Mehboob Shaikh
-
జీవితంలో కొత్త అధ్యాయం షురూ.. మెహబూబ్ దిల్సే ఎమోషనల్
బిగ్‌బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్సే (Mehaboob Dil Se) సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. తమ కుటుంబంలోకి ఓ బుడ్డోడు వచ్చాడంటూ మురిసిపోతున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. మా జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. మా కుటుంబంలో మరొకరు చేరారు. ఆనందభాష్పాలతో తనకు సాదర స్వాగతం పలుకుతున్నాం. మా లైఫ్‌లో నువ్వే పెద్ద గిఫ్ట్‌నా తమ్ముడు సుభాన్కు బాబు పుట్టాడు. అతడి రాకతో మా ఇల్లు మరింత ప్రేమమయంగా, నవ్వుల హరివిల్లుగా మారుతోంది. ఈ బుడ్డోడు ఇప్పటికే మాలో అంతులేని ఆనందాన్ని నింపాడు. తనే మా జీవితాల్లో అత్యంత విలువైన బహుమతి అని చెప్పకనే చెప్పాడు. మా బుడ్డోడు జీవితం సంతోషంగా, ఆరోగ్యంగా, సాఫీగా జరగాలని కోరుకుంటున్నాను. తండ్రిలాగే కరుణామయుడిగా, బలవంతుడిలా ఎదగాలని ఆశిస్తున్నాను. మరి నీ పెళ్లెప్పుడు?వీడ్ని నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు మా కుటుంబ బంధం మరింత బలపడినట్లు అనిపిస్తోంది అని భావోద్వేగానికి లోనయ్యాడు. ఇది చూసిన అభిమానులు మెహబూబ్ పెదనాన్న అయినందుకు శుభాకాంక్షలు చెప్తున్నారు. పనిలో పనిగా పెళ్లెప్పుడు చేసుకుంటావని ఆరా తీస్తున్నారు. దీనికి మెహు స్పందిస్తూ.. ఇప్పటికే ఇంట్లో పదేపదే పెళ్లి ప్రస్తావనే తెస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా మొదలుపెట్టారా? అని తల పట్టుకున్నాడు. View this post on Instagram A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse) చదవండి: రూ.8 కోట్లు పెడితే రూ.55 కోట్లు.. ఓటీటీలో మిస్టరీ థ్రిల్లర్ -
మెహబూబ్ అవుట్.. నొప్పి భరించలేక అవినాష్ సెల్ఫ్ ఎలిమినేట్
పండగ సెలబ్రేషన్స్‌లో బిగ్‌బాస్ ఎప్పుడూ ముందుంటుంది. ఇటీవలే హౌస్‌లో బతుకమ్మ, దసరా వేడుకలు జరిగాయి. ఇప్పుడు దీపావళి సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకలల్లో సినీ తారలు భాగమయ్యారు. మరి హౌస్‌లో జరిగిన రచ్చ, హంగామా ఏ రేంజ్లో ఉందో లైవ్ అప్డేట్స్లో చూసేయండి..పండగ సర్ప్రైజ్నాగార్జున దీపావళి పాటకు స్టెప్పులేస్తూ పండగ కళను తీసుకొచ్చాడు. తర్వాత హౌస్‌మేట్స్‌ను జంటలుగా విడగొట్టిస్టెప్పులు మీవి- మార్కులు మావి అనే గేమ్ ఆడించాడు. ప్రతి రౌండ్లో గెలిచిన టీమ్‌కు ఒక సర్ప్రైజ్ ఉంటుందన్నాడు. అలా మొదటి రౌండ్లో గంగవ్వ-తేజ గెలిచారు. ఈ జంటలో ఒకరికే ఇంటిసభ్యుల నుంచి మెసేజ్ వస్తుందన్నాడు. అలా తేజ త్యాగంతో గంగవ్వకు తన కూతురి వీడియో మెసేజ్ ప్లే చేశారు. అది చూసిన అవ్వ సంతోషంతో కన్నీళ్లుపెట్టుకుంది. తర్వాత విష్ణుప్రియను సేవ్ చేశారు.ప్రైజ్‌మనీలో మరో రూ.1లక్షఅనసూయ డ్యాన్స్‌తో జోష్ నింపింది. ప్రైజ్‌మనీ కవర్స్ కనుక్కోవాలన్న రెండో గేమ్‌లో నిఖిల్, యష్మీ గెలిచారు. వీరు కనిపెట్టిన కవర్లలోని రూ.1 లక్ష ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. తర్వాత ఈ జంటకు సంబంధించిన ఇంటిసభ్యుల ఫోటో చూపించారు. యష్మి త్యాగం చేయడంతో నిఖిల్ పేరెంట్స్ వీడియో ప్లే చేశారు. అలాగే నాగ్ నిఖిల్‌ను సేవ్ చేశాడు.ప్రేరణకు సర్ప్రైజ్తర్వాత 'క' మూవీ టీమ్ స్టేజీపైకి వచ్చింది. వీరు హౌస్మేట్స్ కళ్లకు గంతలు కట్టి గేమ్ ఆడించారు. ఇందులో ప్రేరణ-మెహబూబ్ గెలిచారు. మెహబూబ్ త్యాగంతో ప్రేరణకు వీడియో ప్లే చేశారు. ఆమె తన పేరెంట్స్ మాటలు విని మురిసిపోయింది. తర్వాత మెహరీన్ డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. సింగర్ సమీరా భరద్వాజ్.. హౌస్మేట్స్ అందరిపైనా అలవోకగా పాటలు పడేసి అబ్బురపరిచింది. ప్రతి ఒక్కరిపైనా అద్భుతంగా పాట పాడి అదరొట్టేసింది. స్టేజీపై దుల్కర్ సల్మాన్లక్కీ భాస్కర్ మూవీ హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ వెంకీ స్టేజీపైకి వచ్చారు. డైరెక్టర్స్ త్రివిక్రమ్, వెంకీలలో ఎవరిని సెలక్ట్ చేస్తావన్న ప్రశ్నకు మీనాక్షి.. వెంకీ అని బదులిచ్చింది. లక్కీ భాస్కర్ టీమ్ ఆడించిన గేమ్‌లో గౌతమ్-నయని పావని జంట గెలిచింది. వీరిలో నయని పావని తన తల్లి మెసేజ్‌ను త్యాగం చేయడంతో గౌతమ్.. అతడి తండ్రి వీడియో సందేశాన్ని వినగలిగాడు. ఇంట్లో గొడవపడి వచ్చిన గౌతమ్.. తండ్రికి సాష్టాంగ నమస్కారం చేసి మరీ సారీ చెప్పాడు.హరితేజ ఎమోషనల్హీరోయిన్ శాన్వీ స్పెషల్ డ్యాన్స్ పర్ఫామెన్స్తో మైమరపించింది. తర్వాత ప్రేరణ, పృథ్వీని సేవ్ చేశారు. అనంతరం అమరన్ హీరో శివకార్తికేయన్, హీరోయిన్ సాయిపల్లవి స్టేజీపైకి వచ్చారు. వీరు ఆడించిన గేమ్‌లో రోహిణి, అవినాష్ గెలిచారు. వీళ్లిద్దరూ తమకు బదులుగా హరితేజకు తన కూతురి వీడియో చూపించమన్నాడు. హాయ్ అమ్మ, హ్యాపీ దివాళి అంటూ కూతురు మాట్లాడిన ముద్దుముద్దు మాటలు విని హరితేజ ఏడ్చేసింది. తర్వాత హైపర్ ఆది హౌస్‌లోకి వచ్చి తన పంచ్ కామెడీతో నవ్వించాడు.ఏడ్చిన యష్మిఈ ఎపిసోడ్ కంటే ముందు ఏం జరిగిందన్నది చూపించారు. ఎవరినో ఉడికించడానికి యష్మి తనను వాడుకోవడం నచ్చలేదన్నాడు గౌతమ్. ఆ మాటలు విన్న యష్మి.. తన ఉద్దేశం అది కాదంటూ ఏడ్చేసింది. నిఖిల్, నేను ఫ్రెండ్స్‌లా టీజ్ చేసుకున్నాం తప్ప నువ్వంటే నాకు బాగా ఇష్టం అని ఎక్కడా ఒకరికొకరం ఎక్స్‌ప్రెస్ చేసుకోలేదు. నా వల్ల తప్పు జరిగుంటే సారీ అని చెప్పింది. దీంతో గౌతమ్.. ఇకపై నువ్వు నాకు కంటెస్టెంటు మాత్రమే.. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అని క్లారిటీ ఇచ్చేశాడు. నాగ్ నయనిని సేవ్ చేసి మెహబూబ్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు.అప్పుడలా ఇప్పుడిలా..వెళ్లిపోయేముందు మెహబూబ్ హౌస్‌మేట్స్‌ను పటాకాలతో పోల్చాడు. అవినాష్ ధౌజండ్‌వాలా, గంగవ్వ లక్ష్మీబాంబ్, నబీల్ రాకెట్, రోహిణి కాకరబత్తి, గౌతమ్ మ్యాచ్ స్టిక్ అన్నాడు. గతంలోనూ దీపావళికి నేను ఎలిమినేట్ అయ్యా.. ఈసారి కూడా దీపావళికే బయటకు వచ్చేశాను. ఎందుకో అర్థం కావట్లేదంటూ ఎమోషనల్ అయ్యాడు. అవినాష్ ఎలిమినేట్ఇక రేపటి ప్రోమోలో అవినాష్ అనారోగ్యంతో సెల్ఫ్ ఎలిమినేట్ అయినట్లు చూపించారు. కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాను. మెడికల్ రూమ్‌కు వెళ్తే బయటకు వచ్చేయమన్నారు. వెళ్లిపోతున్నాను అంటూ వీడ్కోలు తీసుకున్నాడు. హాస్పిటల్‌కు వెళ్లి మళ్లీ హౌస్‌లో అడుగుపెడతాడా? లేదా నిజంగానే వెళ్లిపోతాడా? అన్నది రేపు తేలనుంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 8: నయని సేఫ్, మెహబూబ్ ఎలిమినేట్!
బిగ్‌బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్టుగా ఎంట్రీ ఇచ్చేవారెప్పుడూ డేంజర్ జోన్లోనే ఉంటారు. ఎందుకంటే పాత కంటెస్టెంట్లపై జనాలకు ఓ అవగాహన ఉంటుంది. వారి బలాలు, బలహీనతలు.. ప్రతీది తెలుసు. పైగా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు ఫ్యాన్ బేస్‌లు కూడా ఏర్పడుతుంటాయి. కానీ సడన్‌గా వైల్డ్ కార్డ్స్ దిగితే.. వీరు సత్తా చూపించినా సరే పాత కంటెస్టెంట్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రేక్షకులు మొగ్గు చూపిస్తారు. డేంజర్ జోన్లో వైల్డ్ కార్డ్స్అలాంటిది పర్ఫామెన్స్ ఏమాత్రం బెడిట్టినా ఎలిమినేషన్ అనే వాకిట్లో నిలబెట్టేస్తారు. ఈసారీ అదే జరిగింది. ఈ వారం విష్ణుప్రియ, పృథ్వీ, ప్రేరణ, నిఖిల్, మెహబూబ్, నయని పావని నామినేషన్లో ఉన్నారు. వీరిలో మెగా చీఫ్‌గా ఫెయిలైన మెహబూబ్, టాస్కులో పెద్దగా కనిపించని నయని డేంజర్ జోన్లో ఉన్నారు. ఇప్పటికే సండే ఎపిసోడ్ షూటింగ్ పూర్తవగా.. నయని పావనిని ఎలిమినేట్ చేేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి. కానీ అంతలోనే మెహబూబ్ ఎలిమినేట్ అయినట్లు మరో వార్త వైరలవుతోంది. కమ్యూనిటీ ఓట్లు మనకు గట్టిగా పడతాయి అన్న మాటే అతడి ఎలిమినేషన్‌కు ప్రధాన కారణంగా మారింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సీత ఎలిమినేట్.. 'అతడు గెలిస్తే చూడాలనుంది'
దసరా సందర్భంగా బిగ్‌బాస్ స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. హీరోయిన్ల డ్యాన్స్, గెస్టుల రాక, టీమ్స్ మధ్య పోటీతో నేటి ఎపిసోడ్ వినోదాత్మకంగా సాగింది. పండగ సందర్భంగా నాగ్ పంచెకట్టుకుని సాంప్రదాయంగా ముస్తాబయ్యాడు. అటు హౌస్మేట్స్ కూడా అంతే కలర్ ఫుల్‌గా రెడీ అయ్యారు. మరి ఈ దసరా ఎపిసోడ్ ఎలా సాగిందో లైవ్ అప్డేట్స్లో చూసేయండి..అన్లిమిటెడ్ ఫుడ్ కావాలి!నాగార్జున మొదటగా యష్మిని సేవ్ చేశాడు. ఆ వెంటనే ఓ గుడ్‌న్యూస్ చెప్పాడు. ఇన్ఫినిటీ రూమ్‌కు వెళ్లి బిగ్‌బాస్‌ను ఏదైనా కోరిక కోరవచ్చని ఆఫర్ ఇచ్చాడు. కానీ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఓజీ టీమ్‌లో ఒకరికే ఈ ఛాన్స్ ఉంటుందన్నాడు. ఈ బంపర్ ఆఫర్ ఎవరికివ్వాలని అడిగినప్పుడు రాయల్ టీమ్‌లోని మెజారిటీ సభ్యులు నబీల్ పేరు సూచించారు. దీంతో అతడు ఇన్ఫినిటీ రూమ్‌కు వెళ్లి.. ప్రతివారం మార్కెట్‌కు వెళ్లే బాధ లేకుండా అన్లిమిటెడ్ ఫుడ్ కావాలన్నాడు. దీనికి బిగ్‌బాస్ ఏ నిర్ణయం తీసుకుంటాడు? ఎలాంటి కండీషన్స్ పెడతాడనేది సస్పెన్స్‌లోనే ఉంచారుఫస్ట్ టాస్క్‌లో ఓజీ టీమ్ గెలుపుతర్వాత లడ్డు తయారుచేసి మరీ స్పూన్‌తో తినిపించాలంటూ మొదటగా ఫన్ టాస్క్ ఇవ్వగా ఇందులో ఓజీ టీమ్ గెలిచింది. అనంతరం అమృత అయ్యర్ దాండియా పాటతో స్టేజీ దద్దరిల్లేలా చేసింది. ఇక నాగ్.. విష్ణుప్రియను సేవ్ చేశాడు. పకడో.. పకడో అనే రెండో గేమ్‌లో రాయల్ టీమ గెలుపొందింది. బతుకమ్మసింగర్ మంగ్లీ మాస్, లవ్, భక్తి పాటలు పాడుతూ అదరగొట్టేసింది. హౌస్‌లోకి వెళ్లి రెండు టీమ్స్‌తో బతుకమ్మ తయారు చేయించింది. గంగవ్వ అందంగా బతుకమ్మ పేర్చడంతో ఈ మూడో టాస్క్‌లో రాయల్ టీమ్ గెలిచింది. అనంతరం విశ్వం డైరెక్టర్ శ్రీను వైట్ల, హీరో గోపీచంద్ స్టేజీపైకి వచ్చి కాసేపు కబుర్లాడారు. విశ్వం సినిమా ట్రైలర్ కూడా ప్లే చేశారు.ఫరియా డ్యాన్స్దసరా దోస్తీ పేరిట హౌస్‌మేట్స్‌తో నాలుగో గేమ్ ఆడించారు. ఇందులో రాయల్ టీమ్ గెలిచింది. తర్వాత డింపుల్ హయాతి డ్యాన్స్‌తో అలరించగా అటు గంగవ్వ సేవ్ అయినట్లు ప్రకటించారు. మాట-పాట-టాటా అని హౌస్‌మేట్స్‌తో ఐదో గేమ్ ఆడించారు. ఇందులోనూ రాయల్ టీమే గెలిచింది. అనంతరం ఫరియా అబ్దుల్లా ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఓ ఊపు ఊపేసింది.రాయల్ టీమ్‌కు బంపర్ ఆఫర్నాగ్ హౌస్‌మేట్స్‌తో ఆర్మ్ రెజ్లింగ్ అని ఆరో గేమ్ ఆడించారు. ప్రేరణ.. హరితేజను, విష్ణుప్రియ.. రోహిణిని ఓడించింది. మెహబూబ్.. నిఖిల్‌ను, గౌతమ్.. పృథ్వీని ఓడించారు. ఈ గేమ్‌లో ఓజీ టీమ్ గెలిచింది. అయితే మెజారిటీ టాస్కులు గెలుపొందిన రాయల్ టీమ్ ఓవరాల్ విజేతగా నిలిచింది. దీంతో ఈవారం మెగా చీఫ్ అయ్యేందుకు రాయల్ టీమ్‌కు మాత్రమే అవకాశం ఉంటుందన్నాడు. రాయల్ టీమ్‌లోని వారే మెగా చీఫ్ కంటెండర్స్ అవుతారని నాగ్ తెలిపాడు.ముగ్గురికీ హార్ట్ ఇచ్చిన సీతచివర్లో నామినేషన్స్‌లో మిగిలినవారిలో మెహబూబ్‌ను సేవ్ చేసి సీతను ఎలిమినేట్ చేశారు. దీంతో విష్ణు ఎమోషనలైంది. నీకు నీ తల్లిని మర్చిపోయేంత మంచి పార్ట్నర్ దొరకాలని ఆశీస్సులు ఇచ్చింది. ఎలాంటి ముసుగు లేకుండా ఉండే నబీల్ గెలవాలంది. అవినాష్ పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చాడంది. అలా ఈ ముగ్గురికీ వైట్ హార్ట్ ఇచ్చింది.సీత కోసం మాటిచ్చిన మెహబూబ్తర్వాత నిఖిల్, గౌతమ్, నయనికి బ్లాక్ హార్ట్ ఇచ్చింది. నిఖిల్.. హజ్బెండ్ మెటీరియల్ అని చెప్పింది. గౌతమ్.. చిన్నచిన్నవాటికే హర్ట్ అవొద్దని సూచించింది. నయనికి.. వచ్చినప్పుడు నన్ను క్రై బేబీ అన్నావ్.. కానీ నాకన్నా ఎక్కువ ఏడుస్తున్నావ్.. ఈసారి చాలారోజులు ఉండమంటూ బాగా ఆడమని సూచించింది. చివర్లో మెహబూబ్ లేచి.. సీత తన తండ్రికివ్వాలనుకున్న బైక్‌ను తాను గిఫ్ట్‌గా ఇస్తానని మాటిచ్చాడు. మరిన్ని బిగ్‌బాస వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మెగా చీఫ్‌గా మెహబూబ్.. బైక్ గెల్చుకున్న నయని
మెగా చీఫ్‌గా నబీల్ పదవీకాలం ముగిసింది. దీంతో మెగా చీఫ్ పోస్ట్ కోసం మళ్లీ పోటీపెట్టారు. ఈసారి పాత కంటెస్టెంట్లను వెనక్కు నెట్టి సుడిగాలిలా హౌస్‌లో అడుగుపెట్టిన వైల్డ్కార్డుల్లో ఒకరే ఆ పోస్టును ఎగరేసుకుపోయారు. మరి ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి(అక్టోబర్ 10) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఎలిమినేషన్ గురించి ఛాలెంజ్వచ్చేవారం నువ్వే ఎలిమినేట్ అవుతానవి గంగవ్వ అనడంతో విష్ణుప్రియ తాను వెళ్లనంది. అవ్వ పోయేదాకా తాను పోనంది. దీంతో ఎవరు ఎక్కువ రోజులు ఉంటారో చూద్దామని గంగవ్వ, విష్ణుప్రియ ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకున్నారు. అటు ప్రేరణ.. నా మాట వినట్లేదు, నన్ను నమ్మట్లేదు, ఇమ్మెచ్యూర్గా ప్రవర్తిస్తున్నావంటూ నబీల్‌తో వాగ్వాదానికి దిగింది. దీంతో హర్టయిన నబీల్.. నేను ఇమ్మెచ్యూర్ కాదని అరిచాడు. ప్రాంక్ చేసిన గంగవ్వతర్వాత అతడు ప్రేరణను ఇమిటేట్ చేస్తూ మాట్లాడటం కాస్త వెగటుగా అనిపిస్తుంది. ఇక బిగ్‌బాస్ రాయల్ క్లాన్ (వైల్డ్ కార్డ్స్)లో నుంచి ఆరుగురు బెస్ట్ పర్ఫామర్లను మెగా చీఫ్ కంటెండర్స్ కోసం ఎంపిక చేయమన్నాడు. దీంతో అవినాష్.. తన పేరుతో పాటు నయని, మెహబూబ్, హరితేజ, రోహిణి, గౌతమ్ పేర్లను సూచించాడు. నా పేరు ఎవరూ చెప్పలేదని గంగవ్వ ఏడుస్తున్నట్లు నటించి అందర్నీ ఆటపట్టించింది.కంటెండర్‌గా మణిఅటు ఓజీ టీమ్‌లో రెండు స్టార్లున్న మణికంఠ, నబీల్ లలో ఒకరిని బెస్ట్ పర్ఫామర్‌గా సెలక్ట్ చేయాలన్నాడు. దీంతో టీమ్ అంతా కలిసి మణిని బెస్ట్ పర్ఫామర్ అని ప్రకటించడంతో అతడు చీఫ్ కంటెండర్ అయ్యారు. చీఫ్ కంటెండర్లకు మొదటగా ఓ గేమ్ పెట్టారు. అందులో కంటెండర్లు అందరూ జాకెట్ వేసుకుని నిలబడితే వారిపైకి హౌస్మేట్స్ బంతులు విసరాలి. ఎవరి జాకెట్‌కు ఎక్కువ బంతులు అతుక్కుంటే వారు అవుట్ అవుతారు. అందరికంటే గంగవ్వ ఎక్కువ హుషారుగా బాల్స్ విసరడం విశేషం. మొదటి రౌండ్లో గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. ఏడ్చేసిన రోహిణిఈ గేమ్‌లో విష్ణుప్రియ, పృథ్వీ.. తనను కావాలని గట్టిగా కొట్టారని రోహిణి ఫీలైంది. ఈమె దగ్గరకు విష్ణు వెళ్లి.. నాకు అతడి (పృథ్వీ) దగ్గరి నుంచి ఎనర్జీ వస్తుంది. డౌన్‌గా ఉన్నప్పుడే తన దగ్గరకు వెళ్తాను.. అందరితోనూ నేను బాగుంటాను అంటూ తన రిలేషన్ గురించి చెప్పింది. దీంతో రోహిణి.. నేనేమీ మీ గురించి లేనిది చెప్పలేదు.. మీరు అందరిముందు ఎలా ఉంటున్నారన్నదాని గురించే మాట్లాడాను.. అయినా తప్పుగా అనిపిస్తే సారీ అని చెప్పేసి వెళ్లిపోయింది. బైక్ గెల్చుకున్న నయనిఇక బాల్స్ గేమ్ రెండో రౌండ్లో నయని అవుట్ అవడంతో ఏడ్చేసింది. మూడో రౌండ్లో రోహిణి అవుట్ అయింది. సారీ చెప్పిన తర్వాత కూడా విష్ణుప్రియ గేమ్‌లో తనను టార్గెట్ చేయడంతో రోహిణి ఏడ్చేసింది. ఇక హరితేజ, మెహబూబ్, అవినాష్, మణి రెండో గేమ్‌లో పోటీపడగా చివరకు మెహబూబ్ గెలిచి మెగా చీఫ్‌గా నిలిచాడు. అనంతరం దమ్ముంటే స్కాన్ చెయ్ గేమ్‌లో విష్ణుప్రియ, నయని పావని ఆడారు. అయితే నయని పావని గెలిచి థండర్ వీల్స్ బైక్ పొందింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రోహిణిని టార్గెట్ చేసిన లవ్ బర్డ్స్.. కొత్త మెగా చీఫ్ ఎవరంటే?
బిగ్‌బాస్ హౌస్‌లో మెగా చీఫ్ కోసం మొదటి పోటీ జరిగింది. ఇందులో అవినాష్, రోహిణి, మెహబూబ్, మణికంఠ, గౌతమ్, హరితేజ, నయని పావని పాల్గొన్నారు. అయితే ప్రేమపక్షులు విష్ణుప్రియ- పృథ్వీ.. రోహిణిని టార్గెట్ చేసినట్లున్నారు. ఇక పృథ్వీ అయితే ఏకంగా తలకు గురి పెట్టి విసిరాడు. అవి తన కళ్లకు తగులుతుండటంతో రోహిణి ఫైర్ అయింది. దాడి చేశాక సారీ దేనికి?బాడీపై విసురు, కానీ కళ్లపై కొట్టవద్దని అరిచింది. ఒక్కరిపైనే దాడి చేసి తర్వాత సారీ చెప్పేస్తే నాకెలా అనిపిస్తుంది? అని రోహిణి బాధపడింది. అటు విష్ణుప్రియ.. మరి తను వచ్చీరాగానే నన్ను నామినేట్ చేసింది.. నాకెలా అనిపిస్తుంది? అయినా ఐ లవ్యూ చెప్తున్నాగా.. అని అభిప్రాయపడింది. ఏడుపందుకున్న నయనిఇక నయని పావని మరోసారి కన్నీటి కుళాయి ఓపెన్ చేసింది. నన్ను టాప్2లో తీసుకోలేదు, ముందే అవుట్ చేద్దామని మా టీమ్ డిసైడయ్యారంటూ కన్నీళ్లు పెట్టుకుంది. సీత ఊరికనే ఏడవడం నచ్చలేదని నామినేట్ చేసిన నయని.. ఇప్పుడు చేస్తుందేంటో? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇకపోతే ఈవారం నామినేషన్స్‌లో ఉన్న మెహబూబ్ మెగా చీఫ్‌గా గెలిచాడని సమాచారం.చదవండి: తనలో సడన్ మార్పు, చాలా సెల్ఫిష్.. ఇప్పటికీ చెప్తున్నా విష్ణు ఫేక్ ఫ్రెండ్! -
Bigg Boss 8: ఎనిమిదో వారం మెహబూబ్ ఎలిమినేట్
డ్యాన్స్ అంటే పిచ్చి.. యాక్టింగ్ అంటే కూడా అంతే ఇష్టం. ఎప్పటికైనా స్క్రీన్‌పై కనిపించాలనే కోరిక.. అందుకోసం మెహబూబ్ చేయని ప్రయత్నం లేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల సాఫ్ట్వేర్ కొలువులో చేరినా కళను వదిలేయలేకపోయాడు. వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలింస్, టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. తక్కువ సమయంలోనే ఎక్కువమంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.అలా తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజన్లో అడుగుపెట్టిన మెహబూబ్ టాస్కుల్లో సత్తా చూపించాడు. కండబలం బాగానే ఉన్నా బుద్ధి బలం తక్కువగా ఉండటంతో ఫినాలే వరకు వెళ్లకుండానే వెనుదిరిగాడు. ఇప్పుడు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. కానీ దురదృష్టం తోడుగా రావడం వల్ల నాలుగో సీజన్లో దీపావళికి ఎలిమినేట్ అయినట్లే ఈసారీ అదే పండగకు బయటకు వచ్చేశాడు. -
గేమ్ ఛేంజర్: డబ్బులిచ్చి రీల్స్? మెహబూబ్ ఏమన్నాడంటే?
రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ సినిమా నుంచి అలా పాటలు రిలీజ్ చేయగానే ఇలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ మధ్యే రా మచ్చా మచ్చా పాట విడుదలవగా దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన రీల్స్ కనిపిస్తున్నాయి. అయితే ఇలా రీల్స్, షార్ట్స్ చేయడానికి కొంతమంది ఇన్ఫ్లూయెన్సర్లకు చిత్రయూనిట్ డబ్బు చెల్లించిందంటూ ఓ ప్రచారం జరుగుతోంది.రీల్‌కు రూ.10 వేలు?ఈ వ్యవహారంపై బిగ్‌బాస్ ఫేమ్ మెహబూబ్ దిల్సే స్పందించాడు. ఆ ప్రచారం నిజమేనంటూ తాను చాటింగ్ చేసినట్లు వైరలవుతున్న ఓ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ ఇది ఫేక్ అని క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ ఆ స్క్రీన్‌షాట్‌లో ఏముందంటే.. రీల్ చేయడానికి రూ.10,000 ఇస్తున్నారు కదా? అని ఓ నెటిజన్ అడిగాడు. అందుకు మెహబూబ్.. అవును, రీల్స్ చేయమని రూ.80 వేలు పంపారు. ట్యాగ్స్ కూడా వాళ్లే ఇచ్చారు అని రిప్లై ఇచ్చినట్లుగా ఉంది. ఎడిటింగ్‌లో టాలెంట్ బానే ఉంది'నేనే స్వయంగా రిప్లై ఇచ్చినట్లు బాగానే ఎడిట్ చేశారు. చాలా టాలెంట్ ఉంది. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు' అని క్లారిటీ ఇచ్చాడు. స్క్రీన్ రికార్డింగ్ వీడియో కూడా పెడితే నిజంగా ఆ చాట్ ఎవరు చేశారన్న నిజం బయటకు వస్తుందన్నాడు. మెహబూబ్ బిగ్‌బాస్ 8వ సీజన్లో వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వనున్నాడు.సినిమా..గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. శ్రీకాంత్, అంజలి, సముద్రఖని, ఎస్జే సూర్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం క్రిస్మస్కు విడుదల కానుంది.చదవండి: మృణాల్ ఠాకూర్ సోదరి గురించి తెలుసా? ఈమెను అందంగా.. -
బిగ్‌బాస్ 8.కొత్త పోకడ, మాజీ కంటెస్టెంట్లతో వర్కవుట్ అవుతుందా?
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డులను తీసుకురావాలన్న ఆలోచన ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిందేమీ కాదు. సీజన్ ప్రారంభమయ్యే రోజు కేవలం 14 మందినే హౌస్‌లోకి పంపించి.. వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని స్పష్టంగా చెప్పేశారు. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో చాలామందికి గేమ్ మీదకన్నా కొట్లాటలు, ముచ్చట్ల మీదే ఫోకస్ ఎక్కువగా ఉంది. ఒకరిద్దరికి తప్ప ఎవరికీ విజేత లక్షణాలు లేవు.ఎనిమిది వైల్డ్ కార్డ్ ఎంట్రీలువీరితో షో నెట్టుకురావడం కష్టమని భావించిన బిగ్‌బాస్ టీమ్ వైల్డ్‌గా ఉంటే కంటెస్టెంట్లను తీసుకురావాలని ప్లాన్ చేసింది. కొత్తవాళ్లను తీసుకొస్తే వర్కవుట్ అవుతుందో, లేదోనని డౌట్ పడ్డారో ఏమో కానీ పాత సీజన్ల నుంచి కంటెస్టెంట్లను ఎంపిక చేశారు. ఒక్కో సీజన్లో నుంచి ఒక్కో ఆణిముత్యాన్ని తీసుకుని హౌస్‌లోకి పంపించనున్నారు. అలా హరితేజ, గంగవ్వ, గౌతమ్ కృష్ణ, నయని పావని, రోహిణి, అవినాష్, టేస్టీ తేజ, మెహబూబ్ దిల్సేను ఎంపిక చేసినట్లు భోగట్టా! హౌస్‌లో ఉన్నవాళ్లతో పోలిస్తే వీళ్లు చాలా బెటర్.గంగవ్వఇకపోతే గంగవ్వను తీసుకురావడమే అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది. బిగ్‌బాస్ నాలుగో సీజన్లో గంగవ్వతోనే ఐదు వారాలు ఆటను నెట్టుకొచ్చారు. అయితే ఏసీ పడట్లేదు, హౌస్‌లో ఉండలేను, నన్ను పంపించండి మహాప్రభో.. అని బతిమాలడంతో ఆమెను ఎలిమినేట్ చేసేశారు. కానీ సొంతింటి కల నెరవేర్చుకోవాలన్న కోరికతో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గంగవ్వ కలను నాగార్జున సాకారం చేశాడు. ప్రస్తుతం హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు మాజీ కంటెస్టెంట్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదట! (చదవండి: బిగ్‌బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఆదిత్య ఔట్)ముచ్చటగా మూడోసారి..అందుకే గంగవ్వను బతిమాలో, బలవంతపెట్టోగానీ హౌస్‌కు తీసుకువస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే తనవల్ల కాదని గంగవ్వ చేతులెత్తేయడంతో ఆమె స్థానంలో వితికా షెరును తీసుకువస్తున్నారన్నది లేటెస్ట్ టాక్ గౌతమ్ కృష్ణ.. అశ్వత్థామ 2.0 అంటూ అప్పట్లోనే సీక్రెట్‌రూమ్‌కు వెళ్లి వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా మళ్లీ హౌస్‌లో అడుగుపెట్టాడు. ముచ్చటగా మూడోసారి హౌస్‌లోకి వెళ్లబోతున్న ఇతడు ఎలా మెప్పిస్తాడో చూడాలి. రోహిణి, అవినాష్, హరితేజల గురించి భయపడాల్సిన పనేలేదు.నయని పావనిఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో వీళ్లెప్పుడూ ముందుంటారు. గత సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నయని పావని ఒక్కవారంలోనే ఎలిమినేట్ అయింది. కానీ వారం రోజుల్లోనే తనకంటూ మంచి పేరు సంపాదించుకుంది. మరి ఈసారైనా ఎక్కువవారాలు ఉంటుందేమో చూడాలి. మెహబూబ్ టాస్కులు బాగా ఆడతాడు, తేజ ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తాడు. మరి ఈ ఎనిమిది మంది హౌస్‌లో ఉన్నవారికి టఫ్ కాంపిటీషన్ ఇస్తారేమో వేచి చూడాలి!బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బర్త్‌డే పార్టీ వివాదంపై స్పందించిన మెహబూబ్
బిగ్‌బాస్ ఫేమ్ మెహబూబ్ దిల్సే పుట్టినరోజు వివాదం వార్త నెట్టింట భారీగా వైరల్ అయింది. తాజాగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో రియాక్ట్ అయ్యాడు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉండే కాంటినెంట్ రిసార్ట్‌లో జరిగిన పార్టీలో పలువురు సెలబ్రిటీలతో పాటు బుల్లితెర నటులు హాజరయ్యారు. అయితే, అనుమతలు లేకుండా మద్యం పార్టీ నిర్వహించారని రిసార్ట్ యజమానితో పాటు మెహబూబ్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మెహబూబ్ ఇలా స్పందించాడు.'జులై 29న నా పుట్టినరోజు జరిగింది. అయితే, నా తమ్ముడు సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేశాడు. అందులో నా కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం తెలంగాణ పోలీసులు హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్న రిసార్ట్‌లను తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మా పార్టీ జరుగుతున్న రిసార్ట్‌కు కూడా పోలీసులు వచ్చారు. అనుమతి లేకుండా మద్యం పార్టీ జరగకూడదని మా వద్ద ఉన్న బాటిల్స్ అన్నీ వారు సీజ్ చేశారు. అందుకు మేము కూడా ఒప్పుకున్నాం. కానీ, ఈ రిసార్ట్‌లో మద్యం అనుమతి ఉందని యజమాని చెప్పడంతోనే నా తమ్ముడు బుక్ చేశాడు. అయితే, కొందరు మీడియా వారు దీనిని తప్పుగా క్రియేట్ చేశారు. రేవ్ పార్టీ అంటూ ప్రచారం చేయడం నన్ను చాలా అన్యాయం. పార్టీలో చాలామంది మహిళలు ఉన్నారు. వారి గురించి తప్పుగా మాట్లాడుతూ వీడియోలు చేస్తున్నారు. ఇది చాలా దారుణం. మీడియా అంటే నాకు చాలా గౌరవం ఉంది. పూర్తి విషయం తెలుసుకోకుండా వార్తలు రాసేస్తే ఎలా..? నాపై తప్పుడు కథనాలు ఇచ్చిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటా.' అని వీడియో ద్వార చెప్పాడు. View this post on Instagram A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse) -
బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్‌పై కేసు నమోదు..?
బిగ్‌బాస్ ఫేమ్ మెహబూబ్ దిల్సే తాజాగా పుట్టినరోజు తన సన్నిహితులతో జరుపుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉండే కాంటినెంట్ రిసార్ట్‌లో జరిగిన పార్టీలో పలువురు సెలబ్రిటీలతో పాటు బుల్లితెర నటులు హాజరయ్యారు. అయితే, అనుమతలు లేకుండా పార్టీ నిర్వహించారని పోలీసులు గుర్తించారు. దీంతో మెహబూబ్‌తో పాటు రిసార్ట్ యజమాని మీద పోలీసులు కేసు నమోదు చేశారు.మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో ఉండే కాంటినెంట్ రిసార్ట్‌లో మెహబూబ్ బర్త్‌డే పార్టీ జరిగింది. అందులో చాలామంది యువతీయువకులు పాల్గొన్నారు. రిసార్ట్‌లలోకి అనుమతి లేకుండా మద్యం తెచ్చుకుని సేవించడం నేరం అని ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం పార్టీలకు అనుమతి లేదని వారు తెలిపారు.పార్టీలో 11 లీటర్ల మద్యంతో పాటు 7 లీటర్ల బీరు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ పోలీసులు చెప్పారు. మెహబూబ్ పార్టీలు పాల్గొన్న కొందరు మాత్రమే మద్యం సేవించినట్లు తెలుస్తోంది. వారి వద్ద ఎలాంటి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు లేవని సమాచారం. తన పుట్టినరోజు సందర్భంగా అనాథ ఆశ్రమంలో కేక్ కట్ చేసిన మహబూబ్ ఆపై అక్కడ ఉన్న వారందరికీ ఒక పూట భోజనం అందించాడు. వారందరితో సరదాగ గడిపి ఫోటోలు దిగాడు. అయితే, తన స్నేహితులకు ఇచ్చిన పార్టీ వల్ల ఆయన చిక్కుల్లో పడినట్లు అయింది. ఈ అంశం గురించి మెహబూబ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. View this post on Instagram A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse) -
మెహబూబ్ ఇంట షాదీ వేడుకలు.. ఫోటోలు వైరల్
మ్యూజిక్ వీడియోలు, డ్యాన్స్ స్టెప్పులతో అందరినీ తనవైపు తిప్పుకున్నాడు మెహబూబ్ దిల్సే. టిక్‌టాక్ వీడియోలతో బాగా ఫేమస్ అయిన ఇతడు యూట్యూబ్‌లో షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్‌తోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఎప్పుడైతే బిగ్‌బాస్‌లో అడుగుపెట్టాడో అప్పుడే అతడి దశ తిరిగిపోయింది. పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు.. ఈ రెండూ అతడి సొంతమయ్యాయి. ఫలితంగా సొంతింటి కల సాకారం, తనకంటూ కొత్త కారు కొనుకున్నాడు. తాజాగా అతడి ఇంట పెళ్లి సంబరాలు జరిగాయి. మెహబూబ్ తమ్ముడు సుభాన్ షైఖ్ ఓ ఇంటివాడయ్యాడు. పెళ్లి డ్రెస్‌లో ఉన్న తమ్ముడితో పాటు, తండ్రితో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు మెహబూబ్. 'నిఖా ముబారక్ మేరా భాయ్.. ప్రియమైన సోదరుడా.. నీ కలలు నిజం కావాలని, ఆ అల్లా మీ ఇద్దరినీ ఎల్లప్పుడూ కలిసి ఉంచాలని కోరుకుంటున్నాను. ఒకరినొకరు అర్థం చేసుకోండి. ఒకరికొకరు తోడుగా ఉండండి. ఎప్పుడూ సహనం, ఓర్పుతో మెదలండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు నిఖా చేసుకున్న సుభాన్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అమ్మ కూడా ఉండుంటే బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు. కాగా గతేడాది మెహబూబ్ తల్లి మరణించింది. View this post on Instagram A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse) చదవండి: తప్పును అంగీకరిస్తున్నా.. దయచేసి క్షమించండి -
లగ్జరీ కారు కొన్న మెహబూబ్ దిల్సే, ఎన్ని లక్షలో తెలుసా?
గుంటూరు మిర్చి లాంటి కుర్రోడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్సే కొత్త కారు కొన్నాడు. ఈద్ పండగ సందర్భంగా మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కారును ఇంటికి తెచ్చుకున్నాడు. దీని ధర రూ.15 లక్షల పైనే ఉంటుందని తెలుస్తోంది. బ్లాక్ కలర్లో మెరిసిపోతున్న కారు ముందు దిగిన ఫోటోలను మెహబూబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇది చూసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్లు సోహైల్, శ్రీరామచంద్ర, కాజల్, అర్జున్ కల్యాణ్, రవికృష్ణ తదితరులు అతడికి శుభాకాంక్షలు చెప్తున్నారు. నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి అన్నా అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. రంజాన్ మాసం కావడంతో తన స్నేహితులకు ఇఫ్తార్ పార్టీ కూడా ఇచ్చాడు మెహబూబ్. కాగా మెహబూబ్ టిక్‌టాక్ వీడియోలు, వెబ్ సిరీస్‌లతో పాపులర్ అయ్యాడు. బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్‌తో అతడికి కావాల్సినంత గుర్తింపు లభించింది. బిగ్‌బాస్ 4 గ్రాండ్ ఫినాలే వేదికగా చిరంజీవి అందించిన పది లక్షల రూపాయలకు తోడు తను సంపాదించిన డబ్బులను జత చేసి గుంటూరులో సొంతిల్లు కట్టుకున్నాడు. నిత్యం యూట్యూబ్ వీడియోలు, వెబ్ సిరీస్‌లతో మెహబూబ్ తన అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse) చదవండి: సినిమా హిట్.. థియేటర్‌కు వెళ్లిన దర్శకుడికి షాక్.. -
శ్రీసత్యకు ప్రపోజ్ చేసిన మెహబూబ్, చేయి కోసుకుంటానంటూ బ్లాక్మెయిల్!
బిగ్‌బాస్ ఫేం శ్రీసత్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బిగ్‌బాస్ 6 సీజనల్లో హౌజ్‌లో అడుగుపెట్టి తనదైన ఆట తీరుతో బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె స్టార్ మా ప్రసారం అవుతున్న బిబి జోడి డాన్స్‌లో షోలో అలరిస్తోంది. ఇందులో శ్రీసత్య మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సేతో జోడికట్టింది. వీరిద్దరి జోడికి మంచి రెస్పాన్స్ వస్తోంది. స్టేజ్‌పై డాన్స్ చేస్తుండగా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందంటూ షో జడ్జస్ కూడా వారి పర్ఫామెన్స్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: వాగ్వాదంగా మారిన అనసూయ వాలంటైన్స్ డే పోస్ట్, చెప్పుతో కొడతానంటూ..! ఇదిలా ఉంటే మంగళవారం వాలంటైన్స్ డే సందర్భంగా మెహబూబ్ దిల్ సే శ్రీసత్యకి ఎర్ర గులాబిల బోకెతో ప్రపోజ్ చేసి షాకిచ్చాడు. దీంతో శ్రీసత్య అతడిపై సీరియస్ అయిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కొరియోగ్రఫర్స్ ప్రియాంక, సంకేత్ల సాయంతో మహబూబ్ దిల్ సే శ్రీసత్యకు తన ప్రేమను వ్యక్తం చేశాడు. శ్రీసత్య దగ్గరికి వెళ్లి మొదట పరోక్షంగా ఓ అమ్మాయిని ప్రమించానని, తను రిజెక్ట్ చేస్తే తట్టుకోలేనంటూ వాపోయాడు. ఎవరిని అంటూ ఆరా తీయగా.. నిన్నేనని ఆమెను సర్ప్రైజ్ చేశాడు. దీంతో శ్రీసత్య షాకైన శ్రీసత్య బిగ్‌బాస్ హౌజ్‌లో పెంట అయ్యింది.. ఇప్పుడు కూడా పెంట అయ్యిద్ది? అంటూ మహబూబ్‌పై గట్టిగా అరిచింది. చదవండి: అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి, స్వయంగా వెల్లడించిన స్వీటీ దీనికి అతడు ‘నువ్వు, నీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చాయ్. నీలాంటి మంచి అమ్మాయిని వదుకోవాలనుకోవడం ఇష్టం లేదు’ అంటూ తన మనసులో మాట చెప్పాడు. ఇక శ్రీసత్య తన ప్రపోజల్‌ను ఒప్పుకోకపోవడంతో చేయి కోసుకుంటానంటూ మహబూబ్ బ్లాక్మెయిల్ చేయడంతో.. ‘ఇప్పటికే నేను ఆత్మహత్యయత్నం కూడా చేశా తెలుసా? నా ఎంగేజ్మెంట్ బ్రేకప్ తర్వాత నా లైఫ్‌లో ఎవరికి మరో చాన్స్ ఇవ్వాలనుకోవడం లేదు. నాకు మనుషుల మీదే నమ్మకం పోయింది’ అంటుంది శ్రీసత్య. అలా కాసేపు ఇద్దరు అర్గ్యూ చేసుకున్న అనంతరం ఇది ప్రాంక్ అంటూ అందరికి షాకిచ్చాడు మహబూబ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. -
గుంటూరులో ఇల్లు కట్టిన మెహబూబ్, ఫ్యామిలీతో గృహప్రవేశం
మెహబూబ్ దిల్సే.. నాట్ జస్ట్ ఏ యూట్యూబర్.. వెరీ టాలెంటెడ్ యాక్టర్, డ్యాన్సర్ కూడా! ఇల్లు కట్టుకోవాలన్న కల అందరిలాగే అతడికి కూడా ఉండేది. బిగ్‌బాస్ షో అతడి కలకు పునాదులు వేసింది. తన కష్టార్జితానికి తోడు కుటుంబమంతా తలా కొంత సాయం చేయడంతో సొంతింటి కలను నిజం చేసుకున్నాడు మెహబూబ్. తల్లిదండ్రులు, తమ్ముడు, తాను తలా కొంత కూడబెట్టుకున్న డబ్బుతో ఓ చిన్న ఇల్లు కొనుక్కున్నామని చెప్పుకొచ్చాడు. గుంటూరులో ఉన్న ఆ ఇల్లును చూపిస్తూ హోమ్ టూర్ వీడియో చేశాడు. ఈ ఇంటికి ఒకవైపు మూడు గదులు ఏర్పాటు చేయించి వాటిని దుకాణాల కోసం రెంట్‌కు ఇచ్చేలా నిర్మించారు. దీంతో గ్రౌండ్ ఫ్లోర్లో చిన్న హాల్, కిచెన్, సింగిల్ బెడ్ రూమ్ మాత్రమే ఉన్నాయి. మొదటి అంతస్థులో కిచెన్, హాల్‌తో పాటు రెండు విశాలమైన డబుల్ బెడ్ రూమ్స్ ఉన్నాయి. మెహబూబ్ తన అభిరుచికి తగ్గట్టుగా కప్‌బోర్డ్స్, వాల్ పేపర్ అన్నీ దగ్గరుండి వేయించినట్లు తెలుస్తోంది. కరోనా వల్ల పనులన్నీ చాలా లేట్‌గా అయ్యాయాన్న మెహబూబ్ ఫ్యామిలీ.. మొత్తంగా ఈ ఇల్లు కట్టడానికి 16 నెలలు పట్టిందని వెల్లడించింది. ఇంతకీ ఆ ఇల్లు ఎలా ఉందో మీరూ చూసేయండి.. -
టిక్‌టాక్ స్టార్‌కి ప్రపోజ్ చేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్
Bigg Boss 4 Fame Mehaboob Dil Se Proposed To Swetha Naidu: బిగ్‌బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సే గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యూట్యూబ్, టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయిన మెహబూబ్ గతేడాది బిగ్‌బాస్ సీజన్-4లో పాల్గొని మరింత పాపులర్ అయ్యాడు. ఇటీవలె 'గుంటూరు మిర్చి' అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించాడు. ప్రస్తుతం కవర్ సాంగ్స్, వెబ్‌సిరీస్‌లు చేస్తూనే, మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా యూట్యూబర్, టిక్‌టాక్ స్టార్ శ్వేత నాయుడుకు ప్రపోజ్ చేశాడు. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ కలిసి కవర్ సాంగ్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ మెహబూబ్ ఎక్కువగా శ్వేత నాయుడుతోనే రీల్స్ అప్లోడ్ చేస్తుంటాడు. తాజాగా ఆమెకు తన ప్రేమ విషయాన్ని బయటపెట్టాడు. 'ఎప్పటి నుంచో చెబ్దాం అనుకున్నా. కానీ ఎప్పుడు ఎలా అయ్యిందో తెలియదు. ఎందుకు ఇష్టం అన్నదానికి ఆన్సర్ తెలియదు. నువ్వు నా తోడుంటే బెటర్, సక్సెస్ఫుల్ పర్సన్‌ని అవుతా. నాతో జీవితాంతం తోడుంటావా' అంటూ తన మనసులో మాటను రివీల్ చేశాడు. దీంతో శ్వేత సైతం సిగ్గుపడుతూ మెహబూబ్ ప్రేమను అంగీకరించింది. దీనికి సంబంధించిన వీడియోను మెహబూబ్ తన సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. మరి ఈ ఇది రియల్ వీడియోనా లేక యూట్యూబ్ కోసం చేసిన ఫ్రాంక్ వీడియోనా అన్నది తెలియాల్సి ఉంది. -
సొంతింటి కల సాకారం, మెహబూబ్ దిల్సే ఎమోషనల్
'గుంటూరు మిర్చి'లాంటి కుర్రాడు మెహబూబ్ దిల్సే. యూట్యూబ్, టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయిన ఇతడు గతేడాది బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాడు. టాస్కుల్లో ప్రాణం పెట్టి ఆడే మెహబూబ్ ఫ్రెండ్షిప్కు కూడా ఎంతో ప్రాధాన్యం ఇస్తాడు. బిగ్‌బాస్ ద్వారా కేవలం పాపులారిటీ మాత్రమే కాకుండా మంచి మిత్రులను, ఎన్నో ఆఫర్లను అందుకున్నాడు. అంతేకాకుండా ఏకంగా మెగాస్టార్ చిరంజీవి కంట్లో కూడా పడ్డాడు. బిగ్‌బాస్ 4 గ్రాండ్ ఫినాలేకి ప్రత్యేక అతిథిగా వచ్చిన చిరు.. మెహబూబ్ డ్యాన్సింగ్ కెపాసిటీకి, ఎనర్జీకి ఆశ్చర్యపోయాడు. సినిమాల్లోకి రావాలన్న మెహబూబ్ తపన, ఆరాటం చూస్తుంటే తనను తాను చూసుకున్నట్లుందని ముచ్చటపడిపోయాడు. అతడు అనాథాశ్రమానికి చేసిన సాయాన్ని చూసి అభినందించాడు. అంతేకాదు, మెహబూబ్ సొంతింటి కల సాకారం చేయడం కోసం రూ.10 లక్షల చెక్కును బహుమతిగా అందించాడు. మొత్తానికి ఈ బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ సొంతింటి కల నెరవేరింది. ఆదివారం కొత్తింట్లోకి కుటుంబ సమేతంగా అడుగుపెట్టినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు మెహు. 'ఒక సొంతిల్లు ఉండాలి, కట్టుకోవాలని చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది. మొత్తానికి అనుకున్నది సాధించాం. మీ అందరి వల్లే ఇక్కడిదాకా వచ్చాము. మమ్మల్ని ఆశీర్వదించిన భగవంతుడికి కృతజ్ఞతలు. అలాగే నాకు సపోర్ట్ చేసిన అభిమానులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు' అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇదిలా వుంటే ప్రస్తుతం మెహబూబ్ వరుస ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉన్నాడు. ఓ పక్క వెబ్‌సిరీస్‌లు చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన గుంటూరు మిర్చి వెబ్ సిరీస్ యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతోంది. View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) చిరంజీవి మెహబూబ్‌కు ఇచ్చిన 10 లక్షల రూపాయల చెక్ -
అది రిలేషన్ కాదన్న నటి, బెదిరించిన మంచు లక్ష్మి
► చబ్బీ లుక్‌లో అనుపమ పరమేశ్వరన్ ► ఫిష్ కట్ గౌనులో అషూ రెడ్డి అందాలు ► రిలేషన్షిప్ మూడు నెలలకన్నా ఎక్కువ కాలం నిలవలేదంటే దాన్ని ఇంటర్న్‌షిప్ అని పిలవండంటోన్న ఊర్వశి రౌతేలా ► అద్దంలో కనిపించే వాళ్లే మీకు పోటీ అంటున్న అఖిల్ సార్థక్ ► బ్లాక్ డ్రెస్‌లో కవ్విస్తోన్న పాయల్ రాజ్‌పుత్ ► గొడ్డలి పట్టుకుని బెదిరిస్తున్న మంచు లక్ష్మీ ► ఒక వీడియోలో నవ్విస్తూ మరో వీడియోలో ఏడిపిస్తోన్న మెహబూబ్ దిల్సే ► చెన్నైక్ టాటా చెప్పేసి ముంబై చేరుకున్న శ్రద్దాదాస్ ► పూల చీరలో సాక్షి అగర్వాల్ పరువాలు ► క్యూట్‌గా అనిపిస్తోందంటోన్న హంసా నందిని View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Hamsa Nandini | Actress (@ihamsanandini) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Sakshi Malik (@sakshimalikk) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Kirti Kulhari (@iamkirtikulhari) View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) View this post on Instagram A post shared by ANMOL CHAUDHARY (@anmolchaudharyofficial) -
మెహబూబ్ సైగలపై సోహైల్ రియాక్షన్
బిగ్‌బాస్ నాలుగో సీజన్.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించింది. ఆటలు, పాటలు, అలకలు, గొడవలు, కోపాలు, బుజ్జగింపులు, ప్రేమ, గాసిప్స్ ఇలా అన్నీ పంచిపెట్టింది. ఈ సీజన్లో మొత్తం 19 మంది బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టగా వారిలో కొంత మందికి మాత్రమే సరైన గుర్తింపు లభించింది. తమ తలరాతను మార్చేలా భవిష్యత్తు అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. బిగ్‌బాస్‌తో లైఫ్ చేంజ్ అయిన వారిలో సోహైల్ ముందు వరుసలో ఉంటాడు. ఇప్పటి వరకు అడపాదడపా సినిమాల్లో నటించిన సోహైల్‌కు పెద్దగా చెప్పుకునే అంతా పేరు రాలేదు. కానీ బిగ్‌బాస్‌లోకి వెళ్లిన తర్వాత తన లైఫ్ వేరేలా మారిపోయింది. సీజన్ మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాడు. అయితే ఇంత పాపులారిటీ సంపాదించిన సోహైల్‌కు ఒక్కసారిగా ట్రోల్స్, మీమ్స్‌తో గట్టి ఎదురుదెబ్బ ఎదురయ్యింది. చదవండి: బిగ్‌బాస్: బయటపడ్డ సోహైల్, మెహబూబ్ కుట్ర! బిగ్‌బాస్ చివరి అంకానికి చేరుకున్న సమయంలో ఎలిమినేట్ అయిన సభ్యులు ఇంట్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అద్దాలతో ఏర్పాటు చేసిన గది నుంచి ఒక్కొక్కరూ వచ్చి టాప్ 5 కంటెస్టెంట్లను కలిసి కాసేపు అలరించారు. అయితే మెహబూబ్ మాత్రం సోహైల్‌తో ఏవో సైగలు చేసినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అందరితో కూల్‌గా మాట్లాడినట్లు నటించిన నటించిన మెహబూబ్.. తన సంజ్ఞలతో సోహైల్‌కు ఏదో చెప్పాడని నెటిజన్లు మండిపడ్డారు. సోహైల్ నెంబర్ త్రీలో ఉన్నట్టు మెహబూబ్ అద్దంపై మూడు వేళ్లతో సూచించినట్టు ఆరోపిస్తున్నారు. అలాగే, డబ్బులు తీసుకునే ఆఫర్ గనుక వస్తే వదిలిపెట్టొదని సిగ్నల్ ఇచ్చినట్టు అనుమానిస్తున్నారు. ఇక మెహబూబ్ చెప్పినట్లుగానే టాప్ 3 కంటెస్టెంట్లుగా మిగిలిన అఖిల్, అభిజిత్, సోహైల్‌కు బిగ్‌బాస్ భారీ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫైనల్ పోటీ నుంచి తప్పుకున్నవారికి రూ.25 లక్షలు ఇస్తామని బిగ్‌బాస్ చెప్పగా.. సోహైల్ ఆ డీల్‌కు అంగీకరించాడు. రూ.25 లక్షలు తీసుకుని హౌజ్ నుంచి బయటికొచ్చాడు. దీంతో మెహబూబ్ చెప్పడం వల్లే ఎలాగూ తనది మూడో స్థానం అని సోహైల్ డబ్బులు తీసుకున్నాడని, తద్వారా విన్నర్ అభిజిత్‌కు ప్రైజ్ మనీలో సగం కోత పడిందని అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సోహైల్‌కు బ్రహ్మానందం బంపర్ ఆఫర్ కాగా తాజాగా మంగళవారం సోహైల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియోలోకి వచ్చారు. ఎవరు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చేప్తానని చెప్పడంతో అనేకమంది మెహబూబ్ సైగా విఫయాన్ని కామెంట్ల రూపంలో ప్రశ్నించారు. దీంతో మెహబూబ్ సైగలపై స్పందిస్తూ ఆగ్రహానికి గురయ్యాడు. బిగ్‌బాస్‌లో తరువాత ఏం జరుగుతుందనేది అసలు ఎవరికి తెలియదని, ఎవరు ఉంటారు, ఎవరు పోతరని ఎవరికి తెలియదు. ‘అంతా సీన్ లేదు అక్కడ. అట్ల ఉంటే మంచిగుండు. ఏరోజు అలాంటి పరిస్థితి రాలేదు. అలాగే చిన్న లాజిక్ చెబుతా. జాగ్రత్తగా వినండి. వాడు ఏదో గ్లాస్‌ను పట్టుకుని ఊరికే చేతి వేళ్లను అలా అన్నాడు. అసలు వాడేమన్నడో నాకు తెలియదు. టాప్ 3లో ఎవరుంటరనేది ఎవరూ జడ్జ్ చేయలేదు. నేడు విన్నర్ అయ్యే వాడినేమో, టాప్ 2లో ఉండే వాడినేమో. వాడు ఎలా చెప్తడు. వాడికి ఎలా తెలుస్తోంది. మెహబూబ్ బిగ్‌బాస్ కాదు. వాడు డబ్బులు గెలుచుకొని రారా అని సిగ్నల్ చేసిండేమో.. తను చెప్పింది అర్థం కాలేదని తర్వాత అఖిల్‌తో కూడా చర్చిందాను. దాన్ని పట్టుకొని వీడియోలు చేసి, కథలు పడి ఇవన్నీ చేయడం నాకు నచ్చలేదు. నా పది సంవత్సరాల కష్టం. నా కెరీర్ మీద ఒట్టేసి చెప్తున్నా. నిజంగా అలా అన్నది ఎందుకు అన్నాడో నాకు తెలీదు. టాప్ 3 అని నేను అన్నది తెలీదు. నేను నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంత అని అడిగాను. అంతే అయినా థర్డ్ ప్లేస్‌లో ఉన్న వాళ్లకు డబ్బులు ఇస్తారని మెహబూబ్‌కు ఎలా తెలుసు. 25 లక్షలు 25 లక్షలు ఆఫర్ ఇస్తే మనం వినియోగించుకుందాం అని అఖిల్ నేను అనుకున్నాం. అంతేగాని మూడో ప్లేస్‌లో ఉంటే డబ్బులు ఇస్తారని ఎవరికి తెలియదు. నేను అలా స్కాం చేసి చేసి గెలిస్తే నా కెరీర్లోనే బాగుపడను. అసలు అది ఫ్రాడ్, స్కాం కాదు. అభిజిత్ ఫ్యాన్స్‌కు కూడా చెబుతున్నా. నేను తప్పు చేయనప్పుడు ఖచ్చితంగా చెప్తా. బిగ్‌బాస్ హౌజ్‌లో అసలేం జరుగుతుందో ముందే ఎవరికి తెలియదు’ అని సోహైల్ వివరించాడు. -
మెహబూబ్ వల్లే సోహైల్ అలా చేశాడా?!
బిగ్‌బాస్ తెలుగు సీజన్-4 కంటెస్టెంట్ మెహబూబ్ దిల్‌సేపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. హౌజ్‌లోనూ, బయట కూడా అతను ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని బిగ్‌బాస్ ప్రేక్షకులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రూపాయి పెర్మార్మెన్స్ చేయమంటే మూడు రూపాయల యాక్టింగ్‌తో బిల్డప్ ఇస్తున్నాడని విమర్శిస్తున్నారు. ఆదివారం జరిగిన బిగ్‌బాస్-4 గ్రాండ్ ఫినాలే సందర్భంలోనూ అతని అతి కనిపించిందని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. చీఫ్ గెస్ట్‌గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి మెహబూబ్ గురించి మాట్లాడుతుంటే ప్రాణం పోయినట్టుగా చేశాడని, అతనికి చిరంజీవి రూ.10 లక్షలు ఇస్తానని చెప్పినప్పుడు కూడా ఆ ఓవర్ కనిపించిందని పోస్టులు పెడుతున్నారు. బిగ్‌బాస్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు అతని ప్రవర్తనలో మార్పు లేదని మండిపడుతున్నారు. (అఖిల్ నిజంగానే బకరా అయ్యాడా?!) ఇదిలాఉంటే.. గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. హౌజ్ నుంచి ఎలిమినేట్ అయినవారు టాప్ 5 కంటెస్టెంట్లతో కలుసుకునే అవకాశాన్ని బిగ్‌బాస్ కల్పించాడు. అద్దాలతో బిగించిన రూమ్లోకొచ్చి మాజీ కంటెస్టెంట్లు ఒక్కొక్కరూ హౌజ్‌లో ఉన్న అఖిల్, అభిజిత్, సోహైల్, అరియానా, హారికను తమ మాటలు, పాటలు, డ్యాన్సులతో హుషారెత్తించారు. అయితే, మెహబూబ్ మాత్రం సోహైల్‌తో ఏవేవో సైగలు చేసినట్టు వీడియోలో అతని కదలికల ద్వారా తెలుస్తోంది. అందరితో మామూలుగానే జోష్ నింపినట్టు నటించిన మెహబూబ్.. తన సంజ్ఞలతో సోహైల్‌కు ఏదో చెప్పాడని మిగతా కంటెస్టెంట్ల అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బహుశా, సోహైల్ నెంబర్ త్రీలో ఉన్నట్టు మెహబూబ్ అద్దంపై మూడు వేళ్లతో సూచించినట్టు ఆరోపిస్తున్నారు. అలాగే, డబ్బులు తీసుకునే ఆఫర్ గనుక వస్తే వదిలిపెట్టొదని సిగ్నల్ ఇచ్చినట్టు అనుమానిస్తున్నారు. కాగా, టాప్ 3 కంటెస్టెంట్లుగా మిగిలిన అఖిల్, అభిజిత్, సోహైల్‌కు బిగ్‌బాస్ భారీ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫైనల్ పోటీ నుంచి తప్పుకున్నవారికి రూ.25 లక్షలు ఇస్తామని బిగ్‌బాస్ చెప్పగా.. సోహైల్ ఆ డీల్‌కు అంగీకరించాడు. రూ.25 లక్షలు తీసుకుని హౌజ్ నుంచి బయటికొచ్చాడు. ఇక మెహబూబ్ చెప్పడం వల్లే ఎలాగూ తనది మూడో స్థానం అని సోహైల్ డబ్బులు తీసుకున్నాడని, తద్వారా విన్నర్ అభిజిత్‌కు ప్రైజ్ మనీలో సగం కోత పడిందని అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియో కింద చూడవచ్చు 👇 Mehaboob Leaked Sohel's Position Yesterday that he is not the Winner😂 So Today, Sohel preferred 25L instead of 2,3 places which he got from audience votes👍#BiggBossTelugu4#BBTeluguGrandFinale pic.twitter.com/mENk78bsxa — Vinod Reddy (@Vinod_Since1990) December 21, 2020 -
మెహబూబ్‌కు రూ.10 లక్షలిచ్చిన చిరు
పెద్ద హీరోలది పెద్ద మనసని చాటి చెప్పారు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే సాక్షిగా కంటెస్టెంట్ల ఆశయాలకు మద్దతు తెలుపుతూ వారికి సాయం చేశారు. గ్రాండ్ ఫినాలేకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ తన మాటలు, పంచ్‌లతో షోను మరో మెట్టు పైకి ఎక్కించారు. అలాగే బిగ్‌బాస్ సాక్షిగా యువ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు కంకణం కట్టుకున్నట్లు కనిపించింది. ఈ క్రమంలో సోహైల్‌కు ఏం కావాలో కోరుకోమని అడిగారు. దానికి అతడు తను తీయబోయే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రావాలని ఆహ్వానించాడు. ఇది సరిపోదనుకున్న చిరు ఏకంగా అతడి సినిమాలో నటిస్తానని కోట్లాది మంది ప్రేక్షకుల సాక్షిగా మాటిచ్చారు. అంతేకాకుండా ఆ సినిమా ప్రమోషన్ బాధ్యత కూడా భుజాన వేసుకున్నారు. ఇక దివికి తన నెక్స్ట్ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ ఇస్తున్నట్లు తెలిపారు. నన్ను నేను చూసుకున్నట్లుంది: చిరు మెహబూబ్ గురించి మాట్లాడుతూ.. అతడిని చూస్తుంటే చిన్నప్పుడు తనను తాను చూసుకున్నట్లుంది అని చిరంజీవి చెప్పుకొచ్చారు. సినిమాల్లోకి రావాలని నా చిన్నప్పుడు ఎలా తపన చెందానో అది నీలో కనిపిస్తుందన్నారు. ఈ సందర్భంగా నాగార్జున కలగజేసుకుని సోహైల్ గెలుచుకున్న డబ్బు గురించి ప్రస్తావించారు. 'సోహైల్ అందుకున్న 25 లక్షల రూపాయల్లో అనాథశ్రమానికి రూ.5 లక్షలు మెహబూబ్ ఇంటి కోసం రూ.5 లక్షలు ఇస్తానన్నాడు. అయితే మెహబూబ్ మాత్రం దాన్ని తిరస్కరించాడు. తనకివ్వాలనుకున్నదాన్ని కూడా అనాథశ్రమానికి ఇచ్చేయమని సూచించాడు' అని వివరించారు. (చదవండి: 25 లక్షలకు సోహైల్ టెంప్ట్) సోహైల్‌కు మరో పది లక్షలిచ్చిన నాగ్ అయితే సోహైల్ గెలుచుకున్న మొత్తాన్ని అతడి కోసమే వాడుకోవాలని నాగ్ సూచించారు. అతడు దానం చేద్దామనుకున్న పది లక్షలను తన జేబులో నుంచి ఇస్తానని నాగ్ ప్రకటించారు. దీంతో నాగార్జునను ప్రేరణగా తీసుకున్న చిరంజీవి మెహబూబ్‌కు అవసరమయ్యే డబ్బు నేనిస్తాను అంటూ స్టేజీ మీదనే రూ.10 లక్షల చెక్ రాసిచ్చారు. మెగాస్టార్ తనకు చెక్ రాసివ్వడాన్ని నమ్మలేకపోయిన మెహబూబ్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఏడ్చుకుంటూ వచ్చి ఆయన కాళ్ల మీద పడ్డాడు. దీంతో చిరంజీవి అతడిని ఓదార్చుతూ.. మీరు కళాకారులయ్యా.. కళాకారులు కన్నీళ్లు పెట్టకూడదు అంటూ దగ్గరకు చేరదీసి హత్తుకున్నాడు. అతడికి ప్రేమగా ముద్దు పెట్టి పది లక్షల చెక్ ఇచ్చారు. మొత్తానికి సోహైల్ సినిమాలో నటిస్తాననడం, దివికి సినిమా ఛాన్స్, మెహబూబ్‌కు చెక్ ఇవ్వడం మెగాస్టార్ ప్రత్యేకతను చాటుతున్నాయి. మనసున్న మారాజుగా ఆయన్ను అభిమానుల గుండెల్లో నిలబెట్టాయి.(చదవండి: బిగ్‌బాస్: నెరవేరుతున్న గంగవ్వ కల) -
నిజంగానే దివి బ్యూటీ విత్ బలం కూడా
సాక్షి, హైదరాబాద్: బిగ్‌బాస్ సిజన్ 4 గ్రాండ్ ఫినాలేకు సిద్దమవుతోంది. ఈ సిజన్ ట్రోఫీ గెలుచుకునేది ఎవరా అని బిగ్‌బాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురూచుస్తున్నారు. ఈ క్రమంలో హౌజ్ నుంచి వెళ్లిపోయిన మెహబూబ్ దిల్సే, దివిలకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి. ఇందులో దివి మహబూబ్‌ను ఎత్తుకుని ఫొటోలకు ఫొజిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను మెహబుబ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా గురువారం షేర్ చేశాడు. (చదవండి: సీరియల్స్‌లో అవకాశాలు, కానీ.. : దివి) వీటిని ‘బ్యూటీ విత్ బ్రెయిన్ యే కాదు.. బ్యూటీ విత్ బలం కూడా’ అంటూ మెహబూబ్ పోస్టు చేశాడు. అయితే హౌజ్‌లోని మగవారందరిలో మహబుబ్ కండలవీరుడన్న సంగతి తెలిసిందే. ఫిజికల్ లాస్క్లు వస్తే చాలు అందరూ మహబూబ్‌ను చూసి దడుచుకునే వారు. అలాంటి మెహబూబ్‌ను దివి అలవోకగా ఎత్తుకోవడమే కాక ఎంచక్కా ఫొటోలకు ఫొజులు ఇవ్వడం చూసి నెటిజన్లంతా ఆశ్చర్యపోతున్నారు. దీంతో ‘నిజంగానే దివి బ్యూటీ విత్ బలం’ అంటూ ప్రశంసిస్తున్నారు. (చదవండి: బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే: స్టార్ హీరో ఫిక్స్!) View this post on Instagram A post shared by Mehaboob Shaikh 👑 (@mehaboobdilse) -
హారికతో డేట్‌కు వెళ్తా: మెహబూబ్
బిగ్‌బాస్ నాల్గో సీజన్ ప్రారంభమైన తొలినాళ్లలో మెహబూబ్‌కు అంతగా స్క్రీన్ స్పేస్ దొరకలేదు. తర్వాత తర్వాత నెమ్మదిగా పుంజుకున్న అతడు టాస్కుల్లో తన సత్తా చూపి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఆవేశంలో నోరు జారడం, రోబో టాస్కులో అతిగా ఆవేశపడటం, కోపంలో నోరు జారడం, కేవలం ఫిజికల్ టాస్కుల మీద మాత్రమే దృష్టి పెట్టడమే అతన్ని ఎలిమినేషన్ దిశగా నడిపించాయి. దీంతో పదోవారంలో ఇంటి సభ్యులను ఏడిపిస్తూ హౌస్ నుంచి భారంగా వీడ్కోలు తీసుకున్నాడు. బయటకు వచ్చాక అతడు అభిజిత్, సోహైల్‌కు తన పూర్తి మద్దతు తెలుపుతున్నాడు. దీంతో కొందరు నెటిజన్లు అఖిల్ నీ ఫ్రెండే కదా అతడికి ఎందుకు సపోర్ట్ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. దీనిపై మెహబూబ్ స్పందిస్తూ అతడు నామినేషన్లో లేడని, నామినేషన్లోకి వచ్చినప్పుడు అతడికి కూడా సపోర్ట్ చేస్తానని క్లారిటీ ఇచ్చాడు. అలాగే తన బిగ్‌బాస్ జర్నీ గురించి ప్రత్యేక వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాడు. పది వారాలు ట్రోల్ చేశారు మెహబూబ్ తనపై జరిగిన ట్రోలింగ్‌పై స్పందిస్తూ.. 'బయట అప్పటికే నాకో ఫేమ్ ఉంది. అయితే అది టిక్‌టాక్ వల్లే వచ్చింది. అందుకే బిగ్‌బాస్ ఛాన్స్ వచ్చింది అని చాలామంది అనుకున్నారు. అందుకే ట్రోల్ చేశారు. ఒక్కవారం కూడా ఉండనని అన్నవాళ్లు కూడా ఉన్నారు. కాకపోతే వాళ్లకు నేను ఎలా ఉంటానో తెలీదు. కాబట్టి అక్కడికి వెళ్లాక నన్ను చూసి వీళ్ల అభిప్రాయం మారుతుంది అనుకున్నా. అయినా సరే పది వారాల దాకా నామీద ట్రోలింగ్ ఆగలేదు. నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేయలేదు. నన్ను సపోర్ట్ చేస్తే వాళ్లను ఎక్కడ ట్రోల్ చేస్తారో అని! కేవలం నా కుటుంబం, ప్రేక్షకుల వల్లే ఇన్నివారాలు లోపల ఉన్నా. చివరికి నేను ఎలిమినేట్ అవుతుంటే, నేను లోపల ఉండాల్సిన వ్యక్తిని అని అంతా అంటున్నారు, అది సంతోషంగా ఉంది. మంచిగా ఉన్నా, చెడుగా ఉన్నా ట్రోల్ జరుగుతుంది' అని తేలికగా తీసిపారేశారు. (చదవండి: మెహబూబ్ గుడ్‌బై: అవినాష్‌పై బిగ్‌బాంబ్) ముందు నా గురువును కలుస్తా ఫిమేల్ కంటెస్టెంట్లలో ఎవరిని పెళ్లి చేసుకుంటారు? ఎవరితో డేటింగ్ చేస్తారు? ఎవరిని చంపుతారు? అన్న ప్రశ్నకు దివితో పెళ్లి, హారికతో డేటింగ్, అరియానాను చంపేస్తానని మొహమాటం లేకుండా చెప్పాడు. ముందుగా ఈ సీజన్ నుంచి ఇదివరకే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లలో మొట్ట మొదటగా తన గురువు అమ్మ రాజశేఖర్‌ను కలుస్తానని చెప్పుకొచ్చాడు. ఇచ్చిన టాస్కుల్లో తనకు విలన్ పాత్ర బాగా ఇష్టమని చెప్పాడు. హౌస్‌లో అఖిల్-మోనాల్, అభిజిత్-హారిక, సోహైల్-మెహబూబ్, అవినాష్-అరియానా జంటలు బాగుంటాయని తెలిపాడు. (చదవండి: హారికను ఓ చోటకు తీసుకెళ్తా: అభిజిత్) అరియానా బోల్డ్, కానీ ఇన్నోసెంట్ అమ్మాయి కంటెస్టెంట్ల గురించి చెప్తూ.. "అభిజిత్ నాకు పెద్దన్నలా ఉండేవాడు. భుజం సమస్య ఉంది కాబట్టి సరిగా ఫిజికల్ టాస్కులు ఆడలేకపోయాడు. కానీ ఇప్పుడు మాత్రం టాస్కుల్లో అల్లాడిస్తున్నాడు. కచ్చితంగా టాప్ 3లో ఉంటాడు. అఖిల్ కొన్ని విషయాల్లో ఎమోషనల్ అయిపోతున్నాడు. కాస్త కోపం ఎక్కువ. కానీ బాగా ఆడతాడు. మోనాల్ గేమ్ ఇప్పుడిప్పుడే స్ట్రాంగ్ అవుతోంది. అవినాష్ అందర్నీ ఎంటర్టైన్ చేస్తాడు. బంధాలకు విలువిస్తాడు. అరియానాకు ఆరోగ్యం బాగోలేనప్పుడు ఆమెను బాగా చూసుకున్నాడు. అరియానా.. నిజంగా బోల్డ్. లోపల మాత్రం ఇన్నోసెంట్ గర్ల్. లాస్య అక్క చాలా మంచిది. టాస్కుల్లో మాత్రం కొంచెం తగ్గుతోంది. అమ్మ రాజశేఖర్.. షో కోసం మనమేం చేయగలం అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. మాస్టర్ చాలా మంచి వ్యక్తి. గంగవ్వ.. ఫైటర్. దివి నా బెస్ట్ ఫ్రెండ్, చాలా అందంగా ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడుతుంది. సోహైల్.. దిల్దార్ ఉంటాడు. వాడు టాప్ 3లో ఉండాలి. హారిక.. ఫైటర్. టాస్కుల్లో అబ్బాయిలతో సమానంగా ఆడుతుంది" అని పేర్కొన్నాడు. -
మెహబూబ్ అవుట్: ఎంత కష్టపడ్డా ఫలితం లేదు
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో పదోవారం మెహబూబ్ దిల్సే షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. దీంతో కుమిలిపోయిన సోహైల్ బోరుబోరుమంటూ ఏడ్చేశాడు. ఊహించని దెబ్బకు మెహబూబ్ కూడా విలవిల్లాడిపోయాడు. ఎంత కష్టపడినా ఫలితం దక్కట్లేదని తలరాతను తిట్టుకున్నాడు. కానీ బిగ్‌బాస్ హౌస్ ఎన్నో నేర్పించిందని సంతోషించాడు. చివరిసారిగా డ్యాన్స్ చేసి అందరినీ కంటతడి పెట్టించాడు. మరి నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్ ఎలా సాగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చదివేయండి.. రెండుసార్లు గెలిచిన సోహైల్! హోస్ట్ నాగార్జున ఇంటిసభ్యులతో గద్ద కుందేలు ఆట ఆడించారు. మొదట గద్దగా మారిన అభి కుందేలుగా ఉన్న ఇంటిసభ్యుల్లో నుంచి అఖిల్‌ను పట్టుకుని గద్దగా మార్చేశాడు. ఇలా గేమ్ పూర్తయ్యేసరికి అందరూ గద్దలుగా మారిపోగా సోహైల్ మాత్రం కుందేలుగా ఉండి విజేతగా నిలిచాడు. తర్వాత అరియానా సేఫ్ అయినట్లు తెలిపారు. అనంతరం ఒకరు బొమ్మ గీస్తే మిగతావాళ్లు దాన్ని ఆధారంగా చేసుకుని సినిమా పేరు చెప్పాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో సోహైల్ లీడర్‌గా అవినాష్, అఖిల్, హారిక ఒక టీమ్, అరియానా లీడర్‌గా మెహబూబ్, లాస్య, అభిజిత్, మరో టీమ్‌గా విడిపోయారు. మోనాల్ సంచాలకురాలిగా వ్యవహరించింది. (చదవండి: జబర్దస్త్‌లోకి మళ్లీ తీసుకుంటారు: అవినాష్ తమ్ముళ్లు) లాస్యను ఆంటీ అని ఆటపట్టించిన అవినాష్ ఈ గేమ్‌లో అందరికన్నా అవినాష్ బాగా ఆడుతూ ఎగిరి గంతులేశాడు. ఈ క్రమంలో అమ్మాయిలు, ఆంటీలు, ఫిగర్లు అంటూ తిరిగావో యాసిడ్ పోసి చంపేస్తానని హారిక డైలాగ్ చెప్తూ అవినాష్ మీద బాటిల్ గుమ్మరించేసింది. అనంతరం మోనాల్ సేఫ్ అయినట్లు ప్రకటించారు. తర్వాత లాస్యను ఆంటీ అంటూ అవినాష్ ఆటపట్టించడంతో ఆమె అతడిని ఏడవలేక నవ్వుతూ హెచ్చరించింది. ఇక సినిమా పేర్లను కనుక్కునే గేమ్‌లో అరియానా టీమ్‌ను చిత్తుచిత్తుగా ఓడించి సోహైల్ టీమ్ విజయాన్ని ముద్దాడింది. అనంతరం హారిక సేఫ్ అయినట్లు తెలిపారు. (చదవండి: దివి నన్ను కాపాడిన దేవత, హౌస్‌లో అభి దండగ) విజయం కోసం పదేళ్లుగా ఎదురు చూస్తున్నా చివరికి సోహైల్, మెహబూబ్ డేంజర్ జోన్లో మిగిలారు. ఈ సందర్భంగా సక్సెస్ కోసం పదేళ్లుగా కల కంటున్నా అని సోహైల్, కష్టపడుతున్నాను కానీ దురదృష్టం వెంటాడుతోందని మెహబూబ్ బాధపడ్డాడు. మెహబూబ్ చెప్పినట్టుగానే అతడి నెత్తి మీద దరిద్రం దాండియా ఆడుతోంది. ఫలితంగా మెహబూబ్ ఎలిమినేట్ అయినట్లు నాగ్ వెల్లడించడంతో సోహైల్ కన్నీటిపర్యంతమయ్యాడు. టాప్ 5లో ఉంటామంటూ ఇప్పుడు వెళ్లిపోతున్నాడని చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. దీంతో స్నేహితుడి కన్నీళ్లను తుడుస్తూ.. నువ్వు, అఖిల్ తప్పకుండా టాప్ 5లో ఉండాలంటూ మెహబూబ్ కూడా దుఃఖించాడు. ఇంటిసభ్యుల నుంచి భారంగా వీడ్కోలు తీసుకున్నాడు. రేపటి నుంచి ఎవరితో డ్యాన్స్ చేయాలి? హౌస్‌ను వీడి వచ్చేసిన మెహబూబ్ తనకు బిగ్‌బాస్ షో చాలా నేర్పిందని, అందరూ తనకు స్విమ్మింగ్ కూడా నేర్పారని చెప్పుకొచ్చాడు. కాగా 'నువ్వు లేకపోతే నేను డ్యాన్స్ చేయలేను' అని హారిక, ఎగ్ దోశ ఎవరికి వేయాలని లాస్య కన్నీళ్లు పెట్టుకున్నారు. మెహబూబ్ మాట్లాడుతూ.. హౌస్‌లో అభిజిత్ తనకు అన్నలాగా ఉన్నాడని వెక్కివెక్కి ఏడ్చాడు. ఇంత హార్డ్ వర్క్ చేసేవారిని తానెప్పుడూ చూడలేదని అభి చెప్పుకొచ్చాడు. ఇక ఎవరికి ఆరోగ్యం బాగోలేకపోయినా మోనాల్ దగ్గరుండి చూసుకుంటుందని, హౌస్‌లో బెస్ట్ ఎంటర్టైనర్ అవినాష్ అని, అఖిలే నంబర్ 1 అని మెహబూబ్ చెప్పుకొచ్చాడు. (చదవండి: బిగ్‌బాస్: ఏంటేంటి? అతడు టైటిల్ ఎగరేసుకుపోతాడా?) హౌస్‌లో సోహైల్ ఉంటే మెహబూబ్ ఉన్నట్లే మరోవైపు సోహైల్ మాత్రం దుఃఖ సాగరంలో నుంచి బయట పడలేకపోయాడు. మొన్న మాస్టర్ పోయాడు, తర్వాత అఖిల్ వెళ్లొచ్చాడు, ఇప్పుడు మెహబూబ్ వెళ్తున్నాడు అంటూ వెక్కివెక్కి ఏడ్చాడు. అతడిని మెహబూబ్ అతికష్టం మీద ఓదారుస్తూ బిగ్‌బాస్‌లో నువ్వు ఎన్ని రోజులు ఉంటే తాను కూడా అన్ని రోజులు లోపల ఉన్నట్లే అని చెప్పుకొచ్చాడు. చివరగా ఓ హిందీ పాటకు ఆర్తిగా డ్యాన్స్ చేస్తూ అందరినీ ఏడిపించేశాడు. అనంతరం నెక్స్ట్ వీక్ నాన్‌వెజ్ తినకూడదనే బిగ్‌బాంబ్‌ను అవినాష్ మీద వేశాడు. -
ఎలిమినేషన్: సోహైల్‌కు షాకుల మీద షాకులు
'స్నేహం అంటే ప్రాణమిస్తాం' అన్న డైలాగులు చాలా విన్నాం. కానీ స్నేహితులే తన ప్రాణమని భావించే వ్యక్తి సోహైల్. అతడికి బిగ్‌బాస్ షాకుల మీద షాకులిస్తున్నాడు. అఖిల్ ఎలిమినేట్ అయ్యాడంటూ నిన్నటివరకు ఏడిపించిన బిగ్‌బాస్ ఇప్పుడు మరో ఫ్రెండ్ మెహబూబ్‌ను నిజంగానే హౌస్ నుంచి పంపించి వేశాడు. ఈ బాధను తట్టుకోలేకపోయిన సోహైల్ ఒక్కసారిగా కన్నీటిపర్యంతం అయ్యాడు. ఇంతకు ముందు సీజన్లలో ఎలిమినేషన్ జరిగినప్పుడు ఏడుస్తుంటే కంటెస్టెంట్ల ఓవరాక్షన్ ఏందని ఎగతాళి చేసేవాళ్లం. కానీ ఇక్కడ నిజంగా ఆ ఎమోషన్స్ ఏంటో తెలుస్తున్నాయి అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. బ్రెయిన్, మనసు.. ఈ రెండింటితో కొట్లాడాలని ఆవేదన చెందుతున్నాడు. అతడిని ఓదార్చడం ఎవరి తరమూ కావట్లేదు. (చదవండి: సోహైల్ వేస్ట్‌గాడు, ఎవ్వరూ పట్టించుకోరు: హారిక) అటు హారిక, మోనాల్, అఖిల్ కూడా మెహబూబ్ వెళ్లిపోతున్నందుకు ఏడ్చేశారు. ఈ ప్రోమో చూసి నెటిజన్లు సైతం భావోద్వేగానికి లోనవుతున్నారు. సోహైల్ ఏడుపును డ్రామా కాదని, వాళ్ల ఫీలింగ్స్‌ను ఎగతాళి చేయకండని పలువురు సూచిస్తున్నారు. సోహైల్ ఏడుస్తుంటే మాకు తెలియకుండానే దుఃఖం తన్నుకొస్తోందని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక మెహబూబ్‌కు ప్రారంభ ఎపిసోడ్లే దెబ్బ తీశాయన్నది తెలిసిన విషయమే. కానీ టాస్కుల్లో తన సత్తా చూపుతూ ఎదుటివారికి చెమటలు పట్టించాడు. అయితే బిగ్‌బాస్ అంటే కేవలం ఫిజికల్ టాస్క్ మాత్రమే కాదన్న విషయం తెలుసుకోలేకపోయాడు. ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమయ్యాడు. ఫలితంగా మొదట్లో అతడు చేసిన అతి వల్ల ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నాడు. ఇక బిగ్‌బాస్ బజ్‌లో రాహుల్ సిప్లిగంజ్ మెహబూబ్‌ను ఇంటర్వ్యూ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి: బిగ్‌బాస్ నుంచి మెహబూబ్ అవుట్!) -
బిగ్‌బాస్: మెహబూబ్ ఎలిమినేటెడ్!
పదోవారం ముగింపులోకి వచ్చిన బిగ్‌బాస్ హౌస్ నుంచి ఇప్పటికే పది మంది కంటెస్టెంట్లు వెళ్లిపోయారు. సూర్యకిరణ్, కల్యాణి, దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్, సుజాత, కుమార్ సాయి, దివి, అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యారు. అనారోగ్య కారణాలతో గంగవ్వ, నోయల్ స్వతంత్రంగా హౌస్‌ను వీడి వచ్చేశారు. ఇక రేపటి ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది పక్కన పెట్టి అసలు ఎలిమినేషన్ ఉంటుందా? లేదా? అని అందరూ అయోమయంలో పడిపోయారు. నామినేషన్లోకి వచ్చి బుక్కయ్యాడు కానీ తాజాగా లీకువీరులు చెప్తున్న సమాచారం ప్రకారం ఎలిమినేషన్ ఎత్తేయలేదు. దీపావళి పండగను సాకుగా చెప్తూ అందరినీ సేఫ్ చేయలేదు. ముందు నుంచి ఊహిస్తున్నదాని ప్రకారం మెహబూబే ఈ వారం ఎలిమినేట్ అయ్యాడని వినికిడి. నిజానికి ఎప్పుడో బ్యాగు సర్దేయాల్సింది. కానీ అదృష్టం బాగుండి తప్పించుకు తిరుగుతున్నాడు. ఎట్టకేలకు నామినేషన్లోకి వచ్చి అడ్డంగా బుక్కయ్యాడు. నామినేషన్లో ఉన్నవాళ్లలో అరియానా మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ మెహబూబ్ మీద అంతకన్నా ఎక్కువే ఉండటంతో అతడికి పెద్దగా ఓట్లు కురవలేదు. (చదవండి: మాస్టర్ అవుట్: మెహబూబ్‌కు కెప్టెన్సీ, కానీ!) రోబో టాస్కు నుంచి మెహబూబ్‌పై వ్యతిరేకత ఇక్కడ చిత్రమేమిటంటే హౌస్‌లో ఉన్న చాలామందితో పోలిస్తే మెహబూబ్ స్ట్రాంగ్ ప్లేయర్. ఫిజికల్ టాస్కులో ఇరగదీస్తాడు. మిగతావాళ్లకు గెలిచే అవకాశాన్నే ఇవ్వడు. అయితే అతడికి కండబలం ఉంది కానీ బుద్ధిబలం కాస్త తక్కువ. దాని ప్రతిఫలంగా కాయిన్ల టాస్కులో గెలిచే అవకాశాన్ని కాలితో తన్నేశాడు. టాస్కుల్లో తప్పితే సాధారణ సమయాల్లో అతడికి ఎక్కువగా స్క్రీన్ స్పేస్ కూడా లభించలేదు. తన జిగిరీ దోస్త్ సోహైల్‌తో స్నేహం తప్ప ప్రేక్షకులను ఆకర్షించేందుకు ఏం చేయాలన్నదానిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇక రోబో టాస్కులో అతిగా ఆవేశపడి మొదట్లోనే వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. తర్వాత టాస్కులు ఆడుతూ తన గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేసినా వీక్షకుల్లో మాత్రం మెహబూబ్‌పై ఆ వ్యతిరేకత అలాగే ఉండిపోయింది. ఫలితంగా ఈ వారం ఎలిమినేట్ అవక తప్పలేనట్లు తెలుస్తోంది. మరి ఈ విషయాన్ని నాగార్జున రేపటి ఎపిసోడ్లో అధికారికంగా ప్రకటిస్తారా? లేదా ఏమైనా ట్విస్టులిస్తారా? అనేది చూడాలి. (చదవండి: లాఠీలతో కొట్టి స్టేషన్లో వేశారు: మెహబూబ్) -
బిగ్‌బాస్: ఎలిమినేషన్? రీ ఎంట్రీ?
బిగ్‌బాస్ సీజన్ ప్రారంభమైందంటే వినోదానికి ఢోకా లేనట్టే. కానీ ఈ నాల్గో సీజన్ మాత్రం ప్రారంభంలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో కాస్త తడబడినట్లు కనిపించినా.. ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకుని జనాలను తిరిగి తనవైపుకు తిప్పుకుంటోంది. అయితే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు మాత్రం ఇంకా గందరగోళంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఐయామ్ బోల్డ్, స్ట్రాంగ్ అంటూ వీరవనితలా మాట్లాడిన అరియానా ఇంటిసభ్యులందరూ తనపై నామినేషన్ అనే అస్త్రాన్ని వదలగానే మన్ను తిన్న పాములా మారిపోయింది. తన అల్లరితో ఇల్లు పీకి పందిరి వేసే ఆమె ఇప్పుడు హౌస్‌లో ఉందా? లేదా? అన్నట్లుగా ఉంది. అటు అవినాష్ కూడా నోయల్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నాడు. ఫిజికల్ టాస్కు అంటే మెహబూబ్ ఉండాల్సిందే ఇక కెప్టెన్సీ కోసం కొట్టుకు చచ్చిన అఖిల్ హౌస్ నుంచి బయటకు వెళ్లినట్టే వెళ్లి సీక్రెట్ రూమ్‌లో పాగా వేశాడు. ఇప్పుడిప్పుడే తన మీద ఉన్న మచ్చలను తుడిపేసుకుంటూ మోనాల్ సరైన ట్రాక్ ఎక్కుతున్నట్లు కనిపిస్తోంది. ఇక సోహైల్ చెప్పినట్టుగానే అభిజిత్ ఐడియాలు ఇస్తాడు కానీ ఏమీ చేయడని అతడే స్వయంగా రుజువు చేసుకుంటున్నాడు. జున్నును గుర్తు చేసుకుంటూ పదేపదే బాధపడుతున్న లాస్య హౌస్‌లో వంటింటి కుందేలుగా మారిపోయింది. హారిక అయితే అభి, లాస్యతో లేదంటే కెమెరాలతో మాట్లాడుతూ పొద్దు గడుపుతోంది. ఫ్రెండ్షిప్పే తన బలం అనుకుంటున్న సోహైల్‌కు అదే బలహీనంగా మారుతోంది. మిగిలింది మెహబూబ్.. మొదట్లో కాస్త అతిగా ప్రవర్తించి చెడ్డ పేరు మూటగట్టుకున్నాడు. కానీ తర్వాత మామూలుగానే ఉన్నాడు. అయినా సరే అతడిపై వ్యతిరేకత మాత్రం పోలేదు. అయితే ఫిజికల్ టాస్కులో చావోరేవో అన్నట్లుగా పోరాడుతాడు. ప్రత్యర్థికి చెమటలు పట్టిస్తాడు. (చదవండి: హారిక హగ్గిచ్చి ఎన్నిరోజులైతుందో: అభిజిత్) రీఎంట్రీ, ఎలిమినేషన్.. ఏదో ఒకటేనా? వీరిలో ఒకరు బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయం వచ్చింది! పదోవారానికిగానూ అభిజిత్, సోహైల్, మెహబూబ్, అరియానా, మోనాల్, హారిక ఎలిమినేషన్ జోన్లో ఉన్నారు. వీరిలో మెహబూబ్, ఆ తర్వాత మోనాల్ డేంజర్ జోన్లో ఉన్నారు. దీపావళి సందర్భంగా ఎలిమినేషన్ రద్దు చేస్తే మెహబూబ్ మరోసారి అదృష్టవంతుడని నిరూపించుకున్నట్లే. ఎందుకంటే హౌస్‌ను వీడనుంది మెహబూబ్ అని సోషల్ మీడియా పోల్స్ ఘంటాపథంగా చెప్తున్నాయి. మరోవైపు సీక్రెట్ రూమ్‌లో ఉన్న అఖిల్ నేడు హౌస్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. రీ ఎంట్రీ ఉండటంతో పాటు పండగ స్పెషల్ అంటూ ఎలిమినేషన్ ఉంచుతారా? ఎత్తేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. (చదవండి: బిగ్‌బాస్‌కు తలనొప్పిగా మారుతోన్న మెహబూబ్!) -
హారిక హగ్గిచ్చి ఎన్నిరోజులైతుందో: అభిజిత్
కండబలం ఉంది కానీ బుద్ధి బలం లేదని నిరూపించుకున్నారు అఖిల్, మెహబూబ్. కెప్టెన్సీ నాకు తప్ప నా ఫ్రెండుకు కూడా దక్కకూడదన్న మూర్ఖత్వంతో ప్రవర్తించి టాస్కు రద్దయ్యేందుకు కారణమయ్యారు. ఫలితంగా హౌస్‌లో ఉండేందుకు అవసరమైన ప్రాణవాయువులాంటి ఇమ్యూనిటీ ఎవరికీ అందకుండా పోయింది. వీళ్ల గొడవను చూసి అగ్లీ అన్న అభిజిత్.. హారికతో అంతకన్నా అగ్లీ గొడవకు దిగాడు. తనను పక్కనపెట్టి అఖిల్‌కే హగ్గులిస్తుందని నొచ్చుకున్నాడు. వెళ్లి వాళ్లకే నీ హగ్గులు ఇచ్చుకో అని పదే పదే అంటూ జనాలకు విసుగు తెప్పించాడు. మరి నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్లో ఏమేం జరిగాయో తెలియాలంటే దీన్ని చదివేయండి.. గేమ్‌లో ఒంటరైన మోనాల్ బిగ్‌బాస్ ఈ వారం బాస్కెట్ బాల్స్‌ను గోల్ చేసే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఎవరి బంతిని వాళ్లే కాకుండా మిగతావాళ్లు గోల్ చేయాల్సి ఉంటుంది. బజర్ మోగినప్పుడు ఆలస్యంగా గోల్ చేసిన బంతి మీద ఎవరి ముఖం ఉంటే వాళ్లు అవుట్ అవుతారు. ఆఖరి రౌండ్లో గోల్ చేసిన బంతి మీద ఎవరి ముఖం ఉంటే వాళ్లే గెలిచినట్లు. ఈ గేమ్‌లో అభిజిత్ మైండ్ గేమ్ ఆడాడు. అతడు, హారిక కలిసి తనకు గిట్టని వ్యక్తి ముఖం ఉన్న బంతిని తీసుకుని కావాలని ఆలస్యంగా వేశారు. మోనాల్ బంతిని ఎవరూ తీసుకోలేదు. ఈ గేమ్‌లో చివరికి మెహబూబ్, అఖిల్ ఇద్దరే మిగిలారు. (అభిజిత్‌కు హౌస్‌లో ఉండే అర్హత లేదు: అమ్మ రాజశేఖర్ ) తొక్కలో రిలేషన్స్, అంతా నటిస్తారు: అఖిల్ ఈసారి నాకు సపోర్ట్ కావాలంటే నాకు సపోర్ట్ కావాలని ఇద్దరూ వాదులాడుకున్నారు. బజర్ మోగిన విషయం మర్చిపోయి బాల్ వేయకుండా కీచులాడుతూనే ఉన్నారు. చివరికి నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఎవరి బంతి వారు గోల్ చేసేందుకు సిద్ధపడ్డారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బిగ్‌బాస్ ఇద్దరి బాధ్యతారాహిత్యం కారణంగా టాస్క్ మొత్తాన్ని రద్దు చేస్తునట్లు వెల్లడించారు. ఈ వారానికి హౌస్‌లో కెప్టెనే ఉండరని ప్రకటించాడు. దీంతో స్నేహితుల కోసం గేమ్ నుంచి తప్పుకున్న సోహైల్ చిందులు తొక్కాడు. అనవసరంగా ఇమ్యూనిటీ రాకుండా చేసుకున్నారని బాధపడ్డాడు. ఇంట్లో నాకు ఒక్కడు సపోర్ట్ చేయలేదు. ఈ ఒక్కసారి చేయుమన్నా.. అని అఖిల్ ఫ్రస్టేట్ అయ్యాడు. అందుకే ఈ తొక్కలో రిలేషన్స్ వద్దంటా, అంతా నటిస్తారు అని అలిగాడు. పనిలో పనిగా మోనాల్ మీద విసుగు ప్రదర్శించాడు. ప్రతిసారి నీ కోసం ఆడతా అని ఎందుకనుకుంటున్నావు అని మోనాల్ ముఖం పట్టుకుని అడగ్గా నాకోసం ఆడమని నీకు చెప్పలేదని ఆమె స్పష్టం చేసింది. మరోవైపు తన నెత్తి మీద దరిద్రం డ్యాన్స్ చేస్తోందని మెహబూబ్ కన్నీళ్లు పెట్టుకోగా మోనాల్, సోహైల్ ఓదార్చారు. నేను హగ్గిస్తే కుర్చీలో నుంచి పడిపోతావు.. కెప్టెన్సీ చేజారిన బాధలో నుంచి బయటకు రాని అఖిల్.. మెహబూబ్, సోహైల్‌తో మాట్లాడుతూ మీరిద్దరే ఫ్రెండ్స్, నేనే అప్పుడప్పుడు మధ్యలోకి వస్తా. ఈ రిలేషన్స్, ఫ్రెండ్షిప్స్ బక్వాస్. అందుకే దివాళీ గిఫ్ట్‌కు మీ ఇద్దరితో పాటు మోనాల్ పేరు కూడా రాయలేదు అని అసలు విషయం చెప్పాడు. వీళ్ల పంచాయితీ మీద అభిజిత్ సెటైర్లు వేశాడు. ఎందుకింత అగ్లీగా ప్రవర్తిస్తున్నారు, మంచిగా ఆడొచ్చు కదా అని తన టీమ్‌తో చర్చించాడు. కానీ మరుక్షణమే అతడు అగ్లీ టాపిక్కు తెర తీశాడు. పోయి(అఖిల్‌కు) హగ్గులిచ్చుకో పో అని హారిక మీద కోప్పడ్డాడు. నాకు హగ్గిచ్చి ఎన్ని రోజులైతుందో తెలుసా? అని అభి అలగడంతో ఈరోజు పొద్దున్నే కదా ఇచ్చానని హారిక జవాబిచ్చింది. అయినా ఇప్పటికిప్పుడు నేను హగ్గిస్తే కుర్చీలో నుంచి కింద పడిపోతావు అని హెచ్చరించింది. ఎప్పుడూ ఏదో అని, దాన్ని కవర్ చేసేందుకు హగ్గిచ్చావే కానీ సొంతంగా హగ్గిచ్చావా అని నిలదీశాడు. అలా కాసేపటి వరకు ఈ హగ్గుల గురించి హద్దులు దాటి మాట్లాడుకున్నారు. (మనసు గెలిచేసిన మోనాల్) సూట్‌కేసులు సర్దుకున్న కంటెస్టెంట్లు మరోవైపు అలక బూనిన ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సోహైల్ నలిగిపోయాడు. రేపు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను, అఖిల్ ఉంటే.. నువ్వు కచ్చితంగా అఖిల్‌నే సేఫ్ చేస్తావు అని మోనాల్‌తో అన్నాడు. దానికి ఆమె స్పందిస్తూ కానీ నేను, నువ్వు ఉంటే మాత్రం అఖిల్ నిన్నే సేఫ్ చేస్తాడని క్లారిటీ ఇచ్చింది. ఎటొచ్చీ ఈరోజు మోనాల్ మళ్లీ ఒంటరిగా మారగా అప్పటివరకూ గొడవపడ్డ సోహైల్, అఖిల్, మెహబూబ్ మళ్లీ ఒక్కటైపోయారు. ఇక అరియానా దగ్గర మోనాల్ సేఫ్ గేమ్ ఆడుతుందని చెప్పిన అవినాష్.. తర్వాత మాత్రం ఆమె దగ్గరకు వెళ్లి టాప్ 5లో ఉంటావంటూ క్రీమ్ బిస్కెట్లు వేశాడు. అనంతరం అర్ధరాత్రి ఇంటిసభ్యులను నిద్ర లేపిన బిగ్‌బాస్ వారి సూట్‌కేసులను సర్దుకోమన్నాడు. ఫినాలేకు వెళ్లడానికి ఎవరు అడ్డుపడుతారనుకుంటున్నారో వారి పేర్లను చెప్పమన్నాడు. ఎవరు ఎవరి పేర్లను చెప్పనున్నారో రేపటి ఎపిసోడ్లో తేలనుంది. (అభికి జీరో టాలెంట్, అఖిల్‌కు అహంకారం) -
సపోర్ట్ లేదు, ఫ్రెండ్షిప్ పెట్టుకుని వేస్ట్: అఖిల్
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో పదో వారంలోకి అడుగు పెట్టింది. ఇప్పటి వరకు గ్రూపులుగా ఉన్నా టాప్ 5లోకి వెళ్లాలంటే ఒంటరిగా పోరాడాల్సిన సమయం ఇది. కానీ హౌస్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా గ్రూపులు గ్రూపులుగా ఆడుతున్నారు. ఇక అఖిల్ తనతో క్లోజ్‌గా ఉండే వాళ్లను నామినేట్ చేసి షాకిచ్చాడు. ఒంటరువుతున్నానని బాధపడుతున్న అరియానాను అవినాష్ తప్ప మిగతా అందరూ నామినేట్ చేసి ఆమె ఒంటరే అని నిరూపించారు. ఇక లాస్య, అభిజిత్, హారిక ఎలాగో ఒకరినొకరు నామినేట్ చేసుకోరు. ఈ ప్రక్రియను పక్కన పెడితే నేడు కెప్టెన్సీ పోటీ జరగనుంది. దీనికంటే ముందు కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక జరగాలి కదా! అది మీలో మీరే తేల్చుకోమని బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టినట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ కోసం ఎవరు త్యాగం చేస్తారు? అని స్టార్ మా తాజాగా ప్రోమోను వదిలింది. (చదవండి: అఖిల్ ప్రవర్తనపై మోనాల్ ఫ్యాన్స్ ఫైర్) "ఒక్కసారి కూడా ఏ ఒక్కరూ తనకు సపోర్ట్ చేయలేదు అని అఖిల్ ఫ్రస్టేట్ అవుతున్నాడు. ఈ స్నేహాలు గట్రా పెట్టుకునే బదులు దూరంగా ఉండటమే మంచిద"ని చెప్పుకొచ్చాడు. మరోవైపు మెహబూబ్ తన దరిద్రాన్ని గుర్తు చేసుకున్నాడు. ప్రతిసారి దేవుడు తనకు అన్నీ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కు తీసుకుంటున్నాడని దుఃఖిస్తున్నాడు. దీంతో ఇద్దరి మధ్య నలిగిపోతున్న సోహైల్ ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయితే కదా దిల్ అనేది తెలుస్తుంది అని మెహబూబ్‌ను కన్విన్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అటు మోనాల్ కూడా మెహబూబ్‌ను ఓదార్చే పనిలో పడింది. అయితే టాస్కు సరిగా పూర్తి చేయనందుకో, దేనికో కానీ అసలు కెప్టెన్‌గా ఎవరూ ఎన్నిక అవలేదని సమాచారం.. (చదవండి: నీ కాళ్లు పట్టుకుంటా, ఏం చేసుకోకు: అరియానా) -
మాస్టర్ అవుట్: మెహబూబ్‌కు కెప్టెన్సీ, కానీ!
ఈసారి ప్రేక్షకుల అంచనా మిస్సవలేదు. తన చేష్టలతో ఇంటి సభ్యులను బెంబేలెత్తించిన అమ్మ రాజశేఖర్ బిగ్‌బాస్ హౌస్ నుంచి తొమ్మిదో వారం ఎలిమినేట్ అయ్యాడు. మరోవైపు సుమ స్పెషల్ గెస్ట్‌గా రావడంతో శనివారం రావాల్సిన దీపావళి వారం రోజుల ముందే వచ్చినట్లైంది. స్టేజీ పైకి వస్తూనే నవ్వుల బాణాలను వదిలింది. అందరినీ ఇరిటేట్ చేసే అరియానాను ఇమిటేట్ చేస్తూ, ప్రతి ఒక్కరి మీదా జోకులు పేల్చే అవినాష్ మీద కామెడీ చేస్తూ కంటెస్టెంట్లను మారు మాట్లాడనీయకుండా చేసింది. మరి నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలుసుకోవాలనుందా? అయితే వెంటనే ఈ స్టోరీ చదివేసేయండి.. అఖిల్‌కు మోనాల్ చాక్లెట్లు, మరి ఆమెకు? దీపావళి సందర్భంగా ఇంటిసభ్యులకు బహుమతులు వచ్చాయని, వాటిని అందుకోవాలంటే కొన్ని చాలెంజ్‌లు పూర్తి చేయాలని నాగార్జున తెలిపారు. మొదట సోహైల్ కోసం మెహబూబ్ నేల మీద బౌల్లో ఉన్న బిస్కెట్లను చేయితో పట్టుకోకుండా తినేశాడు. దీంతో సోహైల్‌కు తను పంపిన బ్రేస్లెట్ గిఫ్ట్‌ను మెహబూబ్ తొడిగాడు. తర్వాత అఖిల్ కోసం అభిజిత్.. తల మీద బుట్టలో బంతులు వేసే ఆట ఆడాడు. దీంతో అఖిల్ గిఫ్ట్ ఓపెన్ చేయగా మోనాల్ పంపించిన చాక్లెట్లు కనిపించాయి. అనంతరం అభిజిత్ కోసం అఖిల్ సోడాబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని బంతులు వేరు చేసే గేమ్ ఆడాడు. కానీ విఫలమయ్యాడు. దీంతో అభికి వచ్చిన గిఫ్ట్ వెనక్కు వెళ్లిపోయింది. (చదవండి: మోనాల్ మాత్రం కోడలిగా రాదు: అఖిల్ తల్లి) మాస్టర్‌కు, మోనాల్‌కు గిఫ్టులు పంపిన నాగ్ లాస్య కోసం హారిక నడుముకు టిష్యూ బాక్స్ కట్టుకుని గెంతుతూ, అందులో నుంచి 20 బంతులు బయట పడేలా చేయాల్సి ఉంటుంది. కానీ ఓడిపోవడంతో లాస్య బహుమతి పోగొట్టుకుంది.. మెహబూబ్ కోసం అవినాష్, అమ్మ రాజశేఖర్ జడ వేయించుకున్నారు. దీంతో మెహబూబ్‌కు సోహైల్ కాఫీ కప్పును అందించాడు. తర్వాత అవినాష్ కోసం మాస్టర్, అరియానా కోసం మెహబూబ్ గేమ్ ఆడారు. కానీ ఓడిపోవడంతో వాళ్ల గిఫ్ట్ కూడా చేజారిపోయింది. హారిక కోసం.. అభిజిత్, లాస్య బంతుల టాస్కు ఆడి గెలిచారు. దీంతో హారికకు అభి నువ్వుండలు, లాస్య డ్రెస్ పంపించింది. మిగిలిన మోనాల్, అమ్మ రాజశేఖర్‌కు ఎవరూ గిఫ్టులు పంపకపోవడంతో తానిస్తానని నాగ్ స్వయంగా ముందుకొచ్చారు. మాస్టర్‌కు చేపల కూర, మోనాల్‌కు అహ్మదాబాద్ నుంచి స్వీట్లు తెప్పించారు. (చదవండి: నా గురించి మాట్లాడకు అరియానా: అవినాష్ ఫైర్) వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ ప్రాంక్ తర్వాత సుమను సూపర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని లోపలకు ఆహ్వానించారు. కానీ అదంతా ప్రాంక్ అని కొన్ని క్షణాల్లోనే తేలిపోయింది. అయితే సుమ కంటెస్టెంట్లతో సహా నాగార్జున మీద కూడా పంచులు విసరడం గమనార్హం. ఆ తర్వాత ఇంటిసభ్యుల కోసం తెచ్చిన వస్తువుల చిట్టాను ఏకరువు పెట్టింది. మోనాల్‌కు టిష్యూలు, అరియానాకు లాలీపాప్, లాస్యకు తెలుగు జోక్స్ పుస్తకం తెచ్చింది. దీంతో లాస్య జలుబు ముక్కుకే ఎందుకు చేస్తుందని ప్రశ్నించింది. ఈ జోకును పట్టేసిన సుమ.. ఐస్ మధ్యలో ఉంటుందని జవాబిచ్చింది. ఎక్సర్సైజ్ చేయడం లేదని అభితో గెంతులు వేయించింది. హారికతో తెలుగు టంగ్ ట్విస్టర్, అవినాష్‌తో ఇంగ్లీష్ టంగ్ ట్విస్టర్ చెప్పించేందుకు ప్రయత్నించింది కానీ వారి వల్ల కాలేదు. (చదవండి: రాజీవ్‌పై సుమ ఎమోషనల్ ట్వీట్.. వైరల్) అవినాష్ నీ కాళ్లు పట్టుకుంటా.. తర్వాత అవినాష్‌కు బిస్కెట్లు, మాస్టర్‌కు ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చానని చెప్తూ, అఖిల్‌కు లవ్ లెటర్ రాసేందుకు పెన్నూ పేపర్ తేవడం మర్చిపోయినట్లు తెలిపింది. అయితే ఆమె కోరిక మేరకు అఖిల్.. ఏమైపోయావే... అని పాట పాడి అందరినీ బుట్టలో వేసుకున్నాడు. నీకోసం ఎవరైనా పాడారా? అని నాగ్ లాస్యను అడగ్గా.. పాడారు కనుకే రెండు జోల పాటలు పాడానని పంచ్ విసిరింది. ఇక హౌస్‌లోకి వెళ్లమనగానే గంగవ్వ వయసొచ్చాక వెళ్తానంటూ షో నుంచి జారుకుంది. అనంతరం మోనాల్ సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించారు. దీంతో మాస్టర్, అవినాష్ డేంజర్ జోన్లో పడ్డారు. పొరపాటున అవినాష్ వెళ్లిపోతాడేమోనని అరియానా వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఏం జరిగినా నువ్వు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని మదర్ ప్రామిస్ వేయించుకుంది. 'నీ కాళ్లు పట్టుకుంటా, నాకోసం ఎదురు చూడు, నువ్వు బతికుంటే చాలు' అంటూ ఎమోషనల్ అయింది. అభిజిత్ విలన్: అమ్మ రాజశేఖర్ ఇంతలో డబుల్ ఎలిమినేషన్‌కు ఛాన్స్ ఉందని చెప్పడంతో అరియానా షాక్ తింది. కానీ అలాంటిదేమీ లేదని కొన్ని క్షణాల్లోనే తేలిపోయింది. ఇక అవినాష్ సేఫ్ అయ్యాడు కానీ గుండాగినంత పనైంది అని భోరున ఏడ్చాడు. "మళ్లీ జీరోకు వచ్చాను, బిగ్‌బాస్ వల్లే నాకు మళ్లీ లైఫ్ వచ్చింది" అని చెప్పుకొచ్చాడు. అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అవగా అతనితో గేమ్ ఆడించాడు. అందులో భాగంగా సోహైల్, లాస్య, అరియానా, మోనాల్, మెహబూబ్, అవినాష్.. అసలు అని, అఖిల్‌ను హీరో అంటూ, అభిజిత్‌ను విలన్ అంటూ ఈ ఇద్దరూ నకిలీ మనుషులు అని తేల్చి చెప్పాడు. హారికను కూడా ఈ నకిలీ జాబితాలోనే చేర్చాడు. తన కెప్టెన్సీని మెహబూబ్‌కు ఇచ్చేశాడు. అయితే ఇమ్యూనిటీ మాత్రం లభించిందని నాగ్ స్పష్టం చేశారు. బిగ్‌బాంబ్ లేకపోవడం ఇంటిసభ్యులకు ఊరట కలిగించింది. (చదవండి: బిగ్‌బాస్: నాగ్ వెనుక స్టైలిష్ ఫ్యాషన్ డిజైనర్) -
బిగ్‌బాస్: సోహైల్‌కు గట్టి షాక్ ఇచ్చిన మెహబూబ్
బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వారం అమ్మ రాజశేఖర్ కెప్టెన్ అయ్యాడు. తనను నామినేట్ చేసిన ఒక్కొక్కరికీ బొమ్మ చూపిస్తున్నాడు. నా మాటే శాసనం అన్నట్లుగా తాను చెప్పిన పనులే చేయాలంటున్నాడు. కాదూ కుదరదు అన్నవాళ్లకు మరో అవకాశం కూడా ఇవ్వట్లేదు. హౌస్‌లో ఇప్పుడు తనే బిగ్‌బాస్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. అతని వైఖరిని అభిజిత్ టీమ్ జీర్ణించుకోలేకపోతోంది. అలాగే మాస్టర్ తనకు కావాల్సిన అవినాష్, మెహబూబ్‌కు చిన్నాచితకా పనులను అప్పజెప్పి, మిగతా వాళ్లకు రెట్టింపు పనులను కేటాయించినట్లు తెలుస్తోంది. ఇది కరెక్ట్ కాదని సోహైల్ ఖండించాడు. కానీ అతడి మాటలను మాస్టర్ పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. 'నా నిర్ణయం మార్చుకోను. మీరు చేయకపోతే వదిలేయండి' అని దురుసుగా జవాబిచ్చాడు. హౌస్‌లో కుంపటి రాజేస్తున్న మాస్టర్ దీంతో హారిక తాను చేయనని అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోయింది. ఎవరికి ఏ పనులు చేయాలని ఉందో తెలుసుకోకుండా నా కెప్టెన్సీ అంటూ ఎవడి దగ్గర జులుం ప్రదర్శిస్తున్నాడని హారిక మండిపడింది. ఇక అభిజిత్ ఇంగ్లీషులో మాట్లాడగా బిగ్‌బాస్ తెలుగులో మాట్లాడమని వార్నింగ్ ఇచ్చాడు. ఈ సమయం కోసే ఎదురు చూస్తున్నట్లు మాస్టర్ వెంటనే లేచి చప్పట్లు కొడుతూ అభిని శిక్షించేందుకు రెడీ అవుతున్నాడు. దీంతో అయిపోయావ్ అభి అని లాస్య ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు మెహబూబ్ కూడా ప్లేటు ఫిరాయించినట్లు కనిపిస్తోంది. (చదవండి: మాస్టర్ సంచలన నిర్ణయం.. భోరుమన్న మెహబూబ్) బయటపడ్డ మెహబూబ్ నిజ స్వరూపం "మీ ఫ్రెండ్షిప్ వద్దు, ఏం వద్దు" అంటూ తనను గుడ్డిగా నమ్మిన సోహైల్‌కు మెహబూబ్ గట్టి షాకిచ్చాడు. ఏదైతేనేం తొలిసారి కెప్టెన్ అయిన అమ్మ రాజశేఖర్ హౌస్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు అమ్మ రాజశేఖర్ ఏకంగా ట్రోఫీ గెలిచినట్లు ఫీల్ అవుతున్నాడని విమర్శిస్తున్నారు. ఈరోజు అందరి మీద ప్రతీకారం తీర్చుకునేలా ఉన్నాడని, పనిలో పనిగా ఫుటేజీ దక్కించుకునేందుకు ఈ ఆరాటమని అభిప్రాయపడుతున్నారు. ఎంత ఎగిరెగిరి పడ్డా ఇంకా రెండురోజులే అతని ఆటలు సాగుతాయని చెప్తున్నారు. కానీ అతడి వల్ల సోహైల్‌కు ఓ రకంగా మంచే జరిగిందంటున్నారు. స్నేహం ముసుగు ధరించిన మెహబూబ్ నుంచి విముక్తి లభించిందని చెప్పుకొస్తున్నారు. (చదవండి: బిగ్‌బాస్: మోనాల్ కోసం మెహబూబ్ బలవుతాడా?) -
బిగ్‌బాస్‌కు తలనొప్పిగా మారుతోన్న మెహబూబ్!
మెహబూబ్ దిల్సే.. మొదట్లో అతడిని వీలైనంత తొందరగా బిగ్‌బాస్ హౌస్ నుంచి పంపిచేయాలని చాలామందే కాచుకుని కూర్చున్నారు. కానీ అతడు నామినేషన్ జోన్లోకే రాకుండా తప్పించుకు తిరగడం, ఈ మధ్యలో బిగ్‌బాస్ ఇచ్చిన ప్రతి టాస్క్‌లో తన సత్తా చూపిస్తూ తనేంటో నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అతడిపై ఉన్న నెగెటివిటీ తగ్గుతూ వస్తోంది. పైగా టాస్కుల్లో నువ్వా నేనా అన్న రేంజ్లో పోటీపడే వాళ్లు చాలా అరుదు. ముఖ్యంగా ఫిజికల్ టాస్కుల్లో మెహబూబ్‌ను ఢీ కొట్టడం చాలా కష్టమని ఇంటిసభ్యులే అంగీకరించారు. అలాంటిది మెహబూబ్ వెళ్లిపోతే టాస్కుల్లో బలమైన పోటీ ఉండదేమో అన్న పరిస్థితి దాపురించింది. అయితే మెహబూబ్ కొన్నిసార్లు నోరు జారుతాడన్న మాటే కానీ, ఎదుటి వాళ్లు నొచ్చుకున్నట్లు అనిపిస్తే క్షమాపణలు కూడా చెప్తాడని అఖిల్, అభిజిత్ విషయంలో నిరూపించాడు. అలా ఇంటిసభ్యులతో విబేధాలు తగ్గించుకుని సఖ్యతగా ఉంటున్నాడు. (బిగ్‌బాస్ : మోనాల్‌కి అభి భరోసా.. మాటపై నిలబడేనా!) మొన్నటి ఆదివారం ఎపిసోడ్లో అమ్మ రాజశేఖర్, మెహబూబ్‌లలో ఎవరు ఇంట్లో ఉండిపోవాలనుకుంటున్నారు అని నాగార్జున ఓ ప్రశ్నను లేవనెత్తారు. అరియానా, అవినాష్ తప్ప మిగతా అందరూ మాస్టర్ వెళ్లిపోవాలని, మెహబూబ్‌కు ఇంట్లో కొనసాగే అర్హత ఉందని అభిప్రాయపడ్డారు. దీంతో మెహబూబ్ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా అవతరిస్తున్నాడన్న విషయం ఇక్కడే తేలిపోయింది. ఈ విషయాన్ని పక్కన పెడితే హౌస్‌లో గొడవలు ఉండాలనో మరేంటో తెలీదు కానీ బిగ్‌బాస్ అమ్మ రాజశేఖర్‌ను కాపాడాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ అతడిని సేఫ్ చేసే కొద్దీ ప్రేక్షకుల్లో మాస్టర్‌పై వ్యతిరేకత పెరుగుతుందే తప్ప తగ్గకపోవడం గమనార్హం. ఒకవేళ ఈ వారం మాస్టర్ ఎలిమినేట్ అయితే అందరి టార్గెట్ మోనాల్, మెహబూబ్ మీదే ఉంటుంది. హీరోయిన్ మోనాల్‌కు ఎలాగో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండనే ఉంది. దాంతోపాటు బిగ్‌బాస్ ఆమెను వదులుకోడానికి బొత్తిగా ఇష్టపడటం లేదు. పైగా ఆమె కోసం మెహబూబ్‌పై వేటు వేయడానికి కూడా వెనకడుగు వేయడు. అయితే రోజురోజుకీ అతడి పాపులారిటీ పెరుగుతుండటం బిగ్‌బాస్ టీమ్‌కు తలనొప్పిగా మారుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రమాదం నుంచి మెహబూబ్ బయటపడాలంటే అతడు నామినేషన్లోకి రాకుండా తప్పించుకోవడమో లేదా ఫిజికల్ టాస్కులతో పాటు మిగతావాటిలో కూడా అందరికీ గట్టి పోటే ఇస్తూ ప్రేక్షకులను తనవైపు తిప్పుకోవడమో చేయాలి. ఇదే కనక జరిగితే మెహబూబ్ టాప్ 5లోకి వెళ్లే అవకాశం లేకపోలేదు. (అఖిల్ ప్యాంటులో ఐస్‌గడ్డలు వేసి అరాచకం) -
బిగ్‌బాస్: నామినేషన్లో మాస్టర్, మెహబూబ్!
సమంత వచ్చిన వేళావిశేషం.. ఎలిమినేషన్ ఉండదేమో అని కంటెస్టెంట్లు తెగ సంబరపడిపోయారు. కానీ వారి ఆశలను నీరుగారుస్తూ దివి ఎలిమినేట్ అని హీరోయిన్ సమంత బాంబు పేల్చింది. అయితే అమ్మ రాజశేఖర్‌తో సాన్నిహిత్యం కూడా దివి వెళ్లిపోవడానికి ఓ కారణమే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా వుంటే ఎనిమిదోవారానికిగానూ నేడు బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ ప్రక్రియ మొదలు కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో మెహబూబ్ అరియానాను నామినేట్ చేశాడు. మనిద్దరి మధ్య అన్ని సమస్యలు తొలిగిపోవాలని నామినేట్ చేస్తున్నట్లు తెలిపాడు. ఈ కారణం విన్న అరియానాకు కోపం నషాళానికి తాకింది. క్లియర్ అవ్వాలని చెప్పి నామినేట్ చేసి బయటకు పంపించేస్తున్నావేంటని మండిపడింది. (చదవండి: బిగ్‌బాస్: మోనాల్‌పై అభి, అఖిల్ సెటైర్లు) ఎవరికి లేరు అమ్మానాన్న?: అమ్మ రాజశేఖర్ ఇక అమ్మ రాజశేఖర్ అఖిల్, అభిజిత్, మోనాల్ గొడవను ఎత్తి చూపాడు. దీంతో సీరియస్ అయిన అఖిల్.. అభిజిత్‌తో మోనాల్ మాట్లాడకపోవడం తనిష్టం. నేనేమీ తనను ఆపలేదు అని క్లారిటీ ఇచ్చాడు. నేను అన్న మాటకు బయట మా అమ్మానాన్న కూడా హర్ట్ అయి ఉండవచ్చని అఖిల్ చెప్తూ ఉండగా మాస్టర్ మధ్యలో కలగజేసుకుని ఎవరికి అమ్మానాన్న లేరు? అంటూ ఆవేశంతో విరుచుకుపడ్డారు. నువ్వు పెద్ద నేరం చేశావంటూ అభిజిత్ తొలిసారి మోనాల్‌ను నామినేట్ చేశాడు. మొత్తంగా మోనాల్, మెహబూబ్, అఖిల్, లాస్య, అమ్మ రాజశేఖర్, అరియానా గ్లోరీ ఈ నామినేషన్ ప్రక్రియలో ఉన్నట్లు లీకువీరులు చెప్తున్నారు. (చదవండి: కెప్టెన్ అయ్యాడో లేదో కొత్త రూల్స్ పెట్టేశాడు) మోనాల్‌ను మెంటల్ టార్చర్ చేస్తున్నారు ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు మోనాల్‌పై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ ప్రక్రియ వచ్చిన ప్రతిసారి టాస్కుల్లో పర్ఫామెన్స్‌కు బదులు ఆమె క్యారెక్టర్‌ను నిందిస్తూ మానసికంగా టార్చర్ చేస్తున్నారని ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతవారం మెహబూబ్ కోసం నామినేషన్లోకి వెళ్లిన అరియానాను మెహబూబ్ నామినేట్ చేయడాన్ని తప్పు పడుతున్నారు. ఇక అమ్మ రాజశేఖర్ వేరొకరి విషయాన్ని ప్రస్తావించడాన్ని కూడా విమర్శిస్తున్నారు. ఏదైతేనేం.. మాస్టర్ నామినేషన్లోకి వస్తే పంపించేయడం కోసం ఎంతోమంది నెటిజన్లు కాచుకుని కూచున్నారు. ఈ లెక్కన ఈ వారం మాస్టర్ బ్యాగు సర్దుకుని ఇంటి బాట పట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. (చదవండి: దివి ఎలిమినేట్, లాస్యపై బిగ్‌బాంబ్) -
నరకం చూపించిన ఆ ఇద్దరే బెస్ట్ పర్ఫార్మర్లు
మంచికి చెడుకు జరుగుతున్న యుద్ధంలో రాక్షసులు విచ్చలవిడిగా ప్రవర్తించారు. నానారకాలుగా హింసిస్తూ చెలరేగిపోయారు. అయినా సరే చెడుపై విజయం సాధించింది. రాక్షసులపై మంచి మనుషుల టీమ్ గెలిచింది. ఈ క్రమంలో కొందరికి చిన్నపాటి గాయాలు కూడా అయినట్లు తెలుస్తోంది. అయినా సరే వాటిని లెక్క చేయకుండా టాస్కే మాకు సర్వస్వం అన్న రీతిలో రెచ్చిపోయి మరీ ఆడారు. మరి బిగ్‌బాస్ ఇచ్చిన ఈ ఈ టాస్కులో ఎవరు బాగా ఆడారు? ఎవరి ఐడియా వర్కవుట్ అయిందో చదివేసేయండి.. రాక్షసుల టీమ్ వాళ్లు నన్ను వదిలేశారు: హారిక కొంటె రాక్షసులను మంచి మనుషులుగా మార్చేందుకు మరో టాస్క్ ఇచ్చాడు. గుండంలో ఉన్న బస్తాలను బయట పడేసి వారు లోపలే ఉండాల్సి ఉంటుంది. కానీ వాళ్లు బయట పడేసిన ప్రతీసారి రాక్షసులు లోపలకు వేశారు. దీంతో బస్తాలు మరోసారి లోపలకు వేయకుండా మంచి మనుషులు వాటిని స్విమ్మింగ్ పూల్‌లో వేశారు. ఇన్ని చేసినా సరే మంచి మనుషులు ఆ టాస్కులో గెలవలేకపోయారు. ఇక రాక్షసిగా ఉన్న తాను మంచిమనుషులకు ఎలా దొరికిపోయానన్నది హారిక లాస్యతో చెప్పుకొచ్చింది. అరియానా, అవినాష్, మెహబూబ్ తనను వదిలేసి ముగ్గురూ ఒకే వాష్‌రూమ్‌లో దూరిపోయారని చెప్పింది. అందుకు హర్ట్ అయ్యానంది (చదవండి: సోహైల్‌కు హారిక పంటిగాట్లు, ఎవ్వరినీ వదల్లేదు) ఇంకా టార్చర్ చేయాలనుంది: అరియానా ఇక తర్వాతి రోజు అరియానా ఇవాళ ఇంకా టార్చర్ చేయాలనిపిస్తుందని మాస్టర్‌తో అంది. తీరా అన్నంతపనే చేసింది. సోహైల్, అఖిల్ షూలను ఎక్కడపడితే అక్కడ విసిరేసింది. పైగా అఖిల్‌తో సారీ చెప్పించుకుంది. ఇక అవినాష్.. లాస్యతో విసనకర్ర విసిరించుకున్నాడు. మొత్తానికి అందరి బట్టలను కింద పడేసి హౌస్‌ను చెత్తకుప్పగా తయారు చేశారు. కళ్ల ముందు జరుగుతున్న ఘోరాలను చూసి లాస్య ఏడ్వలేక నవ్వింది. (చదవండి: అభి, దివికి అహంకారం, మెహబూబ్ వాడుకుంటున్నాడు) మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్.. లాస్య పంచ్ ఆ కోపంలోనే అరియానా, అవినాష్‌లను 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అని పంచ్ కూడా వేసింది. కానీ వాళ్లు అందుకు ప్రతీకారంగా ఆమె దుస్తులను కింద పడేశారు. దీంతో ఆమె తన మాటను వెనక్కు తీసుకుని 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అని పొగిడింది. అప్పటివరకు రెచ్చిపోయిన అవినాష్ మోనాల్ రాగానే సైలెంట్ అయిపోయాడు. కాసేపటివరకు ఇద్దరు గుసగుసలు పెట్టుకున్నారు. ఆమెను వదిలి రాబుద్ధి కావడం లేదని వాపోయాడు. మరోవైపు సోహైల్ తనంతట తానుగా బట్టలు పడేయకపోతే అందరివీ పారేస్తానని మెహబూబ్ వార్నింగ్ ఇవ్వగా.. టైమ్ బ్యాడ్ అనుకుని చిరాకుతో అప్పటివరకు సర్దుకున్న అన్నింటిని సోహైల్ కింద పడేశాడు. అరియానాను పూల్‌లో తోసేసిన మాస్టర్ కుండలతో స్విమ్మింగ్ పూల్ నుంచి నీళ్లు తీసుకుని డ్రమ్ములు నింపాలని మంచి మనుషులకు మరో టాస్క్ ఇచ్చాడు. మెహబూబ్ కుండలకు చిల్లులు పెడుతూ వాటిని పగలగొట్టాడు. దీంతో అభిజిత్ సీరియస్ అయ్యాడు. అయినా సరే మెహబూబ్ డ్రమ్మును బోర్లించగా, అదే సమయంలో అక్కడున్న తనకు దెబ్బ తగిలిందని అఖిల్ గరమయ్యాడు. నీళ్లెలా పోస్తారో చూస్తానన్నట్టు డ్రమ్ముపై కూర్చున్న మెహబూబ్‌ను సోహైల్ ఆ డ్రమ్మును ఎప్పటిలా పెట్టేశాడు. తర్వాత అరియానాను మాస్టర్ స్విమ్మింగ్ పూల్‌లో తోసేశాడు, కానీ తాను తోయలేదని బుకాయించాడు. (చదవండి: కెప్టెన్‌గా నోయల్, కానీ తప్పని ముప్పు) నువ్వు పెద్ద తోపేం కాదు: అఖిల్ ఇక స్విమ్మింగ్ పూల్‌లో తనను అడ్డుకుంటున్న అవినాష్‌ను మోనాల్ కొరికేసింది. వీళ్లను దాటుకుని టాస్కు గెలవలేమని భావించిన నోయల్ ఓ ఐడియా చెప్పాడు. డ్రమ్ములను స్విమ్మింగ్ పూల్‌లో పడేసి నింపుదామన్నాడు. ఈ ప్లాన్ వర్కవుట్ అయి వారి విజయానికి కారణమైంది. మరోవైపు టాస్కులో చాలా క్రూరత్వంగా ప్రవర్తిస్తున్నావని అఖిల్ మెహబూబ్‌ను అన్నాడు. నన్ను ఆపలేక అంటున్నావా? అని అతడు రివర్స్ కౌంటరివ్వడంతో "నువ్వు పెద్ద తోపు, తురుము ఏం కాదు, దమ్ముంటే నా దగ్గరకు రా" అని అఖిల్ సవాలు విసిరాడు. చివరాఖరకు ఈ టాస్కులో మంచి మనుషుల టీమ్ గెలవడంతో అవినాష్‌ను తమలో కలుపుకుపోయారు. (చదవండి: నాన్న ఇస్త్రీ పని చేసేవాడు, ఇదిగో ప్రూఫ్: నోయల్) మెహబూబ్‌కు బిగ్‌బాస్ పంచ్ ఒక కొంటె రాక్షసుడిని ఎత్తుకుని ఎండ్ బజర్ మోగేసరికి నేలపై లేకుండా చూసుకోవాలని బిగ్‌బాస్ చిట్టచివరి టాస్క్ ఇచ్చాడు. దీంతో అరియానా అడ్డంగా దొరికిపోయింది. ఆమెను కాలు కింద పెట్టకుండా చూసుకుని అరియానాను మంచి మనిషిగా మార్చేశారు. మిగిలిన మెహబూబ్ కూడా వాళ్లలో కలిసిపోయాడు. మంచి మనిషిగా మారిన మెహబూబ్, మైకు ధరించడం కూడా మంచి లక్షణమే అని బిగ్‌బాస్ పంచ్ వేయడంతో ఇంటిసభ్యులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. కెప్టెన్ నోయల్ ఈ టాస్కులో బెస్ట్ పర్ఫార్మర్గా అరియానా, అవినాష్ పేర్లను వెల్లడించాడు. వీరిద్దరూ కెప్టెన్సీ కోసం పోటీ పడుతారు. మరి రేపటి ఎపిసోడ్లో ఎవరు కెప్టెన్ అవనున్నారనేది చూడాలి.. -
అరియానాతో డేట్‌కు వెళ్తా: అభిజిత్
బిగ్‌బాస్ నాల్గవ సీజన్ నలభై రోజులకు చేరింది. నిన్న రియల్ లైఫ్ కష్టాలు చెప్పుకుంటూ బాధపడ్డ కంటెస్టెంట్లు ఇవాళ పార్టీ చేసుకుని మనసు తేలిక చేసుకున్నారు. కెప్టెన్ నోయల్ తనకు టాస్కులో పాల్గొనే అవకాశం వచ్చినప్పటికీ కుమార్‌తో గొడవ కారణంగా ఆట నుంచి వైదొలగాడు. ఈవారంతో పాటు వచ్చేవారంలోనూ నామినేషన్లో ఉన్న నోయల్ టాస్క్ ద్వారా తన సత్తా చూపించుకునే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకుని పెద్ద తప్పే చేశాడు. ఇక అమ్మాయిలకు బిగ్‌బాస్ ఇవాళ స్పెషల్ ఆఫర్ ప్రకటించాడు. వారికి పార్టీ చేసుకునేందుకు అవకాశం కల్పించాడు. పనిలో పనిగా పార్టీలో అబ్బాయిలను ర్యాగింగ్ కూడా చేశారు. మరి వాళ్ల ర్యాగింగ్‌కు ఎవరెవరు బలయ్యారో చదివేసేయండి.. పుషప్స్ చేయలేక చేతులెత్తేసిన అమ్మాయిలు బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు అందరూ హౌస్‌లో ఏదో ఒక పని చేయాల్సిందే. అయితే దివి మాత్రం తనకు కేటాయించిన పని రాదంటూ సరిగా ఊడవట్లేదని ఇతర కంటెస్టెంట్లు తరచూ ఫిర్యాదు చేస్తున్నారు. ఈ విషయం దివి వరకు వెళ్లినా ఆమెలో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం. బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు రేసర్ ఆఫ్ ద హౌస్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో రెండు రౌండ్లు ఉంటాయి. మొదటిదానిలో ఎక్కువ పుషప్స్ చేసిన ఐదుగురు రెండో రౌండ్‌కు అర్హత సాధిస్తారు. ఆ రౌండ్లో ఏడు అడ్డంకులను తక్కువ సమయంలో దాటాల్సి ఉంటుంది. టైర్ల మధ్య నుంచి దూకడం, తాళ్ల మధ్యలో నుంచి దాటడం, ఇసుక మూటలను స్విమ్మింగ్ పూల్‌లో ఒకవైపు నుంచి మరొకవైపుకు తీసుకెళ్లడం, ఏటవాలుగా ఉన్నదానిపై నడవడం, ముళ్ల కంచె కింద నుంచి పాకడం, మార్బుల్స్ మీద పరిగెత్తడం, మంకీ బాస్‌ను చేతులతో పట్టుకుని వేలాడటం వంటివి చేయాలి. అమ్మాయిలందరూ మొదటి రౌండ్ మధ్యలోనే చేతులెత్తేశారు. నోయల్ స్థానంలో టాస్కు ఆడి ఓడిన అవినాష్ కానీ కుమార్ సాయి, అఖిల్, మెహబూబ్, సోహైల్, నోయల్ ఎక్కువ పుషప్స్ చేసి తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించారు. అయితే పుషప్స్ చేసేటప్పుడు మధ్యలో ఆగావని నోయల్ కుమార్‌ను తప్పుపట్టాడు. లేదని బుకాయిస్తున్న కుమార్‌ను ఒక్కరోజైనా నిజం చెప్పమని, నిజాయితీగా ఉండమని ఘాటు సలహా ఇచ్చాడు. ఈ విషయంలో చిరాకు ప్రదర్శించిన నోయల్ తాను ఆడనని తప్పుకోవడంతో అతని స్థానంలో అవినాష్ ఆటలో దిగాడు. కానీ సరిగా ఆడలేక కింద పడిపోయాడు. మెహబూబ్ మాత్రం రేసుగుర్రంలా 49 సెకండ్లలో టాస్క్ పూర్తి చేసి "రేసర్ ఆఫ్ ద హౌస్"గా నిలిచాడు. కుమార్, అఖిల్, సోహైల్ స్వల్ప సెకండ్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అనంతరం తాను 101 పుషప్స్ చేస్తే దాని గురించి మెహబూబ్ తక్కువ చేసి మాట్లాడాడని అఖిల్ ఫీలయ్యాడు. ఆ కోపం సోహైల్ మీద తీశాడు. ఈ విషయం తెలుసుకుని మెహబూబ్ అఖిల్‌కు సారీ చెప్పాడు. అలాంటి అమ్మాయి ఇష్టం: అభిజిత్ బిగ్‌బాస్ అమ్మాయిలకు నైట్ ఔట్ పార్టీ చేసుకునే అవకాశాన్నిచ్చాడు. అయితే పనిలో పనిగా అబ్బాయిలను ఆడుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలో అభిజిత్‌ను పిల్చుకుని మరీ పొగిడించుకున్నారు. ఎలాంటి అమ్మాయి నచ్చుతుందన్న ప్రశ్నకు.. అమ్మాయి లెవల్ హెడెడ్‌గా, నిజాయితీగా ఉండాలి, కరెక్ట్ నిర్ణయాలు తీసుకోగలగాలని చెప్పుకొచ్చాడు. ఇక అక్కడున్న వాళ్లలో ఎవరితో డేట్‌కు వెళ్తావని అడగ్గా అభి.. అరియానా పేరు చెప్పాడు. దీంతో ఆమె కాళ్లు భూమి మీద ఆగలేవు. అనంతరం మాస్టర్‌ను లోనికి రమ్మన్నారు. వీరు పాటలు పాడుతుంటే అతడిని అమ్మాయిలా డ్యాన్స్ చేయమంటూ కాసేపు టీజింగ్ చేశారు. (చదవండి: నాగార్జున ఒక్కసారి కూడా మెచ్చుకోలేదు) సోహైల్ లుంగీ లాగిన హారిక తర్వాత సోహైల్ లోనికి వెళ్లి దివికి ఒక్కటిచ్చుకోవడంతో అమ్మాయిలు షాకయ్యారు. మేము అందరినీ ఆడుకుంటే వీడేంటి మాతో ఆడుకుంటున్నాడని నిశ్చేష్టులయ్యారు. తర్వాత అక్కడున్న అమ్మాయిలందరి గురించి తనదైన స్టైల్లో చెప్పుకొచ్చాడు. మరీ ఉన్నదున్నట్టుగా చెప్పాడే తప్ప ఎక్కడా పొగడలేదని చింతించిన అమ్మాయిలు చితకబాది లుంగీ లాగారు. మీకు అన్నదమ్ముల్లేరా అని అతడు ప్రశ్నించడంతో హారిక లుంగీ లాగడం వదిలేసింది. కానీ సారీ చెప్పాలని పట్టు పట్టినా అతడు మాత్రం చెవికెక్కించుకోలేదు. తర్వాత అరియానా సోహైల్‌తో క్యాట్ వాక్ చేయించింది. (చదవండి: నామినేషన్స్ పిచ్చ లైట్, ఎందుకు ఫీలవుతా) నీ అందం అందరూ చూస్తే తట్టుకోలేను: అరియానా అఖిల్ లోనికి రావడంతోనే మోనాల్ సంబరపడిపోయింది. కొత్తగా పెళ్లైన అమ్మాయిగా నటించమని అఖిల్‌కు అరియానా టాస్క్ ఇచ్చింది. అఖిల్ అమ్మాయిలా ముగ్గు వేస్తుంటే పక్కింటి అబ్బాయిగా హారిక లైనేసింది. అదే సమయంలో భర్త అరియానా కాఫీ ఇవ్వమని కేకేయడంతో పరుగు పరుగున వెళ్లి కాఫీ ఇచ్చాడు. అరియానా అతడిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నట్లు నటించింది. ఆఫీసుకు వెళ్తున్నా.. సాయంత్రం మల్లెపూలు తేనా అని అడుగుతూనే అమ్మ పడుకున్నాక సినిమాకు వెళ్దాం.. నీ అందం అందరూ చూస్తే నేను తట్టుకోలేను అంటూ పాత్రలో లీనమైపోయింది. అర్ధరాత్రి అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ కలిసి చిందులేశారు. కానీ మోనాల్, అవినాష్ మాత్రం అందరూ పడుకున్నాక కూడా ఇద్దరూ సాల్సా డ్యాన్స్ చేశారు. యూ ఆర్ మై ఎవ్రీథింగ్.. అంటూ ఇష్టమొచ్చినట్లుగా చిందేశారు. ఇప్పుడు మనసుకు హాయిగా ఉందని ఇద్దరూ సంతోషంలో మునిగి తేలారు. (చదవండి: నన్ను పంపించేయండి: చేతులెత్తి వేడుకున్న గంగవ్వ) -
బిగ్‌బాస్ : చివరి క్షణంలో ఊహించని ట్విస్ట్..
బిగ్‌బాస్ హౌస్‌లో ఆరో వారం నామినేషన్ ప్రక్రియ కాస్త ప్రశాంతంగా జరిగింది. గత వారంలా పెద్దగా గొడవల్లేవు. అరుచుకోవడాలు అంతగా లేవు. అందరూ మెహబూబ్‌ను టార్గెట్ చేస్తే.. అనూహ్యంగా చివరి క్షణంలో ఆయనే సేవ్ అయ్యారు. అభిజిత్ బర్త్‌డే వేడుకలు, అరియానా అరుపులు, సోహైల్ సహనం, కుమార్‌సాయి ఆగ్రహం.. ఇలా ఈ రోజు ఏపిసోడ్‌లో ఎన్నో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. అవేంటో చదివేయండి మరి. క్లీనింగ్‌పై సోహైల్ రచ్చ.. పొగరు అంటూ అరియానా ఆగ్రహం సుజాత విసిరిన బిగ్ బాంబుతో నానా తిప్పలు పడుతున్నాడు సొహైల్. కెప్టెన్ అయ్యాను కాలు మీద కాలు వేసుకొని కూర్చుందాం అనుకుంటే.. నాతో పాత్రలు తోమిస్తున్నారంటూ బాధపడుతూ అవి కడిగేశాడు. అయితే అన్ని సామాన్లు కడుగుతా కానీ కప్‌లు మాత్రం కడగను అనేశాడు. అయితే అఖిల్ కప్పు నేను కడుగుతా తీసి పక్కన పెట్టు అంటూ చెప్పేసింది మోనాల్. సొంతంగా వాడుకున్న కప్పులు కూడా ఎవరు కడగడం లేదని, వాటిని దాచిపెడతానని సోహైల్ చెప్పాడు. అలా వద్దని, దానివల్ల గొడవలు అవుతాయని అమ్మ రాజశేఖర్ చెప్పాడు. అలాగే..ఇంటిలో ఇప్పటి వరకు ఎవరు వంట పాత్రలను క్లీన్ చేసినా ప్రాబ్లెం రాలేదు. కానీ నీవు మొదలుపెట్టిన తర్వాత శుభ్రంగా ఉండటం లేదు అంటూ అమ్మా రాజశేఖర్ అన్నారు. దానికి సమాధానమిస్తూ.. అయితే రోజు నీవే వంట పాత్రలు శుభ్రం చేయి. ఇప్పటి నుంచి కప్పులు ఎవరూ కడగకండి. మాస్టర్ కడిగేస్తాడంటూ బిగ్గరగా అరిచాడు. దాంతో నేను కడిగేస్తానని మాస్టర్ జవాబిచ్చాడు. ఆ తర్వాత సోహైల్‌కు అరియానా ఏదో చెప్పబోయింది. అందుకు వినకుండా ముఖంపై ఒకరకమైన ఎక్స్ప్రెషన్ ఇవ్వడంతో అరియానా ఫైర్ అయింది. ‘ఇదే అతి. నిన్న చెప్పింది కూడా ఇదే. కెప్టెన్ అన్నప్పుడు అందరి మాట వినాలి. పెద్ద పొగరేందో’ అంటూ అరియానా అనగానే.. ఏందీ అంటూ సోహైల్ సహనం కోల్పోయారు. వెంటనే బిగ్‌బాస్‌కు ఇచ్చిన ప్రామీస్‌ను గుర్తు తెచ్చుకొని కామ్‌గా ఉండిపోయాడు. తర్వాత బిగ్‌బాస్ కెమెరా ముందుకు వెళ్లి అరియానాపై కంప్లైంట్ చేశాడు. అరియానా కూడా బిగ్‌బాస్‌కు వివరణ ఇచ్చింది. నాగ్ సర్ ముందు అలా అంటావా.. మోనాల్‌పై అభి ఫైర్ గతవారం నామినేషన్ ప్రక్రియలో జరిగిన గొడవ గురించి అభి, మోనాల్ చర్చించుకున్నారు. నీకు నాకు మధ్య ఏం లేదా మోనాల్ అంటూ అభి ఆ టాపిక్ తీసుకొచ్చాడు. ఒక అమ్మాయి కోణం నుంచి ఆలోచించు అని మోనాల్ చెప్పబోతుండగా.. దీన్ని ఉమెన్ ఇష్యూలా చూపించకు.. అఖిల్‌కి నీ మీద అంత ప్రేమ ఉంటే.. నేషనల్ టీవీలో వచ్చేస్తుందని అంటే.. నామినేషన్ ప్రక్రియలో నీ పేరు ఎందుకు ప్రస్తావించాడు.నీ బెడ్ రూంలో కూర్చుని అఖిల్‌ది తప్పని అన్నావ్.. నాగ్ సార్ ముందు ఇద్దరిదీ తప్పు అంటావా? నాకు నువ్ ఏం చేస్తున్నావో అర్థం అవుతుంది అని అనడంతో మళ్లీ మోనాల్ ఏడుస్తూ కోపాన్ని ప్రదర్శించింది. అయినప్పటికీ అభిమాత్రం ఆ టాపిక్‌ని వదలేదు. నాకు నీతో మాట్లాడకపోతే బెటర్ అనిపిస్తుంది.. ఏదోటి చెప్పు.. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు.. నా పని నేను చూసుకోవచ్చు.. నేను నేనుగా ఉండలేకపోతున్నా.. నువ్ నీలా ఉండలేకపోతున్నా.. నాలో నువ్ తప్పుపట్టడం.. నేను నిన్న తప్పుపట్టడం వేస్ట్.. అంటూ ఆమె ముఖం మీదే చెప్పేశాడు అభి. అయితే దానికి సమాధానం చెప్పని మోనాల్.. కనీసం గుడ్ మార్నింగ్ హాయ్‌లు అయినా చెప్పుకుందాం అభి అని అడిగింది.. కాసేపు ఆలోచించుకుని చెప్తా అని బర్త్‌డే వేడుకకి వెళ్లాడు అభి. అంతా వచ్చారు..అఖిల్ మాత్రం రాలేదు అభిజిత్ బర్త్ డే కావడంతో అరియానా స్పెషల్ కేక్ తయారుచేసి కట్ చేయించింది. హౌస్మేట్స్ అంతా వచ్చి అభిని విష్ చేశారు. అయితే ఇంటి సభ్యులంతా కేక్ కటింగ్‌కి వచ్చినా అఖిల్ మాత్రం దూరంగానే ఉన్నాడు. మోనాల్ కూడా ఇలా వచ్చి అలా వెళ్లింది. వేలు దించూ.. కుమార్‌పై సోహైల్ ఫైర్ మోనాల్‌కి హెల్త్ బాలేదని సెలైన్ ఎక్కించారని బిగ్ బాస్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఉదయాన్నే మోనాల్ దగ్గరకు వెళ్లిన అఖిల్.. ఆమె చేతికి ఉన్న సూదిని చూసి తెగ ఫీల్ అయ్యాడు.. అయితే మోనాల్ ఎప్పటిలాగే అఖిల్‌ని తనపైకి లాక్కుని గట్టి హగ్ ఇచ్చేసింది. ఇక కెప్టెన్ సోహైల్ కేబినెట్ మీటింగ్ మాదిరి.. హౌస్‌మేట్స్‌తో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ కుమార్ సాయి, సోహైల్‌కు గొడవ జరిగింది. కెప్టెన్ అంటే గర్జించి ఏదో చేయడం కాదు. మనమంతా ఒక కేటగిరినే. అర్ధమవుతుందా? లేదు ఎవడికి ఇవ్వను అంటూ కుదరదు అంటూ కుమార్ సాయి చేయి చూపిస్తూ మాట్లాడుతుండగా.. సోహైల్ రెచ్చిపోయి.. వేలు దించు అంటూ ఓ రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. దానికి సమాధానంగా ఎంత దించాలి. ఇంత సరిపోతుందా అంటూ కుమార్‌సాయి కౌంటర్ ఇచ్చాడు. మెహబూబ్ కలజేసుకొని గొడవలు పెట్టడానికి ఈ మీటింగ్ కాదు. పాత్రలపై పేర్లు రాసుకుందాం.ఇకపై ఎవరి పాత్రను వాళ్లే వాడుకుందాం అన్నాడు. ఎండు మిర్చి మాలతో నామినేషన్ ఇక హౌస్‌లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. దీనిలో భాగంగా నామినేట్ చేయాలనుకునే వ్యక్తి మెడలో ఎండు మిర్చిల దండ వేసి.. అనంతరం కారణం చెప్పాల్సి ఉంటుంది. అరియానాలో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అరియానా మెహబూబ్‌ను నామినేట్ చేస్తూ.. కెప్టెన్సీ టాస్క్‌లో సోహైల్ హ్యాండ్ టచ్ అయిందని మెల్లిగా అంటే..దానిని మెహబూబ్ పెద్దగా చేశాడని, అది నచ్చలేదని రీజన్ చెప్పింది. ఇక రెండో వ్యక్తిగా మోనాల్‌ను నామినేట్ చేస్తూ.. హోటల్ గేమ్‌లో ఇచ్చిన టాస్క్‌ను సరిగా చేయలేదని కారణం చెప్పింది. ఇలా వివిధ కారణాలు చెబుతూ.. దివి - నోయల్, మెహబూబ్‌లను, నోయల్ - దివి, అభిజిత్‌లను, హారిక - అరియానా, కుమార్ సాయిని, అభిజిత్ - మెహబూబ్, అఖిల్‌ని, లాస్య - మెహబూబ్, దివిని, మెహబూబ్ - దివి, అరియానాని, సొహైల్ - అరియానా, కుమార్ సాయిని, అమ్మ రాజ శేఖర్ - లాస్య, అభిజిత్‌ని, అవినాష్ - దివి, అభిజిత్‌ని, మోనాల్ - అరియానా, దివిని, అఖిల్ - అభిజిత్, అరియానాని, కుమార్ సాయి - హారిక, సొహైల్‌ని నామినేట్ చేశారు. చివరి క్షణంలో బయటపడ్డ మెహబూబ్ సొహైల్ హౌస్‌కి కెప్టెన్‌గా ఉండటంతో బిగ్ బాస్ అతనికి ప్రత్యేక అధికారం ఇచ్చారు. నామినేట్ అయిన సభ్యుల్లో ఒకర్ని సేవ్ చేయాలని సూచించాడు. దీంతో అందరూ టార్గెట్ చేసిన తన ఫ్రెండ్ మెహబూబ్‌ని సేవ్ చేశాడు. దీంతో ఈవారం ఎలిమినేషన్ నుంచి మెహబూబ్ సేవ్ అయ్యాడు. దీంతో ఈ వారం అరియానా, అభిజిత్, మోనాల్, కుమార్ సాయి, దివి, అఖిల్, నోయల్, లాస్య, హారికలు ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. -
‘బిగ్‌బాస్’లో మిర్చి మంట.. టార్గెట్ అతడే
బిగ్ బాస్ సీజన్ 4 చూస్తుండగానే ఐదు వారాలు పూర్తి చేసుకుంది. గంగవ్వ హఠాత్తుగా ఇంటి నుంచి వెళ్లిపోవడం, సుజాత ఎలిమినేషన్‌తో ఐదోవారానికి ఎండ్ కార్డ్ పడింది. ఇక ఆరోవారం హౌస్‌లో వాతావరణం మరింత వేడెక్కేలా ఉంది. నామినేషన్ డే (సోమవారం) రావడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియ ‘ఘూటు’గా సాగినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే తెలుస్తోంది. నామినేషన్ కోసం ఘూటుగా ఉండే ఎండు మిర్చిల దండలను పంపిన బిగ్ బాస్.. కంటెస్టెంట్స్ మధ్య గొడవల ఘూటును కూడా మరింత పెంచాడు. అయితే ఈ వారం కంటెస్టెంట్స్ ఎలిమినేషన్స్ ప్రక్రియలో ఎక్కువగా మెహబూబ్ బుక్కయినట్లు తెలుస్తోంది. గతవారం హోటల్ టాస్క్ లో అతను చేసిన రచ్చకు హోటల్ సిబ్బంది ‘ఘూటు’గా రివేంజ్ తీర్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇక ఇంటి కెప్టెన్ కావడంతో సోహైల్ ఈ వారం బతికిపోయాడు. లేదంటే అతను కూడా మెహబూబ్లాగా బుక్కయ్యేవాడేమో. ఇక అభిజిత్, అఖిల్ మధ్య మరోసారి వార్ జరిగినట్లు తెలుస్తోంది. ఎండుమిర్చిల దండలను ఒకరిపై మరొకరు వేసుకున్నారు. కెప్టెన్సీ గేమ్‌లో సంచాలకుడిగా వ్యవహరించిన అభిజిత్ తీరును తప్పుబడుతూ అఖిల్ నామినేట్ చేయగా.. అభి కూడా అదే తరహా రీజన్ చెబుతూ.. అఖిల్‌ను నామినేట్ చేశాడు. ఇక మరోసారి మోనాల్ కంటతడి పెట్టింది. తన గురించీ ఎవరు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని నా సమస్యలను నేను పరిష్కరించుకోగలనని ఏడుస్తూ చెప్పింది. ఇక అరియన కూడా మెహబూబ్ పై విమర్శలు చేసింది. దానికి మెహబూబ్ కూడా ఘాటుగానే స్పందించినట్టు చూపించారు. దివి గత గొడవలను గుర్తు చేసుకుంటూ.. దెబ్బలు తగిలించుకోవడానికి రాలేదంటూ హౌస్‌మేట్స్‌పై మండిపడింది. మోనాల్ దండవేస్తుంటే అసహనంతో తెంచి పడేసింది. ఇక సోహెల్ కి కూడా కుమార్ సాయి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. వేలు దించి మాట్లాడు అంటూ సోహెల్ కుమార్ కి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ప్రోమో చూస్తుంటే బిగ్ బాస్ లో మిర్చి ఘాటు గట్టిగానే తగిలినట్లుంది. -
అలా చేస్తే పోలీసులు మోకాళ్లు విరగ్గొడతారు
బిగ్‌బాస్ నాల్గవ సీజన్లో నాలుగో వారం ఎలిమినేషన్ సమయంలో కొందరు చాలా బాధ పడ్డారు. స్వాతి వెళ్లిపోయినందుకు కాదు, మెహబూబ్ ఇంకా హౌస్‌లోనే ఉన్నందుకు! ఆఖరు నిమిషంలో అదృష్టం అతని వైపు ఉండేసరికి ఆయన బిగ్‌బాస్ ఇంట్లో ఉంటున్నాడు. కానీ ఈపాటికే ఎలిమినేట్ అవాల్సింది. అయినా తనకొచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఎప్పటిలాగే అతిగా ప్రవర్తిస్తున్నాడు. బీబీ హోటల్ టాస్క్‌లో రెచ్చిపోయి మరీ ఒక్క మాట తేడా వచ్చినా పుచ్చ పగిలిపోద్ది అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో సోహైల్ సైతం షాక్ తిన్నాడు. ఆ మాట అనడం కరెక్ట్ కాదని చెప్పాడు. (చదవండి: బిగ్ బాస్ : ఒక్క మాట తేడా వచ్చినా.. పగిలిపోతుంది) 'రౌడీయిజం ఊర్లో చేస్కో..' అని మెహబూబ్‌పై అవినాష్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. అయితే పుచ్చ పగిలిపోద్ది అనే డైలాగ్‌ను నాగ్ సైతం ఖండించారు. 'బయట హోటల్లో అలా మాట్లాడితే మెడ పట్టుకుని బయటకు గెంటేసి 100కు ఫోన్ చేస్తారు. అప్పుడు పోలీసులు మోకాళ్లు విరగ్గొడతారు' అని ఫైర్ అయ్యారు. దీంతో తను చేసింది ఎంత పెద్ద తప్పో బోధపడిన మెహబూబ్ సిగ్గుతో తల దించుకున్నాడు. నేటి ఎపిసోడ్లో ఒక్క మెహబూబ్‌కు మాత్రమే కాదు, అబ్బాయిలందరికీ కోటింగ్ పడుతున్నట్లు కనిపిస్తోంది. అలాగే అర్థం పర్థం లేని కారణాలతో ఒకరినొకరు నామినేట్ చేసుకున్న లాస్య, దివికి కూడా చీవాట్లు పెట్టినట్లు టాక్. (చదవండి: సుజాతది ఫేక్ నవ్వు, మోనాల్ ఆడుకుంటోంది) -
బిగ్‌బాస్: కెప్టెన్‌గా ఎన్నికైన సోహైల్!
బిగ్‌బాస్ ఇచ్చిన బీబీ హోటల్ టాస్క్‌లో అతిథులు సకల మర్యాదలు చేయించుకుంటూ అన్ని సేవలను పొందారు. కానీ హోటల్ సిబ్బంది మాత్రం నానా కష్టాలు పడినా కేవలం టిప్పు దక్కించుకున్నారే తప్పితే స్టార్లు మాత్రం పొందలేదు. అయితే అతిథులెవరూ స్టార్లు ఇచ్చేలా కనిపించకపోవడంతో అభిజిత్ తన మెదడుకు పదును పెట్టాడు. అతను 5 స్టార్లను దొంగిలించి హారిక చేతిలో పెట్టాడు. తర్వాత ఆమె ఒక్క స్టార్ ఇస్తానంటుంటే వినకుండా ఉన్నవన్నీ లాగేసుకున్నాడు. హారిక బాధపడుతున్నా వినలేదు. కానీ ఈ టాస్క్‌లో అతని ఎత్తు పారలేదని తెలుస్తోంది. కెప్టెన్సీ టాస్క్‌లో పాల్గొనేందుకు సోహైల్ మెహబూబ్‌తో చర్చిస్తుండటాన్ని చూస్తుంటే అతిథులే విజేతలుగా నిలిచారని స్పష్టమవుతోంది. (చదవండి: అభిజిత్ మైండ్ గేమ్.. కంటతడి పెట్టిన హారిక) ఇక గతంలో ఆడిన కాయిన్ల టాస్కులో కంటి మీద కునుకు లేకుండా కష్టపడి దొంగిలించిన కాయిన్లను సోహైల్.. తన స్నేహితుడు మెహబూబ్‌కు త్యాగం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అతడు పరోక్షంగా ప్రస్తావిస్తూ.. "ఇంతకుముందు నేను నీకు ఛాన్స్ ఇచ్చాను. కాబట్టి ఈసారి నాకు ఛాన్స్ ఇవ్వు. ఫ్రెండ్షిప్కు విలువిస్తే నాకు అవకాశమివ్వు, లేదంటే నీ ఇష్టం" అని దిల్సేను ముక్కుసూటిగా అడిగాడు. దీంతో అయోమయంలో పడ్డ మెహబూబ్ స్నేహితుడికి సపోర్ట్ చేస్తాడా? లేదా? చూడాలి. మరోవైపు బిగ్‌బాస్ హౌస్‌కు సోహైల్ ఐదో కెప్టెన్‌గా ఎన్నికయ్యాడని లీకువీరులు టముకు వేసి మరీ చెప్తున్నారు. ఇక అభిజిత్ స్టార్లను దొంగిలించడంపై సెటైర్లు వినిపిస్తున్నాయి. 'నొక్కేయాల్సిన కాయిన్ల టాస్కులో సైలెంట్‌గా కూర్చున్నదే కాకుండా దొంగతనం చేసినవాళ్లపై అరిచాడు.. ఇప్పుడేమో సంపాదించాల్సిన చోట నొక్కేశాడు. ఇదేం గేమ్‌రా బాబూ!", "రేపు అభిజిత్ తన సినిమాకు 5 స్టార్ రేటింగ్ ఇస్తేనే సినిమా విడుదల చేస్తాడేమో"నని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. (చదవండి: బిగ్‌బాస్‌ను వదిలేది లేదంటున్న నాగ్!) -
బిగ్ బాస్ : రౌడీయిజం ఊర్లో చేస్కో.. అవినాష్ ఫైర్
బిగ్ బాస్ 4 హౌస్‌లో బీబీ హోటల్ టాస్క్ రసవత్తరంగా సాగుతోంది. హోటల్ సిబ్బందితో అతిథులు ఆడేసుకుంటున్నారు. ఇష్టం వచ్చిన వంటకాలను ఆర్డర్లు ఇవ్వడమే కాగా, పలాన టైంలోపే ఇవ్వాలని కండీషన్లు పెడుతున్నారు. దాంతో పాటు ఫిజికల్ టాస్కులు ఇచ్చి హోటల్ సిబ్బందికి చుక్కలు చూపిస్తున్నారు. ఇక రిచ్‌మెన్లుగా ఉన్న మోహబూబ్, సోహైల్‌లో అయితే తమ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. వారి చేష్టలు హోటల్ సిబ్బందికి కోపం తెప్పిస్తున్నటకీ ఓపికతో అడిగిన పనులన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా మెహబూబ్ అయితే సిబ్బందితో ఓ ఆట ఆడుకుంటున్నాడు. మటన్ మండీ కావాలని, చికెన్ బిర్యానీ చెయ్యండంటూ సిబ్బందికి చుక్కలు చూపిస్తున్నాడు. అయితే మెహబూబ్ మరింత రెచ్చిపోవడంతో హౌస్‌లో గొడవ జరిగింది. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే ఆ విషయం తెలుస్తోంది. (చదవండి : బిగ్ బాస్: అతిథుల టార్చర్.. కుప్పకూలిన అభి) రిచ్‌మెన్లు అబద్దాలు ఆడుతున్నారని అవినాష్ అంటుండగా, నోరు జారకుండా మాట్లాడండి.. ఒక్క మాట తేడా వచ్చినా... పగిలిపోతుంది అంటూ మెహబూబ్ వార్నింగ్ ఇచ్చాయి. దీంతో ఆగ్రహానికి లోనైనా అఖిల్.. మెహబూబ్‌పై విరుచుకుపడ్డాడు. మాటలు కంట్రోల్ పెట్టుకోవాలని, ఒక లెవల్ దాటి మాట్లాడొదంటూ హెచ్చరించాడు. నేను నిన్ను అన్నానా అంటూ అఖిల్‌పై మెహబూబ్ ఫైర్ అయ్యారు. ఇక మధ్యలో కలగజేసుకున్న అవినాష్.. రౌడీయిజం చూపించుకోవాలంటే ఊర్లో చూపించుకో.. ఇది బిగ్ బాస్ హౌస్.. ఇక్కడ చేసుకుంటే వేరేలా ఉంటుందంటూ మొహబూబ్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అయితే మెహబూబ్ ఎవరిని ఉద్దేశించి సీరియస్ అయ్యారనేది తెలియాలంటే మరికొద్ది గంటల్లో ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే. #Mehboob warns the housemates #BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/BuLYsviIoI — starmaa (@StarMaa) October 7, 2020 -
బిగ్‌బాస్: గుడ్‌బై చెప్పనున్న అతడు? ఆమె?
బిగ్‌బాస్ నాల్గవ సీజన్లో నాలుగో కంటెస్టెంటు ఇంటి ముఖం పట్టే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే సూర్య కిరణ్, కరాటే కల్యాణి, దేవి నాగవల్లి ఎలిమినేట్ అయ్యారు. అయితే కొత్తగా వచ్చి చేరిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో కలిపి ప్రస్తుతం 16 మంది ఇంటిసభ్యులు ఉన్నారు. వీరిలో అభిజిత్, లాస్య, హారిక, సోహైల్, మెహబూబ్, కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ నామినేషన్లో ఉన్నారు. అయితే అభిజిత్ అభిమానగణం దండిగానే ఉండటంతో ఓట్లు కూడా అంతే స్థాయిలో పడుతున్నాయి. దీంతో అతడు సేఫ్ జోన్లో ఉన్నాడు. అనవసర విషయాల్లో తలదూర్చకుండా సహనానికి నిలువెత్తు రూపంలా నిలుస్తోన్న లాస్యకూ ఎక్కువ ఓట్లే పడ్డాయి. కెప్టెన్‌కు గండం తప్పినట్టే! ఈ వారం సోహైల్ భీభత్సంగా ఆడేసి ఎక్కువ ఓట్లు వచ్చేలా చేసుకున్నాడు. హారిక కూడా ఎలిమినేషన్ దరిదాపుల్లో లేదు. మిగిలిందల్లా స్వాతి దీక్షిత్, కుమార్ సాయి, మెహబూబ్ దిల్సే. ఇందులో స్వాతి, కుమార్ ఇద్దరూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లే. వచ్చినప్పటి నుంచి సోమరితనం ప్రదర్శిస్తూ వచ్చిన కుమార్ సాయి ఈ వారం అనూహ్యంగా కెప్టెన్‌గా నిలిచి తనను తిట్టిపోసిన వ్యక్తుల చేతులతోనే చప్పట్లు కొట్టించుకున్నాడు. సింపథీ ఓట్లు, దానికి తోడు కెప్టెన్ అయ్యాడు కాబట్టి అతడిని హౌస్ నుంచి పంపించే చాన్సులు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక స్వాతి దీక్షిత్ తన ఆట తానడకుండా ఉన్న కాయిన్లు అన్నింటినీ అభికి అప్పగించేసింది. వచ్చీరావడంతోనే గేమ్‌పై ఫోకస్ పెట్టలేకపోవడం కొంత మైనస్‌గా మారింది. (చదవండి: బిగ్‌బాస్: అభి కోసం ఆట త్యాగం చేసిన స్వాతి) వచ్చిన వారానికే తిరుగుముఖం పట్టిన స్వాతి అంతేకాక హౌస్‌లో ఆమెకు అప్పగించిన పని కూడా సరిగా చేయట్లేదని మిగతా కంటెస్టెంట్లు చర్చించుకుంటూనే ఉన్నారు. ఇంకా ప్రేక్షకులు ఆమెకు పెద్దగా కనెక్ట్ కాకపోవడంతో తక్కువ ఓట్లే పడ్డట్టు తెలుస్తోంది. దీంతో స్వాతి ఎలిమినేట్ అయ్యేందుకు ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. మిగిలింది మెహబూబ్.. నిజానికి చివరి వారమే వెళ్లాల్సింది కానీ చివరి నిమిషంలో అనూహ్యంగా దేవి నాగవల్లిని ఎలిమినేట్ చేశారు. ఈ వారంలో అదృష్టాన్నిచ్చే స్విచ్ కాయిన్ పోగొట్టుకోవడం, కావాలని మరీ అభిజిత్‌తో గొడవ పడటం వల్ల అతడిపై మరింత వ్యతిరేకత వచ్చింది. దీంతో మెహబూబ్ మళ్లీ డేంజర్ జోన్లోకి వచ్చాడు. దీంతో ఇతను కూడా వెళ్లిపోయేందుకు ఆస్కారం ఉందంటున్నారు. మరి ఈ వారం స్వాతి దీక్షిత్, మెహబూబ్‌లలో ఎవరు బిగ్‌బాస్ హౌస్‌కు గుడ్‌బై చెప్తారనేది వేచి చూద్దాం.. (చదవండి: దటీజ్ దేవి: మాస్టర్నే ఏడిపించేసింది) -
బిగ్‌బాస్: లక్ష రూపాయలు పట్టేసిన గంగవ్వ
ఐపీఎల్, కరోనాను ఎదుర్కొని ప్రేక్షకులకు బిగ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు బిగ్‌బాస్ సీజన్ 4 తమ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. టాస్క్‌లు, ట్విస్టులు, నామినేషన్లు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో భారీ స్థాయిలో వినోదాన్ని పంచుతోంది. ఇక బిగ్‌బాస్ ఇంటి హౌజ్‌లో 26వ రోజు సందడి సందడిగా సాగింది. ఉదయాన్నే హుషారైన పాటకు అందరూ ఎనర్జిటిక్‌గా డ్యాన్స్‌లు చేశారు. మార్నింగ్ మస్తీలో భాగంగా ఇంటి సభ్యులందరికి మెహబూబ్ డ్యాన్స్ స్టెప్పులు నేర్పిస్తున్నాడు. ఇంటి సభ్యుల్లో కొంతమందికి మాత్రమే లగ్జరీ బడ్జెట్ లభించింది. ష్యాషన్ షోలో ర్యాంప్ వాక్‌లతో అలరించారు. ఇంకేం జరిగిందంటే.. చపాతి స్టెప్ చేసిన మెహబూబ్ లాస్య ఎక్కువగా కిచెన్ వర్క్ చేస్తుంటుంది. కిచెన్‌లో ఆమె చేసే చపాతిని డ్యాన్స్ రూపంలో చేసి చూపించాడు మెహబూబ్. అవినాష్ కాలుకు దెబ్బ తగలడంతో కాలు కదలకుండా, అఖిల్ లాగా వర్కౌట్స్ ఎలా చేయాలో డ్యాన్స్ చేయాలో చేసి చూపించాడు. వీటితోపాటు ఇంట్లో కోపిష్టిగా పేరు తెచ్చుకున్న సోహైల్ ఆగ్రహంతో ఏ విధంగా డ్యాన్స్‌లు చేయాలో చూపించాడు. మాస్టర్‌తో కలిసి కాంచనలా మారి స్టెప్పులు వేశాడు. గంగవ్వ, స్వాతి, కుమార్ సాయి.. ఇలా ఇంట్లోని వారందరితోనూ ఏదో ఒక విధంగా డ్యాన్స్ చేపించాడు. అవినాష్ తనలోని మిమిక్రీ టాలెంట్‌ను ప్రదర్శించాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు సినిమాలోని విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ వాయిస్‌ను మిమిక్రీ చేసి చూపించాడు. చదవండి : అఖిల్‌కు బిగ్‌బాస్ ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటి? కన్ఫెషన్ రూమ్‌లోకి అఖిల్ ఇంటి సభ్యులంతా హాల్లో కూర్చొని ఉండగా అఖిల్‌ను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిపించాడు. ఆ రూమ్‌లోకి వెళ్లిన అఖిల్ మిగతా ఇంటి సభ్యులకు కనిపించనున్నాడు. ఈ వారం రేషన్ మేనేజర్‌గా అఖిల్ ఎన్నికైనందున అతనికి లగ్జరీ బడ్జెట్ షాపింగ్ చేయాలి. లగ్జరీ బడ్జెట్ సామాన్ల లిస్ట్‌ను అందించి, తమ దగ్గర ఉన్న 3200 పాయింట్లో ఒక్కొక్కరికి ఒక్కో వస్తువు చొప్పున16 ఎంపిక చేయాలి. లాస్యకు చికెన్ పచ్చడి, నోయల్‌కు బ్రెడ్, నూడుల్స్ సోహైల్, పోహ మెహబూబ్, పన్నీర్ మోనాల్, మాస్టర్‌కు శనగపిండి, కార్నఫ్లెక్స్ గంగవ్వకు కేటాయించాడు. కన్ఫేషన్ రూమ్ నుంచి బయటకు వచ్చాక తమకు ఏ వస్తువులు రాని ఇంటి సభ్యులు కొంత నిరాశ చెందాడు. అఖిల్ వేరే విధంగా ప్లాన్ చేసి ఉంటే బాగుండని అనుకున్నారు. చదవండి : బిగ్‌బాస్: అదిరేటి డ్రెస్ మేమేస్తే.. పిచ్చెక్కించిన ఫ్యాషన్ షో ఇంట్లోని సభ్యులందరికి కొత్త బట్టలు వచ్చాయి. చందన బ్రదర్స్ పంపించిన దుస్తులను ధరించి అందంగా తయారు అవ్వాలి. అనంతరం చందన బ్రదర్స్ ఫ్యాషన్ టాస్క్ చేయాలి. ఈ టాస్క్‌లో ర్యాంప్ వాక్ చేయాలి. ఇందులో మంచిగా చేసిన ఒక అబ్బాయి, అమ్మాయిని విజేతగా ప్రకటించి వారికి లక్ష రూపాయల గిఫ్ట్ వోచర్‌ను అందించాలి. ర్యాంప్ వాక్‌లో అబ్బాయిలందరూ ఒక్కొక్కరూ వచ్చి తమదైన స్టైల్లో వాక్ చేశారు. ఆ తర్వాత అమ్మాయిలందరూ అందంగా ర్యాంప్ వాక్ చేసి అబ్బాయిల గుండెల్లో మంటలు రేపారు. కుందనపు బొమ్మలా కనిపించారు. అమ్మాయిల నుంచి గంగవ్వను ఏకగ్రీవంగా విజేతగా ప్రకటించగా..అవ్వకు లక్ష రూపాయల గిఫ్ట్ వోచర్ అందించారు. అబ్బాయిల నుంచి అవినాష్‌ను విజేతగా తెలిపారు. బిగ్‌బాస్: అదిరేటి డ్రెస్ మేమేస్తే.. అద్దంలా మారిన అవినాష్ ఇంట్లోని అమ్మాయిలకు అందంగా తయారు అవ్వడం మహా ఇష్టం. ఈ క్రమంలో అవినాష్ అమ్మాయిలకు అద్దంగా వ్యవహరించనున్నాడు. ప్రతి అమ్మాయి అద్దం(అవినాష్) ముందుకు వచ్చి తమ మనసులోని ఫీలింగ్స్‌ను చెప్పుకోవాలి. ఇందులో అవినాష్ తన దగ్గరకు వచ్చిన వారిలో ఒక్కొక్కరిని ఒక్కో విధంగా ఆటాడుకున్నాడు. వాళ్లపై పంచ్‌లు వేస్తూ వారిని సరదాగా అలరించాడు. చివరగా ర్యాంప్ వాక్ షో లో ఎవరూ ఎలా చేశారో ఇమిటెట్ చేసి చూపించారు. అయితే సుజాత బుంగమూతి పెట్టుకుని అలిగింది. ఈ నెపంతో లాస్య, సుజాతకు మధ్య చిన్నగా వివాదం మొదలైంది. విన్నర్‌గా ముందు నోయల్‌ను చెప్పి ఆ తరువాత అవినాష్‌ను ప్రకటించినదని లాస్య సుజాత మధ్య గొడవ అయ్యింది. తర్వాత అవినాష్ సుజాతను కూల్ చేశాడు. అంతేగాక తనకు నచ్చినట్లు ఆడి బిగ్‌బాస్‌లో ఉండాలని, ఇతరులను బతిమాలడం మానేయాలని అరియానా అవినాష్‌లో స్పూర్తిని నింపింది. -
బిగ్‌బాస్: టాస్క్‌లో పడిపోయిన అవినాష్
కాయిన్లు సంపాదించాలనేది బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్. దొంగతనం చేయడం కూడా టాస్క్‌లో ఓ భాగమే. కానీ రాత్రిపూట కూడా నిద్రపోకుండా జాగారం చేసి మరీ అందరి కాయిన్లు నొక్కేసినందుకు సోహైల్‌పై మిగతా హౌస్మేట్స్ అరిచారు. పైగా ఎవరి కాయిన్లు తీయను అంటూ అందరినీ నమ్మిస్తూనే నొక్కేసిన మాస్టర్.. తన కాయిన్లు పోయినందుకు సోహైల్‌పై కక్ష కట్టాడు. అసలే అతిగా ఆవేశపడే అతడు.. అందరూ తననే టార్గెట్ చేయడంతో కథ వేరే ఉంటది అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఈ ఆటలో గంగవ్వ పాల్గొనకపోవడం గమనార్హం. నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి.. గుట్టు రట్టవుతుందని మాస్టర్ కంగారు బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా కొందరు కష్టపడి కాయిన్లు సేకరిస్తుంటే మరికొందరు వాటిని నొక్కేయడంపైనే దృష్టి సారించారు. అలా హారిక కాయిన్లను సోహైల్ లేపేయగా, అక్కడ దాచానని ఎవరు చెప్పారని అడిగింది. తర్వాత చెప్తానులే అని మెహబూబ్ బదులిచ్చాడు. దీంతో ఎవరెవరు కాయిన్లను ఎక్కడెక్కడ పెట్టుకున్నారనేది అందరికీ జారవేస్తున్న మాస్టర్ తన గుట్టు ఎక్కడ బయటపడిపోతుందోనని భయపడ్డాడు. నాతో మాట్లాడకు అంటూ మెహబూబ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. అభితో కాస్త దూరంగా ఉంటున్న హారిక ఈ రోజు అసలు సమస్యను అతడి ముందు ఏకరువు పెట్టింది. నువ్వు స్వాతికెందుకు సపోర్ట్ చేస్తున్నావు అని నిలదీసింది. ఆమె వచ్చి రెండు, మూడు రోజులే అవుతుంది, తనకిచ్చిన పని కూడా చేయలేకపోతోంది, డేంజర్ జోన్‌లోనూ ఏమీ లేదు. అలాంటిది ఆమె కోసం కిందపడీ, కొట్లాడీ నాణాలు సేకరించాల్సిన పనేంటని ప్రశ్నించింది. ఇది నేను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పుకొచ్చింది. నా స్నేహితుడు అయి ఉండి నాకిస్తావనుకున్నా అని చెప్పడంతో అభిజిత్ చేయి పట్టుకుని సారీ చెప్పాడు. రాత్రంతా జాగారం చేసి మరీ దొంగతనం తర్వాత స్విచ్ కాయిన్‌ను మెహబూబ్ చేతులారా కిందపడేశాడు. అదే ముఖ్యమైన కాయిన్ అని బిగ్‌బాస్ ప్రకటించడంతో తెల్లముఖం వేసిన మెహబూబ్‌కు సోహైల్ క్లాస్ పీకాడు. ఆ తర్వాత అందరూ పడుకున్నాక సోహైల్, లాస్య, అరియానా డీల్ మాట్లాడుకుని మాస్టర్ దగ్గర ఉన్న మొత్తాన్ని లేపేశారు. ఆనందంతో సోహైల్ తీన్మార్ డ్యాన్స్ చేశాడు. కానీ తిట్లు, అపనిందలు మాత్రం అతడి మీదనే వచ్చి పడ్డాయి. సుజాత, నోయల్ దగ్గర కూడా మెహబూబ్ కాయిన్లు తీసుకుని ఉడాయించాడు. అందరూ గుర్రు పెట్టి నిద్రపోతున్నా రాత్రంతా జాగారం చేసి మరీ కష్టపడి దోచుకుని సోహైల్, మెహబూబ్ కిలాడీ దొంగల్లా నిలిచారు. (చదవండి: ఎలిమినేషన్: అతడు కాదు ఆమె!) గంగవ్వ మాత్రం సోహైల్కే సపోర్ట్ పొద్దునే తన కాయిన్లు కనిపించకపోయేసరికి షాకైన మాస్టర్ సోహైల్‌పై ఆగ్రహంతో ఊగిపోయాడు. మీరు ఎలా గెలుస్తారో చూస్తానని సవాలు విసిరాడు. చూస్తేనే దొంగల్లా ఉన్నారంటూ, వాళ్లను కొట్టేయాలన్నంత కసితో రగిలిపోయాడు. ఈ కోపం నుంచి బయటపడని మాస్టర్.. కుమార్‌పై తన చిరాకు ప్రదర్శించాడు. అతడిని నోరు మెదపనీయకుండా చులకనగా మాట్లాడాడు. అనంతరం బ్రాండ్లు కనిపించకుండా బట్టలు ఆరేస్తున్నారని, వాటిని తీసేయాలని బిగ్‌బాస్ లేఖ పంపించాడు. దీంతో అందరూ సోహైల్, మెహబూబ్ కాయిన్లపై పరిచిన వస్త్రాన్ని తీసేయాలని గొడవ చేశారు. కానీ గంగవ్వ, అఖిల్ మాత్రం సపోర్ట్ చేశారు. అక్కడ బ్రాండ్ వస్తువులే లేవని తేల్చి చెప్పారు. అనంతరం కిల్లర్ కాయిన్స్ టాస్క్ మొదటి లెవల్ పూర్తైనట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. (చదవండి: నేను పెళ్లి చేసుకోడానికి రాలేదు: అఖిల్) మెహబూబ్‌కే ఎక్కువ పాయింట్లు ఈ టాస్క్‌లో అవినాష్ 3160, మాస్టర్ 320, స్వాతి 1930, లాస్య 1560, అభిజిత్ 1770, నోయల్ 900, హారిక 1450, సోహైల్ 3620, మెహబూబ్ 4360, మోనాల్ 610, అఖిల్ 2570, అరియానా 1850, దివి 110, కుమార్ 1570, సుజాత 340 + స్విచ్ కాయిన్ సంపాదించుకున్నారు. కానీ ఇక్కడితో ఆట పూర్తవలేదు. ఇప్పుడు వీటిని కాపాడుకోవడంతో అసలు కథ మొదలవుతుంది రెండో దశలో కిల్లర్ కాయిన్‌ను ఎవరిపై అతికిస్తే వారి సగం పాయింట్లు ఆవిరైపోతాయి. అందరూ సోహైల్ మీదే పగ పట్టడంతో ఒకరినే టార్గెట్ చేస్తే కథ వేరే ఉంటదని హెచ్చరించాడు. దీంతో మాస్టర్, సోహైల్ ఒకరి మీద ఒకరు అరుచుకున్నారు. తర్వాత మోనాల్ అవుట్ అయింది. ఇంతలో అవినాష్ సొమ్మసిల్లి కిందపడిపోయాడు. ఏమయ్యిందోనని కంగారు పడిపోగా కాలు బెణికిందని చెప్పాడు. దీంతో అతడిని ఎత్తుకుని మెడికల్ రూమ్‌కు తీసుకెళ్లారు. ఇక మాస్టర్ కాయిన్లు అందరూ దొంగిలించినా తనను మాత్రమే ప్రశ్నించారని మోనాల్ వెక్కివెక్కి ఏడ్చింది. (చదవండి: బిగ్‌బాస్: రెండో వారం పడిపోయిన టీఆర్పీ) -
బిగ్‌బాస్: అదృష్టాన్ని కాలితో తన్నేశాడు
ఇప్పుడిప్పుడే బిగ్‌బాస్ ఎంటర్టైన్మెంట్ ట్రాక్ ఎక్కుతోంది అని సంబరపడే సమయానికి మళ్లీ గాడి తప్పింది. పస లేని టాస్కులు, పైగా వాటిని సీరియల్ ఎపిసోడ్‌లా సాగదీయడం, అటు కంటెస్టెంట్లు సైతం గడిచిన ఫిజికల్ టాస్కునే పట్టుకుని ఇప్పటికీ వేలాడుతుండటం ప్రేక్షకులకు చిరాకు పుట్టిస్తున్నాయి. కాకపోతే మొన్నటివరకు పెద్దగా పట్టించుకోని కంటెస్టెంట్లకు స్క్రీన్‌పై కనిపించే సమయాన్ని పొడిగించడం మంచి పరిణామం. ఇక అమ్మాయిలతో కలిసి ఉంటున్నవాళ్లకే ప్రాధాన్యత ఉంటోందని లేటుగా తెలుసుకున్న మెహబూబ్, సోహైల్ తాజా డిస్కు ఆటలో బాగానే ఆడుతున్నారు. దొంగతనం చేయబోయి చివరి నిమిషంలో అడ్డంగా దొరికిపోతున్న సోహైల్ నేటి ఎపిసోడ్‌లోనైనా సఫలీకృతుడవుతాడేమో చూడాలి. (చదవండి: నువ్వేం తక్కువ కాదు: దివిపై సోహైల్ ఫైర్) మరోవైపు మెహబూబ్ మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. చేతులతో అందుకోవాల్సిన అదృష్టాన్ని కాలితో తన్నేశాడు. పవర్ కాయిన్‌ను చేజేతులా కింద పారేశాడు. ఏదైతే అది అయిందిలేనని సుజాత అతడు పాడేసిన పవర్ కాయిన్‌ను లటుక్కున పట్టేసుకున్నట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత బిగ్‌బాస్ అది స్పెషల్ కాయిన్ అని చెప్పడంతో ఎంత పని చేశానని మెహబూబ్ నాలుక కరుచుకున్నాడు. అతడు చేసిన ఘనకార్యానికి ఇజ్జత్ పోతుందని సోహైల్ తిట్టిపోశాడు. అయినా ఇప్పుడు మాత్రం ఎన్ననుకుంటే ఏం లాభం, ఆ తెలివి ముందుండాలని నెటిజన్లు కండల వీరుడికి బుద్ధి చెప్తున్నారు. ఇలాంటి సమయాల్లోనే మెదడుకు పని చెప్పాలని చురకలంటిస్తున్నారు. మరి ఈ టాస్క్‌లో చివరాఖరికి ఎవరు గెలుస్తారనేది చూడాల్సిందే.. (చదవండి: బిగ్‌బాస్: గంగవ్వకు అతడిష్టం, ఆమె కష్టం) -
బిగ్‌బాస్: మెహబూబ్ సేఫ్, దేవి అవుట్!
బిగ్‌బాస్‌లో గత రెండు సీజన్ల నుంచీ ఓ సాంప్రదాయం నడుస్తూ వస్తోంది. షో ప్రారంభానికి ముందే కంటెస్టెంట్ల లిస్ట్‌ను లీక్ చేయడం, ఇక ఎపిసోడ్ ప్రారంభానికి ముందు ఎవరెవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు? అనే విషయాలను కూడా లీకువీరులు సోషల్ మీడియాలో ముందుగానే టముకేసి మరీ చెప్పేస్తున్నారు. దీంతో అసలు ఎపిసోడ్‌కు వచ్చేసరికి అంతా ఊహించినట్టే జరుగుతుండటంతో అసలు మజా పోతోంది. దీన్ని అరికట్టడం బిగ్‌బాస్ టీమ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఎప్పటిలాగే ఈ సీజన్లోనూ లీకువీరులు చెప్పినట్టుగానే జరుగుతోంది. వాళ్లు ఊహించినట్లుగానే మూడు వారాల్లోపే ముగ్గురు కంటెస్టెంట్లు కుమార్ సాయి, ముక్కు అవినాష్, స్వాతి దీక్షిత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే సూర్య కిరణ్, కరాటే కల్యాణి ఎలిమినేట్ అవుతారని చెప్పిన జోస్యం కూడా నిజమైంది. అరియానాపై బిగ్‌బాంబ్ కానీ మూడో వారానికి వచ్చేసరికి మాత్రం అసలుకే ఎసరొచ్చింది. కండల వీరుడు మెహబూబ్ బిగ్‌బాస్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాడని లీకువీరులు ప్రకటించేశారు. కానీ కథ అడ్డం తిరిగింది. అతడు సేఫ్ జోన్లో అడుగు పెట్టగా, దేవి నాగవల్లి ఎలిమినేట్ అవనుందని తాజా సమాచారం. ఇదంతా లీకువీరుల ఆట కట్టించడానికి బిగ్‌బాస్ వేసిన ఎత్తుగడలా కనిపిస్తోంది. ఇక దేవి నాగవల్లి, మెహబూబ్‌కు మధ్య స్వల్ప ఓట్ల తేడా మాత్రమే ఉందట. ఇదిలా వుంటే లేడీ బిగ్‌బాస్ అవుతానని వచ్చిన దేవి తన బాధ్యతను అరియానా భుజాలపై వేసిందట. బిగ్‌బాంబ్ ద్వారా అరియానాను వచ్చే వారం నామినేషన్ గండం నుంచి గట్టెక్కించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. (మహానటి గంగవ్వ, మహా కంత్రి అవినాష్) దేవిని ఎలిమినేట్ చేస్తే బిగ్‌బాస్ చూడం ఈ వార్త విని దేవి అభిమానులు బిగ్‌బాస్ యాజమాన్యంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవి ఎలిమినేట్ అయితే ఈ సీజన్ ఇంక ఎందుకూ పనికిరాదని తిట్టిపోస్తున్నారు. ఆమె లేకపోతే షో చూడటమే వేస్ట్ అని మండిపడుతున్నారు. బలమైన కంటెస్టెంటును ఇంటి నుంచి పంపించేసి పెద్ద తప్పు చేస్తున్నారని హెచ్చరిస్తున్నారు. పులిహోర కలిపే వాళ్లను హౌస్‌లో ఉంచి ఇలాంటి మంచి కంటెస్టెంట్లను పంపివేయడం భావ్యం కాదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. (బిగ్‌బాస్ షోలో సందడి చేయనున్న అనుష్క) -
బిగ్‌బాస్: మెహబూబ్ బ్యాగు సర్దేయనున్నాడా?
బిగ్‌బాస్ నాల్గవ సీజన్లో ప్రేక్షకులు అతి చేసేవాళ్లను మెచ్చడం లేదు. ఇంటి సభ్యులందరినీ నోరెత్తకుండా, తన మాటే వేదంలా ఆచరించాలనేట్టు అతిగా ప్రవర్తించిన దర్శకుడు సూర్య కిరణ్‌ను మొదటి వారంలోనే బయటకు వెళ్లగొట్టారు. తర్వాత ఓవర్ ఎమోషన్స్ అంటే.. అప్పుడే అందరి మీదా అరిచేసి, ఆ వెంటనే ఏదో జరిగిపోయినట్లు ఏడ్చేసిన కరాటే కల్యాణిని కూడా వీక్షకులు తప్పు పట్టారు. దీంతో రెండోవారంలో ఆమెను ఇంటికి సాగనంపారు. ఇప్పుడు మూడో వారం ముగింపుకు వచ్చేసింది. మరో రెండు రోజుల్లో ఓ కంటెస్టెంటు ముల్లెమూట సర్దుకోనున్నారు. అది ఎవరనేది ఇప్పుడు చూసేద్దాం.. లాస్య, హారికకు ఇప్పట్లో ముప్పు లేదు ఈ వారం నామినేషన్లో లాస్య, కుమార్ సాయి, దేవి నాగవల్లి, మెహబూబ్, అరియానా గ్లోరీ, మోనాల్ గజ్జర్, హారిక ఉన్నారు. ఈ అందరిలో పాపులారిటీ ఎక్కువగా ఉన్న లాస్య ఇప్పట్లో బయటకు వెళ్లే ఛాన్సే లేదు. ఇప్పుడిప్పుడే తెలుగు కూడా మాట్లాడుతోన్న హారిక గేమ్‌పై ఫోకస్ పెట్టింది. ఆమెకు చాలానే ఓట్లు గుద్దడంతో సేఫ్ జోన్లో ఉంది. దేవి నాగవల్లి ఎవరి మాటలకు లొంగకుండా, గేమ్‌ను తన పంథాలో ఆడుతోంది. ఈ వారానికైతే ఆమె కూడా డేంజర్ జోన్లో లేదు. కుమార్ సాయి.. నిజానికి వచ్చిన వారానికే వెళ్లిపోతాడనుకున్నారు. ఈ విషయాన్ని ప్రేక్షకుల కన్నా ఎక్కువగా ఇంటి సభ్యులే బలంగా నమ్మారు. కానీ అలా జరగలేదు. (చెరసాలలో చెత్తగా ఆడిన నోయల్!) ఇంటి సభ్యుల వల్లే కుమార్‌కు ఓట్లు పైగా అతడికి వేసే ఓట్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కారణం అతని ఆడే తీరు నచ్చి కాదు. ఇతర కంటెస్టెంట్లు అతనితో ప్రవర్తించే విధానం. బిగ్‌బాస్‌లో అందరూ కుమార్‌ను గడ్డి పోచతో చూస్తూ, అతడికి మాట్లాడే చాన్స్ కూడా ఇవ్వడం లేదు. అందరూ ఏకమై అతన్నే టార్గెట్ చేస్తున్నారు. టీవీల ముందు కూర్చుని అంతా గమనిస్తున్న ప్రేక్షకులు కుమార్‌కు జరుగుతున్న అవమానానికి ఓట్ల రూపంలో బుద్ధి చెప్పాలనుకున్నారు. దీంతో అతడికి అత్యధిక స్థాయిలో ఓట్లు వస్తున్నాయి. మిగిలింది అరియానా, మెహబూబ్.. వీరిద్దరే ప్రస్తుతం డేంజర్ జోన్లో ఉన్నారు. (బిగ్‌బాస్: ఏడుగురిలో ఇంటికెళ్లేది ఎవరు?) ఫిజికల్ టాస్క్‌తో మెహబూబ్‌కు దెబ్బ అరియానా సీక్రెట్ రూమ్‌లో నుంచి ఇంట్లో అడుగు పెట్టిన రోజు చాలా ఓవర్ చేసిందని ప్రేక్షకులే కాదు హౌస్మేట్స్ కూడా అన్నారు. కానీ ఈ మధ్య అలాంటి వేషాలేం వేయడం లేదు. పైగా తాజా ఫిజికల్ టాస్క్‌లోనూ ఎవరి మాటలను పట్టించుకోకుండా, తనను డిస్కరేజ్ చేసినా సరే 'పోరాడి ఓడిపోవడం నాకిష్టం' అని ఓమాట చెప్పింది. దీంతో ఆమెకు ఓట్లు వేయని జనాలు కూడా అరియానాను 'ఫైటర్'గా అభివర్ణిస్తూ ఆమె ఇంట్లో ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. టాస్క్లంటే చాలు తన ప్రతాపం చూపించే మెహబూబ్ ఈ వారంలో తన పేరు తానే చెడగొట్టుకున్నాడు. దివి కిడ్నాప్ అయినప్పుడు లోపల ఎలాంటి హింస జరగకపోయినా సినిమా డైలాగులు చెప్పి, కన్నీళ్లు కార్చేసి బకరా అయ్యాడు. ఇక్కడ మెహబూబ్ అతి చేశాడని చాలామంది కామెంట్లు చేశారు. ఈ వారం మెహబూబ్‌కు తక్కువ ఓట్లు రావడంతో అతడు ఇంటికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
ఆ ఫాలోయింగ్తోనే బిగ్‌బాస్–4 హౌస్‌లో..
డ్యాన్స్‌పై ఉన్న ప్యాషన్.. టీవీలో చూసి స్టెప్పులు నేర్పింది. యాక్టర్ అవ్వాలనే ఆకాంక్ష.. తొలిసారి కాలేజీ స్టేజీపైకి ఎక్కించింది. స్క్రీన్‌పై కనిపించాలనే కోరిక.. జిమ్‌లో కండలు పెంచింది. ఒకటేమిటి.. ఆసక్తి.. లక్ష్యం.. ప్రతిభ.. ఊహించని అవకాశాన్ని ఇచ్చింది. యూట్యూబ్, టిక్‌టాక్ స్టార్‌గా సంపాదించుకున్న ఫాలోయింగ్ బిగ్‌బాస్–4 హౌస్‌లో కూర్చోబెట్టింది. అతనే గుంటూరులో గుమ్మడికాయలు అమ్మి కుటుంబాన్ని పోషించే ఓ చిరు వ్యాపారి కుమారుడు, అభిమానుల ‘మెహబూబ్ దిల్సే’. గుంటూరు ఈస్ట్ గుంటూరులోని పొన్నూరు రోడ్డు హుస్సేన్ నగర్ 1వ లైనులో షేక్ మెహబూబ్ కుటుంబం నివాసం. తల్లిదండ్రులు షేక్ రఫీ, సాబీ. సోదరుడు సుభాన్. తండ్రి రఫీ పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్లో గుమ్మడికాయలు విక్రయించి జీవనాన్ని సాగిస్తున్నారు. మెహబూబ్ నల్లచెరువులోని మహావీర్ విద్యాలయంలో 10వ తరగతి వరకు, గౌతమ్ కళాశాలలో ఇంటర్, కిట్స్ కళాశాలలో 2015లో బీటెక్ పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌పై ఆసక్తితో తోటి మిత్రులతో కలిసి టీవీల్లో వచ్చే డ్యాన్సులు చూస్తూ ప్రాక్టీస్ చేసేవాడు. ఇలా.. ఎవరి ప్రోత్సాహం లేకుండానే పాఠశాల, కళాశాల వేదికలపై స్టెప్పులేసి మిత్రుల్లో మంచి గుర్తింపు పొందాడు. కొన్నాళ్ల పాటు నల్లచెరువు భారత్ జిమ్‌లో వ్యాయామం చేసి శరీర సౌష్టవం సాధించాడు. ఒకసారి గుంటూరులో నిర్వహించిన 7అప్ కూల్ డ్రింక్ డ్యాన్సు అడిషన్స్‌లో తన ప్రతిభతో ఎంపికయ్యాడు. హైదరాబాద్‌లో కూడా పోటీలను దాటుకుని చెన్నైలో నిర్వహించిన ఫైనల్స్‌లో గట్టి పోటీ ఇచ్చి రెండవ స్థానంలో నిలిచాడు. (మాటలు జాగ్రత్తగా రానీ: మెహబూబ్ వార్నింగ్) తల్లితండ్రి సోదరుడితో మెహబూబ్ అనంతరం కుటుంబ ఆర్థిక పరిస్థితి మెహబూబ్‌ను ఉద్యోగం వైపు నడిపించగా హైదరాబాదులో 2016లో సాఫ్ట్వేర్ కొలువులో చేరాడు. అయితే కళా తృష్ణను విడిచిపెట్టకుండా ఖాళీ సమయంలో వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్, మోటివేషనల్ వీడియోస్, టిక్‌టాక్ కంటెంట్ వీడియోస్, సార్ట్ ఫిల్మŠస్ చేసి యూట్యూబ్‌లో తక్కువ సమయంలోనే ఎక్కువ మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే అతని ప్రతిభను గుర్తించిన సోషల్ మీడియాలో పలు ఆసక్తికర విషయాలను ప్రసారం చేసే సంస్థ అవకాశాన్ని, జీతాన్ని ఇచ్చింది. తనకు ఇష్టమైన రంగంలో పని దొరకడం మెహబూబ్‌కు వరంలా మారింది. ఈ క్రమంలోనే అనేక మంది సినిమా హీరోలు, సినీ పెద్దల అభినందనలు అందుకున్నాడు. ఇంతలో సోషల్ మీడియాలో పాపులరై ఎక్కువ మందిని ఎంటర్టైన్ చేసినందుకు బిగ్‌బాస్ నిర్వాహకులు మెహబూబ్‌ను సీజన్–4 హౌస్‌కు ఆహా్వనించారు. మెహబూబ్ తప్పక విజయం సాధించాలని మిత్రులు, గుంటూరు వాసులు ఆకాంక్షిస్తున్నారు. -
మాటలు జాగ్రత్తగా రానీ: మెహబూబ్ వార్నింగ్
ఫిజికల్ టాస్క్ అంటేనే ఎవరి శక్తి ఏంటో చూపించుకునే ఓ అవకాశం. కానీ ఇదే టాస్క్‌లో వాదులాడుకోవడాలు, కొట్టుకోవడాలు, తోసుకోవడాలు ఇలా ఎన్నో జరుగుతాయి. నేటి ఎపిసోడ్లో ఇచ్చిన ఫిజికల్ టాస్క్‌లో కూడా ఇదే జరగబోతున్నట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో మెహబూబ్ తన సహనాన్ని కోల్పోగా, అగ్గిపుల్లలాంటి దేవి నాగవల్లితో గొడవ పడ్డాడు. ఈ మేరకు స్టార్ మా తాజాగా ప్రోమో రిలీజ్ చేసింది. ఇందులో తన శక్తినంతా కూడదీసుకుని మెహబూబ్ ప్రత్యర్థి టీమ్‌కు గట్టిపోటీనిస్తున్నాడు. అతడి స్పీడ్‌కు బ్రేక్ వేసేందుకు ప్రత్యర్థి టీమ్‌లోని దేవి నాగవల్లి పరుగెత్తుతున్న మెహబూబ్‌ను కాలర్ పట్టుకుని ఆపింది. (చదవండి: ట్రోలింగ్ చూసి చాలా బాధపడ్డా: వితికా షెరు) దీంతో చిరాకు పడ్డ మెహబూబ్ తన చొక్కా పట్టుకోవద్దని సూచించాడు. అందుకు ఆమె అభ్యంతరం చెప్పింది. ఈ క్రమంలో పెద్ద రభసే జరగ్గా "మాటలు జాగ్రత్తగా రావాలి" అని ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఇంటిసభ్యులు గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. కంటెస్టెంట్లు ఒకరి మీద ఒకరు పడటం, మెడ పట్టుకుని గెంటేయడం చూస్తుంటే రెండు టీమ్‌లు గెలుపు కోసం హోరాహోరీగా పోరాడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ బీభత్సమంతా కేవలం ప్రోమో వరకేనా, లేదా ఎపిసోడ్‌లోనూ ఉంటుందా? అని కొందరు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. మరికొందరేమో.. పోయి పోయి దేవితో పెట్టుకున్నావేంట్రా బాబూ అని మెహబూబ్‌పై జాలి చూపిస్తున్నారు. (చదవండి: బీటౌన్‌లో 'బిగ్‌బాస్' సందడి) -
ఇప్పుడు కదా అసలు ఆట మొదలైంది
మొన్నటివరకు సంక్రాంతి సినిమాను తలపించిన బిగ్‌బాస్ హౌస్ నిన్ననటి నామినేషన్ ఎపిసోడ్‌తో రణరంగంగా మారిపోయింది. నామినేషన్ ప్రక్రియతో అందరి రంగులు బయటపడ్డాయని, ఎవరేంటో ఇప్పుడు తెలిసిందని గుసగుసలు పెడుతున్నారు. అప్పటివరకు స్నేహితులుగా ఉన్నవారు బద్ధ శత్రువులుగా మారిపోయారు. వారి మధ్య చెలరేగిన మంట చల్లారకముందే వారితో ఆటాడించేందుకు బిగ్‌బాస్ సిద్ధమయ్యాడు. ఫిజికల్ టాస్క్ ఆడించేందుకు ఇదే సరైన సమయమని భావించిన బిగ్‌బాస్ ఉక్కు హృదయం అని ఓ టాస్క్ ఇచ్చాడు. హౌస్‌మేట్స్‌ను రోబోలు, మనుషులుగా విభజిస్తూ వారి మధ్య కొట్లాట మొదలు పెట్టాడు. (బిగ్‌బాస్: ఏడుగురిలో ఇంటికెళ్లేది ఎవరు?) ఈ టాస్క్‌లో నోయల్, అమ్మ రాజశేఖర్, అవినాష్, దేవి, మెహబూబ్, అఖిల్, సోహైల్ మనుషుల టీమ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. గంగవ్వ రోబో వేషం ధరించి ఆటకు సై అంటోంది. ఇక రోబోలకు, మనుషులకు జరిగే యుద్ధాన్ని నేటి ఎపిసోడ్లో చూసి తీరాల్సిందే. అయితే మనుషుల టీమ్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఎక్కువగా ఉన్నారని, దీంతో వార్ వన్‌సైడ్ అయిపోయే అవకాశాలున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో ఈ టాస్క్‌లో ఎవరు బాగా ఆడితే వారికే ఈ వారం ఓట్లు గుద్దుతామంటున్నారు. ఇప్పుడు కదా అసలు ఆట మొదలైందంటూ నేటి ఎపిసోడ్ కోసం కొందరు తెగ ఎదురు చూస్తున్నారు. (బిగ్‌బాస్ టీమ్‌కు కావాల్సింది ఎడిట్ చేసి చూపించారు) -
బిగ్‌బాస్: ముక్కు అవినాష్ ఎంట్రీ!
నిన్న బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ నేడు కూడా కొనసాగింది. నిన్న జబర్దస్త్, నేడు ఢీ షోలతో కంటెస్టెంట్లు ఆకట్టుకున్నారు. ఇక పొద్దుపొద్దునే మోనాల్ గజ్జర్ కోసం అఖిల్ కారం దోశె వేయించుకుని మరీ తీసుకువచ్చాడు. కానీ తినిపించలేకపోయాడు. ఎందుకంటే అప్పటికే అతని స్థానంలో అభిజిత్ కూర్చుని కబుర్లు చెప్తున్నాడు. దీంతో ఏం మాట్లాడకుండానే అక్కడి నుంచి నిష్క్రమించాడు. అంతలోనే మోనాల్‌కు దగ్గు రావడంతో అభి నీళ్ల కోసం వెళ్లినప్పటికీ అఖిల్ ముందుగా వెళ్లి బాటిల్ ఇచ్చాడు. ఇస్తున్నావా? అని అభి అడిగినా ఏం సమాధానమివ్వకుండా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. తర్వాత కాసేపటికి మోనాల్ అఖిల్ దగ్గర కూచుని కెమెరాల వైపు చూసింది. అందుకే ఆలోచించి మాట్లాడు, కెమెరాలు చూస్తున్నాయని అఖిల్ సూచించాడు. అభి ఏదైనా చెప్తే, దాన్ని తన దగ్గర చెప్పొద్దని కోరాడు. ఇక వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సాయి ఒంటరిగానే కూర్చుంటున్నాడు, ఎవరితో కలవట్లేదని లాస్య అభిప్రాయపడింది. బహుశా తొలిరోజే నామినేషన్లోకి వెళ్లినందుకే ఇలా ఉన్నాడేమోనని సందేహించింది. అఖిల్ - మోనాల్ గురించి మొదలైన గుసగుసలు అభిజిత్, మోనాల్, అఖిల్ మధ్య రిలేషన్షిప్ మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా అఖిల్, మోనాల్ మధ్య ఏదో ఉందని లాస్య, సుజాత బలంగా నమ్ముతున్నారు. సోహైల్‌తో కలిసి డ్యాన్సు చేస్తుంటే అఖిల్ ముఖంలో మారుతున్న వేరియేషన్స్నే తీక్షణంగా చూస్తున్నారు. వీరికి అభిజిత్ కూడా తోడవడం గమనార్హం. ఎప్పుడూ ఎవరో ఒకరు నీ పక్కన ఉండటం వల్లే నీతో కలవలేకపోతున్నామని లాస్య, సుజాత మోనాల్‌కు చెప్పారు. ఇదే విషయాన్ని మోనాల్ అఖిల్‌తో చెప్పుకొచ్చింది. మనం కలిసి టైమ్ స్పెండ్ చేస్తున్నందుకు వారికి కష్టంగా ఉందట అని చెప్పింది. మనం ఫ్రెండ్స్ కదా, వాళ్లు ఏదో అనుకుంటున్నారు అని గుసగుసలాడింది. మరోవైపు తనకంటే చిన్నవాడైన అఖిల్ తనను రా అని పిలుస్తున్నాడని అభి నొచ్చుకున్నాడు. ఈ విషయం తనకు నేరుగాచెప్పినందు వల్లే ఈ రోజు తనతో వింతగా ప్రవర్తించాడని పేర్కొన్నాడు. (రొమాంటిక్ డ్యాన్స్; కళ్లు మూసుకున్న అరియానా) హాట్ డ్యాన్స్ చూసి చొక్కా విప్పేసిన నోయల్ నేడు బీబీ టీవీలో బీబీ టాలెంట్ షో జరిగింది. దీనికి అరియానా యాంకర్‌గా, లాస్య, నోయల్ జడ్జిలుగా వ్యవహరించారు. మొదటగా అమ్మ రాజశేఖర్ సోలోగా డ్యాన్స్ చేశాడు. సినిమా చూపిస్త మామా అంటూ సితక్కొట్టేశాడు. పర్ఫామెన్స్ మధ్యలో అలా వచ్చి, ఇలా వెళ్లిపోయిన దివి, కళ్యాణి స్పెషల్ ఎట్రాక్షన్లుగా నిలిచారు. తర్వాత ఇస్మార్ట్ సోహైల్, మోనాల్ రొమాంటిక్ సాంగ్ "వానా వానా వెల్లువాయే" పాటకు అదరగొట్టేశారు. కమాన్ అంటూ అఖిల్ మోనాల్‌ను బాగానే ఎంకరేజ్ చేశాడు. హాట్ పర్ఫామెన్స్ అంటూ నోయల్ చొక్కా విప్పేశాడు. అనంతరం వచ్చిన యాడ్‌లో దేవి, కళ్యాణి, అభిజిత్, అఖిల్ బమ్చిక్ ఫ్యాన్‌కు ప్రచారం చేశారు. (మరోసారి నామినేట్ అయిన గంగవ్వ) జోకర్ అంటూ వచ్చేస్తున్న కమెడియన్ తర్వాత మెహబూబ్, హారిక "టాప్ లేచిపోద్ది" పాటకు మాస్ డ్యాన్స్ చేశారు. ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయారు. బిగ్‌బాస్ హౌస్ టాపు లేచిపోయేలా దుమ్ము రేపారు. దీంతో మాస్టర్ని వెనక్కు నెట్టి మెహబూబ్, హారిక 'స్టార్ పర్ఫార్మర్ ఆఫ్ ద షో' అవార్డులు గెలుచుకున్నారు. కానీ మాస్టర్ చెప్పిన టిప్స్, కొరియోగ్రఫీ వల్లే ఈ అవార్డు గెలిచానని మెహబూబ్ ఉన్నమాట చెప్పేశాడు. గంగవ్వ 'మీ ఆరు గుర్రాలు మా ఆరు గుర్రాలు' పాట పాడింది. ఈ కార్యక్రమం ముగిసిపోగానే ఇంటి సభ్యులందరూ కలిసి డ్యాన్స్ చేశారు. కాగా మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ హౌస్‌లో ఉన్నా లేనట్టుగానే ఉండటంతో ఇదే వారంలో రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ సిద్ధం చేశారు. "జోకర్ వెనక జీవితమే ఉందం'టూ ఓ కొత్త కంటెస్టెంటు రేపు హౌస్‌లో అడుగులో పెట్టబోతున్నాడు. అందర్ని నవ్వించే జోకర్ పాయింట్‌తో వస్తున్నాడు అంటే అది కచ్చితంగా ముక్కు అవినాష్ అయ్యుంటుంది. (వైల్డ్ కార్డ్ ఎంట్రీ: ఇద్దరా? ముగ్గురా?) -
అందరి కళ్లు దివిపై, కానీ ఆమె కళ్లు..
షో ప్రారంభమైన వారం రోజుల తర్వాత ఎట్టకేలకు బిగ్‌బాస్ నిద్ర లేచినట్టున్నాడు. ఇప్పుడిప్పుడే ఆట మొదలెట్టినట్టు కన్పిస్తున్నాడు. ఈ రోజు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్తో హౌస్మేట్స్ అదరగొట్టేశారు అంటూ ప్రోమోల మీద ప్రోమోలు వదులుతున్నాడు. అయితే పులిలా చూపించే ప్రోమోలు ఎపిసోడ్ వరకు వచ్చేసరికి పిల్లిలా మారిపోతాయన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో నిజంగా నేటి ఎపిసోడ్లో ఫుల్ డోసులో వినోదం ఉంటుందా? లేదా? అని చాలామంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోలు ఈసారి ఎవరి అంచనాలను వమ్ము చేయవని రుజువు చేస్తున్నాయి. ఇన్ని రోజులుగా ఒక్క క్లిప్పింగ్ కూడా దొరకని మెహబూబ్ దిల్సే ఏకంగా వన్డే ఎపిసోడ్‌తో పాపులర్ అయిన దివిని ఎత్తుకునే ఛాన్స్ కొట్టేశాడు. ఒక్కమ్మాయిని కూడా వదలట్లేదంటూ ఓ వైపు కుళ్లుకుంటూనే అమ్మ రాజశేఖర్.. ఓసారి కళ్యానిని ఎత్తుకుని చూపించరా అని సవాలు విసిరాడు. దీంతో మెహబూబ్.. 'వామ్మో, నావల్ల కాదు బాబోయ్' అంటూ దండం పెట్టి మరీ అక్కడ నుంచి పారిపోయాడు. (చదవండి: బిగ్‌బాస్: సూర్యకిరణ్ అవుట్, ఆమెపై బిగ్‌బాంబ్!) చీపురు దెబ్బలు తిన్న సోహైల్ ఆ తర్వాత స్కిట్లో కళ్యాణి గొంతు సవరించుకుని పాటందుకోవడంతో అక్కడున్న మాస్టర్ చచ్చాన్రా దేవుడా అని ఏడ్వలేక నవ్వేశాడు. దేత్తడి హారిక ఇన్నాళ్లకు తెలంగాణ యాసలో మాట్లాడటం విశేషం. దేవి నాగవల్లి నటన మాత్రం ఎపిసోడ్‌కే హైలెట్‌గా నిలిచేలా ఉంది. ఇక దివి తనకు పులిహోర ఇష్టమని మొహమాటం లేకుండా ముఖం మీదే చెప్పింది. కానీ అఖిల్ అదేంటో తెలీని అమాయకుడిలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంతో దివి.. అది కూడా తెలీదా? అన్నట్లుగా ఓ లుక్ ఇచ్చింది. అటు సోహైల్ మరీ దారుణంగా ఆడవాళ్ల చేతిలో చీపురు దెబ్బలు తిని పరువు పోగొట్టుకుంటున్నాడు. ప్రోమోను చూస్తుంటే ఈ ఎపిసోడ్లో అబ్బాయిల కన్నా ఆడవాళ్ల పర్మాఫెన్సే అదుర్స్ అన్నట్లు కనిపిస్తోంది. (చదవండి: బిగ్‌బాస్: ఈ వారం ఎలిమినేషన్లో ఉన్నది వీళ్లే) Adiripoye Entertainment tho adarakottesaru housemates..Wait for the super fun!!!#BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/WjD8b31BeC — starmaa (@StarMaa) September 15, 2020 -
బిగ్‌బాస్: డేంజర్ జోన్లో ఆ ఇద్దరు
బిగ్‌బాస్ నాల్గవ సీజన్ ప్రస్తుతం నీరసంగా సాగుతోంది. ప్రోమోలతో ఆకాశమంత హైప్ క్రియేట్ చేసినా ఎపిసోడ్లు మాత్రం చప్పగా సాగుతున్నాయి. అసలే ఐపీఎల్ గండం ముంచుకొస్తుంది. ఆటను రంజుగా మార్చకపోతే ప్రేక్షకులు షోతో డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. బిగ్‌బాస్ ప్లాన్ మారుస్తే తప్ప ప్రేక్షకులు షోలో లీనమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇదిలా వుంటే గంగవ్వ, అభిజిత్, మెహబూబ్ దిల్సే, అఖిల్ సార్థక్, సూర్య కిరణ్, సుజాత, దివి వైద్య మొదటి వారం ఎలిమినేషన్ రౌండ్లో ఉన్నారు. ఇప్పటివరకు వచ్చిన ఓట్ల ఆధారంగా ఇద్దరు కంటెస్టెంట్లు డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. (చదవండి: బిగ్‌బాస్: 'అతను ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిది') ఒక్క ఎపిసోడ్‌తో పెరిగిన దివి క్రేజ్ 50 శాతానికిపైగా ఓట్లతో గంగవ్వ ఎప్పుడో సేఫ్ జోన్లోకి వెళ్లిపోయింది. ఆమె తర్వాత ఎక్కువ ఓట్లు గెలుచుకున్న అభిజిత్ కూడా ఎలిమినేషన్ గండం నుంచి బయటపడ్డాడు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్న అఖిల్, మెహబూబ్ కూడా ఈసారికి ఎలిమినేషన్ నుంచి బతికి బట్టకట్టారు. మిగిలింది దివి, సుజాత, సూర్యకిరణ్.. నిన్నటి ఎపిసోడ్ ముందు వరకు దివికి తక్కువ ఓట్లు పడ్డాయి. కానీ ఒక్క ఎపిసోడ్ ఆమె రాతనే మార్చేసింది. దివి సైలెంట్ కిల్లర్ అని, ఆమె హౌస్‌లో ఉండాల్సిందేనంటూ ఓట్లు గుద్దుదుతున్నారు. సుజాత.. తొందరపాటు, తత్తరపాటు చర్యలతో ఆమెకు తక్కువ ఓట్లు వచ్చాయి. (చదవండి: బిగ్‌బాస్: సూర్య కిరణ్‌తో దివి ఫైట్!) తన కోపమె తన శత్రువు తొలి రోజు నుంచే ఎవరి మీద పడితే వారిమీద తన కోపాగ్నిని ప్రదర్శించి సూర్య కిరణ్ అప్రతిష్ట మూట గట్టుకున్నాడు. ఎదుటివారిని మాట్లాడనివ్వకపోవడం, తన మాటే వినాలనేలా మూర్ఖత్వంగా ప్రవర్తించడమే ఓట్ల గండికి ప్రధాన కారణం. 'తన కోపమె తన శత్రువు' అన్న మాట ఇతని విషయంలో అక్షరాలా నిజమయ్యేట్లు కనిపిస్తోంది. కోపావేశాల కారణంగా హౌస్‌లో విలన్‌గా మారిపోయిన సూర్య కిరణ్‌ను బ్యాగు సర్దేసి బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు పంపిచాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే చివరి స్థానాల్లో ఉన్న కంటెస్టెంట్ల మధ్య ఓట్ల వ్యత్యాసంలో పెద్ద తేడా కూడా లేదు. పైగా నేడు రాత్రి 12 గంటల వరకు ఓటింగ్ వేసేందుకు అవకాశం ఉండటంతో చివరి రెండు స్థానాలు తారుమారైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది నాగార్జున వచ్చి చెప్పేవరకు వెయిట్ చేయక తప్పదు. (చదవండి: అమ్మ రాజశేఖర్ కుళ్లు జోకులు మానేయండి) -
ప్రేమను పంచుతా.. మెహబూబ్ దిల్సే
పుట్టిన సంవత్సరం: 1995 స్వస్థలం: హైదరాబాద్ వృత్తి: నటుడు, యూట్యూబర్ విద్య: గ్రాడ్యుయేట్ ఇతను నటుడు, డ్యాన్సర్, యూట్యూబర్ కూడా. అందరూ ఇతన్ని మెహబూబ్ దిల్సే అని పిలుచుకుంటారు. సూపర్ హిట్ సాంగ్స్‌కు తనదైన స్టైల్లో అదిరిపోయే స్టెప్పులు వేస్తాడు. ఈ వీడియోలను అతని సొంత ఛానల్ 'మెహబూబ్ దిల్సే'లో విడుదల చేస్తాడు. ఈ ఛానల్‌కు, ఆయన పోస్ట్ చేసే వీడియోలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మెహబూబ్ అనేక షార్ట్ ఫిల్మ్స్‌లోనూ నటించాడు. అన్నింటికీ మించి ఇతనో టిక్‌టాక్ స్టార్ కూడా! వచ్చీరాగానే నాగ్‌తో కలిసి మాస్ స్టెప్పు వేసి మార్కులు కొట్టేశాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ప్రేమను పంచుతానంటున్న ఈ యూట్యూబ్ స్టార్ పంచుతాడా? ప్రేమలో పడతాడా? ఏం చేస్తాడనేది చూడాలి