నాలో వసంతరాగం
ఆదిత్య ఓం, మధుశర్మ, ప్రశాంతి హీరో హీరోయిన్లుగా కోట నరసింహమూర్తి దర్శకత్వం వహించిన చిత్రం ‘నాలో వసంతరాగం’. కీ.శే. అల్లేపల్లి ప్రభాకర్ ఆశీస్సులతో అల్లేపల్లి రోజారాణి నిర్మించారు. మరో వారంలో ఈ చిత్రం పాటలను విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘మనసు, మమతల ఆరాటం, ప్రేమా పెళ్లి మధ్య పోరాటం నేపథ్యంలో రెండు హృదయాల మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్రం.
ఇందులో ఉన్న ఐదు పాటలకు జయసూర్య మంచి స్వరాలిచ్చారు. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పా రు. కుటుంబ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథా చిత్రం అన్ని వర్గాలవారిని ఆకట్టుకునే విధంగా ఉంటుందని చిత్రనిర్మాణ సారథి అల్లేపల్లి విక్రమ్ తెలిపారు.