అల్లు అర్జున్‌కి క్యూట్ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక | Rashmika Gift Silver To Allu Arjun Before Pushpa 2 Release | Sakshi

Allu Arjun: దీపావళికి గిఫ్ట్.. ఇప్పుడు బయటపెట్టిన బన్నీ

Nov 10 2024 7:19 AM | Updated on Nov 10 2024 9:22 AM

Rashmika Gift Silver To Allu Arjun Before Pushpa 2 Release

అల్లు అర్జున్ 'పుష్ప 2' రిలీజ్ టెన్షన్‌తో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనైనా డిసెంబర్ 5కి రావాల్సిందే అనే టార్గెట్‍‌తో బిజీబిజీగా ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్స్ కొత్తోళ్లు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం పనిచేస్తున్నారనే రూమర్స్ గురించి పక్కన పెడితే ఇప్పుడు ఓ విషయం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.

సినిమా రిలీజ్‌కి మరికొన్ని రోజులు ఉందనగా.. ఇందులోనే హీరోయిన్‌గా చేస్తున్న రష్మిక హీరో అల్లు అర్జున్‌కి క్యూట్ అండ్ స్వీట్ గిఫ్ట్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోని బన్నీ తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశాడు.

(ఇదీ చదవండి: ప్రభాస్ ఫొటో లీక్.. కేసు పెట్టిన 'కన్నప్ప' టీమ్)

'ఎవరికైనా వెండి బహుమతిగా ఇస్తే వాళ్లకు అదృష్టం కలిసొస్తుందని మా అమ్మ చెప్పేది. ఈ చిన్న వెండి వస్తువు, స్వీట్స్.. మీకు మరింత అదృష్టం తీసుకొస్తుందని అనుకుంటున్నాను. మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు' అని రష్మిక మందాన్న రాసుకొచ్చింది. 'ఇప్పుడు చాలా అదృష్టం కావాలి డియర్' అని 'పుష్ప 2' గురించి పరోక్షంగా ప్రస్తావించాడు.

'పుష్ప' కోసం తొలిసారి అల్లు అర్జున్-రష్మిక కలిసి పనిచేశారు. ఇప్పుడు 'పుష్ప 2' కోసం పాన్ ఇండియా లెవల్లో మరోసారి మ్యాజిక్ చేయబోతున్నారు. మూవీపై అయితే భారీ అంచనాలు ఉన్నాయి. నవంబర్ 17న ట్రైలర్ రిలీజ్ ఉందనే రూమర్స్ వస్తున్నాయి.

(ఇదీ చదవండి: డబుల్‌ ఎలిమినేషన్‌.. గంగవ్వతోపాటు హరితేజ కూడా!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement