Nayani Pavani
-
బిగ్‌బాస్ ఫినాలేకు ముగ్గురు డుమ్మా.. ఆ కారణం వల్లేనా?
బిగ్‌బాస్ షో తమకు జీవితంలో వచ్చిన పెద్ద అవకాశం అని చాలామంది కంటెస్టెంట్లు చెప్తూ ఉంటారు. ప్రేక్షకులకు తమను దగ్గర చేసిన బిగ్‌బాస్ షోకు ఎప్పటికీ రుణపడి ఉంటామంటుంటారు. అయితే కొందరు మాత్రం ఈ రియాలిటీ షో వల్ల నెగెటివిటీ మూటగట్టుకున్నామని తిట్టిపోస్తుంటారు. ఇదంతా పక్కన పెడితే నేడు బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ గ్రాండ్ ఫినాలే.నెగెటివిటీ మూటగట్టుకున్న హరితేజఅంటే ఈ సీజన్ విజేతను తేల్చే ఆఖరి రోజు. ఇలాంటి పెద్ద ఈవెంట్‌కు ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ వస్తారు. అదేంటో కానీ ఈసారి ఏకంగా ముగ్గురు డుమ్మా కొట్టేశారు. వారే విష్ణుప్రియ, నయని పావని, హరితేజ. విచిత్రంగా సీజన్ 1లో సెకండ్ రన్నరప్‌గా నిలిచిన హరితేజ ఈ సీజన్లో మాత్రం వైల్డ్‌కార్డ్‌గా అడుగుపెట్టి నెలరోజులకే బయటకు వచ్చేసింది. విపరీతమైన నెగెటివిటీ మూటగట్టుకుంది. బహుశా అందుకే గ్రాండ్ ఫినాలేను లైట్ తీసుకుని ఉండవచ్చు!నిరూపించుకోలేకపోయిన నయనిఅటు నయని పావని.. ఏడో సీజన్లో వైల్డ్‌కార్డ్‌గా వచ్చి వారం రోజులకే ఎలిమినేట్ అయిపోయింది. ఈ సీజన్లో తన సత్తా చూపించాలనుకున్నప్పటికీ అన్నింటికీ ఏడ్చేస్తూ మూడువారాలకే హౌస్ నుంచి వచ్చేసింది. బహుశా ఈ బాధతోనే తను రాకపోయి ఉండొచ్చు. ఇక విష్ణుప్రియ.. విన్నర్ అయ్యేంత దమ్మున్నా ఆటపై ఫోకస్ పెట్టకుండా పృథ్వీపై మనసు పారేసుకుంది. గౌతమ్‌పై విష్ణు చిన్నచూపుఅతడు ఛీ కొట్టినా, చులకనగా చూసినా అతడు మాత్రమే కావాలంటూ పిచ్చిగా ప్రవర్తించింది. మనసులోని భావాలను నిర్మొహమాటంగా వ్యక్తపరిచిన ఆమె నిజాయితీ మెచ్చిన జనాలు ఆమెను దాదాపు 100 రోజులు హౌస్‌లో ఉండనిచ్చారు. అయితే గౌతమ్‌పై మొదటి నుంచీ ద్వేషం పెంచుకున్న ఆమె షో నుంచి వెళ్లేటప్పుడు కూడా అతడిని అవమానించింది.ఆ కారణం వల్లే?అసలు నువ్వేం ఆడావో చూస్తానంటూ గడ్డిపోచలా తీసిపారేసింది. కానీ ఇప్పుడేకంగా అతడు టైటిల్ రేసులో ఉన్నాడు. ఆ దృశ్యం చూడలేకే విష్ణు రాలేదని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు. మరికొందరేమో తనపై వచ్చిన నెగెటివిటీ తట్టుకోలేకే ఈ ఈవెంట్‌కు డుమ్మా కొట్టి ఉండొచ్చని భావిస్తున్నారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నవ్వుతూ వెళ్లిన నయని.. ఆ ఐదుగురు డమ్మీ ప్లేయర్స్ అంటూ..
సండే అంటే ఫన్డే.. ఆటలు, పాటలు, డ్యాన్సులు.. మొత్తం ఇవే ఉంటాయి. ఇలాంటి ఫన్ గేమ్‌తోనే ఎపిసోడ్ మొదలైంది. అంతకంటే ముందు గౌతమ్‌ను సేవ్ చేశాడు. తర్వాత ఏం జరిగిందో నేటి (నవంబర్ 3) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..విష్ణుప్రియ టీమ్ గెలుపునిఖిల్, రోహిణి, ప్రేరణ, నయని పావని, విష్ణుప్రియ, తేజను టీమ్ 'A'గా మిగతావాళ్లందరినీ టీమ్ 'B'గా విభజించారు. ఈ గేమ్‌లో భాగంగా ఒక చీటీ తీసి అందులో ఇంగ్లీష్‌లో రాసి ఉన్న వాక్యాలు చదివి తెలుగులో పాటను గెస్ చేయాలి. చిన్నపిల్లలు కూడా ఆడగలిగేలా సింపుల్‌గా ఉన్న ఈ గేమ్‌లో విష్ణుప్రియ టీమ్ గెలిచింది. తర్వాత యష్మి సేవ్ అయినట్లు ప్రకటించాడు.నిఖిల్ వెంటే గెలుపుఅనంతరం అందరూ పక్షుల్లా మారిపోయారు. ఆకాశం, సముద్రం, పర్వతాలు.. వీటిలో నాగ్ ఏ పేరు చెప్తే ఆ పేరు రాసున్న బోర్డ్‌పై కంటెస్టెంట్లు నిలబడాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో కూడా నిఖిలే ఆఖరివరకు చేరుకుని గెలిచాడు. అలాగే లక్ష రూపాయలు ప్రైజ్‌మనీలో యాడ్ చేయడంతో విన్నింగ్ ప్రైజ్‌మనీ రూ.42,16,000కు చేరింది.జ్యూస్‌లకు మారు పేర్లుతర్వాత కొన్ని జ్యూస్‌లకు స్వార్థం, కోపిష్టి, ఫేక్.. ఇలా పలురకాల పేర్లు ఇచ్చారు. అవి ఎవరికి సూట్ అవుతాయో వారితో ఆ జ్యూస్ తాగించాలన్నాడు. మొదటగా గౌతమ్.. ఆనియన్ (నకిలీ), టమాటో (స్వార్థం) జ్యూస్‌ను యష్మీకి ఇచ్చాడు. రోహిణి.. కీరా దోస(బాధ్యతారాహిత్యం), చిల్లీ (కోపిష్టి) జ్యూస్‌ను గౌతమ్‌కు ఇచ్చింది. విష్ణుప్రియ.. చిల్లీ, లెమన్ (నోటిదురుసు) జ్యూస్‌ను ప్రేరణకు ఇచ్చింది. ఆమెకు నోటిదురుసు ఎక్కువహరితేజ.. చిల్లీ, ఆమ్ల జ్యూస్‌ను నిఖిల్‌తో తాగిపించింది. పృథ్వీ.. ప్రేరణకు జ్యూస్ ఇస్తూ తనకు నోటిదురుసు ఉందని, కోపిష్టి అన్నాడు. అవినాష్.. గౌతమ్‌కు నోటిదురుసు, బాధ్యతారాహిత్యం ఉందంటూ అతడితో లెమన్, కీరా జ్యూస్ తాగిపించాడు. తేజ.. ప్రేరణకు నోటిదురుసు, మందబుద్ధి ఉందన్నాడు. నబీల్.. అవినాష్ డంబ్ అండ్ టాక్సిక్ అన్నాడు. ప్రేరణ వంతు రాగా.. హరితేజ ఫేక్ అంటూ ఆనియన్, ఆమ్లా జ్యూస్ తాగిపించింది. ఎక్కువ జ్యూస్‌లు ఎవరికంటే?యష్మి.. గౌతమ్ ఫేక్ అంటూ ఆనియన్ జ్యూస్ ఇచ్చింది. గంగవ్వ.. రోహిణికి మందబుధ్ది, నోటిదురుసు ఉందని తెలిపింది. నయని కూడా ప్రేరణకు కోపమెక్కువ అంటూ నిమ్మ, మిర్చి జ్యూస్ కలిపిచ్చింది. నిఖిల్.. గౌతమ్ బాధ్యతారాహిత్యంగా ఉంటాడంటూ అతడికి లెమన్, కీర జ్యూస్ కలిపిచ్చాడు. అలా ప్రేరణ, గౌతమ్ అందరికంటే ఎక్కువ జ్యూస్‌లు తాగారు.నయని ఎలిమినేట్తర్వాత నాగ్ హరితేజను సేవ్ చేసి నయని ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. ప్రతిదానికి కన్నీళ్లు పెట్టుకునే నయని ఈసారి తన దుఃఖాన్ని దిగమింగుకుని నవ్వుతూ అందరి దగ్గర వీడ్కోలు తీసుకోవడం విశేషం. స్టేజీపైకి వచ్చాక .. గంగవ్వ, రోహిణి, ప్రేరణ, గౌతమ్, విష్ణును డమ్మీ ప్లేయర్స్ అంది. హరితేజ, నిఖిల్, పృథ్వీ బెస్ట్ ప్లేయర్స్ అని కితాబిచ్చింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్: నయని రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ వైల్డ్‌కార్డులు వచ్చాకే అంతో ఇంత ఆసక్తికరంగా మారింది. అయితే వాళ్లు వచ్చిన మొదటివారం తప్ప తర్వాత వాళ్లే ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. మొదట మెహబూబ్ ఎలిమినేట్ అవగా ఇప్పుడు నయని పావని అవుట్ అయింది. ఆటపై కసి ఉన్నా ఎమోషన్స్‌పై కంట్రోల్ లేకపోవడంతో గేమ్ బోల్తా కొట్టింది. ఎంత సంపాదించిందంటే?పదేపదే ఏడుస్తూ ఉంటే చూడటానికి ప్రేక్షకులకు చిరాకు వేసింది. అలా తొమ్మిదోవారం ఎలిమినేట్ అయింది. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ హౌస్‌లో నాలుగు వారాలు ఉంది. వారానికి రూ.1,50,000 చొప్పున మొత్తం రూ.6 లక్షల మేర సంపాదించినట్లు తెలుస్తోంది.అప్పుడు వారమే.. ఈసారి నెల!కాగా నయని గత సీజన్లోనూ వైల్డ్‌కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు కేవలం వారం మాత్రమే ఉండి వెళ్లిపోయింది. ఈ సీజన్లో ఎలాగైనా తనను తాను నిరూపించుకోవాలనుకుంది. ఆటపై బాగానే ఫోకస్ పెట్టింది. కానీ ప్రతి చిన్న విషయానికి గొడవపడుతూ ఏడవడం ఆమెకు మైనస్ అయింది. పైగా ఆటలో గెలిచింది లేదు కానీ గొడవల్లో మాత్రం ముందు ఉందన్న పేరు సంపాదించుకుంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నయని ఎలిమినేట్.. ప్రోమోలోనే హింట్ ఇచ్చిన నాగ్
బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారు? ఇంకెవరు నయని పావని అని సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం జరుగుతోంది. అది నిజమేనని కన్ఫామ్ చేసేశాడు కింగ్ నాగార్జున. బిగ్‌బాస్ రిలీజ్ చేసిన ప్రోమోలో నాగ్.. నయని, యూ ఆర్ ఎలిమినేట్ అనేశాడు. లీక్ చేసిన నాగ్సరిగ్గా 1 నిమిషం 17 సెకన్ల వద్ద ఈ మాటన్నాడు. ఇది చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. నయని ఎలిమినేట్ అని నాగ్ సారే చెప్పేశారు, ఎలాగో ఈ వార్త లీకైపోయిందని లైట్ తీసుకున్నారా? ఎడిటర్ మరీ ఇంత ఘోర తప్పిదం ఎలా చేశాడబ్బా?, ఏదైనా గేమ్‌లో నయని ఎలిమినేట్ అయి ఉండవచ్చు.. బహుశా అందుకే అలా చెప్పాడేమో? అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఎలా ఓదారుస్తారో?ఈ ఎలిమినేషన్ లీక్స్ వల్ల ఉత్కంఠ లేకుండా పోయింది. ఇకపోతే సాధారణంగానే ఏడ్చే నయని ఎలిమినేట్ అయినందుకు ఇంకెంత ఏడుస్తుందో! ఆమెను అటు హౌస్మేట్స్, ఇటు నాగ్ ఎలా ఓదారుస్తారో, తన కన్నీటికి ఆనకట్ట ఎలా కడతారో చూడాలి! -
నాగ్ చేసిన పనికి షాక్‌లో తేజ.. త్వరలో వెళ్లిపోతానంటున్న గంగవ్వ
హౌస్‌మేట్స్‌కు నాగార్జున గట్టిగా క్లాస్ పీకి చాలాకాలమైంది. అందుకే ఈ రోజు అందరికీ కోటింగ్ ఇవ్వడమే పనిగా పెట్టుకున్నాడు. గౌతమ్, నిఖిల్, యష్మి, ప్రేరణలపై సీరియస్ అయ్యాడు. ప్రత్యేకంగా ఈ నలుగురిపైనే ఫైర్ అవడానికి కారణమేంటో తెలియాలంటే నేటి (నవంబర్ 2) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..నువ్వేమైనా పుడింగా?నాగార్జున వచ్చీరాగానే ప్రేరణపై విరుచుకుపడ్డాడు. నువ్వేమైనా పుడింగా? అందరిపై నోరు ఎందుకు జారుతున్నావ్? అని నిలదీశాడు. అందుకామె పుడుంగి అనేది తప్పు పదమని తెలీదని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించింది. దీంతో నయని లేచి.. తను ఎప్పుడూ అమర్యాదగానే మాట్లాడుతుందని అగ్నికి ఆగ్జం పోసింది. అటు నాగ్ వీడియో ప్లే చేయడంతో అడ్డంగా దొరికిపోయిన ప్రేరణ నయనికి సారీ చెప్పింది. నిఖిల్‌ను తిట్టడాన్ని సైతం తప్పుపడుతూ నోరు అదుపులో పెట్టుకోమని హెచ్చరించాడు.ఎందుకంత కోపం?పానీపట్టు యుద్ధం టాస్క్‌లో అగ్రెసివ్‌గా ఆడావు. అప్పుడు ప్రేరణ, యష్మిపై ఎందుకంత కోపం చూపించావని నాగ్ నిఖిల్‌ను అడిగాడు. అందుకతడు ప్రేరణ, గౌతమ్ బూతు వాడటంతో మరింత ట్రిగ్గర్ అయ్యానన్నాడు. దీనిపై గౌతమ్ స్పందిస్తూ.. తాను బూతు మాట అనలేదన్నాడు. దీంతో నాగ్ వీడియో వేసి చూపించాడు. అందులో అతడు పెదాలాడించినట్లు ఉందే తప్ప బూతు మాట్లాడినట్లు లేదు.నిరూపిస్తే హౌస్ నుంచి వెళ్లిపోతా..వీడియో చూసిన తర్వాత కూడా గౌతమ్.. తల్లిపై ప్రమాణం చేస్తున్నాను. నేను బూతు మాట్లాడలేదు. చేయని తప్పును ఒప్పుకోను. నేను బూతు మాట్లాడినట్లు నిరూపిస్తే హౌస్ నుంచి వెళ్లిపోతానని శపథం చేశాడు. దీంతో నాగ్.. గౌతమ్ మాటల్ని ఎవరు నమ్ముతున్నారని అటు హౌస్‌మేట్స్‌ను, ఇటు స్టూడియోలో ఉన్నవారిని అడిగాడు. కానీ ఏ ఒక్కరూ గౌతమ్‌కు సపోర్ట్ చేయకపోవడంతో అతడి ముఖంలో నెత్తురుచుక్క లేకుండా పోయింది.మధ్యలో దూరకుతర్వాత యష్మి వంతురాగా.. నీ ప్రాబ్లమేంటక్కా? అని నాగ్ ప్రశ్నించాడు. గౌతమ్ తనను సడన్‌గా క్రష్, సడన్‌గా అక్క అని పిలిస్తే తీసుకోలేకపోయానని బదులిచ్చింది యష్మి. దీంతో నాగ్ వీడియో ప్లే చేశాడు. అందులో గౌతమ్.. విష్ణుతో మాట్లాడుతుంటే యష్మి మధ్యలో దూరింది. ఈ గొడవ పెద్దదై ఒకరినొకరు అక్కాతమ్ముడు అనుకున్నారు. నువ్వు కూడా తమ్ముడు అన్నావుగా.. ఏదైనా జరుగుతున్నప్పుడు మధ్యలోకి దూరకూడదు అని సూచించాడు. ఫ్లిప్ అవుతున్నావ్అలాగే బీబీ ఇంటికి దారేది ఛాలెంజ్‌లో తన రెడ్ టీమ్‌లో గౌతమ్‌ను ఎలిమినేట్ చేయడం గురించి అడగ్గా.. అతడు పెద్దగా ఆడలేదని తెలిపింది. దీంతో గౌతమ్ లేచి.. నేను ఆల్రెడీ ఒకసారి మెగా చీఫ్ అయ్యానని, అందుకే సైడ్ చేస్తున్నామని చెప్పిందే తప్ప ఆడలేదని చెప్పలేదన్నాడు. ఇది విన్న నాగ్.. ఇలా మాటలు మారుస్తూ ఉంటే నువ్వు ఫ్లిప్ అవుతున్నావని జనాలు భావిస్తారని హెచ్చరించాడు.సిగ్నల్స్ ఇచ్చిన గంగవ్వఅనంతరం బాగా ఆడావంటూ నాగ్ తేజను మెచ్చుకోగా ఇది కలా? నిజమా? అర్థం కాక అతడు నోరెళ్లబెట్టాడు. సెకనులో ఇదంతా నిజమేనని తెలుసుకుని తెగ సంతోషించాడు. ఇక మెగా చీఫ్ పోస్ట్‌ను త్యాగం చేయడం బాగోలేదని నబీల్‌కు చురకలంటించాడు. గండం గట్టెక్కింది!గంగవ్వను ఆటలో ఇంకాస్త యాక్టివ్‌గా ఆడాలని నాగ్ సలహా ఇవ్వగా.. తనకు ఒళ్లునొప్పులు వస్తున్నాయంది. తనవల్ల కానిరోజు హౌస్ నుంచి తనే స్వయంగా వెళ్లిపోతానంది. చివర్లో తేజ సేవ్ అయినట్లు ప్రకటించాడు. గతంలో తొమ్మిదో వారమే షో నుంచి ఎలిమినేట్ అయ్యానని ఈసారి ఆ వారం నుంచి తప్పించుకున్నానంటూ ఫుల్ ఖుషీ అయ్యాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అక్క అంటే నీకేమైనా సమస్యా? యష్మిని నిలదీసిన నాగ్
వచ్చీరాగానే మెగా చీఫ్ అయి తన సత్తా నిరూపించుకున్నాడు గౌతమ్. కానీ ఏమైంది? వచ్చినవారం తక్కువ ఓట్లు రావడంతో ఎలిమినేట్ అయిపోయేవారు. కానీ మణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ వల్ల అతడు హౌస్‌లో ఉండగలిగాడు. ఒకసారి దెబ్బ తగలడంతో తన ఆట, మాట అన్నింటినీ ఓసారి రీచెక్ చేసుకున్నాడు.క్రష్‌ను అక్క అనేసిన గౌతమ్యష్మితో క్రష్ అంటూ లవ్ ట్రాక్ నడపడం జనాలకు నచ్చలేదేమో అని రియలైజ్ అయ్యాడు. ఆమెను కూడా అందరితో సమానంగా చూశాడు. ఈ క్రమంలో నామినేషన్స్‌లో ఆమెతో గొడవపడేటప్పుడు అక్కా అనేశాడు. అయితే అక్కా అని పిలవద్దని యష్మి తోకతొక్కిన తాచుపాములా లేచి బుసలు కొట్టింది.రెండు బూతు పదాలు తెలుసుకున్నాకట్ చేస్తే నయనితో గొడవ జరిగినప్పుడు కూడా గౌతమ్ ఆమెను అక్కా అన్నాడు. దీంతో ఆమె కూడా అక్కా అనొద్దంటూ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది. దీని గురించి నాగ్ తాజా ప్రోమోలో చర్చించాడు. కొత్తగా రెండు బూతు పదాలు తెలిశాయి, ఒకటి అక్క, రెండోది బ్రదర్ అని నాగ్ సెటైర్లు వేశాడు. అక్కా అంటే ప్రాబ్లం ఏంటని యష్మిని అడిగాడు. మధ్యలో ఎందుకు మాట్లాడావ్?నామినేషన్స్‌లో గౌతమ్ విష్ణుతో మాట్లాడుతుంటే నువ్వెందుకు మధ్యలో దూరావని ప్రశ్నించాడు. మరింత క్లారిటీ కోసం వీడియో కూడా చూపించాడు. అందులో గౌతమ్ అక్కా అనగానే యష్మి తమ్ముడు అనేసింది. సడన్‌గా క్రష్ అని, సడన్‌గా అక్కా అనేసరికి తీసుకోలేకపోయానని యష్మి బదులిచ్చింది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 8: నయని పావని ఎలిమినేట్.. ఆ కారణం వల్లే!
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ చూస్తుండగానే రెండు నెలలు గడిచిపోయాయి. వైల్డ్‌కార్డ్స్‌తో షోలో కాస్త వినోదాన్నయితే తీసుకొచ్చారు కానీ మరీ అంతగా రక్తి కట్టించలేకపోతున్నారు. హౌస్‌లో కంటెస్టెంట్ల ఆట, మాట చూస్తుంటే వరుసగా వైల్డ్కార్డ్సే తట్టాబుట్టా సర్దుకునేలా ఉన్నారు.నామినేషన్స్‌లో ఐదుగురుఈ తొమ్మిదోవారం తేజ, యష్మి, నయని పావని, హరితేజ, గౌతమ్ నామినేషన్స్‌లో ఉన్నారు. శక్తికి మించి ఆడిన తేజ అందరికన్నా ముందు సేవ్ అయిపోయాడు. యష్మికి ఆల్రెడీ ఫ్యాన్‌బేస్ ఉండటంతో పాటు తన టీమ్ కోసం నిఖిల్‌నే ఎదిరించడం ప్లస్ అయింది. అలా తనకు బాగానే ఓట్లు పడ్డాయి. గౌతమ్ కూడా తన శక్తి మేర ఆడుతున్నందున అతడు సైతం ఓటింగ్‌లో ముందువరుసలో ఉన్నాడు.హరితేజకు పూనకంమిగిలిందల్లా హరితేజ, నయని పావని. తమను ఎవరూ గుర్తించట్లేదని బాధపడుతున్న వీళ్లను నిజంగానే ప్రేక్షకులు కూడా గుర్తించడం లేదేమో! అందుకే ఓటింగ్‌లో చివరి స్థానంలో ఉన్నారు. బీన్ బ్యాగు టాస్కులో హరితేజ పూనకం వచ్చినట్లుగా ఆడి మెప్పించింది. ఆ కారణం వల్లే..ఇక నయని పావని ఆటలో కన్నా ఎప్పుడూ ఏడుస్తూనే కనిపించడం జనాలకు చిరాకు తెప్పిస్తోంది. ఈ క్రైయింగ్ బేబీ మాకొద్దంటూ ఈ వారం ఆమెను పంపించేశారు. ఇప్పటికే సండే ఎపిసోడ్ షూటింగ్ పూర్తవగా నయని పావనిని ఎలిమినేట్ చేసేశారట! చూస్తుంటే వైల్డ్‌కార్డులను బయటకు పంపించే ప్రక్రియ వచ్చేవారం కూడా కొనసాగేలా ఉంది.చదవండి: నాగ్ సీరియస్.. నిరూపిస్తే షో నుంచి వెళ్లిపోతానన్న గౌతమ్ -
బిగ్‌బాస్ 8లో ఎలిమినేషన్.. ఈసారి వేటు ఎవరిపై?
బిగ్‌బాస్ 8లో తొమ్మిదో వారం చివరకొచ్చేసింది. ఈసారి గౌతమ్, యష్మి, టేస్టీ తేజ, హరితేజ, నయని పావని నామినేషన్స్‌లో నిలిచారు. ఈసారి మెగా చీఫ్ అయ్యేందుకు బిగ్‌బాస్ పలు పోటీలు పెట్టాడు. అవినాష్ మెగాచీఫ్ అయ్యాడు. అలానే పానిపట్టు అనే టాస్క్‌లో జోష్ చూపించిన యష్మి.. ఓటింగ్‌లోనూ మంచి జోరు చూపించింది. ఈ వారం టాప్‌లో నిలిచింది. కానీ ఇప్పుడు ఈమె ప్లేస్ మారినట్లు తెలుస్తోంది.ఈసారి ఐదుగురు నామినేషన్స్‌లో ఉండగా.. శుక్రవారం రాత్రితో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. ఆన్లైన్ పోలింగ్ ప్రకారం గౌతమ్ తొలి స్థానంలోకి వచ్చాడట. ఇప్పటివరకు టాప్‌లో ఉన్న యష్మి రెండో స్థానానికి పడిపోయినట్లు తెలుస్తోంది. కొన్ని గంటల ముందు వరకు మూడు, నాలుగు, స్థానాల్లో ఉన్న టేస్టీ తేజ, హరితేజ, నయని పావని ప్లేసులు మారాయట.(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిన 'పుష్ప' విలన్ జాలీరెడ్డి)చివరలో ఉన్న నయని.. ఓటింగ్ ముగిసే సమయానికి మూడులోకి వచ్చిందట. నాలుగులో టేస్టీ తేజ, ఐదులోకి హరితేజ వెళ్లారట. అంటే చివరి రెండు స్థానాల్లో టేస్టీ తేజ, హరితేజ ఉన్నారు. లెక్క ప్రకారమైతే వీళ్లిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావాలి. కానీ హరితేజ లేదా నయని పావని ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.నామినేషన్స్‌లో ఉన్నవాళ్లలో గౌతమ్, యష్మి, టేస్టీ తేజ మంచిగా ఫెర్ఫార్మ్ చేస్తున్నారు. వీళ్లతో పోలిస్తే నయని, హరితేజ మాత్రం అంతంత మాత్రంగానే ఆడుతున్నారు. దీంతో వీళ్లిద్దరిలో ఒకరు ఈసారి బయటకెళ్లడం పక్కా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: మొదటి పెళ్లిరోజు.. స్పెషల్ వీడియోతో వరుణ్ తేజ్-లావణ్య) -
నబీల్ మ్యాచ్‌ఫిక్సింగ్.. బిగ్‌బాస్ సర్ప్రైజ్లు.. కంటెస్టెంట్ల ఏడుపులు
బిగ్‌బాస్ హౌస్‌లో అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు. దీపావళికి హౌస్‌మేట్స్‌కు వీడియో మెసేజ్‌ల రూపంలో కానుకలు అందాయి. తర్వాత అందరూ కలిసి సంతోషంగా డ్యాన్సులు వేశారు. దీంతో బిగ్‌బాస్ హౌస్ ఆనందాల హరివిల్లుగా మారింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (నవంబర్ 1) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..అవినాష్‌తో డీల్నిన్న బిగ్‌బాస్ ఇచ్చిన బీన్ బ్యాగ్ గేమ్‌లో మొదట హరితేజ, తేజ ఎలిమినేట్ అయ్యారు. ఆ గేమ్ కొనసాగింపుతో నేటి ఎపిసోడ్ మొదలైంది. ఈ ఆటలో నిఖిల్.. నబీల్ను టార్గెట్ చేశాడు. ఈ క్రమంలో నబీల్.. నిఖిల్‌ను మోచేయితో కొట్టాడు. నిఖిల్-ప్రేరణ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారని అర్థమైపోవడంతో నబీల్.. అవినాష్‌తో డీల్ కుదుర్చుకున్నాడు. నిఖిల్‌ను అవుట్ చేద్దామని.. తర్వాత తాను ఓడిపోయి అవినాష్‌ను చీఫ్ చేస్తానని మాటిచ్చాడు. అలా చివరకు అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు.నబీల్‌కు స్వీట్లు తినే ఛాన్స్తర్వాత హౌస్‌లో దీపావళి సెలబ్రేషన్స్ జరిగాయి. ఇందులో భాగంగా అబ్బాయిలు, అమ్మాయిలు అందంగా ముగ్గులు వేశారు. తర్వాత బిగ్‌బాస్ స్వీట్లు పంపించాడు. ఇక ఈ సీజన్ మొత్తం స్వీట్లు తిననని శపథం చేసిన నబీల్‌కు ఈ ఒక్కరోజు మాత్రం స్వీట్లు తినవచ్చని బిగ్‌బాస్ మినహాయింపు ఇచ్చాడు. అనంతరం బిగ్‌బాస్.. కంటెస్టెంట్ల ఇంటిసభ్యుల వీడియో సందేశాలను చూడవచ్చన్నాడు. ఎమోషనలైన తేజఅయితే ఇక్కడ కూడా అందరికీ అవకాశం ఇవ్వకుండా ప్రతి ఇద్దరిలో ఒకరికే ఛాన్స్ ఉంటుందన్నాడు. అలా మొదటగా నబీల్, పృథ్వీలలో.. నబీల్‌కు అమ్మ, అన్నయ్య నుంచి వీడియో మెసేజ్ వచ్చింది. తల్లిని టీవీలో చూడగానే నబీల్ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. రోహిణి, తేజలలో ఒకరికే వీడియో ఛాన్స్ అని బిగ్‌బాస్ చెప్పగా రోహిణి త్యాగంతో తేజకు ఫ్యామిలీ వీడియో ప్లే చేశాడు. తల్లిని స్క్రీన్‌పై చూడగానే తేజ ఎమోషనలయ్యాడు. యష్మి త్యాగంఅనంతరం నయని, యష్మిలలో ఒకరికే వీడియో ఛాన్స్ ఇవ్వగా నయనికి తల్లి మెసేజ్ ప్లే చేశారు. లైఫ్‌లో ఎన్నో ఎదుర్కొంటూ ఈ స్టేజ్‌కు వచ్చావు.. స్ట్రాంగ్‌గా ఆడు అని తల్లి ధైర్యం చెప్పడంతో నయని కళ్లలో నీళ్లు తిరిగాయి. అవినాష్ త్యాగంతో రోహిణి ఫ్యామిలీ వీడియో చూడగలిగింది. తర్వాత యష్మి త్యాగంతో విష్ణుప్రియ ఆంటీ వీడియో చూసి సంతోషపడిపోయింది. చివరగా యష్మి, అవినాష్, పృథ్వీలో ఒక్కరికే ఛాన్స్ అని చెప్పగా వీరు పృథ్వీ పేరు సూచించారు. అంతా ఏకమై సంతోషంగా..అలా పృథ్వీ తన తమ్ముడి వీడియో చూసి ఖుషీ అయ్యాడు. తర్వాత అందరూ పటాసులు కాల్చి డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. పండగ పూట హౌస్‌మేట్స్‌ను బాధపట్టడం ఇష్టం లేని బిగ్‌బాస్ సడన్‌గా అవినాష్, యష్మి, హరితేజ ఫ్యామిలీ వీడియోస్ ప్లే చేశాడు. కూతురిపై బెంగ పెట్టుకున్న హరితేజ.. చిన్నారి భూమిని చూడగానే గుక్కపెట్టి ఏడ్చింది. భావోద్వేగాలతో గుండె భారమైన కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ ప్రత్యేక భోజనం పంపించడం విశేషం.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 8: నయని సేఫ్, మెహబూబ్ ఎలిమినేట్!
బిగ్‌బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్టుగా ఎంట్రీ ఇచ్చేవారెప్పుడూ డేంజర్ జోన్లోనే ఉంటారు. ఎందుకంటే పాత కంటెస్టెంట్లపై జనాలకు ఓ అవగాహన ఉంటుంది. వారి బలాలు, బలహీనతలు.. ప్రతీది తెలుసు. పైగా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు ఫ్యాన్ బేస్‌లు కూడా ఏర్పడుతుంటాయి. కానీ సడన్‌గా వైల్డ్ కార్డ్స్ దిగితే.. వీరు సత్తా చూపించినా సరే పాత కంటెస్టెంట్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రేక్షకులు మొగ్గు చూపిస్తారు. డేంజర్ జోన్లో వైల్డ్ కార్డ్స్అలాంటిది పర్ఫామెన్స్ ఏమాత్రం బెడిట్టినా ఎలిమినేషన్ అనే వాకిట్లో నిలబెట్టేస్తారు. ఈసారీ అదే జరిగింది. ఈ వారం విష్ణుప్రియ, పృథ్వీ, ప్రేరణ, నిఖిల్, మెహబూబ్, నయని పావని నామినేషన్లో ఉన్నారు. వీరిలో మెగా చీఫ్‌గా ఫెయిలైన మెహబూబ్, టాస్కులో పెద్దగా కనిపించని నయని డేంజర్ జోన్లో ఉన్నారు. ఇప్పటికే సండే ఎపిసోడ్ షూటింగ్ పూర్తవగా.. నయని పావనిని ఎలిమినేట్ చేేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి. కానీ అంతలోనే మెహబూబ్ ఎలిమినేట్ అయినట్లు మరో వార్త వైరలవుతోంది. కమ్యూనిటీ ఓట్లు మనకు గట్టిగా పడతాయి అన్న మాటే అతడి ఎలిమినేషన్‌కు ప్రధాన కారణంగా మారింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పృథ్వీకి నాగ్ క్లాస్.. సూర్య కోసం బయటకు వచ్చేస్తానన్న కంటెస్టెంట్
చేసేదంతా చేస్తారు.. అంతా అయిపోయాక మాత్రం తన ఉద్దేశం అది కాదని యూటర్న్ తీసుకుంటారు. సోనియా, యష్మి, తేజ, విష్ణుప్రియ, ప్రేరణ, నాగమణికంఠ.. ఇలా బిగ్‌బాస్ కంటెస్టెంట్లలో చాలామంది ఇదే కోవలోకి వస్తారు. ఈవారం పృథ్వీ.. రోహిణిని కింది నుంచి పైకి చూస్తూ చులకనగా మాట్లాడాడు.. దీని గురించి నాగ్ ప్రస్తావించగా బాడీ షేమింగ్ చేయాలన్న ఉద్దేశం తనది కాదని కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో నాగ్ క్లాస్ పీకాడు. ఇక యష్మి ఇండివిడ్యువల్ గేమ్ కనిపించడం లేదంటూ ఆమె ఫోటో ఉన్న కుండ పగలగొట్టాడు.స్పెషల్ గెస్ట్‌గా సూర్యఇకపోతే ఈరోజు ఎపిసోడ్లో హీరో సూర్య అతిథిగా విచ్చేయనున్నాడు. కంగువా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా స్టేజీపైకి వచ్చాడు. అతడిని చూసి సూర్య అభిమానురాలు నయని పావని తెగ సంతోషపడిపోయింది. అతడి కోసం 5 నిమిషాలు హౌస్‌లో నుంచి బయటకు వస్తావా? అంటే వచ్చేస్తానని తలూపింది. మళ్లీ హౌస్‌లోకి పంపించను అని నాగ్ తిరకాసు పెట్టినప్పటికీ సూర్య కోసం బయటకు వచ్చేందుకు రెడీ అని చెప్పింది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్ ఓటింగ్.. డేంజర్ జోన్లో ఇద్దరు!
బిగ్‌బాస్ 8వ వారం కూడా చివరకొచ్చేసింది. ఈసారి ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. ఓజీ క్లాన్ నుంచి నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ, పృథ్వీ.. రాయల్ క్లాన్ నుంచి నయని పావని, మెహబూబ్ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఎవరికి వాళ్లు గేమ్స్ పరంగా తమ బెస్ట్ ఇచ్చేందుకు చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ డేంజర్ జోన్లో మాత్రం ఇద్దరు ఉన్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కావొచ్చు?లెక్క ప్రకారం ఈసారి ఏడుగురు నామినేట్ అయ్యారు. కానీ మెగా చీఫ్ గౌతమ్ తన సూపర్ పవర్ ఉపయోగించి, హరితేజ నుంచి తప్పించాడు. మిగిలిన వాళ్లలో నిఖిల్.. ఓటింగ్‌లో ఎప్పుడు అగ్రస్థానంలో ఉంటాడు. ఈసారి మాత్రం అతడిని ప్రేరణ దాటిపోయినట్లు కనిపిస్తుంది. చెప్పాలంటే విన్నర్ రేసులోనూ ఈమె ఉందని టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)ఓటింగ్ పరంగా చూసుకుంటే తొలి రెండు స్థానాల్లో ప్రేరణ, నిఖిల్ ఉండగా.. తర్వాతి స్థానాల్లో ప్రేమ పక్షులు పృథ్వీ, విష్ణుప్రియ ఉన్నారు. చివరి రెండు స్థానాల్లో మెహబూబ్, నయని ఉన్నారు. గేమ్స్ పరంగా మెహబూబ్ అంతంత మాత్రమే కనిపిస్తుండగా.. గొడవల్లో తప్పితే నయని ఎక్కడా కనిపించట్లేదు. అంతా చూస్తుంటే వీళ్లిద్దరిలో ఒకరు వెళ్లిపోవడం గ్యారంటీ అనిపిస్తుంది. మరోవైపు గంగవ్వని బయటకు పంపే సూచనలు కనిపిస్తున్నాయి.అప్పుడెప్పుడో 2022లో చేసిన ఓ వీడియో కారణంగా గంగవ్వతో పాటు రాజు అనే యూట్యూబర్‌పై పోలీస్ కేసు నమోదైంది. దీని విచారణలో భాగంగా గంగవ్వని ఎలిమినేట్ చేసి బయటకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈసారి మాత్రం రాయల్ క్లాన్ నుంచి ఒకరు ఎలిమినేట్ కావడం పక్కా అనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: 'నరుడి బ్రతుకు నటన' సినిమా రివ్యూ) -
ప్రేరణపై పగ తీర్చుకున్నారు.. ప్రైజ్‌మనీని ఖాతరు చేయని నబీల్
నామినేషన్స్.. ఈసారి అన్నీ రివేంజ్ నామినేషన్సే పడ్డాయి. ప్రైజ్‌మనీ తగ్గినా తనకేం పర్వాలేదన్నట్లు ప్రవర్తించాడు నబీల్. ఇంతకీ నామినేషన్స్‌కు, ప్రైజ్‌మనీకి ఏం సంబంధం? ఎవరు ఎవర్ని నామినేట్ చేశారనేది తెలియాలంటే నేటి (అక్టోబర్ 21) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..నామినేషన్స్ షురూఇంట్లో ఉండేందుకు అర్హత లేని ఇద్దరు ఇంటిసభ్యుల దిష్టిబొమ్మలపై కుండ పెట్టి పగలగొట్టాలని బిగ్‌బాస్ చెప్పాడు. నామినేషన్ షీల్డ్ ఎవరిదగ్గరైతే ఉంటుందో వారిని నామినేట్ చేసినప్పుడల్లా ప్రైజ్‌మనీలో నుంచి రూ.50 వేలు పోతాయని హెచ్చరించాడు. మెగా చీఫ్ గౌతమ్.. ఈ నామినేషన్ షీల్డ్‌ను హరితేజకు ఇచ్చాడు.పృథ్వీ మీద ప్రేమతో.. పోయినవారం తేజకు బదులుగా పృథ్వీని నామినేట్ చేయడం నచ్చలేదని పరోక్షంగా చెప్తూ ప్రేరణను నామినేట్ చేసింది విష్ణు. గేమ్ స్లో అయిపోతుందంటూ, లైటర్ కోసం పాయింట్ ఇవ్వడం నచ్చలేదని నిఖిల్ దిష్టిబొమ్మపై కుండ పగలగొట్టింది. అలాగైతే నువ్వు అందరికంటే ముందు బ్రేక్‌ఫాస్ట్ చేసి పాయింట్ ఇచ్చేశావ్గా అని నిఖిల్ అనడంతో విష్ణు నీళ్లు నమిలింది. తర్వాత రోహిణి.. ఆటలో ఫిజికల్ అవడం నచ్చలేదని నిఖిల్‌ను నామినేట్ చేసింది. సెల్ఫిష్‌గా ఆలోచిస్తావ్, గేమ్‌లో అగ్రెసివ్ అవుతున్నావంటూ పృథ్వీని నామినేట్ చేసింది. బాడీ షేమింగ్పృథ్వీ.. పోయినవారం కిల్లర్ గర్ల్‌గా తనను నామినేట్ చేసినందుకు ప్రేరణ కుండ పగలగొట్టి తనపై ప్రతీకారం తీర్చుకున్నాడు. టాస్క్‌లో వీక్, ఆటలో జీరో.. నీకు రన్నింగ్ కూడా రావాలి, అది అంత ఈజీ కాదు అని రోహిణిని పై నుంచి కింది వరకు చూశాడు. తనను బాడీ షేమింగ్ చేయడంతో రోహిణికి చిర్రెత్తుకొచ్చింది. ఆ చూపేంటి? బాడీ షేమింగా? ఓవరాక్షన్ చేయకు.. తొక్కలో నామినేషన్స్ చేయకు అని ఇచ్చిపడేసింది.సెల్ఫిష్ గేమ్నయని పావని.. బ్యాటరీ టాస్కులో సెల్ఫిష్‌గా ఆడారంటూ మెహబూబ్, నిఖిల్‌ను నామినేట్ చేసింది. హరితేజ వంతురాగా.. ప్రేరణను నామినేట్ చేస్తూ కొంపలు మునిగాక రావడం మానేయమని సలహా ఇచ్చింది. సెల్ఫిష్‌గా ఆడావంటూ మెహబూబ్‌ను నామినేట్ చేసింది. ప్రైజ్‌మనీ తగ్గినా పర్లేదంటూ..నబీల్.. నన్ను ఇమ్మెచ్యూర్ అనడం నచ్చలేదు, అలాగే వేరేవాళ్ల పనుల్లో దూరకు అంటూ ప్రేరణ దిష్టిబొమ్మపై కుండ పగలగొట్టాడు. ప్రైజ్‌మనీలో నుంచి రూ.50 వేలు పోయినా పర్లేదంటూ హరితేజను నామినేట్ చేశాడు. మీకు డెసిషన్ తీసుకోవడం రావట్లేదు. అలాగే నాకు ఇంట్లో ఉండేందుకు అర్హత లేదని నా సూట్‌కేస్ బయటపెట్టడం నచ్చలేదని కుండ పగలగొట్టాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మణి హగ్గుల పిచ్చి.. ఈ చెండాలం చూడలేకున్నాం సామీ!
ప్రేక్షకులు సున్నిత మనస్కులు.. నిజ జీవితంలో ఎవరు ఎటు పోయినా పట్టించుకోరు కానీ స్క్రీన్‌పై ఎవరైనా కన్నీళ్లు పెట్టుకున్నా, గోడు వెల్లబోసుకున్నా ఇట్టే కరిగిపోతారు. పోనీ, అవి నిజమైన కన్నీళ్లేనా? మొసలి కన్నీళ్లా? అని కూడా ఆలోచించరు.సింపతీ గేమ్బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో కన్నీళ్లు పెట్టుకున్న మొట్టమొదటి కంటెస్టెంట్ మణికంఠ. ఒకసారి ఏడిస్తే ఓకే, రెండోసారికీ ఓకే.. కానీ మూడోసారి, నాలుగోసారి.. హుష్.. తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చెప్పుకుని పదేపదే ఏడుస్తుంటే హౌస్‌మేట్స్‌కు విసుగొచ్చింది. ఇతడేదో సింపతీ ట్రై చేస్తున్నాడని నామినేట్ చేశారు. కానీ ఆడియన్స్.. అతడి బాధకు చలించిపోయి సేవ్ చేసుకుంటూ వస్తున్నారు.హగ్గు కోసం నిస్సిగ్గుగా..భార్యాబిడ్డ కావాలంటూ కెమెరాల ముందు బోరున ఏడ్చేసిన ఇతడు హౌస్‌లో అమ్మాయిలతో ప్రవర్తించే తీరు అసభ్యంగా ఉంటోంది. ఆ మధ్య యష్మి ఇబ్బందిగా ఫీలవుతున్నా సరే వినిపించుకోకుండా హగ్ చేసుకున్నాడు. సోనియాను సైతం చుట్టుపక్కల ఎవరూ లేని సమయం చూసుకుని హగ్ కావాలంటూ అడుక్కుని మరీ తనను హత్తుకున్నాడు. క్లాస్ పీకిన నాగ్దీనికి బ్రేక్ వేయాల్సిందేనని భావించిన నాగార్జున.. మణిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి మరీ క్లాస్ పీకాడు. నీ లక్ష్యం ఏంటి? నువ్వు చేస్తున్న పనులేంటి? అంటూ హగ్గుల వీడియో చూపించి మరీ కడిగిపారేశాడు. దీంతో తప్పయిపోయిందని, ఇంకోసారి అలా చేయనని మాటిచ్చాడు. అన్నట్లుగానే మాట మీద నిలబడ్డాడు.. ఎప్పటిదాకా అంటే.. వైల్డ్ కార్డుల ఎంట్రీదాకా!గాల్లో తేలిన మణికొత్తగా వచ్చిన వైల్డ్‌కార్డులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తనపై జాలి చూపిస్తున్నట్లుగా, తనకు సపోర్ట్ చేస్తున్నట్లుగా మాట్లాడటంతో అతడిలో కొత్త శక్తి ప్రవేశించింది. పైగా ప్రతివారం నామినేషన్స్‌లో ఉండే అతడు ఈవారం వైల్డ్ కార్డుల పుణ్యమా అని నామినేషన్స్‌లో కూడా లేకుండా పోయాడు. ఇంకేముంది, గాల్లో తేలినట్లుందే అని పాటలు పాడుకున్నాడు. అదీ బాగానే ఉంది.. తర్వాతే మళ్లీ రెచ్చిపోయాడు.మళ్లీ మొదటికి..రోహిణిని వెనక నుంచి హగ్ చేసుకున్నాడు. నయని పావనిని కూడా వదల్లేదు. ఆమెను కూడా వెనకనుంచి వచ్చి హత్తుకున్నాడు. తనకెలా ఉందో కానీ చూసే ఆడియన్స్‌కు మాత్రం మహా చెండాలంగా ఉంది. అవతలి వ్యక్తికి తెలియకుండా వెనక నుంచి హత్తుకోవడమనేది చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. ఈ సెకలే తగ్గించుకోమని నాగ్ చెప్పినా మణి మళ్లీ అదే దారిలో వెళ్తున్నాడు. మరి ఇతడికి నాగ్ ఈసారి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో చూడాలి!బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మెగా చీఫ్‌గా మెహబూబ్.. బైక్ గెల్చుకున్న నయని
మెగా చీఫ్‌గా నబీల్ పదవీకాలం ముగిసింది. దీంతో మెగా చీఫ్ పోస్ట్ కోసం మళ్లీ పోటీపెట్టారు. ఈసారి పాత కంటెస్టెంట్లను వెనక్కు నెట్టి సుడిగాలిలా హౌస్‌లో అడుగుపెట్టిన వైల్డ్కార్డుల్లో ఒకరే ఆ పోస్టును ఎగరేసుకుపోయారు. మరి ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి(అక్టోబర్ 10) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఎలిమినేషన్ గురించి ఛాలెంజ్వచ్చేవారం నువ్వే ఎలిమినేట్ అవుతానవి గంగవ్వ అనడంతో విష్ణుప్రియ తాను వెళ్లనంది. అవ్వ పోయేదాకా తాను పోనంది. దీంతో ఎవరు ఎక్కువ రోజులు ఉంటారో చూద్దామని గంగవ్వ, విష్ణుప్రియ ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకున్నారు. అటు ప్రేరణ.. నా మాట వినట్లేదు, నన్ను నమ్మట్లేదు, ఇమ్మెచ్యూర్గా ప్రవర్తిస్తున్నావంటూ నబీల్‌తో వాగ్వాదానికి దిగింది. దీంతో హర్టయిన నబీల్.. నేను ఇమ్మెచ్యూర్ కాదని అరిచాడు. ప్రాంక్ చేసిన గంగవ్వతర్వాత అతడు ప్రేరణను ఇమిటేట్ చేస్తూ మాట్లాడటం కాస్త వెగటుగా అనిపిస్తుంది. ఇక బిగ్‌బాస్ రాయల్ క్లాన్ (వైల్డ్ కార్డ్స్)లో నుంచి ఆరుగురు బెస్ట్ పర్ఫామర్లను మెగా చీఫ్ కంటెండర్స్ కోసం ఎంపిక చేయమన్నాడు. దీంతో అవినాష్.. తన పేరుతో పాటు నయని, మెహబూబ్, హరితేజ, రోహిణి, గౌతమ్ పేర్లను సూచించాడు. నా పేరు ఎవరూ చెప్పలేదని గంగవ్వ ఏడుస్తున్నట్లు నటించి అందర్నీ ఆటపట్టించింది.కంటెండర్‌గా మణిఅటు ఓజీ టీమ్‌లో రెండు స్టార్లున్న మణికంఠ, నబీల్ లలో ఒకరిని బెస్ట్ పర్ఫామర్‌గా సెలక్ట్ చేయాలన్నాడు. దీంతో టీమ్ అంతా కలిసి మణిని బెస్ట్ పర్ఫామర్ అని ప్రకటించడంతో అతడు చీఫ్ కంటెండర్ అయ్యారు. చీఫ్ కంటెండర్లకు మొదటగా ఓ గేమ్ పెట్టారు. అందులో కంటెండర్లు అందరూ జాకెట్ వేసుకుని నిలబడితే వారిపైకి హౌస్మేట్స్ బంతులు విసరాలి. ఎవరి జాకెట్‌కు ఎక్కువ బంతులు అతుక్కుంటే వారు అవుట్ అవుతారు. అందరికంటే గంగవ్వ ఎక్కువ హుషారుగా బాల్స్ విసరడం విశేషం. మొదటి రౌండ్లో గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. ఏడ్చేసిన రోహిణిఈ గేమ్‌లో విష్ణుప్రియ, పృథ్వీ.. తనను కావాలని గట్టిగా కొట్టారని రోహిణి ఫీలైంది. ఈమె దగ్గరకు విష్ణు వెళ్లి.. నాకు అతడి (పృథ్వీ) దగ్గరి నుంచి ఎనర్జీ వస్తుంది. డౌన్‌గా ఉన్నప్పుడే తన దగ్గరకు వెళ్తాను.. అందరితోనూ నేను బాగుంటాను అంటూ తన రిలేషన్ గురించి చెప్పింది. దీంతో రోహిణి.. నేనేమీ మీ గురించి లేనిది చెప్పలేదు.. మీరు అందరిముందు ఎలా ఉంటున్నారన్నదాని గురించే మాట్లాడాను.. అయినా తప్పుగా అనిపిస్తే సారీ అని చెప్పేసి వెళ్లిపోయింది. బైక్ గెల్చుకున్న నయనిఇక బాల్స్ గేమ్ రెండో రౌండ్లో నయని అవుట్ అవడంతో ఏడ్చేసింది. మూడో రౌండ్లో రోహిణి అవుట్ అయింది. సారీ చెప్పిన తర్వాత కూడా విష్ణుప్రియ గేమ్‌లో తనను టార్గెట్ చేయడంతో రోహిణి ఏడ్చేసింది. ఇక హరితేజ, మెహబూబ్, అవినాష్, మణి రెండో గేమ్‌లో పోటీపడగా చివరకు మెహబూబ్ గెలిచి మెగా చీఫ్‌గా నిలిచాడు. అనంతరం దమ్ముంటే స్కాన్ చెయ్ గేమ్‌లో విష్ణుప్రియ, నయని పావని ఆడారు. అయితే నయని పావని గెలిచి థండర్ వీల్స్ బైక్ పొందింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రోహిణిని టార్గెట్ చేసిన లవ్ బర్డ్స్.. కొత్త మెగా చీఫ్ ఎవరంటే?
బిగ్‌బాస్ హౌస్‌లో మెగా చీఫ్ కోసం మొదటి పోటీ జరిగింది. ఇందులో అవినాష్, రోహిణి, మెహబూబ్, మణికంఠ, గౌతమ్, హరితేజ, నయని పావని పాల్గొన్నారు. అయితే ప్రేమపక్షులు విష్ణుప్రియ- పృథ్వీ.. రోహిణిని టార్గెట్ చేసినట్లున్నారు. ఇక పృథ్వీ అయితే ఏకంగా తలకు గురి పెట్టి విసిరాడు. అవి తన కళ్లకు తగులుతుండటంతో రోహిణి ఫైర్ అయింది. దాడి చేశాక సారీ దేనికి?బాడీపై విసురు, కానీ కళ్లపై కొట్టవద్దని అరిచింది. ఒక్కరిపైనే దాడి చేసి తర్వాత సారీ చెప్పేస్తే నాకెలా అనిపిస్తుంది? అని రోహిణి బాధపడింది. అటు విష్ణుప్రియ.. మరి తను వచ్చీరాగానే నన్ను నామినేట్ చేసింది.. నాకెలా అనిపిస్తుంది? అయినా ఐ లవ్యూ చెప్తున్నాగా.. అని అభిప్రాయపడింది. ఏడుపందుకున్న నయనిఇక నయని పావని మరోసారి కన్నీటి కుళాయి ఓపెన్ చేసింది. నన్ను టాప్2లో తీసుకోలేదు, ముందే అవుట్ చేద్దామని మా టీమ్ డిసైడయ్యారంటూ కన్నీళ్లు పెట్టుకుంది. సీత ఊరికనే ఏడవడం నచ్చలేదని నామినేట్ చేసిన నయని.. ఇప్పుడు చేస్తుందేంటో? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇకపోతే ఈవారం నామినేషన్స్‌లో ఉన్న మెహబూబ్ మెగా చీఫ్‌గా గెలిచాడని సమాచారం.చదవండి: తనలో సడన్ మార్పు, చాలా సెల్ఫిష్.. ఇప్పటికీ చెప్తున్నా విష్ణు ఫేక్ ఫ్రెండ్! -
నీకు నయని నచ్చిందా? పృథ్వీ-విష్ణుప్రియ ప్రేమ ముచ్చట్లు!
బిగ్‌బాస్‌లో ప్రతిసారి హోటల్ టాస్క్ ఉంటుంది. ఈసారి కూడా అలాంటిది పెట్టారు. కానీ ఎక్కడో ఒకటో రెండో చోట్ల నవ్వు తప్పితే, పెద్దగా చూడాలనే ఇంట్రెస్ట్ కలిగించలేకపోయారు. పోటీపోటీగా సాగిన ఈ టాస్క్‌లో ఓజీ క్లాన్ సభ్యులే గెలిచారు. కానీ చివర్లో తేజ కిందపడిపోవడంతో కాస్త కంగారు అనిపించింది. ఇంతకీ 39వ రోజు బిగ్‌బాస్ హౌస్‌లో ఏమేం జరిగింది?(ఇదీ చదవండి: 'విశ్వం' మూవీ ట్విటర్ రివ్యూ)బుధవారం ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి బీబీ హోటల్ టాస్క్ మళ్లీ షురూ చేశారు. మణికంఠతో రోహిణి డ్యాన్స్ చేయించింది. అంతలోనే ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్.. కొందరి పాత్రలని మార్చేశాడు. తేజ.. రోహిణి-అవినాష్‌కి అసిస్టెంట్ అని, కొడుకు గురించి గర్వంగా ఫీలవుతూ, అతడిని హీరోని చేద్దామని తల్లి పాత్ర హరితేజది అని.. ఆకతాయి అబ్బాయి కమ్ నయని బాయ్‌ఫ్రెండ్ గౌతమ్ అని, అవినాష్‌కి ఎట్రాక్ట్ అయిన హోటల్ మేనేజర్ ప్రేరణ అని, హోటల్ ఓనర్ నబీల్ కొడుకు పృథ్వీ అని ఫిక్స్ చేశారు.ఇక స్టాఫ్ సేవలు మెచ్చి స్టార్ ఇవ్వాలని చెప్పడంతో.. యష్మి, సీతకు రాయల్ క్లాన్ సభ్యులు స్టార్ ఇచ్చారు. అలానే హోటల్ స్టాఫ్ శారీరక బలం ఏంటో తెలుసుకోవాలని, దానికోసం రాయల్ క్లాన్ పలు పోటీలు నిర్వహించాలని బిగ్‌బాస్ ఆర్డర్ వేశాడు. దీంతో తొలుత కప్ప గెంతులు గేమ్ పెట్టారు. యష్మి, ప్రేరణ ఇందులో ఓడిపోయారు. తర్వాత లెమన్ అండ్ స్పూన్ గేమ్ పెట్టగా నబీల్, పృథ్వీ ఔట్ అయిపోయారు.(ఇదీ చదవండి: 'మా నాన్న సూపర్ హీరో' సినిమా రివ్యూ)చివరగా ఒంటికాలిపై రెండు చేతుల్లో నీళ్లున్న గ్లాస్ పట్టుకోవాలనే గేమ్ పెట్టగా.. సీత, నిఖిల్, మణికంఠ, విష్ణుప్రియ పోటీపడ్డారు. చివరివరకు మణికంఠ, నిఖిల్ గెలిచారు. వీళ్లిద్దరికి.. స్విమ్మింగ్ పూల్ నుంచి స్పూన్స్ తెచ్చే టాస్క్ పెట్టగా మణి పూర్తిగా నిరాశపరిచాడు. నిఖిల్ గెలిచాడు. ఇతడికి స్టార్ ఇచ్చారు. మరోవైపు మణికంఠ గేమ్ కూడా నచ్చడంతో రాయల్ క్లాన్ సభ్యులు ఇతడికి కూడా స్టార్ ఇవ్వడం విశేషం.ఇప్పటివరకు గేమ్స్ మూడ్ ఉన్నది కాస్త లవ్ మూడ్‌లోకి మారిపోయింది. ఓ చోట సోఫాలో కూర్చుని విష్ణుప్రియ-పృథ్వీ ప్రేమ కబుర్లు చెప్పుకొన్నారు. పృథ్వీ ఒడిలో పడుకుని మరీ విష్ణుప్రియ కబుర్లు చెప్పింది. ఈ డబ్బులు కూడా తీసుకో, కానీ నన్ను ప్రేమించు అని తెగ పోజులు కొట్టింది. పృథ్వీ ఏదో చెప్పబోతుంటే.. నీకు నిజంగా నయని నచ్చిందా అని విష్ణు అడిగింది. కాసేపు సైలెంట్‌గా ఉన్న పృథ్వీ.. తర్వాత లేదు అని బదులిచ్చాడు.(ఇదీ చదవండి: రజనీకాంత్ "వేట్టయన్" మూవీ రివ్యూ)ఇంటిలో నీటి సరఫరా ఆపేసి ఇరు టీమ్స్‌కి వాటర్ సేకరించే టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా ఓ చోట నుంచి మరో చోటుకి.. కింద అడుగుపెట్టకుండా దిగువన ఉన్న కొన్ని వస్తువులపై మాత్రమే నడుస్తూ గ్లాసుతో నీళ్లు పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇరు క్లాన్స్ నుంచి బాగా కష్టపడ్డారు కానీ ఓజీ క్లాన్ సభ్యులే ఇందులో విజయం సాధించారు. దీంతో విజేతకు రూ.25 వేలు ఇచ్చాడు బిగ్‌బాస్.టాస్క్ పూర్తయిన తర్వాత ఎవరి దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో చెప్పమని బిగ్‌బాస్ అడిగాడు. కానీ తమ దగ్గర డబ్బులు తక్కువగా ఉండటంతో రాయల్ క్లాన్ సభ్యులకు అనుమానం వచ్చింది. ఓజీ క్లాన్ దగ్గరకు వెళ్లి అడగ్గా.. అవును దొంగతనం చేశానని సీత ఒప్పుకొంది. ఎంత అడిగినా సీత ఇవ్వకపోయేసరికి.. నాగ్ సర్ దగ్గర పంచాయతీ పెడదాం లే అని చాలాసేపు రచ్చ చేశారు. మెగా చీఫ్ నబీల్ వచ్చి సర్ది చెప్పేసరికి ఏమనుకుందో ఏమో గానీ సీత.. తన కొట్టేసిన డబ్బుల్ని తిరిగిచ్చేసింది. అలా రాయల్ క్లాన్ దగ్గర లక్ష 16 వేల 500 రూపాయలు.. ఓజీ క్లాన్ దగ్గర లక్ష 8 వేల 500 రూపాయలు ఉన్నాయి. దీంతో రాయల్ క్లాన్ విజయం సాధించింది. అలా ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఐదు డోంట్ మిస్) -
'బిగ్‌బాస్' గేమ్ కాదు ట్రామా?
బిగ్‌బాస్ షోని ఇష్టపడి చూసేవాళ్లు కొందరైతే. ఇదో దిక్కుమాలిన ప్రోగ్రాం అని తిట్టేవాళ్లు మరికొందరు! మంచి-చెడు అనే చర్చ పక్కనబెడితే ఈ షోలో గెలిస్తే లక్షల రూపాయలు డబ్బు, ఊహించని ఫేమ్ వస్తాయని అందరికీ తెలుసు. కానీ ఇదే షో వల్ల కంటెస్టెంట్స్ మానసికంగా ఎంతలా ఇబ్బంది పడుతున్నారో ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు తొలిసారి ఒకామె నోరు విప్పింది. ఎవరికీ తెలియని చీకటి కోణాన్ని బయటపెట్టింది.(ఇదీ చదవండి: నోరు జారిన టేస్టీ తేజ.. వెక్కివెక్కి ఏడ్చిన నయని పావని)ప్రస్తుతం తెలుగులో బిగ్‌బాస్ 8వ సీజన్ నడుస్తోంది. ఈసారి 14 మందిని తీసుకొస్తే కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా సరిగా ఎంటర్టైన్ చేయలేకపోయారు. దీంతో గత కొన్ని సీజన్లలో పాల్గొన్న గంగవ్వ, అవినాష్, రోహిణి, హరితేజ, టేస్టీ తేజ, మెహబూబ్, నయని పావని తదితరుల్ని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ పేరిట హౌసులోకి తీసుకొచ్చారు. ముందు ముందు వీళ్లు ఏం చేస్తారో చూడాలి?అసలు పాయింట్‌కి వస్తే మంగళవారం (అక్టోబరు 09) ఎపిసోడ్ చివరలో నయన పావని.. ఈ షో వల్ల తాను ఎంత ట్రామాకు గురయ్యాననేది బయటపెట్టింది. అందరితో సరదాగా కూర్చుని మాట్లాడుతున్న టైంలో నయని పావనిని గత సీజన్ ఎలిమినేషన్ గురించి సీత అడిగింది. క్యాజువల్ సంభాషణ కాస్త.. నిన్ను బయట బండబూతులు తిట్టారు అని తేజ ఈమెతో అనేసరికి ఒక్కసారి సీరియస్ అయింది.తేజ కాస్త హర్ష్‌గా అనేసిన 'బండబూతులు' పదం నయని పావనికి ఎక్కడో తగలరాని చోట తగిలేసింది. దీంతో తనని తాను కంట్రోల్ చేసుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది. 'అలా ఎలా అంటాడు. అంత రూడ్‌గా మాట్లాడాడు. ఒక్కసారిగా నా పైకి వచ్చి పడినట్లు మాట్లాడాడు. సంవత్సరం పాటు ఆ ట్రామా ఫేస్ చేశాను. అంతకుముందే మా నాన్న చనిపోయారు. తను అలా అనేసరికి అదంతా ఒక్కసారిగా ఫ్లాష్ అయింది. ఇప్పుడు బండ బూతులు తిట్టారని ఎలా అన్నాడు. మరి అలాంటప్పుడు నేను ఎలిమినేట్ అయినప్పుడు ఎందుకు ఏడ్చాడు' అని కన్నీళ్లు పెట్టుకుంది.నయని చెప్పిన దానిబట్టి చూస్తే వారం ఉండి ఎలిమినేట్ అయిన దానికే ఇంత బాధపడిందా అనిపించింది. ఒక్క వారానికే ఇలా అయిపోతే ఎక్కువ వారాలు ఉండి ఎలిమినేట్ అయిన వాళ్ల పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుతారు. కానీ ఫేమ్ వస్తుంది, డబ్బులు వస్తాయి అనే ముసుగులో కంటెస్టెంట్స్ ఎంతలా మానసిక సంఘర్షణకు లోనవుతున్నారనేది ఎవరు చెప్పరే?అంతెందుకు ఇదే బిగ్‌బాస్ షోలో పాల్గొని అవకాశాలు, ఫేమ్ తెచ్చుకున్న వాళ్లు చాలా తక్కువ మంది ఉంటే. అలాంటివి ఏం రాక కనుమరుగైన వాళ్లు చాలామందే ఉన్నారు. వాళ్ల మనోగతాన్ని బయటకు తీస్తే నయని పావని కంటే ఎక్కువ కన్నీళ్లు వస్తాయేమో?(ఇదీ చదవండి: 'దేవర' ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం)Veedini ekamga PAALERU ani Pilichaaru.. anni marichipoyi.. #NayaniPavani ni antunnadu..Rey.. nuvvu anni weeks unnaa.. Shobha ki chesina oodigam tho negativity techukunnaav... #Nayani one week eh undhi kani positivity tho vellindhi.. #BiggBossTelugu8 pic.twitter.com/20ab6DuneR— BigBoss Telugu Views (@BBTeluguViews) October 8, 2024 -
నోరు జారిన టేస్టీ తేజ.. వెక్కివెక్కి ఏడ్చిన నయని పావని
ఈ సీజన్లో నామినేషన్స్ మరీ సప్పగా సాగేవి. కేవలం ఒక్కరోజులో పూర్తయిపోయేవి. అలాంటిది ఈ వారం మంగళవారం కూడా సాగింది. మరోవైపు డాక్టర్ బాబు గౌతమ్ ప్రతి దానిలో దూరుతున్నాడని నబీల్ ఇబ్బంది పడుతున్నాడు. గత సీజన్లో జరిగిన ఓ పని వల్ల టేస్టీ తేజ, నయని పావని మధ్య పెద్ద రచ్చే జరిగింది. ఇంతకీ 37వ రోజు బిగ్‌బాస్ హౌసులో ఏం జరిగింది? అనేది హైలైట్స్‌లో చూద్దాం.(ఇదీ చదవండి: కార్తీ తప్పు లేకపోయినా సారీ చెప్పించారు: ప్రకాశ్ రాజ్)యష్మికి రోహిణి కౌంటర్స్యష్మిని రోహిణి నామినేట్ చేయడంతో ఈ రోజు ఎపిసోడ్ మొదలైంది. మెగా చీఫ్ టాస్క్‌లో నబీల్-పృథ్వీ ఆడుతున్న టైంలో సంచాలక్ ప్రేరణని తప్పు చేయమనే అర్థమొచ్చేలా పదేపదే చెప్పడం తనకు నచ్చలేదని రోహిణి కారణం చెప్పింది. యష్మి దీనికి ఎంతకీ ఒప్పుకోలేదు. రోహిణి కూడా ఏ మాత్రం తగ్గకుండా కౌంటర్స్ వేసింది. అలానే మొదటితో పోలిస్తే విష్ణుప్రియ ఆట తగ్గిపోయిందని గ్రాఫ్ పెంచుకోమని చెప్పి రోహిణి ఈమెని నామినేట్ చేసింది.అలిగిన గంగవ్వరోహిణి తర్వాత గంగవ్వ వచ్చింది. గేమ్ ఆడట్లేదు, కాళ్లు చేతులు సక్కగా లేవా? ఉన్నా మరెందుకు ఆడట్లే, ఉత్తిగనే కూసుంటున్నావ్ అని చెప్పి విష్ణుప్రియని నామినేట్ చేసింది. ఇక హౌసులోకి వచ్చిన తర్వాత తమ ఎనిమిది మందిని అస్సలు పలకరించట్లేదని, కనీసం టీ కూడా ఇవ్వలేదని చెప్పి యష్మిని నామినేట్ చేసింది. తెలంగాణ స్లాంగ్‌లో గంగవ్వ చెప్పిన మాటలు తొలుత యష్మికి అర్థం కాలేదు. నయని చెప్పడంతో అర్థం చేసుకుంది. ఈసారి రోజూ మాట్లాడతా, చాక్లెట్ కూడా షేర్ చేసుకుంటానని యష్మి చెప్పింది.(ఇదీ చదవండి: సమంతపై డైరెక్టర్ త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్)కొత్తోళ్లు నామినేషన్స్‌లో ఎందుకు?చివరగా వచ్చిన అవినాష్.. పృథ్వీ, యష్మిని నామినేట్ చేశాడు. ప్రభావిత టాస్క్‌లో ఆడవాళ్లతో కాస్త హర్ష్‌గా ప్రవర్తించాడని, అలానే గేమ్ కనిపించట్లేదనే కారణంతో పృథ్వీకి కారణాలు చెప్పుకొచ్చాడు. ఇక కన్ఫెషన్ రూంలో మణికంఠకి ఫుడ్ ఇచ్చేసి ఉంటే బయటకొచ్చి అతడిని ఓదార్చే అవసరముండేది కాదు కదా అని యష్మిని నామినేట్ చేశాడు. ఇక్కడివరకు బాగానే ఉంది గానీ కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ నుంచి కూడా ఇద్దరిని నామినేట్ చేయాలని, వాళ్లిద్దరూ ఎవరూ ఓజీ క్లాన్ (హౌసులోని పాతోళ్లు) నిర్ణయించాలని అన్నాడు. అన్ని చర్చల తర్వాత మెహబూబ్, గంగవ్వని నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. హౌసులోకి వచ్చిన ఒక్కరోజులోనే వీళ్లని నామినేట్ చేయాలని ఎలా డిసైడ్ చేస్తారు? అనేది అర్థం కాలేదు.ఉప్పు ప్యాకెట్ రూ.50 వేలుఓవరాల్గా ఈ వారం పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ, సీత, మెహబూబ్, గంగవ్వ నామినేషన్స్‌లో ఉన్నారు. ఇది పూర్తయిన తర్వాత రేషన్ టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా ఇంట్లోని రేషన్ అంతా బిగ్‌బాస్‌కి ఇచ్చేయాలని అన్నాడు. బిగ్‌బాస్ మార్కెట్ ఉంటుందని, బజర్ మోగి, ఆగేలోపు ఎంత తీసుకొస్తే ఆ రేషన్‌ని ఇరు క్లాన్స్ పంచుకోవాలని బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టాడు. నబీల్-నిఖిల్ అన్నీ తెచ్చారు కానీ ఉప్పు ప్యాకెట్ తీసుకురావడం మర్చిపోయారు. చివరకు బిగ్‌బాస్‌ని ప్రాధేయపడితే ప్రైజ్‌మనీలో నుంచి రూ.50 వేలు తగ్గించుకుని సాల్ట్ ప్యాకెట్ ఇచ్చారు.(ఇదీ చదవండి: 'దేవర' ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం)గౌతమ్ తీరుపై నబీల్ అసహనంఏదైనా అనౌన్స్మెంట్ మెగా చీఫ్‌గా తనకు బాధ్యత ఉందని, కానీ గౌతమ్ కృష్ణ ప్రతిసారీ వచ్చి తన చేతిలో పేపర్ లాగేసుకుని మరీ చదువుతున్నాడని నబీల్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ పాయింట్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటున్నానని తన క్లాన్ సభ్యులతో అన్నాడు. అంటే వచ్చే వారం ఇదే కారణం చెప్పి గౌతమ్‌ని నబీల్ నామినేట్ చేయడం గ్యారంటీ.నోరు జారిన టేస్టీ తేజబయట లాన్లో అందరూ కూర్చున్న టైంలో అవినాష్, మెహబూబ్.. నయని పావనిని గత సీజన్లో నామినేట్ చేయడం గురించి మాట్లాడుకున్నారు. ఈసారి వైల్డ్ కార్డ్‌గా వచ్చిన తేజ కూడా తనని నామినేట్ చేశాడని నయని చెప్పింది. దీంతో దగ్గర్లో ఉన్న తేజ.. నామినేషన్ విషయంలో నిన్నే బండ బూతులు తిట్టారని, కావాలంటే బయటకెళ్లిన తర్వాత చూస్కో అని నోరు జారాడు. దీంతో నయని పావని వెక్కి వెక్కి ఏడ్చింది. చివరకు ఆమె దగ్గరకెళ్లి సారీ చెప్పాడు. నీకు ఎందుకురా అంత నోటి దూల అని తనని తానే తిట్టుకున్నాడు. అలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది.(ఇదీ చదవండి: సమంత-త్రివిక్రమ్‌తో సినిమా.. ఆలియా పెద్ద కోరిక) View this post on Instagram A post shared by Sai Pavani Raju (@nayani_pavani) -
Bigg Boss 8: తొమ్మిదోవారం నయని ఎలిమినేట్
నయని పావని.. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ అసలు పేరు సాయిరాజు పావని. టిక్‌టాక్ స్టార్‌గా ఫేమస్. ఎంత ఘాటు ప్రేమ, సమయం లేదు మిత్రమా, పెళ్లి చూపులు 2.0, బబ్లూ వర్సెస్ సుబ్బులు కేరాఫ్ అనకాపల్లి వంటి పలు షార్ట్ ఫిలింస్‌లో నటించింది. కవర్ సాంగ్స్, చిత్తం మహారాణి, సూర్యకాంతం వంటి చిత్రాల్లోనూ కనువిందు చేసిన ఈ బ్యూటీ బిగ్‌బాస్ ఏడో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది.హౌస్‌కు వెళ్లగానే అందరితో ఇట్టే కలిసిపోయింది. కానీ దురదృష్టం కొద్దీ వారానికే ఎలిమినేట్ అయిపోయింది. హౌస్ నుంచి వచ్చాక అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అంతేకాదు, ఇప్పుడు బయటకు వచ్చేసినా నెక్స్ట్ సీజన్లో రావడం పక్కా అనుకున్నారు. అందరూ ఊహించినట్లుగానే ఈ సీజన్లో అడుగుపెట్టింది. కాకపోతే మరోసారి వైల్డ్‌కార్డ్ ద్వారానే ఎంట్రీ ఇచ్చింది. ఈసారి నెలరోజులు హౌస్‌లో ఉండి తొమ్మిదోవారం ఎలిమినేట్ అయింది. -
బిగ్‌బాస్ 8 రీలోడ్: వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు ఇమ్యూనిటీ.. వాటే ట్విస్ట్
గత ఏడు సీజన్లకంటే కూడా ఈసారి బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ లాంచింగ్ ఎపిసోడ్‌కు అత్యధిక టీఆర్పీ వచ్చింది. కానీ కంటెస్టెంట్లు ఆ రేటింగ్‌ను అలాగే కాపాడుకోలేకపోయారు. నెమ్మదిగా షో బోరింగ్‌గా మారుతుండటంతో బిగ్‌బాస్ ఇక లాభం లేదనుకుని పాత సీజన్లలో పాల్గొన్న పలువురినే వైల్డ్ కార్డ్ ఎంట్రీల పేరిట హౌసులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆదివారం.. 'బిగ్‌బాస్ గ్రాండ్ రీలోడ్' పేరిట ఎపిసోడ్ ప్రసారమైంది. ఇంతకీ హౌస్‌లోకి వచ్చిందెవరో చూసేయండి..నైనిక ఎలిమినేట్'జవాన్' టైటిల్ సాంగ్, 'గేమ్ ఛేంజర్' నుంచి రీసెంట్గా రిలీజైన 'రా మచ్చా' పాటలకు స్టెప్పులేసి ఆదివారం ఎపిసోడ్‌కి హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. వచ్చీ రాగానే డేంజర్ జోన్లో ఉన్న మణికంఠ, విష్ణుప్రియ, నైనికని నిలబెట్టారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలని ఎలా ఎదుర్కోబోతున్నారో ఎదుర్కోబోతున్నారని హౌస్‌మేట్స్‌ను అడగ్గా వారంతా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నైనిక ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించడంతో సీత ఎప్పటిలాగే కన్నీటి కుళాయిని ఓపెన్ చేస్తూ బోరున ఏడ్చేసింది.ఎవరికి ఏ ట్యాగ్?స్టేజీపైకి వచ్చిన నైనికని హౌసులో ఎవరు ఎలాంటి వారనేది నాగ్ అడగ్గా.. ప్రేరణ మ్యానిప్యులేటర్, మణికంఠ వెన్నుపోటు పొడిచే వ్యక్తి, విష్ణుప్రియ నకిలీ స్నేహితురాలు, పృథ్వీ అటెన్షన్ సీకర్, నబీల్ అవకాశవాది, సీత నిజమైన ఫ్రెండ్, నిఖిల్ గేమ్ ఛేంజర్, యష్మిది మంద బుద్ధి అని చెప్పుకొచ్చింది.ఉత్తరాలు వచ్చాయ్..ఈ వారం హౌస్మేట్స్ కోసం ఉత్తరాలు వచ్చాయి. కానీ అవి కొందరికి అందకుండానే వెనక్కు వెళ్లిపోయాయి. వాటిని నాగ్ తిరిగి తీసుకొచ్చాడు. సీత, నబీల్, యష్మి, మణికంఠ తమ లెటర్స్ అందుకుని ఎమోషనల్ అయ్యారు. ఇక హౌస్‌లో ఉన్న ఎనిమిది మంది ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్) టీమ్‌గా, కొత్తగా వచ్చే ఎనిమిది వైల్డ్ కార్డ్స్ రాయల్ టీమ్‌గా ఉంటాయని నాగ్ వెల్లడించాడు.. తొలి వైల్డ్ కార్డ్‌గా హరితేజసీరియల్స్, సినిమాలతో పాపులర్ అయింది హరితేజ. బిగ్‌బాస్ మొదటి సీజన్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. గలగలా మాట్లాడే ఈమె గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఈ షో తర్వాత సినిమాల్లో బిజీ అవడమే కాకుండా హోస్ట్‌గానూ అవతారమెత్తింది. అఆ, యూ టర్న్, అరవింద సమేత వీర రాఘవ, ప్రతిరోజు పండగే, హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హరితేజ.. ఇటీవలే రిలీజైన దేవర సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా మెప్పించింది. యాక్టింగ్, యాంకరింగ్ రెండింట్లోనూ ఆరితేరిన ఈమె ఇప్పుడు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లో మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. తనకు నవదీప్.. ఆల్ ది బెస్ట్ చెబుతున్న వీడియో పంపించారు. అలానే హౌసులోకి వెళ్లేముందు స్టేజీపైకి హరితేజ కూతురుని తీసుకురావడంతో ఆమె ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంది.రెండో వైల్డ్ కార్డ్‌గా టేస్టీ తేజతేజ అసలు పేరు తేజ్‌దీప్. తెనాలో పుట్టిపెరిగిన ఇతడు 2017లో సాఫ్ట్వేర్ ఉద్యోగం హైదరాబాద్‌లో సెటిలయ్యాడు. చిన్నప్పటినుంచి నటన, సినిమాలంటే ఆసక్తి ఉన్న తేజకు కరోనా సెలవులు కలిసొచ్చాయి. 2020లో వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్నప్పుడు తెనాలిలో స్నేహితులతో కలిసి హోటల్‌కు వెళ్లి భోజనం చేశాడు. ఆ వీడియో యూట్యూబ్‌లో పెట్టగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదేదో బాగుందనిపించి హైదరాబాద్ వచ్చాక అదే కొనసాగించాడు. యూట్యూబర్‌గా తిండి వీడియోలు చేస్తూ బిజీ అయ్యాడు. అలా బిగ్‌బాస్ ఏడో సీజన్లో పాల్గొన్నాడు. తొమ్మిదివారాలపాటు హౌస్‌లో ఉన్నాక షోకి టాటా బైబై చెప్పాడు. ఇప్పుడు ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అమ్మ చేసిన పాల తాళికలను నాగార్జున కోసం తీసుకొచ్చాడు. అలానే తేజకి శోభాశెట్టి బెస్ట్ విషెస్ చెప్పింది.మరో రూ.20 లక్షలుసెట్పైకి వచ్చిన స్వాగ్ టీమ్ (శ్రీవిష్ణు, రీతూ వర్మ, దక్ష నగార్కర్) తన సినిమా కబుర్లు చెప్పింది .తర్వాత హౌస్‌లోకి వెళ్లి హౌస్మేట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్‌తో గేమ్ ఆడించారు. ఈ గేమ్‌లో వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్లు హరి-తేజ గెలిచి రూ.20 లక్షలు ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. అనంతరం మూడో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా నయని పావని హౌస్‌లో అడుగుపెట్టింది.మూడో వైల్డ్ కార్డ్‌గా నయని పావనిఈమె అసలు పేరు సాయిరాజు పావని. టిక్‌టాక్ స్టార్‌గా ఫేమస్. షార్ట్ ఫిలింస్, కవర్ సాంగ్స్, చిత్తం మహారాణి, సూర్యకాంతం వంటి చిత్రాల్లోనూ కనువిందు చేసిన ఈ బ్యూటీ బిగ్‌బాస్ ఏడో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. దురదృష్టం కొద్దీ వారానికే ఎలిమినేట్ అయిపోయింది. అయితే నయని నెక్స్ట్ సీజన్లో రావడం పక్కా అనుకున్నారు. అందరూ ఊహించినట్లుగానే ఈ సీజన్లో అడుగుపెట్టింది. కాకపోతే మరోసారి వైల్డ్‌కార్డ్ ద్వారానే ఎంట్రీ ఇచ్చింది. ఇక శివాజీ.. నయనికి బెస్ట్ విషెస్ చెప్పాడు.నాలుగో వైల్డ్ కార్డ్‌గా మెహబూబ్డ్యాన్స్, యాక్టింగ్ అంటే పిచ్చి. అందుకోసం మెహబూబ్ చేయని ప్రయత్నం లేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల సాఫ్ట్వేర్ కొలువులో చేరినా కళను వదిలేయలేకపోయాడు. వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలింస్, టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. తక్కువ సమయంలోనే ఎక్కువమంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.అలా తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజన్లో అడుగుపెట్టిన టాస్కుల్లో సత్తా చూపించాడు. కండబలం బాగానే ఉన్నా బుద్ధి బలం తక్కువగా ఉండటంతో ఫినాలే వరకు వెళ్లకుండానే వెనుదిరిగాడు. ఇప్పుడు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. ఇక మెహబూబ్ కోసం సొహైల్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అలానే నాలుగో సీజన్లో ఎలా అయితే ఆడావో ఈసారి అంతకు మించి ఆడి గెలవాలన్నాడు.'జనక అయితే గనక' మూవీ ప్రమోషన్లో భాగంగా సుహాస్, దిల్ రాజ్ టీమ్ వచ్చారు. సుహాస్, హీరోయిన్ సంగీర్తన హౌసులోకి వెళ్లి ఓజీ, రాయల్ టీమ్స్‌తో గేమ్ ఆడించారు. ఇందులో గెలిచిన సీత-మణికంఠ.. బెడ్ రూమ్, రేషన్ కంట్రోల్ చేసే అధికారాన్ని సొంతం చేసుకున్నారు.ఐదో వైల్డ్ కార్డ్‌గా రోహిణిఒకప్పుడు సీరియల్స్‌లో మెప్పించిన రోహిణి.. ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ రచ్చ చేస్తోంది. తన కామెడీ టైమింగ్స్‌తో అందరికీ వినోదాన్ని పంచుతోంది. ఆ మధ్య కాలు సర్జరీ వల్ల కొన్ని నెలలపాటు తెరపై కనిపించలేదు. కానీ కోలుకున్న వెంటనే మళ్లీ స్క్రీన్‌పై ప్రత్యక్షమై నవ్వుల జల్లు కురిపిస్తోంది. బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొన్న రోహిణి.. మరోసారి ఈ రియాలిటీ షోలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. ఇక శివజ్యోతి.. రోహిణి కోసం స్పెషల్ వీడియో పంపింది. హౌసులో కామెడీ లోటు బాగా ఉందని, దాన్ని ఫుల్ ఫిల్ చేయాలంది.ఆరో వైల్డ్ కార్డ్‌గా గౌతమ్ కృష్ణగౌతమ్ కృష్ణ.. బిగ్‌బాస్‌కు రావడానికి ముందు పలు సినిమాలు చేశాడు. కానీ జనాలకు సుపరిచితుడైంది మాత్రం బిగ్‌బాస్ ఏడో సీజన్‌తోనే! చిన్నప్పటినుంచే డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. కానీ పేరెంట్స్ కోరిక మేరకు డాక్టర్ అయ్యాడు. తన కోరికను చంపుకోలేక 2018లో దర్శకత్వంలో శిక్షణ పొందాడు. ఆ మరుసటి ఏడాది ఆకాశవీధుల్లో సినిమాకు సొంతంగా కథ రాసుకుని తనే డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించాడు.బాలీవుడ్‌లోనూ సిద్దూ: ది రాక్‌స్టార్ సినిమా చేశాడు. సినిమాలపైనే ఫోకస్ పెట్టిన ఈ డాక్టర్ బాబు గత సీజన్లో సీక్రెట్ రూమ్‌కు వెళ్లాడు. అశ్వత్థామ 2.0 అంటూ భారీ డైలాగులతో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ ఫినాలే వరకు రాలేకపోయాడు. తాజాగా మరోసారి వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చాడు.ఏడో వైల్డ్ కార్డ్‌గా అవినాష్ఇండస్ట్రీలో అడుగుపెట్టాలన్న ఆశతో ఎంతోమందిలాగే ఇతడూ కృష్ణానగర్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. అవకాశాలు రాకపోయినా చిన్నచిన్న ప్రోగ్రాంలతో జీవితాన్ని గడిపాడు. అనుకోకుండా ఓ కామెడీ షోలో ఛాన్స్ రావడంతో అతడి దశ తిరిగిపోయింది. ఎనిమిదేళ్లలోనే టీం లీడర్‌గా ఎదిగాడు. చిన్నప్పటి నుంచే మిమిక్రీలు చేసే ఈ జగిత్యాలవాసికి బిగ్‌బాస్ నాలుగో సీజన్లో ఆఫర్ వచ్చింది. ఇదే విషయం కామెడీ షో నిర్వాహకులకు చెబితే.. ఇంకా రెండేళ్ల అగ్రిమెంట్ ఉందని, మధ్యలో వెళ్తే రూ.10 లక్షలు కట్టాలని హెచ్చరించారు.ఆర్థిక అవసరాల వల్ల స్నేహితుల సాయం తీసుకుని మరీ ఆ డబ్బు కట్టేసి బిగ్‌బాస్‌కు వెళ్లాడు. వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన అవినాష్.. 12 వారాలు హౌస్‌లో ఉండి ఎంటర్టైనర్ అని నిరూపించుకున్నాడు. ఇప్పుడు మరోసారి బిగ్‌బాస్ 8లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇతడికి శ్రీముఖి ఆల్ ది బెస్ట్ చెప్పింది. అలానే స్టేజీపై మణికంఠ, నబీల్, విష్ణుప్రియలా యాక్ట్ చేసి నవ్వించాడు.ఎనిమిదో వైల్డ్ కార్డ్‌గా గంగవ్వవయసైపోయాక ఏ పనీ చేతకాక ఓ మూలన కూర్చోవాల్సిందే అని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పని నిరూపించింది గంగవ్వ. టాలెంట్ ఉంటే ఏ వయసులోనైనా రాణించవచ్చని నిరూపించింది. జగిత్యాల జిల్లా లంబాడిపల్లి గ్రామానికి చెందిన గంగవ్వ ఒకప్పుడు దినసరి కూలీ. కానీ ఇప్పుడు తన నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.తన కట్టుబొట్టు, అమాయకత్వం, గడుసుతనం.. జనాలకు నచ్చేశాయి. బిగ్‌బాస్ నుంచి పిలుపు రావడంతో నాలుగో సీజన్లో అడుగుపెట్టింది. స్వచ్ఛమైన పల్లెలో బతికిన మట్టిమనిషికి ఏసీలు పడలేదు. ఈ గోస నావల్ల కాదంటూ దండం పెట్టి బయటకు వచ్చేసింది. అయితే సొంతింటి కలను నెరవేర్చుకుంది. తర్వాత సినిమాల్లోనూ నటించింది. ఇప్పుడు మరోసారి ధైర్యం చేసి బిగ్‌బాస్ 8లోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చింది.రాయల్ టీమ్‌కు ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ టీమ్‌కు చివరగా మరో గేమ్ ఆడించారు. ఇందులో రాయల్ టీమ్ నుంచి అవినాష్, గంగవ్వ ఆడారు. ఓజీ టీమ్‌పై వీరు విజయం సాధించడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ఈ వారం ఇమ్యూనిటీ లభించింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 8.కొత్త పోకడ, మాజీ కంటెస్టెంట్లతో వర్కవుట్ అవుతుందా?
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డులను తీసుకురావాలన్న ఆలోచన ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిందేమీ కాదు. సీజన్ ప్రారంభమయ్యే రోజు కేవలం 14 మందినే హౌస్‌లోకి పంపించి.. వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని స్పష్టంగా చెప్పేశారు. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో చాలామందికి గేమ్ మీదకన్నా కొట్లాటలు, ముచ్చట్ల మీదే ఫోకస్ ఎక్కువగా ఉంది. ఒకరిద్దరికి తప్ప ఎవరికీ విజేత లక్షణాలు లేవు.ఎనిమిది వైల్డ్ కార్డ్ ఎంట్రీలువీరితో షో నెట్టుకురావడం కష్టమని భావించిన బిగ్‌బాస్ టీమ్ వైల్డ్‌గా ఉంటే కంటెస్టెంట్లను తీసుకురావాలని ప్లాన్ చేసింది. కొత్తవాళ్లను తీసుకొస్తే వర్కవుట్ అవుతుందో, లేదోనని డౌట్ పడ్డారో ఏమో కానీ పాత సీజన్ల నుంచి కంటెస్టెంట్లను ఎంపిక చేశారు. ఒక్కో సీజన్లో నుంచి ఒక్కో ఆణిముత్యాన్ని తీసుకుని హౌస్‌లోకి పంపించనున్నారు. అలా హరితేజ, గంగవ్వ, గౌతమ్ కృష్ణ, నయని పావని, రోహిణి, అవినాష్, టేస్టీ తేజ, మెహబూబ్ దిల్సేను ఎంపిక చేసినట్లు భోగట్టా! హౌస్‌లో ఉన్నవాళ్లతో పోలిస్తే వీళ్లు చాలా బెటర్.గంగవ్వఇకపోతే గంగవ్వను తీసుకురావడమే అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది. బిగ్‌బాస్ నాలుగో సీజన్లో గంగవ్వతోనే ఐదు వారాలు ఆటను నెట్టుకొచ్చారు. అయితే ఏసీ పడట్లేదు, హౌస్‌లో ఉండలేను, నన్ను పంపించండి మహాప్రభో.. అని బతిమాలడంతో ఆమెను ఎలిమినేట్ చేసేశారు. కానీ సొంతింటి కల నెరవేర్చుకోవాలన్న కోరికతో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గంగవ్వ కలను నాగార్జున సాకారం చేశాడు. ప్రస్తుతం హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు మాజీ కంటెస్టెంట్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదట! (చదవండి: బిగ్‌బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఆదిత్య ఔట్)ముచ్చటగా మూడోసారి..అందుకే గంగవ్వను బతిమాలో, బలవంతపెట్టోగానీ హౌస్‌కు తీసుకువస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే తనవల్ల కాదని గంగవ్వ చేతులెత్తేయడంతో ఆమె స్థానంలో వితికా షెరును తీసుకువస్తున్నారన్నది లేటెస్ట్ టాక్ గౌతమ్ కృష్ణ.. అశ్వత్థామ 2.0 అంటూ అప్పట్లోనే సీక్రెట్‌రూమ్‌కు వెళ్లి వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా మళ్లీ హౌస్‌లో అడుగుపెట్టాడు. ముచ్చటగా మూడోసారి హౌస్‌లోకి వెళ్లబోతున్న ఇతడు ఎలా మెప్పిస్తాడో చూడాలి. రోహిణి, అవినాష్, హరితేజల గురించి భయపడాల్సిన పనేలేదు.నయని పావనిఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో వీళ్లెప్పుడూ ముందుంటారు. గత సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నయని పావని ఒక్కవారంలోనే ఎలిమినేట్ అయింది. కానీ వారం రోజుల్లోనే తనకంటూ మంచి పేరు సంపాదించుకుంది. మరి ఈసారైనా ఎక్కువవారాలు ఉంటుందేమో చూడాలి. మెహబూబ్ టాస్కులు బాగా ఆడతాడు, తేజ ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తాడు. మరి ఈ ఎనిమిది మంది హౌస్‌లో ఉన్నవారికి టఫ్ కాంపిటీషన్ ఇస్తారేమో వేచి చూడాలి!బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
జాన్వీ కపూర్ జిగేలు.. బచ్చన్ బ్యూటీ చాన్నాళ్ల తర్వాత
మాల్దీవుల్లో చిల్ అవుతున్న హాట్ బ్యూటీ మౌనీ రాయ్జిగేలు మనిపిస్తున్న 'దేవర' హీరోయిన్ జాన్వీ కపూర్చాన్నాళ్ల తర్వాత మళ్లీ కనిపించిన 'మిస్టర్ బచ్చన్' భాగ్యశ్రీజిమ్నాస్టిక్స్ చేస్తూ ఫుల్ బిజీగా హీరోయిన్ నేహాశర్మబ్లాక్ డ్రస్సులో క్యూట్ అండ్ స్వీట్‌గా మీనామెట్లు ఎక్కి తిరుపతి వెళ్తున్న బిగ్‌బాస్ నయని పావనిభర్తతో కలిసి ఆటోలో షికార్లు చేస్తున్న తమిళ నటి ప్రియ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Shwetha Srivatsav (@shwethasrivatsav) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) View this post on Instagram A post shared by Mimi chakraborty (@mimichakraborty) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Celina Jaitly (@celinajaitlyofficial) View this post on Instagram A post shared by Priya Mohan (@priyaatlee) View this post on Instagram A post shared by Sai Pavani Raju (@nayani_pavani) -
ప్రిన్స్ యావర్‌తో లవ్? క్లారిటీ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ
బిగ్‌బాస్ షోలో పాల్గొంటే పాపులారిటీ ఎంతొస్తుందో.. నెగెటివిటీ కూడా అదే స్థాయిలో వస్తుంది. చిన్నచిన్న పొరపాట్లను, తప్పులను కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ కంటెస్టెంట్లను ట్రోల్ చేస్తుంటారు. అయితే ఇలాంటి షోలో ఎటువంటి నెగెటివిటీ లేకుండా బయటకు రావడం చాలా కష్టం. కానీ బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో ఫుల్ పాజిటివిటీతో బయటకు వచ్చింది నయని పావని. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన ఈమె ఒక్క వారంలోనే బయటకు వచ్చేసింది. కానీ బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది. షో నుంచి బయటకు వచ్చాక బిగ్‌బాస్ కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్‌తో తరచూ రీల్స్, డ్యాన్స్ వీడియోలు చేస్తూ వస్తోంది. ఇది చూసిన జనాలు.. వీళ్ల మధ్య ఏదో ఉందని అనుమానించడం మొదలుపెట్టారు. తాజాగా ఆమె అభిమానులతో చిట్‌చాట్ చేయగా ఓ వ్యక్తి నువ్వు ప్రిన్స్ యావర్‌తో ప్రేమలో ఉన్నావా? అని అడిగేశాడు. ఈ ప్రశ్న వినీవినీ విసుగెత్తిపోయిన నయని.. అరేయ్, ఏంట్రా మీరు? ఇంకో ప్రశ్నే లేదా? మా మధ్య ఏం లేదు అని ఎన్నిసార్లు క్లారిటీ ఇవ్వాలి అని రిప్లై ఇచ్చింది. దీంతో వారి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని క్లారిటీ వచ్చేసింది. #NayaniPavani Clarifies Relation with #Yawar pic.twitter.com/KR5B1jT93x — BigBoss Telugu Views (@BBTeluguViews) February 21, 2024 చదవండి: ఫస్ట్ ప్రెగ్నెన్సీ లేట్‌గా ప్లాన్ చేశా.. రెండోది త్వరలోనే.. -
'బిగ్‌బాస్' ఓటీటీ తెలుగు సీజన్ రద్దు? అదే అసలు కారణమా?
బిగ్‌బాస్ రియాలిటీ షో గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే మొన్నీమధ్యే డిసెంబరులో ఏడో సీజన్ పూర్తయింది. ఫినాలేలో రైతుబిడ్డ ప్రశాంత్ విజేతగా నిలవడం.. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట విధ్వంసం.. కార్లు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం.. ఇలా ఎంత జరగాలో అంతా జరిగింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో ఓటీటీ సీజన్ ఉందన్నట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడేమో ఏకంగా అది రద్దయినట్లు చెబుతున్నారు. ఇంతకీ ఏమైంది? రద్దుకు కారణమేంటి? తెలుగులో బిగ్‌బాస్ షో ఇప్పటివరకు ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తొలి సీజన్ హిట్ అయింది. ఆ తర్వాత నుంచి మాత్రం ఏదో ఒక గొడవ అవుతూనే ఉంది. షో ఆపేయాలని విమర్శలు.. కోర్టు కేసులు.. ఇలా ప్రతిసారి రచ్చ అవుతూనే ఉంటుంది. ఇన్ని జరుగుతున్నా సరే షోని ఆపట్లేదు సరికదా ఓటీటీ సీజన్ కూడా ఆ మధ్యలో ఒకటి పెట్టారు. పాతవాళ్లతో పాటు కొత్తవాళ్లు పాల్గొన్న ఆ సీజన్లో బింధుమాధవి విన్నర్‌గా నిలిచింది. కాకపోతే ఆ సీజన్ ఫెయిలైంది. (ఇదీ చదవండి: స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి?) అయితే రీసెంట్గా జరిగిన ఏడో సీజన్.. విమర్శల కారణంగా వార్తల్లో నిలిచింది. దీన్ని క్యాష్ చేసుకుందామని నిర్వహకులు పెద్ద ప్లాన్ వేశారు. ఫిబ్రవరిలో తొలి వారంలో ఓటీటీ సీజన్ మొదలుపెట్టేయాలని అనుకున్నారు. ఏడో సీజన్లో పాల్గొన్న భోలె షావళి, నయన పావని తోపాటు యావర్ కూడా ఈ సీజన్లో పాల్గొంటారని రూమర్స్ వచ్చాయి. కానీ వీళ్లు తప్పితే మిగతా వాళ్లు ఎవరూ దీనిపై కనీస ఆసక్తి చూపించట్లేదట. టీవీ సీజన్ అయితే వస్తాం గానీ ఓటీటీ సీజన్‌కి మాత్రం వచ్చేది లేదని చెబుతున్నారట. రెమ్యునరేషన్ పెంచి ఇస్తామని చెప్పినా సరే పెద్దగా ఆసక్తి చూపించట్లేదట. మరోవైపు నాగార్జున కూడా అందుబాటులో ఉండట్లేదు. దీంతో హోస్ట్ కూడా మారే ఛాన్స్ ఉంటుంది. ఇలా సమస్యలు ఎక్కువయ్యేసరికి నిర్వహకులు.. సీజన్‌ని రద్దు చేయాలని ఫిక్సయ్యారట. మరి ఇందులో నిజమేంటి అనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?)