Allu Arha
-
క్యూట్ గెటప్‌లో అల్లు అర్హ, అయాన్ డ్యాన్స్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సతీమణి స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుంది. ఫ్యామిలీకి సంబంధించిన ఏ విషయాన్నైనా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన పిల్లలు అర్హ (Allu Arha), అయాన్లకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. అందులో పిల్లలిద్దరూ క్యూట్ గెటప్‌లో కనిపించారు. క్లాస్‌మేట్స్‌తో కలిసి హుషారుగా డ్యాన్స్ చేశారు. అర్హ, అయాన్ తమ స్కూల్ ఈవెంట్లో ఇలా వింత గెటప్‌తో డ్యాన్స్ చేసినట్లు కనిపిస్తోంది. అర్హ ముందు వరుసలో ఉంటే అయాన్ మాత్రం వెనకాల నిల్చున్నాడు.పుష్ప 2తో కలెక్షన్ల ఊచకోతఇకపోతే అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు. రూ.1800 కోట్ల పైనే వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. సునీల్, జగపతిబాబు, అనసూయ, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు.సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాబన్నీ తన నెక్స్ట్ సినిమాను త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయనున్నట్లు తెలుస్తోంది. శివుడి కుమారుడు కార్తికేయుడి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రేవతి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అటు థియేటర్ యాజమాన్యంతోపాటు ఇటు అల్లు అర్జున్ను సైతం అరెస్ట్ చేశారు. దీనిపై బన్నీ కోర్టును ఆశ్రయించగా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.చదవండి: గొర్రెల కాపరిగా కొనసాగుతా.. నాకదే ఇష్టం!: బిగ్‌బాస్ విన్నర్ -
నాన్న కోసం అల్లు అర్హ ఎదురుచూపులు.. వీడియో వైరల్
స్టార్ హీరో అల్లు అర్జున్.. చంచల్‌గూడ జైలు నుంచి ఉదయం 6:45 గంటలకు విడుదలయ్యాడు. సంధ్య థియేటర్ దగ్గర డిసెంబర్ 4 రాత్రి జరిగిన తొక్కిసలాట కేసులో బన్నీని శుక్రవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. జైలుకి తీసుకెళ్లేలోపు 4 వారాల మధ్యంతర బెయిల్ వచ్చింది. (ఇదీ చదవండి: జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల.. అసలేం జరిగింది?)బెయిల్ వచ్చినా సరే తమకు సమర్పించిన పేపర్లలో సమాచారం సరిగా లేదని.. చంచల్‌గూడ జైలు అధికారులు బన్నీని విడుదల చేయలేదు. దీంతో రాత్రంతా జైలులోనే ఉండాల్సి వచ్చింది. అండర్ ట్రైల్ ఖైదీగా.. ఖైదీ నంబర్ 7697 ఇచ్చి మంజీరా బ్యారక్ క్లాస్-1 రూంలో రాత్రంతా ఉంచారు. అయితే భోజనం చేయకుండా రాత్రంతా నేలపైన బన్నీ పడుకున్నట్లు తెలుస్తోంది.ఉదయం జైలు గేటు ముందు ఫ్యాన్స్, మీడియా ఉండగా.. వెనక గేటు నుంచి బన్నీని పోలీసులు బయటకు పంపించారు. అయితే నేరుగా ఇంటికెళ్లకుండా గీతా ఆర్ట్స్ కార్యాలయాలనికి వెళ్లాడు. మరోవైపు ఇంటి దగ్గర తండ్రి కోసం అర్హ ఎదురుచూస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు)#alluarha waiting for her Dad #AlluArjun #alluaarjunarrest pic.twitter.com/pkWDdYQGjA— SRK (@SRKofficial67) December 13, 2024 -
అల్లు అర్హ బర్త్ డే.. ముద్దుల కూతురికి ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్!
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహరెడ్డి గారాలపట్టి అల్లు అర్హ ఇటీవల రియాలిటీ షోలో కనిపించింది. తండ్రితో కలిసి పాల్గొన్న అర్హ అచ్చ తెలుగులో పద్యం చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇవాళ బన్నీ ముద్దుల కూతురు అర్హ తన ఎనిమిదో పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా టాలీవుడ్ ఫ్యాన్స్ అభిమాన హీరో కూతురికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.అయితే అల్లు అర్జున్ తన కూతురి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. 8 సంవత్సరాల స్వచ్ఛమైన ఆనందం.. నా లిటిల్ అర్హ నా జీవితాన్ని మధురంగా మార్చింది.. నీపై అనంతమైన ప్రేమతో మీ నాన్న అంటూ బన్నీ పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అల్లు స్నేహరెడ్డి తన గారాలపట్టికి బర్త్ డే విషెస్ తెలిపింది. అర్హకు సంబంధించిన అరుదైన ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. హ్యాపీ బర్త్ డే మై క్యూటెస్ట్, స్వీటెస్ట్ బేబీ..మేము నిన్ను చాలా ప్రేమిస్తున్నాం అర్హ' అంటూ పోస్ట్ చేసింది. మా జీవితంలో ఇది చాలా ప్రత్యేకమైన రోజు అంటూ తమ ముద్దుల కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
అచ్చ తెలుగుతో అల్లు అర్జున్ కూతురు సర్ప్రైజ్
'పుష్ప 2' మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌తో ప్రమోషన్స్ షురూ చేశారు. మరోవైపు బన్నీ కూడా అన్‌స్టాపబుల్ షోలో పాల్గొని మూవీని ప్రమోట్ చేస్తూనే తన వ్యక్తిగత విషయాల్ని కూడా చెప్పాడు. అయితే బన్నీ ఎపిసోడ్స్‌ని రెండుగా చేశారు. గతవారం ఒకటి రిలీజ్ చేయగా.. ఈ శుక్రవారం మరో ఎపిసోడ్ విడుదల చేస్తారు. ఈ మేరకు లేటెస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‌కి పెళ్లి సెట్!)ఇందులో అల్లు అర్జున్‌తో పాటు కొడుకు అయాన్, కూతురు అర్హ షోలో కనిపించారు. హోస్ట్ బాలకృష్ణ.. అర్హ నీకు తెలుగు వచ్చా అని అడిగేసరికి.. 'అటజనికాంచె భూమిసురు డంబరచుంబి..' అని పదో క్లాస్‌లో చాలామంది చదువుకున్న పద్యాన్ని ఆపకుండా చెప్పేసింది. ఇది చూసి బన్నీ, బాలయ్య తెగ మురిసిపోయారు.వ్యక్తిగత విషయాలతో పాటు 'పుష్ప 2' గురించి అల్లు అర్జున్-హోస్ట్ బాలకృష్ణ మాట్లాడుకున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కి కూడా ఫోన్ చేసి మూవీ గురించి మాట్లాడారు. చివరలో బన్నీ మాట్లాడుతూ.. ఇప్పటివరకు మాస్ చూశారు, ఊరమాస్ చూశారు.. 'పుష్ప 2'తో జాతర మాస్ చూస్తారని ఓ రేంజ్ ఎలివిషన్ ఇచ్చాడు. ఈ శుక్రవారం ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు డబ్బింగ్ సినిమా) -
అల్లు అర్జున్ పెళ్లి రోజు.. భార్యతో ఈ క్యూట్ ఫొటోలు చూశారా?
-
'జమల కుదు' పాటకు అల్లు అర్జున్ కూతురు క్యూట్ డ్యాన్స్
అల్లు అర్జున్ పేరు చెప్పగానే ఇతడి సినిమాలు గుర్తొస్తాయి. అదే టైంలో బన్నీ కొడుకు అయాన్, కూతురు అర్హ కూడా గుర్తొస్తారు. ఎందుకంటే పేరుకే చిన్న పిల్లలు అయినప్పటికీ.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటారు. తాజాగా అల్లు అర్హ.. అలా 'యానిమల్' సినిమాలోని హిట్ పాటకు స్టెప్పులేసి వైరల్ అయిపోతోంది. (ఇదీ చదవండి: ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?) అల్లు అర్జున్ సినిమా వచ్చి దాదాపు రెండు మూడేళ్లకు పైనే అయిపోయింది. కానీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాడు. ఇతడి కొడుకు అయాన్ కూడా మోడల్ పోజులిస్తూ నవ్విస్తుంటాడు. కూతురు అర్హ కూడా ముద్దుముద్దుగా మాట్లాడుతూ వైరల్ అవుతూ ఉంటుంది. ఇకపోతే 'యానిమల్' సినిమాలోని 'జమల్ కుదు' పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆ పాటలో తలపై గ్లాస్ పెట్టుకుని డ్యాన్స్ చేశారు. అర్హ మాత్రం తలపై ప్లేట్ పెట్టుకుని.. ఆ పాటని పోలినట్లు నడుస్తూ వచ్చింది. ఇప్పుడీ వీడియో వైరల్ అయిపోయింది. మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేసేయండి. (ఇదీ చదవండి: ప్రేమ కావాలంటున్న మెగా డాటర్ నిహారిక.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్) Arha😂😂❤ pic.twitter.com/ywwSnzTtuw — AK. (@flawsomedamsel) February 21, 2024 -
కూతురి కోసం బన్నీ స్పెషల్ పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయారు. ప్రస్తుతం పుష్ప సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న పుష్ప-2 చిత్రంతో బిజీగా ఉన్నారు. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. అయితే సాధారణంగా సెలబ్రిటీల పిల్లల తల్లిదండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకుంటారు. ఈ విషయంలో సినిమా ఇండస్ట్రీ ఒక అడుగు ముందే ఎప్పుడు ఉంటుంది. అలాగే బన్నీకి అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వీరిద్దరిలో అల్లు అర్హ ఇప్పటికే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. సమంత నటించిన శాకుంతలం చిత్రంలో మెరిసింది. భరతుడిగా నటించి సిల్వర్ స్క్రీన్‌పై రాజసాన్ని పండించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇవాళ తన పుట్టినరోజు కావడంతో అల్లు అర్జున్ స్పెషల్ విషెస్ తెలిపారు. తన ఇన్‌స్టాలో అల్లు అర్హతో ఉన్న ఫోటోను పంచుకున్నారు. బన్నీ తన ఇన్‌స్టాలో రాస్తూ..' హ్యాపీ బర్త్ డే మై లిటిల్ ప్రిన్సెస్' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు అర్హకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ పోస్ట్ చూసిన కల్యాణ్ దేవ్, గీతూ రాయల్, పీవీ సింధు బర్త్ డే విషెస్ తెలిపారు. కాగా.. అల్లు అర్హ.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ చిన్ననాటి పాత్రలో అర్హ కనిపించనున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
'మీ చిన్న హృదయాలు స్వచ్ఛంగా ఉండాలి'.. శ్రీజ పోస్ట్ వైరల్!
శ్రీజ కొణిదెల తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. మెగాస్టార్ చిరంజీవి కూతురిగా శ్రీజకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లికి ఫ్యామిలీతో కలిసి హాజరైంది. తన ఇద్దరు కూతుళ్లతో వరుణ్ పెళ్లిలో సందడి చేసింది. పెళ్లిలో నూతన దంపతులతో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటోంది. (ఇది చదవండి: స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ.. ఈ ఫోటోలోని చిన్నారి ఎవరో తెలుసా?) తాజాగా ఇవాళ చిల్డ్రన్స్ డే కావడంతో తన కూతుళ్లతో పాటు మెగా, అల్లు కుటుంబాల పిల్లలు ఉన్న ఫోటోను పంచుకుంది. అంతే కాకుండా పిల్లల మనస్తత్వం గురించి నోట్ రాసుకొచ్చింది. శ్రీజ తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఇక్కడ ఉన్న అన్ని చిన్న హృదయాలు ప్రేమ, స్వచ్ఛత, నవ్వు, ఆనందం, ఉత్సుకతతో నిండి ఉండాలి. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మీ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఇది చూసి ఫ్యాన్స్ సూపర్ పిక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో రామ్ చరణ్- ఉపాసన కూతురు క్లీంకార ఎక్కడ? అంటూ పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా ఓకే ఫ్రేమ్‌లో మెగా, అల్లు కుటుంబాల పిల్లలను చూస్తుంటే చూడ ముచ్చటగా ఉంది. కాగా.. 2016లో కల్యాణ్ దేవ్‌తో శ్రీజ వివాహం జరిగిన విషయం తెలిసిందే. (ఇది చదవండి: జీవితంలో కష్టాలు వచ్చినా.. గుండె బద్దలైనా అంటూ శ్రీజ కామెంట్స్) View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) -
వరుణ్- లావణ్య పెళ్లిలో బన్నీ కూతురు సందడి..!
మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో మెగా, అల్లు కుటుంబాలు హాజరవుతున్నారు. ఇటలీలోని టుస్కానీలో గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే కాక్టెయిల్ పార్టీ, హల్దీ వేడుకలు ముగిశాయి. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. (ఇది చదవండి: ఈ ముహూర్తంలోనే వరుణ్- లావణ్యల పెళ్లి.. ఎందుకంటే?) సోమవారం రాత్రి జరిగిన కాక్ టెయిల్ పార్టీలో కుటుంబ సభ్యులంతా సందడి చేశారు. ఈ పార్టీలో రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహాలు కూడా కలర్ఫుల్గా కనిపించారు. టాలీవుడ్ హీరో నితిన్, ఆయన భార్య షాలిని కూడా స్టైలిష్‌గా కనిపించారు. అయితే ఈ వేడుకల్లో బన్నీ కూతురు అల్లు అర్హ మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించింది. తాజాగా అల్లు అర్హ ఫోటోలను స్నేహా రెడ్డి తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ఆ ఫోటోల్లో అర్హ బ్రేక్ ఫాస్ట్ చేస్తూ కనిపించింది. బన్నీ సైతం తన కుమారుడు అయాన్‌తో ఉన్న పిక్‌ను షేర్ చేశారు. అంతే కాకుండా ఈ వేడుకల్లో చిరంజీవి కుమార్తె శ్రీజ కొణిదెల కూడా పాల్గొన్నారు. కాగా.. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి నవంబర్ 1న మధ్యాహ్నం 2.48 నిమిషాలకు వివాహాబంధంలోకి అడుగు పెట్టనున్నారు. ప్రస్తుతం వీరికి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (ఇది చదవండి: నెలలోపే ఓటీటీకి వచ్చేస్తోన్న స్టార్ హీరో సినిమా!) View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
'నువ్వంటే నా ప్రాణం'.. వైరల్‌గా మారిన అల్లు అర్జున్ పోస్ట్!!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఇటీవలే జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. పుష్ప సినిమాలో బన్నీ నటనకు గానూ ఆయనకు ఈ అవార్డ్ లభించింది. టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో పుష్ప-2 రాబోతోంది. ఈ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు బన్నీ. అయితే తాజాగా ఇవాళ అంతర్జాతీయ కూతుర్ల దినోత్సవం సందర్భంగా ఓ వీడియోను షేర్ చేశారు. తన ముద్దుల కూతురు అల్లు అర్హతో ఆడుకుంటున్న వీడియోను పోస్ట్ చేశారు. (ఇది చదవండి: అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. ప్రభాస్, మహేశ్ తర్వాత బన్నీయే!) వీడియోలో బన్నీ మాట్లాడుతూ.. 'ఎందుకు నువ్వు ఇంత క్యూట్‌గా ఉన్నావు.. కొంచెం క్యూట్ అయితే ఓకే.. మరీ ఇంత క్యూట్‌గా ఎలా ఉన్నావ్' అంటూ తనపై కూర్చోపెట్టుకుని కుమార్తెను ముద్దాడారు. 'నువ్వంటే నాకు చాలా ఇష్టం.. నువ్వంటే నా ప్రాణం' అంటూ అల్లు అర్హపై ఒక తండ్రిగా ప్రేమను చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ సైతం అల్లు అర్హ సో క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. అల్లు అర్జున్, రష్మిక నటిస్తోన్న పుష్ప-2 వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. బన్నీ కూతురు అల్లు అర్హ సైతం శాకుంతలం సినిమాత వెండితెరపై సందడి చేసింది. ప్రస్తుతం మహేశ్ బాబు నటిస్తోన్న గుంటూరు కారంలోనూ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
వినాయకచవితి స్పెషల్.. బన్నీ కూతురు ఏం చేసిందో తెలుసా?
వినాయకచవితి వచ్చిందంటే చాలు ఏ గల్లీలో చూసిన సందడే సందడి. ముఖ్యంగా చిన్నపిల్లల హడావుడి అంతా ఇంతా కాదు. ఎలాగైనా సరే గణపతి తయారు చేసి మరీ సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు మట్టితో చాలా సరదాగా వినాయక విగ్రహాన్ని తయారు చేయడం మనం చూస్తుంటాం. అలా ఐకాన్ స్టార్ గారాల పట్టి అల్లు అర్హ వినాయకచవితి కోసం బుజ్జి వినాయకుడిని తయారు చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. (ఇది చదవండి: Allu Arha In Devara: దేవుడా.. రెండో సినిమాకే లక్షలు తీసుకుంటున్న అల్లు అర్హ! ) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ అంటే టాలీవుడ్లో తెలియని వారుండరు. కాగా.. అల్లు అర్హ ఇప్పటికే సినిమాల్లో నటిస్తోంది. ఈ ఏడాది సమంత నటించిన శాకుంతలం చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో అర్హ భరతుడి పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించింది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర చిత్రంలో అల్లు అర్హ నటించనున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. జాన్వీ చిన్ననాటి పాత్రలో అర్హ నటించనుందని సమాచారం. ఇప్పటికైతే మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) -
ఫస్ట్ డే బ్యాగేసుకుని స్కూలుకు వెళ్లిన అర్హ, ఫోటో చూశారా?
అల్లు అర్జున్ గారాలపట్టి అర్హ ఇక అల్లరి మాని స్కూలుకు వెళ్తోంది. ఇప్పటివరకు అమ్మానాన్నతో కబుర్లు చెప్తూ, ఆటలాడుతూ కాలక్షేపం చేసిన అర్హ చదువుకునే వేళైంది. ఈ రోజు ఉదయం అర్హ స్కూలుకు వెళ్లింది. ఈ విషయాన్ని అల్లు స్నేహ సోషల్ మీడియాలో వెల్లడించింది. అయాన్‌తో కలిసి బుద్ధిగా బడికి వెళ్తున్న కూతురి ఫోటోను 'ఫస్ట్ డే ఆఫ్ స్కూల్' అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఇందులో అయాన్ బ్యాగ్‌పై తన పేరు రాసి ఉండగా.. అర్హ వేసుకున్న బ్యాగు మీద కూడా ఈ చిన్నారి పేరు ఇంగ్లీష్‌లో ఉంది. వీరి బ్యాగులను బన్నీ దంపతులు ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరూ స్కూలుకు వెళ్తున్న ఫోటో చూసిన బన్నీ ఫ్యాన్స్ భలే ముద్దుగా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా అర్హ స్కూలు పాఠాలకు ముందే సినిమా పాఠాలు సైతం నేర్చేసుకుంది. శాకుంతలం సినిమాలో భరతుడి చిన్ననాటి పాత్రలో కనిపించింది. ఇందులో ఆమె నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. మరోవైపు కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న దేవర సినిమాలోనూ అర్హ నటించనున్నట్లు ఓ వార్త వైరలవుతోంది. జాన్వీ కపూర్ చిన్ననాటి పాత్రలో అర్హ కనిపించనుందని, ఇందులో ఆమె పాత్ర నిడివి 10 నిమిషాలు కాగా ఇందుకోసం ఏకంగా రూ.20 లక్షలు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదెంతవరకు నిజమనేది క్లారిటీ రావాల్సి ఉంది! మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. చదవండి: అరుదైన వ్యాధితో బాధపడ్డ మహేశ్‌బాబు, ఎన్ని టాబ్లెట్లు వాడినా.. హైపర్ ఆది ఓవరాక్షన్.. చిరంజీవిని జీరోగా.. గుర్రుమంటున్న మెగా ఫ్యాన్స్ -
Allu Arha In Devara: దేవుడా.. రెండో సినిమాకే లక్షలు తీసుకుంటున్న అల్లు అర్హ!
మిగతా ఇండస్ట్రీల మాటేమిటో కానీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చలనచిత్రపరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. ఎంతోమంది సెలబ్రిటీల పిల్లలు హీరో హీరోయిన్స్‌గా, దర్శకనిర్మాతలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ముందుకు సాగుతుంటారు. చాలామంది ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు కూడా!ఎవరో కొద్ది మంది మాత్రమే వారి సంతానాన్ని సినిమా దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. ఇకపోతే ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్‌బాబు ముద్దుల తనయ సితార ఓ యాడ్‌లో నటించి ఒక్కసారిగా వైరలయింది. ఇందుకోసం ఆమె కోటి రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 11 ఏళ్లకే యాడ్స్ మొదలుపెట్టిందంటే మరికొంతకాలానికి సినిమాల్లోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. అటు మహేశ్ తనయుడు గౌతమ్ కూడా ఆరేడేళ్ల తర్వాత సినిమాల్లోకి వస్తాడని నమ్రత క్లారిటీ ఇచ్చేసింది. మరోవైపు అల్లు అర్జున్ కూతురు అర్హ శాకుంతలం చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. భరతుడిగా నటించి సిల్వర్ స్క్రీన్‌పై రాజసాన్ని పండించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తాజాగా ఈ చిన్నారి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. జాన్వీ చిన్ననాటి పాత్రలో అర్హ నటించనుందట. వచ్చే నెలలో తను షూటింగ్లో పాల్గొననున్నట్లు భోగట్టా! ఇందులో ఆమె పాత్ర నిడివి 10 నిమిషాలేనని, మేకర్స్ నిమిషానికి రూ.2 లక్షల రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ లెక్కన దేవర సినిమాకు ఆమె 20 లక్షల పారితోషికం తీసుకోనుందన్నమాట! మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. చదవండి: జవాన్ సినిమాకు నయనతార ఎంత పారితోషికం తీసుకుందంటే? -
శాకుంతలం అట్టర్ ప్లాప్ అల్లు అర్జున్ ఫుల్ హ్యాపీ
-
శాకుంతలం మూవీ ప్రెస్ మీట్..
-
అర్హ విషయంలో అల్లు అర్జున్ జోక్యం చేసుకోరు: సమంత
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’మూవీ ఈ నెల 14న విడుదల కాబోతంది. ప్రముఖ కవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గుణ శేఖర్ దర్శత్వం వహించారు. ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించారు. మలయాళ నటుడు దేవ్ మోహన్, ప్రకాశ్ రాజ్, మోహన్ బాబు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ద్వారా అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇస్తుంది. సినిమా ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లిన సామ్.. అల్లు అర్హ కెరీర్ విషయం అల్లు అర్జున్ ప్రమేయం గురించి స్పందించింది. కూతురు కెరీర్ విషయంలో అల్లు అర్జున్ జోక్యం చేసుకోలేడని తాను భావిస్తున్నట్లు సమంత చెప్పుకొచ్చింది. ‘అర్హకు సొంత వ్యక్తిత్వం ఉంది. తన కెరీర్ ఎలా ఉండాలో ఆమె నిర్ణయించుకుంటుంది. తనలో చాలా టాలెంట్ ఉంది. పెద్ద పెద్ద డైలాగ్స్ కూడా ఈజీగా చెప్పేస్తుంది. పిల్లలందరూ అర్హ పాత్రకు కనెక్ట్ అవుతారు’ అని సమంత చెప్పుకొచ్చింది. -
శాకుంతలం సినిమాలో మహేష్ బాబు కూతురిని కాకుండా అల్లు అర్జున్ కూతురిని ఎందుకు తీసుకున్నామంటే..
-
అల్లు అర్జున్ కూతురిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సమంత
సమంత నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఈ సినిమా కోసం సమంత ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అంతే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు కారణం బన్నీ కూతురు అర్హ ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇవ్వడమే. శాకుంతల-దుష్యంత మహారాజు కొడుకు భరతుడి పాత్రలో అర్హ కనిపించనుంది. ఇక ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేసిన సమంత వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీబిజీగా గడిపేస్తుంది. తాజాగా యాంకర్ సుమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత అల్లు అర్హ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. 'అల్లు అర్హ చాలా క్యూట్ గా ఉంటుంది. తనకి అసలు ఇంగ్లీష్ రాదు. హాయ్ కూడా నార్మల్‌గానే చెప్తుంది. ఈ జనరేషన్ పిల్లలకి అంత బాగా తెలుగు నేర్పించినందుకు వాళ్లు పేరెంట్స్‌కి హ్యాట్సాఫ్ చెప్పాలి. సెట్లో కూడా ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా భయపడకుండా బాగా చెప్పింది. అల్లు అర్జున్ ఇప్పుడు స్టార్ అయితే, అర్హ పుట్టకతోనే స్టార్' అంటూ పొగడ్తల వర్షం కురిపించింది. -
అర్హ స్టంట్‌కి షాక్ అయిన అల్లు అర్జున్.. ఫోటో వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ అంటే టాలీవుడ్లో తెలియని వారుండరు. సోషల్ మీడియాలోనూ అర్హకు బోలెడంత ఫాలోయింగ్ ఉంది. తన ముద్దు ముద్దు మాటలు, చేష్టలతో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకునే అర్హ తాజాగా తన టాలెంట్‌తో మరోసారి సర్ప్రైజ్ చేసింది. అతి చిన్న వయసులోనే క్లిష్టమైన యోగాసనాలు వేసి తండ్రి అల్లు అర్జున్‌కే ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి సంబంధించిన ఓ క్యూట్ ఫోటోను స్నేహారెడ్డి తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసుకోవడంతో ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. అయాన్, అర్హ చేసే అల్లరి ఫోటోలు, వీడియోలను స్నేహారెడ్డి తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటదన్న విషయం తెలిసిందే. తాజాగా తమ గార్డెన్లో అర్హ యోగాసనం వేస్తుంటే అది చూసి బన్నీ షాక్ అవుతున్నట్లు ఒక ఫోటోను స్నేహా అభిమానులతో పంచుకుంది. ఇక అర్హ ఇప్పటికే శాకుంతలం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. -
అఫీషియల్.. సమంత ‘శాకుంతలం’ వాయిదా
స్టార్ హీరోయిన్ సమంత అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ శాకుంతలం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణ శేఖర్ రూపొందించిన పౌరాణిక ప్రేమ కావ్యం ఈ చిత్రం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార పోస్టర్లు, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా శాకుంతలం పాటలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని సినీ ప్రియులంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చదవండి: పెళ్లి పీటలు ఎక్కిన ‘నేనింతే’ హీరోయిన్, వరుడు ఎవరంటే! ఈ క్రమంలో ఆడియన్స్‌కి నిరాశ ఎదురైంది. కొద్ది రోజులుగా శాకులంత మూవీ వాయిదా అంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ తాజాగా చిత్రం బృందం ప్రకటన ఇచ్చింది. ఫిబ్రవరి 17న రిలీజ్ చేయాల్సిన శాకుంతలం చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు తాజాగా మూవీ టీం అధికారిక ప్రకటన ఇచ్చింది. “ఫిబ్రవరి 17న శాకుంతలం సినిమాను విడుదల చేయలేకపోతున్నామని ప్రేక్షకులకు తెలిపేందుకు చింతిస్తున్నాం. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌తో వస్తాం. నిరంతరం మాపై కురిపిస్తున్న ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు” అంటూ ప్రకటన ఇచ్చింది. చదవండి: ఓర్వలేక నా బిజినెస్‌పై కుట్ర చేస్తున్నారు: కిరాక్ ఆర్పీ అయితే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ కాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ కథానాయకుడిగా నటించగా.. మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో అర్హ భరతుడు పాత్రలో కనిపించనుంది. The theatrical release of #Shaakuntalam stands postponed. The new release date will be announced soon 🤍@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan @neelima_guna #ManiSharma @GunaaTeamworks @SVC_official @tipsofficial @tipsmusicsouth pic.twitter.com/f0cyBfDCyj — Gunaa Teamworks (@GunaaTeamworks) February 7, 2023 -
డబ్బింగ్ చెబుతున్న అల్లు అర్హ.. సోషల్ మీడియాలో పంచుకున్న ఐకాన్ స్టార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ అంటే టాలీవుడ్లో తెలియని వారుండరు. ఇప్పటికే సమంత నటిస్తున్ శాకుంతలం సినిమాతో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అర్హ భరతుడి పాత్రలో కనిపించనుంది. ఇటీవలే విడుదలైన శాకుంతలం ట్రైలర్లో సింహంపై స్వారీ చేస్తున్న భరత యువరాజుగా అర్హ కనిపించింది. తాజాగా అర్హ డబ్బింగ్ చెబుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇటీవలే ఆరో ఏట అడుగు పెట్టిన అల్లు అర్హ తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంటోంది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతోంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గుణ టీమ్‌వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సమర్పిస్తున్నారు. నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శాకుంతలం చిత్రానికి మణి శర్మ సంగీతం అందించారు. ఫిబ్రవరి 17, 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను త్రీడీలో కూడా విడుదల చేయనున్నారు మేకర్స్. మరోవైపు మహేశ్ బాబు మూవీ‘ఎస్ఎస్ఎంబీ28’(SSMB28) చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్హ నటిస్తున్నట్లు టాక్. -
ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన శాకుంతలం టీం, ఫస్ట్ సింగిల్‌కు డేట్ ఫిక్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక ఫిబ్రవరి 17న ఈ మూవీని విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. రిలీజ్ డేట్ దగ్గర పుడుతుండటంతో శాకుంతలం ప్రమోషన్స్ స్టార్ చేసింది మూవీ యూనిట్. చదవండి: Jr NTR-Team India: భారత ఆటగాళ్లతో తారక్ సందడి, ఫొటో వైరల్! ఈ నేపథ్యంలో శాకుంతలం ఫస్ట్ సింగిల్‌కు ముహుర్తం ఫిక్స్ చేశారు. ‘మల్లికా’ అంటూ సాగే ఈ తొలి పాటని ఈ నెల 18వ తేదీన విడుదల చేయబోత్నుట్లు చిత్రం బృందం అధికారికంగా ప్రకటించింది. కాగా ఇందులో సమంత జోడిగా మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. ఆయన దుష్యంత మహారాజు పాత్ర పోషించగా.. అల్లు అర్జున్ ముద్దుల తనయ ఈ సినిమాతో వెండితెర అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అర్హ ప్రిన్స్ భరత పాత్రలో అలరించనుంది. Starting off the musical journey of #Shaakuntalam with the First Single 🤍#Mallika/#Malligaa/#Mallike on Jan 18th 🎶 Music by Melody Brahma #ManiSharma 🎹@Gunasekhar1 @ActorDevMohan @neelima_guna @GunaaTeamworks @SVC_official @tipsofficial @tipsmusicsouth pic.twitter.com/or8ntqc170 — Samantha (@Samanthaprabhu2) January 16, 2023 -
అదిరిపోయే విజువల్స్‌తో శాకుంతలం ట్రైలర్.. అల్లు అర్హ ఎంట్రీ అదిరింది
సమంత ప్రధానపాత్రలో నటిస్తున్న సినిమా శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోనే సమంత శకుంతల పాత్రలో నటించగా, ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. ఫిబ్రవరి 17న ఈ సినిమా పాన్ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. 'ఈ భూమ్మిద అమ్మానాన్నలకు అక్కర్లేని తొలి బిడ్డ.. మేనకా విశ్వామిత్రుల ప్రేమకు గుర్తుగా ఈ బిడ్డ పుట్టింది. శకుంతల ఒక కారణ జన్మురాలు.. నవ నాగరికతకు నాంది పలకబోతోంది' అంటూ ట్రైలర్ ఆరంభం అవుతుంది. విజువల్స్, మణిశర్మ సంగీతం కట్టిపడేస్తుంది. ఇక చివర్లో సింహం మీద అల్లు అర్హ ఎంట్రీ మరో హైలైట్ అని చెప్పొచ్చు. సమంత లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. మరి ట్రైలర్లో కనిపిస్తున్న మ్యాజిక్ సినిమాలోనూ వర్కవుట్ అవుతుందా? అన్నది చూడాల్సి ఉంది. -
మహేశ్-త్రివిక్రమ్ సినిమాలో అల్లు అర్హ స్పెషల్ రోల్?
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇదే విషయంపై మూవీ టీం సైతం క్లారిటీ ఇచ్చింది. జనవరిలో ‘ఎస్ఎస్ఎంబీ28’(SSMB28) రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హ ఓ ప్రధాన పాత్రలో కనిపించనుందని టాక్. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ చిన్నారిది స్పెషల్ రోల్ ఉంటుందట. దాని కోసం త్రివిక్రమ్ అర్హను తీసుకోవాలని అభిప్రాయపడుతున్నాడని తెలుస్తోంది. అంత ఓకే అయితే అర్హ కొద్ది నిమిషాల పాటు ఈ సినిమాలో అలరించనుందని సినీ వర్గాల నుంచి సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి. కాగా అర్హ ఇప్పటికే శాకుంతలం చిత్రంలో సినీరంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న శాకుంతలంలో అర్హ భరతుడి పాత్ర పోషించిందని సమాచారం. చదవండి: తమన్నా ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా? 5 ఏళ్లలో మూడు వేల కోట్లు.. హొంబాలే ఫిలింస్ కీలక ప్రకటన! -
కూతురు బర్త్‌డే.. అర్హ క్యూట్ వీడియో షేర్ చేసి మురిసిపోయిన బన్నీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా కూతురికి సంబంధించిన ఓ వీడియో షేర్ చేస్తూ అర్హకు క్యూట్ బర్త్‌డే విషెస్ తెలిపాడు బన్నీ. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. కాగా అర్హకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తన ముద్దు ముద్దు మాటలు, చేష్టలతో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ఇక అల్లు అర్జున్ కూడా ఏమాత్రం సమయం దొరికినా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా కూతురు అర్హతో కలిసి ఆడుకుంటూ చిన్నపిల్లాడిలా మారిపోతాడు బన్నీ. ఇప్పటికే అర్హకు సంబంధించిన పలు క్యూట్ వీడియోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. చదవండి: ప్రత్యేక ఆకర్షణగా నాగశౌర్య పెళ్లి భోజనాలు, అరేంజ్మెంట్స్ చూస్తే షాకవ్వాల్సిందే నవంబర్ 21 అర్హ బర్త్‌డే స్పందర్భంగా బన్నీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశాడు. ఇందులో అర్హ తన క్యూట్ క్యూట్ మాటలతో తండ్రికి కందిరీగల గురించి చెబుతూ కనిపించింది. కందిరిగలు వాళ్ల జుట్టులోకి వెళ్లిపోతున్నాయని చెబుతుంటే.. తెనె పుట్ట ఎక్కడుందని బన్నీ కూతురి అడగ్గా.. ఎక్కడంటే కింద ఉంది. వాళ్లు పొగ పెట్టి తెనె పుట్ట తీసేశారని చెప్పింది. తండ్రిని తీసుకుని కిందికి తీసుకుని వెళ్లింది అర్హ. తన కూతురికి కందిరీగలు అంటే భయపడొద్దని చెబుతుంటే.. అక్కడ చాలా ఎక్కువ కందిరీగలున్నాయని, అవి కుడుతున్నాయ్ అంటూ ముద్దు ముద్దుగా చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోని బన్నీ పోస్ట్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్ డే మై క్యూట్ బేబీ అర్హ’ అటూ క్యాప్షన్ ఇచ్చాడు. చదవండి: నాకెవ్వరూ లేరు.. చచ్చిపోతానంటూ నటి మేఘన! వీడియో వైరల్ View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
‘ఫన్’టాస్టిక్ సితార .. ‘తగ్గేదే లే’అంటున్న అర్హ.. ‘స్టార్’లా ఎదిగిన కిడ్స్ వీరే
ఇవ్వాళ్టి పిల్లలు పెద్దల నీడన దాగుండిపోవడం లేదు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల పిల్లలు.. తల్లిదండ్రుల పాపులారిటీతో పరిచయం అవడానికి ఇష్టపడట్లేదు. ఆ పేరుప్రఖ్యాతులను ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగించుకుని సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటున్నారు. తమ టాలెంట్‌ను చాటుకుంటున్నారు. ఆ లిస్ట్‌లో ఉన్న కొంతమంది లిటిల్ స్టార్స్ గురించి.. ‘ఫన్’టాస్టిక్ సితార చిన్న వయసు నుంచే తనలోని బహుముఖ ప్రజ్ఞను నిరూపించుకుంటోంది మహేశ్ బాబు–నమ్రతా శిరోడ్కర్ వారసురాలు సితార! ‘ఫన్’టాస్టిక్ తార అనే వెబ్ సిరీస్‌కు సితార బ్రాండ్ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తోంది. ‘జన్యాస్ క్లోజట్’ బ్రాండ్ కోసం మోడలింగ్ కూడా చేసింది. దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలసి ఓ యూట్యూబ్ చానెల్‌నూ నిర్వహిస్తోంది. తగ్గేదే లే... ఈ మాట అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హకి సరిగ్గా సరిపోతుంది. సూపర్ యాక్టివ్నెస్తో తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ని క్రియేట్ చేసుకుంది. ముద్దు ముద్దు మాటలు.. ముద్దొచ్చే రూపంతో తన తండ్రి సినిమాల్లోని కొన్ని సీన్స్‌కి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ, డైలాగ్స్ చెప్తూ, పాటలు..డ్యాన్స్‌లతో డిజిటల్ మీడియా వీక్షకులను ఇట్టే ఆకట్టుకుంటోంది అర్హ. ఇలా చిన్న వయసులోనే స్టార్ స్టేటస్‌ని సొంతం చేసుకున్న అర్హ మంచి చెస్ ప్లేయర్ కూడా! ‘మంచు’ సింగర్స్... మంచు విష్ణు కూతుళ్లు అరియానా–వివియానా.. ఇన్‌స్టా స్టార్స్. ఈ ట్విన్ సిస్టర్స్ ఫొటోలు, వీడియోలకు ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందం, అభినయమే కాదు.. మధురమైన గాత్రం కూడా వీరి సొంతం. వాళ్ల నాన్న విష్ణు నటించిన ‘జిన్నా’ సినిమా కోసం ‘ఇదే స్నేహం.. యే హై దోస్తీ’ అనే గీతాన్ని ఆలపించారీ అక్కాచెల్లెళ్లు. ఈ పాట విడుదలైన ఒక్క రోజులోనే 40 లక్షలకు పైగా వ్యూస్‌ను సంపాదించి ట్రెండింగ్‌లో ఉంది. ఇంకోవైపు మంచు లక్ష్మి కూతురు విద్య నిర్వాణ కూడా మై కిసీ సే కమ్ నహీ అంటోంది. పేరుకు తగ్గట్టే చదువులో దిట్ట ఈ బిడ్డ. కరోనా సమయంలో తల్లితో కలసి యూట్యూబ్ వీడియోలు చేసి తన టాలెంట్‌ను ప్రదర్శించింది. అన్నట్టు విద్య కూడా మంచి చెస్ ప్లేయర్. ఇంటి చిరు కొమ్మ.. అమ్మ, నాన్న, తాతకు తగ్గకుండా తన పేరునూ పాపులర్ చేసుకుంటోంది ఐశ్యర్య, అభిషేక్ కూతురు ఆరాధ్య బచ్చన్. శ్రావ్యమైన స్వరంతో క్రిస్మస్ జింగిల్స్.. ఇతర పాటలు పాడుతూ తన ఐడెంటిటీ చాటుకుంటోంది. ‘పవర్’ ఫుల్ డాటర్ పవన్ కల్యాణ్–రేణూ దేశాయ్ కూతురు ఆద్యకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆ అమ్మాయి మొన్నామధ్య గిటార్ వాయిస్తూ పాడిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే! ఆమె గాన మాధుర్యానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. తండ్రిలాగే ఆద్యకు పుస్తకాలు చదవడమన్నా ఎంతో ఇష్టం. -
చిరంజీవి ఫ్యామిలీతో గొడవ? మరోసారి అల్లు అరవింద్ క్లారిటీ!
మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీకి మధ్య సత్సంబంధాలు లేవంటూ సోషల్ మీడియాలో తరచూ పుకార్లు షికార్లు చేస్తుంటాయి. మా మధ్య ఎటువంటి గొడవలు లేవు అని అటు చిరంజీవి, ఇటు అల్లు అరవింద్ ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా ఈ రూమర్లకు చెక్ పడటం లేదు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అరవింద్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. ఎందుకిలా కాంట్రవర్సీలోకి లాగుతారు? మా కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఇక తన మనవరాలు గురించి మాట్లాడుతూ.. 'అర్హ ఎంతో తెలివైనది. ఇంత చిన్న వయసులో అంత తెలివైనవాళ్లను చూడటం చాలా అరుదు. నా మనవరాలు కాబట్టి ఎక్కువ చెప్పుకోకూడదులే' అంటూనే అర్హపై ప్రశంసల వర్షం కురిపించారు అల్లు అరవింద్. చదవండి: గరికపాటికి సారీ చెప్పిన చిరంజీవి అమ్ము ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది, స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
భార్య బర్త్‌డేకి స్పెషల్ విషెస్...గోల్డెన్ టెంపుల్‌కి బన్నీ ఫ్యామిలీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పుట్టిన రోజు నేడు(సెప్టెంబర్ 29). ఈ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ దర్శనానికి వెళ్లాడు బన్నీ. సంప్రదాయ దుస్తులు ధరించి దర్శనం చేసుకున్నారు. పాన్ ఇండియా స్టార్ స్టేటస్ ఉండి కూడా ఒక సాధారణ వ్యక్తిలా గోల్డన్ టెంపుల్ ను సందర్శించడం అల్లుఅర్జున్ లోని సింప్లిసిటీ కి నిదర్శనం అని చెప్పాలి. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ‘హ్యాపీ బర్త్‌డే క్యూటీ’ సోషల్ మీడియా ద్వారా భార్యకు బర్త్‌డే విషెస్ చెప్పాడు బన్ని. స్నేహారెడ్డి కెక్ కట్ చేస్తున్న ఫోటోని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘హ్యాపీ బర్త్‌డే క్యూటీ’అని పోస్ట్ చేశాడు. అల్లు అర్జున్, స్నేహారెడ్డిలది ప్రేమ వివాహం. 2011 మార్చ్ లో వీరి పెళ్లి జరిగింది. 2014లో అబ్బాయి అయాన్, 2016లో అమ్మాయి అర్హ జన్మించారు. Happy Birthday Cutie 💖 pic.twitter.com/LL5nEaOmjg — Allu Arjun (@alluarjun) September 29, 2022 -
కూతురి చేతిలో ఓడిపోయిన బన్నీ
-
కూతురి చేతిలో ఓడిపోయిన బన్నీ.. వీడియో వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తన ముద్దు ముద్దు మాటలు, చేష్టలతో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ఇక అల్లు అర్జున్ కూడా ఏమాత్రం సమయం దొరికినా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా కూతురు అర్హతో కలిసి ఆడుకుంటూ చిన్నపిల్లాడిలా మారిపోతాడు బన్నీ. ఇప్పటికే అర్హకు సంబంధించిన పలు క్యూట్ వీడియోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో వీడియోలను షేర్ చేశాడు బన్నీ. ఇందులో అర్హ గంగిగోవు పాలు గరిటడైనా చాలు.. అదేంటి అని అడగ్గా.. జున్ను అని బన్నీ సమాధానం ఇస్తాడు. అందుకు అర్హ.. అవును నీకెలా తెలుసు అంటూ క్యూట్‌గా అడిగింది. ఇక ఈసారి నాలుగు ఎర్ర లారీలు.. నాలుగు తెల్ల లారీలు అనే లైన్‌ను వేగంగా, కరెక్ట్‌గా చెప్పాలంటూ టంగ్ ట్విస్టర్ ఇస్తుంది. అయితే ఈ ఛాలెంజ్‌లో ఫాస్ట్‌గా చెప్పలేక అల్లు అర్జున్ ఓడిపోతాడు. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బన్నీ పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నాడు. -
టాలీవుడ్లో ‘థర్డ్ థండర్’ షురూ.. ఫ్యాన్స్‌కి పండగే!
ఆకాశంలో ఉరుము.. మంచి మెరుపుతో తన ఉనికిని చాటుతూ శబ్దం చేస్తుంది. కొత్త జాబ్‌లో మెరవాలనుకునేవాళ్లను, తమ టాలెంట్‌తో సౌండ్ చేసేవాళ్లను ‘థండర్’ (ఉరుము)తో పోల్చుతారు. ఇప్పుడు అలా మెరవడానికి తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో మూడో తరం వారసుల ఎంట్రీ షురూ అయింది. ఈ ‘థర్డ్ థండర్’ని చూడటానికి ఆయా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు మహేశ్‌బాబు. ఈ కుటుంబానికి చెందిన మూడో తరం గౌతమ్ (మహేశ్ కుమారుడు) ఆల్రెడీ ‘వన్: నేనొక్కడినే’ చిత్రంలో చైల్డ్ యాక్టర్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేశ్ కుమార్తె సితార కూడా దాదాపు ఎంట్రీ ఇఛ్చినట్లే. మహేశ్ తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’లోని ‘పెన్నీ..’ లిరికల్ వీడియో సాంగ్‌లో సితార అదిరిపోయే స్టెప్లతో అలరించింది. అలాగే కృష్ణ కుమార్తె ప్రియదర్శిని (నటుడు సుదీర్‌బాబు భార్య) కుమారుల్లో చరిత్ మానస్ ‘భలే భలే మగాడివోయ్’, విన్నర్’ వంటి చిత్రాల్లో బాల నటుడిగా నటించాడు. (చదవండి: థియేటర్లో మహేశ్ బాబు ఫ్యాన్స్ హల్చల్.. అద్దాలు ధ్వంసం) సుధీర్ హీరోగా హర్షవర్ధన్ దర్శకత్వంలో రూపొందు తోన్న తాజా సినిమాలో చిన్నప్పటి సుదీర్లా కనిపిస్తాడు చరిత్. అలాగే రెండో కుమారుడు దర్శన్ ‘సర్కారు వారి పాట’లో మహేశ్‌బాబు చైల్డ్ ఎపిసోడ్స్‌లో జూనియర్ మహేశ్‌గా నటించాడు. కాగా కృష్ణ మరో కుమార్తె పద్మావతి (భర్త జయదేవ్ గల్లా) కుమారుడు అశోక్ గల్లా ఆల్రెడీ ‘హీరో’ చిత్రంతో యాక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరో కుమార్తె– నటి–దర్శకురాలు మంజుల తనయ జాన్వీ కూడా ‘మనసుకు నచ్చింది’లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఇటు ప్రముఖ దివంగత నటులు అల్లు రామలింగయ్య యాక్టింగ్ లెగసీని ఆయన మనవడు అల్లు అర్జున్ సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ చేస్తున్నారు (అల్లు రామలింగయ్య కుమారుడు అరవింద్ తెలుగులో అగ్రనిర్మాతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే). ‘శాకుంతలం’ చిత్రంలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. అయితే అల్లు రామలింగయ్య కుటుంబానికి చెందిన నాలుగో తరం అల్లు అర్హ. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘శాకుంతలం’లో ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపిస్తుంది అర్హ. మరి.. అల్లు అర్జున్ కుమారుడు అయాన్ కూడా సినిమాల్లోకి వస్తాడా అనేది చూడాలి. అభిరామ్ ఇక దివంగత ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు కుమారులు సురేశ్‌బాబు నిర్మాతగా, వెంకటేశ్ హీరోగా హిట్టయ్యారు. సురేశ్ పెద్ద కుమారుడు రానా యాక్టర్‌గా మంచి ఫామ్‌లో ఉండగా, చిన్న కుమారుడు అభిరామ్ కూడా యాక్టింగ్‌నే ఎంచుకున్నాడు. తేజ తెరకెక్కించిన ‘అహింస’ చిత్రం ద్వారా అభిరామ్ హీరోగా పరిచయం కానున్నాడు. ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. యువ రాజ్‌కుమార్ కన్నడ కంఠీరవ మనవడు ఎంట్రీ కన్నడంలో కూడా మూడోతరం వారసులు నటన వైపు అడుగులు వేస్తున్నారు. దివంగత ప్రముఖ నటుడు, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ మనవరాలు, కన్నడ యాక్టర్ రామ్‌కుమార్, పూర్ణిమ (రాజ్‌కుమార్ కూతురు)ల తనయ ధన్యా రామ్‌కుమార్ ‘నిన్నా సానిహకే’ ద్వారా హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఇక రాజ్‌కుమార్ కొడుకు, నటుడు–నిర్మాత రాఘవేంద్ర రాజ్‌కుమార్ తనయుడు యువ రాజ్‌కుమార్ సైతం హీరోగా సై అన్నాడు. ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ యువ రాజ్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా నిర్మిస్తోంది. రజ్వీర్ డియోల్, అగస్త్య నంద హిందీలోనూ.. తెలుగు నుంచి ఇంతమంది వారసులు వస్తుండగా అటు హిందీలో కూడా థర్డ్ జనరేషన్ రెడీ అయింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుమార్తె శ్వేతా నంద కుమారుడు అగస్త్య నంద ఎంట్రీ ఖరారైంది. ఈ బిగ్ బి మనవడు జోయా అక్తర్ తెరకెక్కిస్తోన్న ‘ఆర్చీస్’ అనే ఓ వెబ్ షోలో నటిస్తున్నాడు. ఇదే వెబ్ ఫిల్మ్ ద్వారా శ్రీదేవి కుమార్తె ఖుషీ, షారుక్ కుమార్తె సునైనా పరిచయం కానున్నారు. ఇక ప్రముఖ నటుడు ధర్మేంద్ర వారసత్వాన్ని ఆయన కుమారులు సన్నీ. బాబీ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. సన్నీ చిన్న కొడుకు రజ్వీర్ డియోల్ ఎంట్రీ ఖరారైపోయింది. అవనీష్ బర్జాత్యా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ద్వారా రజ్వీర్ పరిచయం అవుతున్నారు. ఇక సన్నీ డియోల్ పెద్ద కుమారుడు అంటే రజ్వీర్ డియోల్ సోదరుడు కరణ్ డియోల్ ఆల్రెడీ నటుడిగా కొనసాగుతున్నాడు. సినిమాల్లోకి ఎంట్రీ కార్డ్ ఈజీ అయినప్పటికీ ఈ వారసులపై అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలను చేరుకుంటే ఫ్యాన్స్‌కి పండగే. వీరే కాదు.. మూడో తరానికి చెందిన మరికొందరు వారసులు తమ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘కచ్చా బాదం’ పాటకు అర్హ డ్యాన్స్, వీడియో షేర్ చేసి మురిసిపోయిన బన్నీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటుంది. తండ్రికి తగ్గ తనయ అంటూ అందరి మన్నలు పొందుతుంది. ఇంతకి అసలు విషయం ఎంటంటే. ఆర్హ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో తెలిసిన విషయమే. తన చేసే అల్లరి, క్యూట్ వీడియోలు, తండ్రితో కలిసి సరదాగా ఆడుకుంటున్న వీడియోలు తరచూ సోషల్ మీడియా తరచూ దర్శనం ఇస్తుంటాయి. తండ్రికూతుళ్లు చేసే అల్లరి బన్నీ భార్య అల్లు స్నేహా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మురిసిపోతుంది. చదవండి: Sudheer Babu: కెమెరామెన్ అలా అనడంతో గదిలోకి వెళ్లి ఏడ్చాను అయితే ఈసారి అర్హ ఓ వైరల్ పాటకు కాలు కదిపింది. ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్న కచ్చా బాదం పాటకు అర్హ డ్యాన్స్ చేసిన బన్నీ షేర్ చేశాడు. ‘మై లిల్ బాదాం అర్హ’ బన్నీ ఈ వీడియోకు కాప్షన్ ఇచ్చాడు. అర్హ డ్యాన్స్‌కు నెటిజన్లు ఆయన ఫాలోవర్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. బన్నీ సినిమాలకు సంబంధించిన పాపులర్ డైలాగ్స్‌తో అర్హపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘మేడం సార్ మేడం అంతే అంతే, తండ్రికి తగ్గ తనయ.. చూడముచ్చటగా ఉంది. ఎక్కడా అర్హ తగ్గేదేలే’ అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
నాన్నకు వెరైటీగా స్వాగతం పలికిన అల్లు అర్హ.. మురిసిపోయిన బన్నీ
పుష్పకు ముందు అల్లు అర్జున్ పేరు టాలీవుడ్ , మాలీవుడ్ లోనే రిపీటెడ్ గా వినిపించేది. కాని పార్ట్ 1 రిలీజైన తర్వాత బన్ని క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా మారింది. గతేడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ మూవీ.. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. బన్నీ కెరీర్లోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. అంచనాలకు మించి ఉత్తరాదిన రూ.100 కోట్లు కొల్లగొట్టి మరోసారి టాలీవుడ్ సత్తాని చూపించాడు. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప’సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. సెలబ్రెషన్స్ కోసం దుబాయ్ వెళ్లి.. అక్కడి అందాలను ఆస్వాదించాడు. దాదాపు 16 రోజుల తర్వాత అల్లు అర్జున్ తిరిగి హైదరాబాద్ వచ్చాడు. ఈ సందర్భంగా బన్నీకి ఆయన ముద్దుల తనయ అల్లు అర్హ వెరైటీ స్వాగతం పలికి సర్ప్రైజ్ చేసింది. గులాబీ పూల రెక్కలు, ఆకులతో ‘వెల్కమ్ నాన్న’అని రాసి బన్నీకి ఇంట్లోకి స్వాగతం చెప్పింది. తన కూతురు చెప్పిన వెరైటీ స్వాగతానికి అల్లు అర్జున్ మురిపిపోయాడు. ఆ ఫోటోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. ‘పదహారు రోజుల తరువాత స్వీటెస్ట్ వెల్కమ్` అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ అయింది. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
‘తగ్గేదే లే’ డైలాగ్‌తో తండ్రి మ్యానరిజం చూపించిన అయాన్, ఆర్హ
Allu Arha And Allu Ayaan: అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి డైరెక్టర్లు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, మారుతి, వెంకీ కుడుముల, బుచ్చిబాబు సనతో పాటు నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా బన్నీ ఇండస్ట్రీకి దొరికిన బహుమతి అంటూ అల్లు అర్జున్‌పై రాజమౌళి ప్రశంసలు కురిపంచాడు. ఈ వెంట్లో అల్లు అర్జున్‌తో పాటు హీరోయిన్ రష్మిక మందన్నా, అనసూయ, సునీల్‌తో పాటు మిగతా తారగణం పాల్గొంది. కానీ దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాత్రం రాలేకపోయారు. చదవండి: సమంతకు థ్యాంక్స్ చెప్పిన బన్నీ ఈ ఈ ప్రీ రిలీజ్ కార్యక్రమంలో రష్మిక తన క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్, డ్యాన్స్, మాటలతో సందడి చేసింది. ఇదిలా ఉంటే ఈ వేడుకలో ఇద్దరు బుల్లి సెలబ్రెటీలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వారెవరో కాదు ఐకాన్ స్టార్ తనయుడు అయాన్, తనయ ఆర్హ. తండ్రితో పాటు ఈవెంట్‌కు వచ్చిన అయాన్, అర్హలు ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అల్లు అర్హ, అల్లు అయాన్లు పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై చేసిన హడావిడి అందరినీ ఆకట్టుకుంది. ఇక వీరిద్దరూ చెప్పిన డైలాగ్స్ అయితే స్పెషల్‌గా నిలిచాయి. చదవండి: అప్పుడే ఓటీటీకీ ‘ఆర్ఆర్ఆర్’.. ఫ్యాన్సీ రేటుకు నెట్‌ఫ్లిక్స్ డీల్! స్టేజ్‌పై వచ్చిన వారిని హోస్ట్ సుమ ఎవరూ మాట్లాడతారని అడగంతో అయాన్ నేను అంటూ చేతులు ఎత్తాడు. దీంతో సుమ మైక్ ఇచ్చింది. వెంటనే ‘ హాలో.. తగ్గేదే లే’ అంటూ తండ్రి మ్యానరిజాన్ని చూపించాడు అయాన్. ఆ తర్వాత ఆర్హ సైతం మైక్ తీసుకుని నమస్తే అంటూ తండ్రి స్టైల్లో ‘తగ్గేదే లే’ డైలాగ్ చెప్పి విజిల్స్ వేయించింది. ఇలా అయాన్, ఆర్హలు వచ్చి క్యూట్ క్యూట్ తండ్రి డైలాగ్ చెప్పడంతో అక్కడ ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. అయాన్, ఆర్హల అల్లరిని చూసి తండ్రి అల్లు అర్జున్, తాత అల్లు అరవింద్‌లు మురిపిపోయిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. -
ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫాపై అర్హ బర్త్‌డే వేడుకలు
Allu Arjun And Sneha Celebrates Arha 5th Birthday At Burj Khalifa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ నేడు(నవంబర్ 21) ఆరో వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ బర్త్‌డే వేడుకను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనుకున్నాడు బన్నీ. ఇందుకోసం ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం బుర్జ్ ఖలీఫాను ఎంచుకున్నాడు. అనుకున్నదే తడవు ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌కు చెక్కేశాడు. బుర్జ్ ఖలీపాపై అర్హతో కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకలు జరిపాడు. ఈ భవంతిపై ఈ రేంజ్లో బర్త్‌డే పార్టీ జరుపుకున్న మొదటి వ్యక్తి అర్హనే అంటూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు. ప్రస్తుతం అర్హ బర్త్‌డే ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా అర్హ 'శాకుంతలం' సినిమాతో వెండితెరపై అడుగు పెడుతున్న విషయం తెలిసిందే! క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అర్హ భరతుడిగా నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో శాకుంతలగా సమంత నటిస్తుండగా, మలయాళ యంగ్ హీరో దుశ్యంతుడిగా నటిస్తున్నాడు. శకుంతల, దుష్యంతుడి కుమారుడైన భరతుడు పాత్రలో అర్హ సందడి చేయనుంది. -
అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ క్యూట్ ఫోటోస్
-
అల్లు అర్హకు తల్లి స్నేహా బర్త్‌డే స్పెషల్ గిఫ్ట్.. వీడియో వైరల్
Allu Arha Birthday Special Gift From Parents And Video Viral: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలిసేంది. ఖాళీ సమయం దొరికితే భార్య ఇద్దరు పిల్లలతో ఆయన సరదాగా గడుపుతుంటారు. ఇక అల్లు అర్జున్ భార్య స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. బన్నీతో పాటు తన పిల్లలు అయాన్, అర్హలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. అలాగే అల్లు అర్జున్ న్ కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఇవాళ (నవంబర్ 21) అల్లు అర్జున్-స్నేహ దంపతుల ముద్దుల కూతురు అర్హ పుట్టినరోజు. నవంబర్ 21, 2016న పుట్టిన అర్హ నేడు ఐదేళ్లు పూర్తి చేసుకుని ఆరో వసంతంలోకి అడుగుపెడుతోంది. దీనికి సంబంధించిన ఓ వీడియోను స్నేహ తన ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేశారు. అందులో అర్హ చెస్ గేమ్ ఆడుతూ సందడి చేస్తుంది. ఒక్కొక్క చేస్ గేమ్ బోర్డులో పావులు కదుపుతూ, కేరింతలు కొడుతూ, నవ్వుతూ చిందులేస్తు కనిపిస్తుంది. తన గేమ్‌ను అల్లు అర్జున్ కుటుంబం చప్పట్లు ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అనంతరం తాను గెలుచుకున్న బహుమతులను చూపిస్తూ ఉంటుంది అర్హ. అర్హను, తాను ఆడే ఆట తీరును అల్లు అర్జున్, స్నేహ ప్రేమగా చూస్తూ ఆనందిస్తుంటారు. అల్లు అరవింద్ తన మనవరాలిని ముద్దు చేస్తూ కనిపిస్తారు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) చదవండి: ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా..’ సాంగ్ రిలీజ్ -
మట్టి గణేశుడ్ని తయారు చేసిన అల్లు అర్హా... అభిమానులు ఫిదా
దేశవ్యాప్తంగా భక్తులు వైభవంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. ఆ పండుగ సందర్భంగా టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి ఆర్హా అభిమానుల మనసులు దోచుకుంటోంది. వివరాల్లోకి వెళితే..వివిధ రకాల కెమికల్స్‌తో తయారు చేసే గణేశుడి విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందని తెలిసిందే. ఈ విషయాన్నే చెబుతూ ఎంతోమంది టాలీవుడ్ స్టార్స్ ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను పూజించేలా అభిమానుల్లో అవగాహన కలిగిస్తుంటారు. అలాంటి వాటిలో అల్లు అర్జున్ ఎప్పుడు ముందుంటారు.. కాగా ఈ వినాయక చవితి సందర్భంగా ఆయన కూతురు ఆర్హా తన చిట్టి చేతులతో మట్టి గణేశుడ్ని తయారు చేసింది. కాలుష్య రహిత పండుగను ప్రోత్సహించేలా ఉన్న ఈ పిక్ చూసిన ‘వావ్ ఆర్హా’ అంటు ఫిదా అవుతున్నారు. Cutie Arhalu ❤️😘#GaneshChaturthi Vibes ✨#AlluArjun #Allusnehareddy#AlluAyaan #AlluArha@alluarjun || #AA20 #Pushpa pic.twitter.com/VsFcGZYx15 — Dinesh krishna AADHF™ 🥳 (@dinesh_krishna) September 9, 2021 -
షూటింగ్ కంప్లీట్ చేసుకున్న అల్లు అర్హ: ఫోటోలు వైరల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ శాకుంతలం సినిమాతో వెండితెరపై అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమానే పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్హ భరతుడి పాత్ర పోషిస్తుంది. తాజాగా శాకుంతలంలో అర్హకు సంబంధించిన షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ ఆమెకు గ్రాండ్‌గా వీడ్కోలు పలికింది. ఈ సెలబ్రేషన్స్‌లో అల్లు అర్జున్‌తో పాటు ఆయన భార్య స్నేహారెడ్డి కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో శాకుంతలగా సమంత నటిస్తుండగా, మలయాళ యంగ్ హీరో దుశ్యంతుడిగా నటిస్తున్నాడు. శకుంతల, దుష్యంతుడి కుమారుడైన భరతుడు పాత్రలో అర్హ కనిపించనుంది. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
ఒకే లొకేషన్లో తండ్రి కూతురు షూటింగ్
-
భరతుడిని కలిసిన 'పుష్ప'.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
Pushpa Meets Bharata In Shakunthalam : అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప మూవీ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు అల్లు అర్హ శాకుంతలం షూటింగ్లో పాల్గొంటుంది. అయితే తాజాగా వీరిద్దరి షూటింగ్ లొకేషన్లు ఒకే దగ్గర ఉండటంతో కూతురిని చూసేందుకు బన్నీ మరోసారి శాకుంతలం సెట్లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఫోటోను షేర్ చేస్తూ.. 'అర్హ, నేను ఒకే లొకేషన్లో వేరు వేరు చిత్రాల్లో నటిస్తున్నాం. ఇలాంటి రోజు ఓ 15-20 ఏళ్ల తర్వాత ఉంటుందనుకున్నా. కానీ ఇంత త్వరగా వచ్చేసింది.. పుష్ప శాకుంతలంలోని భరతుడిని కలిశాడు. ఇది ఎప్పటికి గుర్తిండిపోతుంది' అంటూ బన్నీ ఎమోషనల్ అయ్యారు. ఇక అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ ఈ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో శాకుంతలగా సమంత నటిస్తుండగా, మలయాళ యంగ్ హీరో దుశ్యంతుడిగా నటిస్తున్నాడు. శకుంతల, దుష్యంతుడి కుమారుడైన భరతుడు పాత్రలో అర్హ కనిపించనుంది. Today my daughter Arha and I are shooting for different films at the same location. So, got to visit her set. I was expecting something like this to happen maybe after 15-20 years. But it happened so soon. PUSHPA meets BHARATA in SHAAKUNTHALAM. What a memorable coincidence 💖 pic.twitter.com/4J3mMZmmBj — Allu Arjun (@alluarjun) August 9, 2021 -
శాకుంతలం సెట్‌కి వెళ్లిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్
Allu Arjun Visits Shakunthalam Sets: సమంత, గుణశేఖర్ కాంబినేషన్లో ప్రస్తుతం శాకుంతలం సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్హ వెండితెరపై ఎంట్రీ ఇవ్వనుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్హ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక కూతురు పర్ఫార్మెన్స్ చూసేందుకు అల్లు అర్జున్ స్వయంగా శాకుంతలం సెట్‌కి వచ్చారు. ఈ సందర్భంగా కూతురి నటనను చూసి బన్నీ మురిసిపోయినట్లు సమాచారం. ఆల్లు అర్జున్‌తో పాటు భార్య స్నేహ రెడ్డి, కొడుకు అల్లు అయాన్లు కూడా సెట్‌కి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో శాకుంతలగా సమంత నటిస్తుండగా, మలయాళ యంగ్ హీరో దుశ్యంతుడిగా నటిస్తున్నాడు. శకుంతల, దుష్యంతుడి కుమారుడైన భరతుడు పాత్రలోనే అల్లు అర్హ కనిపించనున్నట్లు సమాచారం. కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. క్రిస్మస్ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ ఫార్ట్ విడుదల కానుంది. -
శాకుంతలం సెట్లో అల్లు అర్హ.. మేకప్ వీడియో వైరల్
అల్లు అర్జున్ గారాల పట్టి అర్హకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తన ముద్దు ముద్దు మాటలు, చేష్టలతో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ అల్లువారి ముద్దుల తనయ సంబంధించిన మేకప్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘శాకుంతలం’.హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో గుణశేఖర్ రూపొందిస్తుండగా.. గుణ టీం వర్క్స్ బ్యాన్పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అర్హ ఓ కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్లో పాల్గొంది అర్హ. కారవాన్‌లో అర్హ క్యూట్‌గా మేకప్ వేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు టీం. మేకప్ వేస్తుండగా భలే ముద్దుగా కూర్చుని ఉంది అర్హ. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. #AlluArha is back on the sets. The little Prince Bharata joins the ongoing schedule of the mythological drama #Shaakuntalam, which is currently underway in Hyderabad @alluarjun @Samanthaprabhu2 @Gunasekhar1@neelima_guna @neeta_lulla @GunaaTeamworks pic.twitter.com/l03FKZFBrK — Shreyas Sriniwaas (@shreyasmedia) August 3, 2021 -
సోషల్ హల్చల్: అల్లరి అర్హ ఆట.. సమంత ‘పూల’మాట
పువ్వులు ఎల్లప్పుడు సంతోషాన్ని పంచుతాయని నేను నమ్ముతున్నాను. మీ గార్డెన్లో పూల మొక్కలు ఉండేలా చూసుకొంది. అవి మన మనసుకు మెడిసిన్‌లా పనిచేస్తాయని చెబుతోంది నటి సమంత. అల్లు అర్హ అల్లరి ఆటలను కెమెరాలో బంధించి అభిమాలతో పంచుకుంది అల్లు అర్జున్ సతీమణి స్నేహ. సండే మూడ్ అంటూ ఓ హాట్ ఫోటోని అభిమాలతో పంచుకుంది పొడుగు కాళ్ల సుందరి ప్రగ్యా జైశ్వాల్ వండర్ ఉమెన్ అంటూ ఓ ఫోటోని షేర్ చేసింది బుట్టబొమ్మ. సోనూసూద్ రిక్షావాలా అయ్యాడు. గేదెలకు పశుగ్రాసం తీసుకెళుతున్న రైతును ఆపి స్వయంగా సోనూ రిక్షా నడిపాడు. ఆ ఫోటోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Sonu Sood (@sonu_sood) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Shobhita Rana (@shobhitaranaofficial) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) -
అల్లు అర్జున్ ఇంట్లో క్యూట్ దెయ్యాలు.. వీడియో వైరల్
అల్లు అర్జున్ ఇంట్లో రెండు దెయ్యాలు పడ్డాయి. అవును.. అవి మాములు దెయ్యాలు కావు.. అల్లరి చేసే పిల్ల దెయ్యాలు. ఇళ్లంతా తిరుగుతూ నానా హంగామా చేసే క్యూట్ దెయ్యాలు. ఈ పిల్ల దెయ్యాలు ఎవరో కాదు అల్లు అర్జున్ పిల్లలు అర్హ, అయాన్. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే అల్లు అర్జున్ సతీమణి ఈ క్యూట్ దెయ్యాల వీడియోని తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన పిల్లలకు ఉన్నచోటే వినోదాన్ని అందిస్తోంది స్నేహ. పిల్లలకు రకరకాల గెటప్ వేసి ఆడిస్తోంది. వాటికి సంబంధిన వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చేరవేస్తుంది స్నేహ. తాజాగా ఆమె షేర్ చేసిన దెయ్యాల వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. అందులో అర్హ, అయాన్లు తెల్లటి వస్త్రాలు ధరించి, దెయ్యాల గెటప్‌లో ఉన్నారు. ముఖాలకు కళ్లద్దాలు పెట్టుకొని క్యూట్ డ్యాన్స్ చేస్తూ భయపెట్టే ప్రయత్నం చేశారు. . ఇక ఇందులో బుల్లి అర్హ వేసిన చిన్న స్టెప్పులు మాత్రం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
శాకుంతలంలో అల్లు అర్హ: ఫుల్ ఖుషీలో బన్నీ
Allu Arha In Shakuntalam: ఇండస్ట్రీలో తొలి సినిమా ఎంతో ప్రత్యేకం. కెరీర్‌కు పునాది వేసే మొదటి సినిమాకు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు సెలబ్రిటీలు. అంతేకాదు, వెండితెరపై వారి పిల్లల ఎంట్రీ కూడా ఘనంగా ఉండేలా చూసుకుంటారు. అందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అతీతం కాదు. తన గారాలపట్టి అర్హ సినీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ చేశాడు. అది కూడా బడా హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న 'శాకుంతలం' సినిమా ద్వారా ఆమెను నటిగా ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు. అయితే తన క్యూట్, స్వీట్, అల్లరి చేష్టలతో అర్హ ఈపాటికే తెలుగు ప్రేక్షకులను తన బుట్టలో వేసుకుంది. మరి ఇప్పుడు ఏకంగా నటించే చాన్స్ వచ్చిందంటే జనాలను ఏ రేంజ్లో అలరిస్తుందో చూడాలంటున్నారు అభిమానులు. తన కూతురి సినీ ఎంట్రీ సమంత సినిమా ద్వారా జరుగుతుండంపై హర్షం వ్యక్తం చేశాడు బన్నీ. 'సమంతతో వైవిధ్యమైన జర్నీ కొనసాగించాను. ఆమె సినిమా ద్వారా అల్లు అర్హ నటిగా పరిచయం అవుతుండటం చాలా సంతోషంగా ఉంది. శాకుంతలం సినిమా టీమ్‌కు ఇవే నా అభినందనలు' అంటూ ట్వీట్ చేశాడు. ఇక అల్లువారి చిట్టితల్లి బిగ్స్క్రీన్పై సందడి చేయబోతుందని తెలిసిన అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. సమంత, అర్హను ఒకే స్క్రీన్ మీద చూడబోతున్నామని తెగ ఎగ్జైట్ అవుతున్నారు. I had an altogether different journey with @Samanthaprabhu2 and am happy to watch Arha debut with her movie. My best wishes to the entire Cast & Crew of #Shakuntalam — Allu Arjun (@alluarjun) July 15, 2021 పీరియాడికల్ మూవీ శాకుంతలం విషయానికి వస్తే ఇందులో సమంత ప్రధాన పాత్రలో నటిస్తోంది. దుష్యంతుడు- శకుంతల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శకుంతల పాత్రలో సమంత, గుణశేఖర్ పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం సమంత నాలుగు నెలలపాటు క్లాసికల్ డ్యాన్సులు కూడా నేర్చుకుంది. శాకుంతలం కొడుకు భరత్ పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ లేదా అల్లు అర్జున్ కొడుకు అయాన్లలో ఎవరో ఒకరు నటించేలా ఒప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారట! ఈ సినిమాను 'దిల్' రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై గుణశేఖర్ కుమార్తె నీలిమ నిర్మిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
Allu Arha : బిగ్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అయిన అల్లు అర్హ!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. తన ముద్దు ముద్ద మాటలు, అల్లరి చేష్టలతో అందరినీ ఆకట్టుకుంటుంది. తన క్యూట్‌నెస్‌తో ఇప్పటికే అభిమానుల్లో క్రేజ్ సంపాదించుకుంది. అర్హకు సంబంధించి ఫోటోలు, వీడియోలను స్నేహరెడ్డి, బన్నీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. దీంతో నాలుగేళ్ల వయసులోనే అర్హ బోలెడంత పాపులారిటీని సంపాదించుకుంది. త్వరలోనే ఈ చిన్నారి సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనున్నట్లు సమాచారం. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో అర్హ ప్రధాన పాత్రలో కనిపించనుందట. ఈ కథకు అర్హ అయితే సరిగ్గా సరిపోతుందని మేకర్స్ భావించారట. దీంతో అల్లు ఫ్యామిలీని దిల్‌రాజు ఇప్పటికే సంప్రదించినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే అర్హ టాలీవుడ్‌కు పరిచయం అవబోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
అల్లు అర్హ, స్నేహల క్యూట్ వీడియో వైరల్
అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. బన్నీతో పాటు తన పిల్లలు అయాన్, అర్హలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. ఆమె షేర్ చేసిన వీడియోలు, ఫోటోలు వైరల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇటీవల అర్హకు చేయించిన ఫోటోషూట్ పిక్స్ ఎక్కువగా షేర్ చేసింది స్నేహ. ఆ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్హకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రీసెంట్గా బన్నీ ఫ్యామిలీలో ఓ ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్లో తన కూతురిని రెడీ చేయిస్తున్న ఓ వీడియోని షేర్ చేసింది స్నేహ. అందులో అర్హ పాప క్యూట్ స్మెల్ కుందనపు బొమ్మలా కనిపిస్తోంది. ఇక ఈ వీడియో చూసిన బన్నీ ఫ్యాన్స్.. లిటిల్ ప్రిన్సెస్ అంటూ అర్హని పొగడ్తలతో ముంచేస్తున్నారు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
అల్లరి అర్హ.. సోదరుడి భూజాలపై అలా.. క్యూట్ పిక్ వైరల్
అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. బన్నీతో పాటు తన పిల్లలు అయాన్, అర్హలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. ఆమె షేర్ చేసిన వీడియోలు, ఫోటోలు వైరల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే అతి తక్కువ సమయంలోనే ఇన్‌స్టాలో ఆమెను 4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇదిలా ఉంటే..తాజాగా అల్లు స్నేహ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ క్యూట్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో అల్లు అయాన్ తన సోదరి అర్హని భూజాన ఎత్తుకొని తిప్పుతున్నాడు. ఇక అన్నయ్య భూజాన ఎక్కిన అర్హ.. నవ్వుతూ ఫోటోకి ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ‘క్యూట్ బ్రదర్ అండ్ సిస్టర్’, ‘అన్నా,చెల్లిల ప్రేమ అంటే ఇదే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) చదవండి: అల్లు అర్జున్ సతీమణి స్నేహ సరికొత్త రికార్డు అప్పుడు నా బరువు జాతీయ సమస్యలా మారింది: హీరోయిన్ -
ఇంత చిన్న వయసులో ఎంత తెలివో.. అల్లు అర్హ వీడియో వైరల్
అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. నాలుగేళ్ల ఈ చిన్నారి ముద్దు ముద్ద మాటలు, అల్లరి చేష్టలతో అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ వయసులోనే తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. కాగా ఈ చిన్నారి చేష్టలను అప్పుడప్పుడు అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ఇద్దరు తమ తమ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా స్నేహారెడ్డి అర్హకు సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు. ఆ వీడియోలో అర్హ.. చెస్ ఆడాటానికి సిద్ధం అవుతూ.. పావులను సెట్ చేసుకుంటూ కనిపిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన బన్నీ ఫ్యాన్స్ అర్హ చెస్ కోసం పావులను సిద్ధం చేయడం చూసి ఆమెను అభినందిస్తున్నారు. ఇంత చిన్న వయస్సులోనే అర్హకు ఎంత తెలివో.. సో క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) చదవండి: నాగచైతన్య కార్ల కలెక్షన్స్ చూస్తే కళ్లు తిరగడం ఖాయం! సింగిల్ అంటు కన్నుకొట్టిన వనితపై నెటిజన్ ఫైర్, నటి చురకలు