బిగ్ బాస్ తెలుగు 8 పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ జరిగింది. పలు అనారోగ్య కారణాలతో గంగవ్వ తనంతట తానే హౌస్ నుంచి బయటకు వస్తే.. ఆడియెన్స్ ఓట్ల కారణంగా హరితేజ ఎలిమినేట్ అయింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన హరితేజ ప్రేక్షకుల అంచనాలకు తన ఆటతో రీచ్ కాలేకపోయింది. అక్టోబర్ 6న బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హరితేజ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఐదు వారాల్లో ఆమె సంపాదన ఎంతో చూద్దాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 1లో తనదైన ఆటతీరుతో సత్తా చాటిన హరితేజ ఈ సీజన్‌లో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ, బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినప్పటికీ చెడ్డపేరు లేకుండానే హుందాగా ఆట నుంచి నిష్క్రమించింది. హౌస్‌లో ఉన్నంతకాలం చలాకిగా కనిపించిన ఆమె ఆట తీరు బాగున్నప్పటికీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కావడంతో పెద్దగా ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ కాలేదని చెప్పవచ్చు. బహుషా ఈ కారణంతోనే ఆమె ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. ఈ వారం నామినేషన్ లిస్ట్‌లో నిఖిల్,ప్రేరణ, యష్మీ, విష్ణుప్రియ, పృథ్వీ, హరితేజ,గౌతమ్ ఏడుగురు ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఐదు వారాలపాటు హౌస్‌లో కొనసాగిన ఈ బ్యూటీ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో అనే వార్త ఆసక్తిగా మారింది.
రూ. 17 లక్షలు పైగానే..
సోషల్‌మీడియాలో మంచి పాపులరాటీ ఉన్న హరితేజకు బిగ్ బాస్ ఒక వారానికి గాను రూ. 3.5 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తోంది. అంటే రోజుకు రూ. 50 వేల పారితోషకం ఆమె బిగ్‌బాస్ నుంచి అందుకుందని టాక్. బిగ్ బాస్‌లో అత్యధికంగా రెమ్యునరేషన్ అందుకునే వారి జాబితాలో హరితేజ ఒకరని చెప్పవచ్చు. బిగ్ బాస్‌లో తను ఐదు వారాలపాటు ఉన్నందుకు రూ. 17 లక్షలకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నారని చెప్పవచ్చు.
సీజన్1లో సెకండ్ రన్నరప్
సీరియల్స్, సినిమాలతో పాపులర్ అయింది హరితేజ. బిగ్‌బాస్ మొదటి సీజన్‌లో అడుగుపెట్టి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. గలగలా మాట్లాడే ఈమె సీజన్1లో గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఈ షో తర్వాత సినిమాల్లో బిజీ అవడమే కాకుండా హోస్ట్‌గానూ అవతారమెత్తింది. ఫిదా మీ ఫేవరెట్ స్టార్‌తో, పండగ చేస్కో, సూపర్ సింగర్, లక్కీ ఛాన్స్.. ఇలా పలు షోలకు యాంకర్‌గా వ్యవహరించింది. అఆ, యూ టర్న్, అరవింద సమేత వీర రాఘవ, ప్రతిరోజు పండగే, హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హరితేజ ఇటీవలే రిలీజైన దేవర సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా మెప్పించింది.
Comments
Please login to add a commentAdd a comment