బిగ్‌బాస్‌ : చివరి క్షణంలో ఊహించని ట్విస్ట్‌.. | Bigg Boss 4 Telugu : Sixth Week elimination Process Started | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ : కెప్టెన్‌ పవర్‌తో ఫ్రెండ్‌ని సేవ్‌ చేసిన సోహైల్‌

Published Mon, Oct 12 2020 11:07 PM | Last Updated on Tue, Oct 13 2020 1:52 PM

Bigg Boss 4 Telugu : Sixth Week elimination Process Started - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆరో వారం నామినేషన్‌ ప్రక్రియ కాస్త ప్రశాంతంగా జరిగింది. గత వారంలా పెద్దగా గొడవల్లేవు. అరుచుకోవడాలు అంతగా లేవు. అందరూ మెహబూబ్‌ను టార్గెట్‌ చేస్తే.. అనూహ్యంగా చివరి క్షణంలో ఆయనే సేవ్‌ అయ్యారు. అభిజిత్‌ బర్త్‌డే వేడుకలు, అరియానా అరుపులు, సోహైల్‌ సహనం, కుమార్‌సాయి ఆగ్రహం.. ఇలా ఈ రోజు ఏపిసోడ్‌లో ఎన్నో ఆసక్తికర  సంఘటనలు చోటు చేసుకున్నాయి. అవేంటో చదివేయండి మరి.

క్లీనింగ్‌పై సోహైల్‌ రచ్చ.. పొగరు అంటూ అరియానా ఆగ్రహం
సుజాత విసిరిన బిగ్ బాంబుతో నానా తిప్పలు పడుతున్నాడు సొహైల్‌. కెప్టెన్‌ అయ్యాను కాలు మీద కాలు వేసుకొని కూర్చుందాం అనుకుంటే.. నాతో పాత్రలు తోమిస్తున్నారంటూ బాధపడుతూ అవి కడిగేశాడు. అయితే అన్ని సామాన్లు కడుగుతా కానీ కప్‌లు మాత్రం కడగను అనేశాడు. అయితే అఖిల్ కప్పు నేను కడుగుతా తీసి పక్కన పెట్టు అంటూ చెప్పేసింది మోనాల్. సొంతంగా వాడుకున్న కప్పులు కూడా ఎవరు కడగడం లేదని, వాటిని దాచిపెడతానని సోహైల్‌ చెప్పాడు. అలా వద్దని, దానివల్ల గొడవలు అవుతాయని అమ్మ రాజశేఖర్‌ చెప్పాడు. అలాగే..ఇంటిలో ఇప్పటి వరకు ఎవరు వంట పాత్రలను క్లీన్ చేసినా ప్రాబ్లెం రాలేదు. కానీ నీవు మొదలుపెట్టిన తర్వాత శుభ్రంగా ఉండటం లేదు అంటూ అమ్మా రాజశేఖర్ అన్నారు. దానికి సమాధానమిస్తూ.. అయితే రోజు నీవే వంట పాత్రలు శుభ్రం చేయి. ఇప్పటి నుంచి కప్పులు ఎవరూ కడగకండి. మాస్టర్ కడిగేస్తాడంటూ బిగ్గరగా అరిచాడు. దాంతో నేను కడిగేస్తానని మాస్టర్ జవాబిచ్చాడు.

ఆ తర్వాత సోహైల్‌కు అరియానా ఏదో చెప్పబోయింది. అందుకు వినకుండా ముఖంపై ఒకరకమైన ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడంతో అరియానా ఫైర్‌ అయింది. ‘ఇదే అతి. నిన్న చెప్పింది కూడా ఇదే. కెప్టెన్ అన్నప్పుడు అందరి మాట వినాలి. పెద్ద పొగరేందో’ అంటూ అరియానా అనగానే.. ఏందీ అంటూ సోహైల్ సహనం కోల్పోయారు. వెంటనే బిగ్‌బాస్‌కు ఇచ్చిన ప్రామీస్‌ను గుర్తు తెచ్చుకొని కామ్‌గా ఉండిపోయాడు. తర్వాత బిగ్‌బాస్‌ కెమెరా ముందుకు వెళ్లి అరియానాపై కంప్లైంట్‌ చేశాడు. అరియానా కూడా బిగ్‌బాస్‌కు వివరణ ఇచ్చింది.

నాగ్‌ సర్‌ ముందు అలా అంటావా.. మోనాల్‌పై అభి ఫైర్‌
గతవారం నామినేషన్‌ ప్రక్రియలో  జరిగిన గొడవ గురించి అభి, మోనాల్‌ చర్చించుకున్నారు. నీకు నాకు మధ్య ఏం లేదా మోనాల్ అంటూ అభి ఆ టాపిక్ తీసుకొచ్చాడు. ఒక అమ్మాయి కోణం నుంచి ఆలోచించు అని మోనాల్‌ చెప్పబోతుండగా..  దీన్ని ఉమెన్ ఇష్యూలా చూపించకు.. అఖిల్‌కి నీ మీద అంత ప్రేమ ఉంటే.. నేషనల్ టీవీలో వచ్చేస్తుందని అంటే.. నామినేషన్ ప్రక్రియలో నీ పేరు ఎందుకు ప్రస్తావించాడు.నీ బెడ్ రూంలో కూర్చుని అఖిల్‌ది తప్పని అన్నావ్.. నాగ్ సార్ ముందు ఇద్దరిదీ తప్పు అంటావా? నాకు నువ్ ఏం చేస్తున్నావో అర్థం అవుతుంది అని అనడంతో మళ్లీ మోనాల్‌ ఏడుస్తూ కోపాన్ని ప్రదర్శించింది. అయినప్పటికీ అభిమాత్రం ఆ టాపిక్‌ని వదలేదు. నాకు నీతో మాట్లాడకపోతే బెటర్ అనిపిస్తుంది.. ఏదోటి చెప్పు.. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు.. నా పని నేను చూసుకోవచ్చు.. నేను నేనుగా ఉండలేకపోతున్నా.. నువ్ నీలా ఉండలేకపోతున్నా.. నాలో నువ్ తప్పుపట్టడం.. నేను నిన్న తప్పుపట్టడం వేస్ట్.. అంటూ ఆమె ముఖం మీదే చెప్పేశాడు అభి. అయితే దానికి సమాధానం చెప్పని మోనాల్‌.. కనీసం గుడ్ మార్నింగ్ హాయ్‌‌లు అయినా చెప్పుకుందాం అభి అని అడిగింది..  కాసేపు ఆలోచించుకుని చెప్తా అని బర్త్‌డే వేడుకకి వెళ్లాడు అభి.

అంతా వచ్చారు..అఖిల్‌ మాత్రం రాలేదు‌
అభిజిత్ బర్త్ డే కావడంతో అరియానా స్పెషల్ కేక్ తయారుచేసి కట్ చేయించింది. హౌస్‌మేట్స్‌ అంతా వచ్చి అభిని విష్‌ చేశారు.  అయితే ఇంటి సభ్యులంతా కేక్ కటింగ్‌కి వచ్చినా అఖిల్ మాత్రం దూరంగానే ఉన్నాడు. మోనాల్‌ కూడా ఇలా వచ్చి అలా వెళ్లింది. 

వేలు దించూ.. కుమార్‌పై సోహైల్‌ ఫైర్‌
మోనాల్‌కి హెల్త్ బాలేదని సెలైన్‌ ఎక్కించారని బిగ్ బాస్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఉదయాన్నే మోనాల్ దగ్గరకు వెళ్లిన అఖిల్.. ఆమె చేతికి ఉన్న సూదిని చూసి తెగ ఫీల్ అయ్యాడు.. అయితే మోనాల్ ఎప్పటిలాగే అఖిల్‌ని తనపైకి లాక్కుని గట్టి హగ్ ఇచ్చేసింది. ఇక కెప్టెన్‌ సోహైల్‌ కేబినెట్‌ మీటింగ్‌ మాదిరి.. హౌస్‌మేట్స్‌తో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ కుమార్‌ సాయి, సోహైల్‌కు గొడవ జరిగింది. కెప్టెన్ అంటే గర్జించి ఏదో చేయడం కాదు. మనమంతా ఒక కేటగిరినే. అర్ధమవుతుందా? లేదు ఎవడికి ఇవ్వను అంటూ కుదరదు అంటూ కుమార్ సాయి చేయి చూపిస్తూ మాట్లాడుతుండగా.. సోహైల్ రెచ్చిపోయి.. వేలు దించు అంటూ ఓ రకమైన ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చాడు. దానికి సమాధానంగా ఎంత దించాలి. ఇంత సరిపోతుందా అంటూ కుమార్‌సాయి కౌంటర్‌ ఇచ్చాడు. మెహబూబ్‌ కలజేసుకొని గొడవలు పెట్టడానికి ఈ మీటింగ్‌ కాదు. పాత్రలపై పేర్లు రాసుకుందాం.ఇకపై ఎవరి పాత్రను వాళ్లే వాడుకుందాం అన్నాడు. 

ఎండు మిర్చి మాలతో నామినేషన్‌
ఇక హౌస్‌లో నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. దీనిలో భాగంగా నామినేట్‌ చేయాలనుకునే వ్యక్తి మెడలో ఎండు మిర్చిల దండ వేసి.. అనంతరం కారణం చెప్పాల్సి ఉంటుంది. అరియానాలో నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. అరియానా మెహబూబ్‌ను నామినేట్‌ చేస్తూ.. కెప్టెన్సీ టాస్క్‌లో సోహైల్‌ హ్యాండ్‌ టచ్‌ అయిందని మెల్లిగా అంటే..దానిని మెహబూబ్‌ పెద్దగా చేశాడని, అది నచ్చలేదని రీజన్‌ చెప్పింది. ఇక రెండో వ్యక్తిగా మోనాల్‌ను నామినేట్‌ చేస్తూ.. హోటల్‌ గేమ్‌లో ఇచ్చిన టాస్క్‌ను సరిగా చేయలేదని కారణం చెప్పింది. ఇలా వివిధ కారణాలు చెబుతూ.. దివి - నోయల్, మెహబూబ్‌లను, నోయల్ - దివి, అభిజిత్‌లను, హారిక - అరియానా, కుమార్ సాయిని, అభిజిత్ - మెహబూబ్, అఖిల్‌ని, లాస్య - మెహబూబ్, దివిని, మెహబూబ్ - దివి, అరియానాని, సొహైల్ - అరియానా, కుమార్ సాయిని, అమ్మ రాజ శేఖర్  - లాస్య, అభిజిత్‌ని,  అవినాష్ - దివి, అభిజిత్‌ని, మోనాల్ - అరియానా, దివిని, అఖిల్ - అభిజిత్, అరియానాని, కుమార్ సాయి - హారిక, సొహైల్‌ని నామినేట్‌ చేశారు. 

చివరి క్షణంలో బయటపడ్డ మెహబూబ్‌
సొహైల్‌ హౌస్‌కి కెప్టెన్‌గా ఉండటంతో బిగ్ బాస్ అతనికి ప్రత్యేక అధికారం ఇచ్చారు. నామినేట్ అయిన సభ్యుల్లో ఒకర్ని సేవ్ చేయాలని సూచించాడు. దీంతో అందరూ టార్గెట్‌ చేసిన తన ఫ్రెండ్‌ మెహబూబ్‌ని సేవ్‌ చేశాడు. దీంతో ఈవారం ఎలిమినేషన్‌ నుంచి మెహబూబ్ సేవ్‌ అయ్యాడు. దీంతో  ఈ వారం అరియానా, అభిజిత్, మోనాల్, కుమార్ సాయి, దివి, అఖిల్, నోయల్, లాస్య, హారిక‌లు ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement