ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటుంది. తండ్రికి తగ్గ తనయ అంటూ అందరి మన్నలు పొందుతుంది. ఇంతకి అసలు విషయం ఎంటంటే. ఆర్హ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో తెలిసిన విషయమే. తన చేసే అల్లరి, క్యూట్ వీడియోలు, తండ్రితో కలిసి సరదాగా ఆడుకుంటున్న వీడియోలు తరచూ సోషల్ మీడియా తరచూ దర్శనం ఇస్తుంటాయి. తండ్రికూతుళ్లు చేసే అల్లరి బన్నీ భార్య అల్లు స్నేహా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మురిసిపోతుంది.
చదవండి: Sudheer Babu: కెమెరామెన్ అలా అనడంతో గదిలోకి వెళ్లి ఏడ్చాను
అయితే ఈసారి అర్హ ఓ వైరల్ పాటకు కాలు కదిపింది. ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్న కచ్చా బాదం పాటకు అర్హ డ్యాన్స్ చేసిన బన్నీ షేర్ చేశాడు. ‘మై లిల్ బాదాం అర్హ’ బన్నీ ఈ వీడియోకు కాప్షన్ ఇచ్చాడు. అర్హ డ్యాన్స్‌కు నెటిజన్లు ఆయన ఫాలోవర్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. బన్నీ సినిమాలకు సంబంధించిన పాపులర్ డైలాగ్స్‌తో అర్హపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘మేడం సార్ మేడం అంతే అంతే, తండ్రికి తగ్గ తనయ.. చూడముచ్చటగా ఉంది. ఎక్కడా అర్హ తగ్గేదేలే’ అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment