
హౌస్‌మేట్స్‌కు నాగార్జున గట్టిగా క్లాస్ పీకి చాలాకాలమైంది. అందుకే ఈ రోజు అందరికీ కోటింగ్ ఇవ్వడమే పనిగా పెట్టుకున్నాడు. గౌతమ్, నిఖిల్, యష్మి, ప్రేరణలపై సీరియస్ అయ్యాడు. ప్రత్యేకంగా ఈ నలుగురిపైనే ఫైర్ అవడానికి కారణమేంటో తెలియాలంటే నేటి (నవంబర్ 2) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..

నువ్వేమైనా పుడింగా?
నాగార్జున వచ్చీరాగానే ప్రేరణపై విరుచుకుపడ్డాడు. నువ్వేమైనా పుడింగా? అందరిపై నోరు ఎందుకు జారుతున్నావ్? అని నిలదీశాడు. అందుకామె పుడుంగి అనేది తప్పు పదమని తెలీదని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించింది. దీంతో నయని లేచి.. తను ఎప్పుడూ అమర్యాదగానే మాట్లాడుతుందని అగ్నికి ఆగ్జం పోసింది. అటు నాగ్ వీడియో ప్లే చేయడంతో అడ్డంగా దొరికిపోయిన ప్రేరణ నయనికి సారీ చెప్పింది. నిఖిల్‌ను తిట్టడాన్ని సైతం తప్పుపడుతూ నోరు అదుపులో పెట్టుకోమని హెచ్చరించాడు.

ఎందుకంత కోపం?
పానీపట్టు యుద్ధం టాస్క్‌లో అగ్రెసివ్‌గా ఆడావు. అప్పుడు ప్రేరణ, యష్మిపై ఎందుకంత కోపం చూపించావని నాగ్ నిఖిల్‌ను అడిగాడు. అందుకతడు ప్రేరణ, గౌతమ్ బూతు వాడటంతో మరింత ట్రిగ్గర్ అయ్యానన్నాడు. దీనిపై గౌతమ్ స్పందిస్తూ.. తాను బూతు మాట అనలేదన్నాడు. దీంతో నాగ్ వీడియో వేసి చూపించాడు. అందులో అతడు పెదాలాడించినట్లు ఉందే తప్ప బూతు మాట్లాడినట్లు లేదు.

నిరూపిస్తే హౌస్ నుంచి వెళ్లిపోతా..
వీడియో చూసిన తర్వాత కూడా గౌతమ్.. తల్లిపై ప్రమాణం చేస్తున్నాను. నేను బూతు మాట్లాడలేదు. చేయని తప్పును ఒప్పుకోను. నేను బూతు మాట్లాడినట్లు నిరూపిస్తే హౌస్ నుంచి వెళ్లిపోతానని శపథం చేశాడు. దీంతో నాగ్.. గౌతమ్ మాటల్ని ఎవరు నమ్ముతున్నారని అటు హౌస్‌మేట్స్‌ను, ఇటు స్టూడియోలో ఉన్నవారిని అడిగాడు. కానీ ఏ ఒక్కరూ గౌతమ్‌కు సపోర్ట్ చేయకపోవడంతో అతడి ముఖంలో నెత్తురుచుక్క లేకుండా పోయింది.

మధ్యలో దూరకు
తర్వాత యష్మి వంతురాగా.. నీ ప్రాబ్లమేంటక్కా? అని నాగ్ ప్రశ్నించాడు. గౌతమ్ తనను సడన్‌గా క్రష్, సడన్‌గా అక్క అని పిలిస్తే తీసుకోలేకపోయానని బదులిచ్చింది యష్మి. దీంతో నాగ్ వీడియో ప్లే చేశాడు. అందులో గౌతమ్.. విష్ణుతో మాట్లాడుతుంటే యష్మి మధ్యలో దూరింది. ఈ గొడవ పెద్దదై ఒకరినొకరు అక్కాతమ్ముడు అనుకున్నారు. నువ్వు కూడా తమ్ముడు అన్నావుగా.. ఏదైనా జరుగుతున్నప్పుడు మధ్యలోకి దూరకూడదు అని సూచించాడు.

ఫ్లిప్ అవుతున్నావ్
అలాగే బీబీ ఇంటికి దారేది ఛాలెంజ్‌లో తన రెడ్ టీమ్‌లో గౌతమ్‌ను ఎలిమినేట్ చేయడం గురించి అడగ్గా.. అతడు పెద్దగా ఆడలేదని తెలిపింది. దీంతో గౌతమ్ లేచి.. నేను ఆల్‌రెడీ ఒకసారి మెగా చీఫ్ అయ్యానని, అందుకే సైడ్ చేస్తున్నామని చెప్పిందే తప్ప ఆడలేదని చెప్పలేదన్నాడు. ఇది విన్న నాగ్.. ఇలా మాటలు మారుస్తూ ఉంటే నువ్వు ఫ్లిప్ అవుతున్నావని జనాలు భావిస్తారని హెచ్చరించాడు.

సిగ్నల్స్ ఇచ్చిన గంగవ్వ
అనంతరం బాగా ఆడావంటూ నాగ్ తేజను మెచ్చుకోగా ఇది కలా? నిజమా? అర్థం కాక అతడు నోరెళ్లబెట్టాడు. సెకనులో ఇదంతా నిజమేనని తెలుసుకుని తెగ సంతోషించాడు. ఇక మెగా చీఫ్ పోస్ట్‌ను త్యాగం చేయడం బాగోలేదని నబీల్‌కు చురకలంటించాడు.
గండం గట్టెక్కింది!
గంగవ్వను ఆటలో ఇంకాస్త యాక్టివ్‌గా ఆడాలని నాగ్ సలహా ఇవ్వగా.. తనకు ఒళ్లునొప్పులు వస్తున్నాయంది. తనవల్ల కానిరోజు హౌస్ నుంచి తనే స్వయంగా వెళ్లిపోతానంది. చివర్లో తేజ సేవ్ అయినట్లు ప్రకటించాడు. గతంలో తొమ్మిదో వారమే షో నుంచి ఎలిమినేట్ అయ్యానని ఈసారి ఆ వారం నుంచి తప్పించుకున్నానంటూ ఫుల్ ఖుషీ అయ్యాడు.





Comments
Please login to add a commentAdd a comment