మెహబూబ్‌ అవుట్‌.. నొప్పి భరించలేక అవినాష్‌ సెల్ఫ్‌ ఎలిమినేట్‌ | Bigg Boss 8 Telugu October 27th Full Episode Review And Highlights: Celebrities Diwali Surprise Visits, Mehboob Elimination | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Oct 27th Highlights: బిగ్‌బాస్‌ దీపావళి స్పెషల్‌: మెహబూబ్‌, అవినాష్‌ ఎలిమినేట్‌!

Published Sun, Oct 27 2024 7:09 PM | Last Updated on Mon, Oct 28 2024 12:17 PM

Bigg Boss Telugu 8: Diwali 2024 Special Episode Live Updates

పండగ సెలబ్రేషన్స్‌లో బిగ్‌బాస్‌ ఎప్పుడూ ముందుంటుంది. ఇటీవలే హౌస్‌లో బతుకమ్మ, దసరా వేడుకలు జరిగాయి. ఇప్పుడు దీపావళి సెలబ్రేషన్స్‌ జరిగాయి. ఈ వేడుకలల్లో సినీ తారలు​ భాగమయ్యారు. మరి హౌస్‌లో జరిగిన రచ్చ, హంగామా ఏ రేంజ్‌లో ఉందో లైవ్‌ అప్‌డేట్స్‌లో చూసేయండి..

పండగ సర్‌ప్రైజ్‌
నాగార్జున దీపావళి పాటకు స్టెప్పులేస్తూ పండగ కళను తీసుకొచ్చాడు. తర్వాత హౌస్‌మేట్స్‌ను జంటలుగా విడగొట్టిస్టెప్పులు మీవి- మార్కులు మావి అనే గేమ్‌ ఆడించాడు. ప్రతి రౌండ్‌లో గెలిచిన టీమ్‌కు ఒక సర్‌ప్రైజ్‌ ఉంటుందన్నాడు. అలా మొదటి రౌండ్‌లో గంగవ్వ-తేజ గెలిచారు. ఈ జంటలో ఒకరికే ఇంటిసభ్యుల నుంచి మెసేజ్‌ వస్తుందన్నాడు. అలా తేజ త్యాగంతో గంగవ్వకు తన కూతురి వీడియో మెసేజ్‌ ప్లే చేశారు. అది చూసిన అవ్వ సంతోషంతో కన్నీళ్లుపెట్టుకుంది. తర్వాత విష్ణుప్రియను సేవ్‌ చేశారు.

ప్రైజ్‌మనీలో మరో రూ.1లక్ష
అనసూయ డ్యాన్స్‌తో జోష్‌ నింపింది. ప్రైజ్‌మనీ కవర్స్‌​ కనుక్కోవాలన్న రెండో గేమ్‌లో నిఖిల్‌, యష్మీ గెలిచారు. వీరు కనిపెట్టిన కవర్లలోని రూ.1 లక్ష ప్రైజ్‌మనీలో యాడ్‌ చేశారు. తర్వాత ఈ జంటకు సంబంధించిన ఇంటిసభ్యుల ఫోటో చూపించారు. యష్మి త్యాగం చేయడంతో నిఖిల్‌ పేరెంట్స్‌ వీడియో ప్లే చేశారు. అలాగే నాగ్‌ నిఖిల్‌ను సేవ్‌ చేశాడు.

ప్రేరణకు సర్‌ప్రైజ్‌
తర్వాత 'క' మూవీ టీమ్‌ స్టేజీపైకి వచ్చింది. వీరు హౌస్‌మేట్స్‌ కళ్లకు గంతలు కట్టి గేమ్‌ ఆడించారు. ఇందులో ప్రేరణ-మెహబూబ్‌ గెలిచారు. మెహబూబ్‌ త్యాగంతో ప్రేరణకు వీడియో ప్లే చేశారు. ఆమె తన పేరెంట్స్‌ మాటలు విని మురిసిపోయింది. తర్వాత మెహరీన్‌ డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. సింగర్‌ సమీరా భరద్వాజ్‌.. హౌస్‌మేట్స్‌ అందరిపైనా అలవోకగా పాటలు పడేసి అబ్బురపరిచింది. ప్రతి ఒక్కరిపైనా అద్భుతంగా పాట పాడి అదరొట్టేసింది. 

స్టేజీపై దుల్కర్‌ సల్మాన్‌
లక్కీ భాస్కర్‌ మూవీ హీరో దుల్కర్‌ సల్మాన్‌, హీరోయిన్‌ మీనాక్షి చౌదరి, డైరెక్టర్‌ వెంకీ స్టేజీపైకి వచ్చారు. డైరెక్టర్స్‌ త్రివిక్రమ్‌, వెంకీలలో ఎవరిని సెలక్ట్‌ చేస్తావన్న ప్రశ్నకు మీనాక్షి.. వెంకీ అని బదులిచ్చింది. లక్కీ భాస్కర్‌ టీమ్‌ ఆడించిన గేమ్‌లో గౌతమ్‌-నయని పావని జంట గెలిచింది. వీరిలో నయని పావని తన తల్లి మెసేజ్‌ను త్యాగం చేయడంతో గౌతమ్‌.. అతడి తండ్రి వీడియో సందేశాన్ని వినగలిగాడు. ఇంట్లో గొడవపడి వచ్చిన గౌతమ్‌.. తండ్రికి సాష్టాంగ నమస్కారం చేసి మరీ సారీ చెప్పాడు.

హరితేజ ఎమోషనల్‌
హీరోయిన్‌ శాన్వీ స్పెషల్‌ డ్యాన్స్‌ పర్ఫామెన్స్‌తో మైమరపించింది. తర్వాత ప్రేరణ, పృథ్వీని సేవ్‌ చేశారు. అనంతరం అమరన్‌ హీరో శివకార్తికేయన్‌, హీరోయిన్‌ సాయిపల్లవి స్టేజీపైకి వచ్చారు. వీరు ఆడించిన గేమ్‌లో రోహిణి, అవినాష్‌ గెలిచారు. వీళ్లిద్దరూ తమకు బదులుగా హరితేజకు తన కూతురి వీడియో చూపించమన్నాడు. హాయ్‌ అమ్మ, హ్యాపీ దివాళి అంటూ కూతురు మాట్లాడిన ముద్దుముద్దు మాటలు విని హరితేజ ఏడ్చేసింది. తర్వాత హైపర్‌ ఆది హౌస్‌లోకి వచ్చి తన పంచ్‌ కామెడీతో నవ్వించాడు.

ఏడ్చిన యష్మి
ఈ ఎపిసోడ్‌ కంటే ముందు ఏం జరిగిందన్నది చూపించారు. ఎవరినో ఉడికించడానికి యష్మి తనను వాడుకోవడం నచ్చలేదన్నాడు గౌతమ్‌. ఆ మాటలు విన్న యష్మి.. తన ఉద్దేశం అది కాదంటూ ఏడ్చేసింది. నిఖిల్‌, నేను ఫ్రెండ్స్‌లా టీజ్‌ చేసుకున్నాం తప్ప నువ్వంటే నాకు బాగా ఇష్టం అని ఎక్కడా ఒకరికొకరం ఎక్స్‌ప్రెస్‌ చేసుకోలేదు. నా వల్ల తప్పు జరిగుంటే సారీ అని చెప్పింది. దీంతో గౌతమ్‌.. ఇకపై నువ్వు నాకు కంటెస్టెంటు మాత్రమే.. నీ లైఫ్‌ నీది, నా లైఫ్‌ నాది అని క్లారిటీ ఇచ్చేశాడు. నాగ్‌ నయనిని సేవ్‌ చేసి మెహబూబ్‌ ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించాడు.

అప్పుడలా ఇప్పుడిలా..
వెళ్లిపోయేముందు మెహబూబ్‌ హౌస్‌మేట్స్‌ను పటాకాలతో పోల్చాడు. అవినాష్‌ ధౌజండ్‌వాలా, గంగవ్వ లక్ష్మీబాంబ్‌, నబీల్‌ రాకెట్‌, రోహిణి కాకరబత్తి, గౌతమ్‌ మ్యాచ్‌ స్టిక్‌ అన్నాడు. గతంలోనూ దీపావళికి నేను ఎలిమినేట్‌ అయ్యా.. ఈసారి కూడా దీపావళికే బయటకు వచ్చేశాను. ఎందుకో అర్థం కావట్లేదంటూ ఎమోషనల్‌ అయ్యాడు. 

అవినాష్‌ ఎలిమినేట్‌
ఇక రేపటి ప్రోమోలో అవినాష్‌ అనారోగ్యంతో సెల్ఫ్‌ ఎలిమినేట్‌ అయినట్లు చూపించారు. కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాను. మెడికల్‌ రూమ్‌కు వెళ్తే బయటకు వచ్చేయమన్నారు. వెళ్లిపోతున్నాను అంటూ వీడ్కోలు తీసుకున్నాడు. హాస్పిటల్‌కు వెళ్లి మళ్లీ హౌస్‌లో అడుగుపెడతాడా? లేదా నిజంగానే వెళ్లిపోతాడా? అన్నది రేపు తేలనుంది.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement