బిగ్‌బాస్‌ చరిత్రలోనే పరమ చెత్త కంటెస్టెంట్‌.. హరితేజ ఏమందంటే? | Bigg Boss 8 Telugu Eliminated Contestant Hariteja Exit Interview With Arjun Ambati, Comments Goes Viral | Sakshi
Sakshi News home page

Hariteja: 'వరస్ట్‌ కంటెస్టెంట్‌ హరితేజ'.. నెల రోజుల్లో చెడ్డదాన్నైపోయానా?

Published Mon, Nov 11 2024 8:58 PM | Last Updated on Tue, Nov 12 2024 12:36 PM

Bigg Boss 8 Telugu: Hariteja Exit Interview with Arjun Ambati

బిగ్‌బాస్‌ తెలుగు మొదటి సీజన్‌లో హరితేజ అదరగొట్టింది. కానీ ఈసారి తన సత్తా చూపించలేకపోయింది. అక్కడి మాటలు ఇక్కడ.. ఇక్కడి మాటలు అక్కడ చెప్తూ నారదుడిలా మారిపోయింది. టాస్కులు పెద్దగా ఆడలేదు కానీ టైమ్‌పాస్‌ మాత్రం బాగానే చేసింది. ఫలితంగా పదోవారంలో ఎలిమినేట్‌ అయింది. తాజాగా బిగ్‌బాస్‌ బజ్‌ ఇంటర్వ్యూలో పాల్గొంది. 

కామెడీ వల్ల బతికిపోతున్నాడు
ఈ సందర్భంగా కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతూ.. అవినాష్‌ అంత జెన్యూన్‌ కాదు. కాకపోతే కామెడీ వల్ల బతికిపోతున్నాడు. విష్ణు.. నత్తిబుర్ర, పృథ్వీ.. ఫ్రెండ్‌ కోసం ఏమైనా చేస్తాడు, టాస్క్‌లో విజృంభిస్తాడు. ఇతడు గెలిస్తే చూడాలనుకుంది. తేజ.. ఈయన అతితెలివి అతడికే చేటు తెస్తుంది. ప్రేరణ.. నోటికొచ్చిన మాటలు అనేస్తుంది, నబీల్‌.. తన పర్సనాలిటీ వేరేలా ఉంది. పాములాంటోడు, నిజంగానే పగబడతాడు. 

ఆమె సెల్ఫిష్‌
రోహిణి.. ప్రతిదానికి ఏడవడం నచ్చదు. నిఖిల్‌.. అందరితో బాగుండటానికి ట్రై చేస్తున్నాడు.. అతడు రేలంగి మామయ్య. యష్మి.. సెల్ఫిష్‌, ఎమోషనల్‌గా వీక్‌ అవుతోంది అంటూ హౌస్‌మేట్స్‌పై తన అభిప్రాయాలు వెల్లడించింది. తర్వాత యాంకర్‌ అర్జున్‌.. హరితేజపై వచ్చిన ట్వీట్లు స్క్రీన్‌పై చూపించాడు. 

ఆడితే ఇలా.. ఆడకపోతే అలా
బిగ్‌బాస్‌ తెలుగు చరిత్రలోనే వరస్ట్‌ కంటెస్టెంట్‌ హరితేజ. మరీ అంత చండాలంగా ప్రేరణ మీద పగతో గేమ్‌ ఆడాలా? టూ వరస్ట్‌. విష్ణుప్రియ, నయని పావని దాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. మోస్ట్‌ వరస్ట్‌ కంటెస్టెంట్స్‌.. మీకు మానవత్వమే లేదు అని ఓ యూజర్‌ ట్వీట్‌ చేశాడు. దీనిపై హరితేజ స్పందిస్తూ.. ఆడకపోతే ఆడలేదంటారు.. ఆడితేనేమో ఇలాంటి మాటలంటారు అని పెదవి విరించింది. 

మధ్యలో ఎందుకు దూరానా?
మరో ట్వీట్‌లో విష్ణుప్రియ.. ప్రేరణను నామినేట్‌ చేస్తుంటే హరితేజ, నయని ఎందుకు మధ్యలో దూరుతున్నారు? అక్కడ వాళ్లకేం పని? అని మరో వ్యక్తి విమర్శించాడు. ఆ నామినేషన్స్‌లో అందరూ అందరి మధ్యలో దూరి మాట్లాడారాని తెలిపింది. హరితేజ తనకున్న మంచి పేరు పోగొట్టుకుని నెగెటివ్‌ ఇమేజ్‌ తెచ్చుకుంది అని మరో ట్వీట్‌ చూపించాడు. 

ఎవరు గెలవాలంటే?
ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉండి ప్రేక్షకులకు దగ్గరగా బతికిన హరితేజ నెల రోజుల్లో చెడ్డదెలా అవుతుంది? ఓపికతో ఉంటే అన్నీ సెట్‌ అయిపోతాయ్‌ అని సానుకూల దృక్పథంతో మాట్లాడింది. ఈ సీజన్‌ ఎవరు గెలవాలనుకుంటున్నారన్న ప్రశ్నకు విష్ణుప్రియ అని బదులిచ్చింది.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement