'పుష్ప 2' మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌తో ప్రమోషన్స్ షురూ చేశారు. మరోవైపు బన్నీ కూడా అన్‌స్టాపబుల్ షోలో పాల్గొని మూవీని ప్రమోట్ చేస్తూనే తన వ్యక్తిగత విషయాల్ని కూడా చెప్పాడు. అయితే బన్నీ ఎపిసోడ్స్‌ని రెండుగా చేశారు. గతవారం ఒకటి రిలీజ్ చేయగా.. ఈ శుక్రవారం మరో ఎపిసోడ్ విడుదల చేస్తారు. ఈ మేరకు లేటెస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‌కి పెళ్లి సెట్!)
ఇందులో అల్లు అర్జున్‌తో పాటు కొడుకు అయాన్, కూతురు అర్హ షోలో కనిపించారు. హోస్ట్ బాలకృష్ణ.. అర్హ నీకు తెలుగు వచ్చా అని అడిగేసరికి.. 'అటజనికాంచె భూమిసురు డంబరచుంబి..' అని పదో క్లాస్‌లో చాలామంది చదువుకున్న పద్యాన్ని ఆపకుండా చెప్పేసింది. ఇది చూసి బన్నీ, బాలయ్య తెగ మురిసిపోయారు.
వ్యక్తిగత విషయాలతో పాటు 'పుష్ప 2' గురించి అల్లు అర్జున్-హోస్ట్ బాలకృష్ణ మాట్లాడుకున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కి కూడా ఫోన్ చేసి మూవీ గురించి మాట్లాడారు. చివరలో బన్నీ మాట్లాడుతూ.. ఇప్పటివరకు మాస్ చూశారు, ఊరమాస్ చూశారు.. 'పుష్ప 2'తో జాతర మాస్ చూస్తారని ఓ రేంజ్ ఎలివిషన్ ఇచ్చాడు. ఈ శుక్రవారం ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది.
(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు డబ్బింగ్ సినిమా)
Comments
Please login to add a commentAdd a comment