Aditya Om
-
సందేశంతో...
వాతావరణ పరిరక్షణపై సామాజిక సందేశం నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘బందీ’(Bandhi). ఆదిత్య ఓం(Aditya Om) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు రఘు తిరుమల దర్శకత్వం వహించారు. గల్లీ సినిమాపై వెంకటేశ్వర్ రావు దగ్గు, రఘు తిరుమల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది.‘‘భారతదేశంతో పాటు ఇతర విదేశాల్లోని అనేక అటవీ ప్రాంతాల్లో రియల్ లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. పర్యావరణ ప్రేమికులందరినీ ఈ సినిమా కదిలించేలా ఉంటుంది. అటవీ ప్రాంతంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటూ ఆదిత్య ఓం అద్భుతంగా నటించారు’’ అని యూనిట్ పేర్కొంది. -
మంచు లక్ష్మీ ‘ఆదిపర్వం’ మూవీ రివ్యూ
టైటిల్: ఆదిపర్వంనటీనటులు: మంచు లక్ష్మి, ఆదిత్య ఓం, ఎస్తేర్, సుహాసిని, శ్రీజిత ఘోష్, శివ కంఠమనేని, వెంకట్ కిరణ్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్ తదితరులురచన, దర్శకత్వం - సంజీవ్ మేగోటినిర్మాణ సంస్థలు: అన్వికా ఆర్ట్స్, ఏఐ(అమెరికా ఇండియా) ఎంటర్ టైన్ మెంట్స్సంగీతం: మాధవి సైబ, ఓపెన్ బనాన ప్రవీణ్, సంజీవ్, బి.సుల్తాన్ వలి, లుబెక్ లీ, రామ్ సుధీ(సుధీంద్ర)సినిమాటోగ్రఫీ - ఎస్ ఎన్ హరీశ్ఎడిటింగ్ - పవన్ శేఖర్ పసుపులేటివిడుదల తేది: నవంబర్ 8, 2024కథేంటంటే..ఈ సినిమా కథ 1974-90 మధ్యకాలంలో జరుగుతుంది.రాయలసీమ కడప దగ్గరలోని ఎర్రగుడిలో గుప్త నిధులు ఉన్నాయని అందరూ నమ్ముతారు. ఆ గుప్త నిధుల కోసం ఎమ్మెల్యే నాగమ్మ(మంచు లక్ష్మి) ప్రయత్నం చేస్తుంది. ఇందుకోసం క్షుద్ర శక్తులను ఆశ్రయిస్తుంది. మరోవైపు ఆ ఊరి పెద్ద రాయప్ప కూడా ఆ గుప్త నిధులను దక్కించుకోవాలనుకుంటాడు. గుప్త నిధుల కోసం వీరిద్దరు చేసిన అరాచకాలు ఏంటి? రాయప్ప తన కూతురుని ఎందుకు చంపాలనుకున్నాడు? నాగమ్మ కూడా ఆమెనే ఎందుకు చంపాలనుకుంది? బుజ్జమ్మ-శ్రీనుల ప్రేమ కథ ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..అమ్మవారి గుడిలో గుప్త నిధులు.. వాటిని సొంతం చేసుకునేందుకు కొంతమంది ప్రయత్నించడం.. దైవ శక్తి-దుష్ట శక్తుల మధ్య పోరాటం..ఈ కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ‘ఆదిపర్వం’సినిమా కూడా ఆ కోవలోకి చెందిన చిత్రమే. అప్పట్లో ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేసి నిధులు దొంగిలించే ఘటనలకు కొంత ఫిక్షన్‌ను మిక్స్ చేసి తెరకెక్కించారు. ఈ పీరియాడిక్ డ్రామా సినిమాలో అమ్మవారి ఆధ్యాత్మికతకు, స్థానిక రాయలసీమ సంస్కృతికి, యాసకు ప్రాధాన్యత ఇచ్చారు.ఒక పీరియాడిక్ కథని ఫాంటసీతో మేళవించి రాయలసీమ నేపథ్యంలో చక్కగా చూపించారు. ఆలయాల పట్ల ఉన్న గౌరవాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని గుర్తుచేస్తూ, ఈ చిత్రం ఆధ్యాత్మికతను, ధైర్యాన్ని ప్రతిబింబిస్తుంది. కథలొని ట్విస్ట్ లు బాగున్నాయి. కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్ బాగా కుదిరింది. అయితే దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌తో పాటు కథనం కూడా రొటీన్గాన సాగడంతో పాత మూవీ చూసిన ఫీలింగే కలుగుతుంది.ఎవరెలా చేశారంటే..మంచు లక్ష్మి తన నటనతో సినిమా స్థాయిని పెంచారు. కొన్ని సీన్లలో పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. అదిత్య ఓం కీలక పాత్రలో కనిపించగా, ఎస్తేర్ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లో ఆకట్టుకున్నారు. అలాగే, బెంగాలి నటి శ్రీజిత ఘోష్, సుహాసినీ ("చంటిగాడు" ఫేం) కూడా కథలో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారు. ఈవెనింగ్ సినిమాలో హీరో, హీరోయిన్ అనే ప్రత్యేక పాత్రలు లేకుండా, ప్రతి పాత్ర కూడా కథలో భాగంగా ఉంటుంది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. తక్కువ బడ్జెట్ మూవీయే అయినా గ్రాఫిక్స్ బాగా కుదిరింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
‘ఆదిపర్వం’ మూవీ ప్రీ రిలీజ్ ఫోటోలు
-
అందుకే మంచు లక్ష్మిని తీసుకున్నా: ‘ఆదిపర్వం’ డైరెక్టర్
1974-90 మధ్య కాలంలో జరిగిన యదార్థ ఘటనల నేపథ్యంలో ‘ఆదిపర్వం’ చిత్రాన్ని తెరకెక్కించాం. అప్పట్లో నిధి నిక్షేపాల కోసం గుడులలో విగ్రహాలు ధ్వంసం చేసేవారు. ఆ ఘటనలకు ఫిక్షన్ యాడ్ చేసి ఈ చిత్రంలో చూపిస్తున్నా. అమ్మోరు, అరుంధతి చిత్రాల తరహాలో ‘ఆదిపర్వం’ ఉంటుంది’అని అన్నారు దర్శకుడు సంజీవ్ మేగోటి. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఆదిపర్వం’. ఈ సినిమాలో మంచు లక్ష్మి, ఎస్తేర్, శివ కంఠమనేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరో కీలక పాత్రను ఆదిత్య ఓం పోషిస్తున్నారు. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు సంజీవ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి. చిన్నప్పుడు పద్య నాటకాలు చూసేవాడిని. ఇంట్లో ఉన్న పెడల్ హార్మోనియం వాయించేవాడిని. అలా మ్యూజిక్ పట్ల చిన్నప్పుడే అవగాహన ఏర్పడింది. రచన, సంగీత జ్ఞానం చిత్ర పరిశ్రమలో నా కెరీర్ కు ఉపయోగపడ్డాయి.⇢ 1994 లో మధు ఫిలిం ఇనిస్టిట్యూట్ లో స్టూడెంట్స్ చేరడం ద్వారా చిత్ర పరిశ్రమలో నా జర్నీ మొదలైంది. 1995లో ప్రొడ్యూసర్ గా ఒక సినిమా చేశాను. నాకు అప్పుడు 21 ఏళ్లు. 97లో సింధూరం సినిమా చూసి రవితేజను కలిసి నువ్వు పెద్ద హీరో అవుతావు అని చెప్పి అడ్వాన్స్ ఇచ్చి కథ చెప్పాను. ఆ మూవీ పలు కారణాలతో పట్టాలెక్కలేదు. 14 సినిమాలకు మ్యూజిక్ చేశాను, తమిళ, తెలుగు, కన్నడ కలిపి 10 సినిమాలకు డైరెక్షన్ చేశాను. 42 సీరియల్స్ కు స్క్రిప్ట్ రాశాను. కొన్ని సినిమాలకు మ్యూజిక్ చేశాను. సీరియల్స్, సినిమాల్లో నటించాను. ఇలా నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, లిరిసిస్ట్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా నా జర్నీ కొనసాగుతోంది.⇢ "ఆదిపర్వం" సినిమా నా రీఎంట్రీ మూవీ అనుకోవచ్చు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలో ఈ నెల 8వ తేదీన రిలీజ్ చేస్తున్నాం. రాయలసీమ కడప దగ్గరలోని ఎర్రగుడి నేపథ్యంగా అమ్మవారి సినిమాగా "ఆదిపర్వం" రూపొందించాను. గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఇచ్చాం. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూసి గ్రాఫిక్స్ తో చేసినవి అని గుర్తుపట్టరు. మాకున్న బడ్జెట్ లో క్వాలిటీ గ్రాఫిక్స్ చేయించాం. 11 నెలలు సీజీ కోసమే వర్క్ చేశాం. మొత్తం మూవీ చేయడానికి ఏడాదిన్నర టైమ్ పట్టింది.⇢ ఆదిపర్వం సినిమాలో మంచు లక్ష్మి కీ రోల్ చేస్తున్నారు. ఆమె నెగిటివ్ గా, పాజిటివ్ గా రెండు షేడ్స్ లో మెప్పించగలరు. యాక్షన్ చేయగలరు. అందుకే ఈ సినిమాలో ఆమెను తీసుకున్నాం. మంచు లక్ష్మి షూటింగ్ టైమ్ లో మాకు ఎంతో కోపరేట్ చేశారు. ఆదిత్య ఓం మరో ప్రధాన పాత్రలో కనిపిస్తారు. ఎస్తేర్ ఒక మంచి పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ లో నటించారు. అలాగే మలయాళ నటి శ్రీజిత ఘోష్, చంటిగాడు ఫేం సుహాసినీ కథలో ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ చేశారు. ఈ మూవీలో హీరో హీరోయిన్స్ అంటూ ప్రత్యేకంగా ఉండరు. అందరూ కథలో భాగంగా ఉంటారు.⇢ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా "ఆదిపర్వం" థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. మంచు లక్ష్మి గారితో సహా ప్రతి పాత్రను కొత్తగా స్క్రీన్ మీద చూస్తారు. కన్నడలో మంచి రిలీజ్ దొరికింది. అక్కడ మేము పబ్లిసిటీ చేయలేదు అయితే దర్శకుడిగా నాకు కన్నడలో మంచి పేరుంది. అక్కడ సక్సెస్ పుల్ సినిమాలు తీశాను. దాంతో "ఆదిపర్వం" సినిమా కన్నడలో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.⇢ ప్రస్తుతం సర్పయాగం అనే సినిమా డైరెక్ట్ చేస్తున్నాను. మరో వెబ్ సిరీస్ కు సంప్రదింపులు జరుగుతున్నాయి. -
బాలీవుడ్ ని వదిలి తెలుగు ప్రజలకోసమే బిగ్ బాస్ కి వచ్చా..
-
మణికంఠపై రెచ్చిపోయిన ఆదిత్య.. దగ్గరుంటే కొట్టేసేవాడేమో!
బిగ్‌బాస్ 8 మరీ చప్పగా సాగుతోంది. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి ఆదిత్య ఓంని బయటకు పంపేశారు. ఆదివారం కూడా నైనిక ఎలిమినేట్ కాబోతుందని చెబుతున్నారు. అలానే 'రీలోడెడ్' పేరుతో స్పెషల్ ఎపిసోడ్ ఆదివారం టెలికాస్ట్ కానుంది. మరోవైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఆదివారమే ఉన్నాయి.సరే ఇదంతా పక్కనబెడితే వారం మధ్యలో ఎలిమినేట్ అయి బయటకొచ్చిన ఆదిత్యని బిగ్‌బాస్ బజ్ కోసం అర్జున్ ఇంటర్వ్యూ చేశాడు. పలు విషయాల్ని చర్చించుకున్నారు. హౌస్‌లో ఉన్న నాలుగు వారాల జర్నీ గురించి ఏం చెబుతారని ఆదిత్యని అడగ్గా.. అది పెద్ద సైకాలజీ, మెంటల్ టెస్ట్ అని చెప్పుకొచ్చాడు. మరి అందులో పాసయ్యారా అంటే సమాధానం చెప్పలేకపోయిన ఆదిత్య నవ్వి తప్పించుకున్నాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోనే ది బెస్ట్... సలార్, కేజీఎఫ్‌కి బాబు లాంటి సినిమా)ఇక హౌస్‌లో గొడవల గురించి కూడా మాట్లాడిన ఆదిత్య.. కావాలని గొడవ పడుతున్న వాళ్లు, యాక్ట్ చేస్తున్న వాళ్లు చాలామందే ఉన్నారని చెప్పుకొచ్చాడు. గొడవలు పడే కంటెంటే ముఖ్యమని వాళ్లు అనుకుంటున్నారని ఆదిత్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక మణికంఠపై ఫుల్ ఫైర్ అయిపోయాడు. మనిషివా జంతువువా అని పట్టరాని కోపాన్ని ప్రదర్శించాడు.'మణికంఠ.. అసలు నువ్వు మనిషివా జంతువా? ఎన్నిసార్లు మీ దగ్గరు వచ్చి చెప్పాను మీకు, కరెక్ట్ సలహా ఇచ్చాను. కానీ ప్రతిసారీ నేను ఇచ్చిన సలహా సరిగా తీసుకోలేదు. ఎప్పుడు నేర్చుకుంటారు లైఫ్‌లో? అసలు బుర్ర ఉందా మీకు?' అని ఆదిత్య తెగ ఫైర్ అయిపోయాడు. ఒకవేళ మణికంఠ దగ్గరుంటే కొట్టేసేవాడేమో అన్నంతగా ఆవేశపడిపోయాడు.(ఇదీ చదవండి: ‘బిగ్‌బాస్’ ఫేం శుభశ్రీకి యాక్సిడెంట్.. తుక్కుతుక్కైన కారు) -
టాటూ సీక్రెట్ బయటపెట్టిన యష్మి.. మణికంఠ సింపతీ డ్రామాలొద్దు!
వైల్డ్‌కార్డులు లేకుండా ఈరోజే లాస్ట్డే.. రేపు ఈ సమయానికల్లా ఎనిమిది మంది మాజీలు హౌస్‌లో తిష్ట వేస్తారు. సింపతీ ఏడుపులు వద్దంటూ నాగార్జున నాగమణికంఠకు క్లాసు పీకాడు. ఇదే మంచి తరుణమని హౌస్మేట్స్ అంతా కూడా మణిపైనే పడ్డారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగిందో తెలియాలంటే నేటి(అక్టోబర్ 5) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..మణికంఠకు క్లాస్ పీకిన నాగ్నాగార్జున వచ్చీరావడంతోనే సింపతీకి ఫుల్స్టాప్ పెట్టమని మణికంఠకు గట్టిగా క్లాస్ పీకాడు. ఎంత బాధున్నా ఇప్పుడే ఏడ్చేసేయ్, కానీ తర్వాత మాత్రం ఏడవడానికి వీల్లేదన్నాడు. అయినా మణి కంట నుంచి ఒక్క నీటి చుక్క కూడా రాలేదు. దీంతో నాగ్.. నీ భార్య నీదగ్గరకు రానంటే ఏం చేస్తావ్? నీకు ఫుడ్ పంపించింది కూడా నీ భార్య కాదు ఫ్రెండ్ రాహుల్ అని చెప్పడంతో మణి ఏడ్చేశాడు. ఇంకా ఎన్నాళ్లు ఇలా ఏడుస్తూ సింపతీ కోరుకుంటావని తిట్టాడు.ఫైర్? అదెలా ఉంటుంది సర్?మణికి ఈ రేంజ్లో క్లాస్ పీకడంతో హౌస్మేట్స్ అంతా కూడా అతడి మీదే పడ్డారు. మొదటగా ప్రేరణ.. మణి అందరూ తన గురించే ఆలోచించాలనుకుంటాడంది. విష్ణుప్రియ, పృథ్వీ కూడా అతడిని సెల్ఫిష్ అనేశారు. ఈ సందర్భంగా నాగ్.. విష్ణుప్రియలో ఫైర్ చూడాలనుందనగా.. అదెలా ఉంటుంది సర్? అని అమాయకంగా ముఖం పెట్టి అడిగింది విష్ణు. దీంతో నాగార్జున మారు మాట్లాడలేక తన నోటికి తాళం వేసుకున్నాడు. ప్రేరణను సెల్ఫిష్ అనేసిన యష్మినబీల్ వంతురాగా.. తాను గెలిచినప్పుడు యష్మి జెలసీతో ఏడ్చేసిందన్నాడు. యష్మి మళ్లీ మణి దగ్గరకే వచ్చి అతడు ప్రవర్తన అన్నోయింగ్గా అనిపిస్తుందంది. అలాగే ప్రేరణ సెల్ఫిష్‌గా అనిపిస్తోందని అభిప్రాయపడింది. నాగ్ మాత్రం.. ప్రేరణ గేమ్ అద్భుతంగా ఆడుతుందని మెచ్చుకున్నాడు. ఇక యష్మికి తండ్రి పంపిన మెసేజ్ చెప్తానన్నాడు నాగ్. కాకపోతే ఏదైనా సీక్రెట్ చెప్పాలని షరతు విధించాడు. మోసపోయిన యష్మిదీంతో యష్మి ఓపెన్ అవుతూ.. కాలేజీలో ఒకర్ని ప్రేమించాను.. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని మా ఇద్దరి పేర్ల మొదటి అక్షరాలను చైనీస్ భాషలో పచ్చబొట్టు వేయించుకున్నాను. తర్వాత తెలిసిందేంటంటే.. ఇది జపనీస్ భాష అంట.. పైగా ఈ అక్షరాలకు అసలు అర్థమే లేదంటూ తను మోసపోయిన విషయం బయటపెట్టింది. సీక్రెట్ బయటపెట్టిన యష్మికి తండ్రి పంపిన మెసేజ్‌ను తెలియజేశాడు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది, వారియర్‌లా పోరాడు, మిస్ అవుతున్నానని సందేశం పంపాడన్నాడు. మణికంఠ కన్నీళ్లుసీతకు ఈర్ష్య ఉందని పృథ్వీ, ప్రేరణ అభిప్రాయపడ్డారు. మణి కన్నింగ్ అని నిఖిల్, మణి టాక్సిక్ అని నైనిక పేర్కొన్నారు. మణికంఠ వంతు వచ్చేసరికి.. ఎవరినీ జడ్జ్ చేసే పరిస్థితిలో లేనంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. గేమ్ ఆడాల్సిందే అని నాగ్ గద్దించడంతో సీతకు జెలసీ ఉందన్నాడు. నేను ఎలా సేవ్ అవుతున్నానో అర్థం కావడం లేదనేసిందని చెప్పాడు. కిచెన్‌లో ప్రేరణ ప్రవర్తించిన తీరు నచ్చలేదన్నాడు. ఈరోజు ఎపిసోడ్లో నిఖిల్, నబీల్ను సేవ్ చేశారు.ఆ నలుగురికీ ఆదిత్య పంచ్తర్వాత వారం మధ్యలోనే ఎలిమినేట్ అయిన ఆదిత్యను స్టేజీపైకి పిలిచి జర్నీ చూపించాడు. అతడితో హగ్ అండ్ పంచ్ గేమ్ ఆడించాడు. నబీల్, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, ప్రేరణ, నిఖిల్‌కు హగ్స్ ఇచ్చిన ఆదిత్య.. యష్మి, నైనిక, సీత, నాగమణికంఠకు పంచ్ ఇచ్చాడు. ఒక్కవారమైనా ఏ గొడవా లేకుండా ఆడమని మణికి సలహా ఇచ్చాడు. ఇక పుట్టినరోజునాడే ఆదిత్య బిగ్‌బాస్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ ద్వారా ఆదిత్య ఎంత సంపాదించాడంటే?
బిగ్‌బాస్ ఎనిమిదవ సీజన్లో ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అన్నారు కానీ హౌస్మేట్ల గిల్లికజ్జాలు, సోదిముచ్చట్లు చూస్తుంటే ప్రేక్షకులకు కూడా అసహనం, చిరాకు అన్‌లిమిటెడ్‌గానే వస్తోంది. నెల రోజుల్లోనే మొహం మొత్తేస్తే కష్టమని భావించిన బిగ్‌బాస్ టీమ్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీలను దింపుతోంది. ఎనిమిది మందిని హౌస్‌లోకి ఒకేసారి పంపించనుంది.ఆదిత్య ఓం అవుట్ఇందుకోసం పెద్దగా కంటెంట్ ఇవ్వని కంటెస్టెంట్లను డబుల్ ఎలిమినేషన్ ద్వారా బయటకు పంపించేయాలని ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతున్న మంచి మనిషి ఆదిత్య ఓంను వారం మధ్యలోనే ఎలిమినేట్ చేసేశారు. ఈయన నాలుగున్నర వారాలపాటు హౌస్‌లో ఉన్నాడు.ఎంత సంపాదించాడంటే?హీరోగా జనాలకు సుపరిచితుడైన ఆదిత్యను ఈ షోకి తీసుకువచ్చేందుకు భారీగానే ఆఫర్ చేశారట! వారానికి రూ.3 లక్షల పారితోషికం ఇచ్చారట! ఈ లెక్కన నాలుగున్నర వారాలకుగానూ దాదాపు రూ.14 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన బేబక్క, బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల కంటే కూడా ఆదిత్యే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్నట్లు భోగట్టా!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేరణపై విషం కక్కిన యష్మి, ఆదిత్యను దగ్గరుండి సాగనంపారు!
బిగ్‌బాస్ హౌస్‌కు కొత్త చీఫ్ సెలక్ట్ అయ్యాడు. ఓరుగల్లు పిలగాడు నబీల్ అఫ్రిది చీఫ్ పోస్ట్ దక్కించుకున్నాడు. అలాగే నాగార్జున చెప్పినట్లు మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా జరిగింది. అందరూ ఊహించినట్లుగానే ఆదిత్య ఓంను బయటకు పంపించారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 3) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..పోరాడి ఓడిన ప్రేరణహ్యాపీ పప్పీ టాస్క్‌లో నబీల్, ఆదిత్య, ప్రేరణ, నిఖిల్ మాత్రమే మిగిలారు. ఎలాగైనా చీఫ్ అవ్వాలని ప్రేరణ చివరిదాకా ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోయింది. అందరినీ వెనక్కు నెట్టి చివరకు నబీల్ చీఫ్ కంటెండర్‌గా నిలిచాడు. చేతిదాకా వచ్చిన అవకాశం చేజారిపోయిందని ప్రేరణ కన్నీళ్లు పెట్టుకుంది. పృథ్వీ, నబీల్‌లకు బిగ్‌బాస్ 'రాజయ్యేది ఎవరు?' అన్న టాస్క్ ఇచ్చాడు. ఇందులో పృథ్వీ మొదటగా టాస్క్ పూర్తి చేశాడు. కానీ చిన్న పొరపాటు చేయడంతో ఓడిపోయాడు.ఫ్రెండ్ అని ఊరుకున్నా..ఆలస్యంగానైనా నబీల్ గెలిచి మెగా చీఫ్‌గా నిలిచాడు. పృథ్వీ గెలవనందుకు యష్మి ఏడ్చేసింది. సంచాలకురాలిగా ప్రేరణ.. నబీల్‌కే ఫేవర్ చేసిందని ఆరోపించింది, అతడే గెలవాలని తన మనసులో ఉందంటూ ఏవేవో నిందలు వేసింది. ఫ్రెండ్ అని సైలెంట్‌గా ఊరుకుంటున్నాను, లేకపోయుంటే మాత్రం వదిలేసేదాన్నే కాదని నిఖిల్, పృథ్వీ దగ్గర ఫైర్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రేరణ కనిపిస్తే కూడా.. పృథ్వీ మిస్టేక్ చేసినప్పుడు సరిచేయొచ్చు కదా అని నిలదీసింది. సంచాలకురాలిగా ఉన్నప్పుడు ఎవరికీ సాయం చేయనని ప్రేరణ మొహం మీదే చెప్పేసింది.లేడీస్ గ్యాంగ్ ఏడుపురాత్రిపూట బిగ్‌బాస్ మిడ్‌వీక్ ఎలిమినేషన్ అంటూ బాంబు పేల్చాడు. నామినేషన్లో ఉన్నవారిలో నిఖిల్, నబీల్, మణికంఠ.. ఈరోజుకైతే సేఫ్ అని తెలిపాడు. విష్ణుప్రియ, ఆదిత్య, నైనికలలో ఒకరు ఈరోజు బిగ్‌బాస్ నుంచి వెళ్లిపోతారని పేర్కొన్నాడు. దీంతో నైనిక ఏడుపందుకుంది. వాళ్లను చూసి సీత సైతం కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తర్వాత బిగ్‌బాస్.. ఆదిత్య, నైనిక, విష్ణుప్రియను వరుసగా నిల్చోబెట్టి.. వీరిలో ఎవరు ఈరోజు వెళ్లిపోతారని భావిస్తున్నారో చెప్పాలని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు.ఆదిత్య ఎలిమినేట్కొన్ని విషయాల్లో ఆదిత్య వెనకబడుతున్నాడని, అతడు ఎలిమినేట్ అవుతాడని నిఖిల్ అభిప్రాయపడ్డాడు. మణికంఠ, సీత, యష్మి సైతం.. ఆదిత్య వెళ్లిపోతాడని భావించారు. నబీల్ వంతురాగా.. మాటలు జారిన విష్ణుప్రియ హౌస్ నుంచి వెళ్లిపోవచ్చేమోనని గెస్ చేశాడు. ప్రేరణ, పృథ్వీ.. నైనిక వెళ్లిపోతుందేమోనని అభిప్రాయపడ్డారు. చివర్లో బిగ్‌బాస్.. ప్రేక్షకుల ఓట్ల ప్రకారం ఆదిత్య ఎలిమినేట్ అయ్యాడని ప్రకటించాడు. దీంతో ఎప్పటిలాగే ఆదిత్య అందరికీ ఓ ఫ్లయింగ్ కిస్ వదిలి హౌస్ నుంచి నిష్క్రమించాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఆదిత్య ఔట్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఈ వారం ఒక ట్విస్ట్ ఉంటుందని నాగార్జున ఇప్పటికే చెప్పారు. ఈ క్రమంలోనే గురువారం హౌస్ నుంచి ఒకరు ఎలిమినేషన్ కానున్నారు. అనంతరం మరికొందరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో బిగ్‌బాస్ హౌస్‌లోకి రానున్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా హౌస్ నుంచి ఎవరు ఇంటిబాట పడుతారోనని ఫ్యాన్స్ ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.సోమవారం రోజు నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ భారీగానే ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు అన్ అఫీషియల్ పోలింగ్స్ను పరిశీలిస్తే.. నబీల్ ఎక్కువ ఓట్లతో టాప్‌లో ఉన్నాడు. తర్వాత నిఖిల్, విష్ణుప్రియ ముందంజలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మణికంఠ, ఆదిత్య, నైనిక ఉన్నారు. అయితే, నైనిక, ఆదిత్యలకు మధ్య ఓటింగ్ విషయంలో స్వల్ప తేడా మాత్రమే ఉంది. కానీ, తాజాగా విడుదలైన బిగ్‌బాస్ ప్రోమోలో ఆదిత్య, నైనిక, విష్ణుప్రియలు డైంజర్ జోన్లో ఉన్నట్లు కనిపిస్తోంది. గురువారం ఈ ముగ్గిరిలో ఒకరు మిడ్ వీక్ ఎలిమినేషన్ కావచ్చని సమాచారం. అయితే, ఎక్కువమంది అభిప్రాయం ప్రకారం మిడ్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా ఆదిత్య హౌస్ నుంచి బయటకు రావచ్చని అంచనా వేస్తున్నారు. కానీ, ఆయన్ను సీక్రెట్ రూమ్‌కు పంపించే ఛాన్స్ ఎక్కువగా ఉందని ప్రచారం జరగుతుంది. -
ఆదిత్య పిచ్చిపని.. బిగ్‌బాస్ వార్నింగ్.. నిజం ఒప్పుకున్న విష్ణు
ఈ రోజు నామినేషన్స్‌లో అంత ఫైర్ ఏం కనిపించలేదు. కారణాలు వెతుక్కుని మరీ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నట్లు కనిపించింది. మెజారిటీ సభ్యులు నాగమణికంఠపైనే పడ్డారు. యష్మి.. నిఖిల్ టీమ్‌కు షిఫ్ట్ అయినట్లు కనిపిస్తోంది. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 30) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..అలా వెళ్లి ఇలా వచ్చేశాడుఈ సీజన్లో జైల్లో అడుగుపెట్టిన మొదటి వ్యక్తిగా నాగమణికంఠ నిలిచాడు. అయితే కాసేపటికే అతడిని బయటకు పంపించి నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. నామినేట్ చేయాలనుకున్న వ్యక్తుల ఫోటోలను మంటలో వేయాలన్నాడు. మొదటగా నాగమణికంఠ మాట్లాడుతూ.. మొదటి వీక్‌లో ఉన్నంత స్ట్రాంగ్‌గా ఇప్పుడు లేవంటూ నైనికను నామినేట్ చేశాడు. తనపై జోకులు వేయడం నచ్చలేదంటూ యష్మి ఫోటోను మంటల్లో వేశాడు.నామినేషన్స్తర్వాత నైనిక..నబీల్, విష్ణుప్రియను; సీత.. మణికంఠ, విష్ణుప్రియను; నబీల్.. నైనిక, విష్ణుప్రియను నామినేట్ చేశారు. ఈ సందర్భంగా విష్ణు.. నేను అనుకున్నంత ఈజీగా ఈ జర్నీ లేదు. నేను ప్రతిరోజు బెస్ట్ ఇవ్వలేను.. కానీ ట్రై చేస్తాను అంటూ తను పెద్దగా ఆడలేదన్న విషయాన్ని ఒప్పేసుకుంది. ఆదిత్య ఓం.. నీ నిర్ణయాలు నువ్వే తీసుకుంటే బాగుంటుందని నైనిక ఫోటోను అగ్నిలో వేశాడు. ఆచితూచి మాట్లాడంటూ విష్ణును నామినేట్ చేశాడు.నీకే నోటిదురుసునిఖిల్ వంతురాగా.. నువ్వు చేసే కామెడీ ఎదుటివారిని బాధపెట్టేలా ఉండకూడదు అని విష్ణును నామినేట్ చేశాడు. అప్పుడు విష్ణు.. నాకన్నా నీకే పెద్ద నోటిదూల, అలాంటిది నువ్వు వచ్చి చెప్తున్నావా? అని సెటైర్లు వేయడంతో లేడీ గ్యాంగ్ ఫక్కుమని నవ్వింది. సింపతీ గేమ్ ఆడుతున్నావంటూ నాగమణిని నామినేట్ చేశాడు. తర్వాత ప్రేరణ.. త్యాగం చేయడం తప్పు అంటూ మణి ఫోటోను మంటల్లో వేసింది. మీలో కాన్ఫిడెన్స్ సన్నగిల్లుతోందంటూ ఆదిత్యను నామినేట్ చేసింది. ఆవేశపడ్డ ఆదిత్యఆమె మాటలతో ఆవేశపడ్డ ఆదిత్య.. మంటల్లో చేయి పెట్టి తన ఫోటోను బయటకుతీస్తూ ఇదీ నా కాన్ఫిడెన్స్ అన్నాడు. దీంతో బిగ్‌బాస్.. మంటల్లో చేయి పెట్టడం ఆటలా? అని క్లాస్ పీకడంతో ఆదిత్య క్షమించమని కోరాడు. తర్వాత విష్ణుప్రియ.. నీ పర్ఫామెన్స్ ఇంకా మెరుగవ్వాలంటూ నైనికను నామినేట్ చేసింది. సంచాలకుడిగా సరిగా వ్యవహరించలేదంటూ నబీల్ ఫోటోను మంటల్లో వేసింది. మాట మార్చావ్..యష్మి.. మణికంఠను నామినేట్ చేస్తూ నువ్వు ఎలా సేవ్ అవుతున్నావో అర్థం కావట్లేదు... నువ్వు నా ఫ్రెండ్ కానందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ సమయంలో మణి, యష్మి.. చాలాసేపు వాదులాడుకున్నారు. అనంతరం యష్మి.. మీలో క్లారిటీ మిస్ అయినట్లు అనిపిస్తోందని ఆదిత్య ఫోటోను మంటల్లో వేసింది. పృథ్వీ.. నైనికను నామినేట్ చేశాడు. నాలుగు గోడల దగ్గర త్యాగం చేశానని చెప్పి అందరిముందు త్యాగం చేయలేదని మాట మార్చావంటూ మణికంఠను నామినేట్ చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ కాసేపు గొడవపడ్డారు. నామినేషన్స్‌లో ఎవరంటే?చివర్లో హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్ సూపర్ పవర్ ఇచ్చాడు. ఇద్దరు చీఫ్స్‌లో ఒకరిని నామినేట్ చేయొచ్చన్నాడు. యష్మి, పృథ్వీ మినహా మిగతా అందరూ సీతను సేవ్ చేయడానికే మొగ్గు చూపడంతో నిఖిల్ నామినేషన్లోకి వచ్చాడు. అలా ఈ వారం నిఖిల్, విష్ణుప్రియ, నైనిక, నాగమణికంఠ, ఆదిత్య, నబీల్ నామినేషన్లో ఉన్నారు.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'నీకే నోటిదూల'.. కోపంతో మంటల్లో చేయి పెట్టిన ఆదిత్య!
గమ్యం లేకుండా ఆట ఆడుతున్న కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా? అంటే విష్ణుప్రియ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. ఆదిత్య కూడా అసలు హౌస్‌లో ఉన్నాడా? లేడా? అన్నట్లుగానే ఉన్నాడు కానీ తనకు ఈ షో అవసరమని ఒకానొక సందర్భంలో చెప్పాడు.గేమ్‌ను లైట్ తీసుకున్న విష్ణు?విష్ణుప్రియ మాత్రం అవసరం కాదుకదా టైం పాస్ అన్నట్లుగా గేమ్‌ను లైట్ తీసుకుంటోంది.. పృథ్వీతో లవ్ యాంగిల్ ట్రై చేస్తూ గేమ్‌ను పక్కన పడేసింది. పైగా నోటికి ఎంతొస్తే అంత వాగేస్తోంది. పతివ్రత, పుణ్యస్త్రీ వంటి పదాలు వాడిన ఆమె పోయినవారం నిఖిల్ చేతికి గాజులు, నుదుటన బొట్టు ఒక్కటే తక్కువయ్యాయంటూ దారుణంగా మాట్లాడింది.ఈయనకే నోటిదూలఇదే పాయింట్‌ను ప్రస్తావిస్తూ నిఖిల్.. విష్ణుప్రియను నామినేట్ చేశాడు. కానీ దాన్ని ఒప్పుకోని విష్ణు.. ఈయనకే పెద్ద నోటిదూల ఉంది, అయినా నా దగ్గరకు వచ్చి ఎలా చెప్తున్నాడో అర్థం కావట్లేదని నవ్వేసింది. తర్వాత నిఖిల్.. మణికంఠను నామినేట్ చేశాడు.మంటలో చేయి పెట్టిన ఆదిత్యప్రేరణ వంతు రాగా.. ఎక్కువ మంచిమాటలు చెప్పి నెగెటివ్ విషయాల్ని మాత్రం చెప్పడం లేదని ఆదిత్యను నామినేట్ చేశాడు. నాజీవితంలో ఇలాగే ఉంటాను.. వచ్చేవారం కూడా ఇలాగే ఉంటానని ఆదిత్యబదులిచ్చాడు. వచ్చేవారం దాకా హౌస్‌లోనే ఉంటావన్న నమ్మకం నీకు లేదటూ ఆదిత్య ఫోటోను మంటల్లో వేసింది. ఈ నామినేషన్‌ను ఒప్పుకోని ఆదిత్య మంటల్లో చేయి పెట్టి తన ఫోటో బయట పడేశాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈసారి ఎవరిపై వేటు?
బిగ్‌బాస్ 8 నుంచి సోనియా ఎలిమినేట్ అయిపోయింది. ఈమె బయటకొచ్చేయడంపై సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. మరోవైపు ఐదవ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున ట్విస్ట్ ఇచ్చాడు. అంటే ఈసారి రెండు వికెట్లు పడతాయనమాట. వాళ్లు ఎవరు కావొచ్చు? ఎందుకు ఇదంతా?బోరింగ్ బిగ్బాస్ఈసారితో పోలిస్తే గత సీజనే కాస్తోకూస్తో బెటర్ అనిపిస్తోంది. ఎందుకంటే ఒక్కరు కూడా సరైన కంటెంట్ ఇవ్వట్లేదు. బిగ్‌బాస్ టీమ్ కూడా ఏదో ప్రయత్నిస్తున్నారు కానీ వర్కౌట్ కావట్లేదు. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తయింది కానీ రెగ్యులర్‌గా షో చూస్తే కొందరికి తప్పితే మిగతా ప్రేక్షకులు దీనివైపే చూడట్లేదు. ఇది కాస్త బిగ్‌బాస్‌కి అర్థమైనట్లుంది. అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)ఎలిమినేట్ వేటుఈ వారం నామినేషన్స్ కూడా హోరాహోరీగానే జరిగినట్లు కనిపిస్తుంది. మంటల్లో ఫొటో వేయాలి అనే కాన్సెప్ట్‌తో ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. ఈసారి విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య ఓం, మణికంఠ, నబీల్, నిఖిల్ నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లలో ఆదిత్య, నైనికకి తప్పితే మిగిలిన వాళ్లకు కాస్తోకూస్తో ఫ్యాన్ బేస్ ఉంది. ఓట్లు కూడా బాగానే పడుతున్నాయిఆ ఇద్దరు వీళ్లేనా?అలా ఆదిత్య, నైనికలో ఒకరిని వారం మధ్యలో పంపేస్తారు. మరొకరిని వీకెండ్లో పంపించేస్తారనిపిస్తోంది. వచ్చే వారం దసరా సందర్భంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయి. అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేశారు. ఇక వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చే వాళ్లలో ముక్కు అవినాష్, హరితేజ, రోహిణి, నయని పావని, గౌతమ్ కృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి. యాంకర్ రవి కూడా ఈ లిస్టులో ఉండొచ్చని అంటున్నారు. వీటిపై క్లారిటీ రావాలంటే మరో వారం ఆగితే సరిపోద్ది.(ఇదీ చదవండి: సోనియా ఎలిమినేట్, ఏడ్చిన నిఖిల్.. చివర్లో పెద్ద ట్విస్ట్ ఇచ్చిన నాగ్!)TWIST - There is a Mid-Week Elimination this week!#BiggBossTelugu8 pic.twitter.com/yaSu22gXPx— TeluguBigg (@TeluguBigg) September 29, 2024 -
Bigg Boss 8: సోనియా ఎలిమినేట్.. ఖుషీలో నిఖిల్ ఫ్యాన్స్
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో అడుగుపెట్టిందే 14 మంది కంటెస్టెంట్లు.. అందులో బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్ వరుసగా ఎలిమినేట్ అయ్యారు. ఈ మూడువారాలు అందరూ ఊహించి కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవగా నాలుగోవారం మాత్రం ప్రేక్షకులు కోరుకున్న వ్యక్తి హౌస్ నుంచి బయటకు వచ్చేస్తున్నారట!సోనియాకే తక్కువ ఓట్లుఈ వారం ఆదిత్య ఓం, సోనియా ఆకుల, పృథ్వీ శెట్టి, ప్రేరణ, నబీల్, నాగమణికంఠ నామినేషన్లో ఉన్నారు. వీరిలో పృథ్వి, ఆదిత్య, సోనియాకు తక్కువ ఓట్లు వచ్చినట్లు భోగట్టా! ఈ ముగ్గురిలో కూడా సోనియాకే అత్యంత తక్కువ ఓట్లు పడ్డాయి. సోనియా తానే పెద్ద తోపు అని ఫీలవ్వడమే కాక నిఖిల్, పృథ్వీలను తన చేతివేళ్లపై ఆడిస్తోంది. ఈ టాలెంట్ నచ్చకనే ఆపరేషన్ సోనియా పేరిట తనను ఎలిమినేట్ చేయాలని ప్రేక్షకులు కంకణం కట్టుకున్నారు.సీక్రెట్ రూమ్?అయితే తనవల్ల అంతోఇంతో కంటెంట్ వస్తోంది కాబట్టి ఆమెను పంపించేందుకు బిగ్‌బాస్ టీమ్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కానీ చివరికి తనను ఎలిమినేట్ చేశారట! ఎలిమినేట్ చేసినట్లే చేసి సీక్రెట్ రూమ్‌లోకి పంపించే ఆస్కారం కూడా ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో పాటు తిరిగి తనను హౌస్‌లోకి అడుపెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు!బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పృథ్వీ ఆమెకు పడిపోయాడు, తనను చూస్తే భయమేస్తోంది: సోనియా
సీరియస్ టాస్క్‌లకు చెక్ పెడుతూ బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో ఫన్ గేమ్ ఆడించాడు. ఒకరి పాత్రల్లో మరొకరు దూరి మిమిక్రీ చేయాలన్నాడు. ఇంకేముంది.. హౌస్మేట్స్ దొరికిన ఛాన్స్‌ను బీభత్సంగా వాడుకున్నారు. నబీల్ అయితే నెక్ట్స్ లెవల్.. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 27) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..పృథ్వి మాయలో విష్ణుపృథ్వి, విష్ణుప్రియకు ఒకరంటే ఒకరికి ఇష్టం. నిన్న టాస్కులో కూడా పృథ్వి.. విష్ణుకోసం ప్రేమపాట పాడటం.. అది విని ఆమె పరవశించిపోవడం చూశాం. వారి ఇష్టాన్ని గ్రహించిన సోనియా.. పృథ్విగాడిని చూస్తే భయం వేస్తుంది. ఆమె (విష్ణు)కు పడిపోతున్నాడు. నాకు ఏది నిజం? ఏది అబద్ధమో తెలియదుగానీ అలా అనిపిస్తుంది అని నిఖిల్‌తో చెప్పుకొచ్చింది. అటు విష్ణుప్రియ కూడా.. తన లేడీ గ్యాంగ్‌కు పృథ్వీ అంటే ఇష్టమని చెప్పి అతడితోనే ఎంచక్కా ఉంటోంది.రేషన్ టాస్క్తర్వాత బిగ్‌బాస్ రేషన్ టాస్క్ పెట్టాడు. అందులో భాగంగా తాను వినిపించే శబ్దాలను వరుస క్రమంలో రాయాలన్నాడు. ఈ గేమ్‌లో శక్తి టీమ్ గెలవగా తమకు కూరగాయలు, పండ్లు, కూల్‌డ్రింక్ తీసుకునేందుకు ఎక్కువ గడువు దొరికింది. కాంతార టీమ్‌కు వాటిని సంపాదించుకునేందుకు తక్కువ సమయం మాత్రమే ఇచ్చారు.టీమ్ మార్చేసిన మణిఅనంతరం బిగ్‌బాస్.. గార్డెన్ ఏరియాలో ఓ బంగారు గాజును పెట్టాడు. దాన్ని ఉపయోగించుకుని వేరే టీమ్‌లోకి మారొచ్చని చెప్పాడు. నబీల్ను లాక్కోవాలని శక్తి టీమ్.. పృథ్విని లాక్కోవాలని కాంతార టీమ్ ప్రయత్నించింది. కానీ ఈ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తూ నాగమణికంఠ గోల్డెన్ బ్యాంగిల్ ధరించాడు. అలా శక్తి టీమ్‌ను వదిలేసి కాంతార టీమ్‌లో చేరాడు. అయితే కాంతార టీమ్‌లో నుంచి ఒకరిని స్వాప్ చేయాలనడంతో ఆదిత్యను శక్తి టీమ్‌కు పంపించాడు.పరకాయ ప్రవేశంతర్వాత బిగ్‌బాస్.. ఇంట్లో ఫన్ గేమ్ ఆడించాడు. ఒకరిని ఒకరు ఇమిటేట్ చేయాలన్నాడు. ప్రేరణ.. మణి పాత్రలో జీవించేసింది. ఆదిత్య.. సోనియాను అచ్చుదింపేశాడు. నబీల్.. ఆదిత్య పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. ఎవరూ తగ్గలేదు. అందరిలో నబీల్ను బెస్ట్ పర్ఫామర్‌గా ప్రకటించారు. ఇక ఈ ఇమిటేషన్ టాస్కులో నిఖిల్, సోనియా, పృథ్వీలను ఒక గ్రూపుగా పేర్కొంటూ వారిపైనే ఫోకస్ పెట్టడంతో సోనియా తెగ సంతోషపడిపోయింది. తమ ముగ్గురి గురించే హౌస్ అంతా మాట్లాడుకుంటోందని మురిసిపోయింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గోల్డెన్ ఛాన్స్‌తో మోక్షం పొందిన మణి.. పాపం ఆదిత్య!
గ్రూప్ గేమ్స్ అంటూ నిఖిల్‌ను మొదటిరోజే విమర్శించిన సోనియా.. ఇప్పుడు అతడితోనే జతకట్టి గేమ్ ఆడుతోంది. పృథ్వీ, నిఖిల్, సోనియా.. ఈ ముగ్గురూ ఓ బ్యాచ్. వీళ్ల మధ్యలోకి ఎవరూ వెళ్లలేరు. వెళ్లినా ఉండలేరు. నాగమణికంఠ విషయంలో ఇదే జరిగింది.శక్తి టీమ్‌లో ఒకరిని గేమ్ నుంచి ఎలిమినేట్ చేయాలన్నప్పుడు సోనియా, పృథ్వి, యష్మి.. మణి పేరు సూచించారు. ఆల్రెడీ ఫలితం నిర్ణయించుకున్నాక, తననే మెడపట్టి గెంటేయాలని ఫిక్సయ్యాక వాదించడం అనవసరమని మణి తనే త్యాగం చేస్తానన్నాడు. పోరాటానికి బదులు త్యాగానికే మొగ్గు చూపాడు.(ఇది చదవండి: దేవర మూవీ రివ్యూ)తానేం కావాలని త్యాగం చేయలేదని మణి అనగానే శక్తి టీమ్ ఒంటికాలిపై లేచింది. అబద్ధాలు ఆడుతున్నావంటూ మణిపై విరుచుకుపడింది. ఓరకంగా చెప్పాలంటే మెంటల్ టార్చర్ చూపించింది. నిజానికి ఈ టీమ్‌లోకి వెళ్లడం అతడికి ఇష్టమే లేదు.అయితే తాజాగా బిగ్‌బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడట. టీమ్ నుంచి స్వాప్ అయ్యే ఆప్షన్ కల్పించాడట. ఆ గోల్డెన్ బ్యాండ్ అందుకున్న మణి కాంతార టీమ్‌లోకి వెళ్లగా.. తన స్థానంలో ఆదిత్యను శక్తి టీమ్‌లో పంపించాడు. బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎవడిని కొడతానో నాకే తెలీదు.. పూనకంతో ఊగిపోయిన సోనియా
చీఫ్ పోస్ట్ పోయాక యష్మిలో చాలామార్పు వచ్చింది. ఆటలోనే కాదు మాటలోనూ రాటు తేలింది. అటు ప్రేరణ.. విష్ణుప్రియతో గొడవకు చెక్ పెడదామనుకుంటే అందుకు విష్ణు దాన్ని సాగదీసే పనిలో పడింది. మణికంఠకు హౌస్‌లో బొమ్మరిల్లు సినిమా కనిపిస్తోందట.. నామినేషన్స్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (సెప్టెంబర్ 23) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..ఆదిత్యపై సోనియా సెటైర్లుఇంట్లో ఉండటానికి అనర్హులనుకున్న వారి ముఖాలకు ఫోమ్ కొట్టి నామినేట్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. మొదటగా ఆదిత్య ఓం.. పృథ్వీని నామినేట్ చేశాడు. మైక్ పక్కనపెట్టి గుసగుసలు పెడుతున్నావ్, నీ ఫ్రెండ్ అయిన పృథ్వీ ఆవేశంతో ఉంటే తనను కూల్ చేసేందుకు ప్రయత్నించలేదని సోనియాను నామినేట్ చేశాడు. అందుకామె ఏదో ట్రై చేశావ్ కానీ ఫెయిలయ్యావ్ అని వెటకారంగా మాట్లాడింది.గొంతు పెంచితే తప్పా?నైనిక.. నేను సేఫ్ అయినప్పుడు నీ ముఖంలో సంతోషం కనిపించలేదంటూ నాగమణికంఠను నామినేట్ చేసింది. టాస్క్ సరిగా ఆడటం లేదంటూ ఆదిత్య ముఖంపై ఫోమ్ స్ప్రే చేసింది. నబీల్ వంతురాగా.. నువ్వు గట్టిగా మాట్లాడితే తప్పు లేదు కానీ నేను గట్టిగా రిప్లై ఇస్తే మాత్రం తప్పా? పైగా నీతో మాట్లాడితే నిఖిల్, పృథ్వీ నామీదకు దూసుకురావడమేంటోనని సోనియాను నామినేట్ చేశాడు. అతడు తన పాయింట్లు చెప్తున్నప్పుడు కూడా పృథ్వీ, నిఖిల్ సోనియా బాడీగార్డుల్లా నబీల్‌పై ఎగబడటం గమనార్హం. వెన్నుపోటు..తర్వాత అతడు పృథ్వీని నామినేట్ చేశాడు. అప్పుడు సోనియా మధ్యలో దూరి ఫెయిల్డ్ సంచాలక్ అంటూ పదేపదే అతడిపై ముద్ర వేసేందుకు ప్రయత్నించింది. ప్రేరణ.. నువ్వు అందరితో బాగానే ఉండి ఎప్పుడు ఎవరికి వెన్నుపోటు పొడుస్తావో తెలియడం లేదంటూ మణికంఠను నామినేట్ చేసింది. నీ గేమ్ కనిపించడం లేదంటూ నైనికను నామినేట్ చేసింది. మనిషిగా కూడా ఫెయిల్ సోనియా వంతురాగా.. సంచాలకుడిగానే కాదు ఒక మనిషిగా కూడా నువ్వు ఫెయిల్ అని నబీల్ను నామినేట్ చేసింది. అవునా, నిన్ను నామినేట్ చేసినందుకు నేను తప్పు, ఫేక్ కదా అని కౌంటరిచ్చాడు. తర్వాత ఆమె ఆదిత్య గురించి మాట్లాడుతూ.. మీ పర్ఫామెన్స్ ఏం లేదు కాబట్టి పెద్దగా పాయింట్లులేవు. ఈ వారం వెళ్తానని మీరు ఫిక్సయ్యారు కాబట్టి ప్లీజ్, వెళ్లిపోండి అని నామినేట్ చేసింది.బొమ్మరిల్లు సిద్దు సీన్ రిపీట్నాగమణికంఠ వంతురాగా.. నీ వల్ల దెబ్బలు తగులుతాయేమోనని భయంగా ఉందంటూ పృథ్వీని నామినేట్ చేశాడు. మీరు బొమ్మరిల్లు సినిమాలో ప్రకాశ్ రాజ్‌లా ఎక్కువ గైడ్ చేసేస్తున్నారు, అది వద్దంటూ ఆదిత్యకు హీరో సిద్దార్థ్లా క్లాసు పీకాడు. విష్ణుప్రియ.. నిన్నొకరు(పృథ్వీ) బూతు తిడితే సైలెంట్‌గా ఉండటం నచ్చలేదని ప్రేరణను నామినేట్ చేసింది. అతడు తిట్టింది నన్నుకాదని నాకు తెలుసు.. నువ్వు కావాలని ఇలా ప్రతీకారం తీర్చుకుటున్నావని అసలు విషయం బయటపెట్టింది. నేను వీక్ కాదు: మణిపృథ్వీ.. నబీల్, నాగమణికంఠను; సీత.. ప్రేరణ, మణికంఠను నామినేట్ చేశారు. యష్మి వంతు రాగా హౌస్‌లో నువ్వు చాలా వీక్ అంటూ మణిని నామినేట్ చేసింది. నేను వీక్ అయితే ఎప్పుడో గేట్లు తీయండని చెప్పి బయటకు వెళ్లిపోయేవాడిని అని వాదించాడు. సోనియాను నామినేట్ చేస్తూ.. నిఖిల్, పృథ్విని ఆయుధంలా వాడుకుంటున్నావ్, ఆ ఇద్దరి సపోర్ట్ లేకుండా గేమ్ ఆడితే బాగుంటుందని సలహా ఇచ్చింది. ఎవర్ని కొడతానో తెలీదుఅందుకు సోనియా.. నేను అందరికంటే అగ్రెసివ్.. నేను గ్రౌండ్లో దిగాక ఎవడిని కొడతానో నాకే తెలియదు. నా వల్ల ఎవరికీ ఇబ్బంది కావొద్దని ఆలోచించి నేను గుడ్ల దగ్గరే కూర్చున్నాను. నా గేమ్ నేను ఆడాను అని బదులిచ్చింది. ఫైనల్‌గా ఈ వారం పృథ్వి, నాగమణికంఠ, ఆదిత్య, ప్రేరణ, సోనియా, నబీల్, నైనిక నామినేట్ అయ్యారు. అయితే నిఖిల్ చీఫ్ అయినందున అతడికి ఒకర్ని సేవ్ చేసే అవకాశం ఇవ్వడంతో అతడు నైనికను సేవ్ చేశాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఇంట్లో నుంచి వెళ్లిపోమన్న సోనియా.. నామినేషన్స్ ఆరుగురు!
నీళ్ల ట్యాంకర్ దగ్గర గొడవపడ్డట్లు ఆ కొట్లాటలేంటి? ఆ మాటలేంటి? అని విష్ణుప్రియ, ప్రేరణ.. ఇద్దరికీ క్లాస్ పీకాడు నాగ్. పోయినవారం గుడ్డు దగ్గర మొదలైన వైరం గుడ్డుతోనే ముగిసిపోవాలని ఐదు ఎగ్స్ ఇచ్చి మరీ ఒకరికొకరు తినిపించుకోమన్నాడు. అప్పుడు సరేనంటూ తలూపిన వీళ్లు నామినేషన్స్ రాగానే మళ్లీ ఒరిజినల్ క్యారెక్టర్లోకి దిగిపోయారు.నబీల్ వర్సెస్ సోనియావిష్ణుప్రియ.. ప్రేరణను నామినేట్ చేయడంతో ఆమె షాకైంది. అయితే ప్రేరణ మాత్రం విష్ణును వదిలేసి నైనిక, మణికంఠలను నామినేట్ చేసింది. ఇక సోనియా.. తన యాటిట్యూడ్ చూపించింది. మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అని నబీల్‌కు ట్యాగ్ ఇచ్చింది. అటు ఆదిత్య ఓంను నామినేట్ చేస్తూ.. మీరేం పర్ఫామెన్స్ ఇవ్వలేదు కాబట్టి చెప్పడానికి పెద్దగా పాయింట్లు కూడా లేవంది.వెళ్తాననుకున్నారుగా.. వెళ్లిపోండిఎలాగో ఈవారం వెళ్తాననుకున్నారు కదా.. కాబట్టి ఈ హౌస్ నుంచి వెళ్లిపోండి అని ఆదిత్య ముఖం మీదే చెప్పింది. మొత్తానికి ఈ వారం ప్రేరణ, నబీల్, ఆదిత్య, సోనియా, పృథ్వి, మణి ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. నిజానికి నైనిక కూడా నామినేషన్లో ఉండాల్సింది కానీ తనను నిఖిల్ సేవ్ చేసినట్లు తెలుస్తోంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రభావతి మళ్లీ వచ్చింది.. అప్పుడు సన్నీ అలా, ఇప్పుడు పృథ్వీ ఇలా!
మీకు ప్రభావతి గుర్తుందా? అదేనండి.. బిగ్‌బాస్ హౌస్‌లో రచ్చలేపిన కోడి. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో బంగారు కోడి పెట్ట అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ జరిగింది. అందులో ప్రభావతి అనే కోడి కూత పెట్టి గుడ్లు పెడితే వాటిని కంటెస్టెంట్లు అందుకోవాలి. అంతేకాదు, ఆ గుడ్లను ఎవరూ ఎత్తుకుపోకుండా భద్రంగా తమ బుట్టలో దాచుకోవాలి. అప్పుడు సన్నీ దాచిన గుడ్లను నటి ప్రియ దొంగిలించడం.. ఇద్దరికీ మాటామాటా పెరగడం.. ప్రియ ఏకంగా సన్నీని చెంప పగలగొడతానని తిట్టడం అందరికీ గుర్తుండే ఉంటుంది.ఆవేశంతో ఊగిపోయిన పృథ్వీఇలా కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టిన ఈ టాస్క్ ఈ సీజన్లో పునఃప్రత్యక్షమైంది. ఇంకేముంది, యాంగ్రీబర్డ్ పృథ్వీ ఆవేశంతో ఊగిపోయాడు. తన టీమ్ గుడ్లను కాపాడుకునే క్రమంలో ఒక్కొక్కరినీ ఎత్తిపడేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదిత్యను నెట్టేయడంతో అతడు గొడవకు దిగాడు. ఎవరికీ దెబ్బలు తగలొద్దు అంటే టాస్కే పెట్టొద్దని బిగ్‌బాస్‌కు చెప్పండని ఫైర్ అయింది యష్మి. మరి శక్తి, కాంతార టీమ్స్ ఈ గేమ్ ఎలా ఆడతాయో చూడాలి! -
బాషాకు మూకుమ్మడిగా అన్యాయం.. బ్రేకప్ స్టోరీ చెప్పిన సీత
బయట జనాలు చూస్తున్నారు, చూస్తున్నారు అంటూ విష్ణుప్రియ విషయంలో జాగ్రత్తగా ఉండమని నాగార్జున సోనియాకు బాగానే హింట్లు ఇచ్చాడు. ఆటలో చివర్లో ఉంటుందేమో కానీ ఇలాంటివి క్యాచ్ చేయడంలో ముందుండే సోనియా నేడు మొత్తం విష్ణుప్రియ పక్కనే కూర్చుంది. అంటే అప్పుడే స్నేహం మొదలెట్టేసిందన్నమాట! అటు శేఖర్ బాషాను అన్యాయంగా ఎలిమినేట్ చేశారు. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో నేటి (సెప్టెంబర్ 15) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..నిఖిల్‌కు నా గైడెన్స్ అవసరం: సోనియాసోనియా పాటతో ఫండే ఎపిసోడ్ మొదలైంది. తర్వాత హౌస్‌ను రెండు టీములుగా విడగొట్టే పనికి పూనుకున్నాడు నాగ్. నిఖిల్, అభయ్ టీమ్స్‌లోకి ఎవరు వెళ్లాలనుకుంటున్నారో చెప్పాలని హౌస్‌మేట్స్‌ను అడిగాడు. అలా సీత, మణికంఠ, విష్ణుప్రియ, పృథ్వీ, సోనియా.. నిఖిల్ టీమ్‌ను ఎంచుకున్నారు. ఈ క్రమంలో సోనియా.. నా అవసరం, నా గైడెన్స్ నిఖిల్‌కు ఎక్కువ అవసరం అంటూ తన గురించి గొప్పగా చెప్పుకుంది. హౌస్‌లోనే టాప్ పర్ఫామర్ అయిన నిఖిల్‌కు ఇంతవరకు ఏ గేమ్‌లోనూ గెలవని సోనియా.. గైడెన్స్ ఇస్తాననడం కాస్త విడ్డూరంగా అనిపించకమానదు. విష్ణుప్రియతో గొడవలకు ఫుల్స్టాప్!అభయ్ టీమ్‌లో యష్మి, ప్రేరణ, ఆదిత్య, నబీల్, మణికంఠ ఉన్నారు. అభయ్ టీమ్‌కు కాంతార, నిఖిల్ టీమ్‌కు శక్తి అన్న పేర్లు ఫిక్స్ చేశారు. అనంతరం విష్ణుప్రియ సేవ్ అయినట్లు ప్రకటించడంతో సోనియా వెళ్లి ఆమెను హగ్ చేసుకుంది. నాగ్ ఇచ్చిన హింట్లను బాగానే తలకు ఎక్కించుకుందని చూసేవారికి ఇట్లే అర్థమైపోయింది. తర్వాత శక్తి, కాంతారల టీమ్స్‌తో సరదా గేమ్ ఆడించారు. ఇందులో రెండు టీమ్స్‌కు టై అయింది. దీంతో ఎవరైనా తన బ్రేకప్ స్టోరీ చెప్తే వారికి ఎక్స్ట్రా పాయింట్ ఇస్తానన్నాడు నాగ్. అలా అన్నాడో లేదో సీత టక్కున లేచి తన విషాద లవ్ స్టోరీని మొదలుపెట్టింది. ఆరు నెలల్లో 14 కిలోలు తగ్గానా ఐదేళ్ల ప్రేమ గతేడాది ఏప్రిల్‌తో ముక్కలైంది. మా ఇంట్లో చెప్పి పెళ్లికి సైతం ఒప్పించాక ఆ అబ్బాయి వదిలేశాడు. ఆరు నెలలపాటు తనను ఒప్పించేందుకు ఎంతో ప్రయత్నించాను. ఈ క్రమంలో అతడు నన్ను ఏడాది నుంచి మోసం చేస్తున్నాడని తెలుసుకున్నాను. ఆ బ్రేకప్ బాధ వల్ల 14 కిలోల బరువు తగ్గాను. బాధ నుంచి బయటపడేందుకు సైక్రియాట్రిస్ట్‌ను కలిశాను. ఇప్పుడు ఆలోచిస్తుంటే బ్రేకప్ అవడమే మంచిదైందనిపిస్తోందని సీత పేర్కొంది. సీత పాయింట్ గెలవడంతో తన శక్తి టీమ్ విజేతగా నిలిచింది.హౌస్మేట్స్ చేతిలో ఎలిమినేషన్మీకు గిఫ్ట్ హ్యాంపర్ కావాలా? ప్రైజ్‌మనీలో మరో రూ.15 వేలు యాడ్ చేయాలా? అని నాగ్ రెండు ఆఫర్స్ ముందు పెట్టాడు. టీమ్ ముక్తకంఠంతో ప్రైజ్‌మనీ పెరగడమే ముఖ్యమని తేల్చి చెప్పింది. దీంతో ప్రైజ్‌మనీ రూ.5,60,000కు చేరింది. తర్వాత సీత సేవ్ అయినట్లు నాగ్ ప్రకటించాడు. అనంతరం నాగార్జున పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. నామినేషన్లో మిగిలిన బాషా, ఆదిత్యలలో ఎవరు సేవ్ అవ్వాలి? ఎవరు ఎలిమినేట్ అవ్వాలనేది హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. సీత తప్ప ప్రతి ఒక్కరూ బాషా గేమ్‌పై ఫోకస్ చేయలేకపోతున్నాడని, తను వెళ్లిపోవడమే మంచిదని నిర్ణయించారు. సీత మాత్రమే బాషాకు సపోర్ట్ఆదిత్యకు పూలమాల వేసి ఇంట్లో ఉండాలని కోరుకున్నారు. శేఖర్ లేకుండా ఇంటిని ఊహించలేకపోతున్నా అని సీత మాత్రమే అతడికి సపోర్ట్ చేసింది. ఫైనల్‌గా శేఖర్ ఎలిమినేట్ అని చెప్పడంతో విష్ణుప్రియ, సీత, నైనిక ఏడ్చేశారు. వాళ్లను ఓదార్చిన బాషా.. వెళ్లేముందు కూడా అందర్నీ నవ్వించి పోయాడు. నేను జోక్ చేస్తే మీరు వినేస్తారో లేదో కానీ మీరు అందరి హార్టులు విన్ చేస్తారు అని తెలిపాడు.ఎవరు ఫేక్? ఎవరు రియల్?స్టేజీపైకి వచ్చిన బాషాతో.. ఎవరు ఫేక్, ఎవరు రియల్ అన్నది చెప్పమని గేమ్ ఆడించాడు. అలా బాషా ముందుగా.. సీత.. మనసులో ఏదనిపిస్తే అదే మాట్లాడుతుంది, విష్ణుప్రియ.. చాలా అమాయకురాలు, ప్రేరణ.. జెన్యూన్, తను కూడా మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడుతుంది అంటూ ముగ్గురి ఫోటోలను రియల్ పర్సన్ లిస్టులో చేర్చాడు. సోనియాకు రెండు ముఖాలుఫేక్ మనుషుల గురించి ప్రస్తావిస్తూ సోనియా.. నవ్వు చాలా ప్రశాంతంగా అనిపించింది. కానీ నామినేషన్లో మాత్రం కాళి అవతారం చూశాను. తనకు రెండు ముఖాలున్నాయి. మణికంఠ కావాలనే ఫేక్ ఫేస్ పెట్టుకుంటాడు. బహుశా అది అతడి స్ట్రాటజీయేమో! ఆదిత్య.. తను నన్ను నామినేట్ చేసినప్పుడు స్పోర్టివ్‌గా తీసుకున్నాను. కానీ నేను నామినేట్ చేస్తే దాన్నతడు స్పోర్టివ్‌గా తీసుకోలేదు అని ఈ ముగ్గురినీ ఫేక్ లిస్టులో చేర్చాడు. మొత్తానికి ఒక మంచి వ్యక్తిని బిగ్‌బాస్ హౌస్ కోల్పోయింది.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అతడే ఎలిమినేట్.. ముందే స్కెచ్చేసిన బిగ్‌బాస్!
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ లాంచింగ్ రోజు 14 మంది కంటెస్టెంట్లు హౌస్‌లో అడుగుపెట్టారు. విష్ణుపప్రియ, ఆదిత్య ఓం వంటివాళ్లు తప్ప మిగతా అందరూ జనాలకు పెద్దగా పరిచయం లేనివాళ్లే! కానీ రోజులు గడిచేకొద్దీ అందరూ సుపరిచితులైపోయారు. అంతలోనే ఎలిమినేషన్ దగ్గరకు రాగా బేబక్క ఇంటిని వీడింది..రెండో వారం నామినేషన్లో..మొదట్లో గమ్ముగా కూర్చున్న ఆమె వెళ్లిపోయేముందు మాత్రం తనలో ఫైర్ చూపించింది. ఇక రెండో వారం నాగమణికంఠ, కిర్రాక్ సీత, పృథ్వీ శెట్టి, నైనిక, శేఖర్ బాషా, విష్ణుప్రియ, ఆదిత్య, నిఖిల్ నామినేషన్లో ఉన్నారు. వీరిలో నిఖిల్, విష్ణుప్రియ అందరికంటే ముందు సేవ్ అవుతారనడంలో డౌటే లేదు. రోజురోజుకీ ఆట మెరుగుపర్చుకుంటున్న మణికంఠకూ బాగానే ఓట్లు పడుతున్నాయి. నైనికకు కూడా ఓట్లు పర్వాలేదనిపిస్తున్నాయి. సీతను కాపాడింది అదే!మిగిలిందల్లా ఆదిత్య, సీత, శేఖర్ బాషా, పృథ్వీ. ఈ నలుగురిలో ఈ వారం గేమ్‌లో రఫ్ఫాడించింది సీత. ఆమె డేంజర్ జోన్లో ఉన్నప్పటికీ తన గేమ్ ఆమెను కాపాడింది. పృథ్వీ.. గొడవలకు సై అంటూ దూకుతున్నాడు కాబట్టి.. ఆ కొట్లాటల కోసం మరికొన్నాళ్లు అలాగే కొనసాగించే ఛాన్స్ ఉంది. మిగిలింది బాషా, ఆదిత్య. కావాలనే..హౌస్‌లో అంతో, ఇంతో నవ్విస్తోంది బాషాయే! తన జోకులతో, పంచులతో చిరాకు పుట్టిస్తూనే చిరునవ్వు తెప్పిస్తున్నాడు. కానీ ఈ వారం అతడికి గేమ్స్ ఆడే అవకాశమే బిగ్‌బాస్ ఇవ్వలేదు. ఈ లెక్కన తనను పంపించేయాలని ముందే డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అటు ఆదిత్య.. హౌస్‌లో ఉన్నాడా? లేడా? అన్నట్లుగానే ఉన్నాడు. ఆదిత్య ఉన్నాడా? లేదా?ఈ వారమైనా కాస్త కనిపించమని నాగ్ చెప్పినా సరే ఎక్కడా యాక్టివ్‌గా ఉన్నట్లు కనిపించలేదు. దీంతో ఇతడిని ఎలిమినేట్ చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆదిత్యను సేవ్ చేసి బాషాను ఎలిమినేట్ చేశారట!బాషా ఎలిమినేట్!త్వరలోనే అవినాష్ లేదా రోహిణి వంటి కమెడియన్స్‌ను వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా హౌస్‌లోకి పంపించాలన్నది బిగ్‌బాస్ ప్లాన్. ఇందుకోసమే తనకు తెలిసిన కామెడీతో నవ్విస్తున్న బాషాను బయటకు పంపిస్తున్నారట! మరి ఇదెంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
చనిపోదామనుకున్న ఆదిత్య.. గిఫ్టులు అందుకున్నదెవరంటే?
ప్రైజ్‌మనీని పెంచుకునేందుకు బిగ్‌బాస్ ఇంటిసభ్యులు బాగానే కష్టపడ్డారు. అయితే అందరికంటే చిన్న టీమ్ ఎక్కువ ప్రైజ్‌మనీ గెలవడం విశేషం. టాస్కుల్లో రెచ్చిపోయిన హౌస్‌మేట్స్‌ను మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు సరదా గేమ్ ఆడించారు. ఆ వెంటనే వాళ్ల ఇంటి నుంచి కొన్ని వస్తువులు తెప్పించి కొందరికి ఇచ్చి మరికొందరికి కళ్లముందు ఆశపెట్టివెనక్కు తీసేసుకున్నారు. ఇంతకీ ఎవరెవరు బహుమతులు అందుకున్నారో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 13) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఆడపులిలా సోనియాప్రైజ్మనీ కోసం ఇచ్చిన పోటీ ముగిసిందని బిగ్‌బాస్ ప్రకటించాడు. అంతులేని వీరులు టీమ్.. రూ.75 వేలు, అఖండ టీమ్ రూ.1,25,000, కెరటం రూ.2,45,000 సాధించినట్లు వెల్లడించాడు. ఈ మూడింటిలో కెరటం టీమ్ సాధించిన డబ్బును ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. దీంతో ప్రైజ్‌మనీ రూ.5,45,000కు చేరింది. అనంతరం బిగ్‌బాస్ ఇంటిసభ్యులతో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడించాడు. ఈ క్రమంలో యష్మి చికెన్ దొంగిలించినట్లు ఒప్పుకుంది. సోనియా ఆడపులిలా రెడీ అయింది. విష్ణుప్రియ పోల్ డ్యాన్స్ చేసింది. నిఖిల్ చీర కట్టుకుని స్టెప్పులేశాడు.ఇంటి నుంచి బహుమతులుతర్వాత కంటెస్టెంట్లకు ఇంటి నుంచి బహుమతులు వచ్చాయని గుడ్‌న్యూస్ చెప్పాడు. కానీ ఐదుగురికి మాత్రమే గిఫ్ట్స్ పొందే అవకాశం ఉందని మెలిక పెట్టాడు. ఆ ఐదుగురు ఎవరనేది హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. ఎవరు గిఫ్ట్ పొందాలి? ఎవరి బహుమతి వెనక్కు పంపించాలన్నది ఇంటిసభ్యుల చేతిలోనే ఉంటుందన్నాడు. మొదటగా అభయ్, నిఖిల్ గిఫ్టులు వచ్చాయి.నాన్నకు తెలియకుండా దొంగతనంఅభయ మాట్లాడుతూ.. మా నాన్న లెక్కల మాస్టారు. తాను చాలా స్ట్రిక్ట్. కానీ, నేను సినిమాల్లోకి వస్తానంటే సపోర్ట్ చేశాడు. అలా నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను సంపాదించిన డబ్బుతో కొన్న వాచ్ అది.. ఆయన ఉన్నన్ని రోజులు అదే ధరించాడు అని చెప్పాడు. నిఖిల్ మాట్లాడుతూ.. అబ్బాయిలకు నాన్నను హగ్ చేసుకునే అదృష్టం ఉండదు. అందుకని నాన్నకు తెలియకుండా ఆయన షర్ట్ దొంగతనం చేశాను అంటూ ఏడ్చేశాడు. నైనిక కోసం సీత త్యాగంమెజారిటీ ఇంటిసభ్యులు అభయ్కు లాలీపాప్ ఇచ్చి సపోర్ట్ చేశారు. దీంతో అతడు వాచీ అందుకున్నాడు. నైనిక, సీతకు బొమ్మలు గిఫ్ట్స్‌గా వచ్చాయి. సీత మాట్లాడుతూ.. ఐదేళ్లపాటు రిలేషన్లో ఉన్నాక అతడు నన్ను వదిలేసి పోయాడు. అప్పుడు నాకు ఒక ఫ్రెండ్ దొరికాడు. అతడే ఈ బొమ్మ కొనిచ్చాడు. ఆ బొమ్మ లేకుండా నేనసలు నిద్రపోలేనంటూ ఏడ్చేసింది. కానీ ఈ బిగ్‌బాస్ హౌస్‌లో నైనిక, విష్ణుప్రియ దొరికారని.. వాళ్లతో కబుర్లు చెప్తూ నిద్రపోతున్నానంది. కాబట్టి ఆ బొమ్మ లేకుండా ఉండగలనని నైనికకు గిఫ్ట్ ఇచ్చేయండని కోరింది.చాలాసార్లు విడిపోదామనుకున్నామునైనిక మాట్లాడుతూ.. ఎవరినైనా గాఢంగా ప్రేమిస్తే ఎన్నో గొడవలు జరుగుతాయి. అలా ఎన్నోసార్లు గొడవలయ్యాయి, చాలాసార్లు విడిపోదామనుకున్నాము. ఒక హింసాత్మక రిలేషన్ నుంచి బయటకొచ్చాక ఈ వ్యక్తి వల్లే ఆ బాధను మర్చిపోయాను. నేనూ కొన్ని తప్పులు చేశాను, సారీ కన్నా, నన్ను ఇంతలా ప్రేమిస్తున్నందుకు థాంక్యూ అని ఏడ్చేసింది. సీత త్యాగం, హౌస్మేట్స్ సపోర్ట్‌తో నైనిక తన బొమ్మను గెల్చుకుంది.అదే చివరి ఫోటో..నబీల్, పృథ్వీలకు తండ్రి ఫోటోలు వచ్చాయి. నబీల్ మాట్లాడుతూ.. నాన్నకు సింగర్ అవ్వాలన్నది కోరిక. తనకెలాగూ అనుకున్న కల నెరవేరలేదని నాకు ఎక్కువ సపోర్ట్ చేసేవాడు. కాలేజీకి కూడా సరిగా వెళ్లకుండా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉండేవాడిని. 2021 జూన్‌లో నాన్నతో చివరిసారి ఫోటో దిగాను. ఆ మరుసటి నెలలోనే తను చనిపోయాడు. కానీ, నేను స్ట్రాంగ్.. పృథ్వీకి వచ్చిన బహుమతిని అతడికి ఇచ్చేయమని కోరాడు.నాన్నతో దిగిన ఏకైక ఫోటోపృథ్వీ మాట్లాడుతూ.. మా నాన్నతో నేను దిగిన ఏకైక ఫోటో ఇదొక్కటే. మా నాన్నతో ఆగస్టు 15న చాలాసేపు మాట్లాడాను. ఆరోజే ఆయన కాలం చేశాడు. నేను నటుడినవ్వాలన్నది ఆయన కల. అది నెరవేర్చాను అని చెప్పుకొచ్చాడు. మెజారిటీ ఇంటిసభ్యులు నబీల్‌కు లాలీపాప్స్ ఇవ్వడంతో అతడు ఫోటోఫ్రేమ్ అందుకున్నాడు. అనంతరం మణికంఠకు శాలువా, ఆదిత్యకు తండ్రి ఫోటో ఫ్రేమ్ గిఫ్టుగా వచ్చాయి. చనిపోదామనుకున్నా..మణికంఠ మాట్లాడుతూ.. అమ్మ చనిపోతుందనడానికి ముందు తన శాలువా ఇచ్చింది. సింపతీ కోసమైతే దీన్ని నాకు ఇవ్వకండి అన్నాడు. ఆదిత్య మాట్లాడుతూ.. నాలో ఉన్న మంచి లక్షణాలకు నాన్నే కారణం. కరోనా టైంలో నా భార్య, కుమారుడు, తల్లి.. అందరికీ కోవిడ్ వచ్చింది. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. అప్పుడు నాన్న ఫోటో కిందపడి నన్ను హెచ్చరించింది అని ఎమోషనల్ అయ్యాడు. దొంగతనంఈ క్రమంలో నాన్న గొప్పదనం గురించి చెప్తూ బాషా భావోద్వేగానికి లోనయ్యాడు. హౌస్మేట్స్ సపోర్ట్‌తో ఆదిత్య తన తండ్రి ఫోటో అందుకున్నాడు. ఇకపోతే మణికంఠ అర్ధరాత్రి అఖండ టీమ్ బెడ్రూమ్లో దూరి సరుకులు దొంగతనం చేశాడు. అందర్నీ ఓ ఆటాడుకుందామనే ఈ ప్లాన్ వేసినట్లున్నాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నాన్నతో మనసారా మాట్లాడా.. అదే ఆఖరి రోజు.. పృథ్వీ ఎమోషనల్
నిన్న గొడవలతో వేడెక్కిన బిగ్‌బాస్ హౌస్ నేడు ఎమోషనల్‌గా మారనుంది. కంటెస్టెంట్లకు సంబంధించిన గిఫ్టులను ముందుపెట్టిన బిగ్‌బాస్ ఇవి అందరికీ కాదని, కొందరికి మాత్రమేనని తిరకాసు పెట్టాడు. దీంతో హౌస్మేట్స్ తమకు వచ్చిన గిఫ్టులను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఆ బహుమతుల వెనక ఉన్న స్టోరీని బయటపెట్టారు.మణికంఠ సూపర్..తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో.. ఆదిత్య తన తండ్రి ఫోటో చూసి ఎమోషనల్ అయ్యాడు. నాలో ఉన్న చెడు లక్షణాలు నేనే నేర్చుకున్నాను.. కానీ మంచి లక్షణాలు మాత్రం తన తండ్రి నుంచే వచ్చాయన్నాడు. మణికంఠకు శాలువా లాంటిది వచ్చింది. అయితే కంటెస్టెంట్లు దాన్ని ఏదో సింపతీతో తనకు ఇవ్వాలని మాత్రం కోరుకోవడం లేదన్నాడు.కరోనా టైంలో నాన్న..ఇప్పటికే సింపతీ గేమ్ అన్న ముద్ర పడటంతోనే తను గిఫ్టును సైతం ఆశించకుండా గుండె రాయి చేసుకుని నిలబడ్డాడు. నబీల్ వంతు రాగా.. మా నాన్నతో దిగిన చివరి ఫోటో ఇదే.. ఆయన కరోనా వల్ల చనిపోయారని తెలిపాడు. పృథ్వీ మాట్లాడుతూ.. ఆగస్టు 15న నేను మా నాన్నతో చాలా సేపు మాట్లాడాను. అదే ఆయన చివరి రోజు అవుతుందనుకోలేదు అని చెప్పాడు. నాన్న ప్రేమ తెలీదుఇక చివర్లో బాషా తండ్రి గొప్పదనం గురించి చెప్తూ ఏడ్చేశాడు. మనందరికీ నాన్నంటే చాలా ఇష్టం. కానీ నాన్నకు మనమంటే ఎంతిష్టమనేది చాలామందికి తెలియదు. మీరు నాన్నయితే తప్ప ఆ ప్రేమ తెలియదు అని ఏడ్చేశాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తడిబట్టలతో అబ్బాయిల ముందు! మళ్లీ విష్ణుప్రియకు నీతి సూక్తులు
పర్సనల్ వేరు, గేమ్ వేరు. దీనికి మధ్య తేడా తెలుసుకోవాలి.. ఇది సోనియా చెప్పిన మాటే!అయితే తాను అందరికీ సూక్తులు చెప్తాను కానీ పాటించనంటోందీ ఆర్జీవీ బ్యూటీ. మొన్న జరిగిన నామినేషనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. నన్ను అడల్ట్రేటెడ్ జోకులు అనడం నచ్చలేదని విష్ణుప్రియ.. సోనియాను నామినేట్ చేసింది. విష్ణుప్రియ కౌంటర్తను పద్ధతిగా సోనియా గారు అని మాట్లాడుతుంటే సోనియా మాత్రం తనపై బురదజల్లే ప్రయత్నం చేసింది. నీకు అలాంటి జోకులే వచ్చని మాట్లాడింది. దీంతో సహనం కోల్పోయిన విష్ణుప్రియ.. అడల్ట్ అనేది నాలో లేదు, నీ బుర్రలో ఉంది. పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని కౌంటర్ ఇచ్చింది.సోనియా దిగజారుడు వ్యాఖ్యలుతనకు ఎదురు తిరగడంతో సోనియా మరింత దిగజారుడు వ్యాఖ్యలు చేసింది. దుస్తులు సరిగ్గా వేసుకుని ఆ మనిషి పక్కన నిల్చోవాలన్నది కూడా తెలీదు. అతడు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా కూడా మళ్లీ వెళ్లి అతడి పక్కనే నిలబడుతున్నావంటే నీ మాటలు, చేతలు అడల్ట్లాగే అనిపిస్తాయి అని దారుణంగా మాట్లాడింది. ఎవరి దగ్గర ప్రవర్తించానో చెప్పు అని విష్ణు సాఫ్ట్‌గానే అడిగినా.. అందరి దగ్గర అలాగే ప్రవర్తిస్తావని మండిపడింది. పొరపాటున..అసలు అంతగా ఇబ్బంది పడ్డ వ్యక్తి ఎవరు? ఏం జరిగింది? అంటే.. బాత్రూమ్లో చీర కట్టుకోవడం కష్టం కాబట్టి విష్ణుప్రియ బెడ్రూమ్లోకి వెళ్లింది. అది తెలియక పొరపాటున ఆదిత్య ఓం బెడ్రూమ్లోకి వెళ్లాడు. ఆమె చీర కట్టుకుంటుందని తెలిసి వెంటనే బయటకు వెళ్లిపోయాడు. అతడిని గమనించిన విష్ణు.. ఆదిత్య దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది. ఇంతదానికి సోనియా.. ఏదో చెండాలం జరిగిపోయినంత బిల్డప్ ఇచ్చింది. మరి నీ డ్రెస్సింగ్ సెన్స్ ఏది?అక్కడ ఆదిత్య ఇబ్బందిపడకపోయినా సోనియానే తెగ ఫీలైపోయింది. నిఖిల్, అభయ్ దగ్గరకు వెళ్లి విష్ణుప్రియ చీర మార్చుకుంటుండగా ఏం జరిగిందో తెలిసా? అని మళ్లీ మొదలుపెట్టింది. పైగా తడిచిన బట్టల్లో, కేవలం టీషర్ట్‌తో ఉండగానే వాళ్ల ముందు నిలబడింది. విష్ణుప్రియ డ్రెస్సింగ్ గురించి ఓవర్‌గా మాట్లాడిన సోనియా.. మరి ఇలా తడిచిన బట్టలతో వాళ్ల ముందు నిలబడటమేంటో తనకే తెలియాలి! Sonia is the cheapest contestant on #BiggBossTelugu8 She is slut-shaming #VishnuPriya to two guys over a genuine misunderstanding. Hefty PR can't hide her ugliness and no, she can never be Bindu👎pic.twitter.com/26Nz6JqXiI— 🍋 (@yunoforeva) September 10, 2024Enta galeez ga undi enti ah Soniya #Vishnupriya saree drape cheskunte ah Aditya om by mistake ah room Loki velipoyadu tanu sorry kuda chepindi adi edo tanu kavali ani ala chesinatu oka sexualize way lo cheptundi anduke ninu adultrated ananu ani antundi #BiggBossTelugu8 pic.twitter.com/kyDN5pFQ4a— Abhishek (@uniqueabhi18) September 10, 2024మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణుప్రియను టార్గెట్ చేసిన సోనియా! ఇప్పటికీ అదే అంటా!
వంట చేస్తూ అందరి కడుపు నింపిన బేబక్కను మొదటివారమే పంపించేశారు. దీంతో నిఖిల్ గరిట తిప్పాల్సిన పరిస్థితి! కానీ ఒక్కరికోసం మాత్రమే స్పెషల్‌గా వండాడు. మరోవైపు బేబక్క ఎలిమినేషన్‌తో నైనిక, సీతకు బయట ఏం జరుగుతుందో అర్థమైపోయింది. జనాలు ఎటువంటి గేమ్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు? ఏంటనేది సినిమా క్లియర్‌గా తెలిసిపోయింది. ఇక నామినేషన్స్‌ను కంటెస్టెంట్లు యుద్ధంలా పూర్తి చేశారు. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (సెప్టెంబర్ 9) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..చిట్టా పెద్దగానే ఉందే!ఎవరు ఎలిమినేట్ అవుతారనుకున్నానో వాళ్లే ఫస్ట్ సేవ్ అయ్యారంటూ తన బాధను బయటపెట్టింది విష్ణుప్రియ. అయినా సోనియా ఎలిమినేట్ అవుతుందని ఎలా అనుకున్నావని ప్రేరణ నోరెళ్లబెట్టింది. అనంతరం పృథ్వీ.. సోనియాకు ఎలాంటి అబ్బాయి నచ్చుతాడనేది కూపీ లాగింది. అందుకామె.. నన్ను అర్థం చేసుకోవాలి, ప్రోగ్రెసివ్‌గా ఉండాలి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, ముఖ్యంగా నేను చేయాలనుకున్నదానికి అడ్డుపడొద్దు, నా అంత బుద్ధి ఉండొద్దు అని కోరికల చిట్టా బయటపెట్టింది.ఆమెకు ఇష్టమైన కూర చేసిన నిఖిల్మరోపక్క ఈమె మెంతి టమాట కూర తినాలని కోరిక పుట్టడంతో నిఖిల్ కిచెన్‌లో గరిట తిప్పాడు. ఈ విషయాన్ని సీత బయటపెట్టడంతో విష్ణుప్రియ నోరెళ్లబెట్టింది. తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలైంది. కంటెస్టెంట్లు తమ టీమ్‌లోని సభ్యులను మినహాయించి అవతలి టీమ్స్‌లో ఎవరినైనా నామినేట్ చేయొచ్చని బిగ్‌బాస్ (#BiggBoss8Telugu) తెలిపాడు. పెద్ద టీమ్ చీఫ్ అయిన కారణంగా యష్మి నామినేషన్స్‌లో ఉండబోదని పేర్కొన్నాడు.కోరిక తీర్చేసుకున్న సీతమొదటగా సీత.. గతవారమే నిన్ను నామినేట్ చేయాలనుకున్నాను, ఇప్పుడు ఆ ఛాన్స్ దొరికిందంటూ నిఖిల్‌పై రంగు పోసింది. చెత్తబుట్టలో నుంచి గ్లాస్ తీసి బయటపెట్టడం నన్ను అవమానించినట్లుగా అనిపించిందని ప్రేరణను నామినేట్ చేసింది. అభయ్.. ఇంకా బెస్ట్ ఇవ్వాలంటూ విష్ణుప్రియను, ఇన్వాల్వ్మెంట్ తక్కువైందంటూ ఆదిత్యను నామినేట్ చేశాడు. సోనియా వర్సెస్ సీతసోనియా.. చీఫ్‌గా ఫెయిలైందంటూ నైనికను నామినేట్ చేసింది. సీతను నిలబెట్టి.. టాస్కులు అర్థం చేసుకోలేకపోతున్నావంటూ క్లాసు పీకింది. అభయ్‌తో జరిగిన గొడవలోనూ నీకు పర్సనాలిటీ ప్రాబ్లమ్ ఉందని తేలిందని, నీకింకా మెచ్యూరిటీ రావాలంటూ తిట్టిపోసింది. అసలు టీమ్‌లో ఎలా ఉండాలో కూడా తెలియదని చులకన చేసింది. టోటల్‌గా గ్రూప్ అంతా ఫెయిలైందని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇదంతా విన్న సీత.. నువ్వు గేమ్‌ను అర్థం చేసుకున్నాక నాతో మాట్లాడని కౌంటరిచ్చింది. నీకు మెచ్యూరిటీ లేదని తిరిగనేసరికి.. మెచ్యూరిటీ గురించి మాట్లాడొద్దని సోనియా హెచ్చరించింది.ఆదిత్యపై పడ్డారే!మణికంఠ.. ప్రతి మనిషి గురించి పాజిటివ్స్ చెప్తున్నారు. అది సేఫ్ గేమా? లేదంటే మీ వ్యక్తిత్వమే అలాంటిదా? అనేది అర్థం కావడం లేదు. అలాగే నామినేషన్స్ ఒత్తిడిని ఎలా తీసుకుంటావో చూడాలనుందని ఆదిత్యను నామినేట్ చేశాడు. అందుకతడు.. మీరు నాకు పబ్లిసిటీ చేస్తున్నారంటూ నవ్వుతూ స్వీకరించాడు. సీరియస్ టైంలో కుళ్లు జోకులు వేస్తున్నావని, అలాగే స్వీట్లు తీసుకెళ్లి దాచేశావని బాషాను నామినేట్ చేశాడు.ఆరని జ్వాలఆదిత్య వంతు రాగా.. స్ట్రాంగ్ కంటెండర్ అంటూ అభయ్ నవీన్‌ను, ఈ గేమ్‌కు మీరు ఫిట్ కాదంటూ శేఖర్ బాషాను నామినేట్ చేశాడు. విష్ణుప్రియ.. నా తప్పులు వెతకడానికి నాతో జర్నీ చేశానని గతవారం నామినేషన్లో చెప్పడం నచ్చలేదని మణికంఠపై రంగు చల్లింది. తర్వాత సోనియాను నామినేట్ చేస్తూ.. మీకు కోపం వచ్చినప్పుడు అవతలివారిపై నిందలు వేస్తున్నారంది.దుస్తులు సరిగా వేసుకోవు!అందుకామె.. నీకు నాతో అంత ర్యాపో లేకపోయినా నాపై జోకులు వేశావు.. సారీ చెప్పినంత మాత్రాన మాటల్ని వెనక్కు తీసుకోలేం.. నువ్వు అడల్ట్రేటెడ్ జోకులు చేస్తావు.. ఇప్పటికీ అదే అంటాను. బట్టలు సరిగా వేసుకుని ఒక మనిషి పక్కన నిల్చోవాలనేది కూడా నీకు తెలియదు కదా.. ఒకరు కంఫర్ట్‌గా లేరని తెలిసినా కూడా అలా వారి పక్కన నిల్చున్నప్పుడే నీ వ్యక్తిత్వం తెలుస్తోంది అంటూ విష్ణుప్రియను మరింత రెచ్చగొట్టింది. పచ్చకామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని సెటైర్లు వేసింది విష్ణుప్రియ.ఒకే ఒక్కడితో ప్రాబ్లమ్బాషా వంతు రాగా.. నాకు ఒకే ఒక్కడితో ప్రాబ్లమ్.. అతడే మణికంఠ.. అతడు జనజీవన స్రవంతిలో కలవనంతవరకు నామినేట్ చేస్తూనే ఉంటానంటూ తనపై రంగు గుమ్మరించాడు. నేను బిగ్‌బాస్‌కు అన్‌ఫిట్ అని మీరు నిర్ణయించడం బాధేసిందంటూ ఆదిత్య ఓంను నామినేట్ చేశాడు. వీళ్ల రూటే సెపరేటుదీంతో ఆదిత్య.. నా వయసులో ఏం జరుగుతుందో మీకు తెలియదు.. నేను ఫ్యామిలీని వదిలేసి వచ్చాను. అన్ని పనులు చేస్తున్నాను అంటూ సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడాడు. నిజానికి వీళ్లిద్దరూ ఒకర్ని ఒకరు నామినేట్ చేసుకున్నారు కానీ మనసులో మాత్రం బాధపడుతున్నారని చూసే జనాలకు ఇట్టే తెలిసిపోతుంది. అందుకే నామినేషన్ అయ్యాక హగ్ చేసుకుని ముద్దులు పెట్టుకున్నారు.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నిఖిల్‌కు హ్యాండిచ్చిన ఆ ఇద్దరు.. విష్ణుప్రియకు ఘోర అవమానం!
నామినేషన్స్‌లో ఉండటంతో నాగమణికంఠ సైలెంట్ అయిపోయాడు. బోలాగా మాట్లాడే విష్ణుప్రియను టీమ్‌లోకి తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు.. యష్మి తనను నమ్మినందుకు అభయ్.. ఆమెను గెలిపించాడు.. ఇలాంటి ఎన్నో సంగతులను నేటి (సెప్టెంబర్ 5)ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..ఫేస్‌వాష్‌తో బ్రషింగ్!నామినేషన్స్ రోజు మొదలుపెట్టిన ఏడుపును మణికంఠ ఇంకా ఆపలేదు. బహుశా ఎలిమినేషన్ భయం పట్టుకుందో, ఏమో కానీ ఓరకమైన శూన్యంలోకి వెళ్లిపోయాడు. తన జీవితం ఏమవుతుందో తెలియడం లేదంటూ మళ్లీ కంటతడి పెట్టుకున్నాడు. మరోవైపు బాత్రూమ్లో పృథ్వీ తనకు తెలియకుండా చేసిన పనితో అందరినీ నవ్వించాడు. టూత్‌పేస్ట్ అనుకుని అతడు తన బ్రష్‌కు ఫేస్‌వాష్ క్రీమ్ పెట్టుకోవడంతో అక్కడున్న అందరూ ఫక్కుమని నవ్వారు.చీఫ్‌లకు టీమ్స్ఇక నైనిక ప్రేమ వ్యవహారాన్ని నిఖిల్ బయటకు లాగాలని ప్రయత్నించాడు. కానీ దానికింకా టైముందన్నట్లు ఒక్క ముక్క కూడా చెప్పడానికి ఇష్టపడలేదు. పైగా అబ్బాయి పేర్లు గెస్ చేయనా అంటుంటే కూడా వద్దంటూ తెగ సిగ్గుపడిపోయింది. ఇంతలో బిగ్‌బాస్ ముగ్గురు చీఫ్‌లకు ఓ టాస్క్ ఇచ్చాడు. రాజుకు సైన్యం ఉన్నట్లే చీఫ్‌లకు క్లాన్ ఉండాలని, అది వారే నిర్మించుకోవాలని చెప్పాడు. ఆ ముగ్గురూ చెరొకరిని..చీఫ్ అవడానికి ఒక అడుగు దూరంలో ఆగిపోయిన బాషా, బేబక్క, అఫ్రిదిలకు మాత్రం ఏ చీఫ్ కింద చేరాలనేది సొంతంగా నిర్ణయించుకోవచ్చని ఆఫర్ ఇచ్చాడు. దీంతో బాషా.. యష్మిని, బేబక్క.. నిఖిల్‌ను, అఫ్రిది.. నైనికను సెలక్ట్ చేసుకున్నారు. మిగతా ఇంటిసభ్యుల్లో ఎవరు ఎవరికి కావాలనేది చీఫ్‌లు నిర్ణయించుకోవాలన్నాడు. ప్రేరణ కావాలని నిఖిల్, యష్మి ఇద్దరూ కోరారు. అయితే ప్రేరణ.. యష్మి టీమ్‌లోకి వెళ్లడానికే మొగ్గు చూపుంది. నిఖిల్ టీమ్‌లో మణికంఠఅలాగే అభయ్ కావాలని నిఖిల్, యష్మి ఇద్దరూ అడిగారు. అయితే యష్మి టీమ్‌కు బలం కావాలని కోరిందని, దాన్ని నెరవేర్చేందుకు ఆమె టీమ్‌లోకి అడుగుపెడుతున్నానన్నాడు అభయ్. నాగమణికంఠకు తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం ఇవ్వాలనుకుంటున్నానంటూ అతడిని తన టీమ్‌లో చేర్చుకున్నాడు నిఖిల్. పృథ్వీ కావాలని నిఖిల్, యష్మి ఇద్దరూ అడిగారు. అయితే పృథ్వీ యష్మిని ఎంపిక చేసుకోవడం గమనార్హం.విష్ణుప్రియ వంతు వచ్చేసరికి..చీఫ్ నైనిక.. తన నిర్ణయాలు బాగుంటాయంటూ ఆదిత్యను, బ్యూటీ విత్ బ్రెయిన్ అంటూ సీతను తన టీమ్‌లో చేర్చుకుంది. విష్ణుప్రియ పేరెత్తేసరికి ఎవరూ తనను తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. కొన్ని క్షణాల తర్వాత నైనిక.. విష్ణుప్రియను తీసుకుంది. యష్మి, నైనిక టీమ్‌లో నలుగురు చొప్పున ఉండటంతో సోనియాకు ఇంకో ఆప్షన్ లేక నిఖిల్ టీమ్‌లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమె.. నిఖిల్లో నాయకత్వ లక్షణాలున్నాయి, ఈ ఆడపులి నీ టీమ్‌లో ఉంటే విజయం తథ్యమన్నట్లుగా తనకు తానే డప్పు కొట్టుకుంది.నిఖిల్ ఎమోషనల్కాసేపటి తర్వాత తననెందుకు సెలక్ట్ చేసుకోలేదని విష్ణుప్రియ వెళ్లి నిలదీయడంతో నిఖిల్ ఎమోషనలయ్యాడు. తన ఉద్దేశం అది కాదంటూ కంటతడి పెట్టుకున్నాడు. మణికంఠను నేను తీసుకోకపోతే ఇంకెవ్వరూ తీసుకోరు, అందుకే అతడిని చేర్చుకున్నాను.. నిన్నెవరైనా తీసుకుంటారనే ఊరుకున్నట్లు పేర్కొన్నాడు.వింత అలవాటుపృథ్వీ ఊరికనే కప్పు కూర తినే అలవాటు చూసి బేబక్క షాక్ అయింది. అలాంటి పద్ధతులు ఇక్కడ కష్టమని పరోక్షంగా హెచ్చరించింది. అటు ప్రేరణ.. తన టవల్‌ను ఆదిత్య చూసుకోకుండా వాడేశాడంటూ తెగ ఫ్రస్టేట్ అయింది. చూసుకోలేదు, తప్పయిపోయిందంటూ ఆదిత్య పదిసార్లు క్షమాపణ చెప్పినా ఆమె మాత్రం అదే పాఠం అప్పజెబుతూనే ఉంది. దీంతో ఈ గోడు వినలేక బిగ్‌బాస్ తనకు కొత్త టవల్ పంపించాడు. బాత్రూమ్ను క్లీన్‌గా ఉంచడం లేదంటూ యష్మి, ప్రేరణ, సోనియా కాసేపు వాదులాడుకున్నారు.మాట మీద నిలబడ్డాడుగేమ్ విషయానికి వస్తే.. యష్మి, నైనిక టీమ్స్‌లో నలుగురు చొప్పున ఉండటంతో ఈ రెండు టీమ్‌లకు బాల్ పట్టు- గోల్ కొట్టు అనే టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్‌లో నైనిక టీమ్ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. యష్మి టీమ్‌లో అభయ్.. ఒక గోల్ చేయడంతో వీరి టీమ్ గెలుపొందింది. గెలిచిన యష్మి టీమ్.. ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్న నిఖిల్ టీమ్‌లో నుంచి ఒకరిని లాక్కునే ఛాన్స్ ఉంది. అయితే వాళ్లు సోనియాను లాక్కున్నారని తెలుస్తోంది. ఇలాగైతే నిఖిల్ టీమ్‌లో ఇద్దరు మాత్రమే మిగులుతారు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'బిగ్‌బాస్ 8' షోలో తెలుగు వాళ్లకు అన్యాయం?
పేరుకే తెలుగు బిగ్‌బాస్. కానీ చూస్తుంటే మాత్రం అలా అనిపించట్లేదు. ఎందుకంటే మొత్తం 14 మంది హౌసులోకి అడుగుపెడితే అందులో ఏకంగా ఆరుగురు పరాయి భాషకి చెందిన వాళ్లే ఉన్నారు. వీళ్లందరూ తెలుగులో సీరియల్స్, షోలు, సినిమాలు చేశారు. ఇంతకీ వీళ్లెవరు? నిజంగానే షోలో తెలుగు వాళ్లకు అన్యాయం జరుగుతోందా? బిగ్‌బాస్ గేమ్ ప్లాన్ ఏంటనేది చూద్దాం!(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 8' లాంచ్ ఎపిసోడ్ హైలైట్స్.. 14 మంది హౌస్మేట్స్ వీళ్లే)ఆదివారం కొత్త సీజన్ మొదలైంది. అమ్మాయిలు, అబ్బాయిలు ఏడు జంటలుగా హౌసులోకి అడుగుపెట్టారు. వీళ్లలో యష్మి గౌడ, నిఖిల్, ప్రేరణ, పృథ్వీరాజ్.. కర్ణాటకకు చెందినవాళ్లు. తెలుగులో సీరియల్స్ చేశారు. తెలుగు మాట్లాడటం వచ్చు. కానీ పూర్తిగా తెలుగు అయితే కాదు. అలానే నైనిక అనే డ్యాన్సర్ ఉంది. ఈమె చాన్నాళ్లుగా తెలుగు డ్యాన్స్, రియాలిటీ షోలు చేస్తోంది. సోషల్ మీడియాలో తెలుగమ్మాయి అని రాసుకుంది కానీ చూస్తుంటే ఇక్కడామె కాదనిపిస్తోంది.అప్పట్లో 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో తెలుగులో హీరోగా పేరు తెచ్చుకున్న ఆదిత్య ఓం.. చాన్నాళ్ల తర్వాత బిగ్‌బాస్ తెలుగు షోలో కనిపించాడు. ఇప్పటికీ ఇంకా తెలుగు ఇబ్బందిగానే మాట్లాడుతున్నారు. తెలుగు షోలో మాట్లాడాలన్నా, గొడవ పడాలన్నా సరే ఫ్లూయెంట్‌గా తెలుగు వస్తే ఆ మాజా వేరుగా ఉంటుంది. ఇలా వేరే భాషకు చెందిన వాళ్లని తీసుకొస్తే.. కొన్నిసార్లు వీళ్లు చెప్పింది పక్కనోళ్లకు అర్థం కాదు, వాళ్లు చెప్పింది వీళ్లకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లోకి వచ్చి రోజు కాలేదు.. అప్పుడే వాగ్వాదాలు)దానికి తోడు వీళ్లు వేరే భాషలో మాట్లాడుకున్నా ప్రతిసారి.. తెలుగులోనే మాట్లాడండి అని బిగ్‌బాస్ చెప్పుకోవాల్సి వస్తుంది. వేరే ఏ భాషలోని బిగ్‌బాస్ షో తీసుకున్నా.. ఆయా ప్రాంతాలకు చెందిన వాళ్లే ఉంటారు తప్పితే తెలుగోళ్లు ఒక్కరూ కనిపించరు. అప్పట్లో ఓసారి బింధుమాధవి తమిళ బిగ్‌బాస్ షోలో కనిపించిందంతే.ఈ సీజన్లో పాల్గొన్న 14 మందిలో ఆరుగురు వేరే భాషలకు చెందినవాళ్లు. అంటే తెలుగులో సరైన కంటెస్టెంట్సే లేరా? నిర్వహకులు కావాలనే ఇలా ప్లాన్ చేశారా అనేది క్వశ్చన్ మార్క్‌గానే మిగిలిపోయింది. మరి వీళ్లలో ఎవరు హౌసులో ఉంటారు? ఎవరు ఎలిమినేట్ అయి వెళ్లిపోతారనేది చూడాలి?(ఇదీ చదవండి: కోట్లు ఇచ్చినా 'బిగ్‌బాస్'లోకి వెళ్లనంది.. ఇప్పుడేమో విష్ణుప్రియ ఇలా) -
Bigg Boss 8: ఆదిత్య ఓం ఎలిమినేట్
ఆదిత్య ఓం.. పుట్టింది కాశీలో, పెరిగింది ఉత్తరప్రదేశ్‌లో! సినిమా పిచ్చితో ముంబైలో అడుగుపెట్టాడు. వైవీఎస్ చౌదరితో ఏర్పడిన పరిచయంతో లాహిరి లాహిరి లాహిరిలో సినిమా చేశాడు. ఈ చిత్రంతోనే తెలుగు వారికి పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే ఫుల్ క్రేజ్ అందుకున్నాడు. తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో యాక్ట్ చేశాడు. హీరోగానే కాకుండా విలన్‌గానూ తన టాలెంట్ చూపించాడు.ఒకప్పుడు టాప్ హీరోగా వెలుగొందిన అతడు తర్వాత బోలెడన్ని సినిమాలు చేశాడు. కానీ, అవేవీ పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. సినిమాలు లేని టైంలో డిప్రెషన్‌కు వెళ్లిపోయాడు. రోజుకు దాదాపు 60 సిగరెట్లు తాగాడు. తన గది దాటి బయటకు రాలేకపోయాడు. కానీ కుటుంబం అందించిన సపోర్ట్ వల్ల నెమ్మదిగా ఆ మానసిక ఒత్తిడి నుంచి కోలుకున్నాడు. 2010లో ముంబై వెళ్లి ప్రొడక్షన్ మేనేజర్‌గా మళ్లీ కెరీర్ మొదలుపెట్టాడు. దర్శకనిర్మాతగా చిత్రాలు తెరకెక్కించాడు. ఇతడు రీల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో కూడా! ఆ మధ్య భద్రాద్రి కొత్తగూడెంలోని రెండు గ్రామాలను దత్తత తీసుకుని దాదాపు 500 మందికి సాయం చేశాడు. అలాగే అక్కడ పరిసర ప్రాంతాలకు అంబులెన్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాడు. సేవాగుణం మెండుగా ఉన్న ఆదిత్య బిగ్‌బాస్ షోతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూశాడు. కానీ ఐదో వారం మధ్యలోనే ఎలిమినేట్ అయ్యాడు. -
Bandi Trailer : నగ్నంగా కనిపించి షాకిచ్చిన హీరో
డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే ఆదిత్య ఓం ఈ సారి మరో ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సింగిల్ కారెక్టర్‌తో ‘బంధీ’అనే సినిమా చేస్తున్నాడు. గల్లీ సినిమా బ్యానర్ మీద ఈ మూవీని వెంకటేశ్వర రావు దగ్గు, తిరుమల రఘు నిర్మిస్తుండగా.. తిరుమల రఘు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా బంధీ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ఇందులో సినిమా కాన్సెప్ట్ గురించి చెప్పాడు. ఓ సగటు మనిషి కోరుకునేవి ఎలా ఉంటాయో చూపించాడు. ఏ మనిషైనా ఆహారం, నీరు, డబ్బు, స్వాతంత్ర్యం కోరుకుంటారు. స్వేచ్చగా విహరించాలని అనుకుంటాడు. అలాంటి వ్యక్తి జీవితంలో ఏర్పడిన ఘట్టాలనే బంధీగా రూపొందించారు. ఇక ఈ ట్రైలర్లో అన్ని రకాల ఎమోషన్స్‌ను ఆదిత్య ఓం చూపించారు. చివరకు నగ్నంగా కనిపించి అందరికి షాకిచ్చాడు. దేశంలోని పలు అటవీ ప్రాంతాల్లో ఈ మూవీని షూట్ చేశారు. ఇక ఈ చిత్రంలో ఆదిత్య ఓం ఎలాంటి డూప్ లేకుండా అన్ని రకాల స్టంట్స్ చేశారు. మూడేళ్లు కష్టపడి ఏడాదిలో ఉండే అన్ని రుతువుల్ని కవర్ చేస్తూ ఈ మూవీని షూట్ చేశారు. పర్యావరణ సంరక్షణ మీద తీసిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘నాతో నేను’ రెట్రో సాంగ్ వినగానే పాత రోజులు గుర్తొచ్చాయి: శ్రీకాంత్
‘‘నాతో నేను’ చిత్రంలోని రెట్రో సాంగ్ వినగానే మళ్లీ పాత రోజులు గుర్తొచ్చాయి. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు ఈ పాటను తీర్చిదిద్దారు’’ అని హీరో శ్రీకాంత్ అన్నారు. సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజపుత్ ప్రధాన పాత్రల్లో శాంతకుమార్ తూర్లపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘నాతో నేను’. ప్రశాంత్ టంగుటూరి నిర్మించిన ఈ చిత్రంలోని రెట్రో మెలోడీ సాంగ్‌ను శ్రీకాంత్ విడుదల చేశారు. ‘‘ఈ పాట చూస్తే ప్రేక్షకులు 1980 జ్ఞాపకాల్లోకి వెళతారు’’ అన్నారు శాంతకుమార్. ‘‘త్వరలో మా సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు ప్రశాంత్ టంగుటూరి. ఈ చిత్రానికి కెమెరా: మురళీ మోహన్ రెడ్డి, సంగీతం: సత్య కశ్యప్, నేపథ్య సంగీతం: ఎస్ చిన్న, సమర్పణ: ఎల్లలు బాబు టంగుటూరి. -
‘దహనం’మూవీ రివ్యూ
టైటిల్: దహనం నటీనటులు: ఆదిత్య ఓమ్, ఎఫ్ఎమ్ బాబాయ్, శాంతి చంద్ర తదితరులు నిర్మాణ సంస్థ: ఓపెన్ ఫీల్డ్ మీడియా నిర్మాత,సంగీతం : డాక్టర్ పెతకంశెట్టి సతీష్ కుమార్ దర్శకత్వం: ఆడారి మూర్తి సాయి విడుదల తేది: మార్చి 31, 2023 కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1984 ప్రాంతంలో జరుగుతుంది. విశాఖపట్నంలోని వాడరేవుల పల్లి గ్రామానికి చెందిన పూజారి భరద్వాజ శాస్త్రి(ఆదిత్య ఓమ్)కి శివ నామస్మరణ తప్ప మరొకటి తెలియదు. ఆ గ్రామంలోని శివాలయంలో పూజలు చేస్తూ భార్య, కూతురితో కలిసి ఉంటాడు. ఆ గుడి కిందే ఓ గుడిసెలో కాటికాపరి బైరాగి(ఎఫ్ఎం బాబాయ్) ఉంటాడు. తక్కువ జాతికి చెందిన అతను ఒక్కసారి అయినా ఆ గుడిలోని శివలింగాన్ని తాకాలనే కోరికతో ఉంటాడు. అయితే ఆ శివాలయం తో పాటు చుట్టుపక్కల ఉన్న స్థలంపై భూస్వామి భూపతి కన్నపడుతుంది. తమ పూర్వికులు ఉచితంగా కట్టించిన ఆ గుడిని వదిలి వెళ్లాలని పూజారి శాస్త్రీని బెదిరిస్తాడు. కానీ శాస్త్రీ కోర్టును ఆశ్రయిస్తాడు. మరి చివరకు గుడి ఎవరికి దక్కింది? శివ లింగాన్ని తాకాలనే బైరాగి కోరిక నెరవేరిందా? ఆయన చేసిన త్యాగమేంటి? కట్టుబాట్లు, కుల వివక్ష కారణంగా బైరాగి, శాస్త్రీ జీవితాల్లో ఎలాంటి మార్పులు సంభవించాయి? అనేదే ‘దహనం’ కథ. ఎలా ఉందంటే.. సినిమాలో ఒక సీన్లో శాస్త్రీ శివుడికి పూజ చేస్తూ పాలు లింగంపై పోస్తుంటాడు.. అదే సమయంలో అతని మనవడు తినడానికి తిండిలేక ఆకలితో ఏడుస్తుంటాడు. వెంటనే ఓ పిల్లాడు వెళ్లి లింగంపై పడి కిందపోతున్న పాలను చేతుల్లో పట్టి పిల్లాడికి తాగిస్తాడు. ఈ ఒక్క సీన్ చాలు ‘దహనం’ ఓ మంచి సందేశాత్మక చిత్రమని చెప్పడానికి. కులం, కట్టుబాట్లపేరుతో జరిగే అరచకాలను ఈ చిత్రంలో చూపించారు. కులాల పేరుతో మనుషులను వేరు వేరుగా చూడొద్దనే సందేశాన్ని ఇచ్చారు. అయితే కులవివక్ష, వర్ణ వివక్షపై గతంలో చాలా సినిమాలు వచ్చాయి. దహనం కూడా ఆ తరహా చిత్రమే. కానీ శివాలయంతో ముడిపెట్టి కథనాన్ని నడిపించడం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. కట్టుబాట్లు, కులం కారణంగా శాస్త్రీ పస్తులుంటే.. బైరాగి కొడుకును దూరం చేసుకొవడం..ఇలా రెండు వర్గాలు పడే బాధలను చూపించారు. ఆకలికి అంటరానితనం ఉంటుందా? అలాంటి డైగాల్స్ ఆలోచింపచేస్తాయి. అయితే కథ నెమ్మదిగా, ఊహకందేలా సాగడం మైనస్. క్లైమాక్స్ మాత్రం కాస్త ఆసక్తికంగా ఉంటుంది. ఈ చిత్రం కమర్షియల్‌గా ఏ మేరకు ఆడుతుందో తెలియదు కానీ.. ప్రేక్షకులకు మాత్రం మంచి సందేశాన్ని అందిస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఇన్నాళ్లు లవర్ బాయ్‌గా కనిపించిన ఆదిత్య ఓమ్.. ఈచిత్రంలో విభిన్నమైన పాత్ర పోషించాడు. కాస్త వయసు మీద పడ్డ భరద్వాజ శాస్త్రి పాత్రలో ఆదిత్య ఒదిగిపోయాడు. ఆయన వాచకం, కట్టూబొట్టూ, నడవడికి అన్నీ కూడా చక్కగా కుదిరాయి. ఆదిత్య ఓమ్‌లోని మరో యాంగిల్‌ని ఈ చిత్రంలో చూడొచ్చు. ఆదిత్య తర్వాత బాగా పండిన పాత్ర ఎఫ్ఎం బాబాయ్‌ది. కాటికాపరి బైరాగి పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. తాగుబోతుగా ఆయన నటన.. చెప్పు డైలాగ్ ప్రతిదీ ఆకట్టుకుంటుంది. భూపతి పాత్రకు శాంతి చంద్ర న్యాయం చేశాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సతీష్ కుమార్ సంగీతం బాగుంది. పాటలు సందర్భానుసారం వస్తాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
కెరీర్ ముగిసింది, డిప్రెషన్లోకి వెళ్లిపోయా: హీరో
'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో కెరీర్ ఆరంభించాడు ఆదిత్య ఓమ్. తొలి సినిమానే బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఆదిత్యకు అదృష్టం కలిసొచ్చింది అనుకున్నారంతా. తర్వాత అతడు ధనలక్ష్మి ఐ లవ్ యూ, మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు? ప్రేమించుకున్నాం పెళ్లికి రండి వంటి చిత్రాలు చేశాడు. కానీ మళ్లీ లాహిరి లాహిరి లాహిరిలో వంటి ఘన విజయం మాత్రం రాలేదు. దీంతో తనే దర్శకుడిగా మారి మిస్టర్ లోన్లీ మిస్ లవ్లీ సినిమా తెరకెక్కించాడు. తర్వాత తనే దర్శక,నటుడిగా బందూక్ చేశాడు. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. 'నటుడికి వయసుతో, పాజిటివ్, నెగెటివ్ రోల్‌తో సంబంధం ఉండదు. అందుకే నేను పాతికేళ్ల అబ్బాయిగానూ, 90 ఏళ్ల ముసలివాడిగానూ నటించగలను. 24 ఏళ్ల వయసులో కెరీర్ మొదలై 30 ఏళ్లకే ముగిసింది. ఆ వయసులో అందరికీ కెరీర్ మొదలవుతే నాకేమో ముగిసిపోయింది. ఆ సమయంలో నేను ముంబైలో ఉన్నాను. డిప్రెషన్‌తో ఇంట్లోనే ఉండిపోయాను. ఓవర్‌థింకింగ్ చేశాను. జీవితం ఏంటి ఇలా అయిపోయింది? ఇలా ఆగిపోయాను అని కుమిలిపోయాను. రెండేళ్లపాటు నాకు బ్యాడ్‌టైమ్ నడిచింది. తర్వాత సెల్ఫ్ మోటివేషన్‌తో ముందుకు వెళ్లాను. సినిమా ఇండస్ట్రీలో అదృష్టం కూడా ముఖ్యమే! టాలెంట్‌తో పాటు లక్ ఉంటేనే పీక్స్ వెళ్తారు' అని చెప్పుకొచ్చాడు ఆదిత్య ఓం. -
పదేళ్లకు ఒకసారి ఇలాంటి సినిమాలు వస్తాయి : నటుడు ఆదిత్య ఓం
నటుడు ఆదిత్య ఓం గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆదిత్య ఓం.. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా, విలన్‌గా తన మార్క్ చూపించారు. 2018లో మాసాబ్ అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించి తనలోని మరో టాలెంట్ బయటపెట్టారు.ఇటీవలె ఉత్తమ నటుడిగా అవార్డు కూడా గెలుచుకున్నారు. తాజాగా ఆయన నటించిన దహనం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దిత్య ఓం మాట్లాడుతూ.. 'దహనం సినిమాను సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్స్. ప్రతీ శుక్రవారం సినిమాలు వస్తాయి. కానీ దహనం లాంటి సినిమాను ఏ ఐదేళ్లకో, పదేళ్లకో వస్తాయి. ఈ సినిమాను ఇంత గొప్పగా తీసిన మా దర్శక నిర్మాతలకు థాంక్స్. ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నారు. ఇది కమర్షియల్ ప్రాజెక్ట్ కాదు. ప్యాషన్‌తో తీసిన ప్రాజెక్ట్' అని అన్నారు. -
అంబులెన్స్ సేవలు ప్రారంభించిన ఆదిత్య ఓం
'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆదిత్య ఓం.. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా, విలన్‌గా తన మార్క్ చూపించారు. దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేసుకుంటున్న ఆదిత్య ఓం సేవారంగంలో తన ఔదార్యాన్ని చాటుతున్నాడు. పలు సేవా కార్యక్రమాలు ద్వారా ఆయన ఇప్పటికే ఎంతో మందికి పేదవాళ్లకు సహాయం చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేరుపల్లి లోని ఐదు గ్రామాలను దత్తత తీసుకుని దాదాపు 500 మంది కి సహాయం చేసిన ఆదిత్య ఓం తాజాగా కొత్తగూడెం జిల్లా మరియు తాండూరులోని చెరుపల్లి, కొత్తపల్లి మరియు పరిసర ప్రాంతాలకు అంబులెన్స్ సేవలను అందించడానికి తన వంతు కృషి చేశారు. అక్కడి గిరిజన గ్రామాల్లో చాలా కాలంగా పనిచేస్తున్న ఆదిత్య ఓం కోవిడ్ సమయంలో అంబులెన్స్ సేవలు లేకపోవడం మరియు ఆ ప్రాంతంలో పాము కాటు కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చూసి చలించారు. దాంతో అక్కడ పేరుగాంచిన రోటరీ క్లబ్, దానికి సంబంధించిన స్థానిక సంస్థల ఆర్థిక సహాయంతో ఈ ప్రాంతాలకు అంబులెన్స్ సేవలు అందించగలిగారు. తన స్నేహితులు, స్వచ్ఛంద సంస్థలు అందించిన సహాయం మరియు స్థానిక ప్రజల అవగాహన కారణంగా ఇది సాధ్యం అయ్యింది ఆదిత్య ఓం అన్నారు. -
ఎన్నో అవార్డులు అందుకున్న దహనం పోస్టర్ రిలీజ్!
ఎన్నో అవార్డులు అందుకున్న ఫీచర్ ఫిల్మ్ ‘దహనం’కు సంబంధించిన పోస్టర్ రిలీజైంది. ఈ పోస్టర్లో ఆదిత్య ఓం ఓల్డ్ గెటప్‌లో ఇది వరకు ఎన్నడూ కనిపించని విధంగా ఉన్నారు. పురాతన ఆలయాన్ని పరిరక్షించే రక్షకుడిగా కనిపిస్తున్నారు. అదారిమూర్తి సాయి తెరకెక్కించిన ఈ చిత్రం ఇది వరకే ఎన్నో జాతీయ వేదికల మీద పలు అవార్డులు అందుకుంది. రెండు బెస్ట్ యాక్టర్ అవార్డులు కూడా వచ్చాయి. నిర్మాతగానే కాకుండా సంగీత దర్శకుడిగానూ డా.పి సతీష్ కుమార్‌కు మంచి ప్రశంసలు వచ్చాయి. శాంతి చంద్ర, ఎఫ్ఎం బాబాయ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఎంతో ఆర్టిస్టిక్‌గా ఉన్నా కూడా అంతర్లీనంగా కులాలు, మతాల మీద ప్రశ్నించినట్టుగా ఉంటుంది. అదే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆలోచించేలా చేస్తుంది. చదవండి: రౌడీ హీరోకు ఉంగరం తొడిగి ఏడ్చేసిన మహిళా అభిమాని, వీడియో వైరల్ చూపులు కలవకుండానే పెళ్లి చేసుకున్న చిరంజీవి -
మొట్టమొదటి సారి షార్ట్ ఫిలిం చేస్తున్న లాహిరి లాహిరి లాహిరిలో నటుడు
యాక్టర్‌గా వెండితెరపై సత్తా చాటిన యువ హీరో ఆదిత్య ఓం డైరెక్టర్ గా కూడా సత్తా చాటారు. 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆదిత్య ఓం.. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించారు. 2018లో మాసాబ్ అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించి మరో టాలెంట్ బయటపెట్టారు. తాజాగా ఆయన మొట్టమొదటిసారిగా పవిత్ర అనే షార్ట్ ఫిలింతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆదిత్య స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జ్యోతి, గాయత్రి గుప్త, ఐశ్వర్య ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్గా ప్రీమియర్స్ ప్రదర్శించగా.. షార్ట్ ఫిలింను వీక్షించిన పలువురు ప్రముఖులు ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌనిల్స్ జనరల్ సెక్రటరీ టీ ప్రసన్న కుమార్, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కొల్లి రామకృష్ణ, తెలుగు వన్ ఎండీ రవిశంకర్, గజల్ శ్రీనివాస్, అదిరే అభి, జాకీర్ హుస్సేన్, గాయత్రీ గుప్తా, హరిచందన్, రవికిరణ్, శ్రీరాపాక, వైభవ్ సూర్య, జ్యోతి లాభాల, నిర్మాత రఘు, మిస్ ఇండియన్ పసిఫిక్ రష్మీ ఠాకూర్ వంటి వారు పాల్గొన్నారు. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌనిల్స్ జనరల్ సెక్రటరీ టీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ‘ఓ డాక్టర్ చిన్న తప్పు చేస్తే ఎంతటి అనర్థాలు జరుగుతాయో చూపించారు. నాకు తెలిసిన ఓ వ్యక్తికి కూడా అలానే జరిగింది. క్యాన్సర్ లేకపోయినా ఉందని చెప్పారు.. దాంతో ఆయన చనిపోయేంత వరకు వెళ్లారు. చివరకు క్యాన్సర్ లేదని తెలిసింది. ఆ సైకలాజికల్ ప్రాబ్లంను ఇందులో చూపించారు. జాతీయస్థాయిలో కచ్చితంగా అవార్డులు వస్తాయి’ అన్నారు. ఆదిత్య మాట్లాడుతూ.. ‘నేను అభిని 'ఒట్టూ.. ఈ అమ్మాయి ఎవరో తెలీదు' సినిమా సమయంలో కలిశాను. ఆనాడే చెప్పాను.. అతనొక పెద్ద స్టార్ అవుతాడు అని. ఈ రోజు ఇక్కడ ఉన్న వారిలో ఆయనే పెద్ద స్టార్. ప్రసన్న గారితో నాకు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. వైవీఎస్ చౌదరి గారు నాకు బ్రేక్ ఇచ్చారు. ఆ సినిమా రిలీజ్ సమయంలో సమస్యలు వస్తే ప్రసన్న గారు సాయం చేశారు. 2016లో ఫ్రెండ్ రిక్వెస్ట్ సినిమా తీశాను. అప్పుడు కూడా ఆయన వచ్చి కో ఆపరేట్ చేశారు. మా ఎండీ రవి గారు మా అందరికీ పయోనీర్ లాంటి వారు. ఎంతో మంది యంగ్ టాలెంట్‌కు సపోర్ట్ చేస్తున్నారు. బంధీ సినిమాను చేశాం. డీఓపీ మధుసూదన్ గారిని అనుకోకుండా కలిశాను. సినిమాలు,యాడ్ ఫిల్మ్స్ కలిసి చేశాం. మా అన్నలాంటివారు.. ఆయన నాకు కంటిచూపు వంటివారు. రైటర్ హరిచందన్ గారితో ఓ వెబ్ సిరిస్ ప్లాన్ చేశాను. గజల్ గారిని చంబల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కలిశాను. ప్రకాష్ నా సినిమాలకు ఎడిటర్. ఆయన వల్లే ఎంతో మంది హిందీలో దర్శకులయ్యారు. 2006లో నా పరిస్థితి బాగా లేనప్పుడు జాకీర్ ఇంట్లోనే ఉన్నాను.. నా దగ్గర డబ్బుల్లేని సమయంలో నీడనిచ్చారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మహ్మద్ నా దగ్గర డ్రైవర్‌గా వచ్చాడు.. ఇప్పుడు దాదాపుగా 20 చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. మీ అందరూ షార్ట్ ఫిల్మ్‌ని చూసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. అదిరే అభి మాట్లాడుతూ.. ‘ఆదిత్య గారితో నాది 20 ఏళ్ల బంధం. ఓ సినిమాలో ఫ్రెండ్ కారెక్టర్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా బంధం కొనసాగుతోంది. నేను ఓ సారి ముంబైకి వెళ్తే వాళ్లింట్లోనే ఉన్నాను. అది ఎప్పటికీ మరిచిపోలేను. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో ఆదిత్యను చూసి తెలుగువాడని అనుకున్నారు. కానీ ముంబై నుంచి వచ్చి నటించాడని తరువాత తెలిసింది. అలాంటి నటుడి గురించి తెలుగు నిర్మాతలు ఎందుకు ఆలోచించడం లేదో అర్థం కాలేదు. మాస్ సాబ్ అనే సినిమాకు దర్శకుడిగా అవార్డులు వచ్చాయి. ఫ్రెండ్ రిక్వెస్ట్ అనేది హాలీవుడ్ రేంజ్ సినిమాతో పోటీ పడింది. ఆయన లాంటి టాలెంట్ ఉన్నవాళ్లని తెలుగు నిర్మాతలు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. పవిత్ర షార్ట్ ఫిల్మ్‌లో ఆదిత్య షారుఖ్ ఖాన్‌లా అనిపించారు. ఆయన టాలెంట్‌ను అందరూ ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాను’ అని అన్నారు. చదవండి: లండన్‌లో సీక్రెట్‌గా బాలీవుడ్ హీరో పెళ్లి..! ఓటీటీకి వచ్చేస్తున్న గాడ్సే.. ఎప్పుడు, ఎక్కడంటే! -
షార్ట్ ఫిలిమ్‌కు డైరెక్టర్‌గా యంగ్ హీరో..
Aditya Om Pavithra Short Film: 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆదిత్య ఓం.. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా, విలన్‌గా తన మార్క్ చూపించారు. 2018లో 'మాసాబ్' అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించి మరో టాలెంట్ బయటపెట్టారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఆయన ఇప్పుడు 'పవిత్ర' అనే ఓ ప్రయోగాత్మక షార్ట్ ఫిలిమ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. థ్రిల్లింగ్ జానర్‌గా తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలింలో జ్యోతి, గాయత్రి గుప్త, ఐశ్వర్య ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మోడర్న్ సినిమా బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనుంది. దీనికి వీరల్, లవన్ సంగీతం అందించగా.. మధుసూదన్ కోట సినిమాటోగ్రాఫర్‌గా, ప్రకాష్ ఝా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈ షార్ట్ ఫిలిమ్‌ని యూట్యూబ్‌తో పాటు ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసి ఆసక్తి పెంచారు. ఆదిత్య ఓం చేతిలో మొబైల్ ఫోన్స్, ఆ వెనకాల జ్యోతి, గాయత్రీ గుప్త లుక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. మిస్ అయిన తన భార్య కోసం ఓ బ్లైండ్ డాక్టర్ వెతికే పాయింట్‌తో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఈ షార్ట్ఫిలిమ్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. చదవండి: స్టార్ నటుడి భార్యపై కేసు.. రూ. 31 లక్షలు తిరిగి ఇవ్వట్లేదని ఫిర్యాదు టైటిల్ రోల్ జ్యోతి పోషిస్తుండగా.. గాయత్రి గుప్త మరో స్పెషల్ క్యారెక్టర్ చేస్తోంది. గాయత్రీ రోల్ సినిమాలో కీలకం కానుందట. జాకిర్ హుస్సేన్, ఐశ్వర్య, వెంకట్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. పెరుగుతున్న టెక్నాలజీలో షార్ట్ ఫిలిమ్స్ కీలక భూమిక పోషిస్తున్నాయని, ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ కెమెరా ముందు సరికొత్త ప్రయోగాలు చేసేందుకు అనువుగా ఉండటమే గాక ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ అవుతుంటాయని ఆదిత్య ఓం అన్నారు. అలాంటి కోవలోనే ఈ 'పవిత్ర' మూవీ ఉంటుందని చెప్పారు. చదవండి: విక్రమ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల.. నమ్మట్లేదా ? ఆధార్ కార్డు చూపించనా ?: యంగ్ హీరో -
ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో హీరో ఆదిత్య ఓంకు అవార్డు
నటుడు, డైరెక్టర్ ఆదిత్య ఓం గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆదిత్య ఓం.. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా, విలన్‌గా తన మార్క్ చూపించారు. 2018లో మాసాబ్ అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించి తనలోని మరో టాలెంట్ బయటపెట్టారు.తాజాగా జరిగిన రెండు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఉత్తమ నటుడిగా ఆదిత్య ఓం అవార్డు గెలుచుకున్నారు. 'దహ్నం'. ఈ సినిమాలో బ్రాహ్మణ పూజారిగా ఆయన నటనకు గాను ప్రశంసలతో పాటు అవార్డ్స్ దక్కాయి.రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క ప్రతిష్టాత్మక ఎనిమిది ఎడిషన్లలో ప్రాంతీయ చలనచిత్ర విభాగంలో ఉత్తమ నటుడిగా అవార్డు పొందారు ఆదిత్య ఓం. ఈ గ్రాండ్ ఫిల్మ్ ఫెస్టివల్లో రణధీర్ కపూర్ వంటి దిగ్గజాలకు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డులను అందించారు. మరోవైపు ఆదిత్య ఓంకు ముంబైలోని ప్రైమ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ఉత్తమ నటుడిగా అవార్డు లభించింది. దీంతో ఆనందంలో మునిగిపోయిన ఆదిత్య ఓం.. తాను మళ్లీ మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమాలకు కనెక్ట్ అయ్యేలా చేయడంలో ఈ అవార్డులు ఎంతగానో దోహదపడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక 'దహ్నం' చిత్రానికి రచన, దర్శకత్వం వహించిన మూర్తి అడారికి కూడా బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు లభించింది. -
మూడు సినిమాల్లో విలన్‌గా చేస్తున్న హీరో!
Aditya Om Turn As Villain: హీరో, విలన్, కమెడియన్ ఇలా రకరకాల వేరియన్స్ చూపించే అతి కొద్దిమంది నటుల్లో ఆదిత్య ఓం ఒకరు. తెలుగు, తమిళ సినిమాలతో పాటు పలు హిందీ సినిమాల్లో వైవిద్యభరితమైన పాత్రలు పోషించి శభాష్ అనిపించుకున్న ఆదిత్య బాలీవుడ్లో దర్శకుడిగా కూడా సూపర్ సక్సెస్ సాధించారు. ఇప్పుడు విలన్‌గా కూడా సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు ఆదిత్య ఓం. తెలుగు హిట్ సినిమా 'లాహిరి.. లాహిరి.. లాహిరిలో' మూవీలో లీడ్ రోల్ పోషించిన నటుల్లో ఒకరైన ఆదిత్య ఓం.. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించి బాలీవుడ్ గడప తొక్కారు. అలా బీ టౌన్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తూనే తెలుగు, తమిళ భాషా చిత్రాల్లోనూ రాణిస్తున్నారు. నటుడిగా అన్నిరకాల పాత్రలకు న్యాయం చేస్తూ ప్రేక్షకులను అలరించాలని ఫిక్సయిన ఆదిత్య ఓం.. ఇప్పుడు ఏకంగా మూడు సినిమాల్లో నెగెటివ్ షేడ్స్‌లో కనిపించబోతున్నారు. కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న నాగ వర్మతో కలిసి 'విక్రమ్' అనే సినిమాలో మాఫియా బాస్‌గా నటిస్తున్నారు ఆదిత్య ఓం. దీంతో పాటు మరో రెండు సినిమాలు ''అమరం (నగరంలో), పవిత్ర'' మూవీల్లో విభిన్నమైన విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. అమరం సినిమాలో ఆది సాయి కుమార్‌తో కలిసి నటిస్తున్న ఆదిత్య.. ఈ చిత్రంలో ఎంతో కీలకమైన హ్యాకర్ రోల్లో కనిపించనున్నారు. అలాగే జ్యోతి, గాయత్రి గుప్తాతో కలిసి పవిత్ర అనే వెబ్ ఫిల్మ్‌లో సైకోటిక్ డాక్టర్ వేషం వేస్తున్నారు. ఈ సినిమాలన్నీ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ మూడు సినిమాల్లో తన నెగెటివ్ క్యారెక్టర్ డిఫరెంట్ షేడ్స్‌లో చూపించానని చెప్పిన ఆదిత్య ఓం.. నేటితరం ప్రేక్షకులు సైతం నటులు తమ పరిమితులను అధిగమించాలని కోరుకుంటున్నారని, ప్రస్తుతం తాను అదే బాటలో ఉన్నానని చెప్పుకొచ్చారు. -
పూజారి పాత్రలో ఆదిత్య ఓం..!
‘ప్రేమలో పావని కల్యాణ్’ ,‘లాహిరి లాహిరి లాహిరి’ వంటి పలు వెరైటీ చిత్రాలతో ఆకట్టుకొన్న నటుడు ఆదిత్య ఓం హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘దహనం’. ఈ మూవీలో ఆదిత్య కొంతమంది బడా వ్యాపారవేత్తల నుంచి నుంచి గుడిని కాపాడుకునే పూజారి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా లో ఆదిత్య 1980వ కాలంలో సాగే అప్పటి కాలం వ్యక్తిగా కనిపించబోతున్నాడు. అందుకు తగ్గ మేకోవర్ కూడా పూర్తి చేశాడు. ఓపెన్ ఫీల్డ్ మీడియా బ్యానర్ పతాకంపై డాక్టర్ పి సతీష్ కుమార్, డాక్టర్ అర్ బలరాం సాయిలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎడారి మూర్తిసాయి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి డాక్టర్ పి సతీష్ కుమార్ బాణీలను సమకూరుస్తున్నారు. ఎఫ్ఎం బాబాయి, శాంతి చంద్రలు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఇప్పటికి ఈ సినిమా విశాఖపట్నం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. కె.విశ్వనాథ్, బాపుల సినిమాల మ్యాజిక్ ఫీల్ ఈ సినిమాలో ఉండబోతుందని, త్వరలోనే ఈ మూవీ ఫస్ట్‌లుక్, ట్రైలర్‌ను కూడా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. -
ఐదు గ్రామాల దత్తత.. ఈ హీరో ఎవరో తెలుసా!
లాహిరి లాహిరి లాహిరి, ధనలక్క్క్ష్మీ ఐ లవ్ యూ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు ఆదిత్య ఓం.. అప్పట్లో ఓ వెలుగు వెలిగిన ఈ హీరో కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రజలకు మాత్రం చేరువలోనే ఉన్నారు. రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరోగానూ మారిన ఆదిత్య తెలంగాణలోని ఐదు గ్రామాలను దత్తత తీసుకొని వాటి బాగోగులు చూసుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చేరుపల్లి సమీపంలోని గ్రామాలను గత అయిదేళ్లుగా దత్తత తీసుకుని వాటి అభివృద్ధి బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు. (చదవండి: 42 లీటర్ల చనుబాలను డొనేట్ చేసిన నిర్మాత) వీటిని రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదిత్య తన స్నేహితుడు, నిర్మాత పీవీఎస్ వర్మతో కలిసి ఇటీవల గ్రామాల్లోని 500 రైతులకు మామిడి, కొబ్బరి మొక్కలను అందించారు. అలాగే దత్తత గ్రామాల్లోని యువతను విద్యతోపాటు క్రీడా రంగంలో రాణించేలా ప్రోత్సహిస్తున్నారు. చేరువల్లి గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారు. కాగా చాలా రోజుల గ్యాప్ ఆనంతరం ఆదిత్య ప్రస్తుతం రాఘవ టీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బందీ అనే సినిమాతో రీఎంటీ ఇవ్వనున్నారు. తెలుగు తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో కేవలం ఒకే పాత్ర ఉండబోతుంది. చదవండి: ప్రయోగాత్మక కథతో వస్తున్న ఆదిత్య .@adityaaom has been working for the upliftment of tribal villages in Telangana for last 5 yrs. He adopted Cherupally and surrounding villages in Bhadradri Kothagudem dist and launched various development works His next #Bandhi directed by #RaghavaT is a multi-lingual film pic.twitter.com/BU6L8a5bpy — BARaju (@baraju_SuperHit) November 17, 2020 -
ఛాతీపై తొండ, పక్కనే విష సర్పం
"లాహిరి లాహిరి లాహిరిలో" చిత్రంతో వెండితెరపై తెరంగ్రేటం చేసిన హీరో ఆదిత్య ఓమ్. విజయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "బందీ". ఈ చిత్రం ఫస్ట్‌లుక్ సోమవారం విడుదలైంది. ఇందులో హీరో అడవిలో 'బందీ 'అయినట్లు కనిపిస్తోంది. అతని ఛాతీపై తొండ పాకుతుండగా పక్కనే విషసర్పం బుసలు కొడుతోంది. దీన్ని చూసిన అభిమానులు ఒళ్లు జలదరిస్తోందని, ఇలాంటి పాత్ర చేసేందుకు పూనుకోవడం అంటే సాధారణ విషయం కాదని ప్రశంసిస్తున్నారు. (టైమ్ ఫిక్స్) ఈ సినిమా షూటింగ్ మొత్తం దాదాపుగా అడవిలోనే జరుగుతుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ గురించి బలమైన సందేశాన్ని ఇస్తుందని హీరో ఆదిత్య ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. టీ రాఘవ దర్శకత్వం వహిస్తున్న 'బందీ' సినిమాను రాకేశ్ గోవర్ధనగిరి, మధు సూదన్ కోట నిర్మిస్తున్నారు. ఈ సినిమా గతేడాదే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. (‘ఇస్మార్ట్’ విజయం మా ఆకలిని తీర్చింది) -
'దామిని విల్లా' సినిమా స్టిల్స్
-
చేతిలో చెయ్యేసి చెప్పు బావ
‘‘దసరా బుల్లోడు’ చిత్రంలోని ‘చేతిలో చెయ్యేసి చెప్పుబావ...’ అంటూ అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ ఆడిపాడారు. ఆ పాట ఎంత పాపులరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడదే పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. అరుణ్, రోహిణిపూజ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఆదిత్య ఓం మరో హీరోగా నటిస్తున్నారు. కట్ల రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. మేరీ కృపావతి, ప్రభుదాస్ సమర్పణలో కె.జె.రాజేష్, దేవదాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం చివరి షెడ్యూల్ జరుగుతోంది. కట్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ లవ్ అండ్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇద్దరు ప్రేమికులు చనిపోయినా వాళ్ల ప్రేమను ఎలా బతికించుకుంటారు? అనే నేపథ్యంలో సాగుతుంది. ఈ ఏడాది ఆఖరులో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘మా సినిమాలోని నటీనటులందరూ చాలా బాగా నటించారు’’ అన్నారు రాజేష్. ‘‘చాలా కాలం తర్వాత ఓ మంచి చిత్రంతో వస్తున్నా’’ అన్నారు ఆదిత్య ఓం. ‘‘నందిని’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడినే. ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాను’’ అన్నారు అరుణ్ రాహుల్. దేవదాస్, రోహిణి పూజ, చలపతి రాజు పాల్గొన్నారు. -
విల్లాలో ఏం జరిగింది?
శ్రీ తిరుమల మూవీ మేకర్స్‌పై రాకేష్ రెడ్డి దర్శకత్వంలో పోలా రావు దండెం, ప్రతాప్ దండెం నిర్మిస్తోన్న హారర్ చిత్రం ‘దామిని విల్లా’ ఆదిత్యా ఓం, రేఖా బోజ్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. రాకేష్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘హారర్ చిత్రాల్లో కొత్త ట్రెండ్ సష్టించే చిత్రంగా ‘దామిని విల్లా’ నిలుస్తుందన్న నమ్మకం ఉంది. ఇంతవరకు సిల్వర్ స్క్రీన్ పై రాని ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. దామిని విల్లాలో ఏం జరిగింది? అనేదే చిత్రం. నిర్మాతలు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది చివరిలో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రమోద్ కుమార్ పరిసర్ల; కెమెరా: శ్రీనివాస్ సబ్బి, ఎడిటింగ్: ఎమ్కేయస్ మనోజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సురేష్ యాదవ్, నిర్మాతలు: పోలా రావు దండెం, ప్రతాప్ దండెం, రచన–దర్శకత్వం: రాకేష్ రెడ్డి. -
మూడు భాషల్లో యంగ్‌స్టార్స్
ఆదిత్యా ఓం, స్వాతి టండన్ జంటగా హరిచందన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న త్రిభాషా చిత్రం ‘యంగ్ స్టార్స్’. రాధా వైష్ణవ్ లక్ష్మీ నారాయణ ప్రొడక్షన్ పతాకంపై వైష్ణవ్ లక్ష్మీ నారాయణ , ఔరంగజేబ్, వినోద్ పార్వతి, మురళి కృష్ణ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ – ‘‘స్నేహం, ప్రేమ అనే రిలేషన్స్ యువతరం జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి, ఎలాంటి అలజడులను సృష్టిస్తున్నాయి అనే కాన్సెప్ట్‌తో యంగ్‌స్టార్స్ తెరకెక్కిస్తున్నాం. వైజాగ్. అరకు, ముంబై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించి దసరాకు ఈ సినిమాను విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘సినిమాలో మరో జంటను, ఇంకొంత మంది ఆర్టిస్టులను త్వరలో అనౌన్స్ చేస్తాం. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు నిర్మాత, కెమెరామేన్ లక్ష్మీనారాయణ. ఈ చిత్రానికి సంగీతం: డేవిడ్.జి, ఫైట్స్: పి.సతీష్ మాస్టర్. -
ఒకే ఒక్క పాత్రతో...
‘లాహిరి లాహిరి లాహిరిలో, ధనలక్ష్మీ ఐ లవ్యూ, మీ ఇంటికొస్తే ఏమిస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు, ఒట్టు ఈ అమ్మాయెవరో తెలీదు, ఫ్రెండ్ రిక్వెస్ట్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు నటుడు ఆదిత్య ఓం. ఆయన ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపొందనుంది. అందులో విశేషం ఏంటంటే... ఈ సినిమా మొత్తం ఒకే ఒక్క పాత్రతో ఉంటుంది. వినూత్న కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రాఘవ తిరువాయిపాటి దర్శకత్వం వహించనున్నారు. ఎమినెంట్ 5ఎంటర్టైన్మెంట్స్ అనే నూతన సంస్థ ఎస్.ఆర్. ప్రొడక్షన్ సమర్పణలో రూపొందించనున్న ఈ సినిమా ఈ నెలాఖరు నుంచి షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే: రాకేష్ గోవర్ధన్ గిరి, కెమెరా: మధుసూదన్ కోట. -
ఫిలింఛాంబర్ దగ్గర హీరో నిరాహార దీక్ష
-
సోషల్ మీడియాకు బానిసలైతే...
‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘ధనలక్ష్మి ఐలవ్ యూ, ‘మీ ఇంటికొస్తే ఏమిస్తారు.. మా ఇంటి కొస్తే ఏం తెస్తారు’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు ఆదిత్య ఓం. తొలిసారి ఆయన దర్శకునిగా మారి, తెరకెక్కించిన చిత్రం ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’. మోడరన్ సినిమాపై విజయవర్మ పాకలపాటి నిర్మాణ నిర్వహణలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెలాఖరులో విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా ఈ చిత్రం ఉంటుంది. యూత్‌ఫుల్ చిత్రాల్లో కొత్త ఒరవడి సృష్టిస్తుందనే నమ్మకం ఉంది. దర్శకునిగా నాకు మంచి పేరు తెస్తుంది’’ అని పేర్కొన్నారు. చిత్ర నిర్మాణ నిర్వాహకుడు, సహ నిర్మాత విజయవర్మ మాట్లాడుతూ -‘‘నేటి యువత సోషల్ మీడియాకు ఎలా బానిసలవుతున్నారు? దాని వల్ల ఎటువంటి అనర్థాలు ఏర్పడుతున్నాయి? అనే పాయింట్‌తో ఈ చిత్రం నిర్మించాం’’ అని తెలిపారు. ఆదిత్య ఓం ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంగీతం: లవన్ వీరన్, కెమెరా: సిద్ధార్థ్. -
స్నేహితుడి రిక్వెస్ట్
లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రంలో చలాకీగా నటించిన ఆదిత్యా ఓం తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తున్నాడు. అతనిప్పుడు దర్శక, నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. ఆదిత్యా ఓం స్వీయదర్శకత్వంలో నిర్మించి, నటించిన చిత్రం ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఆదిత్యా ఓం మాట్లాడుతూ -‘‘సస్పెన్స్ హారర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ నెలాఖరులోగా అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయి. త్వరలోనే పాటలను, నవంబరులో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. కథ మీద నమ్మకంతో ఈ సినిమా చేశామని, అవసరమైతే సొంతంగా అయినా విడుదల చేస్తామని మరో నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి చెప్పారు. చెరుపల్లిని దత్తత తీసుకున్న ఆదిత్య సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటితో కలిసి ఆదిత్యా ఓం ‘ఎడ్యులైట్‌మెంట్’ అనే స్వచ్చంద సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా భద్రాచలం దగ్గర్లోని చెరుపల్లి గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. తమ ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా విద్యా వ్యవస్థలో మార్పుల కోసం గత నెల సెప్టెంబరు 3న న్యూఢిల్లీలో, అక్టోబరు 2న ముంబైలో నిరాహార దీక్ష చేశామని ఆదిత్యా ఓం తెలిపారు. -
'ఫ్రెండ్ రిక్వెస్ట్' టీజర్ లాంచ్..!
-
6 భాషల్లో ఆర్తి అగర్వాల్ చిత్రం
-
విపరీత పరిణామాలు
‘లాహిరి లాహిరి లాహిరిలో’ఫేం ఆదిత్య ఓం నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం ‘ఫన్ ఫ్రీక్డ్ ఫేస్బుక్’. ఈ చిత్రం ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. సాగరిక చెత్రి, జల్ చిత్ర, శీతల సింగ్, అంచిత్కౌర్ తదితరులు ఇందులో ప్రధాన పాత్రధారులు. హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి ఆదిత్య ఓం మాట్లాడుతూ -‘‘సామాజిక మాధ్యమానికి యువతరం ఏ రీతిగా బానిసలవుతున్నారు? పర్యవసానంగా ఎలాంటి విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని చెప్పారు. 20 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌ని హైదరాబాద్, వైజాగుల్లో పూర్తి చేస్తామని నిర్మాణ నిర్వాహకులు పి.విజయ్‌వర్మ తెలిపారు. -
ఫ్రెండ్ రిక్వెస్ట్ మూవీ స్టిల్స్
-
నాలో వసంతరాగం
ఆదిత్య ఓం, మధుశర్మ, ప్రశాంతి హీరో హీరోయిన్లుగా కోట నరసింహమూర్తి దర్శకత్వం వహించిన చిత్రం ‘నాలో వసంతరాగం’. కీ.శే. అల్లేపల్లి ప్రభాకర్ ఆశీస్సులతో అల్లేపల్లి రోజారాణి నిర్మించారు. మరో వారంలో ఈ చిత్రం పాటలను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘మనసు, మమతల ఆరాటం, ప్రేమా పెళ్లి మధ్య పోరాటం నేపథ్యంలో రెండు హృదయాల మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్రం. ఇందులో ఉన్న ఐదు పాటలకు జయసూర్య మంచి స్వరాలిచ్చారు. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పా రు. కుటుంబ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథా చిత్రం అన్ని వర్గాలవారిని ఆకట్టుకునే విధంగా ఉంటుందని చిత్రనిర్మాణ సారథి అల్లేపల్లి విక్రమ్ తెలిపారు.