బిగ్‌బాస్‌ మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌.. ఆదిత్య ఔట్‌ | Bigg Boss Telugu 8 Mid Week Elimination | Sakshi

బిగ్‌బాస్‌ మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌.. ఆదిత్య ఔట్‌

Oct 3 2024 3:25 PM | Updated on Oct 3 2024 3:31 PM

Bigg Boss Telugu 8 Mid Week Elimination

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఈ వార​ం ఒక ట్విస్ట్‌ ఉంటుందని నాగార్జున ఇప్పటికే చెప్పారు. ఈ క్రమంలోనే గురువారం హౌస్‌ నుంచి ఒకరు ఎలిమినేషన్‌ కానున్నారు. అనంతరం మరికొందరు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ రూపంలో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి రానున్నారు.  మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో భాగంగా హౌస్‌ నుంచి ఎవరు ఇంటిబాట పడుతారోనని ఫ్యాన్స్‌ ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.

సోమవారం రోజు నామినేషన్స్​ ప్రక్రియ ముగియడంతో కంటెస్టెంట్స్‌ ఫ్యాన్స్‌ భారీగానే ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు అన్​ అఫీషియల్​ పోలింగ్స్‌ను పరిశీలిస్తే.. నబీల్ ఎక్కువ ఓట్లతో టాప్‌లో ఉన్నాడు. తర్వాత నిఖిల్, విష్ణుప్రియ ముందంజలో ఉన్నారు.  ఆ తర్వాతి స్థానాల్లో మణికంఠ, ఆదిత్య, నైనిక ఉన్నారు. అయితే, నైనిక, ఆదిత్యలకు మధ్య ఓటింగ్‌ విషయంలో స్వల్ప తేడా మాత్రమే ఉంది. 

కానీ, తాజాగా విడుదలైన బిగ్‌బాస్‌ ప్రోమోలో ఆదిత్య, నైనిక, విష్ణుప్రియలు డైంజర్‌ జోన్‌లో ఉన్నట్లు కనిపిస్తో​ంది. గురువారం ఈ ముగ్గిరిలో ఒకరు మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌ కావచ్చని సమాచారం. అయితే, ఎక్కువమంది అభిప్రాయం ప్రకారం మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌లో భాగంగా  ఆదిత్య హౌస్‌ నుంచి బయటకు రావచ్చని అంచనా వేస్తున్నారు. కానీ, ఆయన్ను సీక్రెట్‌ రూమ్‌కు పంపించే ఛాన్స్‌ ఎక్కువగా ఉందని ప్రచారం జరగుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement