Allu Sneha
-
అల్లు స్నేహ పోస్టుకు సామ్, రకుల్ కామెంట్
అల్లు స్నేహా రెడ్డి.. తెలుగు సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ స్టార్ ఐకాన్ అల్లు అర్జున్ భార్యగానే కాకుండా తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకున్నారామె. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రెగ్యులర్‌గా తన పిల్లల వీడియోలు, ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అంతేగాక ఇంట్లోనూ పిల్లల బాధ్యతలు చూస్తూ.. బన్నీకి పూర్తి అండగా ఉంటూ వస్తున్నారు.తాజాగా బన్నీ తన కుటుంబం సమేతంగా వెకేషన్స్‌కు వెళ్లారు. పుష్ప 2 సినిమా షూటింగ్‌కు గ్యాప్ రావడంతో యూరప్‌లోని నార్వే దేశంలో భార్య, పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బన్నీ భార్య స్నేహ నార్వే వెకేషన్‌కు సంబంధించిన అందమైన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో అల్లు అర్జున్ స్నేహను హగ్ చేసుకొని ఉండగా.. ఆమె తన పక్కనుంచి సెల్ఫీ తీసింది. ఈ ఫోటోలో పక్కనే పిల్లలు అయాన్, అర్హ కూడా ఏదో అల్లరి చేస్తూ పోజులు ఇవ్వడం కనిపిస్తోంది.ఈ పోస్టుకు నెటిజన్లతో సైతం సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. సమంత, రకుల్ ప్రీత్ సింగ్ ‘హార్ట్ సింబల్’ను జత చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింటా వైరల్‌గా మారింది. వీటికంటే ముందు నార్వేలో బాగా ఫేమస్ అయిన పల్పిట్ రాక్ అనే పర్యాటక ప్రాంతంలో భారీ కొండ పైకి ఎక్కి దాని అంచున కుటుంబమంతా కలిసి దిగిన ఫోటో కూడా స్టోరీలో షేర్ చేసింది స్నేహ రెడ్డి. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) మరోవైపు బన్నీ ఈ వెకేషన్ నుంచి తిరిగొచ్చాక ఆగస్టులో మళ్ళీ పుష్ప 2 షూటింగ్లో జాయిన్ కానున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
15 ఏళ్ల క్రితం ఇదే మ్యూజియంలో అంటూ అల్లు శిరీష్ కామెంట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు బొమ్మను ఆవిష్కరించాడు. అక్కడ ఈ గౌరవం దక్కించుకున్న తొలి సౌత్ ఇండియన్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఎంతో ఘనంగా జరిగిన ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి బన్నీ కుటుంబంతో సహా దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ గౌరవం దక్కించుకున్న బన్నీకి ఎందరో శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ఆయన సోదరుడు అల్లు శిరీష్ కూడా బన్నీని విష్ చేస్తూ దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంతో తమకు ఉన్న అనుబంధాన్ని ఇలా గుర్తుచేసుకున్నాడు. '15 ఏళ్ల క్రితం నేను, అన్నయ్య కలిసి దుబాయ్‌లోని ఇదే మ్యూజియానికి టూరిస్టులుగా వచ్చాం. ఆ సమయంలో మ్యూజియంలో ఉన్న పలు విగ్రహాలతో కలిసి ఫోటోలు దిగాం. కానీ ఇంతటి గొప్ప ప్లేస్‌లో మా కుటుంబం నుంచి ఒకరి మైనపు బొమ్మ ఇక్కడ ఉంటుంది అని ఎప్పుడూ ఊహించుకోలేదు. ఆ విగ్రహంతో కలిసి ఫోటోలు దిగుతామని అనుకోలేదు. అన్నయ్యా.. నీ సినీ ప్రయాణం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.' అంటూ అల్లు శిరీష్ శుభాకాంక్షలు చెప్పారు. బన్నీతో దిగిన పోటోలను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అల్లు అర్జున్ సతీమణి స్నేహ కూడా శుభాకాంక్షలు తెలిపింది. బన్నీ భార్యగా తనకెంతో గర్వంగా ఉందని ఆమె తెలిపింది. ఎక్కడైనా సరే తనదైన ముద్రవేసే అల్లు అర్జున్ .. ఇప్పుడు మైనపు విగ్రంతో శాశ్వతంగా అందరినీ ఆకర్షిస్తుంటారని ఆమె తెలిపింది. మార్చి 28 ఎప్పటికీ మా గుండెల్లో ఉండిపోతుందని స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
అల్లు అర్జున్ పెళ్లి రోజు... భార్య గురించి క్యూట్ పోస్ట్
'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా సూపర్‌స్టార్ అయిపోయిన అల్లు అర్జున్.. ఇప్పుడు దీని సీక్వెల్‌తో బిజీగా ఉన్నాడు. ఆగస్టు రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి షూటింగ్ యమ ఫాస్ట్‌గా సాగుతోంది. ఓవైపు మూవీ చేస్తూనే మరోవైపు కుటుంబంతోనూ బన్నీ టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన పెళ్లి రోజు సందర్భంగా భార్య స్నేహారెడ్డి గురించి అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. (ఇదీ చదవండి: మళ్లీ థియేటర్లలోకి ఉదయ్ కిరణ్.. కల్ట్ సినిమా రీ రిలీజ్ ఎప్పుడంటే?) నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లు అర్జున్.. హీరోగా క్రమక్రమంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. డిఫరెంట్ సినిమాలు చేస్తూ తెలుగుతో పాటు మలయాళంలోనూ ఫేమ్ సంపాదించాడు. 'పుష్ప' మూవీతో మాత్రం పాన్ ఇండియా రేంజులో క్రేజ్ దక్కించుకున్నాడు. ఇకపోతే 2011లో స్నేహారెడ్డిని పెళ్లి చేసుకోగా.. వీళ్లకు అయాన్, అర్హ పుట్టారు. ఇకపోతే తన 13వ పెళ్లి రోజు సందర్భంగా భార్యని బన్నీ తెగ పొగిడేశాడు. 'మన పెళ్లయి 13 ఏళ్లయిపోయింది. నేను ఇలా ఉండటానికి నీతో బంధమే కారణం. నీ ప్రశాంతత నుంచి నాకు బోలెడంత శక్తిని ఇచ్చావ్. మరెన్నో వార్షికోత్సవాలు ఇలానే జరుపుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ యానివర్సరీ క్యూటీ' అని అల్లు అర్జున్, భార్యతో కలిసున్న ఫొటో పోస్ట్ చేసి క్యూట్ ఇన్ స్టా స్టోరీ పోస్ట్ చేశాడు. ఇది ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది. (ఇదీ చదవండి: కోట్లు విలువ చేసే కారు కొన్న 'ఆదిపురుష్' రైటర్..) -
జిమ్ వేర్లో అల్లు స్నేహ.. వర్కౌట్స్ వీడియో వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణిగా స్నేహా రెడ్డి అందరికీ పరిచయమే.. కానీ సోషల్ మీడియాతో అందరికీ టచ్‌లో ఉంటూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నారు. తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో నెటిజన్లను ఆకట్టుకుంటారు. ఈ క్రమంలో ఆమెకు నెట్టింట ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు సుమారు 10 మిలియన్ల వరకు ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న అల్లు స్నేహా ఫిట్నెస్ ఫ్రీక్ అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె తాజాగా ఒక వీడియోను షేర్ చేశారు. తన ఇంటి గార్డెన్లో ఉన్న గౌతమబుద్ధిడి విగ్రహం వద్ద జిమ్ వర్కౌట్స్ చేశారు. వీలు చిక్కినప్పుడు తరచూ జిమ్, యోగ వీడియోలు, ఫొటోలను షేర్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె విడుదల చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది. అక్కడ అల్లు అర్జున్ కూడా యోగా చేస్తారనే విషయం తెలిసిందే.. ఆమె పుట్టినరోజు నాడు కూడా జిమ్ వేర్లో ఉన్న స్నేహ వీడియోను బన్నీ షేర్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. బాడీ ఫిట్నెస్ పట్ల వారిద్దరూ కూడా ఎంతో శ్రద్ధ పెడుతారనే విషయం తెలిసిందే. అల్లు స్నేహా సినిమాల్లో నటించక పోయినా హీరోయిన్లకే షాక్ ఇచ్చేలా ఫ్యాషన్ దుస్తులు ధరిస్తూ ట్రెండింగ్‌లో ఉంటారు. SIT ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్, బిజినెస్ మెన్ సీ శేఖర్ రెడ్డి కూతురయిన స్నేహా రెడ్డి కామన్ ఫ్రెండ్ పెళ్లిలో బన్నీతో పరిచయం ఏర్పడిటం.. ఆ తర్వాత 2011 మార్చి 6న వివాహం చేసుకోవడం జరిగింది. వీరికి కుమారుడు అల్లు అయాన్, కూతురు అల్లు అర్హ ఉన్న విషయం తెలిసిందే. పుష్ప-2 షూటింగ్ బిజీలో అల్లు అర్జున్ ఉన్నారు. ఈ ఏడాది ఆగష్టు 15న ప్రపంవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
అల్లు అర్జున్ భార్య స్టైలే వేరు..
-
వ్యాపారాన్ని విస్తరించే పనిలో అల్లు అర్జున్ భార్య!
తెలుగు హీరోల్లో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్న పాత్రలు చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. 'పుష్ప'తో పాన్ ఇండియా షేక్ చేసి, నేషనల్ అవార్డు గెలుచుకున్న ఇతడు ప్రస్తుతం 'పుష్ప 2' బిజీలో ఉన్నాడు. ఇతడి భార్య స్నేహా కూడా తను ఆల్రెడీ పెట్టిన వ్యాపారాన్ని విస్తరించే పనిలో ఫుల్ బిజీగా ఉంది. (ఇదీ చదవండి: ఆ ఫొటో పోస్ట్ చేసి గుడ్‌న్యూస్ చెప్పిన మెగాకోడలు లావణ్య త్రిపాఠి) అల్లు అర్జున్ ఫ్యామిలీ గురించి అభిమానులకు పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. భార్య స్నేహా, పిల్లలు అయాన్-అర్హ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటారు. తాజాగా అలా బన్నీ భార్య వ్యాపారం గురించి ఓ విషయం బయటకొచ్చింది. అల్లు స్నేహా స్థాపించిన పికాబు సంస్థ సమర్పిస్తున్న ఫైర్ ఫ్లై కార్నివల్.. జనవరి 20న ఎన్ కన్వెన్షన్‌లో జరగనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ కార్నివాల్లో షాపింగ్ ఎంజాయ్మెంట్ యాక్టివిటీస్, రుచికరమైన వంటకాలు, లైవ్ మ్యూజిక్ ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ ఈవెంట్ జనవరి 20న హైదరాబాద్‌లోని మాదాపూర్ లో ఉదయం 10 గంటలకు మొదలవుతుంది. అయితే ఈ కార్నివాల్ ద్వారా తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని అల్లు స్నేహ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) -
అల్లు బ్రదర్స్ ఇంట్రెస్టింగ్ పిక్స్.. ఒకరు అలా మరొకరు ఇలా!
భర్తతో క్యూట్ ఫొటో షేర్ చేసిన అల్లు అర్జున్ భార్య స్నేహ మంచు లక్ష్మీ బుగ్గపై ముద్దుపెట్టిన అల్లు శిరీష్ హాట్ వీడియోతో హీట్ పెంచేసిన మృణాల్ ఠాకుర్ క్యూట్ పోజులో యంగ్ హీరోయిన్ మెహ్రీన్ కేక పుట్టించే లుక్‌లో ముద్దుగుమ్మ ప్రియా వారియర్ దీపావళి స్పెషల్.. మంట పుట్టించేస్తున్న సన్నీ లియోనీ సోనాల్ చౌహాన్ స్టన్నింగ్ లుక్.. వీడియో వైరల్ వయ్యారంగా గోడకు వంగి రచ్చ లేపుతున్న రకుల్ View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) -
ఫస్ట్ డే బ్యాగేసుకుని స్కూలుకు వెళ్లిన అర్హ, ఫోటో చూశారా?
అల్లు అర్జున్ గారాలపట్టి అర్హ ఇక అల్లరి మాని స్కూలుకు వెళ్తోంది. ఇప్పటివరకు అమ్మానాన్నతో కబుర్లు చెప్తూ, ఆటలాడుతూ కాలక్షేపం చేసిన అర్హ చదువుకునే వేళైంది. ఈ రోజు ఉదయం అర్హ స్కూలుకు వెళ్లింది. ఈ విషయాన్ని అల్లు స్నేహ సోషల్ మీడియాలో వెల్లడించింది. అయాన్‌తో కలిసి బుద్ధిగా బడికి వెళ్తున్న కూతురి ఫోటోను 'ఫస్ట్ డే ఆఫ్ స్కూల్' అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఇందులో అయాన్ బ్యాగ్‌పై తన పేరు రాసి ఉండగా.. అర్హ వేసుకున్న బ్యాగు మీద కూడా ఈ చిన్నారి పేరు ఇంగ్లీష్‌లో ఉంది. వీరి బ్యాగులను బన్నీ దంపతులు ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరూ స్కూలుకు వెళ్తున్న ఫోటో చూసిన బన్నీ ఫ్యాన్స్ భలే ముద్దుగా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా అర్హ స్కూలు పాఠాలకు ముందే సినిమా పాఠాలు సైతం నేర్చేసుకుంది. శాకుంతలం సినిమాలో భరతుడి చిన్ననాటి పాత్రలో కనిపించింది. ఇందులో ఆమె నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. మరోవైపు కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న దేవర సినిమాలోనూ అర్హ నటించనున్నట్లు ఓ వార్త వైరలవుతోంది. జాన్వీ కపూర్ చిన్ననాటి పాత్రలో అర్హ కనిపించనుందని, ఇందులో ఆమె పాత్ర నిడివి 10 నిమిషాలు కాగా ఇందుకోసం ఏకంగా రూ.20 లక్షలు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదెంతవరకు నిజమనేది క్లారిటీ రావాల్సి ఉంది! మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. చదవండి: అరుదైన వ్యాధితో బాధపడ్డ మహేశ్‌బాబు, ఎన్ని టాబ్లెట్లు వాడినా.. హైపర్ ఆది ఓవరాక్షన్.. చిరంజీవిని జీరోగా.. గుర్రుమంటున్న మెగా ఫ్యాన్స్ -
భార్య బిజినెస్‌ను ప్రమోట్ చేస్తున్న అల్లు అర్జున్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బన్నీకి ఎంత క్రేజ్ ఉందో స్నేహారెడ్డికి కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కూతురు, కొడుకుతో కలిసి బన్నీ చేసే అల్లరి ఫోటోల, వీడియోలను తరచూ తన ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటుంది స్నేహారెడ్డి. ఇక బన్నీ భార్యగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆమె సొంతంగా PICABOO పేరుతో ఓ ఆన్లైన్ ఫోటో స్టూడియోను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2016లో ప్రారంభించిన ఈ కంపెనీ ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ప్రస్తుతం PICABOOPOPUP పేరుతో ఫస్ట్ ఎడిషన్ కోసం స్నేహారెడ్డి ఓ గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇందులో దేశ వ్యాప్తంగా వివిధ డిజైనర్ బ్రాండ్స్ సందడి చేశాయి. ముఖ్యంగా మామ్ అండ్ కిడ్స్ కోసం ప్రత్యేకంగా ఈ ఎగ్జిబిషన్లో స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కోసం స్నేహారెడ్డి కూతురు అర్హతో కలిసి హాజరయ్యింది. ఈ సందర్భంగా స్టాల్స్ యజమానులతో సరదాగా ముచ్చటించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ కొడుకు అయాన్‌తో కలిసి ఈవెంట్లో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్‌గా మారాయి. భార్య ఈవెంట్‌ను సపోర్ట్ చేయడానికి బన్నీ రావడం ముచ్చటేస్తుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. -
మేనకోడల్ని చూడడానికి వచ్చిన అల్లుఅర్జున్ , స్నేహ
-
ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన అల్లు స్నేహ.. పోస్ట్ వైరల్
టాలీవుడ్లో స్టైలిష్ హీరో ఎవరంటే అల్లు అర్జున్ అని టక్కున చెప్పేస్తారు. బన్నీయే కాదు ఆయన సతీమణి స్నేహ కూడా స్టైలిష్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేస్తుంటారు. తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో నెటిజన్లను ఆకట్టుకుంటారు. ఈ క్రమంలో ఆమెకు నెట్టింట ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 8.6 మిలియన్లపైనే మంది ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న అల్లు స్నేహా ఫిట్నెస్ ఫ్రీక్ అనే విషయం తెలిసిందే. చదవండి: మై స్వీట్ బ్రదర్ అంటూ ఫొటో షేర్ చేసిన మంచు మనోజ్ వీలు చిక్కినప్పుడు తరచూ జిమ్, యోగ వీడియోలు, ఫొటోలను షేర్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు. తన డైలీ రోటీన్‌ను ఓ చిన్న వీడియో ద్వారా పంచుకున్నారు. ఇందులో స్నేహ వ్యాయమంతో పాటు తన ఆహారపు అలవాట్లను కూడా పంచుకుంది. ప్రస్తుతం స్నేహ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అంతేకాదు ఇటీవల తన కూతురు ఆర్హ యోగ చేస్తున్న ఫొటోను కూడా షేర్ చేశారు. కూతురు వేసిన యోగ పోస్టర్‌కి బన్నీ షాకవుతూ అలానే చూస్తుండిపోయిన ఫొటోను ఇటీవల స్నేహ షేర్ చేశారు. చదవండి: డైరెక్టర్‌తో ఏడేళ్లు ప్రేమ, పెళ్లి.. పెళ్లైన వారానికే నరకం చూశా: నటి జయలలిత View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
ట్రెండింగ్‌లో అల్లు అర్జున్-స్నేహల ఫొటో! స్పెషల్ ఏంటంటే..
పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక అల్లు అర్జున్ ఎక్కడ కనిపించిన ఫ్యాన్స్ ఐకాన్ స్టార్ అంటూ సెల్పీలు తీసుకునేందుకు వెంటపడుతున్నారు. అలాంటి బన్నీ సెల్ఫీ ఒకటి నెట్టింట ట్రెండ్ అవుతోంది. అయితే అది ఫ్యాన్‌తో తీసుకుకుంది కాదు. తన భార్య స్నేహతో దిగిన సెల్ఫీ. నిన్న సోమవారం(మార్చి 6) అల్లు అర్జున్-స్నేహల 12వ వివాహ వార్షికోత్సం. ఈ సందర్భంగా ఈ స్పెషల్ డేను సెలబ్రెట్ చేసుకుంటూ భార్యకు విషెస్ తెలిపాడు. చదవండి: కళ్లు చెదిరేలా కమెడియన్ రఘు లగ్జరీ ఇల్లు.. చూశారా? ఇద్దరు కలిసి తీసుకున్న సెల్పీ ఫొటోను షేర్ చేస్తూ.. ‘హ్యాపీ యానివర్సరీ క్యూటీ’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. భార్యకు అలా క్యూట్‌గా విషెస్ చెప్పడంతో బన్నీ పోస్ట్‌పై అందరి దృష్టి పడింది. ఇక ఫ్యాన్స్ అయితే వారి సెల్ఫీకి ఫిదా అవుతూ పోస్ట్‌పై రకరకాలుగా స్పందించారు. క్యూట్ కపుల్ అంటూ వారికి వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ తెలిపారు. అలా కుప్పలు కుప్పలుగా బన్నీ-స్నేహలకు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. దీంతో బన్నీ పోస్ట్ ట్రెండింగ్‌లో నిలిచింది. కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. మరోవైపు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ‘అర్జున్ రెడ్డి’ ఫేం సందీప్ వంగతో చేస్తున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన వెలువడింది. చదవండి: బిడ్డ పుట్టిన మూడు నెలలకే వచ్చేశా.. అందరు ప్రశ్నిస్తున్నారు: కాజల్ అగర్వాల్ Happy Anniversary Cutie 🖤 #AlluSnehaReddy pic.twitter.com/lWEJRfuQZH — Allu Arjun (@alluarjun) March 6, 2023 -
టీ కొట్టు దగ్గర శోభిత, గ్రీన్ సారీలో కట్టిపడేస్తున్న స్నేహ
► పింక్ డ్రెస్‌లో ఈషా రెబ్బా ► స్కూటీ నడుపుతున్న కీర్తి సురేశ్ ► గ్రీన్ చీరలో అల్లు స్నేహా ► తండ్రికి బర్త్‌డే విషెస్ చెప్పిన అనుపమ పరమేశ్వరన్ ► వీధి చివర కొట్టులో టీ తాగిన శోభిత ధూళిపాళ View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) -
కొడుకుతో వంట చేయిస్తున్న అల్లు స్నేహ, ఫోటో వైరల్
టాలీవుడ్లో స్టైలిష్ హీరో ఎవరంటే అల్లు అర్జున్ అని టక్కున చెప్పేస్తారు. బన్నీయే కాదు ఆయన సతీమణి స్నేహ కూడా స్టైలిష్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేస్తుంటుంది. ఇటీవల ఫ్యాన్స్‌తో జరిపిన చిట్‌చాట్‌లో కొత్త సంవత్సరం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారన్న ప్రశ్నకు తన తనయుడు అయాన్‌తో కలిసి వంట చేయాలనుకుంటున్నానని ఆన్సరిచ్చింది. ఆ మాట చెప్పిందో లేదో వెంటనే దాన్ని ఆచరణలో పెట్టేసింది స్నేహ. తాజాగా అయాన్‌తో కలిసి వంట చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో అయాన్ తల్లికి సాయంగా కిచెన్‌లో కూరగాయలు కట్ చేస్తున్నాడు. ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. అయాన్ తల్లికి ఇలాగే హెల్ప్ చేస్తే త్వరలోనే మంచి చెఫ్ అవుతాడని సరదాగా కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. ఇకపోతే అల్లు అర్జున్- స్నేహ.. గురువారం నాడు దిల్ రాజు మనవరాలి పుట్టిన రోజు ఫంక్షన్లో తళుక్కుమని మెరిసిన సంగతి తెలిసిందే! చదవండి: దిల్‌రాజు మనవరాలి బర్త్‌డే ఫంక్షన్లో బన్నీ దంపతులు -
బన్నీ అభిమానులకు న్యూ ఇయర్ విషెష్.. సోషల్ మీడియాలో వైరల్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త ఏడాదిని ఆస్వాదిస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా తన భార్య స్నేహరెడ్డితో కలిసి వ్యాకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ ఫోటోలను స్నేహ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పోస్ట్ చేసింది. ఆ ఫోటో కాస్తా సోషల్ మీడియాతో వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల కుటుంబంతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన చిత్రాలను తరచుగా పోస్ట్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటున్నారు స్నేహారెడ్డి. కాగా.. అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం పుష్ప: ది రూల్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రష్మిక మందన్నా అతనికి మరోసారి జోడీగా కనిపించనుంది. వీరిద్దరి కాంబినేషన్లో పుష్ప-పార్ట్ 1 బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం.. ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
2023లో నేను తీసుకుంటున్న నిర్ణయమదే: అల్లు స్నేహ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కే కాదు ఆయన సతీమణి స్నేహా రెడ్డికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను 8.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఫ్యామిలీ ఫోటోలు, కూతురు అర్హ వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది స్నేహ. అంతేగాక హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా డిజైనర్ డ్రెస్సుల్లో ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె అభిమానులతో ముచ్చటించింది. రాబోయే ఏడాదిలో ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోబోతున్నారా? అని ఓ అభిమాని ప్రశ్న విసిరాడు. ఇందుకామె స్పందిస్తూ.. అవాన్తో కలిసి కిచెన్‌లో బాగా వంట చేయాలనుకుంటున్నాను అని బదులిచ్చింది. ఫేవరెట్ ఫుడ్ ఏంటన్న ప్రశ్నకు బిర్యానీ ఫోటో షేర్ చేస్తూ ఇండియన్ వంటకాలంటే మహా ఇష్టమని పేర్కొంది. మీకు ఉదయం అంటే ఇష్టమా? రాత్రి అంటే ఇష్టమా? అని అడగ్గా వేకువజాము వేళలే ఇష్టమని తెలిపింది. బన్నీగారు మీకు ఏదైనా నిక్‌నేమ్ పెట్టారా? ఏమని పిలుస్తారు? అన్న క్వశ్చన్‌కు క్యూటీ అని పిలుస్తాడని ఆన్సరిచ్చింది స్నేహా. చదవండి: గర్భం దాల్చాక సడన్‌గా పెళ్లి? నటి ఏమందంటే? -
Fashion: అందానికే అందంలా అల్లు స్నేహారెడ్డి! ఆ చీర ధర ఎంతంటే!
Allu Arjun Wife Allu Sneha Reddy- Fashion Brands: ట్రెండ్‌ను ఫాలో అవుతూ స్టైల్ మెయింటైన్ చేయడంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముందుంటారు అన్న విషయం తెలిసిందే. అయితే అలాంటి స్టైలిష్ స్టార్‌కు సరిజోడు అనిపించుకుంటోంది అల్లు స్నేహారెడ్డి. ఫంక్షన్ అయినా.. పార్టీ అయినా.. ఔటింగ్ అయినా.. తనకు నప్పే అవుట్ ఫిట్‌తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. అలా తనను ఎలివేట్ చేసే లుక్ కోసం స్నేహారెడ్డి డిపెండ్ అయ్యే ఫ్యాషన్ బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి.. లేబుల్ క్షితిజ్ జలోరీ క్షితిజ్.. న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో టెక్స్టైల్ కోర్సు పూర్తి చేశాడు. తర్వాత కొంత కాలం వివిధ ప్రాంతాల్లో పర్యటించి దేశ సంస్కృతీసంప్రదాయాలను ప్రేరణగా తీసుకొని 2018లో ‘లేబుల్ క్షితిజ్ జలోరీ’ని ప్రారంభించాడు. దేశీ సంప్రదాయ నేత కళ, వరల్డ్ ట్రెండ్స్ అండ్ స్టయిల్స్‌ను పడుగుపేకలుగా పేర్చి డిజైన్స్‌ను క్రియేట్ చేస్తున్నాడు. అతివలు నచ్చే.. మెచ్చే చీరలు, దుపట్టాలు, లెహంగాలను డిజైన్ చేయడంలో ఈ బ్రాండ్‌కి సాటి లేదు. అయితే వీటి ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఖన్నా జ్యూయెలర్స్ నగల వ్యాపారంలో డెబ్భై ఏళ్లకు పైగా నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న ఈ ఖన్నా జ్యూయెలర్స్ను స్వర్గీయ శ్రీ వజీర్ చంద్ ఖన్నా ప్రారంభించారు. చిక్, లష్ పోల్కిస్ – ఫ్యూజన్ స్టైల్స్ బంగారు ఆభరణాలు ఈ బ్రాండ్ ప్రత్యేకత. ప్రస్తుతం ఢిల్లీతోపాటు చెన్నై, కోయంబత్తూర్లలో ఈ జ్యూయెలర్స్కి స్టోర్స్ ఉన్నాయి. ఆన్లైన్లో కొనుగోలు చేసే వీలుంది. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. బ్రాండ్ వాల్యూ చీర బ్రాండ్: లేబుల్ క్షితిజ్ జలోరీ ధర: రూ. 59,800 జ్యూయెలరీ బ్రాండ్: ఖన్నా జ్యూయెలర్స్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. అలా ఏం లేదు.. నాకు సపరేట్ స్టైల్ అంటూ లేదు. అకేషన్‌కి తగ్గట్టు రెడీ అవడమే! – అల్లు స్నేహా రెడ్డి. -దీపికా కొండి చదవండి: Bhagyashree: 53 ఏళ్ల వయసులోనూ అందంలో తగ్గేదేలే! నా బ్యూటీ సీక్రెట్ అదే! Varsha Bollamma: ఈ హీరోయిన్ ధరించిన డ్రెస్ ధర 9500! జైరా బ్రాండ్ ప్రత్యేకత అదే! సామాన్యులకు కూడా View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
సతీమణి స్నేహారెడ్డితో అల్లు అర్జున్.. స్వీట్ పిక్ వైరల్
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఎంత ప్రియారిటీ ఇస్తారో తెలిసిందే. ఖాళీ సమయం దొరికితే చాలు.. ఫ్యామిలీతో కలిసి ట్రిప్ వేస్తాడు. ఎక్కువ సమయం పిల్లలతోనే గడపడానికి ప్రయత్నిస్తాడు. సినిమాల పట్ల ఎంత బిజీగా ఉన్నా.. తన ఫ్యామిలీ టైమ్ ను మాత్రం అస్సలు మిస్ కాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ కు తన కూతురు అల్లు అర్హా అంటే ప్రాణం. కూతురితో ఎంత సరదాగా, ఫ్రెండ్లీగా ఉంటారో తెలిసిందే. తాజాగా ఫ్యామిలీతో కలిసి ఓ వెడ్డింగ్‌కి వెళ్లిన బన్నీ.. భార్య స్నేహరెడ్డితో కలిసిదిగిన పిక్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ట్వీటర్‌తో పాటు ఇన్‌స్టా స్టోరీలో ఆ ఫోటోని షేర్ చేస్తూ... హారిస్ జయరాజ్ కంపోజ్ చేసిన ఉనక్కుళ్ నాన్ సాంగ్ ని కూడా జత చేశాడు. సతీమణితో కలిసి అందంగా దిగిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘పుష్ప’తో భారీ విషయాన్ని సొంతం చేసుకున్న బనీ.. ఇప్పుడు దాని కొనసాగింపు ‘పుష్ప ది రూల్’ లో నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా లో ఫామిలీ తో కలిసి వెకేషన్ లో ఉన్నారు. pic.twitter.com/DijOpntv42 — Allu Arjun (@alluarjun) November 19, 2022 -
Allu Sneha Reddy: సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న అల్లు అర్జున్ భార్య?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి సోషల్‌మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కూతురు, కొడుకుతో కలిసి బన్ని చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను స్నేహా రెడ్డి తరుచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇక ఈ మధ్య కాలంలో ఫోటోషూట్స్‌తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది స్నేహ. హీరోయిన్‌కి ఏ మాత్రం తగ్గని అందం, గ్లామర్‌తో నెటిజన్ల మనసు దోచుకుంటున్న ఈ అల్లువారి కోడలికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ కూడా ఎక్కువే. ఈ క్రమలో సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ దక్కించుకున్న స్నేహకు రీసెంట్గా సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందట. మలయాళ ఇండస్ట్రీ నుంచి ఆమెకు ఓ ఆఫర్ వచ్చినట్లు ఫిల్మీ దునియాలో టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా ఇందులో మలయాళ స్టార్ హీరో నటించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది. ఒకేవళ ఆమెకు సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ ఉంటే టాలీవుడ్ కాకుండా మాలీవుడ్‌ను ఎంచుకుంటుందా అనేదానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. చదవండి: బరువు పెరగడం ఓ సవాల్‌గా అనిపించింది: హీరోయిన్ -
బన్నీ భార్య స్నేహా రెడ్డి చీర ఖరీదు ఎన్ని లక్షలో తెలుసా?
అల్లు అర్జున్, స్నేహా రెడ్డిలను స్టార్ జంట అనేకన్నా స్టైలిష్ జంట అనడం కరెక్టేమో! ట్రెండ్‌ను ఫాలో అవుతూ స్టైల్‌ను మెయింటెన్ చేయడంలో ఇద్దరూ ముందుంటారు. ప్రతి సినిమాకు లుక్‌ను మార్చేస్తూ సర్ప్రైజ్ చేస్తుంటాడు బన్నీ. అలాగే ఆయన భార్య స్నేహా కూడా డిఫరెంట్ శారీస్‌తో అందంగా రెడీ అవుతూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఆమె వెండి కలర్లో ఉన్న చీరను ధరించింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. రిమ్జిమ్ దాదు ఈ చీర డిజైన్ చేయగా, ప్రీతమ్ జుకల్కర్ తననింత స్టైలిష్‌గా రెడీ చేశాడని పేర్కొంది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఎంతందంగా ఉన్నారండీ బాబూ.. హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈ చీర ఖరీదు ఎంతనుకుంటున్నారు? అక్షరాలా లక్షా డెబ్భై ఆరు వేల రూపాయలట! చూడటానికి ఇంత సింపుల్‌గా ఉంది, కానీ అంత ధర ఉందేంటని షాకవుతున్నారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) చదవండి: అప్పుడే సమంతతో ప్రేమలో పడిపోయా: రౌడీ హీరో ఆటోలో సిటీ అంతా తిరిగిన నటుడు, వీడియో వైరల్ -
గోల్డెన్ టెంపుల్లో ఫ్యామిలీతో అల్లు అర్జున్ (ఫొటోలు)
-
బన్నీ భార్య స్నేహారెడ్డి ఫోటోపై కల్యాణ్ దేవ్ కామెంట్ వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి సోషల్‌మీడియాలో మాంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. కూతురు, కొడుకుతో కలిసి బన్ని చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను స్నేహా రెడ్డి తరుచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ యాక్టివ్‌గా ఉండే స్నేహ ఫాలోవర్లు కూడా ఎక్కువే. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రముఖ డిజైనింగ్ శారీలో స్నేహారెడ్డి స్టన్నింగ్ లుక్‌లో కనిపించారు. సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ స్నేహకు స్టైలింగ్ చేశారు. స్నేహారెడ్డి పోస్ట్ చేసిన ఫోటోపై చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ రియాక్ట్ అవుతూ హాట్ ఎమోజీతో స్నేహా.. అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం స్నేహా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
అల్లు అర్జున్ భార్య ఫోటోషూట్‌పై నిహారిక కామెంట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి సోషల్‌మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోల సతీమణుల్లో స్నేహారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇన్‌స్టాలో 8.3 మిలియన్ ఫాలోవర్స్‌తో సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. బన్నీకి సంబంధించిన అప్డేట్స్తో పాటు వారి పిల్లలకు సంబంధించిన క్యూట్ వీడియోలను స్నేహారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స్నేహారెడ్డి మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. బ్లాక్ కలర్ డ్రెస్‌లో సూపర్ స్టైలిష్ లుక్‌లో కనపిస్తుందామె. ఇక ఈ ఫోటోపై నిహారిక, సుష్మిత కొణిదెల సహా పలువురు నెటిజన్లు సైతం సూపర్ హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్‌కు ఏ మాత్రం తీసుపోకుండా ఉన్నారంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం స్నేహారెడ్డి షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
బన్నీకి ఫేవరెట్ అదే.. సీక్రెట్ రివీల్ చేసిన స్నేహారెడ్డి
అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. కూతురు, కొడుకుతో కలిసి బన్ని చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను స్నేహా రెడ్డి తరుచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ యాక్టివ్‌గా ఉండే స్నేహ ఫాలోవర్లు కూడా ఎక్కువే. తాజాగా స్నేహా ఇన్‌స్టాలో అభిమానులతో ముచ్చటించింది. ఆస్క్ మీ ఎనీథింగ్ అంటూ నెటిజన్లతో చిట్‌చాట్ సెషన్లో పాల్గొంది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. తనకు రెడ్ కలర్ అంటే ఇష్టమని, లండన్ ఫేవరెట్ హాలీడే స్పాట్ అని పేర్కొంది. ఇక బన్నీకి ఇష్టమైన ఫుడ్ ఏంటి అని అడగ్గా.. బిర్యానీ అని సీక్రెట్ బయటపెట్టేసింది. ఇక రీసెంట్గా దిగిన ఫ్యామిలీ ఫోటోలను సైతం పంచుకుంది. -
అల్లు అర్జున్‌కి స్నేహ తండ్రి సన్మానం.. అతిథిగా చిరంజీవి
Sneha Reddy’s father felicitates Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో బన్ని సతీమణి స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి తన అల్లుడు అల్లు అర్జున్ కోసం గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఓ ప్రముఖ స్టార్ హోటల్లో పుష్ప సక్సెస్ పార్టీ జరిగినట్టు సమాచారం. చంద్రశేఖర్ రెడ్డి బన్నికి పిల్లనిచ్చిన స్వంత మామగారు. ఇక ఆయన ఇప్పటి వరకు సినిమా జనాలకు, సినిమా ఫంక్షన్లకు పరిచయం తక్కువనే చెప్పాలి. అయితే తొలిసారి అల్లు అర్జున్ కోసం ఇలాంటి పార్టీ ఇచ్చారు. అంతేకాక ఆయనే స్వయంగా సినిమా జనాలను ఆహ్వానించడం విశేషం. పుష్పరాజ్‌గా అద్బుతంగా నటించిన అల్లు అర్జున్ను చంద్రశేఖర్ రెడ్డి సత్కరించారు. ఇక ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి-సురేఖా దంపతులతో పాటు అల్లు అరవింద్, అల్లు స్నేహారెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్, క్రిష్ జాగర్లమూడి, హరీష్ శంకర్, గుణశేఖర్‌తో పాటు పలువురు ఈవెంట్‌కు హాజరయినట్టు తెలుస్తోంది. ఇక ఈ పార్టీలో మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇక బన్ని సినిమాల విషయానికొస్తే..‘పుష్ప’ రెండో భాగం ‘పుష్ప: ది రూల్’ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తర్వాత చిత్రం సంజయ్‌లీలా భన్సాలీతో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే రాజమౌళి దర్శకత్వంలోనూ బన్నీ నటించబోతున్నట్లు సమాచారం.