
మెగా చీఫ్‌గా నబీల్ పదవీకాలం ముగిసింది. దీంతో మెగా చీఫ్ పోస్ట్ కోసం మళ్లీ పోటీపెట్టారు. ఈసారి పాత కంటెస్టెంట్లను వెనక్కు నెట్టి సుడిగాలిలా హౌస్‌లో అడుగుపెట్టిన వైల్డ్‌కార్డుల్లో ఒకరే ఆ పోస్టును ఎగరేసుకుపోయారు. మరి ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి(అక్టోబర్ 10) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..

ఎలిమినేషన్ గురించి ఛాలెంజ్
వచ్చేవారం నువ్వే ఎలిమినేట్ అవుతానవి గంగవ్వ అనడంతో విష్ణుప్రియ తాను వెళ్లనంది. అవ్వ పోయేదాకా తాను పోనంది. దీంతో ఎవరు ఎక్కువ రోజులు ఉంటారో చూద్దామని గంగవ్వ, విష్ణుప్రియ ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకున్నారు. అటు ప్రేరణ.. నా మాట వినట్లేదు, నన్ను నమ్మట్లేదు, ఇమ్మెచ్యూర్‌గా ప్రవర్తిస్తున్నావంటూ నబీల్‌తో వాగ్వాదానికి దిగింది. దీంతో హర్టయిన నబీల్.. నేను ఇమ్మెచ్యూర్ కాదని అరిచాడు.

ప్రాంక్ చేసిన గంగవ్వ
తర్వాత అతడు ప్రేరణను ఇమిటేట్ చేస్తూ మాట్లాడటం కాస్త వెగటుగా అనిపిస్తుంది. ఇక బిగ్‌బాస్ రాయల్ క్లాన్ (వైల్డ్ కార్డ్స్)లో నుంచి ఆరుగురు బెస్ట్ పర్ఫామర్లను మెగా చీఫ్ కంటెండర్స్ కోసం ఎంపిక చేయమన్నాడు. దీంతో అవినాష్.. తన పేరుతో పాటు నయని, మెహబూబ్, హరితేజ, రోహిణి, గౌతమ్ పేర్లను సూచించాడు. నా పేరు ఎవరూ చెప్పలేదని గంగవ్వ ఏడుస్తున్నట్లు నటించి అందర్నీ ఆటపట్టించింది.

కంటెండర్‌గా మణి
అటు ఓజీ టీమ్‌లో రెండు స్టార్లున్న మణికంఠ, నబీల్ లలో ఒకరిని బెస్ట్ పర్ఫామర్‌గా సెలక్ట్ చేయాలన్నాడు. దీంతో టీమ్ అంతా కలిసి మణిని బెస్ట్ పర్ఫామర్ అని ప్రకటించడంతో అతడు చీఫ్ కంటెండర్ అయ్యారు. చీఫ్ కంటెండర్లకు మొదటగా ఓ గేమ్ పెట్టారు. అందులో కంటెండర్లు అందరూ జాకెట్ వేసుకుని నిలబడితే వారిపైకి హౌస్‌మేట్స్ బంతులు విసరాలి. ఎవరి జాకెట్‌కు ఎక్కువ బంతులు అతుక్కుంటే వారు అవుట్ అవుతారు. అందరికంటే గంగవ్వ ఎక్కువ హుషారుగా బాల్స్ విసరడం విశేషం. మొదటి రౌండ్‌లో గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు.

ఏడ్చేసిన రోహిణి
ఈ గేమ్‌లో విష్ణుప్రియ, పృథ్వీ.. తనను కావాలని గట్టిగా కొట్టారని రోహిణి ఫీలైంది. ఈమె దగ్గరకు విష్ణు వెళ్లి.. నాకు అతడి (పృథ్వీ) దగ్గరి నుంచి ఎనర్జీ వస్తుంది. డౌన్‌గా ఉన్నప్పుడే తన దగ్గరకు వెళ్తాను.. అందరితోనూ నేను బాగుంటాను అంటూ తన రిలేషన్ గురించి చెప్పింది. దీంతో రోహిణి.. నేనేమీ మీ గురించి లేనిది చెప్పలేదు.. మీరు అందరిముందు ఎలా ఉంటున్నారన్నదాని గురించే మాట్లాడాను.. అయినా తప్పుగా అనిపిస్తే సారీ అని చెప్పేసి వెళ్లిపోయింది.

బైక్ గెల్చుకున్న నయని
ఇక బాల్స్ గేమ్ రెండో రౌండ్‌లో నయని అవుట్ అవడంతో ఏడ్చేసింది. మూడో రౌండ్‌లో రోహిణి అవుట్ అయింది. సారీ చెప్పిన తర్వాత కూడా విష్ణుప్రియ గేమ్‌లో తనను టార్గెట్ చేయడంతో రోహిణి ఏడ్చేసింది. ఇక హరితేజ, మెహబూబ్, అవినాష్, మణి రెండో గేమ్‌లో పోటీపడగా చివరకు మెహబూబ్ గెలిచి మెగా చీఫ్‌గా నిలిచాడు. అనంతరం దమ్ముంటే స్కాన్ చెయ్ గేమ్‌లో విష్ణుప్రియ, నయని పావని ఆడారు. అయితే నయని పావని గెలిచి థండర్ వీల్స్ బైక్ పొందింది.









Comments
Please login to add a commentAdd a comment