Allu Arjun Wife Sneha Reddy Silver Saree Cost Details Inside - Sakshi
Sakshi News home page

Allu Sneha Reddy: స్టైలిష్‌ సారీలో స్నేహా రెడ్డి, చీర ధరెంతో తెలిస్తే గుడ్లు తేలేయాల్సిందే!

Published Thu, Oct 27 2022 8:12 PM | Last Updated on Thu, Oct 27 2022 10:38 PM

Allu Arjun Wife Sneha Reddy Silver Saree Cost Details Inside - Sakshi

అల్లు అర్జున్‌, స్నేహా రెడ్డిలను స్టార్‌ జంట అనేకన్నా స్టైలిష్‌ జంట అనడం కరెక్టేమో! ట్రెండ్‌ను ఫాలో అవుతూ స్టైల్‌ను మెయింటెన్‌ చేయడంలో ఇద్దరూ ముందుంటారు. ప్రతి సినిమాకు లుక్‌ను మార్చేస్తూ సర్‌ప్రైజ్‌ చేస్తుంటాడు బన్నీ. అలాగే ఆయన భార్య స్నేహా కూడా డిఫరెంట్‌ శారీస్‌తో అందంగా రెడీ అవుతూ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఆమె వెండి కలర్‌లో ఉన్న చీరను ధరించింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

రిమ్‌జిమ్‌ దాదు ఈ చీర డిజైన్‌ చేయగా, ప్రీతమ్‌ జుకల్కర్‌ తననింత స్టైలిష్‌గా రెడీ చేశాడని పేర్కొంది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఎంతందంగా ఉన్నారండీ బాబూ.. హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈ చీర ఖరీదు ఎంతనుకుంటున్నారు? అక్షరాలా లక్షా డెబ్భై ఆరు వేల రూపాయలట! చూడటానికి ఇంత సింపుల్‌గా ఉంది, కానీ అంత ధర ఉందేంటని షాకవుతున్నారు నెటిజన్లు.

చదవండి: అప్పుడే సమంతతో ప్రేమలో పడిపోయా: రౌడీ హీరో
ఆటోలో సిటీ అంతా తిరిగిన నటుడు, వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement