరుచుగా షేర్ చేసే స్నేహారెడ్డి ఈ మధ్యకాలంలో ఫోటోషూట్స్‌తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా గ్లామరస్ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది. స్టైలిష్ కపుల్‌గా ఇండస్ట్రీలో ఈ జంటకు పేరుంది. స్టార్ హీరోయిన్లకు దీటుగా మాంచి ఫిట్నెస్ మెయింటెయిన్ చేస్తున్న స్నేహరెడ్డి తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ వీడియోను షేర్చేస్తూ.. 'మన చుట్టూ మొక్కలు ఉంటే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది. వాటిని చూస్తే ప్రేమలో పడిపోతాం. మొక్కల పోషణ మనసుకు ఎంతో ఆనందాన్నిస్తుంది. అందుకే నర్సరీ నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశం' అంటూ మొక్కలపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. అయితే ఈ వీడియోలో ఎప్పటిలాగే స్నేహారెడ్డి యంగ్ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ఇది చూసిన నెటిజన్లు.. మేడమ్ సర్.. మేడమ్ అంతే. హీరోయిన్‌కి ఏమాత్రం తగ్గట్లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
బన్నీ భార్యకు ఆ అవసరం లేదు.. అయినా పనిచేస్తుంది : అల్లు అరవింద్
ప్రతి ఆడపిల్ల తన కుటుంబంతో కలిసి రైటర్ పద్మభూషణ్ సినిమా చూడాలని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇటీవలె విడుదలై థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుంది. తాజాగా రైటర్ ప్మభూషణ్ సక్సెస్ మీట్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అరవింద్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ''ప్రతి ఆడపిల్లలు పెరెంట్స్‌ని తీసుకొని ఈ సినిమాకు వెళ్లాలి. ఎందుకంటే సాధారణంగా ఆడపిల్లలనగానే చక్కగా చదువుకోవాలి. పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి.వాళ్లని పెంచి పెద్ద చేయాలనే ఉంటుంది. కానీ వాళ్లకంటూ కొన్ని అభిప్రాయాలు, ఇష్టాలు ఉంటాయని తల్లిదండ్రులు గుర్తించరు. అందుకే ఆ సినిమా వాళ్లందరికి చూపించాలి. ఇక నేను పర్సనల్‌గా ఆడపిల్లలు ఇంట్లోనే కూర్చోవాలి అనే సిద్ధాంతాలను ఇష్టపడను. వాళ్ల కాళ్లమీద వాళ్ల నిలబడాలనుకుంటాను. ఈ సినిమా చూశాక ఇంటికి వెళ్లి మా భార్యను అడిగాను. నువ్వు ఏం అవ్వాలనుకున్నావ్ అని. ఇక మా కోడలు స్నేహా రెడ్డి(అల్లు అర్జున్ భార్య)కి నిజానికి పని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ధనవంతుల ఇంట్లో పుట్టి పెద్ద స్టార్ హీరోను పెళ్లి చేసుకుంది. కానీ ఇప్పటికీ తన పని తాను చేసుకుంటుంది'' అంటూ కోడలిపై ప్రశంసలు కురిపించారు. కాగా స్నేహారెడ్డి ప్రస్తుతం ఓ ఆన్లైన్ ఫోటో స్టూడియోకు సీఈవోగా వ్యవహరిస్తున్నారు.