అమ్మాయిలకు అన్యాయం జరిగితే కోపం వచ్చేస్తుంది: అల్లు అర్జున్ | Allu Arjun Unstoppable 4 Promo | Sakshi
Sakshi News home page

Allu Arjun: బయటపడని బన్నీ.. 'అన్‌స్టాపబుల్' ప్రోమో రిలీజ్

Nov 10 2024 10:59 AM | Updated on Nov 10 2024 11:54 AM

Allu Arjun Unstoppable 4 Promo

డిసెంబరు 5న 'పుష్ప 2'తో అల్లు అర్జున్ రాబోతున్నాడు. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. దేశంలో ఏడు ప్రధాన నగరాల్లో గ్రాండ్ ఈవెంట్స్ ఉంటాయని నిర్మాతలు ప్రకటించారు. ఇంతలో బన్నీ కూడా ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు. బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్' షోలో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోని ఇప్పుడు రిలీజ్ చేశారు.

ప్రోమో బట్టి చూస్తే జాతీయ అవార్డ్ రావడంపై బన్నీ స్పందించాడు. తెలుగు వాళ్లకు ఇంతవరకు రాలేదు. దీన్ని రౌండప్ చేసి ఎలాగైనా కొట్టాలి అని ఫిక్సయ్యాను, ఇప్పుడు దక్కింది అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. యాక్షన్ ఇష్టమా? రొమాన్స్ ఇష్టమా? అని బాలయ్య అడగ్గా.. తొక్కలో యాక్షన్ సర్ అని నవ్వుతూ మరీ మనసులో మాట బయటపెట్టాడు. షోకి అల్లు అర్జున్ తల్లి నిర్మల కూడా వచ్చారు.

(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి క్యూట్ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక)

చిన్నప్పుడు ఎప్పుడైనా కొట్టారా? అని బాలకృష్ణ అడిగితే బన్నీ మాట్లాడుతూ.. ఒక్కటా, దేనితో కొట్టలేదా అని అడిగిండి. అన్ని వెపన్స్ ఉపయోగించారు. అందుకే ఇలా సినిమాలు చేస్తున్నాం అని తాను చిన్నప్పుడు చేసిన అల్లరి గురించి ఫన్నీగా చెప్పాడు. ఏ వెపన్ వల్ల నువ్వు మారావ్ అనుకోవచ్చు అని బాలకృష్ణ అడగ్గా.. స్నేహారెడ్డి అనే వెపన్ వల్ల మారానని సెటైరికల్‌గా చెప్పుకొచ్చాడు.

ఏ విషయంలో కోపం వస్తుంటుంది అని అడగ్గా.. బయటకు చెప్పకపోవచ్చు, కానీ అమ్మాయిలకు ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం కోపం వచ్చేస్తూ ఉంటుందని అల్లు అర్జున్ చెప్పాడు. చివరలో కొత్త మూవీ గురించి మాట్లాడుతూ.. మీరు పుష్ప 3 చేయండి, నేను అఖండ 3 చేస్తాను అని బన్నీ, బాలయ్యతో అన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ 'పుష్ప' మేనరిజమ్‌తో నడుస్తూ 'తగ్గేదే లే' అని చేసి చూపించారు. ఓవరాల్‌గా చూస్తే ప్రోమోలో అయితే బన్నీ పెద్దగా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పలేదు. ఫుల్ ఎపిసోడ్‌లో ఏమైనా ఉంటాయేమో చూడాలి?

(ఇదీ చదవండి: ఆర్జీవీ మేనకోడలు పెళ్లిలో రష్మిక, విజయ్ దేవరకొండ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement