Allu Arjun And Arha Latest Photo Viral On Social Media: కూతుర్ని గుండెలపై ఎక్కించుకున్న అల్లు అర్జున్‌ - Sakshi
Sakshi News home page

వైరల్‌: కూతుర్ని గుండెలపై ఎక్కించుకున్న అల్లు అర్జున్‌

Published Wed, Apr 21 2021 6:57 PM | Last Updated on Thu, Apr 22 2021 1:04 PM

Allu Arjun And His Daughter Arha New Pic Viral In Social Media - Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌ను చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తుంటాడు. అటు సినిమాలతో బిజీగా ఉంటూనే ఇటు సమయం చిక్కినప్పుడల్లా కుటుంబంతో సరదాగా గడుపుతుంటాడు. ఈ మధ్యనే హాలిడే ట్రిప్‌లో భాగంగా దుబాయ్‌కు‌ కూడా వెళ్లొచ్చాడు. ఇక షూటింగ్స్ నుంచి కాస్త గ్యాప్ దొరికితే చాలు అర్హ, అయాన్‌లతో కలిసి సందడి చేస్తుంటాడు. తన ముద్దుల పిల్లల పిక్స్, వీడియోస్‌ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా ఇలాంటి ఓ క్యూట్‌ ఫోటోను బన్నీ సతీమణి స్నేహారెడ్డి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

క‌రోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ పుష్ప మూవీ షూటింగ్ వాయిదా ప‌డింది. దీంతో ఈ ఖాళీ స‌మ‌యాన్ని త‌న కుటుంబంతో హాయిగా గడుపుతున్నాడు బ‌న్నీ. ఈ క్రమంలో తన ముద్దుల కూతురు అర్హ.. తండ్రి అల్లు అర్జున్ గుండెల‌పై నిల్చుని ఆడుకుంటున్న ఫొటోను స్నేహా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఈ ఫోటో బన్నీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘తండ్రి ప్రేమ కంటే విలువైనది ఏముంది. ఇంతకంటే ఆనందం ఏముంటుంది’ అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.​

చదవండి: 
బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌..‌ ‘ఐకాన్’ మూవీపై దిల్‌రాజు క్లారిటీ
సినిమాల్లోకి రంభ రీఎంట్రీ.. ఫొటోలు, ఫ్లెక్సీలతో హల్‌చల్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement