
బిగ్‌బాస్ షో మొదలై రెండు నెలలపైనే అవుతోంది. వారాలు గడిచేకొద్దీ హౌస్‌లో జనాలు పలుచనవుతున్నారు. మున్ముందు వారాలు మరింత కఠినంగా ఉండనున్నాయి. ఇక ఈ వారం నిఖిల్, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ, గౌతమ్ కృష్ణ, పృథ్వీ, హరితేజ నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో నిఖిల్, విష్ణు, గౌతమ్‌ల గురించి ఆలోచించాల్సిన పని లేదు. వారికి ఓట్లు గట్టిగానే పడుతున్నాయి. ప్రేరణ ఓటు బ్యాంక్ కూడా బాగానే పెరిగింది. మిగిలిందల్లా పృథ్వీ, యష్మి, హరితేజ.
ఎవరు సేఫ్?
ఈ ముగ్గురిలో ఎవరు సేఫ్ అవుతారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు? అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే హరితేజ ఎలిమినేషన్‌కే ఎక్కువ ఆస్కారం ఉంది. లేదు అనుకుంటే పృథ్వీ, యష్మిని బలి చేసే ఛాన్స్ ఉంది. కానీ బిగ్‌బాస్ భలే ట్విస్ట్ ఇచ్చాడు. వీళ్లందరినీ కాదని గంగవ్వను పంపించేశాడు.
డబుల్ ఎలిమినేషన్
ఆమె ఆరోగ్యం సహకరించకపోవడంతో తనను బయటకు పంపించక తప్పలేదు. దీంతో నామినేషన్స్‌లో ఉన్న మిగతావాళ్లు గండం గట్టెక్కిందని ఊపిరి పీల్చుకున్నారు. కానీ అంతలోనే బిగ్‌బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఎలిమినేషన్ ఇంకా పూర్తవలేదంటూ హరితేజను పంపించేశారు. అలా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ వల్ల గంగవ్వ, హరితేజ ఎలిమినేట్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment