Gangavva
-
బిగ్‌బాస్ చరిత్రలోనే పరమ చెత్త కంటెస్టెంట్.. హరితేజ ఏమందంటే?
బిగ్‌బాస్ తెలుగు మొదటి సీజన్లో హరితేజ అదరగొట్టింది. కానీ ఈసారి తన సత్తా చూపించలేకపోయింది. అక్కడి మాటలు ఇక్కడ.. ఇక్కడి మాటలు అక్కడ చెప్తూ నారదుడిలా మారిపోయింది. టాస్కులు పెద్దగా ఆడలేదు కానీ టైమ్‌పాస్ మాత్రం బాగానే చేసింది. ఫలితంగా పదోవారంలో ఎలిమినేట్ అయింది. తాజాగా బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంది. కామెడీ వల్ల బతికిపోతున్నాడుఈ సందర్భంగా కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతూ.. అవినాష్ అంత జెన్యూన్ కాదు. కాకపోతే కామెడీ వల్ల బతికిపోతున్నాడు. విష్ణు.. నత్తిబుర్ర, పృథ్వీ.. ఫ్రెండ్ కోసం ఏమైనా చేస్తాడు, టాస్క్‌లో విజృంభిస్తాడు. ఇతడు గెలిస్తే చూడాలనుకుంది. తేజ.. ఈయన అతితెలివి అతడికే చేటు తెస్తుంది. ప్రేరణ.. నోటికొచ్చిన మాటలు అనేస్తుంది, నబీల్.. తన పర్సనాలిటీ వేరేలా ఉంది. పాములాంటోడు, నిజంగానే పగబడతాడు. ఆమె సెల్ఫిష్రోహిణి.. ప్రతిదానికి ఏడవడం నచ్చదు. నిఖిల్.. అందరితో బాగుండటానికి ట్రై చేస్తున్నాడు.. అతడు రేలంగి మామయ్య. యష్మి.. సెల్ఫిష్, ఎమోషనల్‌గా వీక్ అవుతోంది అంటూ హౌస్‌మేట్స్‌పై తన అభిప్రాయాలు వెల్లడించింది. తర్వాత యాంకర్ అర్జున్.. హరితేజపై వచ్చిన ట్వీట్లు స్క్రీన్‌పై చూపించాడు. ఆడితే ఇలా.. ఆడకపోతే అలాబిగ్బాస్ తెలుగు చరిత్రలోనే వరస్ట్ కంటెస్టెంట్ హరితేజ. మరీ అంత చండాలంగా ప్రేరణ మీద పగతో గేమ్ ఆడాలా? టూ వరస్ట్. విష్ణుప్రియ, నయని పావని దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మోస్ట్ వరస్ట్ కంటెస్టెంట్స్.. మీకు మానవత్వమే లేదు అని ఓ యూజర్ ట్వీట్ చేశాడు. దీనిపై హరితేజ స్పందిస్తూ.. ఆడకపోతే ఆడలేదంటారు.. ఆడితేనేమో ఇలాంటి మాటలంటారు అని పెదవి విరించింది. మధ్యలో ఎందుకు దూరానా?మరో ట్వీట్లో విష్ణుప్రియ.. ప్రేరణను నామినేట్ చేస్తుంటే హరితేజ, నయని ఎందుకు మధ్యలో దూరుతున్నారు? అక్కడ వాళ్లకేం పని? అని మరో వ్యక్తి విమర్శించాడు. ఆ నామినేషన్స్‌లో అందరూ అందరి మధ్యలో దూరి మాట్లాడారాని తెలిపింది. హరితేజ తనకున్న మంచి పేరు పోగొట్టుకుని నెగెటివ్ ఇమేజ్ తెచ్చుకుంది అని మరో ట్వీట్ చూపించాడు. ఎవరు గెలవాలంటే?ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉండి ప్రేక్షకులకు దగ్గరగా బతికిన హరితేజ నెల రోజుల్లో చెడ్డదెలా అవుతుంది? ఓపికతో ఉంటే అన్నీ సెట్ అయిపోతాయ్ అని సానుకూల దృక్పథంతో మాట్లాడింది. ఈ సీజన్ ఎవరు గెలవాలనుకుంటున్నారన్న ప్రశ్నకు విష్ణుప్రియ అని బదులిచ్చింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తేజకు దారుణమైన పనిష్మెంట్.. త్యాగానికి రోహిణి రెడీ!
టేస్టీ తేజకు దెబ్బమీద దెబ్బ పడింది. ఎవిక్షన్ షీల్డ్ టాస్కులో అతడు చేసిన తప్పిదం వల్ల వచ్చేవారం కంటెండర్ అయ్యే అవకాశం కోల్పోయాడు. అటు హౌస్మేట్స్ వల్ల తన ఫ్యామిలీ హౌస్‌లోకి వచ్చే ఆస్కారమే లేదట.. అదెలాగో నేటి ఎపిసోడ్ (నవంబర్ 9) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..సిగ్గు లేకుండా..మెగా చీఫ్ ప్రేరణ మాట ఎవరూ వినడం లేదు. పెండింగ్‌లో ఉన్న పని చేయమంటే విష్ణు కస్సుబుస్సులాడుతుంది. సీతాఫలం తినొద్దు అని చెప్పినా ఉన్న ఒక్కదాన్ని లటుక్కుమని గౌతమ్ ఆరగించేశాడు. వద్దని చెప్పినా ఎలా తిన్నావు? సిగ్గు లేకుండా ఎలా నవ్వుతున్నావని గౌతమ్‌పై ఫైర్ అయింది. అటు స్వీట్లు తినను అని బిగ్‌బాస్‌కు మాటిచ్చిన నబీల్.. హల్వా తిని ఆ నియమాన్ని ఉల్లంఘించాడు.తేజకు శిక్షఇక నాగార్జున వచ్చీరావడంతోనే ఎవిక్షన్ షీల్డ్ గేమ్ అర్ధాంతరంగా ఆగిపోవడానికి కారణమైన తేజను వాయించాడు. నీకంటే ముందు వచ్చిన జంటలు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారు. నువ్వు మాత్రం యష్మితో కలిసి ఒక అభిప్రాయానికి రాకుండా నీకు నచ్చింది చేశావని సీరియస్ అయ్యాడు. అతడు చేసిన తప్పుకుగానూ వచ్చేవారం చీఫ్ కంటెండర్‌వి కాలేవని శిక్ష విధించాడు.ఎవిక్షన్ షీల్డ్ ఎవరికివ్వాలో డిసైడ్ చేసిన ప్రేరణఇక ఎవిక్షన్ షీల్డ్ రేసులో మిగిలిన రోహిణి, నబీల్, నిఖిల్‌లలో ఎవరికి ఆ షీల్డ్ ఇవ్వాలో హౌస్మేట్స్ డిసైడ్ చేయాలన్నాడు. ఈ క్రమంలో రోహిణికి ప్రేరణ, గంగవ్వ, తేజ సపోర్ట్ చేయగా నిఖిల్‌కు హరితేజ, విష్ణుప్రియ, పృథ్వీ సపోర్ట్ చేశారు. నబీల్‌కు గౌతమ్, యష్మి, అవినాష్ మద్దతిచ్చారు. ముగ్గురికీ సమాన ఓట్లు పడటంతో చీఫ్ ప్రేరణపై భారం వేశారు. ఆమె నబీల్‌కు సపోర్ట్ ఇవ్వడంతో అతడు ఎవిక్షన్ షీల్డ్ అందుకున్నాడు.అంతరాత్మపై ఒట్టేసి..అనంతరం నాగార్జున.. ఒక్కొక్కరినీ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలుస్తూ.. నీపై నువ్వు ప్రమాణం చేసుకుని ఈ సీజన్లో వరస్ట్ ప్లేయర్ ఎవరో చెప్పాలన్నాడు. మొదటగా నబీల్.. తన ఫోటోపై ఒట్టేసి విష్ణుప్రియను వరస్ట్ ప్లేయర్‌గా పేర్కొన్నాడు. నిఖిల్.. తప్పు చేసినా రుబాబు చూపిస్తాడు, వెటకారం ఎక్కువ అంటూ తేజ వరస్ట్ ప్లేయర్ అన్నాడు. హరితేజ, యష్మి.. రోహిణిని, గౌతమ్, తేజ.. పృథ్వీని, అవినాష్.. హరితేజను, రోహిణి, గంగవ్వ.. యష్మిని, విష్ణుప్రియ, పృథ్వీ.. తేజను చెత్త ప్లేయర్ అని పేర్కొన్నారు. తేజకు కోలుకోలేని దెబ్బప్రేరణ.. గెలవాలన్న ఆసక్తి లేదంటూ విష్ణుప్రియ వరస్ట్ ప్లేయర్ అని తెలిపింది. వరస్ట్ హౌస్మేట్స్ అని ఎక్కువ ఓట్లు పడ్డ వ్యక్తికి ఫ్యామిలీ వీక్‌లో వారి కుటుంబసభ్యులు రాబోరని నాగ్ బాంబు పేల్చాడు. ఈ సీజన్లో తేజను వరస్ట్ ప్లేయర్‌గా డిసైడ్ చేశారు. కేవలం తల్లిని తీసుకురావడానికే ఈ సీజన్‌కు వచ్చాను సర్ అంటూ తేజ కన్నీళ్లు ఆపుకునే ప్రయత్నం చేశాడు.గంగవ్వ ఎలిమినేట్దీంతో రోహిణి.. నా ఫ్యామిలీకి బదులుగా నీ కుటుంబసభ్యులు రావాలని బిగ్‌బాస్‌ను అభ్యర్థిస్తానంది. అటు గంగవ్వ ఆరోగ్యం గురించి నాగ్ ఆరా తీశాడు. ఆమె తన ఒళ్లంతా మంట లేస్తోందంటూ.. సంతోషంగానే ఉన్నాను కానీ చేతనవడం లేదని తెలిపింది. దీంతో ఆమెను హౌస్ నుంచి పంపించేశారు. గంగవ్వ వెళ్లిపోతుంటే రోహిణి, తేజ గుక్కపెట్టి ఏడ్చారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్: తిడుతుంటే నవ్వుతుందేంటి? ఈ పగ చల్లారదు!
గంగవ్వ హౌస్‌లో అడుగుపెట్టి నాలుగువారాలవుతోంది కానీ కొందరి పేర్లు ఇప్పటికీ తనకు నోరు తిరగదు. యష్మిని కాస్త అశ్విని అనేసింది. దీంతో నామినేషన్స్‌లో అందరూ పడీపడీ నవ్వారు. గంగవ్వ యష్మిని నామినేట్ చేస్తూ.. గౌతమ్ బాగానే ఆడుతున్నాడుడు. కానీ నువ్వు.. ఆటలో గెలవకపోతే మాత్రం చించి సంచి కోసుకుంటవ్ అంటూ పక్కా తెలంగాణ యాసలో సెటైర్లు వేసింది. నబీల్ రివేంజ్ నామినేషన్?అది ఆమెకు ఏమర్థమైందో కానీ పకాపకా నవ్వింది. విష్ణుప్రియ.. ప్రేరణను అగ్రెసివ్ అంటూ నామినేట్ చేసింది. ఇక ఈ రోజు కోసం నబీల్ వారం రోజులనుంచి ఎదురుచూస్తున్నాడు. పోయినవారం మన క్లాన్లోని వారిని నామినేట్ చేసుకోవద్దని మరీ చెప్పాడు నబీల్. కట్ చేస్తే విష్ణుప్రియ నబీల్ను నామినేట్ చేసింది. నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?అది గుర్తుపెట్టుకుని మరీ విష్ణుప్రియపై ప్రతీకారం తీర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక హరితేజ, ప్రేరణల మధ్య సైలెంట్‌వార్ కొనసాగుతూనే ఉంది. మొత్తానికి ఈ వారం హరితేజ, గౌతమ్, ప్రేరణ, యష్మి, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ నామినేషన్స్‌లో ఉన్నారు. -
నాగ్ చేసిన పనికి షాక్‌లో తేజ.. త్వరలో వెళ్లిపోతానంటున్న గంగవ్వ
హౌస్‌మేట్స్‌కు నాగార్జున గట్టిగా క్లాస్ పీకి చాలాకాలమైంది. అందుకే ఈ రోజు అందరికీ కోటింగ్ ఇవ్వడమే పనిగా పెట్టుకున్నాడు. గౌతమ్, నిఖిల్, యష్మి, ప్రేరణలపై సీరియస్ అయ్యాడు. ప్రత్యేకంగా ఈ నలుగురిపైనే ఫైర్ అవడానికి కారణమేంటో తెలియాలంటే నేటి (నవంబర్ 2) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..నువ్వేమైనా పుడింగా?నాగార్జున వచ్చీరాగానే ప్రేరణపై విరుచుకుపడ్డాడు. నువ్వేమైనా పుడింగా? అందరిపై నోరు ఎందుకు జారుతున్నావ్? అని నిలదీశాడు. అందుకామె పుడుంగి అనేది తప్పు పదమని తెలీదని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించింది. దీంతో నయని లేచి.. తను ఎప్పుడూ అమర్యాదగానే మాట్లాడుతుందని అగ్నికి ఆగ్జం పోసింది. అటు నాగ్ వీడియో ప్లే చేయడంతో అడ్డంగా దొరికిపోయిన ప్రేరణ నయనికి సారీ చెప్పింది. నిఖిల్‌ను తిట్టడాన్ని సైతం తప్పుపడుతూ నోరు అదుపులో పెట్టుకోమని హెచ్చరించాడు.ఎందుకంత కోపం?పానీపట్టు యుద్ధం టాస్క్‌లో అగ్రెసివ్‌గా ఆడావు. అప్పుడు ప్రేరణ, యష్మిపై ఎందుకంత కోపం చూపించావని నాగ్ నిఖిల్‌ను అడిగాడు. అందుకతడు ప్రేరణ, గౌతమ్ బూతు వాడటంతో మరింత ట్రిగ్గర్ అయ్యానన్నాడు. దీనిపై గౌతమ్ స్పందిస్తూ.. తాను బూతు మాట అనలేదన్నాడు. దీంతో నాగ్ వీడియో వేసి చూపించాడు. అందులో అతడు పెదాలాడించినట్లు ఉందే తప్ప బూతు మాట్లాడినట్లు లేదు.నిరూపిస్తే హౌస్ నుంచి వెళ్లిపోతా..వీడియో చూసిన తర్వాత కూడా గౌతమ్.. తల్లిపై ప్రమాణం చేస్తున్నాను. నేను బూతు మాట్లాడలేదు. చేయని తప్పును ఒప్పుకోను. నేను బూతు మాట్లాడినట్లు నిరూపిస్తే హౌస్ నుంచి వెళ్లిపోతానని శపథం చేశాడు. దీంతో నాగ్.. గౌతమ్ మాటల్ని ఎవరు నమ్ముతున్నారని అటు హౌస్‌మేట్స్‌ను, ఇటు స్టూడియోలో ఉన్నవారిని అడిగాడు. కానీ ఏ ఒక్కరూ గౌతమ్‌కు సపోర్ట్ చేయకపోవడంతో అతడి ముఖంలో నెత్తురుచుక్క లేకుండా పోయింది.మధ్యలో దూరకుతర్వాత యష్మి వంతురాగా.. నీ ప్రాబ్లమేంటక్కా? అని నాగ్ ప్రశ్నించాడు. గౌతమ్ తనను సడన్‌గా క్రష్, సడన్‌గా అక్క అని పిలిస్తే తీసుకోలేకపోయానని బదులిచ్చింది యష్మి. దీంతో నాగ్ వీడియో ప్లే చేశాడు. అందులో గౌతమ్.. విష్ణుతో మాట్లాడుతుంటే యష్మి మధ్యలో దూరింది. ఈ గొడవ పెద్దదై ఒకరినొకరు అక్కాతమ్ముడు అనుకున్నారు. నువ్వు కూడా తమ్ముడు అన్నావుగా.. ఏదైనా జరుగుతున్నప్పుడు మధ్యలోకి దూరకూడదు అని సూచించాడు. ఫ్లిప్ అవుతున్నావ్అలాగే బీబీ ఇంటికి దారేది ఛాలెంజ్‌లో తన రెడ్ టీమ్‌లో గౌతమ్‌ను ఎలిమినేట్ చేయడం గురించి అడగ్గా.. అతడు పెద్దగా ఆడలేదని తెలిపింది. దీంతో గౌతమ్ లేచి.. నేను ఆల్రెడీ ఒకసారి మెగా చీఫ్ అయ్యానని, అందుకే సైడ్ చేస్తున్నామని చెప్పిందే తప్ప ఆడలేదని చెప్పలేదన్నాడు. ఇది విన్న నాగ్.. ఇలా మాటలు మారుస్తూ ఉంటే నువ్వు ఫ్లిప్ అవుతున్నావని జనాలు భావిస్తారని హెచ్చరించాడు.సిగ్నల్స్ ఇచ్చిన గంగవ్వఅనంతరం బాగా ఆడావంటూ నాగ్ తేజను మెచ్చుకోగా ఇది కలా? నిజమా? అర్థం కాక అతడు నోరెళ్లబెట్టాడు. సెకనులో ఇదంతా నిజమేనని తెలుసుకుని తెగ సంతోషించాడు. ఇక మెగా చీఫ్ పోస్ట్‌ను త్యాగం చేయడం బాగోలేదని నబీల్‌కు చురకలంటించాడు. గండం గట్టెక్కింది!గంగవ్వను ఆటలో ఇంకాస్త యాక్టివ్‌గా ఆడాలని నాగ్ సలహా ఇవ్వగా.. తనకు ఒళ్లునొప్పులు వస్తున్నాయంది. తనవల్ల కానిరోజు హౌస్ నుంచి తనే స్వయంగా వెళ్లిపోతానంది. చివర్లో తేజ సేవ్ అయినట్లు ప్రకటించాడు. గతంలో తొమ్మిదో వారమే షో నుంచి ఎలిమినేట్ అయ్యానని ఈసారి ఆ వారం నుంచి తప్పించుకున్నానంటూ ఫుల్ ఖుషీ అయ్యాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మెహబూబ్ అవుట్.. నొప్పి భరించలేక అవినాష్ సెల్ఫ్ ఎలిమినేట్
పండగ సెలబ్రేషన్స్‌లో బిగ్‌బాస్ ఎప్పుడూ ముందుంటుంది. ఇటీవలే హౌస్‌లో బతుకమ్మ, దసరా వేడుకలు జరిగాయి. ఇప్పుడు దీపావళి సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకలల్లో సినీ తారలు భాగమయ్యారు. మరి హౌస్‌లో జరిగిన రచ్చ, హంగామా ఏ రేంజ్లో ఉందో లైవ్ అప్డేట్స్లో చూసేయండి..పండగ సర్ప్రైజ్నాగార్జున దీపావళి పాటకు స్టెప్పులేస్తూ పండగ కళను తీసుకొచ్చాడు. తర్వాత హౌస్‌మేట్స్‌ను జంటలుగా విడగొట్టిస్టెప్పులు మీవి- మార్కులు మావి అనే గేమ్ ఆడించాడు. ప్రతి రౌండ్లో గెలిచిన టీమ్‌కు ఒక సర్ప్రైజ్ ఉంటుందన్నాడు. అలా మొదటి రౌండ్లో గంగవ్వ-తేజ గెలిచారు. ఈ జంటలో ఒకరికే ఇంటిసభ్యుల నుంచి మెసేజ్ వస్తుందన్నాడు. అలా తేజ త్యాగంతో గంగవ్వకు తన కూతురి వీడియో మెసేజ్ ప్లే చేశారు. అది చూసిన అవ్వ సంతోషంతో కన్నీళ్లుపెట్టుకుంది. తర్వాత విష్ణుప్రియను సేవ్ చేశారు.ప్రైజ్‌మనీలో మరో రూ.1లక్షఅనసూయ డ్యాన్స్‌తో జోష్ నింపింది. ప్రైజ్‌మనీ కవర్స్ కనుక్కోవాలన్న రెండో గేమ్‌లో నిఖిల్, యష్మీ గెలిచారు. వీరు కనిపెట్టిన కవర్లలోని రూ.1 లక్ష ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. తర్వాత ఈ జంటకు సంబంధించిన ఇంటిసభ్యుల ఫోటో చూపించారు. యష్మి త్యాగం చేయడంతో నిఖిల్ పేరెంట్స్ వీడియో ప్లే చేశారు. అలాగే నాగ్ నిఖిల్‌ను సేవ్ చేశాడు.ప్రేరణకు సర్ప్రైజ్తర్వాత 'క' మూవీ టీమ్ స్టేజీపైకి వచ్చింది. వీరు హౌస్మేట్స్ కళ్లకు గంతలు కట్టి గేమ్ ఆడించారు. ఇందులో ప్రేరణ-మెహబూబ్ గెలిచారు. మెహబూబ్ త్యాగంతో ప్రేరణకు వీడియో ప్లే చేశారు. ఆమె తన పేరెంట్స్ మాటలు విని మురిసిపోయింది. తర్వాత మెహరీన్ డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. సింగర్ సమీరా భరద్వాజ్.. హౌస్మేట్స్ అందరిపైనా అలవోకగా పాటలు పడేసి అబ్బురపరిచింది. ప్రతి ఒక్కరిపైనా అద్భుతంగా పాట పాడి అదరొట్టేసింది. స్టేజీపై దుల్కర్ సల్మాన్లక్కీ భాస్కర్ మూవీ హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ వెంకీ స్టేజీపైకి వచ్చారు. డైరెక్టర్స్ త్రివిక్రమ్, వెంకీలలో ఎవరిని సెలక్ట్ చేస్తావన్న ప్రశ్నకు మీనాక్షి.. వెంకీ అని బదులిచ్చింది. లక్కీ భాస్కర్ టీమ్ ఆడించిన గేమ్‌లో గౌతమ్-నయని పావని జంట గెలిచింది. వీరిలో నయని పావని తన తల్లి మెసేజ్‌ను త్యాగం చేయడంతో గౌతమ్.. అతడి తండ్రి వీడియో సందేశాన్ని వినగలిగాడు. ఇంట్లో గొడవపడి వచ్చిన గౌతమ్.. తండ్రికి సాష్టాంగ నమస్కారం చేసి మరీ సారీ చెప్పాడు.హరితేజ ఎమోషనల్హీరోయిన్ శాన్వీ స్పెషల్ డ్యాన్స్ పర్ఫామెన్స్తో మైమరపించింది. తర్వాత ప్రేరణ, పృథ్వీని సేవ్ చేశారు. అనంతరం అమరన్ హీరో శివకార్తికేయన్, హీరోయిన్ సాయిపల్లవి స్టేజీపైకి వచ్చారు. వీరు ఆడించిన గేమ్‌లో రోహిణి, అవినాష్ గెలిచారు. వీళ్లిద్దరూ తమకు బదులుగా హరితేజకు తన కూతురి వీడియో చూపించమన్నాడు. హాయ్ అమ్మ, హ్యాపీ దివాళి అంటూ కూతురు మాట్లాడిన ముద్దుముద్దు మాటలు విని హరితేజ ఏడ్చేసింది. తర్వాత హైపర్ ఆది హౌస్‌లోకి వచ్చి తన పంచ్ కామెడీతో నవ్వించాడు.ఏడ్చిన యష్మిఈ ఎపిసోడ్ కంటే ముందు ఏం జరిగిందన్నది చూపించారు. ఎవరినో ఉడికించడానికి యష్మి తనను వాడుకోవడం నచ్చలేదన్నాడు గౌతమ్. ఆ మాటలు విన్న యష్మి.. తన ఉద్దేశం అది కాదంటూ ఏడ్చేసింది. నిఖిల్, నేను ఫ్రెండ్స్‌లా టీజ్ చేసుకున్నాం తప్ప నువ్వంటే నాకు బాగా ఇష్టం అని ఎక్కడా ఒకరికొకరం ఎక్స్‌ప్రెస్ చేసుకోలేదు. నా వల్ల తప్పు జరిగుంటే సారీ అని చెప్పింది. దీంతో గౌతమ్.. ఇకపై నువ్వు నాకు కంటెస్టెంటు మాత్రమే.. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అని క్లారిటీ ఇచ్చేశాడు. నాగ్ నయనిని సేవ్ చేసి మెహబూబ్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు.అప్పుడలా ఇప్పుడిలా..వెళ్లిపోయేముందు మెహబూబ్ హౌస్‌మేట్స్‌ను పటాకాలతో పోల్చాడు. అవినాష్ ధౌజండ్‌వాలా, గంగవ్వ లక్ష్మీబాంబ్, నబీల్ రాకెట్, రోహిణి కాకరబత్తి, గౌతమ్ మ్యాచ్ స్టిక్ అన్నాడు. గతంలోనూ దీపావళికి నేను ఎలిమినేట్ అయ్యా.. ఈసారి కూడా దీపావళికే బయటకు వచ్చేశాను. ఎందుకో అర్థం కావట్లేదంటూ ఎమోషనల్ అయ్యాడు. అవినాష్ ఎలిమినేట్ఇక రేపటి ప్రోమోలో అవినాష్ అనారోగ్యంతో సెల్ఫ్ ఎలిమినేట్ అయినట్లు చూపించారు. కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాను. మెడికల్ రూమ్‌కు వెళ్తే బయటకు వచ్చేయమన్నారు. వెళ్లిపోతున్నాను అంటూ వీడ్కోలు తీసుకున్నాడు. హాస్పిటల్‌కు వెళ్లి మళ్లీ హౌస్‌లో అడుగుపెడతాడా? లేదా నిజంగానే వెళ్లిపోతాడా? అన్నది రేపు తేలనుంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మిపై ప్రేమను దాచేస్తున్న నిఖిల్.. కోపంతో తేజను కొట్టిన గంగవ్వ
రెండు రోజులుగా కొనసాగుతున్న బీబీ రాజ్యం ఛాలెంజ్ ఈరోజుతో పూర్తయింది. రాయల్స్(వైల్డ్ కార్డ్స్) ను వెనక్కు నెట్టి ఓజీ టీమ్(పాత కంటెస్టెంట్లు) రాజ్యాన్ని కైవసం చేసుకుంది. అదొక హఠాత్పరిణామం.. అన్నట్లుగా విష్ణుప్రియ మెగా చీఫ్‌గా నిలిచింది. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 25) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..పొడుపు కథబీబీ రాజ్యం చాలెంజ్‌లో భాగంగా మీలో ఎవరు తెలివైనవారు? అనే టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌కు నిఖిల్ సంచాలకుడిగా వ్యవహరించాడు. '13 హార్ట్స్ ఉంటాయి.. కానీ మిగతా ఆర్గాన్స్ ఉండవు.. ఏంటి?' అన్న ప్రశ్నకు తేజ ప్లేయింగ్ కార్డ్స్ అని బదులిచ్చాడు. కొన్ని నెలలకు 31 రోజులుంటాయి కొన్ని నెలలకు 30రోజులుంటాయి. ఎన్ని నెలలకు 28 రోజులుంటాయన్న ప్రశ్నకు గౌతమ్ 12 నెలలు అని కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు.బతికుండగానే పాతిపెడతారా?ఏపీ, తెలంగాణ సరిహద్దులో విమానం పడిపోతే అందులో ఉన్న సర్వైవర్లను ఎక్కడ పాతిపెడతారు? అని అడిగాడు. అందుకు నిఖిల్, నయని.. ఆంధ్ర, తెలంగాణ అంటూ శుద్ధ తప్పు సమాధానం చెప్పారు. బతికున్నవాళ్లను పాతిపెడతారా? అని బిగ్‌బాస్ కౌంటర్ వేయడంతో అందరూ పడీపడీ నవ్వారు. ఇలాంటి ప్రశ్నలే మరికొన్ని వేయగా రెండు టీమ్స్‌కు టై అయింది. దీంతో చివరి ప్రశ్నగా.. కోతి, ఉడుత, పక్షిలో ఏది ముందుగా కొబ్బరిచెట్టు ఎక్కి అరటిపండు తెంపుతుందన్నాడు. తేజను వాయించిన గంగవ్వముందుగా బజర్ నొక్కిన ప్రేరణకు ప్రశ్న సరిగా అర్థం కాలేదు. ఆ క్వశ్చన్ రిపీట్ చేయడానికి వీల్లేదని తేజ వాదించాడు. కావాలంటే జంతువుల పేర్లను ఇంగ్లీష్‌లో చెప్పుకోవచ్చన్నాడు. దీంతో గంగవ్వ వచ్చి.. ప్రేరణకు ఎందుకు చెప్తున్నావు, నీకు ఆన్సర్ చెప్పొస్తలేదా? అని తేజను కొట్టింది. ఇంతలో ప్రేరణ కొబ్బరిచెట్టుపై నుంచి పండును ఏ జంతువూ తెంపలేదని పేర్కొంది.ప్రేరతో గౌతమ్ ఫైట్అలా ఈ గేమ్‌లో ఓజీ గెలిచి బీబీ రాజ్యంలో స్కూల్, న్యాయస్థానం గెలుచుకుంది. అలాగే తన టీమ్‌లో ప్రేరణను కంటెండర్‌గా ప్రకటించారు. రాయల్స్ టీమ్‌లో మెహబూబ్‌ను చీఫ్ కంటెండర్ పోస్టు నుంచి తప్పించారు. ఇంతలో గౌతమ్.. ప్రేరణతో ఏదో వాదులాటకు దిగగా మధ్యలో యష్మి వచ్చి సముదాయించబోయింది. మా ఇద్దరి మధ్యలోకి రాకు, వెళ్లిపో అని యష్మిపై అరిచాడు. కాసేపటికి వాళ్లిద్దరికీ సారీ కూడా చెప్పాడు. ప్రేమ ఉంది కాబట్టే అలా..మరోవైపు నిఖిల్, యష్మి మధ్య దోబూచులాట అవుతూనే ఉంది. నీకు, నాకు సెట్టవదు, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకు అంటూ ఏవేవో మాట్లాడుకున్నారు. నిఖిల్ ప్రవర్తన అంతుపట్టని యష్మి.. సడన్‌గా వచ్చి నాపై ఇంట్రస్ట్ ఉందన్నట్లు మాట్లాడతాడు. అలాగే నేను, గౌతమ్ డ్యాన్స్ చేస్తే జెలసీ ఫీల్ అయ్యాడు.. ఇలాంటివి చాలా ఉన్నాయి. కెమెరా ముందు మంచోడిలా ఉండాలనుకుంటే ఉండు.. నేను మాత్రం ఫేక్‌గా ఉండలేను అంది. అలా ఈర్ష్యపడటం లవ్ లాంగ్వేజ్ అని ప్రేరణ నిర్ధారించింది.ఆరుగురు మెగా చీఫ్ కంటెండర్స్ఇక బీబీ రాజ్యం టాస్కు పూర్తయిందన్న బిగ్‌బాస్.. ఓజీ, రాయల్స్ నుంచి చెరొక కంటెండర్‌ను సెలక్ట్ చేయవచ్చన్నాడు. దీంతో విష్ణుప్రియ, తేజను ఎంపిక చేశారు. ప్రేరణ, నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీ, రోహిణి, తేజలలో ఒకర్ని మెగా చీఫ్‌గా ఎన్నుకునే బాధ్యతను హౌస్‌మేట్స్‌పై వేశాడు. మెగా చీఫ్‌కు అనర్హులనుకునేవారికి మిరప దండ వేసి రేసు నుంచి తప్పించాలన్నాడు.కొత్త చీఫ్‌గా విష్ణుప్రియఅలా మొదటగా మెహబూబ్.. ప్రేరణను తప్పించడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. నబీల్.. రోహిణిని, అవినాష్.. పృథ్వీని అవుట్ చేశారు. చివరగా గౌతమ్.. నిఖిల్‌ను అవుట్ చేస్తూ విష్ణుప్రియను చీఫ్‌గా గెలిపించాడు. అయితే ఒక్కరికే అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా అందరినీ సమానంగా చూడాలని మాట తీసుకున్నాడు. ఇక విష్ణుప్రియకు ఇచ్చిన ఎన్విలాప్‌లో రూ.2 లక్షలు ఉండగా అది ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. దీంతో ప్రైజ్‌మనీ రూ.40,16,000కు చేరింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గంగవ్వపై కేసు.. చిలక తెచ్చిన చిక్కు
-
నిఖిల్‌పై మనసు పారేసుకున్న యష్మి, అవ్వకు ఆస్కార్ ఇవ్వాల్సిందే!
సమయం దొరికినప్పుడల్లా అవినాష్ అటు హౌస్‌మేట్స్‌ను, ఇటు ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నాడు. అటు తేజ, అవినాష్.. గంగవ్వను దెయ్యం పట్టినట్లు యాక్ట్ చేయమన్నారు. కానీ గంగవ్వ ఏకంగా జీవించేసింది. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 23) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..తిక్క కుదిర్చిన బిగ్బాస్ఇంటిని శుభ్రంగా ఉంచట్లేదని, తన ఆదేశాలను లెక్కచేయట్లేదని బిగ్‌బాస్ హర్టయ్యాడు. అందుకని ఈ వారం సూపర్మార్కెట్లో షాపింగ్ చేసే సమయాన్ని కాస్త కట్ చేసిపారేశాడు. దీంతో మెగా చీఫ్ గౌతమ్.. నిఖిల్‌ను మార్కెట్‌కు పంపించి అతడితో షాపింగ్ చేయించాడు.యష్మి- నిఖిల్ లవ్ ట్రాక్?ఇక యష్మి.. నిఖిల్‌ను తనతో మాట్లాడమని బతిమాలింది. ఫ్రెండ్స్‌గా ఉన్నప్పుడే బాగుండేది.. నా వల్ల నీ గేమ్‌కు ప్రాబ్లం కానివ్వను. నాది పడిపడి చచ్చే క్యారెక్టర్ అయితే కాదు, ఇకపై జస్ట్ ఫ్రెండ్‌గా ఉంటా అని చెప్పుకుంటూ పోయింది. నిఖిల్ శిలావిగ్రహంలా స్తబ్దుగా కూర్చోవడంతో కోపంతో వెళ్లిపోయింది. ఆమె అలకను తీర్చేందుకు నిఖిల్.. యష్మిని హత్తుకుని ముద్దిచ్చాడు.ఇంకా పృథ్వీ వెనకే పడుతోన్న విష్ణుపృథ్వీ మెడలో గోల్డ్ చెయిన్ చూసి నిలువెత్తు బంగారం.. మళ్లీ బంగారం వేసుకుని తిరగడమేంటో అని మురిసిపోయింది. ఈ మాట విన్న హౌస్మేట్స్ ఇక మా వల్లకాదు, వెళ్లిపోతాం అని జోక్ చేశారు. బిగ్‌బాస్ కూడా సరే, మీ సరదా నేనెందుకు కాదంటాను అన్నట్లు గేట్లు తెరిచాడు. దీంతో అబ్బాయిలంతా కలిసి అవినాష్‌ను లాక్కెళ్లి మరీ బయట పడేసేందుకు ప్రయత్నించారు.మనసు మార్చుకున్న బిగ్బాస్అనంతరం బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ మేరకు అవినాష్ జిమ్ ట్రైనర్‌గా మారి హౌస్‌మేట్స్‌తో చిత్రవిచిత్రమైన కసరత్తులు చేయించి నవ్వించాడు. దీంతో కిచెన్ టైమర్‌కు మరో రెండు గంటల సమయం యాడ్ చేశాడు. అలాగే మార్కెట్లో మర్చిపోయిన కూరగాయలు, పండ్లను సైతం పంపించి తన మనసు వెన్న అని నిరూపించుకున్నాడు.అవ్వకు ఆస్కార్ ఇవ్వాల్సిందే!అవినాష్, తేజ.. గంగవ్వను దెయ్యంలా రెడీ అయి భయపెట్టాలన్నాడు. ఇంకేముంది.. అర్ధరాత్రి గంగవ్వ జుట్టు విరబోసుకుని కేకలు వేయడంతో హౌస్మేట్స్ నిద్రలో నుంచి లేచి జడుసుకున్నారు. ఇది చూసిన తేజ.. నెక్స్ట్ వీక్ నామినేషన్స్ పక్కా అని భయపడిపోయాడు. నిఖిల్, పృథ్వీ, నబీల్ మాత్రం నిద్రలో నుంచి లేవలేదు. అయితే ఇది ప్రాంక్ అని, అవినాష్ చేయించి ఉంటాడని గౌతమ్ అనుమానపడ్డాడు.మెగా చీఫ్ కంటెండర్‌గా రోహిణిబీబీ రాజ్యం ఏర్పాటు చేసుకునేందుకు రెండు క్లాన్స్ పోటీపడతాయన్నాడు. మొదటగా అక్వేరియంలో నీళ్లను నింపే టాస్కులో రాయల్ టీమ్ గెలిచింది. అందుకు గానూ రాజ్యంలో మంచినీటి సరస్సును పొందారు. అలాగే రాయల్ టీమ్‌లో నుంచి రోహిణి మెగా చీఫ్ కంటెండర్ అయింది. అలాగే ఓజీ టీమ్‌లో యష్మి మెగా చీఫ్ కంటెండర్ రేసు నుంచి తప్పుకుంది. రోహిణిని కంటెండర్‌గా సెలక్ట్ చేయడంపై హరితేజ రాద్దాంతం చేసింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గంగవ్వ కాళ్లు మొక్కిన బిగ్ బాస్ కొత్త చీఫ్
బిగ్ బాస్ హౌస్‌లో మెగా చీఫ్ కోసం రాయల్ క్లాన్, ఓజీ క్లాన్లు భారీగానే పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఓవర్ స్మార్ట్ గేమ్‌లో కొట్లాడుకుని మరీ ఛార్జింగ్ కోసం ఆపసోపాలు పడ్డారు. అయితే, ఈరోజు జరగనున్న డే-43 ప్రోమో తాజాగా విడుదలైంది. హౌస్‌లో వచ్చే వారం కోసం మెగా చీఫ్ ఎవరుకానున్నారనేది తేలిపోయింది.ఛార్జింగ్ టాస్క్‌లో రాయల్ క్లాన్ గెలిచింది. దీంతో ఆ క్లాన్ నుంచి కొందరు మెగా చీఫ్ పోటీదారులు అయ్యారు. ఫైనల్‌గా ఎవరైతే రేసులో ఉన్నారో వారందరితో 'పట్టుకో లేదంటే వదులుకో' అనే టాస్క్‌ను బిగ్‌బాస్ పెట్టాడు. ఈ గేమ్ కూడా స్కూలు పిల్లలు ఆడుతున్న కుర్చీల ఆట మాదిరి ఉంది. సర్కిల్లో ఒక వస్తువును ఉంచి దానిని ఎవరైతే ముందుగా తీసుకుంటారో వారికి ఒక పవర్ దక్కుతుంది. అప్పుడు రేసులో ఉన్న కెంటెస్టెంట్స్లలో ఎవరినైనా ఇద్దరినీ తొలగించే ఛాన్స్ ఉంటుంది. ఈ గేమ్‌లో ఎక్కువ సార్లు గౌతమ్ నెగ్గుతాడు. దీంతో చాలామందిని గేమ్ నుంచి తప్పిస్తాడు. ఫైనల్‌గా గౌతమ్, గంగవ్వ మాత్రమే ఉంటారు. వారిలో గౌతమ్ మెగా చీఫ్ అయినట్లు తెలుస్తోంది. అతనికి తోడుగా గంగవ్వ-హరితేజ ఇద్దరూ మినీ చీఫ్లుగా ఉండనున్నారు. గౌతమ్- గంగవ్వ మధ్య జరిగిన టాస్క్ ఎంటి అనేది బిగ్ బాస్ రివీల్ చేయలేదు. తాజాగా విడుదలైన ప్రోమోలో మాత్రం గంగవ్వ కాళ్లకు గౌతమ్ నమస్కరించడాన్ని చూపించాడు. -
ప్రతివారం అరతులం బంగారమిస్తా.. గంగవ్వకు మణి బంపరాఫర్
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ అంతా అన్లిమిటెడ్ ఫుడ్ కావాలన్నాడు నబీల్. అయితే ఇది గొంతెమ్మ కోరికగా భావించిన బిగ్‌బాస్ ఈ వారం మాత్రమే కావాల్సినంత ఫుడ్ ఇస్తానన్నాడు. కానీ ఓ తిరకాసు పెట్టాడు. అదేంటో తెలియాలంటే నేటి (అక్టోబర్ 16) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..నా జీవితంలో జరిగిన ఘోరంవిష్ణుప్రియ తన మనసులోని బాధను చెప్పడంతో గంగవ్వ ఎమోషనలైంది. అమ్మకు ఇష్టం లేదని చిన్నప్పటినుంచి నాన్నతో మాట్లాడేవాళ్లం కాదు. నాన్నపై ఎంత ప్రేమ ఉన్నా, అమ్మ కోసం ఆయనతో మాట్లాడలేదు. చిన్నప్పుడే అమ్మానాన్న విడిపోయారు.. అది నా జీవితంలో జరిగిన ఘోరం.. ఇది ఎవరికీ జరగకూడదు. అమ్మ చనిపోయాక ఇప్పుడిప్పుడే తనతో మాట్లాడుతున్నాం అని చెప్పింది. ఇది విని గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుంది.హౌస్మేట్స్ కోసం నబీల్ త్యాగంఇకపోతే ఇన్ఫినిటీ రూమ్‌లో నబీల్ అన్లిమిటెడ్ ఫుడ్ కావాలన్న సంగతి తెలిసిందేగా! దాని గురించి బిగ్‌బాస్ ప్రస్తావిస్తూ.. ఇంట్లో ఉన్నంతకాలం నబీల్ స్వీట్లు, కూల్‌డ్రింక్స్, చాక్లెట్లు త్యాగం చేస్తే ఈ ఒక్క వారం అన్లిమిటెడ్ రేషన్ లభిస్తుందన్నాడు. ఇంటిసభ్యులందరికోసం ఆ కండీషన్‌కు నబీల్ ఓకే చెప్పాడు. దీంతో మెహబూబ్.. సూపర్ మార్కెట్లో ఉన్న రేషన్ అంతా ఊడ్చేశాడు.బంగారం ఇస్తానన్న మణికంఠతర్వాత నాగమణికంఠ.. తాను నామినేషన్స్‌లో నుంచి సేవ్ అయితే గంగవ్వకు బంగారు ముక్కుపుడక ఇస్తానన్నాడు. సేవ్ అయిన ప్రతివారం అరతులం ఇస్తానంటూ గంగవ్వ మీద ఒట్టేశాడు. మరి నాకేం ఇస్తావని రోహిణి అనగా ఒక ముద్దిస్తానన్నాడు. ఇక అవినాష్-రోహిణి నామినేషన్స్‌ను రీక్రియేట్ చేసి నవ్వించారు. వీరి పర్ఫామెన్స్ మెచ్చిన బిగ్‌బాస్ కిచెన్‌లో మరో రెండు గంటలు ఎక్కువ సేపు వంటచేసుకునే ఛాన్సిచ్చాడు. మెగా చీఫ్ కంటెండర్‌గా గంగవ్వఅనంతరం రాయల్ టీమ్ గెలుపొందిన మెగా చీఫ్ కంటెండర్ షీల్డ్‌ను గంగవ్వకిచ్చారు. బిగ్‌బాస్.. రాయల్ టీమ్‌ను ఓవర్ స్టార్ట్ఫోన్లుగా, ఓజీ టీమ్‌ను ఓవర్ స్మార్ట్ చార్జర్లుగా విభజించారు. హౌస్ అంతా రాయల్ టీమ్ ఆధీనంలో, గార్డెన్ ఏరియా ఓజీ టీమ్ ఆధీనంలో ఉంటుందన్నాడు. కిచెన్, బెడ్రూమ్, వాష్‌రూమ్ వంటి వసతులు అందిస్తూ చార్జింగ్ పొందవచ్చని తెలిపాడు.బెంబేలెత్తిపోయిన మణికంఠటాస్క్ పూర్తయ్యేలోపు బతికున్న సభ్యులే మెగాచీఫ్ కంటెండర్లవుతారన్నాడు. టాస్క్ ప్రారంభానికి ముందే మణి బెంబేలెత్తిపోయాడు. నాకంటూ ఫ్యామిలీ ఉంది. బొక్కలిరగ్గొట్టుకుని బయటకు వెళ్లలేను. ఆరోగ్యం ముఖ్యం.. టీమ్‌కు ఎంతవరకు సపోర్ట్ ఇవ్వాలో అంతే ఇస్తానని చెప్పాడు. ఆట మొదలవగానే అవినాష్.. నబీల్‌కు తెలియకుండా అతడి చార్జర్‌ను తన ప్లగ్‌కు కనెక్ట్ చేశాడు. హరికథ చెప్పి చార్జింగ్హరితేజ.. హరికథతో మణికంఠను మెప్పించి అతడి దగ్గర నిమిషం పాటు చార్జింగ్ పొందింది. నయని కూడా యష్మి దగ్గర బలవంతంగా చార్జ్ పొందడానికి ట్రై చేసింది. కానీ నిఖిల్ ఆమెను అడ్డుకుని అవతలకు విసిరేయడంతో కన్నీళ్లు పెట్టుకుంది. అలా నేటి ఎపిసోడ్ ముగిసింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మెగా చీఫ్‌గా మెహబూబ్.. బైక్ గెల్చుకున్న నయని
మెగా చీఫ్‌గా నబీల్ పదవీకాలం ముగిసింది. దీంతో మెగా చీఫ్ పోస్ట్ కోసం మళ్లీ పోటీపెట్టారు. ఈసారి పాత కంటెస్టెంట్లను వెనక్కు నెట్టి సుడిగాలిలా హౌస్‌లో అడుగుపెట్టిన వైల్డ్కార్డుల్లో ఒకరే ఆ పోస్టును ఎగరేసుకుపోయారు. మరి ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి(అక్టోబర్ 10) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఎలిమినేషన్ గురించి ఛాలెంజ్వచ్చేవారం నువ్వే ఎలిమినేట్ అవుతానవి గంగవ్వ అనడంతో విష్ణుప్రియ తాను వెళ్లనంది. అవ్వ పోయేదాకా తాను పోనంది. దీంతో ఎవరు ఎక్కువ రోజులు ఉంటారో చూద్దామని గంగవ్వ, విష్ణుప్రియ ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకున్నారు. అటు ప్రేరణ.. నా మాట వినట్లేదు, నన్ను నమ్మట్లేదు, ఇమ్మెచ్యూర్గా ప్రవర్తిస్తున్నావంటూ నబీల్‌తో వాగ్వాదానికి దిగింది. దీంతో హర్టయిన నబీల్.. నేను ఇమ్మెచ్యూర్ కాదని అరిచాడు. ప్రాంక్ చేసిన గంగవ్వతర్వాత అతడు ప్రేరణను ఇమిటేట్ చేస్తూ మాట్లాడటం కాస్త వెగటుగా అనిపిస్తుంది. ఇక బిగ్‌బాస్ రాయల్ క్లాన్ (వైల్డ్ కార్డ్స్)లో నుంచి ఆరుగురు బెస్ట్ పర్ఫామర్లను మెగా చీఫ్ కంటెండర్స్ కోసం ఎంపిక చేయమన్నాడు. దీంతో అవినాష్.. తన పేరుతో పాటు నయని, మెహబూబ్, హరితేజ, రోహిణి, గౌతమ్ పేర్లను సూచించాడు. నా పేరు ఎవరూ చెప్పలేదని గంగవ్వ ఏడుస్తున్నట్లు నటించి అందర్నీ ఆటపట్టించింది.కంటెండర్‌గా మణిఅటు ఓజీ టీమ్‌లో రెండు స్టార్లున్న మణికంఠ, నబీల్ లలో ఒకరిని బెస్ట్ పర్ఫామర్‌గా సెలక్ట్ చేయాలన్నాడు. దీంతో టీమ్ అంతా కలిసి మణిని బెస్ట్ పర్ఫామర్ అని ప్రకటించడంతో అతడు చీఫ్ కంటెండర్ అయ్యారు. చీఫ్ కంటెండర్లకు మొదటగా ఓ గేమ్ పెట్టారు. అందులో కంటెండర్లు అందరూ జాకెట్ వేసుకుని నిలబడితే వారిపైకి హౌస్మేట్స్ బంతులు విసరాలి. ఎవరి జాకెట్‌కు ఎక్కువ బంతులు అతుక్కుంటే వారు అవుట్ అవుతారు. అందరికంటే గంగవ్వ ఎక్కువ హుషారుగా బాల్స్ విసరడం విశేషం. మొదటి రౌండ్లో గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. ఏడ్చేసిన రోహిణిఈ గేమ్‌లో విష్ణుప్రియ, పృథ్వీ.. తనను కావాలని గట్టిగా కొట్టారని రోహిణి ఫీలైంది. ఈమె దగ్గరకు విష్ణు వెళ్లి.. నాకు అతడి (పృథ్వీ) దగ్గరి నుంచి ఎనర్జీ వస్తుంది. డౌన్‌గా ఉన్నప్పుడే తన దగ్గరకు వెళ్తాను.. అందరితోనూ నేను బాగుంటాను అంటూ తన రిలేషన్ గురించి చెప్పింది. దీంతో రోహిణి.. నేనేమీ మీ గురించి లేనిది చెప్పలేదు.. మీరు అందరిముందు ఎలా ఉంటున్నారన్నదాని గురించే మాట్లాడాను.. అయినా తప్పుగా అనిపిస్తే సారీ అని చెప్పేసి వెళ్లిపోయింది. బైక్ గెల్చుకున్న నయనిఇక బాల్స్ గేమ్ రెండో రౌండ్లో నయని అవుట్ అవడంతో ఏడ్చేసింది. మూడో రౌండ్లో రోహిణి అవుట్ అయింది. సారీ చెప్పిన తర్వాత కూడా విష్ణుప్రియ గేమ్‌లో తనను టార్గెట్ చేయడంతో రోహిణి ఏడ్చేసింది. ఇక హరితేజ, మెహబూబ్, అవినాష్, మణి రెండో గేమ్‌లో పోటీపడగా చివరకు మెహబూబ్ గెలిచి మెగా చీఫ్‌గా నిలిచాడు. అనంతరం దమ్ముంటే స్కాన్ చెయ్ గేమ్‌లో విష్ణుప్రియ, నయని పావని ఆడారు. అయితే నయని పావని గెలిచి థండర్ వీల్స్ బైక్ పొందింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గతాన్ని తల్చుకుని కుంగిపోయిన గౌతమ్.. ఈసారి కప్పు కొడతా!
వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్ కళకళలాడుతోంది. బిగ్‌బాస్ 8లో ప్రస్తుతం 16 మంది ఉన్నారు. వీరితో కలిసి ఫన్ గేమ్ ఆడించాడు. అదే బిగ్‌బాస్ హోటల్. ఈ టాస్క్‌లో పాతవాళ్లంతా హోటల్ సిబ్బందిగా, కొత్తవాళ్లంతా గెస్టులుగా ఉన్నారు. మరి ఈ టాస్క్ ఏమేరకు వర్కవుట్ అయిందో నేటి (అక్టోబర్ 9) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..ఫన్ టాస్క్బిగ్బాస్ అమ్మాయిలను ఒక టీమ్‌గా, అబ్బాయిలను ఒక టీమ్‌గా విభజించి ఫన్నీ టాస్కు ఇచ్చాడు. ఆడాళ్ల టీమ్‌కు ముక్కు అవినాష్, అబ్బాయిల టీమ్‌కు రోహిణిని లీడర్‌గా పెట్టారు. గేమ్ ఏంటంటే.. టీమ్సభ్యులంతా వారి నోటిని నీటితో నింపుకోవాలి. వీళ్లను ఇతర టీమ్‌లోని వారు నవ్వించి ఆ నీళ్లు బయటకు వచ్చేలా చేయాలి. ఈ గేమ్‌లో అబ్బాయిలను నవ్వించే క్రమంలో అవినాష్.. మణికంఠ దగ్గరకు వెళ్లి పాట పాడాడు. కప్పు కొడతా: గౌతమ్తర్వాత గౌతమ్ దగ్గరకు వెళ్లి అశ్వత్థామ 2.0 అని ఇమిటేట్ చేశాడు. అది విని హర్టయిపోయిన గౌతమ్.. అయిపోయినదాన్ని మళ్లీ మళ్లీ తీసి ఇరిటేషన్ తెప్పించొద్దు. వెళ్లిపోమంటే వెళ్లిపోతా.. అని మైక్ విసిరేసి ఇంట్లోకి వెళ్లి ఏడ్చాడు. నాన్న ఐయామ్ సారీ, నీతో గొడవపడి మాట్లాడకుండా వచ్చేశా.. కానీ ఈసారి నన్ను నేను నిరూపించుకుంటాను. కప్పు కొడతాను అని తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు.ఉప్పు గెల్చుకున్న అవినాష్, రోహిణిమరోవైపు తనను నవ్వించమని అవినాష్, రోహిణికి బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు. ఎంటర్టైన్మెంట్ వీరికి కొట్టిన పిండి కావడంతో ఇరగదీశారు. వీరి పర్ఫామెన్స్ మెచ్చిన బిగ్‌బాస్.. ఇంటిసభ్యులు రేషన్‌లో మర్చిపోయిన ఉప్పును కానుకగా ఇచ్చాడు. ఇక తర్వాతి రోజు ఉదయం విష్ణు ధ్యానం చేస్తుంటే గంగవ్వ చెడగొట్టేందుకు ప్రయత్నించడం భలే సరదాగా అనిపించింది. అనంతరం బిగ్‌బాస్ హోటల్ టాస్క్ పెట్టాడు. ఇందులో ఓల్డ్ కంటెస్టెంట్లు హోటల్ సిబ్బంది కాగా రాయల్ టీమ్ అతిథులుగా ఉంటారు. ఎవరెవరు ఏ పాత్రలో..పాత్రల విషయానికి వస్తే.. నబీల్.. అప్పుల్లో కూరుకుపోయిన హోటల్ యజమాని, ప్రేరణ.. మతిమరుపు మేనేజర్, నిఖిల్.. హెడ్ చెఫ్, సీత.. అసిస్టెంట్ చీఫ్, పృథ్వీ.. అందరినీ ఫ్లర్ట్ చేసే గార్డ్, విష్ణు.. పృథ్వీతో లవ్‌లో ఉండే పర్సనల్ బట్లర్, యష్మి.. హౌస్ కీపింగ్, మణికంఠ.. హౌస్ కీపింగ్(దొంగిలించడం, దాన్ని తిరిగిచ్చేయడం)గా వ్యవహరిస్తారు.తికమక మనిషిగా హరితేజగంగవ్వ.. రాజవంశానికి చెందిన మహారాణి, నయని పావని.. మహారాణి అసిస్టెంట్, అవినాష్.. సూపర్‌స్టార్, రోహిణి- పొగరుబోతు రిచ్ కిడ్ (అవినాష్ గర్ల్‌ఫ్రెండ్), మెహబూబ్.. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ (రోహిణి తండ్రి అపాయింట్ చేస్తాడు) హరితేజ.. మెహబూబ్ అసిస్టెంట్(తికమక మనిషి), తేజ.. పాపులర్ ఫుడ్ బ్లాగర్, గౌతమ్.. పోలీసుల నుంచి దాక్కుని తిరుగుతున్న క్రిమినల్‌గా పాత్రలు పోషించారు.మణిని ఆడుకున్న రోహిణిటాస్కు ప్రారంభానికి ముందే సీత.. ఒక పర్సు కొట్టేయడం గమనార్హం. ఈ టాస్కులో హౌస్మేట్స్ తమ పర్ఫామెన్స్ చూపించారు. నన్నెవరూ పట్టించుకోవట్లేదని రోహిణి అనగా.. మణి.. నువ్వో మాడియపోయిన కందిపప్పు, మీ ఆయనో పెసరపప్పు అని సెటైర్ వేశాడు. దీంతో రోహిణి సీరియస్ అయింది.. ఒకసారి, రెండుసార్లు ఓకే.. కానీ మూడోసారి ఒప్పుకోను. నీ క్యారెక్టర్లో నుంచి బయటకు వచ్చి నీకు నచ్చినట్లు మాట్లాడటం ఫన్ కాదు.. అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతలోనే జోక్ చేశానంటూ నవ్వేసింది. నీ కళ్లలో భయమే నాకు కావాలంటూ నవ్వుతూ చెప్పడంతో మణి ఊపిరి పీల్చుకున్నాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హింటిస్తే అర్థం చేసుకోరే..! మణిని చెడుగుడు ఆడుకున్న గంగవ్వ
వైల్డ్‌కార్డ్ ఎంట్రీలతో హౌస్ కళకళలాడిపోయింది. సీజన్ ప్రారంభం అయినప్పుడు 14 మంది ఉన్నారు. కానీ వైల్డ్ కార్డ్స్ రాకతో కంటెస్టెంట్ల సంఖ్య 16కు చేరుకుంది. మరి వీళ్ల నామినేషన్స్ ఎలా ఉన్నాయో నేటి (అక్టోబర్ 7) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..గంగవ్వా.. మజాకా!వైల్డ్ కార్డ్స్‌ను చూసి హౌస్‌మేట్స్‌కు భయం పట్టుకుంది. ఎవరు ఎలాంటివాళ్లు, ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలనేది చర్చించుకున్నారు. తర్వాతి రోజు ఉదయం గంగవ్వ మణికంఠను ఓ ఆటాడుకుంది. నీ పెండ్లాం, పిల్ల యాదొచ్చిందని ఏడ్చినవ్.. అంత యాదికొస్తే ఎందుకొచ్చినవ్ ఇక్కడికి అని కౌంటర్ వేసింది. నా బాధ తట్టుకోలేకున్నా అని మణి అంటే మరి ఈ వారం పోతవా అని మరో పంచ్ వేసింది. ఇకపోతే ప్రైజ్‌మనీ రూ.38 లక్షలకు చేరుకుంది.తేజకు శిక్షఓజీ టీమ్ పాలు సహా కొన్ని రేషన్ సామానును రాయల్ టీమ్‌కు ఇచ్చేందుకు తటపటాయించింది వచ్చీరావడంతోనే తనతో బోళ్లు తోమించారని అవినాష్ తెగ ఫ్రస్టేట్ అయ్యాడు. దీంతో అతడికి హరితేజ, మణికంఠ సాయం చేశారు. ఆడుతూపాడుతూ బోళ్లన్నీ తోమేశారు. మరోవైపు టేస్టీ తేజ కూర్చోవడంతో కుర్చీ విరిగిపోయింది. బిగ్‌బాస్ ప్రాపర్టీ ధ్వంసం చేసిన పాపానికి కాసేపు అతడు కుక్కలా నటించాడు.మణికంఠను టార్గెట్ చేశావ్..తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలైంది. రాయల్ టీమ్‌కు మాత్రమే నామినేట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. మొదటగా హరితేజ.. గ్రూపిజం చేస్తున్నావు, మణికంఠను టార్గెట్ చేశావంటూ యష్మిని నామినేట్ చేసింది. ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావ్, సొంతంగా ఆడటం లేదంటూ పృథ్వీని నామినేట్ చేసింది. గౌతమ్.. నీ గేమ్ వదిలేసి వేరొకరి వెనకాల పడుతున్నావంటూ విష్ణుప్రియను, మణికంఠపై ప్రతీకారం తీర్చుకోవడం బాగోలేదని యష్మిని నామినేట్ చేశాడు. మణిని టార్గెట్ చేయడం వల్లే అతడికి సింపతీ వస్తోందని రాయల్ టీమ్ హింటిస్తోంది. కానీ దాన్ని యష్మీ అర్థం చేసుకోలేకపోయింది.మెహబూబ్ సిల్లీ నామినేషన్స్నయని వంతురాగా.. నీకసలు సీరియస్‌నెస్, ఇంట్రస్ట్ లేదంటూ విష్ణు మెడలో నామినేటెడ్ బోర్డు వేసింది. సీత మెడలోనూ బోర్డు వేస్తూ.. నామినేట్ చేయడం దేనికి? బయటకు వెళ్లిపోతుంటే ఏడ్వడం దేనికని ఆమె ఎమోషన్‌ను ప్రశ్నించింది. మెహబూబ్ వంతురాగా.. నువ్వు నాతో సరిగా మాట్లాడలేదంటూ సీతను నామినేట్ చేశాడు. మా రాకను జీర్ణించుకోలేకపోతున్నారంటూ యష్మి మెడలో బోర్డు వేశాడు. తేజ మాట్లాడుతూ.. చీఫ్‌గా ఫెయిలయ్యావంటూ సీతను నామినేట్ చేశాడు. ఒక్కో పాయింట్ కూడా తూటామణికంఠ మెడలో బోర్డు వేస్తూ కరెక్ట్ పాయింట్లు చెప్పాడు. 1. ఎప్పుడు చూసినా నీ గోడు చెప్పుకుంటూనే ఉంటావ్.. అది నీ గేమా? 2. సీత నీకు ఫ్రెండ్ అన్నావ్, కానీ బిగ్‌బాస్ అడిగినప్పుడు నబీల్, విష్ణు పేర్లు మాత్రమే చెప్పావ్, అంటే సీత నీ ఫ్రెండ్ కాదా? 3. తన ఫుడ్ వస్తే తీసుకోవద్దని పృథ్వీ మరీ మరీ చెప్పాడు, అయినా సరే యష్మిది పక్కనపెట్టి మరీ అతడికే ఫుడ్ తీసుకెళ్లావ్.. దీన్నెలా అర్థం చేసుకోవాలంటూ మణికంఠను నామినేట్ చేశాడు. యష్మి సైకోయిజం!ఈ నామినేషన్ జరుగుతున్నప్పుడు యష్మి ఆనందం అంతా ఇంతా కాదు. చప్పట్లు కొట్టి మరీ సంతోషించింది. మణికంఠ ఎప్పటిలాగే తడబడకుండా సమాధానాలిచ్చాడు. పదేపదే ఏడ్వడం మానుకుంటున్నానని, సీత ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ కాదని, మదర్ సెంటిమెంట్ వల్లే పృథ్వీకి ఫుడ్ ఇచ్చానని మూడింటికీ ఆన్సరిచ్చాడు. మిగతావారి నామినేషన్స్ రేపటి ఎపిసోడ్లో ప్రసారం కానుంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 8 రీలోడ్: వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు ఇమ్యూనిటీ.. వాటే ట్విస్ట్
గత ఏడు సీజన్లకంటే కూడా ఈసారి బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ లాంచింగ్ ఎపిసోడ్‌కు అత్యధిక టీఆర్పీ వచ్చింది. కానీ కంటెస్టెంట్లు ఆ రేటింగ్‌ను అలాగే కాపాడుకోలేకపోయారు. నెమ్మదిగా షో బోరింగ్‌గా మారుతుండటంతో బిగ్‌బాస్ ఇక లాభం లేదనుకుని పాత సీజన్లలో పాల్గొన్న పలువురినే వైల్డ్ కార్డ్ ఎంట్రీల పేరిట హౌసులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆదివారం.. 'బిగ్‌బాస్ గ్రాండ్ రీలోడ్' పేరిట ఎపిసోడ్ ప్రసారమైంది. ఇంతకీ హౌస్‌లోకి వచ్చిందెవరో చూసేయండి..నైనిక ఎలిమినేట్'జవాన్' టైటిల్ సాంగ్, 'గేమ్ ఛేంజర్' నుంచి రీసెంట్గా రిలీజైన 'రా మచ్చా' పాటలకు స్టెప్పులేసి ఆదివారం ఎపిసోడ్‌కి హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. వచ్చీ రాగానే డేంజర్ జోన్లో ఉన్న మణికంఠ, విష్ణుప్రియ, నైనికని నిలబెట్టారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలని ఎలా ఎదుర్కోబోతున్నారో ఎదుర్కోబోతున్నారని హౌస్‌మేట్స్‌ను అడగ్గా వారంతా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నైనిక ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించడంతో సీత ఎప్పటిలాగే కన్నీటి కుళాయిని ఓపెన్ చేస్తూ బోరున ఏడ్చేసింది.ఎవరికి ఏ ట్యాగ్?స్టేజీపైకి వచ్చిన నైనికని హౌసులో ఎవరు ఎలాంటి వారనేది నాగ్ అడగ్గా.. ప్రేరణ మ్యానిప్యులేటర్, మణికంఠ వెన్నుపోటు పొడిచే వ్యక్తి, విష్ణుప్రియ నకిలీ స్నేహితురాలు, పృథ్వీ అటెన్షన్ సీకర్, నబీల్ అవకాశవాది, సీత నిజమైన ఫ్రెండ్, నిఖిల్ గేమ్ ఛేంజర్, యష్మిది మంద బుద్ధి అని చెప్పుకొచ్చింది.ఉత్తరాలు వచ్చాయ్..ఈ వారం హౌస్మేట్స్ కోసం ఉత్తరాలు వచ్చాయి. కానీ అవి కొందరికి అందకుండానే వెనక్కు వెళ్లిపోయాయి. వాటిని నాగ్ తిరిగి తీసుకొచ్చాడు. సీత, నబీల్, యష్మి, మణికంఠ తమ లెటర్స్ అందుకుని ఎమోషనల్ అయ్యారు. ఇక హౌస్‌లో ఉన్న ఎనిమిది మంది ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్) టీమ్‌గా, కొత్తగా వచ్చే ఎనిమిది వైల్డ్ కార్డ్స్ రాయల్ టీమ్‌గా ఉంటాయని నాగ్ వెల్లడించాడు.. తొలి వైల్డ్ కార్డ్‌గా హరితేజసీరియల్స్, సినిమాలతో పాపులర్ అయింది హరితేజ. బిగ్‌బాస్ మొదటి సీజన్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. గలగలా మాట్లాడే ఈమె గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఈ షో తర్వాత సినిమాల్లో బిజీ అవడమే కాకుండా హోస్ట్‌గానూ అవతారమెత్తింది. అఆ, యూ టర్న్, అరవింద సమేత వీర రాఘవ, ప్రతిరోజు పండగే, హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హరితేజ.. ఇటీవలే రిలీజైన దేవర సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా మెప్పించింది. యాక్టింగ్, యాంకరింగ్ రెండింట్లోనూ ఆరితేరిన ఈమె ఇప్పుడు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లో మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. తనకు నవదీప్.. ఆల్ ది బెస్ట్ చెబుతున్న వీడియో పంపించారు. అలానే హౌసులోకి వెళ్లేముందు స్టేజీపైకి హరితేజ కూతురుని తీసుకురావడంతో ఆమె ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంది.రెండో వైల్డ్ కార్డ్‌గా టేస్టీ తేజతేజ అసలు పేరు తేజ్‌దీప్. తెనాలో పుట్టిపెరిగిన ఇతడు 2017లో సాఫ్ట్వేర్ ఉద్యోగం హైదరాబాద్‌లో సెటిలయ్యాడు. చిన్నప్పటినుంచి నటన, సినిమాలంటే ఆసక్తి ఉన్న తేజకు కరోనా సెలవులు కలిసొచ్చాయి. 2020లో వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్నప్పుడు తెనాలిలో స్నేహితులతో కలిసి హోటల్‌కు వెళ్లి భోజనం చేశాడు. ఆ వీడియో యూట్యూబ్‌లో పెట్టగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదేదో బాగుందనిపించి హైదరాబాద్ వచ్చాక అదే కొనసాగించాడు. యూట్యూబర్‌గా తిండి వీడియోలు చేస్తూ బిజీ అయ్యాడు. అలా బిగ్‌బాస్ ఏడో సీజన్లో పాల్గొన్నాడు. తొమ్మిదివారాలపాటు హౌస్‌లో ఉన్నాక షోకి టాటా బైబై చెప్పాడు. ఇప్పుడు ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అమ్మ చేసిన పాల తాళికలను నాగార్జున కోసం తీసుకొచ్చాడు. అలానే తేజకి శోభాశెట్టి బెస్ట్ విషెస్ చెప్పింది.మరో రూ.20 లక్షలుసెట్పైకి వచ్చిన స్వాగ్ టీమ్ (శ్రీవిష్ణు, రీతూ వర్మ, దక్ష నగార్కర్) తన సినిమా కబుర్లు చెప్పింది .తర్వాత హౌస్‌లోకి వెళ్లి హౌస్మేట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్‌తో గేమ్ ఆడించారు. ఈ గేమ్‌లో వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్లు హరి-తేజ గెలిచి రూ.20 లక్షలు ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. అనంతరం మూడో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా నయని పావని హౌస్‌లో అడుగుపెట్టింది.మూడో వైల్డ్ కార్డ్‌గా నయని పావనిఈమె అసలు పేరు సాయిరాజు పావని. టిక్‌టాక్ స్టార్‌గా ఫేమస్. షార్ట్ ఫిలింస్, కవర్ సాంగ్స్, చిత్తం మహారాణి, సూర్యకాంతం వంటి చిత్రాల్లోనూ కనువిందు చేసిన ఈ బ్యూటీ బిగ్‌బాస్ ఏడో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. దురదృష్టం కొద్దీ వారానికే ఎలిమినేట్ అయిపోయింది. అయితే నయని నెక్స్ట్ సీజన్లో రావడం పక్కా అనుకున్నారు. అందరూ ఊహించినట్లుగానే ఈ సీజన్లో అడుగుపెట్టింది. కాకపోతే మరోసారి వైల్డ్‌కార్డ్ ద్వారానే ఎంట్రీ ఇచ్చింది. ఇక శివాజీ.. నయనికి బెస్ట్ విషెస్ చెప్పాడు.నాలుగో వైల్డ్ కార్డ్‌గా మెహబూబ్డ్యాన్స్, యాక్టింగ్ అంటే పిచ్చి. అందుకోసం మెహబూబ్ చేయని ప్రయత్నం లేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల సాఫ్ట్వేర్ కొలువులో చేరినా కళను వదిలేయలేకపోయాడు. వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలింస్, టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. తక్కువ సమయంలోనే ఎక్కువమంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.అలా తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజన్లో అడుగుపెట్టిన టాస్కుల్లో సత్తా చూపించాడు. కండబలం బాగానే ఉన్నా బుద్ధి బలం తక్కువగా ఉండటంతో ఫినాలే వరకు వెళ్లకుండానే వెనుదిరిగాడు. ఇప్పుడు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. ఇక మెహబూబ్ కోసం సొహైల్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అలానే నాలుగో సీజన్లో ఎలా అయితే ఆడావో ఈసారి అంతకు మించి ఆడి గెలవాలన్నాడు.'జనక అయితే గనక' మూవీ ప్రమోషన్లో భాగంగా సుహాస్, దిల్ రాజ్ టీమ్ వచ్చారు. సుహాస్, హీరోయిన్ సంగీర్తన హౌసులోకి వెళ్లి ఓజీ, రాయల్ టీమ్స్‌తో గేమ్ ఆడించారు. ఇందులో గెలిచిన సీత-మణికంఠ.. బెడ్ రూమ్, రేషన్ కంట్రోల్ చేసే అధికారాన్ని సొంతం చేసుకున్నారు.ఐదో వైల్డ్ కార్డ్‌గా రోహిణిఒకప్పుడు సీరియల్స్‌లో మెప్పించిన రోహిణి.. ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ రచ్చ చేస్తోంది. తన కామెడీ టైమింగ్స్‌తో అందరికీ వినోదాన్ని పంచుతోంది. ఆ మధ్య కాలు సర్జరీ వల్ల కొన్ని నెలలపాటు తెరపై కనిపించలేదు. కానీ కోలుకున్న వెంటనే మళ్లీ స్క్రీన్‌పై ప్రత్యక్షమై నవ్వుల జల్లు కురిపిస్తోంది. బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొన్న రోహిణి.. మరోసారి ఈ రియాలిటీ షోలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. ఇక శివజ్యోతి.. రోహిణి కోసం స్పెషల్ వీడియో పంపింది. హౌసులో కామెడీ లోటు బాగా ఉందని, దాన్ని ఫుల్ ఫిల్ చేయాలంది.ఆరో వైల్డ్ కార్డ్‌గా గౌతమ్ కృష్ణగౌతమ్ కృష్ణ.. బిగ్‌బాస్‌కు రావడానికి ముందు పలు సినిమాలు చేశాడు. కానీ జనాలకు సుపరిచితుడైంది మాత్రం బిగ్‌బాస్ ఏడో సీజన్‌తోనే! చిన్నప్పటినుంచే డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. కానీ పేరెంట్స్ కోరిక మేరకు డాక్టర్ అయ్యాడు. తన కోరికను చంపుకోలేక 2018లో దర్శకత్వంలో శిక్షణ పొందాడు. ఆ మరుసటి ఏడాది ఆకాశవీధుల్లో సినిమాకు సొంతంగా కథ రాసుకుని తనే డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించాడు.బాలీవుడ్‌లోనూ సిద్దూ: ది రాక్‌స్టార్ సినిమా చేశాడు. సినిమాలపైనే ఫోకస్ పెట్టిన ఈ డాక్టర్ బాబు గత సీజన్లో సీక్రెట్ రూమ్‌కు వెళ్లాడు. అశ్వత్థామ 2.0 అంటూ భారీ డైలాగులతో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ ఫినాలే వరకు రాలేకపోయాడు. తాజాగా మరోసారి వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చాడు.ఏడో వైల్డ్ కార్డ్‌గా అవినాష్ఇండస్ట్రీలో అడుగుపెట్టాలన్న ఆశతో ఎంతోమందిలాగే ఇతడూ కృష్ణానగర్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. అవకాశాలు రాకపోయినా చిన్నచిన్న ప్రోగ్రాంలతో జీవితాన్ని గడిపాడు. అనుకోకుండా ఓ కామెడీ షోలో ఛాన్స్ రావడంతో అతడి దశ తిరిగిపోయింది. ఎనిమిదేళ్లలోనే టీం లీడర్‌గా ఎదిగాడు. చిన్నప్పటి నుంచే మిమిక్రీలు చేసే ఈ జగిత్యాలవాసికి బిగ్‌బాస్ నాలుగో సీజన్లో ఆఫర్ వచ్చింది. ఇదే విషయం కామెడీ షో నిర్వాహకులకు చెబితే.. ఇంకా రెండేళ్ల అగ్రిమెంట్ ఉందని, మధ్యలో వెళ్తే రూ.10 లక్షలు కట్టాలని హెచ్చరించారు.ఆర్థిక అవసరాల వల్ల స్నేహితుల సాయం తీసుకుని మరీ ఆ డబ్బు కట్టేసి బిగ్‌బాస్‌కు వెళ్లాడు. వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన అవినాష్.. 12 వారాలు హౌస్‌లో ఉండి ఎంటర్టైనర్ అని నిరూపించుకున్నాడు. ఇప్పుడు మరోసారి బిగ్‌బాస్ 8లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇతడికి శ్రీముఖి ఆల్ ది బెస్ట్ చెప్పింది. అలానే స్టేజీపై మణికంఠ, నబీల్, విష్ణుప్రియలా యాక్ట్ చేసి నవ్వించాడు.ఎనిమిదో వైల్డ్ కార్డ్‌గా గంగవ్వవయసైపోయాక ఏ పనీ చేతకాక ఓ మూలన కూర్చోవాల్సిందే అని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పని నిరూపించింది గంగవ్వ. టాలెంట్ ఉంటే ఏ వయసులోనైనా రాణించవచ్చని నిరూపించింది. జగిత్యాల జిల్లా లంబాడిపల్లి గ్రామానికి చెందిన గంగవ్వ ఒకప్పుడు దినసరి కూలీ. కానీ ఇప్పుడు తన నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.తన కట్టుబొట్టు, అమాయకత్వం, గడుసుతనం.. జనాలకు నచ్చేశాయి. బిగ్‌బాస్ నుంచి పిలుపు రావడంతో నాలుగో సీజన్లో అడుగుపెట్టింది. స్వచ్ఛమైన పల్లెలో బతికిన మట్టిమనిషికి ఏసీలు పడలేదు. ఈ గోస నావల్ల కాదంటూ దండం పెట్టి బయటకు వచ్చేసింది. అయితే సొంతింటి కలను నెరవేర్చుకుంది. తర్వాత సినిమాల్లోనూ నటించింది. ఇప్పుడు మరోసారి ధైర్యం చేసి బిగ్‌బాస్ 8లోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చింది.రాయల్ టీమ్‌కు ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ టీమ్‌కు చివరగా మరో గేమ్ ఆడించారు. ఇందులో రాయల్ టీమ్ నుంచి అవినాష్, గంగవ్వ ఆడారు. ఓజీ టీమ్‌పై వీరు విజయం సాధించడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ఈ వారం ఇమ్యూనిటీ లభించింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 8.కొత్త పోకడ, మాజీ కంటెస్టెంట్లతో వర్కవుట్ అవుతుందా?
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డులను తీసుకురావాలన్న ఆలోచన ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిందేమీ కాదు. సీజన్ ప్రారంభమయ్యే రోజు కేవలం 14 మందినే హౌస్‌లోకి పంపించి.. వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని స్పష్టంగా చెప్పేశారు. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో చాలామందికి గేమ్ మీదకన్నా కొట్లాటలు, ముచ్చట్ల మీదే ఫోకస్ ఎక్కువగా ఉంది. ఒకరిద్దరికి తప్ప ఎవరికీ విజేత లక్షణాలు లేవు.ఎనిమిది వైల్డ్ కార్డ్ ఎంట్రీలువీరితో షో నెట్టుకురావడం కష్టమని భావించిన బిగ్‌బాస్ టీమ్ వైల్డ్‌గా ఉంటే కంటెస్టెంట్లను తీసుకురావాలని ప్లాన్ చేసింది. కొత్తవాళ్లను తీసుకొస్తే వర్కవుట్ అవుతుందో, లేదోనని డౌట్ పడ్డారో ఏమో కానీ పాత సీజన్ల నుంచి కంటెస్టెంట్లను ఎంపిక చేశారు. ఒక్కో సీజన్లో నుంచి ఒక్కో ఆణిముత్యాన్ని తీసుకుని హౌస్‌లోకి పంపించనున్నారు. అలా హరితేజ, గంగవ్వ, గౌతమ్ కృష్ణ, నయని పావని, రోహిణి, అవినాష్, టేస్టీ తేజ, మెహబూబ్ దిల్సేను ఎంపిక చేసినట్లు భోగట్టా! హౌస్‌లో ఉన్నవాళ్లతో పోలిస్తే వీళ్లు చాలా బెటర్.గంగవ్వఇకపోతే గంగవ్వను తీసుకురావడమే అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది. బిగ్‌బాస్ నాలుగో సీజన్లో గంగవ్వతోనే ఐదు వారాలు ఆటను నెట్టుకొచ్చారు. అయితే ఏసీ పడట్లేదు, హౌస్‌లో ఉండలేను, నన్ను పంపించండి మహాప్రభో.. అని బతిమాలడంతో ఆమెను ఎలిమినేట్ చేసేశారు. కానీ సొంతింటి కల నెరవేర్చుకోవాలన్న కోరికతో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గంగవ్వ కలను నాగార్జున సాకారం చేశాడు. ప్రస్తుతం హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు మాజీ కంటెస్టెంట్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదట! (చదవండి: బిగ్‌బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఆదిత్య ఔట్)ముచ్చటగా మూడోసారి..అందుకే గంగవ్వను బతిమాలో, బలవంతపెట్టోగానీ హౌస్‌కు తీసుకువస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే తనవల్ల కాదని గంగవ్వ చేతులెత్తేయడంతో ఆమె స్థానంలో వితికా షెరును తీసుకువస్తున్నారన్నది లేటెస్ట్ టాక్ గౌతమ్ కృష్ణ.. అశ్వత్థామ 2.0 అంటూ అప్పట్లోనే సీక్రెట్‌రూమ్‌కు వెళ్లి వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా మళ్లీ హౌస్‌లో అడుగుపెట్టాడు. ముచ్చటగా మూడోసారి హౌస్‌లోకి వెళ్లబోతున్న ఇతడు ఎలా మెప్పిస్తాడో చూడాలి. రోహిణి, అవినాష్, హరితేజల గురించి భయపడాల్సిన పనేలేదు.నయని పావనిఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో వీళ్లెప్పుడూ ముందుంటారు. గత సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నయని పావని ఒక్కవారంలోనే ఎలిమినేట్ అయింది. కానీ వారం రోజుల్లోనే తనకంటూ మంచి పేరు సంపాదించుకుంది. మరి ఈసారైనా ఎక్కువవారాలు ఉంటుందేమో చూడాలి. మెహబూబ్ టాస్కులు బాగా ఆడతాడు, తేజ ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తాడు. మరి ఈ ఎనిమిది మంది హౌస్‌లో ఉన్నవారికి టఫ్ కాంపిటీషన్ ఇస్తారేమో వేచి చూడాలి!బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కోట్ల ఆస్తిని సంపాదించిన గంగవ్వ.. మొత్తం ఎంతంటే?
బిగ్‌బాస్ షోలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ అంతో ఇంత పాపులారిటీ వస్తుంది. బిగ్‌బాస్ ద్వారా వచ్చిన ఫేమ్‌తో కెరీర్‌ను మంచిగా బిల్డ్ చేసుకుని ఆర్థికంగా ఉన్నత స్థానానికి ఎదిగినవారూ ఉన్నారు. అయితే బిగ్‌బాస్ షోలోనే సంచలనంగా నిలిచిన గంగవ్వ ఈ రియాలిటీ షో తర్వాత కూడా తనకు నచ్చినట్లుగా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ హాయిగా జీవిస్తోంది.ఇంటికి ఎంత ఖర్చయిందంటే?తాజాగా ఆమె ఆస్తులు, సంపాదన గురించి మై విలేజ్ షో టీమ్ ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో గంగవ్వ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ (నాలుగో సీజన్) తర్వాత తన జీవితం చాలా మారిందంటూ తన ఇల్లు చూపించింది. రియాలిటీ షో తర్వాతే కట్టుకున్న ఈ ఇంటికి రూ.22 లక్షలు అయిందని తెలిపింది. తనకు ఉన్న ఆవుల కోసం రేకుల షెడ్డు కూడా వేసినట్లు పేర్కొంది. అలాగే వాటి కోసం గడ్డిని కూడా పెంచుతోంది.వ్యవసాయ భూములుఆవుల్ని కొని, షెడ్డు నిర్మించడానికి మొత్తం రూ.3 లక్షలు అయిందని వివరించింది. తర్వాత తను కొన్న నాలుగున్నర గుంటల పొలాన్ని చూపించింది. దీని ధర ఇప్పుడు రూ. 9 లక్షలు. అలాగే మరో చోట ఉన్న రెండున్నర ఎకరాల పొలం చూపించింది. ఇది దాదాపు రూ.75-80 లక్షలు పలుకుతోందట! ఇంకోచోట ఉన్న కమర్షియల్ ప్లాట్ చూపిస్తూ దీన్ని కొనడానికి సుమారు రూ.3 లక్షలయిందని పేర్కొంది. అదే తన కోరికమరో వ్యవసాయ భూమిని చూపిస్తూ.. ఇక్కడ 15 గుంటల భూమి ఉందని.. దీని విలువ ఏడెనిమిది లక్షల రూపాయలు ఉంటుందని తెలిపింది. మొత్తంగా తన ఇల్లు, వ్యవసాయ భూమి, కమర్షియల్ ప్లాట్స్ అంతా కలిపి కోటి 24 లక్షల విలువ చేస్తోంది. తనకంటూ ఐదు తులాల బంగారం ఉందన్న గంగవ్వ ఎప్పటికైనా 50 ఆవులను తీసుకుని వాటిని పెంచుతూ, పాలమ్ముతూ బతకాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చింది. ఇక తను సంపాదించినదాంట్లో కూతుర్లిద్దరికీ చెరో రూ.2 లక్షలు, మనవరాలి పెళ్లికి రూ.2.5 లక్షలు ఇచ్చాం.చదవండి: నాగమణికంఠ భార్యపై ట్రోలింగ్.. మరీ, ఇంత ఘోరమా? -
డ్రైవర్ గంగవ్వ!
పంచాయతీ ట్రాక్టర్‌ను నడుపుతుంది. లారీ మీద, బైక్ మీద సవారీ చేస్తుంది. పంటల సాగులోనూ అందెవేసిన చేయి కష్టాలను ఎదిరించి సొంత కాళ్ల మీద నిలబడింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం సజ్జన్పల్లి గ్రామంలో గంగవ్వ గురించి అడిగితే ‘ఎవరు?’ అంటారేమో గానీ... డ్రైవర్ గంగవ్వ.. అంటే అందరికీ తెలుసు. ప్రతిరోజూ పంచాయతీ ట్రాక్టర్‌ను తీసుకుని గల్లీల్లో చెత్త సేకరణ తో పొద్దున్నే అందరినీ పలకరిస్తూ వెళుతుంది గంగవ్వ. ట్రాక్టర్ ఒక్కటే కాదు లారీ, ఆటో, కారు ఏదైనా నడపగలదు. బైక్ మీద సవారీ చేయగలదు. సొంత కాళ్ల మీద నిలబడిన గంగవ్వ ఎందరికో ఆదర్శంగా నిలిచింది. చదువుకుంటూనే డ్రైవర్‌గా! సజ్జన్పల్లి గ్రామానికి చెందిన పుట్టి నాగయ్య, సాలవ్వల కూతురు గంగవ్వ. శెట్పల్లి సంగారెడ్డిలో పదో తరగతి వరకు చదువుకుంది. లింగంపేట మండల కేంద్రానికి వెళ్లి ఇంటర్ చదివింది. దూరభారాలు అని చూడకుండా సైకిల్ మీద సవారీ చేస్తూ వేరే ఊళ్లలో చదువుకుంది. పేద కుటుంబం కావడంతో సెలవు దినాల్లో కూలి పనులకు వెళ్లేది. అమ్మానాన్నలకు చేదోడువాదోడుగా ఉండేది. ఈ క్రమంలోనే బైకు నేర్చుకుంది. తరువాత ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. లారీ డ్రైవర్‌గానూ పనిచేసింది. గ్రామ పంచాయితీ పనుల్లో... గంగవ్వకు తల్లిదండ్రులు పెళ్లి చేశారు. వారం రోజులు తిరక్కుండానే వెనుదిరిగి వచ్చేసి, తల్లిగారింట్లోనే ఉండిపోయింది. అప్పటి నుంచి ఇంటి దగ్గరే ఉంటూ వ్యవసాయ పనులకు వెళ్లేది. అలాగే ట్రాక్టర్, కారు, లారీ డ్రైవర్‌గా వెళ్లి వచ్చేది. నాలుగేళ్ల పాటు రైస్‌మిల్‌లో ఆపరేటర్‌గా కూడా పనిచేసింది. ఐదేళ్ల కిందట పంచాయతీలకు ప్రభుత్వం ట్రాక్టర్లు, ట్యాంకర్లు సరఫరా చేయడంతో గ్రామంలో డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వాళ్లు దొరకలేదు. అప్పటికే భారీ వాహనాలు నడిపే సామర్థ్యంతో పాటు డ్రై వింగ్ లైసెన్స్ ఉండడంతో పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్‌గా నియమించారు. అప్పటì నుంచి పంచాయతీలో పనిచేస్తోంది. రోజూ చెత్త సేకరణ నుంచి రకరకాల పంచాయితీ పనుల్లో చురుగ్గా పాల్గొంటుంది. నిచ్చెన సాయంతో స్తంభం ఎక్కి విద్యుత్తు దీపాలను సరిచేస్తుంది. పంచాయతీలో ఏ పని ఉన్నా ఇట్టే చేసిపెడుతుంది. మొదట్లో ఆమెకు పంచాయతీ నుంచి రూ.2,500 వేతనం ఇచ్చేవారు. క్రమంగా పెరుగుతూ వచ్చి ఇప్పుడు రూ.8,500 వేతనం ఇస్తున్నారు. ట్రాక్టర్ అవసరం ఎప్పుడు ఏర్పడినా సరే గంగవ్వ పరుగున వెళ్లి ట్రాక్టర్ తీస్తుంది. నాలుగేళ్ల కిందట తండ్రి నాగయ్య చనిపోయాడు. తల్లి సాలమ్మతో కలిసి ఉంటుంది. అన్న కొడుకుని చదివించింది. అతను ఇప్పుడు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. వ్యవసాయ పనులు గంగవ్వ డ్రైవర్‌గా పనిచేస్తూనే వ్యవసాయ పనులు చేస్తోంది. తనకు సొంత భూమి లేకపోవడంతో వేరేవాళ్ల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తోంది. వెళ్లి దున్నడం, నాటు వేయడం, కలుపుతీయడం వంటి పనులన్నీ సొంతంగా చేసుకుంటుంది. లింగంపేట మండల కేంద్రానికి వెళ్లాలన్నా, ఎల్లారెడ్డి పట్టణానికి వెళ్లాలన్నా గంగవ్వ బైకు మీదనే ప్రయాణం చేస్తుంది. ‘ఎవరిపైనా ఆధారపడకుండా బతకడంలో ఉన్న తృప్తి మరెందులోనూ లేద’నే గంగవ్వ మాటలు నేటి తరానికి స్ఫూర్తి కలిగిస్తాయి. నచ్చిన పనిని ఎంచుకున్నా! ఇంటర్మీడియెట్ పూర్తవుతూనే పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. అక్కడ వాతావరణం ఎందుకో నాకు సరిపడదు అనిపించింది. వారం రోజులు కూడా గడవకముందే ఇంటికి వచ్చేశాను. అమ్మనాన్నలకు భారం కాకూడదని నిర్ణయించుకున్నా. నాకు బాగా నచ్చిన పని మీద దృష్టి పెట్టాను. డ్రైవింగ్ సొంతంగానే నేర్చుకున్నాను. రైస్‌మిల్ ఆపరేటర్‌గా పనిచేస్తూనే ట్రాక్టర్, లారీ, కారు.. డ్రైవింగ్ నేర్చుకున్నాను. కొందరు విచిత్రంగా చూసేవారు. కొందరు మగరాయుడు అనేవారు. ఎవరు ఏమనుకున్నా నా కష్టం మీద నేను బతకాలనుకుని నచ్చిన పనిచేసుకుంటూ వెళుతున్నాను. – గంగవ్వ, సజ్జన్పల్లి, లింగంపేట మండలం, కామారెడ్డి జిల్లా – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి -
రూట్ మార్చిన కేటీఆర్.. గంగవ్వతో నాటుకోడి కూర వండి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమరం నడుస్తుండగా.. కేటీఆర్ ప్రచారం కోసం వినూత్నంగా ఆలోచించారు. సోషల్ మీడియాను బేస్ చేసుకుని ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగానే తెలంగాణ యాసతో సోషల్ మీడియాలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ‘మై విలేజ్ షో’ టీమ్‌తో ఓ ప్రోగ్రామ్ చేశారు. ఈ ప్రోగ్రామ్‌లో కేటీఆర్ స్వయంగా నాటు కోడి కూర వండి.. పచ్చటి పొలాల మధ్య దావత్ చేసుకున్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ తనకు సంబంధించిన కొన్ని విషయాలను గంగవ్వ అండ్ టీమ్‌తో షేర్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, కరీంనగర్లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్.. అదే వేదిక మీద ఉన్న గంగవ్వతో మాట్లాడారు. ఈ సమయంలోనే.. తన మై విలేజ్ షో ఛానల్‌కు సమయం ఇవ్వాలని కోరగా.. కచ్చితంగా ఏదో ఒక రోజు వస్తానని ఆ సభా వేదికగా గంగవ్వకు కేటీఆర్ మాట ఇచ్చారు. ఆయన ఇచ్చిన మాట మేరకు.. కేటీఆర్ మై విలేజ్ షోకు వెళ్లారు. అక్కడ గంగవ్వతో పాటు అనిల్ జీలా, అంజి మామతో కలిసి స్వయంగా నాటుకోడి కూర, గుడాలు, బగార అన్నం వండారు కేటీఆర్. ఈ మొత్తం ప్రోగ్రామ్‌ను వీడియో తీశారు. నవ్వులే నవ్వులు.. ఇక, అందులో కేటీఆర్‌తో గంగవ్వ ముచ్చట్లు నవ్వులు పూయించాయి. ఏమనుకోవద్దు అనుకుంటూనే.. కేటీఆర్‌ను ప్రశ్నలు అడిగింది గంగవ్వ. కేసీఆర్‌తో తనకు ఎప్పుడైన గొడవలు అయ్యాయా అని అడగ్గా.. గొడవలు జరగని ఇళ్లు ఉండదని.. వాళ్లకు కూడా జరిగాయని చెప్పారు కేటీఆర్. కేసీఆర్‌ను ఏమని పిలుస్తావ్ అని అడగ్గా.. బయట సార్ అని, ఇంట్లో మాత్రం డాడీ అని పిలుస్తా అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే.. వాళ్ల టీంతో పాటు కేటీఆర్ టమాటలు కట్ చేశారు. ముచ్చట్లు చెప్తూనే అందరి కంటే ముందే కోసేశారు. అమెరికాలో ఉన్నప్పుడు తానే అన్ని పనులు చేసుకున్నానని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఏ కూర బాగా వండుతారని అంజిమామ అడిగితే.. తాను అన్ని బాగానే వండుతా కానీ.. అది తినే వాళ్ల మీద ఆధారపడి ఉంటుందంటూ నవ్వులు పూయించారు. కవితతో అనుబంధం.. ఇలా.. తన కుటుంబం గురించి, ఎమ్మెల్సీ కవితతో అనుబంధం గురించి కేటీఆర్ చెప్పారు. అటు వంట చేస్తూ.. మధ్య మధ్యలో తన పర్సనల్ విషయాలు పంచుకుంటూనే.. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాల గురించి వివరించే ప్రయత్నం చేశారు కేటీఆర్. మొత్తానికి నాటు కోడి కూరతో బగారా అన్నంతో గంగవ్వ టీంతో కలిసి సరదా సరదాగా ముచ్చట్లు చెప్పుకుటూ కేటీఆర్ జబర్ధస్త్ దావత్ చేసుకున్నారు. అటు దావత్ చేసుకుంటే.. మధ్యలో బీఆర్ఎస్ నుంచి ఎన్నికల ప్రచారం కానిచ్చేశారు. ఈ వీడియోపై నెటిజన్ల స్పందిస్తూ.. వినూత్న ప్రచారం చేయడంలో మంత్రి కేటీఆర్‌ను మించిన వ్యక్తి లేడంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
Gangavva: లంబాడి పల్లి నుంచి దుబాయ్ వెళ్లిన గంగవ్వ (ఫొటోలు)
-
నా దిగులు అంత నా కొడుకు కోసమే..!
-
అబద్దాలు బాగా మాట్లాడుతావు గంగవ్వ నువ్వు..!
-
అఖిల్ అంటే ఇష్టం.. నన్ను మంచిగా చూసుకుంటాడు..!
-
నాగార్జున సార్ ఋణం మర్చిపోలేనిది: గంగవ్వ
-
గంగవ్వ ఇమిటేట్ చేసిన బిత్తిరిసత్తి
-
ప్రేక్షకుల స్పందనతో ఆనందం కలిగింది
‘‘మానవ సంబంధాల నేపథ్యంలో నడిచే చిత్రం ‘ఇంటింటి రామాయణం’. కుటుంబంతో, స్నేహితులతో కలిసి చూడాల్సిన సినిమా ఇది. మా చిత్రానికి ప్రేక్షకుల స్పందన చూసి చాలా ఆనందం కలిగింది’’ అని డైరెక్టర్ సురేష్ నరెడ్ల అన్నారు. రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, వీకే నరేశ్, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రలు ΄ోషించిన చిత్రం ‘ఇంటింటి రామాయణం’. సూర్యదేవర నాగవంశీ, మారుతి టీమ్ సమర్పణలో వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ యిన్నమూరి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో సురేష్ నరెడ్ల మాట్లాడుతూ– ‘‘మా సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. అమెరికాలోనూ మంచి స్పందన వస్తోంది. నాకు స΄ోర్ట్ చేసిన నాగవంశీ, మారుతిగార్లకు, ఆహా వారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఇంటింటి రామాయణం’కి మేం ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది.. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని నటి నవ్య స్వామి అన్నారు. -
రానాకు గంగవ్వ కల్లు దావత్.. ‘పరేషాన్’ చేసిన దగ్గుబాటి హీరో!
అచ్చమైన తెలంగాణ పల్లె మాటలతో ఆరుపదుల వయసులోనూ యూట్యూబ్‌ని షేక్ చేస్తుంది గంగవ్వ. మై విలేజ్ షో అనే యూట్యూబ్ చానల్ ద్వారా అందరికి పరిచమైన గంగవ్వ.. బిగ్‌బాస్ 4 ద్వారా మరింత ఫేమస్ అయింది. ఇస్మార్ట్ శంకర్, లవ్‌స్టోరీతో పాటు పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం పలు సినిమాల ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫుల్ బిజీ అయింది. తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ కోసం విలేజ్‌కి వెళ్లిన రానాకు కల్లు తాగించి మరోసారి వార్తల్లో నిలిచింది గంగవ్వ. (చదవండి: బికినీలో అనసూయ రచ్చ...స్విమ్మింగ్ ఫూల్ పిక్స్ వైరల్) రానా సమర్పణలో ‘మసూద’ ఫేమ్ తిరువీర్ హీరోగా నటించిన చిత్రం ‘పరేషాన్’. రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించారు. వాల్తేర్ ప్రొడక్షన్స్‌పై సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమాని జూన్ 2న విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మై విలేజ్ షో టీమ్‌తో కలిసి సందడి చేశాడు రానా. (చదవండి: వెన్నెల కిషోర్ ఇంట్లో కుప్పలుగా రెండువేల నోట్ల కట్టలు.. ఫోటో వైరల్) పరేషాన్ టీమ్‌తో కలిసి గంగవ్వ ఉండే ఊరికి వెళ్లాడు. పల్లెటూరు వాతావరణం లోకి అడుగుపెట్టిన రానా కి గంగవ్వ తాటి కల్లు తాగిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by My Village Show (@myvillageshow) -
హీరో నాని ని ఒక ఆట ఆడుకున్న గంగవ్వ
-
తొలిసారి విమానం ఎక్కిన గంగవ్వ హడావుడి చూశారా? ట్రెండింగ్‌లో వీడియో
యూట్యూబ్ స్టార్, బిగ్‌బాస్ ఫేం గంగవ్వ గురించి ప్రత్యేకంగా పరియం అక్కర్లేదు. మై విలేజ్ షో అనే యూట్యూబ్ చానల్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న ఆమె బిగ్‌బాస్ ద్వారా మరింత పాపులర్ అయ్యారు. బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్లో పాల్గొన్న ఆమె మోస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ ద హౌస్‌గా కొనియాడారు. తనదైన మాటలు, తెలంగాణ యాసతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బిగ్‌బాస్ అనంతరం యూట్యూబ్ వీడియోలతో అలరిస్తున్న గంగవ్వ తొలిసారి విమానం ఎక్కింది. చదవండి: ఆస్కార్ స్టేజ్‌పై నాటు నాటుకు చరణ్, తారక్ డాన్స్? ఎన్టీఆర్ క్లారిటీ బిగ్‌బాస్ హౌజ్‌లోని సౌకర్యాలు, లైట్లు, కెమెరాలు చూసి అవాక్కవైన గంగవ్వ ఫస్ట్‌టైం ఫ్లైట్ ఎక్కితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కనర్లేదు. విమానంలో ఆమె చేసిన హడావుడి అంతా ఇంత కాదు. శివరాత్రి సందర్భంగా మొదటిసారి విమానం ఎక్కిన గంగవ్వ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఫ్లైట్ డోరు, కిటికి తెరవమంటూ గంగవ్వ విమానంలోని సిబ్బందికి చుక్కలు చూపించింది. ఆమె చేసిన సందడి చూసి నెటిజన్లంత సర్ప్రైజ్ అవుతున్నారు. దీంతో ఈ వీడియో గంటల్లోనే వేలల్లో లైక్స్, లక్షల్లో వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికీ వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ వీడియో 6 మిలియన్ల వ్యూస్ ట్రెండింగ్‌లో నిలిచింది. చదవండి: నేను నోరు విప్పితే.. మీరు ఎవరెవరి కాళ్లు పట్టుకున్నారో చెప్పనా?: వారికి తమ్మారెడ్డి కౌంటర్ View this post on Instagram A post shared by Milkuri Gangavva (@gangavva) -
బిగ్‌బాస్ రెమ్యునరేషన్, నాగార్జున ఎంతిచ్చాడో కూడా చెప్పేసిన గంగవ్వ
బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్లో మోస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ ద హౌస్‌గా గంగవ్వను కొనియాడుతూ ఉంటారు. తను ఇంట్లో ఉన్నన్నిరోజులు హౌస్ కళకళలాడిపోయింది. తన మాటలతో, పంచులతో అందరినీ నవ్వించింది అవ్వ. కానీ పచ్చటి పల్లె వాతావరణమే ఊపిరిగా బతికే ఆమె ఏసీ గదుల్లో ఉండలేకపోయింది. అనారోగ్యంతో నీరసించిపోయింది. తనను పంపించేయమని వేడుకుంది. ఆమె గోస చూడలేక బిగ్‌బాస్ తనను హౌస్ నుంచి పంపించేశాడు. తిరిగి ఇంటికి వచ్చాక గంగవ్వ మళ్లీ యూట్యూబ్ వీడియోలతో రెచ్చిపోయింది. అందరికీ నవ్వుల పొట్లాలు పంచుతోంది. అయితే బిగ్‌బాస్ నుంచి వచ్చేటప్పుడు తనకు ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు నాగార్జున. ఆ హామీని నెరవేర్చాడు కూడా! తాజాగా తన ఇంటికి సంబంధించిన విషయాలను పంచుకుంది గంగవ్వ. 'బిగ్‌బాస్ హౌస్‌లో 5 వారాలున్నందుకు రూ.10 లక్షలు ఇచ్చారు. నాగార్జున సార్ రూ.7 లక్షలు ఇచ్చారు. ఇల్లు కట్టడానికి మొత్తం రూ.20 లక్షలు ఖర్చైంది. అప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో ఇంకా కొన్ని వారాలుండాల్సింది, కానీ అప్పుడేం అర్థం కాలేదు. అదే ఇప్పుడైతేనా.. ఒక్కొక్కరిని బయటకు పారేశి తాళమేద్దును' అని చెప్పుకొచ్చింది. -
ఆహా ఒరిజినల్ 'ఇంటింటి రామాయణం', అప్పుడే స్ట్రీమింగ్!
షోలు, వెబ్ సిరీస్‌లు, సినిమాలతో తెలుగువారిని ఆకట్టుకుంటోంది ఆహా. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇంటింటి రామాయణం అనే చిత్రం రాబోతోంది. నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్యస్వామి, గంగవ్వ, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రల్లో నటించారు. సురేష్ నారెడ్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డీజే టిల్లు, భీమ్లా నాయక్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా ద్వారా ఓటీటీలోకి ప్రవేశించనున్నారు. ఈ సినిమా టీజర్ నవంబర్ 25న విడుదల చేయనున్నారు. మధ్య తరగతి కుటుంబాల్లో సహజంగా జరిగే సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కరీంనగర్ ప్రాంతంలో నివసించే రాములు (నరేష్) కుటుంబం ఓ సమస్యలో చిక్కుకుంటుంది. దీంతో కుటుంబ సభ్యుల్లోనే ఒకరిపై మరొకరికి అనుమానాలు పుట్టుకొస్తాయి. దీంతో వారిలో దాగి ఉన్న అసలు రూపాలన్నీ బయటకు వస్తాయి. ఈ కుటుంబ కథా చిత్రం డిసెంబర్ 16 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ ఎంట్రీపై సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో ఎంతో మంది మంచి నటులున్నారు. ఎంతో గొప్ప టీం పని చేసింది. ప్రతీ ఒక్కరూ ఈ సినిమా బాగా రావాలని కష్టపడ్డారు. ఆహాలో రాబోతోన్న ఇంటింటి రామాయణం అందరికీ ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా ఉంటుంది. మానవ బంధాలు, సంబంధాలు, జీవిత గుణపాఠాలు ఇలా అన్నింటిని ఈ చిత్రంలో చూపించాం. అంతా మనకు తెలిసిన ప్రపంచంలానే ఉంటుంది. కానీ కొత్తగా ఉంటుంది” అన్నారు. Iga mucchata shuru!😉 Ee gammatthu katha chudaniki ready kaandi thondarlo... Teaser out on November 25th. An @ahavideoIN Original.#IntintiRamayanamOnAHA @DirectorMaruthi @vamsi84 @eyrahul #NavyaSwamy @SitharaEnts @Sureshflms @Venkatupputuri @innamuri8888 @GangavvaMilkuri pic.twitter.com/9zoRyStvwZ — Sithara Entertainments (@SitharaEnts) November 21, 2022 చదవండి: ఆస్పత్రిలో ప్రేమదేశం హీరో అబ్బాస్ నీ నుంచి కంటెంటే రాదు, ఇంకా కోపం కూడానా.. యాంకర్ వెకిలి చేష్టలు -
‘మై విలేజ్ షో’ గంగవ్వ నెల సంపాదన ఎంతో తెలుసా?
గంగవ్వ.. సోషల్ మీడియా యూజర్లకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ‘మై విలేజ్ షో’తనదైన నటనతో పిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన గంగవ్వ అదే క్రేజ్‌తో బిగ్‌బాస్ నాలుగో సీజన్లో అడుగు పెట్టి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. హౌజ్‌లో తనదైన తీరు, మాటలతో ఆకట్టుకున్న ఆమె అనారోగ్య కారణలతో ఐదో వారంలోనే బిగ్‌బాస్ హౌజ్‌ని వీడింది. ఇక బయటకు వచ్చాక గంగవ్వ పలు చిత్రాల్లో నటించే ఆఫర్ అందుకుంది. మల్లేషం, ఇస్మార్ట్ శంకర్, లవ్ స్టోరీ, రాజ రాజ చోర వంటి చిత్రాల్లో సైతం నటించింది. చదవండి: దీపావళికి ఓటీటీలో ‘బింబిసార’ మూవీ, రిలీజ్ డేట్ ఇదే! వెండితెరపై అలరిస్తూనే మరోవైపు తన యూట్యూబ్ చానల్లో వీడియోలు చేస్తూ ఫాలోవర్స్‌ను ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది గంగవ్వ. యూట్యూబ్‌తో ఎంతో పాపులారిటి సంపాదించుకున్న గంగవ్వ సంపాదన ఎంతనేది ఆసక్తిగా మారింది. దీంతో ఆరా తీయగా యూట్యూబ్ ద్వారా భారీగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అన్ని ఖర్చులు పోను నెలకు లక్ష రూపాయల వరకు గంగవ్వకు ఆదాయం వస్తున్నట్టు సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఒక రోజు సినిమా షూటింగ్‌కు గంగవ్వ రూ. 10వేల వరకు పారితోషికంగా తీసుకుంటారని వినికిడి. ఏదేమైన ఈ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటూ ఇలా సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకోవడం విశేషం. చదవండి: వేలానికి శ్రీదేవి చీరలు, ఆ డబ్బుతో ఏం చేయబోతున్నారంటేవ్వా -
సొంతూరికి బస్సు వచ్చేలా చేసిన బిగ్‌బాస్ గంగవ్వ..
Bigg Boss Gangavva Initiative For Bus Service To Lambadipally: యూట్యూబ్ స్టార్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ గంగవ్వ పల్లెటూరి యాస, మంచి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంది. 'మై విలేజ్ షో'లో తనదైన నటనతో పిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన గంగవ్వ బిగ్‌బాస్ నాలుగో సీజన్లో అడుగు పెట్టి మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అనారోగ్య కారణలతో ఐదో వారంలోనే బిగ్‌బాస్ హౌజ్ నుంచి నిష్కమించిన గంగవ్వ.. మల్లేషం, ఇస్మార్ట్ శంకర్, లవ్ స్టోరీ, రాజ రాజ చోర చిత్రాల్లో నటించి అలరించింది. ఇటీవల తన సొంతింటి కలను నిజం చేసుకున్న గంగవ్వ తాజాగా తన సొంతూరికి తిరిగి బస్సు సర్వీసును తీసుకొచ్చింది. గంగవ్వది తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామం. ఈ గ్రామానికి మొదట్లో బస్సు సర్వీసు ఉండేది. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా లంబాడిపల్లికి ఆర్టీసీ బస్సు రావట్లేదు. దీంతో గ్రామస్థులు, వ్యవసాయ దారులు, కూలీలు, విద్యార్థులు జగిత్యాల జిల్లా కేంద్రానికి వెళ్లి రావడానికి ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్ వాహనాల్లో జగిత్యాలకు వెళ్లి రావాలంటే వాహన చార్జీలతో తలకుమించిన భారమైంది. తమ సమస్యలకు పరిష్కారంగా బస్సు సర్వీసును తిరిగి ప్రారంభించాలనుకున్నారు లంబాడిపల్లి గ్రామ ప్రజా ప్రతినిధులు. ఇందుకోసం బిగ్‌బాస్ ఫేమ్, యూట్యూబ్ స్టార్ గంగవ్వ సహాయం కోరారు. చదవండి: తన కొత్తింటిని చూపిస్తూ మురిసిపోయిన గంగవ్వ లంబాడిపల్లికి తిరిగి బస్సు తీసుకురావాలన్న లక్ష్యంతో గ్రామస్థులతో కలిసి జగిత్యాల ఆర్టీసీ డిపో అధికారులను కలిసింది గంగవ్వ బృందం. గంగవ్వ వినతితో లంబాడిపల్లికి బస్సు సర్వీసును తిరిగి పునరుద్ధరించారు అధికారులు. ప్రస్తుతం ఈ గ్రామానికి జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి ఐదు ట్రిప్పలుగా ఆర్టీసీ సేవలు అందిస్తోంది. లంబాడిపల్లికి తిరిగి బస్సు రావడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులను కలిసిన గంగవ్వ బృందంలో 'మై విలేజ్ షో' టీం నటులు అనిల్, అంజి మామ తదితరులు ఉన్నారు. చదవండి: ‘గాడ్ ఫాదర్’లో తన రోల్ చెప్పెసిన గంగవ్వ, ఏకంగా చిరుకు.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1571342813.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అవును... మన గంగవ్వే!
మిలుకూరి గంగవ్వ, అరవై ఏళ్ల గంగవ్వ, వ్యవసాయ కూలీ గంగవ్వ... ఉన్నట్లుండి యూ ట్యూబ్ స్టార్ అయిపోయిన గంగవ్వ... ఎప్పుడో స్టార్‌గా ఎదిగిపోయింది. ఇప్పుడు తాజాగా దేశం గుర్తించిన యూ ట్యూబ్ స్టార్ అయింది. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ మీడియా మనదేశంలో ప్రభావవంతమైన, సాధికార మహిళలను గుర్తించిన క్రమంలో గంగవ్వను గుర్తు చేసుకుంది. చదవండి: ఇంటర్య్వూలో పూజ నోట అభ్యంతరకర పదం, పట్టేసిన నెటిజన్లు మనకు తెలిసిన మన గంగవ్వ ఇప్పుడు దేశవ్యాప్త మహిళాప్రభంజనం జాబితాలో చేరింది. నిజమే... గంగవ్వ నిజంగా ఒక ప్రభంజనం అనే చెప్పాలి. యూట్యూబ్‌లో ప్రసారమైన ‘మై విలేజ్ షో’ను గంగవ్వ కోసమే చూసిన వాళ్లున్నారు. ఆ షో చూస్తూ గంగవ్వకు అభిమానులైన వాళ్లున్నారు. ఆమెకు ఎంత ఫాలోయింగ్ అంటే... కాజల్ అగర్వాల్ వంటి సినీతారల కంటే గంగవ్వకే ఎక్కువ లైక్‌లు వచ్చేటంత. చదవండి: ప్రభాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన శ్యామల దేవి అందరి ఇంటి ‘అవ్వ’ గంగవ్వది తెలంగాణ రాష్ట్రం, లంబాడి పల్లి గ్రామం. పొలం పనులకు వెళ్లడం కోసం స్కూలు చదువు మధ్యలోనే ఆపేసింది. వ్యవసాయ పనులతోనే జీవితాన్ని కొనసాగించింది. ఆమెలో సహజనటి ఉందనే విషయం రెండో వ్యక్తికి కాదు తనకు కూడా తెలియకనే అరవై ఏళ్లు జీవించేసింది. ఆమె అల్లుడు తన హాస్య కథనంలో అతిథిగా కనిపించమని ఆమెను అడగడం కేవలం యాదృచ్ఛికమే. ఆ తర్వాత గంగవ్వ కెరీర్ గ్రాఫ్ అలా అలా పెరిగిపోయింది. ఇస్మార్ట్ శంకర్, మల్లేశం, లవ్‌స్టోరీ చిత్రాల్లో నటించింది. మొత్తానికి అలా మన కళ్ల ముందు ఎదిగిన మన గంగవ్వ కీర్తిపతాకం జాతీయస్థాయికి చేరింది. ‘అవ్వా! నువ్వు గ్రేట్. ఇవన్నీ ఎలా సాధించావు, నీకు భయంగా అనిపించలేదా’ అని అడిగితే ‘నీ శక్తి మీద నీకు నమ్మకం ఉంటే, నువ్వు ఏదైనా సాధించగలవు’ అంటోంది గంగవ్వ. -
కొత్తింటిని చూపిస్తూ మురిసిపోయిన గంగవ్వ, ఇంటి విశేషాలేంటో ఆమె మాటల్లో..
Bigg Boss Telugu 4 Fame Gangavva Shares Home Tour Moments: బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, యూట్యూబ్ స్టార్ గంగవ్వ ఇటీవల కొత్త ఇంటిలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ‘మై విలేజ్ షో’ అనే యూట్యూబ్ చానల్‌తో ఫేమస్ అయిన గంగవ్వ తన మాటలతో ఎంతో ప్రేక్షకుల ఆదరణను పొందింది. అనంతరం బిగ్ బాస్ 4వ సీజన్లో అడుగు పెట్టి.. యావత్ తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను అలరించింది. చదవండి: మాల్దీవులో వాలిపోయిన పూజా, స్టన్నింగ్ వీడియోలు షేర్ చేసిన ‘బుట్టబొమ్మ’ ఈ నేపథ్యంలో హోస్ట్ నాగార్జునతో తన చిరకాల స్వప్నం గురించి పంచుకున్న ఆమె నాగార్జున, స్టార్ మా సాయంతో సొంత ఇంటి కలను నిజం చేసుకుంది. ఇటవల గృహప్రవేశం కూడా చేసిన గంగవ్వ ఈ క్రమంలో తన కొత్త ఇంటి గురించి, అందులోని గదుల ప్రత్యేకత గురించి వివరిస్తూ యూట్యూబ్ చానల్లో విడియో విడుదల చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. చదవండి: 13 ఏళ్లుగా నరకం, ఎట్టకేలకు బ్రిట్నీ స్పియర్స్‌కు తండ్రి నుంచి విముక్తి ఈ సందర్భంగా గంగవ్వ తనకు ఇళ్లు కట్టిస్తానాని మాట ఇచ్చిన హీరో నాగార్జున్, బిగ్‌బాస్ టీం, స్టార్ మాకు ధన్యావాదాలు తెలిపింది. అలాగే గృహ ప్రవేశానికి కలగూర గంప టీంతో పాటు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అఖిల్ తన తల్లితో వచ్చాడని, అలాగే సావిత్రి కూడా వచ్చినట్లు చెప్పింది. అనంతంర కొత్త బిజీ కారణంగా రాలేకపోయారు, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన గంగవ్వ కొత్త ఇంటిని చూపిస్తూ మురిపోయింది. మరి తన ఇళ్లు ఎలా ఉంది, గంగవ్వ పంచుకున్న విశేషాలను మనం కూడా చూద్దాం రండి! చదవండి: కొత్త ఇంట్లోకి బిగ్‌బాస్ ఫేమ్ గంగవ్వ గృహప్రవేశం -
కొత్త ఇంట్లోకి బిగ్‌బాస్ ఫేమ్ గంగవ్వ గృహప్రవేశం
Bigg Boss Contestant Gangavva House Warming: యూట్యూబ్ స్టార్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ గంగవ్వ తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకుంది. సొంతిల్లు కట్టుకోవాలన్న ఆమె కోరిక నెరవేరింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లిలో నూతనంగా నిర్మించుకున్న ఇంట్లోకి గంగవ్వ గృహప్రవేశం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ‘మై విలేజ్ షో’తో య్యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన గంగవ్వ బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్లో పాల్గొని మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పల్లెటూరి యాస, కామెడీ టైమింగుతో పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న గంగవ్వ సొంతిల్లు కట్టుకోవాలన్న ఆశయంతో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టింది. అయితే అనారోగ్య కారణాల వల్ల అయిదో వారంలోనే హౌస్ నుంచి నిష్క్రమించింది. అయినప్పటికీ ఆమె కల కలగానే మిగిలిపోకూడదన్న భావనతో హీరో నాగార్జున గంగవ్వకు ఇల్లు కట్టిస్తానని ఆ బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. చెప్పినట్లుగానే ఆమెకు రూ.7లక్షల రూపాయలు సహాయం చేశాడు. బిగ్‌బాస్ షో ద్వారా రూ.11లక్షలు సమకూరడంతోపాటు మరో రూ.3లక్షల వరకు అప్పుచేసిన గంగవ్వ చివరకు తన సొంత గ్రామం లంబాడిపల్లిలో సొంతిల్లు కట్టించుకుంది. ఎట్టకేలకు తన కల నెరవేరినందుకు గంగవ్వ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ కార్యక్రమానికి బిగ్‌బాస్ ఫేమ్ అఖిల్, శివజ్యోతి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మై విలేజ్ షో టీం సభ్యులు సహా పలువురు హాజరయ్యారు. గంగవ్వ గృహప్రవేశానికి సంబంధించిన వీడియోను మై విలేజ్ షో టీం యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన కాసేపటికే ట్రెండింగ్‌లో నిలిచింది. గంగవ్వ కల నెరవేరినందుకు పలువురు నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
‘గాడ్ ఫాదర్’లో తన రోల్ చెప్పెసిన గంగవ్వ, ఏకంగా చిరుకు..
‘మై విలెజ్ షో’ అనే యూట్యూబ్ ఛానల్‌తో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న గంగవ్వ ఆ తర్వాత బిగ్‌బాస్‌లో పాల్గొనే చాన్స్ కొట్టెసింది. బిగ్‌బాస్‌తో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఆమె ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా అయిపోయింది. ఇటీవల సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరీ’ చిత్రంలో కనిపించిన గంగవ్వ.. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా నటించే అవకాశం కొట్టేసిన సంగతి తెలిసిందే. ‘లవ్‌స్టోరీ’ మాదిరిగా ఓ చిన్న పాత్ర చేస్తుందని అందరూ భావించారు. ఈ క్రమంలో ఆమె రోల్‌కు సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే సినిమాలివే ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో చిరంజీవికి గంగవ్వ తల్లిగా నటిస్తుందట. ఈ విషయాన్ని స్వయంగా గంగవ్వ వెల్లడించింది. లవ్‌స్టోరీ మ్యాజికల్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్లో భాగంగా మూవీ టీం ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. దీనికి డైరెక్టర్ శేఖర్ కమ్ముల, హీరో నాగచైతన్యలతో పాటు గంగవ్వ కూడా పాల్గొంది. ఈ క్రమంలో తాను చిరంజీవి మూవీ షూటింగ్ కోసం ఊటీ వెళ్లానని, ఇందులో చిరుకు అమ్మగా నటిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. దీంతో అతి తక్కువ కాలంతో గంగవ్వ ఏకంగా మెగాస్టార్‌కు తల్లిగా నటించడం విశేషమని, గంగవ్వ చాలా లక్కీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: Akkineni Nagarjuna: ‘నేను చూసిన నాగార్జుననే పేరు మార్చి శీనుగా చూపించా’ కాగా ఈ సినిమాలో చిరుకు సోదరిగా కీర్తి సురేశ్ నటిస్తన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరు ఆచార్య, గాడఫాదర్ షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య మేవీ దాదాపు పూర్తయినప్పటికి పలు సన్నివేశాలు, పాటలు మిగిలి ఉండటంతో వాటి చిత్రకరణ జరుగుతోంది. దీనితో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా జరుపుకుంటోంది. దీంతో ఇటీవల లూసిఫర్ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్‌ను కూడా మొదలు పెట్టాడు చిరు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. -
Karimnagar: సిల్వర్ స్క్రీన్‌పై కరీంనగర్ వెలుగులు
ఒక్కచాన్స్.. ఒకేఒక్క చాన్స్ అంటూ వీళ్లు క్రిష్ణానగర్ చుట్టూ కాళ్లరిగేలా తిరగలేదు.. సినిమాల్లో అవకాశం కోసం ఏళ్లకేళ్లు ఎదురుచూడలేదు. చేస్తున్న పనిని, అన్నం పెడుతున్న ఊరును వదిలిపెట్టలేదు. ఉన్నచోటు నుంచే తమ ప్రతిభను ప్రదర్శించారు. అవకాశాన్ని.. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకున్నారు. యూట్యూబ్‌లో సొంతంగా ఒక వేదికను ఏర్పాటుచేసుకుని తామేంటో నిరూపించుకున్నారు. షార్ట్‌ఫిల్మ్‌లు, ప్రయివేటు ఆల్బంల ద్వారా తమ టాలెంటును మొదట ప్రజలు గుర్తించేలా కష్టపడ్డారు. ఆ కష్టమే ఇప్పుడు వారిని స్టార్లను చేసింది. అనతికాలంలోనే సినిమాల్లో, పెద్దపెద్ద రియాలిటీషోల్లో అవకాశం వచ్చేలా చేసింది. ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్‌పై ఉమ్మడి కరీంనగర్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. మై విలేజ్ షో ద్వారా ఫేమ్ అయిన బిగ్‌బాస్ గంగవ్వ, అనిల్ జీల సినిమాల్లో బిజీగా మారారు. మరికొందరు యాక్టర్లు, సింగర్లు, డైరెక్టర్లు పలు సినిమాల్లో ప్రతిభ చూపి స్టార్.. స్టార్.. సూపర్‌స్టార్ అనిపించుకుంటున్నారు. యూట్యూబ్ ద్వారా రంగుల ప్రపంచంలో ప్రస్థానం ప్రారంభించి వెండితెరపై వెలుగుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సినీ కళాకారులపై ‘సాక్షి’ వీకెండ్ స్పెషల్..!!] పేరు: గంగవ్వ యూట్యూబ్ చానల్ మై విలేజ్ షో షార్ట్‌ఫిల్మ్: 120కి పైగా సినిమాలు: 4 ‘ఇస్మార్ట్’ గంగవ్వ మల్యాల(చొప్పదండి): జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన మై విలేజ్‌షో గంగవ్వ అంటే ఇప్పుడు ప్రపంచమంతా పరిచయమే. బడిముఖం చూడని గంగవ్వ కష్టాల కడలిని ఈదింది. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం.. కల్మషం లేని ఆమె మనసు.. ఆరు పదుల వయసులో ప్రపంచానికి స్టార్‌గా పరిచయం చేశాయి. ఇదే గ్రామానికి చెందిన శ్రీరాం శ్రీకాంత్ ప్రారంభించిన మై విలేజ్ షో యూట్యూబ్ చానల్ గంగవ్వ జీవితాన్ని మార్చివేసింది. 120కిపైగా వీడియోల్లో, నాలుగు పెద్ద సినిమాల్లో నటించింది. ఓ రియాలిటీ షోతో మరింత ఫేమస్ అ యిన గంగవ్వ.. ఇల్లు కట్టుకోవాలనే తనకలను నెరవేర్చుకుంది. జీవితమంతా.. ముళ్లబాటే గంగవ్వ జీవితమంతా ముళ్లబాటలోనే సాగింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. బీడీలు చేస్తూ తమ్ముళ్లకు ఆసరాగా నిలిచింది.ఐదేళ్లలో బాల్య వివాహం జరిగింది. అత్తాగారిల్లే జీవితమైంది.భర్త గంగయ్య పదిహేనేళ్లపాటు గల్ఫ్ వెళ్లాడు. ఐదేళ్లపాటు దుబాయ్ నుంచి కబురు లేకపోవడంతో ఉన్నాడో లేడో కూడా తెలియని వేదనతో గడిపింది. మరో పదేళ్లు గల్ఫ్ వెళ్లినా నయాపైసా పంపలేదు. ఇక్కడి నుంచే అప్పుచేసి, పైసలు పంపిస్తే ఇంటికి తిరిగివచ్చాడు. కలోగంజో తాగి, పొద్దంతా వ్యవసాయ పనులకు వెళ్లి, రాత్రి బీడీలు చేస్తూ పిల్లలను పెద్ద చేసింది. ఆరుపదుల వయసులో.. గంగవ్వకు మై విలేజ్ షో మరో జన్మనిచ్చింది. అవ్వలోని సహజ నటిని మై విలేజ్ షో దర్శకుడు శ్రీరాం శ్రీకాంత్ ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇంటర్నెట్ కష్టాలు అనే షార్ట్‌ఫిల్మ్‌తో యూ ట్యూబ్‌లో అడుగుపెట్టి.. సుమారు 120కిపైగా లఘుచిత్రాల్లో నటించింది. సినీ నటులుసైతం గంగవ్వతో సెల్ఫీకోసం ఎదురుచూసేలా ఎదిగింది. గంగవ్వ సహజ నటనను చూసిన సినిమా డైరెక్టర్లు అవకాశం ఇవ్వడంతో మల్లేశం, ఇస్మార్ట్ శంకర్, రాజరాజచోర, లవ్‌స్టోరీలో తనేంటో నిరూపించుకుంది. రెండు టీవీ రియాలిటీషోల్లో అదరగొట్టింది. గంగవ్వ మాట తీరు..ఆప్యాయత..కల్మ షం లేని తన వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది. ఏ అవసరం ఉన్నా ఇప్పటికీ ప్యాసింజర్ ఆటోల్లో వెళ్తుండడం ఆమె నిరాడంబరతకు నిదర్శనం. ‘చిన్నప్పటి నుంచి కష్టాలు, కన్నీళ్లతోనే గడిపిన. పొద్దంతా వ్యవసాయ పనికి వెళ్లివచ్చి, బీడీలు చేసేదాన్ని. సదువు అసలే రాదు. ఎక్కడెక్కడి నుండో నా దగ్గరికి అచ్చి.. సెల్ఫీలు దిగుతున్నరు. ఇంటికాడ ఉంటే శ్రీకాంత్ అచ్చి, నేను చెప్పినట్టు చేత్తవా గంగవ్వ అని, షూటింగ్ మొదలు పెట్టిండు. ఇంట్ల టీవీ కూడా లేదు. సినిమాలో నటిస్తా అని అనుకోలేదు. ఇప్పటికి నాలుగు సినిమాలు విడుదల ఐనయ్. ఇంకా వేరే సినిమాలో నటిస్తున్న.. ఇప్పుడు కూడా ఊటీలో షూటింగ్లో ఉన్న.. నాకు తెలిసింది ఒక్కటే. నా పని నేను సేత్త’ అని గంగవ్వ చెప్పుకొచ్చింది. పేరు: రాదండి సదయ్య యూట్యూబ్ చానల్ సదన్న కామెడీ షార్ట్‌ఫిల్మ్‌లు: 200కి పైగా సినిమాలు: 10 ఆర్ఎస్ నందా.. కామెడీకి ఫిదా విద్యానగర్(కరీంనగర్): ఆర్ఎస్ నంద.. యూట్యూబ్ ప్రపంచానికి పరిచయం కాకముందే ఇతని కామెడీ షార్ట్‌ఫిల్మ్‌లను సిడీల రూపంలో అభిమానులు వీక్షించేవారు. రెండు వందలకు పైగా షార్ట్‌ఫిల్మ్‌లు తీసిన ఆర్ఎస్ నందకు దాదాపు ఐదు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నటన అంటే ప్రాణం ఓదెల మండలం కనగర్తికి చెందిన రాదండి సదయ్యకు చిన్నతనం నుంచే నటన అంటే ప్రాణం. పదేళ్ల వయసులోనే బుర్రకథలు చెప్పేందుకు ఆసక్తి చూపేవాడు. 2007నుంచే లఘుచిత్రాలు తీయడం ప్రారంభిచాడు. యూట్యూబ్ హవా ప్రారంభం కావడంతో 2013లో కోడెం సంతోశ్‌తో కలిసి ‘సదన్న కామెడీ’ చానెల్ ద్వారా ‘గుట్టల్లో గుసగుస’తో యూట్యూబ్‌లో తొలి అడుగువేశాడు. ఇప్పటివరకు దాదా పు 200కు పైగా విలేజ్ కామెడీ షార్ట్ఫిలిమ్స్ చేశాడు. కామెడీ స్టార్‌గా దేశవిదేశాల్లో గుర్తింపు సాధించాడు. సినిమా అవకాశాలు కూడా రావడంతో బతుకమ్మ, నానీ బుజ్జి బంగారం, తుపాకీ రాముడు, సంత, చిన్ని గుండెల్లో ఎన్ని ఆశలో, నేనేసరోజన, గున్నమామిడి కొమ్మ మీద తదితర 10కి పైగా సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం మరిన్ని సినిమాల్లోనూ బిజీగా ఉన్నట్లు తెలిపాడు. పేరు: అనిల్ జీల యూట్యూబ్ చానల్: మై విలేజ్ షో షార్ట్‌ఫిల్మ్‌లు: 200 కి పైగా సినిమాలు: 5 క్రేజీహీరో.. అనిల్ మల్యాల(చొప్పదండి): ఎన్ఎస్ఎస్ వలంటీర్‌గా సేవచేసేందుకు లంబాడిపల్లి వెళ్లి.. యూట్యూబర్‌గా తనలోని ప్రతిభకు పదును పెట్టుకుని.. ప్రపంచస్థాయిలో గుర్తింపు సాధించి, యువతకు క్రేజీ హీరోగా మారాడు అనిల్ జీల. ఉపాధ్యాయుడిగా విద్యాబుద్ధులు బోధిసూ్తనే తన ఆలోచనలను వీడియో రూపంలో ప్రదర్శిస్తూ.. సహచరుడు, మై విలేజ్ షో వ్యవస్థాపకుడు శ్రీరాం శ్రీకాంత్‌తో జట్టుకట్టాడు. మై విలేజ్ షోలో నటిస్తూ.. తనలో దాగిఉన్న ప్రతిభను చాటుకున్నాడు. స్వయంగా వ్లాగ్ నిర్వహిస్తూ ఏకంగా 7లక్షల ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలో నటిస్తూనే.. యూత్ ఐకాన్‌గా నిలిచాడు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లి గ్రామానికి చెందిన నిర్మల–మల్లేశం కొడుకు అనిల్ జీల. టీటీసీ చేసేటప్పుడు ఎన్ఎస్ఎస్ క్యాంపులో భాగంగా లంబాడిపల్లికి వచ్చాడు. అప్పుడే శ్రీరాం శ్రీకాంత్‌తో పరిచయం ఏర్పడింది. జమ్మికుంటలో రెండేళ్లపాటు ఉపాధ్యాయుడిగా పనిచేసి, ఐదేళ్లక్రితం వేసవిసెలవుల్లో లంబాడిపల్లికి వచ్చిన అనిల్ జీల శ్రీకాంత్ దర్శకత్వంతో పాటు ఇతర లఘుచిత్రాలు సుమారు 200లకుపైగా నటించారు. కికీ చాలెంజ్ తన జీవితాన్ని మలుపు తిప్పగా, రైతు పడుతున్న కష్టాల వీడియోతో అనిల్‌కు ఫాలోయింగ్ పెరిగింది. ఏడు లక్షల ఫాలోవర్స్.. మై విలేజ్ షో వీడియోలతోపాటు తన వ్యక్తిగత జీవిత విశేషాలను అప్లోడ్ చేసేందుకు అనిల్ జీల వ్లాగ్ ప్రారంభించాడు. షూటింగ్లో.. ఇంట్లో.. ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఆ విశేషాలు తెలిసేలా వ్లాగ్‌లో పెడుతుండడంతో ప్రస్తుతం అనిల్‌కు 7లక్షల మంది ఫాలోవర్లు పెరిగారు. యూట్యూబ్ వీడియోల్లో నటిసూ్తనే సినిమాల్లో చాన్స్ కొట్టేశాడు అనిల్. ఇతడి సహజమైన నటనతో నేటియువతకు హీరోగా మారాడు. అనిల్ నటనకు సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్‌తోపాటు, ఎస్ఆర్ కల్యాణ మంటపం సినిమాలు ఇప్పటికే రిలీజ్ కాగా, దర్శకుడు నవీన్ బేతిగంటి తీస్తున్న ‘రామన్న యూత్’ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. మై విలేజ్ షో తీస్తున్న ఓ వెబ్సిరీస్లోసైతం నటిస్తున్నాడు. పాటల మాంత్రికుడు మల్లిక్ గొల్లపల్లి(ధర్మపురి): పల్లెపదాలు ఆయన పాటలకు ప్రాణాలు. తాను రాసే పాటలోని ప్రతీ అక్షరం గ్రామీణ జీవన సుమధురం. మట్టిమనుషుల మధ్య బాధలు, బంధుత్వాలను జానపదాలుగా మలిచి చిత్రీకరిస్తూ.. జానపద ఆణిముత్యంగా రాణిస్తున్నాడు జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్కు చెందిన ఎస్వీ మల్లిక్‌తేజ. ఎస్వీ మ్యూజిక్ చానల్ ద్వారా 150కి ప్రయివేటు పాటలు రాసి, పాడిన, వీక్షకులకు అందించగా.. ఆరులక్షల మంది పాలోవర్స్ను సొంతం చేసుకున్నాడు మల్లిక్‌తేజ. ఇటీవల వచ్చిన రుణం సినిమాకు సంగీత దర్శకుడిగా కూడా పనిచేశాడు. చిన్నతనం నుంచే.. మల్లిక్‌తేజ డిగ్రీవరకు చదివాడు. చిన్నతనం నుంచి అమ్మమ్మవాళ్ల ఊర్లో పెరిగాడు. తాత మ్యాకల వెంకయ్యతో గొర్రెలు మేపేందుకు వెళ్లి జానపదాలు నేర్చుకున్నాడు. ఆ పాటలనే స్కూళ్లో పాడేవాడు. ఇంటర్‌లోనే పాటలు రాయడం, పాడడం ప్రారంభించాడు. అప్పుడే జగిత్యాలకు వచ్చిన సుద్దాల అశోక్‌తేజ మల్లిక్పాటకు ముగ్దుడయ్యాడు. మల్లిక్‌ను హైదరాబాద్ పిలిపించుకుని మెలకువలు నేర్పించాడు. తరువాత యూట్యూబ్‌లో ఎస్వీ మ్యూజిక్ చానల్‌ను ప్రారంభించాడు. 2018 జనవరిలో తీసిన ‘నేనొస్తాబావ’ పాటకు 3కోట్లవ్యూస్ను సాధించాడు. ‘మదనాసుందారి’ పాట అత్యంత ప్రేక్షక ఆదరణ సాధించింది. ఎస్వీ మ్యూజిక్ చానల్ద్వారా 150కి పైగా ప్రయివేటు పాటలు చిత్రీకరించాడు. ఆరులక్షల పాలోవర్స్ ఉన్నారు. సినిమాల్లో అవకాశం రావడంతో 2019 ఏప్రిల్‌లో విడుదలైన రుణం సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేశాడు. కన్నడంలో భన్నదకనుసు, రంగిన దునియాకు మ్యూజిక్ డైరెక్టరుగా పరేషాన్ సినిమాలో పాట పాడాడు. పాటే రమేశ్ ప్రాణం గొల్లపల్లి(ధర్మపురి): యక్షగానం నుంచి పుట్టిన జానపద కళాకారుడు గడ్డం రమేశ్. జగిత్యాల జిల్లా చిన్నాపూర్కు చెందిన రమేశ్ తండ్రి అనంతం యక్షగానం చేస్తుండేవాడు. తండ్రిని అనుకరిస్తూ రమేశ్ తాను చదువుతున్న పాఠశాల వేదికపై యక్షగానం ప్రదర్శిస్తుండేవాడు. తరువాత జానపద పాటలు పాడిన రమేశ్ స్థానికంగా పేరు సంపాదించాడు. 2002లో రమేశ్ ప్రతిభను గుర్తించిన ధర్మపురి సీఐ హోంగార్డుగా ఉద్యోగం కల్పించాడు. పోలీసు కళాబృందంతో కలిసి ప్రదర్శనలు ఇస్తూ.. ప్రజలను చైతనం చేస్తున్నాడు. 2011లో రేలారెరేలా కార్యక్రమంలో పాల్గొని విజేతగా నిలిచాడు. తరువాత పలు ప్రదర్శనలు ఇచ్చాడు. 2018లో యూట్యూబ్‌లో గడ్డం మ్యూజిక్ చానల్ ప్రారంభించాడు. ‘నీలమ్మ నిమ్మసుక్క రాయిడు సోలో’ పాట మంచి గుర్తింపు పొందింది. ‘అత్తకొడుకా.. ముద్దల మారెల్లయ్య’ పాట 37లక్షల వ్యూస్ దాటింది. రమేశ్ ప్రతిభను జగిత్యాల జిల్లాకు చెందిన డైరెక్టర్ రాజ్నరేంద్ర, నిర్మాత గుగ్గిల్ల శివ ప్రసాద్ గుర్తించి సినిమాల్లో అవకాశం ఇచ్చారు. ఇలా సింగర్‌గా సినిమాల్లోనూ రాణిస్తున్నాడు. అంచెలంచెలుగా.. ఇల్లందకుంట(హుజురాబాద్): ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే ఆ కుర్రాడికి సిని మాలంటే పిచ్చి. చూసిన ప్రతీ సినిమాను ‘అక్కడ ఆ సీన్ ఉండాల్సింది కాదు.. అక్కడ ఆ ఫైట్ ఇలా తీయాల్సి ఉండే’ అంటూ స్నేహితులతో పంచుకునేవాడు. అలా సినిమాలపై అతడికి ఉన్న ఆసక్తి డైరెక్టర్‌గా కావాలని సంకల్పిచింది. మొదట్లో అవకాశం రాకపోవడంతో యూట్యూబ్ ద్వారా లఘుచిత్రాలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు జమ్మికుంటకు చెందిన సూర్యతేజ. తన ప్రతిభను గుర్తించిన చాలా మంది నిర్మాతలు డైరెక్టరుగా అవకాశం కల్పించారు. గుంటూరుకు చెందిన రాములు– శ్రీదేవి కుటుంబం 20ఏళ్ల క్రితమే కరీంనగర్‌కు వచ్చింది. రాములు ప్రైవేట్ విద్యాసంస్థల్లో వంటమనిషిగా చేసేవాడు. వీరికొడుకు సూర్యతేజకు చిన్నతనం నుంచి సినిమాలంటే పిచ్చి. స్నేహితులు తమాషాగా సినిమా పిచ్చోడు అంటూ ఎగతాళి చేసిన సందర్భాలున్నాయి. అవకాశం కోసం తిరిగితే ఎవరూ ఆదరించలేదు. సినిమారంగంపై ఉన్న మక్కువతో సొంతంగా కెమెరా కొనుక్కుని లఘుచిత్రాలు తీయడం ప్రారంభించాడు. పోలీసు డిపార్టుమెంటు చేస్తున్న సేవలపై 500కు పైగా లఘుచిత్రాలు తీశాడు. 2013లో తీసిన దేశం కోసం లఘుచిత్రం పేరుతెచ్చి పెట్టింది. తరువాత దర్శకుడు సుకుమార్ దగ్గర పనిచేశాడు. ఆనంద్‌సాయి, ఈశ్వర్, పైడిరమేతో పాటు పెద్దదర్శకుల వద్ద సలహాలు తీసుకుని సొంతంగా సినిమాలు చేస్తున్నాడు. 2019లో షైన్పిక్చర్స్ బ్యానర్‌పై తీసిన ‘తలచినదే జరిగిందా’ సినిమా సూర్యకు గుర్తింపునిచ్చింది. వెండితెరపై మరెందరో.. విద్యానగర్(కరీంనగర్): కళలు, కళాకారులకు వేదికైన కరీంనగర్ నుంచి చాలామంది వెండితెరపై సైతం వెలుగుతున్నారు. కరీంనగర్‌లోని మార్కెండేయకాలనీకి చెందిన జి.రాధిక ఇంటర్‌నుంచే నటనలో పేరు సాధించింది. భర్త ప్రోత్సాహంతో లఘుచిత్రాల్లో నటించడం ప్రారంభించింది. తక్కువ సమయంలో పేరు సంపాదించి, సహజనటిగా వెలుగొందుతోంది. ఇప్పటి వరకు 700కు పైగా షార్ట్‌ఫిల్మ్‌లతో పాటు దొరసాని, విరాటపర్వం, భిక్ష, గల్లీగ్యాంగ్, స్కైలాబ్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం సితార బ్యానర్‌పై నిర్మిస్తున్న సినిమాలో కీరోల్ చేస్తోంది. గోదావరిఖనికి చెందిన ఏదుల స్వప్న 250 లఘుచిత్రాల్లో నటించింది. గల్లీగ్యాంగ్, పరేషాన్, నువ్వునేను ఒక్కటైతే, బతుకంతాబ్రహ్మచారి, బిచ్చగాడా మజాకా సినిమాల్లో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బైరాన్‌పల్లి సినిమాలో నటిస్తోంది. వేములవాడకు చెందిన గోలి శివరామ్‌రెడ్డి నాటకాల్లో నటిస్తారు. 15 షార్ట్‌ఫిల్మ్‌లు చేశారు. పరేషాన్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఇటీవల నటించిన తుపాకులగూడెం సినిమా విడుదలకు సిద్ధమైంది. -
రాజ రాజ చోర: మందు గ్లాసు పట్టుకున్న గంగవ్వ, శ్రీవిష్ణు
డిఫరెంట్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. ఆయన తాజాగా నటించిన చిత్రం రాజ రాజ చోర. మేఘా ఆకాశ్, సునయన హీరోయిన్లుగా నటిస్తున్నారు. హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. ఇందులో శ్రీవిష్ణు, బిగ్‌బాస్ ఫేమ్ గంగవ్వ మందు గ్లాసు పట్టుకుని కనిపించారు. తనో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని చెప్పిన హీరో నిజానికి దొంగతనం చేస్తాడన్నట్లుగా చూపించారు. ఇందులో కామెడీకి కూడా ఎటువంటి ఢోకా లేనట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో గంగవ్వతోపాటు తనికెళ్ళ భరణి, రవిబాబు, కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్, వాసు, ఇంటూరి తదితరులు నటించారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. చదవండి: పాపం 'గాలి సంపత్' అప్పుడే ఓటీటీ బాట! -
గంగవ్వ నోటి వెంట శ్రీవిష్ణు ‘చోర గాథ’
శ్రీవిష్ణు హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాజ రాజ చోర’. సునయన, మేఘా ఆకాశ్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను ‘చోర గాథ బై గంగవ్వ’ పేరుతో చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో ‘నీకు ఊ.. కొట్టే కథ తెలుసా? ఏది చెప్పినా ఊ.. కొట్టాలి’ అని అసలు కథ మొదలు పెడుతుంది గంగవ్వ. ‘అనగనగా ఓ సూర్యుడు ఉంటడు. ఆ సూర్యడేమో భూమికి ప్రాణం ఇచ్చాడు. భూమి నుంచి కోతి, బంగారం వచ్చాయి’ అంటూ సాగే ఆద్యంతం ఆసక్తిగా సాగింది. గంగవ్వ చెప్పుకొచ్చిన ఈ కథ రాజు, దొంగ, కిరీటం చూట్టు తిరగనుందనేది అర్థమైంది. చివరకు ఈ మూడింటి మధ్య ఏం జరిగింది, రాజు కిరీటాన్ని ఎత్తుకెళ్లిన ఆ దొంగ దొరుకుతాడా? లేదా? అనే ప్రశ్నతో ముగించిన గంగవ్వ చోర గాథ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. విభిన్న కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం టీజర్ జూన్ 18న విడుదల కానుంది. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో తనికెళ్ల భరణి, రవిబాబు, కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. -
గంగవ్వ, ‘కన్ను గీటు భామ’ మూతి తిప్పుడు వీడియో వైరల్
తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇష్క్’. ఆర్బీ చౌదరి సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యస్.యస్. రాజు అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కి పరిచయడం అవుతున్నాడు. ఏప్రిల్ 23న ఈ చిత్రం ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది చిత్రబృందం. రోటీన్‌గా కాకుండా కాస్త డిఫెరెంట్, ఫన్ వేలో ‘ఇష్క్’ మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఓ సెలబ్రిటీని పిలవడానినికి తేజ పడిన కష్టాలు చూడడంటూ ఓ వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆ విడియో సోషల్ మీడియాలో వైరలై నవ్వులు పూయించింది. తాజాగా హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్, బిగ్‌బాస్ ఫేమ్ గంగవ్వకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తన దగ్గరకు వచ్చిన ప్రియా ప్రకాష్‌కు తనదైన మాటలు, చేష్టలతో చుక్కలు చూపించింది గంగవ్వ. కన్నుకొట్టుడు కాదు మూతులు తిప్పుడంటూ.. ప్రియాకు మూతి తిప్పుడు ట్రైనింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా యువ హృదయాలను కొల్లగొట్టిన ‘ఈ కన్నుగీటు భామ’.. మూతి తిప్పినా ముద్దుగానే ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
కరోనా వ్యాక్సిన్: గంగవ్వకు స్వల్ప అస్వస్థత
సాక్షి, కరీంనగర్: బిగ్‌బాస్ నాలుగో సీజన్లో కంటెస్టెంట్లందరినీ తన మాటల గారడీతో హుషారెత్తించింది గంగవ్వ. వయసులో పెద్దదైనా అందరినీ కలుపుకుంటూ, ఆఖరికి వ్యాఖ్యాత నాగార్జునను కూడా అన్న అని పిలుస్తూ ఆప్యాయతగా కబుర్లు చెప్పేది. కానీ పచ్చటి పైర్ల మధ్య జీవిస్తూ మట్టివాసన పీల్చే ఆమెకు అక్కడి ఏసీ వాతావరణం పడక అనారోగ్యం బారిన పడింది. దీంతో హౌస్ నుంచి అర్ధాంతరంగా బయటకు వచ్చేసింది. ఇక బిగ్‌బాస్ తర్వాత మరెంతమందో అభిమానులను సంపాదించుకున్న ఆమె తాజాగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంది. మల్యాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం వ్యాక్సిన్ తొలి డోసు వేసుకుంది. అయితే వ్యాక్సిన్ తీసుకునే సమయంలో చిన్నపిల్లలా భయడుతూ అవ్వా.. అంటూ కేకలు పెడుతూ ఏడిచినంత పని చేసింది. ఇక వ్యాక్సిన్ తర్వాత ఆమెకు జ్వరం వచ్చిందని, అంతే కాక ఒళ్లు నొప్పులతోనూ సతమతమవుతోందని గంగవ్వ బాధ్యతలు చూసుకునే శ్రీకాంత్ మీడియాకు తెలిపాడు. అయితే వ్యాక్సిన్ తర్వాత ఈ లక్షణాలు సాధారణమే కాబట్టి పెద్దగా భయపడాల్సిన పని లేదని చెప్పాడు. ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటోందన్నాడు. ప్రస్తుతం ఆమె తన పనిని పక్కనపెట్టి విశ్రాంతి తీసుకుంటోందని తెలిపాడు. చదవండి: గాలి మోటార్ ఎక్కి, చక్కర్లు కొట్టిన గంగవ్వ గంగవ్వకు పట్టగొలుసులు ఇచ్చిన అఖిల్ -
'అవ్వ బంగారం' అంటూ అఖిల్ సర్ప్రైజ్ గిఫ్ట్
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో సెంటరాఫ్ అట్రాక్షన్ గంగవ్వ. యూట్యూబ్ వీడియోలతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆమె బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చి సంచలనమే క్రియేట్ చేసింది. అయితే వయసురీత్యా అనారోగ్యం వెంటాడుతుండటంతో షో మధ్యలోనే అర్ధాంతరంగా బయటకు రాక తప్పలేదు. కానీ ఉన్నన్ని రోజులు మాత్రం అందరికంటే హుషారుగా ఉంటూ మిగతా కంటెస్టెంట్లకు గట్టి పోటీనిచ్చింది. ఇక అఖిల్ సార్థక్‌ను ప్రేమగా అఖిలూ... అని పిలుస్తూ సొంత మనవడిలా చూసుకునేది. దత్తత తీసుకుని పెళ్లి కూడా చేస్తానంది. అతడు కూడా అవ్వతో ఆప్యాయంగా మెలిగేవాడు. తాజాగా అఖిల్ ఇంటికి వెళ్లి రచ్చ రచ్చ చేసింది గంగవ్వ. చాలా రోజులకు అఖిల్‌ను కళ్లారా చూడటంతో అవ్వ తెగ సంతోషపడిపోయింది. అఖిల్‌ను తీసుకుపోయేందుకు వచ్చానంటూ అతడి కుటుంబ సభ్యులతో చెప్పుకొచ్చింది. ఇక అఖిల్ వేసుకున్న జీన్స్ మీద కూడా సెటైర్లు వేసింది. ఇది చినిగిపోయింది. ఇలాంటివి నేను మసిగుడ్డలుగా వాడుతానంటూ అతడి పరువు తీసింది. కానీ అంతలోనే అఖిల్ ఒక్కడే కాదు, ఇప్పుడు అందరూ ఇలాంటివే తొడుగుతున్నారని వెనకేసుకొచ్చింది. ఇక సడన్‌గా అఖిల్ వాళ్ల అమ్మానాన్న కనిపించకపోవడంతో అవ్వ వారి కోసం తెగ వెతికింది. అయితే ఇక్కడ అఖిలే వారి పేరెంట్స్‌ను బయటకు పంపించి ఆమె కోసం పట్టీలు తీసుకురమ్మన్నాడు. దీంతో అవ్వ ఇష్టపడే డిజైన్‌లో పట్టీలు కొనుక్కొచ్చారు. వాటిని అవ్వ కాలికి పెట్టి సర్ప్రైజ్ చేశారు. మొత్తానికి ఊరి నుంచి వచ్చిన అవ్వను ఊరికే పంపించకుండా కానుక ఇచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆమె వెళ్లిపోతుండటంతో 'నా అవ్వ బంగారం..' అంటూ అఖిల్ కొద్దిగా ఎమోషనల్ అయ్యాడు. చదవండి: ఇన్స్టాగ్రామ్ రీల్స్..ఇప్పటికే..10 లక్షలకు పైగానే లైక్స్ గాలి మోటార్ ఎక్కి, చక్కర్లు కొట్టిన గంగవ్వ ఎమీ హాకిన్స్.. మరో గంగవ్వ -
గాలి మోటార్ ఎక్కి, చక్కర్లు కొట్టిన గంగవ్వ
సాక్షి, వేములవాడ: ‘మై విలేజ్ షో’తో య్యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన గంగవ్వ బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వడంతో మరింత ఆదరణ సొంతం చేసుకుంది. బిగ్‌బాస్‌లో కుర్రాళ్లకు ఏ మాత్రం తగ్గకుండా ప్రేక్షకులను అలరించింది. తన మార్క్ పల్లెటూరి డైలాగ్ లతో అందరినీ ఆకట్టుకుంది. ఆమెకు ఓట్లు వేసేందుకు సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ కూడా నడిచింది. అయితే బిగ్‌బాస్ హౌజ్ వాతావరణం పడకపోవడంతో ఆమె అనారోగ్యం పాలైంది. దాంతో హౌజ్నుంచి మధ్యలోనే బయటకు రాక తప్పలేదు. ఇక బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున చలువతో సొంతింటి కలను నిజం చేసుకున్న గంగవ్వ తాజాగా.. తన చిరకాల కోరికను తీర్చుకుంది. ఆమె హెలీకాప్టర్‌లో చక్కర్లు కొడుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అంతెత్తు ఆకాశం నుంచి తన ఊరు పొలాలను, ఇళ్లను చూసి ఆమె మురిసిపోయింది. శివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడలో హెలీకాప్టర్ సేవలు మొదలైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో రాజన్న దర్శనానికి వెళ్లిన గంగవ్వ గాలి మోటార్ ఎక్కి పరవశించిపోయింది. -
ఎమీ హాకిన్స్.. మరో గంగవ్వ
టాలెంటును ప్రదర్శించడానికి వయసు అడ్డురాదని చెబుతున్నారు 110 ఏళ్ల ఎమీ హాకిన్స్. ఒకే ఒక్కపాటతో ఈ బామ్మగారు ఓవర్ నైట్ స్టార్‌గా ఎదిగారు. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో బాగా పాపులర్ అయిన ‘‘ఇట్స్ ఏ లాంగ్ వే టు టిప్పరరే’’ అనే పాటను ఎమీ పాడింది. దానిని ఆమె మనవరాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం టిక్‌టాక్‌లో అప్లోడ్ చేయడంతో ఎమీ హాకిన్స్ పేరు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అంతేగాకుండా ఈ వీడియో సాంగ్‌ను లక్షమందికి పైగా చూశారు. వేల్స్నగరానికి చెందిన ఎమీ ఒకప్పుడు డ్యాన్స్ ట్రూప్‌లో నర్తకిగా పనిచేసేవారు. అయితే ఇన్నేళ్లలో రాని గుర్తింపు తాజాగా ఆమె పాడిన ఒక పాటకు వచ్చింది. గత వారంలో ఆమె 110 వ ఏటలోకి అడుగుపెట్టగా, ఆ సెలెబ్రేషన్స్‌లో భాగంగా ఎమీ లాంగ్ వేటు పాట పాడింది. దాన్ని టిక్‌టాక్‌లో షేర్ చేయగా అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతోంది. వరల్డ్‌వార్–1 ముగిసే సమయానికి ఎమీకి ఏడేళ్లు. 1911 కార్డిఫ్‌లో ఎమీ జన్మించినప్పటికీ తన చిన్నతనం మొత్తం న్యూపోర్ట్‌లో గడిపారు. ఎమీకి ఐదుగురు సోదరులతోపాటు ఒక సోదరి కూడా ఉన్నారు. ఆమె తన 14వ ఏట డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకోగా, ఒక నృత్య బృందంతో కలిసి ప్రదర్శనలు ఇచ్చారు. (చదవండి: విషాదాన్ని మిగిల్చిన కొరియన్ దేవకన్య) 1937లో సైన్ రైటర్ జార్జ్ హాకిన్స్‌ను వివాహం చేసుకుని చాలా కాలం పాటు న్యూపోర్ట్‌లో నివసించారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఎమీ హాకిన్స్ ఫైర్ వాచర్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆమె దక్షిణ వేల్స్‌లోని మోన్‌మౌత్‌షైర్‌లోని తన నివాసంలో నాలుగు తరాల వారసులతో కలిసి జీవిస్తున్నారు. బామ్మ పాటను టిక్‌టాక్‌లో షేర్ చేయాలన్న నిర్ణయం ఇంతటి సంతోషాన్ని ఇస్తుందనుకోలేదు. బామ్మకు సోషల్ మీడియా అంటే ఏంటో పెద్దగా తెలీదు. కానీ ఆమె ఒకపాటతో సింగింగ్ సెన్సేషన్‌గా నిలవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఆమెకు దక్కిన సూపర్ బర్త్‌డే గిఫ్ట్‌గా భావిస్తున్నామని మనవరాలు ఫ్రీమన్ చెప్పుకొచ్చింది’’. -
బిగ్‌బాస్: గంగవ్వకు ఇల్లు కట్టిస్తున్న నాగ్
యూట్యూబ్ స్టార్ గంగవ్వకు పెద్ద సమస్యే వచ్చిపడింది. ఆమె బిగ్‌బాస్‌కు రాకముందు చాలా తక్కువ మంది ఆమెను కలిసేందుకు వచ్చేవాళ్లు. ఇప్పుడు మాత్రం నిత్యం వందల్లో అభిమానులు ఆమె ఇంటికి క్యూ కడుతున్నారు. వారందరితో మాట్లాడి గొంతు పోతుందని గంగవ్వ వాపోయింది. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజీ మీద ఆమె మాట్లాడుతూ మరో ఆసక్తికర విషయాన్ని సైతం బయటపెట్టింది. తనకు ఇల్లు కావాలన్న కల నెరవేరుతోందని చెప్పుకొచ్చింది. ఇప్పటికే తన ఊరిలో ఇంటి నిర్మాణం కోసం ముగ్గు కూడా పోసినట్లు వెల్లడించింది. దీంతో త్వరలోనే ఆమె కళ్లముందు కలలు గన్న ఇల్లు రూపుదిద్దుకోనుందన్నమాట. (చదవండి: బిగ్‌బాస్: అదరగొట్టిన ఆ నలుగురు.. కరీంనగర్ బిడ్డలే) కాగా బిగ్‌బాస్ షోలో అడుగు పెట్టిన గంగవ్వ అందరితో కలిసిపోవడమే కాక వాళ్ల మీద పంచ్‌లు కూడా విసిరేది. ఎలాగైనా చివరి వరకు ఉండాలని బలంగా నిర్ణయించుకుని హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెను నామినేట్ చేయాలంటే కూడా ఇతరులకు వెన్నులో నుంచి వణుకు పుట్టేది. ఆమె మాటకు ఎవరూ అడ్డు చెప్పేవాళ్లే కాదు. అరవై ఏళ్ల వయసులో కూడా ఎనర్జీగా స్టెప్పులేసిన ఆవిడ చివరికి అనారోగ్యం బారిన పడింది. దీంతో ఆమె తనను పంపించేయడంటూ పెద్దన్న బిగ్‌బాస్‌ను, చిన్నన్న నాగార్జునను అభ్యర్థించింది. ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న బిగ్‌బాస్ ఆమెను హౌస్ నుంచి పంపించేశారు. ఈ క్రమంలో తనకు ఇల్లు కట్టివ్వండి అని అవ్వ నోరు తెరిచి అడగడంతో నాగార్జున ఆమె కలను సాకారం చేసే బాధ్యతను భుజాన వేసుకున్నారు. అందులో భాగంగానే ఆమె ఊర్లో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే బిగ్‌బాస్ హౌస్‌లో జరిగిన ఫ్యాషన్ షోలో గంగవ్వ లక్ష రూపాయల చెక్కును అందుకోగా ఈ మధ్యే దానితో బంగారం కూడా కొనుగోలు చేసింది. ఇప్పుడిక సొంతింటి కల కూడా నెరవేరుతుండటంతో గంగవ్వ సంతోషం వ్యక్తం చేసింది. (చదవండి: పెద్దగా ఆకట్టుకోని కంటెస్టెంట్లు వీళ్లే..) -
బిగ్‌బాస్: గంగవ్వ, సుజాతల కొట్లాట!
బిగ్‌బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్ల తలరాతను మార్చే గ్రాండ్ ఫినాలేకు సర్వం సిద్ధమవుతోంది. ఈ టెన్షన్ నుంచి ఉపశమనం కల్పిస్తూ, చివరి సారి హౌస్‌లో సరదాగా గడిపేందుకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను లోనికి పంపించారు. వాళ్లను చూడటంతోనే ఫైనలిస్టుల కళ్లు ఆనందంతో మతాబుల్లా వెలిగిపోతున్నాయి. ఇప్పటికే మోనాల్, కల్యాణి, లాస్య, కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి రచ్చ రచ్చ చేశారు. నేడు మిగతా కంటెస్టెంట్లు గంగవ్వ, నోయల్, సుజాత, అవినాష్, మెహబూబ్, దివి ఇంట్లోకి తిరిగి అడుగు పెట్టబోతున్నారు. ఈ క్రమంలో నోయల్ తన ర్యాప్ సాంగ్‌తో ఫైనలిస్టుల్లో జోష్‌ను నింపాడు. ఇక మెహబూబ్‌ను చూడగానే సోహైల్ ఆనందంతో గంతులేశాడు. (చదవండి: నిద్ర పట్టడం లేదు అఖిల్.. నాక్కుడా మోనాల్!) అటు పక్క మెహబూబ్ మాత్రం దివితో కలిసి డ్యాన్స్ చేశాడు. ఈ జోడీని చూసి ఇంటి సభ్యులు కూడా రెట్టించిన హుషారుతో స్టెప్పులేశారు. గంగవ్వ, సుజాతలు మాత్రం కాసేపు కొట్టుకున్నట్లుగా నటించి ఆ వెంటనే మాస్ సాంగ్‌కు ఇరగదీశారు. అవినాష్ తనకు దొరికిన కాసింత సమయంలో కూడా కామెడీని పండించి ఆకట్టుకున్నాడు. అభిని చూస్తూ బయట అమ్మాయిల ఫాలోయింగ్ మామూలుగా లేదు, నెంబర్ అడుగుతున్నారు అని ఊరించి చివర్లో తన నెంబర్ అడుగుతున్నారని పంచ్ వేశాడు. అలాగే ఈ మధ్య మొహమాటం లేకుండా రెచ్చిపోయి మరీ పులిహోర కలుపుతున్న అఖిల్ గురించి మాట్లాడకుండా ఉండలేకపోయాడు. పులిహోర చేయాలంటే ముందుగా కావాల్సింది అఖిల్ అంటూ జోకులు పేలుస్తూ అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. అయితే ఈ ప్రోమోలో సూర్య కిరణ్, అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి జాడ మాత్రం కనిపించలేదు. మరి వారు తర్వాతి ప్రోమోలో అయినా కనిపిస్తారో లేదో చూడాలి! (చదవండి: బిగ్‌బాస్: గంగవ్వకు కండల వీరుడు స్పెషల్ గిఫ్ట్) -
‘బిగ్‌బాస్’లో గంగవ్వ.. అఖిలూ, ఓ అఖిలూ అంటూ..
మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ నాల్గో సీజన్ ముగిసిపోతుంది. అందుకే ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఇది గుర్తుండి పోయేలా ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్. గత రెండు ఎపిసోడ్లలో కంటెస్టెంట్ల ప్రయాణాన్ని వారి కళ్లముందుంచిన బిగ్‌బాస్..నేడు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ని హౌస్‌లోకి తీసుకొచ్చి పాత జ్ఞాపకాలను గుర్తుచేశాడు. అందరితోనూ సరదాగా డాన్సులు చేయించాడు. చిలిపి ప్రశ్నలు అడిగించి ఇంటి కంటెస్టెంట్స్‌తో ఆడుకునేలా చేసాడు. మోనాల్, కరాటే కల్యాణి, లాస్య, కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ ఇలా ఇలా చాలా మంది ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ మళ్లీ ఇంటికి వచ్చారు. ఇక హౌస్‌లో వారు చేసిన రచ్చ ఏంటో చదివేయండి బయట కథ వేరే ఉంటది : మోనాల్ ప్రతి సీజన్ మాదిరే ఈ సారి కూడా హౌస్‌లోకి ఎలిమినేట్ అయిన సభ్యులను తీసుకువచ్చారు. అయితే కరోనా నేపథ్యంలో నిబంధనల్ని పాటిస్తూ.. ఎంట్రీ ఇచ్చిన వారు కంటెస్టెంట్స్‌ని డైరెక్ట్‌గా కలవనీయకుండా వారిని ఒక అద్దాల గదిలో ఉంచారు. అద్దాల గదికి ఒక్క పక్క టాప్ 5 కంటెస్టెంట్స్.. మరో పక్క ఎలిమినేట్ అయిన సభ్యులు ఉన్నారు. మొదటగా లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన మోనాల్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా మ్యూజిక్ వినిపించగానే అఖిల్, సోహెల్ పరుగులు పెట్టి వచ్చారు. వారికి మోనాల్ కనిపించడంతో ఆనందంతో చిందులేశారు. అఖిల్ అయితే అడ్డుగా అద్దాలు ఉన్న సంగతి మర్చిపోయి మోనాల్‌కి హగ్‌లు, కిస్‌లు ఇచ్చాడు. ‘మూడు రోజుల నుంచి నిద్ర పట్టడం లేదు అఖిల్.. ప్రతి రోజు 3-4 అవుతుంది’అని అఖిల్‌తో తన బాధను చెప్పుకోగా..‘ నువ్వు వెళ్లాక నాక్కూడా నిద్ర పట్టలేదు.. అసలు పడుకోలేదు’ అని మోనాల్‌తో చెప్పాడు. అభిజిత్ కూడా మోనాల్‌ని చూసి సూపర్ ఉన్నావ్ అంటూ ప్రశంసలు కురిపించాడు. బయట ఎలా ఉందని సోహైల్ అడగ్గా.. ఏ విషయం చెప్పకుండా అంతా సూపర్ అని సరిపెట్టేసింది. జనాలు నీ కోసం బయటకు ఎప్పుడు వస్తాడో అని వెయిట్ చేస్తున్నారు అంటూ సోహైల్‌కు మోనాల్ చెప్పడంతో ఆనందంతో గంతులు వేశాడు. ఆ తర్వాత అఖిల్ డ్రీమ్స్ అన్ని నెరవేరాలని కోరుతూ గాల్లోకి బెలూన్లను ఎగురవేసింది. బెలూన్లు గాల్లోకి ఎగరగానే అఖిలే నంబర్ వన్ అని మోనాల్ గట్టిగా అరిచింది. ఆ తర్వాత అభిజిత్ ప్యూచర్ బాగుండాలంటూ, అరియానాతో ఫ్రెండ్ షిప్ పెరగాలని, సోహైల్ బిగ్‌బాస్ విజేత కావాలంటూ బెలూన్లను పైకి ఎగురవేసింది. బయటకు వచ్చాక అందరం కలిసి పార్టీ చేసుకుందాం అని సోహైల్ అనగా.. బయట కథ వేరే ఉందని, కలిసేందుకు టైమ్ కూడా దొరక్కట్లేదని మోనాల్ చెప్పుకొచ్చింది. చివరగా అఖిల్‌కి హగ్ ఇచ్చి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. బిగ్‌బాస్‌లోకి ఇద్దరు వంటలక్కలు ఆ తర్వాత హరికథ చెబుతూ.. కల్యాణి ఎంట్రీ ఇచ్చింది. ఇంటి సభ్యులందరిని చూసి కంటతడి పెట్టింది. మీ అందరిని ఎంత మిస్ అయ్యానో.. మీరంతా బయటకు వచ్చగా చక్కటి వంటలు చేసి పెడతా అంటూ ఎమోషనల్ అయింది. మీరు ఇంటి నుంచి వెళ్లాక.. స్వీట్ చేయడమే లేదని అభిజిత్ అనగా.. బయటకు రాగానే అన్ని వంటలు చేసి పెడతా అని కల్యాణి చెప్పింది. కల్యాణి ఇలా మాట్లాడుతుండగానే లాస్య ఎంట్రీ ఇచ్చింది. లాస్యను చూసి ఇంటి సభ్యులంతా ఆనందంతో గట్టిగా అరిచేశారు. జున్ను ఎలా ఉన్నాడు? బయట ఏంటి పరిస్థితి?లాంటి ప్రశ్నలు వేసి ఉక్కిరిబిక్కిరి చేశారు. సోహైల్ అయితే ఇంట్లోకి ఇద్దరు వంటలక్కలు వచ్చారని పంచ్ వేశాడు. ఇక తనపై వంటలక్క 2.o అని మీమ్స్ వేస్తున్నారంటూ లాస్య తన బాధను పంచుకుంది. ఇక అభిజిత్‌ను చూస్తూ.. పాపం అభి.. తనతో టైమ్ స్పెండ్ చేయమని హారికను అడుక్కుంటున్నాడు అని అనగా.. లాస్యక్క నువ్వు కూడా తనకే సపోర్ట్ చేస్తున్నావా అని హారిక అలిగింది. అభి ఏమో.. ఎంత రిక్వెస్ట్ చేసినా తనతో స్పెండ్ చేస్తలేదని లాస్యకు కంప్లైంట్ ఇచ్చాడు. ఇలా లాస్య ఎక్కువ సమయం తన క్లోజ్ ఫ్రెండ్స్ హారిక, అభిజిత్లతోనే గడిపింది. అందరి కంటే అఖిల్‌కే ఎక్కువ హగ్స్! ఇక లాస్య, కల్యాణి కలిసి ఇంటి సభ్యులతో ఫన్నీ గేమ్ ఆడించారు. తాము ఒక్కొక్కరిని కొన్ని ప్రశ్నలు అడుతామని.. వరుసగా ముగ్గురు అవును(ఎస్) అని చెబితే.. ఆ కంటెస్టెంట్ ఐస్ వాటర్ ఒంటిపై పోసుకోవాలని కండీషన్ పెట్టారు. మొదటగా అఖిల్‌పై ప్రశ్నలు అడుగుతూ.. అఖిల్‌కు ఎక్కువ హగ్స్ లభించాయని భావిస్తున్నారా?, అఖిల్ అరియానాను కంటే హారికను ఎక్కువగా ఫ్లర్టింగ్ చేస్త్నున్నాడా?, అఖిల్ అభిజిత్ కంటే మంచి సింగర్ అవునా కాదా? అని అడగ్గా.. ఇంటి సభ్యులంతా ముక్తకంఠంతో అవునని సమాధానం ఇచ్చారు. అఖిల్‌కు 2021లో పెళ్లి అవుతుందని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు మాత్రం అంతా నో అని చెప్పారు. అరియానాకి అవినాష్ కంటే చింటే ఎక్కువ ఇష్టం ఇక అరియానాపై ప్రశ్నలు అడుగుతూ.. అరియానా ఇంట్లో తాను తెలివైనది అని భావిస్తోంది?, అరియానాకి అవినాష్ కంటే చింటు ఎక్కువ ఇష్టం?, అరియానా గొతు జలజ గొంతు కంటే భయంకరంగా ఉంటుంది? లాంటి ప్రశ్నలకు అంతా ఎస్ అని సమాధానం ఇచ్చారు. దీంతో అరియానా మూడుసార్లు ఐస్ నీళ్లు ఒంటిపై పోసుకుంది. ఇక సోహైల్ గురించి అడుతూ.. రాత్రి 9 గంటల తర్వాత సోహైల్ ఏ పని చేయడు. ఆయన మంచి బోల్డ్ డాన్సర్ అవుతాడు. సోహైల్ టూత్‌పేస్ట్‌ను ఫేస్ క్రీమ్‌గా వాడుతాడా లాంటి చిలిపి ప్రశ్నలు అడిగారు. వీటన్నింటికి ఇంటి సభ్యులు అవుననే సమాధానం ఇచ్చారు.ఇక అభిజిత్ గురించి అడుతూ.. అభి వాళ్ల అమ్మ ఆయన కంటే ఫన్నీగా ఉంటారా? అభి ధరించే మోనాలి జాకెట్ ఆయన కంటే ఫేమస్ అని భావిస్తున్నారా? అని అడగ్గా.. అంతా ఎస్ అని సమాధానం ఇచ్చారు. ఈ గేమ్ అనంతరం లాస్య, కళ్యాణి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అఖిల్‌పై పగ తీర్చుకున్న కుమార్ సాయి ఆ తర్వాత కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ జంటగా ఎంట్రీ ఇచ్చారు. ఇంటి సభ్యులతో ఆడిపాడారు. ఇక కుమార్ సాయి అయితే తన పాత పగను అంతా తీర్చుకున్నాడు. అమ్మాయి అంటే హారికలా ఉండాలంటూనే ఆమెపై పంచ్‌లు వేశాడు. ‘అభిజిత్‌ను నామినేట్ చేస్తుంది మళ్లీ బాధపడుతోంది. నువ్వు నామినేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా పెద్ద రీజన్ చెప్పావా? టీ ఇవ్వలేదని లాంటి సిల్లీ రీజన్ చెప్పి నామినేట్ చేస్తుంది’అంటూ హారికను ఏడిపించాడు. ఆ తర్వాత అఖిల్ అంటే తనకు ఇష్టమని చెబుతూనే ‘నీకు ఇష్టమైనది నాకు ఇష్టమైనది ఒకటి ఉంది.. అది ఏంటంటే పులిహోర. ఇద్దరికి కరివేపాకు అంటే నచ్చదు’ అని మరోసారి కరిపేపాకు గొడవను గుర్తు చేశాడు. తర్వాత సొహైల్‌తో జరిగిన గొడవలో వేలు సెంటీ మీటర్ దిగింది.. సరిపోతుందా? అంటూ మళ్లీ పంచ్ వేశాడు. అనంతరం ఇంటి సభ్యులతో కలిసి డాన్స్ వేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత అఖిలు.. ఓ అఖిలు.. అంటూ గంగవ్వ ఎంట్రీ ఇచ్చింది. గంగవ్వ వాయిస్ విని ఇంటి సభ్యులంతా గార్డెన్ ఏరియాలోకి పరుగులు తీశారు. మరి బిగ్‌బాస్ హౌస్‌లో గంగవ్వ చేసిన సందడి ఏంటో రేపటి ఎపిసోడ్లో చదివేద్దాం. -
బిగ్‌బాస్: గంగవ్వకు మెహబూబ్ స్పెషల్ గిఫ్ట్
బిగ్‌బాస్ హౌస్‌లో కోపం, ప్రేమ, ద్వేషం, గొడవలు,అలకలు, మనస్పర్థలు అన్నీ ఉంటాయి. ఒక్కో కంటెస్టెంట్స్ కొట్టుకునే రేంజ్లో గొడవ పడతారు కూడా. అయితే ఈ గొడవలు, కోపాలు కేవలం ఆటలో మాత్రమే ఉంటాయి. తర్వాత అంతా ఒక్కటైపోతారు.హౌస్‌లో శత్రువుల్లా మారినవారు సైతంబయటకు వచ్చాక మిత్రులైపోతారు. ఇది గత మూడు సీజన్లలో చూస్తూ వచ్చాం. బిగ్ బాస్ లో గోడవలు ఎన్ని జరిగినా కూడా ఎక్కడో ఒక చోట కంటెస్టెంట్స్ మధ్య స్నేహ భావం అనేది ఉంటుంది.ఇక బిగ్‌బాస్ నాల్గో సీజన్లో ఇప్పటికే ఎలిమినేట్ అయిన సభ్యులంతా బయట కలిసి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇంటికెళ్లి కలుస్తున్నారు. గంగవ్వ ఇంటికి జోర్దార్ సుజాత వెళ్లి పలకరించింది. అలాగే లాస్య, నోయల్ కలిశారు. ఇలా ప్రతి కంటెస్టెంట్ మిగిలిన వారందరిని కలుసుకుంటు స్పెషల్ గా పార్టీలు కూడా చేసుకుంటున్నారు. ఇక తాజాగా కండల వీరుడు మెహబూబ్ దిల్సే గంగవ్వతో పాటు జోర్దార్ సుజాతను ప్రత్యేకంగా ఇంటికి పిలిచాడు. మెహబూబ్ వారితో బిగ్‌బాస్‌కు సంబంధించిన సంగతులను గుర్తు చేసుకుంటూ సరదాగా నవ్వించాడు. తన ఇంట్లో వారిద్దరికీ స్పెషల్ గా వంట చేసి పెట్టాడు. ఆ తర్వాత బిగ్‌బాస్ పెట్టినట్లు వీరిద్దరికి ఒక గేమ్ పెట్టాడు మెహబూబ్. అద్దం లేకుండా మేకప్ వేసుకోవాలని సుజాత, గంగవ్వకు పోటీ పెట్టాడు. అందులో గంగవ్వ తనదైన శైలీలో మేకప్ వేసుకొని నవ్వులు పూయించింది. ఇక చివర్లో గంగవ్వకు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు మెహబూబ్. ఆమె కోసం 25 తులాల పట్టీలను అందించారు. గంగవ్వ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు పట్టీల స్టోరీ చెప్పింది. అప్పట్లో పొలం పని చేసేటప్పుడు పట్టీలు తీసి ఒక కుండలో దాచగా, ఆమె భర్తే తాగుడుకు అలవాటు పడి అమ్ముకున్నట్లు చెప్పింది. ఇక అప్పటి నుంచి కాళ్లకు పట్టీలు లేకుండానే ఉంటున్నానని ఒక సందర్భంలో చెప్పింది. అది గుర్తుపెట్టుకున్న మెహబూబ్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక పట్టీలను కానుకగా ఇచ్చి గంగవ్వను సర్ప్రైజ్ చేశాడు. మెహబూబ్ ఇచ్చిన గిఫ్ట్ చూసి ఆశ్చర్యపోయిన గంగవ్వ ఎమోషనల్ అయింది. మోహబూబ్‌ను దగ్గరికి పిలిచి హగ్ చేసుకుంది. ఇక మెహబూబ్, సుజాతకు స్వీట్స్ ప్రజెంట్ చేశాడు. -
బిగ్‌బాస్ చెక్కుతో బంగారం కొన్న గంగవ్వ
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లలో మోస్ట్ ఎట్రాక్షన్ పర్సన్ ఎవరయా అంటే అది గంగవ్వ మాత్రమే! ఈ వయసులో అవ్వ ఏం చేయగలదు అనుకునేవాళ్లకు ఆమె జర్నీ చెంపెట్టు సమాధానం. ఆమె హుషారును ఎవరూ అందుకోలేకపోయారు. ఆమె కామెడీని ఎవరూ బీట్ చేయలేకపోయారు. ఆమె పంచ్‌లకు రివర్స్ పంచ్ అనేదే లేకుండా పోయింది. కల్మషం లేని మనసుతో ముసుగు లేకుండా ఆడిన గంగవ్వకు పిల్లల నుంచి పెద్దల వరకు అంతా అభిమానులే. దేశవిదేశాల్లో ఉన్న ఎంతోమంది తెలుగువాళ్లు కేవలం అవ్వ కోసమే బిగ్‌బాస్ షో చూసేవారు. (చదవండి: ఇల్లు కోసం పైసలత్తయంటే పోయిన..) గంగవ్వకు ఇల్లు కట్టిస్తానని నాగ్ హామీ అంతటి ఆదరణ పొందిన ఈ యూట్యూబ్ స్టార్ కొత్తిల్లు కట్టుకోవాలన్న ఆశయంతో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టింది. తన కలుపుగోలుతనంతో అందరితో ఇట్టే కలిసిపోయింది. అందరి మీద ఉన్న చనువుతో వారిపై సరదాగా పంచులేస్తూ, వాళ్లతో కలిసి డ్యాన్సులు చేస్తూ ఎంతగానో అలరించింది. కానీ అనారోగ్య కారణాల వల్ల అయిదో వారంలోనే హౌస్ నుంచి నిష్క్రమించింది. ఆమె కల కలగానే మిగిలిపోకూడదన్న భావనతో నాగార్జున తన చెల్లెలికి మంచి ఇల్లు కట్టిస్తానని ఆ బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. ఈ మాటలతో ఆమె మనసు ఖుషీ అయింది. గుండె నిండా ఆనందంతో ఇంటి నుంచి వీడ్కోలు తీసుకుంది. (చదవండి: బిగ్‌బాస్: లక్ష రూపాయలు పట్టేసిన గంగవ్వ) ఫ్యాషన్ షోలో రూ.లక్ష గెలుచుకున్న అవ్వ అయితే హౌస్‌లో అవ్వ ఓ స్పెషల్ టాస్క్ గెలిచింది. చందన బ్రదర్స్ ఫ్యాషన్ షోలో అమ్మాయిలు, అబ్బాయిలు ర్యాంప్ వాక్‌పై నడిచారు. ఇందులో అబ్బాయిలు గంగవ్వను విజేతగా ప్రకటించారు. ఆమెకు లక్ష రూపాయల గిఫ్ట్ వోచర్ అందించారు. ఆ చెక్కుతో బంగారం కొనాలా? బట్టలు కొనాలా? అన్న సందిగ్ధంలో ఊగిసలాడిన అవ్వ ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చింది. బంగారం కొనుగోలు చేసేందుకు తాజాగా హైదరాబాద్‌కు వచ్చింది. లక్ష రూపాయల చెక్కుతో రెండు తులాల బంగారం కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు వీడియోను అవ్వ తన ఛానల్లో పోస్ట్ చేసింది. అలాగే త్వరలోనే గంగవ్వ తన ఇంటి నిర్మాణం వీడియోను కూడా వదలనున్నట్లు తెలుస్తోంది. (చదవండి: నా గుండె తట్టుకుంట లేదు: ఏడ్చేసిన గంగవ్వ) -
బిగ్‌బాస్: అదరగొట్టిన ఆ నలుగురు.. కరీంనగర్ బిడ్డలే
బిగ్‌బాస్ సీజన్–4 రియాల్టీ షో చివరి అంకానికి చేరింది. వంద రోజులుగా కొనసాగుతున్న కార్యక్రమంలో వచ్చే ఆదివారం విజేత ఎవరో తేలనుంది. ఈ క్రమంలో ఫినాలే పోరులో నిలిచిన సయ్యద్ సోహెల్‌ది పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీ కాగా.. దేత్తడి హారిక సుల్తానాబాద్ ఆడబిడ్డే. సీజన్–4ను రక్తికట్టించిన వారిలో జగిత్యాల జిల్లా లంబాడిపల్లికి చెందిన గంగవ్వ షోకే ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. వైల్డ్‌కార్డుతో ఎంట్రీ ఇచ్చి షోను జబర్దస్త్‌గా నడిచేలా చేసిన అవినాష్ గొల్లపల్లి మండలం రాఘవపట్నంకు చెందినవాడు. ఈ సందర్భంగా అవినాష్ ‘సాక్షి’తో తన జీవన ప్రయాణ అనుభవాన్ని పంచుకోగా.. సోహెల్ గురించి ప్రత్యేక కథనం.. బిగ్‌బాస్ నుంచి కాల్ వచ్చింది ఒకరోజు బిగ్‌బాస్ షో నిర్వాహకుల నుంచి ఫోన్ వచ్చింది. రియాల్టీషోలో పని చేయాలని ఆహ్వానించారు. అయితే ఓ టీవీ చానల్లో ఎనిమిదేళ్లుగా చేస్తున్నా... రానన్నాను. ఒక్కసారి ట్రై చేయండి అన్నారు. నాకున్న ఆర్థిక పరిస్థితులు నన్ను కన్విన్స్ చేశాయి. ఓకే చెప్పాను. ఇదే విషయం కామెడీ షో నిర్వాహకులకు చెబితే ఒప్పుకోలేదు. ఇంకా రెండేళ్ల అగ్రిమెంట్ ఉందని, మధ్యలో వెళ్తే రూ.10 లక్షలు కట్టాలని హెచ్చరించారు. దాంతో పాటు ఒక్కసారి వెళ్లినవారికి మరో అవకాశం ఉండదన్నారు. అప్పటికే పీకల్లోతు అప్పుల్లో ఉన్నా. ఏం చేయాలో తోచలేదు. ఈ క్రమంలో గెటప్ సీను, శ్రీముఖి, చంద్ర నాకు అండగా నిలిచారు. వాళ్లే రూ.10లక్షలు ఫైన్ కట్టారు. అలా నటనలో జన్మనచ్చిన షోను వదిలి బిగ్‌బాస్‌లో అడుగుపెట్టాను. పునర్జన్మనిచ్చింది: అవినాష్ గొల్లపల్లి(ధర్మపురి): నాన్న ఉపాధికోసం ఎడాదిదేశాలకు వెళ్తే.. అమ్మా, అన్నయ్యలు వ్యవసాయం చేస్తూ.. కుటుంబాన్ని పోషించేవారు. చదువుకునే వయసులో స్నేహితుల ప్రోత్సాహం, అన్నయ్య సాయంతో నటనవైపు మళ్లాడు తను. హైదరాబాద్‌లో అందరిలాగే క్రిష్ణానగర్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. అవకాశాలు రాలేదు. చిన్నచిన్న ప్రోగ్రాంలతో జీవితాన్ని గడిపాడు. అనుకోకుండా వచ్చిన చాన్స్‌ను అందిపుచ్చుకున్నాడు. ఓ టీవీచానల్లోని కామెడీ షో జన్మనిస్తే.. బిగ్‌బాస్ పునర్జన్మనిచ్చిందని చెబుతున్నాడు ముక్కు అవినాష్. సాధారణ కుటుంబమే.. మాది జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామం. నాన్న లక్ష్మణ్, అమ్మ మల్లమ్మ. ఐదుగురం అన్నదమ్ములం. నేను మూడోవాణ్ని. నాన్న నా చిన్నప్పటినుంచి దుబాయ్ వెళ్లేవాడు. అమ్మ, అన్నలు వ్యవసాయం చేస్తుండేవారు. నేను జగిత్యాలలో పదోతరగతి వరకు, కరీంనగర్లో ఇంటర్, హైదరాబాద్‌లో బీటెక్ పూర్తిచేశా. స్కూల్ టైంనుంచే నటన అంటే ఇంట్రెస్టు. కల్చరల్ ప్రోగ్రాముల్లో మిమిక్రీ, డ్యాన్స్‌లు చేసేవాడ్ని. ఇంటర్లో నా ప్రతిభను చూసిన స్నేహితులు ప్రోత్సహించారు. ఇండస్ట్రీకి వెళ్తాఅంటే అమ్మానాన్న ఒప్పుకోలేదు. మా పెద్దన్నయ్య వారిని మెప్పించి నన్ను హైదరాబాద్‌లోని ఓ యాక్టింగ్ స్కూల్లో చేర్పించాడు. ఆఫీస్ బాయ్‌గా చేసిన.. ఐస్‌క్రీం అమ్మిన రెండునెలలు యాక్టింగ్ నేర్చుకున్నా. బతకడానికి డబ్బులు అవసరం కాబట్టి మూడు నెలలు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆఫీస్‌బాయ్‌గా పనిచేశా. ఐస్‌క్రీం బండి నడిపా. కిరాణాషాపులో పనిచేశా. బీటెక్ చేస్తుండగా.. సిటీలోని ఓ లోకల్ చానెల్లో పనిచేస్తూ.. రూంరెంట్, ఖర్చులు వెల్లదీసుకున్నా. సినిమాల్లో అవకాశం కోసం కృష్ణానగర్ చుట్టూ తిరిగా. ఆడిషన్లకు వెళ్తే.. నా ఫొటోలు డస్ట్‌బిన్‌లో వేసిన సందర్భాలున్నాయి. 16 రోజులకు రూ.వెయ్యి ఇచ్చారు మొట్టమొదటిసారి ఓ సినిమా షూటింగ్ కోసం అండమాన్ నికోబార్ తీసుకెళ్లారు. అక్కడ టీ బాయ్‌గా ప్రొడక్షన్ చూసుకునేది. 16 రోజులు పనిచేస్తే రూ.వెయ్యి ఇచ్చారు. ‘వాట్హాపెండ్ 6టు6’ సినిమాలో అవకాశం రాగా రెండురోజులు ఆడింది. వరంగల్‌కు చెందిన కిరణ్ నా యాక్టింగ్‌ను చూసి కెవ్వుకేక ప్రోగ్రాంలో అవకాశం ఇప్పించారు. ఈ క్రమంలో ఓ టీవీలో వచ్చిన తడాఖా ప్రోగ్రాంలో చాన్స్ వచ్చింది. అప్పుడే చమ్మక్‌చంద్ర నా యాక్టింగ్‌ను గుర్తించి తనటీంలో చేర్చుకున్నారు. తరువాత వేణు వండర్స్ టీంలో చేశాను. అలా ఎనిమిదేళ్లలో టీం లీడర్‌స్థాయికి ఎదిగాను. ఓ వైపు కామెడీ షో చేసూ్తనే పలు ఈవెంట్లు, షోలు చేసేవాడ్ని. వచ్చిన సంపాదనతో 2019లో మణికొండలో ఇల్లు కొన్నా. చీకట్లు నింపిన లాక్డౌన్ ఇల్లు కొన్న సమయంలోనే అమ్మ అనారోగ్యానికి గురైంది. రూ.10 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించా. ఆపై రూ.15లక్షలు అప్పు చేశా. ఈ క్రమంలో కరోనా లాక్డౌన్ నా జీవితంలో చీకట్లు నింపింది. లాక్‌డౌన్‌తో కామెడీ షో షూటింగ్ నిలిచిపోయింది. షోలు, ఈవెంట్లు లేవు. అప్పు కట్టేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. ఏం చేయాలో అర్థంకాక నేను కొనుక్కున్న ఇంటి పైనుంచే దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. అదే సమయంలో గెటప్ సీను ఫోన్ చేశాడు. మేమున్నామని ధైర్యం చెప్పాడు. 13 వారాలున్నా.. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా బిస్‌బాస్ రియాల్టీషోలో అడుగుపెట్టిన నేను 13 వారాలు హౌస్‌లో ఉన్నా. హౌస్‌లో బాగానే ఉన్నప్పటికీ అమ్మానాన్నలకు దూరం ఉండడం కొంత బాధేసింది. కానీ నాకున్న కష్టాలు పోవాలంటే గెలవాలనే కసితో ఆడాను. టాప్–5లో నిలుద్దామని అనుకున్నా. కుదరలేదు. ఏదేమైనా అన్నిరోజులు హౌస్‌లో ఉండేలా నాకు ఓట్లువేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఆఫర్లు వస్తున్నాయి షోనుంచి బయటకు వచ్చాక చాలా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఆర్థిక కష్టాలు కూడా తీరాయి. అందరిని నవ్విస్తూ.. అందరితో నవ్వుతూ ఉండాలన్నది నా కోరిక. మళ్లీ కామెడీ షో నిర్వాహకుల నుంచి పిలుపు వస్తే.. తప్పకుండా వెళ్తా. ఫైనల్లో సింగరేణి కుర్రోడు రామగిరి(మంథని): ‘అరె ఏందిబై.. నేను గిట్లనే ఉంటా. నా ఇష్టమున్నట్టు చేస్తా.. ఊరమాస్ ఇక్కడా..!’ బిస్బాస్లో ఈ డైలాగులు ఎంతో ఫేమస్. ఆ మాస్ క్యారెక్టరే.. సయ్యద్ సోహైల్. అతడిప్పుడో యూత్ ఐకాన్. సింగరేణి పొత్తిళ్లలో పెరిగి ప్రస్తుతం బిగ్‌బాస్ ఫైనల్లో నిలిచాడు. సింగరేణి ఉద్యోగం వద్దని.. పెద్దపల్లి మండలం మారేడుగొండ గ్రామానికి చెందిన సయ్యద్ సలీం–ఫాహీమా సుల్తానా దంపతులకు సయ్యద్ సోహెల్ రెండో సంతానం. సలీం సింగరేణి ఉద్యోగం రీత్యా కుటుంబంతో సహా సెంటినరీకాలనీలో స్థిరపడ్డారు. మైనింగ్ సర్దార్‌గా పనిచేస్తున్న సలీంకు 2016లో ఓపెన్‌హార్ట్ సర్జరీ అయ్యింది. యాజమాన్యం అతడ్ని అన్‌ఫిట్ చేసింది. వారసత్వంగా తండ్రి ఉద్యోగాన్ని స్వీకరించేందుకు సోహెల్ నిరాకరించాడు. దీంతో సలీంకు డిమోషన్ కల్పించి జనరల్ మజ్దూర్‌గా అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఓసీపీ–2లో విధులు నిర్వహిస్తున్నాడు. బిగ్‌బాస్ ఫైనల్లో.. ఈ క్రమంలో బిగ్‌బాస్ షోనుంచి ఆహ్వానం అందింది. ఎంట్రీతోనే సీక్రెట్ కంటిస్టెంట్గా ఉన్న సయ్యద్ సోహెల్ మొదటినుంచి చురుగ్గా ఆడాడు. ఇచ్చిన ప్రతీటాస్క్లో విజయం సాధించాడు. మాస్ క్యారెక్టర్‌గా పేరు, ఫ్యాన్స్‌ని సంపాదించాడు. మనసున్న స్నేహితుడిగా మన్ననలు పొందాడు. బిగ్‌బాస్ ఫైనల్లో అడుగుపెట్టాడు. విజేతగా తిరిగిరావాలని జిల్లా ప్రజలు, కుటుంబ సభ్యులు, అభిమానులు కోరుతున్నారు. డ్యాన్స్ అంటే ప్రాణం.. నటన అంటే ఇష్టం సయ్యద్ సోహెల్‌కు చిన్ననాటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. 2005లో 9వ తరగతి చదువుతున్న సమయంలో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమానికి ఎంపిక య్యాడు. ఇంటర్ కరీంనగర్లో చదివి, డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తిచేశాడు. 2009లో దిల్‌రాజ్ దృష్టిని ఆకర్షించిన సయ్యద్ సోహెల్ కొత్తబంగారు లోకం సినిమాలో సైడ్ క్యారెక్టర్‌కు ఎంపికయ్యాడు. 2010లో యూఅండ్ఐ, 2013లో మ్యాజిక్ మ్యూజిక్, 2015లో దిబెల్స్, 2017లో సినీ మహల్ సినిమాల్లో నటించాడు. నాతిచరామి, కృష్ణవేణి సీరియల్స్‌లో నటించి పేరు తెచ్చుకున్నాడు. విజేతగా వస్తాడు సోహెల్ ఏదైనా సాధించాలంటే పట్టుదలతో ఉంటాడు. అదే సంకల్పంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ రాణిస్తున్నాడు. సోహెల్ యూత్ ఐకాన్‌గా నిలవడం గర్వంగా ఉంది. బిగ్‌బాస్ షోలో విజేతగా నిలుస్తాడనే నమ్మకం ఉంది. – సయ్యద్ సలీం, సోహెల్ తండ్రి -
బిగ్‌బాస్: నెట్టింట ట్రెండ్ అవుతున్న అఖిల్
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో అడుగు పెట్టిన అందగాడు అఖిల్ సార్థక్. తన నవ్వుకు, తెలివికి, గాత్ర మాధుర్యానికి అమ్మాయిలు దాసోహమయ్యారు. అతడికే మా ఓటు అని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. మోనాల్‌తో సాన్నిహిత్యం, అభిజిత్‌తో వైరం, టాస్కుల్లో వీరత్వం వెరసి అఖిల్ బిగ్‌బాస్ వీక్షకుల నోట్లో నాలుకగా మారిపోయాడు. ఈ రోజు(నవంబర్ 17) అఖిల్ సార్థక్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, అఖిల్‌కు బర్త్‌డే విషెస్ చెప్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో అఖిల్ ట్రెండింగ్ అవుతున్నాడు. ఇతడికి బిగ్‌బాస్ స్టార్ గంగవ్వ, సుజాత, యాంకర్ శివ వీడియో సందేశం ద్వారా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: కాపురాలు కూలిపోతాయ్ అని హెడ్డింగ్ పెట్టారు: హిమజ) కాగా నాగార్జున కొడుకు అఖిల్ పిల్లాడిగా నటించిన 'సిసింద్రీ' సినిమా విడుదలైన సమయంలో అఖిల్ పుట్టాడు. అందుకనే అతడికి ఆ పేరు పెట్టారు. బుల్లితెరతో కెరీర్ ప్రారంభించిన అఖిల్ 'ముత్యాల ముగ్గు', 'ఎవరే నువ్వు', 'కళ్యాణి', 'మోహిని' వంటి సీరియల్స్‌లో కూడా నటించాడు. మధ్యలో 'బావా మరదలు' అనే చిత్రంతో వెండితెర మీద తళుక్కుమని మెరిశాడు. ఇక బిగ్‌బాస్ షోలో అడుగు పెట్టిన అఖిల్ మోనాల్ గజ్జర్‌ను బెస్ట్‌ఫ్రెండ్‌గా, సోహైల్‌ను తమ్ముడిగా ఫీలవుతాడు. మిగతా అందరితోనే బాగానే ఉంటున్నప్పటికీ ముక్కుసూటిగా మాట్లాడే తత్వం, యాటిట్యూడ్‌తో వైరాలు కొని తెచ్చుకుంటున్నాడు. ఇక ఈ మధ్యే సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లిన అఖిల్ మరింత స్ట్రాంగ్‌గా హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. పదకొండో వారానికి కెప్టెన్‌గా కొనసాగుతున్న ఇతడు టాప్ 3లో ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. (చదవండి: బిగ్‌బాస్: మోనాల్‌ని ముద్దు అడిగిన అఖిల్!) Thank you #anchorshiva, #gangavva Garu and #jordarsujatha for your wishes...#HBDAkhilSarthak #HBDakhilsarthak#akhilsarthak pic.twitter.com/RNyishjlL5 — Akhil Sarthak Official (@akhilsarthak17) November 17, 2020 -
నేను బైటకచ్చినంక అందరు ఏడిసిర్రట..
సాక్షి, మల్యాల(చొప్పదండి): బిగ్‌బాస్ షోలో కనబడితే చాలు అనుకునే వేలాది మందికి రాని అవకాశం గంగవ్వ తలుపు తట్టింది. చాంపియన్ కావాలనే సంకల్పంతో అడుగుపెట్టే వారికి భిన్నంగా తన ఇంటి కల నెరవేరితే చాలు అనుకుంటూ ఆ షోలో అడుగుపెట్టింది. రూ.లక్షలు కావాలనే కోరిక లేదు.. ఇల్లు కట్టుకుంటే చాలు అనే కల తప్ప.. ఆ మాటే చెప్పింది బిగ్‌బాస్ షోలో.. గంగవ్వ ఇంటి కల నెరవేరుస్తా అని బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున మాట ఇవ్వడంతో తాను అనుకున్నది సాధించినంత సంబరపడింది. రియాల్టీ షో.. నటన అంటే తెలియదు.. తెలిసిందల్లా తనకు తోచింది చేసుడే.. నిర్మలమైన హృదయం.. కల్మషం లేని మనసు.. అందరూ మంచిగ ఉండాలని కోరుకునే వ్యక్తిత్వం.. అక్షరం నేర్వకపోయినా కష్టాలు, కన్నీళ్లు జీవిత పాఠాలు నేర్పాయి. ఐదేళ్ల చిన్నారుల నుంచి అరవై ఏళ్ల వృద్ధుల వరకు అందరూ గంగవ్వ కోసం బిగ్‌బాస్ చూశారనడంలో అతిశయోక్తి లేదు. అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్ వంటి దేశాల నుంచి తెలుగువారు లక్షలాది మంది ఆమెకు అభిమానులయ్యారు. బిగ్‌బాస్ రియాల్టీ షో నుంచి స్వచ్ఛందంగా బయటకు వచ్చిన యూ ట్యూబ్ స్టార్ గంగవ్వకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఆమె షోను వీడుతుంటే అందరూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మల్యాల మండలంలోని లంబాడిపల్లికి చెందిన గంగవ్వ బిగ్‌బాస్ షోలో తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఇల్లు కోసం పైసలత్తయంటే పోయిన.. అవ్వగారి ఊరు పొలాస నుంచి అత్తగారి ఊరు లంబాడిపల్లికి అచ్చిన అంటే ఇంకో ఊరుకు పోలే. ఎప్పుడూ పొలం, ఇల్లు, చెట్టు, పుట్ట తప్ప ఏం తెల్వదు. మై విలేజ్ షో శ్రీరాం శ్రీకాంత్ తీసిన 200 సినిమాల్ల చేసిన. నేను పలుకబలుపం పట్టుకోని బడికిపోలే. సదువురాదు. శ్రీకాంత్ చెప్పింది చేసుడే వచ్చు. బిగ్బాసోళ్లు అడుగుతుండ్రు బిగ్‌బాస్‌కు పోతవా గంగవ్వ అని శ్రీకాంత్ అడిగిండు. మూడు నెలలు ఉంటవా మరి అని అంటే ఉంటా.. ఇల్లు కట్టుకునేందుకు ఉంట అని చెప్పిన. ఇగ ఏం ఆలోచించలేదు. బిగ్‌బాస్ పోత. ఇల్లు కట్టుకునేందుకు ఎన్ని రోజులైన ఉంటా అన్న. బిగ్‌బాస్‌కు పోవాల్నా అని నా బిడ్డలను అడిగిన.. పో అవ్వ అన్నరు. పోతే పైసలత్తే బిడ్డలకు కూడా ఇయ్యచ్చని అనుకొని పోయిన. కారంటైన్ చెయ్యంగ మైండ్ కరాబైంది.. ఇక్కడి నుంచి పెయినంక.. కారంటైన్ అని ఒకటే రూంల 18 రోజులు ఉంచిన్రు. గప్పుడే మైండ్ అంత కరాబైంది. ఇంక బిగ్‌బాస్‌ల ఎంట్ల ఉంటదో అనిపించింది. కండ్లకు బట్టకట్టి బిగ్‌బాస్ షోకు తీసుకపోయిండ్రు. అక్కడికి పోయిన రోజే చెప్పిన నాకు ఇల్లు లేదు సారు.. మీరిచ్చే పైసలతోని ఇల్లు కట్టుకుందామని ఆశతో వచ్చిన అన్న. రెండు వారాలకే ఇంటి మొకాన పానం కొట్టుకునుడు మొదలైంది. కొడుకు, బిడ్డలు, మనవలు, మనవరాండ్లు ఎట్ల ఉన్నరో అని మనాది వడ్డది. ఇగ ఇంటిమీద రందితో జరం అచ్చింది. సూదులు ఇచ్చిండ్రు. మందులు ఇచ్చిండ్రు. మంచిగ సూసుకున్నరు. ఎవలన్న తప్పు సేత్తె తిట్టెదాన్ని.. బిగ్‌బాస్ ఇంట్లకు పోయినాక అందరు నన్ను గంగవ్వ అనుకుంట మంచిగ సూసుకున్నరు. ఆట ఆడినప్పుడు ఒక్కలుగూడ నన్ను ఏం అనలేదు. ఎవలన్న తప్పు సేత్తె నేనే తిట్టెదాన్ని. అవ్వ.. అవ్వ అనుకుంట అందరూ నా సుట్టే తిరిగెటోళ్లు. అఖిల్ కాళ్లు ఒత్తుకుంట.. ఎట్ల ఉంది అవ్వ అనుకుంట నాతోనే ఉండెటోడు. బిగ్‌బాస్ ఇంట్ల నన్ను ఏం పని చెయ్యనియ్యలేదు. కానీ బిగ్‌బాస్ ఇంట్ల నుంచి ఎటూ పోరాదు. తెల్లందాక ఎప్పుడు ఏవో ఆటలు ఆడాలి. నిద్ర పోవుడు లేదు. బువ్వ తిందామంటే తినబుద్ది కాలేదు. ఓ టీవీ లేదు. గడియారం లేదు. చెట్టు కనవడది.. పుట్ట కనవడది.. ఎప్పుడు తెల్లారిందో.. ఎప్పుడు రాత్రయిందో తెల్వకపోతుండె. ఎట్లయినా ఇల్లు కట్టుకోవాలే అనే ఆలోచనతో అక్కడనే ఉండాలె అనుకున్న. కానీ ఎప్పుడు నలుగుట్ల తిరిగిన గదా అంత పెద్ద బంగుళాలో ఉండలేకపోయిన. నేను బైటకచ్చినంక అందరు ఏడిసిర్రట.. బిగ్‌బాస్ ఇంట్ల అందరు నాతోని మంచిగున్నరు. కానీ నాకు నా ఇంటి రంది వట్టుకొని రెండుసార్లు జరమచ్చింది. మొదటిసారి జరమచ్చినప్పుడు నా కొడుకును తీసుకచ్చి సూపెట్టినంక రెండు వారాలు ఉన్న. ఇగ వానలకు నా ఇల్లు ఏమైందో.. నా మనవలు, మనవరాండ్లు, బిడ్డలు ఎట్లున్నరో అని రందైంది. బిగ్‌బాస్ ఇల్లు పెద్దగ మంచిగుంది. నాకే ఏసీ వడలేదు. తిండి తినబుద్ది కాలే. నిద్ర పట్టలేదు. గందుకే బయటకు వచ్చిన. నేను బైటకచ్చినంక అందరు ఏడిసిర్రని పిలగాండ్లు చెప్తున్నరు. -
గంగవ్వతో గరం సత్తి ముచ్చట్లు
-
గంగవ్వను కలిసిన బిత్తిరి సత్తి
సాక్షి, మల్యాల: బిగ్‌బాస్ రియాల్టీ షో నుంచి స్వచ్ఛందంగా బయటకు వచ్చిన మై విలేజ్ షో గంగవ్వను గురువారం నటుడు, యాంకర్ బిత్తిరి సత్తి, బిగ్‌బాస్ ఫేమ్ సుజాత కలిశారు. మల్యాల మండలంలోని లంబాడిపల్లి గ్రామంలోని గంగవ్వ ఇంటికి వెళ్లి, ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గంగవ్వ బిగ్‌బాస్ రియాల్టీ షో నుంచి అనారోగ్యంతో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అనంతరం మై విలేజ్ షో డైరెక్టర్ శ్రీరాం శ్రీకాంత్‌తోపాటు టీం సభ్యులను కలిశారు. (గంగవ్వ చాలా సేఫ్‌గా ఉంది) -
గంగవ్వ చాలా సేఫ్‌గా ఉంది
బిగ్‌బాస్ షోలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గంగవ్వ హఠాత్తుగా హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆరోగ్యం బాగాలేదన్న కారణంతో ఆమె షో నుంచి వైదొలిగింది. నిజానికి ఈ సీజన్లో ఎక్కువ ఫాలోయింగ్ ఆమెకు మాత్రమే ఉంది. ఆమె షోలో అడుగు పెట్టిన మరుక్షణమే ఆర్మీలు పుట్టుకొచ్చాయి. నామినేషన్లోకి వచ్చినా కోట్లాది ఓట్లు ఆమెకు అత్యంత సులువుగా వచ్చి పడేవి. అలాంటి ఎంటర్టైనర్ అవ్వ. తన వాక్చాతుర్యంతో కుర్ర కంటెస్టెంట్లను కూడా హడలెత్తించేది. ఏదైనా తప్పు జరిగినట్లు అనిపిస్తే ఏమాత్రం సంకోచించకుండా ముఖం మీదే చెప్పేసేది. (చదవండి: బిడ్డ శవం ఎత్తుకుని వెళ్తే బస్సెక్కనియ్యలే) కానీ ఎవరు కంటతడి పెట్టినా ఆమె మనసు తరుక్కుపోయేది. వెళ్లి తన చీరకొంగుతో కన్నీళ్లు తుడుస్తూ తల్లిలా ఊరుకోబెట్టేది. బిగ్‌బాస్ హౌస్‌లో అందరికీ ప్రేమలు పంచి, ప్రేక్షకుల గుండెల్లో గొప్ప స్థానాన్ని దక్కించుకున్న అవ్వ ఆరోగ్యం ఇప్పుడెలా ఉందన్న ప్రశ్న ఆమె అభిమానులను కలవరపరుస్తోంది. దీంతో మై విలేజ్ షో టీమ్ అవ్వ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చింది. గంగవ్వ ఆరోగ్యం చాలా సేఫ్‌గా ఉందని, ఎవరూ భయపడాల్సిన పని లేదని స్పష్టం చేసింది. డాక్టర్ సలహా మేరకు ఒక వారం స్పెషల్ కేర్‌లో ఉంచామని పేర్కొంది. (చదవండి: బిగ్‌బాస్‌ను వీడిన గంగవ్వ, అఖిల్ కంటతడి) -
గంగవ్వకు కొత్త ఇల్లు కట్టిస్తా: నాగ్
ఐదోవారంలో నామినేషన్లో కూడా లేని గంగవ్వ అనారోగ్యం కారణంగా బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చేసింది. ఆమెకు ఇంటిసభ్యులందరూ సగౌరవంగా వీడ్కోలు పలికారు. ఏ కోరికతో ఈ షోలో అడుగు పెట్టిందో ఆ కలను నిజం చేస్తానని నాగ్ హామీ ఇచ్చారు మరోవైపు అనవసరంగా నోరు పారేసుకుంటున్న సోహైల్, మెహబూబ్‌లకు నాగ్ అక్షింతలు వేశారు. ఇంకోసారి ఇలాంటివి పునరావృతం కాకూడదని హెచ్చరించి వదిలేశారు. అలాగే ఇద్దరు కంటెస్టెంట్లు సేఫ్ జోన్లో ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాదు, ఈవారం 8 కోట్ల ఓట్లు వచ్చాయని తెలిపారు. మరి నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి.. ఎవరు రూల్స్ బ్రేక్ చేసినా కెప్టెన్‌కే పనిష్మెంట్ బిగ్‌బాస్ ఇంటిసభ్యులను నిద్రలో నుంచి లేపి మరీ కౌంటింగ్ ఇచ్చాడు. మైక్ సరిగా ధరించట్లేదని, తెలుగులో మాట్లాడట్లేదని సీరియస్ అయ్యాడు. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం లేదని తిట్టిపోశాడు. ఇంకోసారి ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా కెప్టెన్ సోహైల్ అన్ని కెమెరాలకు క్షమించమని చెప్పాల్సి ఉంటుందని ఆదేశించాడు. అనంతరం ఒప్పో టాస్క్‌లో మోస్ట్ స్టైలిష్ పర్సన్ - మెహబూబ్, పర్ఫెక్ట్ పిక్చర్ - అరియానా, మోస్ట్ స్పీడీ - లాస్య, మోస్ట్ హైలెటెడ్ ఇన్ ద క్రౌడ్ - అవినాష్, మోస్ట్ క్లియర్ ఇన్ థాట్ - కుమార్ సాయి, బాగా శక్తివంతులు - అమ్మరాజశేఖర్ అని పేర్కొన్నారు. మోనాల్‌ను ఆల్‌రౌండర్‌గా పేర్కొంటూ ఆమెకు కెప్టెన్ సోహైల్ కిరీటం ధరించారు. (చదవండి: ఇక్కడ రిలేషన్స్ పెట్టుకోవడం వేస్ట్: అఖిల్) ఎదుటి వాళ్లు చెప్పేది వినిపించుకోండి స్టేజీ పైనకు నాగార్జున వచ్చీరాగానే అఖిల్, అభిజిత్ మీద సీరియస్ అయ్యారు. మీరు నామినేషన్ చేసుకునేటప్పుడు మధ్యలో మోనాల్ పేరు ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. ఇంకోసారి ఇది జరగకూడదని కొరడా ఝుళిపించారు. స్వాతి దీక్షిత్‌ను నామినేట్ చేసినందుకు మాస్టర్‌పై నోయల్ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని నాగ్ ప్రస్తావిస్తూ మరి కుమార్ సాయి విషయంలో ఏమీ అనిపించలేదా అని నిలదీయగా ఏమి చెప్పాలో తెలీక నోయల్ నీళ్లు నమిలాడు. అదేవిధంగా నోయల్ వచ్చి సారీ చెప్పినా కనీసం ఏం చెప్తున్నారనేది కూడా వినిపించుకోరా? అని మాస్టర్‌ను ప్రశ్నించారు. ముందు వినడం నేర్చుకోమని సూచించారు. దివిపైన అరుపులు ఏంటి? పిచ్చి కుక్కలా అరుస్తున్నట్లు ఉంది అని సోహైల్‌పై ఫైర్ అయ్యారు. ఇంకోసారి ఆడపిల్ల మీద అరవకూడదని వార్నింగ్ ఇచ్చారు. నీ గెలుపు కోసం టీమ్‌ను ఓటమిపాలు చేశావు తర్వాత అవినాష్.. దివికి లైన్ వేసిన విషయాన్ని నాగ్ అందరి ముందు బట్టబయలు చేశారు. కానీ సీక్రెట్ టాస్క్ మాత్రం బాగా ఆడావని మెచ్చుకున్నారు. స్టార్లు దొంగిలించి ఆట ఆగిపోయేలా చేశాడని అభిజిత్‌ను నిందించారు. నీ గెలుపు కోసం మాత్రమే పాటుపడటం వల్ల హోటల్ సిబ్బంది టీమ్ ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. ఎప్పుడూ ఎడ్యుకేషన్ కోసం తీయకని అభికి సూచించారు. పుచ్చ పగిలిపోతుంది అన్న మాట బయట హోటల్లో మాట్లాడితే మెడపట్టి తోసేసి పోలీసులు మోకాళ్లు విరగ్గొడతారు అని, అలాంటి మాటలు మాట్లాడొద్దని మెహబూబ్‌ను గట్టిగానే హెచ్చరించారు. అయితే ఆ పదం వాడటం తప్పని, ఇంటి సభ్యులకు సారీ చెప్పమని మెహబూబ్‌కు సూచించినందుకు సోహైల్‌ను అభినందించారు. అనంతరం సోహైల్ సేఫ్ అయినట్లు ప్రకటించారు. (చదవండి: బిడ్డ శవం భుజానేసుకుని వెళ్లాను: గంగవ్వ) నాగార్జునకు మనుమరాలు పుట్టాక పట్నం వస్తా గంగవ్వకు ఆరోగ్యం సరిగా లేదని నాగ్ చెప్పుకొచ్చారు. అవ్వను కన్ఫెషన్ రూమ్‌లోకి రమ్మని చెప్పి సంభాషించారు. గంగవ్వ తన నాగ్ అన్నను చూసి బోరున విలపించింది. "పదిరోజులుగా నిద్ర పోతలేను. ఇల్లు లేదని వచ్చాను. కానీ నా వల్ల ఐతలేదు. ఆట కూడా ఆడలేకపోతున్నా. నన్ను ఊరు పంపించేయండి. నీకు మనుమరాలు పుట్టినప్పుడు హైదరాబాద్ వచ్చి మీ ఇల్లు చూస్తా" అని అంది. ఆమె అవస్థకు కలత చెందిన నాగ్.. అవ్వ ఈ హౌస్‌ను వీడేందుకు అనుమతి ఇవ్వాలని బిగ్‌బాస్‌కు విన్నవించారు. దీంతో ఆమె వెళ్లిపోవచ్చని బిగ్‌బాస్ ప్రకటించాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన అఖిల్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. అవ్వకు హార్ట్ షేప్ పిల్లోను బహుమతిగా ఇచ్చాడు. ఇంటి సభ్యులందరూ ఆమెకు కన్నీటితో వీడ్కోలు పలికారు. (చదవండి: బిగ్‌బాస్: రీ ఎంట్రీ కోసం స్వాతి ఫ్యాన్స్ ఆందోళన) సోహైల్ నాగుపాము, మోనాల్ అమాయకురాలు స్టేజీపైకి వచ్చిన అవ్వ ఇంటి సభ్యులందరి గురించి మంచి, చెడు చెప్పుకొచ్చింది. హారిక అప్పుడే నవ్వుతూ, అప్పుడే సీరియస్ అయితని తెలిపింది. దివి.. తన మనుమరాలిలాగా అని, కానీ ఎవరైనా మాట్లాడకపోతే ముఖం మాడ్చుకుంటుందని చెప్పింది. సోహైల్.. నాగుపాము అని, అతడిలో మంచి చెప్పుకునేందుకు ఏమీ లేదని గాలి తీసేసింది. అఖిల్‌ను పెంచుకుంటానంది. అమ్మ రాజశేఖర్ హౌస్‌లో ఉండాలి అని తీర్పు చెప్పింది. అలాగే తనను సినిమాలో తీసుకోవాలన్న అవ్వ కోరికకు మాస్టర్ తప్పకుండా అవకాశమిస్తానని భరోసా ఇచ్చారు. మోనాల్ మంచిదని, అమాయకురాలని చెప్పుకొచ్చింది. నోయల్.. బిగ్‌బాస్ అవగానే పెళ్లి చేసుకో: గంగవ్వ నోయల్.. హౌస్ నుంచి బయటకు రాగానే పెళ్లి చేసుకోవాలని ఆదేశించింది. లాస్య, తన పెద్ద బిడ్డ అని, సుజాత నామినేషన్లోకి వస్తదని అభిప్రాయపడింది. అభిజిత్ ముఖం కడుక్కోకుండా కాఫీ, టీలు తాగుతారని, అందుకే నామినేట్ చేశానని తెలిపింది. అరియానా చూడటానికి చిన్నపిల్ల, కానీ ఎవరు పట్టించుకోకున్నా ముఖం మీదే అనేస్తదని పొగిడింది. అవినాష్‌ను కుందేలుగా అభివర్ణించింది. కుమార్ సాయి రోజూ నేర్చుకుంటున్నాడని, అందరితో కలిసిపోయాడంది. ఈ సందర్భంగా తనకో ఇల్లు కట్టియ్యమని అవ్వ మనసులో మాట బయటపెట్టింది. దీంతో తాను ఇల్లు కట్టిస్తానని, ఇక దాని గురించి మర్చిపోమని నాగ్ అభయమిచ్చారు. అనంతరం అందరూ ఊహించినట్టుగానే అఖిల్‌ను సేఫ్ చేసింది. రేపటి ఎపిసోడ్లో సుజాత ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. (చదవండి: అవినాష్ తిక్క కుదిర్చిన అరియానా) -
బిగ్‌బాస్: నాకు ఎవరూ లేరు.. అఖిల్
బిగ్‌బాస్ హౌస్‌లో ట్రయాంగిల్ లవ్‌స్టోరీ నడుపుదామనుకున్నారు. కానీ అది వర్కవుట్ కావడం లేదు. అభిజిత్ మోనాల్‌ను పక్కన పెట్టి హారికతోనే ఉంటున్నాడు. అయితే నామినేషన్ ప్రక్రియ పెట్టిన చిచ్చు వల్ల ఈక్వేషన్స్ తలకిందులయ్యాయి. నేషనల్ ఛానెల్లో తన గురించి మాట్లాడకండి అని మోనాల్.. అఖిల్, అభిజిత్‌కు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పటినుంచి అఖిల్ ఆమెతో మాట్లాడటమే మానేశాడు. కానీ ఇదే సమయంలో అభి.. మళ్లీ ఆమెకు దగ్గరవుతున్నాడు. వీళ్లిద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటున్నారు. నాకు ఇంట్లో బాగా నచ్చే వ్యక్తి అఖిల్: మోనాల్ అఖిల్ మాత్రం ఒంటరివాడైపోయాడు. అతడితో మాట్లాడేందుకు మోనాల్ ఎన్నో ప్రయత్నాలు చేయగా చివరికి ఆయన ఏదో పొడిపొడిగా మాట్లాడాడు. కానీ నీపై నమ్మకం పోయిందంటూ మోనాల్ ముఖం మీదే చెప్పాడు. నేను నీకు నచ్చడం లేదా అని మోనాల్ విసిరిన ప్రశ్నకు సైతం ఏ విషయంలో? ఎందుకు నచ్చాలని అని ఎదురు ప్రశ్నించాడు. తనకు మాత్రం ఇంట్లో బాగా నచ్చే వ్యక్తి అఖిల్ అని చెప్పగా అవునా! నీకు నేనంటే ఇష్టమా? అని కొంత ఆశ్చర్యంగా, మరికొంత నిస్తేజంగా ముఖం పెట్టాడు. ఆ తర్వాత తనలో తను నలిగిపోతున్న విషయాలను ఏకరువు పెట్టాడు. (చదవండి: బిగ్‌బాస్: అఖిల్ మీద పడిపోయిన సోహైల్) గంగవ్వ ప్రేమకు దూరం కానున్న అఖిల్ "బిగ్‌బాస్ ఇంట్లో నాకు ఎవరూ లేరు. నాకు సపోర్ట్ ఇచ్చేవాళ్లు కనిపించలేదు. గంగవ్వ తప్ప! సోహైల్ సోదరుడిలా అనిపిస్తాడు. మెహబూబ్ ఫ్రెండ్. అయినా ఇక్కడ రిలేషన్షిప్స్ పెట్టుకోవడమే వేస్ట్. నువ్వే నన్ను ఇలా చేశావు ఇలా చేశావు అని నిలదీస్తున్నావు. అలాంటప్పుడు ఇక ఎవరితో కూడా రిలేషన్స్ పెట్టుకోవద్దని అనుకుంటున్నాను" అని మనసులోని మాటను బయటపెట్టాడు. కాగా అతనికి అండగా ఉంటూ ఆప్యాయంగా చూసుకునే గంగవ్వ నేడు బిగ్‌బాస్ హౌస్ నుంచి వెళ్లిపోనుంది. దీంతో అవ్వను ఆరాధించే అఖిల్ పరిస్థితి మరింత ఘోరంగా తయారవనుంది. ఇప్పటికే మోనాల్ విషయంలో మథన పడుతున్న ఆయన టాస్కులోనూ సరిగా ఆడలేకపోతున్నాడని మెహబూబ్, సోహైల్ ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో అవ్వ వెళ్లిపోతే అఖిల్ ఆ బాధ నుంచి ఎలా బయటపడతాడో చూడాలి! (చదవండి: బిగ్‌బాస్: ఆ విషయంలో మోనాల్‌దే తప్పన్న దివి) -
నా గుండె తట్టుకుంట లేదు: ఏడ్చేసిన గంగవ్వ
బిగ్‌బాస్ నాల్గవ సీజన్లో చాలామంది కంటెస్టెంట్లు ప్రేక్షకులకు పెద్దగా తెలీదు. కానీ ప్రేక్షకుల మధ్యలో నుంచి వచ్చిన గంగవ్వ అందరికీ సుపరిచితురాలే. ఇల్లు కట్టుకోవాలన్న ఆశతో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టింది. కానీ ఎప్పుడూ నలుగురి మధ్య తిరుగుతూ ఉండే ఆమె నాలుగు గోడల మధ్య ఉండలేకపోయింది. ఫేక్ ఎమోషన్స్ చూపించే మనుషుల మధ్య ఇమడలేపోయింది. మట్టి వాసనను పీల్చి బతికే ఆమెకు ఏసీ వాసన పడలేదు. అందరితో కలిసి నాలుగు మాటలు చెప్తూ బువ్వ తినే అవ్వకు అక్కడ బుక్కెడు అన్నం కూడా గొంతులోకి దిగట్లేదు. అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఇంకో రెండు వారాలుండేందుకు ప్రయత్నిస్తానంటూ నెల రోజులుగా కాలం నెట్టుకొచ్చింది. అవ్వ ఆరోగ్య స్థితిపై చలించిన నాగ్ కానీ రోజురోజుకీ ఆమె పరిస్థితి దిగజారుతోంది. వారం రోజులుగా ఆమె ఆరోగ్యం ఏమీ బాగో లేదని స్వయంగా నాగార్జున ప్రకటించారు. ఆమె హెల్త్ రిపోర్టులు చూసి చలించిపోయిన నాగ్ ఆమె వెళ్లిపోయేందుకు అనుమతి ఇవ్వాలని బిగ్‌బాస్‌ను కోరారు. కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన గంగవ్వ నాగ్‌తో మాట్లాడుతూ.. "ఇంకో రెండు వారాలుంటే బాగుండు. కానీ, నాకు గుండె తట్టుకుంట లేదు" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తనను ఇంటికి పంపించేయండని చేతులెత్తి వేడుకుంది. (చదవండి: బిగ్‌బాస్: వెళ్లిపోయేది ఆమె? అతడు?) ఆమెకు ఇల్లు కట్టించండి అవ్వ పరిస్థితిని అర్థం చేసుకున్న నాగ్ ఆమెను బయటకు పంపించేయాలని బిగ్‌బాస్‌ను కోరారు. దీంతో అవ్వ ఇక హౌస్‌లో ఉండదన్న విషయం జీర్ణించుకోలేకపోయిన అఖిల్, సుజాత కంటతడి పెట్టుకున్నారు. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు అవ్వకు మంచి ఇల్లు కట్టించమని, లేదంటే ఇల్లు కట్టేందుకు అవసరమయ్యేంత పారితోషికాన్ని ఆమెకు అప్పజెప్పండని వేడుకుంటున్నారు. "నువ్వు ఉన్నావన్న ఒకే ఒక్క కారణంతో బిగ్‌బాస్ చూస్తున్నాం. ఇప్పుడు నువ్వెళ్లిపోయాక ఎవరి కోసం ఈ షో చూడాలి?" అని ఆమె అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. (చదవండి: బిడ్డ శవం ఎత్తుకుని వెళ్తే బస్సెక్కనియ్యలే: గంగవ్వ) -
బిగ్‌బాస్‌కు గంగవ్వ గుడ్‌బై!
-
షాకింగ్: బిగ్‌బాస్‌కు గంగవ్వ గుడ్‌బై!
బిగ్‌బాస్ నాల్గవ సీజన్లో గంగవ్వ స్థానం ప్రత్యేకమైనది. షో ప్రారంభమైన కొత్తలో ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రధానంగా ఆమె పైనే ప్రోమోలు వచ్చేవి. ఆమె హుషారు, ఆమె వేసే పంచులు షో నీరసంగా సాగకుండా, ఫుల్ జోష్‌తో కొనసాగేందుకు కారణమయ్యేవి. అయితే ఆమధ్య తన ఆరోగ్యం బాగోలేదని, ఇంటికి వెళ్లిపోతానని చేతులెత్తి వేడుకుంది. కానీ బిగ్‌బాస్ ఆమెను పంపించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అందుకు బదులుగా ఆమెకు వైద్యం చేయించి మరికొన్ని రోజులు ఇంట్లోనే ఉంచేందుకు ప్రయత్నించారు. ఆమె తిరిగి కోలుకొని ఎప్పటిలాగే హుషారుగా కనిపించడంతో ఇప్పట్లో అవ్వ బయటకు వెళ్లదని అందరూ డిసైడ్ అయ్యారు. (చదవండి: బిగ్‌బాస్‌లో ఆ నవ్వు దూరం కానుందా?) ముద్ద దిగడం లేదని బాధపడ్డ గంగవ్వ కానీ నిన్నటి ఎపిసోడ్లో ఆమెకు మళ్లీ ఇంటిపై ప్రాణం కొట్టుకుంది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండలేకపోతున్నానని వాపోయింది. కడుపు నిండా తినే తనకు ఇక్కడ పిడికెడు ముద్ద కూడా లోపలికి వెళ్లట్లేదని భోరుమని ఏడిచింది. కానీ బిగ్‌బాస్ ఈసారి ఆమె వేదనను అర్థం చేసుకోకుండా కఠినంగా ప్రవర్తించలేదు. అవ్వ మొరను ఆలకించి ఆమెను బిగ్‌బాస్ హౌస్‌లో నుంచి బయటకు పంపించేసినట్లు సమాచారం. అనారోగ్య కారణాల వల్లే ఆమెను షో నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. (చదవండి: గంగవ్వ వల్ల ఆట దెబ్బతింటోందా?) అవ్వ వెళ్లిపోతే అఖిల్ పరిస్థితి? ఈ వార్త విన్న గంగవ్వ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక అవ్వ వెళ్లిపోతే ఎక్కువగా బాధపడేది అఖిల్. తాను అవ్వను తప్ప ఎవ్వరినీ నమ్మట్లేదని నిన్ననే అఖిల్ మనసులోని మాట బయటపెట్టాడు. ఇంతలోనే గంగవ్వ వెళ్లిపోతుండటం అతడికి భారంగానే మారనున్నట్లు కనిపిస్తోంది. కాగా ఇప్పటినుంచైనా కంటెస్టెంట్లు సానుభూతి కార్డు ప్లే చేయకుండా ఆడతారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గంగవ్వ అభిమానులు మాత్రం రేపటి నుంచి అవ్వ లేకుండా షో ఎలా చూడగలమని బాధలో కూరుకుపోయారు. (చదవండి: బిడ్డ శవం భుజానేసుకుని వెళ్లాను: గంగవ్వ) -
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: అవినాష్
కొద్ది రోజులుగా ఎడమొహం, పెడమొహం అన్నట్లుగా ఉన్న అఖిల్, మోనాల్ కలిసిపోయారు. ఇంటిసభ్యులు వారికి జరిగిన సంఘటనలను చెప్తూ ఎమోషనల్ అయ్యారు. రాత్రి వచ్చేసరికి మాత్రం పాటల అంత్యాక్షరిలో ఎంజాయ్ చేశారు. లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో మెహబూబ్, అఖిల్ పోటీపడ్డారు. మరోవైపు బిగ్‌బాస్ ఆత్మ అవినాష్‌లోకి వచ్చి ఇంటి సభ్యులందరి గురించి చెప్పింది. మరి ఆ ఆత్మ ఏం చెప్పింది? లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో ఎవరు గెలిచారు? అనే విషయాలను చదివేసేయండి.. అమ్మ నా బెస్ట్ ఫ్రెండ్: నోయల్ హౌస్‌లో ఐదో కెప్టెన్‌గా ఎన్నికైన సోహైల్‌కు బిగ్‌బాస్ మొదటిరోజే పరీక్ష పెట్టాడు. నీటి సరఫరా ఆగిపోవడంతో సోహైల్ తన ఇజ్జత్ తీయొద్దని వేడుకున్నాడు. అతని మొర ఆలకించిన బిగ్‌బాస్ వెంటనే నీళ్లను పంపించాడు. తర్వాత మార్నింగ్ మస్తీలో ఇంటిసభ్యులందరూ మనసులో ఉండిపోయిన తమ సందేశాలను తెలియజేయాల్సి ఉంటుందన్నాడు. అందులో భాగంగా నోయల్ తన అమ్మ గురించి చెప్పుకొచ్చాడు. 207 ఎముకలు విరగ్గొడితే ఎంత నొప్పి ఉంటుందో పురిటి నొప్పి అంత తీవ్రంగా ఉంటుందని వివరించాడు. అందుకే తన కాలి నొప్పిని నేను టాస్కులో ఎప్పుడూ లెక్కచేయలేదన్నాడు. తన బెస్ట్ ఫ్రెండ్ అమ్మ అని, తనను తల ఎత్తుకునేలా చేస్తానని సగర్వగా ప్రకటించాడు. దీంతో లాస్యకు జున్ను గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. (చదవండి: అతిథుల టార్చర్.. కుప్పకూలిన అభి) ఇంటి కోసం అప్పు చేశాను: అవినాష్ అవినాష్ మాట్లాడుతూ.. "నేను పేరెంట్స్, ప్రేక్షకులను మాత్రమే నమ్ముతా. లాక్డౌన్లో ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. ఎందుకంటే ఇల్లు కొన్నాను, కానీ ఈఎమ్ఐ కట్టలేకపోయాను. ఎందుకంటే అదే సమయంలో నాన్నకు గుండెపోటు వచ్చింది. మూడు స్టంట్లు వేయడానికి ఇంటి కోసం ఉంచిన 4 లక్షలు ఖర్చు పెట్టాను. అమ్మకు కీళ్లు అరిగిపోతే వైద్యం చేయించాను. దీంతో ఇంటి అప్పు తీర్చేందుకు బయట అప్పు చేశాను. కానీ ఇదంతా నా పేరెంట్స్ కోసమే చేశాను. వాళ్లు పోయినప్పుడు బాధపడకుండా ఉన్నప్పుడే వారికి గౌరవం ఇవ్వండి. ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పెట్టకండి. వాళ్లతో కలిసి ఉండండి అని కోరుతూ ఓ మంచి సందేశాన్ని వినిపించాడు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అవినాష్‌పై మాస్టర్ మండిపడ్డాడు. తాను రూ.6 కోట్ల ఇల్లు కట్టాను, కానీ అమ్మేశాను, కష్టాలు అలా ఉంటాయి అని సముదాయించాడు. బిడ్డ శవం ఎత్తుకుని వెళ్తే బస్సెక్కనియ్యలే తర్వాత గంగవ్వ మాట్లాడుతూ.. "ఐదేళ్లప్పుడే పెళ్లి. 17 ఏళ్లకే కొడుకు. ఇంకో రెండేళ్లకే కూతురు పుట్టింది. తాగి కొట్టే భర్త విదేశాలకు పోయిండు. ఓ రోజు నా కూతురుకు ఫిట్స్ రావడంతో ఆమెను ఎత్తుకుని నడక ప్రారంభించాను. అప్పుడు ఊర్లోకి బస్సు వచ్చేది కాదు. కానీ ఊరి నుంచి వెళ్లే ఓ బండి నన్ను చూసి ఎక్కించుకుంది. అలా జగిత్యాల ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ ఆమె చనిపోయిందని చెప్పగానే బిడ్డను ఎత్తుకుని వెనుదిరిగాను. బస్ ఎక్కబోతే శవంతోని లోపలకు రానీయలేదు. ఆటోలో ఇంటికి వెళ్లాను" అని ఏడ్చేసింది. తర్వాత మళ్లీ అన్నం తినలేకపోతున్నానని గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుంది. (చదవండి: బిగ్ బాస్ : సీక్రెట్ టాస్క్ అవినాష్ కొంప ముంచేనా?) లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో గెలుపొందిన మెహబూబ్ బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో అఖిల్, మెహబూబ్ పోటాపోటీగా ఆడారు. తర్వాత గెలిచిన మెహబూబ్ మోనాల్‌తో మసాజ్ చేయించుకున్నాడు. ఇక అఖిల్ కొద్దిరోజులుగా దూరం పెట్టిన మోనాల్‌తో మాట్లాడి ఆమెను కూల్ చేశాడు. కానీ దేవుడి మీద నమ్మకం ఉంది గానీ నీ మీద లేదని మోనాల్ మొహం మీదే చెప్పేశాడు. బిగ్‌బాస్ ఈసారి ఓ క్రేజీ టాస్క్ ఇచ్చాడు. బిగ్‌బాస్‌ను ప్రసన్నం చేసుకోవాలని, అతని ఆత్మను రప్పించాలని చెప్పాడు. ఆ ఆత్మ అవినాష్ శరీరంలోకి వస్తుందని తెలిపాడు. వెంటనే ఇంటి సభ్యులందరూ బిగ్‌బాస్ ఆవాహయామి అంటూ చేతులు పట్టుకుని వలయాకారంలో అవినాష్ చుట్టూ తిరిగారు. వెంటనే ఉరుములు, మెరుపులతో బిగ్‌బాస్ ఆత్మ అవినాష్ శరీరంలోకి వచ్చింది. అతడు ఇంటి సభ్యులు ఒక్కొక్కరి గురించి వివరంగా చెప్పాడు. (చదవండి: బిగ్‌బాస్: గంగవ్వ భజన చూడలేక..) ఐ లవ్ యూ : దివి నోయల్‌ను కుంటడం మానేయమని, సుజాతను చిన్న చిన్న విషయాలకు అలగడం మానేయాలని చెప్పాడు. మోనాల్ తెలుగులో చక్కగా మాట్లాడుతుందని మెచ్చుకున్నాడు. ఇక గంగవ్వ మాత్రం అవినాష్(బిగ్‌బాస్)కు ఓ కోడిని కోసి పెడతా, ఇంటికి రా అని చెప్పింది. తర్వాత సోహైల్‌ను గట్టిగా మాట్లాడటం తగ్గించండని చెప్పాడు. దివి బిగ్‌బాస్‌కు ఐ లవ్ యూ చెప్పడంతో కాసేపు మెలికలు తిరిగాడు. మెహబూబ్ బాగా ఆడుతున్నాడని, కానీ కోపానికి వస్తున్నారని అన్నాడు. హారిక ముద్దులతో సైగలు ఇవ్వగా అవినాష్‌కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇక హోటల్ టాస్క్‌లో అవినాష్‌ను బాగా టార్చర్ పెట్టావని అరియానాను తిడుతూనే, ముక్కుసూటి మనిషి అని మెచ్చుకున్నాడు. ఈ వయసులో కూడా బాగా ఆడుతున్నాడని మాస్టర్‌పై సెటైర్ వేశాడు. అనంతరం మళ్లీ మెరుపులతో బిగ్‌బాస్ ఆత్మ అవినాష్ నుంచి వెళ్లిపోయింది. మోనాల్‌కు దివి, మాస్టర్ సలహాలు తర్వాత గంగవ్వతో ముచ్చట్లు పెట్టుకుంటుంటే మధ్యలో వచ్చినందుకు అవినాష్‌ను సుజాత ఒక్కటిచ్చింది. రాత్రి ఇంట్లో అంత్యాక్షరి జరిగింది. మాస్టర్, అవినాష్, అరియానా, సోహైల్ పాటలు పాడాడు. ఈ పాటల పోటీ ముగిశాక దివి మోనాల్‌కు కొన్ని సూచనలు చేసింది. మోనాల్‌కు నేనంటే ఇష్టమని ఇద్దరు అబ్బాయిలు(అభిజిత్, అఖిల్) ఫీల్ అవుతున్నారు అని ఆమె చెవిన వేసింది. నేనలా చెప్పలేదని, నా పేరు వాడొద్దని మాత్రమే చెప్పానని మోనాల్ తెలిపింది. అఖిల్‌తో ఉంటే ఏం కాదు కానీ, అభిజిత్‌తో ఉండొద్దని మాస్టర్ ఉచిత సలహా ఇచ్చాడు. ఇద్దరూ జెన్యూన్, నువ్వే వాళ్లకు క్లారిటీ ఇవ్వు అని దివి చెప్పుకొచ్చింది. (చదవండి: నేను పెళ్లి చేసుకోడానికి రాలేదు: అఖిల్) -
బిగ్‌బాస్: గంగవ్వ భజన చూడలేక..
బిగ్‌బాస్ నాల్గవ సీజన్లో కొందరికి ఫేవరెటిజం చూపిస్తూ మిగతావారిపై పక్షపాతం చూపిస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. దీంతో ఈ సీజన్ గతి తప్పుతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇంతకీ కొత్తగా ఈ డౌట్లు రావడానికి ప్రధాన కారణం నిన్నటి ఎపిసోడే. బిగ్‌బాస్ ఇంటి సభ్యులందరికీ కొత్త బట్టలు పంపించి ఫ్యాషన్ షో చేయమన్నాడు. అందులో భాగంగా అబ్బాయిలందరూ ర్యాంప్ వాక్ బాగానే చేశారు. కానీ డ్యాన్సులు చేసుకుంటూ స్టేజీపై ఎక్కువ సమయం గడుపుతూ అతి చేశారు. అమ్మాయిలు కూడా చీరకట్టులో ర్యాంప్ వాక్ చేస్తూ హొయలు పోయారు. చిలిపితనం, హాట్నెస్, అందం, ఇలా ఒక్కొక్కరు ఒక్కోదాన్ని హైలెట్ చేస్తూ వాక్ చేశారు. (చదవండి: అఖిల్, మోనాల్‌ను గంగవ్వ విడదీస్తోందా?) ఆర్థిక ఇబ్బందుల వల్లే ఇలా చేశారా? గంగవ్వ కూడా ర్యాంప్ వాక్ ప్రయత్నించింది. వయసులో తనకంటే చిన్నవారితో పోటీ పడి మరీ స్టేజీపై నడిచింది. కానీ అద్భుతహ అనే రేంజ్లో మాత్రం కాదు. అయినా సరే.. అబ్బాయిలందరూ మిగతా అమ్మాయిలందరినీ కాదని గంగవ్వను ఈ ఫ్యాషన్ షోలో విజేతగా ప్రకటించారు. ఇది చాలామందికి మింగుడు పడటం లేదు. ఇదెక్కడి న్యాయం, అనవసరంగా సింపతితో ప్రతీదానిలో ఆమెనే గెలిపిస్తున్నారని మండిపడుతున్నారు. ఇక అమ్మాయిలు కూడా కాలు బెణికి అవస్థ పడ్డ అవినాష్‌ను విజేతగా ప్రకటించారు. దీన్ని కూడా కొందరు మేల్ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్లే వీరిని విజేతలుగా ప్రకటించి లక్ష రూపాయల బహుమతి అందించారేమోనని సర్ది చెప్పుకుంటున్నారు. #BiggBossTelugu4 @StarMaa Ee #gangavva bhajana maaneyandra nayana 🤦♂️🤦♂️ All are #SafeGame players .. pic.twitter.com/l0aG1KsC3d — BiggBossTelugu4 (@TeluguBiggBoss) October 3, 2020 టాస్కులోనూ పాల్గొనని గంగవ్వ కానీ గంగవ్వను విన్నర్‌గా ప్రకటించడంపై చాలామంది గుసగుసలు పెడుతున్నారు. కాయిన్ల టాస్కులోనూ ఆడకుండా ఓ పక్కన కూర్చుందని, ఫ్యాషన్ షోలో కూడా పెద్దగా ఆకట్టుకోలేదని విమర్శిస్తున్నారు. ఇలా ఏమీ చేయని కంటెస్టెంటుకు అన్నీ ఇచ్చేసుకుంటూ వెళ్తూ ఆఖరికి కప్పు కూడా ఇచ్చి పంపించేయండి అని గరమవుతున్నారు. నిజానికి తన మాటలతో, ముచ్చట్లతో గంగవ్వ అందరినీ అలరిస్తుంది. కానీ టాస్కుల విషయానికి వచ్చేసరికి మాత్రం కొన్నిసార్లు బిగ్‌బాస్ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ శిలా విగ్రహంలా కూర్చుండిపోతోంది. అయినా సరే ప్రతిదానికి గంగవ్వే బెస్ట్ అని భజన చేయడం చూడలేకపోతున్నామని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. సోషల్ మీడియాలో గంగవ్వ గురించి, ఆమెను విజేతగా ప్రకటించిన హౌస్మేట్స్ గురించి నెటిజన్లు ఏమంటున్నారో చూసేయండి (చదవండి: బిగ్‌బాస్: లక్ష రూపాయలు పట్టేసిన గంగవ్వ) Next time nundi BB prathi task ki oka announcement ivali anukunta, #gangavva kakunda vere names cheppandi ani. Honestly, Avva ki respect isthunatu ledu, sympathy laaga undhi. Avva ki sympathy avasaram ledu. #Nagarjuna garu pls niladhisify I say! #BiggBossTelugu4 @StarMaa — BB4 telugu follower | Shaheer admirer (@alekya_musing) October 2, 2020 @iamnagarjuna garu must ask: How many of you came to become winner? Hope many of you came to make #Gangavva Winner! Gelipinchadiniki vachara Lena Gelavadaniki vachara??? @StarMaa #BiggBossTelugu4 pic.twitter.com/GyG9A4d7Hm — PROUD INDIAN 🇮🇳 (@IamRahool) October 2, 2020 Fashion show voucher tho paatu cup kooda icheyandi #gangavva ki ..ee show lo amey contribution ento meekey telavali.gangavva ni anavasaram ga highlight chesthunnaru meeru inka mee contestants..audience maatram bore avthunnaru.#BiggBossTelugu4 — archie (@ArchiesK) October 2, 2020 In My opinion, best performers in ramp walk 1.#Noel / #Akhil in male 2. #harika / #sujatha in female I can undeestand #gangavva nd #avinash are havin finance issues. So every1 chosen them. If thats nt the reason then selection is worsthttps://t.co/WwEtSz72K2#BiggBossTelugu4 — Vamsi Krishna (@vamsidasarik) October 2, 2020 Em cheyyani ee #gangavva ki deniki ichedi...Ee sympathy game lu aapandi ra nayana😬#BiggBoss4Telugu #BiggBossTelugu — Pramoda Paruchuri (@iampramoda) October 2, 2020 Contestants Rewards: Best Writer -Gangavva Best Lyrics -Gangavva Best Singer -Gangavva Best Dancer -Gangavva Best Music Director -Gangavva Best Fight Master -Gangavva Best Actor/Actress -Gangavva Best Director -Gangavva Best FOOLS - Audience #BiggBossTelugu4 #gangavva — SatwikMathangi (@seven_week) October 2, 2020 #ChandanaBrothers fashion show lo ye basis meeda select chesaaru #Gangavva #Avinash ni🙄 Evaru professionals laga cheyadaniki try Kuda cheyaledu👎kaastho kustho #AkhilSarthak #MonalGajjar baaga chesaaru. #BiggBossTelugu4 #BiggBoss4Telugu — Princess Usha🌞 (@PrincesUshaOffl) October 2, 2020 Oka pani cheyyandra.... Trophy kuda #gangavva ke icheyandi....🤦🏻 Captaincy icharu..... Fashion show lo prize icharu.... Trophy okkate migilipoindi....#BiggBossTelugu4 @StarMaa pic.twitter.com/10DO7PFhKp — Vamc Krishna (@vamccrishnaa) October 2, 2020 -
బిగ్‌బాస్: లక్ష రూపాయలు పట్టేసిన గంగవ్వ
ఐపీఎల్, కరోనాను ఎదుర్కొని ప్రేక్షకులకు బిగ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు బిగ్‌బాస్ సీజన్ 4 తమ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. టాస్క్‌లు, ట్విస్టులు, నామినేషన్లు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో భారీ స్థాయిలో వినోదాన్ని పంచుతోంది. ఇక బిగ్‌బాస్ ఇంటి హౌజ్‌లో 26వ రోజు సందడి సందడిగా సాగింది. ఉదయాన్నే హుషారైన పాటకు అందరూ ఎనర్జిటిక్‌గా డ్యాన్స్‌లు చేశారు. మార్నింగ్ మస్తీలో భాగంగా ఇంటి సభ్యులందరికి మెహబూబ్ డ్యాన్స్ స్టెప్పులు నేర్పిస్తున్నాడు. ఇంటి సభ్యుల్లో కొంతమందికి మాత్రమే లగ్జరీ బడ్జెట్ లభించింది. ష్యాషన్ షోలో ర్యాంప్ వాక్‌లతో అలరించారు. ఇంకేం జరిగిందంటే.. చపాతి స్టెప్ చేసిన మెహబూబ్ లాస్య ఎక్కువగా కిచెన్ వర్క్ చేస్తుంటుంది. కిచెన్‌లో ఆమె చేసే చపాతిని డ్యాన్స్ రూపంలో చేసి చూపించాడు మెహబూబ్. అవినాష్ కాలుకు దెబ్బ తగలడంతో కాలు కదలకుండా, అఖిల్ లాగా వర్కౌట్స్ ఎలా చేయాలో డ్యాన్స్ చేయాలో చేసి చూపించాడు. వీటితోపాటు ఇంట్లో కోపిష్టిగా పేరు తెచ్చుకున్న సోహైల్ ఆగ్రహంతో ఏ విధంగా డ్యాన్స్‌లు చేయాలో చూపించాడు. మాస్టర్‌తో కలిసి కాంచనలా మారి స్టెప్పులు వేశాడు. గంగవ్వ, స్వాతి, కుమార్ సాయి.. ఇలా ఇంట్లోని వారందరితోనూ ఏదో ఒక విధంగా డ్యాన్స్ చేపించాడు. అవినాష్ తనలోని మిమిక్రీ టాలెంట్‌ను ప్రదర్శించాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు సినిమాలోని విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ వాయిస్‌ను మిమిక్రీ చేసి చూపించాడు. చదవండి : అఖిల్‌కు బిగ్‌బాస్ ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటి? కన్ఫెషన్ రూమ్‌లోకి అఖిల్ ఇంటి సభ్యులంతా హాల్లో కూర్చొని ఉండగా అఖిల్‌ను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిపించాడు. ఆ రూమ్‌లోకి వెళ్లిన అఖిల్ మిగతా ఇంటి సభ్యులకు కనిపించనున్నాడు. ఈ వారం రేషన్ మేనేజర్‌గా అఖిల్ ఎన్నికైనందున అతనికి లగ్జరీ బడ్జెట్ షాపింగ్ చేయాలి. లగ్జరీ బడ్జెట్ సామాన్ల లిస్ట్‌ను అందించి, తమ దగ్గర ఉన్న 3200 పాయింట్లో ఒక్కొక్కరికి ఒక్కో వస్తువు చొప్పున16 ఎంపిక చేయాలి. లాస్యకు చికెన్ పచ్చడి, నోయల్‌కు బ్రెడ్, నూడుల్స్ సోహైల్, పోహ మెహబూబ్, పన్నీర్ మోనాల్, మాస్టర్‌కు శనగపిండి, కార్నఫ్లెక్స్ గంగవ్వకు కేటాయించాడు. కన్ఫేషన్ రూమ్ నుంచి బయటకు వచ్చాక తమకు ఏ వస్తువులు రాని ఇంటి సభ్యులు కొంత నిరాశ చెందాడు. అఖిల్ వేరే విధంగా ప్లాన్ చేసి ఉంటే బాగుండని అనుకున్నారు. చదవండి : బిగ్‌బాస్: అదిరేటి డ్రెస్ మేమేస్తే.. పిచ్చెక్కించిన ఫ్యాషన్ షో ఇంట్లోని సభ్యులందరికి కొత్త బట్టలు వచ్చాయి. చందన బ్రదర్స్ పంపించిన దుస్తులను ధరించి అందంగా తయారు అవ్వాలి. అనంతరం చందన బ్రదర్స్ ఫ్యాషన్ టాస్క్ చేయాలి. ఈ టాస్క్‌లో ర్యాంప్ వాక్ చేయాలి. ఇందులో మంచిగా చేసిన ఒక అబ్బాయి, అమ్మాయిని విజేతగా ప్రకటించి వారికి లక్ష రూపాయల గిఫ్ట్ వోచర్‌ను అందించాలి. ర్యాంప్ వాక్‌లో అబ్బాయిలందరూ ఒక్కొక్కరూ వచ్చి తమదైన స్టైల్లో వాక్ చేశారు. ఆ తర్వాత అమ్మాయిలందరూ అందంగా ర్యాంప్ వాక్ చేసి అబ్బాయిల గుండెల్లో మంటలు రేపారు. కుందనపు బొమ్మలా కనిపించారు. అమ్మాయిల నుంచి గంగవ్వను ఏకగ్రీవంగా విజేతగా ప్రకటించగా..అవ్వకు లక్ష రూపాయల గిఫ్ట్ వోచర్ అందించారు. అబ్బాయిల నుంచి అవినాష్‌ను విజేతగా తెలిపారు. బిగ్‌బాస్: అదిరేటి డ్రెస్ మేమేస్తే.. అద్దంలా మారిన అవినాష్ ఇంట్లోని అమ్మాయిలకు అందంగా తయారు అవ్వడం మహా ఇష్టం. ఈ క్రమంలో అవినాష్ అమ్మాయిలకు అద్దంగా వ్యవహరించనున్నాడు. ప్రతి అమ్మాయి అద్దం(అవినాష్) ముందుకు వచ్చి తమ మనసులోని ఫీలింగ్స్‌ను చెప్పుకోవాలి. ఇందులో అవినాష్ తన దగ్గరకు వచ్చిన వారిలో ఒక్కొక్కరిని ఒక్కో విధంగా ఆటాడుకున్నాడు. వాళ్లపై పంచ్‌లు వేస్తూ వారిని సరదాగా అలరించాడు. చివరగా ర్యాంప్ వాక్ షో లో ఎవరూ ఎలా చేశారో ఇమిటెట్ చేసి చూపించారు. అయితే సుజాత బుంగమూతి పెట్టుకుని అలిగింది. ఈ నెపంతో లాస్య, సుజాతకు మధ్య చిన్నగా వివాదం మొదలైంది. విన్నర్‌గా ముందు నోయల్‌ను చెప్పి ఆ తరువాత అవినాష్‌ను ప్రకటించినదని లాస్య సుజాత మధ్య గొడవ అయ్యింది. తర్వాత అవినాష్ సుజాతను కూల్ చేశాడు. అంతేగాక తనకు నచ్చినట్లు ఆడి బిగ్‌బాస్‌లో ఉండాలని, ఇతరులను బతిమాలడం మానేయాలని అరియానా అవినాష్‌లో స్పూర్తిని నింపింది. -
బిగ్‌బాస్: సోహైల్‌ను టార్గెట్ చేసిన కంటెస్టెంట్లు
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో కాయిన్ల టాస్క్ మరింత ముదురుతోంది. నిన్నటి వరకు తాము కూడగట్టుకున్న కాయిన్లను పదిలంగా దాచుకోడానికి ప్రయత్నించిన ఇంటి సభ్యులు ఇకపై ఇతరులు సంపాదించిన కాయిన్లను దొంగింలించేందుకు కాచుకు కూర్చున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్‌బాస్ కూడా మిగతా వారి నుంచి కాయిన్లు రాబట్టుకునేందుకు ఒకే చెప్పడంతో కంటెస్టెంట్లు రెచ్చిపోయారు. సామ, దాన, భేద, దండోపాయాలతో తమ వద్ద ఉన్న కాయిన్ల విలువలను పెంచుకునేందుకు నడుం బిగించారు. చివరి బజర్ మోగే వరకు ఎవరి వద్ద ఎక్కవ కాయిన్లు ఉంటే వారే ఈ టాస్క్ విజేతలుగా మారనున్నారు. దీంతో ఇప్పుడు కదా గేమ్‌లో అసలైన మజా రాబోతుందని జనాలు అభిప్రాయపడుతున్నారు, (బిగ్‌బాస్: కాసుల వేటలో గెలుపెవరిది!) ఇక ఎవరి నుంచి కాయిన్లు దొంగిలించాలో ఓ ప్లాన్ వేసుకున్న కంటెస్టెంట్లు పథకం ప్రకారం లాక్కోనున్నారు. ఇప్పటి వరకు ఎక్కువ సంఖ్యలో కాయిన్స్ సాధించిన సోహైల్, మెహబూబ్‌నే మిగతా వారందరూ టార్గెట్ చేసేలా కన్పిస్తున్నారు. అలాగే ఈ గేమ్‌లో అవినాష్‌ను పాయింట్స్ పట్టుకోమని తనకు సాయం చేస్తానని అరియానా పేర్కొంది. మాస్టర్ పాయింట్లు మాస్టర్‌కు ఇచ్చేద్ధాం అని సోహైల్ చెప్పగా ఇందుకు అఖిల్ వద్దు అని తెగేసి చెప్పేశాడు. కానీ మాస్టర్ మాత్రం తన వద్ద లాక్కున్న కాయిన్లకు తనకు ఇచ్చేమని కోరాడు. మరి ఇన్ని ఆలోచనలు చేస్తన్న ఇంటి సభ్యుల్లో చివరికి ఎవరి వద్ద అత్యధికంగా కాయిన్లు ఉంటాయో చెప్పడం ఊహించలేం. అది తెలుసుకోవాలంటే ఆ రోజు రాత్రి బిగ్‌బాస్ వచ్చేంత వరకు ఆగాల్సిందే. (కథ వేరే ఉంటది: మాస్టర్‌కు సోహైల్ వార్నింగ్) Task lo asala fun ipudu untundi...Evari Coins teskuntaru..Evaru return istaru??#BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/2XGvUPj8Ei — starmaa (@StarMaa) October 1, 2020 -
అఖిల్, మోనాల్‌ను గంగవ్వ విడదీస్తోందా?
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి నివాళులిస్తూ బిగ్‌బాస్ షో ప్రారంభమైంది. కానీ కంటెస్టెంట్లకు మాత్రం ఆయన మరణవార్తను తెలియజేయకపోవడం గమనార్హం. ఇక రోజురోజుకీ ఆటలో మరింత రాటు దేలుతున్న గంగవ్వకు అఖిల్ అంటే ఇష్టం. మోనాల్ అంటే కష్టం. దీంతో నేటి ఎపిసోడ్లో వారిద్దరినీ వేరు చేసేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. ఇదిలా వుంటే కింగ్ నాగార్జున ఇద్దరు అమ్మాయిలు సేఫ్ అయినట్లు వెల్లడించారు. వారెవరో, నేటి ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చదివేయండి.. అఖిల్ దత్తపుత్రుడిగా తీసుకువెళ్తా: గంగవ్వ గంగవ్వ ఈ మధ్య మరీ హుషారుగా కనిపిస్తోంది. అంతేకాదు, మోనాల్‌ను కూడా ఏడిపించేసింది. నీతో మాట్లాడకని అఖిల్‌కు నేనే చెప్పానని అవ్వ అనడంతో నిజమని నమ్మిన మోనాల్ కంటతడి పెట్టుకుంది. దీంతో ఊరికే అన్నానని బుజ్జగించింది. ఇక తనకు ఎంతో ఇష్టమైన అఖిల్‌ను దత్తపుత్రుడిగా స్వీకరిస్తానని చెప్పుకొచ్చింది. మరి అతడికి భార్యగా ఆమె వద్దా అని లాస్య.. మోనాల్ వైపు వేలు పెట్టి చూపిస్తే ఛీ, ఇక్కడున్నవాళ్లు వద్దు అని తేల్చి చెప్పింది. అలాగే నాగ్ ముందు కూడా మోనాల్‌కు గట్టిగానే కౌంటర్లు ఇచ్చింది. అమ్మాయిలు అమ్మాయిలతో, అబ్బాయిలు అబ్బాయిలతో ఉండాలని తేల్చి చెప్పింది. చూస్తుంటే తన అఖిల్.. మోనాల్‌తో ఉండటం అవ్వకు ఏమాత్రం ఇష్టం లేనట్లు కనిపిస్తోంది. మరోవైపు అరియానాలో రోజురోజుకీ గెలవాలన్న కసి పెరిగిపోతోంది. ఈ సీజన్లో అమ్మాయే గెలవాలని బలంగా కోరుకుంటోంది. ఒకవేళ తాను వెళ్లిపోతే, తన బాధ్యతను స్వీకరించాల్సిందిగా దేవి నాగవల్లి దగ్గర మాట తీసుకుంది. (చదవండి: బిగ్‌బాస్: విశ్వరూపం చూపించిన గంగవ్వ) ఏ అక్షరం మైండ్లోనూ ఉంది: మోనాల్ నామినేషన్లో ఉన్న ఏడుగురితోనే నాగ్ గేమ్స్ ఆడించారు. అందులో భాగంగా నాగ్ అడిగిన ప్రశ్నలకు నామినేట్ అయిన కంటెస్టెంట్లు ఇలా సమాధానమిచ్చారు. ఇంట్లో కుమార్ సాయి తనకు పోటీయే కాదని హారిక తెలిపింది. ఇంట్లో నారదుడు సోహైల్ అని మోనాల్ తెలిపింది. ఆమెతో నాగ్ మాట్లాడుతూ నీ మనసులో ఏ అక్షరం ఉందని నాగ్ చెప్పడంతో, మైండ్‌లో కూడా ఉన్నారని నవ్వేసింది. బిగ్‌బాస్ హౌస్‌లో మోనాల్ ఉత్తమ అబద్ధాల కోరు అని లాస్య ప్రకటించింది. మరోవైపు కిడ్నాప్ ప్లాన్ అభిజిత్‌దే అని లాస్య చెప్తుంటే కాదు తాను చెప్పానని గంగవ్వ అడ్డు పడింది. ఇక ఎలిమినేట్ అయిన వారిని కుమార్ సాయి స్థానంలోకి తీసుకురావచ్చని దేవి నాగవల్లి పేర్కొంది. ఎందుకంటే అతడిలో ఇంకా క్లారిటీ లేదని స్పష్టం చేసింది. (చదవండి: బిగ్‌బాస్: గంగవ్వకు అతడిష్టం, ఆమె కష్టం) ఒకరంటే మరొకరికి మహా చిరాకు సోహైల్ ఇంట్లో తనకు బాగా చిరాకు తెప్పించే వ్యక్తి అని అరియానా చెప్పగా, తనకు కూడా చిరాకు తెప్పించే వ్యక్తి అరియానా అని సోహైల్ పేర్కొన్నాడు. కుమార్ సాయికి అసలు ఇంట్లో ఉండేందుకు అర్హత లేదని మెహబూబ్ చెప్పుకొచ్చాడు. అవకాశం వచ్చినప్పుడు కూడా ఉపయోగించుకోవడం లేదని తెలిపాడు. సోహైల్, తాను కర్ణార్జునలా కనెక్ట్ అయ్యామని మెహబూబ్ తన స్నేహాన్ని చాటుకున్నాడు. ఈ ఇంట్లో అత్యంత నకిలీ వ్యక్తి అభి అని కుమార్ సాయి అభిప్రాయపడ్డాడు. టాస్క్‌లో నోటికొచ్చినట్లు తిడుతున్నాడని బాధపడ్డాడు. "24 ఏళ్ల అఖిల్.. పెద్ద చదువులు చదివిన నన్ను ఒరేయ్ అంటాడా? అని అభిజిత్ పంచాయతీ చేశాడు. కానీ అతను కోరుకున్న గౌరవం వేరేవాళ్లకు(నాకు) కూడా ఇవ్వాలి కదా అని బాధపడ్డాను. ఈ విషయంలో అతను సారీ చెప్పకపోతే ఎలిమినేట్ అయ్యేంతవరకు అతడినే నామినేట్ చేస్తాను" అని కుమార్ చెప్పడంతో అభి మరో ఆలోచన చేయకుండా క్షమాపణ కోరడం విశేషం. ఓటమి నుంచి బయటపడని మనుషుల టీమ్ కానీ ఆ వెంటనే అఖిల్ తానెప్పుడూ అరేయ్ అని అనలేదని గరమవడంతో, ఇప్పటికే దీని గురించి మాట్లాడుకున్నామని అభి క్లారిటీ ఇచ్చాడు. ఇక గత టాస్క్‌లో ఓడిపోయిన మనుషుల టీమ్ ఓటమి నుంచి బయటపడినట్లు కనిపించడం లేదు. ఓటమి చెందిన మనసు మంచిది అని సంకేతాలు ఇస్తూ ర్యాప్ సాంగ్ పాడారు. ఇంటి సభ్యులందరూ రోబోల టీమ్‌లో మహా నాయకుడుగా గంగవ్వ పేరు చెప్తే నాగ్ మాత్రం యుద్ధం చేశాడంటూ అభిజిత్ పేరు చెప్పారు. అవినాష్‌కు మహా కంత్రి అవార్డు బహుకరించారు. గంగవ్వకు మహా నటి అవార్డు బహుకరించారు. ఆమె ట్రాప్ చేసేందుకు ప్రయత్నించిన క్లిప్పింగ్‌ను చూపించారు. అది చూసి మనుషుల టీమ్ షాక్‌కు లోనయ్యారు. అటు అవ్వ కూడా ఇదంతా టీవీలో వచ్చిందా అని ఖంగు తింది. తర్వాత లాస్య సేఫ్ అయినట్లు ప్రకటించారు. (చదవండి: అభిజిత్‌లో ధోనీని చూశా: యాంకర్ రవి) ఇంటి సభ్యుల్లో మీకు నచ్చనిది ఇంటి సభ్యులు ఒక్కొక్కరుగా ఒక్కో కంటెస్టెంటులో నచ్చని గుణం ఏంటో చెప్పుకొచ్చారు. అఖిల్ చిన్న చిన్న విషయాలకే కోపానికొస్తాడని మోనాల్ బుంగమూతి పెట్టుకుంది. మరి తనను ఒక్కోసారి అభి అని పిలుస్తుందని అఖిల్ చిన్నబుచ్చుకున్నాడు. కుళ్లు జోకులేస్తున్నాడని నోయల్ మాస్టర్‌పై ఫిర్యాదు చేశాడు. కానీ ఆయన చిన్నపిల్లాడని అంతలోనే వెనకేసుకొచ్చాడు. అభి కనిపించేంత అమాయకుడు కాదని దివి పేర్కొంది. గంగవ్వ ఇష్టపడే వాళ్లు తప్పు చేసినా వారినే సపోర్ట్ చేస్తుందని దేవి అభిప్రాయపడింది. ఇంట్లో ఏమైపోతుందా అని లాస్య ఊరికే కంగారు పడిపోతుందని అవినాష్ చెప్పుకొచ్చాడు. స్వాతి దీక్షిత్ ప్రిపేర్ అయి వచ్చింది అభి అందరితో కలవట్లేదని సుజాత చెప్పింది. ఏ, నీకు చెల్లె అనడం నచ్చలేదా అని నాగ్ నిలదీయడంతో నీళ్లు నమిలిన సుజాత.. లేదు, ఛీ అనడం మాత్రమే నచ్చలేదని స్పష్టం చేసింది.. బ్రష్ చేసుకోకుండానే టీ, కాఫీలు తాగుతుందని అవ్వ హారిక ఇజ్జత్ తీసింది. దివికి దేనికి ఏడవాలో, దేనికి నవ్వాలో తెలీదని మాస్టర్ చెప్పుకొచ్చాడు. స్వాతి ఎవరితో క్లోజ్‌గా ఉండాలో ముందే ప్లాన్ చేసుకుని వచ్చిందని లాస్య పేర్కొంది. అనంతరం మోనాల్ సేఫ్ అయినట్లు ప్రకటించారు. -
నేను పెళ్లి చేసుకోడానికి రాలేదు: అఖిల్
బిగ్‌బాస్ నాల్గవ సీజన్లో వారానికో వైల్డ్ కార్డ్ ఎంట్రీ నడుస్తోంది. మొదటి వారం కమెడియన్, నటుడు కుమార్ సాయి హౌస్‌లో అడుగు పెట్టగా రెండో వారం అవినాష్ ఇంట్లోకి వచ్చి చేరాడు. ఇప్పుడు ముచ్చటగా మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హీరోయిన్ స్వాతి దీక్షిత్ హౌస్‌లో ప్రవేశించింది. వస్తూ వస్తూనే అబ్బాయిలకు ఓ సర్ప్రైజ్ తీసుకొచ్చానంది. అదేంటో, అసలు నేటి ఎపిసోడ్ ఎలా సాగిందో ఓ లుక్కేసేయండి.. ప్రతిజ్ఞ నుంచి తప్పించుకున్న అభి, అఖిల్ 'నాది నెక్కిలిసు గొలుసు..' అంటూ దుర్గారావు మాస్ సాంగ్ ఇంటి సభ్యులందరినీ ఓ ఊపు ఊపేసింది. తర్వాత బిగ్‌బాస్ కంటెస్టెంట్ట్స్ ఆలర్ ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అబ్బాయిలందరూ ప్రతిజ్క్ష చేశారు. ఇందులో అభిజిత్, అఖిల్ మాత్రం ఈ ప్రతిజ్ఞ నుంచి తప్పించుకున్నారు. బిగ్‌బాస్ నోయల్‌ను చెరసాల నుంచి విడుదల చేశాడు. దీంతో ఇంటి సభ్యులు పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ నోయల్‌కు ఇంట్లోకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అఖిల్ అంటే ఇష్టమని, మోనాల్ నచ్చదని గంగవ్వ చెప్పుకొచ్చింది. గత టాస్క్‌లో ఎవరు ఎట్లా చేశారనేది అవ్వ చేసి చూపించడంతో.. అవ్వ కూడా యాక్టింగ్ మొదలెట్టిందిరోనని మాస్టర్ పంచ్ వేశాడు. (చదవండి: అభిజిత్ టాప్ 3లో ఉంటాడు: యాంకర్ రవి) కెప్టెన్సీ పోటీదారులకు రంగు పడింది బిగ్‌బాస్ రంగు పడుద్ది జాగ్రత్త అని కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. టాస్క్ అయిపోయే సమయానికి ఎవరి బౌల్లో ఎక్కువ రంగు ఉంటుందో వాళ్లే గెలిచినట్లు. ఇంటి సభ్యులందరూ పగపట్టినట్లు అభిజిత్, అవినాష్, హారిక పాత్రలోని నీళ్లను మొత్తం కింద పడేశారు. కానీ ఏ ఒక్కరూ గంగవ్వను కనీసం టచ్ కూడా చేయకపోవడంతో ఆమె కెప్టెన్ అయింది. తర్వాత అందరూ కాసేపు స్విమ్మింగ్‌పూల్‌లో జలకాలాడారు. అఖిల్, మోనాల్ మాట్లాడుకోవడట్లేరని అవ్వ గుసగుసలు పెట్టింది. హౌస్‌మేట్స్‌పై బిగ్‌బాస్ గరం నిజంగానే తర్వాత మోనాల్.. అఖిల్‌కు సారీ చెప్పింది. నేనేం పెళ్లి చేసుకోవడానికి రాలేదని అఖిల్ అనడంతో అతడిని కూల్ చేసేందుకు రాత్రికి గోరుముద్దలు తినిపించింది. ఇక తన ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని బిగ్‌బాస్ ఇంటి సభ్యులపై సీరియస్ అయ్యాడు. లగ్జరీ బడ్జెట్ పాయింట్లు తొలగించడంతో పాటు రేషన్‌లోనూ కోత విధించాడు. దీంతో దేవి మినహా మిగతా కంటెస్టెంట్లు అందరూ చేతులెత్తి నమస్కరిస్తూ బిగ్‌బాస్‌కు సారీ చెప్పారు. (చదవండి: బిగ్‌బాస్: ఇద్దరి మధ్య నలుగుతున్న మోనాల్) కమెడియన్లకూ మనసుంటుంది: అవినాష్ బుట్టబొమ్మ సాంగ్‌తో స్వాతి దీక్షిత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే ఆమెను అభిజిత్ లోనికి తీసుకువెళ్తే, మాస్టర్ మాస్క్ తీశాడు. ఇక అవినాష్, మాస్టర్ ఆమెకు సకల మర్యాదలు చేశారు. ఆ తర్వాత బిగ్‌బాస్ అసలు ట్విస్ట్ ఇచ్చాడు. స్వాతి అబ్బాయిలకు సర్ప్రైజ్ తీసుకొచ్చిందని అది చెప్పాలంటే వారంతా ఆమెను మెప్పించాల్సి ఉంటుందని తెలిపాడు. "అందం ఎలా ఉంటుందో నిన్ను చూశాకే తెలిసింది.. చిన్నప్పుడు ఆడుకునే బొమ్మ ప్రాణంతో ఉంటుందని ఇప్పుడే చూస్తున్నాను" అంటూ మాస్టర్ కవిత్వం చెప్పాడు. "నువ్వు నవ్వితే బాగుంటావు, నేను నీ తోడుంటే జీవితాంతం నవ్వుతూనే ఉంటావు. బుట్టబొమ్మ కాదు.. బాపు గీసిన బొమ్మవు. నీ పేరు స్వాతి దీక్షిత్.. నీ కోసం ఎన్ని దీక్షలైనా చేయొచ్చు. సాధారణంగా హీరోయిన్లు హీరోలకు పడిపోతారు. కానీ కమెడియన్లకు పడిపోరు. మాకు మనసుంటుంది" అని అవినాష్ ప్రేమ కావ్యాలు పలికాడు. అఖిల్, మాస్టర్. నోయల్, అవినాష్‌తో స్వాతి పార్టీ మెహబూబ్ 100 పుషప్స్ చేశాడు. అందరి ప్రేమను మీపై చూపిస్తానని సోహైల్ మాటిచ్చాడు. అఖిల్, అభిజిత్, నోయల్ పాట పాడగా కుమార్ సాయి డ్యాన్స్ చేశాడు. అనంతరం స్వాతి. అయితే వీరందరిలో తనను మెప్పించిన అఖిల్, మాస్టర్, నోయల్, అవినాష్‌కు ఎర్ర గులాబీలు ఇచ్చింది. ఆ తర్వాత సర్ప్రైజ్ రివీల్ చేశారు. ఈ నలుగురితో కలిసి స్వాతి ఓ ప్రత్యేక గదిని ఓపెన్ చేసి గ్రాండ్ పార్టీ చేసుకున్నారు. మిగతా ఇంటి సభ్యులు పార్టీ మిస్సయ్యామని చాలా ఫీలయ్యారు. (చదవండి: నోయల్‌కు రోజంతా రాగి జావ మాత్రమే) -
బిగ్‌బాస్: జైలు నుంచి నోయల్ విడుదల
బిగ్‌బాస్ నాల్గవ సీజన్ ఇప్పుడిప్పుడే ఇంట్రస్టింగుగా మారిందనుకుంటున్న సమయంలో బిగ్‌బాస్ ఆ పేరును చెగడొట్టేలా ఉన్నాడు. కెప్టెన్సీ టాస్క్ కోసం కొత్తగా ఆలోచించకుండా మూస పద్ధతిలో వెళ్లాడు. రెండు, మూడో సీజన్లలో ఇచ్చిన "రంగు పడుద్ది" టాస్క్‌నే కొంచెం కూడా మార్చకుండా మళ్లీ దింపేశాడు. ఇక ఈ పోటీలో గంగవ్వ, అభిజిత్, హారిక, అవినాస్ పాల్గొంటున్నారు. వాళ్లకు రంగు నీళ్లను నింపిన పాత్రలను ఇచ్చారు. అవి కిందపడగొట్టేందుకు మిగతా ఇంటి సభ్యులు నానా ప్రయత్నాలు చేస్తూ వారిని కంగారు పెట్టేస్తున్నారు. (చదవండి: చెరసాలలో చెత్తగా ఆడిన నోయల్!) ఈ క్రమంలో అభి, అవినాష్ గిన్నెలలోని రంగు కిందపడిపోయింది. కానీ ఎవరెన్ని కోతి వేషాలు వేసినా అవ్వ మాత్రం గిన్నె తొణకకుండా పట్టుకోవడం విశేషం. దీంతో గంగవ్వే నెంబర్ 1, ఈసారి అవ్వే కెప్టెన్ అవుతుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. మరికొందరు మాత్రం కెప్టెన్సీ పోటీకి హారికకు బదులు అరియానాను పంపించాల్సిందని అభిప్రాయపడుతున్నరు. హారిక కూర్చున్న చోటే సవాలు చేసింది తప్పితే ఎక్కడా పెద్దగా ఆడలేదని, కానీ అరియానా ఎవరి మాటను ఖాతరు చేయకుండా ఓడినా సరే ప్రయత్నించాలటూ పట్టుదలను చూపించిందని పొగుడుతున్నారు. (చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో తలనొప్పిగా మారుతోన్న గంగవ్వ!) మరో ప్రోమోలో అవ్వ ఇంటి సభ్యులు ఎలా ప్రవర్తించారో అనుకరించి చూపించడంతో పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఈ రోజు కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిందన్న ఆనందమో ఏమో కానీ కంటెస్టెంట్లు అందరూ తెగ హుషారుగా ఉన్నారు. ఈరోజు హౌస్‌లో అందరికీ దుర్గారావు పూనారు. ఆయనెవరు అనకండి. నాదీ నెక్కిలీసు గొలుసు పాట తెలుసు కదా! వీర లెవల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చిన అతడిని ఇంటి సభ్యులు మించిపోయేలా డ్యాన్స్ చేశారు. ర్యాంప్ వాక్ చేస్తూ హొయలు పోయారు. మరో విషయమేంటంటే.. ఆల్ బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటూ అబ్బాయిలందరూ ప్రతిజ్ఞ చేశారు. కానీ అందులో అఖిల్ మాత్రం కనిపించలేదు. నేటి ఎపిసోడ్లో నోయల్ జైలు శిక్ష పూర్తి చేసుకుని చెరసాల నుంచి బయట పడినట్లు కనిపిస్తోంది. (చదవండి: బిగ్‌బాస్: రెండో వారం టీఆర్పీ పరిస్థితి ఇదీ!) -
గంగవ్వ వల్ల ఆట దెబ్బతింటోందా?
"బిగ్‌బాస్ హౌస్‌లో అందరూ సమానమే". గత మూడు సీజన్ల నుంచి వస్తున్న ఈ నియమాన్ని ఈ సీజన్లో గాలికొదిలేసినట్లు కనిపిస్తోంది. అరవయ్యేళ్ల వయసున్న గంగవ్వ బిగ్‌బాస్ ఇంట్లోకి అడుగు పెట్టడం విశేషమే. ఆమె వయసును గౌరవించి తీరాల్సిందే. ఆమెపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిందే. కానీ ఫిజికల్ టాస్కులో అదే ఆటకు అడ్డుపడుతోంది. నిన్నటి ఉక్కు హృదయం టాస్క్‌లో బిగ్‌బాస్ ఇంటి సభ్యులను మనుషులు, రోబోలుగా విడగొట్టారు. గంగవ్వ రోబోల టీమ్‌లో ఉంది. ఆమె ఉన్నందుకు మనుషుల టీమ్ అడుగు ముందుకు వేయడానికి కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించారు. దీంతో గంగవ్వ వల్ల ఇతర కంటెస్టెంట్ల ఆటతీరు దెబ్బ తింటోందన్న వాదనలు వినిపిస్తున్నాయి అవ్వను బాగానే వాడుకున్న రోబోలు మరోవైపు 'అవ్వ ఉంది, జాగ్రత్త' అంటూ రోబోలు ఆమెను అడ్డుపెట్టుకుని బాగానే ఆడారు. కిడ్నాప్ ప్లాన్‌కు కూడా ఆమెను వాడుకున్నారు. ఈ క్రమంలో గంగవ్వ అమ్మాయిలను ట్రాప్ చేసేందుకు ప్రయత్నించింది. ఇక్కడేదో తిరకాసు ఉందని అనుమానించిన మనుషులు వారి కోపాన్ని అణుచుకుని మరీ అవ్వతో బుజ్జగింపుగా మాట్లాడారు. కానీ తెలిసిందే కదా, ఆమె ఎవరి మాటా పట్టించుకోదు. ఆ తర్వాత దివిని కిడ్నాప్ చేయడం, ఆవేశంతో మనుషులు రెచ్చిపోవడం రెండూ జరిగాయి. దీంతో మనుషులపై గరం అయిన అవ్వ కనీసం వారు ఏం చెప్తున్నారో కూడా వినే ప్రయత్నం చేయలేదు. (చదవండి: భీభత్సంగా వర్కవుట్ అయిన కిడ్నాప్ ప్లాన్) మోనాల్‌పై చేయి చేసుకున్న అవ్వ! ఇక నేడు రిలీజ్ చేసిన ప్రోమోలోనూ అవ్వ మోనాల్‌పై చేయి చేసుకున్నట్లు అస్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి అదే స్థానంలో వేరే ఎవరు ఉన్నా అక్కడ పరిస్థితి ఇంకోలా మారిపోయేదే. కానీ అవ్వను ఎవరూ ప్రశ్నించే సాహసం చేయరు. ఒకవేళ చేసినా.. వారిని దోషులుగా చూస్తారు పైగా లోపల నుంచి హారిక.. అవ్వ జోలికి ఎవరూ పోవద్దని చెప్పడం మరింత హాస్యాస్పదం. ఆమె కూడా ఆటలో భాగమైనప్పుడు గొడవ సహజం. అయితే మిగతా కంటెస్టెంట్లు ఒకరి మీద పడి మరొకరు కొట్టుకుంటూ, తోసుకుంటున్నా, అవ్వకు ఏం అవుతుందోనన్న భయంతో ఆమెను టచ్ చేయడానికే భయపడుతున్నారు. టాస్క్‌లో అవ్వను పక్కకు తప్పించండి ఆమె ఉన్న చోటకు వెళ్లేందుకు కూడా వెనకడుగు వేస్తున్నారు. ఆవేశంలో అరిచినందుకే సోహైల్, మోనాల్‌పై తీవ్రంగా విరుచుకుపడుతున్న వాళ్లు అవ్వ ఏకంగా ఓ అమ్మాయిపై కుర్చీ పైకెత్తి విసిరేసినా కిమ్మనకుండా ఉండటం శోచనీయం. దీంతో ఆమెను ఫిజికల్ టాస్క్‌లో పక్కన పెట్టండి అని కొందరు సూచిస్తున్నారు. కానీ రానున్న కాలంలో మరింత కఠినంగా మారనున్న ఈ ఫిజికల్ టాస్కుల్లో ఓ కంటెస్టెంట్‌గా ఆమెను పక్కన పెట్టడం జరగని పని. (చదవండి: బిగ్‌బాస్: ఏడుగురిలో ఇంటికెళ్లేది ఎవరు?) -
బిగ్‌బాస్: విశ్వరూపం చూపించిన గంగవ్వ
బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు ఇచ్చిన 'ఉక్కు హృదయం' టాస్క్‌లో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఒక్క టాస్క్ ఇంటి సభ్యుల మాస్క్‌లను తీసివేయడంతో పాటు ఇంటిని నిప్పుల గుండంగా మార్చింది. దివిని కిడ్నాప్ చేసినందుకుగానూ అభిని 'నువ్వు మగాడివేనారా? థూ' అంటూ మనుషుల టీమ్ సహనం కోల్పోయి అతడిని అనరాని మాటలు అన్నారు. దీంతో ఆ బూతులను తట్టుకోలేక అభి 'మీకు కోపముంటే నన్ను నామమినేట్ చేసేయండి" అని ఒక్క మాట చెప్పి గొడవను అక్కడితో ఆపేశాడు. నేడు కూడా కొనసాగనున్న ఈ టాస్క్‌లో .. ఒళ్లు తెలీకుండా సోఫాలో సెటిలైన మాస్టర్‌తో రోబో అవినాష్ కబుర్లు చెప్తూ చార్జింగ్ పెట్టుకున్నాడు. మాస్టర్ పెద్ద ప్లేయర్ అనుకున్నామే.. అని తప్పులో కాలేశామని గ్రహించి మెహబూబ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాజాగా రిలీజ్ చేసిన మరో ప్రోమోలో గంగవ్వ తన విశ్వరూపం చూపించింది. అసలే అమ్మాయిలను దుప్పటి అడ్డం పెట్టి గార్డెన్ ఏరియాలోనే వాష్‌రూమ్‌కు పోనిచ్చినందుకు మనుషుల టీమ్‌లోని అబ్బాయిలపై ఆమె ఇదివరకే చాలా సీరియస్ అయింది. చేసిన ఘనకార్యానికి ఇంకా గొంతు లేపి మాట్లాడుతున్నారా? అని వాళ్ల నోరు మూయించింది. నేటి ఎపిసోడ్లో ఐతే ఏకంగా చేయి చేసుకున్నట్లు కనిపిస్తోంది ఇంట్లో నీళ్లు రాకుండా స్విచ్ ఆఫ్ చేసినందుకు మోనాల్‌పై అరియానా, గంగవ్వ ఒంటికాలిపై లేచారు. మోనాల్, అరియానా కొట్టుకు చస్తుంటే రోబోలు నిర్ఘాంతపోయారు. (చదవండి: అతి త్వరలోనే మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ) మోనాల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన గంగవ్వ.. ఆమెపై తన ప్రతాపం చూపిస్తూ కుర్చీ విసిరి పారేసింది. ఈ వీడియోను చూసిన నెటిన్లు 'రోబోలకు ఎమోషన్స్ ఉండకూడదు కదా!' అని లాజిక్ మాట్లాడుతున్నారు. 'సోహైల్ అరిస్తే తప్పు అని వారించినప్పుడు గంగవ్వ చేస్తుందేంటి?' అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే కావాలనే అభిజిత్ గంగవ్వను బలి చేస్తుడేమోనని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 'మరేం పర్లేదు, శనివారం నాడు నాగార్జున వచ్చి అందరికీ గడ్డి పెడతాడని, అప్పటివరకు వెయిట్ చేద్దాం' అంటూ కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: ఒకరిని కిడ్నాప్ చేసి మిగతా వారిని వదిలేశారు!) -
గంగవ్వను విడుదల చేయాలి
-
బాంచెన్.. నా వల్ల అయితలే: ఏడ్చేసిన గంగవ్వ
బుల్లితెర బాస్ బిగ్‌బాస్ రియాలిటీ షోలో నేడు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్‌గా ముక్కు అవినాష్ హౌస్‌లో ఎంటరయ్యాడు. వినూత్న ఎంట్రీతో హౌస్‌లో అడుగుపెట్టి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. మట్టి మనిషి గంగవ్వకు ఏసీ గదుల్లో రోజుల తరబడి ఉండటం కష్టంగా ఉంది. ఆ వాతావారణం, అక్కడి తిండి తన ఒంటికి పడక అస్వస్థతకు లోనైంది. దీంతో ఆమెను వైద్యుల దగ్గరకు పంపించారు. మరి నేటి ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూసేద్దాం.. ఈ రోజు.. నా రోజు: అవినాష్ ఎంట్రీ పదకొండో రోజు ఉదయం పాటకు బదులు వాయిస్ ఓవర్‌తోనే నిద్ర లేచారు. ఈ రోజు.. నా రోజు అంటూ ముక్కు అవినాష్ ఇంట్లోకి రాకముందే ఇంటి సభ్యులపై జోకులు పేల్చాడు. జోకర్.. ఆనందానికి, బాధ మధ్య నలిగిపోతూ ఉండే చిన్న పదం, జోకర్ వెనక జీవితమే ఉంది అంటూ ఏవీ చూపించారు. ఆ తర్వాత అందర్నీ నవ్వించే జోకర్‌గా వచ్చాను అంటూ అవినాష్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీరాగానే తనకు పెద్ద కుటుంబం ఉందని, తన గురించి ఆలోచించంటూ మోనాల్ దగ్గర పెళ్లి అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంటి సభ్యులు సరదాగా కళ్యాణిని బయటపెట్టాలనుకున్న ప్లాన్ అట్టర్‌ప్లాఫ్ అయింది. (చదవండి: బిగ్‌బాస్: ఎలిమినేషన్, ఆ వెంటనే సర్ప్రైజ్) గుక్కపెట్టి ఏడ్చిన సుజాత, బుజ్జగించిన నోయల్ కానీ సుజాతను మాత్రం నోయల్ విజయవంతంగా బయటపెట్టాడు. ఆ భయం నుంచి బయటపడని సుజాత గుక్కపెట్టి మరీ ఏడ్చింది. దీంతో నోయల్ ఆమెను దగ్గర తీసుకుని ఊరడించాడు. అనంతరం పెద్ద బిల్డప్ ఇచ్చిన అవినాష్‌తో ఇంటి సభ్యులు ఓ ఆటాడుకున్నారు. అతడిని అమ్మాయిగా రెడీ చేసి గంగవ్వతో కలిసి ర్యాంప్ వాక్ చేయించారు. ఇదిలా వుంటే ట్రూత్ ఆర్ డేర్ గేమ్‌లో భాగంగా ఇంట్లో ఉండే ఒక అబ్బాయిని నువ్వుసెలక్ట్ చేసుకోవాలి అని హారిక సుజాతను అడిగింది. అందరూ అక్క, తమ్ముడు అవుతారు, పోనీ అభి పేరు చెప్తావా అనగానే అతడు ఛీఛీ సుజాత నాకు చెల్లి అని అన్నాడు. చీచీ అన్నందుకు సుజాత నొచ్చుకుంది. ఆ విషయాన్ని చెప్తూ పదేపదే ఏడ్చింది. పంటి కింద నొప్పిని భరిస్తున్న గంగవ్వ గత కొద్దిరోజులుగా పంపించండని వేడుకుంటున్న గంగవ్వ అనారోగ్యం బారిన పడింది. దీంతో బిగ్‌బాస్ ఆమెను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు. ఆరోగ్యం ఎలా ఉందని అడిగాడు. అందరూ బాగానే చూసుకుంటున్నారు, కానీ భర్త కొట్టిన దెబ్బలు ఇప్పుడు మళ్లీ నొప్పెడుతున్నాయని చెప్పింది. నాకిక్కడ వాతావారణం, ఆహారం పడతలేదని ఏడుస్తూ గోడు వెల్లబోసుకుంది. మట్టిలో తిరిగేదాన్ని, ఇక్కడ ఉండలేకపోతున్నానని చెప్పింది. రెండు నెలలు ఉందామనే వచ్చాను, కానీ తన వల్ల కావట్లేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. (చదవండి: నాకైతే రెమ్యూనరేషన్ చాలానే ఇచ్చారు) వైద్యులతో గంగవ్వకు చికిత్స మీరు గట్టిమనిషి, ఇలాంటి ఎన్నో కష్టాలను చూసి ఇక్కడిదాకా వచ్చారు అని బిగ్‌బాస్ ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ఇక్కడ ఉండలేకపోతున్నా అని పరోక్షంగా పంపించేయండని పదేపదే చెప్పింది. బిగ్‌బాస్ ఆమెను మెడికల్ రూమ్‌కు వెళ్లమని చెప్పి అక్కడ వైద్యులతో చికిత్స అందించారు. ఇప్పటివరకు గంగవ్వను గెలిపిద్దాం అనుకున్న అభిమానులు నేటి ఎపిసోడ్ చూశాక మనసు మార్చుకుంటున్నారు. ఆమె పడుతున్న అవస్థను కళ్లారా చూసిన తర్వాత ఆమెను ఇంక ఇంటికి పంపించేయడమే బెటర్ అంటున్నారు. ఇదిలా వుంటే రేపటి ఎపిసోడ్లో బీబీ కామెడీ షో జరగనుంది. ఇందులో రెండు టీమ్‌లుగా విడిపోయిన అవినాష్, అమ్మ రాజశేఖర్ కామెడీ స్కిట్లు చేయనున్నారు. వీరిలో ఎవరి కామెడీ పండనుందో చూడాలి. ఇక్కడ రియల్ జోకర్ గెలుస్తాడా? రీల్ జోకర్ విజయం సాధిస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. (చదవండి: బిగ్‌బాస్: కెప్టెన్ లాస్యకు మాస్టర్ పంచ్) -
బిగ్‌బాస్: గంగవ్వకు కరోనా టెస్ట్
కరోనా కాలంలో ఎంటర్టైన్మెంట్ లేక బోసిపోతున్న జనాలకు వినోదాన్ని పంచేందుకు బిగ్‌బాస్ నాల్గవ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. షోలో పాల్గొనే కంటెస్టెంట్లను 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచి, అందరికీ పరీక్షలు చేశాక నెగెటివ్ అని తేలితేనే లోనికి పంపించారు. షో కోసం పనిచేసే సిబ్బందిని కూడా సగానికి సగం తగ్గించారు. ఉన్న కొద్దిమంది కూడా కరోనా నిబంధనలు తూ.చ తప్పకుండా పాటిస్తున్నారు. ఇంత పకడ్బందీగా చర్యలు చేపట్టినా ఆ మాయదారి కరోనా కన్ను బిగ్‌బాస్‌పై పడింది. తాజాగా షోలో పనిచేసే కొందరు టెక్నీషియన్లకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. (బిగ్‌బాస్: మోనాల్‌కు అబిజిత్ కౌంటర్) మరోవైపు ఇంట్లోనూ గంగవ్వ కాస్త అస్వస్థతకు గురైనట్లు కనిపిస్తోంది. అందుకే కొద్ది రోజులుగా వెళ్లిపోతా బిడ్డా అంటూ నోరు తెరిచి మరీ వేడుకుంటోంది. కానీ ఆమె విన్నపాన్ని నాగ్ మన్నించలేదు. అది ప్రేక్షకుల అభిప్రాయానికే వదిలేస్తున్నానంటూ చేతులు దులిపేసుకున్నారు. కానీ టెక్నీషియన్లకు కరోనా సోకిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా గంగవ్వకు కూడా కోవిడ్-19 పరీక్ష చేయించారట. ఆ ఫలితాలు ఇంకా రావాల్సి ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో షో నిర్వహణకు మరిన్ని కఠినమైన చర్యలు తీసుకునేందుకు బిగ్‌బాస్ యాజమాన్యం సిద్ధమైంది. కాగా గంగవ్వ వరుసగా రెండోసారి కూడా ఎలిమినేషన్ రేసులో నిలబడింది. కానీ ప్రేక్షకులు గుద్దే ఓట్లతో ఇప్పట్లో ఆమె ఇంటికి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. అయితే హౌస్‌లో ఉండలేనని మాటిమాటికీ చెప్తుండటంతో బిగ్‌బాస్ నిర్వాహకులే ఓ అడుగు ముందుకేసి ఆమెను త్వరలోనే బయటకు పంపించేందుకు ఆలోచన చేస్తున్నారు. (బిగ్‌బాస్: ఈ వారం ఎలిమినేషన్లో ఉన్నది వీళ్లే) -
అయోమయంలో గంగవ్వ ఫ్యాన్స్
బిగ్‌బాస్ హౌస్‌లో ఎక్కువమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ ఎవరు? అన్న ప్రశ్న పూర్తయ్యేలోపే గంగవ్వ అని చటుక్కున సమాధానం చెప్పేస్తారు. ఈ షో చూడని వాళ్లు కూడా ఆమెకోసం సమయం కేటాయించి మరీ ఓట్లు గుద్దుతారంటేనే అర్థం చేసుకోవాచ్చు ఆమె తెలుగు ప్రేక్షకులకు ఎంతగా నచ్చేసిందో. కల్లాకపటం లేని మనసు, ముక్కుసూటితత్వం, కష్టపడి పైకొచ్చిన విధానం, మాటతీరు మరెన్నో సుగుణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడవే బిగ్‌బాస్ హౌస్‌లో ఆమెకు అడుగడుగునా అడ్డుపడుతున్నాయి. లేని ఎమోషన్స్‌ను నటించడం రాదు, పోనీ అలా నటించినవారితో కలిసిపోనూలేదు. (చదవండి: గంగవ్వను గెలిపించేందుకు ఓటు) నా వల్ల కాదు బిడ్డా.. అక్కడున్న అందరూ ఆమె ఈడుకు తగ్గ వాళ్లు కాకపోయినా అందరితో బాగానే మాట్లాడుతోంది. అయినా ఎందుకో ఇమడలేకపోతోంది. "నా వల్ల కాదు బిడ్డా, నేను పోతా" అని పదే పదే అభ్యర్థిస్తోంది. దానికి నాగ్ బదులు చెప్పలేక అది ప్రేక్షకుల చేతిలో ఉంది, తానేం చేయలేను అని చేతులెత్తేశారు. నిన్నటి నామినేషన్ ప్రక్రియలోనూ అవ్వే మొదటగా పడవ దిగి వెళ్లిపోవాలన్న కోరికను మరోసారి బయటపెట్టింది. కానీ బిగ్‌బాస్ యాజమాన్యం అందుకు ఒప్పుకుంటుందా? టీఆర్పీ కోసం ఏరికోరి తెచ్చుకున్న అవ్వను వదులుకుంటుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. (చదవండి: ఎన్నో వారాలు ఉండలేను: గంగవ్వ) నీరుగారిపోతున్న అభిమానుల ఆశలు పైగా బిగ్‌బాస్ హౌస్‌లో వినోదాన్ని పంచుతున్న ఏకైక వ్యక్తి అవ్వ. ఆమెతోనే సరదాలు, ఆమె వేసే పంచ్‌లతోనే ప్రోమోలు, ఎపిసోడ్లు గడిచితున్నాయి. అలాంటి అవ్వ వెళ్లిపోతే షో బోసిపోతుందేమో అన్న సందేహం బిగ్‌బాస్ టీమ్‌ను భయభ్రాంతులకు గురి చేస్తుందేమో! కానీ ఎన్నాళ్లు ఊరడించినా అవ్వ ఎక్కువ రోజులైతే ఉండలేదు. ఇదే వాస్తవం. కాదు, కూడదు అంటే బిగ్‌బాస్‌తోనే లడాయి పెట్టుకుని మరీ ఇంట్లో నుంచి వెళ్లిపోయే రకం. దీంతో ఎలాగైనా గంగవ్వను గెలిపిద్దామని కోటి ఆశలు పెట్టుకున్న అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. ఆమెను పంపించడానికి ఏమాత్రం ఇష్టం సుముఖత వ్యక్తం చేయడం లేదు. కానీ వయసుతోపాటు వచ్చే అనారోగ్య సమస్యలు, హౌస్‌లో ఉన్న కృత్రిమత్వం ఆమెను ఉండనివ్వట్లేదు. కాబట్టి షో కాస్త పుంజుకునేవరకు ఎదురు చూసి బిగ్‌బాస్ యాజమాన్యమే ఆమెను నేరుగా ఇంటికి పంపించే అవకాశాలు ఉన్నాయి. (చదవండి: బిగ్‌బాస్: ఫిట్‌నెస్‌పై గంగవ్వ ఫోకస్) -
బిగ్‌బాస్: ఈ వారం ఎలిమినేషన్లో ఉన్నది వీళ్లే
కరోనా కారణంగా కాస్తా ఆలస్యంగా ప్రారంభమైనా బిగ్‌బాస్ జనాల్లో మెల్లమెల్లగా పుంజుకుంటుంది. వారం రోజులుగా చప్పగా సాగిన కంటెస్టెంట్ల ప్రదర్శనలో మెరుగు కన్పిస్తోంది. తొటి సభ్యులతో పరిచయాలు పెంచుకుంటూ ప్రస్తుతం హుషారుగా ఉన్నట్లు కొట్టొచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రెండో వారం రానే వచ్చింది. అర్థరాత్రి బిగ్‌బాస్‌లోకి ప్రవేశించిన కుమార్ సాయి దొంగలా దాక్కొని.. అక్కడ ఉన్న దేవితో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఇంట్లోకి ఎవరో వచ్చారని గమనించిన దేవి అతని ముఖం చూసేందుకు సాహసించింది. అయితే తనను చూడొద్దని దేవిని భయపెడుతూ సభ్యులను పిలుచుకు రావాలని కుమార్ కోరాడు. అనంతరం ఒక్కొక్కరిగా వచ్చి సాయి కుమార్‌తో మాట్లాడి ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారని పసిగట్టారు. (బిగ్‌బాస్: నువ్వు హీరోయిన్, నేను హీరో) అంతేగాక అభిజిత్, మోనాల్ అర్థరాత్రి ఏకాంతంగా గుసగుసలు పెట్టుకున్నారు. ఇక ఉదయం కూడా మళ్లీ మోనాల్, అభిజిత్ రహస్యంగా మాట్లాడుకోవడంతో వీరి మధ్య ఎదో ఉందని ప్రజలకు సందేహిస్తున్నారు. అదే విధంగా అఖిల్ మోనాల్ గురించి లాస్యతో చాడీలు చెప్పేందుకు ప్రయత్నించి వెంటనే మళ్లీ మోనాల్‌ను పిలిచి తనతో కాస్తా కొంటెగా ముచ్చటించాడు. అఖిల్ వద్దకు వచ్చిన మోనాల్ ఎదో చెప్పే ప్రయత్నం చేయబోతుంటే యదవ యాక్టింగ్‌లు చేయకు అంటూ అఖిల్ నోరు పారేసుకున్నాడు. నీకేం చేయాలో తెలియదా అని అఖిల్ అనగానే. మంచిగా మాట్లాడు అంటూ మోనాల్ కూడా కొంచెం సీరియస్ అయ్యింది. ఇక ఈ వాదన అయిపోగానే ఇద్దరి మధ్య ఏర్పడిన చిరు గొడవను డైవర్ట్ చేస్తూ మోనాల్‌ను కూల్ అయ్యేలా మస్కా కొట్టాడు. మరోలా ఆలోచిస్తే ఈ రోజు చర్చంతా మోనాల్‌పై జరిగినట్లు కన్నిస్తోంది. (బిగ్‌బాస్: సూర్యకిరణ్ అవుట్, ఆమెపై బిగ్‌బాంబ్!) ఇదిలా ఉండగా ఈ రోజు నుంచి రేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇంటి సభ్యులకు కావాల్సిన రేషన్‌ను దక్కించుకునేందుకు ఒకిరిని రేషన్ మేనేజర్‌గా ఎన్నుకోవాలి. వారికి రూమ్ తాళం ఇచ్చి అందులోని సమన్లు తెచ్చుకోవాలి. అ క్రమంలో ఈ పోస్టును అమ్మ రాజశేఖర్‌కు కెప్టెన్ లాస్య అప్పగించడంతో మాస్టర్, కెప్టెన్ లాస్య స్టోర్ రూమ్‌కు వెళ్లి కావాల్సిన వస్తువులను తీసుకొచ్చారు. (బిగ్‌బాస్: ముందు తనే వెళ్లిపోతానన్న గంగవ్వ) ఇక రెండో వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇంట్లోని 16 మంది గార్డెన్ ఏరియాలో ఉన్న పడవలోకి ఎక్కాలి. పడవ ప్రతి తీరం మధ్య ఆగినప్పుడు ఒక్కో సభ్యుడు దాని నుంచి ఖచ్చితంతగా దిగిపోవాల్సి ఉంటుంది. ఇలా తొమ్మిది తీరాల మధ్య పడవ ఆగుతుంది. అంటే 9 మంది నామినేషన్ అవుతారు. ఇక పడవలోకి కూర్చొని సభ్యులంతా సరదాగా పాటలతో హోరెత్తించారు. ఇక మొదటి తీరం రాకముందే పడవ నుంచి నేను పోత అంటే నేను దిగపోతా అంటూ ముందుకు వచ్చారు. ఇంతలోనే దిగేందుకు సరైన కారణం చెబితే తాను దిగిపోతానని కుమార్ సాయి తెలిపాడు. దీంతో ఎవరిని పడవ నుంచి దింపేయాలన్న చర్చ సభ్యుల్లో సాగింది. ఇంతోనే అభిజిత్ కలగజేసుకొని అవ్వ ఎక్కవ సేపు కూర్చోలేదని చెబుతూ మొదట పడవ దిగమని చెబుతామా అని సలహా ఇచ్చాడు. దానికి అవ్వ సరే చెప్పి తొలి రౌండ్లోనే దిగిపోయింది. అయితే ఊహించని విధంగా నోయల్ రెండో హారన్‌కు దిగిపోయాడు. మోనాల్ మూడో హారన్‌కు పడవ నుంచి దిగేసింది. (మైండ్ బ్లాక్ చేసిన దివి, దేవి) ఇంట్లోకి వచ్చిన కుమార్ మొదటి రోజే ఇంటి సభ్యులతో మైండ్ గేమ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. మనసులో దిగాలని లేకపోయిన మీరు చేస్తే దిగుతా అంటూ ప్రతి రౌండ్లో తెలివి ప్రదర్శిస్తూ వచ్చాడు. నాలుగో రౌండ్ మోగగానే పోహైల్, అయిదో బజర్‌కు కరాటే కళ్యాణి దిగిపోయింది. ఆరో హారన్‌కు అమ్మ రాజశేఖర్ పడవ నుంచి దిగేసి ఇంట్లోకి వచ్చేశారు. ఏడవ రౌండ్లో కుమార్, ఎనిమిది హారిక, తొమ్మిది అభిజిత్ దిగిపోయాడు. అయితే నామినేషన్లోకి వెళ్లినా తిరిగి సేఫ్ అవ్వగలం అన్న నమ్మకం ఉన్న వారు పడవ నుంచి దిగేసినట్లు తెలస్తోంది. నామినేట్ అయితే ఎలిమినేట్ అవుతామన్న భయంతో సుజాత, మెహబూబ్, దివి, అఖిల్ గుట్టు చప్పుడు కాకుండా చివరి దాకా పడవలోనే ఉన్నారు. చివరికి ఈ వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. గంగవ్వ, నోయల్, మోనాల్, సోహైల్, కరాటే కళ్యాణి, అమ్మ రాజశేఖర్, కుమార్ సాయి, హారిక, అభిజిత్ నామినేట్ అయ్యారు. మరి ఈ వారం సేఫ్ అయ్యేది ఎవరో, ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలియాలంటే ఈ వారమంతా బిగ్బాస్సై ఓ కన్ను వేయాల్సిందే. -
బిగ్‌బాస్: తొలివారం ఎలిమినేట్ అయ్యేది అతనే!
బిగ్‌బాస్ తెలుగు సీజన్-4 మొదలై వారం కావొస్తున్న అనుకున్నంత ఆదరణ లభించడం లేదనిపిస్తోంది. బలమైన, పేరున్న కంటెస్టెంట్లను తీసుకురావడంలో బిగ్‌బాస్ ఈసారి దృష్టి పెట్టలేదనేది ప్రేక్షకుల మాట. ఈక్రమంలోనే తొలి వారం ఎలిమినేషన్‌కు గడువు దగ్గర పడింది. హౌజ్ నుంచి ఎవరు బయటికి వెళ్తారనేది మరికొన్ని గంటల్లో తేలుతుంది. అయితే, శనివారం నాటి ఎపిసోడ్‌ను బట్టి సూర్య కిరణ్ ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయన ప్రవర్తనపై ఇంటా, బయటా విమర్శలు వస్తున్నాయి. ప్రేక్షకుల్లో కూడా ఆయనపై మంచి అభిప్రాయం కలగలేదని సోషల్ మీడియాలో కామెంట్లను బట్టి అర్థమవుతోంది. అతన్ని బయటికి పంపించేందు ఓట్లు వేసినట్టు చాలా మంది చెప్తున్నారు. ఇక హోస్ట్ నాగార్జున సైతం సూర్య కిరణ్‌ను కాస్త కఠినంగానే మందలించారు. అన్నీ కలగలిసి అతన్ని బయటికి పంపేందుకు రంగం సిద్ధమయ్యేలా చేశాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. (చదవండి: బిగ్‌బాస్ : గంగవ్వ తోపు.. ‘బకరా’ అయిన లాస్య) డ్యాన్సులతో ఇరదీసిన కంటెస్టెంట్లు ఇక ‘సండే అంటే ఫన్ డే’ అంటూ రాములో రాములా పాటతో ఆదివారం నాటి ఎపిసోడ్లో నాగార్జున ఎంట్రీ ఇవ్వనున్నారు. హౌజ్‌లోని కంటెస్టెంట్లతో సైతం ఆయన డ్యాన్సులు వేయించాడు. దివి వైద్య-సొహైల్, హారిక-నోయల్, దేవి-అభిజిత్, లాస్య-సూర్యకిరణ్, మోనాల్-మెహబూబ్ జోడీగా స్టెప్పులు వేశారు. ‘తమ్ముడూ.. లెట్స్ డూ కుమ్ముడూ’ పాటకు అమ్మ రాజశేఖర్ గంగవ్వతో కాలు కదిపాడు. అంతకుముందు నాగార్జున కంటెస్టెంట్లను బొమ్మలు గీయాలని చెప్పాడు. కంటెస్టెంట్లు వేసిన బొమ్మలను మిగతావారు వర్ణించాలని సూచించాడు. ఆదివారం ఉదయం విడుదలైన ప్రోమో ద్వారా ఈ విషయాలు రివీల్ అయ్యాయి. ఇదిలాఉండగా.. ఈ రోజుల్లో' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సాయికుమార్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆదివారం నాటి ఎపిసోడ్ ద్వారా హౌజ్‌లోకి అడుగుపెట్టడం ఖాయమనే వార్తలు వెలువడుతున్నాయి. (చదవండి: టాప్ 5లో ఎవరుంటారని చెప్పడం కష్టం) Sunday is a Fun'day...Get ready for loads of entertainment.#BiggBossTelugu4 Today at 9 PM on @StarMaa pic.twitter.com/HBX5EbNmZU — starmaa (@StarMaa) September 13, 2020 -
బిగ్‌బాస్ : గంగవ్వ తోపు.. ‘బకరా’ అయిన లాస్య
బిగ్‌బాస్ హౌస్‌లో శనివారం అంతా సందడిగా సాగింది. అనుకున్నట్లే కింగ్ నాగార్జున్ తనదైన చలాకీతనం, అనుభవంంతో శనివారం ఎపిసోడ్‌ని ఎంటర్టైన్ చేశాడు. ఫన్నీ టాస్క్ ఇచ్చి ఎంటర్‌టైన్‌తో పాటు ఇంటి సభ్యుల క్యారెక్టర్ ఏంటో బయటపడేలా చేశాడు. అయితే ఈ టాస్క్‌కి బలి అయింది మాత్రం నేబర్ హౌజ్ నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన సోహైల్, అరియానాలే. వీరిద్దరికి రకరకాల బొమ్మలు ఉన్న కొన్ని మెడల్స్ ఇచ్చి.. ఒక్కొ మెడల్ ఎవరెవరికి ఇస్తారో రీజన్ చెప్పి మెడలో వెయాలని చెప్పారు హోస్ట్ నాగార్జున. మొదటగా ఊసరవెళ్లి అని రాసి ఉన్న మెడల్ని సుజాతకు ఇచ్చారు. అప్పుడే ఏడుస్తుంది.అప్పుడే నవ్వుతుంది. వెంటనే బాధ పడుతుంది అందుకే ఆమెకు ఊసరవెళ్లి మెడల్ ఇచ్చామని సోహైల్, గ్లోరీ చెప్పుకొచ్చారు. ఇక కాకరకాయ(చేదు) మెడల్ దివికి, రోమాంటిక్ పర్సన్ అఖిల్‌కి ఇచ్చారు. అఖిల్ చాలా మంచోడని, కేరింగ్ కూడా ఎక్కువేనని, అతనంటే ఇష్టమని అరియానా చెప్పుకొచ్చింది. దీంతో నాగార్జున మరోసారి అరియానాకి అన్నం తినిపించాలని అఖిల్‌కు చెప్పుకొచ్చాడు. (చదవండి :బిగ్‌బాస్: ఫస్ట్ కెప్టెన్‌గా కట్టప్ప! ) ఇక ఇంట్లో చిచ్చుపెట్టేది ఎవరనగా ఇద్దరూ కల్యాణిని సూచించారు. ఆమె ఇక్కడి మాటలు అక్కడ.. అక్కడి మాటలు ఇక్కడ చెప్తారని అందుకే పుల్లలు పెట్టే మెడల్ ఆమెకు ఇస్తున్నామని సోహైల్ చెప్పాడు. డ్రామ క్వీన్ మెడల్ హారీక ఇవ్వగా.. కింగ్ నాగార్జున ఆశ్చర్యపోయారు. అసలు ఆ మెడల్ ఆమెకు సెట్ కాదని కింగ్ చెప్పేశాడు. ఇక సూర్య కిరణ్ ఇంట్లో ఏ పని చేయరంటూ బద్దకం మెడల్ ఇచ్చారు. చెత్తకుండి మెడల్ ఎవరికి ఇస్తారని నాగ్ అడగ్గా.. అలాంటి వాళ్లు హౌస్‌లో ఎవరూ లేరని, ఆ మెడల్ ఇవ్వలేనని సోహైల్ చెప్పాడు. వెంటనే అరియానా కలుగజేసుకొని అభిజిత్‌కు ఆ మెడల్ ఇచ్చింది. తనకి ఎవరైనా అన్నం తినిపించమని అడిగినప్పుడు అభి.. నేను ఓవరియాక్షన్ చేస్తున్నానని అన్నాడని అందుకే అతనికి చెత్తకుండి మెడల్ ఇస్తానని ముఖం మీదే చెప్పేసింది. ఇక ‘తోపు’ మెడల్ని ముక్తకంఠంతో గంగవ్వకు ఇచ్చారు. బిగ్‌బాస్ హౌస్‌లో గంగవ్వను మించిన తోపు ఎవరూ లేరని, ఆమె ఎన్నో కష్టాలని చూసి వచ్చి ఈ స్థాయికి చేరుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా కింగ్ నాగార్జున కూడా హౌస్‌లో గంగవ్వే తోపు అని స్పష్టం చేశాడు. ఇక బకరా మెడల్ని లాస్యకి, క్రయింగ్ బేబిని మోనాల్‌కు , ఫర్ఫెక్ట్ దేవికి, మిర్చి మెడల్ని గుంటూరు చిన్నోడు మెహబూబ్‌కి ఇచ్చారు. చివరగా జోకర్ మెడల్ని అమ్మ రాజశేఖర్ ఇస్తూ.. హౌస్‌లో అందరిని ఎంటర్టైన్ చేసే ఏకైక వ్యక్తి రాజశేఖర్ అని చెప్పుకొచ్చారు. -
బిగ్‌బాస్: ఫస్ట్ కెప్టెన్‌గా కట్టప్ప!
నాలుగు రోజులుగా నాన్చుతూ వచ్చిన కట్టప్ప ఎపిసోడ్ ఉత్తిదేనని తేలింది. హౌస్‌లో అలాంటి పాత్రే లేదని, కానీ మీలో ఉన్న అనుమానమే కట్టప్ప అని, దాన్ని పక్కన పడేయండని నాగార్జున సూచించారు. వారం రోజులు కావస్తున్నా ఇంటి సభ్యులు ఒకరికొకరు సరిగ్గా కనెక్ట్ అయినట్లు కనిపించడం లేదని చెప్పాడు. హౌస్మేట్స్ చేసిన తప్పొప్పులను సరిదిద్దే ప్రయత్నం చేశారు. ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఈ వారం 5 కోట్ల ఓట్లు వచ్చాయన్నారు. ఎలిమినేషన్ జోన్లో ఉన్న ఇద్దరిని ఆ గండం నుంచి బయటపడేశారు. ఆ ఇద్దరు ఎవరు? నేటి ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూసేద్దాం.. ఎన్నో వారాలు ఉండలేను: గంగవ్వ బిగ్‌బాస్‌లో కట్టప్ప ఎవరో తేల్చేద్దాం అంటూ బాహుబలి పాటతో ఎంట్రీ ఇచ్చాడు కింగ్ నాగార్జున. అనంతరం శుక్రవారం నాడు హౌస్‌లో ఏం జరిగిందో చూపించారు. ఆ రోజు వర్షం పడుతుండటంతో "ఎన్నాళ్లకు గుర్తొచ్చానా వాన" సాంగ్ వేశారు. ఇంకేముందీ.. ఇంటి సభ్యులు వర్షంలోనే తడుచుకుంటూ మరీ చిందేశారు. ఆ తర్వాత మాస్టర్ కట్టప్ప మీద పాట పాడాడు. కల్యాణి కూడా బాగా పాడుతుందంటూ పొగడటంతో గొంతు సవరించుకుని పాటందుకుంది. అంతే.. చటుక్కున అక్కడున్న అబ్బాయిలంతా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయి ఆమెను బకరా చేశారు. ఐదేళ్లున్నప్పుడు పెళ్లి చేశారు. మరోవైపు గంగవ్వ "నా భర్త తాగుడు, కొట్టుడు, చెప్పినమాట వినకుండా అయిపోయిండు" అని తన బాధలను ఇంటి సభ్యులతో వెళ్లబోసుకుంది. ఎన్నో వారాలు ఇంట్లో ఉండలేనని చెప్పుకొచ్చింది. (చదవండి: బిగ్‌బాస్: 'అతను ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిది) అప్పుడు పెళ్లన్నాడు, ఇప్పుడు మాట కూడా లేదు వీకెండ్ ఎపిసోడ్ కావడంతో హౌస్మేట్స్ అందరూ అందంగా ముస్తాబయ్యారు. వారం రోజులకు నాగార్జున కనిపించడంతో ఇంటిసభ్యులు ఆనందానికి లోనయ్యారు. గంగవ్వ నాగార్జునను నడిపన్న(రెండో అన్న) అని పిలుచుకుంటూ పాట పాడింది. నోయల్ నువ్వు ఓవర్ థింక్ చేస్తావ్ కదా అని నాగ్ అన్నారు. అన్నింటిని అలాగేపెంట చేశావ్ అని చెప్పారు. నువ్వు టాలెంటే కానీ, ఓవర్ థింకింగ్ తగ్గించుకో అని సూచించారు. అరియానాకు ఇంకోసారి తినిపించయని అఖిల్‌ను ఆదేశించారు. ఆ తర్వాత నాగ్, ఇంటిసభ్యుల కోరిక మేరకు సోహైల్ అరియానాను వీపుపై మోస్తూ పుషప్స్ చేశాడు. నువ్వెప్పుడైనా ఇలా ట్రై చేశావా అని నాగ్ అడగ్గా ఇలాంటి అమ్మాయి ఇంకా దొరకలేదని అఖిల్ సమాధానమిచ్చాడు. నర్మద నదిలో ఎప్పుడు నీళ్లు ఉంటాయి. దానికి డ్యామ్ కట్టేశారని, నువ్వు కూడా అలాంటిది వేసుకోవాలని నాగ్ మోనాల్‌ను కోరారు. లాస్యకు గోడ మీద పిల్లిలా ఉన్నావ్, జోష్ తగ్గిపోయిందని చెప్పారు. షో ప్రారంభం రోజు అభిజిత్ ఎవర్ని పెళ్లి చేసుకుంటావు అంటే మోనాల్‌ను చేసుకుంటానన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు తను నేరుగా వచ్చి మాట్లాడిచ్చినా స్పందించట్లేదని మోనాల్ వాపోయింది. మరోవైపు సైలెంట్‌గా ఉంటూ.. అందరి గురించి బాగా చెప్పావ్ అని దివిని పొగిడారు. సూర్యకిరణ్‌కు మొట్టికాయలు వేసిన నాగ్ కట్టప్ప గురించి తెలుసుకోడానికి వెయిటింగ్ అంటూ హౌస్మేట్స్ అద్భుతమైన ర్యాప్ సాంగ్ పాడారు. నా చెవులు గిల్లుమంటున్నాయి ఆపండి అని గంగవ్వ వారించడంతో అందరూ నోళ్లు మూసుకున్నారు. ఆ తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లో జరుగుతున్నదాని గురించి బ్రేకింగ్ అండ్ హెడ్‌లైన్స్ చెప్పమని నాగ్ దేవి నాగవల్లిని కోరారు. అందుకు ఆమె వ్యాసం చెప్పడంతో 'ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. దేవి వార్తలు చెప్పడం మర్చిపోయింద'ని కింగ్ నవ్వుతూ చెప్పుకొచ్చారు. అనవసరమైన దానిలో దూరి లెక్చర్లు ఇవ్వకండని సూర్యకిరణ్‌కు మొట్టికాయలు వేశారు. అక్కడిది ఇక్కడ.. ఇక్కడిది అక్కడ చెప్పడమేంటని కరాటే కల్యాణిపై అసహనం ప్రదర్శించారు. వేరేవాళ్లని మాట్లాడనివ్వండని ఉచిత సలహా ఇచ్చారు. (చదవండి: దివి ధ్యాసలో వంట పెంట చేసిన మాస్టర్) గంగవ్వ తోపు, లాస్య బకరా ఆ తర్వాత సోహైల్, అరియానాతో ఓ ఆటాడించారు. రకరకాల బొమ్మలు ఉన్న మెడల్స్‌ను కంటెస్టెంట్ల మెడలో వేయాలన్నారు. అలా సుజాత ఊసరవెల్లి, దివి కాకరకాయ, కల్యాణి చిచ్చు పెట్టడం, హారిక డ్రామా క్వీన్, సూర్య కిరణ్ బద్ధకం, అభిజిత్ చెత్తకుండీ, నోయల్ లౌడ్ స్పీకర్, గంగవ్వ తోపు, దేవి పర్ఫెక్ట్, మోనాల్ ఏడ్చే బేబీ, లాస్య బకరా, మెహబూబ్ మిర్చి, అమ్మ రాజశేఖర్‌ను జోకర్‌గా చెప్పుకొచ్చారు. అనంతరం నాగ్ ఎలిమినేషన్ జోన్లో ఉన్న ఏడుగురిలో మొదట అభిజిత్‌ను, తర్వాత సుజాత, గంగవ్వను సేవ్ చేశారు. ఇక మెజారిటీ ఇంటి సభ్యులు లాస్యను కట్టప్ప అనుకున్నారు, కానీ అలాంటి క్యారెక్టరే లేదని నాగ్ వెల్లడించారు. లాస్యను ఫస్ట్ కెప్టెన్‌గా ప్రకటించారు. (చదవండి: అమ్మ రాజశేఖర్ కుళ్లు జోకులు మానేయండి) -
నోయల్ తర్వాత ఆమెకే..: రాహుల్
బిగ్‌బాస్ మూడో సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్ మరోసారి బుల్లితెరపై సందడి చేయనున్నాడు. ఎలాగో ఇంటిసభ్యుల్లో ఒకరు ఆదివారం బిగ్‌బాస్ హౌస్ నుంచి బ్యాగ్ సర్దేయనున్నారు. అయితే వారిని నేరుగా ఇంటికి పంపించకుండా హౌస్‌మేట్స్‌పై వారి అభిప్రాయాలను, అనుభవాలను పంచుకునేందుకు బిగ్‌బాస్ బజ్ ఉండనే ఉంది. ఈ కార్యక్రమానికి రాహుల్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. అయితే కంటెస్టెంట్లతో మాటామంతీ జరపాలంటే వారి గురించి అంతో ఇంతో తెలిసే ఉండాలి. ఇందుకోసం రాహుల్ ప్రతిరోజూ బిగ్‌బాస్ షోను ఫాలో అవుతున్నాడట. (చదవండి: కంటెస్టెంట్ల ఎంపిక బాగోలేదు: కౌశల్) టాప్ 5లో ఎవరుంటారో ఇప్పుడే చెప్పలేం ఈ మేరకు ఓఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ.. షో చూస్తున్నాను, కానీ ఎవరు టాప్ 5లో ఉంటారనేది చెప్పడం కష్టమని అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే ఇక్కడ మంచివాళ్లు.. చెడ్డవాళ్లుగా, చెడ్డవాళ్లు.. మంచివాళ్లుగా మారిపోయే ఆస్కారం ఉంటుందన్నాడు. కంటెస్టెంట్లలో తనకు నోయల్ తప్ప ఎవరూ పెద్దగా పరిచయం లేదని పేర్కొన్నాడు. కాకపోతే బిగ్‌బాస్ ఇంట్లోకి యూట్యూబర్లను తీసుకురావడం వారికి దక్కిన గొప్ప అవకాశం అని తెలిపాడు. అందరూ ఊహించినట్టుగానే తన జిగిరీ దోస్త్ నోయల్‌కే సపోర్ట్ చేస్తానని తెలిపాడు. నోయల్ తర్వాత గంగవ్వపై మంచి అభిప్రాయం ఉందని చెప్పుకొచ్చాడు. ఈ వయసులో ఆమె బిగ్‌బాస్ షోలో పాల్గొని యువతతోపాటు చాలామందిని ఇన్స్పైర్ చేస్తుందన్నాడు. ప్రోమోలు కూడా ఆమె మీదే ఎక్కువ వస్తున్నాయని, అటు ట్విటర్లోనూ గంగవ్వ హ్యాష్‌ట్యాగ్‌లు చాలానే ఉంటున్నాయని చెప్పుకొచ్చాడు. (చదవండి: అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటా: మోనాల్) -
తొలివారం ఎలిమినేషన్; లిస్టులో గంగవ్వ!
బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్-4 తొలివారం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. కంటెస్టెంట్లలో సూర్య కిరణ్, అభిజిత్, సుజాత, మెహబూబ్, దివి, అఖిల్ సార్థక్, గంగవ్వ ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారని బిగ్‌బాస్ ప్రోమో ద్వారా తెలుస్తోంది. అయితే, ఈ ఏడుగురికి కొన్ని టాస్కులు పెట్టి.. విజేతలుగా నిలిచిన కొందరిని బిగ్‌బాస్ సేవ్ అయినట్టుగా ప్రకటించే అవకాశముంది. మిగతావారిలో ఒకరు ఎలిమినేట్ కాక తప్పదు. నామినేషన్లో ఉన్నవారిలో ఎవరెవరు సేవ్ అవుతారో శనివారం నాటి ఎపిసోడ్లో వెల్లడవుతుంది. (చదవండి: ఎనిమిదేళ్లలో లంబాడిపల్లి టు బిగ్‌బాస్..) ఇదిలాఉండగా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కొత్తగా మరో ఇద్దరు కంటెస్టెంట్లను బిగ్‌బాస్ హౌజ్‌లోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. వారిలో జబర్దస్థ్ కమెడియన్ ముక్కు అవినాష్, ఈ రోజుల్లో' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సాయికుమార్, 'జంప్ జిలానీ' హీరోయిన్ స్వాతి దీక్షిత్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా గత సీజన్లో హౌజ్‌లోకి వచ్చిన కంటెస్టెంట్లు పెద్దగా ఆకట్టుకోలేదు. మూడో సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రి తోటి కంటెస్టెంట్లకు చుక్కలు చూపించింది. దీంతో రెండు మూడు వారాల్లోనే ప్రేక్షకులు తమన్నాను బయటకు పంపించారు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా శిల్పా శెట్టిని కూడా హౌజ్‌లోకి పంపించినప్పటికీ అటు కంటెస్టెంట్లతో పాటు ఇటు ప్రేక్షకులు కూడా ఆమెకు కనెక్ట్ అవలేదు. దీంతో ఆమె కూడా వచ్చినదారినే తిరుగుముఖం పట్టింది. ప్రస్తుతం బిగ్‌బాస్ నాల్గవ సీజన్లో 16 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. First week elimination lo house nundi exit ayyedi evaru??#BiggBossTelugu4 Today at 9 PM on @StarMaa pic.twitter.com/fR4x2do3vI — starmaa (@StarMaa) September 12, 2020 -
గంగవ్వను గెలిపించేందుకు ఓటు
మల్యాల(చొప్పదండి): ఎండిన డొక్కను అడిగితే.. గంగవ్వ పేరు చెబుతుంది. పుట్టీపుట్టగానే తల్లి ఒడికి దూరమైంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని వారి ప్రేమకు దూరమైంది. పలక, బలపం చేతబట్టకపోయినా ఇంగ్లిష్ నేర్చింది. ఐదేళ్లలోనే పెళ్లిపీఠలపై కూర్చుంది. కన్నీళ్లు.. కష్టాలే తోడునీడగా పెరిగింది. ఇక జీవితం అయిపోయిందనుకున్న తరుణంలో మై విలేజ్ షో.. గంగవ్వలోని తెలంగాణ గడుసుతనాన్ని..యాసను. భాషను ఒడిసిపట్టింది. మట్టిలోని మాణిక్యాన్ని వెలికితీసి, ప్రపంచపు నలుమూలలకు పరిచయం చేసింది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఐరోపా దేశాలతోపాటు సౌదీ అరేబియా, దుబాయ్ వంటి గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారికి గంగవ్వ ఆరాధ్యదైవమైంది. ఐదేళ్ల చిన్నారుల నుంచి 60 ఏళ్ల ముదుసలి వాళ్లు సైతం గంగవ్వ అంటే తెలియని వారు లేరు. కష్టాల కడలిని దాటుకుంటూ లంబాడిపల్లి నుంచి బిగ్‌బాస్ షో వరకు వెళ్లిన బహుదూరపు బాటసారి గంగవ్వ. గంగవ్వను గెలిపించేందుకు ఓటు మల్యాల మండలంలోని లంబాడిపల్లికి చెందిన మిల్కూరి గంగవ్వ బిగ్‌బాస్ రియాలిటీ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె నామినేషన్ కోసం వేలాదిమంది ఇతర దేశాల్లోని అభిమానులు, స్థానికులు, తెలంగాణ భాషా ప్రేమికులు ఆన్లైన్ ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ సంప్రదాయం..కట్టు..బొట్టు..అమాయకత్వానికి నిదర్శనంగా నిలిచిన గంగవ్వ ఫొటో వాట్సాప్ స్టేటస్‌లలో, ఫేస్బుక్లో వైరల్‌గా మారింది. గంగవ్వను గెలిపించేందుకు యూట్యూబ్ గంగవ్వ ఫాలోవర్స్ తపన పడుతున్నారు. విదేశాల్లోని తెలుగు వారుసైతం తమతోపాటు తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులుసైతం ఓటు వేస్తున్నారు. ఎనిమిదేళ్లలో లంబాడిపల్లి టు బిగ్‌బాస్.. లంబాడిపల్లికి చెందిన ఎంటెక్ విద్యార్థి శ్రీరాం శ్రీకాంత్ పల్లె సంస్కృతిని, సంప్రదాయాలను పల్లెల్లోని అనుబంధాలు, ప్రేమలు, పండుగలు ప్రపంచానికి చాటి చెప్పేందుకు 2012లో ‘మై విలేజ్ షో’ ఛానల్ ప్రారంభించాడు. ఎస్సారెస్పీ ఆయకట్టు ప్రాంతమైన లంబాడిపల్లిలోని పచ్చని పొలాలు, పండుగలను యూట్యూట్‌లో అప్లోడ్ చేయడం ప్రారంభించాడు. తన ఇంటి పక్కనే ఉన్న గంగవ్వతోపాటు స్థానికులతో షార్ట్ ఫిల్మŠస్లో నటింపజేశారు. సుమారు 200 షార్ట్ ఫిల్మŠస్లో నటించింది. గంగవ్వ అమాయకత్వం..తెలంగాణ తిట్లు..భాష..యూట్యూబ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో పల్లె ప్రజల్లో ఇంటి మనిషిగా మారిపోయింది. ఇక వెనకకు తిరిగిచూడలేదు. గంగవ్వకు ఫాలోవర్స్ పెరిగిపోయారు. గంగవ్వ ఎక్కడ కనపడినా ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. దీంతో ఆమె సహజనమైన నటనను సినిమా దర్శకులను సైతం ఆకట్టుకుంది. పూరి జగన్నాథ్ సినిమాలో అవకాశం కల్పించారు. ఇస్మార్ట్ జోడీ వంటి టీవీ ప్రోగ్రాంలో పాల్గొని విజేతగా నిలిచింది. ఆమె ప్రతిభను గుర్తించి, రాష్ట్ర గవర్నర్ తమిళిసై నుంచి జ్ఞాపిక అందుకున్నారు.