
అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. బన్నీతో పాటు తన పిల్లలు అయాన్, అర్హలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. ఆమె షేర్ చేసిన వీడియోలు, ఫోటోలు వైరల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇటీవల అర్హకు చేయించిన ఫోటోషూట్ పిక్స్ ఎక్కువగా షేర్ చేసింది స్నేహ. ఆ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.
ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్హకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రీసెంట్‌గా బన్నీ ఫ్యామిలీలో ఓ ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్‌లో తన కూతురిని రెడీ చేయిస్తున్న ఓ వీడియోని షేర్ చేసింది స్నేహ. అందులో అర్హ పాప క్యూట్ స్మెల్ కుందనపు బొమ్మలా కనిపిస్తోంది. ఇక ఈ వీడియో చూసిన బన్నీ ఫ్యాన్స్.. లిటిల్ ప్రిన్సెస్ అంటూ అర్హని పొగడ్తలతో ముంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment