బిగ్‌బాస్‌ 8.కొత్త పోకడ, మాజీ కంటెస్టెంట్లతో వర్కవుట్‌ అవుతుందా? | Bigg Boss Telugu 8: Eight Wild Card Entries Details | Sakshi
Sakshi News home page

Bigg Boss: 8 వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలు.. గంగవ్వ స్థానంలో ఆ కంటెస్టెంట్‌!

Published Thu, Oct 3 2024 4:14 PM | Last Updated on Thu, Oct 3 2024 8:50 PM

Bigg Boss Telugu 8: Eight Wild Card Entries Details

బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌లో వైల్డ్‌ కార్డులను తీసుకురావాలన్న ఆలోచన ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిందేమీ కాదు. సీజన్‌ ప్రారంభమయ్యే రోజు కేవలం 14 మందినే హౌస్‌లోకి పంపించి.. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలు ఉండబోతున్నాయని స్పష్టంగా చెప్పేశారు. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో చాలామందికి గేమ్‌ మీదకన్నా కొట్లాటలు, ముచ్చట్ల మీదే ఫోకస్‌ ఎక్కువగా ఉంది. ఒకరిద్దరికి తప్ప ఎవరికీ విజేత లక్షణాలు లేవు.

ఎనిమిది వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు
వీరితో షో నెట్టుకురావడం కష్టమని భావించిన బిగ్‌బాస్‌ టీమ్‌ వైల్డ్‌గా ఉంటే కంటెస్టెంట్లను తీసుకురావాలని ప్లాన్‌ చేసింది. కొత్తవాళ్లను తీసుకొస్తే  వర్కవుట్‌ అవుతుందో, లేదోనని డౌట్‌ పడ్డారో ఏమో కానీ పాత సీజన్ల నుంచి కంటెస్టెంట్లను ఎంపిక చేశారు. ఒక్కో సీజన్‌లో నుంచి ఒక్కో ఆణిముత్యాన్ని తీసుకుని హౌస్‌లోకి పంపించనున్నారు. అలా హరితేజ, గంగవ్వ, గౌతమ్‌ కృష్ణ, నయని పావని, రోహిణి, అవినాష్‌, టేస్టీ తేజ, మెహబూబ్‌ దిల్‌సేను ఎంపిక చేసినట్లు భోగట్టా! హౌస్‌లో ఉన్నవాళ్లతో పోలిస్తే వీళ్లు చాలా బెటర్‌.

గంగవ్వ
ఇకపోతే గంగవ్వను తీసుకురావడమే అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది. బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో గంగవ్వతోనే ఐదు వారాలు ఆటను నెట్టుకొచ్చారు. అయితే ఏసీ పడట్లేదు, హౌస్‌లో ఉండలేను, నన్ను పంపించండి మహాప్రభో.. అని బతిమాలడంతో ఆమెను ఎలిమినేట్‌ చేసేశారు. కానీ సొంతింటి కల నెరవేర్చుకోవాలన్న కోరికతో బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టిన గంగవ్వ కలను నాగార్జున సాకారం చేశాడు. ప్రస్తుతం హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు మాజీ కంటెస్టెంట్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదట! 

(చదవండి: బిగ్‌బాస్‌ మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌.. ఆదిత్య ఔట్‌)

ముచ్చటగా మూడోసారి..
అందుకే గంగవ్వను బతిమాలో, బలవంతపెట్టోగానీ హౌస్‌కు తీసుకువస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే తనవల్ల కాదని గంగవ్వ చేతులెత్తేయడంతో ఆమె స్థానంలో వితికా షెరును తీసుకువస్తున్నారన్నది లేటెస్ట్‌ టాక్‌ గౌతమ్‌ కృష్ణ.. అశ్వత్థామ 2.0 అంటూ అప్పట్లోనే సీక్రెట్‌రూమ్‌కు వెళ్లి వైల్డ్‌కార్డ్‌ కంటెస్టెంట్‌గా మళ్లీ హౌస్‌లో అడుగుపెట్టాడు. ముచ్చటగా మూడోసారి హౌస్‌లోకి వెళ్లబోతున్న ఇతడు ఎలా మెప్పిస్తాడో చూడాలి. రోహిణి, అవినాష్‌, హరితేజల గురించి భయపడాల్సిన పనేలేదు.

నయని పావని
ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వడంలో వీళ్లెప్పుడూ ముందుంటారు. గత సీజన్‌లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన నయని పావని ఒక్కవారంలోనే ఎలిమినేట్‌ అయింది. కానీ వారం రోజుల్లోనే తనకంటూ మంచి పేరు సంపాదించుకుంది. మరి ఈసారైనా ఎక్కువవారాలు ఉంటుందేమో చూడాలి. మెహబూబ్‌ టాస్కులు బాగా ఆడతాడు, తేజ ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తాడు. మరి ఈ ఎనిమిది మంది హౌస్‌లో ఉన్నవారికి టఫ్‌ కాంపిటీషన్‌ ఇస్తారేమో వేచి చూడాలి!

బిగ్‌బాస్‌ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement