hariteja
-
బిగ్‌బాస్ ఫినాలేకు ముగ్గురు డుమ్మా.. ఆ కారణం వల్లేనా?
బిగ్‌బాస్ షో తమకు జీవితంలో వచ్చిన పెద్ద అవకాశం అని చాలామంది కంటెస్టెంట్లు చెప్తూ ఉంటారు. ప్రేక్షకులకు తమను దగ్గర చేసిన బిగ్‌బాస్ షోకు ఎప్పటికీ రుణపడి ఉంటామంటుంటారు. అయితే కొందరు మాత్రం ఈ రియాలిటీ షో వల్ల నెగెటివిటీ మూటగట్టుకున్నామని తిట్టిపోస్తుంటారు. ఇదంతా పక్కన పెడితే నేడు బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ గ్రాండ్ ఫినాలే.నెగెటివిటీ మూటగట్టుకున్న హరితేజఅంటే ఈ సీజన్ విజేతను తేల్చే ఆఖరి రోజు. ఇలాంటి పెద్ద ఈవెంట్‌కు ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ వస్తారు. అదేంటో కానీ ఈసారి ఏకంగా ముగ్గురు డుమ్మా కొట్టేశారు. వారే విష్ణుప్రియ, నయని పావని, హరితేజ. విచిత్రంగా సీజన్ 1లో సెకండ్ రన్నరప్‌గా నిలిచిన హరితేజ ఈ సీజన్లో మాత్రం వైల్డ్‌కార్డ్‌గా అడుగుపెట్టి నెలరోజులకే బయటకు వచ్చేసింది. విపరీతమైన నెగెటివిటీ మూటగట్టుకుంది. బహుశా అందుకే గ్రాండ్ ఫినాలేను లైట్ తీసుకుని ఉండవచ్చు!నిరూపించుకోలేకపోయిన నయనిఅటు నయని పావని.. ఏడో సీజన్లో వైల్డ్‌కార్డ్‌గా వచ్చి వారం రోజులకే ఎలిమినేట్ అయిపోయింది. ఈ సీజన్లో తన సత్తా చూపించాలనుకున్నప్పటికీ అన్నింటికీ ఏడ్చేస్తూ మూడువారాలకే హౌస్ నుంచి వచ్చేసింది. బహుశా ఈ బాధతోనే తను రాకపోయి ఉండొచ్చు. ఇక విష్ణుప్రియ.. విన్నర్ అయ్యేంత దమ్మున్నా ఆటపై ఫోకస్ పెట్టకుండా పృథ్వీపై మనసు పారేసుకుంది. గౌతమ్‌పై విష్ణు చిన్నచూపుఅతడు ఛీ కొట్టినా, చులకనగా చూసినా అతడు మాత్రమే కావాలంటూ పిచ్చిగా ప్రవర్తించింది. మనసులోని భావాలను నిర్మొహమాటంగా వ్యక్తపరిచిన ఆమె నిజాయితీ మెచ్చిన జనాలు ఆమెను దాదాపు 100 రోజులు హౌస్‌లో ఉండనిచ్చారు. అయితే గౌతమ్‌పై మొదటి నుంచీ ద్వేషం పెంచుకున్న ఆమె షో నుంచి వెళ్లేటప్పుడు కూడా అతడిని అవమానించింది.ఆ కారణం వల్లే?అసలు నువ్వేం ఆడావో చూస్తానంటూ గడ్డిపోచలా తీసిపారేసింది. కానీ ఇప్పుడేకంగా అతడు టైటిల్ రేసులో ఉన్నాడు. ఆ దృశ్యం చూడలేకే విష్ణు రాలేదని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు. మరికొందరేమో తనపై వచ్చిన నెగెటివిటీ తట్టుకోలేకే ఈ ఈవెంట్‌కు డుమ్మా కొట్టి ఉండొచ్చని భావిస్తున్నారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ చరిత్రలోనే పరమ చెత్త కంటెస్టెంట్.. హరితేజ ఏమందంటే?
బిగ్‌బాస్ తెలుగు మొదటి సీజన్లో హరితేజ అదరగొట్టింది. కానీ ఈసారి తన సత్తా చూపించలేకపోయింది. అక్కడి మాటలు ఇక్కడ.. ఇక్కడి మాటలు అక్కడ చెప్తూ నారదుడిలా మారిపోయింది. టాస్కులు పెద్దగా ఆడలేదు కానీ టైమ్‌పాస్ మాత్రం బాగానే చేసింది. ఫలితంగా పదోవారంలో ఎలిమినేట్ అయింది. తాజాగా బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంది. కామెడీ వల్ల బతికిపోతున్నాడుఈ సందర్భంగా కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతూ.. అవినాష్ అంత జెన్యూన్ కాదు. కాకపోతే కామెడీ వల్ల బతికిపోతున్నాడు. విష్ణు.. నత్తిబుర్ర, పృథ్వీ.. ఫ్రెండ్ కోసం ఏమైనా చేస్తాడు, టాస్క్‌లో విజృంభిస్తాడు. ఇతడు గెలిస్తే చూడాలనుకుంది. తేజ.. ఈయన అతితెలివి అతడికే చేటు తెస్తుంది. ప్రేరణ.. నోటికొచ్చిన మాటలు అనేస్తుంది, నబీల్.. తన పర్సనాలిటీ వేరేలా ఉంది. పాములాంటోడు, నిజంగానే పగబడతాడు. ఆమె సెల్ఫిష్రోహిణి.. ప్రతిదానికి ఏడవడం నచ్చదు. నిఖిల్.. అందరితో బాగుండటానికి ట్రై చేస్తున్నాడు.. అతడు రేలంగి మామయ్య. యష్మి.. సెల్ఫిష్, ఎమోషనల్‌గా వీక్ అవుతోంది అంటూ హౌస్‌మేట్స్‌పై తన అభిప్రాయాలు వెల్లడించింది. తర్వాత యాంకర్ అర్జున్.. హరితేజపై వచ్చిన ట్వీట్లు స్క్రీన్‌పై చూపించాడు. ఆడితే ఇలా.. ఆడకపోతే అలాబిగ్బాస్ తెలుగు చరిత్రలోనే వరస్ట్ కంటెస్టెంట్ హరితేజ. మరీ అంత చండాలంగా ప్రేరణ మీద పగతో గేమ్ ఆడాలా? టూ వరస్ట్. విష్ణుప్రియ, నయని పావని దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మోస్ట్ వరస్ట్ కంటెస్టెంట్స్.. మీకు మానవత్వమే లేదు అని ఓ యూజర్ ట్వీట్ చేశాడు. దీనిపై హరితేజ స్పందిస్తూ.. ఆడకపోతే ఆడలేదంటారు.. ఆడితేనేమో ఇలాంటి మాటలంటారు అని పెదవి విరించింది. మధ్యలో ఎందుకు దూరానా?మరో ట్వీట్లో విష్ణుప్రియ.. ప్రేరణను నామినేట్ చేస్తుంటే హరితేజ, నయని ఎందుకు మధ్యలో దూరుతున్నారు? అక్కడ వాళ్లకేం పని? అని మరో వ్యక్తి విమర్శించాడు. ఆ నామినేషన్స్‌లో అందరూ అందరి మధ్యలో దూరి మాట్లాడారాని తెలిపింది. హరితేజ తనకున్న మంచి పేరు పోగొట్టుకుని నెగెటివ్ ఇమేజ్ తెచ్చుకుంది అని మరో ట్వీట్ చూపించాడు. ఎవరు గెలవాలంటే?ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉండి ప్రేక్షకులకు దగ్గరగా బతికిన హరితేజ నెల రోజుల్లో చెడ్డదెలా అవుతుంది? ఓపికతో ఉంటే అన్నీ సెట్ అయిపోతాయ్ అని సానుకూల దృక్పథంతో మాట్లాడింది. ఈ సీజన్ ఎవరు గెలవాలనుకుంటున్నారన్న ప్రశ్నకు విష్ణుప్రియ అని బదులిచ్చింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ అంటేనే ఇమేజ్ డ్యామేజ్.. ఎప్పుడు తెలుసుకుంటారో?
కళ అనేది ప్రేక్షకుడికి ఆనందం, కళాకారుడికి జీవితం ఇస్తుంది. ఏ కళాకారుడైనా తన కళను నమ్ముకునే జీవిస్తాడు. ముఖ్యంగా నేటి కళాకారులు తమకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. తమ కష్టాన్ని, నష్టాన్ని బేరీజు వేసుకోకుండా ఆఖరికి తమ జీవితాన్ని కూడా పణంగా పెట్టి కళకు అంకితమవుతున్నారు. కానీ దురదృష్ణమేమిటంటే ఎంతటి కళాకారులనైనా కనుమరుగు చేస్తూ క్యాష్ చేసుకుంటుంది బిగ్ బాస్ లాంటి కార్యక్రమం. అదెలాగంటారా చూడండి...ఇమేజ్ పెంచుకోవడానికే..బిగ్ బాస్ కార్యక్రమం దాదాపు 8 సంవత్సరాల నుంచి తెలుగు ప్రేక్షకులకు పరిచయం. 8 సీరిస్ లలో వచ్చిన పార్టిసిపెంట్స్ మళ్ళీ ఎక్కడా కనబడట్లేదు. కనీసం విన్నర్స్ ఎవరైనా ఎక్కడైనా కనబడతారనుకున్నా పొరపాటే. బిగ్‌బాస్ కార్యక్రమ రూపేణా ప్రేక్షకాదరణ విపరీతంగా ఉంటుంది. దాన్ని చూసే ప్రతి కళాకారుడు బిగ్‌బాస్‌కు వెళ్ళి తన ఇమేజ్ పెంచుకోవాలనుకుంటాడు. కట్ చేస్తే తాను బిగ్ బాస్ బ్యాలెన్స్ పెంచుతాడే కానీ తన ఇమేజ్ డామేజ్ కాకుండా చూసుకోలేడు.అదెలాగో ఇంకాస్త వివరంగా చెబుకుందాం.హౌస్‌లో గిల్లికజ్జాలుబిగ్ బాస్ హౌస్ అంటే ఏమిటి ? ఏ సంబంధం లేని నలుగురు పబ్లిక్ ఇమేజ్ ఉన్నవాళ్ళని ఓ ఇంట్లో పెట్టి, వారి మధ్య టాస్కుల పేరుతో గిల్లికజ్జాలు పెట్టి, వారు కొట్టుకుంటే చూసే ప్రేక్షకుడితో తన గల్లా పెట్టి నింపుకునేదే ఈ బిగ్ బాస్ వ్యాపార సూత్రం. సాధారణంగా రోడ్డు మీద ఎవరైనా అనామకుడితో మనకు చిన్న పాటి ప్రమాదం జరిగినా చెలరేగిపోతాం. అటువంటి సమయంలో చుట్టూ వచ్చి పోయే వాళ్ళు ఆగి మరీ మన కొట్లాట వేడుకలా చూసి ఆనందిస్తారు. ఇప్పుడు బిగ్‌బాస్‌లో జరిగేది కూడా అదే! గొడవపడితే ఏమవుతుంది?తెలియని అనామకుడితో జరిగే గొడవ మనకు కాస్తంత అసహనం ఇచ్చినా గొడవపడతాం, అలాంటిది కోట్లాది మంది చూస్తున్నారన్న విషయం తెలిసి కూడా అదుపు తప్పి తోటి పార్టిసిపెంట్స్‌తో గొడవ పడినపుడు ఏమవుతుంది? మహా అయితే బిగ్‌బాస్ చిల్లర రెమ్యునరేషన్ రూపంలో విదిలిస్తాడు, కానీ తన ఇమేజ్ను ఈ కాస్త చిల్లర కోసం పాడు చేసుకుంటున్నామన్న విషయం గ్రహించలేకపోతున్నారు ఇప్పటి పార్టిసిపెంట్స్.గంగవ్వ ఎలిమినేషన్ఈ వారం విశ్లేషణ అంతా పైన విషయంలోనే వుంది. ఇక చెప్పుకోవాల్సిన అంశాలేమైనా ఉన్నాయి అంటే వైల్డ్ ఎంట్రీగా వచ్చిన గంగవ్వ సైలెంట్‌గా అనారోగ్య కారణాలతో ఎగ్జిట్ అయింది. బిగ్‌బాస్ కార్యక్రమాన్ని మొత్తంగా హరికథ రూపేణా పొగిడించుకుని వారాంతంలో హరితేజకు హ్యాండిచ్చి ఎలిమినేట్ చేశాడు బిగ్‌బాస్. బిగ్ డ్యామేజ్వారాంతంలో జంబలకిడిపంబ పేరుతో పార్టిసిపెంట్స్‌ను లింగ వేషధారణతో జుగుప్సాకరమైన డ్యాన్సులు హావభావాలతో రసాభాస చేసి ఈ వారానికి మమ అనిపించారు. ఏదేమైనప్పటికీ బిగ్‌బాస్ అన్నది బిగ్ డ్యామేజ్ అన్న విషయం చూసే ప్రేక్షకులు ఎప్పటికీ తెలుసుకోలేరు. కానీ పార్టిసిపెంట్స్ అయినా ఎప్పటికి గ్రహిస్తారో ఏమో!-ఇంటూరు హరికృష్ణమరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్ బాస్ నుంచి హరితేజ ఎలిమినేట్.. కిరాక్ రెమ్యునరేషన్
బిగ్ బాస్ తెలుగు 8 పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ జరిగింది. పలు అనారోగ్య కారణాలతో గంగవ్వ తనంతట తానే హౌస్ నుంచి బయటకు వస్తే.. ఆడియెన్స్ ఓట్ల కారణంగా హరితేజ ఎలిమినేట్ అయింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన హరితేజ ప్రేక్షకుల అంచనాలకు తన ఆటతో రీచ్ కాలేకపోయింది. అక్టోబర్ 6న బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హరితేజ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఐదు వారాల్లో ఆమె సంపాదన ఎంతో చూద్దాం.బిగ్ బాస్ తెలుగు సీజన్ 1లో తనదైన ఆటతీరుతో సత్తా చాటిన హరితేజ ఈ సీజన్లో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ, బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినప్పటికీ చెడ్డపేరు లేకుండానే హుందాగా ఆట నుంచి నిష్క్రమించింది. హౌస్‌లో ఉన్నంతకాలం చలాకిగా కనిపించిన ఆమె ఆట తీరు బాగున్నప్పటికీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కావడంతో పెద్దగా ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ కాలేదని చెప్పవచ్చు. బహుషా ఈ కారణంతోనే ఆమె ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. ఈ వారం నామినేషన్ లిస్ట్‌లో నిఖిల్,ప్రేరణ, యష్మీ, విష్ణుప్రియ, పృథ్వీ, హరితేజ,గౌతమ్ ఏడుగురు ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఐదు వారాలపాటు హౌస్‌లో కొనసాగిన ఈ బ్యూటీ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో అనే వార్త ఆసక్తిగా మారింది.రూ. 17 లక్షలు పైగానే..సోషల్‌మీడియాలో మంచి పాపులరాటీ ఉన్న హరితేజకు బిగ్ బాస్ ఒక వారానికి గాను రూ. 3.5 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తోంది. అంటే రోజుకు రూ. 50 వేల పారితోషకం ఆమె బిగ్‌బాస్ నుంచి అందుకుందని టాక్. బిగ్ బాస్‌లో అత్యధికంగా రెమ్యునరేషన్ అందుకునే వారి జాబితాలో హరితేజ ఒకరని చెప్పవచ్చు. బిగ్ బాస్‌లో తను ఐదు వారాలపాటు ఉన్నందుకు రూ. 17 లక్షలకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నారని చెప్పవచ్చు. సీజన్1లో సెకండ్ రన్నరప్సీరియల్స్, సినిమాలతో పాపులర్ అయింది హరితేజ. బిగ్‌బాస్ మొదటి సీజన్లో అడుగుపెట్టి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. గలగలా మాట్లాడే ఈమె సీజన్1లో గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఈ షో తర్వాత సినిమాల్లో బిజీ అవడమే కాకుండా హోస్ట్‌గానూ అవతారమెత్తింది. ఫిదా మీ ఫేవరెట్ స్టార్‌తో, పండగ చేస్కో, సూపర్ సింగర్, లక్కీ ఛాన్స్.. ఇలా పలు షోలకు యాంకర్‌గా వ్యవహరించింది. అఆ, యూ టర్న్, అరవింద సమేత వీర రాఘవ, ప్రతిరోజు పండగే, హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హరితేజ ఇటీవలే రిలీజైన దేవర సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా మెప్పించింది. -
హరితేజ ఎలిమినేట్.. నిఖిల్ సహా ఆ నలుగురు మాస్క్ తీయాల్సిందే!
ఈరోజు హౌస్ జంబలకిడిపంబగా మారిపోయింది. వాళ్లు వీళ్లయ్యారు, వీళ్లు వాళ్లయ్యారు. అదేనండి.. ఆడాళ్లు మగాళ్ల గెటప్‌లోకి. మగాళ్లు ఆడాళ్ల గెటప్‌లోకి మారిపోయారు. వీరినలా చూస్తుంటేనే ప్రేక్షకులు పడీపడీ నవ్వడం ఖాయం. అలా ఉన్నాయి ఒక్కొక్కరి అవతారాలు.. పైగా ఒకరి పాత్రల్లో మరొకరు లీనమై నటించారు. ముఖ్యంగా ప్రేరణ.. నిఖిల్‌గా నటించి అదరగొట్టేసింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 10) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..ఐటం సాంగ్నాగ్.. ప్రేరణ, గౌతమ్‌ను సేవ్ చేశాడు. తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ మట్కా సినిమా ప్రమోషన్స్ కోసం స్టేజీపైకి వచ్చాడు. వచ్చీరావడంతోనే ఆడవేషంలో ఉన్న మగవారికి ఐటం సాంగ్ చేసే టాస్క్ ఇచ్చాడు. అలాగే మగవేషంలో ఉన్న ఆడపిల్లలు మాస్ పాటలకు చిందేయాలన్నాడు. పర్ఫామెన్స్ బట్టి మార్కులిస్తానన్నాడు. ఈ గేమ్‌లో నబీల్‌కు 6, రోహిణి, తేజ, విష్ణుప్రియకు 10, అవినాష్, ప్రేరణ, నిఖిల్, హరితేజలకు 9, యష్మికి 8, గౌతమ్‌కు 7 మార్కులిచ్చాడు. తేజ డ్యాన్స్‌కు ముచ్చెమటలుముఖ్యంగా తేజ పర్ఫామెన్స్కైతే వరుణ్‌తేజ్‌కు చెమటలు పట్టాయి. ఒక్కరు నవ్వకుండా ఉంటే ఒట్టు! ఆ రేంజ్లో ఉంది మనోడి పర్ఫామెన్స్. ఫైనల్‌గా ఈ గేమ్‌లో బాయ్స్ వేషంలో ఉన్న ఆడవారు గెలిచారు. అనంతరం వరుణ్ తన మనసుకు దగ్గరైనవారి గురించి మాట్లాడాడు. రామ్ చరణ్ తనకు సోదరుడని, ఏ సమస్య వచ్చినా అతడి దగ్గరకు వెళ్తానన్నాడు. నిహారిక కొడుతుందా?చిరంజీవి తన ఇన్స్పిరేషన్ అని, అల్లు అర్జున్ హార్డ్‌వర్కర్ అని, పవన్ కళ్యాణ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవన్నాడు. నిహారిక బెస్ట్‌ఫ్రెండ్ అని.. ఎప్పుడూ తనను కొడుతుందన్నాడు. తర్వాత సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. అనంతరం నాగ్ నిఖిల్‌ను సేవ్ చేశాడు. ఇకపోతే కొన్ని హ్యాష్‌ట్యాగులు ఇచ్చిన బిగ్‌బాస్ అవి ఎవరికి సెట్టవుతాయో చెప్పాలన్నాడు. ముందుగా తేజ.. ఎవరికోసం ఆలోచించకుండా పండ్లు తినేసిన గౌతమ్‌కు సెల్ఫిష్ ట్యాగ్ ఇచ్చాడు. బిల్లు మాఫీ చేయించిన నాగ్ఈ క్రమంలో హౌస్‌లో జరుగుతున్న దొంగతనం గురించి నాగ్ ఆరా తీశాడు. సూపర్ మార్కెట్లో హౌస్మేట్స్ కొన్ని వస్తువులు దొంగతనం చేశారు. అందుకుగానూ బిగ్‌బాస్ రూ.1,85,000 బిల్లు వేశాడు. అసలు ఏమేం దొంగిలించారనేది నాగ్ వీడియో ప్లే చేసి మరీ చూపించాడు. అయితే చిన్నచిన్న దొంగతనాలను చూసీ చూడనట్లు వదిలేయమని, ఆ బిల్లును ప్రైజ్‌మనీలో నుంచి కట్ చేయొద్దని నాగ్ బిగ్‌బాస్‌ను అభ్యర్థించడం విశేషం.అవినాష్ కట్టప్పహ్యాష్ట్యాగుల గేమ్ విషయానికి వస్తే.. విష్ణుప్రియ.. ప్రేరణ టేప్‌రికార్డర్ అని, హరితేజ.. తేజ లేజీబాయ్ అని, నబీల్.. ప్రేరణకు ఇగో ఎక్కువ, యష్మి.. అవినాష్ కట్టప్ప (వెన్నుపోటు), అవినాష్.. విష్ణుప్రియ ఓవర్ డ్రమటిక్, గౌతమ్.. ప్రేరణ కంట్రోల్ ఫ్రీక్, రోహిణి.. అవినాష్ అటెన్షన్ సీకర్, ప్రేరణ.. గౌతమ్ ఇరిటేటింగ్, పృథ్వీ.. నిఖిల్ ఇమ్మెచ్యూర్, నిఖిల్.. పృథ్వీ అటెన్షన్ సీకర్ అని పేర్కొన్నారు. తర్వాత విష్ణు, పృథ్వీ సేవ్ అయ్యారు.హరితేజ ఎలిమినేట్చివరగా హరితేజ, యష్మి మాత్రమే మిగిలారు. నబీల్ను ఎవిక్షన్ షీల్డ్ వాడతావా? అని నాగ్ అడగ్గా అతడు ఇప్పుడు వాడనని తేల్చిచెప్పాడు. దీంతో నాగ్ యష్మిని సేవ్ చేసి హరితేజ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. హరితేజ వెళ్లిపోతుంటే విష్ణుప్రియ వెక్కివెక్కి ఏడ్చింది. చివర్లో హరితేజ.. హౌస్‌లో ఎవరు మాస్కులు తీసేస్తే బెటరో చెప్పాలన్నాడు. ఐదుగురు మాస్క్ తీయాల్సిందే!అవినాష్, రోహిణి మాస్కు తీసేయాలని అభిప్రాయపడింది. తేజ.. రూల్స్ చెప్పడమే కాకుండా పాటించాలని సూచించింది. ప్రేరణ మంచి అమ్మాయే కానీ కొన్ని చెడు లక్షణాల వల్ల తన మంచి కనడకుండా పోతుందని తెలిపింది. నిఖిల్.. తన ఎమోషన్స్ బయటకు చూపించాలన్నాడు. అలా ఈ ఐదుగురు మాస్క్ తీసేస్తే బెటర్ అని చెప్పింది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
డబుల్ ఎలిమినేషన్.. గంగవ్వతోపాటు హరితేజ కూడా!
బిగ్‌బాస్ షో మొదలై రెండు నెలలపైనే అవుతోంది. వారాలు గడిచేకొద్దీ హౌస్‌లో జనాలు పలుచనవుతున్నారు. మున్ముందు వారాలు మరింత కఠినంగా ఉండనున్నాయి. ఇక ఈ వారం నిఖిల్, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ, గౌతమ్ కృష్ణ, పృథ్వీ, హరితేజ నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో నిఖిల్, విష్ణు, గౌతమ్‌ల గురించి ఆలోచించాల్సిన పని లేదు. వారికి ఓట్లు గట్టిగానే పడుతున్నాయి. ప్రేరణ ఓటు బ్యాంక్ కూడా బాగానే పెరిగింది. మిగిలిందల్లా పృథ్వీ, యష్మి, హరితేజ.ఎవరు సేఫ్?ఈ ముగ్గురిలో ఎవరు సేఫ్ అవుతారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు? అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే హరితేజ ఎలిమినేషన్‌కే ఎక్కువ ఆస్కారం ఉంది. లేదు అనుకుంటే పృథ్వీ, యష్మిని బలి చేసే ఛాన్స్ ఉంది. కానీ బిగ్‌బాస్ భలే ట్విస్ట్ ఇచ్చాడు. వీళ్లందరినీ కాదని గంగవ్వను పంపించేశాడు.డబుల్ ఎలిమినేషన్ఆమె ఆరోగ్యం సహకరించకపోవడంతో తనను బయటకు పంపించక తప్పలేదు. దీంతో నామినేషన్స్‌లో ఉన్న మిగతావాళ్లు గండం గట్టెక్కిందని ఊపిరి పీల్చుకున్నారు. కానీ అంతలోనే బిగ్‌బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఎలిమినేషన్ ఇంకా పూర్తవలేదంటూ హరితేజను పంపించేశారు. అలా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ వల్ల గంగవ్వ, హరితేజ ఎలిమినేట్ అయ్యారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణుప్రియకు చుక్కలు చూపిస్తున్న ప్రేరణ.. బలైపోయిన తేజ!
ఎన్నాళ్లనుంచో చీఫ్ పోస్ట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ప్రేరణ కల ఎట్టకేలకు సాకారమైంది. మెగా చీఫ్ పదవిని అధిరోహించింది. అలా డ్యూటీ ఎక్కిందో లేదో తన పనితనం మొదలుపెట్టేసింది. అప్పుడే విష్ణుప్రియకు చుక్కలు చూపించేస్తోంది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 8) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేయండి..మాట తప్పాడన్న కోపంతో..మెగా చీఫ్ గేమ్‌లో పృథ్వీ, నబీల్ ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని ముందుగానే డీల్ చేసుకున్నారు. కట్ చేస్తే నబీల్ను ఓడించమని నిఖిల్‌కు సూచించాడు పృథ్వీ. చేసిందంతా చేశాక తాను అలా అనలేదని మాట మార్చాడు. తను ఓడిపోవడంతో నబీల్ కూడా పృథ్వీని ఓడించాలని డిసైడయ్యాడు. ఈ క్రమంలో అతడు కూర్చున్న బాక్స్‌లో మూటలు వేశాడు. అయితే అవి తన మీద పడటం, అలాగే ఇచ్చిన మాట తప్పాడన్న కోపంతో పృథ్వీ.. నబీల్‌పై సీరియస్ అయ్యాడు. ఈ రౌండ్లో పృథ్వీ ఓడిపోయాడు.ప్రేరణ మెగా చీఫ్చివర్లో ప్రేరణ, రోహిణి ఇద్దరే మిగిలారు. విష్ణు, గంగవ్వ, అవినాష్, తేజ.. రోహిణికి సపోర్ట్ చేయగా మిగతా అందరూ ప్రేరణకు మద్దతిచ్చి ఆమెను చీఫ్ చేశారు. ఇకపోతే హరితేజ హౌస్‌లో ఉన్నవారందరిపైనా హరికథ చెప్పి అలరించింది. అనంతరం మెగా చీఫ్ అయిన ప్రేరణ మొదట విష్ణునే టార్గెట్ చేసినట్లు ఉంది. విష్ణును కప్బోర్డ్ ఖాళీ చేయమందట.. అలాగే విష్ణు బెడ్ దగ్గరున్న సామాను నీట్‌గా పెట్టుకోమని చెప్పింది. ఆమె వినకపోవడంతో ప్రేరణ వెళ్లి సర్దింది. ఇంట్లో చేయాల్సిన పనులు కూడా సరిగా చేయడం లేదని విష్ణును తప్పు పట్టింది.పాము- ఎగ్స్బిగ్బాస్ ఎవిక్షన్ షీల్డ్‌ను ప్రవేశపెట్టాడు. సమయానుసారం ఆకలిగా ఉన్న పాముకు గోల్డెన్ ఎగ్స్ ఇవ్వాలన్నాడు. ఎవరికి చెందిన గోల్డెన్ ఎగ్ పాముకు ఆహారమవుతుందో వారు ఎవిక్షన్ షీల్డ్‌కు దూరమవుతారు. మెగా చీఫ్ ప్రేరణ.. ఎవిక్షన్ షీల్డ్ రాకూడదనుకున్న ఐదుగురి ఎగ్స్ పాముకు ఆహారంగా పెట్టాలన్నాడు. అలా విష్ణుప్రియ, గంగవ్వ, పృథ్వీ, గౌతమ్, హరితేజ ఫోటోలున్న ఎగ్స్‌ను పాము నోట్లో వేసింది.అవినాష్‌పై ఎగిరెగిరి పడ్డ యష్మిఅనంతరం.. అవినాష్, నబీల్ను పిలిచి ఒక ఎగ్‌ను పాము నోట్లో పెట్టమన్నాడు. ఇద్దరూ ఏకాభిప్రాయంతో యష్మి ఎగ్ తొలగించారు. అందుకు కారణం చెప్పమని యష్మి అడగ్గా.. నువ్వు వీక్ కాబట్టే నబీల్ నీకు సూట్‌కేస్ ఇచ్చాడు. అయినా ఈ వారం నీకు వచ్చిన అవకాశం సరిగా వాడుకోలేదని అవినాష్ అన్నాడు. ఆ మాటతో యష్మికి కోపం కట్టలు తెంచుకుంది. అందరూ అన్ని గేమ్స్ గెలవరు, స్ట్రాంగ్ ఉన్నవాళ్లు కూడా చాలా గేమ్స్‌లో ఓడిపోయారు.. నన్ను వీక్ అంటూ డీమోటివేట్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చింది.నిఖిల్ గేమ్‌ను అడ్డుకున్న గౌతమ్నిఖిల్, గౌతమ్ వంతు రాగా నిఖిల్ త్యాగం చేసేందుకు రెడీ అయ్యాడు. అందుకు గౌతమ్ ఒప్పుకోలేదు. ప్రేరణ ఎగ్ తీసేద్దామంటే నిఖిల్ ఒప్పుకోడు. చివరకు ఇద్దరూ కలిసి తేజను బలి చేశారు. విష్ణుప్రియ, పృథ్వీ వంతురాగా.. ప్రేరణ ఎగ్ తీసేశారు. తర్వాత రోహిణి, హరితేజ వంతు వచ్చింది. నిఖిల్ ఈ గేమ్ నుంచి ఎలిమినేట్ అవడానికి రెడీగా ఉన్నాడని రోహిణి అంటుంటే హరితేజ మాత్రం నామినేషన్స్‌లోకి రావట్లేదంటూ అవినాష్‌ను తీసేద్దామంది. అందుకు రోహిణి ఒప్పుకోలేదు. అటు హరితేజ కూడా వినకపోవడంతో తప్పని పరిస్థితిలో రోహిణి.. అవినాష్ ఎగ్‌ను పాము నోట్లో వేసింది.తేజ చేసిన పనికితేజ, యష్మి వంతు వచ్చింది. యష్మి.. ఎఫర్ట్స్ కనిపించడం లేదంటూ రోహిణి పేరు చెప్పగా తేజ.. నబీల్, నిఖిల్లో ఎవరైనా ఓకే అన్నాడు. ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాకపోవడంతో తేజ.. నబీల్, రోహిణి, నిఖిల్ అభిప్రాయాలు అడిగాడు. తనకు అక్కర్లేదని నిఖిల్ క్లియర్‌గా చెప్పడంతో మరో సెకన్ ఆలోచించకుండా అతడి ఎగ్‌ను పాము నోట్లో వేశాడు.నబీల్‌కు ఎవిక్షన్ షీల్డ్అది చూసిన యష్మి.. కావాలని రోహిణి ఎగ్ కూడా వేసేసింది. దీంతో నిఖిల్, పృథ్వీ, హరితేజ, విష్ణు.. అందరూ తేజపై పడి అరిచారు. ఏకాభిప్రాయానికి రాకుండా ఎగ్ ఎలా వేస్తావంటూ మండిపడ్డారు. కానీ ఏ ఒక్కరూ యష్మి ఎగ్ వేయడాన్ని తప్పుపట్టలేదు. చివర్లో నబీల్ ఎగ్ మాత్రమే మిగిలి ఉండటంతో అతడు ఎవిక్షన్ షీల్డ్ గెలుపొందినట్లు తెలుస్తోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నిఖిల్ స్ట్రాటజీ అదే..! గెలవాలంటే వదులుకోవాల్సిందే!
ఎవిక్షన్ షీల్డ్ గేమ్‌ను బిగ్‌బాస్ మెగా ఛీఫ్ ప్రేరణతో మొదలుపెట్టాడు. షీల్డ్ అందుకోవడానికి అనర్హులైన ఐదుగురిని గేమ్‌లో నుంచి తీయాలన్నాడు. గేమ్‌లో ఎవరు ఉండకూడదనుకుంటున్నారో వారి ఎగ్స్‌ను పాము నోట్లో పెట్టాల్సి ఉంటుంది. దీంతో ప్రేరణ... విష్ణుప్రియ, పృథ్వీ, గంగవ్వ, హరితేజ, గౌతమ్‌లను సైడ్ చేసింది.ప్రేరణ జోలికొస్తే విష్ణును తీసేస్తానన్న పృథ్వీఅనంతరం హౌస్‌మేట్స్‌ను జంటలుగా పిలిచి.. వాళ్లు ఎవర్ని తీసేయాలనుకుంటున్నారో నిర్ణయించుకుని ఆ కంటెస్టెంట్ ఎగ్‌ను పాము నోట్లో వేయమన్నాడు. అలా విష్ణుప్రియ, పృథ్వీని పిలిచాడు. విష్ణు.. ప్రేరణను తీసేద్దామనడంతో పృథ్వీ సరేనని తలాడించాడు. ఇక హరితేజ- రోహిణి వంతు వచ్చింది. హరితేజ.. అవినాష్‌ను తీసేయాలనుకుంటున్నట్లు చెప్పింది. నిఖిల్‌ను తీసేద్దామన్న రోహిణిఅయితే రోహిణి.. నిఖిల్ తనంతట తానుగా అవుట్ అయ్యేందుకు రెడీ ఉన్నప్పుడు ఆ పని మనమే చేసేస్తే అయిపోతుందిగా అని తన అభిప్రాయం చెప్పింది. అది హరితేజకు మింగుడుపడలేదు. అటు యష్మి-తేజ సైతం ఎవర్ని తీసేయాలన్నదాని గురించి ఏకాభిప్రాయానికి రాలేదు. ఇక నిఖిల్ తనను తీసేయమని చెప్పడానికి ప్రత్యేక కారణం ఉంది. ఎవిక్షన్ పాస్ వల్ల సేవ్ అవడం అతడికి ఏమాత్రం ఇష్టం లేదు. నిఖిల్ ప్లాన్ అదేనామినేషన్స్లో ఉంటేనే తనకు ఓట్ బ్యాంక్ పెరుగుతుందని.. అది తన విజయానికి దోహదపడుతుందని భావిస్తున్నాడు. అందుకే ఎవిక్షన్ షీల్డ్‌తో తనను తాను కాపాడుకోవడానికి సుముఖత చూపించడం లేదు. ఒకవేళ నిజంగా ఆ షీల్డ్ గెలుచుకున్నా తనకోసమైతే వాడుకోనని.. వేరేవారికోసమే ఉపయోగిస్తానని స్పష్టంగా చెప్పేశాడు. చదవండి: బిగ్‌బాస్ 8.. డేంజర్ జోన్లో ఆమె.. వేటు పడటం గ్యారంటీ! -
'ఇక ఆపేద్దామన్న హరితేజ.. నా మీదే ఎందుకంత కోపం'
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ ప్రస్తుతం తొమ్మిదో వారం నడుస్తోంది. గతవారంలో నయని పావని హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సోమవారం వచ్చిందంటే హౌస్‌లో మాటల యుద్ధమే. ఎందుకంటే నామినేషన్స్ ప్రక్రియ మొదలయ్యేది ఆ రోజు నుంచే. అయితే ఈసారి బిగ్‌బాస్ ఓ చిన్న కండీషన్ పెట్టాడు. ఎప్పుడూ ఇద్దర్ని నామినేట్ చేయాలని చెప్పే బిగ్‌బాస్ ఈసారి మాత్రం ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయాలన్నాడు.అలా ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. పలు కారణాలతో ఈ వారం యష్మి, ప్రేరణ, గౌతమ్, నిఖిల్, హరితేజ, విష్ణుప్రియ, పృథ్వీ నామినేట్ అయ్యారు. అయితే ఒక్క రోజులోనే ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. మంగళవారం కూడా నామినేషన్స్ కొనసాగాయి. తాజాగా ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ రోజు నామినేషన్స్ ప్రక్రియలో హరితేజ, ప్రేరణ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇప్పటివరకు జరిగిందంతా చాలు.. ఇక నుంచి ఆపేద్దాం.. నోరు బాగుంటే ఊరు బాగుంటది' అంటూ ప్రేరణను అడిగింది హరితేజ. ఏదైనా స్ట్రాంగ్ పాయింట్ ఉంటే నామినేట్ చేసుకుందాం. అంతేకానీ మనిద్దరికీ ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మాటలకు హరితేజను అభినందిస్తూ మాట్లాడింది ప్రేరణ. ఆ తర్వాత మళ్లీ హరితేజను ఫేక్ అని ప్రేరణ అనడంతో మరింత మాటల యుద్ధం నడిచింది. ప్రతిసారి ఫేక్ అనొద్దు.. మాటలు ముందు సక్కగా మాట్లాడు అంటూ హరితేజ వాదించింది. దీంతో వీరిద్దర మధ్య జరిగిన వార్ పూర్తిగా తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి. -
అక్క అనడం తప్పన్న నిఖిల్, ఫ్రెండ్‌ను కాపాడిన అవినాష్
నామినేషన్స్ అంటే మాటల యుద్ధమే.. ఎప్పుడూ ఇద్దర్ని నామినేట్ చేయాలని చెప్పే బిగ్‌బాస్ ఈసారి మాత్రం ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయాలన్నాడు. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో నేటి (నవంబర్ 4) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..హరితే, ప్రేరణ.. ఇద్దరూ ఇద్దరే!మొదటగా పృథ్వీ.. నాకు నెక్ ఫాంటసీ ఉందనడం నచ్చలేదంటూ రోహిణిని నామినేట్ చేశాడు. నెక్ ఫాంటసీ అన్నది బూతు పదమా? అని రోహిణి ఆశ్చర్యపోయింది. హరితేజ.. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది.. నోటికొచ్చిన మాటలు అనేయొద్దని ప్రేరణను నామినేట్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరూ వాదులాడుకున్నారు. హరితేజ చెప్పే పాయింట్లు కరెక్టే ఉన్నా కాస్త యాక్టింగ్ చేస్తూ చెప్పడం అతిగా అనిపించింది. తెలుగులో కొత్త బూతు 'అక్క'అటు ప్రేరణ కూడా ఈమెపై రివేంజ్ నామినేషన్ చేసింది. అంత అరుచుకున్నాక చివర్లో ఇద్దరూ కలిసిపోయి హగ్గులిచ్చుకోవడం గమనార్హం. నిఖిల్ వంతురాగా.. ఒకమ్మాయి తనను అక్కా అని అనొద్దని చెప్తున్నా పదేపదే అనడం బుల్లీయింగ్ అంటూ గౌతమ్‌ను నామినేట్ చేశాడు. అక్కా అనడంలో తప్పేముంది? అని గౌతమ్ అంటే అశ్వత్థామ అని పిలిస్తే నువ్వు హర్టయినప్పుడు.. ఆమె వద్దంటున్నా అక్కా అని పిలవడం కూడా తప్పేనని లాజిక్ లేని సమాధానమిచ్చాడు. అశ్వత్థామ ఈజ్ బ్యాక్.దీంతో చిర్రెత్తిన గౌతమ్.. ఇప్పుడు చెప్తున్నా.. అశ్వత్థామ ఈజ్ బ్యాక్.. నన్ను ట్రోల్ చేసుకోండి.. ఏమైనా చేసుకోర్రి అన్నాడు. ఇద్దరూ అరుచుకుని కాసేపటికి నిఖిల్.. అమ్మతోడు, గేటు తీయమను.. బయటకెళ్లి చూసుకుందాం అని రెచ్చగొట్టాడు. నా ప్రవర్తన తప్పు అంటున్నావ్.. మరి నా మీద కోపాన్ని టాస్కులో అమ్మాయిలపై చూపించడం తప్పు కాదా? ఎవరేంటో నాకర్థమైంది.. ఇప్పుడు నాకు భయం లేదు, ఎవరికీ వినేది లేదు, తగ్గేది లేదు అని గౌతమ్ ఆవేశంతో మాట్లాడుతుంటే రోహిణి, హరితేజ చప్పట్లు కొట్టారు.నువ్వే ఆ ఛాన్సిచ్చావువిష్ణుప్రియ వంతు రాగా.. నేను నిన్ను నామినేట్ చేయకూడదనుకున్నాను.. కానీ నువ్వే ఆ ఛాన్సిచ్చావు! ఈ వారం చాలా తప్పులు చేశావంటూ ప్రేరణను నామినేట్ చేసింది. నబీల్.. పోయినవారం నామినేషన్స్‌లో ఫేవరెటిజం చూపించావు, మెగా చీఫ్‌గా ఫెయిలయ్యావంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు.చప్పట్లు కొట్టిన గంగవ్వగంగవ్వ.. యష్మిని అశ్విని అనడంతో అందరూ పడీపడీ నవ్వాడు. గౌతమ్ బాగా ఆడతాడు. చిన్నదానికీ పెద్దదానికీ నువ్వు, ప్రేరణ ఇద్దరూ అతడిపై అరుస్తారు. ఆటలో గెలవకపోతే మాత్రం చీదరించుకుంటావు అని చెప్పింది. నామినేట్ అయినందుకుగానూ యష్మిపై ఆయిల్ పెయింట్ పడటంతో గంగవ్వ చప్పట్లు కొట్టింది. రోహిణి.. మెగా చీఫ్ కంటెండర్‌షిప్ గేమ్‌లో నీకంటే ఒక అడుగు ముందున్న గౌతమ్‌ను సైడ్ చేయడం బాగోలేదని యష్మిని నామినేట్ చేసింది. బిగ్‌బాస్‌కు గౌరవం ఇవ్వలేదుగౌతమ్ వంతు రాగా.. టీమ్‌లీడర్‌గా ఉన్నప్పుడు పదేపదే ఇరిటేట్ అయ్యావ్.. రెండోది నన్ను గేమ్‌లో సైడ్ చేసినప్పుడు నాకో కారణం చెప్పావ్.. కానీ వెనకాల మరో కారణం చెప్పావ్.. అంటూ యష్మిని నామినేట్ చేశాడు. తేజ.. నామినేషన్స్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో నువ్వు స్మోకింగ్ జోన్లో సిగరెట్ తాగుతూ కూర్చున్నావు.. ఇది బిగ్‌బాస్‌ను అగౌరవపర్చాడంటూ పృథ్వీని నామినేట్ చేశాడు.ఆమెను సేవ్ చేసిన అవినాష్యష్మి.. నువ్వు నన్ను అక్కా అని పిలవడం నచ్చలేదు. క్రష్ అంటావ్, అక్కా అంటావ్.. ఫ్లిప్ అవుతున్నావు అంటూ గౌతమ్‌ను నామినేట్ చేసింది. చివర్లో ఒకరిని స్వాప్ చేసే అధికారం మెగా చీఫ్ అవినాష్‌కు ఇవ్వడంతో అతడు రోహిణిని సేవ్ చేసి ఆమె స్థానంలో నిఖిల్‌ను నామినేట్ చేశాడు. అలా ఈ వారం యష్మి, ప్రేరణ, గౌతమ్, నిఖిల్, హరితేజ, విష్ణుప్రియ, పృథ్వీ నామినేట్ అయ్యారు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్: తిడుతుంటే నవ్వుతుందేంటి? ఈ పగ చల్లారదు!
గంగవ్వ హౌస్‌లో అడుగుపెట్టి నాలుగువారాలవుతోంది కానీ కొందరి పేర్లు ఇప్పటికీ తనకు నోరు తిరగదు. యష్మిని కాస్త అశ్విని అనేసింది. దీంతో నామినేషన్స్‌లో అందరూ పడీపడీ నవ్వారు. గంగవ్వ యష్మిని నామినేట్ చేస్తూ.. గౌతమ్ బాగానే ఆడుతున్నాడుడు. కానీ నువ్వు.. ఆటలో గెలవకపోతే మాత్రం చించి సంచి కోసుకుంటవ్ అంటూ పక్కా తెలంగాణ యాసలో సెటైర్లు వేసింది. నబీల్ రివేంజ్ నామినేషన్?అది ఆమెకు ఏమర్థమైందో కానీ పకాపకా నవ్వింది. విష్ణుప్రియ.. ప్రేరణను అగ్రెసివ్ అంటూ నామినేట్ చేసింది. ఇక ఈ రోజు కోసం నబీల్ వారం రోజులనుంచి ఎదురుచూస్తున్నాడు. పోయినవారం మన క్లాన్లోని వారిని నామినేట్ చేసుకోవద్దని మరీ చెప్పాడు నబీల్. కట్ చేస్తే విష్ణుప్రియ నబీల్ను నామినేట్ చేసింది. నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?అది గుర్తుపెట్టుకుని మరీ విష్ణుప్రియపై ప్రతీకారం తీర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక హరితేజ, ప్రేరణల మధ్య సైలెంట్‌వార్ కొనసాగుతూనే ఉంది. మొత్తానికి ఈ వారం హరితేజ, గౌతమ్, ప్రేరణ, యష్మి, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ నామినేషన్స్‌లో ఉన్నారు. -
బిగ్‌బాస్ 8లో ఎలిమినేషన్.. ఈసారి వేటు ఎవరిపై?
బిగ్‌బాస్ 8లో తొమ్మిదో వారం చివరకొచ్చేసింది. ఈసారి గౌతమ్, యష్మి, టేస్టీ తేజ, హరితేజ, నయని పావని నామినేషన్స్‌లో నిలిచారు. ఈసారి మెగా చీఫ్ అయ్యేందుకు బిగ్‌బాస్ పలు పోటీలు పెట్టాడు. అవినాష్ మెగాచీఫ్ అయ్యాడు. అలానే పానిపట్టు అనే టాస్క్‌లో జోష్ చూపించిన యష్మి.. ఓటింగ్‌లోనూ మంచి జోరు చూపించింది. ఈ వారం టాప్‌లో నిలిచింది. కానీ ఇప్పుడు ఈమె ప్లేస్ మారినట్లు తెలుస్తోంది.ఈసారి ఐదుగురు నామినేషన్స్‌లో ఉండగా.. శుక్రవారం రాత్రితో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. ఆన్లైన్ పోలింగ్ ప్రకారం గౌతమ్ తొలి స్థానంలోకి వచ్చాడట. ఇప్పటివరకు టాప్‌లో ఉన్న యష్మి రెండో స్థానానికి పడిపోయినట్లు తెలుస్తోంది. కొన్ని గంటల ముందు వరకు మూడు, నాలుగు, స్థానాల్లో ఉన్న టేస్టీ తేజ, హరితేజ, నయని పావని ప్లేసులు మారాయట.(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిన 'పుష్ప' విలన్ జాలీరెడ్డి)చివరలో ఉన్న నయని.. ఓటింగ్ ముగిసే సమయానికి మూడులోకి వచ్చిందట. నాలుగులో టేస్టీ తేజ, ఐదులోకి హరితేజ వెళ్లారట. అంటే చివరి రెండు స్థానాల్లో టేస్టీ తేజ, హరితేజ ఉన్నారు. లెక్క ప్రకారమైతే వీళ్లిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావాలి. కానీ హరితేజ లేదా నయని పావని ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.నామినేషన్స్‌లో ఉన్నవాళ్లలో గౌతమ్, యష్మి, టేస్టీ తేజ మంచిగా ఫెర్ఫార్మ్ చేస్తున్నారు. వీళ్లతో పోలిస్తే నయని, హరితేజ మాత్రం అంతంత మాత్రంగానే ఆడుతున్నారు. దీంతో వీళ్లిద్దరిలో ఒకరు ఈసారి బయటకెళ్లడం పక్కా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: మొదటి పెళ్లిరోజు.. స్పెషల్ వీడియోతో వరుణ్ తేజ్-లావణ్య) -
నబీల్ మ్యాచ్‌ఫిక్సింగ్.. బిగ్‌బాస్ సర్ప్రైజ్లు.. కంటెస్టెంట్ల ఏడుపులు
బిగ్‌బాస్ హౌస్‌లో అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు. దీపావళికి హౌస్‌మేట్స్‌కు వీడియో మెసేజ్‌ల రూపంలో కానుకలు అందాయి. తర్వాత అందరూ కలిసి సంతోషంగా డ్యాన్సులు వేశారు. దీంతో బిగ్‌బాస్ హౌస్ ఆనందాల హరివిల్లుగా మారింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (నవంబర్ 1) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..అవినాష్‌తో డీల్నిన్న బిగ్‌బాస్ ఇచ్చిన బీన్ బ్యాగ్ గేమ్‌లో మొదట హరితేజ, తేజ ఎలిమినేట్ అయ్యారు. ఆ గేమ్ కొనసాగింపుతో నేటి ఎపిసోడ్ మొదలైంది. ఈ ఆటలో నిఖిల్.. నబీల్ను టార్గెట్ చేశాడు. ఈ క్రమంలో నబీల్.. నిఖిల్‌ను మోచేయితో కొట్టాడు. నిఖిల్-ప్రేరణ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారని అర్థమైపోవడంతో నబీల్.. అవినాష్‌తో డీల్ కుదుర్చుకున్నాడు. నిఖిల్‌ను అవుట్ చేద్దామని.. తర్వాత తాను ఓడిపోయి అవినాష్‌ను చీఫ్ చేస్తానని మాటిచ్చాడు. అలా చివరకు అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు.నబీల్‌కు స్వీట్లు తినే ఛాన్స్తర్వాత హౌస్‌లో దీపావళి సెలబ్రేషన్స్ జరిగాయి. ఇందులో భాగంగా అబ్బాయిలు, అమ్మాయిలు అందంగా ముగ్గులు వేశారు. తర్వాత బిగ్‌బాస్ స్వీట్లు పంపించాడు. ఇక ఈ సీజన్ మొత్తం స్వీట్లు తిననని శపథం చేసిన నబీల్‌కు ఈ ఒక్కరోజు మాత్రం స్వీట్లు తినవచ్చని బిగ్‌బాస్ మినహాయింపు ఇచ్చాడు. అనంతరం బిగ్‌బాస్.. కంటెస్టెంట్ల ఇంటిసభ్యుల వీడియో సందేశాలను చూడవచ్చన్నాడు. ఎమోషనలైన తేజఅయితే ఇక్కడ కూడా అందరికీ అవకాశం ఇవ్వకుండా ప్రతి ఇద్దరిలో ఒకరికే ఛాన్స్ ఉంటుందన్నాడు. అలా మొదటగా నబీల్, పృథ్వీలలో.. నబీల్‌కు అమ్మ, అన్నయ్య నుంచి వీడియో మెసేజ్ వచ్చింది. తల్లిని టీవీలో చూడగానే నబీల్ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. రోహిణి, తేజలలో ఒకరికే వీడియో ఛాన్స్ అని బిగ్‌బాస్ చెప్పగా రోహిణి త్యాగంతో తేజకు ఫ్యామిలీ వీడియో ప్లే చేశాడు. తల్లిని స్క్రీన్‌పై చూడగానే తేజ ఎమోషనలయ్యాడు. యష్మి త్యాగంఅనంతరం నయని, యష్మిలలో ఒకరికే వీడియో ఛాన్స్ ఇవ్వగా నయనికి తల్లి మెసేజ్ ప్లే చేశారు. లైఫ్‌లో ఎన్నో ఎదుర్కొంటూ ఈ స్టేజ్‌కు వచ్చావు.. స్ట్రాంగ్‌గా ఆడు అని తల్లి ధైర్యం చెప్పడంతో నయని కళ్లలో నీళ్లు తిరిగాయి. అవినాష్ త్యాగంతో రోహిణి ఫ్యామిలీ వీడియో చూడగలిగింది. తర్వాత యష్మి త్యాగంతో విష్ణుప్రియ ఆంటీ వీడియో చూసి సంతోషపడిపోయింది. చివరగా యష్మి, అవినాష్, పృథ్వీలో ఒక్కరికే ఛాన్స్ అని చెప్పగా వీరు పృథ్వీ పేరు సూచించారు. అంతా ఏకమై సంతోషంగా..అలా పృథ్వీ తన తమ్ముడి వీడియో చూసి ఖుషీ అయ్యాడు. తర్వాత అందరూ పటాసులు కాల్చి డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. పండగ పూట హౌస్‌మేట్స్‌ను బాధపట్టడం ఇష్టం లేని బిగ్‌బాస్ సడన్‌గా అవినాష్, యష్మి, హరితేజ ఫ్యామిలీ వీడియోస్ ప్లే చేశాడు. కూతురిపై బెంగ పెట్టుకున్న హరితేజ.. చిన్నారి భూమిని చూడగానే గుక్కపెట్టి ఏడ్చింది. భావోద్వేగాలతో గుండె భారమైన కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ ప్రత్యేక భోజనం పంపించడం విశేషం.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
స్టామినా లేదంటూ తేజ కన్నీళ్లు.. గౌతమ్‌ను మెంటల్ అన్న గంగవ్వ
బీబీ ఇంటికి దారేది గేమ్‌లో ఎల్లో టీమ్ ఎటూ కాకుండా పోయింది. కనీసం కంటెండర్లు కూడా అవలేకపోయారు. రెడ్ టీమ్‌లో నుంచి ఒకరు, గ్రీన్, బ్లూ టీమ్ నుంచి ఇద్దరు చొప్పున కంటెండర్లు అయ్యారు. ఇదిలా ఉంటే అవినాష్, రోహిణి వల్లే ఇంటిసభ్యులు పస్తులుండకుండా తినగలిగారు. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 31)ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఏడుపు అనేది నా ఎమోషన్గేమ్లో కావాలనే ఏడ్చావ్ అంటూ యష్మిపై సెటైర్లు వేశాడు నిఖిల్. ఆ జోకుల్ని సరదాగా తీసుకోలేకపోయిన యష్మి నేను కష్టపడి ఆడాను.. ఏడుపు అనేది నా ఎమోషన్ అని సీరియస్‌గా బదులిచ్చింది. దీంతో నిఖిల్ చివరకు సారీ చెప్పాల్సి వచ్చింది. ఇకపోతే కిచెన్‌లో వంట చేసుకునేందుకు బిగ్‌బాస్ టైం కండీషన్ పెట్టిన సంగతి తెలిసిందే కదా! ఈరోజు వంట చేస్తుండగానే ఆ సమయం ముగియడంతో బిగ్‌బాస్ ఉన్నఫళంగా గ్యాస్ ఆఫ్ చేశాడు.ఆ ఇద్దరిల్లే అందరికీ భోజనం..దీంతో వంట చేసేదెలాగా? అని హౌస్మేట్స్ కంగారుపడ్డారు. అంతలోనే బిగ్‌బాస్.. ఆ టైం యాడ్ చేయాలంటే అవినాష్, రోహిణి చిన్న పిల్లలుగా మారి నవ్వించాలన్నాడు. ఎంటర్టైన్మెంట్ అనేది వీళ్లిద్దరికీ కొట్టిన పిండి కావడంతో పిల్లల్లా కాదు ఏకంగా చిచ్చర పిడుగుల్లా మారిపోయారు. వీరి వినోదాన్ని చూసి ముచ్చటపడిపోయిన బిగ్‌బాస్ కిచెన్ టైమర్‌కు రెండు గంటలపాటు టైం యాడ్ చేశాడు. దీంతో కంటెస్టెంట్లు వంట చేసుకుని తినగలిగారు.గౌతమ్ అవుట్ఇక బీబీ ఇంటికి దారేది టాస్క్‌లో తాడోపేడో అని చివరి ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో నిఖిల్ తన బ్లూ టీమ్‌ను గెలిపించాడు. బ్లూ టీమ్ లీడర్ హరితేజ రెండు సార్లు డైస్ రోల్ చేసే ఛాన్స్ పొందింది. అలా డైస్ ద్వారా వచ్చిన మూడు పాయింట్లను నిఖిల్‌కు ఇవ్వగా ఐదు పాయింట్లు తనకు ఇచ్చుకుంది. వీరికి రెండు ఎల్లో కార్డ్స్ రాగా.. అందులో ఒకటి రెడ్ టీమ్‌కు, మరొకటి గ్రీన్ టీమ్‌కు ఇచ్చారు. అలా రెడ్ టీమ్ నుంచి గౌతమ్, గ్రీన్ టీమ్ నుంచి విష్ణుప్రియ ఆటలో నుంచి వైదొలిగారు.కరివేపాకులా తీసిపారేసిన గంగవ్వగేమ్ నుంచి అవుట్ అవడంతో గౌతమ్ డీలా పడిపోయాడు. అదే విషయం విష్ణుప్రియ.. గంగవ్వతో చెప్తే.. అతడికేమైనా మెంటలా? ఎక్కువ ఆవేశపడతాడు. బిత్తిరి అంటూ.. కూరలో కరివేపాకులా తీసిపారేసింది. ఇక బీబీ ఇంటికి దారేది టాస్క్‌లో బీబీ ఇంటికి చేరువైన హరితేజ, నిఖిల్, అవినాష్, నబీల్, ప్రేరణ, తేజను కంటెండర్లుగా ప్రకటించారు. వీరికి తిరుగుతూనే ఉండు- గెలిచేవరకు అనే గేమ్ పెట్టాడు. ఇందులో పోటీదారులు బ్యాగులు ధరించి సర్కిల్లో తిరుగుతూ ఉండాలి.ఏడ్చేసిన తేజఫస్ట్ రౌండ్లో హరితేజ బాగానే ఆడింది కానీ తన బ్యాగు ఎక్కువ ఖాళీ అవడంతో ఆమె ఆటలో నుంచి అవుట్ అయింది. ఆటలో ఎన్నోసార్లు కింద పడుతూ లేస్తూ ఫైట్ చేసిన తేజ నెక్స్ట్ అవుట్ అయ్యాడు. దీంతో హర్టయిన తేజ.. తనకు స్టామినా ఉంటే బాగుండేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తయింది. ఇకపోతే ఈ గేమ్‌లో ఫైనల్ వరకు అవినాష్ నిలిచి మెగా చీఫ్ పదవి గెలిచాడని తెలుస్తోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మెహబూబ్ అవుట్.. నొప్పి భరించలేక అవినాష్ సెల్ఫ్ ఎలిమినేట్
పండగ సెలబ్రేషన్స్‌లో బిగ్‌బాస్ ఎప్పుడూ ముందుంటుంది. ఇటీవలే హౌస్‌లో బతుకమ్మ, దసరా వేడుకలు జరిగాయి. ఇప్పుడు దీపావళి సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకలల్లో సినీ తారలు భాగమయ్యారు. మరి హౌస్‌లో జరిగిన రచ్చ, హంగామా ఏ రేంజ్లో ఉందో లైవ్ అప్డేట్స్లో చూసేయండి..పండగ సర్ప్రైజ్నాగార్జున దీపావళి పాటకు స్టెప్పులేస్తూ పండగ కళను తీసుకొచ్చాడు. తర్వాత హౌస్‌మేట్స్‌ను జంటలుగా విడగొట్టిస్టెప్పులు మీవి- మార్కులు మావి అనే గేమ్ ఆడించాడు. ప్రతి రౌండ్లో గెలిచిన టీమ్‌కు ఒక సర్ప్రైజ్ ఉంటుందన్నాడు. అలా మొదటి రౌండ్లో గంగవ్వ-తేజ గెలిచారు. ఈ జంటలో ఒకరికే ఇంటిసభ్యుల నుంచి మెసేజ్ వస్తుందన్నాడు. అలా తేజ త్యాగంతో గంగవ్వకు తన కూతురి వీడియో మెసేజ్ ప్లే చేశారు. అది చూసిన అవ్వ సంతోషంతో కన్నీళ్లుపెట్టుకుంది. తర్వాత విష్ణుప్రియను సేవ్ చేశారు.ప్రైజ్‌మనీలో మరో రూ.1లక్షఅనసూయ డ్యాన్స్‌తో జోష్ నింపింది. ప్రైజ్‌మనీ కవర్స్ కనుక్కోవాలన్న రెండో గేమ్‌లో నిఖిల్, యష్మీ గెలిచారు. వీరు కనిపెట్టిన కవర్లలోని రూ.1 లక్ష ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. తర్వాత ఈ జంటకు సంబంధించిన ఇంటిసభ్యుల ఫోటో చూపించారు. యష్మి త్యాగం చేయడంతో నిఖిల్ పేరెంట్స్ వీడియో ప్లే చేశారు. అలాగే నాగ్ నిఖిల్‌ను సేవ్ చేశాడు.ప్రేరణకు సర్ప్రైజ్తర్వాత 'క' మూవీ టీమ్ స్టేజీపైకి వచ్చింది. వీరు హౌస్మేట్స్ కళ్లకు గంతలు కట్టి గేమ్ ఆడించారు. ఇందులో ప్రేరణ-మెహబూబ్ గెలిచారు. మెహబూబ్ త్యాగంతో ప్రేరణకు వీడియో ప్లే చేశారు. ఆమె తన పేరెంట్స్ మాటలు విని మురిసిపోయింది. తర్వాత మెహరీన్ డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. సింగర్ సమీరా భరద్వాజ్.. హౌస్మేట్స్ అందరిపైనా అలవోకగా పాటలు పడేసి అబ్బురపరిచింది. ప్రతి ఒక్కరిపైనా అద్భుతంగా పాట పాడి అదరొట్టేసింది. స్టేజీపై దుల్కర్ సల్మాన్లక్కీ భాస్కర్ మూవీ హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ వెంకీ స్టేజీపైకి వచ్చారు. డైరెక్టర్స్ త్రివిక్రమ్, వెంకీలలో ఎవరిని సెలక్ట్ చేస్తావన్న ప్రశ్నకు మీనాక్షి.. వెంకీ అని బదులిచ్చింది. లక్కీ భాస్కర్ టీమ్ ఆడించిన గేమ్‌లో గౌతమ్-నయని పావని జంట గెలిచింది. వీరిలో నయని పావని తన తల్లి మెసేజ్‌ను త్యాగం చేయడంతో గౌతమ్.. అతడి తండ్రి వీడియో సందేశాన్ని వినగలిగాడు. ఇంట్లో గొడవపడి వచ్చిన గౌతమ్.. తండ్రికి సాష్టాంగ నమస్కారం చేసి మరీ సారీ చెప్పాడు.హరితేజ ఎమోషనల్హీరోయిన్ శాన్వీ స్పెషల్ డ్యాన్స్ పర్ఫామెన్స్తో మైమరపించింది. తర్వాత ప్రేరణ, పృథ్వీని సేవ్ చేశారు. అనంతరం అమరన్ హీరో శివకార్తికేయన్, హీరోయిన్ సాయిపల్లవి స్టేజీపైకి వచ్చారు. వీరు ఆడించిన గేమ్‌లో రోహిణి, అవినాష్ గెలిచారు. వీళ్లిద్దరూ తమకు బదులుగా హరితేజకు తన కూతురి వీడియో చూపించమన్నాడు. హాయ్ అమ్మ, హ్యాపీ దివాళి అంటూ కూతురు మాట్లాడిన ముద్దుముద్దు మాటలు విని హరితేజ ఏడ్చేసింది. తర్వాత హైపర్ ఆది హౌస్‌లోకి వచ్చి తన పంచ్ కామెడీతో నవ్వించాడు.ఏడ్చిన యష్మిఈ ఎపిసోడ్ కంటే ముందు ఏం జరిగిందన్నది చూపించారు. ఎవరినో ఉడికించడానికి యష్మి తనను వాడుకోవడం నచ్చలేదన్నాడు గౌతమ్. ఆ మాటలు విన్న యష్మి.. తన ఉద్దేశం అది కాదంటూ ఏడ్చేసింది. నిఖిల్, నేను ఫ్రెండ్స్‌లా టీజ్ చేసుకున్నాం తప్ప నువ్వంటే నాకు బాగా ఇష్టం అని ఎక్కడా ఒకరికొకరం ఎక్స్‌ప్రెస్ చేసుకోలేదు. నా వల్ల తప్పు జరిగుంటే సారీ అని చెప్పింది. దీంతో గౌతమ్.. ఇకపై నువ్వు నాకు కంటెస్టెంటు మాత్రమే.. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అని క్లారిటీ ఇచ్చేశాడు. నాగ్ నయనిని సేవ్ చేసి మెహబూబ్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు.అప్పుడలా ఇప్పుడిలా..వెళ్లిపోయేముందు మెహబూబ్ హౌస్‌మేట్స్‌ను పటాకాలతో పోల్చాడు. అవినాష్ ధౌజండ్‌వాలా, గంగవ్వ లక్ష్మీబాంబ్, నబీల్ రాకెట్, రోహిణి కాకరబత్తి, గౌతమ్ మ్యాచ్ స్టిక్ అన్నాడు. గతంలోనూ దీపావళికి నేను ఎలిమినేట్ అయ్యా.. ఈసారి కూడా దీపావళికే బయటకు వచ్చేశాను. ఎందుకో అర్థం కావట్లేదంటూ ఎమోషనల్ అయ్యాడు. అవినాష్ ఎలిమినేట్ఇక రేపటి ప్రోమోలో అవినాష్ అనారోగ్యంతో సెల్ఫ్ ఎలిమినేట్ అయినట్లు చూపించారు. కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాను. మెడికల్ రూమ్‌కు వెళ్తే బయటకు వచ్చేయమన్నారు. వెళ్లిపోతున్నాను అంటూ వీడ్కోలు తీసుకున్నాడు. హాస్పిటల్‌కు వెళ్లి మళ్లీ హౌస్‌లో అడుగుపెడతాడా? లేదా నిజంగానే వెళ్లిపోతాడా? అన్నది రేపు తేలనుంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హడలెత్తించిన నిఖిల్, పృథ్వీ.. కూతురి కోసం హరి కన్నీళ్లు!
ఫిజికల్ టాస్క్ వస్తే పృథ్వీకి తెలియకుండానే పూనకం వస్తుంది. మనుషుల్ని పిట్టల్లా విసిరేస్తూ, పురుగుల్లా నలిపేస్తుంటాడు. ఈ రోజూ ఇదే జరిగింది. ఈసారి నిఖిల్ తోడయ్యాడు. టాస్కులో ఈ దోస్తులిద్దరూ అరాచకం సృష్టించారు. మరి వీరితో పోటీపడిందెవరు? హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 24) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..నిఖిల్, పృథ్వీ అరాచకంబీబీ రాజ్యం ఛాలెంజ్ కొనసాగింపుగా నేటి ఎపిసోడ్ ప్రారంభమైంది. ఎనిమిది ధాన్యపు బస్తాలను తోపుడు బండిపై ఎవరు ముందుగా పెడతారో ఆ టీమ్‌కు రాజ్యంలో వ్యవసాయం దక్కుతుందన్నాడు. ఓజీ టీమ్ నుంచి నిఖిల్, పృథ్వీ విజృంభించి ఆడారు. వారిని అడ్డుకునేందుకు గౌతమ్, మెహబూబ్ చాలావరకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొట్టుకున్నారు, తోసేసుకున్నారు. నానా అరాచకం సృష్టించడంతో బిగ్‌బాస్ కొన్ని సెకన్లపాటు గేమ్‌ను పాజ్ చేశాడు. అదుర్స్ అనిపించిన తేజ, అవినాష్అలాగే ఈ ఆటలో పోటీదారులను మార్చుకోవచ్చని వెసులుబాటు కల్పించాడు. అలా గౌతమ్, మెహబూబ్ స్థానంలోకి అవినాష్, తేజ వచ్చారు. వీళ్లు కూడా తమ శక్తికి మించి ప్రయత్నించి ఆడారు. వాళ్లు ఎంతో కష్టపడి ఓ సంచిని బండిపై పెట్టారు. కానీ అది ముందు ఓజీ తోపుడు బండికి టచ్ అయిందంటూ వారికే పాయింట్ ఇస్తానని సంచాలకురాలు యష్మి వితండ వాదం చేసింది. ఒక్క బస్తా కూడా రాయల్ టీమ్‌ను పెట్టనివ్వకపోవడం నిఖిల్, పృథ్వీల శక్తికి నిదర్శనం.మనలో ఒకరే విన్నర్ఫైనల్గా ఈ గేమ్‌లో ఓజీ టీమ్ గెలవడంతో వ్యవసాయ భూమి గెలిచారు. అలాగే తన టీమ్‌లో నుంచి పృథ్వీని మెగా చీఫ్ కంటెండర్‌గా ప్రకటించారు. ఈ క్రమంలో కంటెండర్ అవ్వాలనుకున్న ప్రేరణకు, యష్మికి మధ్య గొడవ జరిగింది. ఈ ఇద్దరికీ సర్ది చెప్పిన నిఖిల్.. ఇది మన సీజన్.. మన టీమ్‌లోని ఒకరే ట్రోఫీ ఎత్తాలి. మనలో మనకు గొడవలొద్దు అని టీమ్ సభ్యులకు హితోపదేశం చేశాడు. ఓడిన రాయల్స్ టీమ్ నుంచి గంగవ్వను మెగా చీఫ్ కంటెండర్ పోస్టు నుంచి తప్పించారు.కూతుర్ని తల్చుకుని హరితేజ ఎమోషనల్వచ్చినప్పటినుంచి మేమే గెలిచాం అని రాయల్స్ ఫీల్ అవుతున్నారు. మనం మిగతా టాస్కులు గెలిచి ఆ పొగరును తగ్గించేయాలని ప్రేరణ.. నబీల్‌తో అంది. అన్నట్లుగానే తర్వాత టాస్కుల్లోనూ దూకుడు ప్రదర్శించారు. మరోవైపు హరితేజ.. తన కూతురు భూమిని తల్చుకుని ఎమోషనలైంది. అమ్మ గురించి బెంగపెట్టుకోకు, స్కూలుకు వెళ్లు, పిన్నితో ఆడుకో.. వీకెండ్లో నాన్న వస్తాడు. అమ్మమ్మ, తాతయ్య అందరూ ఉన్నారు, నీకోసం ఏడవట్లేదు. నువ్వు కూడా ఏడవొద్దంటూనే కన్నీళ్లు పెట్టుకుంది.మళ్లీ ఓజీ టీమ్‌దే గెలుపుబీబీ రాజ్యంలో సైన్యం, హాస్పిటల్‌ను పొందడానికి బిగ్‌బాస్ వైరల్ అటాక్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఓజీ టీమ్ నుంచి నిఖిల్, నబీల్ ఆడగా రాయల్ టీమ్ నుంచి గౌతమ్, తేజ ఆడారు. మరోసారి ఓజీ టీమ్ గెలిచి హాస్పిటల్, సైన్యం పొందింది. అలాగే తన టీమ్‌లో నుంచి నిఖిల్‌ను మెగా చీఫ్ కంటెండర్‌గా ప్రకటించారు. రాయల్స్ నుంచి గౌతమ్‌ను మెగా చీఫ్ కంటెండర్ రేసు నుంచి తప్పించారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నిఖిల్‌పై మనసు పారేసుకున్న యష్మి, అవ్వకు ఆస్కార్ ఇవ్వాల్సిందే!
సమయం దొరికినప్పుడల్లా అవినాష్ అటు హౌస్‌మేట్స్‌ను, ఇటు ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నాడు. అటు తేజ, అవినాష్.. గంగవ్వను దెయ్యం పట్టినట్లు యాక్ట్ చేయమన్నారు. కానీ గంగవ్వ ఏకంగా జీవించేసింది. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 23) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..తిక్క కుదిర్చిన బిగ్బాస్ఇంటిని శుభ్రంగా ఉంచట్లేదని, తన ఆదేశాలను లెక్కచేయట్లేదని బిగ్‌బాస్ హర్టయ్యాడు. అందుకని ఈ వారం సూపర్మార్కెట్లో షాపింగ్ చేసే సమయాన్ని కాస్త కట్ చేసిపారేశాడు. దీంతో మెగా చీఫ్ గౌతమ్.. నిఖిల్‌ను మార్కెట్‌కు పంపించి అతడితో షాపింగ్ చేయించాడు.యష్మి- నిఖిల్ లవ్ ట్రాక్?ఇక యష్మి.. నిఖిల్‌ను తనతో మాట్లాడమని బతిమాలింది. ఫ్రెండ్స్‌గా ఉన్నప్పుడే బాగుండేది.. నా వల్ల నీ గేమ్‌కు ప్రాబ్లం కానివ్వను. నాది పడిపడి చచ్చే క్యారెక్టర్ అయితే కాదు, ఇకపై జస్ట్ ఫ్రెండ్‌గా ఉంటా అని చెప్పుకుంటూ పోయింది. నిఖిల్ శిలావిగ్రహంలా స్తబ్దుగా కూర్చోవడంతో కోపంతో వెళ్లిపోయింది. ఆమె అలకను తీర్చేందుకు నిఖిల్.. యష్మిని హత్తుకుని ముద్దిచ్చాడు.ఇంకా పృథ్వీ వెనకే పడుతోన్న విష్ణుపృథ్వీ మెడలో గోల్డ్ చెయిన్ చూసి నిలువెత్తు బంగారం.. మళ్లీ బంగారం వేసుకుని తిరగడమేంటో అని మురిసిపోయింది. ఈ మాట విన్న హౌస్మేట్స్ ఇక మా వల్లకాదు, వెళ్లిపోతాం అని జోక్ చేశారు. బిగ్‌బాస్ కూడా సరే, మీ సరదా నేనెందుకు కాదంటాను అన్నట్లు గేట్లు తెరిచాడు. దీంతో అబ్బాయిలంతా కలిసి అవినాష్‌ను లాక్కెళ్లి మరీ బయట పడేసేందుకు ప్రయత్నించారు.మనసు మార్చుకున్న బిగ్బాస్అనంతరం బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ మేరకు అవినాష్ జిమ్ ట్రైనర్‌గా మారి హౌస్‌మేట్స్‌తో చిత్రవిచిత్రమైన కసరత్తులు చేయించి నవ్వించాడు. దీంతో కిచెన్ టైమర్‌కు మరో రెండు గంటల సమయం యాడ్ చేశాడు. అలాగే మార్కెట్లో మర్చిపోయిన కూరగాయలు, పండ్లను సైతం పంపించి తన మనసు వెన్న అని నిరూపించుకున్నాడు.అవ్వకు ఆస్కార్ ఇవ్వాల్సిందే!అవినాష్, తేజ.. గంగవ్వను దెయ్యంలా రెడీ అయి భయపెట్టాలన్నాడు. ఇంకేముంది.. అర్ధరాత్రి గంగవ్వ జుట్టు విరబోసుకుని కేకలు వేయడంతో హౌస్మేట్స్ నిద్రలో నుంచి లేచి జడుసుకున్నారు. ఇది చూసిన తేజ.. నెక్స్ట్ వీక్ నామినేషన్స్ పక్కా అని భయపడిపోయాడు. నిఖిల్, పృథ్వీ, నబీల్ మాత్రం నిద్రలో నుంచి లేవలేదు. అయితే ఇది ప్రాంక్ అని, అవినాష్ చేయించి ఉంటాడని గౌతమ్ అనుమానపడ్డాడు.మెగా చీఫ్ కంటెండర్‌గా రోహిణిబీబీ రాజ్యం ఏర్పాటు చేసుకునేందుకు రెండు క్లాన్స్ పోటీపడతాయన్నాడు. మొదటగా అక్వేరియంలో నీళ్లను నింపే టాస్కులో రాయల్ టీమ్ గెలిచింది. అందుకు గానూ రాజ్యంలో మంచినీటి సరస్సును పొందారు. అలాగే రాయల్ టీమ్‌లో నుంచి రోహిణి మెగా చీఫ్ కంటెండర్ అయింది. అలాగే ఓజీ టీమ్‌లో యష్మి మెగా చీఫ్ కంటెండర్ రేసు నుంచి తప్పుకుంది. రోహిణిని కంటెండర్‌గా సెలక్ట్ చేయడంపై హరితేజ రాద్దాంతం చేసింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేరణపై పగ తీర్చుకున్నారు.. ప్రైజ్‌మనీని ఖాతరు చేయని నబీల్
నామినేషన్స్.. ఈసారి అన్నీ రివేంజ్ నామినేషన్సే పడ్డాయి. ప్రైజ్‌మనీ తగ్గినా తనకేం పర్వాలేదన్నట్లు ప్రవర్తించాడు నబీల్. ఇంతకీ నామినేషన్స్‌కు, ప్రైజ్‌మనీకి ఏం సంబంధం? ఎవరు ఎవర్ని నామినేట్ చేశారనేది తెలియాలంటే నేటి (అక్టోబర్ 21) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..నామినేషన్స్ షురూఇంట్లో ఉండేందుకు అర్హత లేని ఇద్దరు ఇంటిసభ్యుల దిష్టిబొమ్మలపై కుండ పెట్టి పగలగొట్టాలని బిగ్‌బాస్ చెప్పాడు. నామినేషన్ షీల్డ్ ఎవరిదగ్గరైతే ఉంటుందో వారిని నామినేట్ చేసినప్పుడల్లా ప్రైజ్‌మనీలో నుంచి రూ.50 వేలు పోతాయని హెచ్చరించాడు. మెగా చీఫ్ గౌతమ్.. ఈ నామినేషన్ షీల్డ్‌ను హరితేజకు ఇచ్చాడు.పృథ్వీ మీద ప్రేమతో.. పోయినవారం తేజకు బదులుగా పృథ్వీని నామినేట్ చేయడం నచ్చలేదని పరోక్షంగా చెప్తూ ప్రేరణను నామినేట్ చేసింది విష్ణు. గేమ్ స్లో అయిపోతుందంటూ, లైటర్ కోసం పాయింట్ ఇవ్వడం నచ్చలేదని నిఖిల్ దిష్టిబొమ్మపై కుండ పగలగొట్టింది. అలాగైతే నువ్వు అందరికంటే ముందు బ్రేక్‌ఫాస్ట్ చేసి పాయింట్ ఇచ్చేశావ్గా అని నిఖిల్ అనడంతో విష్ణు నీళ్లు నమిలింది. తర్వాత రోహిణి.. ఆటలో ఫిజికల్ అవడం నచ్చలేదని నిఖిల్‌ను నామినేట్ చేసింది. సెల్ఫిష్‌గా ఆలోచిస్తావ్, గేమ్‌లో అగ్రెసివ్ అవుతున్నావంటూ పృథ్వీని నామినేట్ చేసింది. బాడీ షేమింగ్పృథ్వీ.. పోయినవారం కిల్లర్ గర్ల్‌గా తనను నామినేట్ చేసినందుకు ప్రేరణ కుండ పగలగొట్టి తనపై ప్రతీకారం తీర్చుకున్నాడు. టాస్క్‌లో వీక్, ఆటలో జీరో.. నీకు రన్నింగ్ కూడా రావాలి, అది అంత ఈజీ కాదు అని రోహిణిని పై నుంచి కింది వరకు చూశాడు. తనను బాడీ షేమింగ్ చేయడంతో రోహిణికి చిర్రెత్తుకొచ్చింది. ఆ చూపేంటి? బాడీ షేమింగా? ఓవరాక్షన్ చేయకు.. తొక్కలో నామినేషన్స్ చేయకు అని ఇచ్చిపడేసింది.సెల్ఫిష్ గేమ్నయని పావని.. బ్యాటరీ టాస్కులో సెల్ఫిష్‌గా ఆడారంటూ మెహబూబ్, నిఖిల్‌ను నామినేట్ చేసింది. హరితేజ వంతురాగా.. ప్రేరణను నామినేట్ చేస్తూ కొంపలు మునిగాక రావడం మానేయమని సలహా ఇచ్చింది. సెల్ఫిష్‌గా ఆడావంటూ మెహబూబ్‌ను నామినేట్ చేసింది. ప్రైజ్‌మనీ తగ్గినా పర్లేదంటూ..నబీల్.. నన్ను ఇమ్మెచ్యూర్ అనడం నచ్చలేదు, అలాగే వేరేవాళ్ల పనుల్లో దూరకు అంటూ ప్రేరణ దిష్టిబొమ్మపై కుండ పగలగొట్టాడు. ప్రైజ్‌మనీలో నుంచి రూ.50 వేలు పోయినా పర్లేదంటూ హరితేజను నామినేట్ చేశాడు. మీకు డెసిషన్ తీసుకోవడం రావట్లేదు. అలాగే నాకు ఇంట్లో ఉండేందుకు అర్హత లేదని నా సూట్‌కేస్ బయటపెట్టడం నచ్చలేదని కుండ పగలగొట్టాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్: నామినేషన్స్‌లో ఆరుగురు.. ఎవరెవరంటే?
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ మొదలైందే పద్నాలుగో మందితో! అందులో ఆరుగుర్ని పంపించేశాక ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలను దింపారు. అప్పటినుంచి ఆట రసవత్తరంగా మారింది. అయితే వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత కూడా పాత కంటెస్టెంట్లు సీత, మణికంఠ ఎలిమినేట్ అయ్యారు. నిజానికి ఇందులో మణికంఠకు బదులు గౌతమ్ వెళ్లిపోవాల్సింది.కానీ ఆరోగ్యం సహకరించడం లేదంటూ మణి స్వతాహాగా బయటకు వచ్చేశాడు. ఇక గౌతమ్ మెగా చీఫ్ కావడంతో ఎనిమిదో వారం నామినేషన్స్ నుంచి బతికిపోయాడు. ఈ వారం నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, విష్ణు, మెహబూబ్, నయని పావని, హరితేజ నామినేషన్స్‌లో ఉన్నారట.. గౌతమ్ తనకున్న పవర్‌తో హరితేజను నామినేషన్స్‌లో నుంచి సేవ్ చేసినట్లు సమాచారం! మరి ఈ ఆరుగురిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు? ఎవరు సేవ్ అవుతారనేది చూడాలి!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు కానీ!
బిగ్‌బాస్ 8లో ఏడో వారం చివరకొచ్చేసింది. ప్రస్తుతం హౌస్‌లో ఓవర్ స్మార్ట్ గేమ్ నడుస్తోంది. కొట్లాడుకుని మరీ ఛార్జింగ్ కోసం ఆపసోపాలు పడుతున్నారు. శుక్రవారం సాయంత్రం కల్లా ఇది అయిపోతుంది. వీకెండ్ వచ్చేస్తుంది కాబట్టి ఎలిమినేషన్ టెన్షన్ కచ్చితంగా ఉంటుంది. అందుకు తగ్గట్లే ఈసారి ఓటింగ్‌లో ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది.గత ఆరు వారాల్లో బేబక్క, శేఖర్ భాషా, అభయ్, సోనియా, నైనిక, ఆదిత్య ఓం, సీత ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్స్‌లో ఏకంగా తొమ్మిది మంది ఉన్నారు. నిఖిల్, పృథ్వీ, నబీల్, మణికంఠ, ప్రేరణ, యష్మి, గౌతమ్, హరితేజ, టేస్టీ తేజ ఉన్నారు. గేమ్ పరంగా ఆకట్టుకుంటున్న నబీల్.. టాప్‌లో కొనసాగుతున్నాడట.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ నుంచి బయటకెళ్లిపోతా.. నిఖిల్ vs గౌతమ్)ఓటింగ్ పరంగా నబీల్ తర్వాతి స్థానాల్లో వరసగా నిఖిల్, మణికంఠ, ప్రేరణ, పృథ్వీ, యష్మి, హరితేజ, టేస్టీ తేజ, గౌతమ్ ఉన్నారు. వీళ్లలో పృథ్వీపై సోషల్ మీడియాలో ఘోరమైన వ్యతిరేకత ఉంది. నామినేషన్ సందర్భంగా అవినాష్ భార్య గురించి చీప్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది. అదే టైంలో ఇతడి ఆటని ఇష్టపడేవాళ్లు కూడా ఉన్నారని ఓటింగ్ చూస్తుంటే తెలుస్తోంది.చివరి మూడు స్థానాల్లోనూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్సే ఉన్నారు. వీళ్లలో టేస్టీ తేజ కాస్తోకూస్తో ఎంటర్ టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. గౌతమ్ అయితే యష్మితో మెల్లగా మాటలు కలుపుతూ లవ్ ట్రాక్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. లెక్క ప్రకారం చూసుకుంటే వీళ్లిద్దరి ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేస్తారా? లేదంటే ఉన్నా లేనట్లే కనిపిస్తున్న హరితేజని ఇంటికి పంపించేస్తారా అనేది చూడాలి. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
ప్రతివారం అరతులం బంగారమిస్తా.. గంగవ్వకు మణి బంపరాఫర్
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ అంతా అన్లిమిటెడ్ ఫుడ్ కావాలన్నాడు నబీల్. అయితే ఇది గొంతెమ్మ కోరికగా భావించిన బిగ్‌బాస్ ఈ వారం మాత్రమే కావాల్సినంత ఫుడ్ ఇస్తానన్నాడు. కానీ ఓ తిరకాసు పెట్టాడు. అదేంటో తెలియాలంటే నేటి (అక్టోబర్ 16) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..నా జీవితంలో జరిగిన ఘోరంవిష్ణుప్రియ తన మనసులోని బాధను చెప్పడంతో గంగవ్వ ఎమోషనలైంది. అమ్మకు ఇష్టం లేదని చిన్నప్పటినుంచి నాన్నతో మాట్లాడేవాళ్లం కాదు. నాన్నపై ఎంత ప్రేమ ఉన్నా, అమ్మ కోసం ఆయనతో మాట్లాడలేదు. చిన్నప్పుడే అమ్మానాన్న విడిపోయారు.. అది నా జీవితంలో జరిగిన ఘోరం.. ఇది ఎవరికీ జరగకూడదు. అమ్మ చనిపోయాక ఇప్పుడిప్పుడే తనతో మాట్లాడుతున్నాం అని చెప్పింది. ఇది విని గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుంది.హౌస్మేట్స్ కోసం నబీల్ త్యాగంఇకపోతే ఇన్ఫినిటీ రూమ్‌లో నబీల్ అన్లిమిటెడ్ ఫుడ్ కావాలన్న సంగతి తెలిసిందేగా! దాని గురించి బిగ్‌బాస్ ప్రస్తావిస్తూ.. ఇంట్లో ఉన్నంతకాలం నబీల్ స్వీట్లు, కూల్‌డ్రింక్స్, చాక్లెట్లు త్యాగం చేస్తే ఈ ఒక్క వారం అన్లిమిటెడ్ రేషన్ లభిస్తుందన్నాడు. ఇంటిసభ్యులందరికోసం ఆ కండీషన్‌కు నబీల్ ఓకే చెప్పాడు. దీంతో మెహబూబ్.. సూపర్ మార్కెట్లో ఉన్న రేషన్ అంతా ఊడ్చేశాడు.బంగారం ఇస్తానన్న మణికంఠతర్వాత నాగమణికంఠ.. తాను నామినేషన్స్‌లో నుంచి సేవ్ అయితే గంగవ్వకు బంగారు ముక్కుపుడక ఇస్తానన్నాడు. సేవ్ అయిన ప్రతివారం అరతులం ఇస్తానంటూ గంగవ్వ మీద ఒట్టేశాడు. మరి నాకేం ఇస్తావని రోహిణి అనగా ఒక ముద్దిస్తానన్నాడు. ఇక అవినాష్-రోహిణి నామినేషన్స్‌ను రీక్రియేట్ చేసి నవ్వించారు. వీరి పర్ఫామెన్స్ మెచ్చిన బిగ్‌బాస్ కిచెన్‌లో మరో రెండు గంటలు ఎక్కువ సేపు వంటచేసుకునే ఛాన్సిచ్చాడు. మెగా చీఫ్ కంటెండర్‌గా గంగవ్వఅనంతరం రాయల్ టీమ్ గెలుపొందిన మెగా చీఫ్ కంటెండర్ షీల్డ్‌ను గంగవ్వకిచ్చారు. బిగ్‌బాస్.. రాయల్ టీమ్‌ను ఓవర్ స్టార్ట్ఫోన్లుగా, ఓజీ టీమ్‌ను ఓవర్ స్మార్ట్ చార్జర్లుగా విభజించారు. హౌస్ అంతా రాయల్ టీమ్ ఆధీనంలో, గార్డెన్ ఏరియా ఓజీ టీమ్ ఆధీనంలో ఉంటుందన్నాడు. కిచెన్, బెడ్రూమ్, వాష్‌రూమ్ వంటి వసతులు అందిస్తూ చార్జింగ్ పొందవచ్చని తెలిపాడు.బెంబేలెత్తిపోయిన మణికంఠటాస్క్ పూర్తయ్యేలోపు బతికున్న సభ్యులే మెగాచీఫ్ కంటెండర్లవుతారన్నాడు. టాస్క్ ప్రారంభానికి ముందే మణి బెంబేలెత్తిపోయాడు. నాకంటూ ఫ్యామిలీ ఉంది. బొక్కలిరగ్గొట్టుకుని బయటకు వెళ్లలేను. ఆరోగ్యం ముఖ్యం.. టీమ్‌కు ఎంతవరకు సపోర్ట్ ఇవ్వాలో అంతే ఇస్తానని చెప్పాడు. ఆట మొదలవగానే అవినాష్.. నబీల్‌కు తెలియకుండా అతడి చార్జర్‌ను తన ప్లగ్‌కు కనెక్ట్ చేశాడు. హరికథ చెప్పి చార్జింగ్హరితేజ.. హరికథతో మణికంఠను మెప్పించి అతడి దగ్గర నిమిషం పాటు చార్జింగ్ పొందింది. నయని కూడా యష్మి దగ్గర బలవంతంగా చార్జ్ పొందడానికి ట్రై చేసింది. కానీ నిఖిల్ ఆమెను అడ్డుకుని అవతలకు విసిరేయడంతో కన్నీళ్లు పెట్టుకుంది. అలా నేటి ఎపిసోడ్ ముగిసింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హింటిస్తే అర్థం చేసుకోరే..! మణిని చెడుగుడు ఆడుకున్న గంగవ్వ
వైల్డ్‌కార్డ్ ఎంట్రీలతో హౌస్ కళకళలాడిపోయింది. సీజన్ ప్రారంభం అయినప్పుడు 14 మంది ఉన్నారు. కానీ వైల్డ్ కార్డ్స్ రాకతో కంటెస్టెంట్ల సంఖ్య 16కు చేరుకుంది. మరి వీళ్ల నామినేషన్స్ ఎలా ఉన్నాయో నేటి (అక్టోబర్ 7) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..గంగవ్వా.. మజాకా!వైల్డ్ కార్డ్స్‌ను చూసి హౌస్‌మేట్స్‌కు భయం పట్టుకుంది. ఎవరు ఎలాంటివాళ్లు, ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలనేది చర్చించుకున్నారు. తర్వాతి రోజు ఉదయం గంగవ్వ మణికంఠను ఓ ఆటాడుకుంది. నీ పెండ్లాం, పిల్ల యాదొచ్చిందని ఏడ్చినవ్.. అంత యాదికొస్తే ఎందుకొచ్చినవ్ ఇక్కడికి అని కౌంటర్ వేసింది. నా బాధ తట్టుకోలేకున్నా అని మణి అంటే మరి ఈ వారం పోతవా అని మరో పంచ్ వేసింది. ఇకపోతే ప్రైజ్‌మనీ రూ.38 లక్షలకు చేరుకుంది.తేజకు శిక్షఓజీ టీమ్ పాలు సహా కొన్ని రేషన్ సామానును రాయల్ టీమ్‌కు ఇచ్చేందుకు తటపటాయించింది వచ్చీరావడంతోనే తనతో బోళ్లు తోమించారని అవినాష్ తెగ ఫ్రస్టేట్ అయ్యాడు. దీంతో అతడికి హరితేజ, మణికంఠ సాయం చేశారు. ఆడుతూపాడుతూ బోళ్లన్నీ తోమేశారు. మరోవైపు టేస్టీ తేజ కూర్చోవడంతో కుర్చీ విరిగిపోయింది. బిగ్‌బాస్ ప్రాపర్టీ ధ్వంసం చేసిన పాపానికి కాసేపు అతడు కుక్కలా నటించాడు.మణికంఠను టార్గెట్ చేశావ్..తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలైంది. రాయల్ టీమ్‌కు మాత్రమే నామినేట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. మొదటగా హరితేజ.. గ్రూపిజం చేస్తున్నావు, మణికంఠను టార్గెట్ చేశావంటూ యష్మిని నామినేట్ చేసింది. ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావ్, సొంతంగా ఆడటం లేదంటూ పృథ్వీని నామినేట్ చేసింది. గౌతమ్.. నీ గేమ్ వదిలేసి వేరొకరి వెనకాల పడుతున్నావంటూ విష్ణుప్రియను, మణికంఠపై ప్రతీకారం తీర్చుకోవడం బాగోలేదని యష్మిని నామినేట్ చేశాడు. మణిని టార్గెట్ చేయడం వల్లే అతడికి సింపతీ వస్తోందని రాయల్ టీమ్ హింటిస్తోంది. కానీ దాన్ని యష్మీ అర్థం చేసుకోలేకపోయింది.మెహబూబ్ సిల్లీ నామినేషన్స్నయని వంతురాగా.. నీకసలు సీరియస్‌నెస్, ఇంట్రస్ట్ లేదంటూ విష్ణు మెడలో నామినేటెడ్ బోర్డు వేసింది. సీత మెడలోనూ బోర్డు వేస్తూ.. నామినేట్ చేయడం దేనికి? బయటకు వెళ్లిపోతుంటే ఏడ్వడం దేనికని ఆమె ఎమోషన్‌ను ప్రశ్నించింది. మెహబూబ్ వంతురాగా.. నువ్వు నాతో సరిగా మాట్లాడలేదంటూ సీతను నామినేట్ చేశాడు. మా రాకను జీర్ణించుకోలేకపోతున్నారంటూ యష్మి మెడలో బోర్డు వేశాడు. తేజ మాట్లాడుతూ.. చీఫ్‌గా ఫెయిలయ్యావంటూ సీతను నామినేట్ చేశాడు. ఒక్కో పాయింట్ కూడా తూటామణికంఠ మెడలో బోర్డు వేస్తూ కరెక్ట్ పాయింట్లు చెప్పాడు. 1. ఎప్పుడు చూసినా నీ గోడు చెప్పుకుంటూనే ఉంటావ్.. అది నీ గేమా? 2. సీత నీకు ఫ్రెండ్ అన్నావ్, కానీ బిగ్‌బాస్ అడిగినప్పుడు నబీల్, విష్ణు పేర్లు మాత్రమే చెప్పావ్, అంటే సీత నీ ఫ్రెండ్ కాదా? 3. తన ఫుడ్ వస్తే తీసుకోవద్దని పృథ్వీ మరీ మరీ చెప్పాడు, అయినా సరే యష్మిది పక్కనపెట్టి మరీ అతడికే ఫుడ్ తీసుకెళ్లావ్.. దీన్నెలా అర్థం చేసుకోవాలంటూ మణికంఠను నామినేట్ చేశాడు. యష్మి సైకోయిజం!ఈ నామినేషన్ జరుగుతున్నప్పుడు యష్మి ఆనందం అంతా ఇంతా కాదు. చప్పట్లు కొట్టి మరీ సంతోషించింది. మణికంఠ ఎప్పటిలాగే తడబడకుండా సమాధానాలిచ్చాడు. పదేపదే ఏడ్వడం మానుకుంటున్నానని, సీత ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ కాదని, మదర్ సెంటిమెంట్ వల్లే పృథ్వీకి ఫుడ్ ఇచ్చానని మూడింటికీ ఆన్సరిచ్చాడు. మిగతావారి నామినేషన్స్ రేపటి ఎపిసోడ్లో ప్రసారం కానుంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: పదోవారం హరితేజ ఎలిమినేట్
సీరియల్స్, సినిమాలతో పాపులర్ అయింది హరితేజ. బిగ్‌బాస్ మొదటి సీజన్లో అడుగుపెట్టి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. గలగలా మాట్లాడే ఈమె గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఈ షో తర్వాత సినిమాల్లో బిజీ అవడమే కాకుండా హోస్ట్‌గానూ అవతారమెత్తింది. ఫిదా మీ ఫేవరెట్ స్టార్‌తో, పండగ చేస్కో, సూపర్ సింగర్, లక్కీ ఛాన్స్.. ఇలా పలు షోలకు యాంకర్‌గా వ్యవహరించింది.అఆ, యూ టర్న్, అరవింద సమేత వీర రాఘవ, ప్రతిరోజు పండగే, హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హరితేజ ఇటీవలే రిలీజైన దేవర సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా మెప్పించింది. యాక్టింగ్, యాంకరింగ్ రెండింట్లోనూ ఆరితేరిన ఈమె ఇప్పుడు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. మూడేళ్ల కూతురిని వదిలేసి మరీ రియాలిటీ షోలో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈసారి జనాల్ని అంతగా మెప్పించలేకపోయింది. ఫలితంగా పదోవారమే హౌస్‌లో నుంచి వెళ్లిపోయింది. -
బిగ్‌బాస్ 8 రీలోడ్: వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు ఇమ్యూనిటీ.. వాటే ట్విస్ట్
గత ఏడు సీజన్లకంటే కూడా ఈసారి బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ లాంచింగ్ ఎపిసోడ్‌కు అత్యధిక టీఆర్పీ వచ్చింది. కానీ కంటెస్టెంట్లు ఆ రేటింగ్‌ను అలాగే కాపాడుకోలేకపోయారు. నెమ్మదిగా షో బోరింగ్‌గా మారుతుండటంతో బిగ్‌బాస్ ఇక లాభం లేదనుకుని పాత సీజన్లలో పాల్గొన్న పలువురినే వైల్డ్ కార్డ్ ఎంట్రీల పేరిట హౌసులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆదివారం.. 'బిగ్‌బాస్ గ్రాండ్ రీలోడ్' పేరిట ఎపిసోడ్ ప్రసారమైంది. ఇంతకీ హౌస్‌లోకి వచ్చిందెవరో చూసేయండి..నైనిక ఎలిమినేట్'జవాన్' టైటిల్ సాంగ్, 'గేమ్ ఛేంజర్' నుంచి రీసెంట్గా రిలీజైన 'రా మచ్చా' పాటలకు స్టెప్పులేసి ఆదివారం ఎపిసోడ్‌కి హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. వచ్చీ రాగానే డేంజర్ జోన్లో ఉన్న మణికంఠ, విష్ణుప్రియ, నైనికని నిలబెట్టారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలని ఎలా ఎదుర్కోబోతున్నారో ఎదుర్కోబోతున్నారని హౌస్‌మేట్స్‌ను అడగ్గా వారంతా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నైనిక ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించడంతో సీత ఎప్పటిలాగే కన్నీటి కుళాయిని ఓపెన్ చేస్తూ బోరున ఏడ్చేసింది.ఎవరికి ఏ ట్యాగ్?స్టేజీపైకి వచ్చిన నైనికని హౌసులో ఎవరు ఎలాంటి వారనేది నాగ్ అడగ్గా.. ప్రేరణ మ్యానిప్యులేటర్, మణికంఠ వెన్నుపోటు పొడిచే వ్యక్తి, విష్ణుప్రియ నకిలీ స్నేహితురాలు, పృథ్వీ అటెన్షన్ సీకర్, నబీల్ అవకాశవాది, సీత నిజమైన ఫ్రెండ్, నిఖిల్ గేమ్ ఛేంజర్, యష్మిది మంద బుద్ధి అని చెప్పుకొచ్చింది.ఉత్తరాలు వచ్చాయ్..ఈ వారం హౌస్మేట్స్ కోసం ఉత్తరాలు వచ్చాయి. కానీ అవి కొందరికి అందకుండానే వెనక్కు వెళ్లిపోయాయి. వాటిని నాగ్ తిరిగి తీసుకొచ్చాడు. సీత, నబీల్, యష్మి, మణికంఠ తమ లెటర్స్ అందుకుని ఎమోషనల్ అయ్యారు. ఇక హౌస్‌లో ఉన్న ఎనిమిది మంది ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్) టీమ్‌గా, కొత్తగా వచ్చే ఎనిమిది వైల్డ్ కార్డ్స్ రాయల్ టీమ్‌గా ఉంటాయని నాగ్ వెల్లడించాడు.. తొలి వైల్డ్ కార్డ్‌గా హరితేజసీరియల్స్, సినిమాలతో పాపులర్ అయింది హరితేజ. బిగ్‌బాస్ మొదటి సీజన్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. గలగలా మాట్లాడే ఈమె గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఈ షో తర్వాత సినిమాల్లో బిజీ అవడమే కాకుండా హోస్ట్‌గానూ అవతారమెత్తింది. అఆ, యూ టర్న్, అరవింద సమేత వీర రాఘవ, ప్రతిరోజు పండగే, హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హరితేజ.. ఇటీవలే రిలీజైన దేవర సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా మెప్పించింది. యాక్టింగ్, యాంకరింగ్ రెండింట్లోనూ ఆరితేరిన ఈమె ఇప్పుడు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లో మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. తనకు నవదీప్.. ఆల్ ది బెస్ట్ చెబుతున్న వీడియో పంపించారు. అలానే హౌసులోకి వెళ్లేముందు స్టేజీపైకి హరితేజ కూతురుని తీసుకురావడంతో ఆమె ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంది.రెండో వైల్డ్ కార్డ్‌గా టేస్టీ తేజతేజ అసలు పేరు తేజ్‌దీప్. తెనాలో పుట్టిపెరిగిన ఇతడు 2017లో సాఫ్ట్వేర్ ఉద్యోగం హైదరాబాద్‌లో సెటిలయ్యాడు. చిన్నప్పటినుంచి నటన, సినిమాలంటే ఆసక్తి ఉన్న తేజకు కరోనా సెలవులు కలిసొచ్చాయి. 2020లో వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్నప్పుడు తెనాలిలో స్నేహితులతో కలిసి హోటల్‌కు వెళ్లి భోజనం చేశాడు. ఆ వీడియో యూట్యూబ్‌లో పెట్టగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదేదో బాగుందనిపించి హైదరాబాద్ వచ్చాక అదే కొనసాగించాడు. యూట్యూబర్‌గా తిండి వీడియోలు చేస్తూ బిజీ అయ్యాడు. అలా బిగ్‌బాస్ ఏడో సీజన్లో పాల్గొన్నాడు. తొమ్మిదివారాలపాటు హౌస్‌లో ఉన్నాక షోకి టాటా బైబై చెప్పాడు. ఇప్పుడు ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అమ్మ చేసిన పాల తాళికలను నాగార్జున కోసం తీసుకొచ్చాడు. అలానే తేజకి శోభాశెట్టి బెస్ట్ విషెస్ చెప్పింది.మరో రూ.20 లక్షలుసెట్పైకి వచ్చిన స్వాగ్ టీమ్ (శ్రీవిష్ణు, రీతూ వర్మ, దక్ష నగార్కర్) తన సినిమా కబుర్లు చెప్పింది .తర్వాత హౌస్‌లోకి వెళ్లి హౌస్మేట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్‌తో గేమ్ ఆడించారు. ఈ గేమ్‌లో వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్లు హరి-తేజ గెలిచి రూ.20 లక్షలు ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. అనంతరం మూడో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా నయని పావని హౌస్‌లో అడుగుపెట్టింది.మూడో వైల్డ్ కార్డ్‌గా నయని పావనిఈమె అసలు పేరు సాయిరాజు పావని. టిక్‌టాక్ స్టార్‌గా ఫేమస్. షార్ట్ ఫిలింస్, కవర్ సాంగ్స్, చిత్తం మహారాణి, సూర్యకాంతం వంటి చిత్రాల్లోనూ కనువిందు చేసిన ఈ బ్యూటీ బిగ్‌బాస్ ఏడో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. దురదృష్టం కొద్దీ వారానికే ఎలిమినేట్ అయిపోయింది. అయితే నయని నెక్స్ట్ సీజన్లో రావడం పక్కా అనుకున్నారు. అందరూ ఊహించినట్లుగానే ఈ సీజన్లో అడుగుపెట్టింది. కాకపోతే మరోసారి వైల్డ్‌కార్డ్ ద్వారానే ఎంట్రీ ఇచ్చింది. ఇక శివాజీ.. నయనికి బెస్ట్ విషెస్ చెప్పాడు.నాలుగో వైల్డ్ కార్డ్‌గా మెహబూబ్డ్యాన్స్, యాక్టింగ్ అంటే పిచ్చి. అందుకోసం మెహబూబ్ చేయని ప్రయత్నం లేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల సాఫ్ట్వేర్ కొలువులో చేరినా కళను వదిలేయలేకపోయాడు. వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలింస్, టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. తక్కువ సమయంలోనే ఎక్కువమంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.అలా తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజన్లో అడుగుపెట్టిన టాస్కుల్లో సత్తా చూపించాడు. కండబలం బాగానే ఉన్నా బుద్ధి బలం తక్కువగా ఉండటంతో ఫినాలే వరకు వెళ్లకుండానే వెనుదిరిగాడు. ఇప్పుడు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. ఇక మెహబూబ్ కోసం సొహైల్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అలానే నాలుగో సీజన్లో ఎలా అయితే ఆడావో ఈసారి అంతకు మించి ఆడి గెలవాలన్నాడు.'జనక అయితే గనక' మూవీ ప్రమోషన్లో భాగంగా సుహాస్, దిల్ రాజ్ టీమ్ వచ్చారు. సుహాస్, హీరోయిన్ సంగీర్తన హౌసులోకి వెళ్లి ఓజీ, రాయల్ టీమ్స్‌తో గేమ్ ఆడించారు. ఇందులో గెలిచిన సీత-మణికంఠ.. బెడ్ రూమ్, రేషన్ కంట్రోల్ చేసే అధికారాన్ని సొంతం చేసుకున్నారు.ఐదో వైల్డ్ కార్డ్‌గా రోహిణిఒకప్పుడు సీరియల్స్‌లో మెప్పించిన రోహిణి.. ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ రచ్చ చేస్తోంది. తన కామెడీ టైమింగ్స్‌తో అందరికీ వినోదాన్ని పంచుతోంది. ఆ మధ్య కాలు సర్జరీ వల్ల కొన్ని నెలలపాటు తెరపై కనిపించలేదు. కానీ కోలుకున్న వెంటనే మళ్లీ స్క్రీన్‌పై ప్రత్యక్షమై నవ్వుల జల్లు కురిపిస్తోంది. బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొన్న రోహిణి.. మరోసారి ఈ రియాలిటీ షోలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. ఇక శివజ్యోతి.. రోహిణి కోసం స్పెషల్ వీడియో పంపింది. హౌసులో కామెడీ లోటు బాగా ఉందని, దాన్ని ఫుల్ ఫిల్ చేయాలంది.ఆరో వైల్డ్ కార్డ్‌గా గౌతమ్ కృష్ణగౌతమ్ కృష్ణ.. బిగ్‌బాస్‌కు రావడానికి ముందు పలు సినిమాలు చేశాడు. కానీ జనాలకు సుపరిచితుడైంది మాత్రం బిగ్‌బాస్ ఏడో సీజన్‌తోనే! చిన్నప్పటినుంచే డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. కానీ పేరెంట్స్ కోరిక మేరకు డాక్టర్ అయ్యాడు. తన కోరికను చంపుకోలేక 2018లో దర్శకత్వంలో శిక్షణ పొందాడు. ఆ మరుసటి ఏడాది ఆకాశవీధుల్లో సినిమాకు సొంతంగా కథ రాసుకుని తనే డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించాడు.బాలీవుడ్‌లోనూ సిద్దూ: ది రాక్‌స్టార్ సినిమా చేశాడు. సినిమాలపైనే ఫోకస్ పెట్టిన ఈ డాక్టర్ బాబు గత సీజన్లో సీక్రెట్ రూమ్‌కు వెళ్లాడు. అశ్వత్థామ 2.0 అంటూ భారీ డైలాగులతో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ ఫినాలే వరకు రాలేకపోయాడు. తాజాగా మరోసారి వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చాడు.ఏడో వైల్డ్ కార్డ్‌గా అవినాష్ఇండస్ట్రీలో అడుగుపెట్టాలన్న ఆశతో ఎంతోమందిలాగే ఇతడూ కృష్ణానగర్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. అవకాశాలు రాకపోయినా చిన్నచిన్న ప్రోగ్రాంలతో జీవితాన్ని గడిపాడు. అనుకోకుండా ఓ కామెడీ షోలో ఛాన్స్ రావడంతో అతడి దశ తిరిగిపోయింది. ఎనిమిదేళ్లలోనే టీం లీడర్‌గా ఎదిగాడు. చిన్నప్పటి నుంచే మిమిక్రీలు చేసే ఈ జగిత్యాలవాసికి బిగ్‌బాస్ నాలుగో సీజన్లో ఆఫర్ వచ్చింది. ఇదే విషయం కామెడీ షో నిర్వాహకులకు చెబితే.. ఇంకా రెండేళ్ల అగ్రిమెంట్ ఉందని, మధ్యలో వెళ్తే రూ.10 లక్షలు కట్టాలని హెచ్చరించారు.ఆర్థిక అవసరాల వల్ల స్నేహితుల సాయం తీసుకుని మరీ ఆ డబ్బు కట్టేసి బిగ్‌బాస్‌కు వెళ్లాడు. వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన అవినాష్.. 12 వారాలు హౌస్‌లో ఉండి ఎంటర్టైనర్ అని నిరూపించుకున్నాడు. ఇప్పుడు మరోసారి బిగ్‌బాస్ 8లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇతడికి శ్రీముఖి ఆల్ ది బెస్ట్ చెప్పింది. అలానే స్టేజీపై మణికంఠ, నబీల్, విష్ణుప్రియలా యాక్ట్ చేసి నవ్వించాడు.ఎనిమిదో వైల్డ్ కార్డ్‌గా గంగవ్వవయసైపోయాక ఏ పనీ చేతకాక ఓ మూలన కూర్చోవాల్సిందే అని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పని నిరూపించింది గంగవ్వ. టాలెంట్ ఉంటే ఏ వయసులోనైనా రాణించవచ్చని నిరూపించింది. జగిత్యాల జిల్లా లంబాడిపల్లి గ్రామానికి చెందిన గంగవ్వ ఒకప్పుడు దినసరి కూలీ. కానీ ఇప్పుడు తన నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.తన కట్టుబొట్టు, అమాయకత్వం, గడుసుతనం.. జనాలకు నచ్చేశాయి. బిగ్‌బాస్ నుంచి పిలుపు రావడంతో నాలుగో సీజన్లో అడుగుపెట్టింది. స్వచ్ఛమైన పల్లెలో బతికిన మట్టిమనిషికి ఏసీలు పడలేదు. ఈ గోస నావల్ల కాదంటూ దండం పెట్టి బయటకు వచ్చేసింది. అయితే సొంతింటి కలను నెరవేర్చుకుంది. తర్వాత సినిమాల్లోనూ నటించింది. ఇప్పుడు మరోసారి ధైర్యం చేసి బిగ్‌బాస్ 8లోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చింది.రాయల్ టీమ్‌కు ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ టీమ్‌కు చివరగా మరో గేమ్ ఆడించారు. ఇందులో రాయల్ టీమ్ నుంచి అవినాష్, గంగవ్వ ఆడారు. ఓజీ టీమ్‌పై వీరు విజయం సాధించడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ఈ వారం ఇమ్యూనిటీ లభించింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గ్లామర్ ఫోటోలు షేర్ చేసిన హరితేజ.. హైదరాబాద్ మెట్రోలో రవితేజ వాయిస్ వైరల్
సీటాడెల్ టీజర్ విడుదల కార్యక్రమంలో మెరిసిన సమంత ఏదైతే అదైతదంటూ గ్లామర్ ఫోటోలు షేర్ చేసిన బిగ్ బాస్ హరితేజహైదరాబాద్ మెట్రోలో రవితేజ వాయిస్.. సరికొత్తగా మిస్టర్ బచ్చన్ ప్రమోషన్ తంగలాన్ ఆడియో లాంచ్ ఆగష్టు 5న.. కొత్త పోస్టర్ షేర్ చేసిన విక్రమ్ View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by People Media Factory (@peoplemediafactory) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Chiyaan Vikram Fan Page (@chiyaanism.official) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Nadiya Moidu (@simply.nadiya) View this post on Instagram A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies) View this post on Instagram A post shared by 𝗔𝗰𝘁𝗼𝗿𝘃𝗶𝗷𝗮𝘆 (@actorvijayofficl) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee)